Presently English to Telugu free online dictionary

Presently adv వెంటనే, వెంబడిగా, తోడుతోనే. I cannot come now I will come* యిప్పుడే రాలేను యింక కొంచెము సేపటికి వస్తాను. రవంతతాళి వస్తాను. he * arrived తోడుతోనే వచ్చి చేరినాడు. he * became rich తోడుతోనే మహరాజైనాడు.
Presentment n s గ్రాండు జూరీలు వ్రాసుకొనే మనివి అర్జి.
Preservation n s కాపాడడము, రక్షించడము. we thank God for our * దేవుని దయవల్ల తప్పినాము. motives of self * made him do this తన ప్రాణాన్ని కాపాడుకోవడమునకై దీన్ని చేసినాడు.
Preservative n s రక్షించేటిది, రక్ష, కాపు. as a * against fever జ్వరము రాకుండా వుండేటట్టు.
Preserve n s Preserves or fruits preserved కుళ్ళిపోకుండా చక్కెరలో గాని తేనెలో గాని పక్వముచేసి పెట్టిన పండ్లు, మిఠాయి.* in pickle వూరుగాయ. or park for wild animals (See on Park.)ఉద్యానవనము వేడుకకు మృగములను పెంచే తోట.
Preserver n s రక్షకుడు, పోషకుడు.
Presidency n s superintendency ప్రభుత్వము, అధికారము, సంస్థానము. ortown రాజధాని, పట్నము, రాజ్యము. in the four Presidencies i.e. in Madras,calcutta, Bombay and Agra. నాలుగు రాజ్యములలో అనగా ఇండ్యదేశమంతటానున్ను. Suttee is now abolishedin the four Presidencies భరత ఖండములో సహగమనము నిలిపివేయబడ్డది.
President n s అధ్యక్షుడు, ముఖ్యుడు. he was the * at the meetingఅతడు ఆ సభా నాయకుడుగా వుండెను.
Presidentship n s అధ్యక్షత, ఆధిపత్యము.
Press n s Multitude గుంపు, సందడి, సమ్మర్ధము. from the * of businessబహుపనివల్ల. printing * అచ్చు, అచ్చుయంత్రము. errors ofthe * అచ్చుకూర్చడములో వచ్చే తప్పులు. the work was put ot * ఆ గ్రంథము అచ్చువేయడానకు ఆరంభమైనది. they stopped the * అచ్చు వేయడమును చాలించినారు.the daily * i.e., newspapers సమాచార పత్రికలు the daily * confirms thisసమాచార పత్రికలవల్ల యిది రూఢమైనది. or cabinet అల్మారా. a * bed అల్మారా వలెవుండే వొక విధమైన మంచము.
Pressed adj అణచబడ్డ, అణగిన, పిండబడ్డ, తొందర చేయబడ్డ. I was * for timeనాకు సావకాశము లేక వుండెను .if * for time సావకాశము లేకపోతే.
Pressgang n s వాడకు మనుష్యులను పట్టేవాండ్లు. అనగా యుద్ధవాడలో నౌకరికిపెట్టుకోవడానకు మనుష్యులను పట్టుకొని వచ్చే వుద్యోగములో వుండేవాండ్లు.
Pressing n s సిపాయీ కొలువులో గాని, సైలరు కొలువులోగాని పెట్టుకోవడానకుమనుష్యులను పట్టుకొని వచ్చే బంట్రోతు, బలవంతము, కక్కసము. In consequence ofhis * I did this వాడి బలవంతమువల్ల దీన్ని చేస్తిని.
Pressingly adv బలవంతముగా, నిండా అగత్యముగా.
Pressman n s అచ్చు వేశేవాడు.
Pressure n s అణచడము, వొత్తడము, పైనబడడము, తోదోపుళ్లు, తొందర. by the *of the crowd గుంపు పైబడడమువల్ల, తోదోపుళ్ళ వల్ల. by the * of want లేమిడియొక్క తొందర చేత.
Prest adj అదమబడ్డ, అణచబడ్డ. See to Press.
Prestige n s ( illusion ) విద్యలు, మాయ. O'Connell had that vigour ofintellect which. coupled with a reckless determination to succeedforms the true * of legal success ( Times, newspaper వాడు జయిస్తాడనేమాయ అందరినిన్ని కమ్మినది.
Presto adv లటక్కు, తక్షణము. in Music ద్రుతము, త్వర.
Presuming adj అహంకరించే.
Presumption n s Pride అహంకారము, గర్వము. supposition అనుకోవడము,యెంచుకోవడము, ఊహ.
Presumptive adj అనుమేయించిన, వూహించిన. * evidence or proof వూహించిన రుజువు.
Presumptuous adj గర్వించిన, అహంకరించిన.
Presumptuously adv గర్వము, అహంకారము.
Presupposal n s ముందుగా అనుకోవడము, ముందుగా యెంచుకోవడము. on the *that he would consent అతడు వొప్పునని యెంచుకొని.
Presupposed adj పూర్వభావిగావుండే, ముందుగా యెంచిన, తలచిన.
Presupposition n s పూర్వభావిత్వము, ముందుగా యెంచడము, తలచడము.
Pretence n s సాకు, నెపము, వ్యాజము, జంభము, డంభము.
Pretended adj మాయమైన, కపటమైన. * sleep దొంగనిద్ర. * grief నీలియేడ్పు.a * saint కపట సన్యాసి. a * warrant పితలాటకపు వారంటు.
Pretender n s or claimant తనకు బాధ్యత కలదనేవాడు. a * to religion మాయ భక్తిగలవాడు. the * to a throne ఒక సింహాసనము యొక్క బాధ్యత తనకు కలదనేవాడు.
Pretension n s బాధ్యత. groundless *s దుర్భలమైన బాధ్యత.
Preterimperfect adj in grammar తాత్కాలిక భూతమైన. I was going, hewas doing పోతూవుంటిని, చేస్తూ వుండినాడు.
Preterit adj in grammar భూత, గత గడిచిన. * tense భూతకాలము. Went isthe * of To Go and Came is the * of To come.
Preternatural adj అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, విపరీతమైన, విశేషమైన. SeeGibbon chap. note .
Preterperfect, Preterpluperfect adj అనద్యతన భూతమైన.
Pretext n s సాకు, నెపము, వ్యాజము.
Pretor n s an officer among the ancient Romans ఒకఅధికారి.
Prettily adv సొగసుగా, శృంగారముగా, మనోహరముగా, ముద్దుగా.
Prettiness n s సొగసు, శృంగారము, సొంపు, ముద్దు.
Pretty adj and adv సొంపైన, సొగసైన, ముద్దైన, చక్కని, నాణ్యమైన, విలక్షణమైన,తగిన, కొంచెము, కాస్త. a * girl సొగసైన పడుచు. It is * nearly finished అది కావచ్చినది. * good కొంచెము మంచిది, వాసి. * easy కొంచెము సులభము. * large కొంచెము గొప్ప * soon కొంచెము త్వరగా I am * well నాకు వొళ్లు మరేమిలేదు. In reproach దొడ్డ. a * excuse దొడ్డసాకు, దివ్యమైనసాకు, అనగా పనికిమాలినసాకు. you are a * fellow నీవు మంచివాడవే,దొడ్డవాడవే. Very * ! దొడ్డపని సుమీ, బంగారుపని. a * fellow or beau విటగాడు.
Prevailing adj ప్రబలమైన, వ్యాపకమైన, చెల్లే, నడిచే.
Prevalence n s ప్రాబల్యము, వ్యాపకత్వము, విస్తారము.
Prevalent adj ప్రబలమైన, విస్తారమైన.
Prevarication n s సందిగ్ధముగా చెప్పడము, తారుమారుగా చెప్పడము.
Preventative n s కట్టుమందు, ప్రతిక్రియ.
Prevented adj ఆటంకపరచబడ్డ, అభ్యంతరమైన. was * coming నేను రావడానకుఅభ్యంతరమైనది.
Prevention n s ఆటంకము, అభ్యంతరము.
Preventive adj. ఆటంకము చేసే, అభ్యంతరమైన. the * service మెట్టుబంట్రోతులు,సుంకపు బంట్రోతులు.
Previous adj ముందరి, పూర్వపు, లోగడి. * to my arrival నేను చేరడానకు
Previously adv ముందుగా, ముందర, లోగా, లోగడ, అంతకులోగా.
Prey n s ఎర, ఆహారము, కొల్ల, దోపుడు. he became their * వాండ్ల చేత చిక్కినాడు.a beast of * దుష్టమృగము, క్రూరమృగము, అనగా పులి మొదలైనది. the alligatorand lizard are beasts of * మొసలి, బల్లి, యివి జంతువులను కొట్టుకొని తినేటివి.she is a * to grief వ్యసనము పాలైనది. the house fell a * to the flames ఆ యిల్లు అగ్నిహోత్రముపాలైనది, అనగా కాలిపోయినది. he was a * to thoughtవిచారగ్రస్తుడై వుండెను.
Priapus n s ప్రజాపతి, లింగము, సంగమేశ్వరుడు. or scarecrow వెరబొమ్మ.
Price n s వెల, క్రయము, ధర. the market * అంగడివెల. the current *కాలక్రయము. a current నీరఖునామా. he paid a heavy * for it తలతోచెల్లించినాడు. +
Pricker n s పొడిచే సాధనము.
Pricking adj పొడిచే.
Prickle n s ముల్లు, సన్నముల్లు.
Prickliness n s ముండ్లుగా వుండడము.
Pricklouse n s ( Johnson ) దర్జీ, కుట్రపువాడు, యిది యెగతాళిమాట.
Prickly adj ముండ్లుగా వుండే. a * ముండ్ల చెట్టు.
Prickly-pear n s ( Cactus Indicus, straight thorned opuntia Wilks.3.87.నాగతాళి, నాగతాళి ముల్లు. Ainslie .2.217 . Rox.2.475 .
Pride n s గర్వము, అహంకారము, మదము, పొగరు. the * of beauty అందముయొక్క వుఛ్రాయదశ. she was the * of her sex అది స్త్రీ తిలకము, స్త్రీ రత్నము.the horses are full of * ఆ గుర్రములు మదించి వున్నవి. the elephant is in *or lust ఆ యేనుగకు మదము పట్టివున్నది.
Priest n s గురువు, ఆచారి. a Christian * పాదిరి. a Musulman * ముల్లా. asacrificing * యాజకుడు. an officiating * in a Vishnu pagoda అర్చకుడు,నంబివాడు. In a Siva pagoda తంబళవాడు. In the pagoda of a villagegoddess పూజారి. a family * or chaplian పురోహితుడు. a parish * గ్రామపురోహితుడు. In .Acts .XIV.13. ఆచారి .G+ పూజారి. F.యాజకః A+. .In .Heb..VII.21. ఆచారి. FG. యాజక A+.
Priestcraft n s గురుకృత ప్రతారణము, గురువుచేసే పితలాటకము.
Priestess n s అర్చకురాలు.
Priesthood n s ఆచార్యపుంస్త్వము, పౌరోహిత్యము, అర్చకత్వము. the * గురువులుపాదుర్లు. he was raised to the * పాదిరి అయినాడు.
Priestly adj గురు సంబంధమైన. * office గురు ధర్మము the * dressగురువేషము, పాదిరి వేషము.
Priestridden adj గురువుచేతికింద పశుప్రాయులై యుండే. these people are *వీండ్లు పశుప్రాయులై గురువు ఆడిస్తే అట్లా ఆడుతారు.
Prig n s అహంకారి, తలకొవ్వినవాడు, పొగరుబోతు.
Prim adj ముద్దుగా వుండే, సొగసైన, సొంపైన, చక్కని, గంభీరమైన, అమరికగా వుండే. She blushed and looked * ముఖము మాడిచినది.
Prima facie adv స్వతస్సిద్ధముగా, సహజముగా.
Primacy n s Archbishop అనే గురు పట్టణము, రాజగురుత్వము. he was raisedto the * అతడు. Srchbishop[ అయినాడు, రాజగురువైనాడు.
Primarily adv మొదట, ఆదిని, ప్రథమతః, ముఖ్యముగా.
Primary adj మొదటి, ఆది, ముఖ్యమైన.
Primate n s రాజగురువు, ప్రధానగురువు.
Prime n s ఆరంభము. or best part ఉత్తమాంశము. In the * of youthయౌవనశాల మందు. her beauty is now in its * దాని అందానికి యిప్పుడువుఛ్రాయదశ. or dawn ప్రాతఃకాలము.
Primer n s పిల్లకాయలు అక్షరములు నేర్చుకొనే చిన్నపుస్తకము.
Primero n s వొక విధమైన కాకితాలాట.
Primeval adj మొదటి, ఆదిమ, ప్రాచీనమైన. [ పుర్వోత్పన్న W. in Sankh. $ 40. ]
Priming n s రంజకము, తుపాకి చెవికి పెట్టేమందు. in painting మొదటిపూత.
Primitive adj మొదటి, ఆదిమ, ప్రాచీనమైన, అనాదిగావుండే. a man of * virtueకృతయుగ ధర్మముగలవాడు. in grammar ప్రాతిపదికము. the * meaning ధాత్వర్థము,మూలార్థము.
Primitives n s ధాతువులు, ప్రాతిపదిక శబ్దములు.
Primness n s ముద్దు, సొగసు, గంభీరము, అమరిక.
Primogeniture n s జ్యేష్ఠత్వము. the the right of * జ్యేష్ఠుడైనందున.
Primordial adj ప్రథమ, ఆదిమ.
Primrose n s వొకవిధమైన పుష్పము.
Primum mobile n s ఆదిమకారణము, జీవాతవు, ప్రాణము.
Prince n s రాజు, యువరాజు, రాజకుమారుడు. Shakespeare is held to be the* of poets అతడు కవి శ్రేష్ఠుడు.
Princedom n s ఆధిపత్యము, ప్రభుత్వము.
Princelike adj రాజయోగ్యమైన.
Princeliness n s ఘనత్వము, ఆధిపత్యము.
Princely adj అతిఘనమైన. One of * birth రాజవంశములో పుట్టినవాడు.
Princess n s రాణి, రాజభార్య, దొరసాని, రాజకుమార్తె.
Principal adj ప్రధానమైన, ముఖ్యమైన. the * objection ముఖ్యమైన ఆక్షేపణ.
Principality n s ఆధిపత్యము, ప్రభుత్వము, అధికారము, రాజ్యము.
Principia n s plu. మూలసూత్రములు, సిద్ధాంతము.
Principle n s Fundamental truth మూలసూత్రము. this machine is madeonthe * of the spinning wheel యీ యంత్రము రాట్నము రీతిగా చేసివున్నది. It isthe * of fire to burn నిప్పుకు కాలడము సహజ గుణము. motive, opinion, text,rule, హేతువు, అభిప్రాయము, ప్రయోజనము, మతము, సిద్ధాంతము, బీజము,సూత్రము. a man of god *s నీతిపరుడు. a man of no * నీతిదూరుడు. heattends to his duties on * వాడు తన పనిని ధర్మముగా జరిపిస్తాడు. the *s heprofesses వాడు అవలంబించి యున్నాననే సిద్ధాంతములు. the soul of man isan active * ప్రాణము చలనశక్తిగా వున్నది. If you profess these *s you oughtnot to do this నీవు యీ సిద్ధాంతమును అవలంబించినా నంటివా దీన్ని చేయరాదు.
Principled adj నీతిగల, ధర్మముగల. ill * దుష్ట. well * సునీతుడైన.
Print n s అచ్చు, ముద్ర. or picture అచ్చు వేసిన పఠము. that book is now in *ఆ పుస్తకము యిప్పుడు అచ్చు వేసి వున్నది. that book is now out of * ఆపుస్తకము యిప్పుడు చిక్కదు, అనగా అచ్చువేసిన ప్రతులన్ని అమ్మకమైనపోయినవి. abook in large * పెద్ద అక్షరములతో అచ్చు వేసిన పుస్తకము. a book in small *నన్న అక్షరములతో అచ్చు వేసిన పుస్తకము. the public *s అనగా newspapersసమాచార పత్రికలు. there were the * s of a dog's feet here యిక్కడ కుక్కయొక్క అడుగుల జాడలు వుండినవి. a wooden butte * వెన్న మీద ముద్రవేసే ముద్రపలక. a * of butter వెన్న మీద ముద్ర వేసే ముద్రపలక. a * of butter వెన్నబిళ్ళ. a chintz చీటిగుడ్డ. in * or formal method ( a low or word Johnson )పరిష్కారముగా.
Printed adj అచ్చువేసిన. * cloth చీటిగుడ్డ.
Printer n s అచ్చువేసేవాడు.
Printless adj గురుతులేర్పడని.
Prior adj మొదటి, ముందరి. on a * occassion ముందర వొక తరణములో. hehas a * claim to the money ఆ రూకలకు మొదటి బాధ్యత వానిది, ముఖ్య బాధ్యతవానిది. he refused my invitation saying he had a * engagement వరులకుమాట యిచ్చి వున్నాను నీ విందుకు రానన్నాడు. * to his arrival వాడు రాక మునుపే.
Prioress n s సన్యసించిన స్త్రీలు వుండే మఠాధికారియైన స్త్రీ.
Priority n s ముందుగా వుండడము. this proves the * of his appointmentయిందువల్ల అతని వుద్యోగము ముందు అని తెలుస్తున్నది. from the * of the saleఅమ్మకము ముందు గనుక.
Priory n s సన్యాసులు వుండే మఠము.
Pripism n s an erection of the penis without any concomitant pain,రాత్రి పూట రోగము చేత శిశ్నము వుత్థాపన కావడము.
Prism n s మూడు పక్కలుగాకోసిన గాజుకడ్డి, దీన్ని చూస్తే యింద్ర ధనుస్సువలె violet, indigo, blue, green, yellow, orange, red యీ యేడు వర్ణములుగాఅగుపడుతున్నది.
Prismatic, Prismatical adj పైన చెప్పిన యేడు వర్ణములలో వొక వర్ణముగల redis one of the * colours యెరుపు పైన చెప్పిన వర్ణములలో వొకటి.
Prismatically adv పైన చెప్పిన యేడు వర్ణములుగా.
Prison n s చెరసాల, బందేఖానా.
Prisonbars, Prisonbase n s. ( Johnson ) పిల్లకాయలు ఆడే వొక ఆట.
Prisoned adj చెరసాలలో పడ్డ, ఖైదులోవుండే.
Prisoner n s చెరసాలలో పడి వుండే వాడు, బందేఖానాలో వుండేవాడు, ఖైది. thisrain keeps us *s యీ వాన మమ్మున బయిట పోనియ్యలేదు. the monkey wasthen * my అప్పట్లో ఆ కోతి నాకు చిక్కి వుండినది.
Pristine adj అదిమమైన, మొదటి, ముందరి.
Prithee Abbreviation for praythee బతిమాలుకొంటాను, Tell me *ఆడుక్కొంటాను నాతో చెప్పు.
Privacy n s రహస్యము, ఏకాంతము. he did this without my * దీన్ని నా యెరుకలేక చేసినాడు.
Private adj రహస్యమైన, ఏకాంతమైన, సొంతమైన. * individuals సర్కారు యిలాకా లేనివాండ్లు. * servants సొంత నౌకరులు. * mark సంకేతమైన గురుతు he was in * clothes సొంత వుడుపును వేసుకొని వుండినాడు. అనగా సర్కారు వుద్యోగమునకు లాయఖైన వుడుపును వేసుకోలేదని భావము. a * gentleman స్వతంత్రుడు,సేవకా వృత్తిలేని దొర. one officer and ten * s వొక దొర, పదిమంది బంట్లు, పదిమంది ఖాసాలు, సోజర్లున్ను. they did this in * దీన్ని రహస్యముగా చేసినారు.he lives in * ఏకాంతముగా వున్నవాడు. the * parts of the corpse were coveredwith a cloth ఆ పీనుగ యొక్క మానము వొక గుడ్డతో కప్పి వుండినది. the Governor madea * visit to the fort గవనరు కోటకు వొంటిగా పోయినాడు.
Privateer n s కొల్లవాడ, దొంగవాడ.
Privately adv రహస్యముగా, ఏకాంతముగా.
Privation n s హీనత, లేమి, శూన్యత. the * of sight దృష్టి తప్పడము,గుడ్డితనము. the * of reason తెలివిలేమి. they suffered great *s లేమిడిచేతనానాకడగండ్ల బడ్డారు.
Privative adj అభావార్థకమైన, నిషేధార్థకమైన. ( the prefix in నఙ్ is * as, )justice, injustice " in " అనే ఉపసర్గ అభావార్థకము, యేలా గంటే న్యాయము,అన్యాయము.
Privet n s వావిలిచెట్టువంటి చెట్టు. ( Ainslie. )
Privilege n s స్వతంత్రము, ధర్మము, ఆధిక్యము, అధికారము, ఫలము, లాభము. thesecretary has the * of the post శెక్రిటేరికి తపాలా కూలి యివ్వవలసినది లేదనేఆధిక్యముకద్దు. power is a * of the rich ఐశ్వర్యమునకు అధికారము వొక ఫలము.she was allowed the * of a seat దానికి కురిచి యిచ్చేదనే స్వతంత్రము కద్దు.ఆధిక్యము నాకు కద్దు. In the Malayalam country men who are married enjoynone of the* s of a husband మళయాళ దేశములో మొగుడికి భర్తృత్వధర్మములేదు, పురుషుడికి స్వతంత్రము లేదు.
Privileged adj స్వతంత్రముగల, ఆధిక్యముగల. the * classes స్వతంత్రము గలవాండ్లు, అనగా మేజస్త్రీటు వారి యొక్కగాని, కోర్టువారి యొక్కగాని అధికారమునకులోబడినవాండ్లు. In that country the priests are * ఆ దేశములో పాదుర్లను మేజస్త్రీలువారుగాని కోర్టువారుగాని యేమిన్ని చేయకూడదు. you are * నీవు యేమి చేశినాతప్పు పట్టేవారు లేరుగదా.
Privily adv రహస్యముగా, ఏకాంతముగా.
Privity n s యెరుక. this was done with his * యిది వాని యెరుక మీదనడిచినది. without his * వాని యెరుక లేకుండా. the privides గుహ్యము, మానము,అంగము.
Privy adj రహస్యమైన, గుప్తమైన, తెలిసిన, యెరిగిన. he was not * to thisdesign యీ ఆలోచనననే యెరిగినవాడు కాడు. I was not * to their designs వాండ్ల ఆలోచన నేను యెరిగినది కాదు. were you * to this theft ? యిది నీవు యెరిగినడిచిన దొంగతనమా. they made him * to this business తాము చెయ్యబొయ్యేపనిని వాడికి యెరుకచేసినారు. the king held a * council రాజు తన అంతరంగులతోఆలోచించినాడు. a * counsellor అంతరంగాలోచనకర్త, యిది సీమలో వొక దర్జా. thelord * seal సీమ రాజసభలో వొక వుద్యోగస్థుడు.
Prize n s బహుమానము, లాభము, దోపుడు, కొల్ల, చూర. they thought thislawful * యిది తమకు దొరకడము న్యాయమే ననుకొన్నారు. In this lottery thereare ten *s and one hundred blanks యీ లాటరిలో పది గెలుపు చీట్లున్ను నూరువుత్త చీట్లున్ను వున్నవి. the ship brought her *s into port ఆ వాడ తానుజయించిన వాడలను యీ రేవుకు తీసుకొని వచ్చినది. she is a * to him అది వాడికిదొరకడము వొక లాభమే. the tier made the bull his * పులి ఆ యెద్దునులంకించుకొని పోయినది. he made the apple his * ఆ పండును లకించు కొన్నాడు. a * ram ఉత్తమమైన పొట్టేలు, అనగా పొట్టేలు, కోళ్ళు, యెద్దులు మొదలైన వాటిని అభివృద్ధి చేయడానకై ఫలాని వొక సంతలో తెచ్చే ఉత్తమమైన దానికి యింత బహుమానమని యిస్తారు, అందుకై తెచ్చే వుత్తమమైన వాటికి యీ పేరు చెల్లుతున్నది.the * ring జెట్టివాండ్లు సాముచేసే స్థలము. they took a * ( that is captured a ship ) శత్రువుల వాడను చిక్కించుకొని దోచుకొన్నారు.
Prizefighter n s బహుమానమునకై పోట్లాడే జెట్టి.
Prizeman n s బహుమానమును పొందినవాడు.
Pro See Protempore, probone,Pros and cons వాగ్వాదము.
Pro_tempore adv తత్కాలమునకు, ప్రకృతమునకు యీసారికి.
Proa n s a boat వొక విధమైన పడవ. correctly, Prahu a Malay word.
Probability n s ఏష్యము, జాడ. there is a * of rain వర్షము వచ్చే జాడగావున్నది. there is no * of that అందుకు ఏష్యము లేదు. there is small * of hisrecovering వాడు బ్రతికే జాడ కాసము. there is no * of the money being paidఆ రూకలు చెల్లే యోగము కనబడలేదు. the probabilities are in favourof hisliving there బహుశః వాడు అక్కడవుండేటట్టు వున్నది. in that * అట్లాఅయ్యేపక్షమందు. there is no* of its being useful అది అక్కరకు వచ్చేదారికనపడలేదు. in all * he is gone బహుశా వాడు పోయివుండును.
Probable adj తోచే, కనుపడే. It is * that he will come వాడు వచ్చుననితోస్తున్నది. Is that * ? అట్లా అవునా, అట్లా అవునని తోస్తున్నదా. It is very * hegave it but వాడు యిచ్చినాడో యేమో కాని.
Probably adv బహుశా, కాబోలు, యేమో, వొకవేళ.
Probang n s పెద్దశలాకు.
Probate n s Proof. The proof of a will; the official copy of a willwith the certificate of its havingbeen proved నిరూపణము, మరణ శాసననిరూపణము, యీ మరణ శాసనము నిరూపించబడ్డదని రూఢి చేయబడ్డ వొక మరణశాసనమునకు న్యాయసభలో వ్రాసిపెట్టుకొన్న ప్రతినకలు. to take * మరణ శాసనమునున్యాయసభలో నిరూపణ చేసి అధికారమును తీసుకొనుట.
Probation n s విమర్శ, పరిక్ష, పరిశీలన, పరిశోధన.
Probationary adj పరిక్షా సంబంధమైన. during the * period పరిక్షాకాలములో.
Probationer n s one who is upon trial, a novice, పరిక్షలో వుండేవాడు, అంతేవాసి. a candidate కొత్తగా పని నేర్చుకొనేవాడు.
Probatum est అనుభవసిద్ధము,యిదిపరిక్షకునిలిచినద
Probe n s పుంటిలో వేసే శలాకు.
Probity n s గార్హస్త్యము, పెద్దమనిషితనము. a man of * పెద్దమనిషి,ప్రామాణికుడు.
Problem n s ప్రశ్న. whether he will return is a * వాడు మళ్ళీ వచ్చేదిసందిగ్ధము. this is a * which I cannot solve యిది నాచేత తీరే సందేహము కాదు,యిది నావల్ల తీరదు. to curve them without pain is the * వారికి బాధ లేకుండాస్వస్థము చేయడ మెటువంటిదో విచారించ వలసినది. how to live without food wasthe * అన్నము లేకుండా యెట్లా బ్రతికేదో దాన్ని విమర్శించవలసినది. how to get adinner was the * every day తెల్లవారి లేస్తే కూటికి యెట్లా అనేదే నాకొక ప్రశ్నగావుండెను.
Problematical adj సందిగ్ధమైన, సందేహమైన, అనిశ్చయమైన, నిరాధారమైన. It ismore than * అది వొక నాటికి సంభవించేటిది కాదు. the advantages of this arevery * యిది సఫలమౌననేది నిండా సందిగ్ధముగా వున్నది.
Proboscis n s తొండము. of a muskito దోమ యొక్క ముక్కు.
Procedure n s కార్యము, పని, ప్రవర్తన.
Proceeding adj కలిగే, సంభవించే. neither made, nor created norbegotten but * నకృతం, నసృష్టితం, నప్రసూతం, తర్హి,సంజాతం, అనగా చేయబడ్డదిన్నికాదు, సృజించబడ్డదిన్ని కాదు, కన్నదిన్ని కాదు, అయితే కలిగినది.
Proceeds n s అయిన అయివజు, వచ్చిన రూకలు. I have sold the goods andsent the * here with ఆ సామాను అమ్మి అందులో వచ్చిన రూకలను యిందులో కూడాపంపినాను.
Process n s క్రమము, పద్ధతి. the * in which pearls are formed is curiousముత్యాలు పుట్టే క్రమము చోద్యముగా వున్నది. what is the * of making indigo ?నీలిమందు చేసే క్రమమేమి. in * of time కాలక్రమేణ. in law వ్యవహార క్రమము. orwarrant ఆజ్ఞాపత్రిక. A proces verbal ( French ) వాఙ్మూలము.
Procession n s వూరేగింపు, సవారి, ఉత్సవము. funeral * పీనుగను యెత్తుకొనిపోవడము.
Proclaimed adj చాటించిన, ప్రకటన చేయబడ్డ.
Proclamation n s చాటింపు, ప్రకటన కాకితము.
Proconsul n s రోమ ్ దేశములో వొక విధమైన దేశాధిపతి.
Procrastination జరపడము,ఆలస్యముచేయడము
Procreant adj ఉత్పాదకమైన, జనకమైన.
Procreation n s generation, production ఉత్పత్తి, సంతానము. the work of * రతి, సంభోగము. the * ofbirds is chiefly in the spring పక్షులు ముఖ్యముగావసంతకాలములో గుడ్లను పెట్టుతవి.
Procreative adj ఉత్పాదకమైన, జనకమైన.
Proctor n s నిర్వాహకుడు, గుమస్తా, వకీలు. the magistrate of an universityఅధికారి.
Procurable adj బోర్లగా వుండే.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment