Remittance n s money that is sent పంపిన రూకలు, పరదేశమునకు పంపిన పైకము.
Remnant n s శేషము, మిగత, నిలవ, లోతక్కువ. the * of the people (the survivors) తక్కినవాండ్లు, అనగా హతశేషులు, చావగా మిగిలినవాండ్లు. *s of cloth చించుకొన్నది పోగా మిగిలిన గుడ్డ. a quilt made of *s కత్తిరించగా మిగిలిన నానా వర్ణములు గల గుడ్డతునకలతో కుట్టిన బొంత.
Remonstrance n s ఆక్షేపము, ఖండన, న్యాయము, న్యాయనిరూపణము. he made *s against this claim యీ వ్యాజ్యమునకు ఖండన చెప్పినాడు our *s were in vain మా ఖండనలు వ్యర్ధమైపోయినవి.
Remora n s a let or obstacle విఘ్నము, అడ్డము, ఆటంకము, యిబ్బంది.
Remorse n s పశ్చాత్తాపము, అనుతాపము, తాను చేసిన పాపమును గురించిమనసులో మెమెరలాడే భేదము. he felt * at having committed the murder తాను హత్య చేసినందున గురించి మనసులో కుళ్లుకొంటూ వుండినాడు. he felt * at this అయ్యో యేల చేస్తినని దుఃఖపడ్డాడు. he felt no * at this యేల చేస్తిననే వ్యాకులమే వాడికి లేకపోయినది.
Remorseless adj నిర్దయాత్మకుడైన, క్రూరుడైన.
Remorselessly adv క్రురముగా, నిర్దయాత్మకుడై.
Remote adj దూరమైన. in * countries దూర దేశములలో. a secluded * spot యెడారిగా వుండే స్థలము. without the remotest chance of success కూడి వస్తున్నదనే ఆశ యెంత మాత్రము లేకుండా. I had not the remotest hope of seeing you here నిన్ను యిక్కడ చూస్తాననే తలంపే నాకు లేదు. there is not the remotest likelihood of his consenting వాడు యెంతమాత్రమున్ను వొప్పడు.
Remount v a to mount again తిరిగీ యెక్కుట. in the cavalry, a remount horse తాజా గుర్రము, విడిగోలు గుర్రము.
Removal n s నివృత్తి, విమోచనము, విడిచిపోవడము, తీశివేయడము, యెత్తివేయడము, లేకుండాచేయడము. after his * I went into the house వాడు ఆ యింటిలో నుంచి లేచిపోయిన తర్వాత నేను ఆ యింట్లోకి పోయినాను. after the * of the corpse ఆ పీనుగను యెత్తుకొని పోయిన తర్వాత. after the * of the disease ఆ రోగము నివృత్తి అయిన తర్వాత. after his * from the magistracy వాడికి పోలీసు వుద్యోగము పోయిన తర్వాత. after the * of ట్హే leg i. e. after the leg was cut off కాలును తీశివేసిన తర్వాత, అనగా,కాలు కోశివేశిన తర్వాత. before the * of the tree ఆ చెట్టును యెత్తివేయక మునుపు. before my * from my village నేను మా వూరు విడిచేటందుకు మునుపు.
Remove n s the act of changing place మరివొక యింటికి పోవడము, మరివొక యింటికి కాపురము లేచిపోవడము. at each * అడుగడుగుకు. in genealogy పురుషాంతరము. a change of dishes at dinners మారువడ్డన.
Removeability n s పరిహర్తవ్యత. from the * of these constables యీ బంట్రోతులను కావలెనంటే తోశివేయవచ్చును గనక. the * of magistrates is a security to the public పోలీసు అధికారులను కావలెనంటే తోసివేయవచ్చు ననేది లోకులకు వొక క్షేమము.
Removeable adj తోశివేయగూడిన, తీశివేయగూడిన, పరిహర్తవ్యమైణ. they say sin is * by penance ప్రాయశ్చిత్తము చేత పాపము పరిహారము కాతగ్గదంటారు.
Remuneration n s బహుమానము, ప్రత్యుపకారము, ఈడుకుయీడు, ప్రతికి ప్రతి. I gave him ten rupees as a * for his trouble వాడు పడ్డ ప్రయాసకు చెల్లుగా పది రూపాయలు యిచ్చినాను.
Remunerative adj చెల్లు అయ్యే, కట్టి వచ్చే, ఈడుకాగల. the * price కట్టివచ్చే వెల.
Renard n s (or Reynard,) Name for a fox.
Rencontre n s meeting, seeing suddenly; a sudden fight సందర్భము, సంధి, యుద్ధము.
Rendezvous n s సాంకేతిక స్థలము. a meeting by appointment సంకేతము చేసుకొని కూడడము. I went to the * but she did not come సంకేత స్థలానికి నేను పోయినాను గాని అది రాలేదు. she gave him a * వాడు రావడమునకు వొక సంకేత స్థలమును చెప్పినది. they had a * last night విన్న వాండ్లు సంకేతముగా కూడి మాట్లాడుకొన్నారు.
Renegade, Renegado n s. మతభ్రష్టుడు, పతితుడు. Originally it meant a Christian who has become a Mahomedan తురకమతములో బడ్డ ఖ్రిస్తువాడు.
Renewable adj మళ్ళీ చేయతగ్గ, మళ్లీ పుట్టతగ్గ.
Renewal n s పునఃసృష్టి, నూతన సృష్టి.
Renewed adj కొత్తగా పుట్టిన, నూతన సృష్టి, అయిన. after the skin was * కొత్త తోలు పెరిగిన తరువాత.
Renitency n s (resistance) అడ్డము, ప్రతి.
Rennet n s A liquor made by steeping the stomach of a calf in hot water, and used to coagulate milk for curds and cheese: sometimes written runnet తోడు, చేమిరి.
Renounced adj త్యజించబడ్డ, వర్జించబడ్డ, విడిచిపెట్టబడ్డ, వదులుకోబడ్డ. the customs * by them వాండ్లు మానుకొన్న మర్యాదలు.
Renovation n s నూతన సృష్టి, పునఃసృష్టి. after the * of his health వాడి వొళ్లు కుదిరిన తరువాత.
Renown n s ఖ్యాతి, కీర్తి, పేరు, ప్రసిద్ధి.
Renowned adj ప్రసిద్ధుడైన, పేరుపడ్డ.
Rent n s (a wound or tearing) చింపి, చినుగు, గాయము. money paid for lodging అద్దె, బాడిగె. or for land పన్ను. land granted rent free మాన్యము.
Rental n s the sum paid as rent బాడిగె, అద్దె, పన్ను.
Rentcharge n s అద్దె తోటిపాటుగా కొంత ధర్మానికి చెల్లించవలసిన రూకలు.
Renter n s he who pays money upon a lease బాడిగె యిచ్చేవాడు.an arrack * సారాయి గుత్తదారుడు.
Renunciation n s పరిత్యాగము, విసర్జనము. after his * of the business వాడు పని విడిచిపెట్టిన తరువాత.
Repaid adj తిరిగీ చెల్లించిన.
Repair n s mending బాగు చేయడము, చక్కబెట్టడము. he paid for the *s of the house ఆ యింటిని చక్కబెట్టడమునకు పట్టిన రూకలు యిచ్చినాడు. this house is in good * యీ యిల్లు చెక్కు చెదరకుండా వున్నది. this road is out of * యీ బాట ఖిలముగా వున్నది, పాడుగా వున్నది. his clothes are out of * వాడి బట్టలు శిధిలమై వున్నవి. this house is under * ఆ యింటిని బాగు చేస్తున్నారు, చక్కబెడుతున్నారు.
Repaired adj చక్కబెట్టిన, బాగుచేసిన.
Reparation n s restitution, amends పరిహారము, చెల్లు, ఈడు, తాను చేసిన అపకారమును పోగొట్టుకోవడమునకై చేసే పరిహారము. will this money make * for the injustice done? చేసిన అన్యాయమునకు యీ రూకలు చెల్లవునా? If you have done him a mischief you must make him * వాడికి నీవు అపకారము చేస్తే దాన్ని నీవు పరిహరించుకోవలసినది.
Repartee n s a clever witty reply చతురోక్తి, చాతుర్యోక్తి, సరసముగా చెప్పిన వుత్తరము, హటాత్తుగా చెప్పిన యెగతాళి మాట.
Repast n s ఫలాహారము, భోజనము.
Repayment n s మళ్ళీ యిచ్చి వేయడము, మళ్ళీ చెల్లించడము.
Repeal n s కొట్టివేయడము, నిషేధించడము. after the * of the law ఆ చట్టమును కొట్టివేసిన తరువాత.
Repeated adj మళ్ళీ చేసిన, మళ్ళీ చెప్పిన. he made * inquiries పునఘవిమర్శన చేసినాడు మళ్ళీ విచారించినాడు.
Repeatedly adv పదేపదే, మాటిమాటికి, మళ్ళీమళ్లీ, పలుమారు.
Repeater n s one who repeats మళ్లీ మళ్ళీ చెప్పేవాడు. a sort of watch గంటలు వాగే చిన్న గడియారము.
Repelling adj (unpleasant, harsh, vile) అసహ్యమైన, అసభ్యమైన.
Repentance n s పశ్చాత్తాపము, అనుతాపము, నొచ్చుకోవడము, వెనక చింతించడము, ముందర చేసి వెనక యేడవడము, పరావర్తనం A+. Milton on Christian Doctrine, Chapter XIX says * or rather that higher branch of it, called by the Greeks metanoia.
Repentant adj పశ్చాత్తాపపడే, అనుతాపపడే, చింతించే యేల చేస్తినని యేడ్చే.
Repercussion n s ఉత్పతనము, చెండు మొదలైనవి తగిలిన వురువడి చేత మళ్ళీ యెగియడము. * of sound ప్రతిధ్వని.
Repercussive adj తగిలిన వురువడి చేత మళ్ళీ యెగిసే.
Repertory n s కోశగృహము. the * of wit శృంగారాలవాలము. the * of arts శిల్పి శాస్త్ర గ్రంధము.
Reperusal n s మళ్ళీ చదవడము, పునర్విమర్శ.
Repetition n s మళ్ళీ చేయడము మళ్ళీ చెప్పడము, పునరుక్తి. on account of this * యిట్లా తిరిగీ చేసినందున. * of words or prayers పునశ్చరణ. silent * of prayers జపము.
Replenished adj నిండిన, సంపూరితమైన.
Replete adj సంపూర్ణమైన, భరితమైన, నిండిన. this book is * with beauties యీ పుస్తకము అందమైన శ్లోకములతో భరితమై వున్నది. this is * with errors యిది తప్పులతో నిండి వున్నది.
Repleteness n s సంపూర్ణత.
Repletion n s తృప్తి, సంపూర్తి. you should not eat to * నీవు వెక్కసమయ్యేటట్టుగా తినరాదు.
Reply n s ఉత్తరము, ప్రత్యుత్తరము, మారుమాట. he wrote a * and sent it to me ప్రత్యుత్తరము వ్రాసి నాకు పంపినాడు. in * to his letter అతను వ్రాసిన జాబుకు ప్రత్యుత్తరముగా.
Report n s meaning account వృత్తాంతము, సమాచారము, వదంతి.evil * and good * దూషణ భూషణలు. he wrote a * regarding the examination విమర్శ చేసి దాన్ని గురించిన సమాచారమును వ్రాసినాడు.by * he is a thief వాడు దొంగ అని వినికిడి, వాడు దొంగఅట. a man of good * మంచి పేరెత్తినవాడు. or noise ధ్వని. the * of a gun పిరంగిశబ్దము.
Reporter n s సమాచారము చెప్పేవాడు, యెరుక చేసేవాడు.
Repose n s శయనము, నిద్ర. quiet నెమ్మది, విశ్రాంతి.
Reposed adj విశ్రమించిన. the authority which is * in his hands వాని కిచ్చిన అధికారము.
Repository n s a place for storing things ఉంచే స్థలము, అధారము. a hive is a * for honey తేనెకు తుట్టె ఆధారము, వుండే స్థలము.
Reprehensible adj నింద్యమైన, దూష్యమైన. * conduct దురాచారము, కాని పని.
Reprehensibly adv అతి నింద్యముగా. he was * indulgent వాడు అధిక చనువు చేసినాడు. he was * severe అతి క్రౌర్యము చేసినాడు.
Reprehension n s చీవాట్లు, గద్దింపులు, దూషణ.
Representation n s likeness ఆకారము. account given మనవి, విజ్ఙాపన, వృత్తాంతము. appearance on behalf of another person ప్రత్యామ్నాయముగా పోవడము. a * of a woman స్త్రీ ప్రతిమ theatrical* వొకని వలె వేషము కట్టి ఆడడము, అనగా నాటకము.
Representative n s ప్రత్యామ్నాయముగా వచ్చిన మనిషి, వకీలు. the heirs are the *s of the deceased చనిపోయినవాడి వార్సుదార్లు వాడికి ప్రతిగా వున్నారు, వాడి స్థానానికి వాడి వార్సుదార్లుగా వున్నారు. the baron is an infant and his uncle is his * వాడు పసి బిడ్డగా వున్నందున వాడి పినతండ్రి అతనిపని చూస్తున్నాడు. they constituted him their * తమకు ప్రత్యామ్నాయముగా అతణ్ని పంపినారు.
Repressed adj అణిగిన, తగ్గిన, మట్టుపడ్డ. she * her tears యేడ్పును అణుచుకొన్ణది. they were * అణిగినారు.
Reprieve n s a delay or remission of capital punishment తల తీయవద్దు తాళవలసినదని వచ్చిన ఆజ్ఞ. he gained a * వాణ్ని అప్పుడు వురి తియ్యకుండా నిలిపినారు, వాడికి శిక్ష చెయ్యకుండా నిలిపిపెట్టినారు. the morning he was to be hanged a * arrived వాణ్ని వురి తీయవద్దని ఆజ్ఞ వచ్చినది. he is a little better to-day; it is a short * వాడికి నేడు కొంచెము వాసిగా వున్నది, యీ వేళకు ప్రాణము నిలిచినది. they said they would come and take the money next morning; but they did not come; this he looked upon as a * రేపు వచ్చి రూకలు తీసుకొంటా మని వాండ్లు రాకపోయిరి అందువల్ల నాకు ఆ గండము తప్పినదన్నాడు, యూ వేళకు బ్రతికితి నన్నాడు.
Reprimand n s చీవాట్లు, గద్దింపులు.
Reprisal n s seizure by way of retaliation ప్రతి అపకారము.the French ships destroyed one of our towns; we therefore sent our ships and made *s వాండ్లు మాది వొకవూరును పాడు చేసినందుకు ప్రతిగా వాండ్లుది వొక వూరును మేము పాడుచేసినాము. at different *s (more correctly Reprises, French) that is, time after time పదేపదే, మాటిమాటికి.
Reproach n s దూషణ, నింద, అపవాదము.
Reproachable adj నింద్యమైన, దూష్యమైన, దూషించతగ్గ.
Reproachful adj దూష్యమైన, నింద్యమైన. he used * language దూషించినాడు, తిట్టినాడు.
Reproachfully adv నిందగా, అవమానముగా. he spoke * చీవాట్లు పెట్టినాడు.
Reprobate n s నీచుడు, క్షుద్రుడు, పతితుడు, పనికిరాని దుషటుడు, దుర్మార్గుడు, భ్రష్టుడు, పాపాత్ముడు.
Reprobation n s భ్రష్టత, నీచత్వము.
Reproduction n s తిరిగిపుట్టడము, మళ్ళీ వుత్పత్తి కావడము, పునరుత్పత్తి. See Colebr. I. 290.
Reproof n s చీవాట్లు, గద్దింపులు.
Reprovable adj నింద్యమైన, దూష్యమైన, తప్పైన.
Reprover v a కూకలు పెట్టేవాడు, చీవాట్లు పెట్టేవాడు, నిందించేవాడు.
Reptile n s ప్రాకేటిది. serpents, lizards, and other *s పాములు బల్లులు మొదలైన పాకే జంతువులు. he is a vile * వాడు వొక దుష్ట జంతువు.
Republican adj అరాజకమైన, ప్రజాప్రభుత్వము గల, ప్రజల చేత నియమించబడ్డ అధికారి చేత యేలబడే.
Republick n s Originally meant a city, a town పురము, ప్రజల దొరతనము, రాజు లేకుండా ప్రజలు తామే చేసుకొనే దొరతనము, ప్రజా ప్రభుత్వము, సర్వసాధారణమైన దొరతనము, ప్రజలందరున్ను కూడి నియమించబడ్డ వాడివల్ల జరిగించబడే ప్రభుత్వము. the * of crows శానా కాకులు గుంపుగా కూడి గూళ్ళు కట్టుకొని వుండడము. In Aristoph Eccles. 853 polis is rendered Respublica. `The People (Laos is the Greek word) as an influential and important body, is Raj రాజ్యము SeeAsiat. Res. XVII. 400 `The Membu people in Assam acknowledge noauthority but that of the Raj or people generally. Thus, as in America, the sheep take the place of the shepherd.
Repudiation n s పరిత్యాగము, భార్యాపరిత్యాగము, పెండ్లాన్ని తోసివేయడము.+
Repugnance, Repugnancy n s. అసమ్మతి, అనిచ్ఛ, అసహ్యము, విరోధము. the child shewed great repugnancy to him ఆ బిడ్డ వాడి దగ్గర చేరేది లేదు, ఆ బిడ్డకు వాడంటే గిట్టదు. he felt much repugnancy to do so అట్లా చేయడమునకు వాడికి తల చీదరగా వుండెను.
Repugnant adj అసహ్యమైన, చీదరైన, విరోధమైన. this remedy is very * to him యీ చికిత్స వాడికి యిష్టము లేదు.
Repulse n s వోడిపోవడము, అపజయము, తరమకొట్టడము. he attacked our troops but he met with a * మా మీదికి దూరి అపజయమును పొందినాడు,వోడకొట్టబడ్డాడు.
Repulsion n s striking back again తగిలిన వురువడి చేత మళ్ళీ యెగియడము.
Repulsive adj అసహ్యమైన, చీదరైన. the food looks * ఆ అన్నము కండ్లకుయింపుగా వుండలేదు. this manners are * వాడి నడకలు అసహ్యకరములుగా వున్నవి. he is a * looking creature వాడు వొక వికార జంతువు, వాణ్ని చూస్తే అసహ్యము వస్తున్నది.
Reputable adj ప్రసిద్ధుడైన, పేరుబడ్డ, నమ్మతగిన. his father was a * merchant వాడి తండ్రి ప్రసిద్ధుడైన వర్తకుడుగా వుండెను.
Reputation n s పేరు, కీర్తి, యశస్సు. these people are by * thieves వాండ్లు దొంగలట.
Repute n s ఎన్నిక, తలంపు, కీర్తి. a man of good * మంచి పేరుగలవాడు. a medicine of doubtful * అప్రసిద్ధమైన మందు.
Reputed adj ప్రసిద్ధమైన, పేరుబడ్డ, యోగ్యమైన. the * father of the child ఆ బిడ్డకు తండ్రియని పేరుబడ్డవాడు, ఆ బిడ్డకు తండ్రియని పదిమంది వల్ల అనబడేవాడు.
Reputedly adv కీర్తిగా, ప్రసిద్ధిగా, వాడుకగా.
Requeim n s A hymn for the dead పీనుగ దగ్గిరపాడే మంగళము.
Request n s మనవి, ప్రార్థన, విన్నపము. a book much in * అందరున్నూ కోరే పుస్తకము. that cloth is not now in * ఆ గుడ్డను యిప్పుడు అడిగేవాండ్లు లేదు, దానికి గిరాకి లేదు.
Required adj కావలసిన, అగత్యమైన. It is not * అది అగత్యము లేదు. you are * to come tomorrow రేపు నీవు రావలసినది. your services are no longer * ఇక మీదట నీపని అక్కరలేదు, అనగా నిన్ను కొలువులోనుంచి తీశివేసినాము.
Requisite adj అవశ్యకమైన, అగత్యమైన. ten days will be * పది దినములు పట్టును. should it be * అగత్యమైతే, అవశ్యకముగా వుంటే. silence is * for this ఇందుకు నిశ్శబ్దముగా వుండవలెను. how much will be *? ఎంత పట్టును. things * to write వ్రాయవలసిన ప్రయోజనములు. rules * to learn నేరచుకోవలసినసూత్రములు. as much as is * కావలసినమట్టుకు.
Requisition n s ఆజ్ఞ, కోరడము, అడుక్కోవడము, బలాత్కారముగా యీడ్చి పనిలో వేసుకోవడము. they put his car in * వాడి బండిని వెట్టికి పట్టినారు. they put his services in * వాణ్ని వెట్టికి పట్టినారు. every ship was put in * వొక వాడ అయినా వూరికె వుండలేదు. all his ingenuity was put in * to discover thisదీన్ని కనుక్కోవడానకు వాడి ఆరణభరణ శక్తి చూచినాడు. a * was made for ten bullocks పది యెడ్లను వెట్టికి పట్టుకొని రమ్మని ఆజ్ఞ అయినది. at his * ఆయన కోరినందు మీదట, అతని ఆజ్ఞ చొప్పున. they put in * the whole of the jewels నగల నంతా యీడ్చివేసుకొన్నారు.
Requital n s return, for any good or bad office ప్రతికారము, ప్రతిక్రియ, చెల్లు. I did this as a * for his kindness ఆయన చేశిన వుపకారమునకు నేను ప్రతి చేశినాను. a just * తగిన బహుమానము, తగిన శిక్ష. he did not look upon that money as any * for his trouble తన ప్రయాసకు ఆ రూకలను వొక బహుమానముగా యెంచలేదు.
RES 959 To Resume v a To take back మళ్లీ పుచ్చుకొనుట. he *d the land `నేలను కట్టుకొన్నాడు, జఫ్తీ చేసుకొన్నాడు. he *d his seat మళ్ళీ కూర్చున్నాడు. he *d the bond when it was paid రూకలు చెల్లించి ఆ పత్రాన్ని మళ్ళీ తీసుకొన్నాడు. to begin again మళ్ళీ ఆరంభించుట. he *d his discourse or he *d the subject తిరిగీఅందున గురించి మాట్లాడ సాగినాడు. they *d the trade మళ్ళీ ఆ వర్తకానికి మొదలు పెట్టిరి.
RES 957 Respite n s Pause; interval వ్యవధానము, సావకాశము. a delay or remission of punishment సధ్యాశిక్ష జరిగించకుండా నిలిపి పెట్టవలసినదన్న ఆజ్ఞ.
Rescinded adj కొట్టివేయబడ్డ, తోశివేయబడ్డ.
Rescission n s కొట్టివేయడము, తోశివేయడము. after the * of this law ఈ చట్టమును కొట్టి వేశిన తర్వాత.
Rescissory adj abrogatory నిషేధకమైన.
Rescript n s ఆజ్ఞ, గురుశాసనము, రాజశాసనము.
Rescue n s కాపాడడము, తప్పించడము, రక్షణ. he called me to the * నన్ను వచ్చి తప్పించుమని కూకలు పెట్టినాడు. they came to the * వాడి ఆపద నివారణము చేయడమునకై వచ్చినారు.
Rescued adj నివారణము చేయబడ్డ, తప్పించబడ్డ, విడుదలచేయబడ్డ.
Research n s పరిశోధన, విచారణ, విమర్శ, వెతకడము. in his *es he found this వాడు వెతకడములో యిది దొరికినది Asiatic *es భారతవర్ష చర్చ ఏషియా దేశములలో నానా విద్యలను గురించి చేశిన విమర్శ. a man of great * or curiosity నిండా పరిశోధకుడు.
Resemblance n s likeness పోలిక, సాదృశ్యము. do you see the * between him and his brother? వాడు వాడి అన్నా వొకటే పోలికగా వున్నారు చూస్తివా. or picture పటము.
Resembling adj తుల్యమైన, సమానమైన, సాదృశ్యమైన, పోలికగావుండే.a flower * the lily తామరవంటి వొక పువ్వు. * this ఇటువంటి. * that అటువంటి. * a tree చెట్టువలె వుండే.
Resentful adj కోపిష్ఠియైన, మండిపడే, చిరచిరలాడే.
Resentment n s కోపము, ఆగ్రహము, క్రోధము, క్రౌర్యము.
Reservation n s reserve పెట్టుకోవడము, నిలుపుకోవడము.concealment of something in the mind మర్మము, కాపట్యము. he paid all the debts without * వొకటిన్ని నిలపకుండా ఋఉణమునంతా తీర్చివేశినాడు. mental * కాపట్యము, మనస్సులోని మర్మము. he produced all the accounts without * వొకటిన్ని దాచకుండా యావత్తు లెక్కలనున్ను తెచ్చి యెదట పెట్టినాడు. they sold the goods without * ఆ సరుకులను వచ్చినకాడికి అమ్మివేశినారు, నిలువ లేకుండా ఆ సరుకులనంతాఅమ్మివేసినారు.
Reserve n s సంచితము, దాచిపెట్టినది, ఎత్తిపెట్టినది, నిలిపిపెట్టినది, కట్టిపెట్టినది. a man speaks to his enemy with * విరోధితో మర్మముగా మాట్లాడుతాడు. he spokewithout * దాచకుండా చెప్పినాడు, కపటము లేకుండా చెప్పినాడు.he speaks to his friend without * విహితుడితో నిష్కపటముగా మాట్లాడుతాడు. * of mind కాపట్యము. a man of * కపటి, మర్మి, పరులకు మనసు యివ్వనివాడు. the * of an army యుద్ధములో కలియక కడగా నిలిపి పెట్టిన జనము, దళము.
Reserved adj remaining నిలిచిన, ఎత్తిపెట్టిన, పెట్టి పెట్టిన, నిలిపి పెట్టిన. this must be * till tomorrow దాన్ని రేపటిదాకా పెట్టి పెట్టవలసినది. he was * for another fate వాడికి వేరే చావు వున్నది గనక యీ చావు తప్పినది. modest, sullen, not frank మూతి ముడుచుకొని వుండే, పుట్ట ముంగివలె వుండే. she is very * అదివొకరికిన్ని మనసు యిచ్చేదికాదు, అది అంతా లోగా వున్నది.
Reservedness n s కాపట్యము, మర్మము, పరులకు మనసు యివ్వక వుండడము.
Reservoir n s తొట్టి, తటాకము, గుంట. a * on a hill మెట్ట మడుగు, దొన.
Re-shipment n s దిగుమతి చేసినదాన్నే మళ్ళీ యెగుమతి చేయడము.
Residence n s వాసము, నివాసము mansion ఇల్లు, గృహము. He has his * there అక్కడ వుంటాడు. temporary * or lodging విడిది బస.during my * there నేను అక్కడ వుండేటప్పుడు.
Residency n s the house or duty of a foreign minister స్థానాపతి వుండే యిల్లు, ఆయన యొక్క వుద్యోగము.
Resident n s నివాసి, పరదేశవాసి, కాపు, వుండేవాడు. phrase for a minister at a foreign court స్థానపతి, వకీలు.
Residuary adj మిగిలిన, నిలవగా వుండే, అవశిష్టమైన. a * legatee కడాపటికర్త, అనగా మరణ శాసనములో ఆయాసొత్తులు వారి వారికని యేర్పరచి వ్రాశి కడమ యావత్తు సొత్తు కన్ను బాధ్యుడుగా యేర్పరచబడ్డవాడు.
Residue n s అవశిష్టము, నిలువ, మిగత, శేషము. many were slain and the * fled శానామంది చంపబడ్డారు, కడమవాండ్లు పారిపోయినారు, హతశేషులు పారిపోయినారు.
Residuum n s శేషము, మిగత, నిలిచినది, పిప్పి, మష్టు, పిష్టము, గసి.
Resignation n s giving up, relinquishment పరిత్యాగము, మానుకోవడము, వొప్పగింత పెట్టడము. after his * of his duty ఆ వుద్యోగమును మానుకొన్న తర్వాత, చాలించిన తర్వాత patience సహనము. quite submission లోబడడము, లొంగడము.
Resiliency n s elasticity లఘిమ, లాఘవము.
Resin n s గుగ్గిలము, సజ్జాకారము, సజ్జరసము. the * of a mango మామిడిపండుమీద పేరి గడ్డగా కట్టుకొన్న జీడి.
Resinous adj గుగ్గిలసంబంధమైన.
Resipiscence n s మళ్ళీ తెలివి తెచ్చుకోవడము. after his * వాడికి మళ్ళీ తెలివి వచచిన తర్వాత.
Resistance,Resistence n s. ఆటంకము, ఎదురు, అడ్డము, విరోధము.
Resistless adj నిరాటంకమైన, ఎదురు లేని.
Resolute adj నిశ్చలమైన, దృఢమైన, స్థిరమైన. a * man నిబ్బరమైన వాడు.
Resolution n s స్థైర్యము, స్థిరబుద్ధి, ధైర్యము, సాహసము. a man of* సాహసుడు, వీరుడు. an intent or plan ప్రతిజ్ఞ నిశ్చితాభి ప్రాయము. * doubts సందేహ నివారణము. after the * of sugar in water బెల్లము నీళ్ళలో కరిగిపోయిన తర్వాత. after the * of bodies into smoke అవి పొగగా యెగిసిపోయిన తర్వాత.
Resolvable, Resoluble adj కరగతగిన, సాధ్యమైన, తీర్చగూడిన, వీడ్చగూడిన. this question is * by this rule ఈ సూత్రము చేత యీ సందేహము తీరతగ్గది, నివారణము కాతగ్గది, వీడతగ్గది.
Resolve n s నిశ్చయము, రూఢి, నిష్కర్ష, సంకల్పము.
Resolved adj నిశ్చయించబడ్డ, తీరిన. It was * to send him వాణ్ని పంపించేదని నిశ్చయమైనది.
Resonant adj ప్రతిధ్వని కారియైన.
Resort n s గమనాగమనము. a place of great * బహుమంది వస్తూ పోతూ వుండే చోటు. a place of * పది మంది కూడే చోటు.
Resounding adj మోగే, వాగే, ధ్వనించే, దివ్యమైన ధ్వని గల.
Resource n s ఉపాయము, గతి, ఆశ్రయము, మార్గము, సాధనము, సాధకము.I am without * నాకేమిన్ని గతిలేకుండా వున్నాను. a man of no *కల్పనాశక్తి లేనివాడు.
Resourceless adj దిక్కుమాలిన, గతిమాలిన.
Respect n s గౌరవము, మర్యాద, ఆదరణ, లక్ష్యము. In this * ఈ విషయమునందు. in all *s అన్ని విధాల. in some *s కొన్ని విషయములలో.they did this as a mark of * గౌరవము కొరకై దీన్ని చేసినారు. they shewed him * వాణ్ని నిండా ఆదరించినారు. he never was wanting in * to them వాండ్లకు వాడు యెప్పుడున్ను అగౌరవము చేయలేదు. out of * to his father అతని తండ్రి యందుండే గౌరవమును పట్టి. *s (compliments) దండములు దీవెనలు. give my *s to your brother మీ అన్నగారికి నా దండములు చెప్పు. with * to your brother I know nothing at present నీ అన్నను గురించి యిప్పట్లో నాకు వొకటిన్నీ తెలియదు. I paid him my *s ఆయన దర్శనానికి పోయినాను. that man shows no self * వాడు యోగ్యుడు కాడు, పెద్ద మనిషి కాడు. * of persons Rome 2. II పక్షపాతము. A+. P+. పక్షపరపక్షము. H+. thou shalt not have not have * of persons in judgement తీర్పు చెప్పడములో నీకు పక్షపాతము కారాదు.
Respectability n s గౌరవము, గణ్యము. a man of * పెద్దమనిషి.
Respectable adj గౌరవమైన, గణ్యమైన పూజ్యమైన. a * man మర్యాదస్థుడు,పెద్ద మనిషి. he obtained it by * means అది వాడికి గౌరవముగా చిక్కినది.
Respected adj పూజ్యమైన, గణ్యమైన, ఘనమైన. your * father శ్రీమాన్ మీ తండ్రిగారు. my * mother మాతృశ్రీ, తల్లిగారు. our * Governor మహారాజశ్రీ గౌనరుగారు.
Respecter n s విచారించేవాడు. (God is no * of persons) Acts X.35. ఈశ్వరో మనుష్యాణాం అపక్షపాతి, దేవుడు జనులయందు పక్షపాతము కలవాడు కాదు, దేవుడికి వొకడు హెచ్చు వొకడు తక్కువ లేదు.
Respectful adj వినయముగల, వినయ విధేయముగల.
Respectfully adv వినయముగా, భయభక్తితో. I am most * your's తమ శేవకుడైన.
Respecting prep గురించి, విషయమై. * this యిందున గురించి.
Respective adj వారివారి, తమతమ, ఆయా. I went to their *houses వారివారి యిండ్లకు పోయినాను. they went to their * lodgings తమతమ బసలకు వెళ్ళిరి. their * children వారివారి బిడ్డలు. In the * villages ఆయా గ్రామములలో.
Respectively adv ప్రత్యేకముగా, వేరేవేరే. they received four rupees * తలా నాలుగు రూపాయీలు ముట్టినవి. the five fingers are * known by these names as the first is the thumb &c. అయిదు వేళ్లున్ను యీ పేళ్ళ చేత పరత్యేకముగా తెలుసుకోబడుతవి, యేలాగంటే మొదటిది బొట్టన వ్రేలు. he delivered their letters to them * వారివారి జాబులను వాండ్ల వాండ్లకు చేర్చినాడు. the three children were* 8, 7, and 6 years old ఆ ముగ్గురు బిడ్డలు వొకడు 8 వొకడు 7 వొకడు 6 యేడ్లవాండ్లుగా వుండిరి.
Respiration n s ఊపిరి, శ్వాసము.
Respiratory adj ఊపిరిని, గురించిన, శ్వాస సంబంధమైన.
Resplendence n s ప్రకాశము, కాంతి.
Resplendent adj ప్రకాశమైన, కాంతిగల.
Resplendently adv ప్రకాశమానముగా, అతిశోభాయమానముగా.
Respondent n s ప్రతివాది.
Response n s ఉత్తరము, ప్రత్యుత్తరము.
Responsibility n s ఉత్తరవాదము, భారము. the * rests upon the security పూటబడ్డవాడు వుత్తరవాదము చేయవలసినది, జామీనుదారుడిమీద జవాబుదారి వున్నది. I did it on his * వాని వుత్తరవాదము మీద దీన్ని నేను చేస్తిని నేను చేసిన పనికి వుత్తరవాది వాడు. he acted on his own * మంచో చెడో తానే తల మీద వేసుకొని చేసినాడు.
Responsible adj ఉత్తరవాదియైన. a secuirty is the man who makes himself * పూటబడ్డవాడు వుత్తరవాది అవుతున్నాడు. he that is * ఉత్తరవాదిగా వుండేవాడు. I will be * for it అందుకు నేను వుత్తరవాదిని, అందుకు నేను జవాబుదారుణ్ని.
Responsive adj ప్రత్యుత్తరమైన. they sung * వాండ్లు యెదురు పాడినారు.
Rest n s sleep నిద్ర. respose శమనము, విశ్రమము, విశ్రాంతి, విరామము, ఎడ. he was at * వాడు నిద్రపోతూ వుండినాడు, చచ్చినాడు. he took his * నిద్ర పోయినాడు. at night every thing is at * రాత్రి పూట అన్నీ నిశ్చలముగా వుంటవి. * house (a lodge) సత్రము, చావిడి. he is now at * వాడు యిప్పుడు నిద్రపోయినాడు, అనగా చచ్చినాడు.this sets the question at * ఇందువల్ల ఆ సంశయము తీరదు. he setthe question at * ఆ సందేహమును తీర్చినాడు. absence of motion నిశ్చలముగా వుండడము, చలించకుండా వుండడము. quiet peace నెమ్మది హాయి. what we * upon (as a cushion, &c) వొరుగు దిండు మొదలైనవి.the remainder కడమ, కొదవ, నిలవ, తక్కినవి, శేషము. the Bharata and the * of the Puranas భారతము మొదలైన పురాణములు. the dictionary and the * of the books నిఘంటు మొదలైన గ్రంథములు.three were drowned and the * came to shore ముగ్గురు ముణిగిపోయినారు, కడమ వాండ్లు గట్టుకు వచ్చి చేరినారు. the same with all the * of the country దేశముతోటి పాటుగా, లోకముతోటిపాటుగా. for the * what he said was true మెట్టుకు వాడు చెప్పినది నిజము. In Hebr. IV. 9. విశ్రామము.A+.
Restiff adj or restive, obstinate; stubborn, మూర్ఖమైన, మొండి.this horse is * యీ గుర్రము తొమదర చేస్తున్నది, మొండి చేస్తున్నది.
Restituted adj కుదిరిన. after his health was * వాడికి వొళ్ళు కుదిరిన తర్వాత.
Restitution n s restoring or making good ఉత్తరవాదము చేయడము, ఈడు చేయడము. I killed that man's horse and to make * I gave him two others వాడి గుర్రాన్ని చంపినాను, గనక దానికి చెల్లుగా రెండు గుర్రాలను యిచ్చినాను. If the thief is caught will he make *? ఆ దొంగ చిక్కితేనేమి ఆ రూకలను మళ్ళీ చెల్లించబోతాడా. he made * ఉత్తరవాదము చేసినాడు.
Restless adj నిద్రలేని, నిమ్మళము లేని. being in a fever, he was * జ్వరముగా వుండినందున వాడు నిలిచిన చోట నిలవలేదు, వాడికి పడక పొందలేదు the * flies tormented the horse నిలిచిన చోట నిలవని ఈగలు గుర్రాన్ని తొందరపెట్టినవి. he passed a * night రాత్రి అంతా వాడికి నిద్ర లేదు, పడక పొందలేదు.
Restlessly adv తొందరగా, నిమ్మళము లేక.
Restlessness n s తొందర, ఆయాసము, నిలిచిన చోట నిలవక వుండడము.the * caused by fever జ్వరము వల్ల పడక పొందక వుండడము. the * of a lover కామి యొక్క అల్లాటము. from the * of these dogs యీ కుక్కలు నిలిచిన చోట నిలవవు గనక. from the * of those leaves ఈ ఆకులు యెప్పుడూ చలిస్తూ వుంటవి గనక.
Restoration n s మళ్ళీ స్థాపించడము, మళ్ళీ కుదరడము. after the * of his health వాడికి వొళ్ళు కుదిరిన తర్వాత. after the king's *రాజుకు మళ్లీ రాజ్యము వచ్చిన తర్వాత. after the * of the money ఆ రూకలు మళ్లీ తన చేతికి వచ్చిన తర్వాత, వాడు ఆ రూకలను మళ్లీ చెల్లించిన తర్వాత.
Restorative adj మళ్లీ బ్రతికించే అప్యాయమానమును చేసే, సేద తీర్చే.a * medicine మళ్లీ బ్రతికించే మందు, సంజీవి.
Restorer n s బాగుచేసేవాడు, కుదిరించేవాడు.
Restrained adj అణిగిన, అణిచిపట్టిన, బిగబట్టిన, కట్టులోపెట్టిన.
Restraint n s check నిర్బంధము, విరోధము, ఆటంకము, కైదు. his father's presence was a * on him తండ్రి యెదట వుండడము వాడికి వొక నిర్బంధముగా వుండినది. their presence was no * to him వాండ్లు వున్నారని వాడికి సంకోచము లేదు. they kept the prisoner under * ఆ కైదీని కయిదులో వుంచినారు, నిర్బంధములో పెట్టినారు. self * దమము, దాంతి.I saw he was under some * about this యిందున గురించి వాడు కొంచెముఅజ్జాయించినట్టు కనుక్కొన్నాను. he spoke without * జంకు లేకుండా మాట్లాడినాడు.
Restriction n s కట్టు, నియమము, నిర్బంధము. this rule is to be understood with some *s యీ సూత్రమును తెలుసుకోవడములో కొన్ని నిబంధనలు కూడా వున్నవి అనగా యీ సూత్రము కొన్నిచోట్ల చెల్లదు.
Restrictive adj that which restricts, నిర్బంధముగల, నియమము గల.
Result n s ఫలము, ఫలితార్థము, తీర్పు what was the *? యేమిగా తీరినది. this marriage had very unhappy *s యీ పెండ్లి ఫలము మహత్తైన దౌర్భాగ్యముగా పరివసించినది. the * of this was very happy యిందువల్ల సుఖము సంభవించినది. this is the * of telling lies అబద్ధాలు ఆడడమునకు యిదే ఫలము.
Resume n s (or Summary: French) సంక్షేపము.
Resumed adj మళ్ళీ పుచ్చుకొన్న, మళ్ళీ ఆరంభించిన, జప్తీ చేయబడ్డ.a * estate జప్తీలో వుండే సంస్థానము.
Resumption n s the act of taking back మళ్ళీ పుచ్చుకోవడము, పునర్గ్రహణము. the act of beginning again మళ్ళీ మొదలు పెట్టడము, ఆరంభించడము. sequestration జప్తీ.
Resurrection n s తిరిగీ లేవడము C. P. G. పునరుత్థాపనము H.శ్మశానోత్థానం A+ మృతకోత్థాపనం (Roman Catholic version) The day of * ఉత్థానదివసం.
Resuscitation n s the bringing back to life, మళ్లీ ప్రాణము వచ్చేటట్టు చేయడము.
Resuscitative adj మళ్లీ బ్రతికించే. during the * process మళ్లీ బ్రతికించేపని జరుగుతూ వుండగా. Ann. Reg. 1805. Chr. 360.
RET 961 Retrenchment n s తగ్గించడము, మట్టుచేయడము. even after these *s themoney was not enough శలవులను మట్టు చేశినప్పటికిన్ని ఆ రూకలు చాలక పోయినవి.
Retail n s చిల్లర బేరము, చిల్లరగా చేసే మారుబేరము. a * shop చిల్లర అంగడి. a * shopkeeper చిల్లర అంగడివాడు, మారుబేరానికి కొని అమ్మే చిల్లర అంగడివాడు.
Retailer n s he who sells in small quantities చిల్లర బేరగాడు, చిల్లరగా అమ్మేవాడు. the * of this story యీ కధ విని తిరిగీ చెప్పినవాడు.
Retainer n s An adherent; a dependant ఆశ్రితుడు, పోష్యవర్గుడు. a * of justice i. e. a bailiff కోర్టుసంబంధమైనవాడు, ముఖ్యముగా కోర్టు బంట్రోతు. a fee to engage counse. లాయరుకు మొదట యిచ్చే వర్తన రూకలు.
Retaliation n s ప్రతికారము, ప్రతికిప్రతి, ఈడుకుయీడు.
Retaliatory adj ప్రతికిప్రతి, సరికిసరియైన. a * invasion వాండ్లు మా దేశము దోచుకొన్నారు గనక దానికి ప్రతి మేము వాండ్ల దేశమును దోచుకొన్నాము.a * lawsuit ప్రతివ్యాజ్యము యెదురు వ్యాజ్యము.
Retching n s వోకర.
Retention n s the act of retaining, hold పట్టు, నిలపడము. the * of these rules in the mind is not sufficient యీ సూత్రములను మనసులో నిలపడము చాలదు * of urine నీరు కట్టు. an infant has no * of urine బిడ్డ వుచ్చను నిలప నేరదు.
Retentive adj నిలుపుకొనే శక్తి గల. a * memory మంచి జ్ఞానము, ధారణశక్తి.
Retentiveness n s పట్టు, జ్ఞాపకశక్తి.
Reticence n s Concealment by silence మనసులో పెట్టుకొని బయిట విడకుండా వుండడము.
Reticular, Reticulated adj like a net వలవలె వుండే, అల్లిక పనిగా వుండే.
Reticulation n s making like a net వలవలె చేయడము, అల్లిక పని.
Reticule, or Ridicule n s. దొరసానులు చేతికి తగిలించుకొనే జోలనాసంచి.
Retina n s కంటి గుడ్డు నడమ అద్దమువలె వుండే పొర. objects painted on the * కంటికి అగుపడే వస్తువులు.
Retinue n s a suit or train పరిజనము, పరివారము.
Retired adj ఏకాంతమైన, వొంటిగా వుండే. a * house వొంటికొంప. a * village వొంటిగా వుండేవూరు. he lives very * వాడు నిండా యేకాంతముగా వుంటాడు.
Retiredly adv ఏకాంతముగా, వొంటిగా.
Retiredness n s ఏకాంతము.
Retirement n s living in seclusion ఏకాంతవాసము, చాలించుకోవడము. they live in * అజ్ఞాత వాసముగా వున్నారు. * from business పని చాలించుకోవడము.
Retiring adj meek దీనమైన సాత్వికమైన, సాధువైన.
Retort n s a censure or incivility returned ప్రతినింద, ప్రతికి ప్రతిగా చేరిన నింద, ప్రతి అమర్యాద. a glass vessel కొంగ మెడవంటి మూతిగల మందులు చేసే కుప్పె.
Retouching n s దిద్దుబాటు, సవరింపు.
Retraction n s తిప్పుకోవడము. after his * of his former story ముందర చెప్పి అట్లా కాదని మళ్లీ తిప్పుకొన్న తర్వాత.
Retreat n s act of retiring పలాయనము వెనక్కు మళ్లుకోవడము, తిప్పుకోవడము. during the * of the army ఆ దండు వెన్కు మళ్లుకోవడములోa private place ఏకాంతస్ధలము, నిర్జన ప్రదేశము. he had now no * వాడికి వాగడానకు లోటు లేకపోయినది. the * of a monk ఆశ్రమము, మఠము.place of security భద్రమైన స్థలము. this hill is a * for bears యీ కొండ యెలుగ్గొడ్లకు యిరవు.
Retribution n s ప్రాయశ్చిత్తము, శిక్ష, దండన. this is a just * to you యిది నీకు కావలసినదే, యీ ప్రాయశ్చిత్తము నీకు కావలశినదే, యిది నీకు శిక్ష. a place of * చెరసాల, నరకము. this was a * to him వాండ్ల వుసురు వాడికి తాకినది. to make * ప్రాయశ్చిత్తము చేసుట.
Retributive adj శిక్షగా వుండే.
Retrocession n s అపసరణము, వెనకకు నడవడము.
Retrograde adj విపరీతమైన, విరుద్ధమైన, వక్రించిన, ప్రతిగామియైన.
Retrogression n s ప్రతిగమనము, వెనకకు నడవడము.
Retrospect, Retrospection n s. పునర్విమర్శ, గతంజరిగిన దాన్ని గురించినవిమర్శ.
Retrospective adj పునర్విమర్శ చేసే, గతం జరిగినదాన్ని విచారించే.
Retroversed adj లోనిది బైటికి తిప్పబడ్డ.
Return n s తిరిగీ రావడము, తిరిగీ పోవడము. after his * మళ్లీ వచ్చిన తర్వాత, తిరిగీ పోయిన తర్వాత. before his * వాడు మళ్లీ రాక మునుపే. I heard of his * వాడు మళ్లీ వచ్చినాడని విన్నాను. this was the * they made for his kindness వాడు చేసిన వుపకారానికి వాండ్లు ప్రతిచేశినది యిది. on their * home వాండ్లు దేశానికి వచ్చి చేరి నందు మీదట, యింటికి వచ్చి చేరినందుమీదట. on his * from his journey వాడు పోయిన ప్రయాణము వచ్చి చేరిన తర్వాత. they exported silks and the *s were cotton పట్టుబట్టలు పంపించి దానికిప్రతి నూలు బట్టలు తెప్పించుకొన్నారు. the * of the fever మరకపాటు. in * for his kindness వాడు చేశిన వుపకారమునకు ప్రతిగా. a kind of account వొక విధమైన లెక్క.
Reunion n s (cant for a party) విందు. cohesion or concord సంధి,సమాధానము. after their * వాండ్లు మళ్లీ సమాధానపడ్డ తర్వాత.
REV 963 To Reverence v a పూజ్యతచేసుట, గౌరవము చేసుట, గురుత్వము చేసుట. they * him వాణి యందు గురుత్వము చేసినారు. he did not * the law వాడు చట్టమును లక్షయము చేయలేదు. in Marks XII. 6. They will * my son నాకొడుకు యందు గురుత్వము చేతురు, గౌరవము చేతురు.
Revealed adj బైటపెట్టిన, బాహిరంగము చేయబడ్డ. a certain thing was * tohim దైవాధీనము వాడికి వొకటి తెలిశినది. the * word i. e. the Bible బైబిలు గ్రంథము.
Revel n s a feast with loose and noisy jollity తిని తాగి అరుస్తూతుళ్ళడము, విందులో తిని వుల్లాసముగా వుండడము. Krishna's * కృష్ణ లీలలు. * rout(Johnson) అల్లరి మూక.
Revelation n s బైట పెట్టడము, తెలియచేయడము, ప్రకటన చేయడము. the bookof *s పరకాశిత భవిష్యద్వాక్యము, ప్రకటనము, ప్రత్యక్ష పుస్తకములు A+ &c.
Reveller n s తిని తాగి తుళ్ళేవాడు.
Revelling n s loose jollity తిని తాగి తుళ్ళడము.
Revelry n s loose jollity తిని తాగి తుళ్ళడము.
Revenge n s చలము తీర్చుకోవడము, కసితీర్చుకోడము, కడుపుమంట తీర్చుకోవడము, వైరశుద్ధి. he did this out of * చలము చేత దీన్ని చేసినాడు. he did good to his enemy; this was a glorious * శత్రువుకు వుపకారము చేసినాడు, దీనికంటే వేరే చలము తీర్చుకోవడమే బ్రహ్మానందము. he took a cruel * కొంచెపు పనికి కొండంత చలము సాధించినాడు.
Revengeful adj క్రూరమైన, చలము పట్టిన, పగబట్టిన, కసితీర్చుకోవలెనని వుండే. the wise pardon but every fool is * తెలిసినవాండ్లు క్షమిస్తారుగాని అవివేకులు చలము పట్టుతారు. In A 2 Cor. VII. II. దండకరణేచ్ఛా A+. దండన G+.
Revengefully adv క్రూరముగా. he did this * చలము చేత దీన్ని చేసినాడు.
Revenger n s శాస్తి చేశేవాడు. God is the * of the poor బీదలను నొప్పిస్తే దేవుడు శాస్తి చేసును.
Revenue n s income వచ్చుబడి, వరవు, వరుమానము. what is the * of this pagoda? యీ గుడికి యేమి వచ్చుబడి. his gross * is a thousand rupees; the clear income is about three hundred వాడి మొత్తము వచ్చుబడి వెయ్యి రూపాయలు నికరం వచ్చుబడి మున్నూరు రూపాయలు. his * is insufficient for food and clothing వాడికి వచ్చేది కూటికి గుడ్డకే చాలదు. to pay * పన్ను చెల్లించుట. a * officer i. e. a bailiff &c. సుంకపు బంట్రౌతు. the * office రాజ్యము యొక్క వచ్చుబడిని విచారించే కచ్చేరి. the * branch of the service ములికీపని, దివాణపు వచ్చుబడిని విచారించే పని.
Reverberating adj వెనకకు తిప్పికొట్టే. a * furnace వొక విధమైన కొలిమి.
Reverberation n s వెనకకు తిప్పికొట్టడము. the * of sound ప్రతిధ్వని. the * of heat కాకవిసరడము.
Reverberatory, or a reverberating furnace ఒకవిధమైనకొలిమి
Revered adj పూజ్యమైన, గురుత్వమైన. my mother మాతుశ్రీ, తల్లిగారు.
Reverence n s a salutation, bow దండము, నమస్కారము. awful regard, respect, courtesy భయము, గౌరవము, గురుత్వము. his * గురువులవారు,పాదిరివాడు, అయ్యవారు, ఉపాధ్యాయులు.
Reverend adj పూజ్యులైన, ఘనమైన, మహత్తైన. his * father శ్రీమాన్ తండ్రిగారు.a * temple నిండా పూజ్యమైన గుడి, దొడ్డ గుడి, మహత్తైనగుడి. a * tree మహాత్మ్యముగల వృక్షము, దొడ్డ చెట్టు. a title of the clergy as the * Mr. Thompson పాదిరి తామసన్ దొరగారు.
Reverent, Reverential adj very humble వినయము గల.
Reverently, Reverentially adv వినయముగా.
Reverie n s loose musing; irregular thought పరధ్యానము, దీర్ఘ చింత.I spoke to him but he was in a * and did not hear me నేను వాడితో చెప్పినాను గాని వాడు పరధ్యానముగా వుండినందున నేను చెప్పినది వాడు వినలేదు.
Reversal n s తిప్పడము, అన్యధా చేయడము, విపరీతము, విపర్యయము. after the* of this decree యీ తీర్పును మార్చి వేశిన తర్వాత.
Reverse n s the opposite side వెనకటి పక్క. on the coin there was the queen's face, and on the * there was the date ఆ నాణెముకు పైతట్టు రాణి ముఖము వుండినది, వెనకటితట్టు సంవత్సరము వుండినది. vicissitude విపరీతము,విపర్యయము, వ్యత్యయము. this is the * of what he said వాడు చెప్పినదానికియిది విరుద్ధము వ్యత్యయము. he met with many *s వాడికి అనేక దౌర్బాగ్యములుసంభవించినవి. the contrary విరుద్ధము, విరోధము.
Reversed adj వెనక ముందైన, తల్లకిందులుచేయబడ్డ, విపరీతమైన. he read thealphabet in * order ఆ అక్షరములను కొన మొదలుపెట్టి చదివినాడు, తల్లకిందులుగాచదివినాడు.
Reversion n s బాధ్యత అనగా వుండే వాడు పోయిన తర్వాత రావలసిన బాధ్యత,సొత్తులు మొదలైన వాటికి యిప్పట్లో కర్తగా వుండేవాడు పోయినందుమీదట వచ్చే బాధ్యతపరావృత్తిః I have the * of that post ఆ వుద్యోగములో వుండే వాడు పోగానే ఆ పని నాకు కావలసిన బాధ్యత వున్నది.
Reversionary adj to be enjoyed in succession ఉత్తరోత్తరమైన, అవతలి. he has a * right to the land వేరేకర్తలు లేని పక్షమమదు వానికి ఆ నేలకు బాధ్యత కలిగి వున్నది.
Reverted adj turned తిప్పబడ్డ, మళ్ళించబడ్డ.
Revery See Reverie
Review n s పునర్విమర్శ, పునర్విచారణ. a * of an army దండుకు యథారీతిగావుండ చూచుకోవడము. * of a book వొక గ్రంథములో వుండే దోషా దోషములను విమర్శించి వ్రాశిన గ్రంథము.
Reviewer n s విచారించేవాడు, విమర్శ చేసేవాడు. the * of a book వొకగ్రంథములో వుండే సారా సార వివేచన చేసి ఆ సంగతిని వ్రాశేవాడు.
Reviling n s తిట్టు, దూషణ, తిరస్కారము.
Revisal n s పునర్విమర్శ, తిరిగీ విచారించినది.
Revision n s పునర్విమర్శ, సరి చూడడము.
Revival n s return to life మళ్లీ ప్రాణము రావడము. after the * of trade వర్తకము మళ్లీ బాగుపడ్డ తర్వాత.
Revivification n s మళ్లీ ప్రాణము వచ్చేటట్టు చేయడము, మళ్లీ ధైర్యము వచ్చేటట్టుచేయడము.
Revocable adj that which can be recalled కొట్టివేయతగ్గ.
Revocation n s కొట్టివేయడము. after the * of this order ఆ వుత్తరువునుకొట్టివేసిన తర్వాత.
Revoked adj కొట్టివేయబడ్డ.
Revolt n s తిరగబడడము, యెదిరించడము.
Revolting adj that is shocking, disgusting అసహ్యమైన, చీదరైన,అఘోరమైన. * conduct అసహ్యమైనది, నలుగురు ఛీ అనే పని.
Revoltled adj that is disobedient తిరగబడ్డ, యెదిరించిన.
Revolution n s turning తిరగడము, చుట్టడము, భ్రమణము. the wheel madethree hundred *s ఆ చక్రము మున్నూరు మాట్లు తిరిగినది. the * of a planetగ్రహగతి. change మారడము. a change in the government ప్రభుత్వము మారడము.this made a complete * in his mind యిందువల్ల వాడి మనసు శుద్ధముగా తిరిగినది. the fall of Seringapatnam made a * in the Mysorecountry శ్రీరంగపట్టణము పోవడముతో మైసూరు దేశపు ప్రభుత్వము తల్లక్రిందులైనది.
Revolutionary adj originating in a revolution a word which the French democrats formed, and usually coupled with the most execrableactions. (Todd) రాజ్యములో కలహము చేసే, రాజ్యమును తల్లక్రిందులు చేయవలెననే.
Revolutionist n s a rebel రాజు మీద తిరగబడ్డవాడు, రాజనేమాట కూడదనేవాడు.
Revulsion n s turning or diverting వైపరీత్యము. this made a complete* in his mind యిందువల్ల వాడి బుద్ధి వేరే అయిపోయినది.
REW 965 Reward n s బహుమానము, ప్రతిఫలము. he recieved his * వాడికి బహుమానముఅయినది, అనగా వాడు చేసిన మంచి పనికి మంచి, చెడుపనికి చెడు వాడికి ప్రాప్తమైనది.
Rewarded adj బహుమానము చేయబడ్డ, బహుమానము పొందిన.
Reynard n s the proper name for a fox కోతికి తిమ్మడు అన్నట్టు నీతి కథలలో నక్కకు పెట్టబడ్డ పేరు.
Rhadamanthus n s ఇది యముడికి వొక పేరు, యముడు, యమ ధర్మరాజు.
Rhapsodical adj విపరీతమైన, తలాతోకాలేని. a * poem తలాతోకాలేని కావ్యము.
Remittance English to Telugu free online dictionary
No comments:
Post a Comment