Unplowed

Unplowed adj not cultivated దున్నని, దున్నబడని, సాగుబడి కాని. half thefields there are * సగము నేలను దున్న లేదు.
Unpoetical adj not having the beauties of verse కావ్యరస విహీనమైన,గ్రామ్యమైన, సాధారణమైన, పామరమైన. these expressions are * ఇవి వట్టిగ్రామ్యమైన మాటలు.
Unpoetically adv not elegantly గ్రామ్యముగా, విరసముగా.
Unpointed adj having no sting కొనలేని, మొన లేని. this epigram, is * యీపద్యమందు చమత్కారము లేదు.
Unpolished adj not made bringht మెరుగు పెట్టబడని. an * diamondసానపట్టబడని వజ్రము. a man of * manners మోటు మనిషి అసంస్కృతుడు. apoem written in an * style మోటు వాక్కుగా వుండే కావ్యము. * folks పామరులు.
Unpolite adj not refined నాగరీకము కాని. * expressions మడ్డిమాటలు, మోటుకూతలు.
Unpoliteness n s rudeness మోటుతనము.
Unpolluted adj not soiled పవిత్రమైన, శుచిగావుండే, అంటుబడని, భ్రష్టుకాని,చెరపబడని. there is not a single house there * with murder అక్కడఖూనియనే దోషగ్రస్తము కాని యిల్లు లేదు, అనగా ఖూని జరగని యిల్లు లేదు.
Unpopular adj not generally agreeable జనసమ్మతము కాని, జనరంజకము కాని,సర్వ సమ్మతము కాని. this new law is * యీ కొత్త చట్టము లోకులకు యిష్టము కాదు.they say he is very * వాడు జనకంటకుడట, వాని పేరంటే యెవరికీ కాదు.
Unpopularity n s a bad name లోక విరోధము, జన కంటకత్వము. from the *of this new regulation యీ కొత్త చట్టము యెవరికీ యిష్టము కాదు గనక.
Unportioned adj not having a dowry ఉంకువలేని, స్త్ర ధనములేని. he hadthree * daughters వాని ముగ్గురు కూతుండ్ల కున్ను వుంకువలేదు.
Unpowdered adj not sprinkled with powder పొడిచల్లుకోని. four of themwere powdered and the other four were * నలుగురు తలకు పొడి చల్లుకొనియుండిరి నలుగురు అట్లా చల్లుకోక వుండిరి.
Unpractised adj not trained, not skilled వాడుకపడని, అలవాటులేని. if he is* how can he carry on the business? వాడుక పడనివాడైతే పని యెట్లా జరుగును.
Unprecedented adj అపూర్వమైన, విపరీతమైన, అభూతపూర్వమైన. theconduct is quite * యిట్లా యెవరున్ను చేసినది లేదు.
Unpreferred adj not advanced ఉద్యోగము దొరకని. an * priest ఉద్యోగముదొరకకుండా వుండే పాదిరి.
Unprejudiced adj impartial అభిమానము లేని, పక్షపాతము లేని. he was * inmy favour నా యందు అభిమానము లేకుండా వుండినాడు.
Unpremeditated adj not thought of before అనాలోచితమైన, ముందుగాఆలోచించబడని. an * poem ఆశుకవనముగా చెప్పిన కావ్యము.
Unpremeditatedly adv without being thought of before అయత్నముగా,ముందుగా ఆలోచించక.
Unprepared adj not trained, not ready అలవరచబడని, సిద్ధముకాని. at thattime the army was * for war అప్పట్లో ఆ దండు యుద్ధానికి పనుబడి యుండలేదు.he was * to answer this question యీ ప్రశ్నకు వుత్తరము చెప్పడానకు వాడుఆయత్తపడి యుండలేదు. I was quite * for this ఇది నిండా ఆశ్చర్యమునుకలగచేసినది.
Unprepossessed adj not partial నిష్పక్షపాతమైన, పక్షపాతము లేని.
Unprepossessing adj not having a pleasing appearance అసహ్యమైన,వికారమైన, విరసమైన.
Unpretending adj humble, modest సామాన్యమైన, అణుకువగల. he lived inan * house సామాన్యమైన వొక యింట్లో కాపురము వుండినాడు.
Unprevented adj not hindered అడ్డము లేని, నిరాటంకమైన. he entered thehouse * ఆ యింట్లో ధారాళముగా జొరబడ్డాడు.
Unprincipled adj destitute of virtue నీతి నిర్ణయము లేని, దుర్నీతుడైన,అన్యాయీకుడైన. an * act దుర్మార్గము. an * man అన్యాయీకుడు.
Unprinted adj not committed to types అచ్చువేయబడని. the book is yet *ఆ పుస్తకము యింకా అచ్చు వేయలేదు.
Unprized adj not valued లక్ష్యపెట్టబడని.
Unproclaimed adj not notified ప్రకటన చేయబడని, చాటించబడని.
Unproductive adj barren ఫలించని, పాడుగా వుండే.
Unprofitable adj bringing no advantage నిష్ఫలమైన, క్రియావిహీనమైన,వ్యర్థమైన, పనికిమాలిన.
Unprofitably adv నిరర్థకముగా, నిష్ఫలముగా.
Unprofitional adj not correct ( this is a bad word ) అశాస్త్రీయమైన,అన్యాయమైన, విపరీతమైన.
Unpromising adj without hope of advantage ముందుకు వచ్చేటట్టుగా వుండని,కాగలదికాని. this year is * యీ సంవత్సరము సుభిక్షముగా వుండేటట్టు వుండలేదు.this business looks * యీ పని సఫలమయ్యేటట్టు తోచలేదు.
Unpronounceable adj that cannot be uttered ఉచ్చరించగూడని,అనిర్వచనీయమైన.
Unpronounced adj not uttered, not spoken ఉచ్చరించబడని, చెప్పబడని.
Unpropitious adj not favourable ప్రతికూలమైన, విరుద్ధమైన, కాని. theweather was * కాలము బాగా వుండలేదు, అనగా వానా గాలి అతియెండ చెడుమంచువీటిలో యేదైనా వొకటి వుంటూనే వుండినది.
Unproportioned adj not suited to something else తగని, పొంకము కాని,పొందికకాని, విపరీతమైన. the expense is * to his means వాడికి వరవు కొంచెముసెలవు అధికము.
Unpropped adj not supported, not upheld నిరాధారముగా వుండే, ప్రోద్భలములేకుండా వుండే.
Unprosperous adj unfortunate శ్రేయస్కరము కాని, దిక్కుమాలిన. thebusiness was * ఆ పని సఫలము కాలేదు.
Unprosperously adv unsuccessfully విరుద్ధముగా, ప్రతికూలముగా,నిష్ఫలముగా. the business ended * ఆ పని తుదకు చెడిపోయినది.
Unprotected adj not supported; not defended దిక్కుమాలిన, నిరాశ్రయముగావుండే, నిరాదరువుగా వుండే. a village * by hills కొండలు మరుగు లేకుండా వుండేగ్రామము.
Unprovided adj not supplied, not got జాగ్రతకాని, సిద్ధము చేయబడని. themoney is as yet * రూకలు యింకా జాగ్రతకాలేదు. those who are * withhorsed గుర్రములు లేని వాండ్లు. they are miserably * వాండ్లు దిక్కు దెస లేకుండావున్నారు.
Unprovoked adj not excited నిర్నిమిత్తమైన, నిష్కారణమైన. * angerనిష్కారణమైన కోపము.
Unpruned adj not cut; not lopped కోయబడని, నరకబడని. the trees are *అధికముగా పెరిగిన కొమ్మలను నరికి ఆ చెట్టు సవరించబడలేదు.
Unpublished adj not made known ప్రకటన చేయబడని. a book that is yet *యింకా ప్రచురము కాని పుస్తకము. the book is printed, but it is yet * ఆపుస్తకము అచ్చువేయబడ్డది గాని యింకా ప్రసిద్ధము కాలేదు. an * piece of scandalయింకా ప్రచురము చేయబడని అపవాదము.
Unpunctual adj not exact in time &c. నిష్కర్షలేని, ఖండితము లేని. he isvery * వాడ క్రమస్థుడు, వాడు చెప్పేది వొకటి చేసేది వొకటి.
Unpunished adj not chastised శిక్షించబడని, దండించబడని. these crimes didnot go * యీ తప్పులకు శిక్ష లేకపోలేదు.
Unpurchased adj not bought కొనబడని.
Unpurged adj not cleansed పరిశుద్ధము చేయబడని, శుభ్రము చేయబడని.
Unpurified adj not cleansed నిర్మలము చేయబడని. silver that is *ఊదనివెండి, కందువెండి.
Unpursued adj not followed వెంబడించబడని.
Unputrified adj not corrupted కుళ్ళిపోని.
Unqualified adj not fit తగని, పనుపడని. he is * for that duty ఆ పనికి వాడుఅర్హుడు కాడు. he gave an * assent వాడు యెంత మాత్రము సందేహించ కుండావొప్పుకొన్నాడు, నిరాక్షేపముగా వొప్పుకొన్నాడు.
Unquenchable adj that cannot be put out ఆర్చగూడని. * fire ఆర్చగూడనినిప్పు.
Unquenchably adv without being extinguished ఆర్చగూడకుండా.
Unquenched adj not extinguished ఆర్చబడని.
Unquestionable adj that cannot be doubted నిస్సందేహమైన.
Unquestionably adv certainly నిస్సందేహముగా.
Unquestioned adj not doubted నిస్సందేహమైన, నిరాక్షేపమైన. he sold theestate * వాడు యీ ఆస్తిని అమ్మిన దానికి యెవడు ఆక్షేపించలేదు. his authority is *వాని మాటకు తిరుగు లేదు.
Unquickened adj not animated జీవము పోయబడని, త్రాణిలేని. the * foetusయింకా జీవము పోయబడని పిండము.
Unquiet adj not still చపలమైన, చంచలమైన, అశాంతమైన. the child was *all night ఆ బిడ్డ రాత్రంతా నిమ్మళముగా వుండలేదు. his * eye showed that hewas a little mad వాడు కండ్లు తిప్పడము చూస్తే కొంచెము వెర్రి వానివలె వుండినది.
Unravelled adj loosened, opened విచ్చబడ్డ, వీడ్చబడ్డ. the puzzle is at last * తుదకు ఆ కలవరము తీరినది.
Unread adj not perused చదవబడని. untaught చదువులేని, విద్యావిహీనులైన.
Unreadiness n s want of skill అసమర్థత. from his * in arithmetic వాడికిలెక్కలో సామర్థ్యము లేనందున.
Unready adj not quick అసమర్థుడైన. they are * in trade వాండ్లకు వర్తకములోసామర్థ్యము లేదు. (See the Homily on Gluttony page 1.)
Unreal adj not substantial; having appearance only మాయగా వుండే,కృత్రిమమైన, అసారమైన. they say that this world is * యీ ప్రపంచమువట్టిమాయ అంటారు. these are * gratifications యివి నిజమైన సుఖములు కావు.See Ideal.
Unreality n s nonentity అభావము, శూన్యత, మాయ. all acknowledge the *of his claim అందరు వాడికి బాధ్యత లేదంటారు.
Unreasonable adj without proper cause, without sense అన్యాయమైన,వివేకము లేని, తెలివిలేని. this is an * claim ఇది అన్యాయమైన వ్యాజ్యము. you arevery * if you expect that your father will consent to this దీనికి నీ తండ్రివొప్పుకొంటాడనేది వట్టి వెర్రి. you are * నీవు చెప్పేది అన్యాయము. In 2 Thess. III. 2. అవివేచకులు. A+.
Unreasonableness n s injustice అన్యాయము. from the * of his claim వాడివ్యాజ్యము అన్యాయమైనది గనక.
Unreasonably adv without proper cause అన్యాయముగా. he was * angryat this దీనికి వృథాగా కోపము చేసినాడు.
Unreasoning adj not having judgement వివేకము లేని, తెలివిలేని.
Unreclaimable adj that cannot be brought under cultivation సాగుబడిచేయడానకు అనర్హమైన, తిరిగీ చక్కబడని, బొత్తిగా చెడిపోయిన, మళ్ళీ వొనగూడని.
Unreclaimably adv irreclaimably తిరిగీ చక్కబడక, మళ్లీ వొనగూడక.
Unreclaimed adj not cultivated పనుపరచబడని. this land is all * యీనేలంతా బీడుగా వున్నది. an * savage or heretic అతి మూర్ఖుడు.
Unrecognized adj not owned, not known నాది అనబడని, ఎరగని,అనవాలుపట్టబడని. when he came home he was * by his brothers వాడుయింటికి వచ్చేటప్పటికి వానితోడ బుట్టిన వాండ్లు వాణ్ని గురుతు పట్టలేక పోయినారు. the distinction between these two is * in law ధర్మశాస్త్రమందు యీ రెంటికీభేదము లేదు.
Unreconciled adj not appeased దోవకు రాని, సమాధానానికి రాని. they were *for ten years వాండ్లు పదేండ్ల దాకా సమాధానానికి రాకుండా వుండినారు.
Unrecorded adj not registered వ్రాసుకోబడని, గ్రంథములో యెక్కించబడని. thisevent is * in their books యీ పనివారి గ్రంథములలో వ్రాయబడి యుండలేదు.
Unredeemed adj not ransomed, not paid విడిపించబడని, విడుదలచేయబడని,విమోచనము చేయబడని, కడతేర్చబడని. the bond is * to this day ఆ పత్రానికినేటివరకు చెల్లు కాలేదు. * souls ముక్తులు కాని ఆత్మలు. the difficulty of thebook was * even by its utility ఆ గ్రంథము యెంత వుపయోగమైనదిగావున్నప్పటికిన్ని దాని కాఠిన్యతవల్ల పనికి రాకపోయినది, ఆ గ్రంథములో ప్రయాస అధికము,ప్రయోజనము కొంచెము. the goods that were pawned remain * కుదువపెట్టబడనిసరుకులు యింకా విడిపించబడలేదు.
Unreduced adj not lessened, in size తగ్గని, మట్టుబడని, అణగని, లోబడని. thedebt is as yet * ఆ అప్పు యింకా తగ్గలేదు.
Unrefined adj not purified శుద్ధిచేయబడని, పరిష్కృతముకాని. * silverకందువెండి. * sugar మడ్డిబెల్లము. people of * manners మోటువాండ్లు.
Unreflected adj not turned back ప్రతిఫలించని, the next ray * shone ongrey stone రెండో కిరణము బూడిదె వర్ణములో వుండే రాతి మీద ప్రతి ఫలించకుండావుండెను. (Scott's Lady of the Lake, V. 10.)
Unreformed adj not reclaimed from vice పాడుగా వుండే, పరిష్కరించబడని,చక్కపెట్టబడని.
Unrefreshed adj not relieved from fatigue విశ్రాంతి పొందని, ఆయాసముతీరని, అలసట తీరని. he rose * by sleep నిద్ర చేత అలసట తీరకమునుపే లేచినాడు.
Unrefuted adj not proved to be false ఖండించబడని. his argument is asyet * వాడు చెప్పిన న్యాయము యింకా ఖండించబడలేదు.
Unregarded adj లక్ష్యపెట్టని. among them learning is * వాండ్లకు విద్య మీదగౌరవము లేదు, లక్ష్యము లేదు.
Unregenerate adj పునర్జన్మము లేని, అనగా జ్ఞానమార్గమును అవలంబించని. the *పామరులు, అజ్ఞులు.
Unregistered adj కవిలెలో వ్రాయబడని, పుస్తకములో యెక్కించబడని.
Unregretted adj not lamented ఏడవబడని, దుఃఖించబడని. he died * by hisrelations వాడు చచ్చిన దానికి వాడి వాండ్లు యేడవలేదు.
Unregulated adj not reduced to order క్రమపరచబడని. * expenses దోవాడొంకిలేని సెలవు. an * heart నీతి నిలకడ లేని మనసు.
Unreined adj free, not constrained నిరర్గళమైన, నిరంకుశమైన, యథేచ్ఛగా వుండే.
Unrelenting adj cruel నిర్దయాత్మకుడైన, క్రూరుడైన.
Unrelieved adj not eased, not delivered from pain ఉపశమించబడని,నివారణము చేయబడని, నివృత్తి చేయబడని, కావలి మర్చుకోబడని. his distress is asyet * వాడి తొందర యింకా తీరలేదు. the sentry remained * until nightfallసాయంకాలము దాకా పారామార్చకుండా వాడే వుండేవాడు.
Unremediable adj that cannot be cured స్వస్థము కాని, కుదరని, తీరని.
Unremedied adj not cured స్వస్థము చేయబడని, నివృత్తిచేయబడని. many evilsare as yet * అనేక చెరువులు యింకా నివృత్తి చేయబడలేదు.
Unremembered adj not recollected మరిచిపోయిన. their names are * inhistory చరిత్రలలో వాండ్ల పేళ్లు యెత్త లేదు.
Unremitting adj not abating మట్టుబడని. he was * in his exertions వాడుచేశే ప్రయత్నములలో తక్కువ లేదు.
Unremittingly adv without cessation ఎడతెగకుండా, తీయకుండా.
Unremovably adv firmly నిబ్బరముగా, స్తిమితముగా, దృఢముగా.
Unremoved adj firm దృఢమైన, సుస్థిరమైన. the pain is as yet * నొప్పి యింకాపోలేదు.
Unremunerative adj which does not re-pay చెల్లు కాని, యీడు కాని. thisprice is * యిది దానికి వెలకాదు.
Unrenewed adj not made a new మళ్ళీ చేసుకోబడని. the bond was * ఆపత్రము మళ్ళీ పుట్టలేదు. the lease is * మళ్ళీ గుత్త చేసుకోలేదు. in the * heartపామరబుద్ధిలో, పాపగ్రస్తముగా వుండే మనసులో.
Unrepealed adj not annulled కొట్టివేయబడని. those laws are hitherto * ఆ చట్టములు యిది వరకు కొట్టివేయబడలేదు.
Unrepentant, Unrepenting adj not penitent పశ్చాత్తాపపడని, యింత పాపముచేస్తిమే అని దుఃఖించని.
Unrepented adj not expiated by penitential sorrow పశ్చాత్తాపము చేతపరిహరించబడని. those sins which are yet * పశ్చాత్తాపము చేత పరిహరించబడనిపాపములు.
Unrepingly adv కయ్యో మొర్రో అనకుండా, సహనముగా.
Unrepining adj not complaining మొరబెట్టని, యేడవని. she suffered thesemisfortunes with * patience యిన్ని కడగండ్లనున్ను కుయ్యో మొర్రో అనకుండాసహనముతో అనుభవించినది.
Unreplenished adj not filled నించబడని, నిండని. the ponds remained * forsix months ఆరు నెలల దాకా గుంటలు నిండకుండా వుండినవి. his pocket is still *వాడికి యింకా వొక కాసైనా దొరక లేదు.
Unreported adj not written, not told వ్రాయబడని, గ్రంథములో యెక్కని,తెలియచేయబడని. that trial is * ఆ విచారణ జరిగినది గాని, దాన్ని ఆ గ్రంథములోవ్రాయలేదు. an * case గ్రంథములో వ్రాసుకోబడని విమర్శ. the trials inmagistrate's offices are generally * మేజస్త్రిటు విచారణలను బహుశాగ్రంథములో వ్రాయడము లేదు.
Unrepresented adj not shown చూపబడని, గుమస్తాను పంపించబడని. offenceswhich are yet * to government గౌనరుమెంటువారికి యింకా తెలియచేయబడనినేరములు. a town which is * in parliament పార్లేమెంటుకు తమ తట్టు నుంచిగుమస్తాను పంపకుండా వుండే పట్టణము.
Unrepressed adj not crushed అణచబడని.
Unrepressible adj that cannot be checked అణచగూడని.
Unreprieved adj not respited తల తీయబడినది అక్కరలేదనే ఆజ్ఞరాని వురితీయకనిలిపి పెట్టవలసినదనే ఆజ్ఞరాని. three are hanged, three are reprieved andthree are * ముగ్గురు వురిదీయబడ్డారు, ముగ్గురిని వురితీయక నిలిపిపెట్టవలసినదని ఆజ్ఞ వచ్చినది, ముగ్గురిని గురించి తలతీయక నిలిపిపెట్టవలసినదనే ఆజ్ఞ రాలేదు.
Unreproachable adj not blamable నింద్యము కాని.
Unreproached adj not upbraided దూష్యము కాని.
Unreproveable adj not deserving blame అనింద్యమైన, దూషించతగని.
Unreproved adj censured దూషించబడని, నిందించబడని, చీవాట్లుబడని.
Unrequested adj not asked అడగబడని, కోరబడని, నిందించబడని, చీవాట్లుబడని.
Unrequited adj not recompensed ఈడుకాని, చెల్లుకాని, ప్రతిలేని. she diedby reason of * love దాని మొహమునకు సరియైన మొహము గలవాడు లేదన్నహేతువుచేత అది చచ్చినది. what avails an * passion ? యిద్దరిలో వొకరికిమాత్రము మోహము వుండడము వల్ల యేమి ప్రయోజనము. his trouble was * వాడిశ్రమకు యీడు కాలేదు, వాడి ప్రయాస నిష్ఫలమైనది.
Unresented adj not taken ill తప్పుగా యెంచబడని, నేరముగా యెంచబడని. hisinjustice was * వాడు చేసిన అన్యాయమును వాండ్లు తప్పుగా యెంచలేదు, వాడు చేసినఅన్యాయమునకు వాండ్లు ఆగ్రహపడలేదు.
Unreserved full; entire పూర్ణమైన,సంపూర్ణమైన,యావత్తు, he gave them his* confidence వాండ్ల యందు పూర్ణమైన నమ్మకమును వుంచినాడు.
Unreservedly adv freely, without concealment దాచకుండా, సవిస్తారముగా.he wrote to me * about this ఇందున గురించి వాడు వొకటిన్ని దాచకుండా నా పేరవ్రాశినాడు.
Unreservedness n s frankness : openness నిష్కాపట్యము. from the * ofhis language అతడు బాహాటముగా చెప్పినందున, నిష్కాపట్యముగా మాట్లాడినందున. orimpudence కొంటెతనము.
Unresisted adj not opposed ఆటంకములేని, నిరాటంకమైన, ప్రతి రోధము లేని,నిరంకుశమైన. he passed * through the country అతడు నిరాటంకముగా ఆ దేశముగుండా వెళ్ళినాడు. among them Sancara Chari's doctrines have * swayవారిలో శాంకరాచార్యులవారి మతము నిరంకుశముగా చెల్లుతున్నది.
Unresisting adj patient, tame దీనమైన, సాత్వికమైన, మేదకుడైన, అడ్డమాడని.their * patience excited his pity వాండ్లు యేమి అడ్డమాడకుండా తాళుకోవడమువల్ల వాడికి కరుణ వచ్చినది, వాండ్లు వెన్నలో వెంట్రుక తీసినట్టుగా వుండడమువల్ల వాడికి దయవచ్చినది. the mud was as * as butter ఆ బురదలో వెన్నలో వలె దిగిపోయినది.
Unresistingly adv without opposition నిరాటంకముగా, అడ్డము లేకుండా. shewas carried away * ఆమెను తీసికొనిపోయిరి దానికి ఆమె యేమి అడ్డమాడలేదు.
Unresolvable adj that cannot be opened or settled అసాధ్యమైనతీర్చగూడని. this question is by any rule in arithmetic గణితములో వుండే యేసూత్రము వల్లనున్ను యీ సంశయము తీరదు.
Unresolved adj not settled, not determined తీరని. that doubt is still *ఆ సంశయము యింకా తీరక వున్నది.
Unrespective adj careless జాగ్రత లేని. not connected సంబంధము లేని. thispayment is * of the others దీన్ని చెల్లించడమునకున్ను కడమ వాటికిన్ని యెంతమాత్రమున్ను సంబంధము లేదు.
Unrest n s want of sleep or ease, distress, trouble ఆయాసము, తొందర,జాగరము.
Unrestored adj not repaired, not given back కుదరని, కుదటబడని. themoney was * ఆ రూకలు మళ్ళీ రాలేదు, ఆ రూకలు చెల్లలేదు.
Unrestrained adj not checked ఆగని, ఆచబడని, నిరంకుశమైన, నిరర్గళమైనవిచ్చలవిడిగా వుండే. * range ఆగని కోపము. * love మహత్తైన మోహము.
Unrestrainedly adj నిరాటంకముగా, అడ్డి లేకుండా.
Unrestricted adj not bound, not limited నిరంకుశమైన, యధేష్టమైన,నిరర్గళమైన, నిరాటంకమైన, అడ్డము లేని. waste * by fear of want లేమిడి యనేభయము చేత కట్టుబడని దాతృత్వము.
Unrestrictedly adv నిరాటంకముగా, అడ్డి లేకుండా.
Unretracted adj not recalled తిప్పుకోబడని. their first statement is *తాము మొదట చెప్పిన దానికి తిరుగులేదంటారు, తాము మొదట చెప్పినమాటే మాటఅంటారు.
Unrevealed adj not shown forth తెలియని, అగుపడని, బైటపడని. his futurelife is * to man మనుష్యులకు ముందు సంభవించబొయ్యేది తెలియదు. the causeof this * is దీని కారణమేమో తెలియలేదు.
Unrevenged adj not vindicated or settled కశిదీర్చబడని, చలము తీర్చబడని.their death is * to this day వాండ్లను చంపిన దానికి నేటివరకు శాస్తి కాలేదు.
Unreverently adv without care, without fear భయ భక్తి లేకుండా.
Unreversed adj not annulled కొట్టి వేయబడని. that sentence is as yet * ఆతీర్పు యింకా కొట్టి వేయబడలేదు.
Unrevoked adj not annulled కొట్టి వేయబడని.
Unrewarded adj not compensated బహుమానము చేయబడని. his gooddeeds are as yet * వాని సత్కార్యములకు యింకా బహుమానము కాలేదు.
Unrighteous adj not holy not just ధర్మ విహీనులైన, అన్యాయమైన, అధర్మమైన,దుష్టులైన.
Unrighteously adv unjustly; wickedly : sinfully అధర్మముగా,అన్యాయముగా, పాపముగా.
Unrighteousness n s injustice, iniquity అన్యాయము, అధర్మము.
Unripe adj not mellow పండని. * mangoes మామిడికాయలు. an * fruit కాయ.* plantains అరిటికాయలు. an * girl పసిబిడ్డ. an * judgment లేతబుద్ధి, పసిబుద్ధి.
Unripened adj not matured పక్వముకాని, పండని.
Unrivalled adj having no equal అసమానమైన.
Unrobed adj past p|| stripped ఉడుపులు విప్పివేయబడ్డ. when * he looked verymean బట్టలు విప్పి వేశేటప్పటికి క్షుద్రుడివలె అగుపడ్డాడు.
Unrolled adj opened; displayed విప్పబడ్డ, తెరవబడ్డ.
Unromantic adj not fanciful సాధువైన, పిచ్చి బుద్ధులులేని, లేనిపోని తలంపులులేని. an * youth పిచ్చిబుద్ధులు లేని పిల్లవాడు, స్థిరబుద్ధి గలవాడు. merchants are an * race వర్తకులకు లేనిపోని భ్రమలు లేవు.
Unruffled adj calm; tranquil; not agitated నిమ్మళముగా వుండే, నెమ్మదిగావుండే. the sea was * సముద్రము అలలు లేకుండా వుండినది.
Unruliness n s licentiousness పోకిరితనము, దౌర్జన్యము, కొంటెతనము. from the* of these boys యీ పిల్లకాయలు అణగని వాండ్లు గనక.
Unruly adj licentious పోకిరియైన, కొంటెయైన, దుష్ట.
Unsaddled adj not having a saddle on జీనికట్టని. an * horse బడి గుర్రము. *with a wife భార్య అనే పీకులాట లేని. an estate * with debts రుణమనేతొందరలేని ఆస్తి.
Unsafe adj not secure భద్రము లేని. these stairs are * యీ మెట్లు భద్రములేదు. this house is * యీ యిల్లు గట్టిది కాదు.
Unsafeness n s want of security భద్రము లేమి. from the * of thesestairs యీ మెట్లు భద్రము లేనందున.
Unsaid adj not uttered చెప్పని. he left the rest of the tale * కడమ కథనుచెప్పక విడిచినాడు.
Unsainted adj not holy పాపిష్ఠి, దిక్కుమాలిన.
Unsaleable adj not in demand; without a purchaser అమ్ముడోబోని.
Unsalted adj fresh, without salt ఉప్పు వేయని.

No comments:

Post a Comment