పిల్లి కి స్నానం చేయించడం ఎలా

 పిల్లి కి స్నానం చేయించడం ఎలా...
ఒకసారి స్నానం చేయించడానికి పూనుకున్నాక మొదట పరిస్ధితిని పూర్తిగా అర్దం చేసుకోవాలి. పిల్లి చాలా వేగంగా పరుగెత్తగలదు. దానికి మన ప్రాణం అంటే ఏమాత్రం లెక్క ఉండదు. మన బలంమే మనకు దానిపై పైచేయి సాధించడానికి ఉపయోగపడుతుంది. పూర్తిగా మన బలంమీద నమ్మకం ఉంచి సరైన యుద్దభూమిని ఎన్నుకోవాలి. (ఎందుకంటే పిల్లి తన తిరుగుబాటుతో యుద్దవాతావరణాన్ని సృష్టిస్తుంది.)

విశాలమైన ఆరుబయట దానికి స్నానం చేయించొద్దు. ఎందుకంటే అది పరుగెత్తి మనల్ని చేజింగ్ చేసేలా చేస్తుంది. చిన్న బాత్ రూం ని ఎంచుకోండి.అతి చిన్న నాలుగడుగుల బాత్ రూం అయితే ఇంకా మంచిది.  పిల్లి పంజాకూడా మన ఒంటినుండి చర్మాన్ని వేగంగా వేరుచేయగలదు. మన తెలివే మనకు అండ. తలకు హాకీ ఫేస్ మాస్క్, ఒంటికి కాన్వాస్ క్లాత్ బట్టలు, హాకీ గోల్ కీపర్ లా డ్రెస్, స్టీల్ గ్లోవ్స్, రోడ్డుమీద తారు పోసేవాళ్లు వేసుకునే బూట్లు వేసుకుంటే మంచిది.

బాత్రూంకి వెళ్లేముందు మన పిల్లినే తీసుకెళ్తున్నామా, పక్కింటి పిల్లా అనేది ఒక్కసారి తేరిపార చూడండి. మన పిల్లే అయితే మనకు ప్రాణహాణి కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక మీరు కాజువల్ గా స్నానానికి వెళ్తున్నట్టు నటిస్తూ పిల్లిని కూడా తీసుకుని బాత్ రూం డోర్ మూసేయండి. లేదా దాన్ని మామూలుగా డిన్నర్ కి తీసుకెళ్ళున్నట్టు తీసుకెళ్ళండి. (పిల్లి మీ కొత్త అవతారాన్ని ఏమాత్రం అనుమానించదు. ఎందుకంటే పిల్లులకు ఫ్యాషన్లగూర్చి ఏమాత్రం పట్టింపు ఉండదు.ఎందుకంటే పిల్లులకు ఫ్యాషన్ చానల్ లేదుకదా.)మామూలు షవర్ కర్టెన్ అయితే పిల్లి చించేస్తుంది. అందుకే షాపులకు వేసే ఇనుప షట్టర్ ఉంటే మంచిది. ఇక ఒక్కసారి బాత్రూంలోకి ఎంటరయ్యాక మన వేగమే మన ప్రాణాల్ని రక్షిస్తుందనేది నిజం. బాత్రూంలోకి ఎంటరవగానే వేగంగా డోర్ మూసి, టబ్ లోకి దూకి షట్టర్ మూసి పిల్లిని నీళ్ళలో వేసి షాంపు బాటిల్ పిల్లిపై గుమ్మరించండి. ఇప్పుడు మీ జీవితంలో అత్యంత క్లిష్టమైన ఆ ఒక్క నిముషం ప్రారంభమైంది. పిల్లికి ఏ హ్యండిల్ ఉండదు పైగా దాని బొచ్చు ఇప్పుడు షాంపూతో జారుడుగా మారింది పరిస్దితి ఇంకా భయంకరంగా మారుతుంది. దాన్ని ఎక్కువసేపు పట్టుకోవాలని ప్రయత్నించకండి.మరోసారి పట్టుకున్న వెంటనే కొంచెం షాంపూ పోసి పిచ్చి పట్టినట్టు వేగంగా దాన్ని రుద్దండి. ఇంతవరకు ఎవరూ పిల్లిని మూడు సెకన్లకంటే ఎక్కువ రుద్దలే. పిల్లుల షాంపూ నేషనల్ రికార్డ్ మూడు సెకన్లే. అంతకంటే ఎక్కువ ప్రయత్నించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దు.


angry cat




cat attack



5 comments:

  1. పిల్లికి స్నానం చేయించారా? లేదా? చేయించే ప్రయత్నం చేసేందుకు మీ అంశం సహకరిస్తుంది. గిన్నీసు బుక్ ఎక్కించేందుకు రడీ చేసేలా ఉన్నారు. పిల్లికి స్నానం చేయించడంవల్ల దాన్ని ఇబ్బందికి గురిచేసిన వాళ్ళమౌతామ్. పిల్లికి ప్రాణ సంకటం, మనిషికి చెలగాటం అవసరమా? ఏది ఏమైనా మీ పరిశీలనా విధానం బాగుంది. మరిన్ని ఉపయోగకరమైనవి పోస్టు చేస్తారని భావిస్తూ.

    ReplyDelete
  2. sir, mee pilliki snaanam cheyinchadam ela? article nu maa 20.1.13 sunday andhra jyothi book lo chinna savaranalatho prachuristhunnam. gamaninchandi.

    - editor, andhra jyothi

    ReplyDelete
  3. sir, mee pilliki snaanam cheyinchadam ela? article nu maa 20.1.13 sunday andhra jyothi book lo chinna savaranalatho prachuristhunnam. gamaninchandi.

    - editor, andhra jyothi

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete