L English to Telugu free online dictionary

L లకారము L. అనగా Pound L. S. D. అనగా pounds, shillingsandpence, 2l. i.e.Two pounds. 200l or L 200 i. e. Two hundred pounds అనగా 2000 రూపాయీలు.LL. D. abbreviation for Doctor of Laws ధర్మశాస్త్రపండితుడు. L. S. abbreviationfor Loco Sigilli నకళ్ళలో ముద్రవుండవలసిన స్థానమందువేసే గురుతు రోమ్ లెక్కలలోL. అనగా (50) యాభై.
L.L.D. n. s. స్త్రి, పండితుడు,anabbreviationofDoctorofLawsశాస్త్రిఅనేమాటకుపుటాక్షరములు
La n s in music సప్తస్వరములలో వొకటి.
Lab n s కుర్రవాడు, పిల్లకాయ. my * అబ్బాయి, నాయన, ఒరే.
Label n s ఉల్లాకు, చీటి, విలాసము అనగా ఫలానిదని తెలియడానికై సంగ్రహముగా వ్రాసి పైన అంటించిన కాగిదపతునక. the name of the book is printed in gold on a red *ఎర్రతోలు తునకమీద బంగారురేకుతో ఆ పుస్తకము పేరు వేసి వున్నది.
Labelled adj విలాసమువేసిన. the bottle was * to be drunk in the morning తెల్లవారిపూట తాగవలసినదని ఆ బుడ్డిమీద కాగిదపు తునకలో వ్రాసి అంటించి వుండినది.
Labial adj ఔష్ఠ్యము. a * letter ఓష్ఠ్యాక్షరము.
Laboratory n s ఔషధములు చేసే యిల్లు ఔషధములు చేసేశాల.(H. ఖార్ఖానా)
Laborious adj or industrious కష్టపడే, పాటుపడే, ఓపికగల. a * man ఓపికగలవాడు, ప్రయాసపడేవాడు. or difficult కష్టమైన, గడుసైన. a * taskకష్టమైనపని, గడుసైనపని.
Laboriously adv కష్టముగా, ప్రయాసగా.
Laboriousness n s కష్టము ప్రయాస, ఓపిక. from the * ofr the taskఅదినిండా కష్టమైన పని గనుక.
Labour n s శ్రమ. ప్రయాస, కష్టము, పాటు. the * we sufferred in this taskఈ పనికై మేము పడ్డ ప్రయాస, కష్టము, కడగండ్లు, పాట్లు. daily * కూలి.unpaid or compelled * వెట్టి అమిజి, అమంజి. his learned *s అతను చెప్పిన గ్రంథము. a woman in * నొప్పులు పడుతూ వుండేటిది. In Revel. II 2. పరిశ్రమము A+.
Laboured adj కష్టపడి చేసిన, కష్టపడి సాధించిన. a much * letter నేర్పినేర్పి వ్రాసినజాలు. a * description ఆదికవర్ణమము, అనగా పనికిమాలిన వర్ణనము.
Labourer n s కూలివాడు, పాటుపడేవాడు, కమతగాడు.
Labyrinth n s చెడ్డచిక్కు, చిట్టడవి, చాలా తిరుగుళ్ళు గల ప్రదేశము, అనగా లోగా ప్రవేశిస్తే బయటికి రావడానికి మహాచిక్కైన దారిగల ప్రదేశము దీన్ని రావణుడుకోట అని అంటారు. this story is quite a * ఈ కథ పోనుపోను మరీ చిట్టడివిగా వున్నది. these accounts are a complete * ఈ లెక్కలు వట్టి చిక్కుగా వున్నవి.
Labyrinthine adj చాలా తిరుగుళ్ళుగల, చిట్టవిడిగా వుండే, చెడ్డచిక్కైన,తలబీకరకాయగా వుండే.
Lac n s (in arithmetic 100,000) లక్ష. used in sealing లక్క.
Lace n s gold o silver సరిగ. a woven string అల్లికాడు. bed * న వారు, నులక. a delicate fabric of linen వలవలెవుండ వొకవిధమైన జల్లిగుడ్డ, దీన్ని చూస్తే పాముకుసుమవలె వుంటున్నది, మరిన్ని చివికిపోయి, యీనెలు మాత్రము మిగిలివుండే రావి ఆకువలలె వుంటున్నది. a * man జరీ, జల్లిగుడ్డలు, అల్లికతాళ్ళు యిటువంటివి అమ్మేవాడు.
Laced adj అల్లిన, కూర్చుకొన్న, సరిగ వేసిన. a gold * జరి వేశిన, గోటు వేశిన. strait * or austere దృఢవీర. he is strait * Vaishnava వాడు వీర వైష్ణవుడు.
Lacerated adj గీచిన, బరికిన, గాయమైన. the skin was * ఆ తోలంతా యేక బరుకులుగా వుండినది.
Laceration n s బరుకు, క్షతము, గాయము.
Lace-work n s అల్లిక, అల్లికపని.
Lachrymatory n s కన్నీళ్ళుపట్టి పెట్టే బుడ్డి.
Lacing n s అల్లిక. she sufferce from tight * నడుము బిగించి కట్టడమువల్ల దానికి రోగము వచ్చినది.
Lack n s కొరత, తక్కువ. * of sense తెలివి లేమి. for * of food అన్నానికిలేనందున. or 100,000 లక్ష.
Lackadaisical adj ద్రాభ అయిన, దేబెగా వుండే, యిది హాస్యకరమైనమాట.
Lackaday interj అమ్మకచెల్ల, యిది హాస్యకరమైనమాట.
Lackbrain n s జడుడు, మందుడు.
Lacker n s ఒకవిధమైన మెరుగునూనె, దీన్ని వార్నిసు అంటారు.
Lacker,Lacquer n s. A varinish, consisting of a solution of shell lac in alcohol; used chiefly for varnishing brass and some other metals, to prevent their trarnishing మెరుగుపూత, అనగా విత్తళి మొదలైన లోహముల మెరుగు మాయకుంఢా వుండమము నకై పూసే ద్రవద్రవ్యము.
Lackered adj మెరుగునూనె పూసిన, వార్నిసు పూసిన. * box లక్కపెట్టె. * dollsబచ్చెన బొమ్మలు.
Lackey n s చిటిగాడు, పనివాడు.
Lacklustre adj మందమైన, మకమకలాడే, నిస్తేజస్కమైన.
Laconic adj సంగ్రహముగా వుండే సంక్షేపమైన. a * letter ఒక ముక్కగా వ్రాసినజాలు. a * remark టూకీగా చెప్పినమాట.
Laconically adv సంగ్రహముగా, సంక్షేపముగా, టూకిగా.
Lacquer n s See Lacker.
Lacquey n s See Lackey.
Lactation n s చన్నిచ్చే కాలము, చన్నుతాగే కాలము.
Ladder n s నిచ్చెన.
Laden adj బరువు యెక్కించిన.
Lading, ladi'ing n s. ఎక్కించిన బరువు, కేవు.a bill of * ఎగుమతియైన సరుకులపట్టి.
Ladle, ladel n s. పెద్దగెరిటె. made of a cocoanut shell అబక.
Lady n s దొరసాని, నాయకి, యజమానురాలు. sit like a * ! పెద్దమనిషిగా కూర్చో. the gentleman and the lady wer talking ఆయన ఆమె మాట్లాడుతూ వుండిరి.the gentlemen and ladies దొరలు దొరసానులు. the old * ముసలిది. a young * చిన్న.he and his * arrived అతడు అతడి పెండ్లామున్ను వచ్చిచేరినారు. the servants went and told their * పనివాండ్లు పోయి దొరసానితో చెప్పుకొన్నారు. my * ! (or, madam !) will you please to give me leave for today ? అమ్మా నేటి దినానికి శలవు యిస్తారా. Our Lady అనగా the Virgin Mary some Hindu Saints are called by this name thus : Our * of the small pox పోలేరమ్మ. the * saint of Madras called Yagatta (i. e. St. Agatha) చెన్న పట్టణపు గ్రామదేవతయైన యేగాత. a * in waiting పరువు గల పరిచారకురాలు,ఆడపాప. a * of easy virtue బోగముది. the * in the straw (Todd in Johnson)బాలింతరాలు. a *'s man సొగసుగాడు.
Lady-bird n s ఆరుద్రపురుగు, ఇంద్రగోపపురుగు.
Lady-day n s మార్చినెల 25దో తేది వచ్చే వొకపండుగ, అనగా గుజరాతి వాండ్లకు దీపావళి సంవత్సరాదివలె యీ దినము మొదలు వర్తకపు లెక్కలు మొదలు పెట్టుతారు.
Lady-like adj దొరసానికి తగిన, నాగరీకమైన, నాజూకైన, సొంపైన. is this * conduct ? ఇది దొరసానికి తగిన నడతా.
Ladyship n s ఆమెగారు. Her * దొరసానిగారు, ఆమె. Her * Pedda Jaggaya {this is the title of a baroness near Rajahmundry} మహాదేవులైన పెద్దజగ్గయ్య. N. B. these Telugu names adopt the Masculine termination like Francis or Charles, instead of Frances or Charlotte.
Ladysmock n s ఒకవిధమైన పుష్పము
Lag, lag adj వెనకపడ్డ, జబ్బుగానడిచే. this is a very * ship ఇది మహాజబ్బుగా పొయ్యేవాడు.
Lagoon n s మడుగు.
Laic, Laical adj లౌకీక. a * bramin లౌకీకుడుగా వుండే బ్రాహ్మణుడు, నియోగి.
Laid adj ఉంచిన, పెట్టిన. a new * egg అప్పుడే పెట్టినగుడ్డు. that plan was * aside or * on the shelf ఆ యోచన మానుకోబడ్డది. the money * up for this business ఇందుకై యెత్తిపెట్టిన రూకలు. he was * open ఆ పుంటివి శస్త్రముచేసినారు. the money * out in this business ఇందుకై వ్రయము చేసిన రూకలు. the corpse was * outశవము అలంకరించి పెట్టబడ్డది. he was * up for ten days పది దినములు మంచములోపడివుండినాడు. See To Lay.
Lain adj ఉంచిన పెట్ఠిన. a woman who has * in ప్రసవించివుండే స్త్రీ. See ToLie.
Lair n s మృగముల వునికిపట్టు, మృగనివాసస్థానము. Also See Layer, which issometimes misspelt Lair.
Laird n s జమీందారుడు, యిది Scotch శబ్దము. a petty * పల్లెటూరిదొర.
Laity n s లౌకికులు, లౌక్యులు. the * and clergy లౌకికులున్ను వైదికులున్ను.
Lake n s మడుగు, హ్రదము. an artificial * చెరువు. a sort of red colourచెంగావి.
Lamb n s గొర్రెపిల్ల. a sheep in * చూటి గొర్రె. a poor * or helpless objectదిక్కుమాలిన పక్షి. in John XXI. 15.మేషశాబకము A+ ఆట్టుక్కుట్టి G+.కురిమరిగళన్ను K+.
Lambent adj gliding over without harm కదిలే, చలించే. * flames చల్లనిమంట, నిరుపద్రవమైనమంట, యిది కావ్యములో వచ్చేమాట.
Lambkin n s గౌర్రెపిల్ల, యిది గౌర్రెపిల్లకు ముద్దుపేరు.
Lambs-wool n s (a certain beverage) అప్పిల్పండ్లతో చేసిన వొక విధమైన పానకము.
Lame adj కుంటి, మొండి. this is a * excuse ఇది మొండి సమాధానము, జబ్బు సమాధానము.
Lamed adj కుంటిగావుండే. a * leg కుంటికాలు.
Lamellated adj పెంకులవలె వొకటి మీద వొకటి కప్పుకొని వుండే.
Lamely adv కుంటిగా, మొండిగా. he reads * వాడికి చదవడములో నట్టుపడుతున్నది.వాడు జబ్బుగా చదువుతాడు.
Lameness n s కుంటితనము, మొండితనము.
Lament n s ఏడ్పు, ప్రలాపము.
Lamentable adj వ్యసనకరమైన, దుఃఖకరమైన, దౌర్భాగ్యమైన, పాపిష్ఠి. a * occurrenceదౌర్భాగ్యము, ఆపద. a * mistake పాపిష్ఠి భ్రమ.
Lamentably adv వ్యసనకరముగా, దుఃఖకరముగా , దౌర్భాగ్యముగా.he is * foolish అయ్యో వాడికి యేమి పిచ్చిపట్టినది. he is * ill పాపము వాడికి యేమి రోగము వచ్చినది. he is * proud వాడికి చెడుగర్వము. corn is now * dearఅబ్బాయిప్పుడు ధాన్యము యేమికరముగావున్నది.
Lamentation n s ఏడ్పు, శోకము, ప్రలాపము.
Lamia n s బిడ్డలను మింగే స్త్రీ, ముఖవ్యాళరాక్షసి.
Lamina n s రేకు, పొర.
Laminated adj పొరలుగల.
Lammas n s ఆగష్టు నెల మొదటి తేదిని వచ్చే వొక పండుగ.
Lamp n s దీపము, ప్రమిదె. a * stand శెమ్మే. the perpetual * in atemple అఖండము. a * lighter భాటలో వారధుల మీదవుండే దీపాలను పరుగెత్తి పరుగెత్తి ముట్టించేవాడు.
Lampblack n s కాటుక కబ్జళము.
Lamp-oil n s (the Indian phraase for castor oil) ఆముదము.
Lampoon n s ఎగతాళి పద్యము.
Lamprey n s పెద్దమలుగుచేప.
Lance n s ఈటె, బల్లెము, నజా. he broke a * with them ragarding thisఇందుకై వాండ్లతో పోరినాడు.
Lanceolate adj ఈటె ఆలుగు ఆకారముగా వుండే మొగిలిరేకు ఆకారముగా వుండే.
Lancer n s నేజాలుగల గుర్రపుసవారు.
Lancet n s శస్త్రము, నెత్తురు తియ్యడానకు గాని పుంటిని శస్త్రము చేయడానకుగా వుండే ఆయధము.
Lancinating palns n s శూలనొప్పి, పోట్లు.
Land n s దేశము, ప్రదేశము, రాజ్యము, నేల, భూమి.he travelled by * not by water వాడమీదపోలేదు గాని మెట్ట మార్గముగా పోయినాడు.
Landau n s a coach, of which the top may be occasionally opened ఎదురెదురుగారెండు పడిగలు గల నాలుగు చక్రాల బండి.
Landboard n s See Coast.
Landed adj దించిన, దిగిన, దిగుమతియైన. a * estate భూస్థితి. a * proprietorభూస్వాతంత్య్రముగలవాడు, జమీందారుడు.
Landflood n s వెల్లువ, ప్రవాహము. Walter Scott, Letter of 26th September, 1809.
Landforces n s సైన్యము.
Landgrave n s ఒకవిధమైన రాజు. Landgravine అతని రాణి.
Landholder n s నేలసొంతగాడు, భూస్వామి, భూస్థితిగలవాడు.
Landing n s దిగడము, దిగుమతి.
Landing, Landing-place n s. దిగేస్థలము, రేవు. in a stair case మిద్దె మెట్లలో మూలలు తిరిగేచోట్ల వుండే విశాలమైన మట్లు లేదా. చిదరముగావుండే స్థలము, కొండమెట్లనడమ అక్కడక్కడ వుండే విశాలమైనమెట్లు లేదాచదరముగా వుండే ప్రదేశము.
Landlady n s ఇంటియజమానురాలు, ఇంటిసొంతకత్తె, ఇంటినిగాని నేలనుగాని బాడిగెకు యిచ్చిన ఆపె. or hostess పూటకూళ్ళువేసే స్త్రీ.
Landlocked adj గాలికి మరుగ్గావుండే, యిది వాడిరేవును గురించినమాట.
Landlord n s ఇంటిమానుడు, ఇంటిసొంతగాడు, ఇంటినిగాని నేలనుగాని బాడిగకు యిచ్చినవాడు. or host పూటకూళ్ళుపెట్టేవాడు.
Landmark n s ఎల్లరాయి పొలిమేర రాయి.or singal post వాడవాండ్లుచూచుకొనే కొండ గురుతు. or remarkable record శాసనము.
Landscape n s a region; the prospect of a country ఒక కొండ, గోపురము మొదలైన వున్నతప్రదేశమునుంచి చూస్తే కనుపారేటంత దూరము వేడుకగా అగుపడే భూమి. or a picture representing an extent of land,with the various objects in it విశేషమైన వొక ప్రదేశము యొక్క పఠము. there is a fine * from the top of the hill ఈ కొండమీదినుంచి చూస్తే బహుదూరము వేడుకగా తెలుస్తున్నది.
Landship n s భూమి పగిలి జారడము. a * took place at that hill ఆ కొండ బద్ధలై వొరిగినది.
Land-tax n s నేలపన్ను, నేలవరి.
Land-waiter n s రేవుబంట్రోతు.
Landward adv భూమితట్టుకై, భూమి వైపుగా.
Landwind n s (Madras phrase for the westwind) పడమటిగాలి, వడగాడ్పు.
Lane n s సందు, సందువీధి.
Langoti n s or codpiece (an Indian word) కౌపీనము, గోచి.
Language n s భాష, మాట. the * of this poem is elevated ఈ గ్రంథముయొక్క శయ్య బహుఘనముగా వున్నది. book * గ్రాంథిక భాష. bad *దుర్భాష, తిట్లు. coarse * మోటు కూతలు. or style రసము, శయ్య. this is childish * ఇది పిల్లమాటలు. he held different * to me వాడు నాతో మాట్లాడిన విధమువేరు. he speaks the * of a friend స్నేహితునిరీతిగామాట్లాడుతాడు. in common * సాధారణముగా. a Hero, or in common * a great manపాంచాల పురుషుడు, అనగా దౌడ్డవాడు. low * గ్రామ్యపు కూతలు. dirty * బూతు, బండుకూతలు. virulent * దూషణ. the * of the eye నయనభాష, కనుసంజ్ఙతోమాట్లాడే మాటలు.
Languaged adj భాషగల.
Languid adj అలసిన ఆయాసముగల, నిస్త్రాణగల, బడలికగల. he used* accents వాడు నిండా బడలికగా మాట్లాడినాడు. the * light of the moonగుడ్డి వెన్నెల. Languidly, adv. అలసి, ఆయాసముగా, బడలికగా, నిస్త్రాణగా.
Languidness n s అలుపు, ఆయాసము, బడలిక, నిస్త్రాణ.
Languishing adj క్షయించే, క్షీణించే, కృశించే, దైన్యమైన. a * glance దీనదృష్టి,దైన్యముగా చూడడము, అతివ్యామోహముగా చూడడము. he is in a * state వాడుక్షయిస్తూ వున్నాడు.
Languishingly adv అతివ్యామోహముగా, దైన్యముగా, సోలి.
Languishment n s అలుపు, బడలిక, ఆయాసము, నిస్త్రాణ.
Lank adj బక్క చిక్కిన, సన్నటి, సన్న నూలువడికిన. * locks (the contrary ofcurling) వికారముగా వుండే పొడుగు వెంట్రుకలు.
Lansguenet n s ఒకవిధమైన కాగిదాల ఆట.
Lantern n s లాందరు. (the English word) a dark * కుండలో పెట్టినదీపము.
Lantern-jaws n s అంటుకొని పోయిన చెక్కిళ్లు, అంటుకొనిపోయినదవడలు.
Lap n s ఒడి. She came with her * full of corn ఒడినిండా వడ్లుకట్టుకొనివచ్చినది. he seated the child in his * ఆ బిడ్డను వొళ్ళో కూర్చుండపెట్టుకొన్నాడు.Metaphorically-he was in the very * of luxury అతడు లక్ష్మీపుత్రుడై వుండినాడు.or bath wrapper గోచి కాసె.
Lapdog n s కుచ్చికుక్క, ముద్దుకుక్క.
Lapful n s నిండువొడి.
Lapidary n s రాళ్ళ వర్తకుడు, రత్నాల వర్తకుడు.
Lapidation n s రాళ్ళతో రువ్వి చంపడము.
Lapis-lazuti n s (commonly called fire-marble) వైడూర్యము, రాజావర్తము అనే నీలరాయి.
Lappet n s స్త్రీల టోపీలపైన కట్టే వొక విధమైన సన్న నాడా.
Lapse n s గడవడము, జరగడము. after the * of a month నెల గడిచిన తరవాత.the * of time కాలక్రమేణ, దినాలపేరట. a * of memory మతితప్పడము. or errorతప్పు. lapsus linguae or slip of the tongue నోరు జారి వచ్చిన మాట.
Lapsed adj గడిచిన, గతించిన, జరిగిన.
Lapwing n s ఉల్లంగిపిట్ట, గుడ్డికొక్కెరాయి, పసిడికంటిపిట్ట, బంగరుకంటిపిట్ట.
Larboard n s ఎడమతట్టు, ఎడమపక్క, యిది వాడవాండ్ల భాష.
Larceny n s స్వల్పదొంగతనము, యిది ధర్మశాస్త్ర శబ్దము.
Larch n s ఒక విధమైన వృక్షము, దీన్ని బొబ్బిలిచెట్టు అనవచ్చును.
Lard n s పందికొవ్వు. In Madras business it is called పందినూనె,పందినెయ్యి.
Larder n s ఆహారములు పెట్టే కొట్టు. he keeps a good * మంచి విందులు చేస్తాడు.
Largely adv విశాలముగా, విస్తారముగా.
Largeness n s విశాలత, విస్తారత, స్థౌల్యము, లావు. from the * of these cattle ఈ పశువులు నిండా పెద్దవి గనుక.
Largess n s బహుమానము పారితోషికము.
Lark n s భారద్వాజము, ఏట్రింత చందోలి పిట్ట, భరతిపిట్ట. or sport వేడుక.
Larkspur n s ఒకవిధమైన పుష్పము.
Larum n s ఎచ్చరిక, నిద్దలేపే వొకవిధమైన ఘంటానాదము.
Larva n s the young of an insect, ఈపి, అప్పుడు పుట్టిన పురుగులు Larynx, n. s. కంఠనాళము, గొంతుకోవి యిది గొంతులో శ్వాసమువచ్చే నాళము,దీంట్లో నుంచి శబ్దము పుట్టుతున్నది.
Lascar n s కలాసువాడు.
Lascivious adv కామాతురముగల, కామవికారముగల, కొంటె, పోకిరి.
Lasciviously n s కామాతురము, కామవికారము, పోకిరితనము. In Ephes, IV. 19. కామస్యాభిమతము. A+.
Lash n a stroke with any pliant and tough thing దెబ్బ. the thong or point of the whip జాటికొననుకట్టినవారు, చిళ్ళ. or a sarcasm పొడుపుమాట.
Lashing, Lashings n s. కట్లు కట్టినతాళ్ళు.
Lass n s పడుచు, చిన్నది, కుర్రది.
Lassitude n s ఆయాసము, అలసట, బడలిక.
Last n s జోటిఅచ్చు, మాదిగదిమ్మె అనగా జోళ్ళుకుట్టడానకు మాదిగ వాండ్లు మనిషి పాదము వలె చేసి పెట్టుకొనివుండే కొయ్య. a * of grain ఒక బండివడ్లు.
Lasting adj నిలిచే, నిత్యమైన, స్థిరమైన, నిరంతమైన, శాశ్వతమైన. this effected a *cure ఇందులో కుదిరి అదే స్థిరముగా వుండినది.
Lastly adv తుదకు, మెట్టుకు.
Lat (abbreviation for Latitude) See Latitude.
Latch n s గడియ.
Latchet n s కాలిజోడు జారకుండా కట్టడానికై వుండేతాడు.
Late adv ప్రొద్ధెక్కి. you are very * to-day నేడు నిండా ప్రొద్దుబోయివచ్చినావు. he came * in the day శానా ప్రొద్దెక్కి వచ్చినాడు. he went to bed very* నిండా ప్రొద్దుపోయి పండుకొన్నాడు. * in life అపరవయస్సులో. he married * in life నిండా యేండ్లుపోయి పెండ్లాడినాడు. it is now too * ఇప్పుడు మించిపోయినది, సమయము తప్పినది. Beware of a repentance వెనకచింతించుట వెర్రితనము. Of * he behaves very well ఇటీవల బాగా నడుచుకొంటాడు.
Lateen n s ఒకవిధమైన వాడచాపలు.
Lately adv ఇటీవల, కొన్నిదినముల కిందట. the letter * received ఇటీవల వచ్చినజాబు.
Lateness n s ఆలస్యము, తామసము. on account of the * of the hour చాలా ప్రొద్దు పోయినది గనక. on account of the * of the season తరుణముతప్పనందున.
Latent adj గుప్తమైన, గూఢమైన, అంతర్గర్భితమైన, అంతర్యమైన. the * meaningof this verse ఈ శ్లోకము యొక్క గుఢార్ధము. * heat in wood కాష్ఠగతాగ్ని,ఇంధనాగ్ని. as fire lies * in wood కొయ్యలో నిప్పు కనుపడకుండా వుండేరీతిగా.
Later adj and adv. ఇటీవలి, కొన్నాళ్ళ కిందట జరిగిన ఆలస్యముగా. his * actsఇటీవల వాడు చేసిన పనులు. he came * than me నా కంటే ఆలస్యముగావచ్చినాడు. no * than yesterday I heard of this దీన్ని నిన్ననే విన్నాను. sooneror * he will die of this నాలుగు నాళ్ళు ముందో వెనకో యిందుచేత వాడు చస్తాడు.
Lateral adj పక్కనువుండే, పార్శ్వమందువుండే. the gills of a fish are two * openings చేపయొక్క పువ్వారలు చేపకు రెండు పక్కసందులుగా వున్నవి. the * branches of this tree ఈ చెట్టు యొక్క పక్కకొమ్మలు.
Laterally adv పక్కగా, పార్శ్వముగా.
Laterite n s బిళ్ళరాయి, అనగా మేడకు వేసేబిళ్ళ యిటికరాయి (Tamil శొరికల్లు.) See J. Lit: Soc. IV. 101 in essay on Iron clay.
Laterite-stone n s తురకరాళ్ళు.
Lateritious adj like bricks; of the colour of bricks ఇటికరాతివలె వుండే, ఇటిక వర్ణముగా వుండే.
Latest adj కడాపటి. the * intelligence కడాపటి సమాచారము. See Last.
Lath n s సెండె, బద్ద. a dagger of * కొయ్యబాకు.
Lathe n s తరిమిడిదొడ్డి, తరిమెనదొడ్డి. to turn in a * తరిమెనబట్టుట.
Lather n s నురుగు, సబ్బుకుంకుడు గాయలు, వీటియొక్క నురుగు.
Latice n s కటాంజనము, అల్లికకిటికి, దీన్ని అరవములో పలగణి తలుపు అంటారు.
Latin n s లాటిన్‌భాష.
Latinism n s లాటిన్‌భాషీయము.
Latinist n s లాటిన్ భాషాపండితుడు.
Latinity n s లాటిన్‌భాషాపటిమ.
Latinized adj లాటిన్‌భాషాజటిలమైన.
Latish adj కొంచెము ప్రొద్దెక్కిన, కొంచె మూలస్యమైన.
Latitude n s వెడల్పు, విశాలత. in geography ఉత్తరదక్షిణరేఖ, దక్షిణోత్తరధృవమధ్య ప్రదేశము, పూర్వపశ్చిమాచ్ఛరేఖకు వుత్తరదక్షిణదేశము. in these *s ఈప్రాంతములయందు. Hong-Kong, Madras and Bangalore are nearly in the same * ఈ మూడు వూళ్ళున్న వొకటే వరసగా వున్నవి, అనగా దక్షిణముగా గాని వుత్తరముగాగాని వొత్తి వుందలేదని భావము. this rule allows of great * ఆ సూత్రము బహుదూరానికి యెడమిస్తున్నది, అనగా పరిష్కారముగా విధించి వుండలేదు.he allows his tongue great * వాడికి నోటికి యెట్లావస్తే అట్లా చెప్పుతున్నాడు. they interpret this rulewith great * ఆ సూత్రమును తమకు మనసువచ్చినట్టుతిప్పుతారు. Generals in the field are allowed great * in inflicing punishmentరణరంగములో వుండేటప్పుడుసేనాధి పతులు తమ మనసుకువచ్చినట్టు శిక్షవిధించవచ్చును. the word evening is used with some * among them వాండ్లుసాయంకాలము అవడములో కొంచెము కాలవ్యత్యయము వున్నది.Valpy and Benson on MK. XV. 42.
Latitudinarian n s స్వేచ్ఛా చారి, మనసువచ్చినట్టు నడిచేవాడు.
Latitudinarianism n s స్వేచ్ఛాచారిత్వము.
Latten n s (a sort of brass) ఒకవిధమైన యిత్తళి.
Latter adj వెనకటి. the Bharata and the Ramayanam are much read, the former is written by Vyasa, the * by Valmiki భారత రామాయణాలు నిండాచదువబడుతవి ముందరిది వ్యాసులున్ను వెనటిది వాల్మీకులున్న చెప్పినారు.* part ఉత్తరభాగము. * rain ముసలివాన.
Latterly adv ఇటీవల, ఈవెనక, కడాపట.
Latticed adj కటాంజనముగల.
Laudable adj మెచ్చుకోతగ్గ, మంచి. a * act సుకృతము. a * design మంచితలంపు. a * puruit సత్కార్యము, సుకర్మము. a * society సత్కార్యమునకైకూడేసభ.
Laudably adv మెచ్చుకొనేటట్టుగా, బాగా. he was * diligent వాడు మంచిజాగ్రత్తగలవాడు.
Laudanum n s అభినిద్రావకము
Lauded adj స్తుతించబడ్డ, స్తోత్రముచేయబడ్డ.
Laugh n s నవ్వు, హాస్యము, ఎగాతళి సరసము. horse పకపకనవ్వు.
Laughable adj నవ్వించే. a * story నవ్వించేకథ. Laugher, n. s. నవ్వేవాడు, యెగతాళిచేసేవాడు.
Laughingstock n s నవ్వులకు ఆస్పదముగా వుండేటిది. he became a *నవ్వులపాలయినాడు, నవ్వులకాలయమైనాడు.
Laughter n s నవ్వు, హాస్యము. he burst into * పక పక నవ్వినాడు. he wastheir * వాండ్లనవ్వులకు పాత్రుడయినాడు.
Laundress n s చాకలది.
Laundry n s చాకలపనిచేసేగది, యిది గొప్ప యిండ్లల్లో వొక తట్టు వుంటున్నది.
Laureate n s or poet * ఆస్థానకవి.
Laurel n s ఒక వృక్షవిశేషము, పొన్నచెట్టువంటిది, దీన్ని తమాలవృక్షమనవచ్చును, పూర్వకాలమందు జయించిన మాలికను శిరస్సున ధరించేది. he gained the *s వాడికి శ్లాఘన కలిగినది, జయము కలిగినది. this added fresh *s to his victoryఇందుచేత వాడి జయమునకు మరీ శ్లాఘన కలిగినది, వాడికి మరీ జయమైనది. seeBay-tree.
Laureled adj శ్లాఘవ పొందిన, పొగ డొందిన కొండలలో అగ్నిపుట్టేటందువల్ల అందుచేత కరిగి పారేచిట్టెము, యిది చల్లారిన తరువాత గాజురాయి వలె వుంటున్నది.a torrent of * came down from the hill కొండలోనుంచి నిప్పు బయలుదేలి రాళ్ళుకరిగి నీరుగా పారినది.
Lavement n s ఔషధబేదము, ఆసనమునందు చిమ్మిన గొట్టముతో కొట్టేమందు, Lavender, n. s. మరువమువంటి వొక మొక్క. * water దీనితో చేసిన పన్నీరు.
Lavender n s a vesel పెద్దతొట్టి. * certain plant ఒకచెట్టు.
Lavish adj దూబరదిండియైన, దుగారు బగారుచేసే. he was * of his money వాడిరూకలను దుగారుబగారు చేసినాడు. he was * of applause వాడు అపారముగా స్తోత్రము చేసినాడు.
Lavishly adv దుగారుబగారుగా, దూబరదిండితనముగా.
Lavolta n s ఒక విధమైన నటనము. Law, n. s. నియమము, విధి, విధానము, శాసనము, ధర్మము, ధర్మశాస్త్రము, చట్టము.he studies the * ధర్మశాస్త్రము చదువుతాడు. Counsel learned in the * ధర్మశాస్త్రవేత్తలైనవారు. he went to * వ్యాజ్యానికి పోయినాడు. a bye * బందుకట్టు, సాంకేతికము, సమాఖ్య. it is * of nature that fire goes upwards అగ్నికి పూర్ధ్వజ్వలనము స్వధర్మము. the *s of society లోకాచారము, లోకనడవడిక. this is a * of thecaste ఇది ఆకులములో వుండే ధర్మము, ఇది ఆకులము యొక్క మర్యాద. in * language కోర్టుభాషలో. a* Lord న్యాయాధిపతి, అనగా సూప్రీంకోర్టుజడ్డి. this is the * given by Moses ఇది మూసా చెప్పినవిధి, సూత్రము. in Room. VII. 7 వ్యవస్థ. A+Both the * and the Gospel కర్మకాండ, జ్ఙానకాండ యీ రెండున్ను. he took the *into his own hands దివాణములో చెప్పక తానే స్వతంత్రించి దండన చేసినాడు. a * officer ధర్మశాస్త్రపండితుడు. the * lords and the lay lords జడ్డీలున్ను కడమవాండ్లున్ను. Father-in-* మామగారు. Mother-in-* అత్తగారు. Brother-in-*బావమరిది. Sister-in-* వదినె, మరదలు, Son-in-* అల్లుడు. Daughter-in-* కోడలు.joint sisters-in * ఏరాండ్లు తోడికోడండ్లు. an beir at * దూరపుదాయాది.O * ! O *s! అయ్యో, అకటా, యిది స్త్రీలు చెప్పే ప్రాచీనవాక్యము.
Lawful adj (add,) it is not * to do so అట్లా చేయరాదు,చేయకూడదు.
Lawful, la"ful adj న్యాయమైన, శాస్త్రీయమైన. it is not * for him to marry herదాన్ని పెండ్లి చేసుకోవడము వాడికి న్యాయము కాదు. a * wife ధర్మపత్ని. a * son ఔరసపుత్రుడు. in I Cor. X. 23. అప్రతిషిద్ధము A+ అనిషిర్ధము B+. న్యాయము K+.
Lawfully adv న్యాయముగా, శాస్త్రీయముగా, యథావిధి, యథాశాస్త్రం. Lawfully, n. s. న్యాయము, శాస్త్రీయత. this proves the * of his decisionఇందుచేత అతని తీర్పు న్యాయముగా వుండేటట్టు తెలుస్తున్నది.
Lawgiver n s ధర్మశాస్త్ర విధాయకుడు, చట్టములు కలగచేసేవాడు.
Lawless adj విధివిరుద్ధమైన. * conduct దుర్మార్గము. they lead a * lifeవాండ్లు నీతి నిలకడలేనివాండ్లు దుర్మార్గులు.
Lawlessly adv విధివిరుద్ధముగా, నీతినిలకడలేక దుర్మార్గముగా.
Lawlessness n s అన్యాయము, దుర్మార్గము.
Lawn n s or plain పసరికబయిలు. or fine cloth రవశల్లా. he wore * sleves బిషపు (bishop) యొక్క వుడుపు వేసుకొన్నాడు.
Lawsuit n s వ్యాజ్యము.
Lawyer n s ధర్మశాస్త్రపండితుడు, వకీలు.
Lax adj వదులైన, జబ్బైన, పేలవమైన. he is very * in business వాడు పనిలో మహాజబ్బుగా వున్నాడు. this is * interpretation ఇది జబ్బు భాషాంతరము.his bowels are * వాడికి కడుపు వెళ్ళుతున్నది.
Laxative adj విరేచనకరమైన, భేది అయ్యే. a * drug భేది అయ్యే మందుదినుసు.
Laxity, Laxness n s. not comepression వదులు పలచన, పేలవము, జబ్బు.* of morals దుర్నీతి. * of bowels భేది ప్రవర్తులు.
Laxly adv వదులుగా, పలచనగా, జబ్బుగా.
Lay n s a song కావ్యము, పాట.
Layer n s పొర, వరస, అడకు. in digging the well they met with *s of earthsand and clay ఆ బావి తొవ్వడములో ముందర మన్ను అవతల యిసుక దానికవతల బంకమట్టిన్ని యిట్లా మూడు పొరలు వుండినవి. he put *s of straw between he bottles ఆ బుడ్ల నడమనడమ వరిగడ్డి పెట్టినాడు.
Layman n s one who does out belong to the three learned professions (Law,Physic, Divinity) లౌకికుడు. he is a priest but his father is a * వీడు పాదిరివీడి తండ్రి పాదిరికాడు, వీడు వైదికుడు వీడి తండ్రి లౌకికుడు.
Laystall n s పేడకుప్ప, బహిర్దేశము, బహిర్భూమి. the Hindus use theoutskirts of villages as *s హిందువులు వూరికి పరగడగా వుండే భూమిలోశంకానివర్తులు చేస్తారు.
Lazar n s కుష్టురోగి, పెద్దరోగముగలవాడు.
Lazaretto n s హాస్పత్రి, రోగులు వుండే యిల్లు.
Lazar-house n s or hospital హాస్పత్రి, రోగులు వుండేయిల్లు.
Lazaroni n s plu. భిక్షగాండ్లు.
Lazily n s సోమారితనము, బద్ధకముగా, పాలుమాలికగా.
Laziness n s సోమారితనము, బద్ధకము, పాలుమాలిక.
Lazy adj సోమారియైన , జబ్బైన, మందమైన.
Lazzaretto n s హాస్పత్రి.
Lazzaroni n s plu. భిక్షగాండ్లు.
Lb. or Pound n s పవును, అర్ధ శేరుకు సరియైన తూనిక విశేషము. 20 lbs. అనగా పదిశేరులు.
Ld is a contraction of Lord (Johnson inserts this)
Ldp abbreviation for Lordship
Lea n s (or Ley, a pasture) పసరికబయిలు, పశువులు మేశే పొలము.
Leacher n s ముండలమారి, కామాతురుడు, పోకిరి.
Lead n s (pronounced Leed) or guidance పెత్తనము, ప్రజాపత్యము. he took the *in this business ఈ పనిలో వాడు పెద్దతలగా వుండినాడు. our ship took the * కడమవాడకలకు మా వాడు ముందు సాగినది. in their poetry the Ramayan takesthe * వారి కావ్యములలో రామాయణము శ్రేష్ఠము.
Leaden adj సీసపు. a * ball సీసపుగుండు. * sleep మంచినిద్ర.
Leader n s తీసుకొని పొయ్యేవాడు, దారి చూపేవాడు. the * of tan army సేనానాయకుడు or front horses in a carriage బండికి కట్టిన ముందు గుర్రములు.or chief teacher గురువు, అగ్రగామి, నాయకుడు.
Leading adj ముఖ్యమైన, ముందుగా పొయ్యే. he is a * merchant వీడు ముఖ్యమైన వర్తకుడు. a road * to the down పట్నానికి పొయ్యే దోవ. a * question భావమునుఅందిచ్చే ప్రశ్న, మర్మము బైటపడేటట్టు వుపాయముగా అడిగే ప్రశ్న. words * to a quarrel కలహము పుట్టించే మాటలు.
Leading-strings n s బిడ్డలు నడవడమునకు నేర్చుకొనేటందుకై వుండే తాళ్లు.when you are out of * you may do as you like ఆ మార్గము నీకు కొంచెము తెలిస్తే అవతల నీకు యిష్టమువచ్చినట్లు చేయవచ్చును. in Sanscrit he is scarcely out of * వాడికి సంస్కృతములో ప్రథమారంభమే బాగా కాలేదు,సంస్కృతమందు ప్రవీణుడు కాలేదు. the headman in the office keepshis master in * ఆ దొరను శిరస్తేదారుడు బొమ్మ నాడించినట్టు ఆడిస్తాడు.
Leaf n s ఆకు, పత్రము, వర్ణము, దళము. Young or tender * చిగురు, మోసు.of a flower రేకు. betel * తమలపాకు. * of the aloe కలబందమట్ట. the * ofa door రెక్కతలుపు. a platter formed of * విసరాకు. a cup formed * దొన్నె.* of talk అభ్రకపురేకు. gold * బంగారు రేకు. false gold. కాకిబంగారు. a fig * worn by infants అరముడి మొలబిళ్ళ. ten leaves are lost in thisbook ఈ పుస్తకములో పది పత్రములు పోయినది. you have taken a * out ofhis book or you have followed his example వాడి గుణము నీకు పట్టుబడ్డది.
Leafed adj ఆకులుగల. new * చిగిర్చిన. broad పెద్దాకులుగల.
Leafiness n s గుబురు.
Leafless adj ఆకులులేని.
Leaflet n s చిగురు, పల్లవము.
Leafy adj గుబురుగావుండే.
League n s confederacy కట్టు, బందుకట్టు, కట్టుబాటు, సమయము సమాఖ్య. they are all in one * వాండ్లంతా వొకటేకట్టుగా వున్నారు. a * fellow కుట్రలో కలిసినవాడు. or three miles కోసెడు, కోసెడున్నరు . seven-*-boots యోగ వాగాలుఅనగా దీన్ని తొడుక్కౌన్న వాడు క్షణములో యెంతదూరమైనా ఆకాశ మార్గముగా పోతాడు.
Leagued adj బందుకట్టుచేసుకొన్న, సంకేతముచేసుకొన్న, సమయముచేసుకొన్న,సమాఖ్య చేసుకొన్న . Leaguer, n. s. or bottle of oil సిద్దె.
Leak n s ఓడు, ఉరుపు.
Leakage n s allowance made for accidental loss in liquid measures తరుగువాసి.
Leaky adj ఓడైన, ఉరిసే, కారే. a * boat ఓడుగా వుండే పడవ. he is a * vesselనోట మాట నిలవనివాడు.
Lean adj చిక్కిన, బక్కచిక్కిన. * arms ఈ చేతులు ఊచచేతులు. he became * సన్ననూలు వడికినాడు బక్కచిక్కినాడు, శుష్కించినాడు. a * cow బక్కఆవు. both the fat and the * కొవ్వున్ను మాంసమున్ను.
Leaning adj వంగిన, వాలిన, మొగ్గిన.
Leanness n s బక్కతనము. from the * of the horse ఆ గుర్రము చిక్కిపోవడమువల్ల.
Leap n s గంతు దుముకు, దాటు లంఘనము.
Leap-frong n s పిల్లకాయలు ఆడే ఆట అనగా పదిమంది పిల్ల కాయలు వొకడి వెనక వొకడు వరసగా వంగుకొని వుండేటప్పుడు వొకపిల్లకాయ వెనకటి తట్టునుంచి వరసగా వొకడొకడి భుజముల మీదుగా దాటిపొయ్యే ఆట.
Leap-year n s అధిక దినముగల సంవత్సరము యేవంటే. 1816, 1820, 1824, 1828,1832, 1836, 1840. &c. ఈలాటి ప్రతినాలుగో సంవత్సరములో ఫిబ్రవరి నెలకుయిరువైతొమ్మిది తేదలు వస్తున్నది.
Learned adj (pronounced as two syllables) చదువుకొన్న, పండితుడైన.a * man పండితుడు. the * professions పండిత వృత్తులు, అనగా వేదాంత, ధర్మశాస్త్ర, వైద్యశాస్త్ర వృత్తులు. the * gentleman శాస్త్రులు, శాస్త్రులవారు.the * and the unlearned పండితపామరులు. (as one syllable) they forgetwhat they have * వాండ్లు చదివినది మరిచిపోతారు.
Learnedly adv పాండిత్యముగా, ప్రవీణతగా. he explained this *దీన్ని శాస్త్రీయముగా వివరించి చెప్పినాడు.
Learner n s చదువుకొనేవాడు, నేర్చుకొనేవాడు, విద్యార్ధి.
Learning n s విద్య శాస్త్రము, పాండిత్యము. * a science శాస్త్రాఖ్యాసము.a man of * విద్వాంసుడు, పండితుడు.
Learnt adj See Learned.
Lease n s ఒడంబడికే, గుత్త. he holds the land on a * ఆ నేలను పట్టాచేసుకొన్నాడు, గుత్తచేసుకొన్నాడు. my * is terminated నా గడువు తీరినది. we thoughtthat he had a long * of life before him వాడు దీర్ఘాయుస్సుగా వుండునని యెంచివుంటిమి. the child had but a short * of life ఆ బిడ్డకు ఆయుఃప్రమాణము కొంచెముగా వుండినది. a * holder పట్టాదారుడు, కమల్దారుడు. * roll కవులు పట్టా.
Leash n s వారు వేటకుక్కనుగాని, డేగను గాని కట్టేవారు. or three వేటాడేవాండ్లభాషలో మూడు అనేసంఖ్య. a * of birds మూడు పక్షులు.
Leasing n s అబద్ధాలాడడము, బొంకడము.
Least adj and adv. అన్నిటికిచిన్న, అందరికి చిన్న, రవంత అధమము, తుదకు,మెట్ట్టుకు. this is the * of birds అన్ని పిట్టలకు చిన్నది. I have not the * wishto go పోవడానికి నాకు రవంతైనా మనసులేదు. you must put the * bit of saltరవంతపుప్పు వెయ్యి. he is the * of them వాండ్లందరికి వీడు చిన్నవాడు. not in the *ఎంత మాత్రము, అట. at * అధమము, అయినా. he at * must know English వాడికి అధమము ఇంగ్లిషైనా వచ్చి వుండవలెను. he gave at * ten rupees వాడు అధమముపది రూపాయీలు యిచ్చినాడు. you must read at * two hours a day నీవు దినానికిరెండు గడియలైనా చదువలెను. the child is there at * మెట్టుకు ఆబిడ్డ అక్కడ వున్నది. you must go there at * twice a month నీవు అధమము అక్కడికి నెలకు రెండు మాట్లైనా పోవలశినది.
Leather n s తోలు, చర్మము అనగా పదును చేసిన తోలు. a book bound in * తోలుతో కట్టిన పుస్తకము.
Leather-dresser n s మాదిగెవాడు.
Leathern adj తోలుతో చేసిన.
Leathsome adj అసహ్యమైన, చీదరైన.
Leave n s శలవు, అనుజ్ఙ. he took * of them. వారివద్ద అనుజ్ఙ పుచ్చుకొన్నాడు. he gave me * నాకు సెలవు యిచ్చినాడు. I shall take * to object శలవు యిస్తే ఆక్షేపణ చేస్తారు. by your * I shall take this అనుజ్ఙ అయితే దీన్ని పుచ్చుకొంటాను. he is absent on * శలవు తీసుకొనిరాక నిలిచినాడు. he is absent without * శలవు లేక రాక నిలిచినాడు.
Leaved adj ఆకులుగల. a two * door రెక్కల తలుపు.
Leaven v s పులిసినపిండి, దీన్ని రొట్టె వుబ్బడానకై పిండితో కలుపుతారు. ఈ దేశములో దీనికి బదులు పులిసిన కల్లును పోసి కలుపుతారు.the * of wickedness పాపమనే విషయము.
Leaves n s ఆకులు.
Leavings n s ఉచ్ఛిష్టము, ఎంగిలి, శేషము.
Lebel n s దూషణపత్రిక, దూషణ. that degree of slander which the Law will punish మానవ నష్ఠవ్యాజ్యము తేగూడిన దూషణ.
Leberation n s విడుదల, విమోచనము.
Lecherou adj కామాతురుడైన, కామియైన, పోకిరియైన.
Lecherouness n s కామాతురము, పోకిరితనము.
Lecherously adv కామాతురముగా, పోకిరితనముగా.
Lection n s a reading ప్రతిభేదము , పాఠభేదము, పాఠాంతరము.
Lecture n s ప్రసంగము. or lesson పాఠము. at that * he explained it thorughly ఆ ప్రసంగములో దాన్ని బాగా వివరించినాడు. a chapter in the Bible అధ్యాయము. or reprimand చీవాట్లు, బుద్ధి చెప్పడము.
Led the past and part of Lead, తీసుకొనిపోయినది, తీసుకొనిపోయిన. See To Lead.
Ledge n s a row, layer, stratum పొర, వరస. a ridge rising above the restకట్ట, గనిమ. or projecting above the rest అంచు, ముందు మించివుండే అంచు, ఓర,జవ. any prominence or rising part తిప్ప. a * of rocks రాళ్ళతిప్ప. a shelfపలకవాటుగా వుండేటిది. he placed the watch on the * of the pillar ఆ గడియారము ఆ స్తంభముయొక్క బోదె అంచుమీద పెట్టినాడు.
Ledger n s (Johnson) an account-book లెక్కపుస్తకము, లెక్కవహి.
Led-horse n s కండ్లపుగుర్రము.
Lee n s గాలికెదురుతట్టు, గాలికిమరుగుతట్టు, అనగా తూర్పుగాలికొట్టేటప్పుడు పడమటితట్టు Lee అనబడుతున్నది.
Lee, Lees n s. పిష్టము, మష్టు.
Leech n s (a kind of small water serpent which fastens on animals and sucks the blood) జలగ. the horse * ఏనుగజలగ. he who preys upon another, by drawing away his property indirectly ఒకరిసొమ్మును కొంచెముకొంచెముగా అరగదీసి తినేవాడు,పరద్రవ్యాపహారి. they stuck to him like *es వాణ్ని జలగవలె పట్టుకొన్నారు.a physician కావ్యమందు, వైద్యుడు అనే అర్థమున్ను కద్దు. a cow * పశువుల వైద్యుడు.
Leechcraft n s వైద్యము, యిది కావ్యశబ్దము.
Leek n s ఒకవిధమైనవుల్లి.
Leer n s ఓరచూపు, కడగంటిచూపు, కీగంటిచూపు.
Lee-shore n s గాలికి యెదురుగా వుండే రేవు, గాలికి మరుగ్గావుండేరేవు, అనగా వాడమీద గాలికౌట్టుతూ వుండగా ఆ వాడకు వెనకతట్టు గాలి వాటములో వుండే రేవు.as the storm blew from the east, Madras was our * తూర్పుతట్టు గాలి, పడమటితట్టుచెన్నపట్టణపు రేవు, మేము నడమ వుంటిమి.
Leeward adj and adv. under the wind; on the side opposite to that from which the wind blows. Towards the Lee. గాలికి యెదురుగా వుండే, గాలికొట్టనితట్టున, గాలి దేనిమీద కొట్టు తున్నదో దానికి మరుగుతట్టున, గాలికొట్టేతట్టుకు యెదురుతట్టున. the garden was under the * of the house తోట యింటిమరుగున వుండినందున గాలి యింతా యింటికి తగిలి తోటకు గాలి దెబ్బ తప్పినది. his house caught fire, now as my house was to the * I was in danger, as your house was to the windward you were not in danger వాడింటికి నిప్పు అంటుకొన్నది. అప్పట్లో నా యిల్లు గాలివాటున వుండినందున నాకు అపాయమువచ్చేటట్టు వుండినది, మీయిల్లు గాలివచ్చతట్టున వుండినందున మీకు భయములేక పోయినది. my house being to the * of the gardenwas filled with the scent of the flowers ఆ తోటమీది గాలి వస్తూ వుండినందున నా యిల్లంతా యేక వాసనగా వుండినది. as my house was to the * of the hill we did not feel the storm నా యిల్లు కొండ మరుగ్గావుండినందున మాకు గాలివాన దెబ్బతప్పినది. the wind was from the north and that ship was one mile tothe * of our ship ఉత్తరపుగాలి కొట్టుతూ వుండగా ఆ వాడ మా వాడకు దక్షిణము గడియ దూరములో వుండినది.
Leeway n s గాలి వాటముగా పోవడము, వాడ సరిగ్గా పోవలసిన దారి తొలగి గాలివాటముగా పోవడము. you must work to make up your * నీకు వచ్చిన నష్టమునుసరిపుచ్చుకోవడమునకై నీవు పాటుపడవలసినది.
Left adj ఎడమ, దావలి. a * handed man ఎడమచెయ్యి వాటముగలవాడు,పుర్రచెయ్యివాటముగలవాడు. a * handed marriage కంటెబొట్టువేసిన పెండ్లి.
Leg n s కాలు. the *s of a bed మంచపుకోళ్లు. a * of mutton తొడమాంసము,వేటతొడ. a three *ged stool ముక్కాలిపీట. the disease elephantiasis or cochin * ఏనుగకాలు, పుట్టకాలు. he made his * దండము పెట్టినాడు, మోకారించి దండము పెట్టినాడు.
Legacy n s చచ్చేటప్పుడు యిచ్చినసొత్తు, మరణశాసన పూర్వకముగా యిచ్చిన సొత్తు.
Legal adj శాస్త్రీయమైన, శాస్త్రోకమైన, యథావిధియైన. a * opinion పండితాభిప్రాయము.a * document చట్ట ప్రకారముగా వ్రాసిన సాధనము. * measure న్యాయమైన కొలత.the * profession లాయరు వుద్యోగము. a * adviser లాయరు.
Legality n s శాస్త్రీయము. this proves the * of the marriage ఇందువల్ల ఆ పెండ్లి న్యాయమైనదని రూఢమౌతున్నది.
Legalized adj శాస్త్రసమ్మతమైన, శాస్త్రానుగుణ్యమైన, యథావిధియైన. this was * byhis presence అతడు సమక్షమమందు వుండుటచేత యిది శాస్త్రసమ్మతము కాదనకూడదు.
Legally adv శాస్త్రరసమ్మతముగా, యథావిధిగా.
Legate n s Pope గారిచేత పంపబడ్డ రాజగురువు.
Legatee n s ఉయిలు ప్రకారము ఆస్తిని పొందేవాడు.
Legation n s Pope గారిచేత పంపబడ్డ రాయభారము.
Legend n s చరిత్రము, పురాణము, ఇతిహాసము, కథ. this is a mere * ఇది వట్టి పుక్కటి పురాణము nursery *s పిల్లసుద్దులు. the * of Sri Saila శ్రీశైలమహాత్మ్యము. the * of Arjuna విజయవిలాసము. the * of Stella and the Geniusతారాశశాంక విజయము. on a coin నాణ్యము మీది అక్షరాలు.
Legendary adj పురాణసంబంధమైన, పౌరాణికమైన.
Leger n s an account-book లెక్క పుస్తకము, లెక్కవహీ.
Legerdemain n s కరలాఘవము, హస్తలాఘవము, కనుకట్టువిద్య, గారడివిద్య.
Legged adj కాలుగల, a three * stool ముక్కాలి పీట. four * చతుష్పాదియైన. handy * దొడ్డి కాళ్ళుగల. he sat cross *, like a tailor పద్మాసనము వేసుకొని కూర్చుండినాడు. కాళ్ళు అడ్డము దిగటముగా వేలవేసుకొని కూర్చుండినాడు.
Leggiags n s Gaiters. చీలమండలు మొదలుకొని మోగాలిదాగా వేసుకొనే తోలు, లేక,గుడ్డ దీన్ని గుండీలతో తగిలిస్తారు.
Legibility n s చదువగూడి వుండడము. form the * of his hand వాడి వ్రాలుచదువడానికి సులభమైనది గనక.
Legible adj చదువ శక్యమైన, స్పష్టమైన, విశదమైన. it is not * ఇది చదువశక్యముగా వుండలేదు.
Legibly adv చదువడానకు సులభముగా, స్పష్టముగా, తేటగా, విశదముగా.
Legion n s గణము, దండు, దళము, వెల్లువ. of devils రక్షస్సభా. W. 692. InLuke VIII, 30. వాహినీ A+. యతో హేతో ర్బహవో భూతాస్తమాశిశ్రియుః A+.
Legislation n s ధర్మశాస్త్రమును యేర్పరచడము, చట్టము యేర్పరచడము.
Legislative adj ధర్మశాస్త్రవిధాయకమైన, ధర్మశాస్త్ర సంబంధమైన చట్టములను యేర్పరచే. a * enactment చట్టము. the * council చట్టములను యేర్పరచే అధికారులు.
Legislator n s ధర్మశాస్త్రకర్త, చట్టములు యేర్పరచేవాడు.
Legislature n s చట్టములను యేర్పరచే అధికార్లు.
Legitimacy n s ఔరసత్వము క్రమము, ధర్మము, న్యాయము, శాస్త్రసమ్మతము, సంప్రదాయము. this proved his * ఇందుచేత వాడి ఔరసత్వము రూఢమైనది.this proves the * of his conclusion ఇందువల్ల వాడు చేసుకొన్న భావము న్యాయ మౌతున్నది.
Legitimate adj ఔరసత్వము, క్రమమైన, ధర్మమైన, న్యాయమైన, శాస్త్రసమ్మతమైన,సంప్రదాయమైన. a * son ఔరసపుత్రుడు, అనగా స్వభార్యకు పుట్టిన కొడుకు. the money was put to it's * purpose ఆ రూకలు యెందుకని పెట్టబడ్డవో ఆ పనికే వినియోగమైనవి. the * meaning of a word ఒక శబ్దమునకు సహజమైన అర్థము, వాస్తవ్యమైన అర్థము.
Legitimately adv క్రమముగా, ధర్మముగా, న్యాయముగా, శాస్త్రసమ్మతముగా, సాంప్రదాయికముగా.
Legumes n s కాయధాన్యములు.
Leguminous adj కాయధాన్య సంబంధమైన.
Leisure n s సావకాశము, తీరిక. are you at * now? ఇప్పుడు మీకు తీరికా. yes నాకు తీరికే you may do this at your * ఊరికె వుండేటప్పుడు యీ పని చెయ్యి, నీకుతీరికగా వుండేటప్పుడు దీన్ని చెయ్యి. he ravaged the country at his * ఆ దేశమును యథాసావకాశముగా కొళ్ళబెట్టినాడు.
Leisurely adv తీరికగా, సావకాశముగా. on a * review of the subject ఆ సంగతినిమక్మళముగా విచారిస్తే, యథాసావకాశముగా విచారిస్తే.
Leman n s విటకాడు, విటకత్తె, మిండగాడు, ఉంపుడుస్త్రీ, లంజ.
Lemma n s రూఢమైన విషయము.
Lemon n s నిమ్మపండు. a * tree నిమ్మచెట్టు. * coloured నిమ్మపండు వర్ణమైన.* grass or * thyme కామంచి కసువు.
Lemonade n s పానకము పొంచి.
Lender n s ఎరువు యిచ్చేవాడు, అప్పు యిచ్చేవాడు.
Lenghened adj నిడివి అయిన, పెరిగిన. a * enquiry అతిదీర్ఘవిమర్శ.
Length n s నిడివి, నిడువు, పొడుగు. he walked a street's * with me నాతో కూడా వొక వీధిదాకా వచ్చినాడు. the * and breadth నిడివీ వెడల్పు.for a great * of time బహుకాలము వరకు. this went to a great *ఇది బహుదూరము పెరిగినది, అతిశయించినది. matters went to such a * thatat last they separated ఆ సంగతి అంత దూరము పెరిగినందున వేరుపడ్డారు. she kept him at arm's * అది వాణ్ని దగ్గెర చేరనియ్యలేదు, అది వాడికి చొరవ యివ్వలేదు. he explained it at full * దాన్ని విస్తారముగా చెప్పినాడు. he went the * of saying, that he would kill her వాడికి దాన్ని చంపుతానని చెప్పేటంతమట్టుకువచ్చినది. he launched out at great * against this ఇందున గురించి బహుదూరము వాగ్వ్రయము చేసినాడు. at * తుదకు. they divided the field into three *s ఆ నేలను నిడివికి మూడు తునకలుగా చేసినారు. he was blessed with * of daysవాడు దీర్ఘాయుష్మంతుడై వుండెను.
Lengthwise adv నిడివికి. he tore the cloth into three pieces * ఆ గుడ్డను నిడివికి మూడు తునకలుగా చించినాడు.
Lengthy adj నిడవైన, అతిదీర్ఘమైన, అతివిస్తారమైన. a * description మహాపెంపుగా వుండే వర్ణనము.
Leniency n s శాంతి, సౌమ్యము.
Lenient adj శాంతమైన, సౌమ్యమైన. a * sentence సౌమ్యమైన శిక్ష. a * masterచల్లని ప్రభువు.
Lenitive adj ఉపశాంతికరమైన, నొప్పిని పోగొట్టే, మార్దవకరమైన.
Lenity n s కరుణ, దయ.
Lens n s (a glass) plu. Lenses అద్దపుబిళ్ల, కొద్ది వస్తువు గొప్పగా దాని గొప్ప వస్తువు కొద్ధిగా గాని అగుపడే అద్దపుబిళ్ల, భూతాద్దము,సులోచనము, దుర్బీసు మొదలైన వాటికి వేసే అద్దపు బిళ్లలకు యీమాట చెల్లుతున్నది.
Lent n s (a fasting period of forty days) ఖ్రిష్టియన్ మతస్థులు ప్రతిసంవత్సరములోనున్న వుపవాసముగావుండే నలభై దినాల వ్రతము, యిది ముఖ్యముగామార్చి యేప్రల్నెలలో వస్తున్నది.
Lenten adj అల్పమైన. * diet ఫలహారము, అల్పాఆహరము.
Lentil n s వొకవిధమైన కాయధాన్యము, పెసలు, అలచందలు, వులవలు మొదలైనవి.
Lentisc n s వొకవిధమైన తుమ్మచెట్టు.
Leo n s సింహరాశి.
Leonine n s వొకవిధమైన ఛేకముగల పద్యము, సింహావలోకన పద్యమనవచ్చును.
Leopard n s చిరతపులి. certain kinds are called పొన్నాడ and కరింగోల.
Leper n s కుష్ఠురోగము. the white * తెల్లకుష్ఠు.
Leprous adj కుష్ఠుగల,పెద్దరోగముగల,తెవులుగల.
Less adv తక్కువగా. It became * తగ్గినది, తక్కువైనది. more or less కొంచెముహెచ్చు తక్కువ.
Lessee n s ఇజారాదారుడు, పట్టాదారుడు, వొడంబడిక యిచ్చి బాడిగెకు వుండేవాడు.
Lessened adj తగ్గిన, తరిగిపోయిన, మట్టుపడ్డ.
Lesser adj కొద్ధిదైన. he eats in the larger room and sleeps in the * పెద్దయింట్లో భోజనము చేస్తాడు, చిన్నయింట్లో పడుకొంటాడు.
Lesson n s పాఠము. he gave me a * నాకు పాఠము చెప్పినాడు. Publicpunishment of criminals is a * to all నేరము చేసిన వాండ్లకు పదిమందిలో శిక్ష జరిగించడమువల్ల అందరికిన్ని బుద్ధి వస్తున్నది. or chapter in the Bible అధ్యాయము. I hope this will be a * to you ఇందుచేత నీకు బుద్ధివచ్చునుగదా.I have been taught * by this ఇందువల్ల నాకు బుద్ధివచ్చినది.
Lessor n s అద్దెకు విడిచేవాడు, ఇజారాకు యిచ్చేవాడు, పట్టాకు యిచ్చేవాడు.
Lest conj కాకుండా, ఏమో అని. * he should say so వాడు అట్లా అనకుండా, వాడు అట్లా అనబోతాడని. * he should fall వాడు పడపోతాడని. * any delay should occur ఆలస్య పడపోతుందని, ఆలస్యపడకుండా. * it might be seen అది అగుపడకుండా.
Let n s (a hinderance) ఆటంకము, అభ్యంతరము, ఇది ప్రాచీన శబ్దము.without * or hinderance నిరాటంకముగా.
Letcher n s విటకాడు.
Lethal adj మారకమైన.
Lethargic, Lethargical adj మందముగా వుండే, మబ్బుగా వుండే, దిమ్ముగా వుండే, సోమారితనముగా వుండే, ఇది సన్నిపాతములో వుండే మైకమును గురించినమాట.he was * the whole of yesterday వొళ్లుతెలియక పడివుండినాడు.
Lethargy n s మబ్బు, మైకము, దిమ్ము, సోమారితనము,ఇది సన్నిపాతమువల్ల కలిగిన మయకమును గురించినమాట. Lethe, n. s. విస్మృతి, విరజానది. Let there matters be dipped in * ఈ మాటయింతటితో మరిచిపోనీ.
Lethean adj విరజా నదీ సంబంధమైన. the * wave విరజానదీ, అనగా విస్మృతి.
Letter n s of the alphabet అక్షరము, వర్ణము. * of correspondence జాబు, పత్రిక. he does not know his *s వాడికి ఓనమాలు రావు. the * K కకారము. the * E ఇత్వము. or leaden types అచ్చక్షరములు. according to the * of the law he oughtto be banged ఆ చట్టములో వుండే శబ్ధార్ధప్రకారము వాణ్ని వురిదీయవలసినది. they attended to the * more than to the spirit of the law ఆ చట్టముయొక్క భావమును విచారించకుండా శబ్దార్థమును విచారించినారు. that law is now a dead * ఆ చట్టము యిప్పుడు అప్రసిద్ధమై పోయినది, చెల్లదు. a man of *s విద్వాంసుడు, పండితుడు.belles letters సాహిత్యవిద్య, కావ్యాదులు. *s ecclesiastical శ్రీముఖము. *s ofadministration అధికారపత్రిక.
Lettering (the name on the back of a book) బుక్కు మీద వుండే బంగారు అక్షమ
Letter-Press n s గ్రంథము. In this book there are ten prints and one hundredpages of * ఈ పుస్తకములో పదిపటములున్న నూరు పత్రముల గ్రంథమున్ను వున్నవి.the * is excellent but the prints are worthless ఈ పుస్తకములో అక్షరాలు బాగావున్నవి గాని పటములు పనికిమాలినవి.
Lettrered adj వేరువేసిన, అనగా కాగిద పుస్తకము వీపున పేరువేసిన, విద్వాంసుడైన.a * book వీపున పేరువేసి వుండే కాగిదపుక్తకము. the * sage విద్వాంసుడు, పండితుడు.* ease గ్రంథకాలక్షేపము. the * stone శిలాశాసనము.
Lettuce n s వొకవిధమైన తోటకూర.
Levant n s (a French word) తూర్పు దేశము అనగా . Turkey, Syria, Palestine &c. మొదలైన దేశములకు సముదాయనామము, ఇది Mediteranean అనే సముద్రమునకుతూర్పున వుంటున్నది. Leevee, n. s. ప్రభుదర్శనము, రాజదర్శనము. there was a great * Yesterday నిన్నటిదినము శానామంది ప్రభుదర్శనానికి వచ్చినారు. I am going to the * నేను ప్రభుదర్శనమునకు పోతున్నాను.
Level n s సమమైనభూమి. the water found its own * ఆ నీళ్లు దానిమట్టానికి వచ్చినది. his talents ae above the common * వాడి ప్రజ్ఙ మట్టుమీరి వున్నది. this is above the * of his intellect అది వాడి బుద్ధికి మించి వున్నది. these peoplea all on a * వారందరూ సములే. an instrument నీరు మట్టపలక.
Leveller n s సమముచేసేవాడు, అనగా నాకు వొకడు హెచ్చు లేదనేవాడు.a drunken man is a * తాగుబోతుకు యెవడున్ను హెచ్చులదు అందున్ను సమమే.
Levelling n s సమముచేయడము, మెరకాపల్లము లేక సరదడము, నీరుమట్టము కట్టడము.
Lever n s మీట, సన్న . water is raised fom a well with a *ఏ తాముతో నీలు చల్లుతారు. *s which are used to turn the wheels of a carతేరు చక్రాలు తిరగడానకు వసే సన్నలు. or means for effcting a purpose సాధనము.I will use this letter as a * to effect the pupose ఆ పనిని నెరవేర్చడానకుయీ జాబును సాధనముగా పెట్టుకొంటాను.
Leveret n s కుందేటిపిల్ల.
Leviable adj వసూలు చేయతగిన, రాబట్టతగిన, తీయతగిన.No tax is * upon rice బియ్యానికి సుంకము తియ్యవలసినదికాదు.
Leviathan n s బ్రహ్మాండమైన వొక జలజంతువు, మొసలి యనవచ్చును. In Job. XLI.లివియతాన (being the Hebrew word) D+. మొసలి E+. తమింగిలము H+. what a * book ఎంత బ్రహ్మాండమైన పుస్తకము.
Levite n s యూదియావాండ్లలో లేవీ కులస్థుడు. In Luke X. 32. యాజకః A+ఇలేవియ ్ R+. లేవీయను K+.
Levitical adj యాదియా వాండ్లల్లో లేవీ కులస్థుల సంబంధమైన. the * law ఆచారకాండ.
Levity n s లాఘవము, లఘుత్వము, తేలిక, చులకన. Inconsistency చాంచల్యము,చపలత్వము, దుర్మార్గము. * of conduct దుర్మార్గము.
Levy n s పట్టడము, వెట్టికి పట్టడము, వసూలు చేయడము. the levies they raised,took twenty men from our village వాండ్లు మనుష్యులను పట్టడములో మావూళ్ళో యిరువై మందిని పట్టుకొని పోయినారు. the levies they raised ruined them ఆ రూకలనువసూలు చేయడముచేత వాండ్లు చెడిపోయినారు.
Lewd adj పోకిరి, బండ, దుష్ట, కొంటె, కామాతురముగల. a * minx పోకిరితొత్తు.* anciently meant Ignorrant, unlearned, మొద్దు, మూఖు్ డు, జడుడు. In Acts XVII.;లంపట. A+.
Lewdly adv పోకిరితనముగా, బండతనముగా, దుష్టతనముగా, కొంటెతనముగా, కామాతురముగా.
Lewdness n s పోకిరితనము, బండతనము, కొంటెతనము, కామాతురము. In Acts XVII. దుష్టాచరణ A+. or ignorance మూఢత్వము.
Lexicogaphy n s నిఘంటు చేయడము.
Lexicographer n s నైఘంటికుడు, నిఘంటుకర్త, డిక్షనేరిచేసేవాడు.
Ley, or lie n s. urine అనగా మూత్రము.
Liability n s అర్హత. or responsibility అచ్చుదల, జవాబుదారి. from its * to breeak, glass is less valued గాజు పగిలేటిది గనుక వెల తక్కువగా వున్నది.a merchant's liabilities వొకవర్తకుడు అచ్చుకోవలసినవి, అనగా ఋణములు. I relieved him from that * వాడు దాన్ని అచ్చవలసినది లేకుండా చేసినాను.
Liable adj అర్హమైన, అస్పదమైన, ఎడమైన. this sentence is * tomisconstruction వున్నది. a doctor is * to be called on at all hours ఎప్పుడుతలిస్తే అప్పుడు పిలుపించడానకు వైద్యుడు అర్హుడు. books lying on the ground are * to be destroyed by white ants నేలపడి వుండే పుస్తకాలు చెదలుకొట్టి వేయడానకుఅర్హములే. If you inherit his estate you are * for his debts నీవు వాడి ఆస్తికిబాధ్యుడవైతే వాడి అప్పులకున్ను నీవు లోబడవలెను. a situation * to suspicionఅనుమానాస్పదమైన స్థితి.
Lialc n s (add,) the common name of the plants belonging to the genus Syringa. ఒక పూలచెట్టు. * colour జిల్లేడు పూలవన్నె.
Liar n s అబద్ధీకుడు, అనృతము చెప్పేవాడు.
Liasion (French for crimical connection)వ్యభిచారము,సంబంధము,రంకు
Libation n s దేవుణ్ని వుద్దేశించి నేలపోసే జలాదిద్రవద్రవ్యము, తర్పణము, జలాంజలి అర్ఘ్యము. his health was drunk in copious *s అతని పేరు పెట్టి మహా తాగినాడు.
Libeller n s దూషణపత్రిక వ్రాసేవాడు, దూషించేవాడు, దూషకుడు.
Libellous adj దూషణైన. Abusive to such a degree as calls for legal punishment మాననష్టము వేయకూడిన.
Liberal adj (munificent) ఔదార్యము గల, ధారాళముగల, దాతృత్వముగల. he is a *man వాడు దాత. or respectable, as those of * birth కులీనులు, మంచివంశములో పుట్ట్టినవాండ్లు. * studies సాహిత్యవిద్య. the * Professions పూజ్యమైనవృత్తులు, అనగా పాదిరితనము, డాక్టరుతనము, లాయరుతనము. he took a * view of the questionఆ సంగతిని పక్షపాతము లేక విచారించినాడు. a man of * mind దౌడ్డబుద్ధిగలవాడు,నిష్పక్షపాతి, మంచివాడు. a * or Republican మనకు రాజు అక్కరలేదనేవాడు,ప్రజాప్రభుత్వమే సరియనేవాడు. he who is * of praise వూరికె పొగడేవాడు.
Liberality n s దాతృత్వము, ధారాళము.
Liberally adv ఔదార్యముగా, దాతృత్వముగా, ధారాళముగా.
Liberated adj విడుదలైన, విడువబడ్డ. * from oblagations ఋణవిముక్తుడైన.
Liberator n s విడుదల చేసేవాడు, విమోచనము చేసేవాడు.
Libertine n s అనాచారవంతుడు, దుర్నీతుడు, పోకిరి, కొంటె, లుచ్ఛా,ముండలమారి.
Liberty n s స్వతంత్రము, విడుదల, విమోచనము, విముక్తి, నివారణము, అనుమతి, ఆజ్ఙ. eexmption from tyranny or inordinate government క్రూరప్రభుత్వము లేక వుండడము.when he gained his * వాడికి విడుదలైనప్పుడు. In some places it means the general good ప్రజాసుఖము. thus, the king has a design against their * రాజుకు వారి క్షేమమును చెరపవలెనని వున్నది. if the criminal was debarred a preper trial,it would give the people occasion to think that the king had a design againsttheir * నేరస్థులను క్రమముగా విచారణ చేయకపోవడమువల్ల రాజు ప్రజలకు క్షేమము లేకుండా పోవలెనని తలచియున్నాడని లోకులు అనుకోవలసివచ్చును. In Rom. VIII. 21. the glorious * అపరం చ ప్రాణి గణః స్వైరం అలీకతా యావశీభూతో నా భవత్ A+.James. 1.25. The law of * ముక్తిజనక వ్యవస్థాయాం A+. Peter. II. 16.Not using *స్వేషాంముక్తిం. A+. Isa. LXI. I ముక్తి D+. I take the * to mentionబుద్ధి, వౌకమనివి.he took liberties with her దాని దగ్గెర అమర్యాదలను జరిగించినాడు. he has taken some liberties with the text వాడు మూలముమీద కొంచెము అధిక ప్రసంగము చేసినాడు. he is at * he may do what he likes వాడు స్వతంత్రుడు వాడికి యిష్టమైనట్టు చేయవచ్చును. when he set the tiger at * పులిని విడిచిపెట్టినప్పుడు. I am not at * to tell you మీతో చెప్పడానికి నాకు స్వతంత్రములేదు, వల్లకాదు. you are at * to return if you like నీకు యిష్టమైతె నీవు సుఖముగా మళ్ళీ పోవచ్చును. I am always at * in the evening నాకు యెప్పుడున్ను సాయంకాలముసావకాశము, తీరిక. To-morrow I shall not be at * రేవు నాకు తీరిక వుండదు. he gaveme * to go there అక్కడికి పోవడానికి అతను నాకు శలవు యిచ్చినాడు. In Ps. CXIX. 45. విసారితపథే `in a broad path' D+. రితేస్థలే A+. * of the press ఏ సంగతినికావలిస్తే దాన్ని అచ్చువేయించే స్వతంత్రము. the liberties or boundaries of atown గ్రామసముదాయపు నేల, పొలిమేరలో చేరిననేల.
Libidinous adj lustful కామాతురముగల, కామాంధకారముగల. a * language పోకిరిమాటలు, తుంట మాటలు.
Libidinously adv కామాతురముగా, పోకిరితనముగా, కొంటెతనముగా.
Libra n s తులారాశి.
Librarian n s పుస్తకాల కొట్టుమీద వుండేవాడు.
Library n s పుస్తకములు,పుస్తకములు పెట్టే అల్మారా, పుస్తకములు వుండే యిల్లు, పుస్తకశాల.
Libration n s నటనము, చలనము, తూగడము, డోలాయమానముగా వుండడము.
Lice n s plu. పేలు, పురుగులు.
License శలవు,ఉత్తరవు,ఆజ్ఙ,యథేచ్ఛావిహారము, he gives his tongue strange *వాడి నోటికి యెట్లావస్తే అట్లా మాట్లాడుతాడు. poetical * ఆత్యుత్ప్రేక్ష, అత్యుల్లేఖ. a liquor * సారాయి అమ్మడానకై యిచ్చే చీటి, దీన్ని లేస ్ అంటారు. To License, v. a. చీటియిచ్చుట. he *d the liquor shops ఆ సారాయి అంగళ్లు అమ్మడానకుచీట్లు యిచ్చినాడు, లేసలు యిచ్చినాడు.
Licenser n s చీట్లిచ్చేవాడు, ఉత్తరవు యిచ్చేవాడు.
Licentiate n s (a lawyer or doctor who has obtained a certificate) శాస్త్రి,యోగ్యతాపత్రికను పొందిన పండితుడు.
Licentious adj పోకిరి, దుష్ట, కొంటె, తుంట. a * book పోకిరి పుస్తకము. a * man కాముకుడు, కామాతురముగలవాడు. * reading పోకిరిచదువు. a * or ungrammaticalinterpretation అపార్థము. this is a * interpretation ఇది అబద్ధమైన భాషాంతరము,అక్రమమైన భాషాంతరము.
Licentiously adv పోకిరిగా, దుర్మార్గముగా, భ్రష్టత్వముగా.
Licentiousness n s పోకిరితనము, కొంటెతనము.
Lick n s a blow దెబ్బ, ఇది నీచపుమాట.
Lickerish, or Liquorish adj nice in eating పురపురలాడే. a * womanదూలపట్టి తిరిగేటిది.
Licking n s (flogging) పూజలు, దెబ్బలు శిక్ష.
Licorice, or Liquorice n s. అతిమధురమనే మంది దినుసు.
Lictor n s బంట్రోతు, కింకరుడు.
Lid n s మూత, దిబ్బడము. the eye * రెప్ప, కనురెప్ప.
Lie n s (falsehood) అబద్ధము, అనృతము, కల్ల. See Lying and Liar. she gavehim the * నీవు చెప్పినది అబద్ధమన్నది. his whole conduct gives the * to thisstory వాడియొక్క నడతను చూస్తే యీ మాట అబద్ధమని తోస్తున్నది.
Lief adv సుఖముగా, సమ్మతిగా. I had as * die as live here ఇక్కడ వుండడానికన్నసుఖముగా చావవచ్చును. I would as * go myself as send him వాణ్ని పంపించడానికన్ననేనే పపోవడము మేలు. I had as * die as do it దాన్ని చేయడానికంటె సుఖముగా చావవచ్చును.
Liege n s and adj. మహా, మహాప్రభువు. the *s or a men కాపులు, ప్రజలు. my * or my * or my * lord ప్రభో, రాజా, స్వామీ, His Majesty's *s దాసులు. Her * lordదాని నిజనాధుడు.
Lien n s బాధ్యత, దావా. he has a * upon the estate ఆ యాస్తిని అతనికి బాధ్యతకద్దు.
Lier n s పండుకొనేవాడు. a * in wait పొంచువుండవాడు.
Lieu n s ప్రత్యామ్నాయము, ఈడు, నూరు. In * or this ఇందుకు ప్రత్యామ్నాయముగా. In* of me నామారు.
Lieut an abbreviation of Lieutenant లెఫ్టననేశబ్దమునకుపుటాక్షరములు
Lieutenancy n s లెప్టనాంటు వుద్యోగము.
Lieutenant n s లెఫ్టనాంటు అనే దండు వుద్యోగస్థుడు. * Governor గవనరు వుద్యోగము చూచేవాడు. Lord * రాజసని చూచే గవనరు, Ireland యొక్క అధిపతి.
Life n s జీవము, ప్రాణము, ఆత్మ, ఆయువు, వయస్సు, ఉసురు, బ్రతుకు. they saved my * నన్ను బ్రతికించినారు, నా ప్రాణమును కాపాడినారు. many lives were lost శానామంది నష్టమైనారు. he lost his * వాడి ప్రాణమును పొగొట్టుకొన్నాడు. the conqueror gave them their lives జయించినవాడు వాండ్లను ప్రాణములతో విడిచిపెట్టినాడు. after he was restored to * వాడికి మళ్ళీ ప్రాణము వచ్చిన తరువాత. he is ready to lay down his * for them వాండ్లకై తన ప్రాణమునైనా యిచ్చేవాడుగా వున్నాడు. before he came to * వాడు పుట్టకమునుపు. this will touch his * or this will cost him his * ఇందువల్ల వాడి ప్రాణానికి వచ్చును. I never in my * saw him నా జన్మములో వాణ్ని చూడలేదు, నా ఆయుస్సులో చూడలేదు. during his natural * వాడి శరీరము వుండే వరకు you have along *before you నీకు యింకా నిండా ఆయుస్సు వున్నది, నీవు యింకా నిండా దినాలు బ్రతుకుదువు. he leads a laborious * వాడు యేవేళా పాటు పడేవాడు. they lead an easy * వాండ్లు సుఖప్రాణులు. he entered a new state of * వాండ్లు సుఖప్రాణులు. he entered a new state of * వాడికి వొక నవీనమైన దశ వచ్చనబది. అనగా వివాహముచేసుకొన్నాడు, వర్తకము, వుద్యోగము మొదలైన వాటిలో ప్రవేసించినాడు. he acts of every day * నిత్యకర్మము, నిత్యటిపని. he began * with ten rupees ఆ వ్యాపారములోప్రవేశించినప్పుడు వానికి పదిరూపాయలు వుండినవి. a village granted for three lives మూడుతరాలకు యిచ్చిన గ్రామము. or trade వృత్తి. a farmer's * కాపవృత్తి. he wastransported for * వాడు చచ్చే వరకని ద్వీపాంతరమునకు పంపబడ్డాడు. this injured him for * ఇది వాడి ప్రాణమువుండేదాకా విధించినది. he painted them to the * వాండ్లను తత్స్యరూపముగా వ్రాసినాడు, తద్రూపముగా వ్రాసినాడు. he painted her as large as * దాని ఆకారము యెంతో అంతపెద్దదిగా వ్రాసినాడు. Long * to your Majesty తమరుదీర్ఘాయువుగా వుందురుగాక. they danced with great * బహులాఘవముగా ఆడినారు.he has no * (or vivacity) in his speaking వాడు మాట్లాడడములో సరసతలేదు. he was the * of the company వాడు వాండ్లకు జీవాతువుగా వుండినాడు. this gave new * to his undertaking ఇది వాడారంభించిన పనికి వుపబలమైనది. the present * ఇహము.(as opposed to the next * or world which is future) వరము. I cannot tell for the * of me what he meant వాడి అభిప్రాయము యెట్టిదో నాకు చచ్చినా తెలియదు. he cannot be honest for the * of him (Hannah More) చచ్చినా వాడికి పెద్దమనిషితనము రాదు. a * or memoir చరిత్ర, విజయము. the * of Robinson Criusoe రాబిన్‌సన్ కూస్సో చరిత్ర. the * of Sankara Chari శంకర విజయము. the * of Nala నలోపాఖ్యానము.the Lives of the Poets కవులచరిత్రలు.
Lifeblood n s ప్రాణాధారమైనరక్తము, ఇది కావ్యశబ్దము.
Lifegiving adj బ్రతికించే.
Lifeguard n s అంగరక్షకసేన, రాజు వెంటపొయ్యే తురువు సవార్లు.
Lifeless adj చచ్చిన, ప్రాణములేని నిర్జీవమైన, నీరసమైన, జడమైన. she lay as * for an hour అది గడియసేపు పీనుగవలె వుండినది. his style is * వాడి వాక్కు జబ్బుగా వున్నది, నీరసముగా వున్నది. If you are so * what avails advice ఇంతమూఢుడికి బుద్ధిచెప్పడము యేమి ప్రయోజనము.
Lifelessly adv జబ్బుగా, దుర్బలముగా, నీరసముగా.
Lifelessness n s జబ్బు, దుర్బలము, నీరసము, బలహీనము.
Life-Preserver n s (a certain weapon) ప్రాణ రక్షణమనే ఆయుధము కొనలో సీసముపోసిన దుడ్డు కర్ర.
Life-time n s ఆయుస్సు, జీవితకాలము. in his * వాడు బ్రతికి వుండినప్పుడు.
Lift n s ఎత్తడము, లేవనెత్తడము. assistance సహాయము, చెయ్యి యివ్వడము. at a dead * he helped them out అతి ఆపదలో వాండ్లకు చెయ్యిచ్చినాడు. will you give me a * ? నాకు సహాయము చేస్తావా, నన్ను కూడా కూర్చుండ పెట్టుకొని పోతావా. this money was a good * to him in his trouble వాడి ఆపత్కాలములో యీ రూకలు వాడికి నిండాసహాయముగా వుండినవి.
Ligament, Ligature n s. నరము, కట్టు, గాయకట్టు, బంధము. freed from the *s of the body శరీర బంధము వదిలినవాడై,అనగా చచ్చినవాడై.
Light adj తేలికైన, చులకనైన, లాఘవమైన, సులభమైన, వెలుతురుగల. the antelopeis * of foot జింకకు నడుచురుకు. *-coloured లేచాయగల, నీరుచాయగల. *-greenనీరుపచ్చ, లేబచ్చ. *-blue విడినీలి. *-red నీరుకావియైన. a native of *- complexion చాయనిచాయగా వుండవాడు. a *- hearted man ఉల్లాసముగా వుండేవాడు. Is this a *matter ? ఇది స్వల్పమా. a * task సులభమైనవని. this is but a * objection ఇదిస్వల్పమైన ఆక్షేపణ. a * box తేలికైనపెట్టె. a * coin తూనిక తక్కువగా వుండే నాణ్యము. a * room వెలుతురుగా వుండే యిల్లు. a * man అల్పుడు, చపలుడు. a * minded manచపలచిత్తుడు. a * woman చపలురాలు, రంకులాడి, విటకత్తె. a *- heeled woman రంకులాడి. * dragoons వౌకవిధమైన గుర్రపు రౌతులు. they hold his commands * అతని ఆజ్ఞను అలక్ష్య పెట్టినారు. he made * of his oath ప్రమాణమును అలక్ష్యముచేసినాడు. they set* by this దీన్ని అలక్ష్యము చేస్తారు. To Light, v. a. ముట్టించుట, వెలిగించుట, రాజబెట్టుట, మంటవేసుట. he *ed a lampదీపము ముట్టించినాడు. he *ed the fire నిప్పును రాజబెట్టినాడు. he *ed me into the room ఇంట్లోకి పోవడానికి నాకు వెలుతురు చూపినాడు. he *ed up his house వాడి యింట్లోచాలా దీపాలు వెలిగించినాడు. her face was *ed up with smiles దాని ముఖము చిరునవ్వుతో ప్రకాశించినది. a fare *ed up with cheerfulness సంతోషముతో ప్రకాశించే ముఖము.
Lightening n s సుళువు, లఘువు, తేలిక. there was a * before deathచచ్చేటందుకు ముందుగా వానికి కొంచెము లఘువుగా వుండినది, వాడికి చావుతెలివివచ్చినది.
Lighter n s a boat పెద్దపడవ, పెద్దదోనె. a lamp* భాటలో వారధులమీద దీపాలనుముట్టించేవాడు, వీడు మహాపరుగెత్తేవాడని ప్రసిద్ధము.
Lighterman n s పెద్దపడవవాడు, పెద్ద పడవతోసేవాడు.
Light-fingered adj or Light-handed చెయిచురుకుగల, చెయిదుడుకుగల. the * tribe పచ్చెపు దొంగలు, కేపుమారివాండ్లు.
Light-footed adj కాలిచురుకుగల, వడిగల, వేగముగల.
Lightheaded, lit-hed'ed adj చపలచిత్తముగల, ఇది రోగముచేత వచ్చేటిది.he was * before death చచ్చేటందుకు మునుపు చపలచిత్తుడుగా వుండెను. Light-hearted, adj. ఉల్లాసముగావుండే. Lighthouse, n. s. రేవుదీపము, అనగా వాడవాండ్లకు దిక్కు తెలియడానకై దీపముపెట్టే వున్నత స్థానము.
Lightly adv చులకనగా, లాఘవముగా, అల్పముగా. carelessly, heedlesslyఉపేక్షముగా, తేలికగా, చురుకుగా, వేగముగా. they talk very * regarding the lawధర్మశాస్త్రమును మహా ఉపేక్షగా మాట్లాడుతారు.
Light-minded adj చపలమైన, చపలచిత్తమైన, నిలకడలేని పట్టలేని .
Lightness n s లాఘవము, చులకన, తేలిక, వెలుతురు. from the * of the roomఆ యిల్లు వెలుతురుగా వున్నందున. whimsicalness చపలత, చాంచల్యము. from the *of his mind వాడికి బుద్ధి స్థిరము లేదు గనక.
Lightning n s మెరుపు. or mitigation abatement ఉపశాంతి, శాంతి.
Lights n s plu. the lungs పశువు యొక్క శ్వాసకోశము.
Lightsome adj ఉల్లాసమైన, సంభ్రమమైన.
Lign-aloes n s ధూపయోగ్యాముగా వుండే వొక విధమైన గంధపుచెక్క, అగరు D+.నాటుచందనము F+.
Ligneous adj దారుభూతమైన.
Lignum-vite n s ఇనుమువంటి వొకవిధమైనమాట.
Ligure n s (a certain precious stone) పద్మరాగము F+. H+. లశుని D+.
Like adj and adv. వంటి, వలె, తుల్యమైన, సమమైన, సమముగా, రీతిగా. he is * his his father తండ్రి పోలికగా వున్నాడు. the picture is not * him ఈ పటము అతనివలె వుండలేదు. a man * you నీ వంటివాడు. he thinks there is not one * him తనవంటివాడు లేదంటాడు, తనకు సరియెవరున్ను లేదంటాడు. In * mannerఆ ప్రకారమే. they were killed * him వాడివలెనే వాండ్లున్ను చంపబడ్డారు. he * you isa servant వాడు నీ వంటి వౌకపనివాడు. get me a board * this దీనివంటి పలక వొకటి సంపాదించు. He, * a wise man, consented to this వాడు బుద్ధిమంతుడై దీనికి వొప్పెను. I, * a woman consented to this imposition నేను ఆడుదానిని గనుక యీ మోసానికిలోబడితిని. a brute పశుప్రాయుడై. he looks * a woman వాణ్ని చూస్తే ఆడుదానివలెవున్నాడు. a man * you ought not to say so నీ బోటివాడు యిట్లా అనరాదు. the plam,the date, and the * తాటిచెట్టు యీతచెట్టు మొదలైనవి, ఇంకా అలా గంటవి. Rice andthe * బియ్యము గియ్యము. Leaves and the * ఆకు అలము. I never saw the * ఇటువంటిది నేనెన్నడు చూడలేదు. * master * man గురువుకు తగిన శిష్యుడు. we are * or likely tohave rain వాన వచ్చేటట్టు వున్నది.
Likelihood, Likeliness n s. probability ఏష్యము, జాడ. there is no * ofhis paying the money వాడు ఆ రూకలు యిచ్చేజాడగా వుండలేదు.
Likely adj and adv. probable or probably వలె, బహుశః, కాబోలు, ఏమో. such as may be liked, proper (a vulgar sense) తగిన, వొప్పిదమైన. he is * to dieof this ఇందుచేత వాడు చచ్చేలాగున వున్నది. as it is * to fall పడడానకు సిద్ధమై వున్నది గనక. he very * will come వాడు బహుశః వచ్చును. a * house సొగసైన యిల్లు.a * man తగుబాటివాడు. very * he is gone వాడు వౌకవేళ పోయినాడేమో. Is this * ? ఇట్లా వుండునా. we are * to have rain వాన వచ్చేటట్టు వున్నది. he is not * to have the horse ఆ గుర్రము వాడివద్ద వుండును. It is * to happen అది బహుశః సంభవించును. The money is not * to be in this ఈ రూకలు అందులో వుండవు. he is a man * tohave that book ఆ పుస్తకము వాడి దగ్గెర వుండవచ్చును.
Likeminded adj ఏక మనస్కులైన, ఒకటే మనస్సుగా వుండే.
Likemindedness n s ఏకమనస్కత్వము, ఒకటే మనస్సుగా వుండడము.
Likeness n s పోలిక, సామ్యము. I observed the * between the brothers వాండ్లఅన్నదమ్ములు వౌకటే పోలికగా వున్నట్టు తెలిసినది. or form ఆకారము రూపము. or picture పటము. The painter took her * దానిరూపును వ్రాసినాడు. he came in the * of a friend స్నేహితవేషమును వేసుకొని వచ్చినాడు.
Likewise adv మరిన్ని, సహితము, కూడా, ఆ ప్రకారము. be * went there అతడున్ను పోయినాడు. Go thou and do * నీవు పోయి ఆ ప్రకారము చెయ్యి.
Liking n. s. ఇష్టము, ఇచ్ఛ, Good tate of body ఆరోగ్యత. of plumpness పుష్టి. Inclination or desire ఇష్టము, ఇచ్ఛ, ఆశ, కోరిక. he has no * for books వాడికి పుస్తకాలుమీద యిచ్ఛలేదు. the horses are in good * గుర్రములు పుష్టిగా వున్నవి, బలిష్ఠములుగా వున్నవి. he took the horse on * ఆ గుర్రము సరిపడితేకొనుక్కొంటానని పెట్టుకొన్నాడు.
Lilac n s వొక విధమైనపూలచెట్టు, దాసానిపువ్వు వంటిది.
Lilied adj పద్మములచేత అలంకరింపబడ్డ.
Lilliput n s లొడితెడు మనుష్యులువుండే దేశము.
Lilliputian n s లొడితెడు మనిషి. his wife is a perfect * వాడి పెండ్లాము లొడితెడు మనిషి.
Lily n s వొకవిధమైన మల్లెపువ్వుల వాసనగల తెల్లపుష్పము. (కస్తూరిపుష్పము C+. కాంపిలపుష్పము A+.) the water * కలువ. the blue water * నల్లకలువ. the red water * యెర్రకలువ. the white water * తెల్లకలువ.
Lilylivered adj పిరికిగా వుండే.
Limb n s అంగము, అవయవము. in astronomy the upper * of the sun &c. పైయంచు. the dark * of the moon కృష్ణపక్షమందు నిస్తే జస్కముగా వుండే భాగము. a * of the law అనగా లాయరు, అట్టర్నీ.
Limbeck n s సారాయి కాచే బట్టి.
Limber n s ఫిరంగి మోకు.
Limberness n s వంగేగుణము.
Limbo n s చెరసాల, పితృలోకమువంటి స్థలము, పాతాళము, యిది కావ్యశబ్దము.
Lime n s (or which mortar is made) సున్నము. quick * వేడిసున్నము. slack * తాల్చిన సున్నము, నిగురు. or bird * బంక, జిగురు, జిగట. or Lemon నిమ్మపండు, నిమ్మకాయ. a * tree నిమ్మచెట్టు. or Linden వేపచెట్టువంటి వౌక వృక్షము.
Limed-twigs n s (used in catching birds) జిరుగు పుల్లలు.
Limekiln n s సున్నపు ఆవము, సున్నపు కాలువ.
Limestone n s సున్నపురాయి.
Limewater n s సున్నపునీళ్లు.
Limit n s పొలిమేర, సరిహద్దు, మట్టు, మితము. Beyond all *s అమితముగా. the usual * of life సామాన్యమైన ఆయుఃప్రమాణము.
Limitation n s హద్దు యేర్పరచడము.
Limited adj హద్దుగల, మితమైన, మట్టైన. a man of * learning అల్పవిద్యావంతుడు. our leisure being * సావకాశము లేనందువల్ల. a very * punishment స్వల్పమైన శిక్ష.
Limmer n s చిత్రము వ్రాసేవాడు.
Limpet n s వొకవిధమైన నత్తగుల్ల.
Limpid adj తేట, నైర్మల్యము.
Limpld adj తేటగావుండే, నిర్మలమైన.
Limy adj జిగటగావుండే, సున్నమువుండే.
Lin n s See Flax.
Linchpin n s యిరుసాణి, యిరుసు యొక్క చీల.
Linctus n s లేహ్యము.
Linden n s వేపచెట్టువంటి వొకవృక్షము.
Line n s పజ్తి, వరస, చాలు, శ్రేణి, గీత, రేఖ, క్రమము, సరణి. he drew a * on the wall గోడ మీద గీతి గీచినాడు. or string దారము. or plumbline సీసపుగుండు కట్టినతాడుఇందుతో లోతును కొలుస్తారు. she hung up the clothes upon *s అది గుడ్డలు దండెములమీద వేసినది. a fishing * గాలపుతాడు, సముద్రము మొదలైన వాటితో వేశే బ్రహ్మాండమైన వల. the * in which the soldiers live సిఫాయీలు వుండే పంచపాళి. he attackedhe enemy's *s శత్రువుల కందకములను దాటినాడు. he is in the medical * అతను వైద్యసరణిలో వున్నాడు, అనగా వైద్యవృత్తిలో వున్నాడు. an upright * worn by someHindus on the forehead నామము. a * worn scross the forehead అడ్డబౌట్టు. youshould write him a * వాడికి వొక చీటి వ్రాయి. give me a line when you arrive చేరేటప్పుడు మా పేర వ్రాయవలసినది. *s composed on that occasion అందున గురించి చెప్పిన పద్యము, లేక, కొద్దికావ్యము. this stanza contains six *s యీ పద్యమునకు ఆరుచరణాలు. this * of conduct యీ తరహా నడత. The * or equator అచ్ఛరేఖ. See Equinoctial. or progeny వంశము. he had a son to continue his * వాడి వంశానికివౌక కొడుకు వుండెను. or tenth of an inch అంగుళములో పదో భాగము. marriage *sor certificate పెండ్లి జరిగించినానని పాదిరియిచ్చేపత్రిక. a ship of the * పెద్దయుద్ధవాడ.
Lineage n s వంశము, వంశపరంపర.
Lineal adj వంశస్థుడైన. a * descendant వంశస్థుడు.
Lineaments n s రూపురేఖ, ఆకారము, ఆకృతి, అవయవము. the larger * are closely similar ముఖ్యమైన అవయవములు సమానముగా వున్నవి.
Linear adj గీతలుగా వుండే, రేఖలుగా వుండే.
Linen n s బట్ట, వస్త్రము. a * cloth నారబట్ట. fine * రవశల్లా. coarse * ముతకగుడ్డ. clean * చలవబట్టలు. foul * కట్టిమాసినబట్టలు
Linendraper n s బట్టలవర్తకుడు.
Ling n s వొకతరహా చేప, ఉప్పుచేప.
Lingering adj నవిసే, జాగుచేసే, తారాడే. a * disease దీర్ఘరోగము. *hours నిమిషము గడియగా వుండే కాలము.
Lingeringly adv unwillingly అనిష్టముగా, జాగుగా, బద్ధకముగా.
Lingo n s (Johnson) భాష, యిది నీచమైన యెగతాళిమాట. (Smollett).
Lingua franca n s సంకరభాష. Hindustani is the great * of India హిందుస్తాని అనేక దేశముల యందు వాడుకగా వుండే సంకరభాష.
Linguist n s నానాభాషలు తెలిసిన వాడు.
Liniment n s గాయమునకు వేసే తైలము.
Lining n s ఆస్తిరి, లో అస్తిరి.
Link n s గొలుసు, వుంగరము, వలయము, కొలికి. a chain of 20 *s యిరువై వుంగరములుగల గొలుసు. In this chain one * is broken యీ గొలుసులో వొకవుంగరమువిరిగిపోయినది. there is a * wanting in this argument యీ సమాధానములో వౌకకొలికితక్కువ, అనగా వొక సందర్భము తక్కువ. or torch దివిటీ, మషాలు.
Linked n s దివిటీపట్టెవాడు, మషాల్జి.
Links n s (a piece of waste land) గ్రామసమీపమందువుండే బయలు, మైదానము.
Linnet n s కోకిలవంటి వౌకపక్షి, వొకవిధమైన వంజులపక్షి.
Linseed n s అవిశవిత్తు. * oil అవిశనూనె. The Madras Tariff says అల్లివిత్తుల నూనె.
Linstock n s పిరంగులు కాల్చేవత్తి. యిది ప్రాచీనశబ్దము.
Lint n s సీమదూది, గాయమునకు వేసేదూది.
Lintel n s ద్వారబంధపుపైకర్ర.
Lion n s సింహము. the ant * చీమపులియనే పురుగు. wonderful thing, rarity, sight అతిశయము, చోద్యము, వింత. this Pagoda is quite a * in our town మా వూరిలో వుండే యీ గుడి మహా వింత అయినది. the *s share మంచిది తాను వాతవేసుకొన్నాడు, మంచిది తాను అపహరించుకొన్నాడు|| పంచతంత్రకథలో సింహమున్ను యింకా కొన్ని మృగములున్ను వేటకు పోయినంతట ఆ వేటలో చిక్కిన లేడిని ముప్పాతిక పాలు తానెత్తుకొని పాతికపాలు కడమ మృగములకు యిచ్చినందున దీన్ని lion's share అంటారు, అనగా యజమానాంశము.The Governor General has been our * for the last week గవనరు జమలువారు వచ్చిప్రవేశించిన వారందినములుగా ఆయనను అందరున్ను చోద్యముగా చూస్తున్నారు, దొరకనిదిదొరికినట్టు చూస్తున్నారు.
Lioness n s ఆడుసింహము.
Lip n s పెదవి, మోవి. the under * అధరము, కిందపెదవి. he did not open the *supon the subject వాడు అందున గురించి నోరు తెరవలేదు. I learnt it from his own *sఆయన వాచా విన్నాను. he licked his *s at this వాడు దీనిమీద ఆశ పడ్ఢాడు. he issteeped to the very *s in poverty దారిద్య్రమనే సముద్రములో మునిగినాడు.the cup was filled to the * ఆ గిన్నె అంచుదాకా నిండివుండినది. * worshipభక్తిలేనిపూజ. * devotion నోటిభక్తి, పైభక్తి.
Lipped adj పెదవిగల, పైభక్తి.
Liquefaction n s కరగడము, కరిగించడము.
Liqueflable adj కరిగే.
Liquid n s ద్రవద్రవ్యము. honey is a thick * తేనె చిక్కనగా వుండేటిది.
Liquidated adj తీరిన చెల్లిన. the debt * by him వాడు చెల్లించిన అప్పు.
Liquidation n s తీర్చడము, చెల్లిండము.
Liquor n s రసము, నీళ్ళు. strong * సారాయి కల్లు. he was in * సారాయితాగివుండినాడు.
Liquorice n s అతిమధురము అనే మందుదినుసు.
Liquorish adj రుచిమరిగిన, కాంక్షగల, పలవతనముగల. a * affection for gold(Swift) కాంక్ష.
Liquorishly adv రుచిమరిగి, కాంక్షగా, పలవతనముగా.
Liquorishness n s కాంక్ష, ఆశ.
Lisping adj నోట పట్టీపట్టక మాట్లాడే, దద్దాబిద్దా అని మాట్లాడే.
Lispingly adv దద్దాబిద్ధా అని మాట్లాడుతూ.
Lissome adj (litthesome) వంగే. the cane is * గెత్తము వంగేటిది.
List n s జాబితా, పట్టి. or border అంచు. a cloth with a red * యెర్రంచు గల గుడ్డ. the tiger has a black * running along it's back పులికి వీపులో నల్లటిచారవున్నది. a strip of cloth గుడ్డ పేలిక. the *s యుద్ధరంగము. he entered the *s withme నాతో జగడము చేసినాడు.
Listenlessly adv అశ్రద్ధ. నిస్పృహ, అక్కరపట్టనితనము.
Lists n s యుద్ధరంగము, యుద్ధభూమి.
Lit adv i. e. Literally శబ్ధతః, మాటకుమాటసరిగ్గా.
Litany n s ప్రార్థనా ప్రకరణము.
Literal adj మాటకుమాటగా వుండే. this is a * translation మాటకు మాట సరిగ్గావుండేట్టు చేసిన భాషాంతరము, శబ్దతః చేసిన భాషాంతరము. the * sense ముఖ్యార్థము.as opposed to గౌణార్థము.
Literality n s యాథార్ధ్యము.
Literally adv మాటకుమాట సరిగ్గా, శబ్దతః . he translated it * వాడు దాన్ని మాటకు మాట సరిగ్గా భాషాంతరము చేసినాడు. he is * starving వాడు సిద్ధముగా వస్తువున్నాడు. they are * naked వాండ్లు సిద్ధముగా దిసుమొలతో వున్నారు.
Literary adj విద్యాసంబంధమైన. a * character విద్వాంసుడు. a * circleవిద్వత్సమూహము. a * production గ్రంథము. *pursuits గ్రంథ విచారము. a * Society చదువుకున్న వారి సభ.
Literati n s విద్వాంసులు, పండితులు.
Literature n s విద్య, పాండిత్యము.
Litharge n s మురుదారుసింగు అనే మందు దినుసు.
Lithe adj or lither (Shak. in Johnson) i. e. flexible, yielding ఎటువంచితే అటువంగే. pliant వాహ్యమైన, మోసుకొని పోగూడిన. the bird winged through the lither sky ఎటుబడితే అటు నిరాటంకముగా పోగూడిన ఆకాశములో యెరిగిపోయెను.
Lithographic adj రాతి అచ్చు సంబంధమైన.
Lithography n s రాతిఅచ్చు, అనగా రాతిలో అక్షరాలు తగిలించి శాయి పట్టించివేసే అచ్చు. the stone used for * is called నాపరాయి.
Lithotomist n s మూత్రద్వారములో అడుచుకొనే రాయిని కోసితీసే వైద్యుడు.
Lithotomy n s మూత్రద్వారములో అడుచుకొనే రాయిని కోసితీసే శాస్త్రము.
Litigant n s వ్యాజ్యగాడు.
Litigated adj వ్యాజ్యగ్రస్తమైన, నివాదగ్రస్తమైన. the property which is *వివాద గ్రస్తమైనసొత్తు. this question is much * among them యీ విషయమును గురించివారిలో నివాదముగా వున్నది.
Litigation n s వ్యాజ్యము, వివాదము.
Litigious adj వ్యాజ్యాల, తంటాల. a * fellow వ్యాజ్యాలమారి, తంటాలమారి.
Litigiousness n s తంటాలమారితనము, తగువులమారితనము.
Litter n s or vehicle వాహనము. marriage * కర్నాటక పల్లకి. or dooly డోలి.or sadan నాల్కీ, టాంజన్. or straw గుర్రము మొదలైన వాటికి పక్కకిందవేసే పడకగడ్డి.the room is all in a * or disorder ఆ యింట్లో సామానులు గందరగోళముగా వేసిపెట్టుట.గుర్రము మొదలైన వాటికి పక్క కింద గడ్డిపరచుట. the stable was *ed with strawఆ గుర్రపుతబేలాలో గడ్డి పరువుగా వేసి వుండినది. the room was *ed with books ఆ గది నిండా పుస్తకములు గందరగోళముగా వేసి వుండినది.
Little adv కొంచెముగా, కొద్దిగా. a * after యింకా రవంతసేపటికి, రవంతతాళి.a * before కొంచెము ముందర, రవంతమునుపు. They said * to me నాతో నిండా చెప్పలేదు.
Littleness n s అల్పత్వము, తుచ్ఛత్వము.
Liturgy n s ప్రార్థనాపత్ధతి, ప్రార్థనా ప్రకరణము, జపగ్రంథము, ఆరాధన క్రమము.అర్చనాక్రమము. `Every country has it's own liturgies which are the rules ofprocceding in every thing that relates to external worship and the publicexercise of religion, (Moshcim's Eccl. Hist. 16th Cent } 3.2.5.) ఆచారకాండ.Beschi. uses the word మంత్రమాల. a liturgical work పూజాపత్ధతి.
Live adj ప్రాణములతో వుండే. he had a * snake in box జీవముగల పామునువొకపెట్టెలో పెట్టుకొని వుండినాడు. * coals కట్టెనిప్పు. * stock గొడ్లు, పశువులు, జీవాలు.
Livelihood n s జీవనము, జీవనోపాయము. how do you get your * ? నీవు కూటికి యెట్లా సంపాదించుకొంటున్నావు. what is your * I am shoe-maker నీ వృత్తియేమి,నేను మాదిగె వాణ్ని.
Liveliness n s చురుకు, లాఘవము, ఉల్లాసము.
Livelong adj యావత్తు. the * lay యావత్తుదినము, పగలంతా. the * night రాత్రి అంతా..
Lively adj చురుకైన, ఉల్లాసమైన. a * horse వడిగల గుర్రము. a * song ద్రుతగతిగాపాడే పాట. this is a * resemblance of him యిది సరిగ్గా అతని పోలికగా వున్నది.with * satisfaction వుల్లాసముతో. the * oracles (Acts VII. 38.) జీవనదాయకంవాక్యము A+ జీవవాక్యములు. a * persuasinon ధృఢమైననమ్మిక. in modern days * generally means Lewd శృంగారమైన.
Liver n s జీవముతో వుండేవాడు, బ్రతికి వుండేవాడు. the *s in towns వూళ్ళలో వాసము చేసే వాండ్లు. a good * or moral man నీతిపరుడు. an ill * దుర్వృత్తుడు. orjecur in the body కార్జెము, కలేజా, (నెరిడె M.) నురుగుదబ్బ, కాలఖండము, a * complaint పక్కశూల. * coloured కందువర్ణమైన. * grown కడుపులోబల్ల కట్టిన,నంజు పెరిగిన తెవులుగల.
Liverwort n s వొక్కమొక్క పేరు.
Livery n s యజమానుడు పనివాండ్లకు యిచ్చిన వుడుపు. by liveries I knew it tobe his conveyance పనివాండ్ల వుడుపుచేత అది అతని బండి యని కనుక్కొన్నాడు. *stables బాడిగె గుర్రాలు వుండే లాయము. Those horses now stand at * ఆ గుర్రాలుఅద్దెకు విడువబడి వున్నవి.
Liveryman n s వొకవిధమైన గ్రామమరాసిదారు.
Lives theplu o Life. ప్రాణములు. See Life.
Livid adj కమలిన వర్ణముగల, కందువర్ణమైన. his face is * వాడి ముఖములో నెత్తురు చచ్చినది, పీనుగముఖము పడ్డది.
Lividness n s కమలినవర్ణము.
Living n. s. జీవనము, వృత్తి,మాన్యము,భటవృత్తిమాన్యము, how does he get his * ?వాడికి జీవనముయెట్లా. the priest has a * ల గురువుకు మాన్యమున్నది.
Livre n s సుమారు యేడుఅణాలకు మారే ఫ్రెంచి రూక.
Lixivium n s క్షారోదకము.
Lizard n s the small house * బల్లి. the house * with red tail సరస్వతి పురుగు.the guana వుడుము. the cameleon or camelion or chameleon ఊసరవల్లి.the blood-sucker తొండ. the crocodile మొసలి. &c. ఇవి మొదలైన వాటికి Lizardసముదాయ నామము. The Lizard ఇంగిలండు రేవులోవుండే వొక పర్వతము.
Lo interj అదో, అదుగో, అదుగోచూడు, ఇది ప్రాచీన శబ్దము. Lo and behold ఇది ఆశ్చర్యవాచకము.
Loach n s బొమ్మిడాయి చేపవంటిచేప.
Load n s బళువు, భారము, మోత, మోపు. a bullock * of salt వొక పెరికెవుప్పు.a bullock * of firewood వొక కవాడముకట్టెలు. half a bullock * అంకెము,అరకవాడము. a * of firewood కట్టెలమోపు.
Loadstar n s ధృవనక్షత్రము.
Loadstone n s సూదంటురాయి, కాంతరాయి.
Loaf n s a * of brad రొట్టె. two loaves రెండు రొట్టెలు.
Loaf-sugar n s తెల్లఖండ శర్కర.
Loam n s బంకమన్ను.
Loamy adj బంకమన్నుగా వుండే.
Loan n s అప్పు. of Jewels &c. ఎరువు.
Loath adj అసహ్యపడే. I was * to go there అక్కడికి పోవడానికి నాకు మనసులేదు.
Loathed adj అసహ్యమైన. a * task అసహ్యమైన పని, చీదరైనపని.
Loathing n s అసహ్యము, చీదర.
Loathsomeness n s అసహ్యము, చీదర.
Loaves n s or Lobcock మొద్దు, లంఠడు.
Lobdy n s పడసాల, ముఖమంటపము.
Lobe n s భాగము. the * of the ear చెవి తమ్మె. the * of the lungsశ్వాసకోశము. three *d kidney-bean (Ainslie 2. 434.) మూడు గెణుపులుగల చిక్కుడుకాయ.
Lobster n s పీతవంటి వొకవిధమైన పెద్ద యెండ్రకాయ.
Locacative case in grammar n s సప్తమీవిభక్తి, గ్రామమందు, వూరిలో ఇత్యాది.
Local adj స్థళసంబంధమైన, స్థానికమైన. this is a * custom ఇది ఆ దేశాచారము.a * language దేశభాష. *news ఇక్కడి సమాచారము, అక్కడి సమాచారము.the *authorities అక్కడి అధికారులు. the * sense of a word విశేషార్థము,ఔచిత్యార్థము. a boil is a * disease పుండు యెక్కడలేస్తే అక్కడనే వుపద్రవము చేసేటిది.
Locality n s స్థలము, స్థానము, ప్రదేశము. a sandy * ఇసుకభూమి.
Location n s స్థానము, ప్రదేశము.
Loch n s See Lake.
Lock n s తాళము, బీగము. a * of bair వెంట్రుకలుగుత్తి, జుట్టు. he cut off her*s దాని వెంట్రుకలను కత్రించినాడు. flowing *s జీరాడే వెంట్రుకలు. shaggy *s చింపిరి వెంట్రుకలు. a * of a gun తుపాకి చెవిపెట్టె అనగా cock గుర్రము. hammerచకిముకిరాయి తగిలి నిప్పుపడే యినుము. trigger గుర్రము పడడానకై యీడ్చే కిందిబిస,యివి గలది, firelock తుపాకి. a box with a * బీగముల పెట్టె. on a channel కాలవలో నీళ్లు పారకుండా నిలుపడానకై వేసే ద్వార యంత్రము. a * hospital సెగరోగములు గలవాండ్లు బయటికి రాకుండా బీగమువేసినట్టే చావిడి. * jaw నక్కిళ్ళుపడి చచ్చినాడు. a * up or ward house చావిడి, బందేఖానా.
Locker n s సామానులపెట్టె, సొరుగు, ఇవి కూర్చుండడానకు వుపయోగముగా వుంటవి,ఇది వాడ భాష.
Locket n s తాయిత్తు, పతకము.
Locomotion n s గమనశక్తి. without the power of * సంచరించె శక్తిలేక.
Locomotive adj గమనశక్తిగల, సంచరించే.
Locum-tenens n s బదులుగా పనిచూచేవాడు, ఆక్టింగుగా వుండేవాడు.
Locust n s జట్టిమిడత, శలభము, అరిటి పండు పురుగు, కందిమిడత.
Lodestar n s ధ్రువనక్షత్రము.
Lodestone n s సూదంటురాయి, కాంతరాయి.
Lodge n s చావిడి సత్తము. a * or society of freemasons ఫ్రీమేస ్ మతస్థుల సభ.a * for watchers placed in a garden మంచె.
Lodged adj వుంచిన, వేసిన, దించబడ్డ. the books * on the table మేజమీద పెట్టిన పుస్తకాలు. the prisoners * in the jail చెరలో పెట్టబడ్డ కైదీలు. he is * in my house నా యింట్లో దించబడ్డాడు. the ball * in his leg అతని కాలిలో తగిలిన గుండు.
Lodgement n s స్థానము. the soldiers soon gained a * on the wall సోజర్లుగోడమీదికి శీఘ్రముగా చేరినాడు.
Lodger n s కాపురము వుండేవాడు, అద్దెకు కాపురము వుండేవాడు.
Lodging n s స్థానము. Lodgings బసవిడిది. I took *s with him వాడింట్లో కొంచెము చోటు తీసుకొని వుండే యిల్లు . Loft, n. s. మిద్దెమీద వుండే చిన్న కొట్టిడి. the upstairs seats in a church.The organ * గుడిలో వుండే పై వరస.
Loftily adv ఉన్నతముగా, యెత్తుగా, గర్వముగా.
Loftiness n s ఔన్నత్యము, పొడుగు, గర్వము.
Lofty adj ఉన్నతమైన, అహంకరించిన.
Log n s మొద్దు, దుంగ. (In the Bible a measure) వొక శేరు. (In measuring atsea) సముద్ర భాషలో కోసులుకొల్చే దారము. Log book దినచర్య గ్రంథము.
Log line వాడసాగిపోయినదూరముకొలిచేతాడు
Logarithm n s సంక్షేప గణితశాస్త్ర విశేషము, మహాగణితమందు వచ్చే వొక సాంకేతిక లెక్క.
Loggats n s పిల్లకాయలు ఆట్లాడే వొక ఆట.
Loggerhead n s మొద్దు, మందుడు, జడుడు. they went to *s పోట్లాడ సాగినారు.this author is at *s with physicians యితనికి వైద్యులకు సరిపడదు, ఘష ్ ణ కలదు. allthe quacks are at *s జబ్బువైద్యులు వూరికె పోరాడుతారు.
Logic n s తర్కము, తర్కశాస్త్రము, న్యాయశాస్త్రము.
Logical adj తర్కశాస్త్ర సంబంధమైన, న్యాయమైన.
Logically adv న్యాయముగా, సతర్కముగా.
Logician n s తర్కశాస్త్రి, తార్కికుడు.
Logomachy n s వాగ్వాదము.
Logwood n s చాయచెక్క, తొగురుచెక్క.
Loin n s నడుము, రొంపి. a * of mutton వేటముక్క వీపు. he was girt aboutthe *s with a linen girdle నడుమున దట్టికట్టు కొన్నాడు. the fail of the *s కట్టిప్రదేశము. the horse's *s are broken or the horse is gone in the *s ఆ గుర్రానికి నడము విరిగినది.
Loiterer n s జాగుచేసేవాడు, కాలయాపనము చేసేవాడు.
Loitering n s కాలయాపనము, జాగు, జాప్యము.
Lollipop n s వొకవిధమైన మిఠాయి, వుక్కెర.
Lone adj ఏకాంతమైన, వొంటియైన. I am a * woman నేను దిక్కుమాలినదానను.
Loneliness n s ఏకాంతము, వొంటిరిపాటు.
Lonely adj ఏకాంతమైన, వొంటి. a road యెడారి మార్గము.
Long adv శానాసేపు, బహుకాలము, బహుదూరము. all day * ఎన్నాళ్ళకు, యెంతసేపు.how * were you there? అక్కడ యెన్నాళ్ళు వుంటివి, యెంతసేపు వుంటివి. he is not *for this world ఇకను వాడి ప్రాణము నిలువదు. it will be * before we again seesuch a man as him అంతటివాణ్ని మళ్ళీ కానము. a * forgotten story బహుదినాలుగామరిచిపోయిన సంగతి. a * expected occurrence బహుదినాలుగా యెదురుచూస్తూ వుండినపని.
Longboat n s వాడలో వుండే వాటిలో పెద్దపడవ.
Longcloth n s మూరకోక, బారచాపు.
Longe n s See Lunge.
Longer adj దీర్ఘతరమైన. this is * than that దాని కంటె యిదిపొడుగు. do not hide it any * దాన్ని యికను దాచవద్దు. his patience endured no * వాడికి తాళకూడక పోయినది,వాడికి ప్రాణము విసికినది.
Longevity n s దీర్ఘాయువు.
Longheaded adj దూరాలోచనగల, దీర్ఘదర్శియైన.
Longing n s ఆశ, వాంఛ, భ్రాంతి. a * woman వేవిళ్ళుగల స్త్రీ.
Longingly adv ఆశగా, వాంఛగా, భ్రాంతిగా.
Longish adj కొంచెము పొడుగైన.
Longitude n s నిడుపు, దైర్ఘ్యము. అనగా భూగోళశాస్త్రమందు తూర్పుపడమటినిడివి సంఖ్య.
Longitudinal adj నిడివైన. the field is divided into * sections ఆ పొలము నిడివి తుండ్లుగా చేయబడ్డది. the stone was broken into * portions ఆ రాయి నిడివి తుండ్లుగా పగలకొట్టబడ్డది.
Longitudinally adv నిడివికి, నిడివిగా. See Longwise.
Longlife n s దీర్ఘాయువు. * to you majesty తమరు దీర్ఘాయువుగా వుండవలెను.
Long-lived adj దీర్ఘాయుస్సుగల, దీర్ఘాయుస్సుగా వుండే.
Longshore wind n s (a Madras phrase for that strong south wind which blowsalong the shore) దక్షిణగాలి, అనగా మాఘమాసములో గాలి, పయరగాలి.
Long-suffering n s తాళిమి, వోర్పు, చిరసహిష్ణుత్వము. A+. in Rom. 22.
Longways adv ఊపిరివిడువని, అతి దీర్ఘమైన, తూలైన, మిక్కిలి పెంచి చెప్పిన. a * speech గుక్కవిడువక చెప్పేమాటలు, ప్రసంగము, తలచీదరగా వుండేకథ, అనగా బ్రహ్మాండమైన కథ.
Longwindedness n s తూలు, పెంపు. from the * of his description అతని వర్ణన మహా తూలుగా వుండేందువల్ల.
Longwise adv నిడివికి, నిడుపుగా. the beams were placed across the room andrafers * దూలాలను అడ్డముగా వేసి త్రావులను నిడివిగా వేసినారు.
Loo n s ఒక విధమైన కాకితాల ఆట.
Looby n s మోటువాడు.
Look n s దృష్టి చూపు. he gave me a * వానికన్ను, లేక, దృష్టి నామీద పారినది. or appearance ముఖవిలాసము, ముఖము. at the first * I thought so మొదట చూడగా అఅట్లా తోచినది. his *s shewed that he was offended వాడి ముఖము చూస్తే కోపముగా వున్నట్టువున్నది. she has a cheerful or pleasant * అది వుల్లాసముగా వున్నది. good *s సౌందర్యము, ఇది నీచమాట. this Hindu has the * of a Musulman వీడి ముఖము చూస్తే తురకవాడివలె వున్నది. we are on the * our for him అతనికి యెదురు చూస్తున్నాము. I am on the * out for a house ఒక యిల్లు కావలెనని విచారిస్తాను. a * out house ఠాణా, చౌకి. *ing after (care, supervision) విచారణ, the best of servants want *ing after సేవకులు యెంత మంచివాండ్లయినా వాండ్లనున్ను వొకకంట కనిపెట్టవలసినది.
Looker n s చూచేవాడు.
Looking adj అగుపడే, good * అందమైన. ill * కురూపియైన, వికారమైన. nice *, respectable * చూపుకు బాగా వుండే.
Looking-glass n s అద్దము, దర్పణము.
Loom n s మగ్గము.
Looming (the same as mirage) SeeMirage
Loon n s జడుడు, వెర్రిముఖము, పోకిరి.
Loop n s ఉచ్చు, ఉచ్చుదారము. the tent walls are fastened with *s కణాతులు వుచ్చుదారముతో కట్టబడుతున్నవి. some * s dropped in this net వలలో కొన్ని వుచ్చులు.లేక, కండ్లు తెగిపోయినవి. the curtain was *ed up ఆ తెర చుట్టి వుచ్చులో తగిలించబడ్డది.
Loophole n s కన్ను, రంధ్రము, గవాక్షి, దాగేస్థలము. or pretext సాకు ఉపాయము.
Loose adj విడువజడ్డ, వదులుగా వుండే, విడిగా వుండే, విముక్తుడై వుండే. a * coatవదులుగా వుండే చౌక్కాయ. * language కొంటెమాటలు. a * woman వ్యభిచారి. a * fellow పోకిరి. a * book రంకు పురాణము. * earth పొడిమన్ను. * cash చిల్లరరూకలు. *locksవిరియబోసుకొని వుండే వెంట్రుకలు, చింపిరి వెంట్రుకలు. * principles దుర్నీతి.he used * (uncertain) expressions సందిగ్ధముగా మాట్లాడినాడు. he is * (of the bowels) వాడికి బేదులు అవుతున్నవి. he sat * from the world ఐహికమందు జిగుఫ్సగావుండినాడు. the buffalo broke * and ran away ఎనుము తెంచుకొని పారిపోయినది.the horse got * గుర్రము విడిబడ్డది. the rope got * దారము వూడిపోయినది. he let the birds * ఆ పక్షులను విడిచిపెట్టినాడు.
Loosed adj వదిలిన, సళ్ళిన, విడిచిపెట్టిన.
Loosely adv వదులుగా, సళ్లుగా. the letter is * expressed ఆ జాబులో సందిగ్ధముగా వ్రాసి వున్నది. she lives* అది వ్యభిచారిగా వున్నది. he put in he earth * ఆ మంటిని సళ్ళుగా పోసినాడు.
Loosened adj వదిలిన, వీడిన, సళ్ళిన.
Looseness n s వదులు, సళ్ళు. or Lewdness రంకుతనము. or purging బేది, ప్రవృత్తి. or Latitude సందిగ్ధము. From the * of their conduct వాండ్ల రంకుతనమువల్ల. this fever brought on a * ఈ జ్వరముచేత ప్రవృత్తులు కనిపించినది.
Lopped adj నరికిన, తెగకొట్టిన. a tree with the branches * off మోటుచెట్టు.
Loppings n s తునకలు, తుండ్లు.
Lopsided adj కుంటిగావుండే, వికారమైన.
Loquacious adj వాగే వదురుబోతైన.
Loquacity n s వదురుబోతుతనము.
Lord n s స్వామి, ఈశ్వరుడు, కర్త, ప్రభువు, యజమానుడు, పతి, నాధుడు. the * of the land క్షితీశ్వరుడు, రాజు. he is a * by birth వాడికి జన్మతః లార్డు అనే పట్టముకద్దు. he went to meet his * అతడి యజమానుడి వద్దకి పోయినాడు. * of the manorజమీందారుడు. the * privy seal అంత రంగ మంత్రి. she waited for her * పెనిమిటికొరకు కాచివుండినది, యాజమానుడి కొరకు కాచి వుండినది. my * అయ్యా, మహాప్రభో, దేవరా. our * or the * అనగా Jesus Christ ప్రభువు A+. పరమేశ్వరుడు A+. పరేశ A+. In John VIII.II. మహాశయ B+.in I Pet. I. 25 పరేశః A+. In the Persian Bible the word used is Khodawand and happily this word ఖొదావందు has long since been familiarly used. In Exod. XV. 3 Maityn's Persian says Khodavand sahib-i-jan-gast : nam-i-we, Yehovah. (N.B- Karta is the best:] [A sect of Christians in Bengal call themselves Karta bhaj, or worshippers of the Lord] The Lord's Day ఆదివారము. The Lord's Prayer కర్త వుపదేశించిన జపము. In the year of our * 1842 ఖ్రీష్టుపుట్టిన సంవత్సరం. ఆన 1842 సంవత్సరమని వ్రాస్తారు. spiritual *s బిషపులు. The Lord, or God, is in Braminical Hindu books జగద్గురుః a law-lord న్యాయాధిపతి, అనగా సూప్రీంకోర్టు జడ్జి.
Lord Mayor n s లండన్ పట్టణపు పెద్ద పోలీసు అధికారి, ఈ అధికారము ప్రతిసంవత్సరమున్ను వొక పెద్ద వర్తకుడికి యివ్వబడుతున్నది.
Lordiness n s గంభీరము, జంభము, బడాయి, అహంకారము.
Lording n s దొరకొడుకు, ఇదియోగతాళిమాట.
Lordly adj (grand, fine) దివ్యమైన, ఘనమైన, లక్ష్యమైన, జంభమైన.
Lordship n s ప్రభుత్వము. His * ఆయన. Your * తమరు, ఏలినవారు. Their Lordships వారు. after his death the * went to his brother అతను చచ్చినతర్వాత అతని ప్రభుత్వము తమ్మునికి అయినది.
Lore n s విద్య, చదువు, శాస్త్రము.
Lorhe n s See Loathe.
Lorn adj దిక్కుమాలిన. See Forlorn.
Lory n s ఒక విధమైన చిలుక.
Loss n s నష్టము, ఛేదము, నాశము, ఓటమి. after the * of his father వాడి తండ్రిచనిపోయిన తరువాత. after the * of his situation వాడి వుద్యోగము పోయిన తరువాత.after the * of law suit ఈ వ్యాజ్యము వోడిన తరువాత. * of sight is a great evilగుడ్డి కావడము మహాచెరుపు. * of time కాలహరణము. * of victory అపజయము.* of character అవమానము. * of recollection విస్మృతి. * of health రోగము.* of victory అపజయము. * of character అవమానము. * of money in exchange వట్టము. he sustained a great * శానా నష్టమును పొందినాడు. at a * (phrase denoting ignorance) he was at a * ఎటూ తోచక వుండినాడు. they were at a * about his nameఆయన వాండ్లకు తెలియక తొందరపడిరి. I was at a * for a house ఇల్లు చిక్కకతడమాడితిని. I am at a * his reason యేల చేసినాడో నాకు తోచలేదు.
Lost adj పోయిన, పోగొట్టుకొన్న, నష్టమైన, క్షయమైన. he gave himself up for * అయ్యోచస్తినన్నాడు. * to all wisdom జ్ఙానవిహీనుడైన, తెలివిమాలిన. * to shameశిగ్గుమాలిన, గతలజ్ఙ. he is now quite a * man వాడిప్పుడు అన్నం దాలా పనిచెడివున్నాడు.
Lot n s (fortune) అదృష్టము, యోగము, భాగ్యము. they cast *s for thisand the * fell to him ఇందును గురించి వాండ్లు చీట్లు వేసినారు ప్రైజు వాడికి వచ్చినది. It fell to my * నాకు వచ్చినది, నాకు లభించినది. a jail was his * వాడికి చెరసాల ప్రాప్తి అయినది. his * is hard వాడిది దుర్దశగా వున్నది, వాడికి దుష్కాలము. or Parcel of things మూట. a * of books కొన్నిపుస్తకాలు. a * of people శానామంది. a * of times అనేక మాట్లు, శానా అనే అర్థమందు నీచప్రయోగము. a * at an auction ఏలములో వొకపద్దు. the English word lot (లాటు) is used.
Lota (Indian word for a brasspot)చెంబు
Lote n s or Lotos or Lotus పద్మము, కమలము, తామరపువ్వు.
Loth n s See Loath.
Lothario n s విటుడు, శృంగారపురుషుడు.
Lothed adj See Loathed.
Lothing n s See Loathing.
Lotion n s మందునీళ్లు, వ్రణము మొదలైన వాటిని కడగడానకు మందుకలిపిగానిమందాకులు వేశిగాని కాచిన నీళ్లు.
Lottery n s చీట్లువేసే ఆట, లాటరిఆట. The Indigo business is a mere * నీలిమందు వర్తకము వట్టి రసవాదము. They talk of life as a * ఇహ మనిశ్చయమని అంటారు.in the * of life ఈ క్షణభంగురమైన ఆయుస్సుయందు.
Loud adj. గట్టి, బిగ్గరైన, he spoke with * voice బిగ్గర మాట్లాడినాడు.
Loudly n s గట్టిగా, బిగ్గర.
Loudness n s పెద్దగొంతు, ఉచ్చస్వనము. From the * of his voice వాడి గొంతు పెద్దది గనుక.
Lough n s చెరువు, మడుగు, ఇది అపూర్వశబ్దము.
Louis, or Louisd" or n s. ఒక విధమైన ఫ్రెంచి మోహరి.
Lounge n s సోమారిగా తిరగడము బద్ధకముగా పడియుండడము.In one of his *s he met me వాడు సోమారిగా తిరగడములో నాకు అడుపడ్డాడు.
Lounger n s సోమారిగా తిరిగేవాడు, పాలుమాలికగా పడియుండేవాడు.
Lour n s See Lower.
Louse n s పేను కుక్కుట, వేలుచూచుట, ఈర్చుట. the beggar was lousinghimself ఆ బిచ్చగాడు పేలు కుక్కుకొంటూ వుండినాడు. she *d the dogఆ కుక్కకు పిణుజులు తీసినది.
Lousiness n s పేలుపట్టి వుండడము.
Lousy adj పేలుపట్టిన. or mean క్షుద్ర, నీచ. a * beggar ఈరు పేలు పట్టిన బిచ్చగాడు. a * scoundrel క్షుద్ర విధవ.
Lout n s మొద్దు, జడుడు, ద్రాభ.
Loutish adj మడ్డి, మొద్దు, మోటు, ఎడ్డె.
Loutishness n s మడ్డితనము, మొద్దుతనము, మోటుతనము, ఎడ్డెతనము.
Lovable adj మనోహరమైన, మనోజ్ఙమైన.
Love n s మోహము, వలపు, ఆశ, ఇచ్ఛ,స్నేహము. towards God and man భక్తి.or favour విశ్వాసము, ప్రేమ, దయ. or cupid మన్మథుడు. children shew great * of sweetmeats బిడ్డలకు మిఠాయిమీద నిండా అశ. he has no * of learning వాడికిచదువుమీద ఇచ్ఛలేదు. * towards God దైవభక్తి. It is a labour of * తానే కోరిన శ్రమ. Those who are ensnared in the * of this world ఐహిక పాశబద్ధులయినవాండ్లు.his * or mistress నాయకి, ప్రియురాలు. her * or gallant నాయికుడు, ప్రియుడు.a sweet little * or child బిడ్డ. my little * అమ్మాయి, అబ్బాయి. Paternal *(meaning * towards a son) పుత్రవాత్సల్యము. filial * (meaning * towards father) పితృభక్తి. the * of one's country స్వదేశాభిమానము. he fell in * with her దాన్ని మోహించినాడు. he made * to her దాన్ని వుపసర్పించినాడు. the art of * కళాశాస్త్రము. * epistless నాయకీ నాయకులు వలపు వల్ల వ్రాసుకొనె జాబులు. a book of * versesశృంగారకావ్యము. self * స్వలాభేచ్ఛ, తన మేలును గురించిన వాంఛ. * Powder మరులుమందు. sick of * విరహతాపము. the * sick nightinagalc విరహతాపముగల చకోరము * locks కాకపక్షము, అనగా జులుఫా. In the Christian sense aIn I Cor. XIII. 13. I Pet. IV 8. ప్రేమ ABC+. స్నేహము. p. anbu FR+. ప్రేమ. C+ Wesley's Letter 433 says An ounce of love is worth a pound of knowledge: hereit clearly means రవంత యిష్టముచాలు గంపెడు జ్ఙానము నిష్ఫలమే.
Loveable adj మనోహరమైన, మనోజ్ఙమైన.
Loveapple n s (tomata fruit) సీమబుడ్డ బూసరకాయ ; మొలక్కాయ దీన్ని కర్పూరపు వంకాయ అనిన్ని సీమతక్కాళి యనిన్ని అంటారు. Solanum Lycopersicum; కన్నడములో కడగోలుపండు, తక్కాళి, ఔతుదేకాయ.
Loveletter n s నాయకీ నాయకులు వ్రాసుకొనే జాలు.
Loveliness n s సౌందర్యము, లావణ్యము, మనోహరత్వము.
Lovelorn adj విరహతాపముగల. the * nightingale చక్రవాకము.
Lovely adj సరసమైన, సుందరమైన, మనోహరమైన. whatsoever things are స్నేహమునకు హేతువానవేవో. (phil. IV. 8.) యద్యద్ధి తదాయికం. A+.
Lover n s కాముకుడు, ప్రియుడు, ఆశగల వాడు. or friend స్నేహితుడు,ఇది ప్రాచీన అర్థము. a * of books పుస్తకాల మీద ఆశగలవాడు. a * of wineసారాయి మీద యిష్టము గలవాడు. a * of sin పాపరతుడు. her * * తన్ను పెండ్లి చేసుకొమ్మని వుపసర్పించేవాడు. a * of novelty నూతనప్రియుడు. a * of God భక్తుడు. In 2 Tim.III. 4. lovers of pleasure more than lovers of God ఈశ్వరాదసి సుఖం అభిలాషంతొA+. In 2 Tim. III. 2. lovers of their own selves ఆత్మశ్లాఘినో A+. In Ps. LXXXVIII.18. సుహృదః A+.
Lovesick adj విరహతాపముగల.
Lovetale n s శృంగారకథ.
Loving adj ప్రేమగల, ప్రీతిగల, దయగల. See Affectionate.
Loving kindness n s అనుగ్రహము, కటాక్షము.
Lovingly adv ప్రేమగా, విశ్వాసముగా.
Low adv తగ్గుగా, హీనముగా. he was borught * వాడికి దగ్గు దశ వచ్చినది. వాడికి దీనదశ వచ్చినది. when his money run * వాడికి దుడ్డు మట్టుపడ్డప్పుడు.fasting keeps the desires * వాడు హీనస్వరముగా మాట్లాడుతాడు.
Low-countries అనగా the countries called Bavaria and the lower Rhine
Lower adj కింది పల్లుడుగా వుండే. the * room కింది అర. the * garden తోటలో పలుడుగా వుండే భాగము. the * field పల్లపుచేను. a * roomed house పై మిద్దెలేని యిల్లు.the * garment మొలగుడ్డ.
Lowered adj తగ్గిన, దించిన. See To Lower.
Loweringly adv or Louringly మందారముగా, చిటపటలాడుతూ, దుమదుమలాడుతూ.See To Lower v. n.
Lowermost adj అన్నిటికి కింది.
Lowest adj అన్నిటికి కింది, అతినీచమైన.
Lowing n s or cows కూత, అరుపు, అంభారావము, యిది ఆవును గురించినమాట.
Lowlands n s పల్లుడుభూమి, కొండకిందిదేశము. or southern part of Scotland.
Lowliness n s దీనత, దైన్యము, వినయము, అణుకువ, నమ్రబుద్ధి.
Lowlived adj క్షద్రమైన, నీచమైన, పోకిరి.
Lowly adj వినయవిధేయముగల, అణుకువగల, నీచమైన, తక్కువైన.
Lown n s See Loon.
Lowness n s తగ్గు, పల్లు, నీచత్వము, హీనత్వము. from the * of the door గెడప కురచది గనుక. from the * of his spirits వాడికి ధైర్యము తప్పినది గనుక.వాడు వ్యాకులముగా వుండుటవల్ల.
Lowspirited adj ధైర్యములేని, వ్యాకులముగల.
Low-water n s పాటుకాలము. it was * at noon మధ్యాహ్నముపాటు సమయముగా వుండెను.
Loxia n s (the Toddy bird) గిజిగాడు అనే పక్షి.
Loyal adj సద్భక్తిగల, రాజభక్తిగల. a * subject రాజభక్తిగల కాపు.a * wife పతివ్రత.
Loyalist n s సద్భక్తిగలవాడు.
Loyally adv సద్భక్తిగా, రాజభక్తిగా, పతిభక్తిగా.
Loyalty n s సద్భక్తి, రాజభక్తి, పాతిప్రత్యము, భక్తి.
Lozenge n s A Rhomb. మాణిక్యపట్టె యొక్కగాని డైమన్ చుక్కయొక్కగాని ఆకారము. a medicine బెల్లమువేశి చేసి పుక్కిట పెట్టుకొనే వొక దగ్గుమందు. a cake వొక మిఠాయి.
Lubber n s మోటువాడు, మడ్డివాడు.
Lubberly adv మోటుతనముగా, మడ్డితనముగా.
Lubricity n s నునుపు, చపలత్వము, వ్యభిచారము.
Lucerne n s వొకవిధమైన గడ్డి.
Lucid adj ప్రకాశమైన, నిర్మలమైన. or sober తెలివిగా వుండే. during * intervalsవెర్రిపోయి తెలివివచ్చిన వేళలో.
Lucifer n s వేగుచుక్క. or Devil సైతాను. or a brimstone match which is alsocalled a silent match రాచుటచేత రగిలే గంధకపుపుల్ల.
Lucina n s పురుటింటి దేవత.
Luck n s అదృష్టము, యోగము, ప్రాప్తి, దశ. good * మంచిదశ. bad * గ్రహచారము,దుర్దశ. I wish you * నీకు భాగ్యము రావలెను.
Luckily adv అదృష్టవశముగా, దైవాధీనముగా. * for him వాడి మంచి అదృష్టమువల్ల.
Luckiness n s అదృష్టము, భాగ్యము.
Luckless adj దౌర్భాగ్యముగల, దురదృష్టమైన.
Luckpenny n s బోణి.
Lucky adj అదృష్టముగల, భాగ్యముగల, శుభమైన. a * man అదృష్టవంతుడు. in a * hour శుభముహూర్తములో. a * surgeon చెయివాసిగల వైద్యుడు.
Lucrative adj ఆదాయముగల, లాభప్రదమైన. a * appointmentనిండా దుడ్డువచ్చేపని.
Lucre n s దుడ్డు, రూక, యిది ధనమును గురించిన నిందమాట. filthy * పాపిష్ఠిరూక, పాపిష్ఠిదుడ్డు. Lucubration, n. s. essay or book of remarks విమర్శ, గ్రంథము.
Luculent adj విశదమైన, స్పష్టమైన.
Ludicrous adj పరిహాసాస్పదమైన, హాస్యకరమైన.
Ludicrously adv పరిహాసాస్పదముగా, నవ్వుల కెడముగా.
Ludicrousness n s పరిహాసాస్పదము, నవ్వులకెడము.
Lug n s (an ear) చెవి, యిది Scotch శబ్దము.
Luggage n s సామాను, మూటాముల్లె.
Lugubrious adj sorrowful యేడ్చే, పలవరించే, దుఃఖపడే. a * face యేడ్పుమూతి.
Lugubriously adv sorrowfully లబలబ, భోరుమని.
Lukewarm adj గోరువెచ్చగా వుండే, నులివెచ్చగా వుండే, యిబ్బందియైన, అటుకాని యిటుకాని, అశ్రద్ధగల. he is a * friend నమ్మరాని స్నేహితుడు.
Lukewarmly adv నులివెచ్చగా, అశ్రద్ధగా.
Lukewarmness n s నులివెచ్చన, అశ్రద్ధ.
Lull n s ఉశమనము, శాంతి. there was a short * towards morning తెల్లవారికొంచెముసేపు గాలి అణిగి వుండినది.
Lullaby n s జోలలు, జోలపాటలు.
Lumbago n s నడుమునొప్పి, చెడ్డవాయువు.
Lumber n s పనికిమాలిన సామాను. live * పనికిమాలినగొడ్లు. learned *పిచ్చిగ్రంథము, వెర్రిపాండిత్యము, వొట్టివాగ్జాలము.
Lumbered adj పనికిమాలిన సామానులుగల.
Lumbering adj cumbersome జంజాటముగా వుండే, అసాధ్యమైన బళువుగా వుండే.a * noise as that of knocking violently at a door తలుపును దబదబ తట్టే, తల చీదరరైన ధ్వని.
Luminary n s జ్యోతి, తేజస్సు. the luminaries of heaven సూర్యచంద్రనక్షత్రాదులు.Johnson was a great * జాన్ సన్ జ్ఙానదీపముగా వుండెను.
Luminous adj ప్రకాశించే, దేదీప్యమానమైన. a * description. అతిస్పష్టమైన వర్ణనము.
Luminously adv ప్రకాశముగా, విశదముగా.
Lump n s మొద్దు, ముద్ద, గడ్డ. or piece తునక, పెళ్ళ. he brought the property in the * దాన్ని మొత్తముగా కొనుక్కొన్నాడు. a * of tamarinds చింతపండువుంట, చింతపండు అడ.
Lumping, Lumpish adj మొద్దుగా వుండే, మూర్ఖమైన, పెడసరమైన.
Lumpy adj గడ్డలు గడ్డలుగా వుండే, ముద్దలు ముద్దలుగా వుండే.
Lum-sugar n s ఖండశర్కర.
Lunacy n s పిచ్చి, వెర్రి, చలచిత్తము.
Lunar, Lunary adj చంద్రసంబంధమైన, చాంద్రమాన. a lunar month చాంద్రమానప్రకారముగా వుండే నెల. * rainbow చంద్రపరివేషము. Lunated, adj. అర్ధచంద్రకారముగా వుండే.
Lunatic n s వెర్రివాడు, చలచిత్తము గలవాడు.
Lunation n s తిథుల ప్రకారము వచ్చే మాసము, అనగా శుక్ల అష్టమికి వౌక మాసము.
Lunch n s తునక. a * of bread రొట్టె ముక్క.
Lunch, lansh n s. (the act of puting a ship out of the dock, and launching herinto the water) వాడను నీళ్ళల్లోకి తొయ్యడము. I was present at the * వాడను నీళ్ళలోవిడిచేటప్పుడు నేను వుంటిని. a particular kind of long boat ఒక విధమైన పెద్దపడవ.
Luncheon n s ఫలాహారము, నాస్తా.
Lund n s స్తుతి స్తోత్రము To Laud, v. a. స్తుతించుట, స్తోత్రముచేసుట.
Lunes n s (vagaries) పిచ్చికళలు, వెర్రికళలు.
Lunette n s కోటతో చేరిన చంద్రాకారముగా వుండే వొక విధమైన కట్టడము.
Lung n s See Lungs.
Lunge n s కత్తిపోటు. he made a * at me నన్ను కత్తితో పొడిచినాడు.
Lungotee n s (A Canarese word) గోచి, కౌపీనము.
Lungs n s శ్వాసకోశము, వూపిరితిత్తి, ప్రాణస్థానము. what * thatchild has !ఆ బిడ్డది యేమి రాకాసిగొంతు. Pray spare your * అరవవద్దు, తిన్నగా మాట్లాడండి. hehas weak *s బిగ్గర మాట్లాడలేడు, బిగ్గర చదవలేడు. he has good or storing *s వాడిదిపెద్దగొంతు. his * are diseased వూపిరితిత్తికి రోగము తగిలినది, అనగా వూపిరి కంపుకొట్టుతున్నది.
Lupiness n s వొకవిధమైన కూరాకు, వొకవిధమైన పుష్పము.
Lurch n s వొరగడము, దిక్కుమాలిన స్థితి. the ship gave * ఆ వాడ పొర్లి పోయినది. he left them in the * వాండ్లను నిరాదరువుగా విడిచిపెట్టినాడు. I am left in the * దిక్కులేక అల్లాడుతాను.
Lurcher n s నక్కేదౌంగ, పొంచువేసుకొని వుండే దొంగ, యిది వొకవిధమైన కుక్కకుపేరైనది.
Lure v a డేగ రావడానకై చూపే మాంసము, తీపి, లంచము.
Lurid adj dismal, gloomy, ఘోరమైన, మందారముగా వుండే.
Lurking adj నక్కే, పొంచువేసే. a * place పొంచు వేసుకొని వుండే స్థలము, మాటు. a *disease నచ్చురోగము.
Luscious adj అతిమాధుర్యమైన, తీపైనందున ముఖముకొట్టే.
Lusciousness n s అతిమాధుర్యము, తీపైనందున ముఖము కొట్టడము.
Lush adj కోమలమైన.
Lust n s కామము,వ్యామోహము, అత్యాశ, దురాశ. the * of the flesh గుహ్యచాపల్యము, జిహ్వాచాపల్యము. the * of the eyes దృష్టిచాపల్యము. the * of avarice ధనేషణము, దుడ్డు మీది కాంక్ష. given up to his *s పంచేంద్రియబుద్ధుడై. In I. John II. 17.సుఖాభిలాష. A+.లోభః C+. Rom. VII.7.కామః C+. but A+ omits it.
Lustful adj కామాతురముగల, వ్యామోహముగల, దుర్భ్రాంతిగల.
Lustfully adv కామాతురముగా, వ్యామోహముగా, దుర్భాంతిగా.
Lustily adv బిగ్గర, ఘట్టిగా, గొంతెత్తి. the child roared * ఆ బిడ్డ భోరుమనిఅరిచినది.
Lustiness n s పుష్టి, స్థూలత.
Lustral adj ప్రోక్షించే. * water ప్రోక్షించే నీళ్లు, ప్రోక్షణ జలము.
Lustration n s ప్రోక్షించడము, ప్రోక్షణము.
Lustre n s ప్రకాశము, వెలుగు. or chandelier (the English word లస్తరు is used.)
Lustring n s నిగనిగలాడే వొకవిధమైన పట్టు.
Lustrous adj ప్రకాశమానమైన.
Lusty adj పుష్టిగా వుండే బలిసిన.
Lusus Nature వింతైనరూపముగలజంతువు,వృక్షముమొదలైనద
Lutanist n s వీణె పాఠకుడు.
Lute n s వీణ. earth * or luting చీలమన్ను, అనగా రెండుతునకలుగా వుండేవస్తువును కుంపట్లో గాని కొలిమిలోగాని వేసి అతకవలసినప్పుడు కంసాలవాండ్లుఆ రెంటిని చేర్చి దాన్ని పైన కట్టే మన్ను.
Luted p|| చీలమన్నుచేశిన
Lutestring n s నిగనిగలాడే వొక విధమైన పట్టు.
Luxation n s కీళ్లు వదిలిపోవడము, చీలలు వీడిపోవడము.
Luxuriancy n s పెంపు, వృద్ధి, అభివృద్ధి, విజృంభణము. when she was in the * of her beauty దాని సౌందర్యము విజృంభించి వున్నప్పుడు. from the * of the crop you see the richness of the soil ఆ పయిరు యొక్క పెంపుచేత నేలయొక్క సత్తువ తెలుస్తున్నది. * of style వాక్పటుత్వము.
Luxuriant adj పెంపుగా, విజృంభించి, విస్తారముగా.
Luxurince n s పెంపు, వృద్ధి, అభివృద్ధి, విజృంభణము. when she was in the * of her beauty దాని సౌందర్యము విజృంభించి వున్నప్పుడు. from the * of the crop you see the richness of the soil ఆ పయిరు యొక్క పెంపుచేత నేలయొక్క సత్తువ తెలుస్తున్నది. * of style వాక్పటుత్వము.
Luxurious adj భోగియైన, జంభమైన, వేడుకైన, శృంగారమైన, సుకుమారమైన.or loving ease సుఖవాసిగా వుండే, సుఖప్రాణిగా వుండే. or delicious to the tasteరుచియైన, భోగ్యమైన. a*man ఉల్లాసపురుషుడు, కాముకుడు, విశేషభోగి. a * dinner సుభోజనము, మృష్టాన్నము. * picture వినోదమైన బొమ్మలు. the peacock has a * tread ఆ నెమలి వినోదముగా నడుస్తున్నది. a cat is * పిల్లి సుఖవాసిగా వుండే జంతువు. a * dispositionసుఖవాసిగా వుండే గుణము. a * or amorous poem శృంగార కావ్యము. a * couch జంభమైన పరుపు. a * house జంభమైన యిల్లు. the higher Telugu poems abound in *etteminacy తెలుగు మహాకావ్యములలో శృంగారరసము మెండు.
Luxuriously adv భోగముగా, జంభముగా, విభవముగా. she was lying * on the bed అది పడకలో వుల్లాసముగా పండుకొని వుండినది. the people were * fed వాండ్లుమృష్టాన్నముగా భోజనము చేసినారు. they live * వాండ్లు భోగముగా వున్నారు.
Luxuriousness n s కాముకత్వము, సుఖేచ్ఛ, సుఖములుకోరే గుణము,శృంగార భావము, జంభము. he reproached them for thier * వారి కాముకత్వమును గురించి దూషించినాడు.
Lyar SeeLiar
Lye n s కారపునీళ్లు, మూత్రము. See Lie.
Lying adj and n. s. అబద్ధమాడే, అబద్ధమాడడము. he was addicted to * వాడుఅబద్ధాలకు ఆకరము. this punishment cured him of * యీ శిక్షచేత వాడు అబద్ధాలాడడము విడిచినది. See To Lie.
Lymph n s రసిక. Vaccine lymph టీకాపొడిచేపాలు, అమ్మవారు పొడిచేపాలు.
Lynx n s శివంగి, తీక్ష్ణిదృష్టిగల వొకవిధమైన పులి, చిరుతపులి అనవచ్చును, పెద్దఅడివిపిల్లి.
Lyre n s వీణ.
Lyric, Lyrical adj వీణాసంబంధమైన * poetry గాన రూపముగా వుండే కావ్యము.
Lyrist n s వీణా పాఠకుడు, గానరూపమైన కావ్యములు చేసేవాడు.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

9 comments:

  1. Every weekend i used to go to see this website, as i want
    enjoyment, for the reason that this this web page conations in fact nice funny information
    too.

    Also visit my website Sac A Main Louis Vuitton

    ReplyDelete
  2. Hey There. I found your blog using msn. This is a very well written article.
    I will be sure to bookmark it and come back to read more of your useful
    info. Thanks for the post. I will definitely return.

    Review my web page Louis Vuitton Pas Cher

    ReplyDelete
  3. Thanks to my father who shared with me about this blog, this blog is in fact remarkable.


    my weblog: Louis Vuitton Handbags

    ReplyDelete
  4. I’m not that much of a online reader to be honest but your blogs really nice, keep it up!
    I'll go ahead and bookmark your website to come back down the road. Cheers

    My homepage :: more

    ReplyDelete
  5. Thank you for sharing your info. I truly appreciate your efforts and I am waiting for your next write ups thank you once again.


    Feel free to surf to my website :: Tory Burch Handbags

    ReplyDelete
  6. You can definitely see your enthusiasm within the work you write.
    The world hopes for more passionate writers such as you
    who aren't afraid to mention how they believe. At all times follow your heart.

    Stop by my blog: Louis Vuitton Outlet

    ReplyDelete
  7. I do accept as true with all the concepts you've presented for your post. They're very convincing
    and can definitely work. Still, the posts are very brief for starters.
    May just you please prolong them a little from next time?
    Thanks for the post.

    my webpage - NFL Cheap Jerseys

    ReplyDelete
  8. Have you ever thought about creating an ebook or guest authoring on other sites?

    I have a blog centered on the same subjects you discuss and would love to have you
    share some stories/information. I know my subscribers would appreciate your work.
    If you're even remotely interested, feel free to send me an e mail.

    Also visit my web blog - Nike Pas Cher ()

    ReplyDelete
  9. I was wondering if you ever considered changing the page layout of your blog?
    Its very well written; I love what youve got to say. But maybe you could a little
    more in the way of content so people could connect with
    it better. Youve got an awful lot of text
    for only having 1 or two images. Maybe you could space it out better?


    My page - Christian Louboutin Outlet

    ReplyDelete