Unlearned

Unlearned adj illiterate చదువుకోని, నిరక్షకుక్షియైన, అక్షరస్థుడుకాని. the *speak thus సామాన్యులు యీ రీతిగా చెప్పుతున్నారు.
Unleavened adj not mixed with leaven పులికి ;పిండి ;పెట్టబడని,మలుచుపెట్టబడని ~ R* ~ Rbread ~ Sపులి********************************************************** In ancientEnglish *** was called sweet bread; see Tyndale's version of Mark XIV, andChristian Observer 1824. p.
Unless conj except తప్ప, వినహాగా, గాని, గాక. * you go there నీవు అక్కడికిపోతేనే గాని. * you see him నీవు అతణ్ని చూస్తేనే తప్ప. * I see it నేను దాన్నిచూస్తేనేగాని.
Unlettered adj untaught, ignorant అక్షరస్థుడు కాని, చదవని, తెలివిలేని.
Unlevelled adj not laid even సమము చేయబడని, మిట్లాపల్లము లేకుండాసరదబడని, మెరకాపల్లముగా వుండే.
Unlicensed adj not having permisssion by authority సెలవు చీటి లేని,లేసను లేని. this is * language హద్దు మీరిన మాటలు, మర్యాద తప్పిన మాటలు.
Unlicked adj not set straight మూఢుడైన. an * cub శంఠుడు, వట్టి గొడ్డు.
Unlighted adj not shown by lights దీపాలు పెట్టబడని. not set on fireతగలపెట్టబడని, ముట్టించబడని.
Unlike adj dissimilar; having no resemblance అసదృశ్యమైన, సరిగ్గా వుండనీ.this picture is * him వాడు అట్లా చేశివుండడు. these two houses are * యీరెండిండ్లకు భేదము వున్నది ఆ యిల్లు వొక విధముగా వున్నది, యీ యిల్లు వొక విధముగావున్నది. the English, * the Musulmans, encourage braminical learningతరుకలవలె కాకుండా ఇంగ్లిషువారు బ్రాహ్మణ విద్యకు ప్రోత్సాహము చేస్తున్నారు అనగాతురకలవలె బ్రాహ్మణ విద్యకు చెరుపుచేయరు.
Unlikelihood, Unlikeliness n s. improbability అసంభావితము.
Unlikely adj not probable అసంభావితమైన. in such a business profit is * యిటువంటి పనులలో లాభము వస్తున్నదని యెంచరాదు. It is * that they will comeవాండ్లు వచ్చేది సందేహము.
Unlimited adj boundless అమితమైన, అపారమైన. * expense అమితమైనవ్రయము.
Unliquidated adj not settled; not having the exact amount ascertained తీరని, పరిష్కరించబడని, చెల్లని. * accounts యింకా చెల్లని లెక్కలు.
Unliquified adj not dissolved; unmelted కరగని.
Unloaded adj disburdened విడిగా వుండే. an * ship సరుకులు దించిఖాళీగావుండేవాడ, వుత్తవాడ.
Unlocked adj opened తాళము వేయబడని, తెరిచి వుండిన.
Unlooked-for adj అకస్మికముగా వచ్చిన. this was an * for decision యిట్లాతీర్పు కాబోతున్నదని యెవరు తలవలేదు.
Unloosed adj విడవబడని.
Unlovd adj without friends ఆప్తులు లేని, హితులు లేని.
Unloveliness n s ugliness వికారము.
Unlovely adj ugly వికారమైన.
Unloving adj not found మోహములేని, విశ్వాసము లేని.
Unluckily adv by ill fortune దౌర్భాగ్యముగా, దురదృష్టము చొప్పున. * for himwe knew this story was false వాని దౌర్భాగ్యము వల్ల యీ మాట అబద్ధమనిమాకు తెలిసినది.
Unlucky adj not successful, unfortunate కాని, చెడ్డ, దౌర్బాగ్యమైన. an *omen దుశ్శకునము. he is an * man వాడు దౌర్భాగ్యుడు. this is an * businessయిది దిక్కుమాలిన పని, పాడుపని. they arrived in an * hour చెడ్డ వేళలో వచ్చిచేరినారు. the * witness told the truth ఆ పాడు సాక్షి నిజము చెప్పినాడు. an *boy కొంటె పిల్లకాయ.
Unmade adj not yet formed చక్కపెట్టబడని. the bed is * ఆ పరుపు పరవలేదు.
Unmaimen adj sound; entire హాయిగా వుండే, అంగవైకల్యము లేని. those whowere * అవయవములకు అపాయము లేని వాండ్లు.
Unmanageable adj not governed; not controllable అసాధ్యమైన, అరపరాని,దోవకురాని, మొండి. this is an * horse యిది దోవకురాని గుర్రము.
Unmanly adj not proper; not respectable; base నీచమైన, క్షుద్రమైన. thisis an * conduct యిది నీచపని, తగని నడత.
Unmanned adj ధైర్యము తప్పిన, గతధైర్యుడైన. he was quite * by this newsయీ మాట వినగానే కుంగిపోయినాడు.
Unmannered, Unmannerly adj rude; coarse అమర్యాదైన, మోటైన,అసాంప్రదాయకమైన.
Unmanufactured adj not prepared by art, not wrought into the properform for use పని చేయని. * cotton పత్తి. * wool బొచ్చు. * gold పనిచేయనిబంగారుకడ్డి.
Unmanured adj not prepared with manure యెరువు వేయబడని.
Unmarked adj without a sign, undistinguished గురుతులేని, అప్రసిద్ధమైన.some of the sheep were marked, some were * కొన్ని గొర్రెలకు గురుతువేసినారు, కొన్నిటికి వేయలేదు. he passed * among the throng ఆ గుంపులోతెలియకుండా జరిగినాడు.
Unmarketable adj which cannot be sold అమ్ముడుపోని.
Unmarried adj పెండ్లి కాని.
Unmasked adj open; exposed to view బయిటపడ్డ, ప్రకటితమైన.
Unmastered adj not subdued సాధించబడని. a task * by his fatherతండ్రివల్ల సాధించబడని పని.
Unmatched adj not equalledl అసమానమైన, యీడులేని, దీటులేని.
Unmeaning adj not having an intention నిరర్థకమైన, అర్థవిహీనమైన. a few *words కొన్ని దిక్కుమాలిన శబ్దములు. the titles of several Telugu poems arequite * కొన్ని తెలుగు కావ్యములకు వుండే పేళ్ళు అసంబంధముగా వున్నవి, అనగా ఆపేరుకున్ను దానిలో వుండే కథకున్ను సంబంధము లేకుండా వున్ణది.
Unmeant adj not intended అనాలోచితమైన, తలచిచేయని అబుద్ధిపూర్వకమైన. whyshould you be angry at an * insult ? అబుద్ధిపూర్వకమైన అపచారమునకుతమరేల కోపము చేస్తారు.
Unmeasurable adj great, vast అమితమైన, అపారమైన.
Unmeasured adj not limited అమితమైన, అపారమైన.
Unmeddled with adj not touched; not altered యెవరున్ను అంటని. themoney is * with ఆ రూకలు పెట్టినది పెట్టినట్టుగానే వున్ణవి.
Unmediated adj not planned; not prepared అనాలోచితమైన,అబుద్ధిపూర్వకమైన.
Unmeet adj not fit; not proper తగని, అయుక్తమైన, కూడని, కాని. suchwords were * అటువంటి మాటలు ఆడరాదు.
Unmellowed adj not fully matured పక్వము కాని, అపక్వమైన, మాగని.
Unmelted adj not dissolved కరగని, నీరైపోని. where is the heart thatwould be * at these prayers ? యిట్లా బతిమాలుకొంటే యెవడి మనస్సు నీరైపోదు ?
Unmentionable adj not fit to be told చెప్పరాని, అనరాని.
Unmentioned adj not named చెప్పబడని.
Unmerchantable adj that which cannot be sold అమ్ముడుబోని.
Unmerciful adj cruel; inhuman క్రూడుడైన, నిర్దయాత్మకుడైన. he got an *beating వాణ్ని దయాదాక్షిణ్యము లేకుండా బాది విడిచిపెట్టినాడు.
Unmercifully adv cruelly క్రూరముగా, దయాదాక్షిణ్యము లేక.
Unmerited adj not deserved నర్హమైన, అన్యాయమైన. an * punishmentఅన్యాయమైన శిక్ష.
Unmetalled adj made of earth without brick or stone రాళ్లుపరవని, జల్లివేయని. an * road రాళ్ళు పరవకుండా మట్టితో వేసిన బాట.
Unmilked adj పిండని, పితకని.
Unmindful adj careless; regardless అక్కరలేని, శ్రద్ధలేని. he is quite *about his family వాడికి సంసారము మీద జ్ఞాపకమే లేదు.
Unmingled adj not mixed; not combined; pure కలియని, మిశ్రితము కాని,స్వచ్ఛమైన. this paper is written in Telugu * with Hindustani యీ కాకితముతురక మాటలు కలియకుండా వ్రాయబడియున్నది. milk * with water నీళ్ళు కలియనిపాలు. he gazed at them with * astonishment మహత్తైన ఆశ్చర్యముతో వాండ్లనుచూచినాడు.
Unmistakeable adj clear; certain స్పష్టమైన, పరిష్కారమైన, ఘనమైన. ( thisis a bad word.)
Unmistakeably adv clearly; certainly పరిష్కారముగా, ఘనముగా. ( this isa bad word. )
Unmitigated adj full ; entire, complete తగ్గించబడని, సంపూర్ణమైన.punishment * by mercy దయచేత తక్కువచేయని శిక్ష.
Unmixed adj not mingled; pure కలియని, స్వచ్ఛమైన, అచ్చమైన. wine * withwater నీళ్లు కలియని సారాయి. Telugu * with Sanscrit సంస్కృతము మాటలుకలియని అచ్చ తెలుగు.
Unmndied adj not heeded విచారించబడని, దిక్కుమాలివుండే, అధ్రద్ధచేయబడ్డ. apoor * outcaste వొక దిక్కుమాలిన పక్షి.
Unmoisted adj not disturbed ఇబ్బందిలేని, సంకటము లేని తొందరలేని, హాయిగావుండే. he left them * వాడు వాండ్లను తొందర పెట్టలేదు. he lived there * for tenyears పది యేండ్ల వరకు యెవరి వల్ల వొక వుపద్రవము లేకుండా అక్కడ వుండినాడు.
Unmoistened adj not wetted తడవని, తడవబడని. the earth while * withrain is barren వాన నీళ్ల చేత తడవని భూమి వుండదు.
Unmortgaged adj not pledged కుదవ పెట్టబడని, తాకట్టు పెట్టబడని. his houseis as yet * నేటివరకు వాడి యిల్లు కుదవపెట్టబడనే లేదు.
Unmortified adj not subdued by sorrow అణచబడని, భంగము చేయబడని. *lusts అణచ బడనీ మోహములు.

Unmourned adj not lamented యేడవని, దుఃఖపడని. he was * by his sonsవాడి చావుకు వాని కొడుకులు యేడవలేదు.
Unmovable adj firm; fixed స్థిరమైన, కదలని.
Unmoved adj not affected కఠినమైన, కదలని. he was * at their words వాండ్ల మాటలకు వాడు కదలలేదు.
Unmusical adj not harmonious కర్ణకఠోరమైన, శ్రావ్యము కాని, చెవులకు యింపుకాని.
Unmuzzled adj freed మూతి చిక్కము తీయబడ్డ.
Unnamed adj not mentioned చెప్పబడని. he is * in that book ఆ పుస్తకములోవాని పేరు యెత్తలేదు.
Unnatural adj strange; forced prodigious విపరీతమైన, అన్యాయమైన, పాపిష్ఠిక్రూరమైన. an * son తల్లిదండ్రుల విషయములో క్రూరుడుగా వుండే కొడుకు. * parentsబిడ్డల విషయమై క్రూరులుగా వుండే తలిదండ్రులు. the hand was swollen to an *size చెయి విపరీతముగా వాచినది. Bonaparte was the * and implacable enemyof England బోనయపార్టి అనేవాడు ఇంగ్లండుకు అతి క్రూరుడున్ను అనివార్యుడున్నుఅయిన శత్రువుగా వుండెను. this is a very * meaning of the word యిది ఆమాటకు నిండా అసంబంధమైన అర్థము. an * murder అతి క్రూరమైన ఖూని పని. thiscaused an * disminution in the trade యిందువల్ల యీ వర్తకములో వచ్చిననష్టము యింతంత కాదు. in that picture the hand looks quite * ఆ పఠములోచెయి నిండా వికారముగా వున్నది, పొందికగా వుండలేదు.
Unnaturally adv cruelly, improperly, vilely, abominably పాపిష్ఠితనముగా,అన్యాయముగా, విపరీతముగా.
Unnavigable adj not to be passed by ships వాడలు పోగూడని. as theriver was * యేట్లో వాడలు పోగూడదు గనక.
Unnecessarily adv needlessly అక్కరలేనిదై, అగత్యము లేనిదై, నిర్నిమిత్తముగా.he was appointed to his business * యీపనికి వాణ్ని నిర్నిమిత్తముగా పెట్టినారు.he was * punished వాణ్ని శిక్షించవలసిన అక్కర లేకుండా వుండగా శిక్షించినారు. the tree was * cut down ఆ చెట్టును నరకవలసిన అక్కరలేకుండా వుండగా నరికినారు.
Unnecessary adj needless అక్కరలేని, నిమిత్తము లేని, నిర్నిమిత్తమైన. thispayment is * యీ రూకలు చెల్లించవలసిన అక్కరలేదు.
Unnecessitated adj not required అగత్యము లేని, అక్కరలేని.
Unneighbourly adj not friendly, not kind, rude క్రూరమైన, విరసమైన,దయాదాక్షిణ్యము లేని.
Unnerved adj weak; feeble దుర్బలమైన, సత్తువలేని, కుంగిన, నిస్త్రాణగా వుండే.
Unnoted adj not observed; not heeded విచారించబడని, లక్ష్యపెట్టబడని.
Unnoticed adj not marked విముఖ్యమైన.
Unnumbered adj which cannot be counted అసంఖ్యేయమైన, లెక్కపెట్టకూడని,అమితమైన.
Unobeyed adj not attended to తిరస్కరించబడ్డ. this order remained * యీవుత్తరువు ప్రకారము నడవకుండా అట్టే వుండినది. he was * వాని ఆజ్ఞను విన్నారు కారు,వాణ్ని తిరస్కారము చేసినారు.
Unobjected to adj not found fault with ఆక్షేపించబడని. the accountswere * to ఆ లెక్కలకు ఆక్షేపణ చేయలేదు.
Unobjectionable adj without cavil ; without fault ఆక్షేపణలేని, నిర్దోషమైన. his conduct was * వాడు చేసిన దానికి ఆక్షేపణ లేదు, తప్పులేదు.
Unobliterated adj not blotted out తుడిచివేయబడని. these wordsremained *, all the rest was gone యీ అక్షరాలు మాశిపోకుండా వుండినవి కడమఅక్షరాలు మాశిపోయినవి.
Unobnoxious adj not liable; not exposed to harm నిర్దుష్టమైన,దోషవిహీనమైన. their conduct was * వాండ్ల నడవడి నిర్దుష్టముగా వుండినది.
Unobscured adj not darkened చీకటి కమ్మని. I saw the moon * by cloudsమబ్బులో మరుగుపడని చంద్రుణ్ని చూచినాను.
Unobservable adj that cannot be seen అగుపడని, దృష్టి గోచరము కాని,యోచనకు తగలని. the distinction between these two is * యీ రెంటికీ భేదముఅగుపడలేదు.
Unobservance n s inattention ఆలక్ష్యము.
Unobservant adj heedless; not attentive అజాగ్రతగా వుండే అలక్ష్యముగావుండే.
Unobserved adj not heeded; not noticed చూడబడని, అగుపడని. he passed* through the garden ఆ తోట దాటిపోగా వాడు యెవరికిన్ని అగుపడలేదు. hefollowed them * వాండ్లకు అగుపడకుండా వాండ్ల వెంట పోయినాడు.
Unobserving adj inattentive; heedless శ్రద్ధలేని, అక్కరలేని, అవివేకియైన. an *man learns nothing శ్రద్ధ లేనివాడికి వొకటీ రాదు.
Unobstructed adj not hindered ఆటంకములేని, అడ్డులేని.
Unobstructedly adv నిరాటంకముగా, అడ్డిలేకుండా.
Unobtainable adj not within reach పొందగూడని, అసాధ్యమైన.
Unobtained adj not got; not gained పొందబడని, అప్రాప్తమైన, దొరకని.
Unobtrusive adj modest, humble అణుకువగల, నమ్రతగల. their manners arevery * వాండ్లు నిండా మేదకులు.
Unobtrusively adv humbly అణుకువగా, నమ్రతగా, దీనత్వముగా.
Unobvious adj not evident స్పష్టము కాని తేటకాని, విశదము కాని.
Unoccupied adj not filled వూరికె వుండే, పని లేక వుండే. the house is still * ఆ యింటికి కాపురము రాలేదు, యింకా వూరికె వున్నది. he was * all day దినమంతా పని లేకుండా వూరికె వుండినాడు. those who are * with their owntroubles స్వతః తొందరలు లేనివాండ్లు.
Unoffending adj harmless, sinless నిరపరాధియైన, నిరుపద్రవకారియైన. hecursed his * wife for this ఇందున గురించి నిరపరాధియైన తన పెండ్లాన్ని తిట్టినాడు.
Unoffensive adj harmless నిరుపద్రవకారియైన. he cursed his * wife forthis ఇందున గురించి నిరపరాధియైన తన పెండ్లాన్ని తిట్టినాడు.
Unoffered adj not given ఇవ్వని.
Unofficered adj not having officers అధికారులు లేని. the ship is * ఆవాడలో అధికారులు లేరు.
Unofficerlike adj improper for an officer to do వొక వుద్యోగస్థుడుచేయరాని. this was * conduct యిది వొక వుద్యోగస్థుడు చేయరాని పని.
Unofficial adj not according to rule వుద్యోగ ధర్మమును బట్టని. one letterwas official, the other was * వొక జాబు వుద్యోగ ధర్మమును బట్టి వ్రాశినది మరివొకటి అట్లా కాదు.
Unopened adj closed విచ్చని, వికసించని, తెరవని. an * letter విచ్చని జాబు. an* flower వికసించని పుష్పము.
Unopposed adj not resisted, నిరాటంకమైన, అడ్డములేని. he entered thehouse * ఆ యింట్లో నిరాటంకముగా దూరినాడు. his appointment was * వాణ్నివుద్యోగములో పెట్టడానకు యెవరున్ను అడ్డము చెప్పలేదు.
Unordered adj not commanded ఆజ్ఞాపించబడని. the goods that are *యెవరూ కోరని సరుకులు.
Unorderly adj rude, ill-behaved అమర్యాదస్థులైన. a few * boys కొందరుకొంటె పిల్లకాయలు.
Unorganized adj not regularly arranged చిన్నాభిన్నముగా వుండే, అల్లరిగావుండే, తారుమారుగా వుండే, నియమితము కాని, అవ్యవస్థితమైన. the army is * ఆసైన్యము అల్లరిగా వున్నది చెదిరివున్నది. when a kingdom is * రాజ్యముతల్లక్రిందులుగా వుండేటప్పుడు, తారుమారుగా వుండేటప్పుడు.
Unornamented adj plain శృంగారము లేని, సాదాగా వుండే.
Unostentatious adj not boastful; modest జంభము లేని.
Unowned adj not claimed, having no owner నాది అనేవాడు లేని, దిక్కులేని,నాధుడు లేని. the horse is * యీ గుర్రము నాదని యెవరు రాలేదు.
Unpacked adj opened, as goods విచ్చిన, విప్పబడ్డ.
Unpaid adj not given; not discharged చెల్లించబడని తీర్చబడని, తీరని. thereis much money hitherto * ఇదివరకు యింకా చెల్లని రూకలు శానా వున్నవి. he lefthis servants * వాడు కొలువుడు గాండ్లకు జీతము యివ్వలేదు. * servants జీతములేని కొలువుడు గాండ్లు. all their trouble is * వాండ్లు పడ్డ శ్రమ కంతా చెల్లు కాలేదు.
Unpainted adj not coloured వర్ణము పూయబడని. he left the rooms * ఆయిండ్లకు వర్ణము పూయకుండా వుంచినాడు.
Unpalatable adj not agreeable అసహ్యమైన. this advice was very * tohim, యీ మాటలు వాడికి నిండా చీదరగా వుండినవి, వెగటుగా వుండినవి.
Unparagoned adj not equalled అసమానమైన. this is * injustice యింతఅన్యాయము భూలోకములో లేదు.
Unparalleled adj not equalled అసమానమైన, యీడు జోడులేని. the countrywas ruined to an * extent ఆ దేశము పాడైనది యింతంత కాదు.
Unpardonable adj not to be forgiven మన్నించగూడని, క్షమించగూడని. suchnegligence is * యిటువంటి వుపేక్షను క్షమించరాదు, యిట్లా వుపేక్ష చేసినందుకు వాణ్నిమన్నించరాదు.
Unpardonably adv exceedingly నిండా, మిక్కిలి. he was * prodigal వానిదూబరదిండితనము యింతంత కాదు.
Unpardoned adj not forgiven క్షమించబడని. those whose sins are * ముక్తిలేనివాండ్లు, అక్షమితపాపవంతః.
Unparliamentary adj not proper అమర్యాదగా వుండే, అన్యాయమైన, అక్రమమైన.
Unparted adj not divided; not separated విభజించబడని. they wear hair *on the forehead వాండ్లు పాపట తీయరు.
Unpatronized adj not protected by friends ప్రాపకము లేని, అదరువులేని. thisschool is * యీ బడికి సంరక్షకులు లేరు. how can you do this * bygovernment ? రాజుల ప్రాపకము లేకపోతే నీవు దీన్ని యెట్లా చేయగలవు. at thattime he was entirely * అప్పట్లో వాడికి యెవరు ప్రాపకులు లేరు.
Unpawned adj not pledged కుదవ పెట్టబడని, తాకట్టు పెట్టబడని.
Unpensioned adj not receiving a subsistence భరణము యివ్వబడని,జీవమునకు యివ్వబడని. some of them though old servants are * అందులోకొందరు పాతనవుకరులు అయినప్పటికిన్ని వాండ్లకు వర్షాశనము చిక్కలేదు.
Unpeopled adj without inhabitants, depopulated కాపులు లేని. all thesetowns were * యీ వూళ్ళంతా నిర్మానుష్యముగా వుండినవి, పాడుగా వుండినవి.
Unperceived adj not seen అగుపడని, కండ్లబడని. when you stand at a littledistance the difference is * నీవు కొంచెము దూరములో వుంటే ఆ భేదముకనుపడదు.
Unperformed adj not done చేయని, చేయబడని. they left their tasks *వాండ్ల పనులను వాండ్లు నెరవేర్చకపోయినారు.
Unperishable adj lasting నిరంతరమైన, అక్షయమైన. this glory is * యీ కీర్తికియెన్నటికీ నాశము లేదు.
Unphilosophical adj అశాస్త్రీయమైన, అనుపయుక్తమైన, అజ్ఞానమైన, మూర్ఖమైన,మూఢమైన. I thought his conduct * వాడు చేసినది పిచ్చి పని అని నాకు తోచినది.this is a very * explanation ఇది జబ్బు సమాధానము.
Unphilosophically adv ignorantly, foolishly అవివేకముగా, పిచ్చిగా. hevery * was angry at this వాడు యిందుకు కోపము చేయడము వట్టి వెర్రితనము.
Unpierced adj not penetrated దూయని, దూరని. darkness * by a singlestar గాఢాంధకారము.
Unpinned adj loosed విచ్చిన, విచ్చబడ్డ.
Unpitied adj not lamented అయ్యో అనబడని. he died * వాడు చచ్చినదానికియెవరున్ను అయ్యో అనలేదు.
Unpitying adj cruel నిర్దయాత్మకమైణ, క్రూరమైన.
Unplaced adj not located, not appointed, not fixed ఉంచబడని.
Unplagued adj not tormented ఉపద్రవించబడని, తొందరపెట్టబడని. those whoare * with debts అప్పుల తొందర లేనివాండ్లు.
Unplanted adj not set పెట్టబడని, నాటబడని. there are still some fieldls *యింకా కొంత పొలము నాట్నము కాలేదు.
Unpleasant adj not agreeable అసహ్యమైన, చెడు, చెడ్డ. this is very * యిదినిండా తొందర. this water has an * taste యీ నీళ్ళు నోటికి అరుచిగా వున్నది. hervoice is * దానిది మంచి కంఠము కాదు. this wind is very * యీ గాలి తొందరచేస్తున్నది. it is * to see such behaviour యీ లాగంటి నడతను చూడడముమనసుకు నిండా సంకటముగా వున్నది. his look is * వాని చూపు వికారముగా వున్నది.
Unpleasantly adv not agreeably అసహ్యముగా, తొందరగా.
Unpleasantness n s అసహ్యము, రోత.
Unpleasing adj disagreeable అసహ్యమైన, విరసమైన.
Unpliant adj not easily bent, stiff వంగని, బిరుసుగా వుండే. he is very *వాడు నిండా గడుసు మనిషి, వంగనివాడు, క్రూరుడు.

1 comment:

  1. Thanks for sharing your thoughts about dispensing. Regards

    My web page; best cellulite treatment

    ReplyDelete