Spinach English to Telugu free online dictionary

Spinach, Spinage n s. బచ్చలికూర, ఉపోదకి. Spinal, adj. వెన్నుముక సంబంధమైన, పృష్ఠాస్థి సంబంధమైన.the * marrow వెన్నుయెముకలో వుండే గిజురు. in mystical books thisis called సుషుమ్ననాడి.
Spindle n s కదురు. spindle-shanks గేదె కాళ్లు. spindle-shanked గేదె కాళ్లుగల.
Spine n s the back bone వేన్నెముక, పృష్టాస్థి. Spinel, n. s. మణి, కెంపు.
Spinet n s a small harpsichord; an instrument with keysఒకవిధమైన సంగీతపెట్టె, వాద్య యంత్ర విశేషము.
Spinner n s వడికేవాడు.
Spinning n s వడకడము, గిరగిర తిరగడము * out a story కథనుపెంచి చెప్పడము.
Spinning wheel n s రాట్నము, రాట్టము.
Spinny n s డొంక. Ann. Reg. 1844. p. 57.
Spinster n s కన్యపడుచు, పెండ్లికాని చిన్నది.
Spiny adj full of small thorns కంటకితమైన, సన్నముండ్లుగల.
Spiral adj like a screw, or a tendril ఆవర్తములుగల,సుళ్లుగల, మలుచుట్టువలెవుండే, సుళ్ళుసుళ్లుగా వుండే, మెలికెలుగల. * flames యిర్రికొమ్ములవలె చుట్టులుచుట్టలుగా వుండే జ్వాలలు.the * shoots of a creeper తీగెలోనుంచి సుళ్ళు సుళ్ళుగాలేచినమొలకలు. the horns of the antelope are * ఇర్రియొక్క కొమ్మలుమెలికెలుగా వుంటవి, తిరుగుళ్ళుగా వుంటవి.
Spirally adv మెలికెలు మెలికెలుగా, మలుచుట్టువలె తిరుగుళ్లుగా.
Spire n s steeple ఖ్రీష్టుమతస్థుల గుడిమీద కూచిగా వుండేగోపురము.
Spirit n s the breath, the soul జీవము, ప్రాణము, జీవాత్మ, ఆత్మ, ఊపిరి, ఉసురు. the * of love, or kindness దయారసము. a woman of * ధైర్యవంతురాలు. a man of * ధైర్యము. a noble * ధీరుడు,ధైర్యశాలి. a gifted * అంశ పురుశుడు. fasting brings down the * ఆకలిచేత ధైర్యము కలుగుతున్నది. a broken * భగ్న మనస్సు. A+. God is (pneuma) a * (John IV. 24.) ఈశ్వర ఆత్మ స్వరూపః A+. ఈశ్వరోస్తాత్మాC+. P+. an apparition భూతము, దయ్యము, పిశాచము, గ్రహము. the *or demon that haunts this place యిక్కడ తిరిగే దేవత, తిరిగే రాక్షసుడు. an embodied * దేహి. a disembodied * విదేహి. In Job IV. మూర్తి D+. ardour, vigour తేజస్సు, బలము, శక్తి, ధైర్యము.import తాత్పర్యము. I do not understand the * of his letterవాడి జాబు యొక్క తాత్పర్యము నాకు తెలియలేదు. essence సత్తువ, సారము.this letter is written in a bad * యిది దుర్బుద్ధితో వ్రాసిన జాబు. a * of contradiction వితండవాదము చేసే గుణము. evil * మనుష్యులకు దుర్బుద్ధి పుట్టించే భూతము. In Luke XI. 24. the unclean * అమేధ్యభూతఃA+. The word (psyche) is thus rendered in 1. Thes. V. 23. (pneuma, psyehe, soma) ఆత్మ, ప్రాణము, శరీరము. A+. In Roman Catholioc books, the Latin word `Spiritus' is retained; and Holy Spirit is written Sancta Spirita సాంక్తస్పిరిత.
Spirited adj lively ఉల్లాసముగల. full of fire ఉద్రేకముగల.vivacious వేగముగల, వడిగల. a mean * man క్షుద్రుడు, పెద్దమనిషికానివాడు. soft * పిరికియైన, పంద అయిన. public * లోకోపకారబుద్ధిగల.
Spiritedly dv ధైర్యముగా, ఉల్లాసముగా. mean * పిరికిగా, అల్పముగా.
Spiritedness n s బుద్ధి. public * లోకోపకార బుద్ధి. narrow *అల్పబుద్ధి.
Spiritless adj dejected కుంగిన. deprived of vigour జబ్బైన.wanting courage అధైర్యమైన. a * poem నిస్సారమైన కావ్యము.
Spiritous adj సారాయి సంబంధమైన. * liquor సారాయి.
Spirits n s plu. inflammable liquors, as brandy, rum &c.మదేరా, సారాయి. liveliness, gayety ఉల్లాసము, ఉత్సాహము. she is ingood * అది వుల్లాసముగా వున్నది. they are in low, or bad * వాండ్లు వ్యాకులముగా వున్నారు. essence ద్రావకము.
Spiritual adj immaterial, not bodily అశరీరమైన, విదేహియైన,నిరాకారమైన. a * being దివ్యపురుషుడు, పరమ పురుషుడు. intellignecesదేవతలు మొదలైన వాండ్లు. * body సూక్ష్మ శరీరము. he appeared in a* form అశరీరియై అగుపడ్డాడు. the * affections జ్ఞానేంద్రియములు. mentalమానసికమైన. * exercises మానసిక వ్యాపారములు, అనగా జపము, చింతన మొదలైనవి. * instruction ఆత్మబోధ. * enjoyment జ్ఞానానందము, పరమానందము. * blindness అవివేకము, బుద్ది జాడ్యము, మాయ, అజ్ఞానము. * gifts యీశ్వర కటాక్షమువల్ల కలిగిన సద్గుణములు. * teacher or adviser జ్ఞాన మార్గమును బోధించే గురువు. * knwoledge పరమాత్మజ్ఞానము, వైదికజ్ఞానము, పరలోక సాధకమైన జ్ఞానము. the * eye దివ్యచక్షువు. (Bhagavad Gita. XI. 8.) జ్ఞానదృష్టి. not temporalఐహికము కాని. (Droz.) పారమార్ధికమైన, ఆత్మస్వరూపమైన. the * poweris seperate from the temporal power గురువు యొక్క అధికారమువరు రాజాధికారము వేరు. * persons; that is monks, friars &c.గురువులు, సన్యాసులు, బైరాగులు. a * guide or father confessor గురువు.
Spirituality n s incoporeity; immateriality అశరీరత్వము,ఆత్మస్వరూపత్వము. pure acts of the soul. ధర్మ విషయమైన కార్యము; పరలోక సాధనమైన కార్యము.
Spiritualization n s మనశ్సుద్దికరణము, భక్తిని కలగచేయడము,సత్కార్యమందు మనస్సును లగింప చేయడము, జ్ఙానవంతుణ్నిగా చేయడము.
Spiritually adv జ్ఞానముగా, వైధికముగా, జ్ఞానమార్గముగా.
Spirituous adj ఘాటుగా వుండే, మస్తుగా వుండే. * liquor ఘాటుగా వుండే ద్రవ ద్రవ్యము, అనగా సారాయి.
Spirt n s sudden ejection ఝరీలుమని బైలు దేరడము, ఝరీలుమనిరావడము. a * of blood చెదిరిన నెత్తురు.
Spiry adj కూచిగా వుండే.
Spissitude n s thickness సాంద్రత, చిక్కన. from the * of honey తేనె చిక్కగా వుండేటిది గనక. from the * of the smokeఆ పొగ దట్టముగా వుండినందున.
Spit n s an iron spear నేజా. a * of sand in a riverయేటిలో నిడుపుగా వుండే యిసుక దిన్నె. for roasting flesh మాంసమునునిప్పున వాడ్చే యినుపకడ్డి. or spittle ఉమ్మి, ఉమ్మినీరు.
Spital, or Spittal n s. hospital ఆశిపత్రి.
Spite n s malice; rancour; hate ద్వేషము, చలము, పగ, ఈర్ష్య,కసి, కంటు. through * towards me he did this నా మీద కాక యీపని చేసినాడు. * of the law he did as he pleased చట్టమును కట్టిపెట్టి తన మనసు వచ్చినట్టు చేసినాడు. in * of the rain hecame వాన కురుస్తూ వుండినప్పటికిన్నీ వచ్చినాడు. he did it in * ofme నేను యెంత వద్దన్నా వినక చేసినాడు. he sold the house in *of them వాండ్లు యెంత విరోధము చేసినప్ఫటికిని ఆ యింటిని అమ్మివేసినాడు.he came there in * of the fever జ్వరాన్ని కూడా తోసుకొని అక్కడికివచ్చినాడు. in * of herself she wept తనకు పట్టకూడక యేడ్చినది.he paid the money in * of his teeth ఆ రూకలను విధిలేక చెల్లించినాడు. in * of his learning he is a fool యెంత చదువుకొన్నావాడు వట్టి పిచ్చివాడు. in * of it's beauty all men hate the makeఎంత అందమైనదైనా పామంటే యెవరికిన్నీ గిట్టదు.
Spiteful adj పగబట్టిన, మాత్సర్యముగల, చలముగల, విరోధముగల.
Spitefully adv చలముగా, కసిగా, విరోధముగా, ఈర్ష్యగా.
Spitefulness n s చలము, కసి, పగ.
Spitfire n s మంటలమారి, మండిపడేటిది, గయ్యాళి.
Spitted adj పొడిచిన, గుచ్చిన. insects that are * on thorns ముండ్లలో గుచ్చిపెట్టిన పురుగులు. two of our men were * by the Seiks మాలో యిద్దరు వాండ్ల వల్ల పొడిచి చంపబడ్డారు.
Spitting pot n s తుమ్మపడిగ.
Spittle n s ఉమ్మి, ఎంగిలి.
Spittoon n s a spitting pot తుమ్మపడిగ.
Splash n s wet or dirt thrown up from a puddle చెదిరినబురదనీళ్ళు మొదలైనవి.
Splashy adj అడుగునీళ్ళుగా వుండే. a * road అడుసు నీళ్లుగా వుండే బాట.
Splay-footed adj వికారమైన పాదములుగల.
Spleen n s the milt ప్లీహ, కడుపులో వొక భాగము. as a disease గుల్మవ్యాది. spite ద్వేషము, ఆక్రోషము. melancholy వ్యాకులము,విషాధము, వికారమయిన గుణము. immoderate merrinment అత్యుల్లాసము. changeability చాంచల్యము, చిత్తచాంచల్యము, విపరీతభావము.
Splendid adj దివ్యమైన, జంభమైన, ప్రకాశమైన, ఘనమైన, దొడ్డ.
Splendidly adv దివ్యముగా, ప్రకాశమానముగా, ఘనముగా, జంభముగా.
Splendour n s ప్రకాశము, కాంతి, తేజస్సు, శోభ, దీప్తి. fromthe * of the morning నాటిదినం ప్రాతఃకాలము అతిదివ్యమైనదిగా వుండినందున. magnificence డంభము, జంభము.
Splenetic adj peevish మండిపడే, చీదరపడే. whimsicalచిత్తచాంచల్యము గల.
Splint n s బద్ద, కట్టుకట్టేబద్ద.
Splinter n s పేడు, చెక్క, బద్ద, తునక.
Split p|| పగిలిన,చీలిన,బద్దలైన,విరిశిన,వ్రక్క,* pulse పప్పు.
Splutter n s పీకులాట, తొందర, గత్తర, అల్లరి, కలత.
Spoil n s that which is taken by violence లూటి. plunder దోచుకొన్న వస్తువులు, కొల్లపెట్టబడ్డ వస్తువులు.
Spoiled adj చెడిపోయిన. or plundered దోచుకోబడ్డ. the fruitsthat were * కుళ్ళిపోయిన ఫలములు. half * ముక్కిపోయిన. woodthat is * by damp చివికిపోయిన కొయ్య.
Spoiling n s or plunder దోపిడి, కొల్ల.
Spoilt adj చెడిపోయిన.
Spoke n s part of a wheel చక్రముయొక్క ఆకు. they put a *in his wheel వాడి పనికి అడ్డ కర్ర వేసినారు, వాని పనికి అడ్డవాటువేసినారు, భంగము చేసినారు.
Spoken pastp|| చెప్పిన,అనిన, this is * of in that book ఇందునగురించి ఆ పుస్తకములో చెప్పి వున్నది. the rules * of ఇప్పుడు చెప్పిన సూత్రములు. he is a fair * man వాడు మంచి మర్యాదస్థుడు.
Spokesman n s one who speaks for another ఒకనికి ప్రత్యామ్నాయముగామాట్లాడేవాడు, ముఖ్యుడు, అందరికీ ముఖ్యుడుగా వుండి మాట్లాడేవాడు. I will be your* నీకై నేను మాట్లాడుతాను.
Spoliation n s కొల్ల, దోపుడు. Spondee, n. s. a foot containing two long syllables as కాదా,దీన్ని ఛందస్సులో గగం అంటారు.
Sponge n s నీళ్లను పీల్చే వొకవిధమైన సముద్రపు పాచి. In some versions of the Bible this is (as in the English) left untranslated. A sort of sweet cake వొక విధమైన ఫలహారము. A sycophant సాపాటు రాముడుగా వుండేవాడు, ఇచ్చకాలమారి.
Sponger n s సాపాటురాముడు.
Spongy adj మెత్తని. the bone is * ఆ యెముక పత్తివలె వున్నది.
Sponsor n s a surety, one who makes a promise or gives security for another ఉత్తరవాది, జవాబుదారుడు.
Spontaneity n s స్వేచ్ఛ, యధేచ్ఛ.
Spontaneous adj voluntary; acting of its own accord స్వేచ్ఛయైన,యధేచ్చమైన, తనకుతానే. * lassitude డేనోటేస్ disease (Hippocrates)నిష్కారణముగా వొక ఆయాసము కలిగితే యిది వాడికి యేమో రోగము వచ్చినదనే దానికి గురుతు. * combustion నిప్పులేక తనకు తానే అంటుకోవడము. * herbsతనకుతానే పెరిగేచెట్లు. * salt తనకు తానే పూచినవుప్పు. a * forest తనకుతానే పెరిగిన అడవి.
Spontaneously adv తనకుతానే, స్వేచ్ఛగా. he came * తనకు తానేవచ్చినాడు, స్వేచ్ఛగా వచ్చినాడు. the creeper * seized the branchఆ తీగ తనకుతానే కొమ్మను పట్టుకొన్నది.
Spontaneousness n s స్వేచ్ఛ, యథేచ్ఛ. from the * of his consentతనకు తానే వొప్పుకొన్నాడు గనక.
Spool n s నూలు చుట్టే పుడక.
Spoon n s గరిటే. a very small * మిళ్ళి గరిటే.
Spoonbill n s ఒక పక్షి, తెడ్డుమూతికొంగ. Jerdon ణో. 312.
Spoonful adj గరిటెడు. a small * మిళ్ళెడు. a tea * కాలుమిళ్ళెడు.a dessert * రెండు మిళ్ళులంత, అర గరిటెడు. a table * నాలుగుమిళ్ళులంత. a tea * is about sixty drops. A dessert isabout 120 drops, A table * is a 1/2 fluid oz.
Spoonmeat n s గరిటెతో యెత్తుకొని తినడానకై వల్లగా వుండే ఆహారము,పులుసు చారు మొదలైనవి.
Sporadic adj That is scattered here and there చెదిరినట్టుగావుండే, ఇక్కడ వొకటి అక్కడ వొకటిగా వుండే.
Sport n s ఆట, ఆట్లాట, లీల, కేరణము, క్రీడ, వేడుక, వినోదము.he made us good * మేము పకాపక నవ్వేటట్టు చేసినాడు. *s of the fieldవేట. the jester came there to make * నవ్వించడానికి హాస్యగాడువచ్చినాడు. mockery ఎగతాళి, పరిహాసము. he told it me in * butI believed him వాడు ఎగతాళిగా చెప్పిన దాన్ని నేను నమ్మినాను.
Sportful adj సరసమైన.
Sportfully adv వినోదముగా.
Sportfulness n s ఉల్లాసము, లీల, సరసత, సరసము.
Sportive adj సరసమైన, శృంగారమైన, రసికతగల, విలాసముగల.a * girl విలాసవతి. a * kid వేడుకగా గంతులువేసే మేకపిల్ల.
Sportively adj సరసముగా, వేడుకగా, విలాసముగా, వినోదముగా.
Sportsman n s he who delights in hunting వేటాడేవాడు.
Sportsmanship n s వేటాడే భావము.
Spot n s a blot చుక్క, బొట్టు. a natural * మచ్చ, పొడ.a mark made by discoloration మరక, కర. a disgrace కళంకము,అవమానము. a place స్థలము, ప్రదేశము. a * of land కొంత భూమి. an empty * బయలు. the fatal * చావ వలసిన స్థలము, చచ్చినస్థలము.on the * తక్షణమే, అప్పుడే.
Spotless adj నిష్కళంకమైన, నిర్మలమైన, పవిత్రమైన.
Spotlessness n s నిష్కళంకత్వము, పవిత్రత.
Spotted adj మచ్చలుగల, చుక్కలుగల. a * deer పోడలుగల జింక.the leopard is * with white తెల్ల మచ్చలుగలది చిరుతపులి. thewall is * with damp తేమచేత ఆ గోడ మచ్చలు మచ్చలుగా వున్నది.he is * with crime వానిమీద నేరమనే దోషము వచ్చినది, వానినిలువెల్లా విషము.
Spotty adj మచ్చలుగల.
Spousal adj వివాహసంబంధమైన. the * rite వివాహ ప్రస్తుతము,వివాహ కార్యము.
Spousal, or Spousals n s. వివాహము, పెండ్లి.
Spout n s a pipe గొట్టము. there were *s on the house roofto carry of the water వాన నీళ్ళు బైటపడడానకు మిద్దెమీద అక్కడక్కడాగొట్టములు పెట్టివున్నవి. the * of a fire engine జలయంత్రములోనుంచినీళ్ళు వచ్చే గొట్టము. the * of a tea pot &c గండి. a * of waterఏనుగ తొండమువలే పడే జలము. a * of blood రక్త ధార. a water* ఆకాశ గంగ, ఆకాశమునుంచి పడే జలధార. a vessel that has a * గండిచెంబు.
Sprain n s ఇలుకు, బెణుకు.
Sprained adj ఇలుకుపట్టిన, బెణికిన.
Sprang past tense of the verb ToSpring the monkey * at him కోతి వానిమీద దుమికినది.
Sprats n s చిన్నచేపల పేరు, నెత్తాళ్ళు చందమామ, పక్కెలు,మట్టలు, మసిచేపలు, మెత్తడచేపలు.
Spray n s the extremity of a branch కోమ్మ యొక్క కొన.the foam of the sea నురుగు, సముద్రములోనుంచి పైకి చెదిరేనీళ్ళు.
Spread adj వ్యాపించిన, చాచిన, మూసుకొన్న. the disease * by this wind యీ గాలి వల్ల వ్యాపించిన రోగము. the news * by these papers యీకాగితమువల్ల ప్రచురమైన సమాచారము. Lord Bacon in his Essay On Seditions, ** 10 says Money is like muck, no good unless itbe * రూకలనున్ను పేడనున్ను వ్యాపింప చేస్తేనే గాని పనికిరావు.
Spreading adj విశాలమైన, విస్తారమైన, వ్యాపించే. a * tree నాలుగుతట్లా వ్యాపించిన చెట్టు. a * sore నానాటికి పెద్దదయ్య పుండు.
Sprig n s a small branch రెమ్మ, మండ, చిగురు, పల్లవము.
Sprigged adj పూలువేసిన. a cloth * with gold సరిగపూలువేసిన గుడ్డ.
Spright, or Spite n s. దయ్యము, పిశాచము.
Sprightliness n s briskness; gayety ఉల్లాసము, చురుకు, వడి.from the * of a squirrel ఉడుత చురుకుగలది గనక.
Sprightly adj ఉల్లాసముగల, చురుకుగల, వడిగల. a * girlఉల్లాసవతి, విలాసవతి. she was as a squirrel అది వుడుతవలెనిండా చురుకు గలది.
Spring n s వసంత ఋతువు, పుష్పసమయము. an elastick body బిస,బిర్రు. the * of a carriage బండియొక్క విల్లు. elastic force బిస,వెస. a * knife మడుపు కత్తి. a * gun బిస జారి పడి కాల్చే తుపాకి,అనగా తుపాకి గుర్రమునకు దారము కట్టి ఆ దారమును దోవకు అడ్డముగా కట్టిపెట్టుతారు, ఆ దారము దొంగకాలికి తగలగానే ఆ తుపాకి వేటు వానికితగులుతున్నది. a leap or bound దూకు, గంతు. a leak వోడు, వురుపు.a fountain, an issue of water from the earth చలమ, బుగ్గ, ఊట.a source మూలము, కారణము. beginning ఆరంభము. springing water or *water వూట నీళ్ళు.
Springe n s a gin, or noose ఉరి, ఉచ్చు.
Springiness n s బిస, బిర్రు.
Springing n s మొలవడము, అంకురించడము. growth; increaseపెరగడము.
Springtide n s tide at the new and full moon; high tide పర్వతకాలమందు సముద్రములో హెచ్చే నీరు, కొత్తనీరు.
Springy adj బిసగల, వెసగల, బిర్రుగా వుండే.
Sprinkle n s చినుకు, చినుకులు, తుంపర, తుంపరలు. there was a* of rain to_day నేడు నాలుగు చినుకులు పడ్డవి.
Sprinkled adj చల్లబడ్డ, చిలకరించిబడ్డ. a field * with rainవాన చినుకులు పడ్డ పొలము. a cake * with sugar పైన చక్కెరచల్లిన పణ్యారము.
Sprinkling n s ప్రోక్షణము, చల్లడము, చిలకరించడము.
Sprit n s a pole దూలము. hence the word bolt * వాడయొక్క ముక్కు దూలము.
Sprite n s దయ్యము, భూతము, పిశాచము.
Spritely adj gay, cheerful, merry ఉల్లాసముగల.
Spritsail n s the sail which belongs to the bow-spritmast వాడ ముక్కు దూలమునకు కట్టే మూడుమూలల చాప.
Sprout n s మొలక, అంకురము, మోను, చిగురు.
Spruce adj nice, trim, neat without elegance ముద్దుగా వుండే,శృంగారమైన, ఇది కొంచెము యెగతాళిగా వుండేమాట.
Sprucely adv prettily ముద్దుగా, సొగసుగా.
Spruceness n s సొగసు, శృంగారము. ఇది కొంచెము యెగతాళిగాచెప్పేమాట.
Sprung past tense of the verb ToSpring The cat * at the mouse పిల్లి యెలుకమీద దుమికినది.
Spry adj clever, active సమర్థమైన, గట్టి.
Spud n s గసిక, తొళ్ళిక.
Spume n s నురుగు, ఫేనము.
Spun past tense of the verb Tospin She * the cottonఆ పత్తిని వడికినది.
Spunge n s sponge నీళ్ళను పీల్చే సముద్రపుపాచి.
Spunginghouse n s a house to which debtors are takenbefore commitment to prison అప్పులవాండ్లను చెరశాలలోపెట్టేటందుకు ముందు సధ్యాకావలిలో పెట్టే చావడి.
Spunk n s a spark అగ్నికణము. bravery ధైర్యము. as a match చెకముకిదూది.
Spuose n s a wife భార్య. or a husband భర్త. his * వాని భార్య.her * దాని భర్త.
Spur n s ముల్లు. spurs ముండ్లు, గుర్రము కడుపులో తన్నడనాకైమడిమెకు కట్టుకొనే యినుపముల్లు. he set *s and went offగుర్రమును కాలి ముల్లుతో తట్టి సవారి విడిచినాడు. the * of a thorn tree నిడుపాటి ముల్లు. the *s of the mountain వొకకొండలో నుంచి చీలిన సన్నతిప్పలు. the * of desire కామోద్రేకము.on the * of the moment I gave this answer but I foundafterwards it was wrong ఆ యవసరములో అట్లా చెప్పితిని గానిఅది తప్పు అని అవతల నాకు తెలిసినది. necessity is the* to invention అక్కర అన్ని యుక్తులకు కారణముగా వున్నది, అక్కరఅనేది వుంటే దాని మీద అన్ని యుక్కతులు పుట్టుతవి. the * of necessitydrove him to sell this వాడికి వుండిన అక్కర అనేది దాన్ని వాడు అమ్ముకోవలసి వచ్చినది.
Spur-fowl n s చిమటకోడి. this is the painted sort, thecommon sort is ఎర్రకోడి.
Spurgalled adj irritated, incited రేగిన.
Spurge n s milk hedge, or Indian tree * జముడు.oleander leaved * ఆకు జముడు.
Spurious adj counterfiet, not legitimate కృత్రిమమైన,కపటమైన. a * child జారజుడైన బిడ్డ, రంకు మొగుడికిపుట్టినబిడ్డ. a * coin తప్పు నాణెము. a * verse గ్రంథకర్తచెప్పినది కాకుండా నడమ వచ్చి పడియుండే శ్లోకము. I suspect this verse is * యిది యీ కవి చెప్పిన శ్లోకము కానట్టు నాకుతోస్తున్నది.
Spurn n s a kick తన్ను, తన్నితోసివేయడము. rejectionనిరాకరణము.
Spurt n s sudden ejection ఝరీలుమని బైలుదేరడము,ఝరీలుమని రావడము. a * of blood చిమ్మిన నెత్తురు.
Sputter n s డ్రోప్స్ of spittle మాట్లాడడములో పడే తుంపుర్లు. fuss,trouble వట్టి తొందర, వృథా ఆయాసము.
Spy n s వేగువాడు, చారుడు.
Spy-glass n s దుర్బీను, వోకు, అనగా దూరములో వుండే దాన్నికనుక్కోవడమునకై చూచే అద్దపుబిళ్ల లేక ఆ బిళ్ళగల గొట్టము.
Sqeamishness n s అసహ్యము, చీదర, అరుచి. he showed some * about producing the accounts లెక్కలు చూపడము వాడికి అయిష్టముగావుండినట్టు వుండెను.
Squab n s దిండు, తలగడ.
Squabble n s జగడము, కొట్లాట, వాదు.
Squad n s a company of armed men: usually applied to those who are learning the military exercise దండులో వొక భాగము,దళము.
Squadron n s a body of men drawn up square, చదరముగానిలిచే సిపాయీల దళము. part of a fleet; a certain number of ships కొన్ని యుద్ధవాడలు.
Squalid adj రోతగావుండే, కశ్మలముగా వుండే.
Squall n s a sudden gust of wind గాలి దెబ్బ. or screamకేక, కూత, అరుపు.
Squally adj full of storms, tempestuous గాలి కసురుగావుండే.
Squalor n s dirt, nastiness రోత, కశ్మలము, అసహ్యము.
Squanderer n s దూబరదిండి.
Square adj చతురస్రమైన, చౌకమైన, చచ్చౌకమైన, చదరమైన.ten * feet పది చదరడుగులు. ten * feet పది అడుగుల నల్ చదరము. the * root in arithmetic వర్గుమూలము. * dealing,that is, honesty, justice పెద్దమనిషి నడక. this will make all * యిందువల్ల అన్నీ చక్కబడును.
Squaretoes n s ముసలయ్యకు యెగతాళిగా అనే పేరు.
Squash n s any thing soft and easily crushed మెత్తగాచేతితో నలిచేటందుకు సులభముగా వుండేటిది. the book is nowmere * ఆ కాకిత పుస్తకము నీళ్ళలో తడిసి ముద్దగా వున్నది.
Squat adj short and thick పొట్టి, గిడ్డైన.
Squatter n s an American phrase for a settler అడవిలోయేకాంతముగా వొక గుడిసె వేసుకొని వుండేవాడు. squatting, thatis settling in the forest అడవిలో యేకాంతముగా వొక గుడిసె వేసుకొని వుండడము.
Squeak n s The cry of a pig or a mouse కీచుమనిఅరవడము. he had a narrow * for his life చచ్చిబ్రతికినాడు,వాడికి వచ్చినగండము తప్పినది.
Squeal n s కీచుమని కూశిన కూత.
Squeamish adj easily disgusted, apt to take offencewithout much reason అసహ్యపడే, అరోచకముగా వుండే. when a woman is pregnant she often is * కడుపుతో వుండేదానికిఅరోచకముగా వుంటున్నది. he was too * to take the money ఆరూకలను తీసుకోవడమునకు ఇష్టములేక వుండినాడు.
Squeamishly adv In a fastidious manner చీదరగా, అసహ్యముగా.
Squeezed adj పిండిన, పిడిచిన, పిప్పిచేయబడ్డ, అదమబడ్డ,చిదిమిన.
Squelch n s a heavy fall దఢీలుమని పడడము.
Squib n s పటాసు, టపాసు. a lampoon or story వొకడిమీదకట్టివిడిచిన కథ.
Squills n s a plan అడవి తెల్లగడ్డవంటి వొక దినుసు, నక్కనరమువంటిది. or wild onions అడవి తెల్లగడ్డలు. a kind of fish వొకవిధమైన చేప.
Squint adj మెల్లకన్నుగా వుండే. a * eye మెల్లకన్ను.
Squinting adj మెల్లకన్నుగా వుండే. a * eye మెల్లకన్ను.
Squire n s an attendant పనివాడు, పరిచారకుడు, కింకరుడు.a knights * పనివాడు. a lady's * or beau సొగసుగాడు. he wastheir * వాడు వాండ్ల పనివాడు. a gentleman వొక దొర, అనగా రాజభృత్యుడు. a country * పల్లెటూరిలో వుండే వొకదొర.
Squirrel n s ఉడుత, తరుమూషకము.
Squirt n s చిమ్మనగొట్టము, చిమ్మనగ్రోవి. a * of water(meaning a small quick stream) చిమ్మిన నీళ్ళు, రవ్వన్ని నీళ్ళు.
St. Anthony's fire n s ఒక తరహా గజ్జి.
St. sint అనగా Saint, Saint Paul శ్రీమత్పౌలుడు. "Saint Paul's" (a certan church in London) లండను పట్టణములో నడమ వుండే పెద్దగుడి.
Stab n s పోటు, పొడుపు. this was a * to his reputationయిది వాడి పేరుకు చెరుపు.
Stabber n s పొడిచేవాడు, ఘాతకుడు. a * of character దూషకుడు, దూషించి వొకడి మానమును తిశివేశేవాడు.
Stability n s firmness నిలకడ, అచాంచల్యము, స్థిరత, స్థైర్యము.
Stable adj నిలకడైన, అచంచలమైన, స్థిరమైన.
Stabling n s లాయానికి యిచ్చే బాడిగె.
Stack n s కుప్ప, వామి. a * of straw కసువువామి. a * offirewood కట్టెలరాశి. a * of branches కొమ్ములపోగు, కొమ్మలరాశి.a * of houses గుంపుగా వుండే యిండ్లు.
Stacte n s an aromatick; the gum that distils fromthe tree which produces myrrh ఒక వాసనగల బోళము.
Stadtholder n s formerly the chief magistrate of the United Provinces డచ్చిదేశాధిపతి.
Staed n s a place or room స్థానము. the home * బస, నివాసము.he went in my * నాకు బదులుగా పోయినాడు. in * of a horse he tooka bullock గుర్రానికి బదులుగా యెద్దును తీసుకోనిపోయినాడు. this will standyou in good * యిది నీకు నిండా సహాయమవును, సఫలమవును.
Staes n s boddice or waistcoat for a woman వొక విధమైన రవిక.
Staff n s కట్టె, కర్ర, కోల, కొయ్య, దండము. a hermits *సన్యాసి చేతిదండము. a police man's * దుడ్డుకర్ర. he is the * of his family ఆ కుటుంబానికి వాడే ఆధారము. churning * కవ్వము.a plough * మేడిసోగ. flag * కోడి కంభము, ధ్వజస్థంభము. bread is the * of life అన్నమే ప్రాణాధారము. the * of the army దండులో వుండే పెద్దదొరలు. a * appointment ముఖ్యమైన వుద్యోగము.a * officer ఆధారముగా వుండే దొర, ముఖ్యమైన దొర. the Generaland his * సేనాధిపతిన్ని ఆయన చేతికింద వుండే దొరలున్ను. the *of the supreme court పెద్ద కోర్టులో వుండే ముఖ్యమేన వుద్యోగస్తలు.
Stag n s the male red deer మొగ జింక.
Stage n s in the theatre రంగము, రంగస్థలము. a raised floor to be used for a day or two నడవడమునకై సధ్యాయెత్తుగా కట్టిపెట్టిన పలకలు. any thing publickly transacted or performed రచ్చకూటము. those who appear upon the * నటులు ఆడేవాండ్లు, ఎదటవచ్చిమాట్లాడేవాండ్లు. a * in a journey మజిలి. they went four *s before they met him నాలుగు మజిలీలు పోయి అతణ్ని కనిపెట్టినారు. at every *కడాకు కడవెళ్ళా. youth is the first * of life బాల్యము మొదటిదశ.* horse తపాలు గుర్రము. in an early * of his studies వాడు కొంతమట్టుకుచదివిన తర్వాత. in the last * of the disease ఆ రోగానికి అంత్యకాలములో,అంత్యదశలో. the * or comic art భరతశాస్త్రము. he went on the * వేషగాడై పోయినాడు. as minister he was on the * twenty years యిరువై యేండ్లదాకా వాడు మంత్రిగా ప్రవర్తించినాడు. a new character now enteredon the * కొత్తవేషము వచ్చినది, అనగా కొత్తగా వొకడు ప్రసిద్ధుడై బైలుదేరినాడు.
Stagecoach n s తపాలుబండి.
Stage-player n s వేషగాడు.
Stage-ply n s ఆట, నాటకము.
Stager n s a player, ఆడేవాడు, వేషగాడు, నటి. he is anold * వాడు బాగా తీరిన చెయ్యి. a horse which is kept to run a * తపాలు గుర్రము.
Stagetrick n s వేషగాడు చేసే చమత్కారము, యుక్తి, పనికిమాలినయుక్తి.
Staggered adj అనుమానించిన. I was * at this అనుమానించినాను.
Staggering adv తడమాటముగా.
Staggers n s కాకి చెమ్మలు, కాకి సోమాల, దొమ్ము, మూర్ఛ,యిది గుర్రమును గురించిన మాట. a horse that has got the *కాకి సోమాల గుర్రము.
Stagnancy n s the state of being without motion orventilation పారకుండా నిలిచిన చోటనే నిలవడము. from the * of the water నీళ్ళు పారకుండా తట్టలో పోసినట్టు వుండడమువల్ల.from the * of trade వర్తకము నిలిచి యున్నందున.
Stagnant adj motionless; not flowing, not running కదలకుండావుండే, పారకుండా వుండే, నడవకుండా వుండే. * water పారకుండా నిలకడగావుండడముచేత చెడిపోయిన నీళ్ళు. * water is poison చెడిపోయిన నీళ్ళువిషము. when the blood is * నెత్తురు శరీరములో పారతూవుండకుండా ఆయాచోట నిలిచి పోయినప్పుడు. when trade is * బేరము నిలిచిపోయినప్పుడు. as regrads merchandize this is a * part of the year ప్రతి సంవత్సరమున్నుయీ దినాలలో బేర సారములు లేవు.
Stagnate adj పారకుండా నిలిచివుండే. * water పారకుండా నిలిచి చెడిపోయిన నీళ్ళు.
Stagnation n s stop of course, standing still జలము నిలచిపోవడము.death causes a * of the blood ప్రాణము పోగానే దేహములో నెత్తురు పారడము నిలిచిపోతున్నది. by the * of trade వర్తకము నడవకుండా నిలిచిపోయినందున.
Stagyrist n s అనగా. Stagyra అనే దేశములో పుట్టినవాడు. the * అనగాAristotle అనే పేరు గల మహాపండితుడు.
Staid adj grave; calm, quiet అణుకువుగల, తిన్నని, శాంతముగల.she is a very * woman ఆమె నిండా అణుకువ గలది.
Staidness n s అణుకువ, సాధుత్వము, పెద్దమనిషితనము.
Stain n s blot మరక. mark మచ్చ. the * of ink యింకి మరక.the *s of blood నెత్తురు మరకలు. *s of guilt పాపము యొక్క కళంకము.
Stained adj blotted మరకలుగల. or dyed చాయవేసిన, అద్దకముచేసిన, మలినమైన. the flower is * with red ఆ పుష్పములో యెర్రనిచారలు వున్నవి.
Stainless adj నిష్కళంకమైన, నిర్మలమైన.
Stair, or Stairs n s. మెట్టు, మెట్లు. a winding * orwinding *s తిరుగుళ్ళుగా వుండే మిద్దె పడిగట్లు. a house with one pair of *s వొకపై మిద్దెగల యిల్లు. a house with twopair of *s రెండు మిద్దెలు గల యిల్లు. he went upstairs మిద్దెమీది కెక్కినాడు. he went downstairs మిద్దె మీదనుంచి దిగినాడు. a well built with *s నడబావి. an upstair house మిద్దెయిల్లు. he is upstairs ఆయన మేడమీద వున్నాడు. he is downstairs ఆయన దిగువ యింట్లో వున్నాడు.
Staircase n s సౌపానము, మిద్దెపడి గట్లు, మెట్లు.
Stake n s a post or stick of wood గుంజ, గసిక, మేకు.any thing placed as a palisade కటకటాకమ్మి, గ్రాదికి నిలువుగావేశే కమ్మి. any thing pledged or wagered పందెము. state of being hazarded అపాయము. his reputation is at * in thisbusiness యీ పనిలో వాడి పేరుకు అపాయము వచ్చేటట్టు వున్నది. a * for impaling కొర్రు. he died at the * for this or theybrought him to the * for this ఇందున గురించి వాణ్ని వొక గుంజకు కట్టి ప్రాణముతో కాల్చివేసినారు.
Stalactitis n s ఒక విధమైన రాయి, చిత్రవిచిత్రమైన ఆకారములుగాతనకు తానే పెరిగే రాళ్లు, రాతి పువ్వు, స్ఫటికలింగము మొదలైనవి అనవచ్చును, దీన్ని శిలాజిత్తు అనిన్ని అంటారు.
Stale adj not fresh, old దినాలుపడ్డ, పాతగిలిన, పాశిన,మగ్గిన, మగ్గిపోయిన. * bread నిన్నా మొన్నా కాల్చిన రొట్టె.this is a * objection యిది పాత ఆక్షేపణ, పనికిరాని ఆక్షేపణ.a * story వినివుండే కథ. this is a * trick ఇది యిదివరకే చేసి చూచి పనికిరాదన్న యుక్తి. * news ఇది యిదివరకు అందరు విన్నసమాచారమేను. * aasafatida పాత యింగువ, కారు యింగువ, సారము చచ్చినయింగువ.
Staleness n s పాతగిలి వుండడము, సారము చచ్చివుండడము.from the * of the smell యిది మగ్గుకంపు కొట్టుతున్నది గనక.
Stalifed adj చేతి మేత వేసి పోషించబడ్డ.
Stalk n s the stem on which flowers or fruits grow తొడిమె,కాడ, వృంతము. the * of millet జొన్నదంటు. the * of a chimney పొగ గూటి స్తంభము.
Stalkinghorse n s వేటకుపొయ్యే వాడు జంతువులు బెదిరి పారిపోకుండాతనకు అడ్డముగా పెట్టుకొని పొయ్యేటిది. he uses religion as a *వైదికమనే వొక వేషము వేసుకొన్నాడు. తన మోసము అగుపడకుండా వైదికాన్నివొక అడ్డము పెట్టుకొన్నాడు. he used me as his * or understrapperతన మోసములు బైటపడకుండా నన్ను అడ్డు పెట్టుకొన్నాడు.
Stall n s for cattle కొట్టము, దొడ్డి. for a horse స్థానము.in this stable there are eight *s యీ లాయములో యెనిమిది గుర్రాలుకట్టేటందుకు యెనిమిది అంకణములు వున్నవి. a bench or form whereany thing is set to sale అంగడి. he hired a * in the marketఅంగడి వీధిలో వాడు వొక అంగడిని బాడిగెకు తీసుకొన్నాడు. a carpenter's * వడ్లవాడిదొడ్డి. a fishmonger's * చేపలంగడి. a book * పుస్తకాలుపెట్టి అమ్ముకొనేచోటు. the seat of a dignified clergyman in the chair గొప్పపాదిరిగారికి గుడిలో నియతముగా వుండే ఆసనము, యీ ఆసనములుగల వారికి మాన్యములు గలవు. a * for the finger అంగుళి రక్షకము,వేలికి తొందర లేకుండా దూర్చి పెట్టే గొట్టము.
Stalled adj చేతి మేత వేసి పెంచిన.
Stallion n s a horse kept for mares మావి గుర్రము, ఆడ గుర్రాలకుమావి యివ్వడమునకై పెంచి పెట్టుకొని వుండే మొగగుర్రము.
Stalwart adj stout, brave దార్ఢ్యముగల, శరీర పుష్టిగల.
Stamen n s the middle part of a flower కర్ణీక, పుష్పమునడిమిదిమ్మె.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment