Q English to Telugu free online dictionary

Q Contraction of queen, Question and *Query రాణి, ప్రశ్న,యీమూడుశబ్దములకుసం, q d. ( or Quod denotat ) "which means" అందుకు అర్థమేమంటే, అనగా. q. e. d. or Quod erat demonstrandum"which remains to be proved" this was the thing asked ఇత్యుత్తరందత్తం, ఏవం సమర్థితం. q.s. or Quantum sufficit కావలసినంత. q. v. or Quodvide దాన్ని చూడు, అనగా ఉదాహరించిన శబ్దమును చూడు అనేది. Sed qu or Sedquoere యిది విచారించతగ్గది, యిది అనుమానము.
Qluadrille n s a dance వొక విధమైన నాట్యము. at cards వొక విధమైనకాకితాలాట.
Quack n s in medicine కూరగాయ వైద్యడు, బూటకపు వైద్యుడు.
Quackery n s కూరగాయ వైద్యము, బూటకపు వైద్యము, పితలాటకపు వైద్యము.
Quadragesimal adj Lent అనే వుపవాసకాల సంబంధమైన.
Quadrangle n s చౌకము. In a town or fort నడమ చచ్చౌకముగా వుండే బయిలు.a * in a Hindu house ముంగిలి.
Quadrangular adj చచ్చౌకమైన, చతురశ్రమైన, చతుష్కోణములుగల.
Quadrant n s నక్షత్రాలు చూచే వొక యంత్రము. part of circle వర్తులములోనాలుగో భాగము.
Quadratic adj చతురశ్ర సంబంధమైన, యిది మహా గణితములో వచ్చే శబ్దము.
Quadrature n s వర్తులముగా వుండే దాన్ని చౌకముగా చేయడము, యిది మహా గణితశబ్దము.
Quadrennial adj నాలుగు పక్కలు గల.
Quadriliteral adj having four syllables చాతుర్వర్ణ్యకమైన, నాలుగు అక్షరములుగల.
Quadrisyllable adj నాలుగు అక్షరములు గల. the word దశరధ. is * దశరధ అనేశబ్దము నాలుగు అక్షరములు గలది.
Quadruped n s చతుష్పాజ్జంతువు. " This history of *s is called సింహాదివర్గము.
Quadruple adj నాలుగింతలు.
Quag n s See Quagmire.
Quaggy adj చిత్తడిగా వుండే, చితచితలాడే.
Quagmire n s చిత్తడిగా వుండే భూమి, చితచితలాడే భూమి.
Quail n s వూరేడుపిట్ట, లావుకపిట్ట, పరిఘపిట్ట, కోలంకిపిట్ట, గగ్గిర, పక్కి, మీనవుల్లంకి, డాబ పిట్ట. But పురిడిపిట్ట is the true word See Snipe. the four clawed * గోమిడిపిట్ట. A * pipe యీ పక్షి వచ్చేటట్టుగా వూదే వొక గొట్టము.
Quaint adj ముద్దేన, తమాషాగా వుండే, వింతైన, చమత్కారమైన.
Quaintly adv వింతగా, చమత్కారముగా. `The New Testament is the bestbook, as Burkitt * remarks, that ever was written against Popery.'
Quaintness n s ముద్దు, తమాషా, వింత, చోద్యము, చమత్కారము.
Quakers n s క్వేకర్ వాండ్లు, అనగా సాధువులు, పరమేకాంతులు, వేదాంతులు, యిదిఖ్రిష్టియన్ మతములో వొక శాఖ.
Qualification n s or accomplishment యోగ్యత, సామర్థ్యము. he has every * for being a school master వాడు వుపాధ్యాయుడుగా వుండడానికి వానికి అన్ని యోగ్యతలు వున్నవి. or abatement తక్కువ, కొరత, న్యూనత. he consentedwithout any * అమరలేక వొప్పినాడు. he consented but with one *వొప్పుకొన్నాడు గాని వాడికి యింకా వొక కొరత వున్నది.
Qualified adj యోగ్యమైన, అర్హమైన, తగిన. he is * for this business యీపనికి వాడు తగిన వాడుగా వున్నాడు. or abated తక్కువైన, న్యునతైన. he gave *approbation అంగీకరించినాడుగాణి ఆక్షేపణ చేసినాడు.
Qualitative adv peculiar విశేషమయిన.
Quality n s గుణము, నాణెము, స్వభావము, యోగ్యత, ధర్మము. this fruit has apernicious * యీ పండులో వొక దుర్గుణము వున్నది. rice of superior * శ్రేష్టమైనబియ్యము. of what * is the gold ? ఆ బంగారు యేనాణెము గలది. paper of aninferior * మట్ట కాకితము, జబ్బు కాగితము. the * of fire is to burn నిప్పుకుకాలడము స్వభావము. he attended the king in the * of doctor వైద్య ధర్మమునుబట్టి అతడు రాజు వద్ద వుండినాడు. a man of * గొప్పవాడు, జమీందారుడు, రాజు,నవాబు మొదలైన వాండ్లు. they asked his name and * వాడి పేరునున్నుపరవునున్ను అడిగిరి.
Qualm n s of sickishness వికారము పమన మయ్యేటట్టు వికారముగా వుండడము.of pregnancy వేవిళ్ళు. of conscience పశ్చాత్తాపము, అనుతాపము.
Qualmish adj వమనము వచ్చేటట్టు వికారముగా వుండే, వేవిళ్లుగా వుండే. I feelquite * today యీ వేళ నాకు వాంతి వచ్చేటట్టు వికారముగా వున్నది.
Qualmishness n s వికారము, వమనము వచ్చేటట్టు, వికారముగా వుండడము, వేవిళ్లు.
Quanda'ry n s Doubt, uncertaintly, a state of difficutly or perplexity ముణకరాములు, ఎటూ తోచక వుండడము.
Quantity n s పరిమాణము, మొత్తము మాత్రము. twice the * రెండింతలు,ద్విగుణము. as * of blood శానా నెత్తురు. what * of cotton ? యెంత మాత్రముదూది, యేపాటి దూది. the metals were in different quantities ఆ లోహములయొక్క మాత్రము దూది, యేపాటి దూది. the metals were in different quantitiesఆ లోహముల యొక్క మొత్తము హెచ్చు తక్కువగా వున్నది. a great * విస్తారము. alarge * of salt విస్తారము వుప్పు. In this book there is a great * ofSanscrit యీ గ్రంథములో సంస్కృతము మెండుగా వున్నది. a certain * of waterకొంచెము నీళ్లు. a small * కొంచెము. In poetry మాత్ర, అనగా ఛందస్సులో లఘువుగురువు వీటిలో వచ్చే మాత్ర. these two vowels are of different quantitiesయీ రెండు అచ్చులకున్ను మాత్రలు భేదముగా వున్నవి. these two vowels are ofthe same * యీ రెండు అచ్చులు సమమాత్రలుగా వున్నవి. false quantitiesగణభంగము, మాత్రా భంగము.
Quantum n s ప్రమాణము, పరిమాణము. * sufficient కావలసినంత, తగుబాటి,తగుమాత్రము.
Quarantine n s వొదిగి వుండవలసిన దినాలు, అనగా అంటు రోగము కలదో యేమోఅనే అనుమానము చేత కొత్తగా వచ్చిన వాండ్లను కడగా వుంచబడ్డ దినాలు. we remainedhere ten days in * అంటు రోగము మాకు వుండుననే శంక చేత పది దినములు యిక్కడకడగా వుంచబడ్డాము.
Quare n s ప్రశ్న.
Quarrel n s జగడము, పొట్లాట, ఘర్షణ, కలహము, వ్యాజ్యము, వివాదము.whispering breeds *s గుసగుసలచేత జగడాలు పెరుగుతవి.
Quarrelsome adj జగడగంటియైన, కలహగంటియైన, పోట్లాడే. a * fellow జగడాలమారి.
Quarry n s కత్తెరరాళ్ళు తవ్వి యెత్తే గని, నల్ల రాళ్ళ గని. game attacked by ahawk డేగ పారే వేట, అనగా డేగకు లోకువేన జంతువు.
Quart n s కాలుగాలము. a * bottle నిండు బుడ్డి. a pint bottle అరబుడ్డి.
Quartan n s ague చాతుర్థిక జ్వరము.
Quarter n s a fourth part నాలుగో భాగము, కాలు, పాతి, పాదము. a * of arupee కాలు రూపాయి, పావులా. * of a year మూడు నెలలు. three *s ముక్కాలు,ముప్పాతిక. half a * రెండణాలు. a force * of mutton ముందరిజబ్బ. a hind * ofmutton తొడ. a * of a year ఋతువు మూడు నెలలు. once a * మూడేసి నెలలకువొక పర్యాయము. In the summer * గ్రీష్మ ఋతువులో. a Lac and a * (125000)సపాదలక్ష. or region దిక్కు. In the southern * దక్షిణ దిక్కున. In these *sయిక్కడ, యీ ప్రాంతములో. In all *s సర్వత్ర. the * of a ship వాడ యొక్క వెనకటిమూలలు, పిరుదులు. the four *s of the earth నాలుగు ఖండములు, అనగాEurope, Asia, Africa and America. A station for soldiers స్థలము, బస,విడిది. he appointed this soldier *s in my house యీ సిఫాయికి నా యింట్లోస్థలము నియమించినాడు. he came to my *s నా బసకు వచ్చినాడు, యిది దండు భాష. head * సేనాధిపతి యొక్క మొకాము. the head *s returned to Madrasసేనాధిపతి మళ్లీ పట్నానికి వచ్చి చేరెను. a division of a town పేట, ప్రదేశము. the army went into winter *s ఆ దండు చలికాలానికి వొక చోట పోయి దిగినది. he took up his * in my house మా యింట్లో దిగినాడు. they lived at free *s in my house మా యింట్లో జోరావరిగా వచ్చి కూర్చున్నారు. he gave them * వాండ్లకు స్థలము యిచ్చినాడు. In this battle they gave no * యీ యుద్ధములో చిక్కినవాణ్ని చంపినారు గాని ప్రాణముతో పట్టుకోలేదు. to give * మన్నించుట. to cry for * చంపవద్దని మొరబెట్టుట. Quarter quarter !! మన్నించు, మన్నించు. to offer * మన్నిస్తాననుట. they were at close *s with the enemy శతృ సేనకున్ను వాండ్లకున్ను చెయిచెయి కలిసినది. a measure of eight bushels యెనిమిది తూములు. at dice quatre చౌ. quatre-ace చౌవంచ. in heraldry చిహ్నము. * deck వాడవెనకటితట్టుయొక్క పై దళము. * gallery వాడ యొక్క పై దళము. * gallery వాడ యొక్క పిరుదులు.
Quarter-day n s మాస త్రయాంత్యదివసము, పన్ను వాండ్లు వచ్చే దినము, మూడునెలలకు వొక మాటు పన్ను వాండ్లు వస్తారని సంసారులు తకతకలాడే దినము.
Quarterly adj సంవత్సరానికి నాలుగు మాట్లు సంభవించే, మూడు నెలలకు వొకసారివచ్చే. * payments సంవత్సరానికి నాలుగు వాయిదాలుగా యిచ్చే చెల్లు.
Quartermaster n s దండులో వొక అధికారి, వాడలో వొక పనివాడు.
Quartern n s పరకబుడ్డి, అనగా Pint లో నాలుగో భాగము.
Quarterstaff n s బాణా, దుడ్డు కర్ర.
Quartile n s (in astronomy) చతుర్గృహమాలికా యోగము, అనగా మూడుగ్రహములు మూడు దిక్కులలో వుండగా నాలుగో దిక్కున నాలుగో గ్రహము వుదయించడము.
Quarto n s వొక విధమైన పెద్ద పుస్తకము, వొక కాకితమును నాలుగుగా మడిచి చేర్చిన పుస్తకము.
Quartz n s వొక విధమైన రాయి.
Quash n s కరుబూజా పండు.
Quassia n s తెగడవంటి వొక విధమేన బేది మూలిక.
Quatrain n s నాలుగు పాదములుగల పద్యము, శ్లోకము.
Quatre feuille n s is worngly printed feville.
Quatre-feville n s ** స్వస్తికాకారము, చతుర్దశ పుష్పాకారము.
Quaver n s in music కంపితస్వనము, స్వరకంపనము, వణుకుపలుకు.
Quay n s ఘట్టము, రేవు, సరుకు దించడానకే రాళ్ళలో కట్టిన రేవు.
Quean n s చెడ్డముండ, లంజముండ.
Queasiness n s గుండ్రింపు, వోకర.
Queasy adj గుండ్రించే, వాంతి వచ్చేటట్టు వికారముగా వుండే.
Queen n s రాణి, పట్టపుదేవి, దొరసాని. I saw the king but not the * రాజును చూస్తిని గాని రాణిగారిని చూడలేదు. at chess మంత్రి. the * white ant తల్లి చెద. she is the * of her sex అది స్త్రీ తిలకము.
Queenly adj అతి ఘనమైన, శ్రేష్టమైన.
Queen's metal n s వొక విధమైన లోహము, వెండి వలె వుండేటట్టు బనాయించినస్వల్ప వెలగల వొక లోహము.
Queen's ware n s galzed earthen ware of a cream-colour పాల వన్నెగా తళతళమనే వౌక జత పింగాణులు.
queer adj వింతైన, విపరీతమైన, వికారమైన, అద్భుతమైన.
Queerly adv వింతగా, విపరీతముగా, వికారముగా, అద్భుతముగా.
Queerness n s వింత, విపరీతము, వికారము, అద్భుతము.
Quelled adj అణచబడ్డ, హతమణచబడ్డ.
Queller n s అణచేవాడు, హతమణచేవాడు. * of death మృత్యుంజయుడు.
Quenchable adj ఆర్చతగ్గ, అణచతగ్గ.
Quenchless adj ఆరని, తీరని, అణగని.
Querimonious adj యేడ్చే.
Querist n s ప్రశ్న చేసేవాడు, అడిగేవాడు.
Querulous adj వూరికె యేడ్చే, యేడుపే గతిగా వుండే.
Querulousness n s యే వేళా యేడ్చే స్వభావము.
Query v n సందేహించుట, అనుమానించుట.
Quest n s వెతకడము. in * of food ఆహారము కావలెనని. I was then in * of him అప్పట్లో వాణ్ని వెతుకుతూ వుంటిని.
Question n s ప్రశ్న. on this * యిందున గురించి. or doubt సందేహము,అనుమానము. It is a * whether this is right యిది న్యాయమో కాదోఅనుమానముగా వున్నది. I make no * of that అందున గురించి నాకు సందేహములేదు, అనుమానము లేదు. Theme, topic ప్రస్తాపించబడ్డ విషయము, వొకడు యెత్తిమాట్లాడే లేక వ్రాసే విషయము, సంగతి. the great * is did you pay the money ? ముఖ్యముగానే నడిగేది యేమంటే నీవు ఆ రూకలు చెల్లిస్తావా. that is not the * అది ముఖ్యము కాదు. I leave this out of the * ఆ ప్రశంస నాకు అక్కర లేదు. religion is out of the * ( Wesley ) యిదిమతమును గురించినది కాదు. putting this out of the * దాన్ని విడిచిపెట్టి దాన్నిమానుకొని. this is out of the * యిది అసంభావితము, వట్టిది. their returning is out of the * వాండ్లు తిరిగి రావడము యెక్కడిది, యెక్కడి మాట. or disputeవివాదము. they raised a * about it అందున గురించి వొక ఆక్షేపణ చేసినారు. thematter in * ఆ సంగతి, ఆ ప్రమేయము, ప్రస్తుత విషయము. the house in * ఆయిల్లు. at the time in * అప్పట్లో, తత్కాలమునందు. the man in * ఆ మనిషి.beyond all * నిస్సందేహముగా. to beg the * సందేహాస్పదమైన, దాన్ని నిశ్చయముగాపెట్టుకొని అన్యాయమముగా మాట్లాడుట. he has examined this * అతను యీప్రమేయమును విచారించినాడు, యీ సంగతిని విచారించినాడు. examination bytorture చిత్ర హింస చేసి విచారించడము. they put him to the * to make him confess this దీన్ని వొప్పుకొమ్మని వాణ్ని చిత్రహింస చేసినారు.
Questionable adj సందేహాస్పదమైన, సందిగ్ధమైన. this is a very * step యిదిచెడ్డ యత్నము, యిటో అటో అని నిండా అనుమానాస్పదమైన ప్రయత్నము.
Questionless adv నిస్సందేహముగా, నిస్సంశయముగా.
Queue n s or cue, or Pig tail జుట్టు.
Qui vive (in French) యెవరువస్తారు, the town is on the * for thegovernor ఆ వూరిలో గవనరు వస్తాడు వస్తాడని యేక దడబిడలుగా వున్నది.
Quibble n s ద్వ్యర్థి, శ్లేష, సందిగ్ధముగా చెప్పిన మట. or mean trick కుయుక్తి, వట్టి చమత్కారము.
Quick adj living జీవవత్తైన. he is very * వాడు మంచి చురుకు మనిషి. as * as thought తెప్పున, దబ్బున. a * writer వడిగా వ్రాసేవాడు. he made a * returnమళ్ళీ చురుకుగా వచ్చినాడు or swift శీఘ్రమైన, త్వరితమైన, చురుకుగల. the *and the dead జీవించివుండే వాండ్లున్ను చచ్చినవాండ్లున్ను. she was * with childదానికి గర్భము నిజమైనది. * time in music ద్రుతము.
Quicklime n s కాలి ఆరని సున్నము, తాల్చని సున్నము విరియబోయని సున్నము.
Quickly adv త్వరగా, వడిగా, చురుకుగా, తెప్పున, దబ్బున.
Quickness n s త్వర, వడి, వేగము, చురుకు, తీక్ష్ణత.
Quicksand n s దొంగ యిసుక.
Quicksighted adj తీక్ష్ణదృష్టి గల.
Quicksightedness n s తీక్ష్ణదృష్టి, వివేకము.
Quicksilver n s పాదరసము.
Quicksilvered adj రసము వేసిన. a looking glass * చూచుకొనే అద్దము రసమువేయబడి వుంటున్నది.
Quickwitted adj కుశాగ్రబుద్ధయైన, తీక్ష్ణ బుద్ధిగల.
Quiddity n s తత్వము, వట్టి పీకులాటగా వుండే సూక్ష్మము. a trifling nicetyఅనర్థక వివేచన. See Entity.
Quidnunc n s వూరికె విశేషములు అడిగే వెర్రివాడు, వూరికె సమాచారములు అడిగేపనికిమాలిన వాడు.
Quiescence n s శాంతము, నివృత్తి, వూరికె వుండడము. he remained in a stateof * వూరికె వుండినాడు.
Quiescent adj వూరికె వుండే, శాంతమైన, నిశ్చేష్టితముగా వుండే, అణిగివుండే.
Quiet adj వూరికె వుండే, నిశ్చేష్టితముగా వుండే, అణిగివుండే, సాధువైన. she is a *woman but very idle అది దుష్టు కాదు గాని బహు సోమారి. a * cow సాధువైనఆవు. I kept * till he came close to me వాడు నా దగ్గరికి వచ్చేదాకా వూరికెవుంటిని. cannot you keep * ? వూరికె వుండలేవా. not savage or mischievousశాంతమైన. a * horse or dog సాధువైన గుర్రము, లేక, కుక్క. be * వూరికె వుండు. a *house సందడిలేని యిల్లు, నిశ్శబ్దముగా వుండే యిల్లు. when the wind blows thewater will not stay * గాలికొట్టేటప్పుడు నీళ్లు కదలక వుండదు, చలించక, వుండదు.If you strike the horse he will not stay * గుర్రాన్ని కొట్టితే వూరికె వుండదు.
Quietism n s మౌనవృత్తి, శాంత వృత్తి, యిది ముఖ్యముగా వొక మత నామము.
Quietist n s మౌన వ్రతస్థుడు, శాంతిపరుడు. Quietism అనే మతమునుఅవలంభించినవాడు.
Quietly adv వూరికె, నిమ్మళముగా, అమరికగా, స్థిమితముగా.
Quietness n s నెమ్మది, నిమ్మళము, అమరిక, నిశ్శబ్దత, సుఖము.
Quietude n s విశ్రమము, శాంతి.
Quietus n s an answer that silences నోరెత్తనియ్యకుండా చెప్పే సమాధానము. Igave him his * వాడు మళ్లీ నోరెత్తనియ్యకుండా సమాధానము చెప్పినాడు.
Quill n s పెద్ద యీకె. he took the * and made a pen ఈకెను చెక్కి పేనాచేసుకొన్నాడు. he drove the * all day దినమంతా వ్రాసినాడు. a * driverవ్రాసేవాడు. of a porcupine యేదు ముల్లు, అనగా ముండ్ల పంది యొక్క ముల్లు. usedby a weaver కండెపుల్ల,
Quilt n s జమిలిదుప్పటి, నడమపత్తిపెట్టి కుట్టిన గుడ్డ. a patch work * బొంత.
Quince n s వొక వృక్ష విశేషము, దాని పండున్ను. Quince seed (a drug) బేదానా,corrupted from Bihi-dana.
Quinine n s బారక్కు పట్ట యొక్క సత్తు, అనగా వేప చెట్టు వంటి వొక చెట్టు పట్ట యొక్క సత్తు, యిది జ్వరానికి యిచ్చే యింగ్లిషు మందు.
Quinquagesima n s వొక పండుగ విశేషము.
Quinquennial adj అయిదేండ్లకు వొక సారి వచ్చే.
Quinsly n s కాశరోగ విశేషము, గొంతు లోపల వుండుగా వూపిరి విడవనియ్యకుండాసంకట పెట్టే రోగము.
Quintal n s నూరుపవున్ల యెత్తు, యిది యింగ్లిషు శబ్దము కాదు.
Quintessence n s సారాంశము, సత్త, సర్వోత్కృష్టమైనది. she is the * ofbeauty అది సౌందర్య తిలకము. this book is the * of many volumes యిదినానా గ్రంథ సారాంశము.
Quintuple adj అయిదింతలైన.
Quip n s సరసము, యెగతాళి.
Quire n s వొక దస్తా కాకితములు, యిరువై నాలుగు కాకితములు. of music మేళము,సంగీతము.
Quirister n s మేళగాడు, గాయకుడు.
Quirk n s ద్వ్యర్థియైన వాక్యము.
Quite adv బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా, తీరా. this is not * correct అది అంత సరి కాదు. he is * a boy వాడు కేవలము పిల్లకాయ. this is * black యిది వట్టి నలుపు. this snake is not * dead యీ పాము పరిష్కారముగా చావలేదు.this book is * new యీ పుస్తకము కేవలము కొత్తది. I am * tired నేను నిండాఅలిసినాను. I did not * like it అది నాకు అంతగా సమ్మతి లేదు.
Quitrent n s స్వామి భోగము, నేలవరి.
Quits interj సరి, తంటా తీరినది. you pay me ten rupees and then we willcry * నీవు నాకు పది రూపాయలు యిస్తి వంటే యిక నీకు నాకు యే యొక్కతగాగా లేదనుకొందాము.
Quittance n s చెల్లు చీటి.
Quitted adj విడిచిన, విడవబడ్డ, త్యజించిన.
Quitterbone n s గుర్రము యొక్క అరికాలిలో లేచే వొక విధమైన పుండు.
Quiver n s అంబులపొద, తూణీరము.
Quivering adj వణికే, కంపించే.
Quixote n s ఒక శూరుని పేరు, పుణ్యానికి పాటు బడుతానని లేనిపోని పనులను తలమీద వేసుకొని అల్లాడేవాడు.
Quixotic adj పైన చెప్పిన తీరుగా పాటుపడే. See the preceding word.
Quiz n s an oddity వికారమైన మనిషి, వింత మనిషి, చోద్యమైన, మనిషి. a witచోద్యగాడు, ఎక సక్క్యాలమారి.
Quizzical adj వికారమైన, వింతైన, కుచోద్యమైన. See Quiz.
Quizzing n s వికారము, వింత, కుచోద్యము, ఎక సక్కెము.
Quodlibet n s చమత్కారము.
Quoif n s See Coif.
Quoiffure n s See Coiffure.
Quoit n s చక్రము, వలయము, అనగా జాతి వాండ్లు ఆట్లాటలో దూరాముగా వొక మేకుకొట్టి దాంట్లో పడేటట్టు విసిరివేసే యినుప వలయము.
Quondam adj యిదివరకు వుండిన, యిప్పుడు లేని.
Quorum n s వ్యవహారమును గడపడానకు చాలునన్న న్యాయాధిపతుల సంఖ్య. In thiscouncil two members from a * యీ ఆలోచన సభలో యిద్ధరు న్యాయాధిపతులువుంటే వ్యవహారము గడపవచ్చును, అనగా యీ సభలో చేరినవాండ్లు అయిదారు మందివున్నప్పటికిన్ని యిద్దరుగా వుండి తీర్చినా ఆ వ్యవహారము కాయమని భావము. In a juryless than twelve would not form a * జారీ అనే సభలో పన్నెండు మందికి తక్కువపడితే వ్యవహారమును తీర్చడానకు చాలిన న్యాయాధి పతుల సంఖ్య కానేరదు, అనగాపన్నెండు మందికి తక్కువగా వుండి తీరిస్తే ఆ తీర్పు కాయము కాదని భావము.
Quota n s భాగము, అంశము, పాలు. he contributed his * towards the sumwanted కావలసివచ్చి యుండే మొత్తములో తాను యివ్వవలసిన భాగమును యిచ్చినాడు.
Quotation n s ఉదాహరణ, వుదాహరించిన వాక్యము. In mercantile phrase ధర,వేల. literally ప్రస్తుతపు వెల.
Quoth v imperfect అబ్రవీత్, అన్నాడు * Menu ఇతిమనః.
Quotha అట,అంట,యిదిప్రాచీనశబ్దము యిప్పట్లో వాడుక లేదు.
Quotidian adj ప్రతి దినము, సంభవించే.
Quotient n s లబ్ధము.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment