Stamina English to Telugu free online dictionary

Stamina n s plu. strength, nerves ధార్డ్యము, శరీరపుష్టి.of a flwoer, కర్ణిక, పుష్పము, నడిమిదిమ్మె.
Stammer, or stammering n s. నోరు తడబడి మాట్లాడడము, నత్తిగామాట్లాడడము. he said he would cure the boy of stammer: (or,of stammering) ఆ పిల్లకాయ నత్తిని పోగొట్టుతానని చెప్పినాడు.
Stammerer n s నోరుతడబడి మాట్లాడేవాడు, నత్తిగా మాట్లాడేవాడు.
Stamp n s any instrument by which a distinct and lasting impression is made ముద్ర వేశే శాసనము, ముద్రకోల, అచ్చుబల్ల. a markset on anything ముద్ర, వేసిన ముద్ర, వేసిన గురుతు. a thing marked or stamped ముద్రవేయబడ్డది. * paper ముద్ర కాకితము. a * picture cutin wood or metal పటములు అచ్చువేశే అచ్చు. a picture made by impressionఅచ్చు వేసిన పటము. this book bears the * of truth యీ పుస్తకము నిజమన దానికి గురుతు వున్నది. an act of this * యిటువంటి పని. a man of that * అటువంటి మనిషి.
Stample n s a hook, or loop of iron యినుపకొక్కి, వంకె, మొళ నాగవాసము. he hung the door upon *s ఆ తలుపును మొళలలో తగిలించినాడు. principal productions ప్రధానమైనది, ముఖ్యమైనది, ప్రధానద్రవ్యము. in this market cotton and silk are the *s యిక్కడ పత్తి పట్టు ప్రధానమైన సరుకులు, ముఖ్యమైన సరుకులు. fineness, goodness నాణ్యము. thisthread is short in * యీ నూలుకు నాణ్యము తక్కువ. this cotton is good in the * but it is not strong యీ పత్తిని పంజితేదారాలు దారాలుగా బాగా సాగుతున్నదిగాని గట్టిలేదు. the length of the * పత్తి పట్టుకంబళి వీటి పీచు యొక్క నిడివి. Jermy Taylorp. 268. can we measure it by weight an measure of the * ?ఎత్తు పొడుగు వీటినిపట్టి దాని ప్రమాణమును నిర్ణయించగలమా.
Stanch ,or Staunch adj బలిష్టమైన, దృఢమైన, స్థిరమైన, నమ్మతగ్గ,గంభీరమైన, పెద్దమనిషిగా వుండే.
Stanchion n s a prop; a support పోటు.
Stand n s నిలిచేస్థానము. a table with one leg వొంటికాలు మేజ.a frame or table on which vessels are placed గడమంచె. a * for pots యింగ్లీషువారు కుండలను వొకటి మీద వొకటిగా పెట్టేచట్టము. a * for flowers or flower * పుష్పములు పెట్టే పాత్ర.an ink * యింకీ బుడ్డి. he is at a * మానై నిలిచిపోయినాడు. when I read this I was at a * దీన్ని చదివియెటూ తోచక వుండినాను.he came to a * నిలిచిపోయినాడు, యేమిన్ని చేయలేకపోయినాడు. the work came to a * ఆ పని నిలిచిపోయినది. the troops retreatedto the wood where they made a * ఆ దండు తిప్పుకొని ఆ యడవికివచ్చి అక్కడనే నిలిచి వుండినది. he took his * at the end ofthe street వీధి కొనను అట్టే నిలుచుండి వుండినాడు. 250 * of arms యీన్నూట యాభైమందికి కావలసిన ఆయుదములు. four * of colours నాలుగుజండాలు.
Standard n s an ensign ధ్వజము, కొడి, జండా. among the old Rajas the umbrella was the * పూర్వీకపు రాజులలో ఛత్రమురాజచిహ్నముగా వుండినది. he erected the * of rebellion తిరగబడ్డాడు, యెదిరించినాడు. a settled rate నిర్ణయము, నిష్కర్ష,ప్రమాణము, దిట్టము, మట్టు, కొలత. a test or criterion పరీక్ష.as model మచ్చు. the Amaram is the perpetual * of reference regarding Sanscrit words సంస్కృత శబ్ధములకు ప్రమాణముగా అమరోదాహరణమును పదేపదే చూచుకొంటారు. this gold is very goodbut it does not reach the * యిది మంచిబంగారేగాని నికరమైనదికాదు, మచ్చుకు నిలవలేదు. this piece of gold is the * యిదిమచ్చుకడ్డి.
Standard-baerer n s కొడిపట్టేవాడు, ధ్వజమును పట్టేవాడు,ధ్వజధరుడు.
Standing adj నిలకడగా వుండే, నిలవరముగా వుండే, స్థిరముగావుండే. * a crop or growing-corn కోతకోయని పైరు. * water గుంటగా నిలిచే నీళ్లు. a * order శాశ్వతముగా వుండే శాసనము.a * dish నిత్యటి ఆహారము. a * army యెన్నటికీ వుండే దండు.
Standish n s a case for pen and ink కలందాను.
Stanza n s పద్యము, శ్లోకము.
Staple adj settled వాడుకగా వుండే. * commodities వాడుక సరుకులు,ముఖ్యమైన సరుకులు. this is a * topic among them వాండ్లకునిత్యము యిదే ప్రస్తావము యిదే మాట.
Stapler n s వర్తకుడు, అనగా కంబళ్ళ వర్తకుడు. a * wool* కంబళిబొచు అమ్మే వర్తకుడు.
Star n s చుక్క, నక్షత్రము. the * in the forhead తిలకము,బొట్టు. she is the * of her sex అది స్త్రీ తిలకము. or asterisk* యిటువంటి పువ్వు. * of Bethlehm ఇది వొక పుష్పము పేరు. my *s !అయ్యో కర్మమా.
Starboard n s the right hand side of the ship, as larboardis the left వాడ కుడి తట్టు.
Starch n s చిక్కని గంజి.
Starchamber n s లండనులో పూర్వకాలమందు గుప్తముగా వుండే వొక న్యాయసభ యిది రాజు వల్ల యేర్పరచబడి అతిరహస్యముగా వుండుకొనియెటువంటి వ్యవహారమునున్ను రెండు మాటలుగా అడిగి తీర్పుచేసే అతి క్రూరమైనపంచాయతీ సభ.
Starched adj stiff బిరుసుగా వుండే, గంజిపెట్టిన.
Stare n s a look, a gaze రెప్ప వేయకుండా చూడడము.the bird called a starling పక్షి విశేషము.
Stargazer n s a word of scorn for an astronomer జ్యోతిష్కుడు,ఇది యెగతాళిమాట.
Starggling adj scattered చెదిరినట్టుగావుండే a few * dropsof rain కొన్ని పొడిచినుకులు. a few * branches of the treeయిటూ అటూ పొయ్యే కొన్ని కొమ్మలు. a large * shrub వెలితిగ‍ండేపెద్దపొద.
Staring adj పెద్దకండ్లుచేసే, తేరిచూచే, ప్రత్యక్షమైన. the * owlఎగాదిగా చూచే గుడ్ల గూబ. this is a * error యిది ప్రత్యక్షమైనతప్పు. this picture is a * likeness of him యిది తద్వత్తుగావాడివలెనే వుండే పటము. a * doll తేరిచూచే బొమ్మ. with this *you in the face యిది నీకు ప్రత్యక్షముగా వుండగా. with hell *him in the face నరకము ప్రత్యక్షముగా వుండిన్ని. stark * madపచ్చివెర్రి.
Stark adj utter, total శుద్ధ, ఉత్త. * naked శుద్ధదిసమొలగావుండే. * dead శుద్ధముగా, చచ్చిన, బొత్తిగా చచ్చిన. you are *wrong నీవు శుద్ధముగా తప్పినావు. a * falsehood పచ్చి అబద్ధము.* nonsense వట్టి పచ్చి. these are * naught యివి శుద్ధముగా పనికిరావు.
Starless adj utterly dark శుద్ధచీకటిగా వుండే. a * nightచంద్రుడు లేని రాత్రి.
Starlight adj నక్షత్ర కాంతిగల.
Starling n s a bird పెడిసె పిట్టవంటి వొక పక్షి.
Star-lit adj తారకితమైన, నక్షత్రమయముగా వుండే, నక్షత్రకాంతిగల.
Starpaved adj తారకితమైన, నక్షత్రమయముగా వుండే.
Starred adj చుక్కలుగల, నక్షత్రమయమైన. ill *, unfortunateదౌర్భాగ్యుడైన. evil * దౌర్భాగ్యమైన. as a pane of glass బీటికలు బాసిన. Starry, adj. నక్షత్రములుగల, తారకితమైన. the * heavens నక్షత్రమయముగా వుండే ఆకాశము.
Start n s the begining of running పరుగెత్త నారంభించడము.they got the * of him వాణ్ని ముందు మించిపోయినారు. of pain orfear ఉలికిపాటు, అదురుపాటు.
Startel n s shock, sudden impression of terror ఉలికిపడడము,బెదురు.
Startingpost n s పందెపు గుర్రములు పరుగెత్త మొదలుపెట్టేచోటు.
Startled adj ఉలికిపడ్డ, బెదిరిన. he was * at seeing thisఉలిక్కిపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు.
Startling p|| surprising,remarkable,wonderfulఆశ్చర్యకరమైన,వింతైన,విపరీతమైన
Starvation n s పస్తు, పస్తుతో చావడము. they were in a stateof * కూటికి లేక చస్తూ వుండినారు.
Starved adj ఆకలితోచచ్చిన. the child looks * కూటికి చచ్చేబిడ్డవలె వున్నది.
Starveling n s కూటికిచచ్చేవాడు, అన్నానికిలేని వాడు, శుష్కదరిద్రుడు,అన్నములేక శుష్కించిన వాడు.
Starving n s hunger ఆకలి, క్షుత్తు.
State n s " condition స్థితి, గతి, ఉనికి. a * of life దశ, అవస్థ. have been in this * these two years రెండేండ్లుకా యిట్లా వున్నాను.the * of being a servant దాసత్వము, భృత్యత్వము. the * of beinga wife పత్నీత్వము. do you know his present * of health? వాడి దేహము యిప్పుడే యే స్థితిలో వున్నది. in what * is it now? అది యిప్పుడుయేగతిగా వున్నది. he is now brought to this * వాడి పని యీ కాడికివచ్చినది. a country రాజ్యము, దేశము. Church and * వైధికులు, లౌకికులు,పాదుర్లు కడమవాండ్లున్ను. he had many friends both in church and * వాడికి లౌకికులు లౌకికులు వైదికులు బహుమంది విహితముగా వుండినారు. theexecution of Louis XVI. was a Louis question of * nor of lawఆ రాజును చంపడము రాజకార్యమును పట్టినదే కాని ధర్మశాస్త్రమును పట్టినది కాదు. to lie in * శృంగారించి పండబెట్టి వుండుట. the royal corpse lay in * for four days రాజు యొక్క శవమును నాలుగు దినములు శృంగారించిపండబెట్టి వుండినది. the united *s అనగా America."
Stated adj చెప్పిన, నిర్ణయించిన, నియమించిన. at * timesనిర్ణయించబడ్డ ఆయా కాలములయందు. for a * period నిర్ణయించబడ్డగడువువరకు.
Statedly adv regularly; not occasionlly క్రమముగా, నియతముగా.
Stateliness n s grandeur, pomp డంబము, గంభీరము, జంభము.upon this she assumed a * behaviour అందుమీద అది గంభీరడుగావుండినది.
Stately adj grand, noble జంభమైన, గంభీరమైన.
Statement n s చెప్పినమాట, వాజ్ఞ్మూలము, వివరము, వివరణము. his * proved true వాడు చెప్పినమాట నిజమైనది. what is the good of this * without proof? సాక్ష్యము లేకుండా చెప్పే యీ మాటలవల్లయేమి ప్రయోజనము.
Stateroom n s a magnificent room పటశాల, కూటము.
Statesman n s one who is employed in Government ప్రబుద్ధుడు,అధికారి, ప్రముఖుడు. Confucius is acknowledged to be their great * వాడు వారిలో ప్రముఖుడుగా వుండెను.
Statesmanlike adj prudent, wise ప్రబుద్ధుడైన, ప్రౌఢమైన, తెలివియైన.
Station n s a place స్థానము. in the out *s బైటి దేశములలోa private *, that is privacy దివాణపు సంబందము లేకుండా వుండే స్థితి.an office ఉద్యోగము, ధర్మము, వృత్తి. he is in a public * దివాణపు కొట్టులో వున్నాడు. an exalted * గొప్పస్థితి. a watch house or * house పోలీసు, ఠాణా, చౌకి, చావడి. he took up his * at the end of the street వీధికొననే నిలుచుండి వుండినాడు.
Stationary adj fixed, not moving స్థిరముగా వుండే, నిలవరముగా,స్థావరముగా వుండే, నిలకడగా వుండే. his diseases is * ఆ రోగమువొకటే స్థితిగా వున్నది. the sun is * in cancer దక్షిణాయణ కాలమందు వొకటి రెండు దినాలు సూర్యుడు నిలకడగా వుంటాడు.
Stationed adj fixed, placed ఉంచిన, పెట్టిన. they were * at his bed side వాడి మంచము ప్రక్కన వుంచబడ్డారు.
Stationer n s a sellor of paper కాకితాలు, పేనాలు,పెన్సలులు, శాయి అమ్మేవాడు.
Statist n s politician రాజ్యకార్యవేత్తగా వుండే వాడు.
Statistical adj political ప్రజలను గురించిన, లోకులను గురించిన.
Statisticks n s a collection of facts respecting the stateof the people ప్రజల స్థితిని గురించిన వృత్తాంతము.
Statuary n s images విగ్రహములు, బొమ్మలు, ప్రతిమలు. the art of * శిల్పశాస్త్రము. a man who makes figures, a carver శిల్పి.
Statue n s an image విగ్రహము, ప్రతిమ, బొమ్మ.
Stature n s height, ఎత్తు, పొడుగు. women are not equalto men in * పొడుగులో స్త్రీలు పురుషులకంటె తక్కువగా వుంటారు.
Statutee n s చట్టము, శాసనము.
Staunch, or Stanch adj బలిష్టమైన, ధృడమైన, స్థిరమైన, నమ్మతగ్గ,గంభీరమైన, పెద్ద మనిషిగా వుండే.
Staved adj broken బద్దలైన, వక్కలైన, తునియలైన.
Staves n s the plural of staff కర్రలు, కోరలు. the * of caskపిపాయి పలకలు. long * or stories పెంచి చెప్పిన కథలు.
Stay n s నిలవడము, ఉండడము, ఉనికి. my * there enabled meto see him నేను అక్కడ వుండినందున వాణ్ని చూడడము సంభవించినది.during my * in the town నేను పట్టణములో వుండేటప్పుడు. without stop or * నిరాటంకముగా. he is the main * of the family ఆకుటుంబానికి వాడు ఆధారముగా వున్నాడు. a woman's *s లోగా బద్దలుపెట్టి కుట్టి స్త్రీల నడుముకు బిగువుగా కట్టుకొనే వొక విధమైన రవిక.* lace వొక విధమైన తాడు. the * or *s of a ship వాడ స్థంభానికిఆధారముగా ముందరితట్టుకు యీడ్చి కట్టియుండే పగ్గము.
Stayed adj See Staid.
Steadfast adj firm, fixed, స్థిరమైన, ధృఢమైన, నిలకడగా వుండే.he is my * friend వాడు స్థిరమైన స్నేహితుడు.
Steadfastly adv స్థిరముగా, దృఢముగా, నిలకడగా. Steadfastness, n. s. నిలకడ, నిశ్చయము, దార్ఢ్యము.
Steadily adv నిలకడగా, స్థిరముగా, నిశ్చయముగా.
Steadiness n s నిలకడ, ధైర్యము, దార్ఢ్యము, నిబ్బరము.
Steady adj స్థిరమైన, నిలకడైన, ధృడమైన, దిట్టమైన. a * servent నిలకడగా వుండే పనివాడు. the horse went on with * a pace ఆ గుర్రము నిబ్బరముగా నడిచెను. the trade is very *వర్తకము నిర్వ్యత్యాసముగా జరుగుతున్నది.
Steak n s a slice మాంసఖండము.
Stealer n s దొంగ. life * ప్రాణాపహరి. heart * మనోహరి.a sheep * గొర్రెముచ్చు. a horse-stealer గుర్రాల దొంగ.
Stealing n s దొంగతనము, ముచ్చుతనము.
Stealingly adv రహస్యముగా.
Stealth n s. దొంగతనము, ముచ్చుతనము. they came by * దొంగతనముగా వచ్చినారు, రెండో మనిషికి తెలియకుండా వచ్చినారు.he eyed her by * దాన్ని దొంగతనముగా చూచినాడు.
Stealthily adv దొంగతనముగా. age comes * upon us నిమిషములోయేండ్లైపోతవి.
Stealthy adj దొంగ, తెలియకుండావచ్చే. the * pace of a cat పిల్లి యొక్క దొంగనడుపు. the * approaches of old age తెలియకుండావచ్చే ముదిమి. * glance దొంగచూపులు.
Steam n s ఆవి, ఆవిరి. flour boiled by * ఉప్పినపిండి,పిట్టు. cakes boiled in * వాశనకుడుములు, ఇడ్డేన. a * shipపొగవాడ. a * carriage పొగబండి. a * engine పొగవల్లఆడే యంత్రము.
Steamer n s పొగవాడ.
Steed n s అశ్వము, గుర్రము, ఇది కావ్య శబ్దము.
Steel n s ఉక్కు. a * for striking fire చెకముకి రాయినితట్టే వుక్కుబిళ్ల. flint and * రాయిన్ని యినుమున్ను. a swordఖడ్గము. a butcher's * కటికవాని ఆకురాయి. medicine so calledఇనుపతుప్పుతో చేశే వొక ద్రావకము.
Steeled adj రాయిగా వుండే, నిర్దయాత్మకమైన, అతిక్రూరమైన. when a man's heart is * against conviction మనసు రాయి అయిపోయనప్పుడు.
Steely adj made of steel ఉక్కుమయమైన, ఉక్కుతోచేసిన. hard; firmధృడమైన, గట్టి. * particles ఉక్కుపొడి.
Steelyard n s తూనికెకోల, అనగా వొక పక్కన నీరుకు పెట్టి గుండ్లులేకుండా దండెకు వేసి యుండే తాటిని ఆయా గీతలమీద జరపడము వల్ల వొక వీశ అర వీశ అయ్యే తూనికెకోల.
Steep adj ఒరకాటముగా వుండే, నెట్రముగా వుండే. this hill is *you cannot go up it on horseback యీ కొండ నెట్రముగాఉండేటందువల్ల నీవు గుర్రమెక్కి పైకిపోలేవు. a * descent దిగడానకు నెట్రముగా వుండే స్తలము.
Steeped adj నానిన, నానబెట్టిన. * in blood నెత్తురుతో తడిసిన,నెత్తురు మయముగా వుండే. he is * in misery వాడు సంకటములో మునీగియున్నాడు.
Steeple n s ఖ్రీస్తుగుడి గోపురము. as tall as a * తాటి చెట్టువలె పొడుగ్గావుండే. a * chase గోపుర పందెము, అనగా పది యిరవైకోసుల దూరముగావుండే వొక గోపురమును గురి పెట్టుకొని యెవడుముందర ఆ గోపురము వద్దికి పోతాడో వాడిది గెలుపు అని వేసుకొనే పందెము.
Steepness n s ఒరకటము, నెట్రము. from the * of the hill కొండ నెట్రముగా వుండేటందువల్ల. Steer, n. s. a young bullock కోడె.
Steeragem n s the act or practice of steering వాడనునడిపించడము. the stern or hinder part of the ship వాడ యొక్క వెనకటి భాగము.
Steersman n s వాడనడిపించేవాఢు, పీలికాడు, నావికుడు, పోతవహుడు,చుక్కాణితిప్పేవాడు, మాలిమి.
Stellar adj relating to the stars నక్షత్ర సంబంధమైన.
Stem n s the stalk కాడ, కాండము. the * of a plantaintree అరిటి స్థంభము. or twig మండ, కొమ్మ, మట్ట. race; gerneration వంశము. the forepart of a ship వాడ యొక్క ముందరిభాగము from * to stern యావత్తు, కడవెళ్ళా.
Stench n s a stink కంపు, దుర్గందము, గబ్బు.
Stencilling n s painting, colouring on a wall పూయడము.an operartion performed by cutting a name or pattern in apiece of tin, and rubbing a brush with paint on it.
Stengthless adj నిస్సారమైన, బలహీనమైన, దుర్బలమైన, నిస్త్రాణగా వుండే.
Stenography n s the art of writing in shorthand సాంకేతిక లిపి.
Stentor n s రాక్షసుడివలె అరిచనాడన్న వొక మనిషి పేరు. a stentorian voice మహత్తైన అరుపు, బ్రహ్మాండమైన గోంతు.
Step n s అడుగు. they tread in his *s వాడు పోయినదోవనేవాండ్లు పోతారు, అనగా వాడు యెట్లా చేసినాడో అట్లాగే వీండ్లున్ను చేస్తారు.progress in affairs అభివృద్ధి. this dictionary is one * in teaching English ఇంగ్లీషు నేర్చుకోవడమనకు యీ నిఘంటు వొక మెట్టుగా వున్నది. yesterday he could not eat at all, to-dayhe has eaten a little, this is one * in recovery నిన్న వాడుశుద్ధముగా తినలేక వుండినాడు నేడు కోంచెము తిన్నాడు స్వస్థము కావడమునకుయిది వొక మెట్టు. last month he could not read at all; he hasnow learned his letters, this is one * పోయిన నెలలో సుద్ధముగాచదవలేకుండా వుండినాడు యిప్పుడు అక్షరాలు నేర్చుకొన్నాడు, యిది వొక మెట్టు.last year he was a gambler, now he is a drunkard; this is another * towards ruin పోయిన సంవత్సరము జూదరిగా వుండినాడు యిప్పుడు తాగుబోతున్ను అయినాడు చెడిపోవడానకు యిది మరిన్ని వొక దోవ. a stair మెట్టు, పడిగట్టు. one * in a ladder నిచ్చెనమెట్టు. awell with *s down into it నడబావి, దిగుడు బావి. in genealogy పురుషాంతరము. step by step అడుగుమీద అడుగుగా, క్రమేణ. he bent his *s towards the town పట్టణమునకై వెళ్ళినాడు. a * fatherరెండో తండ్రి, అనగా తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని పెండ్లాడినవాడు.a * mother చవితితల్లి. a * son చవితి కొడుకు, మొదట పెండ్లాడి చనిపోయిన వాడికి పుట్టిన కొడుకు, రెండోమాటు పెండ్లాడిన మొగుడియొక్కమొదటి పెండ్లానికి పుట్టిన కొడుకు.
Stepping board n s కాలవ, మొదలైన వాటికి అడ్డముగావేసి పైన నడిచే పలక.
Stepping stone n s stone laid to catch the foot and saveit from wet or dirt బురదనీళ్ళు కాలికి తగలకుండా నడవడమునకైయేరు మొదలైన వాటిలో వేశి యుండే రాళ్ళు.
Stercoraceous adj మలసంబందమైన, పీతి.
Stereotype n s అప్పటప్పటికి తీయకుండా బిగించి యుండే అచ్చు అక్షరములు.
Stereotyped adj అటువంటి అచ్చు అక్షరములతో అచ్చువేయబడ్డ.metaphorically స్థిరమైన, నిత్యమైన, అచంచలమైన.
Steril adj barren గొడ్డైన, ఫలించని. a * cow గొడ్డావు. * landఫలించని భూమి. a * year పంటపండని సంవత్సరము.
Sterility n s నిస్సంతతి, సంతాన విహీనత. by the * of the land ఆ నేల పండేటిది కాదు గనక.
Sterling adj real స్వచ్ఛమైన, శ్రేష్టమైన, అచ్చమైన, చలామణిఅయ్యే. * wit మంచి చమత్కారము. * gold అచ్చ బంగారు. * silverమంచి వెండి. this is * praise యిది మంచి స్తుతి. a man of *worth ప్రామాణికుడు, పెద్దమనిషి. a pound * రొక్కముగా చెల్లించిన పది రూపాయీలు. this bill was worth ten pounds * యీ హుండికి రొక్కముగా నూరు రూపాయిలు వచ్చును.
Stern adj cruel, severe క్రూరమైన. he looked very * నిండాక్రూరముగా చూచినాడు. * chastity వీరపతివ్రతాత్వము.
Sternly adv క్రూరముగా.
Sternness n s క్రూరత్వము.
Sternum n s the breast-bone రొమ్ము యెముక.
Stew n s meat prepared by boiling నిప్పున వెచ్చచేసిన ఆహారము.he was in a * నిండా దిగులు పడ్డాడు. a bagnio లజ్జలు వుండేయిల్లు, గుడిసెవేట్లు వుండే యిల్లు. they haunt the *s లంజల యిండ్లవద్ద తారాడుతూ వున్నారు.
Steward n s one who manage the affiars of another కార్యకర్త,ఉగ్రాణపువాడు. In 1. Cor IV. 1. భాండాగారాధిపతి. A+.
Stewardess n s ఉగ్రాణకర్తగా వుండే ఆమె.
Stewardship n s ఉగ్రాణ కర్తృత్వము, ఉగ్రాణాధిపత్యము.
Stewpan n s వేపుడుచట్టి.
Stick n s కర్ర, కోల, కొయ్య, కట్టె, బడితె, దండము. a walking* ఊతకోల. a thick * దుడ్డుకర్ర. a * of turmeric పసుపుకొమ్ము. the*s of a fan విసనకర్రలో వేసికట్టి వుండే బద్దలు, పుడకలు. a bitof * or a little * or wand పుడక, పుల్ల. *s for fuel కట్టెపుడకలు,చిదుగులు. a * of sealing wax లక్కకడ్డి, లక్కపుల్ల. a churning *కవ్వము. this is a mere * of a horse యిది శుద్ధముగా పనికిరాని గుర్రము.
Stickiness n s జిగట, బంక. from the * of wax మైనము జిగటగావుండేటందువల్ల.
Stickler n s he who contends పోరాడేవాడు. a * for rank నీవు గొప్పా నేను గొప్పా అని పోరాడేవాడు.
Sticky adj బంకగా వుండే, జిగటగా వుండే. gum is * బంక జిగటగావుంటున్నది. boiled rice is * అన్నము చేతికి అంటుకొంటున్నది.
Stiff adj బిరుసుగా వుండే. a cloth smeared with starch anddried is * గంజి వేసిన గుడ్డ బిర్రుగా వుంటున్నది. the bristles ofthe hog are * పంది వెంట్రుకలు బిరుసుగా వుంటవి. the child writesa * hand ఆ పిల్లకాయ కొతికి కొతికి వ్రాస్తున్నాడు. a * gale నిండా బలమైన గాలి. the earth is very * here యిక్కడ భూమి రాయివలె వున్నది. he dired the pots until they were * and then he burned them ఆ పచ్చికుండలు గట్టిపడే దాకా యెండలో పెట్టి అవతల కాల్చినాడు. a corpse soon grows * పీనుగ రవంత సేపులో నిలుక్కొనిపోతున్నది. I am quite * with cold చలిచేత నా చేతులు కాళ్ళు తిమురుగా వున్నవి. a * card వంచ కూడక బిర్రుగా వుండే కాకితపు అట్ట.the dried tiger skin is very * యెండిన పులి తోలు వంచితే వంగకుండా బిరుసుగా వుంటున్నది. or pertinacious పెడసరమైన,మూర్ఖమైన, ముష్కరమైన. he is so * that I suppose he is angryవాడు బిర్రబిగుసుకొని వుండేటందువల్ల కోపముగా వుండేటట్టు వున్నది. thefather is very easy but the son is very * తండ్రి నిండా సులభుడేగాని కొడుకు నిండా మూర్ఖుడు.
Stiff-hearted, or striffnecked adj తల కొవ్విన, తల బిరుసుగావుండే, ముష్కరమైన.
Stiffled adj ఊపిరి తిరగక చచ్చిన, ఉడ్డుకుడుచుకొని చచ్చిన, ఊపిరిబిగబట్టి చంపబడ్డ. I am quite * అయ్యో నాకు ఊపిరి తిరగలేదు. * sobsతెలిసీ తెలియకుండా విడిచే నిట్టూర్పులు.
Stiffly adv బిర్రుగా, బిగవుగా, గట్టిగా, వంగకుండా.
Stiffness n s బిగువు, బిర్రు, పెడసరము. * of mannersమూర్ఖ్వభావము, పెడసరము. from the * of this poet's styleఆ కవిది కఠిన పాకమైనందున.
Stigma n s a mark of infamy అపవాదము, నింద, కళంకము,ఒచ్చెము. they fixed the of theft on him దోంగతనమనే అపవాదమునువానికి కట్టిపెట్టినారు. they labour under the * of murder హత్యచేసినవాండ్లు అనే అపదూరు వాండ్లకు వచ్చి యున్నది.
Stiletto n s కటారి, భాకు. in women's cant కుట్టుపోగు.
Still adj silent నిశ్శబ్దముగా వుండే. * water కదలకుండా వుండే నీళ్లు. the sea is now * సముద్రము యిప్పుడు నిద్ర పోతున్నది. in the forest నిశ్శబ్దముగా వుండే అడవిలో. a * small voice హీనస్వరము. he stood stock * మానుపడ్డాడు.
Still-born adj చచ్చిపుట్టిన, కడుపులో చచ్చి బైట యీడ్చివేసిన. a * child చావుబిడ్డ. the book was పుట్టీ పుట్టనట్టుగా వుండే పుస్తకముగా వున్నది. నిరర్థకమైణ పుస్తకముగా వున్నది.
Stille n s a set of steps to pass from one enclosure toanother ఎక్కి దిగే మెట్లు, చేలల్లోకి పశువులు పోవడమునకు వల్ల కాకుండా మనుష్యులు మాత్రము పోవడమునకై పెట్టియుండే మెట్లు.
Stillness n S నిశ్శబ్దము, మౌనము, ఉపశమనము, శాంతి, కదలకుండా వుండడము, రెక్కుముక్కు ఆడకుండా వుండడము. from the * of the dayనేడు గాలి ఆడుచుకొని వుండేటందువల్ల.
Stilly adj calm నిశ్శబ్దమైన.
Stilts n s మరగాళ్ళు. poetry raised on stilts బూటకమైనకావ్యము. the stilt of a plough మేడిసోగ.
Stimulant adj ప్రేరేపకమైన, ఉత్తేజకమైన, దీపన, కారియైన,కారమైన.
Stimulants n s ప్రేరేపకము, ఉత్తేజకము, దీపనకారి, కారమైన వస్తువు. pepper, chilly and other * మిరియాలు, మిరపకాయలు మొదలైనకాషముగల వస్తువులు. in medicine these are called త్రికటు.
Stimulating adj ప్రోత్సాహకమైన, ప్రేరేపకమైణ, ఉత్తేజకమైన, రేచే,ఉశికొలిపే, ఉద్దపకమైన, దీపన కారియైన.
Stimulus n s ప్రేరేపకము. the hope of gain is a powerful* to exertion ఆశ అనేది అన్ని పాట్లను పడమంటున్నది.
Sting n s కొండి. remorese of conscience మనోవ్యాధి, మనోవ్యధ. this thought is a continual * యిది మనసులో గాలముగా వుంటున్నది.the * of death is sin మృత్యోఃకంటకం పాపం A+. the * of an epigram వొక పద్యములో స్వారస్యముగా వుండేమాట.
Stingily adv లోభత్వముగా. he treated his servants * వాడుపనివాండ్ల విషయములో పట్టి చూస్తాడు.
Stinginess n s లోభత్వము, పిసినారితనము.
Stinging adj కుట్టే, సలిపే, ఆయాసకరమైన. the * nettle నిండా చురుకైన, దురదగొండి. a * pain సలుపు, నొప్పి. * insects కుట్టేపురుగులు.
Stingless adj కొండిలేని. a * epigram రసములేని పద్యము.
Stingy adj లోభియైన, బంకగా వుండే, పిసినారియైన. perverse, rigidకఠినమైన, క్రూరమైన.
Stink n s కంపు, దుర్గందము, గబ్బు.
Stinkard, or polecat n s. ఆళ్లకోస, వరడునక్క, గంధిలము,మహత్తైన, కంపుకొట్టే వొకమృగము.
Stinking adj కంపుకొట్టే, దుర్గంధమైణ.
Stint n s limit పొలిమేర, మట్టు. proportion ప్రమాణము, కొలత.
Stinted adj మట్టైన, మితమైన, చాలని. * food చాలీచాలక పెట్టినఅన్నము. a child of * growth పెరగకుండా వుండే బిడ్డ.
Stipend n s wages; settled pay జీతము.
Stipendiary adj జీతము తీసుకొనే, జీతగాడైన.
Stipulation n s ఏర్పాటు, ఒడంబడిక.
Stir n s tumult; bustle అల్లరి, సందడి, కలత. they madea great * about this యిందున గురించి నిండా అల్లరి చేసినాడు.
Stirabout n s అంబలి, గంజి.
Stirred adj moved, agitated కదిలిన, మెదిలిన, కలపబడ్డ,రేచబడ్డ. he was much * about this యిందున గురించి నిండారేగినాడు, ఆయాసపడ్డడు.
Stirring adj active, moving పాఠుపడే, కలతగా వుండే, రేగే. she is a * woman అది నిండా పనిమంతురాలు. these are * times యిది కలతగావుండే కాలము. when I arrived, not a soul was * నేను వచ్చి చేరేటప్పటికిమాటుమణిగి వుండినది. the Canarese are a * race కన్నడివాండ్లు నిండా పాటుపడే మనుష్యులు, వోళ్ళు దాచేవాండ్లు కారు. heart * news దుఃఖ సమాచారము,సంతోష సమాచారము.
Stirrup n s అంకె, రికాబు, (అంగుపడి Tamil). as soon as hewas in the *s వాడు గుర్రమెక్కగానే.
Stitch n s కుట్టు. a * in the side ఊపిరి కుట్టు. he put a few*es keep the cloth together ఆ గుడ్డను జతచేసి కొన్ని కుట్లు వేసినాడు,కొన్నిటాకాలు వేసినాడు. he had not a * of clothes on వాడికి కట్టుకొనేటందుకు వొక పేలికైనా లేదు.
Stithy n s an anvil దాగిలి.
Stiver n s దుడ్డు, పైసా, కాసు.
Stoat n s ఒక విధమైన అడవి పిల్లి. A sort of Ermine or Weasel,about the size of a large rat.
Stoccade n s an enclosure or fence made with pointed stakesఅలవ, శత్రువులకు అడ్డముగా కట్టుకొన్న గ్రాది.
Stock n s the trunk చెట్టు యొక్క అడుగు, మోద్దు, మోడు. those of the royal * రాజవంశీకులు. in speaking a foreign languagewe first require a * of words అన్యభాషను మాట్లాడే వాడికి నిండామాటలు వచ్చి వుండవలెను. *s and stones రాయిరప్ప. old * on hand నిలవగా వుండే సరుకు. he is now selling his new * కొత్తగా వచ్చిన సరకును అమ్ముతున్నాడు. the * of rice at present is but smallయిప్పుడు నిలవగా వుండే బియ్యము కొంచెముగా వున్నది. the principal బండాలము, మూలధనము, ఆస్తి. farm * or live * and dead * కాపవానికి వుండే ధనమేమంటే గొడ్లు, అరకలు మోదలైనవి. ten head of live * పదిగొడ్లు. government * దివాణములో పెట్టి వుండే రూకలు. the * of a gunతుపాకికట్టె. they made him their laughing * వాణ్ని యెగతాళీ పట్టించినారు. he became a laughing * నవ్వులకు పాత్రుడైనాడు. a scolding* తిట్లమారి. * (in cooks cant) means నెయ్యి, ఘృతము. the *s (plural,as meaning government money) దివాణములో పెట్టివుండే రూకలు. the stocksfor prisoners బొండకొయ్య. they put him in the *s వాణ్ని బొండకొయ్యలోవేసినారు. To Stock, v. a. to furnish to store; to fill sufficiently సమృద్ధిచేసుట, నించుట. I have bought farm but I have not *ed it భూమిని కొన్నాను గాని దానికి కావలసిన గొడ్డుగోద జాగ్రత్త చేయలేదు. I have *edmy library నిండా పుస్తకాలుయ చేర్చినాను, సంపాదించినాను. he *ed his stables నిండా గుర్రాలను సంపాదించినాడు.
Stockade n s గడి, అనగా యుద్ధకాలమందు శత్రువులకు అడ్డముగాకట్టిన వెదురుబొంగులు, మన్ను తోటి కట్టినిదీన్ని, శత్రువులకు అడ్డముగాకట్టుకోన్న ఆవరణము.
Stockbroker n s one who deals in stock, or the publick fundsకుంపినీ పత్రాల తరగరి.
Stockdove n s ఒక విధమైన పావురాయి.
Stocked adj provided నిండిన, నించబడ్డ, సంపూర్ణమైన. hisgarden is well * with fruit trees వాడి తోటలో నిండా ఫలవృక్షములలు వున్నవి. he is well * with clothes వాడికి నీండా బట్టలు వున్నవి. వాడికి నిండా దాపుడు బట్టలు వున్ణవి. you are well * with excuses నీవద్ద కావలసినన్ని సాకులు వున్నవి.
Stockfish n s dried fish ఎండవేసి పెట్టుకొని వుండే చేపలు.
Stockholder n s దివాణపు పత్రాలు పెట్టుకొని వుండేవాడు.
Stocking n s మేజోడు. a blue * or woman that pretends tolearning పండితురాలు, యిది యెగతాళిమాట. Stockjobber, n. s. a low wretch who gets money by buyingand selling shares in the funds కుంపనీ పత్రాల తరగరి.
Stockstill adv కదలమెదలకుండా. he stood * మానై నిలిచినాడు.
Stoic n s విరాగి, కామ క్రోధాధాలు లేని వాడు. he is a perfect* సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా యేది యెరగక స్థబ్ధుడుగా వుండేవాడు,సుఖమువస్తే సంతోషములేక దుఃఖమువస్తే యేడ్పు లేకుండా వుండేవాఢు.
Stoical adj వైరాగ్యముగల, సుఖదుఃఖంలను సమముగా యెంచే. he behaved with * indifference నిశ్చింతగా వుండినాడు, తొణకకుండామృగమువలె వుండినాడు.
Stoically adv వైరాగ్యముగా, నిశ్చింతభావముగా.
Stoicism n s వైరాగ్యము, సమభావము, నిశ్చింతభావము, ఇందునగురించిన కథ యేమంటే. An Irish labourer was last week at work with a waggon. on a rail road: by some unfortunate accident on of his hands was entirely cut off and fell on the road. He picked it up; and looking at it for a moment, exclamied, You are of no use to me now! and flungit into the river. He immediately fainted and fell Madr. Ath.27th June 1846: p. 307, Col. 6. 3d/4.
Stoker n s one who looks after the fire in a steam engine పొగ యంత్రపు నిప్పు చల్లారకుండా కాపాడేవాడు.
Stole n s a long vest ఓక విధమైన వుడుపు.
Stolen past participle of the Verb ToSteal దొంగిలించబడ్డ.* goods దొంగసొమ్ము. * glances దొంగచూపులు.
Stolid adj stupid, dull మందమైన, జడమైన, అవివేకమైన.
Stolidity n s జడత్వము, మందబుద్ధి, వివేకశూన్యత.
Stolidly adv జడత్వముగా, అవివేకముగా.
Stomach n s కడుపు, అనగా బొడ్డుకు మీదుగా వుండే భాగము. a *ache కడుపు నొప్పి. this wine turned his * యీ సారాయి తాగినందునవాడికి వాంతి అయినది. he ate this to stay his * ఆ వేళకుకడుపుకు దీన్ని వేసుకొన్నాడు. inclination ఇచ్ఛ, యిష్టము, మనసు. thisdisagreed with his * ఇది వాడి కడుపులో యిందలేదు. she has a verysmall * అది మితభోజిగా వున్నది. I see he has no * for the businessఆ పని వాడికి యిష్టములేదు సుమీ. It went against his * to pay the moneyఆ రూకలు చెల్లించడము వాడికి యిష్టములేదు, గిట్టలేదు.
Stomacher n s రవిక.
Stomachic adj జీర్ణకారియైన, ఆకలి పుట్టించే.
Stone n s రాయి, పాషాణము, శిల, కల్లు. he has a heart of *వాడి మనసు రాయి. lithographic * నాపరాయి. precious * రత్నము.testicle వృషణము, బీజాలు. the disease called the * అశ్మరి, మూత్రకృచ్ఛము, శిలామేహము. a certain weight తూనికలో వొక పడికట్టు.a * of wool పధ్నాలుగు పౌనుల గొర్రెబొచ్చు. a * of meat యెనిమిది పౌనుల మాంసము. * in a fruit ముట్టె. the * in a mango మామిడి ముట్టే.a tamarind * చింతగింజ. a hail * వడిగల్లు. a living * జీవరత్నము.corner * నిట్రాయి. stepping * కాలిలో నీళ్లు బురద తగలకుండా నడవడమునకై యేట్లో అడ్డముగా అక్కడక్కడ వేసి వుండే రాయి. he left no * unturned to effect this దీన్ని సాధించడమునకై వాడు చేయని ప్రయత్నములేదు.
Stoneblind n s శుద్ధగుడ్డి.
Stonechatter n s గుండుములుపుగాడు అనే పిట్ట.
Stonecutter n s కాశేవాడు, శిల్పి, శిలావిగ్రహములు చేసేవాడు.
Stonedead adj శుద్ధముగా చచ్చిన.
Stonedeaf n s పెనుచెవుడు.
Stonefruit n s ముట్టెగల పండు.
Stonehorse n s విత్తులు తియ్యని గుర్రము.
Stonemason n s కాశేవాడు, కొల్లెత్తువాడు.
Stonepit n s రాళ్లు తవ్వి యెత్తే బొంద.
Stonepitch n s చింతబందన.
Stoneware n s మరిగ.
Stonework n s రాతిపని.
Stoniness n s కఠినత్వము, క్రౌర్యము. from the * of the ground ఆ భూమి రాళ్ళమయముగా వుండేటందువల్ల. from the * of their heartsవాండ్లు క్రూరమనస్కులుగనక.
Stony adj రాతి, రాళ్ళమయమైన, క్రూరమైన, కఠినమైన. a * road రాళ్ళురప్ఫలుగా వుండే బాట. a * soil రాళ్ళమయముగా వుండేభూమి.a * heart రాతిమనసు.
Stood past tense of the verb ToStand
Stool n s ఆసనము, పీఠము. foot * పాదపీఠము. to go to * బైటికి పోవుట. శంకానివర్తికిపోవుట, కాలవకు పోవుట, మరుగు పెరటికిపోవుట. he had a bloody * వాడికి నెత్తురు ప్రవర్తి అయినది, నెత్తురుబంక పడ్డది. he had three *s వాడికి మూడు మాట్లు ప్రవర్తులైనవి.he went to * శంకానికివర్తికి పోయినాడు. * of repentance (Johnson)శిక్ష, అనగా గాడిదెమీద పెట్టి వూరేగించినట్టు రంకును గురించి చేసే శిక్ష.he was then on the * of repentance అప్పుడు వాడికి చీవాట్లు పెట్టుతూవుండినారు.
Stoop n s వంపు. a man who has a * in the shouldersనడుమువంగినవాడు. a cup చెంబు.
Stooping presentpart వంగిన, నమ్రమైన.
Stop n s a pause నిలుపు. without * or stay నిరాంటంకముగా,వూరికె. they put a * to the business ఆ పనిని నిలిపినారు. the business came to a sudden * వుండేటట్టుగా వుండి ఆ పని నిలిచిపోయినది.a mark in printing గీటు. *s in a musical instrument వీణెమెట్లు.the *s of a flute పిల్లంగోవిలో వుండే రంద్రములు. they put a * tothe sale అమ్మవద్దని నిలిపినారు, అమ్మనియ్యకుండా చేసినారు.
Stopcock n s a pipe made to let out liquor పిపాయి మొదలైన వాటికి పెట్టివుండేగిండి.
Stoppage n s నిలపడము, అడుచుకోవడము, అడ్డపడడము. * of payజీతము చెల్లించకుండా నిలపడము, జీతమును పట్టటడము. * of breathవూపిరిపట్టుకోవడము. * of urine నీరుకట్టు.
Stopped adj నిలపబడ్డ, నిలిచిపోయిన, మూశివేయబడ్డ, అణచివేయబడ్డ.after the hole was * ఆ బొక్కను మూసివేసిన తర్వాత.
Stopper, Stopple n s. బిరడా.
Storax n s గుగ్గిలము.
Store n s plenty విస్తారము, సమృద్ధి. what * of books! ఓయబ్బాయెన్ని పుస్తకాలు. * of ladies (Milton) బహుమంది స్త్రీలు. stock చేర్చిపెట్టినది. a warehouse ఉగ్రాణము. a shop అంగడి, దుకాణము. they did not set * by him అతణ్ని లక్ష్యపెట్టలేదు. he setsgreat * by this దీన్ని నిండా గొప్పగా విచారిస్తాడు. I have somethingin * for you నీకోసరము వొకటి పెట్టుకొన్నాను. what fate may have in * for him is uncertain వాణ్ని గురించి యేమి కాబోతున్నదో తెలియలేదు.he little dreamt what was in * for him వాణ్ని గురించి యేమి సంభవించబోతున్నదో వాడికి యెంతమాత్రము తెలియకుండా వుండినది.
Storehouse, Storeroom n s. ఉగ్రాణము.
Stores n s సామాను, కావలసిన ద్రవ్యము.
Storied adj adorned with picture పటములత అలంకరించబడ్డ,అంతస్తుగల. a two * house రెండు అంతస్తులుగల యిల్లు.
Stork n s ఒక విధమైన కొంగ, బకము, సారసపక్షి, గుడ్డి కొక్కిరాయి,రాబులుగు.
Storm n s గాలివాన, తుఫాను, పెద్దగాలి. a * of rage ప్రచండకోపము.a * of abuse అనేక తిట్లు. after the * of the town వూరును కొల్లబెట్టినతర్వాత. he took the town by * ఆ వూరును లగ్గలెక్కి పట్టుకొన్నాడు.
Storming adj ప్రచండమైన, అఘోరమైన. a * rage అతి ప్రచండమైన కోపము.
Stormy adj tempestuous గాలి కసురుగా వుండే, గాలిగా వుండే. * weather గాలి వానగా వుండే కాలము. passionate రేగిన, ఉగ్రమైన.
Story n s history, కథ, చరిత్రము, వృత్తాంతము. according to the * he dwelt there అక్కడ చచ్చినాడంటారు, అక్కడ దిగినాడట. chronical పురాణము. a flight of rooms అంతస్తు. In a house the first story is that which is reached by a staircase from the ground floor. (Hallam) pretext సాకు. faleshood అబద్ధము.to tell stories కథలు చెప్పుట, బొంకుట, అబద్ధాలాడుట. they are all in one * వాండ్లంతా వొకటేమాటగా వున్నారు.
Story teller n s కథలు చెప్పేవాడు, అబద్ధాలాడేవాడు.
Story telling n s అబద్ధాలాడడము.
Stoup n s a drinking vessel చెంబు.
Stout adj lusty or firm పుష్టిగా వుండే, గట్టి, ధృడమైన, బలమైన,లావాటి. a * person స్థూలకాయి. * paper నిండా దళముగా వుండే కాకితము. brave * blood ధైర్యముగల.
Stout-hearted adj ధైర్యముగల.
Stoutly adv lustily పుష్టిగా, స్తూలముగా. boldly ధైర్యముగా. obstinately మూర్ఖముగా.
Stoutness n s lustiness స్థౌల్యము, పుష్టి. valour ధైర్యము.obstinacy మూర్ఖము, కావరము.
Stove n s కుంపటి.
Stowage n s room for laying up ఉగ్రాణము, కొట్టు, గిడ్డంగి.
Straggler n s a wanderer తిరిగేవాడు, దేశదిమ్మరి, విచ్చలవిడిగాతిరిగేవాడు. the *s who follow an army దండుతో కూడా వచ్చేమూక. onewho forsakes his company విడిబడి తిరిగేవాడు, విడిబడి తిరిగేటిది.
Straight adj not crooked; right సరియైన, చక్కని, ఋజవైన. a * road రుజుమార్గము, తిరుగుళ్ళు లేకుండా వుండేదోవ. narrow; closeయిరుకుగా వుండే, యిరకాటముగా వుండే.
Straightforward adv and adj. చక్కగా, సరిగ్గా, ఋజువుగా. he is a * man వాడు పెద్దమనిషి, సరియైనవాడు. he went * సరిగాపోయినాడు.
Straightlaced adj పెడసరముగా వుండే, క్రూరమైన, మూర్ఖమైన.
Straightness n s rectitude ఆర్జవము, ఋజుత్వము, చక్కన.
Straightway, straightways adv తక్షణము, తోడుతోనే, సరిగ్గా,చక్కగా, సూటిగా.
Strained adj ఇలుకుబట్ఠిన, బెణికిన, వడగట్టిన, వస్త్రఘాళితముచేసిన,జల్లించిన. his arm is * వాడి చెయి బెణికినది. this is a * interpretaion యిది విపరీతార్థము.
Strainer n s వడికట్టేగుడ్డ, వస్త్రఘాళితము చేసేగుడ్డ, జల్లెడ.
Strait adj narrow, close ఇరుకుగా వుండే. the door was so * itwas difficult to pass గడపనిండా యిరుకుగా వుండినందున చొరబడడానకునిండా కష్టముగా వుండెను. * waistcoat నిండా బిగువుగా వుండే చొక్కాయ, వెర్రివాడికి చేతులు స్వాధీనముగా లేకుండా వుండే లాగున బిగుతుగా వుండే చొక్కాయ.
Strait, Straits n s. a narrow pass ఇరుకుగా వుండే దోవ. a narrowpassage in the sea సముద్రములో యిరుకుగా వుండే మార్గము. the *s of Gibraltar జీబ్రాల్టర్ దేశమువద్ద సముద్రంలో యిరుకుగా వుండే మార్గము. distress; difficulty శ్రమ, తొందర, యిబ్బంది.
Straited adj streaked చారలుగల.
Straitened adj distressed ఇబ్బందిగావుండే, సంకటముగావుండే.I am *ed for time నాకు సమయము లేక యిబ్బందిగా వున్నది.
Straitlaced adj పెడసరమైన, క్రూరమైన. a * woman అతి పతివ్రతగా వుండేటిది.
Straitly adv క్రూరముగా, పెడసరముగా, గట్టిగా, బిగుతుగా,బిగువుగా. he charged them * to tell no man రెండో మనిషితో చెప్పవద్దని వాండ్లకు గట్టిగా ఆజ్ఞాపించినాడు. he bound them * వాండ్లను బాగా బిగించికట్టినాడు.
Straitness n s distress ఇబ్బంది, సంకటము, తొందర. narrowness ఇరుకు, ఇరకటము. from the * of his circumstances వాడికి కష్టదశగా వున్నందువల్ల. from the * of the pass దారి నిండా కురచగా వున్నందున, ఇరకాటముగా వున్నందున.
Strake that is Struck, See To Strike.
Straked that is Streaked ,చారలుగల, ring * వలయాకారమైనచారలుగల.
Stramonium n s a certain plant, thorn apple ఉమ్మెత్తకాయ.
Strand n s of the sea సముద్రతీరము, చెల్లెలి కట్ట, కరవాక.of a cord పిరి. a rope of three *s ముప్పిరి దారము.
Stranded adj గట్టుతట్టిన. a * vessel గట్టుతట్టు చెడిపోయనవాడ.
Strange adj foreign పరదేశపు. * servants పరులయొక్క పనివాండ్లు.a * language పరభాష. a * country పరదేశము. wonderful వింతైన,అద్భుతమైన, విచిత్రమైన, చోద్యమైన. * news వింత సమాచారము. a * womanపరస్త్రీ. H+. వేశ్య D+. a * man, i. e. not her own husbandపరపురుషుడు.
Strangely adv వింతగా, అద్భుతముగా, చౌద్యముగా.
Strangeness n s వింత, విచీత్రము, అద్భుతము. from the * of hislanguage వాడు వింతగా మాట్లాడినాడు గనక. from the * of this storyయిది వింత కథ గనక. form the * of his dress వాడిది వికారమైనవుడుపు గనక.
Stranger n s a foreigner పరదేశస్థుడు, విదేశస్థుడు, అన్యుడు, పరుడు.a man not known కొత్తవాడు, గుర్తెరగనివాడు, అపరిచితుడు. I know him well, but his relations are *s to me నేను వాణ్ని బాగా యెరుగుదును గానివాడి వాండ్లను యెరుగను. he and I are *s వాడికీ నాకు పరిచయములేదు. I am a * to their counsels వాండ్ల ఆలోచన నాకు తెలియదు. I am no * tohis character వాని యోగ్యత నాకు తెలియక పోలేదు. he is no * to this language వాడికి యీ భాష తెలియకపోలేదు. I am a * to this యిది నేనెరుగను. his hands are *s to labour వాడు యెన్నడూ పనిచేసినవాడు కాడు. she is a * to all joy and comfort సంతోష సౌఖ్యములనేవి యెట్టివో అది ఎరుగదు. my uncle and I are at present *s అప్పట్లో నేనెవడో మా పిన్నబ్బ యెవడో అని వున్నాము. he took the estate from the daughter and gave it to a * in blood కూతురి సొత్తును యెత్తి పరులకుయిచ్చినాడు.
Strangler n s గొంతుపిసికి చంపేవాడు.
Strangles n s swellings in a horse's throat గుర్రానికి వచ్చే వొక రోగము.
Strangulation n s the act of strangling ఊపిరి తిరగకుండా చేయడము,ఉడ్డు గుడుచుకొనేటట్టు చేయడము.
Strangury n s నీరు కట్టు, మూత్ర కృఛ్రము.
Strap n s వారు తోలువారు.
Strappado n s a kind of militrary torture formerly practisedin drawing up an offender to the top of a beam, and lettinghim fall; in consequence of which, dislocation of a limb usuallyhappened కోదండము వేయడము.
Strapping adj big, stout స్థూలముగా వుండే, లావాటి, బలిష్టమైన,పుష్టిగా వుండే.
Strata n s beds of earth పొరలు, భూమిలో వొకటికింద వొకటిగావుండే మృత్తు యొక్క అంతస్తులు. under the rock there are * ofsand and earth యీ రాతి పారుకింద యిసుక పోరానున్ను దానికింద మంటి పోరానున్ను వున్నవి.
Stratagem n s యుక్తి, ఉపాయము, తంత్రము.
Strategetical adj యుక్తిగా వుండే, తంత్రముగా వుండే, ఇది దండు భాష.
Strategy n s యుక్తి, తంత్రము, ఇది దండును గురించినమాట.
Stratified adj పొరపొరగా వుండే, అంతస్తంతస్తుగ వుండే, ఇది భూమినిగురించినమాట.
Stratum n s పొర, అంతస్తు. there is a * of sand under the rockఆ పారు కింద యిసుక పొరగా వున్నది.
Straw n s the stalk on which corn grows వూరిపుడక, తృణము.I do not care a * for him వాడు నాకు తృణముతో కూడా సమానుడు కాడు.it is not worth a * అది తృణప్రాయము. a bit of * గడ్డి పరక.millet * చొప్పు, ఒగడు. a heap of * కసువు వామి. the * yardకసువువామివేశే దౌడ్డి. a * hat కసువుతో అల్లిన టోపి. a man of * పేరుకుమనిషిగా వుండే వాడు. his securities are men of * వాడికి పూటబడ్డవాండ్లు వట్టి అప్రయోజకులు. the woman in the * పురిటింటిలో వుండే, స్త్రీ, బాలింతరాలు.
Strawberry n s a sort of fruit ఒక విధమైన యెర్రని పండు.
Strawcolour n s చామనిచాయ, పల్లవర్ణము.
Stray n s తప్పిపోయిన గొడ్డు.
Streak n s చార. there are *s of white and red on the wallsof the temple ఆ గుడి ప్రాకారానికి యెర్రమన్ను సున్నపు పట్టెలు పెట్టి వుండినది. there are black *s on the tiger's skin పులితోలుమిద నల్లచారలు వున్నవి. the red * of of paint worn on the foreheadశ్రీచూర్ణము. the *s on a squirrel ఉడత వీపు మీద వుండే చారలు. *s ofblood నెత్తురు చారలు, నెత్తురుమరకలు. there was * of red in theclouds మేఘములో వొక యెర్రచాష వుండినది.
Streaked adj చారలుగల.
Stream n s a running water ప్రవాహము, పారేనీళ్ళు. a * oflight కిరణము. they turned with the * పదిమందితోటి పాటుగా నడిచినారు.they went against the * ప్రవాహమునకు యెదురొడ్డి పోయినారు. లోకవిరుద్ధముగా నడిచినారు, పదిమందితోటి పఅటుగా నడిచినారు కారు. the * of time కాలక్రమము.
Streamer n s a long flag నిడుపుగా వుండే ధ్వజపటము, పతాకము.
Streamlet n s చిన్నయేరు, చిన్నకాలవ.
Street n s వీధి. the troops formed a * దండు వీధివలె రెండు వరసలుగా నిలిచినది.
Street-door n s తలవాకిలి, వాకిలి గడప, సింహ ద్వారము.
Streetwalker n s a prostitute వేశ్య, లంజ, భోగముది. or rogueదేశదిమ్మరి.
Streight n s a narrow pass ఇరుకుగా వుండే దోవ. a narrowpassage in the sea సముద్రములో యిరుకుగా వుండే మార్గము. the *s of gibraltar జీబ్రాలటర్ దేశమువద్ద సముద్రములో యిరుకుగా వుండే మార్గము. distress; difficulty శ్రమ, తోందర, ఇబ్బంది.
Strength n s force; vigour బలము, శక్తి, త్రాణ, సత్తువ,దార్ఢ్యము, పటుత్వము. or spirit సారము, నిగ్గు. of smell వెగటు.or army సైన్యము దండు. he was borne on the * of the regimentఆ దండులో లావణమై వుండినాడు. on the * of his assertions వాడు చెప్పినాడన్న బలము మీద. on the * of his being her brother దానికి తోడబుట్టిన వాడుగా వున్నాడనే బలమునుపట్టి.
Strengthened adj బలపరచబడ్డ, దృఢపరచబడ్డ.
Strengthening adj బలకరమైన, ప్రోద్బలమైన. * food సత్తువనుకలగచేసే ఆహారము.
Strenuous adj brave శౌర్యముగల, శూరత్వము గల, జీమూతమైన. * exertions బహుబలముగాచేసే ప్రయత్నములు. * idleness వృధాయాసము, పృధాశ్రమ.
Strenuously adv జీమూతముగా, తదేకనిష్ఠగా. he * opposed themవాడు వొకటే పట్టుగా వాండ్లతో యెదురాడినాడు. Stress, n. s. importance గురుత్వము. important part ముఖ్యాంశము,సత్త. this is the * of the case యిది ఆ వ్యాజ్యము యొక్క సారాంశము.violence వేగము, బలము. the ship was driven into this place by* of weather ఆ గాలియొక్క వడిచేత ఆ వాడ యిక్కడికి తోసుక రాబడ్డది.I lay no * upon his promise వాడి మాటమీద నేను లక్ష్యము వుంచలేదు.the జుడ్గే laid no * upon this point న్యాయాధిపతి యీ విషయముమీదలక్ష్యము వుంచలేదు. he laid great * upon being my relation నాకుబంధువుడుగా వున్నాడనే దానిమీద నిండా గురుత్వము వాడు పెట్టుకొని వున్నాడు.accept in pronounciation ఊతము, ఒత్తి పలకడము.
Stretch n s extension విశాలత. reach చాచడము. utmostreach of power అధికారమును మీరడము, అధిక ప్రాజాపత్యము.
Stretched adj చాచబడ్డ, పరచబడ్డ, విస్తరింప చేయబడ్డ, సాగిన.
Stretcher n s పలక. a country cot నులక మంచము.
Stretching n s సాగడము, నీల్గడము, నీల్గు. this is done toprevent the leather * తోలు సాగకుండా వుండడమునకై యిది చేయబడ్డది.
Stricken (the ancient participle of Strike) కొట్టబడ్డ , * in yearఏండ్లు చెల్లిన, వయసు చెల్లిన. poverty * దరిద్రుడైన. * by deathకాటికి కాళ్ళు చాచిన. like a * deer దిక్కుమాలిన పక్షివలె.


English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment