M English to Telugu free online dictionary

M 702Luxury n s విశేషభోగము, సుఖము, విభవము, అధికపోకిళ్లు, జంభము, వేడుక, శృంగారము. in diet విశేష భోజనము. the * of doing good పుణ్యము చేయడములోవుండే వుల్లాసము. * is inconsistent with holiness విషయేచ్ఛకున్నుపావనత్వమునకున్ను అత్యంత విరుద్ధము. a plain cup is a necessary buta golden cup is a * సాదా గిన్నె అగత్యము బంగారు గిన్నె అయితే విశేషము. * is the cause of the disease రోగమునకు కారణము అతి. the poor cannot affordluxuries బీదలు జంభములను నిభాయించలేరు పేదలకు అధిక పోకిళ్లు యెట్లా జరుగును. the thirsty think cold water a * గతి లేని అమ్మకు గంజే పానకము.he covered tthe table with fruit and other cheap luxuries పండ్లనున్న వెలసులభమైన నటువంటిన్ని చూపుకు జంభముగా వుండె పదార్థములనున్నువడ్డించినాడు. the luxries of the season అప్పట్లో చిక్కే విశేషమైన పదమునకున్నునామ వాచక పదమునకున్ను కొనను వస్తున్నది, యేలా గంటే. Bold ధైర్యముగల.Boldly ధైర్యముగా. Beast పశువు. Beastly పశుప్రాయమైన.
M Abbrevation. A.M 1000 or Anno Mundi one thousand ప్రపంచము పుట్టిన వెయ్యోసంవత్సరము. M. A. or Master of Arts శాస్త్రివంటి వొకపట్టము. M. or Monsieur ప్రెంచిభాషలో దొరగారు, యేలాగంటే, M. Lally లల్లీ దొరగారు, యిందుకుబహువచనము M.M. యేలాగంటే M. M. Bussy and Lally అనగా బూసీ,లల్లీ దొరలు. M. D. or Doctor of Medicine వైద్యుడు. M. P. or Member of Parliament పార్లెమెంటు మెంబరు. A. M. or Ante Meridiem మధ్యాహ్నాత్పరము. P. M. G. or Post Master GEneral తపాలుకు సర్వయజమానుడు, అంచెల సర్వాధికారి.
M. D. (Initials of "Medicine Dotor")వైద్యుడు
Ma'am, mam n s. (a contraction of Madam) అమ్మా.
Macaroni n s తేనెతొలలు. or buffoon హాస్యగాడు.
Macaroon n s వౌకవిధమైన మిఠాయి.
Macau, Maccau n s. వొకవిధమైన, పంచవర్ణపు చిలక.
Mace n s సోటా. or silver stick వెండిబెత్తము. or club దుడ్డుకర్ర, బాణాకర్ర. or spice జాపత్రి.
Mace-bearer n s వెండిబెత్తపువాడు.
Maceration n s కృశింపచేయడము, రుబ్బడము, నూరడము, నానవేయడము.
Machanic n s పనివాడు చేతిపనివాడు, శిల్పి, అనగా వడ్ల, కరమల, కంసల, కుమ్మర, కొల్లెత్తువాడు మొదలైనపనివాండ్లు.
Machiavel n s వొకమనిషి నామము, ఆయన అతిచమత్కారుడు. to play the * చమత్కరించుట. Machiavelianism కాపట్యము, కుయుక్తి, చమత్కారము.
Machination n s తంత్రము, పంపకము, ఉపాయము.
Machine n s యంత్రము, ఉపకరణము. a loom is a * for weaving cloth మగ్గము బట్టలు నేసే యంత్రము. a pump is a * for raising water యేతాము నీళ్లుచల్లే యంత్రము.
Machinery n s యంత్రము, తంత్రము. the * of this clock is injured యీ గడియారము లోపలవుండే యంత్రము చెడిపోయినది. Poetical * కావ్యచాతుర్యము, కావ్యచమత్కారము.
Mackaw n s రామచిలుక పంచవర్ణపు చిలక.
Mackerel n s సముద్రపు మత్స్య విశేషము.
Mad adj వెర్రి, పిచ్చి. he went to * or ran * వాడికి వెర్రిపట్టినది. a * dog వెర్రికుక్క. * brained దుస్సాహసముగల.
Madam n s అమ్మా in scolding ఒసే.
Madcap n s దుస్సాహసి, వెర్రిమనిషి యిది యెగతాళిగా అనేమాట.
Madder n s a plant which is much used, in dying redమంజిష్ఠ.
Made the p|| of Make చేసిన, a * dish కలవంటకము, అనగా వుప్పు పులుసు కారము వేసిన అన్నము లేక, కూర, a * up story కల్పించిన కథ.కట్టివిడిచిన కథ. a horse * of earth మృణ్మయమైన గుర్రము, మంటిగుర్రము. a jewel * of gems రత్నమయమైన నగ. If you have got that appointment you are * man నీకు ఆ వుద్యోగము దొరికివుంటే నీపని జయము. See to Make.
Madeira n s మదేరా అనే లంక. ఆ లంకలో నుంచి వచ్చే సారాయి.
Madhouse n s వెర్రివాండ్ల ఆస్పత్రి, చెరసాలవంటి వౌక యిల్లు.
Madly adv వెర్రిగా, పిచ్చిగా.
Madman n s వెర్రివాడు, ఉన్మత్తుడు.
Madness n s వెర్రితనము, పిచ్చితనము, ఉన్మాదము.
Madonna n s మేరీ, మేరీ యొక్క విగ్రహము, కర్తయైన ఖ్రష్టుయొక్కతల్లి.
Madras n s చెన్నపట్టణము.
Madrigal n s నాయకీనాయక భావముగల పాట.
Magazine n s గిడ్డంగి, కొట్టు. of arms ఆయుధశాల. of gunpowderమందుగిడ్డంగి. of rice or grain గిడ్డంగి, కణజము. or book dividedinto numbers చిల్ల ప్రబంధము, నెలనెలకు లేక, సంకేతము చేసుకొన్న కాలములో పుట్టేనానా విషయములుగల చిన్న చిన్న పుస్తకములు.
Maggot n s క్రిమి, పురుగు. or caprice పిచ్చిభ్రమ, పిచ్చితలంపు. John Wesley's father printed a volume of poems which he named Maggots.
Maggotty adj పురుగులుపట్టిన. or whimsical పిచ్చిభ్రమలుగల.
Magi n s మునీశ్వరులు, మునులు.
Magic n s ఇంద్రజాలము, మాయ, మంత్రశాస్త్రము. or conjuring గారడివిద్య. by some * he suspected them హఠాత్తుగా వాడికి వాండ్ల మీద వొక అనుమానము తట్టినది.
Magically adv విపరీతముగా.
Magician n s మాంత్రికుడు, మంత్రగాడు, శూన్యగాడు.
Magic-lantern n s An optical instrument which, by means of a lamp and of small figures painted on glass, exhibits in a dark room, images of objects magnified on the wall వింతలాందరు, వొకసాధనవిశేషము, దీనికి వొకతట్టు దీపమునున్ను వొకతట్టు చిన్న చిన్న బ్రతిమలు వ్రాసిన అద్దపు పెంకుమన్ను పెట్టి చీకటి గదిలో గోడమీద చూస్తే గోరంతగా వుండేది కొండంతగా తెలుస్తున్నది.
Magisterial adj అహంకారముగల, గర్వించిన, దాష్టీకముగల.
Magisterially adv అహంకారముగా, గర్వముగా, దాష్టీకముగా.
Magistracy n s పోలీసువిచారణ, పోలీసుఅధికారము, పోలీసుదొరలు.
Magistrate n s పోలీసుదొర.
Magna-charta n s మహాచట్టము, అనగా సీమలోపుట్టే చట్టములకన్నిటికి మూలాధారమైన చట్టము, యిదిఆర్నూరు యేండ్లకు మునుపు పుట్టినది.
Magnainmously adv ధైర్యముగా, శౌర్యముగా, పెద్దమనిషితనముగా, సజ్జనత్వముగా.
Magnanimity n s ధైర్యము, వీరత్వము, సాహసము, పెద్దమనిషితనము,సజ్జనత్వము.
Magnanimous adj ధైర్యముగల, శౌర్యముగల, పెద్దమనిషియైన, సజ్జనుడైన.
Magnates n s (Latin) ప్రభువులు, పెద్దలు.
Magnesia n s కొంచెముగా బేది అయ్యే వొక విధమైనమందు, యిది మృద్విశేషము.
Magnet n s సూదంటురాయి, కాంతరాయి.
Magnetic, Magnetical adj సూదంటురాయి గుణముగల, ఆకర్షకమైన. the * power of the loadstone సూదంటురాయిలో వుండే ఆకర్షకశక్తి.animal * జ్ఞాననిద్ర, మంత్రముచేత రప్పించిన నిద్ర, దేహమును కోశినప్పటికిన్ని తెలియకుండా వుండేటట్టు కొన్ని క్రియలచేత వొకడికి గాఢనిద్ర రప్పించే శాస్త్రము.
Magnificence n s జంభము, డంభము, పటాటోపము. from the * ofthe building ఆ యిల్లు అతిఘనమైనది గనుక.
Magnificent adj దివ్యమైన, ఘనమైన, డంభమైన.
Magnificently adv దివ్యముగా, ఘనముగా, డంభముగా.
Magnifick adj మహనీయమైన.
Magnifico n s మహారాజు, భాఘ్యవంతుడు.
Magnified adj or honoured పూజ్యమైన. See To Magnify. The tiger trap is a * rat trap పెద్దదిగా వుండే యెలుక బోనే పులిబోను అనగా యెలుకబోను పులిబోను ఒకటేగాని యిది చిన్నది అది పెద్దది.
Magnifier n s భూతఅద్దము. See To Magnify.
Magnitude n s గొప్పతనము, స్థూలత్వము. from the * of the task పని బ్రహ్మాండమైనది గనుక.
Magnolia n s వొక చెట్టు పేరు. Of this the చంపక వృక్షముis one species.
Magpie n s వూరికెవదిరే వొక పక్షి. or talker వదురుబోతు. the Indian * గోకరాయి అనే పక్షి. See Madras Journal XI. p. 19. No. 159. The true English Magpie is not found in India. Craufurd's Siam, p. 261.
Mahogany n s మాగనిమాను, దీన్ని అతలషుమాననిన్ని అంటారు, యిది నిండా వెల పొడుగైనది.
Mahomedan, Mahometan n s. and adj. తురకవాడు, తురకసాహెబు. * law తురక ధర్మశాస్త్రము. a woman తురకది.
Mahratta n s మరాటివాడు. the * country మరాటి దేశము. he reads * మహారాష్ట్రము చదువుతాడు. the character or alphabet of this language is called మోడి.
Maid n s (a sort of fish) టేకిచేప.
Maiden n s కన్య, కన్యపడుచు. or woman servant పనికత్తె, బానిసె.
Maidenhead n s కన్నెరికము.
Maidenly adj అణుకువగల, అమరికగల.
Maidmarian n s హాస్యగాడు.
Maidservant n s పనికత్తె, బోనకత్తె, బానిసె.
Mail n s (armour) కవచము, జీరా. of the post తపాలుకట్ట,తపాలు జాబులు వేసే తోలు ససంచి. or coach తపాలుర్ జాబులు తీసుకొనిపొయ్యే బండి.
Mailed adj కవచము వేసుకొన్న, జీరాతోడుక్కొన్న.
Maim n s కుంటు, మొండి, వూనము, భిన్నము. or defect లోపము, తక్కువ, వెలితి.
Main n s ముఖ్యాంశము, ముఖ్యభాగము. or the ocean సుముద్రము. we left the land and went into the * మెట్టను విడిచి సముద్రములోకిపోయినాము. the * of the people వాండ్లలో బహుమంది. by might and * యావచ్ఛక్తితో, యావద్బలముతో. a * in gambling పందెము. Seven's the main! పగడసాలలో వచ్చే వొకమాట.
Maina n s (H. a sort of bird) గోరింక.
Mainifest adj స్పష్టమైన, విశదమైన, తేటైన.
Mainland n s భూమి, ద్వీపము. this island lies within fifty miles of the * ఈ లంక భూమికి యాభై గడియల దూరమునకు లోగా వున్నది.
Mainly adv ముఖ్యముగా, బహుశః.
Mainmast n s వాడ నడిమి స్తంభము.
Mainprize n s జామీను, పూట.
mainsail n s వాడ నడిమి స్తంభము యొక్క అడుగునకట్టే పెద్దచాప.
Mainstay n s వాడ స్తంభానికి యెదట బిగించికట్టే తాడు. Metaphorically,a reliance ముఖ్యమైన ఆధారము.
Mainstreet n s రాజవీధి, ఘంటాపథము.
maintainable adj సాధించతగ్గ. this story is not * ఈ మాట రూడిపరచగూడనిద.
Maintainer n s సంరక్షకుడు, పోషకుడు.
Maintenance n s సంరక్షణ, పోషణ, జీవనము. this income is sufficient for my * యీ వచ్చుబడి నా జీవనమునకు చాలును.
Maintop n s వాడ నడిమి స్తంభము మీది తొట్టి.
Mainyard n s వాడ నడిమి స్తంభపు మొదటి అడ్డకర్ర.
Maize n s మొక్కజొన్న.
Majestic adj (add,) The bull has a * gait ఆ యెద్దుగంభీరముగా నడుస్తున్నది.
Majestic, Majestican adj దివ్యమైన, గంభీరమైన, గౌరవమైన, మహత్తైన, ఘనమైన, శ్రీమత్.
Majestically adv గంభీరముగా, దివ్యముగా.
majesty n s మహత్వము, ప్రభావము, ఘనత. His * రాజుగారు, యేలినవారు. Her * రానిగారు, అమ్మగారు. Their Majesties రాజుగారున్ను రాణిగారున్ను. God bless your * తమ దొరతనము చల్లగా వుండవలెను.
Major adj ముఖ్యమైన, బహు, విస్తారమైన, శానా. the * part of the people వాండ్లలో శానామంది.
Majority n s బాహుళ్యము, బహుమంది, శానామంది, అనేకులు. the * of them are Musulmans వారిలో తురకలు విస్తారము. the * of the judges were in his favour; the minority were against him ఆ జడ్జీలలో శానామంది వాడి పక్షముగానున్ను కొద్దిమంది వాడికి విరుద్ధముగానున్ను వుండిరి. when he reached his * వాడికి వయస్సు వచ్చినప్పుడు, వాడికి వ్యవహారదశ వచ్చినప్పుడు. or rank of major మేజరు వుద్యోగము.
Make n s ఆకారము, స్వరూపము. his * resembles that of his brother వాడి అన్న వాడు వొకటే మచ్చుగా వున్నారు.
Makebate n s కలహగాడు, కలహములు పెట్టేవాడు, తంటాఖోరు.
Maker n s చేసేవాడు, సృష్టించేవాడు, సృష్టికర్త. Pot * కుమ్మరవాడు. Shoe * మాదిగవాడు. His * దేవుడు. this was an offence against your * యిది దేవుని యెడల నీవు చేసిన పాపము.
Makeweight n s పెరికె, కంట్లము మొదలైన వాటిని రెండు పక్కల బరువు సరిగ్గా వుండడానికై పెట్టే రాయిరప్ప మొదలైన బరువు.
Malabar n s Tamil language అరవము. the * coast కొచ్చిన్ రేవు.
Mal-administration n s అవివేక ప్రభుత్వము, నీతిలేని దొరతనము.
Malady n s రోగము, నలి, వికారము.
Malapert adj తలకొవ్విన, తుంట.
Malaria n s విషయగాలి. Davy in his account of the Ionian Islands (2. 241) says A certain something, an agent in the atmosphere causing fevers విషకళ, జ్వరకళ, విషవాయువు.
Malcontent n s రాజుమీద అసహ్యముగా వుండేవాడు, రాజుమీద గిట్టక వుండేవాడు, రాజద్రోహి.
Male n s మొగది. the males and females మొగవాండ్లు ఆడువాండ్లు,మొగవి ఆడువి.
Malecontent n s See Malconent.
Malediction n s శాపము, తిట్లు.
Malefactor n s కైది, నేరస్థుడు, ఖూనిచేసినవాడు, దొంగ.
Malevolence n s పగ, ద్వేషము, వైరము.
Malevolent adj పగపట్టిన, ద్వేషముగల, వైరముగల.
Malfesance n s (French) దుర్మార్గము.
Malformation n s వికారము, కురూపము.
Malice n s అసూయ, వోర్చలేమి, కడుపుమంట, కార్పణ్యము. Or slight roguery పిత్తలాటము. through * against me నా మీది కడుపు మంటచేత. he did this through * prepense దీన్ని చలపట్టి కావలెనని చేసినాడు.
Malicious adj పగపట్టిన, ద్వేషముగల, కార్పణ్యముగల. or roguishచమత్కారమైన.
Maliciously adv ద్వేషముగా, కార్పణ్యముగా. roguishly చమత్కారముగా.
Malign adj దుష్ట, క్రూరమైన.
Malignancy n s వైషమ్యము, క్రౌర్యము, దోషము, విషము.
Malignant n s a rebel దోషకారి, ద్రోహి. in creed See Heretic.
Malignantly adv క్రౌర్యముగా, చలపాదిగా.
Malignity n s vileness, badness, cruelty క్రౌర్యము, ద్వేషము,చలపాదితనము.
Malingerer n s (a soldier who makes excuses of sickness) బూటకాలామారి, వొళ్లు కుదురులేదని సాకుచెప్పి వుద్యోగానికి రాకుండా నిల్చిన సోజరు, సిఫాయి.
Mall n s or a mallet, కొయ్యగూటము. or place మైదానము, బయిలు.
Mallard n s అడివి బాతు.
Malleability n s నయము, సాగేగుణము. See Malleab'e
Malleable adj నయముగల, సాగే. Iron is * but bell metal is not ఇనుములో నయముకద్దు కంచులోలేదు, ఇనుము సాగేటిది కంచు సాగనిది.
Mallet n s కొయ్యగూటము, కౌయ్య సుత్తె.
Mallows n s బెల్ల పాకు చెట్లు, తుత్తిరి చెట్టుకు సమానమైనట్టు.marsh * తుత్తిచెట్టు నూగుబెండ [ఖంగుణి. Reeve.]
Malmsey n s వొకవిధమైన వైను సారాయి.
Malpractice n s దుర్మార్గము, దుష్ప్రవర్తన.
Malt n s ఉప్పుడు బార్లీబియ్యము. malted rice వుప్పుడుబియ్యము. Malt is also a cant pharase for "Malt-liquor" that is, Beer or Ale.
Maltster n s బార్లీబియ్యమును నానబోసి యెండబెట్టి పక్వము చేసేవాడు.
Malversation n s ఛపావణి, సర్కారు ద్రవ్యమును అపహరించడము, మోసము,ద్రోహము.
Malwa n s (name of a country) మాళవదేశము.
Mama,Mamma n s. అమ్మా, తల్లి.
Mammon n s మమోన, ఐశ్వర్యాధి దేవత, ధనపిశాచము, ధనము, పాపిష్ఠిధనము. a slave to * ఐహికబద్ధుడు, రూకలమీద ప్రాణము విడిచేవాడు. the * of unrighteousness అన్యాయార్జిత విత్తము.
Mammoth n s పూర్వయుగమందు వుండిన వొక జంతువు, యిది యేనుగకు అరింతలు పెద్దది, దీన్ని శరభము అనవచ్చును.
Man n s మనిషి, మగవాడు. not a child పెద్దవాడు. a * servantపనివాడు. that * అతడు, వాడు. this * యితడు, వీడు. a * came here వొకడు వచ్చినాడు. no * went there యెవ్వరు పోలేదు. all men అంతమంది,అందరు how many men? యెంతమంది, యెందరు. half those men సగంమంది. a * of that town ఆవూరివాడు. * has reason మనుష్యులకు వివేకముకద్దు. * and wife దంపతులు, ఆలుమగడు. men and women స్త్రీలుపురుషులు,మగవాండ్లు ఆడవాండ్లు. eversince I was a * నాకు బుద్ధి తెలిసినది మొదలు. we had ten men killed మాలో పదిమంది సోజర్లు, లేక, సిఫాయీలు చచ్చినారు. a * of letters or learning విద్వాంసుడు, పండితుడు. he is a made * వాడిపని కుదటపడ్డది, వాడికి యికను చింతలేదు. the outward * శరీరము, కళేబరము. the inner * ఆత్మ, జీవుడు, a wise * బుద్ధిమంతుడు.తెలిసిన వాడు. a sick * రోగి. a wicked * దుర్మార్గుడు, దుష్టుడు. a * ofthe world వివేకి, చమత్కారి. or a sinner సంసృతిబుద్ధుడు. a * at arms ఆయుధపాణి, శూరుడు, బంటు, యిది ప్రాచీనప్రయోగము. a * of war పెద్ద పిరంగుల వాడ, యుద్ధ వాడ, ప్రాచీన గ్రంథములందు, వీరుడు, శూరుడు, అని అర్థమున్ను కద్దు. India * యిండియాకు పొయ్యే వాడ. Guinea * గినీ దేశమునకు పొయ్యే వాడు. my brother's * (i. e. servant) నా తమ్ముని పని వాడు, నౌకరు. As contrasted in Job IV. 17, "Enosh" mortal * నరుడు, and "a *" geber పరుషుడు. In Gen. II. 25. adam, A+. * మనిషి. to a *they left him అందరు విడిచిరి. they entered the town to a * మనిషికిమనిషి. at drafts or chess ఆటలో కాయ. go along *! పోరా. a * midwife మంత్రసాని పనిచేసే వైద్యుడు. come my * ! రావోయి. tell me my good * చెప్పవోయి తమ్ముడా.
Manacles n s చేతిసంకెళ్లు.
Manageable adj సాధ్యమైన, నిభాయించకూడిన, అణిగిన. this horse is not * అది అసాధ్యమైన గుర్రము, అణగని గుర్రము.
Managed adj నిర్వహించబడ్డ, సాధ్యమైన.
Management n s నిర్వాహకము, విచారణ. he used some * in speaking to them వాండ్లతో కొంచెము యుక్తిగా మాట్లాడినాడు.
Manager n s నిర్వాహకుడు, ప్రవర్తకుడు. q. v. విచారణకర్త, దక్షుడు. a good * పోడిమిగా కాపురము చేసేవాడు. of a playhouse ఆట ఆడేవాండ్ల పెద్ద. the * of an office కచ్చేరిలో పెద్ద వుద్యోగస్థుడు.
Manauvre n s యుక్తి, చమత్కారము, ఉపాయము, యెత్తుకడ, సేనావిన్యాసము. he made three or four *s ఆ దండును మూడు నాలుగు వ్యూహములుగా పన్నినాడు, విధములుగా నిలిపినాడు.
Manauvring n s యుక్తి, చమత్కారము, ఉపాయము, సేనావిన్యాసము. the art of * కవాయితు.
Manchet n s చిన్నరొట్టె, ఇది ప్రాచీన శబ్ధము.
Mandamus n s వొకవిధమైన వారంటు.
Mandarin n s అధికారి, యిదిచైనా భాష. This is the Portugeze word: they call themselves by the name Quan. (Asiatic Ann. Reg. 1801. Tracts, p. 63.)
Mandate n s ఆజ్ఞ, శాసనము.
Mandible n s దవడ.
Mandrake n s వొకవిధమైన చెట్టు. See Ainslie Vol. l. p. 207.
Mane n s జాలు వెంట్రుకలు, గుర్రము మొదలైన వాటి మెడ మీది వెంట్రుకలు. a lion's * సింహము యొక్క మెడమీది కేసరములు. themaned billows కేసరములుగల అలలు, అనగా ఉల్లోలకల్లోలములుగా వుండేఅలలు.
Manege n s అశ్వసిక్ష.
Manes n s (pronounced may-nees) plu. ప్రేతము, భూతము, చచ్చినవాడి జీవము, యిది నిత్య బహువచనము. the sacrifice made to the * దినవారాలు.
Manful adj ధైర్యముగల, ధీరుడైన.
Mangalore n s కబ్డాల్బందరు.
Mange n s గజ్జి, తీట, యిది గుర్రాలకు, ముఖ్యముగా కుక్కలకు వచ్చేటిది.
Mangel-wurzel n s వొకవిధమైనగడ్డ. See Beet.
Manger n s తొట్టి, గాడి. a dog in the * తొట్టిలో పండుకొన్న కుక్క, అనగా తనకున్ను అనుభవము లేదు, పరులనున్ను అనుభవించనియ్యదు. Mangey, adj. గజ్జిపట్టిన, తీటపట్టిన. To Mangle, v. a. ఛిన్నాభిన్నముచేసుట, కత్తికింత కండగా కోసట. he *ed my letter నేను వ్రాసిన జాబును తలాతోక లేకుండా దిద్ది చెరిపినాడు. to * linen వొక విధమైన యిస్త్రి చేసుట.
Mangled adj ఛిన్నాభిన్నమైన. * clothes యిస్త్రి చేసిన బట్టలు.
Mango n s మామిడిపండు. a * tree మామిడిచెట్టు. the * fish గంగలో వుండే వొక విధమైన యెర్ర మాగచేపలు, యివి మామిడిపండ్ల కాలములో వచ్చేటివి.
Mangrove n s రావిచెట్టువంటి వొకచెట్టు.
Mangy adj గజ్జిపట్టిన, తీటపట్టిన.
Manhood n s or human nature మనుష్యత్వము, మనుష్యస్వభావము. or virility పుంస్త్వము, మగతనము. or not childhood యౌవనము, వ్యవహార దశ. or courage ధైర్యము, పరాక్రమము. when he reached* వాడికి వ్యవహారదశ వచ్చిన తరువాత.
Mania n s వెర్రి, పిచ్చి, చలచిత్తము. the railway * బాటలు చక్కచేయవలెననే బలుపు, పిచ్చి. the Rose * రోజాపూలను గురించి వుండే పిచ్చి, సీమ పన్నీరు పూలమీద ప్రాణము విడవడము.
Maniac n s వెర్రివాడు, చలచిత్తుడు.
Manifest n s వాడలో తెచ్చిన సరుకులకు వాడ వాడు యిచ్చేపట్టి.
Manifested adj బయలుపడ్డ, తెలియచేసిన స్పష్టమైన.
manifestiation n s ద్యోతనము, ప్రకాశము, ప్రకటన, అవతారము,లీల. after the * of his kindness అతని స్నేహము విశదమైన తరువాత.the * of Krishna కృష్ణలీల. she is a living * of all the virtuesఅమె ధర్మావతారముగా వున్నది. In 1 Cor. XII. 7. విశేషోవిశేషోగుణో A+.
Manifestly adj స్పష్టముగా, విశదముగా, తేటగా.
Manifesto n s ప్రకటన కాకతిము, ప్రసిద్ధ పత్రిక.
manifold adj పరిపరి విధమైన, వివిధమైన, నానావిధమైన. the * goodness of God దేవుడ చేసిన నానావిధమైన వుపకారములు.
Manikin n s పొట్టివాడు, మరుగుజ్జు.
Manipulation n s పిసకడము. Manjeet, n. s. (a drug) మంజిష్ఠ.
Mankind n s మనష్యులు, ప్రజలు, లోకులు. he was called the guardian of * జగద్గురువనబడ్డాడు. for the good of * లోకానికి వుపకారముగా వుండేటట్టు.
Manlines n s మగతనము, పౌరుషము, వీరత్వము, శూరత్వము, ధైర్యము.in this business he shewed much * యీ పనిలో వాడి మగతనము చూపినాడు.
Manly adj మగవాడికి తగిన, ధైర్యమైన, శౌర్యమైన.
Manna n s ఆహారవిశేషము, (మాన్నా. A+ or divine food దివ్యప్రసాదము. or gum ఔషధమునకు వుపయోగమయ్యే వొక విధమైన బంక the * of the bamboo వంశరోచన, వెదురుపప్పు, త్వక్క్షీర.the Madras Tariff merely says మేనా ఆకు. See Christian ObserverJuly 1820, p. 458.
Manner n s రీతి, తెరగు, విధము, మార్గము. in any * యేరీతినైనా,యెట్లాగైనా. in that * అట్లా అలాగున, ఆ రీతిగా, ఆ విధముగా. after what* యెలాగున, యెట్లా. according to the usual * వాడికె చొప్పున. he was taken in the * చెయ్యిపట్టుగా పట్టుకోపడ్డాడు. in the plural మర్యాద, మన్నన, సన్మానము, నడక, స్వభావము, గుణము. good *s మర్యాద,సన్మానము. bad *s అమర్యాద. she has her mother's *s తల్లినడితే దానికి వచ్చినది.
Mannerism n s అలవాటు, పిచ్చిమర్యాద.
Mannerist n s అలవాటు గలవాడు.
Mannerly adj మర్యాదస్థుడైన. a * person మర్యాదపరుడు.
Mannikin n s See Manikin.
Mannish adj మగరూపుగల, మోటుగా వుండే, మూర్ఖురాలైన, యిది ఆడదాన్ని గురించినమాట.
Manor n s భూస్వాస్థ్యము, భూస్థితి, నేల మిరాసి, యజమానత్వము. the lord of the * జమీందారుడు, మిరాసిదారుడు.
Manse n s దివ్యభవనము, గొప్ప యిల్లు, దివ్యమైన యిల్లు. the * house (in London) లండన్, దివ్యమైన యిల్లు, పట్టణపు పెద్దపోలీసుఅధికారి వుండే యిల్లు See Lord-Mayor.
Manslaughter n s అబుద్ధిపూర్వకముగా చేసిన ఖూని.
Manslayer n s మనిషిని చంపేవాడు, మనుష్యహంత, నరాకుంతకుడ. BRY.2. 97.
Mantel piece n s నిప్పుగూటిమిద్దె, పోయిగూటి మిద్దె, అనగా నిప్పుగూడు,పొయిగూడు, వీటి గడప మీద శృంగారముగా కొయ్యతోగాని రాతితోగాని కట్టిన చిన్నమిద్దె. he ought to write these words over his'* యీ మాటలనువాడి పొయిగూటి మిద్దెమిద వ్రాయవలసినది, అనగా సీమలో చలికోసరము యేవేళనిప్పుగూటి ముందర కూర్చుంటారు గనుక యీ మాటలను చూస్తూ వుమడడము వల్ల బాగాజ్ఞాపకము వుండునని భావము. See Fireplace and Chimneypiece.
Mantilla n s (Spanish word) ఉత్తరీయము భైరవాసము, పైపోర్వ,పైదుప్పటి, పచ్చడము.
Mantle n s (a man's *) ఉత్తరీయము, భైరవాసము, పై పోర్వ, పై దుప్పటి, పచ్చడము. a woman's * పయిట.
Mantle piece n s See Mantel piece.
Mantua n s See Mantle.
Mantuamaker n s దొరసానుల వుడుపుకుట్టే ఆడుది.
Manual n s చిన్న పుస్తకము, అనగా చేతిపుస్తకము. the lawyer's *ధర్మశాస్త్ర సంక్షేపము.
Manufactory n s పుట్టించే స్థలము, కార్ఖానా. a carpet * రత్నకంబళీలునేసే దొడ్డి. paper * కాకితాలదొడ్డి, కాకితాల పట్టెడ. an Indigo * నీలిదొడ్డి or నీలితొట్టి.
Manufacture n s పని, నేతపని, అల్లికపని. a cotton * గుడ్డ. a silk* పట్టువస్త్రము. a foreign * పరిదేశమందు వేసిన గుడ్డలు మొదలైనవి. a place for the * of gunpowder మందు గిడ్డంగి, అనగా తుపాకిమందుచేసే స్థలము.
Manufactured adj చేసిన, నేసిన, అల్లిన. * goods నేతసరుకు. * tobacco పదును చేసిన పొగాకు.
Manufacturer n s చేసేవాడు, నేసేవాడు, అల్లేవాడు.
Manufacturing town n s నేతపని జరిగేవూరు.
Manumission n s దాసత్వవిమోచనము, విడుదల, ఖులాసా.
Manure n s సత్తువ, యెరువు, పెంట. they use these leaves as * యీ
Manuscript n s వ్రాసినపుస్తకము, వ్రాసినది. a * copy of the Amara Cosa వ్రాసిన అమర పుస్తకము, అనగా అచ్చువేసినదికాదు. that book is still * ఆ పుస్తకము యింకా అచ్చువేయలేదు. (Vide Gibbon's Rome LXIV. 51).
Many adj అనేకమైన, బహు, శానా, చాలా. * birds అనేక పక్షులు. how *? యెన్ని,యెందరు. so * అన్ని, అందరు, యిన్ని, యిందరు. in * instances శానామాట్లు. twise as * రెండింతలు. * say so శానామంది అట్లా అంటారు. the *, or the world ప్రజలు,జనులు.
Many-coloured adj అనేక తలలుగల.
Manytimes adv అనేకమాట్లు.
Map n s పటము. * of the world భూగోళ పటము, అనగా భూమి, సముద్రము, నదులు, పర్రవతములు వ్రాసి వుండేటిది. a * of Madras చెన్నపట్టణమును వ్రాసివుండే పటము.
Maple n s వృక్షవిశేషము.
Maranatha n s శాపమందు ప్రయోగించేమాట.
Marasmus n s consumption, a disease క్షయరోగము.
Marauder n s దవుడుచేసివాడు, కొల్లబెట్టేవాడు, బందిపోటు చేసేవాడు.
Maravedi n s దుడ్డు, ఇది Spanish శబ్దము.
Marble n s శ్రేష్ఠమైన నల్లరాయి, చలువరాయి. statue made of white * తెల్లచలువ రాతితో చేసిన ప్రతిమ. a ball to play with గోలిగుండు.
Marbled adj చిత్రవిచిత్రమైన, నానావర్ణములుగల, పొడలుపొడలుగా వుండే. a * paper నానావర్ణములుగల కాకితము, పొడలు పొడలుగా వుండే కాకితము.
Marblehearted adj రాతిమనసుగల, కఠినమైన, క్రూరమైన.
Marcasite n s వొక విధమైన రాయి.
March n s or journey ప్రమాణము, కూచి. or grave walk వొయ్యారనడ, హొయలు నడ. a forced * హుటాహుటి ప్రయాణము. the town was then three *es off అప్పుడు ఆ పట్టణము మూడు మజిలీల దూరము వుండినది. or tune ప్రమాణమై పొయ్యేటప్పుడు వూదే రాగము. the dead * వొకడు దండులో వుండి చస్తే వాణ్ని స్మశానానికి తీసుక పొయ్యేటప్పడు వాయించే రాగము. the * of time or the * of events కాలగతి, కార్యవశము. the * of intellect విద్యాభివృద్ధి,జ్ఞానాభివృద్ధి. The Marches or border సరిహద్దు, పొలిమేర.
Marchpane n s వొకవిధమైన ఫలాహారము.
Mare n s అడుగుర్రము, మాదవాను, గోడిగె. a * in foal చూటిగుర్రము. thegrey * is the better horse పెండ్లాము చేతిలో తగులుకొని మిణకరిస్తాడు.Mare's nest కుందేటికొమ్ములు, శశశృరగము, గగన కుసమము, పరమానందయ కథలలోగుర్రపు గుడ్డు.
Marechioness n s దొరసాని, రాణి అనగా రాజుయొక్క భార్యను రాణి యన్నట్టు. Marquis యొక్క భార్య Marchioness.
Mareschal n s సేనాధిపతి
Margent n s తీరము, అంచు. or commentary, notes టీక, వ్యాఖ్యానము.
Margin n s అంచు, తీరము. or notes, commentary టీక, వ్యాఖ్యానము.the names are mentioned in the * ఆ పేళ్ళు యీ పక్కను అనగా యీ అంచున వ్రాసి యున్నవి.
Marginal adj అంచున వ్రాసిన, పక్కను వ్రాసిన. * notes అంచున వ్రాసిన సంగ్రహము,సంక్షేపము, టీక, వ్యాఖ్యానము.
Margosa n s వేపచెట్టు, నింబవృక్షము.
Margrave n s వొకవిధమైన జమీందారుడు.
Margravine n s దొరసాని. Margrave అనే జమీందారుడి యొక్క భార్య.
Marigold n s బంతిపువ్వు.
Marine n s వాడసిఫాయి, వాడిసోజరు.
Mariner n s వాడ వాడు సైలరు.
Marital adj మగని సంబంధమైన. * rights భర్తృధర్మములు.
Maritime adj సముద్రసంబంధమైన, సముద్రపు. * provinces సముద్రతీరమందు వుండే దేశములు.
Marjorum n s మరువమువలెగాని దవనమువలెగాని పరిమళించే వొకవిధమైన చెట్టు.
Mark n s గురుతు, ఆనవాలు, జాడ, మచ్చ. I made a * upon that దానిమిద గురుతు వేసినాను. the Hindus wear a * on their foreheadsహిందువులు ముఖములలో బొట్టు పెట్టుకొంటారు. they call the upright * ఊర్ధ్వపుండ్రము, తిరుమణి. the cross * being అడ్డబొట్టు. a birth * పుట్టుమచ్చ. he has a * upon his hand వాడి చేతిమీద మచ్చ వున్నది. for aiming at గురి, లక్ష్యము. he was a mere * for the bitter shafts of fortune దౌర్భాగ్యపరంపరలకు అస్పదమైనాడు. or a kind of coin వొకనాణ్యము, ఆ నాణ్యము యిప్పుడు చెల్లదు. Letters of Marque (i. e. Mark) వాడలమీదికి యిచ్చే వారంటు.
Marked adj గురుతుగల. this * with red దానికి యెర్రగురుతు వున్నది, యెర్రమచ్చ వున్నది. his conduct towards them was very * వాడు వాండ్ల పట్ల నడుచుకొన్నది మహావిశేషముగా వుండెను. there is a * difference between these two యీ రెంటికి పరిష్కారమైన భేదము వున్నది. a * contempt అత్యంత అలక్ష్యము. See To Mark.
Marker n s అంగడివీధి, బాజారు. or time of sale సంత. or purchase and sale క్రయవిక్రయములు, వ్యాపారము. he made a good * today నేడు వాడికి మంచి బేరము. they found a * here వాండ్ల కిక్కడ కొననేవాండ్లు దొరికిరి. they found no * కొనేవాండ్లు లేరు.
Marketable adj అమ్మతగిన, అమ్మే.
Market-day n s సంతదినము.
Market-folks n s సంతకు వచ్చిన జనము, అంగడికి వచ్చిన జనము.
Marketman n s అంగడివాడు.
Market-place n s అంగడివీధి, బాజారు, సంతకూడే స్థలము.
Market-rice n s అంగడివెల, అంగడిధర, కాలక్రయము.
Marketting n s బేరము, వ్యాపారము.
Market-town n s సంతకూడే వూరు, సుసుబా గ్రామము,
Marking ink n s చలవకు నిలిచే యింకి.
Marking nut n s జీడిగింజ.
Marksman n s గురికాడు.
Marl n s సత్తవమన్ను, గరువునేల, దీన్ని యెరువుగా వేస్తారు. whitish * పాలగరువు
Marline-spike n s వాడ తాళ్లను బిగించడానకై వుండే యినుపకడ్డి.
Marlipit n s గరువుమన్ను తవ్వే గొయ్యి.
Marmalade n s కిచ్చిలి పండ్లు చక్కెర వీటితో చేసిన వొకవిధమైన మిఠాయి.
Marmot n s పందికొక్కువంటి వొక జంతువు.
Maroons n s వొకవిధమైన చెంచువాండ్లు.
Marplot n s రెండో నారదుడు, పని చెరిపేవాడు.
Marquis n s వొకవిధమైన పట్టముగల దొర.
Marriage n s పెండ్లు వివాహము. a left handed * కంటెబొట్టు వేసిన పెండ్లి.
Marriageable adj పెద్దమనిషియైన, పెండ్లి యీడుగా వుండే.
Married adj పెండ్లాడిన, పెండ్లియైన. a * couple దంపతులు, ఆలుమగడు. the* state ఆలుమగడు జీవితులై వుండేదశ, గార్హస్త్యము, ఐదువతనము. a * woman సంసారి. Metaphoricaly, united సంయుక్తులైన. Married to immortal verse(Milton) శ్లోకబద్ధమైన.
Marrow n s మూలగ, మజ్జా, యెముక నడిమి గిజురు. metaphorically సారాంశము.this is the * of the matter యిది ఆ సంగతి యొక్క సారాంశము. * of wheat గోధుమనూక. spinal * కుండలీ నాడి యొక్క మూలగ. vegetable * యిది వొక విధమైనకోసుకూర. the * apple బొప్పాయ.
Marrow-bone పెద్దయెముక, on his *s మోకాలి మీద నిలుచుకొని.
Marrowfat-peas n s పెద్దబటానీలు.
Marrowless ajd యొముకలగూడుగా వుండే, శుష్కించి వుండే.
Marry interj సుమీ, ఆట, యిది నీచమాట. I thought to * నాకు అట్లా తోచిందిసుమీ.
Mars n s (the planet) అంగారకుడు. as god of battle యుద్ధదేవుడు, కొమారస్వామి అనవచ్చును. a son of * వీరుడు, శూరుడు. Marsh, n. s. చిత్తడిభూమి, చితచితమని వుండే భూమి, బాడవనేల, బురదనేల. a salt * ఉప్పుపర్ర.
Marshal n s or genral సేనాధిపతి. or master of cermonies సభ యొక్క కారుబారు విచారించుకొనేవాడు, బరాబరి చేసేవాడు. a field * సేనాధిపతికి యిచ్చే వొక కితాబు.
Marshalled adj (prepared, trained) శిక్షితులైన, యేర్పడ్డ.
Marshalsea n s యిది వొక జెయిల్ఖానా పేరు.
Marshy adj చిత్తడిగా వుండే, చితచితలాడే.
Mart n s అంగడి, బాజారు, అమ్మకము. the goods found a * there అక్కడ ఆ సరుకులు బాగా వెలపోయినవి.
Marten n s a wild cat వొకవిధమైన పెద్ద ముంగిస. a bird భారద్వాజమువంటి వొక పక్షి.
Martial adj వీరుడైన. శూరుడైన. * preparations యుద్ధసన్నాహములు. a court* దండులో కూడిన న్యాయసభ. a man of a very * countenance అతి వీరభావము గలవాడు, వీరరసము గలవాడు.
Martin n s వొకవిధమైన భారద్వాజము, ఏట్రింత. a quadruped వొక విధమైన పెద్దముంగిస.
Martinet n s క్రూర శాసనీకుడు, యిది పూర్వము వొకని పేరు.
Martingal n s జేరుబందు, అనగా సవారి గుర్రపు ముఖపట్టకున్ను టంగువారుకున్ను కట్టేవారు.
Martinmas n s నవంబరు నెల 11 తేదీ వచ్చే వొక పండుగ.
Martyr n s a witness సాక్షి. A+. K+ మతానకై ప్రాణము విడిచనవాడు. he is a * to rheumatism వాత రోగముచేత మహాసంకటపడుతున్నాడు. he has been a * to his zeal in the service పనిలో అతిశ్రద్ధుడై నందువల్లనే చెడిపోయి నాడు. he fell a * to dissipation తన దుర్వృత్తి వల్లనే చెడిపోయినాడు. the army of *s ప్రాణత్యాగము చేసిన భక్తులు.
Martyrdom n s మతానకై చావడము, మత ద్వేషమువల్ల అన్యమతస్థులచేత చంపబడడము.he suffered * మతము గురించి ప్రాణ త్యాగముచేసెను, వాడు నిండా భక్తుడని వాణ్ని అన్యమతస్థులు చంపిరి.
Martyred adj మతానకై చచ్చిన, మత విరోధము చేత చంపబడిన.
Martyrology n s మతానకై చచ్చి నటువంటిగాని చంప బడ్డటువంటిగాని వారి మహాత్మ్యము.
Marvel n s అద్భుతము, ఆశ్చర్యము.
Marvellously adv ఆశ్చర్యముగా, అద్భుతముగా. this is * difficult యిది మహాప్రయాస, అతిప్రయాస.
Marvellousness n s అత్యాశ్చర్యకరత్వము. on account of the * of this story I did not believe it అత్యాశ్చర్యకరమైనందున ఆ మాటను నేను నమ్మలేదు.
Mary-gold n s See Marigold.
Masculine adj మొగ, ఫ్రౌఢ, ధీడ. the * gender పుంలింగము.she has a * look దానిది మొగచూపు. a * style ప్రౌఢవాక్కు.
Mash n s గుజ్జు, కలుపు, అంబలి. a * or syllabub of plantains, milk &c. పంచామృతము.
Mask n s or Masque మారుముఖము, కృత్రిమముఖము, వేషము. he madea * of paper కాకితముతో మారుముఖమును చేసినాడు. they wear *s atthis feast యీ పండుగలో మారు ముఖాలు కట్టుకొంటారు. he threw off the * మాయలు కడగా పెట్టినాడు. there was a * at the Palace నగరిలో వేషాల విందు జరిగినది. or pretext నెపము, సాకు, వ్యాజము.under the * of friendship స్నేహమనే సాకు పెట్టి.
Masker n s మారు ముఖమును కట్టుకొన్నవాడు, వేషధారి.
Masoleum n s వట్టిగోరి, అనగా శవమును పాతిపెట్టకుండా మర్యాదనిమిత్తము జంభముగా కట్టిన గోరి.
Mason n s కాసెవాడు, కొల్లెత్తువాడు. (name of a sect) See Freemason.
Masonry n s కాసెపని, కొల్లెత్తుపని, తాపిపని. (which like Freemasonry means a craft, secret trade, or mystery.)
Masoolah boat n s నాటుపడవ.
Masquerade or Masquerading n s. మారు ముఖాలు కట్టుకొని ఆడే ఆట,వేషము వేసుకొని ఆడే ఆట.
Masquerader n s మారు ముఖమును కట్టుకొన్న వాడు, మారువేషము వేసుకొనవాడు, వేషధారి.
Mass n s మొద్దు, ముద్ద, గడ్డ. a * of wood కొయ్యమొద్దు. orof metal పాళెము, కడ్డి. or a large quantity తడక, విస్తారము,సమూహము. a * of people గుంపు, జనసమూహము. a * of houses యిండ్లసమూహము. a * of clouds మేఘచయము. a * mass of blunders అబ్ద్ధాలపుట్ట. a * of ruins ఏకపాడు. his body is a * of corrupt humoursవాడి శరీరము రోగముల పుట్ట. this island is a * of cannon యీ దీవిఅంతా ఫిరంగుల మయముగా వున్నది. or Catholic workship పూజ. or musicfor a * పూజలో పాడే వొక విధమైన రాగము.
Massacre n s జనసంహారము, వధ.
Massiness, Massiveness n s. స్థౌల్యము, స్థూలత్వము, బరువు.
Massive adj స్థూలమైన, లావాటి, బళువైన. massy gold కుందనము.
Mast n s స్తంభము, వాడ స్తంభము. the middle or main * వాడ నడిమి స్తంభము. the fore * ముందరి స్తంభము. the mizen వెనకటి స్తంభము. the top * పై స్తంభము, రెండో స్తంభము. the top gallant* మూడోస్తంభము, కొనస్తంభము. a jury * విరిగిపోయినదానికి బదులుగా వేసుకొన్న స్తంభము. Mast or acorus &c. కాయలు.
Masted adj స్తంభముగల. or three * vessel మూడు స్తంభములవాడ.
Master adj principal ముఖ్యమైన. This is a * grievance (Wellington) అతివ్యాకులము.
Master-hand n s తీరినచెయ్యి, పూర్ణశక్తి. this poem shews a * యీ కావ్యము కవియొక్క దివ్యశక్తిని అగుపరుస్తున్నది.
Masterly adj దివ్యమైన, ఘనమైన, శ్రేష్ఠమైనదొడ్డ. Johnson's dictionary is a * work అది దివ్యమైన నిఘంటు.
Masterpiece n s ఘనమైనపని, దివ్యమైనపని. these pictures are *s యివి అతి దివ్యమైన పటములు. his work is a * అతనిది అతిదివ్యమైన గ్రంథము.
Mastership n s కర్తృత్వము, అధిక్యము, అధికారము, శ్రేష్ఠత్వము, ఉపాధ్యాయత్వము, ప్రవీణత.
Master-stroke n s సదుపాయము, మంచియుక్తి.
Mastery n s జయము, ప్రవీణత.
Mastication n s నమలడము, చర్వణము.
Mastich n s gum రూంమస్తకీ, దీనితో లప్పము చేస్తారు.
Mastiff n s యింటికి కావలిగా పెంచే వొక విధమైన పెద్దకుక్క.bramins are the *s of mankind (says Johnson in Boswell) బ్రాహ్మణులు బెబ్బులులు.
Mastless adj స్తంభములు లేని.
Masulipatam n s name of a town usually known as బందరు.
Mat n s చాప, చాపగా అల్లుకొన్నది.
Matadore n s కాకితాల ఆటలో చెప్పెమాట.
Matayar n s పాయకారి. "The Metayer is a peasant extracting his own wages and subsistence from the soil. He pays a produce rent to the owner of the land from which he obtains his food.The landlord, besides supplying him with the land on which he lives, supplies him also with the stack by which his labour is assisted." Jones on Wealth, 1831. Chap. III. Sect. 1.
Match n s for fire వత్తి అనగా జానకీతాడు, గంధకపుపుల్ల.or equal యీడు, జోడు, జత. or contest యెదురు పోటి. a wrestling* మల్లయుద్ధము. or marriage పెండ్లి.
Matchless adj యీడుకాని, జతకాని, అసమానమైన.
Matchlessly adv అసమానముగా.
Matchlock n s కర్ణాటక తుపాకి.
Match-maker n s వివాహఘటన చేసేవాడు.
Mate n s సంగాతి, సంగడి, జతగాడు, చెలికాడు, చెలికత్తే. he and his * అతను అతని భార్య. she and her * ఆపె, ఆపె పెనిమిటి. *s స్నేహితులు, సఖులు. he was my ship * నాతో కూడా వాడలో వచ్చినవాడు.they and we were mess-*s వాండ్లు మేమునను వొక భోజనము చేసేవారము.the commander and his * (Inmerchant ships) వాడ దొరానున్ను అతనికిందివుద్యోగస్థులున్ను. the Surgeon's * వైద్యుని హస్తకుడు.
Material n s మూలవస్తువు, ప్రధాన ద్రవ్యము, సంభారము. cloth is the * of which paper is made కాకితానికి మూలద్రవ్యము గుడ్డ. *s సామాను సామగ్రీ. he collected some *s for building యిల్లు కట్టడానకై కలపచేర్చినాడు. writing *s (a misapplication of the word) వ్రాయడానికికావలసిన సాధనములు, అనగా కాకితము, యింకి పేనా మొదలైనవి. I have ample * for composing that history ఆ చరిత్ర వ్రాయడానకు అన్ని అంగములుకుదిరి వున్నవి. his death furnished the *s for this poem యీ కావ్యానకు వాడి చావు మూలముగా వున్నది. or cloth (this is an improper sense) గుడ్డ.
Materialist n s నాస్తికుడు సాంఖ్యమతస్థుడు.
Materiality n s సాకారవస్తుత్వము, ముర్తిమత్వము.
Materially adv ముఖ్యముగా.
Materia-medica n s మందుదినుసు, ఔషదానికి కావలసిన దినుసు.
Maternal adj మాతృ సంబంధమైన. * love పుత్రవాత్సల్యము, అనగా తల్లికి బిడ్డల యందు వుండే విశ్వాసము.
Maternity n s మాతృత్వము. she gained the honors of * తల్లియనే గౌరవము దానికి వచ్చినది అనగా పుత్రవతి అయినది. See Paternity.
Mathematical adj మహాగణిత సంబంధమైన. with * accuracy అతిపరిష్కారముగా, యించుకైనా భేదము లేకుండా.
Mathematically adv మహాగణితశాస్త్ర ప్రకారముగా. this is * correct యిందులో రవంతైనా తప్పులేదు.
Mathematician n s మహా గణితశాస్త్రజ్ఞుడు.
Mathematics n s మహాగణితశాస్త్రము, అనగా సూర్యసిద్ధాంతము మొదలైనవి.
Matin adj తెల్లవారి, ప్రాతఃకాలపు. the * hour తెల్లవారివేళ.
Matins n s తెల్లవారిపూజ, తెల్లవారి జపము.
Matrice n s for casting types అచ్చు అక్షరములను పోసే అచ్చు దీన్ని మాత్రీస్ అంటారు.
Matricide n s మాతృహత్య, మాతృహత్య చేసేవాడు.
Matriculated adj enlisted as a member of the universities of England యింగిలండులో మాన్యముగల పాఠశాలలో ప్రవేశించిన. a * scholar పాఠశాలలో ప్రవేశించిన విద్యార్థి See Penny Cye. in Linna: p 23, line 12.
Matriculation n s పాఠశాలలో ప్రవేశించడము. See Matriculate.
Matrimonial adj వివాహ సంబంధమైన.
Matrimony n s పెండ్లి, వివాహము.
Matrix n s యోని, గర్భము, ఉత్పత్తి స్థానము. of words ధాతువు. of types [the English word మాత్రీసు.] అచ్చక్షరములను పోశే అచ్చు.
Matron n s సవతిపుత్రికా స్త్రీ, యిల్లాలు, పూజ్యురాలు, బిడ్డలతల్లి, కుటుంబిని, పెద్ద ముత్తైద. a chaste * పతివ్రత. an illustrious * అతి ఘనురాలు.
Matronly adj పూజ్యురాలైన, దొడ్డ యిల్లాలైన. from her * appearance ఆమె దౌడ్డ యిల్లాలుగా వుండి నందువల్ల.
Matross n s ఫిరంగీ సోజరు, టిల్లరి సిఫాయి.
Matted adj జడలుకట్టిన, పెనుసుకొన్న, జటిలమైన. * grassరక్కసిగడ్డి.
Matter n s body, substance extended, దేహము, శరీరము. he made up *d with me నాతో రాజీచేసుకొన్నాడు. while *s very farఆ సంగతిని బహుదూరము పెంచినాడు. In the * of that house ఆ యింటిని గురించి, ఆ యింటి విషయమందు. I know nothing of the * నాకు ఆ జోలి యేమిన్ని తెలియదు. materials, that of which any thingis composed వస్తువు, ద్రవ్యము, పదార్థము, మూలద్రవ్యము, సామగ్రీ, ఉపకరణము. subject, thing treated విషయము, సంగతి, ప్రమేయము,కార్యము, వ్యాపారము, పని. news, వర్తమానము. It was a * of ten rupees పదిపన్నెండు రుపాయలు. a * of six miles అయిదు ఆరు గడియల దూరము. the water was contaminated by vegetable * కొయ్యాకొణత,ఆకు అలము పడి ఆ నీళ్లు చెడిపోయినవి. animal * శరీర సంబంధమైనవి,అనగా మాంసము, యొముక, చర్మము, వెంట్రుకలు మొదలైనవి. corrupt *పాచి. what is the * with you? నీకేమి వచ్చినది, నీకేమిపట్టినది. nothing is the * with him వాడికి మరేమిలేదు. something is the * there అక్కడ యేమో విశేషము జరిగినది. there is something the * with his eyes వాడి కండ్లకు యేమో అవిధి వచ్చినది. a * of fact జరిగినపని, నిజమైన సంగతి. he is very * of fact సాధుమనిషి, మేదకుడు. See Penny Cycl. in Guicciar. p. 474. line 63. Is this any great *? యిది వొక గొప్పా. no * which you take నీవు యేది యెత్తుకొన్నా సరే, నీవు యేది యెత్తుకొన్నా చింతలేదు. no * who it was యెవడైనా సరే. pus in a wound చీము, రసిక. in the eyes కంటిపుసి.vaccine * అమ్మవారు పొడిచేపాలు. Matter, -This word probably is derived from the Sanscrit మాత్రా matra See Haughton in Vol. 3. p.14 of Trans. of Roy. As. Socy. In p. 421 Vans Kennedy affirms that Sanscrit has no word for matter, and Haughton refutes this in As. Jour. Sept. 1835. Page 212. In Page 97 is Kennedy's denialthat matra means matter. Yet Lucretius evidently uses Mater in this sense (Rerum Natura 1. 169) Quiposset mater rebus consisterecerta.
Mattins (thus spelt in the prayer-book)తెల్లవారిపూజ
Mattock n s గుద్దలి, తొల్లిక.
Mattress n s మెత్త.
Mature adj పండిన, పక్వమైన. when she came to * age దానికి యీడు వచ్చినప్పుడు. hen the fruit was * కాయపండినప్పుడు. when theplan was * ఆ యుక్తి కుదిరినప్పుడు. on * deliberation పూర్ణాలోచనమీద.
Maturity n s పక్వము, పరిపాకము, పరువము, యీడు. the plan attined * ఆ యుక్తి కుదిరినది. after he arrived at * యెదిగిన తర్వాత. before arriving at * యెదగక మునుపే.
Maty n s (an Indian word for a scrub servant) మేటి అనే పనివాడు.
Maudlin adj తాగిమత్తుగా వుండే, మత్తెక్కిన.
Maugre adv అయినప్పటికిన్ని. * their resistance వాండ్లు ఆటంకము చేసినప్పటికిన్ని.
Maukish adj See Mawkish.
Maul n s hammer సమ్మెట.
Mauled adj బాగా దెబ్బలుతిన్న, నలియకొట్టిన, వికారమైన, ఛిన్నాభిన్నమైన.
Maund n s (an Indian word: a measure of eight viss: that is about 25 lbs) మణుగు.
Maundy-Thursday n s యిది వొకపండుగ.
Mauvaise honte n s బిడియము, వట్టిసిగ్గు, వృథా సిగ్గు.
Mavis n s వొక విధమైన కోకిల.
Maw n s పొట్ట, కడుపు, పశుపక్షిమృగాదుల కుక్షి.
Mawkish adj అరుచియైన, నీరసమైన.
Mawkishness n s అరుచి, వెగటు.
Maw-worm n s నులిపురుగు. or hypocrite ద్రోహి, వంచకుడు.
Maxillary adj దవడ సంబంధమైన.
Maxim n s మూలసూత్రము, నీతి వాక్యము, ధర్మము, నిబంధన, సిద్ధాంతము.
Maximum n s అత్యుఛ్రాయదశ, అత్యున్నతదశ, ముమ్మరము. the cholera reached it's * in the year 1826 వాంతిబేది అప్పట్లో ముమ్మరముగా వుండినది. the * and the minimum ఉన్నతదశ నీచదశ, అధికసంఖ్య తక్కువసంఖ్య. the number of people who annually attend this feast varies greatly; the * is onelack, the minimum is 38,000 లక్షకు అధికములేదు, ముప్ఫైయెనిమిదివేలకు తక్కవలేదు, అధికసంఖ్యలక్ష, కనీసపుసంఖ్య ముప్ఫైయెనిమిదివేలు. he tried to combine the minimum of expense with the * of profit తనచేతనైనమట్టుకు వ్రయమును తగ్గించి లాభమును అధికముచేయవలెనని చూచినాడు. a * price పొడుగు వేల.
May n s అయిదో నెల. the * moon వసంత కాలచంద్రుడు.
May-be or Mayhap adv వొక వేళ. * he is dead చచ్చినాడేమో.
May-bug n s వొక విధమైన పురుగు.
May-day n s మే నెల మొదటి తేదివచ్చే పండుగ.
May-dew n s వొక విధమైన ద్రావకము.
May-game n s వసంతోత్సవ కేశిక, చెల్లాటములు, విహారము.
Mayhap adv వొకవుశ, కాబోలు.
Mayor n s పెద్దపోలీసు అధికారి, అనగా లండన్ పట్టణములో వుండే వేరేవేరే వొకగొప్ప వర్తకునికి యీ అధికారమును ప్రతిసంవత్సరమున్ను యిస్తారు. * of the place (French pharase) exactly the same thePeshwa of the Mahrattas.
Mayoralty n s పెద్దపోలీసు అధికారము, యీ అధికారము వొక సంవత్సరమే వుంటున్నది. See Mayor.
Mayoress n s or Lady Mayoress పెద్దపోలీసు అధికారి యొక్క భార్య.See Mayor.
May-pole n s గడ, స్తంభము, దీన్ని బయిలులో నాటి చుట్టూ ఆడుతారు.she is a perfect * అది గడవలె వున్నది.
Maze n s చెడ్డచిక్కు, చిట్టడవి, చాలా తిరుగుళ్లుగల ప్రదేశము, లోగా ప్రవేశిస్తే బయిటకి రావడానికి మహాచిక్కైన దారిగల ప్రదేశము, దీన్ని రావణుడి కోట అని యంటారు.
Mazed adj వెరగుపడ్డ, దిగ్భ్రమపడ్డ, చీకాకుపడ్డ.
Mazy adj చిక్కుగా వుండే, కలవరముగా వుండే, తిరుగుళ్లుగా వుండే.
Me pron నన్ను,నాకు, he looked at * నన్ను చూచినాడు. give * a pen నాకు వొక కలము యియ్యి.
Mead n s తేనె సారాయి.
Mead, Meadow n s. ????? ?????, ?????????.
Meager, Meagre adj బక్క, బక్కచిక్కిన, బక్కపలచని. he became * చిక్కిపోయినాడు. a * day or partial fast వొక్కపొద్దుదినము. soup maigre అంబలి, గంజి. * fare దిక్కుమాలిన ఆహారము, అర్ధగ్రాసము.
Meal n s or flour పిండి. or time of eating వొకపూట భోజనము. they toke three *s a day దినానికి ముడుపూటలు భోజనము చేస్తారు. * time భోజనము వేళ.
Mealman n s పిండి అమ్మేవాడు.
Mealy adj పిండివలె వుండే. * mouthed తెప్పున చెప్పక వూరికె సంకోచించే. he is very * mouthed about this పరిష్కారముగా చెప్పక సంకోచిస్తాడు. * white (that is, pallid) తెల్ల పారిన, నెత్తురు చచ్చిన.
Mean n s or average సరాసరి.
Meander n s తిరుగుట, సంచరించడము, సంచారము. here the river makes several *s యిక్కడ యీ నది వంకర వంకరగా పారుతున్నది.
Meaning n s అర్థము, తాత్పర్యము, భావము. what could be his *in doing so? అట్లా చేయడానికి వాడి భావమెట్టిది. double * ద్వ్యర్థి, శ్లేష, వ్యంగ్యము. he (*ing your brother) వాడు, అనగా నీ తమ్ముడు.
Meanly adv నీచముగా, తుచ్ఛముగా, హీనముగా.
Meanness n s నీచత, తుచ్ఛత, హీనత.
Means n s plu. See Mean.
Meant adj భావించిన, అనుకొన్న.
Meantime, Meanwhile adv యింతలో, యిట్లా వుండగా.
Measles n s తట్టమ్మవారు, చిన్నమ్మవారు.
Measure n s కొల, కొలత, ప్రమాణము, కొలిచేసాధనము, కొలిచేతూము, పడి మొదలైనవి, కొలిచేకోల, కొలిచేదారము. a * of milk వొకపడి పాలు, being something more than three pints English measure or two pounds eight ounces.In some * కొంతమట్టుకు. in great * శానామట్టుకు. without * మట్టులేకుండా, అవారిగా. but this was not the * of their grief వాండ్లు వ్యాకుల పడవసినది యింతేకాదు. or course, practice క్రమము, బందోబస్త. knowing that the enemy wascoming he took his *s accordingly శత్రుసేన వస్తున్నదనితెలిసి దానికి తగిన బందోబస్తు చేసినాడు. this is no time for taking half *s యిది వుపేక్షచేసే సమయముకాదు. musical * గణము, తాళము, లయ. they danced a * వొక ఆట ఆడినారు. To Measure, v. a. కొలుచుట.
Measured adj కొలిచిన, కొలవబడ్డ. by * efforts మితమైన ప్రయత్నములచేత. he used * language నిండా సున్నితముగా మాట్లాడినాడు.he did not use * language నోటికి వచ్చినట్టంతా మాట్లాడినాడు. Measureless, adj. అపరిమితమైన, అమితమైన.
Measurement n s కొలత, ప్రమాణము, లెక్క.
Measuring adj కొలగావుండే. a room * 30 feet ముప్ఫైయడుగుల యిల్లు.a * reed కొలిచేకర్ర.
Meat n s flesh మాంసము. or food ఆహారము, గ్రాసము. * and drink అన్నోదకాలు. sweet * మిఠాయి, ఫలహారము. house * ఉలవలు మొదలైనవి. green * గడ్డి. chillies are parrot's * చిలకలకు మిరపకాయలు ఆహారము. chicken's * కోడిపిల్లలకు వేసే గింజలు, white *s (i. e. any thing made of milk, as cheese &c.)జున్నుగడ్డ మొదలైనవి.
Meathe n s వొకవిధమైన పానకము.
Mechanic, or Mechanical adj చేతి, చేతితోచేసే. the mechnicalarts శిల్పము, అనగావడ్ల, కరమల, కంసల, కంచర, కుమ్మర మొదలైనపనులు. a mechanical contrivance యంత్రము. a pump isa mechanical contravance for raising water యేతాము, నీళ్లుచల్లేయంత్రము. this is a mere mechanic device యిది వట్టి నీచయుక్తి.to invent a picture is an intellectual art, to copy it is mechanical వొక పటమును మొదట యేర్పరచడము బుద్ధియెక్క పని, దాన్ని చూచి మరివొకటి వ్రాయడము చేతిపని. to invent a machine isan intellectual art, but to use it is mechanical వొక యమత్రమును కల్పించడము బుద్ధి యొక్కపని అయితే దాన్ని వాడడము చేతిపని. settling down into a mere mechanical existence అణిగినిశ్చేష్ఠితుడై.
Mechanical adj unconscious అనాలోచితమైన.
Mechanics n s యంత్రశాస్త్రము, యిది మహాగణితములో వొక భాగము.
Mechanism n s యంత్రము, బిస.
Medal n s బిరుదుబిళ్ల.
Medalist n s ప్రాచీన ముద్రల యొక్క మూలమును విచారించేవాడు.
Medallic adj బిరుదుబిళ్ల సంబంధమైన.
Medallion n s బిరుదుబిళ్ళ ముద్రగల వస్తువు.
Meddler n s తొందగాడు, అధిక ప్రసంగి.
Meddlesome adj తొందర పెట్టే, అధిక ప్రసంగముచేసే. Meddling, n. s. తొందర. See Interference ఇబ్బంది, అధిక ప్రసంగము.
Mediation n s మధ్యస్థము, సంధి.
Mediator n s మధ్యవర్తి, సంధిచేసే వాడు. A+ says మధ్యస్థః.
Mediatorial adj మధ్యస్థ సంబంధమైన. * functions మధ్యస్థము మధ్యస్థత.
Medical adj వైద్యసంబంధమైన. * treatment వైద్యము, చికిత్స. a * man వైద్యుడు. the * profession వైద్యవృత్తి. a * work వైద్య గ్రంథము.
Medically adv వైద్యశాస్త్ర ప్రకారము.
Medicated adj వైద్యశాస్త్ర ప్రకారముచేసిన, మిశ్రమమైన. * cake ఔషధముకలిపి చేసిన వడలు.
Medicinal adj వైద్య సంబంధమైన. * treament వైద్యము, చికిత్స. * application మందు. * brimstone నెల్లి కాయగంధకము. thus phrased in the printed Tariff.
Medicinally adv వైద్యముగా.
Medicine n s ఔషధము, మందు. or the art of * వైద్యము. he studies * వైద్యము నేర్చు కొంటాడు.
Medico n s అనగా, A doctor.
Mediocre adj సామాన్యమైన, మధ్యమమైన, మట్టైన.
Mediocrity n s సామాన్యత, మధ్యమత, మట్టు. his poetry didnot raise above * వాడి కావ్యము సామాన్యముగా వున్నది.
Meditated adj యోజించిన, ధ్యానించిన, తలచిన.
Meditation n s ఆలోచన, ధాన్యము. they left him to his *sవాణ్ని వొంటిగా విడిచిపెట్టినారు. In Ps XIX. 14. మనోభిప్రాయము. A+.
Meditative adj ఆలోచించే, ధ్యానించే. the * faculty ధ్యానశక్తి, అనగా మనసు.
Mediterranean adj మధ్యస్థమైన, యిది వొక సముద్రనామము.
Medium n s మధ్యస్థత. or the * paper వొకవిధమైన కాకితము.he did this through the * of his brother దీన్ని వాడి అన్న ద్వారాచేసినాడు, ముఖాంతరముగా చేసినాడు. In this I was the * యిందుకు నేనుమధ్యవర్తిగా వుంటిని. the circulating * చెల్లేసాధనము, అనగా రూకలు.the air is an unresisting * గగనము శూన్యము.
Medler n s వొక విధమైనపండు, యిది కుళ్ళితే రుచిగా వుంటుందంటారు,మాగిన అరిటిపండు రీతిగా వుంటున్నది.
Medley n s సంకరము, కలగూరగంప. this language is a great * యీ భాష మహాసంకరముగా వున్నది, మిశ్రముగా వున్నది. this poem is a* of sense and nonsense యీ కావ్యములో కొంత మంచి కొంత చెడు, కలగూరగంపగా వున్నది, chance * (in law) అనాలోచితముగా గాయము చేయడము.
Medullary adj మూలసంబంధమైన, మజ్జాసంబంధమైన.
Meed n s బహుమానము.
Meek adj సాత్వికమైన, సాధువైన, నమ్రతగల, దీన, తిన్నని.
Meekly adv నమ్రతగా, దైన్యముగా, సాత్వికముగా.
Meekness n s సాత్వికము, నమ్రత, దీనత.
Meer n s చేరువు. See Mere.
Meet adj తగిన, తగ్గ, యుక్తమైన. this was * punshment యిది తగిన శిక్ష. Is it * for you to say so? యిట్లా చెప్పటము మీకు తగునా, యుక్తమా. it is not * for you యిది మీకు తగదు, యుక్తము కాదు.
Meeting n s కూటము, సభ. or interview దర్శనము, సంఘటనము, కలియడము. there is a * to-morrow at the College రేపు కాలీజులో కూటము, సభ కూడపోతారు. to call a * సభకూర్చుట. a festive * విందు,ఉత్సవము. or place of worship పూజకు కూడే స్థలము.
Meetinghouse n s పూజకు జనులు కూడేయిల్లు యిది నీచమాట.
Meetly adv తగినట్టుగా, ఒప్పుగా.
Meetness n s ఒప్పు, యోగ్యత.
Megreness n s చిక్కి వుండడము, కార్శ్యము.
Megrim n s తలతిప్పడము, తలతిరగడము.
Melancholy n s విచారము, వ్యాకులము. or madness జ్ఞానపైత్యము.
Melangy n s కలగూరకంప, సంకరము, మిశ్రమము. * of languages సంకర భాష.
Melee n s యుద్ధము, జగడము, పోరు, యిది ఫ్రెంచిశబ్ధము.
Melioration n s గుణము, లఘువు, ఉపశమనము.
Mellifluence n s మాధుర్యము.
Mellifluent, Mellifluous adj మాధుర్యమైన.
Mellow adj పరిపక్వమైన, మాగిన. or beautiful లావణ్యముగల. or tipsy మధుమత్త. a * sound మధురస్వనము.
Mellowness n s పరిపక్వము, పరువము.
Melodious adj శ్రావ్యమైన, శ్రవణానందమైన, మాధుర్యమైన.
Melodiously adv శ్రావ్యముగా, శ్రవణానందముగా, మధురముగా.
Melodiousness n s శ్రావ్యత, శ్రవణానందము, మాధుర్యము.
Melodrama n s A dramatic performance in, which songs are intermixed నాటక భేదము.
Melody n s శ్రావ్యత, రక్తి, మాధుర్యము. a sort of song వొకవిధమైన పదము, పాట.
Melon n s ఖర్బూజాపండు. or pumpkin &c. గుమ్మడికాయ మొదలైనవి,వెర్రిపుచ్చకాయ. water * మొలాంపండు, తర్బూజాపడు. or the * vine ఖర్బూజా మొదలైన తీగెలు.
Melted adj కరిగిన, కరిగిపోయిన. * butter నెయ్యి.
Melting adj కరిగే. * tones మధురస్వనము, దీనస్వనము.
Mem n s (an initial to the word memorandum) యాదాస్తు, జ్ఞాపకార్థము వ్రాసుకొన్నది.
Member n s అవయవము, అంగము, భాగము. a vital * ఆయపట్టు. the last * of this sentence యీ వాక్యముయొక్క కడపటి భాగము. a * of parliament హస్తకుడు, పార్లేమెంటనే సభ వారిలో వొకడు. one of the*s of the board సభికులలో వొకడు. *s of a society సభవారు.*s of the family ఆ కుటుంబస్థులు, ఆ యింటివాండ్లు, ఆ యింటిజనము.
Membranaceous adj పొరగా వుండే.
Membrane n s పొర, సన్నతోలు.
Membraneous, Membranous adj పొరలుగా వుండే.
Memento n s జ్ఞాపకార్థమైన వాక్యము. a * mori మరణంస్మర, చావుసిద్ధమని యెంచుకో.
Memoir orn s. చరిత్ర, విన్నపము, మనివి.
Memorable adj అతిప్రసిద్ధమైన, అతిఘనమైన. a * victory అతి ప్రసిద్ధమైన జయము. a * decision అతిఘనమైనతీర్పు.
Memorandum n s యాదాస్తు, జ్ఞాపకార్థము వ్రాసుకొన్నది. a * book యాదాస్తు పుస్తకము, విజ్ఞాపనపత్రిక.
Memorial n s జ్ఞాపకార్థముగా వుండేటిది, జ్ఞాపకార్థముగా వ్రాసిపెట్టేటిది.or petition మనివి, అర్జి. this pillar is a of the victory యీ స్తంభము ఆ జయముయొక్క జ్ఞాపకార్థముగా వున్నది.
Memorialist n s అర్జీదారుడు.
Memory n s జ్ఞాపకము. It occurred to his * that they were gone వాండ్లు పోయినారని వాడికి జ్ఞాపకము వచ్చినది. he committed itto * వల్లించినాడు, పాఠముచేసినాడు. he preserved this in * దీన్ని జ్ఞాపకము పెట్టుకొన్నాడు. he did this to refresh their * వాండ్లకుజ్ఞాపకము రావడానకై దీన్ని చేసినాడు. he called this to * దీన్ని జ్ఞాపకము చేసుకొన్నాడు, జ్ఞాపకానికి తెచ్చుకొన్నాడు. my * fails me నాకు జ్ఞాపకము తప్పినది. this act blotted his former conduct from my * యీ పని వాడు మునుపుచేసిన దాన్ని నేను మరిచేటట్టు చేసినది. this slipped out of his * దాన్ని మరిచినాడు. loss of * మరుపు. meaning fame ఖ్యాతి. the * of the wicked shall rot దుష్టుల కీర్తినశించును. his father of pious * శ్రీమతు అతని తండ్రిగారు. the hero of glorious * అతి ప్రసిద్ధుడైనశూరుడు. beyond the * of man అనాదిగా.
Men n s మనుష్యులు, మానవులు, జనులు, మగవాండ్లు, పనివాండ్లు, నౌకర్లు, సిఫాయీలు.
Menace n s బెదిరింపు, అదురు.
Menacing (p||) fierceక్రూరమైన,దాష్టీకమైన,గద్దించే
Menage n s గుర్రపు సవారి నేర్చుకొనే శాస్త్రము, గుర్రపు సవారి నేర్చుకొనే స్థలము.
Mendacious adj అబద్ధమైన, అనృతమైన, అబద్దీకులయిన.
Mendacity n s అబద్ధాలాడే గుణము. Johnson says Falsehood.
Mender n s చక్కబెట్టేవాడు, బాగుచేసేవాడు.
Mendicant n s బిచ్చగాడు, యాచకుడు. a religious * సన్యాసి, బైరాగి, పకీరు. a naked religious * అవధూత. to become a *సన్యసించుట, బైరాగియౌట.
Mendicity n s the life of a beggar యాచకము, భిక్షము, తిరిపెము.
Mends n s See Amends.
Menial n s పనివాడు, దాసుడ, పరిచారకుడు, చాకిరీవాడు.
Menses n s ముట్టు, అంటు, ఋతుకాలము.
Menstrual adj ఋతు సంబంధమైన, ముట్టు సంబంధమైన, ముట్టు సంబంధమైన.
Menstruation n s ఋతువు. during * ఋతుకాలమునందు.
Menstruous adj అంటుగా వుండె, ముట్టుగా వుండే, భాండవ దూరముగా వుండే. a * woman రజస్వల.
Menstruum n s Any liquor used as a dissolvent, or to extract the virtues of ingredients by infusion, or decoction, లోహమును కరగడమునకు మాటుగా వుండే ద్రావకము, ఆయా వస్తువులలోని సత్తను గుంజుకొనే ద్రవ ద్రవ్యము. water is universal * నీరు అన్నిటినిన్ని భేదిస్తున్నది, కరగదీస్తున్నది. an oily * వస్తువులను కరగదీసే తైలరూపమైన మాటు.
Mensuration n s భూమిని కొలిచే శాస్త్రము, క్షేత్రగణితము.
Ment (theaffixప్రత్యయము)తనము, Thus; government దొరతనము.
Mental adj మానసికమైన. * anguish మనోవ్యాధి. * powers మనోశక్తి.
Mentally adv మనసా, మానసికముగా, మనసులో. silently తూష్ణీం.
Mention n s ఉదాహరించడము, చెప్పడము, అనడము, వ్రాయడము. he made * of you నిన్ను గురించి మాట్లాడినాడు. he made * of this in his letter అతని జాబులో దీన్ని వ్రాసినాడు.
Mentioned adj ఉదాహరించిన, చెప్పిన, వ్రాసిన.
MER 727Merit n s గుణము, యోగ్యత, అతిశయము. he had the * of supporting them వాండ్లను సంరక్షించిన పుణ్యము వాడికి కలిగినది. he had the * of confessing his crime తప్పును వొప్పుకొన్నాడనే ఘనత వాడికి కలిగినది. he had no great * in knowing French, for his mother was a French woman వాడితల్లి ఫ్రెంచిది గనుక వాడికి ఫ్రెంచి తెలియడము అతిశయముకాదు. he is a man of no * అయోగ్యుడు. he made a * of paying his debts తన అప్పులను చెల్లించడమే వొక ధర్మమన్నాడు. he makes a * supporting his mother తన తల్లిని కాపాడడమే వొక పుణ్యమంటాడు. the * fostering minute శిష్టపరిపాలన నిర్ణయ పత్రిక, అనగా ఆయా వుద్యోగస్థుల యోగ్యతలను యేర్పరచి వ్రాసిన పత్రిక. he has the * of having discovered that art యీ శాస్త్రమును చేసిన పుణ్యము వాడిది. he got his *s వాడికి తగినట్టు జరిగినది. we tried the case on it's *s ఆ వ్యాజ్యము యొక్క మూలమును పట్టి విచారిస్తిమి. the Judge went into the *s of the case ఆ వ్యాజ్యము యొక్క సారాంశమును విచారించినాడు. do you know the relative *s these two grammars? యీ రెండు వ్యాకరణములకు వుండే తారతమ్యము నీకు తెలుసునా.
Mercall n s (Madras measure) తూము.
Mercantile adj వర్తక సంబంధమైన, వర్తకమును గురించిన. * arrangements వర్తక బందోబస్తు. * pursuits వర్తకవృత్తి. * affairs వర్తక వ్యాపారము.
Mercenary adj ద్రవ్యాశగల, దుడ్డుకుపాటుపడే, దుడ్డే ప్రధానముగాయెంచే. * troops పరదేశస్థులైన కూలి సిఫాయీలు. a * Judge లంచగొట్టైన న్యాయాధిపతి. he is very * దుడ్డుకై నీచవృత్తిలో ప్రవేసించేవాడు.
Mercer n s పట్టుబట్టలు అమ్మేవాడు.
Mercery n s పట్టుబట్టలు అమ్మే వర్తకము.
Merchandise n s వర్తకము, వ్యాపారము, వాణిజ్యము, సరుకు.
Merchant n s వర్తకుడు.
Merchantman n s వర్తకపు వాడ.
Mercifuiness n s కరుణ, దయ.
Merciful adj దయాళువైన, దయగల.
Mercifully adv దయగా, కరుణతో,
Mercilessly adv నిర్దయాత్మకుడై, క్రూరుడై.
Mercury n s or quicksilver పాదరసము. the planet బుధుడు. the demi-god నారదుడు.
Mercy n s కనికరము, మంచితనము, కరుణ, కృప, దయ. he shewed them no * వామడ్ల యందు క్రౌర్యము చేసినాడు. have * puonme కరుణించు, కృపచెయ్యి. the village now lies at their * ఆవూరు వాండ్ల చేతిలో బడ్డది. ఆ వూరిని ముంచినా వాండ్లే, తేల్చినా వాండ్లే. he was now at the * of the tiger యింతలో వాడు పులి చేత చిక్కినాడు. he left the books outside at the * of the wind and weather గాలి వచ్చునో వాన వచ్చునో యని విచారించక ఆ పుస్తకములను బయిట పడవేసినాడు. he left the door open at the * of every thief యెవడై నా ఒక దొంగ దూరపోతాడని లేక తలుపు తెరిచిపెట్టినాడు.they are now at his * వాండ్లను ముంచినా అతనే తేల్చినా అతనే. they were left to the * of the waves అలల్లో తగులుకొన్నారు. O mercy mercy! అయ్యయ్యో.
Mercy-seat n s కృపాసనము. F+. H+. ఆవరణము D+. కరుణాసనం A+. శాంతికము. W. But ******* (like the Hebrew Koforeth) does not mention a seat and might more truly be rendered దయాసూచకము. even Martyn in his Persion version says (Hebr. IX. 5.) tokht-i-marhamat. Mere, adj. వట్టి, ఉత్త, శుద్ధ. this is * nonsense యిది వట్టి పిచ్చితనము. * spite వట్టి వైరము. these are * lies యివి శుద్ధ అబద్ధాలు.
Mere n s (a lake) చెరువు.
Merecurial adj పాదరస సంబంధమైన. * pills రసగుళికలు. or volatile చపలమైన, చంచలమైన, అస్థిరమైన. a man of * temperament చలచిత్తుడు, పాదరసము వంటివాడు అనగా బుద్ధికుశలత గలవాడు.
Merely adv వూరికె, మాత్రము. I was * looking at it వూరికె దాన్ని చూస్తూ వుంటిని, దాన్ని చూస్తూ వుండినది మాత్రమే. I * went there నేను అక్కడికి పోయినది మాత్రమే, నేను అక్కడికి పోయినది వొకటే. though you * touch it నీవు వూరికె దాన్ని అంటినప్పటికిన్ని. I was at thattime * a boy నేను అప్పట్లో వట్టి పిల్లకాయగా వుంటిని. he told * thisవాడు యింతే చెప్పినాడు, వాడు చెప్పినది యింతే. * this వాడు యింతే చెప్పినాడు,వాడు చెప్పినది యింతే. * for her ఆపె కోసరమే.
Meretricious adj లంజరీతిగా వుండే, వట్టిమినుకైన, నిరర్థకమైన. * tricks వట్టి పితలాటకములు. * ornament వట్టిన పై మినుకుగా వుండేసొమ్ము. this poem is full of * ornament యిది పిచ్చి శృంగారములపుట్ట.
Meretriciously adv లంజరీతిగా, నిరర్ధకముగా.
Meridian adj మధ్యాహ్నపు. the * sun మధ్యాహ్నసూర్యుడు. a * line భూగోళము మీద వుత్తర దక్షిణముగా వుండే రేఖ. in her * beauty దాని సౌందర్యోఛ్రాయ దశలో.
Merited adj i. e. earned, deserved అర్హమైన, పాత్రమైన,తగిన.
Meritorious adj యోగ్యమైన. a * act పుణ్యము, సత్కర్మము, సుకృతము. a * woman యోగ్యురాలు.
Meritoriously adv యోగ్యముగా. he exerted himself very * బహు యోగ్యముగా పాటుబడ్డాడు.
Meritoriousness n s యోగ్యత.
Merlin n s వొక విధమైన డేగ.
Mermaid n s నాగకన్యక, ఊర్ధ్వభాగము స్త్రీ రూపుగానున్ను అధోభాగముచేప రూపుగానున్ను వున్నట్టు కవులు వర్ణించే సముద్ర కన్యక.
Merrily adv ఉల్లాసముగా, వేడుకగా, సంబరముగా.
Merrimaking n s పండుగ, విందు, వేడుక, సంబరము.
Merriment n s వేడుక, సంబరము, తమాషా, ఉల్లాసము.
Merry adj నవ్వే, నవ్వించే, హాస్యకరమైన, ఉల్లాసముగా వుండే. comfortable, agreeable (this is the ancient sense) సుఖమయిన ఇష్టమైన. this story made them very * యీ కథకు వూరికె నవ్వినారు. he is a * fellow ఉల్లాస పురుషుడు. a * story నవ్వించేకథ. they made * all night రాత్రిఅంతా వేడుకగా వుండినారు. he made * with thenews ఆ సమాచారమును యెగతాళి కింద పెట్టినాడు. he made * with theletter ఆ జాబును యెగతాళి పట్టించినాడు.
Merryandrew n s హాస్యగాడు.
Merry-go-round n s రంగులరాట్నము.
Merry-making n s పండుగ, విందు, సంబరము, వేడుక
Merry-man n s బంటు, చెలికాడు.
Merry-thought n s వేడుకమాట. a bone కోడి రొమ్మున పంగలుగా వుండే యెముక.
Meseems verb It seems to me కాబోలు నాకు తోస్తున్నది.
Mesentery n s కడుపులోని వౌక భాగము, పేగులనడిమి భాగము.
Mesh n s కన్ను, వలకన్ను.
Mesmer n s యోగనిద్ర ఉపాయము కనిపెట్టిన వాని పేరు. Mesmerism కావలశినప్పుడు యోగనిద్ర వచ్చేటట్టు చేశే శాస్త్రము. See the London Athenacum 28th December, 1844, page 1198, and No. 555 and 556. To Mesmerise, See Fascinate. In Mesmerism you can put your neighbour to sleep: in Yoga you act solely on yourself.
Mess n s భోజనము, ఆహారము, పొత్తు భోజనము, వడ్డించిన భోజనము. she brought him a * of food వాడికి భోజనము తీసుకవచ్చినది. he and I were in the same * వాడు నేను పొత్తుగా భోజనము చేస్తూ వుంటిమి.she gave me a * of milk తాగడానికి నాకు కొంచెము పాలు యిచ్చినది. they sent him a * of greens వాడికి కూరలు పంపినారు. you have gotinto a fine * నీవుగా తెచ్చి పెట్టుకొన్నరంధే, స్వయంకృతానర్థమే. you have got me into a fine * నాకు యెక్కడి రంధి తెచ్చి పెట్టినావోయి. these papers are in a * of confusion ఆ కాకితాలు గందరగోళముగా వున్నవి, కలగూరగంపగా వున్నవి.
Message n s చెప్పిపంపిన సమాచారము, వర్తమానము, సందేశము.
Messenger n s దూత, సమాచారము తీసుకొనిపొయ్యే మనిషి, హర్కార. my wife was the * నా పెండ్లాముతో చెప్పి పంపిస్తిని.
Messiah n s మస్సీహి, అనగా అభిషిక్తుడు, ఖ్రిష్టు.
Messieurs n s plu. దొరలు, యి శబ్దమును Messrs. అని పుటాక్షరములుగా వ్రాస్తారు.
Messing n s పొత్తుభోజనము.
Messmate n s పొత్తుగా భోజనముచేసే వాడు. *s పొత్తుగా తినేవాండ్లు.
Messuage n s కాపురమువుండే యిల్లు, నివాసస్థానము.
Met, met,the past and part of Meet సంబంధించినది, సంధించిన. See To Meet.
Metacarpus n s మణికట్టు.
Metal n s లోహము. the precious *s వెండి, బంగారు, mixed * పంచలోహము. bell * కంచు. jeweller's gold మట్టబంగారు. this tries his * (See Mettle) యిందువల్ల వాడికి ధైర్యము వుండేది లేనిది తెలుస్తున్నది. regarding a road * means brick or stone. See Unmetalled.
Metallic adj లోహసంబంధమైన, లోహమయమైన. this water has a * taste యీ నీళ్ళు చిలుముగా వున్నది.
Metallurgist n s లోహశాస్త్రజ్ఞుడు.
Metallurgy n s లోహశాస్త్రము.
Metamorphose n s దేహాంతరము, రూపాంతరము, మారురూపు.
Metamorphosed adj రూపాంతరముచేయిబడ్డ, మారురూపుచేయబడ్డ. the woman was * into a crocodile అది మొసలి యైపోయినది. Ahalya was * into a stone అహల్య శిలారూపమైనది.
Metamorphosis n s See Metamorphose
Metaphor n s ఉపమ, ఉత్ప్రేక్ష, ఉపమాలంకారము, శ్లేష. the following are instances: "that commentary is a perfect gem" ఆ వ్యాఖ్యానము రత్నము. money has wings రూకలకు రెక్కలు వస్తవి, అనగా ఐశ్వర్య మస్థిరము. In a verse సరిసరి మంచిమాటలు, ప్రబంధమునాజలరాసి దానిలోపల నెరుసుల్ గణింతురె యపారము లౌ మణులెల్ల నుండగన్.Also గీర్వాణారణ్య సంచారవిద్వన్ మత్తేభ శృంఖలం.
Metaphorical adj భావగర్భితముగా వుండే, ఉపమానముగావుండే, శ్లేషగావుండే.a * expression ఉపమ, సామ్యము, భావగర్భితమైనమాట. See instances at the words.
Metaphorically adv భావగర్భితముగా, ఉపమానముగా, శ్లేషగా. See instances of this word at the word Lap, fascination, facinate.
Metaphrase n s ప్రతిపదము.
Metaphysical adj విశేషమైన, అన్వీక్షకీ సంబంధమైన, తర్క సంబంధమైన, తత్వ విచార సంబంధమైన, అప్రత్యక్షమైన. Supernatural or Preternatural అతిశయమైన.
Metaphysicks n s "The science of the general affections of things subsisting" (Watts) తత్వము. some say అనుభవవిద్య. See Coleridge's Biogr. Lit. 2. 300.
Metastasis Translation or removal (Harvey)వైకల్యము,విపరీతభావము, See Coleridge's note on Southey's Wesley, 1. 258.
Metayar n s read Metayar.
Metempsychosis n s పునర్జననము, దేహాంతరమును యెత్తడము. Christians do not believe in the * ఖ్రిస్తుమతస్థులు పునర్జన్మము, కద్దని నమ్మరు.
Meteor n s ఆకాశమందు క్షణమగుపడి మరుగైపొయ్యే జ్యోతి మొదలైనవి.prosperity is a mere * ఐశ్వర్యము క్షణభంగురము. this *led him astray యీ మాయచేత పొరబాటుపడ్డాడు.
Meteorological adj ఆకాశమందు క్షణ మగుపడి మరుగై పొయ్యే జ్యోతి మొదలైనవాటి సంబంధమైన. a * register ఆకాశమందు వింతగా అగుపడే జ్యోతి గాలివాన మొదలైనవాటి యాదస్తు.
Meteorologist n s ఆకాశమందు క్షణ మగుపడి మరుగైపొయ్యే జ్యోతి గాలివాన మొదలైన వాటిని విచారించే శాస్త్రి.
Meteorology n s ఆకాశమందు క్షణ మగుపడి మరుగైపొయ్యే జ్యోతి గాలివాన మొదలైన వాటిని విచారించే శాస్త్రము.
Meter n s కొలిచేవాడు. See To Mete.
Meterialism n s నాస్తికమతము, సాంఖ్యమతము, తాంత్రికమతము, దేహాత్మవాదము. the * of the Hindus is in two systems of which the సాంఖ్యis obsolete and the యోగశాస్త్రము is in vogue.
Metheglin n s తేనెతోచేసిన పానకము.
Methinks v impersonal తోస్తున్నది, కాబోలు, సుమీ, గదా * this is wrong యిది అన్యాయము సుమీ. Methought తోచినది.
Method n s క్రమము, విధము, రీతి, యుక్తి, ఉపాయము. he thereforeadopted another * గనుక వేరే యుక్తి చేసినాడు. by gentle *s నయాన, మంచితనముగా.
Methodical adj క్రమమైన, అనుపూర్వీకమైన.
Methodically adv క్రమముగా, అనుపూర్వకముగా.
Methodism n s ఖ్రిష్టుమతములో వొకశాఖ.
Methodist n s ("one who lives accoriding to the method laid down in the Bible." Wesley Works XIV. 259) ఖ్రిష్టుమతమువొకశాఖ వాడు.
Methodistical adj వీరమతస్థుడైన, అనగావీర, క్రూర, దుష్ట మాయమైన కపటియైన, యిది దూషణ శబ్దము.
Methodistically adv వీరమతస్థుడై, అనగా వీరుడై, క్రూరుడై, దుష్టుడై.
Methought (thepasttenseof`Methinks) నాకు తోచినది.
Metonymy n s ఉత్ప్రేక్ష, అన్యాపదేశము.
Metre n s ఛందము, గణము, వృత్తము. long * పదము. short * దరువు. common * ద్విపద.
Metrical adj ఛందోబద్ధమైన. a * arrangement శ్లోకముగా యేర్పరచడము.
Metropolis n s రాజధాని, ప్రధాన నగరము. the * usually means London. The * of India అనగా కల్కత్తా.
Metropolitan n s అర్చిబిషపు, ప్రధానభిషపు, ఆస్థాన భిషపు, రాజగురువు.
Mettle n s తేజస్సు, తెంపు, ధైర్యము, చురుకు, ఉత్సాహము, ఉద్రేకము. a man of * తేజ్స్వి, తేజోవంతుడు. this put him on his * యిందువల్ల విజృంభించినాడు, రేగినాడు. this put him quite of his * యిందువల్ల వాడి చురుకు అణిగినది. they are now upon their * about this దీన్ని గురించి అందరు యిప్పుడు గుబగుబ లాడుతారు.
Mettled adj తేజస్సుగల, చురుకుగల, తెంపుగల, ధైర్యముగల, ఉత్సాహముగల, ఉద్రేకముగల.
Mettlesome adj తేజస్సుగల, చురుకుగల, తెంపగల, ధైర్యముగల, ఉత్సాహముగల, ఉద్రేకముగల.
Mew n s a cage గూడు. an enclosure దొడ్డి, పెరడు. for horses తబేలా, లాయము. or sea-fowl వొకవిధమైన సముద్రపు పక్షి.
Mewling n s పిల్లికూత.
Mezereon n s వొక విధమైన ఆకుజెముడు చెట్టు.
Mezzointo n s "or, the black method of engraving" మధ్యవర్ణము,అనగా వొకవిధమైన రాగి అంచుతో వేసిన చిత్రము.
Miasmata n s or fumes విషయము, వాస్పము, అనగా పాసిన, లేక మురిగిన వస్తువుల యొక్క రోగకారియైన ఆవిరి.
Mica n s అభ్రకమువంటి వొకవిధమైన రాయి.
Micaccous adj అభ్రక రాతి సంబంధమైన.
Mice n s the plu of Mouse చుండెలుకలు, చిట్టెలుకలు.
Michaelmas n s సెప్టెంబరు నెల 29దో తేది వచ్చే వొక పండుగ.
Micher n s దొంగ.
Mickle adj శాన, నిండా యిది ప్రాచీన శబ్దము.
Microcosm n s సూక్ష్మప్రపంచము, యీ శబ్దమువల్ల మనిషి యని అర్థమౌతున్నది.
Micrometer n s అతిసూక్ష్మమైన దాన్ని కొలిచే వొకవిధమైన ఆయుధము.
Microscope n s అతిసూక్ష్మమైన, వస్తువులను చూచే భూత అద్ధము.
Microscopic adj అతి సూక్ష్మమైన వస్తువులను చూచే భూతఅద్ద సంబంధమైన.or diminutive అతిసూక్ష్మమైన, అతిస్వల్పమైన.
Mid adj నడిమి, మధ్యమ. * space మధ్యమ ప్రదేశము.
Midcourse n s సగం దూరము.
Mid-day n s మధ్యాహ్నము.
Middle n s మధ్యము, మధ్యభాగము, నడుము. in the * of their quarrel వారి జగడము నడమ. the very * నట్ట నడమ. he cut the* out నడిమి భాగమును కోసి యెత్తినాడు. In the * of the court నడిముంగిట. "about the * of the day usually means, in English, between two and four o' clock" so specified in a letter from William Pitt to Wellesley. Blackw. Apr. 1846, p. 401.
Middle-aged adj నడివయస్సుగల, నడివయస్సుగా వుండే.
Middlemost adj నడమ వుండే, నడిమి.
Middling adj నడితరమైన, సామాన్యమైన. the water is in * abundance నీళ్లు కొద్దిపాటిగా వున్నవి, చాలీ చాలమ్ములుగా వున్నవి. wood of a * description మచ్చుకర్ర says the Tariff.
Midge n s చీకటీగ, నుసుమ సన్నదోమ, కొతిమెర పురుగు.
Mid-heaven n s అంతరిక్షము.
Midland adj నడిభూమిలో వుండే.
Midleg n s చిరితొడ.
Midmost adj నడిమి, నడమ వుండే.
Midnight n s అర్ధరాత్రి, నిశీధము. * employment నిశిరాత్రి పని.
Midriff n s పొట్ట రొమ్ముకు కడుపుకు మధ్య వుండే చర్మము.
Midshipman n s వాడు పని నేర్చుకొనేటందుకు శిష్యుడుగా వుండే దొరకొడుకు, వాడలో పని నేర్చుకొనే దొరబిడ్డ.
Midst n s నడమ. he stood in the * of them వాండ్ల నడమ నిలిచినాడు. in the * of the house నట్టింట్లో. the * of the riverనట్టేరు. in the * of the storm గాలివానలో. in the * of all this distress యింత తొందరలో.
Midstream n s నడి ప్రవాహము.
Midsummer n s మంచి యెండా కాలము, దీన్ని కత్తెరదినాలంటారు. * holidays వేసంగి శలవు.
Midway adv నడిదోవ, సగం దూరము.
Midwife n s మంత్రసాని. a man * మంత్రసానితనము చేసే డాక్టరు.
Midwifery n s మంత్రసానితనము.
Midwinter n s నిండా చలికాలము.
Mien n s ఆకారము, రూపు, ఠీవి, వైఖరి. she was not a pretty woman but she had a noble * అది అంత అందకత్తె కాకపోయినా దాని యొక్క ఠీవి ఘనము.
Miff n s Displeasure. (See Huff) he took * అసహించుకొన్నాడు, అలిగినాడు.
Might n s శక్తి, త్రాణ, బలము. a man of * పరాక్రమవంతుడు. with * and main యావచ్ఛక్తితో, యావద్బలముతో.
Mightily adv మహా, మిక్కిలి, అత్యంతము.
Mightiness n s మహారాజరాజశ్రీకి సమానమైన పట్టము. their high *es the states of Holland మహారాజశ్రీ హాలండు ప్రభువులు.
Mighty adj శక్తిగల, బలముగల. a * army మహాత్తైన సేన. is that any * matter? అది వొక బ్రహ్మాండమా. a * fine business బంగారు పని * easy దొడ్డసులభము, యీ రెండున్నర నీచ తిరస్కారపు మాటలు.
Mignonette n s వొక విధమైన పుష్పము.
Migration n s వలస, దేశము విడిచి మరియొక దేశానికి పోవడము.
Migratory adj వలసబొయ్యే. gypsies have * habits యెరుకలవాండ్లుదేశ దిమ్మరులు.
Mild adj సాధువైన, శాంతమైన, సౌమ్యమైన, మంచి. a man of * temper సాత్వికుడు, శాంతుడు. * sunshine నీరెండ. as chees or beer తీపైన కారములేని. even taken in its's *est sense this was unjust దీన్ని యెంత సాత్వికముగా విచారించినా యిది అన్యాయము.
Mildew n s బూజు, పాచి, కాటుక.
Mildewed adj బూజుపట్టిన, పాచిపట్టిన, కాటుక పట్టిన. a * field కాటుక పట్టిన పయిరు.
Mildly adv శాంతముగా, సాత్వికముగా.
Mildness n s శాంతము, సౌమ్యము, సాధుత్వము.
Mile n s అరకోసు, 1760 గజాలదూరము. one cose is about two miles and one amada is about ten miles వౌక కోసు సుమారు రెండుమైళ్ళున్ను వొక ఆమడ సుమారు పది మైళ్ళున్ను వుంటవి.
Milepedes n s రోకటిబండ. See Woodlouse.
Milestone n s అరకోసెడు దూరమని తెలియడానకై పాతివుండే రాయి.
Miliary n s eruption కుక్కముండ్లు called in Tamil ****** Militant, adj. యుద్ధసన్నద్ధులైన. the church * పోరాడే భక్తులు, అనగా ఇహమందు వుండే భక్తులు.
Military adj ఆయుధజీవియైన, కత్తికట్టియైన, దండు సంబంధమైన. heleads a * life ఖడగజీవిగా వున్నాడు. a * man దండువాడు. a * dress దండు వుడుపు. the * దండు వాండ్లు, కత్తికట్టివాండ్లు.
Militia n s రాణువ సిబ్బంది, కట్టుబడి వాండ్లు. a * man కట్టుబడిబంటు.
Milk n s పాలు, క్షీరము. a curdled * పెరుగు, దధి. sour * మజ్జిగ. of plants చెట్టు యొక్క పాలు. cocount * టెంకాయనీళ్ళు. * and dairy produce in general పాడి. a cow in * పాడి ఆవు. milk-warm వెచ్చని. a * and water poem జబ్బు కావ్యము, పనికిమాలిన కావ్యము. the * of human kindness దయారసము. a * fever బాలింతజ్వరము.
Milkhedge n s (The plant called Euphorbia) జెముడు. in Tamil called తిరుకళ్ళి. In Sanc. సింహుండము.
Milkiness n s శాంతము, సాత్వికము.
Milking n s పాలు పితకడము, పిండడము.
Milkmaid n s పాలది, పాలపనిమీద వుండేటిది.
Milkman n s పాలవాడు, పాలపనిమీద వుండేవాడు.
Milkpail n s పాలతొట్టి, పాలముంత.
Milkpan n s పాలచట్టి.
Milkpottage n s క్షీరాన్నము.
Milksop n s వెర్రిముఖము.
Milkteeth n s పాలపండ్లు.
Milkwarm adj గోరువెచ్చని.
Milkwhite adj పాలవన్నెగల, క్షీరవర్ణమైన.
Milkwoman n s పాలది, మజ్జిగది.
Milky adj తెల్లని, పాలవంటి.
Milky-way n s నక్షత్రవీధి.
Mill n s యంత్రము, తిరగలి. corn * గోధుములను పిండిచేసే యంత్రము. hand * చెయితిరగలి. oil * గానిగ. sugar * చెరకుగానిగ.water * నీళ్ళవేగముచేత తిరిగే యంత్రము. wind * గాలికి తిరిగే యంత్రము. powder * తుపాకిమందుచేసే యంత్రము. a cloth * గుడ్డలు గట్టనవేసే యంత్రము.
Milldam n s యంత్రానికి నీళ్లుపారడానకై అడ్డకట్టినకట్ట.
Milled adj విసిరిన, పిండిచేసిన, నల్లగ్గొట్టిన. a * cloth గట్టన వేసినగుడ్డ, ఉగ్గించినగుడ్డ. a * rupee అంచుకు గీతలు కట్టిన రూపాయి, బండికల్లు రూపాయి, బండి రూపాయి, కంగోరరూపాయి, కల్లారురూపాయి.
Millenium n s సహస్రవత్సర క్షేమము, అనగా కొందరిమతము చొప్పున యికను ఖ్రిష్టు భూలోకమందు వెయ్యేండ్లు రాజ్యము చేయబోతాడనే కాలము. simply 1000 years సహస్రాబ్దములు, వెయ్యేండ్లు.
Miller n s పిండివిసిరేవాడు.
Millet n s వొకవిధమైన చిన్న జొన్నలు, చిటి జొన్నలు.
Mill-horse n s యంత్రమును యీడ్చే గుర్రము.
Milliner n s దొరసానుల వుడుపులు కుట్టి అమ్మే స్త్రీ. man * దొరసానుల వుడుపులు కుట్టి అమ్మేవాడు.
Millinery n s అమ్మడాకనై సిద్ధము చేసిన దొరసానుల వుడుపులు.
Million n s పదిలక్షలు. the * i. e. the people లోకులు, ప్రజలు. the * believe so అట్లా బహుమంది నమ్ముతారు. she hears the * hum (Cowper,) ప్రజలు అరవడమును విన్నది. one * pounds sterling అనగా కోటిరూపాయలు. they came in *s లక్షల తరబడిగా వచ్చినారు. music for the * లోకరంజిత సంగీతము.
Millionnaire n s కోటికిపడగ కట్టినవాడు, అతిధనవంతుడు.
Millpond n s యంత్రానికి పారడానకై నీళ్ళు తటాకముగా నిలిచివుండే గుంట.
Millstone n s తిరగలి.
Milt n s జెన.
Mimetick adj నాటక సంబంధమైన.
Mimick n s వెక్కిరించెవాడు, పరిహాసముచేసేవాడు.
Mimickry n s వెక్కిరింపు, వెక్కిరింత.
Mimini,Piminy adj రవంత, యిది నిండా నీచమాట.
Mimosa n s (fetid) అత్తపత్తచెట్టు, అరిమేదము.
Mina n s a bird గోరువంక పక్షి, మైనాపిట్ట.
Minaret n s మీనారు, అనగా మశీదుయెక్క పై స్తంభము.
Minatory adj బెదిరించే, గద్దించే. * clauses పాపవిధాయకసూత్రములు.
Mince-meat n s కొందిన మాంసము, తునకలు తునకలుగా తగిలిన మాంసము.
Mincingly adj కులుకుగా, కొంకుగా, సంకోచించి. unmincingly సంకోచించక.
Mind n s మనస్సు, అభిప్రాయము, యిచ్ఛ, బుద్ధి, హృదయము. or recollection జ్ఞాపకము, స్మరణ, తలంపు. have you a * to go? నీకు పోవలెనని మనస్సు వున్నదా. he does not know hisown * వాడు చపలుడు, చలచిత్తుడు. I have half a * to go there అక్కడికి పోవలెనని కొంచెము మనస్సు వున్నది. I have a great * to do it దాన్ని చేయవలెనని నాకు నిండా మనస్సు వున్నది. have you a * to this? యిది నీకు యిష్టమా. I let him know my * అతనికి నా ఆంతర్యమును తెలియచేసినాను. I am of the same * still నాకిప్పటికి అదే భావము. you must keepthis in * నీవు దీన్ని జ్ఞాపకము పెట్టుకోవలసినది. put me into go there అక్కడికి పోవడానికి నాకు జ్ఞాపకము చెయ్యి. their grief is never out of my * వాండ్ల వ్యాకులమును గురించి నాకుసదా విచారముగా వున్నది, వాండ్లు పడే వ్యాకులమును నిత్యము తలుస్తున్నాను.you must bear this in * దీన్ని నీవు మరువబోకు. this put your business out of my * యిందువల్ల నీ పనిని మరిచినాను. time out of * అనాదిగా. when this comes to * యిది జ్ఞాపకము వచ్చినప్పుడు. he called to * the advice I had given him నేను చెప్పిన బుద్ధిని జ్ఞాపకము చేసుకొన్నాడు. a man who is out of his * చలచిత్తుడు. a man of sound * స్థిరబుద్ధిగలవాడు. he is of a serious turn of * గంభీర పురుషుడు.
Minded adj మనసుగల, మనస్కుడైన. right * సన్మనస్కుడైన. evil * పాపాత్ముడైన. high * పెద్దమనిషియైన.
Mindful adj జాగరూకుడైన, వినే, విధేయుడైన. you must be * of this దీన్ని మరిచేవు సుమీ.
Mindfully adv జాగ్రత్తగా, భద్రముగా.
Mine pron (the genitive of I.) నాది, నా. this book is * యీ పుస్తకము నాది.
Miner n s గని తవ్వేవాడు.
Mineral adj గని సంబంధమైన, గనిలో చిక్కే. * productions గనిలో చిక్కే వస్తువులు. * waters గనిలో పుట్టే నీళ్ళు, యిది మందుకు పనికి వస్తున్నది.
Mineralogist n s గనుల పరిక్షగలవాడు, గనులలో చిక్కే లోహశిలాది శాస్త్ర ప్రవీణుడు.
Mineralogy n s ఖనిసంబంధమైన లోహశిలాదిశాస్త్రము.
Minerva n s సరస్వతి, వాగ్దేవి.
Mingled adj కలిశిన, చేరిన, మిళితమైన, మిశ్రితమైన.
Miniature n s సూక్ష్మాకారము, కొద్ది రూపు, మనిషిని చూచి భావముగా వ్రాశిన చిన్న అర్ధరూపుపటము. he is just his father in * కొంచెములో అంతా తండ్రివలె నటిస్తాడు. this boy is a schoolmaster in * వాడు రవంతపిల్లగాడై నప్పటికిన్ని వాడినడకంతా పెద్ద ఉపాధ్యాయులదిగా వున్నది. that little girl is her mother in * ఆ పిల్ల అంతా దానితల్లివలె నటిస్తున్నది. the ants were crowding in thousands like a * market అనేకముగా చుట్టుకొన్న చీమలు చిన్న వొక జాజారువలె వుండెను.
Minikin adj మహాచిన్నదైన, అతి స్వల్పమైన, ఇది నవ్వేమాట. a * pin అతి స్వల్పమైన సూది.
Minim n s సంగీతశాస్త్ర పుస్తకములో వేసే వొక గురుతు.
Minimum n s కనీసము, అధమపక్షము. See Maximum.
Minion n s ముద్దులకుర్ర, ప్రభువుయొక్క దయకు పాత్రుడుగా వుండేపోకిరి.
Minished adj తగ్గిపోయిన, చెడిపోయిన, సంక్షేపము చేయబడ్డ.
Minister n s వొకవిధమైన పెద్దగుడి.
Ministerial adj మంత్రి సంబంధమైన, పాదిరి సంబంధమైన. * office మంత్రిత్వము, పాదిరితనము. a * officer మంత్రి.
Ministrant adj పరిచారకులైన.
Ministration n s పరిచారకము, ఉపచారము.
Ministry n s Service పరిచారకము, ఉపచారము, పరిచర్య.the office of minister మంత్రిత్వము, పాదిరితనము. the * మంత్రులు, పాదిర్లు.
Minium n s (vermilion) సింధూరము.
Minnow n s వొకవిధమైన చిన్నచేప, నెత్తాళ్ళు.
Minor adj కొద్ది, స్వల్పమైన, కొంచెపు. this is a * consideration అదివిముఖ్యము . a * legend or petty chronicle ఉపపురాణము.
Minority n s వ్యవహార యోగ్యమైన దశలేమి, వ్యవహారయోగ్యతలేమి. during his* అతడికి వ్యవహార యోగ్యత లేనప్పుడ. or smaller number తక్కువసంఖ్య. they were in the majorty, we were in the * వాండ్లు బహుమంది మేము కొంచెము మంది.
Minotaur n s పురుషామృగము, అనగా ఊర్ధ్వభాగముమనిషి, అధో భాగము వృషభము, వీడు శిశుఘాతకుడని ప్రసిద్ధి.
Minstrel n s సంగీతగాడు, వీణపాఠకుడు, భట్రాజు.
Minstrelsy n s సంగీతము, గానము, కిలకిల స్వనము.
Mint n s a plant పుదీనా. for coining టంకసాల. words of a new * కొత్తగాకల్పించిన శబ్దములు. he has a * of money వాడి దగ్గెర బహుద్రవ్య మున్నది. a * of mischief దుర్మార్గమునకు ఆలయము, దుర్మార్గానికి పుట్నిల్లు.
Mintage n s శికా, ముద్ర. Rupees of Hyderbad * హైద్రాబాదు ముద్రవేసిన రూపాయలు.
Mintmaster n s టంకసాల అధికారి.
Minuendo n s సంగీతములో మూర్ఛన.
Minuet n s వొకవిధమైన నాట్యము, మందముగా ఆడే ఆట, విళంబిత నృత్తము.
Minute n s నిమిషము, ముఖ్యముగా. the * hand వొక ఘంటలో అరువైయో నిమిషమునుతెలియచేసే గడియారపు సన్న ముల్లు. I will come in a * క్షణములో వస్తిని. or memorandum యాదస్తుటిప్పణి. * guns వ్యసన సూచకముగా నిమిషానికి వొకమాటు కాల్చే ఫిరంగులు. * glass వొక నిమిషమును తెలియచేసే యిసుక గడియారము.
Minutely adv సరిగ్గా, పరిష్కారముగా, కూలంకషముగా. it was * finished పరిష్కారముగా నెరవేరినది.
Minuteness n s అతిసూక్ష్మత్వము. from the * of it's finish, this seems natural, not artifical అది వుండే పరిష్కారతను చూస్తే అది దైవకర్తృకమేగాని మనుష్య కృతముకాదని తోస్తున్నది.
Minutia n s plu. వైనములు, వివరములు.
Minx n s గయ్యాళి, చెణచరముగా వుండే పడుచు, నంగనాచి.
Miracle n s ఆశ్చర్యము, A+ అద్భుతము F+ R+ దైవయత్నము, వింతపని.
Miraculous adj ఆశ్చర్యముగా, వింతగా, అమానుషకృత్యముగా. he was * restored to life వాడు మళ్ళీ బ్రతికినది అద్భుతము.
Mirage n s (an appearance like water in the desert) యెండమావులు, మృగతృష్ణ, మరీచికా.
Mire n. s. అడుసు, బురద
Mirror n s అద్దము, దర్పణము.
Mirth n s ఉల్లాసము, ఆనందము, సంతోషము. this excited their * యిందుకు నవ్వినారు.this repressed their * యిందుల్ల వాండ్లు నవ్వును అణుచుకొన్నారు.
Mirthful adj ఉల్లాసముగల, ఆనందముగల, నవ్వే.
Miry adj బురదగావుండే, అడుసుగావుండే.
Mis అనగా,తప్పు,యేలాగంటేMisbehaviourతప్పునడత
Misacceptation v s అపార్థము, తప్పుగా గ్రహించడము.
Misadventure n s కొద్ది తొందర.
Misanthrope n s మనుష్యద్వేషి, లోకవైరి, విశ్వనిందకుడు, సర్వదూషకుడు ప్రజలను నిందించేవాడు, లోకము గిట్టనివాడు.
Misanthropic adj మనుష్య ద్వేషియైన, లోకవైరియైన సర్వదూషకుడైన.
Misanthropy n s మనుష్యద్వేషము, లోకవైరము.
Misapplication n s అప్రయోగము, దుర్వినియోగము. this is a * of the word యిది తప్పు ప్రయోగము. this was a * of the money యిది దుర్వ్రయము, దుర్వినియోగము.
Misapplied adj అప్రయుక్తమైన, దుష్ప్రయోగమైన, దుర్వినియోగమైన, దుర్వ్రయమైన.
Misapprehension n s అపార్థము, పొరబాటు, భ్రమ.
Misappropriation n s దుర్వ్రయము, దుర్వినియోగము.
Misbegotten adj పలుబీజమైన, సంకరజాతియైన. nonsensical వెర్రి, వట్టి, తుంట.
Misbehaved adj దుర్మార్గమైన, దుర్నడతయైన.
Misbehaviour n s దుర్మార్గము, దుర్నడత.
Misbelief n s అపనమ్మిక.
Miscalled adj తప్పు పేరుగల.
Miscarriage n s భగ్నము, భంగము, విచ్ఛత్తి, విఘాతము. or abortion గర్భస్రావము, కడుపు దిగబడడము.
Miscellaneous adj చిల్లర, నానా వివిధమైన, సంకరమైన. * verses చాటుపద్యములు.
Miscellany n s నానా విషయ సముచ్చయము, వివిధ విషయమంజరీ. a poetical * చాటు శ్లోకముల గ్రంథము. a newspaper is a * సమాచార పత్రిక నానా విషయమ సముచ్చయము.
Mischance n s దురదృష్టము, దుర్దశ, దౌర్భాగ్యము.
Mischief n s చెరుపు, చేటు, హాని, కీడు, దుర్మార్గము, దౌష్ట్యము, దుడుకు, కొంటెతనము. a monkey is always in * కోతి యెప్పటికిన్నిదుష్టు. the white ants have done * to these books చెదలు యీ పుస్తకములను కొట్టివేసినవి. the rain has done great * to the crop యీ వానచేత పయిరుకు నిండా చెరుపైనది. bathing in fever did him a great * జ్వరములో స్నానము చేయడము వాడికి నిండా వుపద్రవమైనది.reading that book did him a great * ఆ పుస్తకము చదవడము వాడికి నిండా చెరుపైనది.
Mischiefmaker n s తంటాలమారి, కలహగాడు, ఇల్లామల్లి, చాటీకోరు.
Mischiefmaking n s ఇల్లామల్లితనము, కలహము పెట్టడము.
Mischievous adj దుష్ట, దుర్మార్గమైన, దుడుకైన, చెడ్డ, తుంటైన, కలహముపుట్టించే. a * person దుష్టుడు. a * bull చెడ్డయొద్దు, * advice దుర్భోధన, దురాలోచన.
Mischievously adv దుష్టతనముగా, దుర్మార్గముగా.
Mischievousness n s దుష్టతనము, తుంటతనము.
Misconception n s భ్రమ, తప్పుభావము, అపార్థము.
Misconduct n s దుర్మార్గము, దుర్నడత.
Misconducted adj దుర్మార్గుడైన, దుష్టుడైన.
Misconstruction n s అపార్థము. he laid himself open to * దూషణ తెచ్చుకొన్నాడు. or displeasure అసహ్యము.
Miscreant n s దుష్టుడు, దుర్మార్గుడు, హరాంజాద, బ్రహ్మఘాతకుడు, పాషండుడు.
Miscreated adj వికారమైన, కురూపియైన.
Misdeed n s దుష్కృత్యము, దుర్మాగ్రము, అపరాధము, తప్పు, పాపము.
Misdemeanor n s దుర్నడత, దుర్మార్గము, దురాకృతము.
Misdoer n s అపరాధి, తప్పుచేసినవాడు.
Miser n s లోభి, లుబ్ధుడు, పిశినారిబంక.
Miserable adj దిక్కుమాలిన, అనాధయైన, దౌర్భాగ్యమైన, పాడైన. a * horse యెత్తు బడ్డి గుర్రము. or grieved దుఃఖితులైన. I am * at the thoughts of your going away నీవు పోతా వని తలుచుకొంటే నాకువ్యాకులముగా వున్నది. why should you make yourself * about this?ఇందున గురించి యెందుకు దుఃఖపడుతావు.
Miserably adv దిక్కుమాలినరీతిగా, మహా, నిండా. she is * ill అది నిండా పడివున్నది.
Miserly adj లోభియైన.
Misery n s దౌర్భాగ్యము, దురవస్థ, or grief దుఃఖము, వ్యసనము. he described the miseries he had suffered తానుపడ్డ కడగండ్లను చెప్పినాడు.
Misfangled adj అతివికారమైన, మొండి. (This occurs, as rustic English, in a modern novel.) "Mount Sorel" Chap. X. page 2.
Misfashioned adj వికారమైన, కురూపమైన.
Misfortune n s దౌర్భాగ్యము, దురదృష్టము.
Misgiving n s సందేహము, అనుమానము, సంకోచము, భయము.
Misgovernment n s అనిర్వాహకము, అసామర్ధ్యము, అజాగ్రత, బేబందోబస్తు.
Misguidance n s అజాగ్రత, అనిర్వాహకము.
Misguide adj తప్పుదారినిపడ్డ, పెడదారినిపడ్డ, ఆశిక్షితమైన. a * youth తలకొట్లమారి. a * wretch మూర్ఖుడు.
Mishap n s దురదృష్టము, దౌర్భాగ్యము.
Misinformation n s తప్పుసమాచారము.
Misinterpretation n s అపార్థము.
Misjoined adj తప్పుగా కలిసిన.
Misjudged adj ఆలోచనలేని, పిచ్చి.
Misjudging adj భ్రమపడే, మూఢుడైన.
Mislaid adj ఎక్కడనో పెట్టి మరిచిన, కానకపోయిన.
Misled adj భ్రమసిన, తప్పుదారిని బడ్డ.
Misletoe n s బదనిక వంటి వొక చెట్టు. To Mislike, v. a. ఒప్పకపోవుట, యిష్టపడకపోవుట. he *ed the food వాడికి అన్నము గిట్టలేదు, సహించలేదు.
Mismanaged adj తప్పుగా నిర్వహించిన, చెరిపిన.
Mismanagement n s అనిర్వాహకము.
Mismatched adj ఈడుగా వుమడని, జతగా వుండని. a * marriage ఈడు గాని పెండ్లి.
Misnamed adj తప్పుపేరు గల. Extravagance which is * charityధర్మమనే తప్పు పేరుగల దూబరదిండితనము.
Misnomer n n ఉదాహరించిన తప్పు పేరు, ఇది దొంగల విచారణలో వచ్చేమాట. he pleaded a * ఇది తన పేరు కాదని మనివి చేసినాడు.
Misogamist n s పెండ్లి వద్దనే వాడు.
Misogynist n s స్త్రీవైరి, స్త్రీలు గిట్టనివాడు, వైరాగి. Misogyny, n. s. వివాహము వద్దనే వైరాగ్యము, స్త్రీలయెడల అసూయ.
Misplaced adj చోటు మారాటముగా పెట్టిన, తప్పు స్థలములో బెట్టిన. this is a * remark ఈ మాట వుదాహరించువలసిన స్థల మిది కాదు.
Misprision n s రాజద్రోహమును యెరిగి దాచడము. he was guilty of * of treason రాజద్రోహమును యెరిగి దాచిన తప్పు వాడికి వచ్చినది.
Mispronunciation n s తప్పు వుచ్చారణ, అపస్వరము.
Misproportioned adj అంగుగా వుమడని, వికారమైన, మించిన, అతిశయించిన. his head is * వాడి తల అంగుగా వుండలేదు, మహాపెద్దది.
Misquotation n s తప్పు వుదాహరణ.
Misrepresentation n s తప్పుగా తెలియచేయడము, మాయ.
Misrepresented adj తప్పుగా తెలియచేయబడ్డ, మాయరూపు దాల్చిన.
Misrule n s అల్లరి, దొమ్మి, తారుమారు, పిల్లపెత్తనము.
Miss n s తప్పు, భంగము.
Missal n s జపగ్రంథము.
Misshapen adj వికారమైన, చొట్ట, యీచ.
Missile n s విసిరి వేసేటిది, రువ్వేటిది, అనగా బాణము, బల్లెము, వడిశలతో విశిరి వేసిన రాయి మొదలైనవి. they pelted him with bottles, plates, and other *s బుడ్లు చిప్పలు రాళ్లు మొదలైన వాటిని వాడిమీద రువ్వినారు.
Missing adj తప్పిపోయిన, కానకపోయిన, అగుపడని. he is still * వాడు యింకా చిక్కలేఉద, దొరకలేదు. we had three killed, six wounded and two * మాలో చంపబడ్డవాండ్లు ముగ్గురు, గాయములు తగిలినవారు ఆరుగురు, కానకపోయి వుండేవాండ్లు యిద్దరు.
Mission n s పని, ధర్మము, పంపినపని, బోధించడానకై పొయ్యే రాయభారము, మతమును బోధించడానకై పొయ్యే వ్యాపారము. he went uponthis * ప్రజలకు భోదచేయడమునకై పంపబడ్డ యీ పనిమీద పోయినాడు. all the * were killed ఆ పనిమీద వచ్చిన వాండ్లందరు చంపబడ్డారు. woman'స్ * స్త్రీధర్మము.
Missionary n s or (Apostle) పంపబడ్డవాడు, ఖ్రిష్టు మతమును బోధించడానకై పంపడబ్డవాడు, దేశాంతరమునకు పంపబడ్డ పాదిరి.
Missionaryism n s గురుధర్మము.
Missioner See Missionary LockeX, 514.
Missive n s జాబు, యిది కావ్యశబ్దము.
Mist n s పొగమంచు, a Scotch * (Byron) పొడితూర, సోనవాన, యిది పరదేస్థులకు మంచి వర్షమేను.
Mistaen అనగా Mistaken
Mistake n s తప్పు, భ్రమ, పొరబాటు. If you persist you will find your * నీవు కోతి పట్టుపట్టితే దానితప్పు నీకే అనుభవమునకు రాబోవుతున్నది.
Mistakenly adv తప్పుగా, భ్రమగా, పొరబాటుగా.
Mister v s అయ్య, దొర. See Master మాష్టరనే మాట దగ్గెర వివరముగా వ్రాసి వున్నది.
Mistimed adj అసమయమైన, సమయోచితము కాని.
Mistiness v s పొగమంచుగా వుండడము, మబ్బు, చీకటి, అంధకారము. form the * of the morning తెల్లవారి మంచు మూసకొని వుండినందున. from the * of his vision వాడికి చూపు మందమైనందువల్ల.
Mistletoe n s See Misletoe.
Mistook thepastofMistake తప్పినదిపొరబడినది, See To Mistake.
Mistress n s దొరసాని, యజమానురాలు, ప్రవీణురాలు, చదువుచెప్పే స్త్రీ, చదువుకొన్న స్త్రీ. or a concubine పెట్టుకొన్నస్త్రీ, వుంపుడుస్త్రీ. she is her own * ఆపె స్వతంత్రురాలుగా వున్నది. a term of contermptuous address (Jonson) ఓసీ.
Mistrust n s అపనమ్మిక, సంశయము, సందేహము, అనుమానము.
Mistrustful adj అపనమ్మికపడే, అనుమానించే, శంసయించే, సందేహించే.
Mistry or Maistre n s. a head workman మేస్త్రి.
Misty adj మంచు మూసుకొని వుండే, మంచు మూసకొన్న.
Misunderstanding n s or quarrel జగడము, అసహ్యము.
Misusage n s అన్యాయము, దౌర్జన్యము.
Misuse n s అన్యాయముగా వాడడము, దుర్వినియోగము. this is a * of the word యిది దుష్ప్రయోగము.
Mitch, milsh adj పాడి, పాలిచ్చే. a * cow పాడి ఆవు, పిండే ఆవు. * kine పాడి ఆవులు, పిండే ఆవులు.
Mite n s an insect లక్క తెవులు పురుగు, తవిటిపురుగు, బియ్యమందు పుట్టె నంగనాచి పురుగు, యిది ముఖ్యముగా జున్నుగడ్డలో పుట్టేటిది. a small particle రవంత, లేశము. I paid my * నేను కించిత్కారము యిచ్చినాను. orcoin దుడ్డు.
Mithridate n s తిర్యా క్కనేమందు దినుసు.
Mitigated adj తక్కువచేయబడ్డ, శాంతియైన. * punishment మట్టుపరిచినశిక్ష మితముగాచేసిన శిక్ష.
Mitigation n s శాంతి, ఉపశమనము మట్టుపరచడము, మితము చేయడము.
Mitigatory adj ఉపశమనముచేయించే. in his case there were some * circumstances వాడి వ్యాజ్యములో మన్నించవలసిన సంగతులు కొన్ని వుండినవి.
Mitre n s బిషపు వేసుకొనే కిరీటము.
Mitred adj బిషపుకిరీటమును ధరించిన, ఆచార్యపురుషుడైన.
Mittens n s plu. స్త్రీలు చలికి ముంజేతి మీద తొడుక్కొనే కంబళివుడుపు. Mittimus, n. s. ఖైదిని చెరసాలలో వేయడానకై పుట్టిన వారంటు.
Mixed adj కలిపిన, కలిసిన, మిశ్రమము చేసిన, మిశ్రమమైన. a * dialect సంకరభాష. In * society చిల్లరవాండ్లలో, సామాన్యులలో. a * multitude చిల్లరప్రజ. the * blood సంకర జాతి. * feelings వొకతట్టు సంతోషము, వొకతట్టు వ్యసనము, వొకతట్టు ఆశ్చర్యముగా వుండే రసము. * metal కలపడమైన లోహము. they got * up in the quarrel వాండ్లున్ను ఆ జగడములో కలిసినారు, పడ్డారు. In Hebr. IV. 2. సంజీర్ణమైన. but A+ says అవిశ్వాసాత్ ప్రచారితం.
Mixen n s కుప్ప, పెంట.
Mixing n s కలపడము, కలసినవస్తవు. or medicine ఔషధము, కషాయము.
Mizen n s or * mast వాడ వెనకటి స్తంభము.
Moan n s మూలుగు, గోల.
Moat n s అగడిత, కందకము, పరిఘ.
Mob n s గుంపు, అల్లరిమూక, బికారిగుంపు, క్షుద్రజనము. they come in a * గుంపు కూడి వచ్చినారు. this book is written to please the* యీ గ్రంథము సామాన్యలకొరకు వ్రాసినది. he raise a * పోకిరిగుంపును చేర్చినాడు. they rose in a * గుంపుకూడి వచ్చినారు.
Mobbish (a word used by Sir John Malcolom) SeeTumultuous,Disorderly
Mobcap n s స్త్రీలు వేసుకొనే సామాన్యమైన టోపి.
Mobility n s power of moving చలనశక్తి. or people సామాన్యులు, అల్లరిమూక. this is a mere comic echo opposed to Nobility.
Mocho-stone n s వొకవిధమైన రాయి, యమునా రాయివంటిది.
Mock n s యెగతాళి, హాస్యము, యెక సక్కెము, వెక్కిరింపు. or cheating వంచన, మోసము. a pearls చిప్ప ముత్యాలు. * coral మాయపగడము.* jewellery బూటకపు సొమ్ములు. * turtle అనే చేపకు బదులుగా చేసే కూర.
Mocker n s హాస్యగాడు.
Mockery n s యెగతాళి, హాస్యము, వెక్కిరింపు, వంచన, మోసము.
Mockingbird n s వెక్కిరించేపక్షి, అనగా యితరమైన పక్షులవలె కూసె వొక విధమైన పక్షి. the true name is వనభూషణము.
Mode n s విధము, క్రమము, రీతి, తీరు, వైఖరి, మర్యాద. a musical * శయ్య. this is a * of speech యిది మాట్లాడేవిధము, యిది వూరికె అనేమాట.
Model n s మాదిరి, సవుతు, తరహా. he made a * of the carriagein a small size ఆ రథము మాదిరి చిన్నదిగా వొకటిచేసినాడు. this house is on the * of mine యీ యిల్లు నా యింటి మాదిరిగా వున్నది. she is a * of a woman అది స్త్రీలలో మహా అందకత్తె. See Walton's Life of Donne wherein both the text and the notes, describing a medal style it a model. Walpole says Her face is pretty and her person is a perfect model అది అందమైన ముఖముగలది, అవయవ సౌష్టవము గలదిన్ని.
Moderate adj మితమైన, మట్టైన, కొంచెము, కొద్దిపాటి, తగుమాత్రమైన.a * man శాంతుడు. he had * success వాడికి కొంచెము అనుకూలమైనది. they are * tradesmen సామాన్యులైన వర్తకులు. he took a * dinner మట్టుగా భోజనము చేసినాడు. a * quantity of water కొంచెము నీళ్ళు be * in your food మట్టుగా భోజనముచెయ్యి.
Moderated adj మట్టుపడ్డ, తగ్గిన, శాంతిపడ్డ.
Moderately adv మితముగా, మట్టుగా. he is * clever వాడు కొంచెము సమర్థుడు.
Moderation n s మట్టు, మితము, శాంతి. he shewed * in speech వాడు శాంతముగా మాట్లాడినాడు.
Moderator n s మధ్యవర్తి, మధ్యస్థుడు.
Modern adj కొత్త, యిప్పటి, యీ కాలపు, ఆధునిక. he is a * Milton రెండో కాళిదాసు. she is a * Jezebel రెండోపూతన. * literature కొత్తకావ్యము, ఆధునిక కవ్యము. In * times యీ కాలమందు. * history అనగా యిప్పటికథ, యిటీవలి వృత్తాంతము. "Ancient History is that of the nations who flourished from the time of the creation to the fifth century; while the history of the middle ages has forit's object the revolutions that took place form the fifth to the end of the fifteenth century. What is now termed modern history is that which retraces the events of the last three centuries." (Koch. Revolutions, Introduction.)
Modernized adj యిప్పటి మాదిరిగా చేసిన.
Moderns n s యిప్పటివాండ్లు, యీ కాలపువాండ్లు, ఆధునికులు.
Modest adj అణుకువగల, అమరికగల, సాధువైన, సిగ్గుగల, పతివ్రతయైన. a * man నిగర్వి, సాత్వికుడు, సాధువు. he wrote a * letter on this subject యిందున గురించి వినయముగా వ్రాసుకొన్నాడు. In towns the actresses live separate from the * women వూళ్ళల్లో సంసార్లు వేరే భోగమువాండ్లు వేరే వుంటారు.they live in a very * style వాండ్లు మట్టుగా గడుపుకొంటారు. the Hindu women are perfectly * హిందూ స్త్రీలు నిండా అణుకువగలవాండ్లు.
Modestly adv అణుకువగా, అమరికగా, నిగర్వముగా, వినయముగా.
Modesty n s అణుకువ, అమరిక, నమ్రత, నిగర్వము, లజ్జ, సిగ్గు, పాతివ్రత్యము. had you no * to ask 100 rupees for this? యిందుకు నూరురూపాయలు అడిగేటందుకు నీకు సిగ్గులేదా. the Hindu women are conspicuous for * అణుకువగలవారనే ప్రసిద్ధి హిందూస్త్రీలకే వున్నది.
Modesty piece n s మొలబిళ్ళ, రావిరేకు, గోచి.
Modicum n s కొంచెము, రవంత. every one who has a * of sense రవంత వివేకముగల వాండ్లు.
Modification n s దిద్దుబాటు, సవరింపు, ప్రకారాంతరము "పరిణామము". W. విశేషము, భైదము. it's various *s and their derivations దానియొక్క భిన్న రూపములున్ను వుత్పత్తులున్ను. this is a * of the old lawయిది పాతచట్టమును సవరించి యేర్పరచినది.
Modified adj దిద్దిన, దిద్ది యేర్పరచిన, సవరించిన, ప్రకారాంతరమైన.a * regulation దిద్ది యేర్పరచిన చట్టము, విశేషనిబంధన. In Sankhya p. 93. W. says వైకృతమయిన.
Modish adj పసందైన, సొగసైన, శృంగారమైన.
Modishly adv పసందుగా, సొగసుగా, శృంగారముగా.
Modulation n s సుతికూర్చడము.
Modus n s నియమము, నిర్ణయము, యిజారా. a rule చట్టము, నిబంధన.
Mofussil n s (Indian cant phrase for rural district నాటుపురము. the Mofussilites పల్లెటూరివాండ్లు. a * station పల్లెటూరు. Equivalent to "the country" as opposed to "town" or the capital. Thus, He lives in the Mofussil;i. e. he lives far from the captal: he resides in a country place. The Mofussil newspapers- i. e. the country newspapers, or local press.
Mogul n s మొగల్ అనే జాతిలో చేరిన తురకవాడు.
Mohair n s వొక విధమైన చెంచువాడు.
Moidore n s పదమూడు రూపాయలకు మా రేపోర్టిగిసు మొహురీ.
Moiety n s సగము, అరవాసి.
Moist adj తేమగా వుండే, తడిగా వుండే, చెమ్మగావుండే అర్ద్రమైన.
Moistness n s తడి చెమ్మ.
Molasses n s బెల్లపుపాగు, బెల్లము.
Mole n s on the skin మచ్చ, పుట్టుమచ్చ. the animal అడవి యెలుక, యిది చుంచువంటిది, యీ దేశములో లేదు. or embankment కట్ట అడ్డ కట్ట.
Molecricket n s నేలలో బొక్కచేసుకొనివుండే పురుగు, కుమ్మరపురుగు.
Molehill n s అడవి యెలుకలు పోగుచేసిన మంటిదిబ్బ. to make mountains of *s కొద్ది కొద్ది కష్టములను గురించి భయపడుట.
Moleskin n s యెలుకతోలు అనగా వొకవిధమైన ముతకగుడ్డ.
Molestation n s తొందర, బాధ, ఉపద్రవము.
Mollification n s శాంతిపరచడము, ఉపశమనము.
Mollified adj శాంతిపొందిన, కరుణవచ్చిన. at these words he was * యీ మాటలు విని వానికి కరుణ వచ్చినది.
Molosses n s బెల్లము, బెల్లపుపాగు.
Molten the part of Melt, పోత, పోతబోసిన. a * image పోత విగ్రహము. * grease అతిసారము, యిది గుర్రములను గురించినమాట.
Moly n s మూలిక, అడవినీరుల్లి గెడ్డ.
Moment n s క్షణము, నిమిషము. he will not listen to me for a * నా మాట యెంత మాత్రము వినడు. a *'s consideration will shew this రవ్వంత విమర్శచేస్తిరా తెలుస్తున్నది. for the * అప్పటికి, ఆ వేళకు. at every * మాటిమాటికి. at that * అప్పుడే, తక్షణము. at this * యిప్పుడు, ప్రస్తుతము. he came but this * యిప్పుడే వచ్చినాడు. from this * యిది మొదలుకొని, యికమీద. up to this * యిదివరకు. at his last *s అవసానకాలమందు. or importance అతి ముఖ్యము. it is a matter of great * యిది అతి ముఖ్యమైనపని. it is of no * అది ముఖ్యమా, యిది గొప్పా, అది గొప్పా. there is nothing of any * to add యింకా చెప్పవలసిన విశేషము లేదు.
Momentarily adv నిమిషనిమిషానికి, మాటిమాటికి, అడుగడుక్కు.
Momentary adj క్షణము సేపువుండే. this medicine gave me * ease యీ మందుచేత నాకు క్షణముసేపు హాయిగా వుండినది.
Momentons adj అతిముఖ్యమైన, అత్యావశ్యకమైన, ప్రబలమైన.
Momentum n s జీవాధారము, వురువడి, ఉద్వేగము. the bullet flies by the * of gunpowder తుపాకి మందుయొక్క వురువడిచేత గుండు పోతున్నది, వేగముచేత పోతున్నది. trade creeps: we lose that * which is neccessary to the regular and efficient operation of the commercial machine వర్తకము జబ్బుగా వున్నది, మనకు వర్తకమనే యంత్రము క్రమముగానున్ను సఫలముగానున్ను తిరగడమునకు ఆవశ్యకమైన ప్రోత్సాహకము లేక పోయినది.
Momordica Charintia n s a flowering shrub producing abitter vegetable కాకరచెట్టు, కారవల్లి.
Momus n s నారదనామము. [Narada is the Momus of the gods; See Dr. Stevenson, Journal of Roy, Asiat. Socy, No. XIII. of May 1842, page 2.]
Monachism n s సన్యాసము, మునివృత్తి.
Monad n s అవిభజనియ్యమైన వస్తువు, అఖండనీయ ద్రవ్యము, లింగము. In it's mystic import the lingam answers to the * or కణం of Pythagoras.
Monarch n s రాజు, చక్రవర్తి, శ్రేష్ఠుడు. the * of hills కులాచలము. the * of birds పక్షి రాజు.
Monarchical adj రాజసంబంధమైన. the * power రాజాధికారము.
Monarchy n s ప్రభుత్వము, దొరతనము.
Monastic adj సన్యాసి సంబంధమైన. a * life సన్యాస వృత్తి.
Monday n s సోమవారము, ఇందువాసరము.
Money n s రూకలు, డబ్బు, పైకము. the purchase * క్రయము. I paid ready * for this యిందుకుచేత రూకలిచ్చి కొనుక్కొన్నాడు, యిందుకు రొక్కరూకలిచ్చినాను. that man sells for ready * only వాడు రొక్కఇరూకలకే అమ్ముతాడు.
Money-changer n s సరాపు.
Moneyed adj రూకలుగల. a * man ధనవంతుడు. Moneyless, adj. రూకలులేని, డబ్బులేని.
Moneymatter n s రూకలసంగతి, రూకల విషయము.
Monger n s అమ్మేవాడు, వర్తకుడు. a fish * చేపలమ్మేవాడు. a horse * గుర్రాలమ్మేవాడు. an oil * గాండ్ల వాడు. a marvel * లేనిపోని ఆశ్చరయములు చెప్పేవాడు, మహిమలు చెప్పే వాడు. a scandal * చాడీకోరు.
Mongoose n s (the Ichneumon) ముంగిస, నకులము.
Mongrel adj సంకరమైన. a * dialect సంకర బాష. a * మాలకుక్క, పనికిమాలినకకుక్క, యిరుజాతికుక్క.
Monitor n s బుద్ధిచేప్పేవాడు, బడిలో వుపాధ్యాయుల చేతికింద వుండే పెద్దపిల్లకాయ, వీణ్ని చట్టాంబిళ్ళ అంటారు.
Monitory adj భోదచేసే, బుద్ధిచెప్పే.
Monk n s సన్యాసి.
Monkery n s సన్యాసము, మునివృత్తి.
Monkey n s కోతి, తిమ్మడు.
Monkish adj సన్యాసి సంబంధమైన.
Monody n s శోక కావ్యము, చచ్చిన వాణ్ని గురించి చెప్పిన కావ్యము.
Monogamist n s రెండో వివాహము కారాదనే వాడు, అనగా వొక మనిషికి వొకటే వివాహము కావలసినదనే వాడు. the Hindus are *s as regards women హిందువులు స్త్రీలకు రెండో వివాహము కారాదనేవాండ్లు.
Monogamy n s రెండోవివాహము కూడదనే మతము.
Monogram n s ఏకాక్షరము, సాంకేతికమైన అక్షరము, ముద్రలో రెండు మూడు అక్షరములు కలిపి సంకేతముగా వేసే అక్షరము. The letter శ్రీ is a * శ్రీకారము ఏకాక్షరము.
Monologue దండకమువంటికావ్యము
Monomania n s పిచ్చితనము, చిత్తచాంచల్యము.
Monopolist n s జట్టివర్తకుడు, అనగా వచ్చే సరుకును మొత్తముగా తానే ఆక్రమించుకొనేవాడు.
Monopoly n s జట్టిబేరము, వచ్చిన సరుకును మొత్తముగా తీసువేసుకోవడము.
Monosyllabic adj ఏకాక్షరముగా వుండే. he merely made * answers వూరికె yes, no, Sir. &c. అని వొకొకమాటుగా వుత్తరము చెప్పినాడు.
Monotonous adj ఏకరీతిగా వుండే, వొక అతిశయమున్ను లేని, వింతా వేడుకలేని, విరసమైన. he leads a * life చేసినదే చేస్తూ చూచినదే చూస్తూ పడివున్నాడు. we made a * journey for 50 miles అయిదారు ఆమడ దూరము పోయినాము అదివరకు వొక అతిశయము లేదు.
Monotonously adv ఏకరీతిగా, వొక అతిశయమున్ను లేక, విరసముగా.
Monotony n s ఏకరీతి, వొక అతిశయమున్ను లేమి, విరసము, చేసినదే చేస్తూ చూచినదే చూస్తూ వుండడముచేత పుట్టే విసుకు.
Monsieur n s (a French word) దొరగారు, సాహెబు.
Monsoon n s వషాకాలము. the * has now set in యిప్పుడు వర్షాకాలము ఆరంభించినది.
Monster n s బ్రహ్మాండమైనది, విపరీతమైనది, వికృతాకారమైనది, క్రూర జంతువు. villain, wretch దుర్మార్గుడు. that elephant is a * అది బ్రహ్మాండమైన యేనుగ. what a * of a goat! యెంత బ్రహ్మాండమైన మేకపోతు! the *s of the deep సముద్రములో వుండే క్రూర జంతువులు. the * howitzer బ్రహ్మాండమైన ఫిరంగి, అఘోరమైన ఫిరంగి. the child is a * ఆ బిడ్డ బ్రహ్మాండమైనది, వికృతాకరము గలది, వికారమైనది, అనగా రెండు తలలు కోరలు మొదలైన అవయవములుగలది. a * balloon బ్రహ్మాండమైన గుమ్మటము. one who ill-treats అ woman రాక్షసుడు, దానవుడు. or stabber of a woamn హఠాత్తున స్త్రీలను పొడిచే వాడు. that * killed her child ఆ ఘాతకి తన బిడ్డను చంపినది. a * meeting బ్రహ్మాండమైన సభ, నిండా గొప్పగుంపు, పెద్దకూటము.
Monstrous adj విపరీతమైన, వికృతాకారముగల, బ్రహ్మాండమైన, క్రూరమైన, పాపిష్టి. such * acts యింత విపరీతమైన పనులు, యింత పాపిష్ఠిపనులు, యింత క్రూర కర్మములు. * cold విపరీతమైన చలి, పాడు చలి. a big box మహాగొప్ప పెట్టె.
Monstrously adv విపరీతముగా, వికృతాకారముగా, బ్రహ్మాండముగా, క్రూరముగా.
Monteith n s a glass used at meals రెండు తట్లా రెండు ముక్కులుగల జోడుతపేలావలె వుండే గ్లాసు.
Month n s నెల, మాసము. what is the day of the *? నే డేమి తేది.The Telugu months stand as follows. చైత్రం Aries; March-April.వైశాఖం Taurus, APril-May.జ్యేష్ఠం Gemini, May-June.ఆషాఢం Cancer, June-July.శ్రావణం Leo, July-August.భాద్రపదం Virgo, August-September.అశ్వయుజం Libra, Septemper-October.కార్తికం Scorpio, October-November.మార్గశిరం Sagittarius, November-December.పుష్యం Capricornus, December-Junuary.మాఘం Aqarius, January-February.ఫాల్గుణం Pisces, February-March.
Monthly adv నెల నెలకు వచ్చే. * accounts మాసాంతక లెక్కలు.
Monument n s జ్ఞాపకార్థమైన గురతు, జరిగిన విశేష కార్యము జ్ఞాపకము వుండడానకై నిలిపిన స్తంభము మొదలైన గురుతు. or tomb గోరి.
Monumental adj గోరీ సంబంధమైన. * stone గోరి. a * inscription గోరీమీద వ్రాసిన శాసనము.
Moochy wood (ErythrinaIndica, Rox. 3. 249.) బాడిదెకర్ర, బాడిదెచెట్టు, బలసవద్రిక. (SC.) D.
Mood n s రసము, భావము. he was in angry * కోపరసము కలవాడుగా వుండినాడు. she was in a melting * అది శోకరసము కలదిగా వుండినది. a * in grammar లకారము. the indicative * నిశ్చితార్థ ప్రయోగము. the subjunctive * సంశయార్థక ప్రయోగము.the potential * శక్త్యర్థక ప్రయోగయము. theinfinitive * తుమునర్థక ప్రయోగము.
Moody adj ముసురు మూతిగా వుండే, మూతి ముడుచుకొని వుండే.
Moolight n s వెన్నెల.
Moon n s చంద్రుడు. half* అర్ధచంద్రుడు, నెలవంక. new * అమావాస్య. full * పున్నమ. the light fortnight of the * శుక్లపక్షము, వెన్నెల కాలము. the dark fortnight of the * కృష్ణ పక్షము. nothing on this side of the * can injure him వాడికి ఐహిక దుఃఖము తీరినది, అనగా చచ్చెను. the man in the * ఆకాశరామయ్య, గగన కుసుమము, శశశృంగము. or a kind of lantern వొక విధమైన గుండ్రముగా వుండే లాంతరు.
Moon-beam n s చంద్రకిరణము. in the *s వెన్నెలలో.
Mooneyed adj రేజీకటిగల.
Moonlit adj Bright with the rays of the moon వెన్నెలలోవెలిగే, ప్రకాశించే.
Moonshine n s వెన్నెల. fraud, వట్టి మాయ, పితలాటకము. this proof is mere * యీ నిరూపణము వట్టిమాయ.
Moonstone n s చంద్రకాంతము.
Moonstruck adj వెర్రిపట్టిన, పిచ్చిపట్టిన, చలచిత్తుడైన.
Moor n s or fen చిత్తడి నేల, చితచితలాడే భూమి. or African సిద్దివాడు, అబ్సీమనిషి, వీండ్లు వొకవిధమైన తురకలు.
Moorcock n s వొక విధమైన అడవికోడి.
Moorings n s లంగరుతాళ్లు, లంగరుచేసే స్థలము.
Moorish adj సిద్దీ సంబంధమైన, అబ్సీసంబంధమైన, తురక సంబంధమైన.
Moorland n s చిత్తడి నేల, చితచితలాడే భూమి, బాడవ నేల.
Moorman n s (a base word for Musulman) తురకవాడు.
Mootcase n s విద్యార్ధులకు వేసే మొండిప్రశ్న, విద్యార్ధులు పట్టుకొని పోరాడే వొక అసమంజస ప్రసంగము.
Mop n s pieces of cloth, or lock of wool, fixed to a long handle: women dip this in water and wash the floor with it, ఆలుకుచుట్ట, అనగా పేలికలుగాని గొర్రెబొచ్చుగాని కొనకుచుట్టి ఆడువాండ్లు నీళ్ళలో ముంచి ముంచి నేలను కడిగే తుండుకర్ర.
Mope n s (a dull siuggard) మందుడు, సోమారి, మేదకురాలు, తెలివిమాలినది.
Moping n s ఏకాంతముగా వుండడడము, వొంటరిగా కూర్చుండి అఘోరిస్తూ వుండడము, వ్యాకులముగా వుండడము. p|| వొంటిగా కూర్చుండి అఘోరిస్తూ వుండే,నమోనమో అని వొంటిగా కూర్చుండి వుండే.
Moppet n s బొమ్మ, సాలభంజిక.
Moral n s నీతి, ఫలితార్థము, సారాంశము, అనగా నీతివాక్యము, నీతిగ్రంథము, నీతికథ, వీట్ల యొక్క ఫలితార్థము.
Morale n s (French) ధైర్యము, దార్ఢ్యము, త్రాణ. good behaviour,order క్రమము, నీతి.
Moralist n s నీతులు చెప్పేవాడు. Bhascara and Sumati are *s, and such Addison and Doctor Johnson వీండ్లు నీతులు చెప్పే వాండ్లు.
Morality n s నీతి, న్యాయము, ధర్మము.
Morally adv నీతిగా, ధర్మముగా, న్యాయముగా. or entirely మిక్కిలి. or inferentially ఫలితార్థముగా, వూహగా. it is * impossible that he learned the language within ten days వాడు పదిదినములలో ఆ భాషను నేర్చు కొన్నాడన్నిది మిక్కిలి అసాధ్యము. that bramin is * a Musulman వాడు మనసా తురకవాడు, అనగా బయిటికి బ్రాఃమనుడు అంతః తురకవాడు. these two men are * brothers వాండ్లిద్రరు మనసా అన్నదమ్ములు. he has * deserted her దాన్ని మనసా త్యాగము చేసినాడు.
Morals n s plu. నీతి. a book on * నీతి శాస్త్రము, హితోపదేశము.
Morass n s చిత్తడి నేల, చితచితలాడే భూమి, బాడవ నేల.
Morbid adj రోగసంబంధమైన, విషమమైన. a * swelling రోగపువాపు. a * effection రోగగుణము. or foolish వెర్రి. he has a * pride వాడికి వెర్రి అహంకారమున్నిది, దురహంకారమున్నది. he had a * dispostion to suspect people వాడికి అందరిమీద అనుమానపడే దుర్గుణముండినది. a * inclintion దురాశ, దురపేక్ష.
More adv మరిన్ని, మిక్కిలి, నిండా. and * than that అంతేగాక, యింతేకాకుండా, మరిన్ని. if you do this once * you shall succeed యింకొకమాటు చేస్తివంటే అనుకూలమౌను. if you do this any * I shall flog you యిక నిట్లా చేస్తే కొట్టుతాను. the * you ride the better నీవు యెంత సవారిచేస్తే అంత మంచిది. the * beautiful they are the * vicious they are వాండ్లెంత అందగాండ్లో అంత దుష్టులు. * fool you అయ్యో వెర్రి. as * and * our understanding clears, So * and * ourignorance appears తెలివి పుట్టగా పుట్టగా మన అవివేకము బయటపడుతున్నది.Bp. Hall says I have learnt * of God and of myself in one week's affliction than in all my whole life's prosperity. (Here the word more is omitted) నాయావదాయుస్సున్ను అనుభవించిన శ్రేయస్సుకంటె వారం దినములుపడ్డ వ్యాకులము వల్ల జీవాత్మ పరమాత్మ జ్ఞానము విశేషముగా కలిగినది.
Moreover adv యింతేకాకుండా, యింకా, యిదిగాక, అదిగాక, మరిన్ని.
Morgue n s (French) వూరు, పేరు, తెలియని పీనుగను దాని తాలూకు వాండ్లు వచ్చేదాకా, వేసిపెట్టే చావడి.
Morn n s ప్రాతఃకాలము.
Morning n s ప్రాతఃకాలము, తెల్లవారి. in the * ఉదయాన, ప్రొద్దున. this * నేటి తెల్లవారి. in the * of life బాల్యమందు.this * generally mean in the forenoon or the time before dinner ముఖ్యముగా dinner అనే భోజనము మూడుజాములకు చేసినప్పకిన్ని అంతకు ముందు కాలము morning or forenoon అనబడుతున్నది. I was engaged all the * డిన్నరు పర్యంతరము పనిమీదవుండినాను. dinner కు తరువాత అస్తమాన పర్యంతరము. afternoon అనబడు తున్నది, పరిష్కారముగా ఉదయ కాలమనే అర్థమందు. this * before breakfast or early in the * ఉదయాన. * hymns మేలుకొలుపులు. the * cometh తెల్లవారుతున్నది, ఉదయమవుతున్నది. the * star తెల్లవారిజామున తూర్పునపొడిచే చుక్క అనగా శుక్రడు, వేగుచుక్క.
Morocco n s వొకవిధమైన సన్నతోలు.
Morose adj ముసురుమూతిగావుండే, చిరచిరలాడే, మండిపడే. a * fool కసురుబోతు, దుర్వాసుడు.
Morosely adv ముసురుమూతితనముగా, చిరచిరలాడుతూ, మండిపుడతూ.
Moroseness, Morosity n s. ముసురుమూతితనము, చిరచిరలాడే స్వభావము,మండిపడే గుణము.
Morpheus n s (the god of sleep according to poets) నిద్రాధిదేవత. they were then in the arms of * నిద్రించి వుండినారు.
Morphine n s వొకవిధమైన అభిని ద్రావకము.
Morris or Morris-dance n s వొక విధమైన నృత్యము.
Morrow n s తెల్లవారి. on the * మరునాడు, యిది ప్రాచీన శబ్దము.to-morrow రేపు.
Morsel n s కబళము, కడి, ముక్క, తుకన, రవంత. a * of bread రవంతరొటె. there is not a * of reason for this యిందుకు రవంతైనా హేతువులేదు. it was broken into *s అది తునకలైనది, వక్కా ముక్కలైనది.
Mortal adj చచ్చే, చావగల, నశ్వరమైన, మర్త్యులైన. the body is * the soul is not శరీరము నశ్వరము ఆత్మ నశ్వరముకాదు. as all of us are * మనమంతా చచ్చేవారము గనుక. * power దేహశక్తి. the * frame కాయము, దేహము. they were no heroes of * race వాండ్లు మర్త్యులు కారు, అనగా అమర్త్యులైన దేవతలు. a * wound చావు గాయము. * disease చచ్చేరోగము. * poison చంపేవిషము. a * sin కొంచపొయ్యే పాపము. * peril ప్రాణసంకటము. a * foe బద్ధవైరి,జన్మవైరి, or extreme, violent, (a low word, Johnson) he took * offence at this (a vulgar phrase) యిందుకు వాడికి చెడ్డ అసహ్యము వచ్చినది. I remained there for two * hoursఅక్కడ రెండు పాడు గడియలు నిలిస్తిని. what a * fool! యేమి పాడు వెర్రివాడు. a * fright పాడుభయము. not a * creature was there అక్కడ వొకమనిషి పురుగు వుండలేదు.Mortal, n. s. మనుష్యుడు, మానవుడు. what a happy *! యేమి అదృష్టవంతుడు. wretched *s దౌర్భాగ్యులు. among *s మనుష్యులలో.
Mortality n s చావు, మరణము. or human nature మర్త్యత్వము. this produced a great * యిందుచేత ప్రజాక్షయమైనది. శానా మందిచచ్చినారు. the bills of * యీ వూరిలో యిందరు చచ్చినారనే లెక్క. within the bills of * వూరి పొలిమేరకు లోగా.
Mortally adv చచ్చేటట్టు, చచ్చేలాగు. he wounded her * దాన్ని చచ్చేటట్టు పొడిచినాడు. or extremely, a low ludicrous word (Johnson) మిక్కిలి, చాలా. I was * afraid మహాభయ పడితిని. he was * wounded and died next day చెడ్డగాయము తగిలి మరునాడు చచ్చినాడు.
Mortar n s రోలు, కల్వము. or cannon బొంబసుఫిరంగి. or cement for building గచ్చు. a * full of grain వొక వాయి వడ్లు. to beat in a * దంచుట, rice beaten in a * దంచినబియ్యము, దంగుడుబియ్యము.
Mortgage n s కుదవ, తాకట్టు, యిది స్థావరమైన సొత్తులను గురించినమాట. the * is forfeited తాకట్టు వాకట్టు అయిపోయినది, కుదవ సొత్తు మునిగిపోయినది.
Mortgagee n s కుదువబెట్టుకొన్న వాడు.
Mortice n s See Mortise.
Mortification n s gangrene శరీరములోని మాంసము కుళ్ళడము,మాంసము చావడము. he died by * of the wound ఆ పుండు కుళ్లి చచ్చినాడు. austerities or penance శరీర శోషణము, తపస్సు. subjection of the passious అణచడము, నిగ్రహించడము. they teach the * of the passions ఇంద్రియ నిగ్రహమును వుపదేశిస్తారు. vexation విచారము, చింత, మనస్తాపము, ఆయాసము, లోలోగా కుళ్లుకోవడము.fasting is the * of the flesh ఉపోష్యము శరీరశోషణము. this business gave him great * యిందుచేత వాడి మనసుకు నిండా ఆయాసము వచ్చినది.
Mortified adj కుళ్ళిపోయిన, శోషింపచేసిన, అణచబడ్డ, మనస్తాపముపొందిన, ఆయాసము పొందిన. his pride was * వాడికి గర్వభంగమైనది.See Mortification.
Mortifying adj కుళ్లే, మనస్తాపకరమైన, లోలోగా కుళ్లే, లోగాకోశే.
Mortise n s బెజ్జము, అనగా రెండు పలకలను సంతన చేయడానకై నెమ్ములుకొట్టే బెజ్జము. lying hidden in a * hole (Selden) సందుగొందులలో దాగి.
Mortmain n s అనుభవించతగ్గ భూస్థితి, అనగా దానవిక్రయములకు అయోగ్యమైనది.
Mosaic adj and n. s. (written by Moses) మోసెను వ్రాసిన. the * books మోసెసు చెప్పిన గ్రంథములు. a sort of stucco నానా వర్ణములుగల గాజురాళ్లు పొదిగి విచిత్రముగా చేసిన గచ్చుపని. Moschetto or Musketoe, n. s. దోమ.
Moses n s యిది వొక పురుషుని నామము.
Moslemin n s తురకలు.
Mosque n s మసీదు, తురక వాండ్ల గుడి. Mosquito, n. s. దోమ.
Moss n s వొక విధమైనపాచి, దీన్నిపాకుడు అంటారు రావిచెట్టు మొదలైన వాటిమీద పచ్చ ముఖమల్ వలె పెరిగిన పాచి. a morassor boggy place బురదగా వుండే రేగడినేల. * grown పచి పెరిగిన.
Moss-trooper n a robber బందిపోటు దొంగ, పెండారీ.
Mossy adj పాచి పెరిగిన, See Moss.
Most adv and n. s. బహుశః, మెట్టుకు, అధమం, నిండా, అధికము,అనేకము. the * he could do was to write me a letter వాడి చేతనైనది నాకు వొక జాబు వ్రాసినాడు. he will come in two hours at * వాడు అధమం రెండు గడియలలో వచ్చును. he goes to church at * once a week వాడు గుడికి నిండా పోతే వారానికి వొకసారి పోతాడు. these boys learn at * three lessons a week యీ పిల్లకాయలు నిండా చదివితే వారానికి మూడు పాఠాలు చదువుతారు. the * it will cost is 5 Rupees దీనికి నిండా పట్టితే అయిదు రూపాయలు పట్టును. they make the *of a single instance అన్నిటికి వీండ్లకు యిది వొకటి చిక్కినది అనగావొకమాటు జరిగినదాన్ని పట్టుకొని తేప తేపకు వుదాహరిస్తారని భావము. you must make the * of your time నీవు క్షణమైనా వృథాగా పోనియ్యరాదు.
Mostly adv శానామట్టుకు, బహుశః, ప్రాయశః.
Mote n s రేణువు, అణువు, నలుసు, నెరసు. a * in the eye కంటిలోని నెరసు.
Moth n s చిమట.
Mother n s తల్లి, అమ్మ. idleness is the * of all sins పాపముల కన్నిటకి సోమారితనమే కారణము. the * crow తల్లి ఆవు.a step * మారుతల్లి, చవితితల్లి, అనగా తనతల్లి చనిపోయిన తరువాత తండ్రి మళ్లీ పెండ్లి చేసుకొన్న ఆమె. the * by bloodor own * కన్నతల్లి. * in-law అత్తగారు. a foster * పెంపుడుతల్లి, సాకినతల్లి. a grand * అవ్వ. a great grand * ముత్తవ్వ.* country స్వదేశము. Tamil is his * language వాడికి స్వభాష అరవము. fits of the * స్త్రీలకు వచ్చే వొకవిధమైన శూలనొప్పి.or dregs in oil &c. గసి, మష్టు.
Mother o'pearl n s ముత్యపు చిప్ప వన్నెగల వొకవిధమైనగాజు, దీనితో యింగ్లీషు వారు బర్త్తా అనే బిళ్లలు చేస్తున్నారు.
Motherless adj తల్లిలేని, మాతృవిహీనమైన.
Motherly adj తల్లి సంబంధమైన. * love తల్లికి బిడ్డలయందు వుండే వ్యామోహము, పుత్రవాత్సల్యత.
Mother-wit n s సమయోచితముగా స్ఫురించిన యుక్తి, అనగా అకస్మాత్తుగా వొక మూఢుడికి తోచిన మంచి యుక్తి.
Mothery adj మష్టుగా వుండే. * oil మష్టుగా వుండే నూనె.
Mothy adj చిమటలు పట్టిన.
Motion n s చలనము, కదలడము, గతి, గమనము. the * of a star నక్షత్రము యొక్క గతి. * of planets గ్రహచారము, గ్రహగతి.the * of the pulse ధాతువు ఆడడము. the * of a fan విసనకర్ర యొక్క చలనము. from the * of his lips I thought he was speaking వాడి పెదవులు కదలడమువల్ల మాట్లాడుతూ వుండినాడను కొంటిని.while the wheel was in * చక్రము తిరుగుతూ వుండగా. the wind puts the leaves in * గాలిచేత ఆకులు కదులుతవి. he lay devoid of senseand * స్మారకముతప్పి నిశ్చేష్టితుడుగా వుండెను. they watched all his *s వాడి చేష్టలన్ని బాగా కనిపెట్టినారు. every good * of the mind comes from God మనస్సులో పుట్టే మంచితలంపులన్ని దేవుడివల్ల కలుగుతవి.or a request in a Court మనివి, మనివిఅర్జి. he did it of his own * ప్రయత్నపూర్వకముగా చేసినాడు. or stool పురీషము, మలము. the patient had four *s ఆ రోగికి నాలుగుమాట్లు బేదులు అయినవి.
Motionless adj కదలని నిశ్చేష్టితముగా వుండే. it remained *కదలక వుండెను.
Motive n s కారణము, హేతువు, నిమిత్తము, అభిప్రాయము, భావము. through evil *s దురాలోచనపట్టి. what was your * in doing this? దీన్ని చేయడములో నీ యభిప్రాయమేమి.
Motley adj చిత్రవర్ణముగల, నానావర్ణములుగల. a * dress నానావర్ణములుగల వుడుపు. a * dialect సంకర భార. a * group నానాజాతులు కూడినగుంపు, సుంకరము. their's is a * life వాండ్లకు వొక నాడు సుఖము వొకనాడు దుఃఖము.
Mottled adj చిత్రవిచిత్రమైన. (as a large cowry shell పెద్దగవ్వవలె) నానావర్ణములుగల, బొల్లి, బట్ట. a * cow బొల్లిఆవు,బట్టావు. a * dove పొడలగువ్వ.
Motto n s మంగళ శ్లోకము, మంగళ వాక్యము, అనగా చెప్పిన గ్రంథము యొక్క సారాంశమును శ్లేషగా వుదాహరించిన గ్రంథాంతర వాక్యము, దీన్ని గ్రంథము యొక్క మొదటి పత్రములో గాని ప్రతి అధ్యాయారంభములో గాని వ్రాస్తారు. on a seal or ring ముద్ర, శిఖావుంగరము, వీటి మీద వుండే బిరుదుకింద వ్రాసిన వాక్యము.
Mould n s (mildew) బూజు, or earth మున్ను. or wherein a thing is cast పోతఅచ్చు. a * for bricks ఇటికెఅచ్చు. to cast in a * పోత బోయుట. an image east in a * పోతవిగ్రహము. allthese stories are cast in the same * యీ కథలంతా వొకటేరీతి.
Mouldering adj మన్నైపొయ్యే, మగ్గిపొయ్యే, చివికి పొయ్యే. the * walls వుప్పురిశిపొయ్యే గోడలు.
Mouldiness n s బూజు.
Moulding n s కొయ్య, గచ్చు, రాయి, వీటిమీద విచిత్రముగా చేసే వుబుకువాటు పని.
Mouldy adj బూజు పట్టిన. it grew * దానికి బూజు పట్టినది.
Mound n s దిబ్బ, మంటిదిబ్బ, కట్ట.
Mount n s కొండ, పర్వతము, తిప్ప, దిబ్బ. the * or `St. Thomas' *' (a place near Madras) పరంగికొండ. the * road పరంగికొండకు పొయ్యే భాట.
Mountain n s కొండ, పర్వతము. the wind raised the sea *s high గాలివల్ల అలలు కొండలవలె వచ్చినవి. he makes *s of molehills కొద్ది కష్టమును మహా బ్రహ్మండముగా చెప్పుతాడు.
Mountaineer n s పర్వతవాసియైన చెంచువాడు.
Mountainous adj కొండలమయమైన, కొండల, పర్వతపు. a * country కొండల రాజ్యము, పర్వతదేశము.
Mountebank n s పితలాటకపు వైద్యుడి, కనుకట్టు విద్యలుచేసేవాడు.* feats గారడివిద్యలు.
Mountebankism n s (Croly's Geo. IV. 218.) పితలాటకము, మటుమాయలు.
Mounted adj యెక్కిన. a stick * with silver వెంట్టువేసినకర్ర. an ivory box * with silver వెండిపువ్వులువేసిన దంతపుభరణి. a cannon * చట్టముమీది కెక్కించిన ఫిరంగి.
Mounting n s బంగారుపూలు, వెండిపూలు. gold * upon an ivory box దంతపు పెట్టెమీద వేసి బంగారుపూలు.
Mourner n s దుఃఖపడేవాడు, విచారపడేవాడు, దుఃఖవుడుపును వేసుకొనేవాడు.
Mournful adj వ్యసనముగావుండే, వ్యసకరమైన, దుఃఖకరమైన. she had a * face యేడ్పు ముఖముగా వుండినది. a * occurrence దుఃఖకరమైనపని. a intelligence దుఃఖసమాచారము.
Mournfully adv వ్యసనముగా, దుఃఖముగా. his family is * reduced అయ్యో వాడింట్లో శానా మంది చచ్చినారు.
Mournfulness n s దుఃఖము, శోకము, వ్యసనము. from the * of these tidings యివి దుఖకరమైన సమాచారములు గనుక.
Mourning n s దుఃఖము, వ్యసనము. or dress of sorrow దుఃఖవుడుపు, నల్లవుడుపు. the time of * (the Hindu phrase is) సూతకము. he went into * దుఃఖవుడుపు తొడుక్కొన్నాడు, సూతకము ఆచరిస్తాడు. ఆ శౌచము పట్టినాడు. deep * పూర్ణదుఃఖవుడుపు. half * అర్ధ దుఃఖవుడుపు.
Mouse n s చిట్టెలుక, చుండెలుక. * hole కలుగు, యెలుకబొక్క.
Mouse-deer n s జరిణిపంది. Zarini-pandi.
Mouser n s యెలుకనుపట్టేటిది. this cat is a good * యీ పిల్లి యెలుకను బాగా పట్టేటిది.
Mouth n s నోరు. word of * మాట, ముఖవచనము. the * of a river యేటి ముఖద్వారము. corners of the * సెలవులు. a big * బాకినోరు. this horse has a good * యీ గుర్రము కళ్ళెమునకు స్వాధీనమైనది. he is down in the * about this (Johnson) యెటూ తోచక మిణకరిస్తున్నాడు, ఖన్నుడైవున్నాడు. she made *s at them వాండ్లను వెక్కిరించినది. you need not make * at this నీవు దీనికి అసహ్యపడవద్దు.
Mouthed adj నోరుగల. a hard * horse కళ్ళెమునకు అణగని గుర్రము. a tender * horse కళ్ళెమునకు అణిగే గుర్రము. a foul * woman తిట్టు బోతు, వదురుబోతు. he was very mealy * about is యిందున గురించి విశదముగా చెప్పక గుటకలు మింగినాడు.
Mouthful n s కడి, కబళము, గుక్కెడు. I have not had a * to-day నేడు నేను వొకకడి అయినా తిన లేదు. a * of water గుక్కెడు నీళ్ళు. he took a * of areca or betel వొక తాంబూలము చేసుకొన్నాడు. the child has a * of teeth ఆ బిడ్డకు అన్ని పండ్లు మొలిచినవి.
Mouth-piece n s సన్నాయి మొదలైనవాటికివేసే ఆకు, హూక్కాకాడకు నోట్లో పెట్టుకొనే చోట తగిలించే గొట్టము. that man is the * ofthe village ఆ వూరి వాండ్లందరు అతని ద్వారా మాట్లాడుతారు.
Move n s కదిలించేవాడు. who was the first * of this business? దీన్ని మొదట ప్రస్తాపము చేసినది యెవరు.
Moveability n s కదిలేశక్తి, చరభావము, సంచరించే శక్తి.
Moveable adj కదిలించ కూడిన.
Moveables n s plu. జంగమసొత్తులు, యింటి సామానును. he gave me his * అతని జంగమసొత్తులను నా కిచ్చినాడు.
Moved adj కదిలిన, జరిగిన. she was much * at hearing this దీన్ని విని మహా వ్యాకులపడ్డది. he was not * at all I said నేను చెప్పినదంతా వాడికి లక్ష్యములేదు. he was much * at seeing this దీన్ని చూచి వాడికి మహా అగ్రహము వచ్చినది, నిండా ఆయాసమైనది.
Moveless adj కదలని, చలించని.
Movement n s గమనము, నడక, చలనము, చేష్ట, వ్యాపారము. they observed all his *s వాడు చేసే పనులనంతా కనుక్కొన్నారు, యెక్కడడెక్కడికి పోతున్నాడో కనిపెడ్తారు. the the *s of a clock గడియారపు బిసలు.
Moving adj మనస్సును కరిగించే, జాలి పుట్టించే. a * story యేడ్చేటట్టుచేసే కథ.
Movingly adv మనస్సు కరిగేటట్టు, జాలిపుట్టేటట్టు. he looked at me very * జాలిపుట్టేనన్ను చూచినాడు.
Mow n s వామి, గట్టివామి.
Mrs n s (Contraction of Mistress) pronounced miss-iz దొరసానుల పేరుకు ముందుగా పెట్టే గౌరవ వాచక శబ్దము.
MS n s (Contraction of `Manuscript') వ్రాసిన గ్రంథము. MSS. plu. `Manuscripts' వ్రాసిన గ్రంథములు, లిఖిత గ్రంథములు.
Much n s నిండా, శానా, విస్తారము. he is not * of a painter వాడంత చిత్రపు పనివాడు కాడు. how * is there of this grain? యీధాన్యము యెంత మాత్రము అక్కడవున్నది. he takes too * upon himselfనిండా అహంకరిస్తాడు, నిండా స్వతంత్రపడుతాడు. he made * of them వాండ్లను నిండా ఆదరించినాడు. I am too * tired to go నిండా అలిసినాను పోలేను.
Mucilage n s బంక, బంకగా వుండే, జిగటగా వుండే.
Muck n s యెరువు, పెంట, కశ్మలము. his hands are covered with * వాని చేతులు కశ్మలముగా వున్నవి. to run a * వెర్రెత్తితిరుగుట, సాహసము చేశి ప్రాణమునకు తెగించి చేలరేగుట.
Muckworm n s పేడపురుగు. miser పిశినారిబంక.
Mucky adj కల్మలముగా వుండే.
Mucous adj బంక సంబంధమైన, బంకగా వుండే.
Mucus n s చీమిడి, గోళ, గళ్ళ. of the bowels when disordered బంక, ఆమము, ఆమకట్టు.
Mud, mud n s. అడుసు, బురద, రొంపి, మన్ను * fort మంటికోట.
Muddily adv అస్పష్టముగా.
Muddiness n s మురికి.
Muddled adj మయకమెక్కిన, తాగిన. he is completely * with reading వాడికి చదువుపిచ్చిపట్టినది.
Muddy adj మురికిగావుండే, బురదగావుండే, కలకపారిన. * water బురదనీళ్ళు. * clothes బురద మరకలుగావుండే గుడ్డలు. he told this story in a * manner ఆ కథను అస్పష్టముగా చెప్పినాడు.
Muff n s చలికాలమందు రెండు తట్లాచేతులు దూర్చి కడుపున ఆనించుకొనేటిది, దీన్ని ముఖ్యముగా యెలుగుగౌడ్డుతోలుతోటి తలగడ ఆకారముగా బోలుగా చేస్తారు.
Muffin n s వొక విధమైనరొట్టె, మెత్తని అప్పము.
Muffled adj కప్పిన, మూసిన, ముసకు వేసిన. the Musulman women are * up తురక స్త్రీలు ఘోషా వేసుకొని వుంటారు. a * bell బాగా వాగ కుండా తాడు కట్టినగంట. they rowed with * oars తోట సేప్పుడు చప్పుడు కాకుండా వుండడమునకై పేలికలు చుట్టిన అల్లీన కర్రలతో పడవలను తోసినారు.
Muffler n s ముఖానికి వేసుకొనే ముసుకు.
Mufti n s తురక ధర్మశాస్త్రజ్ఞుడు.
Mug n s పానపాత్రము, చెయిపిడిగలజోడు తపేలా, ముంత. an ugly * ముంతమూతి. a tin * చెయిపిడిగల తగరపు జోడుతపేలా, సీనాజోడు తపేలా.
Muggy adj మందారముగా వుండే, వుక్క చేత వుడికే, వుమ్మదముగా వుండే.a * day మందారము వేసుకొని వుక్కచేత వుడకపోసే దినము.
Mulatto n s చట్టకారివాడు, పరంగి వాడు.
Mulberry n s కంబళిచెట్టు, కంబళి పండు, పట్టుపురుగు భక్షించే వృక్షము యొక్క పండు.
Mulct n s అపరాధము, జుల్మానా.
Muleteer n s కంకరగాడిదె వాడు, యిది గుర్రపువాడు అనే మాటవంటిది.
Mulish adj పశుప్రాయుడైన, చణగరమైన, మూర్ఖుడైన. * obstinacy మడ్డిగాడిదె మూర్ఖత్వము.
Mull mull n s muslin రవసెల్లా.
Muller n s పొత్తరము.
Mullet n s మేవచేప. some sorts are called ఆకు జల్లచేప, బాళి, బొంతచేప, మడవచేప.
Mulligrubs n s కడుపునులి, కడుపు కుట్టు, కడుపుమంట, యిది నీచమాట.
Multifarious adj నానా, చిత్రవిచిత్రమైన.
Multiple n s గణితశాస్త్రమందున వచ్చే వొక శబ్దము, సరిపాలుపొయ్యే సంఖ్య, అనగా 9, 16, 80, 32 యిలాటి సంఖ్యలు.
Multiplicand n s ఒడ్డు.
Multiplication n s గుణకారము. * table యెక్కాలు.
Multiplicator n s గుణకము.
Multiplicity n s బహుత్వము, అనేకత్వము. from the * of proofs దృష్టాంత బాహూళ్యమువల్ల. from the * of such books యీలాటి పుస్తకాలు శానా వున్నవి గనుక.
Multiplied adj గుణించిన, పెంచిన, అనేకమైన. ten * by three isthirty మూడు పదులు ముప్పై. there are * proofs అనేక దృష్టాంతములు వున్నవి.
Multiplier n s గుణకము. 3 times 6 is 18 యిందులో మూడు గుణకము.
Multitude n s బహుళ్యము, అనేకత్వము, సమూహము, ప్రజ, గుంపు. there is a * of proofs regarding this యిందుకు అనేక దృష్టాంతములున్నవి. great *s బహుజనము. he did it to please the * లోకులను సంతోషపెట్టడానకై చేసినాడు.
Multitudinous adj పరిపరి విధమైన, నానా, విస్తారమైన, బహు, శానా.
Mum interj వూరుకో, ఆ మాట యెత్తక.
Mummer n s వేషమువేసుకొన్న వాడు, మొహరములో జలారి మొదలైన వేషగాడు, భాగవతుడు.
Mummery n s వేషము, మాయవేషము, కపట వేషము, భాగవతము.
Mummy n s యెండినపీనుగ, వాసనకట్టి వుంచిన పీనుగ. to beat to * చావగొట్టుట. a medicine, యిటువంటి శవము యొక్క మాంసముతో చేశినమందు.
Mumper n s మాయబిచ్చగాడు. A beggar of a superior class వైరాగి, సన్యాసి.
Mumping adj వేషధారియైన, మాయగావుండే. a * beggar మాయబిచ్చగాడు. I saw him sit * in his house under ground వాడింటిలో నొకగొందిలో నమోనమో అని కూర్చుండగా వాణ్ని చూచినాను.
Mumps n s గవదబిళ్ళలు, గాలిబిళ్ళలు, జలుపుగడ్డలు.
Mundane adj ఐహిక సంబంధమైన, లౌకిక, ప్రపంచపు. the * sphere ప్రపంచము, లోకము.
Mundungus n s దుర్గంధమైన పొగాకు.
Mungoose n s ముంగిస.
Mungrel adj See Mongrel.
Municipal adj వూరి సంబంధమైన. the * authorities గ్రామాధికారులు.* law వూరి చట్టము, గ్రామ చట్టము.
Municipalitiy n s గ్రామము, దేశము, జనము.
Munificence n s దాతృత్వము, ఔదార్యము.
Munificent adj దాతయైన, ఉదారియైన.
Munificently adj దాతృత్వముగా, ఔదార్యముగా.
Muniment n s దస్తావేజు, dastavez.
Munjaul n s (a Tamil word for turmeric) పసుపు.
Munjeet n s మంజిష్ఠ.
Mural adj గోడ సంబంధమైన. a * crown వొక విధమైన కిరీటము, అనగా కోటబట్టినా వాడికి బురుజు ఆకారముగా చేసి బహుమానమిచ్చిన కిరీటము. a * tablet గోడలో చెక్కిన రాతిపలక, యిందులో చచ్చినవారి చరిత్ర వ్రాసి వుంటున్నది.
Murder n s ఖూని, హత్య. self * ఆత్మహత్య, స్వహత్య. the * came out or the secret is known ఆ మర్మము బయటపడ్డది. the vulgar word is బ్రహ్మత్య meant for బ్రహ్మహత్య thus. కుక్క బ్రహ్మత్య dog-killing.
Murderer n s చంపినవాడు, హత్య చేసినవాడు, ఖూని చేసినవాడు, (నరఘాతి. A+.)
Murderess n s ఖునిచేసిన స్త్రీ.
Murderous adj అతిక్రూరమైన, ఘాతకమైన, పాపిష్ఠి.
Muriatic acid n s ఉప్పు ద్రావకము, లవణ ద్రావకము.
Murk n s పిప్పి. See Johnson in Ciderkin.
Murky adj చీకటిగావుండే, గాఢాంధకారముగా వుండే.
Murmur n s గొనుగు, సణుగు. the * of the breeze గాలియొక్క బుర్రుమనేధ్వని. the * of the sea shore సముద్రఘోషము.the *s of the crowd గొలగొలధ్వని. the * of the waterజలజలమనే ధ్వని.
Murrain n s తెవులు, గోమారి. a * take such trumpery! (Vicar of Wakefield Chap. XII. యిది యెందుకు కుప్పులో తీసుకొనిపోయి వెయ్యి.
Musalman n s తురకవాడు.
Muscadel n s వొకవిధమైన ద్రాక్షపండు.
Muscadine n s వొకవిధమైన ద్రాక్ష పండు.
Muscle n s మాంసము, నరము, మాంసల మైన అవయవము. or shell-fish నత్త.
Muscovado sugar n s వొక విధమైన పంచదార, చక్కెర.
Muscovy n s Russia దేశము.
Muscular adj మాంసలమైన, కండగల. a * man బొందు శరీరముగలవాడు,లావాటి వాడు, పుష్టిగలవాడు.
Muse n s or Musing ఆశ్చర్యము, పరధ్యానము, పరాకు.
Museum n s చోద్యమైన వస్తువులను సంగ్రహించిపెట్టివుండే యిల్లు. a botanical * నానావిధ అపరూపమైన చెట్లను సంగ్రహించిపెట్టి వుండే యిల్లు. a * of natural curiosities అపరూపమైన చెట్లు మృగాలు మొదలైన వాటిని సంగ్రహించి పెట్టివుండే యిల్లు. the poetical * కావ్యనిధి, కావ్యసముచ్చయము, యిది వొక గ్రంథనామము.
Mushroom n s కుక్కగొడుగు, పుట్టకుక్క. a wretch తచ్ఛుడు, అల్పుడు. used as an adjective, స్వల్పమైన, వట్టి, పనికిమాలిన,బేల. a mere * attempt జబ్బు ప్రయత్నము. a * government పంజదొరతనము. a * project కొనకు బుస్సని పొయ్యే మహత్ప్రయత్నము.
Music n s సంగీతశాస్త్రము, సంగీతము, పాట, వాద్యము, మేళము, శ్రావ్యమైనధ్వని. this was * to his ears యిది వాడికి శ్రవణానందముగా వుండెను. * master పాఠకుడు, వాద్యమునేర్పేవాడు.
Musical adj సంగీత సంబంధమైన, చెవులకింపైన, శ్రావ్యమైన.a * instrument వాద్యము. a * box సంగీతపెట్టె, అనగా బిసను తిప్ఫితే కొంతసేపు తనకు తానే సంగీతము పాడే పెట్టె.
Musically adv శ్రావ్యముగా, చెవులకింపుగా.
Musician n s పాఠకుడు. Musicians వాద్యగాండ్లు, మేళగాండ్లు.
Musk n s కస్తూరి.
Muskdeer n s వొకవిధమైన మృగము.
Musket n s తుపాకి. * ball తుపాకి గుండు. within a * shot of them వాండ్లకు తుపాకిగుండు పారేంతదూరములో.
Musketeer n s తుపాకివాడు, సిఫాయి.
Musketo n s or Muskito దోమ.
Musketry n s తుపాకివేట్లు. they were killed with * తుపాకివేట్ల చేత చచ్చినారు.
Muskito n s దోమ.
Muskmelon n s కస్తూరికరుబూజా పండు.
Muskrat n s చుంచు.
Muskrose n s వొకవిధమైన రోజాపుష్పము.
Musky adj కస్తూరి వాసనగల.
Muslin n s రవశల్లా. book * వొకవిధమైన రవశల్లా.
Musquet n s తుపాకి. See Musket.
Musquito n s a gnat దోమ.
Mussulman n s తురకవాడు.
Mussulmans తురకలు
Must n s ఫలరసము, యిది ముఖ్యముగా ద్రాక్షఫలరసము, అప్పుడే దించిన కల్లున్ను, యిందులో కైపు లేదు.
Mustaches n s plu. or Mustachios మీసాలు.
Mustard n s ఆవాలు. the * tree ఆవ చెట్టు. as small as * seed ఆవగింజంత. In Matt. సర్షపబీజము A+. which is ఆవాలు SC.
Muster n s హజరు చూడడము, వుండచూడడము, గణితి. or collection సమూహము, గుంపు. or sample (Indian English) మాదిరి. this will notpass * యిది అంగీకారము కానేరదు, సరిపడదు.
Mustermaster n s హాజరు చూచేవాడు, గణితి చూచేవాడు.
Muster-roll n s పేర్ల పట్టి, గణితి జాబితా.
Mustiness n s బూజు, మగ్గు.
Musty adj బూజుపట్టిన, మగ్గిపోయిన. * straw మగ్గిన కసువు. a * story ముసలమ్మసుద్దులు.
Mutability n s అస్థిరత, అనిత్యత్వము, చాంచల్యత, మారడము.
Mutable adj అస్థిరమైన, అనిత్యమైన, చంచలమైన, మారే.
Mutableness n s అస్థిరత్వము, అనిత్యత్వము, మారడము.
Mutation n s మారడము, పరివర్తనము.
Mutatis Mutandis adv మార్చవలసినదాన్ని మార్చి this letter may be addressed to each of them mulatis mulandis కొన్ని మాటలు మాత్రం వేరే పెట్టుకుంటే యీ జాబునే ప్రతిమనిషికి వ్రాయవచ్చును.
Mute n s నోరు మూసుకొని వుండేవాడు. a sort of officer బంట్రోటు. or attendant at a funeral నల్లవుడుపు వేసుకొని శవమును మోసుకొని పోయి వూడ్చే పనివాడు. or a silent consonant అపస్వరాంగమైన హల్లు, అర్ధాక్షరము.
Mutely adv మౌనముగా, నోరెత్తకుండా.
Mutilated adj ఛేదించబడ్డ, భిన్నమైన, వూనమైన.
Mutilation n s అంగచ్ఛేదము, భిన్నము, వూనము.
Mutineer n s తిరగబడ్డబంటు, యజమానుని యెదిరించిన వాడవాడు. the usual word is యేడాగోడము చేసేవాడు.
Mutinous adj తిరగబడే, యెదరించే.
Mutinously adv తిరగబడే, యెదిరించే.
Mutteringly adv గొణుగుతూ, సణుగుతూ, గొణగొణగా.
Mutton n s గొర్రెమాంసము, వేటమాంసము, యీమాట మేక మాంసమునకు చెల్లదు. goat's flesh మేకమాంసము. a leg of * వేటతొడ. a breast of * నానుబోర.
Mutton-fist n s మొద్దుచెయ్యి, మోటు చెయ్యి.
Mutual adj అన్యోన్యమైన, పరస్పరమైన.
Mutually adv అన్యోన్యముగా, పరస్పరము, వొకరికొకరు. they were * displeased వారి కొకరికొకరికి ద్వేషమైనది.
Muzzle n s మూతి, నోరు. the * of a gun తుపాకినోరు, ఫిరంగినోరు.they charged (or loaded) the gun to the * ఆ ఫిరంగి మూతి దాకా మందువేసి గట్టించినారు. a sort of bag మూతికి వేసే చిక్కము, బుట్టి.
My pron నా నాది, నా యొక్క.
Myna n s (an Indian bird) మైనాపిట్ట, గోరువంక.
Myriad n s పదివేలు. the birds came in *s ఆ పక్షులు అనేకముగా వచ్చినవి, వేలతరబడిగా వచ్చినవి.
Myrmidon n s కింకరుడు, అనుచరుడు, చేతికిందివాడు.
Myrobalan n s ఉసిరికాయ,
Myrrh n s బోళము, గోపరసము, యిది పరిమళముగల వొకబంక. the Tamil Bible says బోళము. Carey uses the Greek word. బాలింత బోళము. Tariff. Myrtle, n. s. పరిమళముగల వొక చెట్టు. the Indian * గొంజి. in poetry it answers to కదంబ వృక్షము, పొన్న చెట్టు.
Myself pron నేనే. I * went there నేనే పోయినాను. I saw * in the glass అద్దములో నేనే చూచుకొంటిని. I defended * నామట్టుకు నేనుకాపాడుకొంటిని. I worte it for * నా సొంతానికి వ్రాసుకొంటిని. Mysore, n. s. మైసూరనే పట్టణము. Mysterious, adj. గూఢమైన, అగోచరమైన, దురవగాహమైన, భావగర్భితమైన,మర్మమైన. his conduct is very * వాడు చేసేది బహుమర్మముగా వున్నది.
Mysteriously adv గూఢముగా, భావగర్భితముగా, దురవగాహముగా, మర్మముగా.
Mysteriousness n s గూఢత్వము, దురవగాహత్వము, మర్మము. from the * of this business యీ కార్యము అతిగూఢముగా వుండుటవల్ల.
Mystery n s రహస్యము, మర్మము or trade కులకాయకము. a secretin trade శిల్పులు మొదలైన వారిలో వుండే వొక మర్మము [నిగూఢతా. A+.]
Mystical adj గూఢమైన, మర్మమైన, దురవగాహమైన, భావగర్భితమైన.
Mystically adv గూఢముగా, మర్మముగా, దురవగాహముగా, భావగర్భితముగా.
Mystification n s పితలాటకము, కృత్రిమము, టక్కు, వట్టిమాయ, యిది నీచశబ్దము.
Mystified adj పితలాటకములోబడ్డ, భ్రమలో చిక్కిన, మాయలో తగిలిన.
Mythological adj కవి కల్పితమైన, పౌరాణిక, పురాణ సంబంధమైన.
Mythologically adv పౌరాణికముగా, పురాణరీతిగా.
Mythologist n s పౌరాణికుడు, పురాణవక్త.
Mythology n s పురాణము, పౌరాణక విద్య. he detailed the * of his hamlet తన పల్లె యొక్క పురాణమును వివరించి చెప్పినాడు.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment