Strict English to Telugu free online dictionary

Strict adj ఖండితమైన, గట్టి. as I knew he was a * master అతడు చెడ్డవాడు గనక.
Strictly adj ఖండితముగా, గట్టిగా, రూఢిగా.
Strictness n s ఖండితము, కాఠిన్యము, క్రూరత్వము, ఖండింపు. fromట్హే * of this rule యీ సూత్రము నిండా ఖండితమైనది గనక.
Stricture n s objection, criticism ఆక్షేపణ. as a disease మూత్రకృఛ్రము.
Stride n s అంగ. he went with rapid *s కాళ్ళీడ్చి పెట్టోనడచినాడు,అతి త్వరగా నడిచినాడు. the disease made rapid *s ఆ రోగము గడియ గడియకుమరిమరి అతిశయిస్తూ వుండినది.
Strife n s జగడము, కలహము, ఘర్షణ, కొట్లాట.
Strike n s a bushel తూము. or confederation యికను పనిచేసేది లేదని పనివాండ్లు చేసుకొనే సమయము, సమాఖ్య, కట్టుబాటు.
Striker n s కొట్టెవాడు, ఘాతకుడు.
Striking adj remarkable, surprising వింతైన, ఆశ్చర్యకరమైన.a * differecne మహత్తైన భేదము.
String n s a slender rope తాడు, దారము. *s in a mango పీచు.in a tamarind ఉట్లు. a bow * నారి, అళ్లె. the fiddle * పిడీలుయొక్క సరము. a * of beads సరము. a * of flowers పుష్పసరము.a * of stories కథలవరస. this stretched her heart-stringsయిది దాని మనసులో గాలముగా నాటినది. his heart *s are breakingవాని గుండెలు పగులుతున్నవి. he is always harping on the same * వాడికి యే వేళా అదేపాట, వాడికి యే వేళా అదే లోకము. the naval *నాభి నాళము. he has two *s to his bow వాడికేమి అది తప్పితేదాని అబ్బగా మరి వొకటి వున్నది, ఆ యుక్తి తప్పితే మరి వొక యుక్తిగా వున్నది.
Stringed adj తంతులుగల. * instrument పీడీలు మొదలైనవి.
Stringency n s strictness ఖండితము, దారుణము. from the * of this law యీ చట్టము నిండా ఖండితమైనది గనక, దారుణమైనది గనక.
Stringent adj దారుణమైన, ఖండితమైన.
Stringently adj severely క్రూరముగా, దారుణముగా, ఖండితముగా.
Stringhalt n s పిచ్చుకకుంటి.
Stringy adj పీచుగల. a * mango నార మామిడి పండు.
Strip n s a narrow shred పేలిక, ఖండము, తుండు. a * of leatherవారు. a * of land గోచివలె వుండే భూమి. he tore the handkerchief intosix *s రుమాలగుడ్డను ఆరు పేలికలుగా చించినాడు. a * of papers కాకితపు తునక. *s of bamboo వెదురుబద్దలు.
Stripe n s a blow దెబ్బ. as of colour చార.
Striped adj marked చారలుగల, గీతలు వేయబడ్డ, పట్టెలు వేసిన. the tiger is * with black పులికి నల్లచారలు వుంటవి.
Stripling n s a youth పిల్లకాయ, కుర్రవాడు, చిన్నవాడు.
Stripped adj దిసమొలగా చేయబడ్డ, గుల్లచేయబడ్డ, శూన్యముగాచేయబడ్డ. See To Strip.
Stript SeeStripped
Striving n s పోరాటము, మాల్లాటము.
Stroke n s a blow దెబ్బ, పెట్టు. the clock is on the *of ten యెండగొట్టు, యెండవేటు. a * of rhetoric ఉత్ప్రేక్ష మొదలైనఅలంకారము, కవితా చమత్కారము. he put the finishing * to the business యిదివరకు చేసిన దానికంతా శిఖరము పెట్టినట్టుగా దీన్నిన్నిచేసినాడు. he put the finishing * to the business by setting the house on fire ఆ దుర్మార్గములకంతా శిఖరము పెట్టినట్టుగా యింటినిన్ని తగలబెట్టినాడు. the oar kept an even * పడవను తోశే కోలలు సరిగ్గా పడుతూ వచ్చినవి. they made a great * in trade వాండ్లు వర్తకములో మంచిదెబ్బ కొట్టినారు, వొక జవురు జవిరినారు.
Stroll n s విహారము. they took a * in the wood అడవిలోమనసువచ్చినట్టు తిరిగినారు.
Stroller n s తిరుగుబోతు, దేశదిమ్మరి, వూళ్లమీద తిరిగే వేషగాడు.
Strong adj బలమైన, గట్టి, దార్డ్యమైన, శక్తిగల, సత్తువగల,వడిగల. a * current వడిగా పారే ప్రవాహము. a man of * constitutionజీర్ణశక్తిగలవాడు. a man of * sight మంచి దృష్టి కలవాడు. a * man బలాఢ్యుడు. a * box, or treasure chest భోషాణము, పెద్దపెట్టె.a * wind బలమైన గాలి, పెద్దగాలి. a * smell అధిక వాసన. a * fever మహత్తైన జ్వరము. a * sweat నిండా చెమట. * liquor నిండా మత్తు పుట్టించే సారాయి. * tea or * coffee నిండా కారమైన తేయాకు. కాఫీ,వీటి యొక్క కషాయము. * delusion మటు మాయ. they did it with a strong-hand దాన్ని బలాత్కారముగా చేసినారు. they came a thousand * వెయ్యిమందిగా వచ్చినారు. It smells * వాసనకొట్టుతున్నది. the Bhagavatam takes a * hold of the mind భాగవతము మనోహరమైనది.
Stronghold n s a fort దుర్గము, కోట.
Strongly adv బలముగా, గట్టిగా, నిండా. I am * inclined to go there అక్కడికి పోవలెనని నాకు నిండా యిష్టముగా వున్నది.
Strongwaters n s కల్లు, సారాయి మొదలైనవి.
Strop n s కత్తిని పదునుపెట్టే తోలు.
Strophe n s పద్యము, శ్లోకము.
Strove past tense of the verb ToStrive
Struck past tense of the verb ToStrike he * me నన్ను కొట్టినాడు. it * me నాకు తోచినది.
Structure n s act of building కట్టడము. form, or make ఏర్పాటు,రూపము, క్రమము. I do not understand the * of this sentence యీ వాక్యము యొక్క పొందిక నాకు తెలియలేదు. a house * యిల్లు. or body దేహము. the physical * of the Hindus is slight హిందువులు దృఢగాత్రులు కారు.
Strumpet n s లంజ.
Strumpetocracy n s లంజల ప్రభుత్వము. This word occurs in (Dodsley's) Chronicle of the kings of England, edit. 1821. p.200 regarding Geo. I. "while we are upon the history of theroyal * of the English court" యింగ్లీషు సంస్తానములో జరిగిన వేశ్యాప్రాజాపత్యమును గురించిన చరిత్రయొక్క ప్రస్తాపమ వచ్చినది గనక.
Strung past and participle of the verb ToString
Strut n s pride గర్వము, నీల్గు.
Strutting n s గర్వము, నీల్గు.
Strychnos n s Nux Vomica ముష్టివిత్తు.
Stub n s a thick short left when the rest is cut ofమోడు మోటు, మొద్దు.
Stubble n s the stalks of corn left in the field by the reaper దుబ్బు, కోతకోయగా విడిచిన అడుగుదుబ్బు, ఆకు, అలము, చెత్త, చిదుగు.a * field కోతకోసిన పొలము.
Stubborn adj మూర్ఖమైన, మొండియైన. a * soil యెంత పాటుపడ్డా పనికిరాని భూమి.
Stubbornly adv మూర్ఖముగా, మొండిగా.
Stubbornness n s మూర్ఖత, మొండితనము.
Stubby adj short and thick మోడుగా వుండే, మొద్దుగా వుండే.
Stucco n s సన్నగార. a stuccoed wall సన్నగార, ఆడినగోడ.
Stuck past and part of the verb to Stick he stood like a * pig మాన్పడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు.
Stud n s a nail with a large head driven for ornamnet గుబక,మేకు, గుబ్బమేకు. a * of horses గుర్రములు. he has a large * of horsesవాడి దగ్గిర నిండా గుర్రాలు వున్నవి.
Student n s విద్యార్థి, చదువుకొనేవాడు. a hard * నిండా చదివేవాడు.
Studied adj learned; versed in any study అభ్యశించబడ్డ, నేర్చుకోబడ్డ.having any particular inclination ఆలోచన పూర్వకమైన, ఆలోచితమైన. a * insult కావలెనని చేసిన అమర్యాద. a * neglect కావలెనని చేసిన ఉపేక్ష.
Studiedly adv ఆలోచనపూర్వకముగా, యోచన మీద.
Studious adj given to learning శ్రద్ధుడైన, విద్యాసక్తిగల,ఆస్తగల. careful జాగ్రత్తగల. they were * to please him అతణ్ని సంతోషపెట్టడములో వాండ్లు శ్రద్ధులుగా వుండినారు.
Studiously adv శ్రద్ధగా, ఆస్తగా, విద్యలో ఆసక్తిగలవాడుగా,జాగ్రత్తగా. he * said this to please them వాండ్లను సంతోషపెట్టడమునకై దీన్ని కావలెనని చెప్పినాడు. he * avoided me వాడు కావలెనని నా వద్దకి రాకుండా వుండినాడు.
Studiousness n s addiction to study విద్యాసక్తి శ్రద్ద, అస్త.
Study n s application to learning విద్యాసక్తి, అస్త. a chamberfor reading చదువుకొనే యిల్లు. he was then in a brown * అప్పుడుపరధ్యానముగా వుండినాడు. to please her child is her one * బిడ్డనుసంతోషపెట్టడము వొకటే దానికి వుండే ధ్యానము. (in painting) a sketchచిత్రమును ముందరతూలుగా వ్రాసుకోవడము. (In painter's cant,) a fine instance, a noble pattern చిత్రగాండ్లు పరిభాషలో దివ్యమైన మాదిరి. Theoak before my window is a perfect * (Hazlitt.) మా కిటికీవద్ద వుండేవొక చెట్టు దివ్యమైనది, అది అవశ్యం చూడతగ్గది.
Stuff n s వస్తువు, పదార్ధము, ద్రవ్యము, సామాగ్రి. of what * isthis made? యిది దేనితో నేశినది, యిది దేనితో చేసినది. this woodlooks well, but the * is gone యిది చూపుకు బాగా వున్నది గాని సారముచచ్చిన కొయ్య. good * ఔషదము. in carpenter's cant * means woodవడ్లవాండ్ల భాషలో కొయ్య, చెక్క. wrethched * తుక్కాముక్క. a pack of* or nonsense పిచ్చి కూతలు. what *! యేమిపిచ్చి. *! వెర్రికూత. household* యింటి సామాగ్రీ. kitchen * వంటకు కావలసిన సామాగ్రి. garden * కూరగాయలు.doctor's * మందు, ఔషదములు. lawyer's * లాయరులు చెప్పే వెర్రికూతలు.a kind of cloth వస్త్రవిశేషము. costly *s వెలపొడుగు బట్టలు.wollen * కంబళి, సగలాతు మొదలైనవి.
Stuffing n s that by which any thing is filled కూరేటిది,నించబడేటిది. eating gluttonously అధికముగా తినడము. * bring ondisease అధికతిండిచేత రోగము వస్తున్నది.
Stultification n s the act of making him a fool పిచ్చివాణ్నిచేయడము, వ్యర్ధము చేయడము. this is a complete * of the rule దీనివల్ల ఆ సూత్రము వ్యర్ధమైపోయినది.
Stultified adj made a fool of వెర్రివాణ్నిగా చేయబడ్డ, వ్యర్ధముచేయబడ్డ. the rule is compeltely * by this order యీ ఆజ్ఞవల్లఆ సూత్రము పిచ్చి అయిపోయినది.
Stumble n s కాలుజారడము, తడబడడము. he made a * vAdikiకాలుజారినది.
Stumbling adj కాలుజారే. a * horse కాలుజారిపడే గుర్రము.
Stumbling block n s ఇబ్బంది, సంకటము, అడ్డము. he wished to buythe house, but the price was a great * వాడికి ఆ యింటిని కొనవలెననివుండినదిగాని దాని వెల వొక యిబ్బందిగా వుండెను. every word in thisstory is a * to him యీ కథలో ప్రతి శబ్దమున్ను వాడికి సంకటముగావుండినది.
Stump n s మోడు. the * of a tree చెట్టు యొక్క అడుగు మొద్దు.the * of a hand కోశివేయగా మిగిలిన చెయ్యి. * of a tooth విరిగిమొక్కగా వుండే పల్లు. *s of corn కోతకోయగా మిగిలిన అడుగు మొక్కలు.
Stumpy adj short and thick మోడుగా వుండే, గిడ్డగా వుండే, పొట్టిగా వుండే. a * figure పొట్టిమనిషి.
Stung past and participle of the verb tosting కుట్టిన,పొడిచిన, * with shame అవమానముచేత రోషము వచ్చి. his pridewas * అహంకారముచేత వాడికి నిండా రోషము వచ్చినది.
Stunk past and participle of the verb tostink
Stunned adj దిమ్ముపట్టిన. he was * by the sound. ఆ ధ్వనినివిని మాన్పడ్డాడు, యెటూ తోచక వుండినాడు.
Stunngingly adv దిమ్ముపట్టేటట్టుగా, మాన్పరచేటట్టుగా, అఘోరింపచేసేటట్టుగా.
Stunning adj దిమ్ముపట్టేటట్టుచేసే, మాన్పడేటట్టుచేసే, అఘోరింపచేసే. * intelligence అఘోరమైన సమాచారము.
Stunted adj గిటకపారిన, పెరగక, మోడుపారిన.
Stupefaction n s insensibility; dulness మూర్చ, సొక్కు, మైకము.from the * caused by the blow ఆ దెబ్బచేత కలిగిన దిమ్మువల్ల.the * caused by smoking చుట్టపడడము వల్ల కలిగిన మైకము. the * of grief వ్యసనము చేత వొళ్ళు తెలియకపోవడము.
Stupendous adj wonderful అత్యాశ్చర్యకరమైన, బ్రహ్మాండమైన.
Stupid adj మూఢుడైన, అవివేకియైన, మందమతియైన, బుద్ధిహీనుడైన,తెలివిమాలిన.
Stupidity n s అవ్యక్తత, బుద్దిమాంద్యము, జడత్వము.
Stupidly adv తెలివిమాలి, అవ్యక్తముగా, అవివేకియై.I * believed him నేను పిచ్చిపట్టి వాణ్ని నమ్మినాను.
Stupified adj తెలివితప్పిన, స్మారకము తప్పిన, సొక్కిన, శోషపోయిన.
Stupor n s మైకము, విస్మృతి, భ్రమ, సొక్కు. on hearing thisnews he remained in a state of * all day యీ సమాచారమువిని నాడంతా పిచ్చిపట్టినట్టుగా వుండినాడు.
Sturdily adv బలిష్టముగా, దార్ఢ్యముగా.
Sturdy adj strong; forcible బలిష్టమైన, మోటైన. a * boy బలిష్టుడైన పిల్ల కాయ. a * rogue నిండా బలిష్టుడైన దొంగ.
Sturgeon n s a sea fish ఒక సముద్రపు పెద్ద చేప.
Sturring n s నత్తి.
Sty n s పందులగూడు. a dirty place రోతగా వుండే స్థలము. on theeye-lid కంటిరెప్పమీద లేచేకాయ, పులిపులి.
Stygian adj hellish; infernal నరక సంబంధమైన.
Style n s manner of writing with regard to language ధోరణి, పాకము, ఫణతి. * of dress వుడుపు యొక్క మాదిరి, రీతి. mode, way రీతి,విధము. he lived in noble * మహరాజులాగు వుండినాడు. people of * జంభగాండ్లు. a flowery * కదళీపాకము. a crabbed * నారికేళపాకము. an easy * ద్రాక్షపాకము. the middle of flower పుష్పము యొక్క నడిమిదిమ్మె.a * to write with గంటము, లేఖిని. appellation, title పై విలాసము వ్రాశేవైఖరి. I know his name, but I do not know his * వాడి పేరు నాకు తెలుసుగాని వాడికి పై విలాసము వ్రాశైరీతి నాకు తెలియదు. O. S. అనగా old style N. S. అనగా new style ఇది తిథులు కట్టడమును గురించిన మాట.Old style is still used in Russia and accordingly they sometimes write dates in this manner 17/29 August ... or 17-29 August... 21 Aug... 28 Aug./2 sept...4 sept. 1808; here the latest date is Englishnew style.
Styled adj పేరు పెట్టబడ్డ, పేరుగల. this is * an army దీనికి దండు అని వొక పేరట. he is * their family priest వాడు వాండ్లకు పౌరోహితుడనే పేరు మాత్రము వున్నది.
Stylish adj fine, grand జంభముగా వుండే. a * house దివ్యముగా వుండే యిల్లు.
Stylishly adv జంభముగా, దివ్యముగా.
Stylishness n s డంబము.
Styptick adj astringent ఒగురుగా వుండే. the juice of betel nut is * తాంబూల రసము వొగురుగా వుంటున్నది.
Styx n s వైతరిణీనది.
Suavity n s gentleness సరసత, మర్యాద, శాంతము, మంచితనము, తిన్ననితనము. from the * of her manners దాని సన్మరియాదవల్ల. he received mewith much * నన్ను నిండా సన్మరియాదగాగైకొన్నాడు.
Sub in composition,అనగాకింది, * assistant రెండోపనివాడు.
Sub judice adv before the judge; not decided విచారణలో వుండగా. while the matter is still * ఆ సంగతి యింకా విచారణలో వుండగా.
Subaltern n s రెండో వుద్యోగస్థుడు.
Subdivision n s భాగములో భాగమలు యేర్పరచడము.
Subdued adj జయించబడ్డ, అణచివేయబడ్డ. they were * వాండ్లు వోడిరి. a * voice దీనస్వరము. a tint నిస్తేజస్కమైన వర్ణము.
Subduer n s జయించినవాడు. the * of Mura మురారి.
Subject adj చేతికిందవుండే, లోబడ్డ, స్వాధీనమైన. they were * to him వాని చేతికింద వుండినారు, వానికి లోబడి యుండినారు. man is * to disease మనుష్యులకు రోగమునకు పాత్రులై వున్నారు, మనుష్యులకు రోగమువచ్చేదేను.fortune is * to changes ఐశ్వర్యము అస్థిరమైనది. wood is * to corruptionకొయ్యకు పుప్పిపట్టేదేను. all men are * to error భ్రమ అందిరకీ కలదు. a verb is * to change క్రియకు నానా రూపములు కలవు.
Subjection n s లోకువ, లోబడడము, లొంగడము. they live in * to him వానికి లోబడి వున్నారు. they live in * to him వానికి లోబడి వున్నారు. he held them in * వాండ్లను తనచేతి కింద పెట్టుకొని వుండినాడు. they were held in * వానికి అణిగి వుండినారు. before the * of his enemies శత్రువులు వానికి లోబడక మునుపు.
Subjective adj విశేషమైన.
Subjunctive mood n s చేదర్థకప్రయోగము, సంశయార్థక ప్రయోగము. he opened the door that they might enter వాండ్లు పోవడమునకై తలుపు తెరిచినాడు.
Sublapsarian n s కలియుగ సంబంధమైనవాడు.
Sublimate n s పుటము వేయబడ్డది భస్మము, మహౌషధము. చోర్రోసివే * సౌవీరము. Sublime, adj. ఘనమైన, మహత్తైన. a * river మహానది. a verseనిండా వుత్ప్రేక్షలుగల శ్లోకము. this is a * evidence of the truthఇది యధార్ధమును గురించి నిండా ఘనమైన సాక్ష్యము. the * Porte, thatis, the Court of the Emperor of constatninople కాన్ష్టాంటునోపిల్రాజసభ. "Longinus uses To xxxxxx and xxxxxx (for the sake of variety) for supernatural, great, noble, grand, wondrous, deep, &c. &c." (Pearce on Longin) మహనీయమైన.
Sublimely adv గొప్పగా, ఘనముగా.
Sublimity n s exvcellence మహత్వము, ఘనత. from the * of this verse. యిది అతి ఘనమైన శ్లోకము గనక.
Sublunar, Sublunary adj earthly ఐహికమైన, భూలోక సంబంధమైన.
Submarine adj సముద్రములో వుండే. * fire బడబానలము.
Submerged adj ముణిగిపోయిన.
Submersion n s state of being drowned ముణిగి వుండడము.
Submiss adj humble దీనమైన.
Submission n s obedience నమ్రత, వినయము, విధేయత, అణుకువ.
Submissive adj humble నమ్రతగల, అణుకువగల, వినయము గల.
Submissively adv వినయపూర్వకముగా
submissiveness n s humility వినయము, నమ్రత, విధేయత.
Subordinate adj చేతికింది. you are joined in * co-operation with us మీరు మా చేతికిందివారుగా వున్నారు. * authorities అతని చేతికిందిఅధికారస్థులు. a * farmer లోపాయకారి.
Subordinates n s plu. చేతికిందివాండ్లు.
Subordination n s the state of being inferior to another చేతికింద వుండడము, లోకువై వుండడము. in this school there is no * యీ పల్లెకూటములో పిల్లకాయలు అణిగి వుండడములేదు. what can an army do without * ? వొకడు చెప్పినట్టు పదిమంది విననిదండువల్ల యేమి ప్రయోజనము, ఆజ్ఞ ప్రజ్ఞ లేనిదండువల్ల యేమి ప్రయోజనము. I will teachthem * వాండ్లను అణిగి వుండేటట్టు చేస్తాను.
Subornation n s of perjury తప్పుసాక్షి చెప్పడమునకై మనుష్యులను సంపాదించడము.
Suborned adj తప్పుసాక్షి చెప్పడమునకై కుదర్చబడ్డ. a * witnessతప్పుసాక్ష్యము చెప్పడమునకై తీసుకురాబడ్డ సాక్షి.
Suborner n s one that procures a bad action to be done దుష్కార్యమును చేయించేవాడు. a * of perjury తప్పుసాక్షి చెప్పించినవాడు.
Subpana n s a writ commanding attendance in a court, under a penalty సాక్షి సమ్మనుకు హాజరుకాకుంటే యింతమాత్రము అపరాధమనివిధించబడ్డ సాక్షిసమ్మను.
Subpanaed adj సాక్షి సమ్మను యివ్వబడ్డ. the witness who were *సాక్షి సమ్మను యివ్వబడ్డ సాక్షులు.
Subscribed adj చేవ్రాలుచేయబడ్డ, వ్రాలుపెట్టబడ్డ. a letter * with his name అతని వ్రాలుగల జాబు. in Greek spelling a letter (as iota) *, is a letter which is written under another letter కింది అక్షరము,ఒత్తక్షరము.
Subscriber n s he who writes his name చేవ్రాలు చేసినవాడు, వ్రాలు పెట్టినవాడు. he who gives money చందా రూకలు యిచ్చేవాడు.
Subsequent adj next following తర్వాతి, అటుపిమ్మటి, ఇటీవలి. in the * ten years అటుతర్వత పదియేండ్లలో. his * acts వాడు యిటీవల చేసిన పనులు.
Subsequently adv afterwards అటుతర్వాత, ఆ పిమ్మట.
Subservience n s assistance, helping సహాయము.
Subservient adj సహాయమైన, ఉపయోగమైన. music is * to dancingఆటకు మేళముతోడు. grammar is * to legal studies న్యాయశాస్త్రమునకువ్యాకరణము సహాయముగా ఉంటున్నది.
Subsidiary adj helping, assisting, సహాయముగా వుండే. the * forceఉపబలముగా వుండే దండు. the streams which are * to the Godavari గోదావరిలో కలిశే యేళ్ళు.
Subsidy n s an assistance in money or in troops సహాయముగా యిచ్చే రూకలు, సహాయముగా యిచ్చే దండు.
Subsistence n s means of supporting life జీవనము, జీవనోపాయము,గ్రాసము. their sole * was bread వాండ్లు కేవలము రొట్టె తిని వుండినారు.they were in want of * గ్రాసమునకు లేకుండా వుండినారు. means of * బ్రతుకుదెరువు. real being ఉండడము, ఉనికి. there is no * in this cloth యిందులో దార్ఢ్యము లేదు. they say that all beings have their * in God. సమస్త జంతువులున్ను యీశ్వురునియందు వున్నవని అంటారు. a * in the Trinity మూడు మూర్తులలో వొకటి.
Subsistent, or subsisting adj having real being వుండే,కలిగి వుండే.
Subsription n s writing his name underneath కింద చేవ్రాలు చేయడము. confession, consent ఒప్పుకోవడము, సమ్మతించడము.contribution పంచివేత, విరాళము.
Substance n s being సత్త. there is no * in his reasoning వాడు చెప్పే న్యాయములో సారము లేదు. something existing వస్తువు, పదార్ధము.the essential part సారాంశము. he told me the * of the story, but not the details ఆ సంగతి యొక్క సారాంశమును చెప్పినాడు గాని వివరమును చెప్పలేదు. the sum and * of the matter is this ఆ సంగతి యొక్క సారాంశము యేమంటే. wealth ఐశ్వర్యము. a man of * భాగ్యవంతుడు. vegetable* వృక్ష సంబంధమైన వస్తువులు. meatalic * లోహములు. animal * జీవ సంబంధమైనది, అనగా మాంసము, చర్మము, యెముకలు మొదలైనవి. Indian rubberis a vegetable *, but in this country people suppose it is an animal * రబ్బరు చెట్టున పుట్టినది అయితే యీ దేశస్తులు జంతు సంబందమైనదనిఅనుకొన్నారు.
Substantial adj real; actually existing ఉండే, వాస్తవ్యమైన.there is no * reason for this దీనికి వాస్తవ్యమైన హేతువులేదు.glass may look like diamond, but there is a diffirence తరుపుచూపుకు రవవలె వున్నప్పటికిన్ని అది వేరే వస్తువు, యిది వేరే వస్తువు. solid, strong బలమైన, ధృడమైన, గట్టి. he has eaten nothing * for this week యీ వారందినాలుగా వట్టిధారకమే గాని సత్తువగల ఆహారము వాడు తినలేదు. a * house ధృడమైన యిల్లు, గట్టికట్టడముగా వుండే యిల్లు. bodily, corporeal మూర్తిమత్తైన. a * man భాగ్యవంతుడు.
Substantially adv strongly ధృడముగా, గట్టిగా. the house is * built ఆ యిల్లు దృఢముగా కట్టబడి వున్నది. in point of fact తత్వతఃప్రస్తుతః నిజముగా. this statement is * correct యీ చెప్పిన సంగతిశానామట్టుకు సుబద్ధముగా వున్నది. these two accounts are * one యీ రెండు లెక్కలు తత్వతః వొకటే.
Substantials n s (in Logic) principal parts ముఖ్యాంశములు,సారాంశములు.
Substantiated adj నిరూపించబడ్డ.
Substantive adj actual strong దృఢమైన, దారుడ్యముఅల, గట్టి.
Substative n s in grammar నామవాచకపదము.
Substitue n s ఒకనికి బదులుగా వుండేవాడు, వొకనికి ప్రత్యామ్నాయముగాపెట్టుకోబడ్డవాడు. I went there as his * వాడికి బదులుగా నేను అక్కడికి పోయినాను వానిమారు నేను పోయినాను.
Substituted adj బదులుగా పెట్టుకోబడ్డ. ప్రత్యామ్నాయముగా పెట్టుకోబడ్డ.
Substitution n s బదులుగా వుండడము, ప్రత్యామ్నాయముగా పెట్టడము. the * of his brother is not sufficient వాడికి బదులుగా వాడి అన్న వుండడముపనికిరాదు.
Substraction n s లెక్కలలో తౌశివేయడము, తీసివేయడము,హరణము, బాగారము. after the * of this letter యీ కాకితమునుఅపహరించిన తర్వాత.
Substratum n s that which lies underneath అడుగున వుండేటిది,అడుగుతట్టు, అడుగుమట్టు. the * was rock అడుగుతట్టు చట్టుగా వుండినది.
Subter (Latin) in composition,siginifies underకింద
Subterfuge n s an excuse సాకు.
Subterranean, Subterraneous adj under the surface of theearth భూమికింద, భూమిలోగా వుండే. a subterraneous passage సురంగము.a subterraneous river అంతర్వాహినిగా వుండే యేరు. a subtreraneous chamber నేలమాళీగ. a subterraneous granary పాతర.
Subtile adj thin; not gross అతి సూక్ష్మమైన, అణుస్వరూపమైన.ather is * ఆకాశము, సూక్ష్మ వస్తువు a * distinction అతి సూక్ష్మమైనభేదము. cunning కపటియైన. a * man కుత్సితుడు.
Subtility n s thinness; fineness సూక్ష్మత, సౌక్ష్మయము. craftiness కాపట్యము. from the * of ather ఆకాశము సూక్ష్మ పదార్ధము గనక. from this distinction యీ భేదము అతి సూక్ష్మమైనది గనక.
Subtilization n s సూక్ష్మము చేయడము, పొడి చేయడము, పుటము చేయడము.
Subtilized adj సూక్ష్మము చేయబడ్డ, పొడి చేయబడ్డ, పుటము వేయబడ్డ.
Subtilty n s thinness, fineness సూక్ష్మత, తంత్రము. from the* of the spiders thread సాలెపురుగు నూలు అతి సూక్ష్మమైనందువల్ల.
Subtle adj sly; cunning కపటియైన తంత్రముగల. nice thinఅతి సూక్ష్మమైన, నిండా సన్నని. the spider's thread is very * సాలెపురుగు నూలు అతి సూక్ష్మమైనది.
Subtlety n s See Subtility.
Subtracted adj తోశివేయబడ్డ, భాగారించబడ్డ.
Subtraction n s భాగాహారము.
Suburb n s పేట, శాఖానగరము. the town is small, but the * is large పట్టణము చిన్నదేగాని దాని చుట్టూ వుండే పేటలు పెద్దవి. helives in the * పట్టణము బైటిపేటలో వున్నాడు.
Suburban adj inhabiting the suburb పేటలో కాపురము వుండే,వూరి సమీపములో వుండే.
Subversion n s ruin నాశనము, హాని, చెరువు.
Subversive adj చెరుపైన, హానికరమైన. this war is * of tradeయీ యుద్ధము వర్తకానికి చెరుపుగా వున్నది.
Subvrted adj చెడిన, చెరపబడ్డ, నాశనము చేయబడ్డ.
Succedaneous adj supplying the place of something elseబదులుగా వుండే, ప్రత్యామ్నాయముగా వుండే. secondary not principal ఎడగారుగా వుండే, అకాలమందు కలిగిన.
Succedaneum n s ప్రత్యామ్నాయముగా పెట్టుకోబడ్డది, బదులుగా వుంచుకోబడ్డది. this shell is a perfect * for a razorయీ గుల్ల మంగలకత్తి బదులుగా పెట్టుకోబడ్డది.
Succeeding adj following వెనుకటి, వెంబడిగా వచ్చే. in the *chapter దీనికి అవతల వచ్చే అద్యాయములో, దీనికి వెంబడిగా వచ్చే అధ్యాయములో. the * story యీ కింద చెప్పే కథ. in the * trialదానికి అవతలి విచరణలో. in the * years ఆ తర్వాతి సంవత్సరములలో, ఆ వెనుకటి సంవత్సరములలో.
Success n s victory జయము, కార్య సిద్ధి, ఫలము. he had butbad * వాడికి కార్యసిద్ధి కాలేదు, వానికి అపజయమైనది. ill * అపజయము.
Successful adj జయప్రదమైన, శ్రేయస్కరమైన, అనుకూలమైన.
Successfully adv అనుకూలముగా.
Succession n s పరంపర, పారంపర్యము, క్రమము. in * పరంపరగా, క్రమముగా. the male * to the priesthood ఆచార్యపుంస్త్వము. after a long * of efforts అనేక ప్రయత్నములు చేసిన తర్వాత. after a long * of battles అనేక యుద్ధములు అయిన తర్వాత. Successive, adj. పరంపరగా వుండే, వరసగా వుండే, క్రమముగా వుండే.* battles వరసగా చేసిన యుద్ధములు. the * rulers పరంపరగా వచ్చే ప్రభువులు. in the * periods ఆ తర్వాతి కాలములలో for three * nightsవరసగా మూడు రాత్రిళ్ళు. in the * generations ఆ తర్వాతి పరుషాంతరములందువరుసగా.
Successively adv పరంపరగా, ఒకటికి తర్వాత వొకటిగా, వరసగా.the grandfather, the father and the son were * ministers తాత తండ్రి కొడుకు వీండ్లు పరంపరగా మంత్రులుగా వుండిరి, వొకడికి తర్వాతవొకడు మంత్రిగా వుండెను. the disease which attacked them * వాండ్లకుపరంపరగా వచ్చిన రోగము.
Successor n s వెంబడిగా వచ్చినవాడు, తర్వాత వచ్చినవాడు, బదులుగావచ్చేవాడు. I was his * వానికి తర్వాత నేను వచ్చినాను. who was your *?నీకు తర్వాత వచ్చినవాడు యెవడు. he and his *s in the ministry ఆ మంత్రిత్వమునకు వచ్చిన తానున్ను తన తర్వాతి వాండ్లున్ను. my * నా వుద్యోగానికివచ్చినవాడు, నా తర్వాత నాయాస్తికి వచ్చేవాడు. he left heavy debts to his*s తన వెనుక తన యాస్తికి వచ్చేవాండ్లకు నిండా అప్పులు పెట్టి పోయినాడు. he had no *s వానికి సంతానము లేదు, వానికి తర్వాత వానికి కర్తలు లేరు.
Succinct short;concise;briefసంక్షిపమైన,సంగ్రహమైన
Succinctly adv సంగ్రహముగా, సంక్షేపముగా, రెండు ముక్కలుగా.
Succinctness n s సంక్షేపము, సంగ్రహము.
Succory n s a plant ఒకవిధమైన తోటకూర.
Succour n s aid; assistance సహాయము, ఉపకారము.
Succourless adj సహాయములేని.
Succulent adj సారముగల, సత్తువగల, ఊటగల.
Such adj అటువంటి, ఇటువంటి, అంతటి. * a house యిన్నో వొక యిల్లు.* an one యిన్నో వొక మనిషి. * as me నావంటి. take * as you likeనీకు యిష్టమైనది యెత్తుకో. * as this యిటువంటి, అటువంటి. * as livethere అక్కడే వుండే వాండ్లు. * as trade there అక్కడ వర్తకము చేసేవాండ్లు. as like go; * as do not remain పోవలెనని వుండేవాండ్లుపోతారు, వుండవలెననే వాండ్లు వుంటారు. * and * a house యిన్నో వొక యిల్లు. he already has house * as it is వాడికి యిల్లు అని వొకటి వున్నదిగాని అది అంత మంచిదికాదు. I cannot say the carriage is agood one; it is * as it is ఆ బండి అంత మంచిది అనను వొకమాత్రముగా వున్నది. to * and * a place ఫలానిచోటికి, యిన్నో వొక స్థలానికి.
Suck n s ట్హే act of sucking తాగడము. milk given byfemales చనుబాలు. to give * చన్ను యిచ్చుట. she does not give * to her child అది బిడ్డకు చన్ను యిచ్చేదిలేదు. all who give * చంటిబిడ్డ గలవాండ్లు. by her not giving * the fevercame on అది బిడ్డకు చన్ను యివ్వనందున జ్వరము వచ్చినది.
Sucker n s a shoot చిగురు, పల్లవము. of a pump జలయంత్రనాళము యొక్క కొనను నాలకెవలె వుండేతోలు.
Suckling n s చంటిబిడ్డ.
Sudatory adj చెమట సంబంధమైన. a * medicine చెమటనుగురించిన మందు.
Sudden adj ఆకస్మికమైన, హటాత్తుగా, సంభవించే. this * question alarmed him లటక్కున అడిగినందున భయపడ్డాడు. by thier * arrival వాండ్లు హటాత్తుగా వచ్చి చేరినందున, ఆకస్మికముగా వచ్చిచేరినారు గనక.by a * impulse he went to thier house లటుక్కున ఆయనకు వొకతలంపు వచ్చి వాండ్ల యింటికి పోయినాడు. * death ఆకస్మికమైన చావు.
Suddenly adv ఆకస్మికముగా, లటుక్కున, అకస్మాత్తుగా. he died *మిడిసిపడి చచ్చినాడు, వుండేటట్టు వుండి చచ్చినాడు. it * came onto rain ఆకస్మికముగా వొక వాన వచ్చినది.
suddenness n s ఆకస్మికత. from the * of the marriage ఆ పెండ్లి గాలివాన కూడినట్టుగా కూడినది గనక. from the * of the quarrel ఆ జగడము ఆకస్మికముగా సంభవించినందున.
Sudorific adj చెమటను కలగచేసే.
Sudra n s name of a tribe శూద్రుడు. a * woman శూద్రది. the *s శూద్రులు. * language that is low language శూద్రమాటలు.
Suds n s మరుగు, కుంకుడుగాయ మొదలైన వాటి నురుగు. he wasleft in the * నిండా యిబ్బందిలో వుండినాడు.
Suet n s hard fat కొవ్వు, కడుపులో వుండే కొవ్వు.
Sufferable adj సహించగూడిన, తాళగూడిన, పడగూడిన. is this * ? ఇది సహించతగ్గదా, తాళగూడినదా, దీన్ని యెవరు పడుదురు.
Sufferance n s permission అనుమతి. patience క్షమ, సహిష్ణుత.
Suffered adj endured పడ్డ, పడిన, అనభవించుట. the punishment* by him వాడు పడ్డ శిక్ష.
Sufferer n s పడ్డవాడు. I am one of the *s ఆ తొందరలోపడ్డవాండ్లలో నే నొకడు. am I to be the * for his folly?వాడి పిచ్చితనమును గురించి నేనా పడేది. we were fellow *s మాకందరికిన్ని ఆ గతి వచ్చినది, మేమందరమున్ను దాన్ని పడ్డవాండ్లమే.
Suffering n s pain suffered హింస, బాధ, అవస్త, శ్రమ. patienceసహనము, తాళిమి. long * నిండా వోర్పు.
Sufficiency n s supply equal to want కావలసినంత. he is not called rich, but he has a * వాడు నిండా భాగ్యవంతు డనరాదు, అయితే వాడికి వుండేది వాడికి చాలును. I doubt the * of the security ఆ జామీను చాలునో చాలదో నాకు సందేహముగావున్నది. qualification for any purpose యోగ్యత. self * గర్వము, అహంకారము.
Sufficient adj చాలిన, తగిన. self * అహంకారము గల.
Sufficiently adv కావలసినంత మట్టుకు. this is * boiled యిది అయినమట్టుకువుడికినది. this house is not large యీ యిల్లు విశాలము చాలదు. this rope is not* long యీ దారము నిడుపు చాలదు.
Suffocation n s ఉడ్డుగుడుచు కొనేటట్టు చేయడము, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేయడము. he stayed in the burning house till he feared death by* ఉడ్డుగుడుచుకొని చస్తామనే భయము తోచే దాకా ఆ కాలుతో వుండే యింట్లో వుండినాడు.the room was crowded to * ఆ యింట్లో జనము కిక్కరుసుకొని వూపిరి తిప్పుకోగూడకుండా వుండినది.
Suffragan n s an assistant Bishop రెండో బిషపు.
Suffrage n s vote; voice, approbation సమ్మతి, అంగీకారము. they gavehim their *s వాండ్లందరు వాణ్ని సమ్మతించినారు, వొప్పుకొన్నారు. by common * thesemen are very clever వీండ్లు గట్టివాండ్లని అందరు అంటారు hegained a few *s వాణ్నికొందరు వొప్పుకొన్నారు. my * is of little value నా మాటను యెవరు అడుగుతారు.
Suffusion n s the act of over spreading వ్యాప్తి, వ్యాపించడము.
Sugar n s చెక్కర, పంచదార. soft *, or brown * బెల్లము. loaf * అతిధావళ్యమైన శర్కర.
Sugarcandy n s కలకండ.
Sugar-cane n s చెరుకు. wild * వెర్రిచెరుకు.
Sugared adj తియ్యని, మధురమైన. * phrases తియ్యని మాటలు.
Sugarloaf n s సొగటాలకాయ ఆకారముగా వుండే అతి ధావళ్యమైనశర్కర గడ్డ, యిది అయిదారు పౌనులు వుంటున్నది. a * hill సొగటాల కాయఆకారముగా వుండే కొండ.
Sugarmill n s చెరుకు గానుగ.
Sugarplum n s చెక్కరలో పక్వము చేసిన బాదాం మొదలైన పప్పు.
Sugary adj తియ్యని, తీపైన.
Suggestion n s hint; intimation; insinuation: secretnotification: secret incitement జాడ, సూచన, జాడగా తెలియచేయడము, తెలియచేయడము, తోపింపచేయడము. at his * అతడు చెప్పినందు మీదట.
Suggestive adj (a bad word) interesting సరసమైన.
Suggestively adv (a bad word) interestingly సరసముగా, ఉద్బోధకముగా.
Suggestiveness n s (a bad word) interest, good taste సరసత.
Suicidal adj injurious, miserable హానికరమైన, ప్రాణానికివచ్చే,చేటుదెచ్చే. this is * carelessness యిది చేటును దెచ్చే అశ్రద్ధ, యీలాటి వుపేక్ష వల్ల చెరుపు వచ్చును.
Suicide n s స్వహత్య. he committed * ప్రాణత్యాగము చేసుకొన్నాడు. this is down right * యిది తన నోట్లో తాను మన్ను వేసుకోవడము. there has lately beena great increase of * యిటీవల శానామంది ప్రాణత్యాగము చేసుకోంటున్నారు, స్వహత్య చేసుకొంటున్నారు.
Sui-generis adj peculiar విశేషమైన, విపరీతమైన, విచీత్రమైన.
Suit n s a set జత, జోడు. a * of clothes వొక దుస్తు బట్టలు,వొక పూటకు తొడుక్కొనే వుడుపు. he wore a black * నల్ల వుడుపు వేసుకోన్నాడు.a * at cards ఆడే కాకితాలలో వొక జాతి. a * at law వ్యాజ్యము, వ్యవహారము,తగువు, దావా. a * or request in marriage పెండ్లిని గురించి చేసుకొనే మనివి.
Suitability n s పొందిక, ఇమిడిక. I do not see the * of these twoorders యీ రెండు వుత్తరువులు పొందికగా వుండలేదు, ఇది వొక దోవ అది వొకి దోవగా వున్నది.
Suitable adj అనుకూలమైన, అనుగుణ్యమైన, తగిన, ఇమిడికైన, ఒప్పిదమైన.
Suitableness n s పొందిక, ఇమిడిక. I do not see the * of thesetwo orders యీ రెండు వుత్తరువులు పొందికగా వుండలేదు, యిది వొక దోవ అది వొక దోవ.
Suitably adv అనుగుణ్యముగా, అనుకూలముగా, ఉచితముగా, ఉప యుక్తముగా, న్యాయముగా. Suite, n. s. retinue, company పరిజనము, పరివారము, పరిచారకజనము. series regular order వరస, క్రమము. a * of rooms గదుల వరస he came with a long* నిండా పరిజనముతో కూడా వచ్చినాడు.
Suitor n s one that sues వ్యాజ్యగాడు, మనివి చేసుకొనేవాడు.
Sulkily adv morosely చిరచిరలాడుతూ, మండిపడుతూ. he spoke * చిటిచిటలాడుతూ మాట్లాడినాడు.
Sulkiness n s moroseness ముసురుమూతితనము, చిరచిరలాడే స్వభావము,మండిపడే గుణము.
Sulky adj silently sullen ముఖము ముడుచుకొని వుండే. morose చిరచిరలాడే, మండిపడే, మసురుముతిగా వుండే.
Sullen adj gloomy వ్యాకులముగా వుండే, చింతగా వుండే, మూతిముడుచుకొని వుండే. why are you * about this? యిందున గురించి యేల మూతిముడుచుకొని వున్నావు? obstinate మూర్కమైన, ముష్కరమైన. she looked * అది మూతి ముడుచుకొని వుండినది. * silence కోపము చేత బిర్రబిగుసుకొని వుండడము. Sullenly, adv. malignantly క్రౌర్యముగా. intractably మూర్ఖముగా, ముష్కరముగా.
Sullenness n s malignity క్రౌర్యము. intractability మూర్ఖము, ముష్కరము మొండితనము.
Sullens n s morose temper ముసురుమూతి తనము, ఇది యెగతాళి మాట.
Sullied adj foul మలినమైన, కల్మషయుక్తమైన. his character is * వాడి పేరుకువొక కళంకము వచ్చినది, వాడి పేరు చెడిపోయినది.
Sulphate of iron n s అన్నభేది.
Sulphate of zinc n s తుత్తినాగము.
Sulphur n s గంధకము.
Sultan n s a prince సులుతాను.
Sultana n s a princess సుల్తాను భార్య.
Sultriness n s ఉక్క.
Sultry adj hot and close ఉక్కగా వుండే. it is * to-dayనేడు వుక్కగా వున్నది.
Sum n s the whole amount మొత్తము, వెరశి రూకలు. compendiumసంక్షేపము, సారాంశము. this is the * of the matter ఇది ఫలితార్ధము.the * and substance of the book గ్రంధాభిప్రాయము, ఫలితార్ధము. a small * కొన్ని రూకలు. a large * నిండా రూకలు. a round * సున్నలుగల మొత్తము, అనగా 10-100-1000 మొదలైనవి. he gave me a * to do నన్ను వొక లెక్క వేయమన్నాడు. they contributed various *s వాండ్లవాండ్లకు తోచినది చందా వేసుకొన్నారు. broken *s చిల్లర పద్దులు. To Sum, v. a. to compute కూర్చుట, చేర్చుట. to * up వెరశికట్టుట, సంగ్రహముగాచెప్పుట, ఉటంకించి చెప్పుట. he summed up the story in a few words ఆ కథనునాలుగు మాటలుగా చెప్పినాడు. the judge summed up the case న్యాయాధిపతి ఆ వ్యాజ్యమును సంగ్రహముగా చెప్పినాడు.
Sumach n s మామిడిచెట్టువంటి ఒక చెట్టు.
Summarily adv briefly సంక్షేపముగా, సంగ్రహముగా, టూకీగా, ఉటంకించి.
Summary adj short; brief సంగ్రహమైన, సంక్షేపమైన. * punishmentతక్షణము జరిగించిన శిక్ష, యీ చేతికి ఆ చెయ్యిగా జరిగించిన శిక్ష.
Summer n s ఎండ కాలము, వేసవికాలము, గ్రీష్మకాలము. the * moonశరదిందువు.
Summerest n s a high leap, in which the heels are thrown the headపిల్లి మిరియము, లాగు , దొమ్మరలాగు to throw *s లాగులు వేసుట.
Summer-house n s an a partment in a garden used in the summer ఎండకాలములోతోటలో వుండడానకై కట్టుకొన్న యిల్లు.
Summit n s the top శృంగము, శిఖరము, కూటము, కొన.
Summons n s a call of authority admonition to appear రమ్మని వ్రాసినచీటి,అజ్ఞా పత్రిక, దీన్ని వాడుకగా సమ్మను అంటారు.
Sumpter-horse adj relating to expence వ్రయమును గురించిన.
Sumptuosly adv grandly జంభముగా. I faired * మృష్టాన్నముగా భోజనము చేసినాను, రాజాన్నముగా భోజనము చేసినాను.
Sumptuous adj fine, grand, splendid డంభమైన, జంభమైన. a * entertainment జంభమైన విందు.
Sun n s సూర్యుడు, పొద్దు. such is the state of things under the * ఇహములో యిట్లా కద్దు. it was the noblest city under the * ప్రపంచములో యిటువంటి పట్టణము వేరే లేదు. or sun-shine ఎండ, do not sit in the * యెండలో కూర్చుండక. the * hasspoiled the colour యెండ చేత వన్నె చెడిపోయినది.
Sunbeam n s సూర్యకిరణము.
Sunbright adv సూర్యనివలె ప్రకాశించే.
Sunburnt p|| ఎండకుకందిన,ఎండకువాడిన
Sunday n s ఆదివారము, భానువారము, రవివారము, అధిత్యవారము, తొలివారము.
Sundial n s నీడగడియారము.
Sundown n s అస్తమానము, సాయంకాలమ.
Sundry adj నానావిధమైన, నానా ప్రకారమైన, వివిధమైన. he placed them in * houses వాండ్లను వేరేవేరే యిండ్లలో పెట్టినాడు. this is stated in * books యిది అనేక పుస్తకములకలో చెప్పబడి వున్నది. it has been translated into * languagesఅది నానా భాషలలో భాషాంతరము చేయబడ్డది. * articles చిల్లర సామానులు. * goods చిల్లర సరుకులు. at * times అప్పుడప్పుడు. * in * place కొన్ని స్థలములలో. all and * పిన్నలు, పెద్దలు. surdries; that is, various articles చిల్లర సామానులు, ఇది నీచమాట.
Sunflower n s సూర్యముఖి, అర్క పుష్పిక, పొద్దుతిరుగుడు పువ్వు.
Sung past and participle of the verb tosing పాడుట
Sunk past and participle of the verb toSink ముణుగుట
Sunken adj ముణిగిన, గుంటలుపడ్డ పల్లముపడ్డ. a * piece of ground పల్లముపడ్డ చోటు. her * heart ఖిన్నముగా వుండే దాని మనసు. his eyes are * వాడికండ్లు గుంటలు పడ్డవి. a * chest, or breast బొక్కిరొమ్ము.
Sunn n s Indian word for hemp జనుము.
Sunning n s ఎండ, ఎండకాక.
Sunny adj exposed to the sun ఎండగల, ఎండకాస్తూ వుండే. bright తేజరిల్లే, ప్రకాశమానమైన. in a * spot యెండకాశేస్థలములో. * locks బంగారు తీగలవలె మెరిసే వెంట్రుకలు.
Sunrise, Sunrising n s. సూర్యోదయము, ప్రొద్దుపొడుపు, ఉదయకాలము, ప్రాతఃకాలము. it is * ఇది వుదయకాలము.
Sunset n s సూర్యాస్తమానము, ప్రొద్దుగూకేవేళ. it is * అస్తమాన కాలము. Sunshine, n. s. ఎండ. the * of hope or joy ఆనందాతిశయము.
Sunshiny adj bright with the sun ఎండకాశే. a * spot యెండకాశే చోటు, హాయిగా వుండే చోటు. a * day యెండకాశే దినము.
Sunstantiation n s proving నిరూపించడము, నిజపరచడము.
Sup n s mouthful of liquor గుక్కెడు. he took a * and went on గుక్కెడు తాగి వెళ్ళినాడు.
Super is incompounds expressed by మహా or శ్రీ
Superable adj conquerable; such as may be overcome సాధ్యమైన సాధించకూడిన. I think the difficulty * ఆ తొందర సాధించ తగ్గదిగా వున్నది.
Superabounding adj అతిశయముగా వుండే, అపరిమితముగా వుండే, విస్తారముగా వుండే, మించివుండే.
Superaboundingly adv అప్రిమితముగా, ఎక్కువగా. Superbundance, n. s. more than enough అధికము, అపరిమితము.
Superabundant adj అపరిమితమైన, విస్తారమైన.
Superabundantly adj అపరిమితముగా, ఎక్కువగా.
Superadded adj పైగా చేసిన, మరిన్నిచేసిన.
Superannuated adj disqualified by age వృద్ధాప్యము చేత అశక్తుడైపోయిన. he is now * for that business ముసలివాడై పోయినందున వాడు యిప్పుడు ఆ పనికి పనికిరాడు.
Superannuation n s the state of being too old ఏండ్లుచెల్లినందున అనర్హుడుగా వుండడము.
Superb adj grand, magnificent, splendid దివ్యమైన, ఘనమైన,మహత్తైన, దొడ్డ.
Superbly adv grandly, magnificently దివ్యముగా, ఘనముగా.
Supercargo n s an officer in a ship whose business is tomanage the trade or one who has the care of a cargo వాడకరణము,వర్తకుని మనిషిగా వాడలో వుండి వర్తక సురకును గురించిన వ్యవహారమును చూచుకొనే వాడు.
Supercilious adj haughty; dogmatical గర్వముగల, అహంకారముగల,తలబిరుసైన, నీల్గుగల, నిక్కుగల.
Superciliousness n s దురహంకారము, గర్వము, బిగువు, నిక్కు, నీల్గు.
Supereminence n s సర్వశ్రేష్టత, ఘనత.
Supereminent adj అతి శ్రేష్ఠమైన, మిక్కిలి ఘనమైన, పరమ.
Supereminently adv మిక్కిలి ఘనముగా, అతి శ్రేష్టముగా.
Supererogation n s doing more than duty కర్తవ్యాతిరిక్త కార్యము, నియమాధిక కార్యము, చేయవలసిన అక్కరలేనిపని, నిర్నిమిత్తమైనపని. worksof * అధిక పుణ్యము. he considers it quite a work or * to supporthis sister తనచెల్లిలిని కాపాడవలసిన ధర్మము శుద్ధముగా తనదికాదనియెంచుతున్నాడు. చెల్లెలిని కాపాడవలసిన దానికి నాకేమి పట్టినదని అంటాడు.Telugu bramins value themselves on their skill in Sanscritpoetry and grammar: but a thorough skill in their native Telugu is thought a work of * తెలుగు బ్రాహ్మణులకు సంస్కృత కావ్యవ్యాకరణములయందు ప్రవీణత విశేషమేగాని వారి స్వభాషయైన తెలుగులో మంచి ప్రజ్ఞ సంపాదించడము కొరగాని పని అని అనుకొంటారు.
Supererogatory adj performed beyond the strict demands of dutyకర్తవ్యాతిరిక్తమైన, నియమాధికమైన, అక్కరలేని.
Superexcellent adj అతి ఘనమైన.
Superfetation n s one conception following another, so thatboth are in the womb together, but come not to thier full time for dell very together ఉపబ్రూణము. (The first meaning is not in use) * of soil విత్తనముమీద విత్తనము పడడమువల్ల చక్కగాఅభివృద్ధి కాకపోవడము. * of intellect అనేక యుక్తులచేత వొక యుక్తినిపనికిరాకపోవడము.
Superficial adj పైవెలపటి, పైకి మినుకుగా వుండే. the *measurement is three feet by six పై తట్టు కొలిస్తే నిడివి అడుగులు మూడు, ఎత్తు అడుగులు ఆరు. * work బూటకమైన పని. his goodness is all * వాడిది వట్టి పై మంచితనము, లోగా యేమిసత్త లేదు. on a * examination పైపైగా విచారించడములో లఘువిమర్శచేయడములో. this is a very * grammar యిది పేరుకు వ్యాకరణమేగాని విచారిస్తే సత్త లేదు. he is a * scholar అల్పవిద్య గలవాడు.this is a solid commentary, but the other one is * యిది సారవత్తైన వ్యాఖ్యానము రెండోది నిస్సారమైనది. one of his reasons was solid, the other was * వాడు చెప్పిన హేతువులలో వొక సద్ధేతువువొకటి అసద్ధేతువు. a * observer పైపైగా విచారించేవాడు.
Superficially adv externally, regarding the outside పైపైగా,పైపైన. he examined the case * ఆ సంగతిని గురించి లఘువిమర్సచేసినాడు, పైపైగా విచారించినాడు.
Superficies n s outside, surface బైటితట్టు. I measured the * of the stone, but I do not know it's thickness ఆ రాతి పై తట్టును కొలిచినాను గాని దాని మందమును కొలవలేదు.
Superfine adj very fine నాణ్యమైన, ఇది నీచమాట.
Superfluity n s excess అమితము, అధికము, అపరిమితము.
Superfluous adj అపరిమితమైన, అమితమైన, అనావశ్యమైన,నిష్ప్రయోజకమైన, అక్కరలేని, అగత్యముకాని. reason for thisare quite * ఇందుకు సమాధానము అక్కరలేదు, యిందుకు సమాధానముచెప్పడము నిరర్థకము. he considers a commentary * టీక అక్కరలేదంటాడు. he considers two coats * వొక చొక్కాయే చాలును,రెండోది యెందుకు అంటాడు. they keep their faces clean butthey consider pain * వాండ్ల ముఖములు నిర్మలముగా వుంటవి గానిపసుపు మొదలైనవి పూసుకోవడము అనావశ్యకమంటారు. these two linesare * యీ రెండు చరణములు అనావశ్యకములు.
Superhuman adj above the nature or power of man అతిశయమైన,అతిమానుషమైన, అధిదైవికమైన, మనుష్యశక్తి మించిన. they say the gaints had * power మనుష్యులకంటే అధికమైన బలము రాక్షసులకు వుండిన దంటారు. the eight * attributes అణిమా మహిమాదులు.
Superinduced adj పైగావచ్చిన, సంభవించిన. the evils * by thisయిందువల్ల సంభవించిన చెరుపులు.
Superintendence, Superintendency n s. over-seeing, managingపై విచారణ.
Superintendent n s an overseer, manager పైవిచారణ చేశేవాడు,పై విచారణకర్త, ప్రవర్తకుడు, అధిపతి, అధ్యక్షుడు.
Superior n s a master, a ruler తనకు పైవాడు. he obeyedhis *s తనపై వాండ్లకు అణిగి నడుచుకొన్నాడు. he behaved well both to his *s and to his inferiors తనపై వాండ్లకు తన కిందివాండ్లకు వుభయులకు చక్కగా నడుచుకొన్నాడు. a head man overpriests పెద్దపాదిరి.
Superiority n s the being better ఘనత, శ్రేష్టత, అధిక్యము.from the * of this indigo యీ నీలిమందు శ్రేష్టమైనది గనక.
Superlative adj ఉత్కృష్టమైన, సర్వోత్కృష్టమైన. from the * qualitiesof his mind అతని విశేషగుణమువల్ల. this was an act of * mercyయిది మహత్తైన అనుగ్రహము. the * degree in grammar తమ ప్రత్యయము.
Supernal adj place above; celestial దివ్యమైన.
Supernatural adj అమానుషమైన, అద్భుతమైన, దేవతా సంబంధమైన.* intelligence జ్ఞానదృష్టి, యోగదృష్టి. * weapons దివ్యాస్త్రములు.these were of a * race వీండ్లు దేవతలు.
Supernaturally adv in a manner above the course or powerof nature దైవికముగా, అద్భుతముగా.
Supernumerary adj and n. s. being above the number లెక్కకు మించిన, లెక్కకు పైగా వుండేవాడు, పై మనిషి, ఉమేదువారు. * troops లెక్కకుపైగా ఉమడేదండు, చిల్లర, దండు. he has twenty servants and foursupernumeraries వాడివద్ద యిరువై మంది పనివాండ్లున్ను నలుగురు వుమేదువారున్ను వున్నారు.
Superscribed adj పై విలాసలముగల. the letter was * to him పై విలాసము వాడి పేరిటికి వ్రాశి వుండినది.
Superscription n s పై విలాసము. or title వక్కణ.
Superseded adj కొట్టుబడ్డ, కొట్టుబడిపోయిన. this orderwas * యీ ఆజ్ఞ కొట్టుబడి పోయినది. he was * వాడు కొలువులో నుంచితీశివేయబడ్డాడు.
Supersession n s setting aside, dismissal కొట్టివేయడము,తోసివేయడము, కొలువులోనుంచి తీసివేయడము. this is a * of the oldlaw యిది పాతచట్టమును కొట్టివేయడము.
Superstious adj పిచ్చ భ్రమగా వుండే వట్టి భ్రమగా వుండే. Acts XVII. 22. అతి భక్తులు. [A+ says దేవపూజయాం ఆసక్తాః]
Superstiously adv పిచ్చితనముగా, పిచ్చిభ్రమగా.
Superstition n s foolish belief పిచ్చి, పిచ్చిభ్రమ, వట్టిభ్రమ,పిచ్చితలంపు, పిచ్చి భక్తి, పిచ్చినమ్మిక. they say that last yearthe god appeared in this place: but it is a foolish * పోయినసంవత్సరము యిక్కడ స్వామి ప్రత్యక్షమైనాడని అంటారు, అయితే యిది వట్టి భ్రమ. they believe that milk and sugar will cure the cholera, if drunk here but this is mere * యిక్కడ పాలు బెల్లము తాగితే వాంతి భ్రాంతి కుదురుతున్నదని అంటారు. అయితే యిది వట్టి పిచ్చినమ్మిక. theyhave a * that it is wrong to begin any business on a Fridayశుక్రవారము నాడు యే పనిన్ని ఆరంభించరాదంటారు, ఇది వట్టి పిచ్చి.

English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment