Porringer English to Telugu free online dictionary

Porringer n s పళ్లెము, గిన్నె.
Porsperousness n s శ్రేయస్సు, భాగ్యము, కలిమి, సంపద, ఉఛ్రాయము.
Port n s a harbour వాడరేవు. he reached his * వాడు చేరవలసిన రేవుకుపోయిచేరినాడు. a gate ద్వారము. in a ship వాడలో ఫిరంగి మూతినిపెట్టే బొంద. sally * దిడ్డివాకిలి mien, behaviour హోయలు, ఠీవి, వైఖరి, నడక. a kind of wine వొక విధమైన నల్లనివైను. in steering ships, the left hand యెడమ చేతివైపు.
Portable adj ఉలకనైన, చులకనైన, చిన్న. a * writing desk చేతిదుసుకు. a *medicine chest చేతిపెట్టె. a * key చిన్న తాళము. * soup వొక విధమైన ఆహారము.అనగా దోవ ప్రయాణమునకై మాంసము, మానికూరలు మొదలైన వాటిని ద్రవము లేకుండాగడ్డగా వండి తీసుకొని పోయ్యే ఆహారము.
Portage n s ద్వారము, సింహద్వారము, గవిని.
Portbellied adj పెద్దకడుపుగల, కుండోదరుడైన. a * man కుండోదరుడు, పెద్ద పొట్టగలవాడు.
Portcullis n s గవినిమూత, అనగా బోను, చిలకగూడు, వీటిమూతవలె పైన నుంచికిందికి జారవిడిచే తలుపు.
Ported adj ధరించిన.
Portending adj రాబొయ్యేదాన్ని తెలియ చేసే, సూచించే.
Portent n s ఉత్పాతము, దుశ్శకునము.
Portentous adj ఉత్పాతమైన, దుశ్శకునమైన, అఘోరమైన, విపరీతమైన.
Porter n s a door keeper ద్వారపాలకుడు, వాకిటి కావలివాడు. a bearerకూలివాడు, కూలికి మోసుకొని బ్రతికేవాడు. a kind of drink వొక విధమైన బీరుసారాయి.
Porterage n s కూలి, మోతకూలి.
Portfolio n s బొక్కు ఆకారముగా వుండే తోలు దస్త్రము. or miscellany చిత్ర గ్రంథము నానా గ్రంథోద్ధృత సంగ్రహము. the king gave him the * of war రాజు యుద్ధము యొక్క కారుబారును అతని పరము చేసినాడు. he took charge of the *of foreign affairs యీ సంస్థానానికి యితర సంస్థానానికి వుండే వ్యవహారములుచూచేపని యితని పరమైనది.
Porthole n s వాడయొక్క గవాక్షి, వాడయొక్క కిటికి.
Portico n s ముఖ మంటపము, నడ మంటపము.
Portion n s భాగము, పాలు, అంశము a marriage * ఉంకువ. a very small *of the wood was burnt ఆ కొయ్యలో కొంత లెక్క కాలినది. In Telugu literaturea small * is modern తెలుగు విద్యలో కొంత భాగము నవీనము.
Portliness n s భారీ, గంభీరత. on account of the * of his appearanceవాణ్ని చూస్తే మహాభారీగా వుండడమువల్ల.
Portly adj భారీ, గంభీరమైన. a * man వొడ్డు పొడుగుమనిషి, భారీమనిషి. a largebull has a * appearance పెద్ద వృషభము మహాభారీగా వున్నది, గంభీరముగావున్నది.
Portmanteau n s తోలుతో చేసిన బట్టలపెట్టె.
Portrait n s భావము, మనిషిని చూచి తద్వత్తుగా వ్రాసిన పఠము. this boy is the* of his father యీ పిల్లకాయ తద్వత్తు తండ్రివలె వున్నాడు. this book is a * ofthe bramins యీ పుస్తకములో బ్రాహ్మణుల వర్ణన తద్వత్తుగా చేసి వున్నది.
Portraiture n s వర్ణనము. See Portrait.
Portress n s ద్వారపాలక స్త్రీ, వాకిలి కాచే స్త్రీ.
Posed adj కలతబడ్డ, భ్రమపడ్డ.
Poser n s అసాధ్యమైన ప్రశ్న, సమాధానము చెప్పకూడని ప్రశ్న.
Position n s Situation స్థితి, స్థానము. Soldiers and dancers use many *s సిఫాయీలున్ను ఆడేవాండ్లున్ను శరీరమును నానా విధములుగా తిప్పుతారు.a sandy * యిసుకనేల. he painted her in a sitting * దాన్ని కూర్చున్నట్టు వ్రాసినాడు. state అవస్థ, దశ. he is in a difficult * వాడు చెడ్డ స్థితిలో వున్నాడు. the fort is in a strong * ఆ కోట మంచి స్థానములో వున్నది. while matterswere in this * ఆ వ్యవహారము యీ స్థితిలో వుండగా. in logic పక్షము, సిద్ధాంతము.his * is that these two men are brothers but I deny it వాండ్లిద్దరు అన్నదమ్ములనేది వాడి పక్షము దాన్ని పూర్వపక్షము చేస్తారు, వాండ్లిద్దరుఅన్నదమ్ములనేది వాడనే మాట నేను దాన్ని కాదంటాను.
Positive adj నిశ్చయమైన, ఘట్టియైన, రూఢియైన, వాస్తవ్యమైన. this is * injustice యిది నిశ్చయమైన అన్యాయము. his wife is a * fool వాడి పెండ్లాము వట్టి పిచ్చిది. these children are * plagues యీ పిల్ల కాయాల హింసే హింస.I am * he went వాడు పోయినాడని నాకు రూఢి, నాకు సిద్ధము. Dont' be so * నీకు యింత మూర్ఖము కారాదు, పట్టు కారాదు, పిడివాదము కారాదు. I am not * asto that అది నాకు రూఢిలేదు. the * sign in mathematics ధనము. * negative (inmathematics Colebrook says ) భావ and అభావ.
Positively adv నిశ్చయముగా, ఘట్టిగా, రూఢిగా, ఖండితముగా.
Positiveness n s నిశ్చయము, రూఢి, ఖండితము.
Posse n s Posse comitatus గుంపు. of police పోలీసువాండ్లకు సహాయముగావచ్చిన గుంపు.
Possessed adj కలిగివుండే, స్వాధీనముగా వుండే, అనుభవములో వుండే. the town *by the enemy శత్రువులు పట్టుకొన్న వూరు. when he was * of this secret యీ మర్మము తెలిసినవాడైనప్పుడు he was * of the particulars ఆ వివరములు వాడికి తెలియవచ్చినది * by a spirit ఆవేశముగల. he looked like one * దయ్యము పట్టిన వాడివలె వుండినాడు.
Possessing adj గల. * sense బుద్ధిగల. a * woman మనోహరమైన స్త్రీ.
Possession n s అనుభవము,స్వాధీనము. he lost * of it అది వాడి స్వాధీనముతప్పినది, అనుభవము తప్పినది. I have the letter in my * ఆ జాబు నా వద్ద వున్నది. he got * of the house ఆ యిల్లు వాడి స్వాధీనమైనది. after the house cameinto his * ఆ యిల్లు వాడి స్వాధీనమైన తరువాత. he sold his *s వాడి ఆస్తినిఅమ్మినాడు. demonical * దయ్యము పట్టడము, ఆవేశము. self * ధైర్యము, నిబ్బరము.
Possessive adj సంబంధార్థకమైన. the * case షష్ఠీవిభక్తి. the * pronounsషష్ఠ్యర్థక సర్వనామములు. my, thy, his, her, our, your, their యిత్యాదులు.
Possessor n s కర్త, అనుభవించేవాడు, భోక్త.
Posset n s మసాలా వేసి వైనుతో పేర బెట్టినపాలు, దీన్ని బాలింతరాలికిన్ని దాన్ని చూడ వచ్చిన వాండ్లకున్ను యిస్తారు.
Possibility n s సాధ్యత, శక్యత, సంభావనీయత. I see no * of that marriage ఆ పెండ్లి అయ్యేగతి కనిపించలేదు. I will shew you the * of it అది అయ్యేగతిని అగుపరుస్తున్నాను. there is a * that my brother has paidthe money ఆ రూకలను మా అన్న చెల్లించి వుండవచ్చును. there is no * of my going there tomorrow నేను రేపు అక్కడికి పోవడము వల్ల కాదు, పోవడము దుస్తరము. there is no* of my recovering the money from him వాడు యివ్వవలసిన రూకలు నాకు వచ్చేది అసాధ్యముగా వున్నది.
Possible adj సాధ్యమైన, శక్యమైన, అయ్యే, కాగల. Is it * ? అది అవునా. Is it *you do not know him ? నీవు అతణ్ని యెరగవు అనేదికద్దా, నీవు అతణ్ని యెరగననేది యెక్కడి మాట. Is it * for him to do this ? యిది వాడికి సాధ్యమా. as much as * యథాశక్తి, శక్యమైన మట్టుకు, సాధ్యమైన మట్టుకు. as much as was * అయినమట్టుకు.
Possibly adv యేమో, కాబోలు, వొక వేళ. very * he wrote it వ్రాసినాడేమో,బహుశః వ్రాసి వుండును.
Post n s ( for letters ) తపాలు. send this letter to the * యీ జాబునుతపాలుకు పంపు. send it by * దాన్ని తపాలు మార్గముగా పంపు. he travelled by *తపాలు పెట్టుకొని పోయినాడు. * paid తపాలు రూకలు చెల్లినది. the * is closedతపాలు కట్టి అయిపోయినది. a letter carrier తపాలువాడు. the * has not yetarrived తపాలు యింకా వచ్చి చేరలేదు or office ఉద్యోగము. he held the * ofminister. మంత్రి వుద్యోగములో వుండినాడు. place స్థానము, స్థలము. the enemykept their * శత్రువులు వెనక తియ్యక ఆ స్థలము లోనే నిలిచినారు. they stood attheir *s వారు వారి వారి ఠాణాలలో వుండిరి, పారాలలో వుండిరి. he took his * atthe tree ఆ చెట్టు దగ్గెర నిలిచినాడు. of timber స్తంభము, గుంజ, కూచము. he set aline of *s in the ground స్తంభాలను వరసగా నాటినాడు. the *s of a bedమంచపు కోళ్ళు. a centre * or pole నిట్రాయి. a side * ద్వారబంధము యొక్కనిలువువాసము. a whipping * కైదీని కట్టి కొట్టడానకై పాతివుండే స్థంభము. he wasdriven from * to pillar నిలవ నీడలేక పట్టకొమ్మ లేక వుండినాడు.
Postage n s తపాలుకూలి.
Postboy n s గుర్రము మీద కూర్చుండి బండి తోలేవాడు, తపాలువాడు.
Postchaise n s తపాలుబండి.
Postdiluvian adj జల ప్రళయమునకు తర్వాత గలిగిన. the postdiluvians జల ప్రళయమునకు తర్వాత పుట్టినవాండ్లు, కలియుగ ప్రజలు. See in proof Wilson Vish.Pur. Pref. P.65. note.
Poster n s తపాలు బండి గుర్రము.
Posterior adj తర్వాతి, వెనకటి. * occurrences తర్వాత జరిగిన పనులు, పిమ్మటసంభవించినవి. the *s పిరుదులు. an argument a posteriors కార్యము చేత కారణమును వూహించడము.
Posterity n s సంతతి, సంతు. all his * were destroyed వాడి సంతు నిస్సంతు అయినది.
Postern n s దిడ్డి వాకిలి, పెరటివాకిలి.
Posthaste adv అతి త్వరగా, హుటాహుటిగా.
Posthorse n s తపాలు గుర్రము.
Posthouse n s తపాలు చావిడి, తపాలు కచ్చేరి.
Posthumous adj చచ్చిన తర్వాత బయిటపడ్డ. a * child తండ్రి చచ్చిన తర్వాతపుట్టిన బిడ్డ. a * poem చెప్పిన కవి చచ్చిన తర్వాత ప్రచురణమైన కావ్యము.
Postilion n s గుర్రము మీద కూర్చుండి తోలే గుర్రపు బండివాడు.
Postmaster n s తపాలు అధికారి.
Postmeridian adj మధ్యాహ్నత్పరము.
Post-office n s తపాలు కచ్చేరి.
Postponed adj నిలపబడ్డ.
Postponement n s నిలిపివేయడము. on account of the * of the trial విచారణ నిలిపివేసినందున.
Postscript n s తాజా కలము, జాబు ముగించి చేవ్రాలు చేసిన తర్వాత మళ్ళీతలచుకొని వ్రాసినది.
Postulate n s మూల సూత్రము, సర్వ సమ్మతమైన విషయము, వాది ప్రతివాదులువొప్పుకోతగిన విషయము, సిద్ధాంతము. Will you admit that a father hasauthority over his son ? if you deny this * I can say nothing moreతండ్రికి కొడుకు మీద అధికారము కద్దని నీవు వొప్పుకో వలసినదేగదా, నీవు యీ నిర్ణయమే అక్కరలేదంటే అవతల నేను చెప్పవలసినది యేమి వున్నది. Postulatio principii సిద్ధాంత నిర్ధారణము.
Posture n s అంగవిన్యాసము, స్థితి, రీతి, దశ. he painted her in a sitting *దాన్ని కూర్చున్నట్టుగా వ్రాసినాడు. in dancing or sword play సాము. a * masterసాము నేర్పేవాడు. while affairs were in this * వ్యవహారము యీ దశలో వుండగా, యీ వైఖరిని వుండగా.
Posy n s శిఖా వుంగరము మీద వ్రాసిన వాక్యము. of flowers పూగుత్తి,పుష్పమంజరి.
Pot n s కుండ, ఘటము, కడవ, కాగు. a small earthen * పిడత. a flower *పూల చెట్లు పెట్టే తొట్టి. a brass * యిత్తడి పాత్ర, తపేలా. a large brass water * బిందె. a washerman's * చాకి బాన. a spitting * తమ్మపడిగ. a * for drinkingచెయిపిడిగల జోడుతపేలా, ముంత, చెంబు. A * of roses i.e. flowerpot రోజాపూల చెట్టు నాటిన తొట్టి. a bathing * నీళ్ళకడవ. a chamber * మూత్రపడిగ. a broken piece of * పెంకు. do not speak tohim when he is in his *s తాగి వుండేటప్పుడు వాడితో మాట్లాడక.Potvaliant ( drunk ) తాగినవాడై. he is gone to * ( Johnson ) చెడిపోయినాడు. pots and pans కుండచట్లు.
Potable adj తాగకూడిన, పానయోగ్యమైన. * gold బంగారు నీరు, నీరుగా వుండేబంగారు.
Potash n s క్షారము, మూలికలు భస్మము చేసిన క్షారము.
Potation n s పానము, పానము చేయడము, సారాయి తాగడము.
Potato n s వురలగడ్డ, బంగాళా దుంప. the red or white sweet * గెనుసుగడ్డ,చిరగడ దుంపలు. Tamil name..........
Potbelly n s పెద్ద కడుపు, కుండోదరము.
Potcompanion n s తాగుబోతు, కూడా తాగేవాడు.
Potency n s శక్తి, బలము. the * of this medicine యీ మందు యొక్క వేగము.
Potent adj శక్తిగల, ప్రబలమైన. a * monarch బలవంతుడైన రాజు. a * reasonబలమైన కారణము. a * medicine వేగమైన మందు.
Potentate n s అధికారి, ప్రభువు.
Potential adj existing in possiblity సంభవించేటట్టువుండే. in grammarశక్త్యర్థకమైన. * mood శక్త్యర్థక ప్రయోగము. I can, I could యిత్యాదులు.
Potentiality n s సాధ్యత, శక్యత, సంభావనీయత.
Potentially adv సాధ్యమయ్యేటట్టు, ఘటించేటట్టు, సంభావనీయముగా. he is * rich వాడు భాగ్యవంతుడు కావడానకు యోగ్యత వున్నది.
Potently adv బలముగా, దార్ఢ్యముగా, he * believes దీన్ని రూఢిగా నమ్ముతాడు.See Wesley X.382.
Pothanger n s See Pothook.
Pother n s తొందర, కలత, గలిబిలి.
Potherb n s తోటకూర, కూరాకు.
Pothook n s కొక్కి, వంకీలుగల కమ్మి.
Pothouse n s సారాయి అంగడి.
Potion n s తాగేమందు, కషాయము, ద్రావకము.
Potlid n s కుండమూకుడు.
Potmaker n s ( a caste ) కుమ్మరవాడు.
Potsherd n s కుండపెంకు.
Potstone n s మరిగెరాయి, బలపరాయి. It is grey chlorite state, calledనాపరాయి.
Pottage n s అంబలి, గంజి.
Potter n s కుమ్మరవాడు. potter's wheel కుమ్మరసాన, చక్రము. potter's earth పాలమన్ను.
Pottery n s కుమ్మర స్వరూపాలు, కుండచట్లు మొదలైనవి. or place of makingpots కుండచట్లు చేసే స్థలము.
Pottle n s కొలిచేబుట్ట. a * of fruit బుట్టెడు పండ్లు.
Potvaliant adj తాగిన వీరుడైన.
Pouch n s సంచి, వొడి, జోలె, అడపము. the monkey filled his *es withgrain ఆ కోతి బుగ్గలనిండా బియ్యము పెట్టుకొన్నది.
Poult, or Pout n s. పిల్ల, యిది సీమకోడి, నెమలి, వీటియొక్క పిల్లలను గురించినమాట.
Poulterer n s కోళ్లు అమ్మేవాడు.
Poultice n s పుండు పగలడానకై వుడకపెట్టి కట్టే పిండి. you should put a * overthe swelling ఆ వాపుకు గోధుమపిండి వుడకపెట్టికట్టు.
Poultry n s కోళ్ళు అనగా సాకుడు కోళ్లు, పెంపుడు కోళ్లు.
Pounce n s for paper పిండి అనగా కాకితము వూరకుండా చల్లే వొక విధమైన బంక యొక్క పిండి. a bird's *s పక్షి గోళ్లు. the * fish or cuttle కండుబయిచేప.
Pouncethox n s వాసనపొడి బరిణె.
Pound n s (16 or12 ounces ) సుమారు అర శేరు. or 20 shillings సుమారు పది రూపాయలు. or enclosure బందెగొడ్లను మూసే దొడ్డి.
Poundage n s of cattle బందె. or custom (see Johnson ) in shoppingరవీసు, తరుగు.
Pounded adj as grain దంచిన. as flour కొట్టిన, పొడిచేసిన. with a littlewater తొక్కిన. * sugar candy కలకండపొడి. or confined దొడ్డిలోకి తోలి మూసిన.
Pounder n s ఫిరంగి. a twelve * పన్నెండు పవున్లుగల గుండు వేసే ఫిరింగి.
Pourtrayed adj భావము వ్రాసిన, వర్ణించిన.
Pout n s a poult or young bird పక్షి పిల్ల.
Poverty n s దరిద్రము, పేదరికము, లేమిడి.
Powder n s పొడి, చూర్ణము, పిండి. gunpowder తుపాకిమందు. sweet dust forthe hair వాసనపొడి. a love * మైదు, వలపుమందు. * used for soapసున్నిపిండి. black * మసి. this was reduced to * యిది పొడిచేయబడ్డది,పిండి చేయబడ్డది, చూర్ణము చేయబడ్డది. they beat it into * దీన్ని పొడిచేస్తారు,చూర్ణము చేస్తారు. beaten to * పొడియైన, చూర్ణమైన.
Powdered adj చూర్ణమైన, పొడియైన, పొడిచల్లిన. paper * with gold బంగారురజముచేత తళతళ మెరిసే కాకితము. her * hair వాసన పొడి చల్లిన వెంట్రుకలు.
Powderhorn n s తుపాకి మందు పోసి పెట్టే కొమ్ము.
Powdermill n s మందుగిడ్డంగిమ తుపాకిమందు చేసే కార్ఖానా.
Powdermonkey n s వాడలో ఫిరంగులు కాల్చేటప్పుడు మందుగుండ్లు అందియిచ్చేపిల్లకాయ.
Power n s శక్తి, బలము, త్రాణ, అధికారము, ప్రభుత్వము, రాణువ. he has no *over his limbs వాడి చేతులు కాళ్ళు వాడికి స్వాధీనము లేదు. do it while youhave the * నీకు సాగినప్పుడు చెయ్యి. a man of his *s of mind అతి మేధావి. hehas no * over himself వాడి వొళ్ళు వాడికి తెలియలేదు he lost the * of doingit దాన్ని చేయడానికి వాడికి శక్తి లేకపోయినది. the rival *s శత్రురాజులు. theMusulman * lasted three hundred years మున్నూరు యేండ్లు తురకప్రభుత్వముగా వుండెను. many *s opposed him అనేక రాజులు వాణ్ని యెదిరించిరి.his * or army is greater than ours మా దండు కంటే అతని దండు విస్తారము. the * whom they worshipped వాండ్లు కొలిచిన దేవత. I did it to the best of my *నా చేతనైనమట్టుకు చేసినాడు. they are now in his * యిప్పుడు అతనికిచేతిలో చిక్కినాను. do not put yourself into his * వాడికి స్వాధీనపడవద్దు. he gotthe house into his own * ఆ యింటిని స్వాధీనము చేసుకొన్నాడు. It is out of my* అది నా వల్ల కాదు. is it out of your * to tell the truth ? నిజముచెప్పేటందుకు నీ వల్ల కాదా. there was a * of eatables ( Johnson ) నానావిధమైన ఆహారములు వుండినవి.
Powerful adj శక్తిగల, బలమైన, వేగమైన. a * man బలవంతుడు,కాయపుష్టిగలవాడు. a * medicine వేగమైన మందు.
Powerfully adv బలముగా, వేగముగా.
Powerfulness n s శక్తి, బలము, వేగము.
Powerless adj దుర్భలమైన, శక్తి లేని, నిస్సత్తువైన, నిస్త్రాణైన. he remained *అసమర్థుడుగా వుండినాడు.
Powerlessness n s దుర్బలము, నిస్సత్తువ, నిస్త్రాణ.Pox, n.s. తెవులు. the cow * పోయించే అమ్మవారు. the chicken * చిన్నఅమ్మవారు. small * మశూచకము, అమ్మవారు, పెద్దమ్మవారు. confluent small *తట్టమ్మవారు. the venereal * పుండ్లరోగము.
Poxed,Poxy adj పుండ్లరోగము గల.
Practicability n s సాధ్యత, శక్యత. this proves the * of the enterpriseయిందుచేత అదికా తగ్గదని తెలుస్తున్నది.
Practicable adj సాధ్యమైన, శక్యమైన.
Practical adj అనుభవముగల, వాడికగల. * knowledge అనుభవ జన్య జ్ఞానము,వాడిక వల్ల కలిగిన పరిచయము. * religion అనుష్ఠానతః వుండే భక్తి, నడతలో వుండే భక్తి. a * exposition of a text or a * illustration of a ruleమూల వాక్య సారంశ వివరణము. * observations on a text ఫలితార్థము. a * treatise on medicine ప్రయోగము, ప్రయోగ గ్రంథము. the * result of this regulation has been very bad యీ చట్టమునకు ఫలపర్యవసానమునిండా చెరుపు అయినది, యీ చట్ట ప్రకారము జరిగించడములో నిండా చెరుపు అయినది.there is no * difference between these two యీ రెంటికిన్ని క్రియలో భేదము లేదు.* a * proof అనుభవ సిద్ధమైన దృష్టాంతము. a * man వాడిక పడ్డవాడు, అనుభవశాలి.he is a * atheist క్రియాతః వాడు నాస్తికుడు. * jokes మోటు సరసములు. He is a very* man స్థిర బుద్ధి గలవాడు.
Practically adv ఆచరణలో, క్రియలో, నడతలో, అనుభవములో. he is * an atheistవాడు నడతలో నాస్తికుడు.
Practice n s వాడిక, అభ్యాసము, ఆచారము, అనుభవము. a bad * దురభ్యాసము. the * of a caste or nation కులాచారము. In * this is of no useయిది అనుభవములో పనికి రాదు. he put the law in * చట్ట ప్రకారము జరిగించినాడు.he is out of * in riding వాడికి గుర్రము యెక్కే అలవాటు తప్పినది. a lawyerin full * నిండా వ్యాజ్యములు గల లాయరు. medical * వైద్యము, చికిత్స. as distinguished from law వాడిక, మామూలు. in arithmetic మోడి లెక్క అనగాసులభముగా లెక్క చూచే అడ్డ మార్గము.
Practised adj వాడికపడ్డ, అలవాటుపడ్డ, జతపడ్డ. * in deceit మోసములో జతపడ్డ.
Practitioner n s శాస్త్రి, యిది డాక్టరుకు లాయరుకు చెల్లే మాట.
Praecognita n s plu. ముందుగా తెలియవలసిన విషయములు.
Pragmatic adj read, a * fellow అధిక ప్రసంగి, తొందరమనిషి,ఇబ్బందిచేసే పిచ్చివాడు.
Pragmatic, Pragmatical adj అధిక ప్రసంగియైన,అధికజోలికిపోయ్యే , a * fellow .pragmatic sanction జర్మన్ దేశపువొక చట్టము.
Pragmatically adv అధిక ప్రసంగముగా.
Prairie n s అడివిపోళ్ళు, అడివి పొలము.
Praise n s స్తుతి, స్తోత్రము, స్తవము, శ్లాఘన. * be to God they were notkilled దైవాధీనము వాండ్లు చంపబడలేదు. .In .Isa.60. 18. .Ps.100.4.ప్రశంస. D+ A+.
Praised adj స్తుతించిన, స్తోత్రము చేయబడ్డ, శ్లాఘించబడ్డ. * be God they werenot killed దైవాధీనము వాండ్లు చంపబడలేదు.
Praiseworthy adj మంచి, యోగ్యమైన . the care he takes of his mother isvery * వాడు తల్లిని పరామర్శించడము నిండా మంచిదే.
Prancing n s యెగిసియెగిసి దుమకడము, కుప్పిగంతులు.
Prank n s చేష్ట.
Prate n s పిచ్చికూతలు.
Prator n s An officer among the Romans ఒక అధికారి.
Pratting adj వదిరే, వాగే.
Prattle n s ముచ్చట.
Prattler n s వదిరేమనిషి, వాగేమనిషి.
Pravity n s దుష్టతనము, చెడ్డతనము, దౌష్ట్యము.
Prawn n s పెద్దరొయ్య.
Praxis n s or exercise పాఠము.
Prayer v a వేడుట, ప్రార్థించుట, బతిమాలుకొనుట. Grant me this I * thee దీన్నినాకు యిప్పించవలెనని ప్రార్థిస్తున్నాను. I * you mercy ! I thought he was dead అయ్యో వాడు చచ్చినాడనుకొంటిని. I * your aid నాకు తమరు సహాయము చేయవలెను.
Prayerbook n s జపగ్రంథము.
Preacher n s బోధకుడు, ప్రచురము చేసేవాడు.
Preaching n s ప్రసంగము, బోధ, ఉపదేశము. See Prediction, from whichthis is derived.
Preachment n s ప్రసంగము, యిది తిరస్కార శబ్దము.
Preadamite n s ఆడము కాలమునకు ముందు వుండిన రాక్షసులు.
Preamble n s అవతారిక, పీఠిక.
Prebend n s land గుడిమాన్యము. a priest గుడిమాన్యమును అనుభవించే పాదిరి.
Prebendary n s గుడిమాన్యము అనుభవించే పాదిరి.
Precarious adj అస్థిరమైన, అనిశ్చయమైన, చపలమైన. this health is * వాడిదేహ స్థితిని నమ్మరాదు. a * crop గాలిపంట. wealth is * ఐశ్వర్యము క్షణభంగురము.
Precariously adv అస్థిరముగా, అనిశ్చయముగా.
Precariousness n s అస్థిరత్వము, అనిశ్చయత్వము.
Precative adj Suppliant; beseeching ప్రార్ధించే, వేడుకొనే,బతిమాలుకొనే. the phrase పరిపాలయమాం is a precative form.
Precaution n s ఎచ్చరిక, ముందు యెచ్చరిక, ముందు జాగ్రత్త.he took *s ముందు జాగ్రత పడ్డాడు.
Precedence n s అగ్రగామిత్వము, అగ్రవర్తిత్వము, అగ్రేసరత్వము, ప్రాధాన్యము.he took * of us మా కంటే ముఖ్యుడుగా వుండినాడు. he took * me నాకంటే అతడు ముఖ్యుడుగా వుండెను. this takes * of all otherbusiness అన్నిటికి యిది ముఖ్యము. In the procession he took the* వూరేగింపులో అతడు ముందర పోయినాడు . they gave me * నన్ను పూజితగా ముందర పెట్టుకొన్నారు.
Precedent adj ముందు జరిగిన.
Preceding adj ముందరి, ముందు జరిగిన, పూర్వపు .In the * month, that is, in last month పోయిన నెలలో, ముందు నెలలో. in the * chapter ముందరి కాండలో, పూర్వకాండలో.
Precentor n s ముందర పాడేవాడు.
Precept n s ఆజ్ఞ, వుత్తరవు, విధి, సూత్రము.
Preceptor n s గురువు, శిక్షచెప్పేవాడు.
Precession n s అగ్రేసరత్వము, మించడము. * of the equinoxesకాలవ్యత్యయము.
Precinct n s ఆవరణము.
Precious adj ప్రియమైన, వెలపొడుగైన, అమూల్యమైన. the * metals ప్రియమైన లోహములు, అనగా వెండి, బంగారు, కలధౌతము. * stonesరత్నములు. a * jewel నిండా వెల పొడుగైన సొమ్ము. I lost my * childనా రత్నము వంటి బిడ్డను పోగొట్టుకొంటిని. I lost my * limbs in the war యుద్ధములో నాకు ప్రధానమైన అవయవములు పోయినవి, సాధారణముగా కాళ్ళని భావము. this is a * book యిది దివ్యమైన గ్రంథము.
Preciously adv అమూల్యముగా, దివ్యముగా.
Preciousness n s అమూల్యత.
Precipice n s చరి, భృగువు. he fell from the * and was killed .కొండచరిలో పడి చచ్చినాడు. you are standing on a * నీవు మహా సంకటమైన స్థితిలో వున్నావు.
Precipitance, Precipitancey n s. ఆతురము, అతిత్వర. If you do this with *you will be ruined నీవు అతురపడి చేస్తే చెడిపోతావు.
Precipitantly adv ఆతురముగా, ఆతురపడి.
Precipitate adj ఆతురపడే, పదిరే, ఆలోచన లేక, ఆతురపడే. you are too* నీవు నిండా ఆతురపడుతావు. he gave a * answer ఆతురపడి వుత్తరము చెప్పినాడు.a * decision ఆతురముగా చేసిన తీర్పు.
Precipitated adj తల్లకిందులుగా తోయబడ్డ, ఆతురముగా చేసిన, అడుగుకు దిగిన.
Precipitately adv ఆతురముగా, వెనకా ముందు చూడకుండా, దడబడలుగా.he ran * తలాకాళ్లు తెలియకుండా పరుగెత్తినాడు.
Precipitation n s తల్లకిందులుగా తోయడము, ఆతురము, పదటము. with *ఆతురముగా, దడబడలుగా.
Preciptous adj ఒడ్డొరకముగా వుండే, కాలునిల్వని. the bank has a * riceయిక్కడకట్ట నెట్రముగా వున్నది, కాలు నిలువదు.
Precis n s సంక్షేపము, టూకీ.
Precise adj సరియైన, సరిగ్గావుండే. he came at the * time సరిగ్గా ఆవేళకు వచ్చినాడు. he is a very * man క్రూరుడు.
Precisely adv సరిగ్గా, హెచ్చుతగ్గు లేకుండా.
Preciseness n s సరిగ్గా వుండడము, యెక్కువ తక్కువ లేకుండా వుండడము. orseverity క్రూరభావము.
Precisian n s One who is superstitiously rigorous, పిచ్చితనముగా యిది కాదు అది కూడదనేవాడు.
Precision n s సరిగ్గా వుండడము, యెక్కువ తక్కువ లేకుండా వుండడము,కరా ఖండితముగా వుండడము.
Precluded adj నివారించబడ్డ, నిషేధించబడ్డ. I was * from going thereఅక్కడికి పోవడానికి అభ్యంతరమైనది.
Precocious adj పిందెలో పండిన, అకాలపక్వమైన.
Precocity n s పిందెలో పండడము.
Precognition n s ముందు విమర్శ, మొదటి విమర్శ.
Preconceived adj ముందుగా తోచిన.
Preconception n s ముందుగా తోచినది.
Preconcerted adj ముందుగా ఆలోచించబడ్డ.
Precursor n s ముందుగా పొయ్యేవాడు, అగ్రగామి, పురోభావి సూచకము.this headache is the * of fever యీ తల నొప్పి జ్వరానికి ముందు సూచన.
Predatory adj దోచుకొనే, కొల్లబెట్టే, * horse కొల్ల గుర్రము.a * incursion పెండారీ దవుడు.
Predecessor n s ముందుండిన వాడు. he was my * in this house అతడు నాకు ముందు యీ యింట్లో వుండినవాడు.
Predestinarian n s విధియనేవాడు, దైవ సంకల్పమనేవాండ్లు.
Predestinated adj ఈశ్వర సంకల్పమైన. a * rogue పుట్టుదొంగ.
Predestination n s విధిదైవ సంకల్పము, పూర్వనిర్ధారణ.
Predetermination n s పూర్వ సంకల్పము, ముందు నిర్ణయము.
Predicable adj అనుమేయించ తగ్గ, నిరూపించతగ్గ.
Predicament n s అవస్థ, దురవస్థ, దుర్దశ, దుర్గతి, యిబ్బంది, యిక్కట్టు.in logic పదార్థము.
Predicted adj ముందుగా చెప్పబడ్డ, సూచింపబడ్డ.
Prediction n s రాబొయ్యేదాన్ని చెప్పడము. his * proved false వాడుజరగబోతున్నదన్నది అబద్ధమైపోయినది. all their *s were verified వాండ్లు యేదేది యెట్లా జరగబోతున్నదన్నారో అది అట్లాగే జరిగినది.
Predilection n s పక్షపాతము, అభిమానము.
Predisposed adj ఆయత్తపరచబడ్డ, ఉద్యుక్తపరచిన. by relationship he was *to be my friend బంధుత్వము చేత నాతో హితముగా వుండడానకు సిద్ధముగావుండినాడు.
Predisposition n s సిద్ధము, ఆయత్తము, ఉద్యుక్తము.
Predominance n s ప్రాబల్యము, ప్రాధాన్యము, వ్యాపకత్వము.
Predominant adj ప్రబలమైన, ప్రధానమైన.
Predominating adj ప్రబలమైన, ప్రధానమైన.
Preeminence n s శ్రేష్ఠత్వము, ప్రాధాన్యము, ఆధిక్యము. from the * of hislearning వాడి విద్యామహిమచేత.
Preeminent adj సర్వశ్రేష్ఠమైన, సర్వోత్తమమైన.
Preeminently adv సర్వోత్కృష్టముగా, అతి ఘనముగా.
Preengagement n s ముందుగా మాట్లాడుకోవడము, వేరే ప్రవర్తించడము.
Preexistence n s ముందుగా కలిగి వుండడము, పూర్వజన్మము, పూర్వస్థితి. In astate of * పూర్వజన్మములో.
Preexistent adj ముందుగానే వుండిన, పూర్వమువుండిన.
Preface n s అవతారిక, పీఠిక. without further * అవతారిక లేకుండా, అనగాతిరుగుళ్ళు లేకుండా, ముఖ్యముగా.
Prefaced adj అవతారికగల. the book was * with abuse of other poetsయితర కవుల దూషణ ఆ గ్రంధమునకు అవతారికగా పెట్టబడ్డది.
Prefatory adj అవతారికగా వుండే. * remarks అవతారిక.
Prefect n s అధ్యక్షుడు, సేనాధిపతి.
Preferable adj ఉత్తమమైన, శ్రేష్ఠమైన. this is * to the rest కడమ వాడికంటే యిదివాసి, మేలు, నయము.
Preferably adv ముఖ్యముగా, శ్రేష్ఠముగా.
Preferement n s ( Advancement to a higher station ) ఉద్యోగములోఅభివృద్ధి చేయడము. This is a word used regarding clergymen.
Preference n s ఉత్తమము, ముఖ్యము, శ్లాఘ్యము, మేలు, వాసి. they shewedtheir * of water over wine సారాయి కంటే నీళ్ళే తమకు విశేషమనేదిగాఅగుపరిచినారు. he shewed no * of his relations over others యితరులకంటే తన బంధువులను అధికముగా చూడలేదు. Damayanti gave the * to Nala దమయంతి నలుణ్ని వరించినది.
Prefix n s ఉపసర్గ. In the words ప్రమాదము. the syllable ప్ర is a *.
Pregnancy n s గర్భముగా వుండడము, కడుపుతో ఉండడము, చూలుగా వుండడము during her * అది కడుపుతో వుండేటప్పుడు వేకటిగా వుండేటప్పుడు.* of wit చమత్కారము.
Pregnant adj గర్భిణిగావుండే, కడుపుతో వుండే, చూలుగావుండే. a * wit అతిమేధావి. a * remark అతి ముఖ్యమైన మాట, బహు దూరానికి పొయ్యే మాట.this is a * fact యిది అతి ముఖ్యము. this is * of evil యిది కష్టజనకము, యిది కష్టమునకు కారణము. to become * గర్భిణి యౌట.
Prejudice n s Prepossession, judgement formed beforehand withoutexamination విచారణ లేని నిర్ణయము, అనగా దురభిమానము, దుర్భ్రమ, పిచ్చితలంపు,పిచ్చి. * against విరోధము, విరుద్ధము, అనగా నిర్హేతుకమైన అసహ్యము * in favour of పక్షము, అభిమానము, అనగా నిర్హేతుకమైన విశ్వాసము .Bias పక్షపాతము. some of the English have a * against rice యింగ్లీషు వారిలో కొందరికి బియ్యము కారాదని వొక పిచ్చి నిష్కర్ష కలదు. *s are removed by education చదువు వల్ల దురభిమానములు పోతవి. a Philosopher is a man without *sతత్వజ్ఞాని దురభిమానము లేనివాడు, పిచ్చిభ్రమలు లేనివాడు. a judge should be free from * s న్యాయాధిపతి దయాదాక్షిణ్య విహీనుడుగా వుండవలసినది. the English has a * that the Highlanders ate children ( See in proof the Chevalier Johnstone.page .101.) చెంచు వాండ్లు బిడ్డలను తిన్నారని ఇంగ్లీషు వాండ్లకు వొక పిచ్చి తలంపు వుండినది. The Hindus prefer eating with the hand : the Englishwill eat with the hand : in this both the Hindu and the Englishman are guidedby * హిందువులు చేతితో తినడము మేలు అంటారు, యింగ్లీషువారు చేతితోయెంతమాత్రమున్ను తినరు, యీ విషయములో హిందువులకున్ను యింగ్లీషు వారికిన్ని వుభయులకున్నువుండేది వట్టి దురభిమానమేను. The Musulmans have a * against the ( తొండ ) camelion which they kill wherever they find it తురకలు తొండను చూచిన చోట చంపుతారు దాని మీద వాండ్లకేమోవొక పిచ్చి వైరము. he has a * in my favour I being his relation బంధువుణ్నిగనక అతనికి నా యందు అభిమానము. he had a * against me because he hatedmy father నా తండ్రి యందు వాడికి విరోధము గనక నా యందున్ను విరోధముగా వుండెను.through a * which he had in their favour వాండ్ల యెడల వుండే అభిమానమువల్ల. through a * which he entertained against them వారి యెడల వుండే విరోధమువల్ల.every parent has a * in favour of his child కాకికి తన పిల్లే బంగారుపిల్ల.Prejudice, ( as meaning, mischief, detriment, hurt, harm ) హాని,నష్టము,చెరుపు, వుపద్రవము. this rain did a * to the crop ఈ వర్షము పంటకు చెరుపు. drinking does a * to the health తాగడము వొంటికి చెరుపు.Prejudice is wilful blindness; and thus is in these texts renderedblindness; Mark III.5. Rom.XI.25. Porosis. Eph.IV.18. అంధకారము.A+ అంధతా A+ the veil is over their hearts . Cor.III.15. ప్రచ్ఛాదనం.A+.
Prejudiced adj అభిమానముగల, దురభిమానముగల, విరోధముగల. a * manదురభిమాని క్రూరుడు, చలము పట్టినవాడు. they are * against him వాడి మీద వాండ్లకు విరోధము. all of us are * in favour of ourown country మా కందరికి స్వదేశాభి మానము కద్దు.
Prejudicial adj విరోధమైన, విరుద్ధమైన, హానికరమైన. fruit is * in feverజ్వరములో పండ్లు విరోధము. sleeping outside is * to health బయిట పండుకోవడము వొంటికి కారాదు.
Prelacy n s బిషపుపట్టము. the * బిషపులు. he was raised to the * బిషపుఅయినాడు.
Prelate n s ప్రధాన గురువు, బిషపు.
Preliminary adj మొదటి, ముందరి. a * step ఆదిమ ప్రయత్నము.* remarks అవతారిక, పీఠిక.
Prelude n s ప్రారంభము, మొదటి యత్నము . * in music ఆలాపన.
Premature adj అకాలపు, అకాలపక్వమైన. * death అకాలమరణము.a * confinement కడుపు దిగబడడము.
Prematurely adv అకాల పక్వముగా, అకాలములో.
Prematureness n s అపరిపక్వము. from the * of this * fruit యిది పిందెలో పండినది గనుక.
Premeditated adj ఆలోచించిన.
Premeditatedly adv ఆలోచించి, తలచి, యోచించి, కావలెనని.
Premeditation n s ఆలోచన, యోచన.
Premenade n s పచారి చేయడము, పచారి చేసే బయిలు, మైదానము.
Premier n s మంత్రి, ప్రధాని.
Premised adj ముందుగా చెప్పుట, ముందుగా తెలియ చేసిన.
Premises n s Propositions ప్రమేయము, ముందుగా చెప్పబడ్డవి, సిద్ధాంతము.houses or lands భూమి, స్థలము, యిల్లు మొదలైనవి.
Premiss (n s.) పూర్వ సిద్ధాంతము. ( Whately's Logic ).
Premium n s or reward బహుమానము .in a bond తోపుడు, అడతి.
Premunire n s మహత్తైన అపరాధము, యిది సీమలో చట్టమునకు విరుద్ధముగా చేసిన అపరాధము. he incurred the penalties of a * రాజద్రోహియైనాడు,మహాపరాధియైనాడు.
Prentice n s See Apprentice.
Preoccupied adj ముందుగా స్వాధీనపరుచుకోబడ్డ. the house was * ఆ యింటికిముందుగానే కాపురము వచ్చినారు. I saw that he was * వేరే ఆలోచన మీదవుండినాడు, పరధ్యానముగా వుండినాడు, వాడి బుద్ధి వేరే ప్రవర్తించి వుండినది.
Preparation n s యత్నము, ప్రయత్నము, సన్నాహము. they were in a stateof * సన్నద్ధులై వుండిరి. or medicine కషాయము మొదలైనవి. * of food వంట, పాకము.
Preparative, Preparatory adj స్థిరపరచే, తయారు చేసే. a * schoolప్రథమశిక్ష పల్లెకూటము. preparatory setting out బయిలుదేరడానికి ముందుగా.
Prepared adj సిద్ధమైన, ఆయత్తమైన, తయారైన, ఉద్యుక్తమైన. I am * toprove this దీన్ని రుజువు చేయడానికి సిద్ధముగా వున్నాను. I am not * to consent to this దీనికి నేను వొప్పను.
Prepense adj ఆలోచించిన, తలచిన, యోచించిన. through malice *ప్రయత్నపూర్వకమైన చలమువల్ల.
Preposition n s విభక్త్యర్థకమైన అవ్యయము. To Of, By, For మొదలైనవి.
Prepossessed adj అభిమానముగల, విరోధముగల. I was * in his favourనాకు వాడి మీద అభిమానము కలిగినది. he was * against me వాడికి నా మీద మునుపే ద్వేషము వుండినది.
Prepossessing adj సరసమైన, మనోహరమైన.
Prepossession n s పక్షము, అభిమానము.
Preposterous adj విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
Preposterously adv విపరీతముగా, అసంగతముగా, అకటవికటముగా.
Prepuce n s సున్నతులో కోసి వేసే తోలు, ముందోలు.
Prerogative n s విశేషాధికారము, స్వతంత్రము, ఆధిక్యము.
Presage n s ముందు సూచన, శకునము.
Presbyter n s వొకవిధమైన పాదిరి.
Presbyterian n s వొకవిధమైన మతస్థుడు.
Presbyterianism n s వొక మత నామము.
Presbytery n s వొకమతస్థుల సభ.
Prescience n s భవిష్యద్జ్ఞానము.
Prescient adj భవిష్యద్జ్ఞానముగల.
Prescribed adj ఆజ్ఞాపించిన, విధించిన, చీటి వ్రాసి యిచ్చిన.
Prescription n s ఆజ్ఞ, విధి. or custom బహు దినాల వాడిక, మర్యాద, స్వతంత్రము. a doctor's * వైద్యుడు వ్రాసి యిచ్చిన చీటి.
Prescriptive adj consisting in long usage చిరకాలిక, వాడుకగా నడుస్తూ వుండే, అనాదియైన, స్వతస్సిద్ధమైన, రూఢమైన.
Prescriptively adv అనాదిగా, స్వతస్సిద్ధముగా, రూఢముగా.
Presence n s సముఖము, సమక్షమము. In his * అతని యెదట. In the * ofwitnesses సాక్షుల ముందర. * of mind ధైర్యము, నిబ్బరము, సమయస్ఫూర్తి. lossof * of mind కలవరము. she lost her * of mind కలవరపడ్డది. * in heavenసాలోక్యము.
Presence chamber n s కొలువుకూటము.
Present adj యిప్పుడు వుండే, యెదట వుండే, సమక్షమములో వుండే, యిప్పటి.at * ప్రస్తుతము, యిప్పుడు. the * time యిప్పుడు. the * Governor యిప్పటి గవనరు.his * master అతనికి యిప్పుడు వుండే దొర. at the * day యిప్పటి కాల మందు.Up to the * time యిదివరకు. Were you then * ? నీవు అప్పుడు వుంటివాI was * వుంటిని. the matter was then * to my mind అప్పుడు ఆ సంగతి నాకు జ్ఞాపకము వుండినది. in the * life ఇహమందుthe * letter యీ జాబు for the * ప్రస్తుతమునకు, యిప్పటికి. the * tense వర్తమానకాలము. these * s or this letter పరవానా, యినాయితునామా. The constant * tense, as Men die,children cry నిత్య వర్తమానము. The occassional * tense, as the men aredying, the children are crying అనిత్య వర్తమానము. a very * help in time of trouble Ps. XLVI.I. నికటశ్చోపకారః A+.
Presentable adj అగుపరచదగిన, చూపదగిన. the letter he wrote me is not *అతని జాబు అగుపరచ గూడనిది.
Presentation n s యివ్వడము, ఖ్రిష్టుగుడికి పాదిరిగా నియమించడము. a * copy ofa book బహుమాన మివ్వడమునకై సిద్ధపరచిన ప్రతి.
Presentiment n s అనుమానము, సందేహము, అనగా రాబొయ్యే శుభాశుభములనుగురించి ఆకస్మికముగా మనస్సు తట్టే అనుమానము. he had no * of his death వాడుతాను చస్తానని తలచనేలేదు. See verse written under ప్రవృత్తి.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

3 comments:

  1. Does your ѕіte hаve a contact page?
    I'm having a tough time locating it but, I'd liκe tο ѕеnd you an email.
    I've got some suggestions for your blog you might be interested in hearing. Either way, great website and I look forward to seeing it improve over time.

    Take a look at my blog post :: RPMPoker Bonus

    ReplyDelete
  2. Hі! Would уοu mіnd if І share
    your blog wіth my zyngа gгоuρ?

    There's a lot of folks that I think would really enjoy your content. Please let me know. Thank you

    Feel free to visit my blog post RPMPoker Promotions :: ::

    ReplyDelete
  3. I'm truly enjoying the design and layout of your blog. It's а ѵery easy οn the eyeѕ ωhiсh makes
    іt much morе enjоyаble foг me
    tо come here аnԁ vіsit moгe often.

    Did you hirе out a dеveloper to cгeаtе уоuг theme?
    Suρerb wοгk!

    My ρage: CaгbonPokeг Bonuѕ (http://www.edsupport.cc/mentor/blog/index.php?postid=7347)

    ReplyDelete