పిల్లి కి స్నానం చేయించడం ఎలా

 పిల్లి కి స్నానం చేయించడం ఎలా...
ఒకసారి స్నానం చేయించడానికి పూనుకున్నాక మొదట పరిస్ధితిని పూర్తిగా అర్దం చేసుకోవాలి. పిల్లి చాలా వేగంగా పరుగెత్తగలదు. దానికి మన ప్రాణం అంటే ఏమాత్రం లెక్క ఉండదు. మన బలంమే మనకు దానిపై పైచేయి సాధించడానికి ఉపయోగపడుతుంది. పూర్తిగా మన బలంమీద నమ్మకం ఉంచి సరైన యుద్దభూమిని ఎన్నుకోవాలి. (ఎందుకంటే పిల్లి తన తిరుగుబాటుతో యుద్దవాతావరణాన్ని సృష్టిస్తుంది.)

విశాలమైన ఆరుబయట దానికి స్నానం చేయించొద్దు. ఎందుకంటే అది పరుగెత్తి మనల్ని చేజింగ్ చేసేలా చేస్తుంది. చిన్న బాత్ రూం ని ఎంచుకోండి.అతి చిన్న నాలుగడుగుల బాత్ రూం అయితే ఇంకా మంచిది.  పిల్లి పంజాకూడా మన ఒంటినుండి చర్మాన్ని వేగంగా వేరుచేయగలదు. మన తెలివే మనకు అండ. తలకు హాకీ ఫేస్ మాస్క్, ఒంటికి కాన్వాస్ క్లాత్ బట్టలు, హాకీ గోల్ కీపర్ లా డ్రెస్, స్టీల్ గ్లోవ్స్, రోడ్డుమీద తారు పోసేవాళ్లు వేసుకునే బూట్లు వేసుకుంటే మంచిది.

బాత్రూంకి వెళ్లేముందు మన పిల్లినే తీసుకెళ్తున్నామా, పక్కింటి పిల్లా అనేది ఒక్కసారి తేరిపార చూడండి. మన పిల్లే అయితే మనకు ప్రాణహాణి కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక మీరు కాజువల్ గా స్నానానికి వెళ్తున్నట్టు నటిస్తూ పిల్లిని కూడా తీసుకుని బాత్ రూం డోర్ మూసేయండి. లేదా దాన్ని మామూలుగా డిన్నర్ కి తీసుకెళ్ళున్నట్టు తీసుకెళ్ళండి. (పిల్లి మీ కొత్త అవతారాన్ని ఏమాత్రం అనుమానించదు. ఎందుకంటే పిల్లులకు ఫ్యాషన్లగూర్చి ఏమాత్రం పట్టింపు ఉండదు.ఎందుకంటే పిల్లులకు ఫ్యాషన్ చానల్ లేదుకదా.)మామూలు షవర్ కర్టెన్ అయితే పిల్లి చించేస్తుంది. అందుకే షాపులకు వేసే ఇనుప షట్టర్ ఉంటే మంచిది. ఇక ఒక్కసారి బాత్రూంలోకి ఎంటరయ్యాక మన వేగమే మన ప్రాణాల్ని రక్షిస్తుందనేది నిజం. బాత్రూంలోకి ఎంటరవగానే వేగంగా డోర్ మూసి, టబ్ లోకి దూకి షట్టర్ మూసి పిల్లిని నీళ్ళలో వేసి షాంపు బాటిల్ పిల్లిపై గుమ్మరించండి. ఇప్పుడు మీ జీవితంలో అత్యంత క్లిష్టమైన ఆ ఒక్క నిముషం ప్రారంభమైంది. పిల్లికి ఏ హ్యండిల్ ఉండదు పైగా దాని బొచ్చు ఇప్పుడు షాంపూతో జారుడుగా మారింది పరిస్దితి ఇంకా భయంకరంగా మారుతుంది. దాన్ని ఎక్కువసేపు పట్టుకోవాలని ప్రయత్నించకండి.మరోసారి పట్టుకున్న వెంటనే కొంచెం షాంపూ పోసి పిచ్చి పట్టినట్టు వేగంగా దాన్ని రుద్దండి. ఇంతవరకు ఎవరూ పిల్లిని మూడు సెకన్లకంటే ఎక్కువ రుద్దలే. పిల్లుల షాంపూ నేషనల్ రికార్డ్ మూడు సెకన్లే. అంతకంటే ఎక్కువ ప్రయత్నించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దు.


angry cat
cat attackబార్ లో మొసలి

ఒక వ్యక్తి తన పెంపుడు మొసలి తోపాటుగా బార్ లోకి వస్తాడు.
బార్- ఓనర్ వద్దు. అది బార్ లో అది ఎవరిపైనైనా దాడి చేస్తే నేను బార్ మూసుకోవాల్సివస్తుంది.
ఆ వ్యక్తి ఇది పెంపుడు మొసలి. ఇది ప్రమాదకారి కాదు.కావాలంటే చూడు అని దాని నోరు తెరవమని దాని నోట్లో ఒక నిముషం పాటూ తన తల పెడ్తాడు. అది ఏ హానీ చేయదు.
ఆ వ్యక్తి - ఇంకా ఎవరైనా ఇది ట్రై చేస్తారా.
తాగుబోతు - నేను చేష్టా షార్. కానీ నేను అంత షేపు నోరు తెరచి ఉంచలేను.

తండ్రి కొడుకు బార్


 కొడుకు స్కూల్లో ఫెయిల్ అవుతాడు. తండ్రి కొడుకుని బార్ కి తీసుకువెల్తారు.

తండ్రి: బేరర్ ఒక బీర్ తీసుకురా.
కొడుకు: మరి నువ్వేం తీసుకోవా నాన్నా.