Wad

Wad. n. s. paper, tow,&c, to stop the charge of a gun, a little bundle బిళ్ళ, అనగా మందుగుండు వేసిన తర్వాత గెట్టించడమునకై వేశే కాకితము, చింపి గుడ్డ మొదలైనది.
Wadding n s a wad, a soft stuffing దిండు, అనగా మందుగుండు వేసిన మీదట తుపాకిలో వేశే చింపికాకితము మొదలైనది. I used a little cotton for * మందు గుండు తుపాకిలో వేశి పైకి దిండు కొరకై రవమత దూది వేసినాను.
Wafer n s a thin cake, a thin leaf or dried paste for sealing papers నిండా పలచని నిప్పటి, జాబులకు ముద్రవేసే గోధుమ పిండి బిళ్ళ.
Wafted adj. carried away తీసుకొనిపోయిన, కట్టుకొనివచ్చిన, odours * on the breeze వాయ్వానీత సుగంధము, గాలి తీసుకొనివచ్చిన పరిమళము.
Wag, wag n s. a jester హాస్యగాడు, ఎగతాళి చేసివాడు, నవ్వించేవాడు.
Waged adj carried on చేసిన. a war that was * for ten years పదేండ్ల దాకా చేసిన యుద్ధము.
Wager n s a bet పందెము. he laid a * of one hundred rupees వాడు నూరు రూపాయల పందెము వేశినాడు.
Wages n s hire జీతము.
Waggery n s merriment, sport ఎగతాళి, హాస్యము.
Waggish adj sportive, merry ఎగతాళిఐన, హాస్యమైన. Waggishly, adv. sportively ఎగతాళిగా, పరిహాసముగా.
Waggishness n s merriment ఎగతాళి, పరిహాసము.
Waggon, Wagon n s. a large cart పెద్ద బండి, సామానులను తీసుకొనిపొయ్యే నాలుగు చక్రాల పెద్ద బండి, సీమలో దీనికి ముఖ్యముగా యెనిమిది గుర్రములు కట్టుతారు.
Waggoner, wagoner n s. పెద్ద బండిని తోలేవాడు, పక్కన నడిచి తోలుకొని పొయ్యే వాడు.
Wagtail n s a bird దాసిరిపిట్ట, కంప జిట్టిపిట్ట, జిట్టంగి, లకుముకిపిట్ట.
Waif n s goods having no known owner, goods thrown away, stray దిక్కుమాలిన గొడ్డు, దిక్కుమాలినది, నాధుడు లేని సొత్తు, తనదేనవాడు లేని సొత్తు.
Wail n s రోదనము, యేడ్పు, మొత్తుకోళ్ళు, గోల.
Wailing n s రోదనము, యేడ్పు, మొత్తుకోళ్ళు, గోల.
Wain n s a wagon పెద్దబండి సీమలో ముఖ్యముగా దీనికి నాలుగు లేక యెనిమిది గుర్రాలు కట్టుతారు. Charles's Wain సప్తఋషి నక్షత్రములు.
Wainscot n s the lining of rooms ఇంట్లో గోడకువేసిన పలకకూర్పు, సన్నపలక. a portrait painted on * సన్నపలకమీద వ్రాశిన పటము. a pistol case made of * సన్నపలకతో చేసిన పిస్తోలు వుంచే పెట్టె. Wainscot means Not solid: mere veneer: paltry shew. So in Tomlin's His. of Engl. 2. 61. his wainscot carcase i. e. his rickety weak body వానిగుల్ల వంటి శరీరము.
Wainscoted adj made of thin plank; fitted with thin plank కూర్పుపని చేయబడ్డ, సన్నపలకలతో చేసిన, సన్నపలకతో కూర్చుపని చేసిన. hte room was * with looking glass ఆ గదిలో నాలుగు తట్లా గోడలకు అద్దాలు కూర్చి వుండినది.
Waist n s the middle నడుము. her slender * దాని సన్ననడుము, కృశోదరము. the * of a ship వాడ యొక్క నడిమి భాగము.
Waist-band n s a girdle నడికట్టు.
Waist-coat, wesorn s. covering of the waist అరచొక్కాయ. a woman's * రవిక. a straight * చేతులు నిడుపుగా వుండే అరచొక్కాయ, వెర్రివానికి యీ చొక్కాయ వేశి చేతులను వెనక్కు కట్టిపెట్టుతారు.
Waiter n s an attending servant పనివాడు. a tide * (an officer who watches the lading of goods at the custom house సురుకులు దిగుమతి అయ్యేటప్పుడు కావలి వుండే బంట్రోతు. a dumb * బల్ల.
Waiting n s attending, serving కాచుకొని వుండడము, కనిపెట్టుకొని వుండడము. he is in * వాడు కనిపెట్టుకొని వున్నాడు. a gentleman in * పని వాడు.
Waits n s those who sing at night ఖ్రిస్తుమసు పండుగలో యింటికి పోయి పదములు పాడేవాండ్లు.
Wakeful adj watchful, without sleep మెళుకువగల, జాగరూకతగల. the dog is very * కుక్క నిండా మెళుకువ గలది, చిటుక్కుమంటే లేచేటిది. the * nightingale రాత్రంతా పాడేపక్షి.
Wakefulness n s watchfulness మెళుకువ, జాగరూకత. from the * of the dog కుక్క నిండా మెళుకువగలది గనక.
Waking n s rousing, watchfulness మెళుకువ, జాగరూకత. the sleep that knows no * మెళుకువలేని నిద్ర, అనగా చావు.
Walk n s act of moving by steps నడక, గమనము. a gait or method of walikng నడిచే వైఖరి, నడిచేరీతి. a path శాల. there were three *s in the garden ఆ తోటలో మూడుశాలలు వేశి వుండినవి. will you take a * ? నాతో కూడా కొంత దూరము వస్తారా. behaviour or conduct నడత, మర్యాద, నీతి. course of life or pursuit అధికారము, శక్తి. a sheep * (which is high and dry land where sheep are pastured) గొర్రెలు మేశే ప్రదేశము. this is quite out of his * యిది వాని అధికారములో లేదు, అనగా యిది వానికి అసాధ్యము. this is not within the * of the historian యిది ఆ కథికుని యొక్క అధికారములో లేదు.
Walker n s one who walks నడిచేవాడు, సంచరించేవాడు. a night *, or street *, that is a whore లంజ, బోగముది.
Walking n s a moving by steps నడవడము, సంచరించడము, తిరగడము.
Walking stick n s a staff to walk with ఊత కోల, చేతికట్టె.
Wall n s గోడ. the * of a temple గుడి యొక్క ప్రాకారము. the *s of a tent డేరా యొక్క గుడ్డగోడ, కనాతు. he went to the *, or he was ruined వోడిపోయినాడు, చేడిపోయినాడు. are you going to run your head against a *? నీకు నీవే చేటు తెచ్చుకొంటావా. he took the * of me వాడు నన్ను అలక్ష్యము చేసినాడు, అమర్యాద చేసినాడు, the * of a gun పిరంగి నోటిలోని పక్కలు. England has wooden *s ఇంగ్లండు కొయ్యగోడలు గలది, అనగా యుద్ధ వాడలచేత సంరక్షించబడు తున్నది.
Walled adj having walls గోడలుగల, ప్రహరిగల, ప్రాకారముగల. a * town చుట్టూ ప్రహరి గోడలుగల పట్టణము.
Wallet n s a bag, a knapsack *, a double pouch సంచి, అసిమిసంచి, కక్షపాల, జోలె.
Walleyed adj కాయకన్నుగల, ఇది గుర్రములను గురించిన మాట.
Wallflower n s గోడలమీదపాకే పుష్పచెట్టు.
Wallfruit n s గోడమీద పాకిన చెట్లలో పండిన పండు.
Wallopoing adj walking awkwardly వికారముగా నడిచే.
Wallpiece n s a small cannon గోడమీద పెట్టి కాల్చే చిన్న పిరంగి.
Walnut n s అక్రోటుకాయ. of a * colour చామనిచాయగల.
Walrus n s సముద్రములో వుండే యేనుగవంటి వొక జంతువు.
Waltz n s a wild dance తాండవము.
Wampum n s small beads made of different coloredshells, used by the North American Indians as money, and also wrought into belts, &c. as an ornament పాలపూసలు, శంఖుపూసలు. a belt of * శంఖుపూసలతో అమర్చిన పట్ట.
Wan adj pale పాలిపోయిన, తెల్లపారిని, వివర్ణమైన.
Wand n s a small stick, a staff, a rod చువ్వ, బరికె, దండము, శంగోలము. a riding * (in old English) or whip కొరడా, చబుకు.
Wanderer n s a rambler దేశమ్మ కాకిగా తిరిగే వాడు, అల్లాడేవాడు.the *s in the wilderness అడవిలో తిరిగే వాండ్లు, వనములో సంచరించేవాండ్లు.
Wandering adj roving, rambling తిరిగే, అల్లాడే, అస్థిరమైన, చపలమైన.* thoughts చపలచిత్తము.
Wane n s decrease of the moon చంద్రుడి యొక్క కళాక్షయము. decline; diminution క్షయము, క్షీనగతి. they perceived that his fortune was on the * వాడి ఐశ్వర్యము క్షీనగతిలోకి వస్తున్నదని కనుక్కొన్నారు.
Waned adj diminished క్షయించని, క్షీణగతిలోకి వచ్చిన.
Wannion, With a wannion adv (old English word) meaning with a vengeance ప్రచండముగా, బ్రహ్మాండముగా.
Want n s need; necessity, dificiency; defect అక్కర, అగత్యము,లేమి, తక్కువ, కొదవ, లోపము, వెలితి. poverty దారిద్య్రము. he supplied all my *s నాకు కావలసినదంతా జాగ్రత్త చేసినాడు. * of courage అధైర్యము. * of temper ఆతురము. * of appetite or digestion అజీర్ణము. * strength బలహీనము. * of energy పాలుమాలిలక. a man in * బిదవాడు, పేదవాడు. he is not in * వాడు బిదవాడు కాదు.* of money దారిద్య్రము. * of sense అవివేకము. * of knowledge అజ్ఞానము.* of judgement తెలివి లేమి, అవివేకము. he is in * of money to do this దీన్ని చేయడానకు వానికి రూకలు లేదు. I am in * of a guide నాకు దారి చూపేవాడు కావలెను. being in * of money రూకలు కావలసి. for * of sleep నిద్రలేనందున, చాలనందున.
Wanted adj needed; desired కావలసిన, అగత్యమైన, అక్కరగావుండే, లేకవుండే. how much will be * ? యెంతపట్టును. I am not * ! నేను అక్కర లేదుగదా. no answer is * పత్యుత్తరము అక్కరలేదు.
Wanting adj needing; deficient అక్కరగా వుండే, గావలసి ఉండే, తక్కువగా వుండే, లేకేవుండే, లోపముగా వుండే, వెలితిగా వుండే. the book that is a * లేక వుండే పుస్తకము, లేని పుస్తకము. it is * అది లేక వున్నది, కావలసివున్నది. one thing is * వొక్కటే తక్కువ. he is always * to go to his mother వాడు యేవేళా తల్లి దగ్గిరికి పోవలెనంటాడు. * to go there అక్కడికి వెళ్ళవలసి. how canyou be so * to yourself? నీవు యిట్లా పాలు మాలడము యెటువంటిది.
Wanton adj "roving in sport, sportive, playing loosely,licentious పోకిరియైన, కాముకుడైన, తుంటయైన, కొంటెయైన. * waste of money రూకలను వుయర్థముగా సెలవు చేయడము. a * falsehood వూరికె చెప్పిన అబద్ధము, అట్లాటకు చెప్పిన అబద్ధము. * frolicks శృంగారచేష్టలు, కొంటె పనులు. * cruelty నిర్హేతుకముగా చేసిన క్రూరమైనపని. * abuse వూరికే తిట్టినతిట్లు, నిర్హేతుకమైన తిట్లు. a * book శృంగార కావ్యము, పోకిరి పుస్తకము."
Wantonly adv in a licentious manner కొంటె తనముగా, పోకిరితనముగా. they talked very * వాండ్లు నిండా కొంటె తనముగా మాట్లాడినారు.
Wantonness n s lasciviousness కొంటెతనము, పోకిరినతము. he did this out of pure * వాడు యిది వట్టి కొంటె తనముచేత చేసినపని.
Wapentake n s (division of a district) తుకుడీ, తాలూకా, యీ శబ్దము యిప్పుడు వాడుక లేదు.
War n s contention యుద్ధము, కయ్యము, పోరు, జగడము. a man of * యుద్ధవాడ. she is a man of * అది యుద్ధవాడ.
Warbler n s a singer, a singing bird పాడేటిది, పాడేపక్షి, కోకిల స్వరమువంటి స్వరము గల పక్షి.
Warbling adj singing సరళమైన, మధురమైన.
Warblingly adv సరళముగా, మధురముగా, కలకల.
Ward n s watch, guardianship, district; part of a lock or key, a person under a guardian కాపు, కావలి, సంరక్షకత్వము,పేట, తాళపు చెవి సందు, బీగపుగంటి, తాళములో మారు బీగము పట్టకుండావుండడమునకై అతికివుంచే యినప తునక, సంరక్షణలో వుండే వాడు. they kept watch and * కావలిగా తిరిగినారు. a bear * వెలుగ్గొడ్డును పెంచేవాడు. they put him in * వాణ్ని చెరలో పెట్టినారు. he is a * of my father's వాడు మా తండ్రి సంరక్షణలో వుండే పిల్లగాడు.
Ward, Wards adv వైపుకు, తట్టుకు. ward or heavenwards ఆకాశమునకై,homeward or homewards యింటివైపుగా. godward యీశ్వర విషయమునందు, దేవుని యెడల northwards ఉత్తరముగా. eastwards తూర్పుగా, తూర్పువైపుగా.towards me నాకై, నా తట్టుకై. they were good towards him వాని యెడల మంచివాండ్లుగా వుండినారు.
Warden n s a superintendent పాలకుడు, రక్షకుడు, అధికారి, పారుపత్తి the church * గుడి ధర్మకర్త. the * of the poor (an officer in Ireland) భిక్షగాండ్ల సంగతి విచారించే అధికారి.
Warder n s a keeper; a guard కావలివాడు, తలారి. a truncheon దండము, వేత్రము, సోటాకర్ర.
Wardrobe n s wearing apparel in general ఉడుపు, బట్టలు. he had a good * వాడు మంచి బట్టలు కట్టుతూ వుండినాడు, మంచి వుడుపు వేసుకొంటూ వుండినాడు. a place for apparel బట్టలు వుంచే స్థలము.
Wardship n s guardianship; care సంరక్షకత్వము, పాలనము. pupilageసంరక్షణలో వుండడము.
Ware past tense of the verb toWar morefrequentlyWore
Ware! interj. that is Beware of! భద్రము, జాగ్రత్త
Warehouse n s a storehouse సరుకులు పెట్టే గిడ్డంగి, మళిగ.
Warfare n s conflict యుద్ధము.
Warily adv cautiously, prudently జాగ్రత్తగా, పదిలముగా, ఎచ్చరిక,జాగ్రత.
Warlike adj adapted to war, military యుద్ధసంబంధమైన, యుద్ధార్హమైనన, యుద్ధోపయోగమైన, శౌర్యముగల, శూరత్వముగల. * preparations యుద్ధ సన్నాహములు. they are a * people వాండ్లు శూరులు. I heard the * sound of a trumpet యుద్ధ సంబంధమైన కాహళీ స్వనమును విన్నాను.
Warlock n s (a Scotch word) a wizard శూన్యగాడు, తోడుబోతు.
Warm adj a little hot వెచ్చని, ఉష్ణమైన. * water వేణ్నీళ్ళు.* weather యెండ కాలము. before the food was * he removed it యింకా వెచ్చకాక మునుపే దాన్ని తీశివేసినాడు. * climate ఎండ అధికముగా వుండే దేశము. * bath వేణ్నీళ్ళ స్నానము. zealous శ్రద్ధగల, ఆశగల. a * friend మంచి స్నేహితుడు. he gave me a * reception నన్ను నింఢా విశ్వాసముగా సన్మానించినాడు. the battle was * యుద్ధము నిండా ముమ్మురముగావుండినది. a * engagement ముమ్మరముగా వుండే యుద్ధము. ardent ఉగ్రమైన. * wrods ఉగ్రమైన మాటలు, కోపముగా చెప్పిన మాటలు. a * temper ముంగోపము.he became * or angry ఆయనకు కోపము వచ్చినది. he grew * ఆయనకు కోపము వచ్చినది. warm hearted, kind, good విశ్వాసముగల, దయగల.
Warming adj making a little hot వెచ్చచేసే.
Warming-pan n s a covered copper pan with a long handle, for warming a bed with ignited coals లోపల కట్టె నిప్పులు వెచ్చగా వుండడమునకై మంచముమీద రాచే మూతగల రాగిచట్టి.
Warmly adv ardently ఉగ్రముగా, దయగా. * he spoke * కోపముగామాట్లాడినాడు, దయగా మాట్లాడినాడు.
Warmth n s a little heat వెచ్చన, ఉష్ణము. from the * of the room ఆ యింట్లో నిండా కాకగా వుండేటందువల్ల. form the * of theweather నిండా యెండగా వున్నది గనక. eagerness, ardour ఉగ్రము. * of imagination మనోద్రేకము. * of temper, i. e. passionateness ఆగ్రహము. * of constitution (a bad word) lasciviouness కామోద్రేకము.from the * of his language వాడు నిండా కోపముగా మాట్లడి నందువల్ల, వాడు నిండా దయగా మాట్లాడినందువల్ల.
Warned p|| cautioned against danger; notifiedఎచ్చరికచేయబడ్డ,తెలియచేయబడ్డ,బుద్ధిచెప్పబడ్డ, after they were * out of the town వాండ్లు వూరు వెళ్ళగొట్టబడ తర్వాత.
Warning n s " cautinon ఎచ్చరికచేయడము. admosnishing బుద్ధిచెప్పడము. giving notice to తెలియచేడయము. my coachman gave me * నేను చాలించు కొంటాను వేరే మనిషిని విచారించు కొమ్మని నా బండి వాడు నాతో చెప్పినాడు."
Warp n s thread that runs lengthwise in a loom పడుగు.
Warped adj వంగిన. a mind * by envy అసూయచేత చెడిపోయిన మనసు.
Warrant n s a precept for arresting a person by authorityఒకణ్ని పట్టడమును గురించి అధికారివల్ల యివ్వబడ్డ ఆజ్ఞా పత్రిక. the magistrate gave a * to apprehend the thieves ఆ దొంగలను పట్టడానకు పోలీసు అధికారి వొక అధికార పత్రికను యిచ్చినాడు. voucher దస్తావేజు, సాధకము. this letter is my * యీ జాబు నాకు ఆధారము, సాధకము. right ధికారము. I had his * for paying the money ఆ రూకలను చెల్లించడమునకు అతని సెలవు వున్నది. what * have youfor this interpretation? యిట్లా అర్థము చేయడమునకు నీకేమి ఆధారము. or privilege యిజారా. A warrant was granted to him for supplying the palace with firewood నగరికి కట్టెలు వేయడమునకు వానికి వొక కవులు యివ్వబడ్దది.
Warranted adj authorized అధికారమివ్వబడ్డ, అధికారముగల. The word * is written on several articles, meaning excellent దివ్యమైనది.
Warranty n s a guarantee of soundness, &c. a covenant of security యీ గుర్రములో యేదైనా దోషమువుంటే దానికి నేను పూట అని వ్రాశియిచ్చిన పత్రిక.
Warren n s an inclosed place for rabbits శశవనము, సీమలో కుందేళ్ళను పెట్టి పెంచే తోట, ఇవి యెలుకలవలె బొక్కలు చేసుకొనిఅందులో వుంటవి.
Warring n s battle, conflict జగడము, పోరు.
Warrior n s a military man, brave soldier వీరుడు, శూరుడు, బంటు.
Wart n s a hard excrescence on the flesh పులిపురి.
Wary adj cautious, circumspect, prudent జాగ్రత్తగల, జాగరూకతలగల, ఎచ్చరికగల. be *! భద్రము, జాగ్రత.
Was past tense of the verb Tobe "he * there వాడు అక్కడ వుండెను. he * not there వాడు అక్కడలేడు."
Wash n s cosmetic ముఖము కడుక్కొనే జల విశేషము. she uses a * made of chalk and other things సీమ సున్నము మొదలైనవి కలిపిననీళ్ళను ముఖానికి చరుముకొంటున్నది. * or pond మడుగు. clothes sent to the * చాకల వాడికి వేసిన గుడ్డలు. hogs * పందులకు పోశే కడుగుపుల్లనీళ్ళు.
Washball n s ball of soap సబ్బు వుండ.
Washed adj cleansed in water, purified ఉతకబడ్డ, కడగబడ్డ,నిర్మలము చేయబడ్డ. a white * wall సున్నము కొట్టిన గోడ.
Washerman n s చాకలవాడు. *'s house చాకల వాని యిల్లు.
Washerwoman n s చాకలది.
Washing adj cleansing with water, purifying ఉతికే, కడిగే, పరిశుద్ధము చేశే. washings కడిగిన మురికి నీళ్ళు. washings ofrice కడుగు.
Washleather n s (soft leather, as that of gloves, that may be wahsed) మెత్తనితోలు, నీళ్ళలో కడిగితే చెడిపోని చర్మము.
Washpot n s a vesel in which any thing is washed కడిగేపాత్ర.
Washy adj weak జబ్బైన,దిక్కుమాలిన, a poor * poem దిక్కుమాలిన కావ్యము.
Wasp n s an insect with a sting కందిరీగ, లక్కతుమ్మెద. petulant person దురహంకారి, మండిపేడవాడు. the * builds its nest in our houses with clay కందిరీగ మనయిండ్లలో గూడు కట్టుతున్నది.
Wasphishly adv peevishly మండిపడుతూ, చిరచిరలాడుతూ.
Waspish adj peevish, petulant, cross మండిపడే, చిరచిరలాడే.
Waspishness n s peevishness చిరచిర, మంట, చిటచిట.
Wassail n s drink made of roasted apples, sugar, and ale మదిరా విశేషము, వొక విధమైన సారాయి.
Wassailer n s a toper; a drukard తాగుబోతు, తాగేవాడు, అల్లరిచేశేవాడు.
Wastage n s " తరుగు. loss is making up jewels చేదారము.* in measuring salt ఉప్పు కొలవడములో వచ్చిన నష్టము."
Waste adj desolate, wild uncultivated పాడుగా వుండే, బీడుగా వుండేదున్నకుండా పడివుండే. * land బీటి పొలము, బీడు. * paper పనికిమాలినకాకితము. he laid the land * ఆ దేశమును పాడుచేసినాడు. the cholera laid the village * వాంతి బ్రాంతి ఆ వూరును పాడుచేసినది. he laid the garden * ఆ తోటను పాడు చేసినాడు, ధ్వంసము చేసినాడు.
Waste-book n s a book in which rough entries of transactions are made దినవహి, దినచర్యగా వ్రాసుకొనే లెక్క పుస్తకము.
Wasted adj expended without necessity, exhausted, desolated;ruined పాడుచేయబడ్డ, దురర్వయము చేయబడ్డ, నాశముచేయబడ్డ, కృశించిన,పాడైన, హతమైన, వ్యర్థమైన, నిష్పలమైన.
Wasteful adj lavish, destructive పాడుచేశే, దురర్వయముచేశే, దూబరదిండియైన.
Wastefully adv in a lavish manner; with prodigality; in uselessexpenses దురర్వయముగా వ్యర్థముగా, దూబరిదిండి తనముగా. they live *వాండ్లు దుర్వ్రయముచేస్తారు.
Wastefulness n s lavishness; prodigality దురర్వయము, దూబరదిండితనము.
Waster n s one who squanders property, సొమ్మును పాడుచేశేవాడు,దురర్వయము చేశైవాడు, దూబరదిండి.
Wasting adj lavishing prodigally, desolating పాడుచేశే, దురర్వయముచేశే. a * disease క్షయింపచేశే రోగము, నానాటికి కరగదీసే వ్యాధి a * war నాశకరమైన యుద్ధము.
Watch n s forbearance of sleep; guard sentinel; time of guarding; a pocket time piece, జాగరము, కావలి, కావలివాడు, కావలి వుండవలసిన కాలము, చిన్నగడియారము. there are eight *esin the day దినానికి యెనిమిది ఝాములు. you must keep a strict *after him నీవు వాని విషయములో నిండా జాగ్రతగా వుండవలసినది. they kept * కావలివుండినారు. keep a * over your tongue నోరు ఆచి మాట్లాడు,జాగ్రతగా మాట్లాడు.
Watcher n s one who sits up or continues awake; particularly,one who attends upon the sick during the night మేలుకొనివుండే వాడు,రాత్రిళ్ళు రోగివద్ద వుండి నిద్రకాచేవాడు.

No comments:

Post a Comment