D English to Telugu free online dictionary

D as an abbreviation denotes Doctor ; thus D.D. Doctor ofDivinity; LLD Doctor of laws. M. D. Doctor signifying500
D. In correspondence "(D. V.)" signifies (Deo,'volente)ifitpleaseGodదైవానుధీనముగా
Da capo adv పునః, మళ్లీ, తిరిగి ఆరంభించుమన్న సౌజ్ఞ, యిదిసంగీతశాస్త్రమును గురించిన మాట.
Dab n s ముద్ద. he put a * of cow dung on the wall పేడ వుంటనుగోడమీద తట్టినాడు. he put a * of paint on my face and ranaway నా ముఖము మీద వర్ణము పూసి పరుగెత్తిపోయినాడు, చరిమిపరుగెత్తి పోయినాడు. In low langugage గట్టివాడు, తెలిసినవాడు.యిది నీచమాట. he is a * at English వాడు యింగ్లీషులోగట్టివాడు.
Dabbled adj తడిసిన. * in blood నెత్తురులో తడిసిన.
Dabbler n s బాగా చేతకాని పనిలో చెయి పెట్టుకోనేవాడు, తనకే బాగాతెలియని పనిని చేయ నుద్యోగించేవాడు.
Dab-chick n s బాతుపిల్ల.
Dace n s ఒక తరహా చిన్నచేప.
Dacoit n s ( Hindustani word for a gang robber , a plunderer)బందిపోటుదొంగ.
Dacoity, Decoity n s. బందిపోటు దొంగతనము,.
Dactyl n s ఛందస్సులో, భగణము, అనగా ఒక గురువు రెండు లఘువులు.
Dad, or Daddy n s. అప్ప, నాయన, తండ్రి, అన్నా, అయ్యా,యిది చిన్న పిల్లకాయలు తండ్రిని పిలిచే ముద్దుమాట,యిది కాప మాట.
Daedal adj చిత్రమైన, శృంగారమైన.
Daffodil n s ఒక తరహా అడివి పుష్పము.
Dagger n s కటారి, బాకు. they are at dagger's drawing.వారిలో ఒకరికొకరు గొంతులు కోసుకొనేటట్టు వున్నారు.
Daggled adj తడిసిన.
Dahlia n s నానావర్ణముగల ఒక తరహా పుష్పము, యిందులోఅనేక జాతులు కలవు.
Daily adv ప్రతిదినము, నిత్యము.
Daintily adv రమ్యముగా, రమణీయ్యముగా, విలక్షణముగా.సొగసుగా, స్వారస్యముగా, యింపుగా, గరాగరికగా.
Daintiness n s గరాగరికగా, వైలక్షణ్యము,సొగుసు, స్వారస్యము, యింపు. fastidiousness రాజసము,గర్వము. తినడములో బట్టలు కట్టడములో గర్వము.
Dainty adj or delcious రుచియైన, భోగ్యమైన. or delicate నాజూకైన, కోమలమైన. Dainty, n. s. రుచిగల పదార్ధము, తీపిగా వుండే వస్తువు.
Dairy n s పాలు, పెరుగు మొదలైనవిగా వుంచే యిల్లు. * prouduceపాడి. a * maid గొల్లది, మజ్జిగచేసేటిది. * man మజ్జిగచేసేవాడు.
Daisy n s అడవిపట్టున వుండే ఒక సువాసనగల పుష్పము. daisied ఆ పువ్వుల మయముగా వుండే.
Dale n s పల్లము, లోప, రెండుకొండల సందున వుండే పల్లము. hill and * మెరకాపల్లము , నిమ్నోన్నత స్థలము.
Dalliance n s acts of fondness amorouness సరసము, ముద్దులాట, కేళి.
Dallying n s సరసమాడడము , ముద్దులాడడము, విహారము, విలాసము.
Dam n s or mother తల్లిమృగము, ఆడపులి, ఆడ యేనుగ మొదలైనవి.or bank గట్టు, ఆనకట్టు, మడవ, వుద్ది సేతువ.
Damaged adj చెడిపోయిన, పనికిమాలిన, శిథిలమైన, జబ్బైన. * crcokery, మొర్రిచిప్పలు. cloth * by moisture చినికిపోయిన గుడ్డ. paper * by age కట్టుగడ కాకితములు.
Damanable adj అతి, అతిపాపిష్టి, చెడ్డ, దుష్ట.
Damaned adj or wicked అతిపాపిష్టైన. or punished in hellనరకములో పడ్డ. In Mark XVI.16. దండిత. a+. ఆజ్ఞకు లోపరచబడ్డ. G+.
Damascene n s a plum, ఒక పండు. adj. ( coming from the countryof Damascus ) డామాస్కు దేశపు. a * blade దివ్యమైన ఖడ్గము.
Damask n s డమాసు. అనగా చెట్లువేసిన పట్టు, బుటేదారి శెల్లా.a * complexion శిబ్బెము గల ముఖము. * rose శ్రేష్టమైనరోజా పుష్పము.
Damasked adj బుట్టాలువేసిన. * figures పువ్వుల పని,యిది పట్టునుగురించి, చిన్న ఖడ్గమును గురించిన్ని చెప్పేమాట.
Dame n s అమ్మ. or lady దొరసాని. a noble * ఘనమైన స్త్రీ.a school * వుపాధ్యాయురాలు.
Dammer n s ( a Malay word for rosin ) గుగ్గిలము.
Damnably adv అతి, పాపిష్టితనముగా.
Damnation n s శాసనము, దండన . In Matt. XXIII, XIV. 33.మహాదండము, నరకదండము . A+. వేదన, నరకాజ్ఞ G+.
Damnatory adj శపించే. the * clauses నిషేధించే శపధములు,శాపములు.
Damning adj అతిపాపిష్టి అయిన, విషమైన. this is a * proof ofhis guilt వాడు నేరస్థుడనేటందుకు యిదే పదివేల సాక్ష్యము, యింతకంటేవేరే సాక్ష్యమెందుకు.
Damonstartion n s (add,) (a French pharase for declartion)ప్రకటన.
Damp n s తేమ,చెమ్మ, చిత్తడి. this bad news cast a *over his hopes యీ చెడ్డ సమాచారము చేత వానికి ఆశ తప్పినది.this cast a * over the assembly యీ చెడ్డ సమాచారము వల్ల వాండ్లకు వ్యాకులము తగిలింది.
Dampness n s నేరేడు పండువంటి ఒక పండు.
Damsel n s పడుచు, కన్య, చిన్నది, యువతి.
Dan n s ( an old English word for Noble ) శ్రీమత్;యిది ప్రాచీన కావ్యములో వచ్చేమాట. * cupid శ్రీ మన్మన్మధుడు.
Dance n s ఆట, నటనము, నాట్యము, తాండవము. the torch *పందసేవ, అనగా దివిటీ పట్టుకుని ఆడుట. the stick * కోలాటము.
Dancer n s ఆడేవాడు, ఆడేది, నటి. or a stress భోగముది.rope-dancers దొమ్మరవాండ్లు. a companu of dancers మేళము,మేళగాండ్లు.
Dancing n s ఆట, కేళిక, నర్తనము, నటనము . a * girlబోగముది, వేశ్య, దేవదాశి. a * master నట్టువుడు. a * schoolనాటకశాల. the art of a * నాట్యము, నృత్యము.
Dandelion n s ఒక తరహా అడవి పుష్ప చెట్టు.
Dandriff,Dandruff n s. చుండు.
Dandy n s సొగసుగాడు, బడాయిఖోరు.
Danger n s మోసము, భయము, గండము, అపాయము, ఆపద, విపత్తు.ప్రమాదము. * of life ప్రాణ గండము. this is a task of *యిది అపాయమైన పని. you are in * fever if you live in the forestనీవు అడవిలో నివాసము చేస్తే నీకు జ్వరము వచ్చునని భయముగావున్నది. this will put your life in * యిందుచేత నీప్రాణానికిఅపాయము వస్తున్నది. I was in * of alling నేను పడక తప్పితిని.పడబోతిని. he is in great * వాడి పని యిటో అటో అని వున్నది.he is in * mof death వాడు బహుశా చచ్చును. he was in * of losinghis appointment వాడికి వుద్యోగము పొయ్యేటట్టు వుండెను.a shop-keepr is always in * of sin అంగటి వాడికి పాపముయెక్కడెక్కడని కనిపెట్టుకుని వున్నది. Is he out of * ?వాడి ప్రాణానికి భయములేదా. ? he is not out of * బ్రతుకుతాడనినిశ్చయము లేదు. you may eat this without * నీవు దీన్ని తింటేమరేమిన్ని భయము లేదు.
Dangerous adj అపాయమైన, భయముగల, వుపద్రవకరమైన, ఆపత్కరమైన.this will he * యిందుచేత అపాయము వచ్చును. a * roadఅపాయమైన మార్గము. a * bridge నమ్మరాని వంతెన.a * disease అపాయమైన రోగము,. నమ్మరాని రోగము. he is a * man నమ్మరాని మనిషి. a little learning is a * thing అల్ప విద్యావిషం నిత్యము.
Dangerously adv అపాయముగా . , he is * ill ఆ రోగము చేత వాడుచచ్చేటట్టుగా వున్నాడు.
Dangerousness n s అపాయము.
Dangler n s ముడ్డిచుట్టు తిరుగుతూ వుండేవాడు. a * aboutwomen ఆడవాండ్ల ముడ్డిచుట్టుకుని తిరిగేవాడు.
Dank adj తేమగా వుండే, చెమ్మగా వుండే, చిత్తడిగా వుండే,
Dapper adj little and active మిరియపు గింజవంటి చురుకైనగట్టి. pretty or neat ముద్దుగా వుండే.
Dapple n s చిత్రవర్ణము, ఒక తరహా యెరుపు, యిది పశువులువర్ణమును గురించిన మాట, గాడిదెకున్ను పేరు.
Dappled adj చిత్రవర్ణమైన, నానావర్ణములు గల, గోరు యెరుపుగావుండే.
Daring adj సాహసమైన, తెగువగల, ధైర్యముగల.
Daringly adv తెగువగా, తెంపుగా, సాహసముగా, ధైర్యముగా.
Dark adj చీకటైన, అంధకారమైన. * weather మందారము. a * lantern గుడ్డిలాంతరు, ఘటదీపము, కుండలో పెట్టిన కాగడా, వత్తి .or obscure గూఢమైన, గుప్తమైన. this is a * expression గూఢమైన మాట. a man of * complexion నల్లనివాడు . * eyes కాటుకకండ్లు. * green కాటుకపచ్చ, కప్పుపచ్చ.* red నెత్తురువన్నె. * brown నీలలోహితవర్ణము, వూదావర్ణము.* blue కప్పు నీలివర్ణము. a *deed పాపిష్టిపని. the * passionsకామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, అనగా తామస గుణములు.
Darkened adj చీకటిగా వుండే, అంధకారముగా వుండే. her face was with sorrowవ్యాకులము చేత దాని ముఖము తెలివితప్పి వుండినది, పెంకువలె వుండినది.
Darkish adj కొంచెమునల్లని.
Darkling adv చీకటిలో, అంధకారమందు, యిది కావ్యమందువచ్చేమాట.
Darkly adv చీకటిగా. to see * లీలగా చూచుట.
Darkness n s చీకటి, అంధకారము. * came over my eyesనా కండ్లు మిరమిట్లు కొన్నవి, ఒకటిన్ని తెలియకుండా పోయినది.utter * అంధతమసము, చెడ్డ చీకటి. a deed of * అతిపాపిష్టిపని.
Darling adj ప్రియమైన, ముద్దుగా వుండే. * object ముఖ్యమైన ఆశ.
Darnel n s గురుగాకు, యిది పయిరును చెరిపే ఒక తరహాకలుపు.
Dart n s వేసుడుబరచి, చేబల్లెము, యీటె, బాణము. dartsof love మన్మధ బాణములు. he made a * at the bag సంచినిగుంజుకొనేటందుకై ఒడిసి పట్టుకోవచ్చినాడు, సంచిమీదలటుక్కున చెయ్యివేయవచ్చినాడు. the snake made a * atme పాము నన్ను ఒడిసి పట్టుకోవచ్చినది.a hawk made a * at the bird డేగ ఆ పక్షిమీదికి దూకినది,దాన్ని తన్నుకొని పోయినది.
Dash n s తాకు, దెబ్బ, పెట్టు. the * of waves అలల దెబ్బ.at one * వొక దెబ్బలో. or show డంబము, జంభము. thatfamily cuts a great * (వాండ్లు మహాడంబముగా వుంటారు. or infusionవాసన, జాడ. In his letter there was a * of madness వాడిజాబులో కొంచెము వెర్రితనము కూడా కలిగివున్నది. as that of thepen over the letter T అడ్డగీత, which is written overక,చ,త, &c. తలకట్టు. that which is written under ఖఘధభ.& c. జడ, ఒత్తు. or flourish used in accounts ఫాటా, సరియనేగురుతు.
Dashed adj కొట్టిన, కుంగకొట్టిన. his spirits were * atthis news యీ సమాచారము వినగానే వాడు దిగులుపడ్డాడు, కుంగిపోయినాడు.You look quite * నీవేమి ఖిన్నుడుగా వున్నావు.
Dashing adj కొట్టే. * waves కొట్టే అలలు. or grand, noble డంబమైన, జంభమైన.
Dastard n s పిరికి, పంద, కోచ, పిదప.
Dastardly adj పిరికైన, పందైన, కోచైన, పిదపైన.
Data n s ( Latin, this is plural : the singular is datum,which is the Sancrit word దత్తం " that which is given ")మూలసిద్ధాంతము, ఉభయవాదులున్ను ఒప్పుకోనేవిషయము. If youdeny my * how can I argue ? నీవు మొదలే ఒప్పుకోకపోతేనేను పైన యేమి మాట్లాడేది. If we know the price of corn,the price of labour, and the demand of labour, fromthese three data we can calculate the proper amountof wages యీ మూడు మొదటి సిద్ధాంతములు తెలిస్తే న్యాయముగాసంబళ మింతైనదని చెప్పవచ్చును.
Date n s a fruit ఖర్జూరపండు. * tree ఖర్జూరపు చెట్టు.tree wild * tree యీతచెట్టు. of time తేది. from that* అప్ఫటి నుంచి. that custom is now out of * ఆ వాడుకయిప్పుడు లేదు.
Dateless adj తేది లేని.
Dative adj కి,కు,కై, కొరకు. యిది కొన్ని చోట్ల షష్టీవిభక్తిగాను, చతుర్ధీ విభక్తిగాను నున్ను వుంటున్నది.
Datura n s meant for Dhutturaదుత్తూరము, వుమ్మెత్త చెట్టు.
Daub n s పూత, మరక. this painting is a sad * యెడ్డాదొడ్డిగాతారుమారుగా వ్రాసిన చిత్రము.
Daubed adj పూసిన, అలికిన.
Dauber n s మడ్డి చిత్రకాడు.
Daubing n s పూత, లేపనము.
Daughter n s కూతురు, కొమార్తె, పిల్ల. grand * మనుమరాలు.daughter's husband అల్లుడు. daugher's son దౌహిత్రుడు. Seethe word step.
Daughter-in-law n s కోడలు.
Daunted adj భయపడ్డ, దిగులుపడ్డ, బెదిరిన.
Dauntless adj నిర్భయమైన, దిగులుపడని, బెదరని ,వీరుడైన, సాహసుడైన.
Daw n s కాకివంటి ఒక పక్షి.
Dawb see daub
Dawdle n s సోమారిగొడ్డు, సోమారిస్త్రీ.
Dawdling v n జాప్యముచేసుట, ఆలస్యము చేసుట, జాగుచేసుట.
Dawk n s ( an Indian word for the post or mail ) టపాలు.
Dawn n s అరుణోదయకాలము , వేకువ, ప్రాతఃకాలము.at * తెల్లవారి, అరుణోదయకాలమందు. I rose before * నేను అరుణోదయానికిమునుపే లేస్తిని, చీకటిలో లేస్తిని. or beginning ఆరంభము. this was the * of his hopes వాడి ఆశకు యిదే ఆరంభము.
Dawning n s వుదయము, వుదయకాలము.
Day n s దినము, పగలు, అహస్సు. a * of the lunar month తిధి.a * of the solar month తేది. this shortened his days యిందువల్లవాడి ఆయుస్సు మూడినది. the * is far advanced ప్రొద్దు చాలా యెక్కినది.* of the week వారము. the Lord's * ఆదివారము. threewhole days తిరాత్రము. to-day నేడు, యీ పొద్దు, యీ వేళ.that * నాడు, ఆనాడు. yesterday నిన్న. the * before yesterdayమొన్న. the * before that అటు మొన్న. to-morrow రేపు.the * after to morrow యెల్లుండి. A holiday ఆటవిడుపు an high* or holy * పుణ్యదినము, విశేషదినము. the next * or the following* మరునాడు. this * ten years పది యేండ్లకు ముందర యీ దినము.this * last year పోయినసంవత్సరము యీ దినము. on the alternate daysదినము మార్చిన దినము. at an early * కొన్నాళ్లకు. a * ortwo ago నిన్ననో, మొన్ననో, రెండు మూడు దినములకు ముందు.anevey *affair సాధారణమైన పని. every * people సాధారణులు. all * long ఆ సాయము, పొద్దుగూకులు. in all my days నా ఆయుస్సులో.in my younger days బాల్యమందు,చిన్నప్పుడు. In his father'sdays తండ్రికాలములో. In days of yore పూర్వకాలములో. in the faceof * పట్టపగలులో - యిది సిగ్గుమాలిన పనిని గురించి చెప్పేమాట.from * to * అప్పటికి, నానాటికి. * by * దినదినము,ప్రతిదినము, new years * సంవత్సరాది . the other * మొన్న,కొన్నాళ్ల కిందట. every other * దినము విడిచి దినము, దినముమార్చి దినము. * and night రాత్రి పగలు, అహోరాత్రము. at thistime of * యిట్టి కాలమందు. at the last * or * of judgementప్రళయకాలమందు.. to gain the * జయించుట. he carried the * he gotthe * or he gained the * జయించినాడు. I first saw the* here నేను యిక్కడ పుట్టినాను. the murder was broughtto the light of * ఆ కూని బయటపడ్డది. these things will not bear the light of * యిది బయటరాగూడని సంగతి. half a day'swork ఒక పూటపని. now-a-days యిప్పటి దినాలలో, యిప్పట్లో.he came a * after the fair పని మించిన తరువాత వచ్చినాడు.
Daybook n s దినవహి, కడితము, కవిలె, రోజుచిఠా.
Daybreak n s అరుణోదయము, వేకువజాము, ప్రాతఃకాలము.before * తెల్లవారకమునుపు. after * తెల్లవారిన తరువాత.
Day-dream n s భ్రమ, చలచిత్తము.
Day-labourer n s కూలివాడు.
Daylight n s పగలు, at * తెల్లవారినప్పుడు. by * పగటిలో.
Daysman n s మధ్యవర్తి, యిది ప్రాచీనశబ్దము.
Dayspring n s అరుణోదయకాలము, ప్రకాశము, తేజస్సు.
Daystar n s వేకువచుక్క. మరిన్ని కావ్యమందు సూర్యుడని అర్ధము కలదు.the * of wit ప్రబోధ చంద్రోదయము, this is the name of a celebrated poem.
Daytime n s పగలు.
Dazzilingly adv అతి ప్రకాశముగా, తళతళమని, పళపళమని.
Dazzled adj కండ్లు చెదిరిన, మిరిమిట్లుగొన్న, భ్రమపడ్డ,భ్రమించిన. Bats are * in the light గబ్బిలములకు వెలుతురులోకండ్లు చెదురతవి.
Dazzling adj కండ్లు చెదిరేటట్టు చేసే, మిరమిట్లు కొనేటట్టుచేసే. a * white కండ్లు చెదిరే తెలుపు. the * glory ofhis name అతని మహత్తైన ఖ్యాతి.
De novo adv (These are Latin words ) పునః, మళ్ళి.
Deacon n s ( literally, a servant) పరిచారకుడు, సేవకుడు, దాసుడు.In the church ఒక తరహా పాదిరి. among merchants శెట్టి,పెద్ద, కులపెద్ద, మేస్త్రి, In 1 Tim. 3,8. సహకారి.A+. సేవకుడు. C+ A Bishop ధర్మాధ్యక్షుడు. A +. పరిదశ ్ కుడుC+. కాపుకర్త P +.
Dead adj చచ్చిన, చనిపోయిన, మృతి బొందిన. a * bodyపీనుగ. a * tree యెండిపోయిన చెట్టు. or stupid మూఢ,మడ్డి. * to shame సిగ్గుమాలిన. the trade is very * వర్తకముమహాజబ్బుగా వున్నది. the money lay * for three years ఆ రూకలుమూడు సంవత్సరములుగా వురికెపడివున్నది, వుపయోగము లేక పడివున్నది.* red మడ్డి యెరుపు. the wine is * యీ సారాయిలో కారము పోయినది.a * loss శుద్ధ నష్టము. the moon had a * appearance చంద్రుడుకళాహీనుడుగా వున్నాడు. Iam * beat ( adverbially) నేను బొత్తిగావోడినాను, we had a * calm మాకు శుద్దముగా గాలి లేక పోయినది. ఆకు ఆడలేదు . a man who is civilly * ధర్మదూరుడు, భ్రష్టుడు.మృతప్రాయుడు,జీవచ్ఛముగా వుండేవాడు. * drunk ఒళ్లు తెలియనిసారాయిమత్తు. a * faith పనికిమాలిన భక్తి, క్రియాపర్యవసానము, లేని భక్తి. ( quite separate from మూఢభక్తి simple faith.)a living faith సఫలమైన భక్తి, పనికివచ్చే భక్తి. * flesh దుర్మాంసము.* gold మెరుగుపెట్టని బంగారు. * silver మెరుగుపెట్టని వెండి. * goods గిరాకిలేక పడివుండే సరుకులు. I am half * కొనప్రాణముతో వున్నాను, నిండాఅలిసివున్నాను. he made * a halt యెదబడి నిలిచిపోయినాడు.* lame శుద్దకుంటి. the * languages యిప్పుడు లేని భాషలు.యిప్పుడు లోకులు సాధారణముగా మాట్లాడే వాడుకతప్పిన భాషలు.అనగా సంస్కృతము, ప్రాకృతము, గ్రీక్కు ,లాటి్ , హీబ్రుయీ భాషలలో సాహిత్య విద్య, మొదలైన శాస్త్రములుగలవుగాని, లోకవ్యవహారములో చెల్లని భాషలకు a * languageఅని పేరు కలదు, మరిన్ని యింగ్లీషు తెలుగు మొదలైన ప్రస్తుతముసంభాషించే భాషలకు a living language అని పేరు కలదు. thatlawis now a * letter ఆ స్మృతి యిప్పుడు చెల్లదు. * lettersat the post office చేరవలసిన వాండ్లకు చేరక వూరికే పడివుండేజాబులు. theland is a * level యీ ప్రదేశము వట్టి మైదానము.a * secrete పరమరహస్యము. * silence నిశ్శబ్దము.* sleep మడ్డినిద్ర, వొళ్లు మరిచిన నిద్ర. the live and * stockof a farmer ఒక కాపు యొక్క గొడ్లున్ను కలప సామాన్లున్ని.a * wall వట్టిగోడ. * weight అంక బళువు, చావు బళువు. she is a * weight on my hands అది నాకు తలమోపుగా వున్నది. In the * of the night అర్థరాత్రిలో, నిశిరాత్రిలోమాటుమణిగిన వేళలో. If they hear of it you are a deadman వాండ్లది వింటే నీవు చస్తివి. the చచ్చిన వాండ్లు.He raised him from the * ( Ephes.I.20.) is renderedశ్మాశానాత్. A +.
Deadened adj తక్కువపడ్డ, మాన్పడ్డ, శాంతి పొందిన.
Deadlift n s దురవస్థ, గతిలేని కాలము, ఆశలేని కాలము.at a * సాగనప్పుడు .
Deadlights n s కటికీలు, మూతలు.
Deadly adj చంపే, చచ్చే. a * blow చావు, దెబ్బ.a * weapon చంపే ఆయుధము. a * poison చంపే విషము.* harted పరమవైద్యము. a * secret పరమరహస్యము. a * sinమహాపాతకము. * cold పాడు చలి.
Deadness n s మొండితనము, మూర్ఖతనము, బెరుకుతనము,మాంద్యము, జడత, జబ్బు, జాడ్యము.
Dead-reckoning n s వచ్చిన దూరము యొక్క లెక్క, ఉజ్జాయింపు.
Deaf adj చెవిటి, చెవులు వినని. a * man చెవిటివాడు. he turneda * ear చిత్తగించలేదు. he was * to my advice నా మాటవినలేదు, నా బుద్ది వినలేదు.
Deafened adj చెవులు ఆడుచుకొన్న. I was * by the noiseఆ బ్రహ్మాండమైన ధ్వని చేత నా చెవులు అడుచుకొన్నవి.
Deafening adj. చెవులు అడుచుకొనేటట్టు చేసే, వురుమువంటి
Deafness n s చెవుడు.
Deal n s a part భాగము. what a * of trouble యెంత శ్రమ.a good * విస్తారము, అనేకము, కొద్ది గొప్ప. a great * శానా,నిండా, విస్తారముగా. a great * of wind నిండా గాలి.a great * of cloth విస్తారము గుడ్డలు. he is a great * betterవాడికి నిండా వాసిగా వున్నది. at cards కాకితాల ఆటలోఒకసారి పంచిపెట్టడము. a sort of wood జాజికాయ మానువంటిది.
Dealer n s పంచిపెట్టేవాడు, వర్తకుడు. a * in silks పట్టుబట్టలుఅమ్మేవర్తకుడు . a Plain * సాధు, నిష్కపటి. a double * కపటి.
Dealing n s వర్తకము, వృత్తి, వ్యాపారము, పని, వ్యవహారము.నడక. double * మాయలు, కృత్రిమము, కాపట్యము.
Dealt adj యేర్పరచిన, యిచ్చిన, తగిలించిన, వ్యాపారము చేసిన.
Dean n s గురువు, ఒక తరహా పాదిరి, కులపెద్ద. of a trade శెట్టిపెద్ద.
Deanery n s గురువుండే యిల్లు, గురువు యొక్క వృత్తి , గురువు మాన్యము. Dear, adj. beloved ప్రియమైన, యిష్టమైన. the word * as appliedto relations is thus translated : my * brother (elder brother)is రాజశ్రీ ఇత్యాది అన్నగారు. my * brother * (younger )చిరంజీవులయిన నా తమ్ముడు. my * sister సౌభాగ్యవతియగు నా చెల్లెలు. or నా అక్కగారు. my * mother my belovedmother మాతృశ్రీ తల్లిగారు. regarding a son the expressionis చిరంజీవులయిన. regarding a daughter,the expression is సౌభాగ్యవతియైన. my * sir రాజ్యమాన్య రాజశ్రీ ఇత్యాది.my * madam , మాతృశ్రీ యత్యాది. or costly పొడుగువెలగల; గిరాకి అయిన,ప్రియమైన. This will make corn dearor it will cause the price of grain to rise యిందువల్ల ధాన్యపువెల తగ్గును. ( lit : will fall ) the price is low ధాన్యపువెల తగ్గుగా వున్నది. The market price is quoted differentlyin India and in England. In Europe the variation is in the money given for a fixpe measure. In India the variation is in the quantity o f grain obtainable for a fixedsum, Hence what we call a fall inthe price of grain is calleda rise in the price according to the Indian expression -Dear,bought experience కష్టపడి సాధించిన వివేకము, అనగా శిక్ష చేతవచ్చిన బుద్ధి, వ్యాకులము వచ్చినందున కలిగిన సమాచారము. Dear, n. s. ప్రియమైనది, అనగా చిన్నవాడు, చిన్నది. యిది ముఖ్యముగాపిల్లలను గురించి చెప్పేమాట, మరిన్ని భార్యాభర్తలు ఒకరినొకరు పిలుచుకునేమాట. a * ముద్దుగా, వుండే బిడ్డ బిడ్డలు. the little dearsబిడ్డలు. come here my * యిట్లారా అబ్బాయి, యిట్లారా అమ్మాయి .o dear ! అయ్యయ్యో, o dear me ! అయ్యో , అక్కటా, కటకటాశివశివ, రామరామ, అన్నన్నా , అక్కక్కా.
Dear adj See note on Price.
Dearly adj గిరాకిగా, ప్రియముగా. he paid * for his folly వాడి పిచ్చితనము చేత వాడి ప్రాణానికి వచ్చినది.
Dearness n s గిరాకి, ప్రియము.
Dearth n s కరువు, దుర్భిక్షము, క్షామము. from the * of intellegenceమాకు సమాచారము కరువు అయినందున.
Death n s చావు, మరణము. * was now apporaching యింతలోకాలము సన్నిహితమైనది. to beat to * చావ కొట్టుట. at the pointof * అవసాన కాలములో. to put to * చంపుట. It is play to youbut * to us యిది మీకు అట్లాట, మాకు ప్రాణతల్లడము, పిల్లికిచల్లాటము యెలుకకు ప్రాణసంకటము. he is now on his *bed వాడికి యిప్పట్లో కాలము సన్నిహితమైనది. a *blow చావుదెబ్బ. this was a * blow to the under taking యెత్తిన పనికి యిదేచావుదెబ్బ, అనగా దీనివల్లనే చెడిపోయినది. this will be the*of him యిందువల్ల వానికి ప్రాణము తల్లడమవును. they areat *s door వాండ్లకు కాలము తటస్థించినది. చావు బ్రతుకుల మీదవున్నారని చచ్చేగతిగా వున్నారు. silent as * నిశ్శబ్దముగా వుండే.
Deathless adj నిత్యమైన, శ్వాశతమైన, చావులేని, చిరంజీవియైన,* fame శాశ్వతమైనకీర్తి.
Deathlike ajd చచ్చియెత్తినట్టు వుండే, నిశ్శబ్ధమైన, గాఢమైన.that * lookin bird the adjutant దయ్యమువలె వుండే కొంగ,పాడు కొంగ. * sleep మడ్డి నిద్ర, మహత్తైన నిద్ర.
Deathsman n s తూకుతీసేవాడు, వురితీసేవాడు, తలకొట్టేవాడు, తలవరి.
Deathwatch n s కొయ్యను తొలిచే పురుగు, యిలకోడి, దీనిస్వనమువినబడితే చావుకు సూచకమని చెప్పుతారు.
Debarkation n s వాడమీద నుంచి దిగడము, దించడము.
Debarred adj విఘ్నమును పొందిన, విఘాతమైన పొందిన, నివారించబడ్డ,అడ్డపడ్డ, అభ్యంతరమైన. he was * the sight of his family వాణ్నివాడి పెండ్లాము బిడ్డలను చూడనిచ్చినారు కారు. I was * fromwriting నేను వ్రాయడానకు అభ్యంతరము వచ్చినది. I was * fromgoing there నేను అక్కడికి పోవడమునకు ఆటంకమైనది. you arenot * from going నీవు పోవడానకు అభ్యంతరము లేదు.
Debased adj హీనముగా చేయబడ్డ, నీచమైన, సంకరమైన, కలపడమైన.* gold మట్టు బంగారము. as a dialect అభాసైన. Telugu * with Hindustani తురకమాటలు కలిపి ఆ భాసముగావుండే తెలుగు.
Debasement n s హీనత్వము, నికృష్టత. by mixture సంకరము, కలపడము.
Debatable adj వివాదస్పదమైన, వ్యాజ్యస్పదమైన, సందేహాస్పదమైన.the * land వ్యాజ్యాస్పదమైన పొలము, కరకసా పొలము.
Debate n s వివాదము, వ్యాజ్యము, పోరాటము, జగడము, కలహము.
Debauched adj vicious దుర్మార్గుడైన, పోకిరిఅయిన. * conductపోకిరినడక. a * man కాముకుడు. she was * అది చెడిపోయినది.a * woman కాముకురాలు. a * poem పోకిరి కావ్యము.
Debauchee n s దుర్మార్గుడు, జారుడు, తాగుబోతు.
Debauchery n s పోకిరితనము, తాగుబోతుతనము,. జారత్వము,వేశ్యాలోలత్వము.
Debeauch n s దుర్మార్గము, అనగా తాగడము, జారత్వము.
Debenture n s అప్పుపత్రము.
Debilitated adj దుర్బలుడైన , నీరసమైన, నిస్త్రాణగా వుండే. a man * by illness రోగముచేత బలహీనముగా వుండేవాడు.
Debilitating adj బలహీనముచేసే. drunkeness is * తాగడముబలహీనము, తాగడముచేత బలహీనమౌతున్నది.
Debiltiy n s నిస్సత్తువ, నిస్త్రాణ, బలహీనము.
Debit n s బాకీ, ఖర్చు . * and credit జమాఖర్చు. they putthis to his * దీన్ని వాడిమీద ఖర్చు వ్రాసినారు.
Debonair adj నాగరీకమైన, నాజూకైన, సరసుడైన.
Debris n s చిల్లపెంకులు.
Debt n s రుణము, అప్పు, బాకీ. a simple చేబదులు. a * due tome నాకు రావలసిన అప్పు. to contract a * బాకీపడుట. to run into n*or get into * అప్పులుపడుట. he fell into * వాడు అప్పుపడ్డాడు. he is out of *వాడు యెవరికి బాకీలేదు. he paid the * of nature చచ్చినాడు.
Debtor n s అప్పుపడ్డవాడు, బాకీపడ్డవాడు, రుణస్తుడు. the *said of an account ఖర్చుపడదు.
Debut n s ప్రారంభం, ప్రవేశము, యిది ఫ్రెంచి పదము.
Decade n s దశ సంఖ్య.
Decadence n s క్షయము, క్షీణము. during the * of the empire ఆ రాజ్యము క్షీణమౌతువుండగా,.
Decagon n s దశకోణములుగల రూపు.
Decalogue n s దశకల్పన is the expression in the christianpoem Vedanta Rasayanam దశ శ్లోకీ, ఆజ్ఞలు, యిది బైబిలులోఒక కాండ.
Decanter n s పైపై తేటగా వైను సారాయిని వంచేబుడ్డి. To Decapitate, v. a. తలకొట్టుట, శిరచ్ఛేదము చేసుట, తలకోసివేయుట.
Decapitation n s తలగొట్టివెయ్యడము, శిరచ్ఛేదము.
Decay n s నాశనము, క్షయము, శిథిలము, కుళ్లు,పుప్పి. the decaysof age and grief వృద్దాప్యముచేతనున్ను వ్యసనముచేత నున్నుకలిగిన శైథిల్యములు. he died of a mere * of nature యేండ్లుచెల్లి చచ్చినాడు. ఆరామార బ్రతికి చచ్చినాడు. the wood is gone to * ఆ కొయ్య చివికిపోయినది.
Decayed adj క్షీణమైన, శిథిలమైన, వుడిగిన, కుళ్లిన, చెడిపోయిన.a * gentlemen బాగా బ్రతికి నొచ్చిపోయివుండేవాడు. a *bulidingశిథిలముగా వుండే యల్లు. a * tooth పుప్పిపల్లు. his strengthis much * వాడికి శానా బలము వుడిగిపోయినది.
Deccan n s name of Sothern India దక్షిణదేశము, ద్రవిడదేశము.
Decease. n. s. చావు, మరణము,నిర్యాణము
Deceased adj చచ్చిన, చనిపోయిన, మృతమైన.
Deceit adj మోసమైన, మాయగా వుండే, కపటమైన, నమ్మరాని.
Deceitfully adv మాయగా, మోసముగా, కపటముగా, కృత్రిమముగా.
Deceitfulness n s మాయ, వంచన, కృత్రిమము, కపటము, పితలాటకము.
Deceivable adj మోసపోతగ్గ, మాయకులోపడే,
Deceivablenss n s మాయ, మోసము, మోసపొయ్యేతనము, మాయకులోబడేతనము. In 2 thes 2.9, మిథ్యాలక్షణము. A ప్రవంచితవ్యతC +. To Deceive, v. a. మోసముచేయుట, వంచించుట, యేమార్చుట. they *d himregarding this దీన్ని అతనికి మరుగు చేసినారు.
Deceived adj మోసపోయిన, వచించబడ్డ, యేమారిన. if I am notvery much * he is dead చచ్చినాడని రూఢిగా తోస్తున్నది.
Deceiver n s మోసగాడు, వంచకుడు, ప్రతారకుడు. A +.
Deceiving adj మాయగా వుండే, మోసముగా వుండే. * language మాయమాటలు.
December n s జాతి, సంవత్సరపు కడపటి నెల, ఇంగ్లీషు సంవత్సరపు కడపటినెల, యిది మార్గశిరపుష్యమాసములలో వస్తున్నది.
Decemvirate n s పదిమంది కూడిన సభ, యిది రోమన్ దేశమందుపూర్వము కలిగివుండినది.
Decency n s మర్యాద, యోగ్యతా, మానము.do it for *s sake మానము విచారించి చెయ్యి.
Decent adj తగిన, యోగ్యమైన, యుక్తమైన, సరమైన. this is very *hand-writing యిది తగుపాటి వ్రాలు. he lived in a * house సాధారణమైనయింట్లో వుండినాడు, అనగా అంత గొప్పకాదు, అంతకొద్ది కాదని భావము.
Decently adv యోగ్యముగా, యుక్తముగా, సన్మానముగా.
Deception adj మోసము, మాయవంచన, పితలాటకము.
Deceptive adj మోసముచేసే, మాయయైన, పితలాటకము చేసే.
Decided adj తీర్పైన, పరిష్కరించబడ్డ, నిశ్చయించబడ్డ. a man of *character స్థిరబుద్దిగల వారు. a * christian వీరభక్తుడు.
Decidedly. adv. తీర్పుగా, పరిష్కారముగా,నిష్కర్షగా
Decider n s తీర్పరి, తగవరి.
Deciduous adj ఆకులురాలే. the fig tree is * రావిచెట్టుకు ఫలానమాసములో ఆకురాలు పోవడము కద్దు. Decimal, adj. దశగణసంఖ్య, దశాంశమైన. * fraction గణితశాస్త్రములోదశగణకసంఖ్యఅనే ఒక లెక్క.
Decimation n s దండులో చీట్లువేసి పదిమందిలో వొకడికి విధించడము.
Decimatly adv దంశాంశప్రకారముగా.
Decision n s తీర్పు, పరిష్కారము, తేరుగడ.
Decisive adj తీర్పైన, పరిష్కారమైన. this is a * proofయిది దృఢమైన దృష్ఠాంతము .
Decisively adv తీర్పుగా, పరిష్కారముగా, వగదెంచి.to speak * తెగచెప్పుట.
Deck n s వాడ యొక్క తలవరుస. a ship with three *s మూడుఅంతస్థులు గలవాడు.
Deckan n s A name given to the south part of Indiaదక్షిణదేశము.
Decked adj అలంకరించిన, శృంగారించిన. in a ship పలకతలవరుసకూర్చుపని.
Declaimer n s ప్రసగించేవాడు, ఉపన్యసించేవాడు, మాట్లాడేవాడు.a * against this custom యీ వాడుకను దూషించేవాడు.
Declamation n s ప్రసంగము, ఉపన్యాసము.
Declamstory adj ప్రసంగించే, ఉపన్యసించే. a * poet వూరికేవుపన్యసించే కవి. * style ఉత్రేక్ష.
Declaration n s ప్రకటన, బయలుపరచడము, తెలియచేయడము.యెరుకచేయడము. the * of a witness or prisoner సాక్షిగాని కయిదుగానిచెప్పినమాట, వాఙ్మూలము. a solemn * in lieu of oath వొట్టు.
Declarative adj ప్రకటించే, యెరుకచేసే.
Declaratory adj ప్రకటన చేయతగ్గ, తెలియచేసే, యెరుకచేసే.
Declared adj ప్రకటనచేసిన, తెలియచేసిన, బయటపడ్డ. * enemies ప్రత్యక్షశత్రువులు.
Declension n s of nouns సుబంతశబ్దరూపనిష్పత్తి. In the sacscritlanguage English grammarians call nouns ending in అ or ఆ " nounsof the first * " and nouns ending in ఇ and ఉ are nouns ofthe 2nd * nouns ending in ఈ and ఊ are " of the Third " *In Telugu grammar words like తమ్ముడు are * of the first *. "All the dictionaries finding it hard to translate have substitutedthe word విభక్తి, which signifies case :"and in the Sanscritnoun there are eight cases in each * .
Declinable adj రూపభేదక్రమము గల. a word not * అవ్యయము.రూపబేధములు లేనిపదము. this word is * like the word sivah శివశబ్దరూపమువలెనే రూప నిష్పత్తి కద్దు.
Declination n s oblioque motion వక్రగతి. the sun's northern* ఉత్తరాయణము. the sun's southern * దక్షిణాయనము.
Decline n s క్షయము, క్షీణగతి. in the * of life వయస్సు చెల్లినప్పుడు. the * and fall of Roman Empire రోమ ్ దేశపుక్షీణగతి యొక్క వర్ణనము. or consumption క్షయరోగము.
Declining adj వొరిగే, వాలే, క్షయించే, క్షీణించే, నానాటికితగ్గే.to rock the cradle of declining age వృద్ధులైన తల్లిదండ్రులను పోషించుట.he was in a * state of health వాడి దేహము నానాటికి చెడిపోతూ వుండెను.when the sun was * ప్రొద్దుతిరిగేటప్పటికి.
Declivity n s దిగుడు, యేటివాలుగా వుండే స్థలము.acclivity and * యెగుడుదిగుడు.
Decoction n s కషాయము.
Decoit n s ( Indian word a gang robber ) బందిపోటుదొంగ.
Decoity n s ( a gang robbery ) బందిపోటు దొంగతనము.
Decollation n s తల కోసివేయడము, శిరచ్ఛేదము.
Decomposed adj వీడకొట్టబడ్డ, చివికిన, శిథిలమైన. when wefound the body it was quite * శవము మాకు దొరికినప్పుడుకుళ్లిపోయివుండెను.
Decomposition n s చివికిపోవడము, శిథిలమైపోవడము. to prevent * చివికిపోకుండా, శిథిలమైపోకుండా.
Decorated adj. శృంగారించబడ్డ, అలకరించబడ్డ
Decoration n s శృంగారము, అలంకారము. Decorous, adj. తగిన, యుక్తమైన. it is not * యిది తగదు, యిది కూడదు.
Decorously adv యుక్తముగా, మర్యాదగా, మానముగా.
Decorum n s మానము, మర్యాద, వినయము.
Decoy n s రుచిచూపి వంచించడము, యేమరించిడము, మోసము చేయడము, బోను వల. a * partridge వేట నేర్పి పెట్టుకునివుండేకవుజు. a * duck అడివి బాతులను పట్టడానికై మరిపి పెట్టుకునివుండే అడవిబాతు.
Decrease n s తగ్గు, క్షయము, క్షీణగతి. from the * of the populationప్రజల క్షయించినందున. from the * of the business పని తక్కువైనందున.on occount of the * of the water నీళ్లు తక్కువకావడము చేత.Increase and * హాని వృద్దులు.
Decree n s తీర్పు, నిర్ణయము, ఆజ్ఞ. decrees of faith దశ, దుర్దశ.
Decreed adj తీర్పుచేసిన, నిశ్చయించిన.
Decrement n s క్షయము.
Decrepit adj క్షీణించిపోయిన, ఉడిగిన, దుర్బలమైన. thosewho are * with age యేండ్లు చెల్లినందున, బలహీనులై వుండేవాండ్లు.
Decrepitation n s వేగడము, పెట్టడము, చిట్లడము.
Decrepitude n s జర, ముదిమి, అతివృద్ధాప్యము, దుర్భలము.
DEcretal n s స్మృతి. the *s of Manu మనుస్మృతి.
Decuple n s దశగుణము. Coleber, in Amera. p 737 says Numeration proceeds in * proportion పంక్తిశ్శతసహస్రాది క్రమాద్ధశగుణోత్తరం.
Dedicated adj సమర్పించబడ్డ, అర్పితమైన, అంకితముచేయబడ్డ.కృతి యచ్చిన, the dancing girls were * to the pagoda బోగమువాండ్లనుగుడికి విడిచినారు, ముద్రవేసినారు.
Dedication n s సమర్పణ, అర్పణ. of an image సంప్రోక్షణ.of a temple ప్రతిష్ట. of a book అంకితము. of a poemis commonly called or dedicatory stanzas షష్ట్యంతములు. becausethe words "to" the ruler "to" them protector &c. are in (షష్టి)the dative case.
Dedicatory adj అంకితమైన. * stanzas నాందిశ్లోకములు,పష్ట్యంతములు.
Deducible adj ఊహించతగ్గ, అనుమేయించతగ్గ.
Deducted adj తోసివేసిన, తీసివేసిన, భాగారించిన. these ten rupeesbeing * యీ పదిరూపాయలుపోగా.
Deduction n s inference ఊహ, తేరుగడ, ఫలితార్థము. or defacationతోపుడు. clear of deductions చెల్లుపోగా నిలిచిన నిలవ. or defectతక్కువ, లోపము.
Deed n s act పని, కార్యము, క్రియ, కృత్యము, కర్మము,In thought word and * &. కరణత్రయముగా, త్రికరణముగా, మనసా,వాచా, కర్మణా. in deed వాస్తవ్యముగా , మెట్టుకు . a good *పుణ్యము, సుకృతము. an evil * పాపము , దుష్కృతము. you must take the will for the * మనసులో నిశ్చయించినది నెరవేరకపోయినా చేసినట్టు భావించవలసినది. or insturment సాధకము,పత్రము.
Deep n s లోతు, అగాధము. they consigned his body to the * వాడిశవమును సముద్రములో పడవేసినారు.
Deep mothed adj పెద్దగొంతుగల, అరిచే.
Deepness n s లోతు, గాంభీర్యము.
Deeptoned adj గంభీరస్వరముగల.
Deer n s జింక, కురంగము, ఇందుకు బహువచనము Deer. Onehundred Deer నూరు జింకలు. a fallow * లేడి . (plural లేండ్లు) a spotted * దుప్పి. plural దుప్పులు. the goat * ఇర్రి. plurఇర్లు. the * called neel gao or Bison మనుబోతు.
Defaced adj చెడిపోయిన. చెడిన, పాడైన.
Defacto (A latin Word)adv i.e. infact క్రియతః this Princeis king de jure and the other is king * న్యాయతః యితను రాజుక్రియతః అతను రాజు.
Defalcation n s cheating తక్కువ. there was a * in thetreasury భండారములో కొంచెము రూకలు తక్కువగా వుండినది, కొన్నిరూకలు తినేసివుండినారు.
Defamation n s అపఖ్యాతి, అపవాదము అపనింద.
Defamed adj నిందించబడ్డ, రవ్వలపాలైన.
Defauded adj మోసపోయిన, మాయకో చిక్కిన,
Default n s non-payment failure defect , fault తప్పడము.in * of payment చెల్లించక తప్పితే. in * of appearance రాకపోయినట్టైతే.
Defaulter n s or chaeter తిన్నవాడు, యెత్తి నోట్లో వేసుకున్నవాడు.he was a * to the amount of $1000 పదివేల రూపాయలు తినివేసినాడు.
Defeat n s ఓటమి, పరాభవము, అపజయము, భంగము. after his *అతను వోడిపోయిన తరువాత.
Defeated adj ఓడిన, అపజయము పొందిన, భంగపడ్డ. I was * byhim వాడికి ఓడిపోయినాను.
Defect n s తక్కువ, కొరత, కొర, వెలితి, లోపము, న్యూనత,చెయ్యి విడవడము.
Defective adj తక్కువైన, కొరదలైన, లోపమైన, న్యూనమైన.some of his teeth are * వానికి కొన్ని పండ్లు తక్కువ, కొన్ని దంతములులేవు. one hand of this image is * యీ విగ్రహమునకు చెయ్యిపోయినది. his sight is * యీ విగ్రహమునకు చెయ్యి పోయినది. hissight is * వానికి దృష్టి తక్కువ. his pronunciation is *వాడి వుచ్చారణలో న్యూనత వున్నది. a * noun కొన్ని విభక్తులులేని శబ్దము. a * verb కొన్ని రూపములు లేని క్రియ. Defence, n. s. Guard, protection కాపు, సంరక్షణ, దిక్కు, అడ్డము,మరుగు. God is a * to the poor బీదలకు దేవుడే దిక్కు. this treeis no * from the wind యీ చెట్టు గాలికి అడ్డము కాదు, మరుగుకాదు. what you say is no * of your conduct నీవు చేసిన దానికి నీవుచెప్పేది వొక పరిహారముగాదు, సమాధానము కాదు. without *దిక్కులేక. an umbrella is a * from the sun గొడుగు యెండకు మరుగు.or vindication సమాధానము, పరిహారము. The * of a prisoner of personaccused నేరస్థుడు చెప్పే వుత్తరము. he fought in his own * తన్నుతప్పించుకునేటందుకై పోట్లాడినాడు. he made a good * తనమీద వచ్చినమాటకు మంచిసమాధానము చెప్పినాడు, తనమీద పడే దెబ్బ బాగాతప్పించుకున్నాడు. Translate the Prisoner *s కయిది తాను తప్పించుకొనేటందుకు చెప్పినదాన్ని భాషాంతరము చెయ్యి. what have you tohe spoke on * of the prisoner నేరస్థునికై వహించుకొని మాట్లాడినాడు.he did it in self * తనకు హాని రాకుండా యింతపని చేసినాడు, ఆత్మసంరక్షణకొరకై దీన్నిచేసినాడు. the defence of the fort are all destroyedకోట గోడ బురుజులన్ని పాడైనవి.
Defenceless adj దిక్కులేని, నిరాధరమైన.
Defendant n s ప్రతివాది, యెదిరి.
Defender n s సంరక్షకుడు.
Defensible adj సంరక్షణగల, సమాధానము గల. Do you callthis conduct * ? యీ నడత యోగ్యమైనదని అంటావా.his conduct is not * వాడి నడతకు సమాధానము వుండదు.
Defensive adj సంరక్షకమైన. a * weapon సంరక్షించే ఆయుధము.అనగా డాలు, కవచము మొదలైనవి. he stood on the * యెదురునిల్చినాడు,పోట్లాడినాడు, అడ్డమాడినాడు.
Deference n s వినయము, దాక్షిణ్యము, లక్ష్యము. with great *అతివినయముగా. to address with * మనివిచేసుట.
Defiance n s తిరస్కారము, అలక్ష్యము, పంతము, నీచేతకాదనడము,జగడానకు పిల్వడము. shouts of * హుంకారము. he set them at *వార్ని అలక్ష్యపెట్టినాడు. he set opinion at * యెవరేమన్నాఅననీ అన్నాడు. the books seems to be written in of * system యీ గ్రంధము నిబంధన తప్పి వ్రాసినట్టు తోస్తున్నది, యీ గ్రంధముక్రమమును అలక్ష్యము వ్రాసినట్టు తోస్తున్నది. in * of what thedoctor said వైద్యుడు చెప్పినదాన్ని అలక్ష్యపెట్టి, వుపేక్షచేసి.
Deficiency n s తక్కువ, కొరత, లోపము, న్యూనత. from the * ofmoney రూకలు తక్కువైనందున, లోపమైనందున, రూకలు లేనందున.
Deficient adj తక్కువగా వుండే, కొరదలుగా వుండే, లోపమైన.* in proof సాక్ష్యములోన్యూనమైన. * in sense తెలివితక్కువైన
Deficit n s తక్కువ, లోపము, వెలితి.
Defile n s కనమ.
Defiled adj చెరిపిన, భ్రష్టుచేసిన, అంటుచేసిన, మైలచేసిన.అపవిత్రమైన, అశుచైన. * food యెంగిలి, వుచ్చిష్టము.
Defilement n s అశుచి, భ్రష్టత, అంటు, మైల.
Definable adj నిర్ణయించతగ్గ, వివరించతగ్గ, తెలియబడే,స్పష్టమైన. this disease is not * యీ రోగము యిట్టిదనితెలియలేదు. this has no * shape దీని ఆకారము యిట్టిదని చెప్పేటందుకు వల్ల కాదు.
Definably adj విశదముగా, స్పష్టముగా.
Definite adj నిర్ధారితమైన, నిర్ణయమైన, నిశ్చితమైన, స్పష్టమైన,విశదమైన. there is no * rule for this యిందున గురించి స్పష్టమైన.సూత్రము వొకటిన్ని లేదు. the * article నిర్దిష్టోపదము అనగా "The"
Definitely adv నిర్దిష్టముగా, నిశ్చయముగా, స్పష్టముగా,విశదముగా.
Definition n s నిర్ధారణ, స్వరూపనిరూపణము, వివరణము,విశదముగా.
Definitive adv నిర్ధిష్టమైన, పరిష్కారమైన, స్పష్టమైన.
Definitively adv తీర్పుగా, నిష్కర్షగా, స్పష్టముగా.
Defluxion n s ( in a cold ) పడిశము.
Deforcement n s బలవంతము.
Deformed adj వికారమైన, అందవికారమైన, కూరూపము, వంచించుట.
Deft adj ముద్దైన, అందమైన, సుందరమైన, సరసమైన.
Defunct adj చచ్చిన, చనిపోయిన. the * చచ్చినవాడు.
Degeneracy n s హీనత్వము, నీచత్వము, భ్రష్టత్వము.the * of this people is astonishing యెంతవాండ్ల కడుపులో యింతదిక్కుమాలినవాండ్లు పుట్టినారు. వీరి పెద్దలు వుండినదానికివీండ్లు నిండా అల్పులైపోయినారు. the * of the Madras Hindustaniis great చన్నపట్టణములో మాట్లాడే తురక మాటలు మహా జబ్బు.
Degenerate, Degenerated adj నీచమైపోయిన, తుచ్ఛమైపోయిన.జబ్బయిపోయిన, పిదపైన. a * race of horses మంచి గుర్రమునకుపుట్టిన తట్టువాడి గుర్రములు. a * sort of mangoes యీమామిడి పండ్లు పూర్వము జాతి మంచిదే గాని యిప్పుడు మహా జబ్బైపోయినవి.మొదట జాతి మంచిదేగాని యిప్పుడు దిగుడైపోయినవి.
Deglutition n s మింగడము, కబలీకరణము. in the act of * మింగుతూ వుండగా, మింగడములో. this boil prevented * యీపుండుచేత మింగడము కష్టమైపోయినది.
Degradation n s అవమానము, మానహాని, మానభంగము, స్థానభ్రష్టత్వము,పరువుతప్పడము. after his * వాడికి బెట్టుతప్ఫి పోయిన తరువాత.after this * యీ అవమానము వచ్చిన తరువాత. they were ina state of * వాండ్లు మహా అవమానము పొందివుండిరి.
Degraded adj చెడ్డ, పరువుచెడగొట్టుకున్న, భ్రష్టుడైన, కులభ్రష్టుడైన,తోసివేయబడ్డ. a * wretch భ్రష్టుడు.
Degree n s a step మెట్టు. what * of rain was there ? యేపాటివరుషము. what is the * of relationship between these personsవీండ్లు వొకరికొకరు యేమికావలెను, యేమివరుస, యేమి బంధుత్వము.or rank పరువు, మట్టు, తరగతి. a man of high * గొప్పవాడు, ఘనుడు.a man of low * నీచుడు,అల్పుడు. a * at college is కాలీజులోయిచ్చే పట్టము. he took his * కాలీజులో వాడికి వొకపట్టము వచ్చినది. or arrangement order series క్రమము. to this * యింతమాత్రము.యింతమట్టుకు. to that * అంతమాత్రము, అంతమట్టుకు. to a * or, to any *కొంతమట్టుకు. in any * యేమాత్రమైన. in a great శానా , మహా. in no * యెంత మాత్రము. in a small * కొంచెము, రవంత. the proper* కావలసినమట్టుకు. in an improper * అధికముగా, అతిశయముగా.he studied to such a * that he injured his health తన వొళ్లుచెడిపొయ్యేమట్టుకు చదివినాడు. this is cruel to a * యిది యింతింతక్రౌర్యము కాదు. this is wonderful to a * యిది యింతంత ఆశ్చర్యకరముకాదు. these people are honest to a * వీండ్ల పెద్దమనిషితనముయింతంత కాదు . The positive * సహజ ప్రత్యయము. the comparative * తర ప్రత్యయము. the superlative * తమ ప్రత్యయము. by *sక్రమేణ, క్రమక్రమముగా. he is many *s superior to you నీ కంటేఅనేక అంశములలో గొప్పవాడు. it was now growing light by *s యింతలోబలబలతెల్లవారినది. By *s he became rich వాడు క్రమేణ మహారాజైపోయినాడు. in measuremnet కొలతలో ఒక ప్రమాణము. mathematicianssay therre are 360 *s in a circle ఒక కైవారమందు మున్నూటఅరువైభాగములు వున్నట్టు అంటారు, అనగా సంవత్సరమునకు వుండేదినముల లెక్క.
Deification n s దేవతులలో చేర్చడము, దేవుణ్నిగాయెంచడము.before the * of Sankarachari శంకరాచార్యులను దేవుణ్నిగా యెంచిపూజించడమునకు మొదలు పెట్టకమునుపు.
Deism n s ఒక మత నామము, యిది. Chrisitian మతములో పుట్టి.Christian సిద్ధాంతములు త్యజించి. Chirist దేవుడు కాదనే మతము.( Droz, says ) బ్రహ్మజ్ఙ నెధ ్ర్మంవామతం, పరమాత్మ జ్ఞానము.The Mahomedand religion is *. Deist, n. s. దేవుడు ఒకడు కద్దని ఒప్పుకొని బైబిలులో వుండే సిద్దాంతముఅక్కరలేదనే మతస్థుడు, అయితే వానికి విగ్రహపూజలేదు. ( Droz says )ఆస్తికః ధర్మశాస్త్ర అస్వీకారంకార్య ఏకయీశ్వరవాది. The Mahomedansare deists.
Deistical adj See Deism, (Droz says) ఆస్తిక సంబంధియ్య, ధర్మశాస్త్ర ఖండక, శాస్త్ర నిందక, బ్రహ్మజ్ఞాన సంబంధియ్య.
Deity n s దైవము, దేవత్వము, దేవత. the * దేవుడు, భగవంతుడు.యీశ్వరుడు. a * స్థలదేవత. (Droz says ) పరమేశ్వరః , పరమాత్మా.
Dejected adj చింతపడ్డ, వ్యాకులపడ్డ, కుంగిన. Or cast downకిందపడ్డ. why should you be * about this యిందున గురించి యెందుకు వ్యాకులపడతావు.
Dejectedly adv వ్యాకులముగా, వ్యసనముగా, కుంగి.
Dejection n s వ్యాకులము, విచారము, వ్యసనము.
Delay n s ఆలస్యము, కాలయాపనము, జాగు. without * ఆలస్యముచేయకుండా, తక్షణము, వెంటనే.
Delctable adj దివ్యమైన, సరసమైన. a * affair బంగారుపని,అనగా పిచ్చిపని.
Delecterious adj వికారియైన, వుపద్రవకారియైన, చెరుపైన.* food వొంటికి వుపద్రవముచేసే ఆహారము. drinking spiritsis * తాగడము దేహమునకు వుపద్రవము. this is a * exampleదీన్ని చూసే పదిమందికి బుద్దికూడా చెడిపోను.
Delectus n s చాటుపద్యముల పుస్తకము, వాటపద్యముల పుస్తకము,పిల్లకాయలకుగాను యెత్తివ్రాసిన మంచిశ్లోకముల పుస్తకము.
Delegate n s రాయబారి, వకీలు, నాయిబు, పేషుకారు.
Delf n s ఒక పింగాణి విశేషము.
Deliberate adj ఆలోచనపూర్వకమైన, సావధానమైన. It is my * opinion that he is wrong వాడు తప్పినాడని నాకు రూఢి.
Deliberately adv ఆలోచనపూర్వకమైన, సావధానమై న. It ismy * opinion that he is wrong వాడు తప్పినాడని నాకు రూఢి.
Deliberation n s ఆలోచన, యోచన.
Deliberative adj ఆలోచించే.
Delibertately adv ఆలోచన పూర్వకముగా, కావలెనని.బుద్దిపూర్వకముగా, యోచించి. he did it * ఆలోచన పూర్వకముగాచేసినాడు, కావలెనని చేసినాడు, యెరిగి చేసినాడు.
Delicacy n s daintiness, pleasantness to the taste రుచి,కమ్మదనము, భోగ్యత, స్వాదుత్వము. nicety in choice of food గరాగరిక.బాణ్యము. they shew no * in their eating మడ్డితిండి. any thinghighly pleasing to the senses సరసమైనది, యింపైనది. softness మార్ధనము, కోమలత్వము, సౌకుమార్యము. nicety, minuteaccuracy సున్నితము, సూక్ష్మము. neatness సొంపు,సొగసు, సౌష్టవము నాగరీకము. politeness నమ్రత, మర్యాద,సరసత. I shall mention your name with the greatest *మీ పేరును ఆకున పోకన అంటకుండా వుదాహరిస్తాను, అనగా వుపాయముగానీపేరును వుదాహరిస్తున్నానని భావము. an intant like a monkey hasnot the slightest * బిడ్డలకు కోతివలె సిగ్గుశరము మానము మర్యాదభయము భక్తి వొకటిన్ని లేదు. indulgence, gentle treatmentగారాబము, సుఖము,సుకుమారము. weakness దుర్భలము, ఆశక్తినిస్త్రాణ. smallness అతి సూక్ష్మము, నలుసు.
Delicate adj nice, pleasing to the taste కమ్మని, భోగ్యమైన.pleasing to the senses సరసమైన, ముద్ధైన, సుఖమైన, యింపైన. not coarse, fine సుకుమారమైన, నాణ్యమైన. . soft effeminateమార్ధవమైన. unable to bear hardships సున్నితమైన, కోమలమైన. neat సొంపైన, సొగసైన సౌష్టవమైన, నాగరీకమైన. polite, decentమర్యాదగల, మానముగల, నమ్రతగల. tender మృదువైన.weak దుర్బలమైన, అశక్తిగా వుండే, నిస్త్రాణగా వుండే.small అతిసూక్ష్మమైన, నలుసంతైన. pure, clear శుద్దమైన, నిర్మలమైన.this is a very * affair యిది మహాసున్నితమైన పని, అనగా కొంచెము తప్పితే చెడిపొయ్యేటిదని భావము.
Delicately adv భోగ్యముగా, సరసముగా, సున్నితముగా.సొగసుగా, సుకుమారముగా, మాధుర్యముగా, యింపుగా . See Delicate.
Delicious adj మాధుర్యమైన, రుచియైన, కమ్మని, స్వాదువైన,యింపైన, హితమైన, సరసమైన.
Deliciously adv మాధుర్యముగా, రుచిగా, యింపుగా, సరసముగా.
Delight n s ఉత్సాహము, ఉల్లాసము, ఆహ్లాదము, సంతోషము, ఆనందము,యింపు, వేడుక.
Delighted adj సంతోషపడ్డ, ఆహ్లాదపడ్డ, ఆనందించిన. I was *సంతోషించినాను . to be * ఆహ్లాదపడుట, ఆనందపడుట.
Delightful adj సంతోషకరమైన, ఆనందకరమైన, మనోజ్ఞమైన, రమ్యమైన.
Delineation n s వ్రాత, చిత్రము. or description వర్ణనము.the * of a city పురవర్ణనము.
Delinquency n s తప్పు, నేరము, అపరాధము, దోషము. this proves his * యిందువల్ల వాడి నేరము తెలుస్తున్నది.
Delinquent adj తప్పు చేసినవాడు, నేరస్తుడు, అపరాధి.
Delioneated adj వ్రాసిన, వర్ణించబడ్డ.
Delirious adj తెలివితప్పిన , భ్రమకమ్మిన, తబ్బిబ్బులుగా వుండే.she was * with joy ఆనందముచేత మెయిమరిచినది.
Delirium n s తబ్బిబ్బులు, పిత్తోద్ద్రేకము, భ్రమ.
Deliverance n s విడుదల, విమోచనము, విముక్తి, సంరక్షణ.
Deliverer n s రక్షకుడు, విమోచనము చేసేవాడు.
Delivery n s saving rescue సంరక్షణ, విమోచనము. a surrenderఅప్పగింత. in childbirth ప్రసూతి, ప్రసవము. she had a safe deliveryఅది సుఖప్రసూతియైనది. in speaking ఉచ్చారణ, వాక్పటుత్వము,వాగ్దాటి, వాగ్జరీ, వకృత్వము. this boy is clever but he hasa bad * యీ పిల్లకాయ సమథు్డే కాని వాడికి వాక్పటుత్వములేదు.books cannot teach *in elocution పుస్తుకములచేత సరసమైనఅభినయమును నేర్చుకోకూడదు. an actor's * cannot be judged ofin the dark చీకటిలో ఆడేవాని అభినయమును నిదానించకూడదు. without a good * an actres is of no useఆటలో పాటలో నయములేని భోగముది యెందుకు. the dog has an expressiveface but being dumb has no * కుక్క యొక్క ముఖములో దానిమనోభావము తెలుస్తున్నదిగాని నోరిలేనిది గనుక దానికివాక్చాతుర్యము లేదు.
Dell n s గొంది లోయ, రెండు కొండల సందున వుండే పల్లము.
Delta n s ( the name of the letter x i.e. D in Greek ) ortriangle. In a river:- నది యొక్క రెండు పాయలకున్ను సముద్రమునకున్నుమధ్య వుండే భూమి, అనగా ఒక నది రెండుపాయలై సముద్రములోపోయి పడగా వీటిమధ్య మూడుమూలల గూటివలె వుండే భూమి.
Deluded adj మోసపోయిన, వంచించబడ్డ.
Deluder n s మోసగాడు, వంచకుడు.
Deluge n s జలప్రళయము, వెల్లువ, వరద. the universal* మహాప్రళయము.
Delusion n s మాయ, మోసము, పితలాటకము, మైదు. a gross * మటుమాయ
Delusive adj నమ్మరాని, మాయగా వుండే, పితలాటకముగావుండే, * language దొంగమాటలు, మాయమాటలు, వంచనమాటలు.
Demagogue n s a ringleader of the rabble కలహగాండ్ల మొనగాడు,కలహము పెట్టి పదిమందిని యెత్తి విడిచేవాడు.
Demand n s అడగడము. he paid it on * అడిగినప్పుడు చెల్లించినాడు.debt అప్పు, ఋణము. a question ప్రశ్న, మనవి. he gave a receiptin full of all *s గవ్వకు గవ్వ చెల్లించినట్టు చెల్లుచీటి వ్రాసియిచ్చినట్టు సర్వవిల్లంగశుద్దిగా రశీదు ( meaning receipt) యిచ్చినాడు.there was no * for these goods యీ సరుకులకు గిరాకి లేదు. thesegoods were in * యీ సరుకులకు మహా గిరాకిగా వున్నది. there isno * for this article యీ సరుకును కొనేవాండ్ల లేరు. the government* in revenue matters పన్నురూకలు, కిస్తి. demand, collectionand balance జమ, వసూలు, బాకి. These are Hindusatani wordsjama, wasool, baki.
Demarcation n s విభాగము, దేశవిభాగము. a line of * పొలిమేర.
Demeanour n s నడత, నడవడి, ప్రవర్తన, భావము.
Demented adj వెర్రియైన, పిచ్చిపట్టిన.
Demerit n s అయోగ్యత, దుర్నడత, దుష్కర్మము, అపరాధము,పాపము.
Demesne n s ఉద్యానవనము, తోట, రాజ్యము, భూమి.
Demi adj అర, సగము,అర్థము. a * good దేవాంశ పురుషుడు.a * devil భూతము. ( drozar ) a wolf తోడేలువంటి ఒక జంతువు.
Demi -john n s a large oil bottle సిద్దె.
Demi-god n s అంశపురుషుడు, దేవాంశసంభూతుడు, అవతారపురుషుడు.దైవమువంటి వాడు, అనగా బలరాముడు, హనుమంతుడు మొదలైనవాండ్లు.
Demi-rap n s తప్పనడతగలదనే అనుమానము తగిలిన ఆడది, వ్యభిచారికాదో అనుమానస్పదమైన స్త్రీ.
Demise n s గతించడము. after his father's * వాడి తండ్రిగతించిన తరువాత.
Democracy n s ప్రజాప్రభుత్వము, అనగా రాజులేక కాపులుదేశమును యేలడము. the American Government is a * అమెరికా దేశములో కాపులు యేకమై చెరి అయిదుయేండ్లకు ఒకమాటుఒకణ్ని యేర్పరచి వానిగుండా ప్రభుత్వము జరుపుతున్నారు, గనకఅది Democracy అనబడుతున్నది.
Democrat n s రాజుకారాదని తలచేవాడు, రాజు వుండకూడదనే వాడు.
Democratic, Democratical adj ప్రజాప్రభుత్వసంబంధమైన, రాజు లేని.
Demon n s దయ్యము, పిశాచము, రాక్షసుడు, శైతాను. power ofdemons వశీకరణము . The greak daimon and the sanscrit భూతము.are equilent see stephenson in Journal of the Ray. As. Soc.No. X. p. 264. see notes on Devil.
Demoniac adj భూతగ్రస్తమైన, భూతావిష్టమైన, దయ్యము పట్టిన.
Demoniated adj పేరుపెట్టబడిన, అనబడ్డ. on class of braminsis * Smartas బ్రాహ్మణులలో వక తెగవారు స్మార్తులు అనబడుతారు.nothing took place that could be * injustice అన్యాయమన్నదిలేశమైనా సంభవించలేదు.
Demonica n s శక్తిగ్రస్తుడు, దయ్యము పట్టినవాడు, పిశాచి పట్టినవాడు.
Demonolatry n s శక్తిపూజ, బేతాళపూజ.
Demonology n s భూత, పిశాచాది విషయక గ్రంథము, భౌతికవిద్య.
Demonstrable adj అనుమేయించతగ్గ, రూడిపరచతగ్గ, రూపించతగ్గ.స్థాపించతగ్గ, సిద్దాంతముచేయతగిన.
Demonstrably adv స్పష్టముగా, సాక్షాత్తుగా, సిద్దాంతముగా.
Demonstrated adj దృష్టాంతముగా కనపరచిన, నిజపరచబడ్డ, నిరూపించబడ్డ.
Demonstration n s సిద్ధాంతము, ప్రత్యక్షము, చూపడము.నిశ్చయముగా, నిరూపించడము, నిజపరచడము, రూఢిచెయ్యడము, దండులోసన్నాహము. ocular * ప్రత్యక్ష ప్రమాణము, సాక్షాత్కారముచూపడము.
Demonstratively adv సాక్షాత్తుగా, ప్రత్యక్షముగా, రూఢిగా,నిశ్చయముగా, స్పష్టముగా.
Demonstrator n s నిరూపించేవాడు, విశదముగా అగుపరచేవాడు.యిది వ్రణ వైద్యుణ్ని గురించిన మాట.
Demoralization n s నీతినాశనము.
Demoralized adj దుర్నీతిగా వుండే, విషమమైన, బుద్దిని చెరిపే.
Demostrative adj నిర్దారించిచూపే. * pronouns నిర్ధేశించి చూపే సర్వనామశబ్దములు అనగా This, That, These, Those అనే శబ్దములు.
Demulcent adj మృదుత్వమును కలగచేసే.
Demur n s సందేహము, సంశయము, అనుమానము. without any *నిస్సంశయముగా.
Demure adj నంగనాచివలె వుండే, పిల్లివలెవుండే, పుట్టముంగియైనమూతిముడుచుకొని వుండే, శాంతమైన. Spenser, F. Qu. 216. His countenacne * and temperate శాంతుడై.
Demurely adv నంగనాచిగా, పిల్లివలె, పుట్టముంగివలె.
Demureness n s నంగనాచితనము, మునిముచ్చుతనము, పుట్టిముంగితనము,
Demurrage n s బత్తెపురూకలు, అనగా పొయ్యేవాడను నిలుపుకొన్నదినములకు కట్టియిచ్చే వాడ బత్తెపురూకలు.
Demurrer n s వ్యాజ్యములో ఆటంకపరచవలెనని చేసేమనవి,ఆక్షేపణ.
Demy n s ఒక తరహా కాకితము.
Den n s గుహ, బిలము, దాగేస్థలము. a * of thievesదొంగల వునికిపట్టు, దొంగల నివాసము, దస్యుగహ్వరము.A+.
Deniable adj కూడదనతగిన, కాదనతగిన, లేదనతగిన. It is not* that she is his mother ఆమె వాడి తల్లి కాదనరాదు, ఆమె వాడితల్లికాకపోదు. is this * ? యిది కాదంటావా లేదంటాడా ? లేదనగలరా.
Denial n s కాదనడము, లేదనడము, అపలాపము. on his అతడు కాదన్నందున. self * తనకు కాదనడము, విరక్తి, తపస్సు. this was an act of self * యిష్టము వుండిన్ని మానుకోవడము.act of self * యిష్టమువుండిన్ని మానుకోవడము.he would take no * కాదన్నా వినడు, లేదన్నప్పటికిన్ని.
Denier n s కాదనేవాడు లేదనేవాడు, యిది వాడుకలేనిమాట.Or farthing పరక.
Denizen n s కాపరస్థుడు, స్థలజ్ఞుడు. a * of heaven స్వర్గస్థుడు,స్వర్గవాసి.
Denomination n s పేరు. or creed మతము.
Denominator n s of a fraction గణితశాస్త్రములోహరము.(Warren, page 366.)
Denoting adj సూచకమైన, సూచకముగా వుండే.తెలియచేసే. heat * fever జ్వరసూచకమైన కాక.
Denouement n s ( a French word) కడకు తేలినపని,అనగా సురాభాండేశ్వరములో వేషధారిగా వక మనిషి వస్తూ వున్నాడుతుదకు అతను శివుడుగా వుండినట్టు తెలుస్తుంది, యిది * అనబడుతున్నది.
Denouncement n s చాటింపు, ప్రకటన, యెరుకచేయడము.
Dense adj దట్టమైన, గుబురుగా, వుండే, నీరంధ్రమైన, సాంద్రమైన.
Densely adv దట్టముగా, సాంద్రముగా, నిబిడముగా, నీరంధ్రముగా.a * peopled country జనులు మహా దట్టముగా వుండేదేశము.the arrows flew * బాణములు పుంఖానుపుంఖములుగా యెగిరినవి.
Densensess, Density n s. దట్టము, నిబిడము, సాంద్రము.from the smoke పొగదట్టమైనందున.
Dent n s నొక్కు, చొట్టు.
Dental adj దంత్యమైన, యిది వ్యాకరణమందు తథదధనలకుసాంకేతిక నామము. * surgery పంటి వైద్యము.
Dentifrice n s పండ్లుతోముకునే పొడి, పండ్లపొడి, దాసనపొడి.
Dentist n s పంటివైద్యుడు.
Dentition n s పండ్లుమొలిచే కాలము.
Denuded adj దిగంబరముగా చేయబడ్డ. the trees were entirely *ఆ చెట్ల ఆకులన్నీ రాలిపోయినవి.
Denunciaton n s ప్రకటన, చాటింపు. * of punishment శిక్షరాపోతుందని తెలియచేయడము.
Deodand n s అపరాధము, ప్రాయశ్చిత్తము, అనగా బండిపారిగానిగుర్రము తొక్కిగాని యివి మొదలైన ఆకస్మికమరణమునుగురించి దైవ ప్రీతిగా తీసే స్వల్ప అపరాధము.
Departed adj పోయిన, చచ్చిన, చనిపోయిన.
Department n s separate allotment or business assignedto a partiular person పని, నియమించిపని. this is not your * యిదినీ అధికారములో చేరినది కాదు. all the *s are under him అన్నివ్యవహారములు అతని చేతికిందవున్నవి. province or division భాగము,తుకుడి, జిల్లా. France is divided into eighty three *sఫ్రెంచిదేశము యెనభై మూడు జిల్లాలుగా యేర్పరచబడివున్నది. Astronomyis one * of Mathematicks జ్యోతిషము మహాగణితములో వక భాగము.
Departure n s వెళ్లిపోవడము, ప్రయాణం. a forsaking విడవడము.త్యాగము, తప్పిపోవడము. a * from virtue ప్రాతివ్రత్యభంగము,నీతిభంగము. * from truth అబద్ధమాడడము, నిజము తప్పడము.
Dependance n s నమ్మిక, ఆస్పదము, అవలంబనము, పరస్పరసంబంధము.I have no * on him వాడిమీద నాకు నమ్మికలేదు. there is a mutual* between man and woman స్త్రీ పురుషులకు పరస్పర సంబంధమువున్నది, అనగా స్త్రీ లేక పురుషుడికి గడవదు, పురుషుడు లేక స్త్రీకిన్నిగడవదని భావము. he is their sole * వారికి వాడే పట్టుకున్న అవష్టంభము.
Dependancy n s దేశము, చేరిన దేశము. the city and its *ciesఆ పట్టణమున్ను దాని యిలాకా గ్రామములున్ను . Hyderabad and its *ciesహైద్రాబాదున్ను దానితో చేరిన దేశములున్ను.
Dependant n s ఆశ్రితుడు, చూపెట్టుకుని వుండేవాడు, పోష్యవర్గుడు . *s or members of a family కుటుంబము, పరిజనము, జనము, ఆశ్రితులు.his *s ఆయనజనము, ఆయనచేతికిందవాండ్లు, ఆయనవాండ్లు.
Dependant, Dependent adj ఆశ్రయించివుండే, అవలంబించివుండే.I was * on him నేను అతన్ని ఆశ్రయించి వుంటిని.
Depicted adj వర్ణించుట, చిత్తరువు వ్రాసిన. I saw grief* in her face దాని ముఖము చూస్తే వ్యాకులముగా వున్నట్టు వున్నది.
Deplatory n s వెంట్రుకలు రాలిపొయ్యేటట్టు వేసేపొడి.
Depletion n s ఖాలిచేయడము. అనగా వమనము, విరోచనము, నెత్తురు తియ్యడముచేత శరీరమును శుద్దిచేయడము.
Deplorable adj చెడ్డ, దుఃఖకరమైన, యేడ్వవలసిన. a * stateదురవస్థ, దిక్కుమాలిన స్థితి. a * news చెడ్డసమాచారము, అఘోరమైనసమాచారము.
Deplorably adv అఘౌరముగా, పరితాపముగా. those peopleare * superstitious వాండ్ల పిచ్చి భక్తి యింతటి అఘోరము కాదు.
Deponent n s he who gives a deposition వాజ్మూలము యిచ్చేవాడు. all the *s వాజ్మూలము యిచ్చేవాడు. all the *s వాజ్మూలము యిచ్చినవాండ్లందరున్ను. In grammar "passive " యొక్క రూపముగలవొక తరహా. " active " క్రియ. తెలుగులో వాడు రాబడ్డాడు, వుండబడ్డాడుమొదలైనవి.
Depopulated adj నిర్మానుష్యము చేయబడ్డ, పాడైన. this place was* by the cholera వాంతి భ్రాంతి యిక్కడ వుండే జనాన్ని అంతా తుడుచుకునిపోయినది.
Depopulation n s ప్రజాక్షయము, ప్రజానాశనము , పాడు.
Deporatation n s పరదేశమునకు తీసుకునిపోవడము, దేశాంతరమునకుతీసుకునిపోవడము. before thier * వాండ్లను దేశాంతరమునకుతీసుకొనిపోకమునుపే.
Deportment n s నడత, నడవడి, ప్రవర్తన. from his * I thoughthim that he was a Musulman వాడి నడతను చూచి తురకవాడనుకొంటిని.
Deposed adj ( dismissed) తోసివేయబడ్డ. or attested వాజ్మూలమివ్వబడ్డ. what was * by these winteness ? యీ సాక్షులు యేమి చెప్పినారు.
Deposit n s (add,) బంధకము.
Deposit, Deposite n s. అనామతుగా పెట్టబడ్డది. in water నీళ్లల్లోఅడుగున దిగిన మష్టు.
Depositary n s place వుంచేస్థలము. or a man వుంచబడ్డవాడు.he was the * of their secret వాండ్లయొక్క మర్మజ్ఞుడు, వాండ్లమర్మమును వాడితో రహస్యముగా చెప్పిపెట్టినాడు. they made me their* నా దెగ్గర వుంచినారు.
Deposited adj వుంచిన, పెట్టిన, అడుగున దిగిన. the line thatwas * at the bottom of the water ఆ నీళ్లల్లో అడుగున దిగినసున్నము.
Deposition n s వాజ్మూలము తోసివేయడము, తీసివేయడము, నీళ్ల అడుగునదిగిన మష్టు. After the * of the king ఆ రాజును తోసివేసిన తరువాత.
Depository n s వుంచేస్థలము, పెట్టెస్థలము. Depot, n. s. వుంచేస్థలము, ఆయుధశాల, కొట్టు. a * for cartsబండ్లు పెట్టివుండే స్థలము, అనగా నూరు యిన్నూరు బండ్లు పెట్టివుండేకార్కానా.
Depravation n s చెరపడము, భ్రష్టుపరచడము. this wordis a mere * యిది వట్టి అపశబ్దము. to prevent the * of theschool పల్లెకూటము చెడిపోకుండా.
Depraved adj చెడ్డ, భ్రష్ట, పాపిష్టి, తుంట. a * wretchఅతిదుష్టుడు, పతితుడు.
Depravity n s దుర్మార్గము, దుర్నీతి. * of manners భ్రష్టత. by the * of human nature మనుష్యులు దుర్నీతులుగనక,మనుష్యులు పతితులు గనక.
Deprecated adj వద్దని బతిమాలుకొన్న, కారాదని వేడుకున్న, మొరపెట్టుకున్న.this was a result much to be *by them వాండ్లు యెంతమాత్రము కారాదనికొట్టుకునేతీర్పు, మొత్తుకునేతీర్పు.
Deprecation n s వద్దని బతిమాలుకోవడము, కారాదని మొరపెట్టుకోవడము.
Deprecatory adj వద్దని బతిమాలుకొనే, యెంతమాత్రము కారాదనిమొరపెట్టుకొనే, నివారకమైన. a * assertson సమాధానము.
Depreciated adj హీనమైన, నికృష్టమైన, చులకనైన. a * currencyజబ్బునాణెము, పట్టానికి మారే నాణెము అనగా సులాకీ రుపాయ, తేగడ రూకమొదలైనవి.
Depredation n s దోపుడు కొల్ల, దొంగతనము. the rats have committedgreat *s here యిక్కడ యెలుకలు శానా పాడుచేసినవి.
Depressing adj వ్యాకులకరమైన. * news వ్యాకులమైన సమాచారము.
Deprivation n s లేమి, లేకపోవడము, పోగొట్టడము. after this * ఉద్యోగము పోయిన తరువాత. by * of food అన్నము లేకుండా చేసినందున'by * of life ప్రాణమును పొగొట్టినందున. his wife was dead, and afterhis great deprivation & c. అతని భార్య చచ్చినదనే వియోగము సంభవించినతరువాత. the * of liberty is terrible స్వతంత్రము లేకపోవడముఅఘోరమే, అనగా కయిదిగా వుండడము కష్టము. a * of intelle ct వెర్రితనము.
Depth n s లోతు. in the * of winter మంచి చలికాలములో.from the * of his intellect అతని బుద్ధిగాంభీర్యతవల్ల. this is beyondmy * యిది నాకు బొత్తిగా గ్రాహ్యము కాదు.
Deputation n s రాయబారము. they sent him a * of ten persons వాండ్లు అతని వద్దికి రాయబారానికి పదిమందిని పంపినారు.
Deputed adj రాయబారియైన, వకీలైన. he was * by themవాండ్లకు వాడు వకీలుగా వచ్చినాడు.
Deputy n s రెండోవాడు, నాయబు. he did this by * దాన్నితన మనిషిచేత చేయించినాడు. the * clerk రెండో జవాబు నివీసు.the * collector రెండో కలక్టరు, చిన్నకలెక్టరు. the sheriff * or, sheriff * రెండో నాజరు, చిన్ననాజరు.
Deranged adj తారుమారైన, గందరగోళమైన, కలవరమైన. the clockis deranged ఆ గడియారములో బిసతప్పినది. he is * చలచిత్తుడైనాడు.his affairs are * వాడివ్యవహారములు కలవరముగా వున్నవి.
Derangement n s తారుమారు, కలవరము, తల్లకిందులు. on accountof the * of his health వాడి వొళ్లు తారుమారుగా వుండేటందువల్ల.or insanity వెర్రితనము. those who suffer from * వెర్రివాండ్లు.
Dereliction n s తప్పడము, విడవడము, విచ్ఛిత్తు, లోపము,భంగము, పరిత్యాగము. they look upon this as a * of duty దీన్ని ధర్మ విచ్చిత్తి అని అంటారు.
Derision n s హాస్యము, యెగతాళి, పరిహాసము, నగుబాటు, గేలి.
Derisive adj పరిహాసమైన, యెగతాళియైన, నగుబాటైన.
Derivation n s పుట్టుక, ఉత్పత్తి. what is the * of thisword యీ శబ్దము వల్ల యెట్లా పుట్టింది, యీ శబ్దము యొక్క వ్యుత్పత్తి యేమి.
Derivative adj పుట్టిన, వుత్పన్నమైన, వ్యుత్పన్న . a * wordసమస్తపదము. a * language ఒక భాషలో నుంచి పుట్టిన భాష, అనగాప్రాకృతము.
Derived p|| కలిగిన,ఉద్భవించిన,పుట్టిన, a word * fromthe Sanscrit, సంస్కృతతద్భవశబ్దము. They assert that this is * fromHindustani యిది తురకభాషలోనుంచి పుట్టినట్టు అంటారు.
Derogation n s హాని, తక్కువ, అగౌరవము, అవమానము.
Derogatory adj హానికరమైన, తక్కువైన, అగౌరవమైన, అవమానమైన. this is * to his rank యిది అతని పరువుకు మహాతక్కువ.this is * to them యిది వాండ్లకు అగౌరవము, అవమానము.
Dervis n s ఫకీరు, దరిబేసి.
Descant n s పాట, పదము, దరువు, దండకము.
Descendant n s సంతతి, వంశస్థుడు. we are his descendants మేము అతని వంశస్థులము.
Descent n s the act of coming down దిగడము. declivity దిగుడు.descent and ascent యెగుడుదిగుడు. the * of a hill కొండయొక్క దిగుడు. offsprint సంతతి, వంశము. man of pure * సత్కులప్రసూతుడు.he is one of the priestly * గురువంశములో పుట్టినవాడు. the * orappearance of a god on earth అవతారము. a man of royal* రాజవంశస్థుడు. the estate came to him by * వంశపారంపర్యంగావచ్చిన స్థితి. or generation తరము. two *s రెండుతరాలుor invasion దవుడు. the Pindarries made a * upon this townపెండారివాండ్లు యీవూరిమీద వచ్చి పడ్డారు.
Described adj చెప్పిన, వర్ణించిన. this is * in the Bharataయిది భారతములో వర్ణించబడ్డది. Description, n. s. వర్ణన, వివరము. a flowing * ( passage) వర్ణనాంశము. or sort తరహా, మాదిరి. cloths of every * నానావిధమైనగుడ్డలు, అన్నివిధముల గుడ్డలు. a cloth of this * యీమాదిరి గుడ్డ.it isall of one * అవి అన్ని వొకటేమచ్చు. of that * అటువంటి. of this* యిటువంటి. of what * యెటువంటి. what * of wood యేతరహా మాను.
Descriptive adj వివరముగా వుండే. a * passage in poetry వర్ణనాంశము .
Desecrated adj చెరపబడ్డ, భ్రష్టైన, అపవిత్రమైన, అశుచియైన.
Desecration n s భ్రష్టుపరచడము,భ భ్రష్టత్వము, భంగము.
Desert n s or deserving తగినది, యోగ్యతకు తగినది, శిక్ష, బహుమానము.a prince capable of distinguishing * యోగ్యత విచారించే రాజు. he metwith his *s వాడికి కావలసినది అయినది, అనగా వానికి కావలసినదిశిక్ష అయినది, వాడికి కావలసిన బహుమానము అయినది. they rewardedhim according to his *s వాడి యోగ్యతకు తగిన బహుమానము చేసినారు.or dessert of sweetmeats fruit&c. ఫలహారము యిది ముఖ్యముగా భోజనమైనతరువాత తినే కొంచెము మిఠాయి, పండ్లు మొదలైనవి.
Deserted adj పాడుగావుండే, భావురుమనివుండే, చెయివిడిచిన.a *temple పాడుబడి బావురుమని వుండే గుడి. by * his friends స్నేహితులచేత చెయ్యివిడువబడ్డ. a * heroine విరహిణి.
Deserter n s పారిపోయిన సిపాయి.
Desertion n s చెయ్యి విడువడము, తన పటాళము విడిచి పారిపోవడము. To Deserve, v. a. పాత్రుడౌట, అర్హుడౌట. he was rewarded ashe *d వాడికి యెట్లా జరగవలసినదో అట్లా జరిగినది. he *s wellవాడు యోగ్యుడు, అర్హుడు. he *s praise వాణ్ని స్తోత్రము చేయవలసినదే.he *s more వాడికి యింకా కావలసినదే. he *s death వాడు చావవలసినదే.he *s favour వానియందు అనుగ్రహముచేయవలసినదే, వాడు దయకుపాత్రుడే.
Deserved adj తగిన, అర్హమైన, యోగ్యమైన.పాత్రమైన. punishment తగిన శిక్ష.
Deservedly adv తగినట్టుగా, యోగ్యతానుసారముగా.
Deserving n s యోగ్యత. according to his * అతని యోగ్యతకుతగినట్టుగా.
Deshabille (FrenchLanguage)సాదాబట్టలు,In * కట్టుబట్టతోఅధికశృంగారము లేకుండా అనగా యింట్లో యేప్రకారముగావుంటారో ఆ ప్రకారముగానున్ను, పెద్దల యెదటికి రాకుండావుండేటప్పుడుయెట్లా వుంటారో అట్లాగు. when I saw him he was * నేను వాణ్నిచూచేటప్పుడు మంచి బట్టలు తొడుక్కోలేదు.
Desideratum n s ఘటించని బాగా పరిశోధించి నిర్ధారణ చేయబడనిది, అందరున్ను కోరతగ్గది, అందరికిన్ని ఆపేక్షితమైనది అరుదైనది, దుర్ఘటనగావుండేటిది. a sure medicine against chilera is a * వాంతి భ్రాంతికిమందు దుర్ఘటనముగా వున్నది, తగిన మందు యేర్పాటు కాలేదు.
Designated adj పేరుగల. gifts to a bride are *d Madhuparkamu.పెండ్లి కుమార్తెకు యిచ్చే చీరెను మధుపర్కమని అంటారు.
Designation adj పేరుగా వుండే, గురుతుగా వుండే. the markson the forehead are * of their respective sects నొసటవుండే గురుతులు ఆయా మతములకు చిహ్నముగా వున్నవి.
Designed adj తలచబడిన, యోచించబడిన, నియమించబడిన. thiswas a * insult యిది కావలెనని చేసిన అవమానము, పరిభవము.
Designedly adv బుద్ధిపూర్వకముగా, ఆలోచనపూర్వకముగా కావలెనని.he did it * వాడు దాన్ని కావలెనని చేసినాడు. he did not to do it * వూరికే చేశినాడు.
Designer n s యోచించేవాడు, మొదట యేర్పాటు చేసేవాడు. he paintedthe picture but his father was the * ఆపటానికి వీడు వర్ణము పెట్టినాడుఅయితే మొదటి యేర్పరచినవాడు వీడి తండ్రి.
Designing adj కపటియైన, కుత్సితముగల.
Desirable adj కోరతగ్గ, తగిన, మనోహరమైన. a * house మంచియిల్లుa * horse. దివ్యమైన గుర్రము. It is * that you should do thisనీవు యిట్లా చేయవలసినది. it is not * that you should do soచేయరాదు, చేయకూడదు.
Desirableness n s కోరతగినది, వాంచతవ్యము. this shews the* of a reconciliation యిందువల్ల సమాధానము కోరతగ్గదిగా తోస్తున్నది.
Desire n s కోరిక, ఇచ్ఛ, ఆశ, ఆజ్ఞ. God grantedtheir * దేవుడు వాండ్ల కోరికను నెరవేర్చినాడు. Desiresor carnal desires కామము, మోహము.
Desired adj కోరిన, ఆశించిన, కావలసిన. this is the * effect కోరినది యిదే.
Desirous adj కోరికగల, అపేక్షగల. they were * to see himవాణ్ని చూడవలెనని ఆశగా వుండినారు.
Desk n s యేటవాలుబల్ల, యేటవాలుపెట్టె, అనగా వ్రాయడానకైనాచదవడానకైనా వుండే బల్ల. A writing * వ్రాసేబల్ల, వ్రాసేపెట్టె. he is always at the * వాడు యేవేళ వ్రాస్తూ చదువుతూ వుంటాడు.
Desolate adj పాడైన, నిర్మానుష్యమైన. a * widow దిక్కులేనివితంతు.
Desolated adj పాడుచేయబడ్డ, నిర్మానుష్యము చేయబడ్డ. the townwas * by famine కరువుచేత ఆ పట్టణము పాడైపోయినది.
Desolation n s పాడు, దిక్కుమాలినస్థితి, సంహారము. a scene of* నిర్మానుష్య ప్రదేశము.
Despair n s నిరాశ, దిక్కులేని.
Despairingly adv నిరాశగా.
Despatch n s త్వర, జాగ్రత్త. are the goods ready for *పంపడమునకు సామాన్లు సిద్ధముగా వున్నవా. or letter జాబు, ఉత్తరము, యీ శబ్దములు. dispatch అని కొందరు వ్రాస్తారు.
Desperado n s ధూర్తుడు, ప్రాణానికి తెగించే దొంగ.
Desperate adj ఆశలేని, అసాధ్యమైన, సాహసముగల. a * manఅన్నిటికి తెగించిన సాహసుడు. his case is * వానికి ఆశ లేదు, వాడు చెడిపోతున్నాడు. * debts చచ్చుబాకీలు, రాని అప్పులు. a * rougeచెడ్డ దొంగ. a * theif ప్రాణానికి తెగించిన దొంగ. a * drunkardచెడ్డతాగుబోతు. a * illness తీరనివ్యాధి. vulgarly it meansviolent. Thus he made a * thrust at me నన్ను చెడ్డపోటు పొడిచినాడు.they started in * pursuit of him ప్రాణానికి తెగించి వాని వెంటపడ్డారు.
Desperately adv violently నిరాశగా, చెడ్డ, మహా, మిక్కిలి, అతి. In a vulgar use * hungry చెడు ఆకలిగల. it is * hotచెడ్డ కాకగా వున్నది.
Desperateness n s నిరాశగా వుండేస్థితి. from the * of theircircumstances వాండ్ల సంగతిని గురించి నిరాశగా వుండేటందువల్ల.
Desperation n s నిరాశ, నిస్పృహ, సాహసము. he was in a stateof * వాడు నిరాశగా వుండినాడు, ప్రాణానికి తెగించి వుండినాడు.
Despicable adv అతినీచముగా.
Despised adj అలక్ష్యము చేయబడ్డ, రోసుబడియైన, నీచమైన, తుచ్చమైన,హేయమైన. he that is * ( Prov. XII.9.) సామాన్యుడు. D+ ఊరు రోశినవాడు.
Despiser n s అలక్ష్యము చేసేవాడు. In Acts XIII. 41 అవజ్ఞాకారి.A+.
Despite n s అలక్ష్యము, విరుద్ధము. in * of విరుధ్దముగా, వ్యతిరిక్తముగా.he did it in * of orders ఆజ్ఞకు విరోధముగా చేసినాడు. in * ofthe rain వర్షమైనప్పటికిన్ని. they did it in * of me నేను యేమి చెప్పినావినకుండా జరిగించినారు.
Despiteful adj క్రూరమైన.
Despitefully adv క్రూరముగా, అవమానముగా . A+.
Despoiled adj దోచుకోబడ్డ.
Despoiliation కొల్ల,దోపిడి
Despondency n s నిరాశ.
Desponding adj నిరాశగా వుండే.
Despot n s ఏకఛత్రాధిపతి, నిరంకుశ ప్రభు, దౌర్జన్యము చేసేవాడు.In office he is a perfect * వుద్యోగములో పెద్దపులిగా వున్నాడు.
Despotic adj యెదురులేని, నిరంకుశమైన. a * morach నిరంకుశ ప్రభువు. * power నిరంకుశ ప్రభుత్వము, నిరంకుశాధికారము.
Despotism n s నిరంకుశ ప్రభుత్వము, తన కెదురులేదని దౌర్జన్యముగాచేసే ప్రభుత్వము. a moderate * దౌర్జన్యములేని దొరతనము.
Despressed adj అణిగిన, మట్టుపడ్డ. a * spot in the plainకుంగిన స్థలము, పల్లము. I observed a * on the grass అక్కడకసుపు అణిగి వున్నది. I observed the * on his head వాడి తలతోచొట్టగా వున్నది. of spirits దుఃఖము, వ్యసనము, వ్యాకులము.they are in * వాండ్లు వ్యాకులముగా వున్నారు, కుంగివున్నారు.
Dessert n s మాంస భోజనోత్తరమునందు తినే పండ్లుపలహారం మొదలైనవి. a * spoon నడితరము గరిటె, చిన్నగరిటె. a * spoonful గరిటెడు.
Destination n s ఉద్దేశము, ఉద్ధేశించినస్థలము, పోయిచేరవలసినస్థలము.on arrival at his * వాడు వుద్దేశించిన స్థలానికి పోయి చేరగానే.do you know his * ? వాడు యెక్కిడికి పోతున్నాడో నీకు తెలుసునా.
Destined adj ఉద్దేశించబడ్డ, నిర్ణయించిన, నియమించబడ్డ,యేర్పరచబడ్డ.
Destiny n s విధి, ప్రాప్తి, భాగ్యము, అదృష్టము. by * విధి వశముగా. hard * గ్రహచారము, దౌర్భాగ్యము. future * ముందరిగతి.
Destitute లేని,దిక్కులేని, she was left * అది దిక్కులేనిదైనది.this is * of reason దీనికి న్యాయము లేదు. * of cause నిర్హేతుకమైన.* of food అన్నానకులేని. * of strength బలహీనమైన. the * లేనివాండ్లు, దరిద్రులు, నిరాధరువుగా వుండేవాండ్లు.
Destitution n s లేమిడి, దిక్కుమాలినస్థితి, దరిద్రత.
Destroyed adj నాశనము చేసిన, ధ్వంసము చేసిన, చెడిన, పగలకొట్టిన,చంపిన, పాడైన. his eyes were * by reading చదవడముచేత వాడి కండ్లుఅవిసిపోయినవి.
Destroyer n s నాశనముచేసేవాడు, ధ్వంసము చేసేవాడు, చెరిపేవాడు,సంహరించేవాడు. a self-* ఆత్మఘాతకుడు.
Destroying adj పాడుచేసే, నాశనము చేసే, ధ్వంసము చేసే.
Destruction n s నాశనము, ధ్వంసము, సంహారము. afterthe * of the town ఆ పట్టము నాశనమైన తరువాత. are you rushingupon * నీకు పొయ్యేకాలము వచ్చినదా. self-* ఆత్మఘాతకము.
Destructive adj నాశనముచేసే, ధ్వంసముచేసే, పాడుచేసే, సంహారకమైన.drunkeness is * of the health తాగడము శరీరమునకు చెరుపు, చేటు,తాగడముచేత వొళ్లుచెడిపోతున్నది.
Destructiveness n s సంహారకత్వము, సంహారకశక్తి.
Desuetude n s వాడుక తప్పివుండడము. such marriages havefallen into * అటువంటి పెండ్లిండ్లు యిప్పుడు జరగడము లేదు, ఆ వాడుకతప్పినది.
Desultorily adv నిలకడలేక, అప్పటప్పటికి. he reads * మనసుకు వచ్చినప్పుడుచదువుతాడు, వొక నాటికి చదువుతాడు.
Desultory adj నిలకడలేని, నియమములేని, అనిశ్చితమైన.* study is unprofitable నిలకడలేని చదువు విఫలము. a * studentనిలకడలేని చదివేవాడు, వొకనాటికి చదివి వొకనాటికి చదవని వాడు.
Detached adj ప్రత్యేకముగా వుండే, వీడదీసిపంపిన, చెదిరిన.this house had two * rooms యీ యింటితో చేరిన రెండు గుమ్మములుప్రత్యేకముగా వున్నవి. my house is * from the village నా యిల్లువూరికి ప్రత్యేకముగా వున్నది. detached stones చెదిరిన రాళ్లు.
Detachment n s A part of regiment పటాలములోనుంచి చీలదీసి పంపబడ్డ కొందరు, తుకుడి. the * arrived last nightనిన్నరాత్రి వొక తుకిడి సిఫాయలు వచ్చి చేరినారు.
Detail n s వివరము, విశదము, వయనము. of a feast &c. కలాపము.in * or particularly వివరముగా, విశదముగా, సవిస్తారముగా.in *or one after another క్రమమున, క్రమక్రమంబున.The deatils of a regiment జనులు.
Detailed adj వివరించిన, వివరమైన. the troopswere * పటాలములో పేర్లపట్టి చదివినారు.
Detainer n s అప్పులవాణ్ని కైదులో నుంచి విడవకుండా నిలపవలెననివ్రాసుకొనేమనవి. I lodged my * కైదులోనుంచి విడవద్దని ఆర్జి యిచ్చినాను.
Detection n s బయలుపడడము, తెలిసిపోవడము. afterhis * వాడి దొంగతనము బయటపడ్డ తరువాత.
Detention n s ఆటంకము, అభ్యంతరము. the cause of my * wasనేను రాకపోయిన హేతువ యేమంటే, నేను నిలిచినందుకు హేతువయేమంటే. he passed ten years in * పదియేండ్లు కైదులో వుండినాడు.onaccount of the * of the letter జాబు ఆటంకమైనందున.
Detergent adj శుభ్రముచేసే, శుద్ధిచేసే, soap is * సబ్బుచేతమురికిపోతున్నది, సబ్బు మురికిని పోకొట్టేటిది.
Deteriorated adj చెడిన, భ్రష్టైన, తక్కువైపోయిన, దిగుడైపోయిన,his health is * వాడికి ఆరోగ్యము ఇప్పుడు తక్కువైనది.
Deterioration n s తక్కువ కావడము, దిగుడు . on account of the *ofthe language భాష కొంచెము అభాసైపోయింది గనుక.
Determinable adj నిశ్చయించకూడిన, నిర్ధారణచేయకూడిన, నిర్ణయించకూడిన.this is * by comparing the dates తేదులను సరిపెట్టి చూడడము.చేత దీన్ని నిర్ధారణ చేయవచ్చును.
Determinate adj నిశ్చయించబడ్డ, నిర్ధారణచేయబడ్డ, నిర్ణయంచబడ్డ,తేరుగడైన.
Determinately adv నిశ్చయముగా, నిర్ధారణగా, స్థిరముగా, దృఢముగా.
Determination n s or bravery ధైర్యము. a man of * భయములేనివాడు,ధైర్యశాలి. settlement నిశ్చయము ,నిర్ణయము, నిష్కర్ష,తీర్పు,ఏర్పాటు.having arrived at this * యిట్లా నిశ్చయించినందున. they have acquainted me with their * వారి నిశ్చయమును నాకుతెలియచేసినది.at last they came to this * తుదకు యిట్లా నిశ్చయించినారు.a * of blood to the head నెత్తురు తలకెక్కడము, వొక తరహా కాకిసోమాల.
Determined adj నిశ్చయించిన, he is * upon this యిట్లా నిశ్చయించుకొన్నాడు.being * on injustice అన్యాయమునకు ఆలయమై. Resolute or brave ధీరుడైన, వీరుడైన, ఉద్యుక్తుడైన. he has a very * look వాడి ముఖము చూస్తే ధైర్యముగా వుండేటట్టు వున్నది.
Deterred adj భయపడ్డ. they were * from coming వాండ్లురావడానకు భయపడ్డారు. he was * by this from goingయిందుచేత పోవడానకు భయపడి మానుకున్నాడు. I was * ఝడిస్తిని.do not be * భయపడవద్దు.
Detestable adj అసహ్యమైన, హేయమైన, గిట్టని, సహించకూడని.a * act అతిపాపిష్టి పని. a * knife పాడు కత్తి, పనికిమాలిన కత్తి.a * smell పాడు కంపు, జెష్ట కంపు.
Detestably adv అసహ్యముగా. it is * hot to-day నేడు యెమి పాడు యెండగా వున్నది.
Detestation n s అసహ్యము, గిట్టమి,పగ. they hold him in * వాడియందు వీరికి చెడు అసహ్యము. from their * of wine వాండ్లకుసారాయి గిట్టదు గనుక. he held them in * వాండ్ల మీద వాడికి పగ.వాండ్ల మాటంటే వాడికి తల చీదర.
Detested adj అసహ్యమైన, గిట్టని, అతిపాపిష్టి. books of this* kind యీ పాపిష్టి తరహా పుస్తకములు.
Dethroned adj రాజ్యభ్రష్టుడైన, రాజ్యమును కోలుపుచ్చుకొన్న,ప్రభుత్వము పోగొట్టబడ్డ, సింహాసనభ్రష్టుడైన.
Dethronement n s సింహసనభ్రష్టత, రాజ్యమును కోలుబుచ్చుకోవడము.After his * వాడు రాజ్యమును కోలుబుచ్చుకొన్న తరువాత.
Detonation n s పఠీలుమనడము, ఢమీలుమనడము.
Detonator n s a sort of pistol or guns ఒక తరహా తుపాకి, ఒక తరహా పిస్తోలు, చకుముకిరాయి లేకుండా గంధకముకలిపిచేసిన ఇనుపమొలతగిలి నిప్పుపడి కాలే తుపాకి.
Detraction n s చాడి, కొండెము, నింద, అపనింద, అపవాదము.
Detractor n s తక్కువగా మాట్లాడేవాడు, దూరుచేసేవాడు,చాడి చెప్పేవాడు.Detractory, adj. హానిచేసే, తక్కువైన, అపనిందగా వుండే,అపదూరైన, అపవాదమైన. * language తక్కువ మాటలు,దూషణ.
Detriment n s హాని తక్కువ, లోపము,, నష్టము. without * నిరాయాసముగా. if you cando it without * to your health నీ దేహ సౌఖ్యమునకులోపము లేకుండా చేయకలిగితే.
Detrimental adj హానియైన, చెరుపైన, బాధకమైన.
Deuce n s దుగ. the * రాక్షసుడు, యిది తిట్లల్లోవచ్చే మాట.whatthe * is this ? యిది యేమి యేడుపు, యిది తిట్టుమాట, అనరానిది.
Deuse n s see Deuce.
Deuteronomy n s బైబిలులో అయిదో కాండపేరు, అయిదో ఆగమము.E+.ద్వితీయ వివరణము. D+.
Devastation n s పాడు, నాశనము, ధ్వంసము. The cholerahas made a terrible * వాంతి భ్రాంతి చేతనిండా ప్రజాక్షయమైనది.
Developed adj బయటపడ్డ, తెలిసిన. after the flower was *ఆ పుష్పము వికసించిన తరువాత.
Developement n s బయటపెట్టడము, ప్రసిద్దము . after the * of theflower పుష్పము వికసించిన తరువాత. after the * of the plotఆ కుట్ర బయట పడ్డ తరువాత.
Deviation n s తప్పు, భేదము, వ్యత్యాసము, వ్యతిరేకము,ఉల్లంఘనము. this is a deviation from the rule యిది సూత్రమునకుభంగము, వ్యతిరేకము. a * from rectitude న్యాయము తప్పడము, అన్యాయము.* from regimen అపథ్యము. without * వ్యత్యాసము లేకుండా.
Device n s యుక్తి, ఉపాయము, తంత్రము. A sign or ensignబిరుదు, చిహ్నము, ధ్వజము. the lion is the * of the Englishఇంగ్లిషువారు సింహధ్వజము కలవారు. or flourish in writing చిత్రముగావ్రాసిన అక్షరములు వేడుకకు చేసి పెట్టే ఆకారము. the wall has a carved* of an elephants head fixed in it for the passage of the waterనీళ్లుపడడానకై చిత్రముగా యేనుగ ముఖమును గోడలో పొదిగి వుంటున్నది.
Devil n s శైతాను. A+ B+ K+. పిశాచము, F+G+P+. he castout the * from them వాండ్లకు పట్టిన దయ్యమును తోలివిడిపించినాడు.hed did this at the instigation of the * శైతాను యొక్క ప్రేరేపణచేత యిట్లా చేసినాడు. the wizard sent *s into him ఆ దయ్యాలబోతు వాడికి శూన్యము బెట్టినాడు. they say he has a * వాడికిదయ్యము పట్టినదంటారు . * worship భేతాళపూజ. In mythologya genie or giant రాక్షసుడు. Thus the *s bridge the *s wall &c.merely denote Gigantic Mountaineers or highlanders were styled giantsthat is *s or demons such were the rexasas agianst whom Ramawarred . In the Journal of the Roy: As socy.no X p. 265.Dr.Stephenson shews that "In the proper English sense" of the wordno such being as a * is known "among the Hindus.Theidea of an angelick " being fallen from its pristine holinessand " glory and now possessed of malicious qualities " is a Jewish and Christian ( and " Mahometan ") idea and in thissense no Hindus worship devils ." -A Sprite or demon దయ్యము.భూతము మొదలైనవి. a word of scorn హరంజాదా, పోకిరి,మొదలైనవి. printer*s అచ్చువేసే పనివాండ్లు. they playedthe * with these accounts వాండ్లు యీ లెక్కలను తల్లక్రిందులుచేసినారు, గందరగోళము చేసినారు. Note : the name శైతాను.used by A+ B+ K+ is the Musulman pronuciation of satan. Theword పిశాచము. usually means a ghost.
Devilish adj పాపిష్టి, చెడ్డ. "Excessive in a ludicroussense (Johnson) బహు, అతిశయమైన. Devilishly, adv. పాడుగా,అతి * hot పాడుకాక , యిది పాపిష్టి మాట అనరానిది.
Devilled adj peppered and grilled కాల్చిన, కబాబు చేసిన.
Devilry n s కొంటెచేష్టలు.
Devious adj దారిదిశలేని దోవడొంకిలేని, పెడదారిగా వుండే, చిక్కుగా వుండే,he pursued a * course వాడి దంతా తప్పునడక.
Devise n s కర్త, స్వతంత్రుడు, అనగా మరణశాసనపూర్వకముగా.యేర్పడ్డకర్త.
Devised adj దత్తమైన, యివ్వబడ్డ, అనగా మరణశాసన, పూర్వకముగాయివ్వబడ్డ. or contrived పన్నిన, కుదర్చిన.
Devoid adj లేని, విహీనమైన, దూరమైన. * of advantageనిష్ఫలమైన, అప్రయోజనకమైన. * of a reason or cause నిరహేతుకమైననిర్నిమిత్తమైన. brutes are * of reason మృగములు వివేకశూన్యములైనవి.మృగములు నోరు యెరగనవి. * of shame సిగ్గుమాలిన, సిగ్గులేని.
Devoirs n s మర్యాద, పెద్దలవద్ద నడుచుకోవలసిన మర్యాద.he paid his * to the governor గవనరు దర్శనాననకు పోయినాడు.
Devoted adj అర్పించబడ్డ, సమర్పించబడ్డ, వినియోగపరచబడ్డ, మీదుకట్టిన.నియమించబడ్డ. this money was * to their maintenance యీ ద్రవ్యమువాండ్లకు అన్నానకని నియమించబడ్డది. * to religion మతమందుఅభినివేశముగలవాడు. a poor * wretch దిక్కుమాలిన పక్షి. * friend పరమ స్నేహితుడు. a * man పరమభక్తుడు, వీరభక్తుడు.
Devotedly adv అతిభక్తిగా, శ్రద్దగా.
Devotedness n s అభినివేశము భక్తి, శ్రద్ద.
Devotee n s భక్తుడు, దాసుడు, సన్యాసి, తపసి.
Devotion n s భక్తి, శ్రద్ద. from the * of this moneyto this purpose ఆ రూకలను యీ పనికని యెత్తిపెట్టబడ్డందున, దీనికనినియమించబడ్డందున. from the * of his talents to thisbusiness వాడి ప్రజ్ఞ అంతా యీ పని యందే వినియోగపరచినందున.she is entirely at his * ఆమె అతని స్వాధీనములోవున్నది,అతను యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. Devotions, plu. పూజ, జపము.ప్రార్ధన. he was at his *s వాడు పూజలో వుండినాడు.
Devotional adj పూజాసంబంధమైన, భక్తిసంబంధమైన.
Devoulty adv భక్తిగా. I * hope that this is true యిదే నిజముకావలెనని నేను ముఖ్యముగా కోరుతున్నాను.
Devoured adj కబళికరించబడ్డ, నోట్లో వేసుకోబడ్డ, తినివేయబడ్డ,పాడైన, నాశనమైన, ధ్వంసమైన, హతమైన. * with care చింతాక్రాంతుడైన. * with grief దుఃఖాక్రాంతుడైన.
Devourer n s భక్షకుడు, నోట్లోవేసుకునేవాడు.
Devouring adj పాడుచేసే, హతముచేసే, ధ్వంసముచేసే. a * flameదావాగ్ని, కార్చిచ్చు. the house fell a victim to the * element ఆ యిల్లు తగలబడిపోయినది, ఆ యిల్లు పరుశురామప్రీతియైనది.( this is the phrase in Rajahmandri )
Devout adj భక్తిగల.
Dew n s మంచు, హిమము. it fell as * మంచువలె కురిసినది.in the morning the trees are covered with * తెల్లవారి చెట్లమీదమంచుకురిసి వుంటున్నది. a * drop మంచుబిందు. or wetness ఆర్ద్రత.a * of sweat చిరుచెమట. May * గొజ్జంగి,తెమ్మ, అనగామేనెలమంచు. యిది మందుకు వుపయోగమౌతున్నది.
Dewbesprent adj మంచున తడిసిన.
Dewlap n s గంగడోలు, గళకంబళము,పశువుల మెడలో బటవలె వేలాడేటిది.
Dewy adj మంచుగా వుండే, ఆర్థ్రముగా వుండే.
Dexter adj of the right hand దక్షిణ, కుడిచేతి. on the * side కుడితట్టు.
Dexterity n s కరలాఘవము , చతురత, చమత్కారము,నేర్పు, ఉపము , గట్టితనము,
Dexterous adj కరలాఘవము గల, చమత్కారము, నేర్పుగల, ఉపమరియైన, సమర్ధుడైన.
Dexterously adv కరలాఘవముగా, చమత్కారముగా, నేర్పుగా,ఉపాయముగా.
Dextrous adj See Dexterous.
Dextrously adj See Dexterously.
Dholl n s (an Indian word for pease) పప్పు. Dholl bushcharcoal, (used in gunpowder) కంది బొగ్గు.
Dhoney n s (Indian word for a sloop ) దోనే, పడవ.
Diabetes n s బహుమూత్రము, నీరురోగము.
Diabolic, diabolical adj అతిపాపిష్టి, చెడ్డ, దుష్ట.
Diacritical adj భేదమును తెలియచేసే, భేదద్యోతకమైన . * pointsare used in Persian and called Zabar, zer, and pesh యీ గురుతులుఫారసి భాష లో కలవు. In the letters ధ, ఢ, భ, the mark జడunderneath is called a * point.
Diadem n s కిరీటము, మకుటము.
Diagnosis n s లక్షణము, అనగా రోగభేదమును తెలియచేసేలక్షణము.
Diagnostic n s లక్షణము, రోగభేదమును తెలియచేసే లక్షణము.
Diagonal adj and n. s. ఐ మూలముగా వుండే, మూలకు మూలగావుండే, దీన్ని మహాగణితములో కర్ణము అని అంటారు. a * lineమూలకు మూలకగా గీచిన గీత.
Diagonally adv ఐమూలంగు, మూలకుమూలగా.
Diagram n s చక్రము, కోటి, యంత్రము.
Dial n s గడియలు మొదలైన వాటి గురుతులు గల గడియారముఖబిళ్ల, నీడగడియారపు బిళ్ల. a * plate గడియారపు బిళ్ల.a sun * నీడ గడియారము, ఛాయచేత ఘడియలను తెలియచేసే యంత్రము.
Dialect n s the form or idiom of a language భాషాభేదము మాట్లాడేతీరు, రీతి, వైఖరి, సరణి. the * of Telugu spokenin the town of Madras is not good చన్నపట్టణపు తెలుగుమాటలతీరుమంచిది కాదు, చన్నపట్టణములో మాట్లాడే తెలుగు మంచిది కాదు. this man's shews that he is a native of cuddapahవీడి మాటలతీరు చూస్తే కడప దేశస్థుడివలె వున్నది. there are five *s in Telugu తెలుగు అయిదు విధములు అనగా దేశ్యము తత్సముమొదలైనవి. Pracrit is a dialect of Sanscrit ప్రాకృతముసంస్కృతములో ఒక బేధము. some people say that Teluguand Tamil are *s of Sanscrit , but this is false తెలుగున్నుఅరవమున్ను సంస్కృతములోనుంచి పుట్టినవంటారు. అదిమిధ్య.
Dialectical adj logical, argumental తార్కిక, న్యాయశాస్త్రసంబంధమైన.appertainting to a language భాషాసంబంధమైన.
Dialectician n s తార్కికుడు, మీమాంస పండితుడు.
Dialectics n s తర్కశాస్త్రము, మీమాంస, న్యాయశాస్త్రము.
Dialogue n s సంభాషణ, ముచ్చట. a book of *s సంభాషనగ్రంధము. a set of *s వాక్యావళి.
Diameter n s అడ్డుకొలత, వ్యాసము, గోళము యొక్క మధ్యరేఖ.వ్యాసరేఖ. the wheel was one yard in * ఆ చక్రముయొక్క అడ్డుకొలత.వకగజము, అనగా వక గజము యెత్తు. what was the * of the ball ? ఆ గుండు యొక్క అడ్డుకొలత యెంత.
Diametrical adj ప్రత్యక్షమైన, పరిష్కారమైన. * disobedience పరిష్కారమైన అజ్ఞోల్లంఘనము.
Diametrically adj ప్రత్యక్షముగా, పరిష్కారముగా, శుద్ధముగా. * opposed పరిష్కారముగా విరుద్దమైన. this is * opposite towhat I expected నేను కోరినదానికి యిది శుద్ధముగా విరుద్దము.* contrary to orders వుత్తరవుకు ప్రత్యక్ష విరోధము.
Diamond n s వజ్రము, రవ. an artificial * తరుపు. a brilliantor flse * తోరమల్లి. * cut * యముడికిమొగుడు, దొంగలకు దొంగఅనే సామిత. at cards డైమను అనేకాకితము. * shaped పోకరూపుగావుండేగుర్తు. కాడ్వా ఆటలో డైమనుచుక్క ఆకారముగా వుండే గుర్తు.
Diapason n s సంగీతమందు శ్రుతి, సుతి, షడ్జమ స్వరము.
Diaper n s బుటేదారిగుడ్డ, డమాసురీతిగా, నేసినగుడ్డ, తళువము,తువాలగుడ్డ.
Diapered adj చిత్రవిచిత్రమైన, బుటేదారిగా నేసిన.
Diaphanous adj స్పటికమువలె వుండే, నిర్మలమైన, తేటైన.
Diaphoretic n s చమట పుట్టించే మందు.
Diaphragm n s రొమ్ముకున్ను కడుపుకున్ను నడిమిభాగము,నడిమిస్థానము.
Diarrhoea n s అతి సారము, గ్రహణి భేదులు. he is sufferingfrom * అతనికి అతిసార భేదులు అవుతూవున్నవి.
Diary n s దినచర్య, నానాటికి జరిగినదాన్ని వ్రాసిన పుస్తకము.
Dias n s ( terrace or pial ) అరుగు, తిన్నె.
Diatesseron n s సంక్షేపగ్రంధము, అనగా బైబిలులోGospels అనే నాలుగు కాండలలోనుంచి సంక్షేపముగా యెత్తివ్రాసినగ్రంధము చతుష్టయము.
Diatribe n s దూషణము, తిట్టు.
Dibble n s కుంటకర్ర, గసిక.
Dice n s ( The plural of Die) పాచికలు, అడ్డపాళ్లు.* box సొగటాల పెట్టె. * play సొగటాలఆట, మొదలైనఆటలు.
Dicer n s పాచికలు ఆడేవాడు.
Dickens n s ( See Johnson) శైతాను అన్నట్లు వకమాట,యిది తిట్టుమాట.
Dickey n s ( Seat behind a coach ) పెద్దబండిలో వెనకతట్టుపనివాడు కూర్చుండేటందుకు వుండే తొట్టి.
Dicongruity n s అసంగతము, వైపరీత్యము, విరుద్ధము.
Dicontented adj అసంతుష్టిగా వుండే, అసమాధానముగా వుండే,అసహ్యపడ్డ. as he was * at this యిది వాడికి సమ్మతము కాదు, గనుకయిది వానికి గిట్టనందున.
Dicopmfiture n s వోటమి, అపజయము, పరాభవము.
Dictate n s rule సూత్రము, విధి, ఆజ్ఞ. he did not listento the *s of conscience తన మనస్సుకు యిది పాపమైనట్టు తనకు తెలియచేసివుండిన్ని వాడు విన్నాడు కాడు, అనగా గుర్తెరిగి పాపముచేసినాడు.will you listen to the *s of reason బుద్దివింటావా.
Dictation n s చెప్పివ్రాయించడము. they wrote from his *అతను చెప్పుతూరాగా వీండ్లు వ్రాస్తూవచ్చినారు. or commandఆజ్ఞ, శాసనము. they acted by his * అతని ఆజ్ఞ ప్రకారమువీండ్లు చేసినారు.
Dictator n s అధికారి, శాస్తా, అనగా పూర్వకాలమందురోమ ్ దేశస్తుల చేత కొంతకాలము వరకు యేర్పరచుకోబడ్డసర్వాధికారి.
Dictatorship n s సర్వాధికారము, సర్వాధిపత్యము, సర్వసేనాధిపత్యము.See Dictator.
Diction n s style శయ్య, పాకము, వాక్పరణి. from it'sthis poem appears ancient పాకము చూస్తే యీ గ్రంధము పురాతనమనితోస్తున్నది,
Dictionary n s నిఘంటువు, శబ్దమంజరి. mere * phrases వట్టినైఘంటిక పదములబెట్టి రచించిన వాక్యములు.
Did do అనే క్రియకు భూతకాలము.
Didactic adj శాస్త్రమైన, విధాయకమైన. a * bookregarding law ధర్మశాస్త్రము. a * book ఉపదేశ సంగ్రహము.నీతి గ్రంధము శాస్త్రము. a * book regarding horses అశ్వశాస్త్రము. a * book regarding cookery సూపశాస్త్రము. the Hitopadesa is a *poem హితోపదేశము నీతి గ్రంధము. the prabodha chandrodayamis a * poem ప్రభోదచంద్రోదయము, శాస్త్రవిషయమైన కావ్యము.
Didactically adv బోధించేరీతిగా, ఉపదేశముగా, విధాయకముగా.యిది గర్వముతో చేరినమాట.
Didapper n s వక తరహా బాతు.
Diddiling v n మోసము, పితలాటకము వంచన, పచ్చైపుపని.
Die n s ( Dice) అద్దకము. for making coin ముద్ర.శిక్కా. for gambling పాచిక. the * is cast పాచిక దొర్లినది.పాచికపడ్డది, అనగా తగులుకొన్నది,యిఖనుపడక విధిలేదు, పడితీరవలెను.the *is cast you must sell the property యిఖను సొత్తులను అమ్మకవిధిలేదు.
Die, or Dye colour,seedye
Died v a the preterite of to die
Diet n s పథ్యము, భోజనము, అశనము, ఆహారము. a vegetable* శాకఅశనము, కాయగూరపథ్యము. he is on * or invalid వాడు పధ్యముగావున్నాడు, అశక్తుడుగా వున్నాడు. * drink కషాయము. a fishమత్స్యమాంసము . or supreme Council ఆలోచన సభ,యిదిGerman దేశపుమర్యాద.
Dietetic adj పథ్యమును గురించిన.
Difference n s భేదము, వ్యత్యాసము, వ్యత్యయము, వ్యతిరేకము, విరోధము.in accounts లెక్కవారడి. in money exchange తేడా , కసరు.వారడి. in manuscripts ప్రతిభేదము. the * of thier ages వారివయస్సు యొక్క తారతమ్యము. or quarrel వ్యాజ్యము.
Different adj వ్యత్యాసమైన, భేదమైన, వేరుఅయిన ,యితరమైన. he trav. lled through * countries నానా దేశములు తిరిగినాడు. the * books were arranged according to their languageఆయా భాషల పుస్తకములు వేరు వేరుగా యేర్పరచబడ్డవి.the books are in * langueages ఆ పుస్తకములు నానాభాషలుగావున్నవి. the works appointed for the * days ఆ యా దినములకుయేర్పరచిన పనులు.
Differently adv భేదముగా, వ్యత్యాసముగా, ప్రత్యేకముగా,వేరువేరుగా, నానా విధములుగా.
Difficult adj కష్టమైన, ప్రయాసైన . * of attainment అసాధ్యమైన,దుర్ఘటమైన. or captious పీకులాటచేసే, కఠినమైన. a * masterపీకులాటచేసేదొర, కఠినుడైన దొర, గడుసైన దొర. a * man పీకులాట మనిషి.
Difficulty n s కష్టము, ప్రయాస, యిబ్బంది. I understood himwith * బహుప్రయాస మీద వాడు చెప్పినది నాకు అర్థమైనది. he is indifficulties సంకటపడుతూ వున్నాడు. to raise difficulties పనికిమాలిన ఆక్షేపణలు చేసుట.
Diffidence n s సంకోచము, భయము, సందేహము . She felt * in speakingto him అతనితో మాట్లాడడానకు సంకోచపడ్డది.
Diffident adj సంకోచించిన, సిగ్గుపడ్డ.
Diffuesed adj వ్యాపించిన, ప్రసరించిన.
Diffuse adj విస్తారమైన. a * style గ్రంధవిస్తరము, గ్రంధబాహుళ్యము.
Diffusedly adv విస్తరముగా. Diffusely, adv. విస్తరముగా. he wrote * రెండు ముక్కలుగాచెప్పవలసినమాటను విస్తారముగా వ్రాసినాడు.
Diffusion n s వ్యాప్తి, విస్తరత, విస్తీర్ణము, విస్తారము, బాహుళ్యము.newspapers promote the * of knowledge సమాచారపత్రికచేత విద్యాప్రచారము కలుగుతున్నది.
Diffusive adj వ్యాపించే, వ్యాపకమైన, వ్యాప్తమైన, విస్తీర్ణమైన.the diffusive energy వ్యాపకశక్తి.
Diffusively adv వ్యాపకముగా, విస్తరముగా, బాహుళ్యముగా.
Diffusiveness n s వ్యాపకత, విస్తరత, బాహుళ్యము.
Digest n s స్మృతి, సంహిత, రాజనీతి సంగ్రహము.
Digested adj జీర్ణమైన, అరిగిన, కరిగిపోయిన, క్రమపరచబడ్డ,కుదిరిన, సవరించబడ్డ.
Digester n s ( a kettle or boiler ) కాగు, బాన, పక్వముచేసే బాన.
Digestible adj జీర్ణముకాదగ్గ, జీర్ణమయ్యే, అరగదగ్గ.
Digestion n s జీర్ణము కావడము, అరగడము. want of * అగ్నిమాంద్యము, జీర్ణశక్తి లేమి.
Digestive adj జీర్ణకారియైన, జీర్ణింపచేసే.
Digger n s తవ్వేవాడు. tank-diggers వుప్పరవాండ్లు, వొడ్డెవాండ్లు.
Digging n s తవ్వాటము, తవ్వడము.
Diggish adj మొండియైన, పెడసరమైన, క్రూరమైన.
Dight adj dressed, adorned, arrayed అలంకృతమైన, భూషితమైన,పరిష్కృతమైన.
Digit n s ఆంసము, భాగము , చంద్రసూర్యుల ద్వాదశాంశము.the moon was eclipsed six *s సగము చంద్రగ్రహణము పట్టినది.
Digitals n s or foxglov. గన్నేరు వేరు వంటి వక విషఓషది.
Digitated adj చేతివేళ్లరీతిగావుండే, ఆముదపాకు, వావిలిఆకు,వీటివలె వుండే.
Diglott n s ద్విభాషాగ్రంథము, అనగా వక భాషను వకపక్కనువేసిదాన్నే మరి వక భాషతో రెండో పక్కన వ్రాసి వుండే పుస్తకము.
Dignified adj గౌరవముగల, పరువుగల, ప్రతిష్టగల. * conductపెద్దమనిషితనము, గొప్పనడత, దొడ్డ నడత. he made a * speechగౌరవముగా మాట్లాడినాడు, గంభీరముగా మాట్లాడినాడు. a * clergymanగొప్పపాదిరి, పెద్ద గురుడు.
Dignitary n s గొప్పపాదిరి, యిది ముఖ్యముగా Bishop పేరు.
Dignity n s గౌరవము, పరువు, గణ్యముతెలిసినది.
Digression n s అప్రస్తుతప్రశంస, ఉపకథ, చిత్రకథ.
Dike n s a ditch or channel అగడ్త, కందకము,కాలువ. or bank కట్ట , గట్టు.
Dilacertaion n s ఛేదనము, శరీరమును చిన్నాభిన్నము చేయడము. To Dilapidate, v. a. పాడుచేసుట, నాశనము చేసుట.they *d his estate వాడి ఆస్తిని పాడుచేసినాడు.
Dilapidated adj పాడుచేయబడ్డ, ఛిన్నాభిన్నమైన. a * bookశిథిలమైన, గ్రంధము. a * house నిండా ఖిలముగా వుండే యిల్లు.
Dilapidation n s పాడు, నాశనము, శైధి ల్యము. to preventthe * of the estate ఆ యాస్తి చిన్నాభిన్నమైపోకుండా.
Dilatoriness n s జబ్బు, మాంద్యము, ఆలస్యము, తామసము.
Dilatory adj జాగుచేసే, ఆలస్యమైన, తామసమైన, జబ్బైన.
Dilemma n s చిక్కు, సందేహము, మిణకరింపు, యెటూతోచని స్థితి.I am in a * నాకు ప్రస్తుతము వొకటీ తోచలేదు. he is in the * ofbegging or starving బిచ్చము యెత్తేదా, లేక పస్తుచచ్చేదా. అనియెటూ తోచక మిణకరిస్తూ వున్నాడు.
Diligence n s జాగ్రత్త, చురుకు. in French, thismeans a stage coach తపాలుబండి.
Diligent adj జాగ్రత్తగల, చురుకుగల. a * man జాగురూకుడు.after * examination గట్టి విమర్శ జరిగినమీదట.
Diligently adv జాగ్రత్తగా, చురుకుగా.
Dill n s వకతరహా తోటకూర, శతపుష్పము, గవిసెములవంటివక గింజ. Ainslie I. 109 says సదాపచెట్టు.
Dillenia-speciosa n s ఉవ్వచెట్టు.
Dilly-dallying n s కాలయాపనము, కాలవిడంబనము. See Dally.
Dilucid adj నిర్మలమైన, స్పష్టమైన, తేటగా వుండే.
Dilucidation n s వివరణము.
Diluent n s కరగకొట్టేటిది. water is the great * వస్తువునుకరగగొట్టే వాటిలో జలము ముఖ్యమైనది.
Dilution n s పలచనగా చేయడము, పలచన కావడము. this isa * of salt యిది వుప్పు కలిపిన నీళ్లు.
Diluvian adj జలప్రళయసంబంధమైన. * relicks జలప్రళయమైనతరువాత దొరికిన పూర్వీకుల యెముకలు, పావుకోళ్లు మొదలైనవి.
Dim adj మందమైన, మబ్బైన, మసకగా వుండే, మెరుగుమాసిన, మకమకలాడే.నిస్తేజస్కమైన, నిష్రకాశమైన, అస్పష్టమైన. a * ruby గుడ్డికెంపు,కామసాధ్యపు కెంపు. * sight మంద దృష్టి. it became * దానిప్రకాశముపోయినది, అది మెరుగుమాసి పోయినది.
Dimensions n s కొలత, ప్రమాణము, అనగా నిడుపు, వెడల్పు,యెత్తున్నుగలది. the inside * లోపలి కొలత. do you know the * ofthis room? యీ అర యొక్క కొలతటయెంత, అనగా నిడుపు, వెడల్పు,యెత్తున్ను యెంత అని అర్ధము.
Diminished adj తగ్గిన, తగ్గిపోయిన, తక్కువైన, మట్టుపడ్డ.
Diminuendo n s ( in music) అవరోహణము.
Diminution n s తక్కువ కావడము. from the * of the water నీళ్లు తగ్గినందున. from the * of his means వాడికి రూకలు తగ్గినందున.
Diminutive adj మహాకొంచమైన, రవంతగా వుండే , సూక్ష్మమైన.an ant is a * cereature చీమరవంత జంతువు .a * man నిండాకురచ మనిషి,లొడితెడుమనిషి. a * tree జానెడు చెట్టు. a * house లొడితెడు యిల్లు.diminutives ( in grammar) వూరక, మిన్నక యిత్యాది.a * of names as will for William : or Tom and Tommy for Thomas :thus లచ్చి for లక్ష్మమ్మ
Diminutiveness n s కురచతనము, సూక్ష్మత్వము. from the *ofthis creature యిది మహా కొద్ది జంతువు గనక.
Dimity n s వకతరహాకితనారగుడ్డ, దీన్ని ముఖ్యముగా మేజామీదదుప్పట్లుగా పరుస్తారు.
Dimly adv మందముగా , మబ్బుగా, మసకగా, మగ్గినట్టుగా.It was * perceptible అది చూచాయగా కండ్లబడ్డది.
Dimmed adj కాంతివిహీనమైన. the light was * వెలుతురు తక్కువపడ్డది,మట్టుపడ్డది. the lamp was * ఆ దీపము మకమక లాడుతూ వుండినది.* lustre మందమైన కాంతి.
Dimness n s మబ్బు, మాంద్యము, మసక. she rubbed the silverto take away its dimness ఆ వెండిని తోమి దాని మసకను పోగొట్టినది. * of the eyes caused by age చమత్వారము.
Dimple n s a small cavity or depression on the cheek, chin, or other part పల్లము, అనగా బుగ్గలు, గడ్డము, మొదలైనవాటి మీద అందముగా ప్రకాశంచే పల్లము, యిది సౌందర్యవర్ణనమందుగాని వికారమును గురించిన మాటకాదు. see will son's VishuPur. p 229. where the sancrit is గండయౌః కూపకౌ.
Dimpled adj పల్లముగల, అనగా నవ్వేటప్పుడు చంపలలో గడ్డములోసొగసుగా పల్లముగల. her face was * with smiles నవ్వితే దానిబుగ్గలమీద సొగసుగా పల్లముగా పడుతవి.
Dimpling adj పల్లముపడే. see Dimple.
Din n s బొబ్బలు, కూతలు, అరుపు, ఆర్భాటము, మోత, తలచీదరగా వుండేమోత. the smiths make a great * ఆ కమ్మరవాండ్లు చేవులుదిమ్ముపట్టేటట్టు టంగుటింగుమని కొట్టుతారు. what a thosechildren are making ! ఆ పిల్లకాయలు కూసే కూతలలోనా తల పగిలిపోతుంది.
Ding-dong adv గొలగొల, గణగణ.
Dinginess n s మురికి, మకిల, మసక.
Dingle n s లోయ, రెండుకొమ్మల మధ్య.
Dingy adj మాసివుండే, మురికైన, మకిలగా వుండే.the jackass has a * hide గాడిదెయొక్క తోలులాగా వుంటుంది.a * beauty శోభాహీనశోభనాంగి, అనగా తీరైన ఆడదే గానిదాని వొంటి చాయ మంచిదికాదు.
Dining n s పగటిభోజనము చెయ్యడము. a * room భోజనముచేసే యిల్లు, భోజనశాల.
Dinner n s మధ్యాహ్నభోజనము, రెండోసారి భోజనము.he took his * with us వాడు మాతో కూడా భోజనము చేసినాడు.he dressed him own * తానే పండు కొన్నాడు. he madea * off it దాన్ని తినివేసినాడు, దానితో ఆకలి తీర్చుకున్నాడు,* party విందుకు వచ్చినవాండ్లు. a * set మేజాకు కావలసినపింగాణి సామాను.
Dint n s A blow, దెబ్బ. a mark made by a blow గుంట.a mark upon. silve r &c. నొక్కు,సొట్ట. or force బలము. he got it by * of asking అడిగే దెబ్బలో అది వాడికి దొరికినది.by * of struggling I escaped నా చేతనయినమట్టుకు కాళ్ల చేతులుతన్నుకొని తప్పించుకున్నాను, నా చేతనైన యత్నములు చేసినతప్పించుకొన్నాను. by * of hard study he learnt it వక దెబ్బగాపట్టి చదివినందున దాన్ని నేర్చుకున్నాడు.
Diocesan n s పెద్దపాదిరి, బిషపు.
Diocese n s బిషపు యొక్క అధికారానకు లోబడివుండే దేశము.గురువు యొక్క ముద్రచెల్లే దేశము.
Dip n s ముణక. a depression between two hills లోయ , పల్లము. at a single * వొక ముణకలో . he gave one * వకసారి ముణిగినాడు.
Diploma n s యోగ్యతా పత్రిక, సన్నదు, దీన్ని యీ దేశమందుa college certificate అని అంటారు. he took out a * వాడికియోగ్యతా పత్రిక దొరికినది.
Diplomacy n s మంత్రాంగము, మంత్రిత్వము, తంత్రము, వుపాయము. her * brought the marriage about అదిచేసిన తంత్రముచేత ఆపెండ్లివొనగూడినది. a book of * పంచతంత్రము.
Diplomatic adj మంత్రాంగసంబంధమైన, తంత్రమైన.
Diplomatist n s మంత్రి, తంత్రవాది, వుపాయశాలి.
Diposable adj అధికముగా వుండే, విశేషముగా వుండే, మిగతగావుండే, వ్రయముచేయడమునకు అర్హమైన. all the * productsమిగతగా వుండే ఫలములన్నిన్ని. I have no * funds నా వద్దరూకలు మిగిలిపడి వుండలేదు. నా వద్ద అట్లా అధికముగా రూకలులేవు. all his * time was given to this మిగతగా వుండేకాలములోనంతా యిదే పనిగా యిండినాడు. If you have a room * మీయింట్లో వొక అరవిడిగా వుంటే మిగతగా వుంటే.
Dipthong n s ద్వ్యచ్కసంధి, స్వరద్వయసంధి, అనగా ae, ae, ai oi,మొదలైనవి.
Diquietude n s ఆయాసము, తొందర, చింత, కలవరము.
Dire adj అఘోరమైన, భయంకరమైన, చెడ్డ. out of *necessity చెడ్డ, అక్కరచేత. he submitted to thisfrom * necessity వేరే గతిలేనందున వొప్పినాడు. * intelligenceఅఘోరమైన సమాచారము.
Direct adj చక్కని, సూటియైన, సరియైన. the * road చక్కనిమార్గము, రుజుమార్గము, సూటిగావుండే దారి. * lines రుజువైనపంక్తులు, వంకరలేని పంక్తులు. the * meaning సరియైన అర్ధము.a * falsehood వట్టి అబద్ధము, ప్రత్యక్షమైన అబద్దము.* proofప్రత్యక్షమైన రుజువు. the magistrate was not in * communicationto the government మేజిస్ట్రేటువారు గవనరుమెంటు వారికితాముగా వ్రాసుకోవడములేదు, అనగా తమ పై అధికారులగుండావ్రాసుకొంటారు. he is not the * heir వీడు సాక్షత్కార్తకాదు.a nephew is not the * heir of his uncle తోడబుట్టినవాడికొడుకుపినతండ్రికి సాక్షాత్తు వారసు కాదు, సాక్షాత్కర్తకాదు.
Directed adj గురిపెట్టబడ్డ, అజ్ఞాపించబడ్డ, పైవిలాసము వేయబడ్డ. Heaven -directed దైవాధీనమైన. See To Direct.
Direction n s లక్ష్యము, గురి, ఆజ్ఞ, దిక్కు, వైపు.పై విలాసము. in this * యీ తట్టు. in that * ఆ తట్టుకు. to his * అతని పేరటికి. he school is under his * ఆ పల్లెకూటము అతని అధికారములో వున్నది. invarious *s నాలుగుతట్లా,నఖముఖాల . He is in the Direction ఆయన యేలే దొరలలోవకడు.they ran away in different *s వాండ్లు మూలకు వొకరుగా పరుగెత్తిపోయినారు. he has the * of the business ఆ పనియొక్క నిర్వాహకముఅతని స్వాధీనములో వున్నది. your *s తమరు చెప్పిన ఆజ్ఞలు.I will follow your *s తమ ఆజ్ఞ ప్రకారము నడుచుకొంటాను. thedoctor's *s వైద్యుని వుత్తరువు.
Directly adv చక్కగా, సూటిగా, సరిగ్గా, వెంటనే, తోడుతోనే.you must go * నీవు యిప్పుడే పోవలసినది. I told him * అతనితోస్పష్టముగా చెప్పినాను, అతనితో తక్షణమే చెప్పినాను. he willbe here * వాడు యిప్పుడే వచ్చును. I will come * యిదుగో వస్తాను.I will give it you * యిదుగో యిస్తాను. this is * against thelaw యిది ఆ చట్టానికి బొత్తిగా విరోధము.
Directness n s చక్కన, సూటి, ఋజుత్వము. from the * ofthis question యీ ప్రశ్న పరిష్కారమైనది గనుక, అనగా యీ ప్రశ్నతిరుగుళ్లు లేనిది గనుక.
Director n s యేలేవాడు, విధాయకుడు, అధిపతి, గురువు. Godis the * of all things దేవుడే సమస్తమునకున్ను విధాయకుడు. తేనవి నతృణాగ్రమపి నచలతి. he is the * of the schoolఅతను ఆ పల్లెకూటపు విచారణకర్త. the court of Directiorsఅధికారులు విచారణకర్తలు.
Directory n s a book regarding places names, employmen. s&c. మార్గదర్శి, అనగా వారివారి పేళ్లు వుండేస్థలములు.ఉద్యోగములు, మొదలైనవి వ్రాసి వుండే పుస్తకము. a bookregarding religion ఉపదేశ గ్రంథము.
Directress n s యేలేటిది, విధాయకురాలు, యజమానురాలు.
Direful adj అఘోరమైన, భయంకరమైన , పాడు.
Direness n s అఘోరము, భయంకరత్వము.
Dirge n s a song of lamentation చచ్చిన, వానికి యేడుస్తూపాడేపాట, ప్రలాపము, గోడు, ఖేదజనమునకైన పాట, కరుణారసముగలపాట , దీన్ని అరవములో పెలాక్కణమంటారు.
Dirk n s బాకు, కటారి.
Dirt n s (Johnson) పిల్లకాయలు బంకమట్టితో చేసిన ఫలహారము.
Dirtily adv మురికిగా, రోతగా, అశుద్దముగా, అవలక్షణముగా.he behaved very * in this business పనిలో నిండా పోకిరితనముచేసినాడు.
Dirtiness n s మురికి, రోత, అశుచి, మాలిన్యము,పాచి, అవలక్షణము,పోకిరితనము. from the * of this cloth యీ గుడ్డ మురికిగా వుండేటందువల్ల.
Dirty adj మురికైన, మైలగా వుండే, రోతగా వుండే, అవలక్షణమైన,క్షుద్రమైన, నీచమైన, పోకిరి. as plates or spoons * యెంగిలిగావుండే. a * street రోతగా వుండేవీధి. * clothes మైలబట్టలు. a * white మైలతెలుపు. a * green మైలపచ్చ. a * red మడ్డియెరుపు.a * fellow అవలక్షణపు మనిషి. a * business క్షుద్రమైన వ్యవహారము,నీచపని.
Diruption n s bursting or breaking బీటికబాయడము, పగలడము.
Dirzzle n s తూర, చినుకు, తుంపర.
Disability n s అశక్తత, అసమర్థత, దౌర్బల్యము, నిస్త్రాణ.or legal impediment ప్రతిబంధకము. from his * to rise లేచేటందుకుశక్తిలేనందున. he removed their disabilities వాండ్లకు వుండినప్రతిబంధకనివర్తిచేసినాడు.
Disabled adj దుర్బలమైన, బలహీనమైన, అశక్తమై న, మూలపడ్డ,పనికిరాకపోయిన, ప్రతిబంధకమైన. * people దుర్బలులు,అశక్తులు, రోగులు. I am completely * నేను యెందుకు పనికిరాక పడ్డాను. the ship was * by a storm గాలివాన చేత ఆవాడకు పనికిమాలి పోయినది.
Disabused adj భ్రమనివారణమైన, తిక్కతెలిసిన. he thoughtme his enemy but at last he was * నన్ను శత్రువనుకౌన్నాడు గానితుదకు వాడికి తిక్క తెలసినది.
Disadvantage n s హాని, న్యూనత, తక్కువ, చెరుపు, నష్టము,నష్టి. they spoke to his * అతనికి విరోధముగా మాట్లాడినారు.అతనికి న్యూనతగా మాట్లాడినారు. he appears to great * in thisbusin. ss యీ పనిలో వాడి పేరు పొయ్యేటట్టు వున్నది. he soldit to * నష్టముగా అమ్మినాడు. that the boy is so young is a *ఆ పిల్లకాయ నిండా పసివాడుగా వుండడము వొక అసందర్భము , వొక చెరుపు. he took me at a * నాకు వుండే అసందర్భమును చూచుకొన్నాడు,నేను యే మారిన సమయము చూచుకొన్నాడు.
Disadvantageously adv ప్రతికూలముగా, హానికరముగా , నిష్ఫలముగా,నష్టముగా.
Disadvatageous adj ప్రతికూలమైన, హానికరమైన, చెరుపైన, నష్టమైన.is this * to you? యిందువల్ల నీకేమి హాని, యిందువల్ల నీకేమి విరోధము.
Disaffected adj ప్రతికూలమైన, విరోధముగా వుండే. persons * towardsgovernment అధికారితో విరోధించినవాండ్లు, రాజుమీద గిట్టకుండావుండేవాండ్లు, రాజద్రోహులు.
Disaffection n s ప్రతికూలము, విరోధము, అసహ్యము.
Disagreeableness n s అసహ్యత.
Disagreeble adj అయిష్టమైన, సరిపడని, పొసగని, గిట్టని, కాని,విరసమైన, అసహ్యమైన, అనిష్టమైన. all medicine is * మందు అంటేఅందరికిన్ని అసహ్యమే. a * man విరసుడు. it is * యిది గిట్టదు.
Disagreebly adv అయిష్టముగా, అసహ్యముగా.
Disagreement n s గిట్టమి, సరిపడమి, వొంటిమి, పగ, విరోధము.
Disallowed adj వొప్పుకొని, నిషేధించబడ్డ, కొట్టివేయబడ్డ, రద్దుచేయబడ్డ.
Disappearance n s మరుగై పోవడము , కనపడక పోవడము, పారిపోవడము,అంతర్దానము,మాయమై పోవడము. from the * of the waterఆ నీళ్లు యింకిపోయినందున. after the * of the cholera in that countryఆ దేశములో వాంతి భ్రాంతి నిలిచిపోయిన తరువాత.
Disappoinment n s భంగము, ఆశాభంగము, నైరాశ్యము.
Disappointed adj వంచించబడ్డ, మోసముపోయిన, మొక్కచెడ్డ.
Disapprobation, Disapproval n s. అనంగీకారము.అసమ్మతి. he expressed his * of this యిది కూడదన్నాడు,కారాదన్నాడు, దీనికి ఆయన వొప్పుకోలేదు.
Disarmed adj ఆయుధములను తీసివేయబడ్డ, నిరాయుధుడుగా చేయబడ్డ.the prisoners were * and brought in కయిదీల ఆయుధములు పెరుక్కునివాండ్లను లోనికి తీసుకవచ్చినారు. he was completely * by thisయిందుతో వాడి ఫణము అణగినది, యిందుతో వాడు బొత్తిగా అణిగిపోయినాడు.
Disarray n s చీకాకు, కలవరము, తారుమారు.
Disarrayed adj చీకాకుబడ్డ, చెదిరిపోయిన, తారుమారైన, ఆకటవికటము చేయబడ్డ. or stripped నిలువుకుదోచుకోబడ్డ.
Disaster n s గ్రహచారము, దురదృష్టము, దౌర్భాగ్యము, అవిధి,విపత్తు, చేటు.
Disastrous adj దురదృష్టమైన, దౌర్బాగ్యమైన, చేటైన, కాని,దుష్ట, చెడ్డ. a * occurence ఆపద, అపాయము ,చేటు.a * plight దురవస్థ.
Disastrously adv దురదృష్టముగా, దౌర్బాగ్యముగా, ఆపదగా. this marriged ended * ఆ వివాహము తుదకు ఆ విధిగా ముగిసినది,ఆపెండ్లి తుదకు ఆరుమూడైనది.
Disavowal n s కాదనడము, లేదనడము. in consequence of his * తాను యెరుగనన్నందున.
Disbelief n s అపనమ్మిక, అవిశ్వాసము. he expressedhis * నమ్మనన్నాడు, యిట్లా వుండదన్నాడు.
Disbeliever n s నమ్మనివాడు, మతవిరోధి. he is * in the Koran.కురానును నమ్మనివాడు తురకమతవిరోధి.
Disbursed adj శెలవైన, వ్రయమైన, వినియోగమైన.
Disbursement n s సెలవు, వ్రయము.
Disc n s see Disk
Discarded adj తోసివేయబడ్డ, పరిహరించబడ్డ. * as beingapocriphal అప్రసిద్దమైన.
Discerible adj కనుబడే, అగుబడే, కనుక్కోదగ్గ, గ్రాహ్యమైన.
Discernibly adv కనుబడేటట్టుగా , అగుబడేటట్టుగా,గ్రాహ్యముగా.
Discerning adj తెలివిగల, వివేకశాలియైన.
Discernment n s తెలివి, వివేకము.
Discharge n s letting విసర్జనము, విమోచనము, విడిచిపెట్టడము.performance నెరవేర్చడము. in the * of his duty అతనిపనినెరవేర్చడములో. dismissal తోసివేయడము. release విడుదల చేయడము.చెల్లు. after he obtained his * from jail. చెరసాలలో నుంచివిడుదలైన తరువాత. or * flow కారడము. there was a heavy * of rain జడివాన కురిసినది. at a single * the gun killedthree men ఒక ఫిరంగి వేటుకు ముగ్గురు చచ్చినారు. I heard the *of a gun తుపాకి వేటు విన్నాను. the * of the gun was very loudఆ ఫిరంగిది మహామంచి ధ్వని. the *s both of the stomach andof the bowels shewed the presence of poison వాంతిలోనున్నుభేదిలోనున్ను ఆ విషము అగుపడ్డది.
Disciple n s శిష్యుడు. you are quite a * of his వాడే నీకు గురువు, అనగా వాడిమాట యెంతో నీమాట అంతే. I am not a * ofhis వాడి అభిప్రాయమే నాకు ముఖ్యము కాదు.
Disciplinarian n s శాసనీకుడు, శిక్షకుడు. he was a rigid* వాడు సిపాయిలను వేయించి బొక్కలాడేవాడు. he is no * వాడు అంత క్రూరుడు కాడు.
Discipline n s శిక్ష, ఉపదేశము, నేర్పడము. spiritual * వ్రతాలనుఆచరించడము. Or whip చప్పుకు, చబుకు, కొరడా.
Disclaimer n s యెరుగననే మనవి. he filed a * యీ వ్యాజ్యముతాను బొత్తిగా యెరుగనని మనవి అర్జి దాఖలు చేసినాడు.
Disclosed adj తెలియచేసిన, ప్రసిద్ధమైన,
Disclosure n s మర్మమను బయట చెప్పడము, ప్రకటన,after this * యీ రహస్యము బయటపడ్డ తరు వాత, యీసంగతి బయట తెలిసిన తరువాత.
Discoloration n s వర్ణము లేచిపోవడము,వైవర్ణ్యము కావడము.కందిపోవడము. I observed * upon his skin వాడి వొళ్లు కందినట్టునాకు తెలిసినది, వాడి దేహ కాంతి తప్పినట్టుగా నాకు తెలిసినది.on account of * of the paper ఆ కాకితము యొక్క వన్నేపోయినది గనుక.
Discoloured adj వివర్ణమైన, కందిన. the tongue is * నాలుకవివర్ణమైనది.
Discomfited adj వోడిన, అపజయముపొందిన.
Discomfort n s అసౌఖ్యము, తొందర. he lives in great* వాడికి హాయి లేదు, వాడికి సౌఖ్యము లేదు.
Discommoned adj appropriated నియమితమైన, ఏర్పరచబడ్డ,ఉద్ధేశించబడ్డ, వేలివేయబడ్డ.
Discomposed adj ఆయాసపడ్డ, తొందరపడ్డ.
Discomposure n s కలత, తొందర, ఆయాసము,. వ్యాకులము.
Disconcerted adj భంగపడ్డ, మొక్కచెడ్డ, కలవరపడ్డ, theirplans were * వారి యుక్తి తప్పినది , చెడిపోయినది.
Discongraous adj అసంగతమైన, వ్యతిరేకమైన, విరుద్దమైన, తగని,వొప్పని.
Disconnected adj అసంగతమైన, అసంబంధమైన.
Disconsolate adj దుఃఖపడే, ఆదరణలేని. a * widow దిక్కుమాలిన విధవ.
Disconsolately adv నిరాదరణగా, దిక్కుమాలిన, పరితపిస్తూ.
Discontent n s అసంతుష్టి, అసమాధానము, అసహ్యము, చీదర .
Discontentedly adv అతృప్తిగా, అసమాధానముగా.
Discontentedness n s అసంతుష్టి, అసమాధానము ,కొదవ, కొరత,
Discontentment n s అయిష్టము, అసమ్మతి, వ్యాకులము. చింత, కొదవ, కొరత.
Discontinuance, Discontinuation n s. భంగము, , విచ్ఛేదము.విరామము, నిలుపు,నిలిచిపోవడము. on account of the * of instructionచదువు చెప్పడము, నిలిచిపోయినందున. on account of the * of tillageసాగుబడి నిలిచిపోయినందున.
Discord n s వ్యత్యయము, వైపరిత్యము, విరోధము, అసంతము,పొసగమి, గిట్టమి, కలత. in music శ్రుతివ్యత్యయము, శ్రుతికూడమి.
Discordance, Discordancy n s. వ్యత్యయము, వైపరిత్యము, విరోధము,అసంగతము, పొసగమి, గిట్టమి, కలత.
Discordant adj సరిపడని, అసంబంధమైన, అసంగతమైన,పొసగని. in music శ్రుతివ్యత్యయమైన.
Discordantly adv అసంబంధముగా , అసంగతముగా , విరోధముగా,సరిపడక .
Discount తోపుడు,తీసివేత,ధరాతు,నాగా, I will pay yourdraft if youy will give me ten rupees * పదిరూపాయలు తీసివేస్తేనీ హుండికి రూకలు యిస్తాను. silk is now at a* పట్టు సరుకులకుయిప్పుడు గిరాకి లేదు. Sanscrit learning is at present at a * inMadras యిప్పుడు సంస్కృత విద్య యిక్కడ తోపుడుగా వున్నది.
Discountenance n s ఉపేక్ష నిగ్రహము.
Discountenanced adj ఉపేక్షచేసిన, నిగ్రహించబడ్డ.
Discouraged adj అధైర్యపడ్డ, భయపడ్డ. I felt quite * నేను మిక్కిలి అధైర్యపడ్డాను, భయపడ్డాను . he was * at this యిందుచేత వాడు సందేహించినాడు, వెనకతీసినాడు. do not be* భయపడవద్దు.
Discouragemnet n s అధైర్యము, అడ్డి. this was a great* యిందుచేత నిండా అధైర్యమైనది, యిది ముఖ్యమైన అభ్యంతరము.
Discourse n s సంభాషణ, ప్రసంగము, సల్లాపము, ముచ్చట. a treatiseగ్రంధము, సంభాషణ సరణిగా వుండే గ్రంధము. he wrote a * regarding charityవాడు ధర్మమును గురించి వొక గ్రంధము ను వ్రాసినాడు.
Discourser n s (a word used by warburton, regarding barrow )వాచాలకుడు.
Discourteous adj అమర్యాదస్థుడైన, మూర్ఖుడైన, విరసుడైన.
Discourteously adv అమర్యాదగా, మూర్ఖతనముగా, విరసముగా.
Discourtesy n s అమర్యాద, మోటతనము.
Discouterousness n s అమర్యాద, మూర్ఖత, విరసము.
Discoverable adj గోచరమయ్యే, అగుపడదగ్గ, కనుక్కోదగ్గ,తెలుసుకోదగ్గ. there is no * difference between this and thatవీటిలో భేదము అగుపడలేదు.
Discovered adj తెలిసిన, బయటపడ్డ, కనుక్కోబడ్డ.
Discoverer n s కనిపెట్టేవాడు, బయటపెట్టేవాడు,చూపేవాడు. the * of that country ఆదేశాన్ని మొదట కనుక్కొన్నవాడు.
Discovery n s కనుక్కోవడము, కనిపెట్టడము, బయటపెట్టడము.after the * of the handkerchief రుమాల దొరికిన తరువాత. afterthe * of this star యీ చుక్కను కొత్తగా కనుక్కొన్న తరువాత.after the * of the plot ఆ కుట్ర బయటపడ్డ తరువాత. before the *of this root యీ మూలిక చిక్కక మునుపు. he made * aof the whole plot ఆ యావత్తు కుట్రను బయట పెట్టినాడు.
Discredit n s తక్కువ, అవమానము, మానహాని, అపకీర్తి.
Discreditable adj తక్కువైన, పరువుతక్కువైన, హీనమైన,నీచమైన. they do not consider it * to sell their daughters కూతుండ్లనుఅమ్మడము వొక తక్కువగా వాండ్లు యెంచడము లేదు.
Discreditably adv తక్కువగా, పరువుతక్కువగా, హీనముగా,నీచముగా. he married his daughter * తన కూతురుకి వొకనీచ వివాహము చేసినాడు, అనగా తన కూతురుని వొక నీచుడికి యిచ్చి పెండ్లిచేసినాడు.
Discreet adj బుద్ధిగల, వివేకముగల, జాగ్రత్తగల. a * person వివేకి, వివేకశాలి.
Discreetly adv తెలివిగా, వివేకముగా, వూహాగా, పదిలముగా,జాగ్రత్తగా.
Discreetness n s బుద్ది,తెలివి,వివేకము,పదిలము, భద్రము.
Discrepance, Discrepancy n s. భేదము, వ్యతిరేకము, అసంబంధము.విరుద్ధము.
Discrepant adj భేదమైన, వ్యతిరేకమైన, అసంబంధమైన, విరుద్దమైన.these two rules are quite * యీ రెండు సూత్రములు పరస్పరవిరుద్దములుగా వున్నవి.
Discrete adj See Discreet
Discretion n s బుద్ది, తెలివి, వివేకము, పదిలము, జాగ్రత్త.I leave it to your * మీ యిష్టప్రకారము చేయండి, మీకెట్లా యిష్టమోఅట్లాచేయండి. at * or freely స్వేచ్ఛగా, మనుసువచ్చినట్టుతోచినమట్టుకి. you have a fever you must eat with * but you maydrink water at * నీకు జ్వరముగా వున్నది గనుక నీవు పదిలముగాభోజనము చేయవలసినది, అయితే నీళ్లు యెంత కావలస్తే అంత తాగు.your fever is over you may now eat at * నీకు జ్వరముపోయినదిగనుక నీ మనసు వచ్చినట్టు భోజనము చేయవచ్చును. you may go orstay * నీవుపోతే పో వుండే వుండు. the enemy surrendered at * శత్రువులు తమరు యెట్లాచెబితే అట్లా వింటామని భవ్యులైనారు. you may read Telugu or Tamil at * తెలుగైనా చదువు అరవైమైనాచదువు, నీకేది యిష్టమో అది చదువు. ever since he cameto years of * వాడికి బుద్ది తెలిసిన నాటనుంచి, వాడు ప్రబుద్దుడైననాట నుంచి.
Discretionally adv తన యిష్టప్రకారము, తనకు తోచినట్టు.
Discretionary adj యధేచ్చగా వుండే, స్వేచ్ఛగాచేసే, * power నిరంకుశాధికారము, స్వతంత్రము. * punishmentయధేచ్ఛగాచేసే శిక్ష, తనకు తోచినట్టు చేసే శిక్ష.
Discrimination n s బుద్ది, తెలివి, వివేకము. or mark గురుతు, చిహ్నము, అనవాలు. a man of * వివేకపు శాలి.
Discriminative adj వివేచనముగా వుండే, గురుతుగా వుండే. * powers వివేచన శక్తి
Discursive adj వ్యాపించే, నాలుగుతట్లా వ్యాపించే, శక్తిగల the * faculty అష్టావధానశక్తి, నాలుగు తట్లా వ్యాపించేశక్తిగల బుద్ధి.
Discursively adv వ్యాపించి, నాలుగుతట్లా వ్యాపించి.
Discus n s a quoit, a round iron for play చక్రము, చిమ్ముబిళ్లthe * of Vishnu విష్ణు చక్రము.
Discussed adj విమర్శించిన, విచారించిన, తర్కించిన, వాదించిన.or dissolved కరిగిపోయిన.
Discussion n s తర్కము, చర్చ, వివాదము, విమర్శ. empty, * వితండవాదము. or dissolution కరగడము. to promote the * ofthe tumour గెడ్డను కరిగించుటకు.
Discutient adj కరుగగొట్టే. this oil is * యీ తైలముగెడ్డలను కరుగకొట్టేసినది.
Disdain n s అలక్ష్యము, ఉపేక్ష, అసడ్డ. he looked uponit with * దాన్ని అలక్ష్యము చేసినాడు, ఉపేక్షచేసినాడు.he looks upon the poor with * బీదవాండ్లంటే వాడికి మహాఅలక్ష్యము.
Disdainful adj అలక్ష్యమైన, గర్వము గల. a * face గర్వించినముఖము. a * woman గర్విష్టురాలు.
Disdainfully adv అలక్ష్యముగా, అహంకారముగా , గర్వించి.
Disdainfulness n s అలక్ష్యము, తిరస్కారము, అహంకారము, గర్వము.
Disease n s రోగము, జాడ్యము, తెవులు. the fould * శెగ రోగము.nerveous * సన్నిపాతము.
Diseased adj రోగము తగిలించుకొన్న. the eye is * కంటికినొప్పి తగిలినది. he is * వాడికి నొప్పివచ్చినది, వాడికిరోగము తగిలినది. the * రోగులు. a * person రోగి. a * appetiteఅతిక్షుధాతరుము, పెనుఆకలి. he has a * appetite for readingవాడికి చదువుమీద అత్యాతురము వున్నది, అనగా పనికిమాలినఆతురము వున్నది.
Disegardfully adv ఉపేక్షగా, అనాదరణగా, అలక్ష్యముచేసి,విచారించక, విచారించని, తిరస్కరించి.
Disembarkation n s దిగుమతి, వాడలోనుంచి దించడము, దిగడము.
Disembarkment n s వాడలోనుంచి దండు, దిగడము.
Disemboidied adj శరీరమును విడిచిన, ముక్తదేహియైన. a* sporitముక్తదేహియైన, ఆత్మ , అశరీరి, ప్రేతము. the government ordred the regiment to be * ఆ రిజిమెంటును యెత్తివేయమనిగవర్నమెంటువారు వుత్తరువు చేసినారు. the army was * ఆ దండునుయెత్తివేసినారు.
Disembowelled adj కడుపుచింపి పేగులు వెళ్లదీయబడ్డ.
Disenchanted adj దిగదుడుపుచేయబడ్డ, ప్రతిమంత్రముచేత పొగొట్టబడ్డ,భ్రమతీరిన.
Disenchantment n s భ్రమ నివారణము. after his * వాడికిభ్రమ తీరిన.
Disencumbrance n s బళువు తీరడము, సంకటము తీరడము,చిక్కు వదలడము.
Disengaged adj వూరికేవుండే, విడిగా వుండే, విడదీయబడ్డ,వీడిన. whenever you are * నీవు సావుకాశముగా వుండేటప్పుడంతాI am now * నేను యిప్పుడు వూరికే వున్నాను. after the rope was* ఆ తాడు వీడిన తరువాత. the elder sister is engaged but theyounger is * పెద్ద దానికి వరుడు కుదిరినాడు చిన్నదానికి కుదరకవూరికే వున్నది. this house is engaged now last month it was *ఆ యిల్లు పోయిన నెలలో వూరికే వుండినది, యిప్పుడు వుపయోగములోవున్నది.
Disfaver n s నిగ్రహము.
Disfiguration n s అనాకారము చేయడము, కురూపముగాచేయడము. his nose was cut off and besides this * ముక్కుకోసి విరూపునిగా చేసినది కాకుండా. cutting downthe trees is a * to the road చెట్లను కొట్టివేసినందున భాటవికారమైపోయినది.
Disfigured adj వికారమైన , అందవికారమైన, కూరూపమైన,విరూపమైన.
Disfranchised adj అధికారము తోసివేయబడ్డ, See To Disfranchise
Disgorged adj కక్కించిన.
Disgrace n s అవమానము, అగౌరవము, అపనింద.
Disgraced adj అవమానపడ్డ. this book is * with many errorsయీ గ్రంధములో వుండే అబద్దాలచేత దానియొక్క గౌరవముచెడిపోతున్నది.
Disgraceful adj అవమానమైన, సిగ్గుపొయ్యే, దుష్ట, పోకిరి. * conduct దుర్నడత. * language దుష్టమాటలు, పోకిరిమాటలు.
Disgracefully adv అవమానముగా, తలవంపుగా. this boyis * ignorant యీ పిల్లకాయ యొక్క మూఢత్వమును చెప్పుకుంటే సిగ్గుపోను.
Disguise n s వేషము, మారువేషము , ప్రచన్నవేషము.in the * of friendship స్నేహితుడని వేషము వేసుకొని.
Disguisement n s మారువేషము.
Disgust n s అరోచకము, అసహ్యము , చీదర, విరక్తి.
Disgusted adj అసహ్యపడ్డ,చీదరపడ్డ, రోసిన. he was * at thisయిందువల్ల వాడు అసహ్యపడ్డాడు, యిందువల్ల చిదరపడ్డాడు.
Disgustful adj అసహ్యమైన, చీదరైన.
Disgusting adj అసహ్యకరమైన, చీదరచేసే, రోతైన. a * smellదుర్గందము, కంపు.
Dish n s పాత్ర, పళ్లెము, తట్ట. a great * తాంబాళము.a small * తబుకు. a * or food ఆహారము. a * of rice అన్నము. a * of grens or herbs కూర, కీర. a * of fish వండిన చేపలు. a made * షడ్రస్నానము. a Plain * శుష్కాన్నము,వట్టికూడు. foreign *es అన్యదేశస్థుల మర్యాద ప్రకారముచేసిన పాకము. a standing * నిత్యటి భోజనము, యెప్పటి ఆహారము.rice is a standing * with the Hindus హిందువులకు వరి కూడుముఖ్యమైన ఆహారము. he is a standing * with them వాడు నిత్యమువాండ్లతో కూడా భోజనము చేస్తాడు. Sanscrit is standing* with them వాండ్లకు సంస్కృత చదువే ముఖ్యము.
Dishabille n s పడకవుడుపు, పడకలో నుంచి లేచేటప్పుడు వేసుకొనివుండే వుడుపు. he is in * అతను యింకా బట్టలు తొడుక్కులేదు.they brought him in * వాణ్ని బట్టలు తొడుక్కోకమునుపేతీసుకొని వచ్చినారు, అనగా పడకలో తొడుక్కున్న గుడ్డలతోనేతీసుకొనివచ్చినారు. ( అసభ్య, అనాలంకృత is the literal sense)
Dish-clout n s పాత్రలు తుడిచేగుడ్డ.
Disheartened adj ధైర్యముతప్పిన. he was quite * at thisయిందువల్ల వాడికి ధైర్యము శుద్ధముగా పోయినది.
Dishevelled adj చింపిరిగా వుండే, విరియపోసుకొనివుండే.she came with her hair all * అది తలవిరియ పోసుకొనివచ్చినది.చింపిరి తలతో వచ్చినది. the * matted locks of a hermitవిరియపోసుకున్న సన్యాసి జడలు. like a fair flower * in thewind ( Cowper's poems) గాలికి కొట్టుబడి విరియబడ్డ, పుష్పమువలె.
Dishonest adj నాణ్యములేని, నమ్మకము లేని, యోగ్యతలేని. a *act మోసము, దొంగపని. a * trick మోసము, కృత్రిమము. a *man మోసగాడు, దొంగ. a * woman మోసకత్తె . a * witnessతప్పుసాక్షి. she certainly is chaste but she is abominably* అది పతివ్రత సరేగాని అయితే చెడ్డ మోసకత్తె.
Dishonestly adv నాణ్యము లేకుండా, అయోగ్యముగా , మోసముగా,దొంగతనముగా.
Dishonesty n s మోసము, దొంగతనము. an act of * కుట్ర,కృత్రిమము.
Dishonor n s తక్కవ, అవమానము, అగౌరవము , అపకీర్తి.
Dishonorable adj అగౌరవమైన, మానహీనమైన, దుష్ట.* conduct దుర్నడత.
Dishonored adj అగౌరవమును పొందిన, అవమానపడ్డ. a * billతిరిగిపోయిన హుండి.
Disignenuoness n s కాపట్యము, కృత్రిమము, పితలాటకము.
Disinclination n s అయిష్టము, అసమ్మతి, అంగీకారము, అసహ్యము.he shewed his * to go పోవడానకు వాడికి సమ్మతిలేదు.
Disingenuous adj కపటమైన, కుత్సితమైన, కృత్రిమమైన,క్షుద్ర. * conduct కృత్రిమమైన నడక.
Disingenuously adv కపటమైన, కుత్సితమైన, కృత్రిమమైన, క్షుద్ర .* conduct కృత్రిమమైన నడక.
Disinherited adj బాధ్యత లేకుండా చేయబడ్డ. a * childతండ్రి ఆస్తికి బాధ్యత లేకుండా చేయబడ్డ చిన్నవాడు.
Disiniterestedness n s పరోపకారశీలత, ధర్మశీలత.
Disiniterment n s పాతిపెట్టిన, శవమును మళ్లీ పెళ్లగించియెత్తడము. I was present at the * of the body ఆ పీనుగనుపెళ్లగించి యెత్తేటప్పుడు నేను వుంటిని.
Disintegrated adj separated into integrate parts withoutchemical action విరిగిన, పగిలిన, బద్దలైన, శిథిలమైన.
Disintereste adj స్వప్రయోజనాన్ని విచారించని.ఉపకారియైన, పరోపకారియైన. this was a * effort on hispart వాడైతే దీన్ని ఉపకారానికి చేసినాడు.a *act ఉపకారము, పుణ్యము, ధర్మము. a * man ఉపకారి.
Disinterestedly adv ఉపకారముగా, పుణ్యానికి , ధర్మానికి.
Disinterred Read "Disinterred' fordisintered
Disinthralment n s నివారణము, విమోచనము.
Disitered adj మళ్లీ పెళ్లగించి యెత్తబడ్డ.
Disjointed adj బెడిసిన, కీలుతప్పిన, తొలిగిన. hisfinger was * వాడి వేలికీలు తొలిగినది. * or deliriouswords అసంబంధమైన మాటలు పొందికలేని మాటలు. * textsor fragments of a poem వొక కావ్యములో గచ్ఛత్తుగాయెత్తి వ్రాసిన శ్లోకాలు. * fragements of the vedasఖిలఋక్కులు.
Disjunction n s విచ్ఛేదము, వియోగము . the * of the words పదచ్ఛేదము. by the * of these two words యీ రెండుమాటలను ప్రత్యేకముగా పెట్టినందున.
Disjunctives, or Disjunctivepasticles n s. వికల్పకావ్యములు, అనగా " Or, But " అనే శబ్దములు.
Disk n s బింబము, మండలము. the * of the moon చంద్రబింబము, చంద్రమండలము.
Dislike n s అసమ్మతి, అసహ్యము, చీదర.
Dislocation n s బెసకడము, కీలు తప్పడము, తొలిగిపోవడము.
Dislocted adj బెసికిన, కీలుతప్పిన, తొలిగిన.his shoulder was * వాటి రెట్ట బెసికినది. his knee was *వాడి మోకాలి చిప్ప తొలిగినది. * words అసంబంధమైన మాటలు, పొందిక తప్పిన మాటలు.
Disloyal adj స్వామిద్రోహమైన, రాజభక్తిలేని.
Disloyally adv స్వామిద్రోహముగా, రాజభక్తిలేక.
Disloyalty n s స్వామిద్రోహము, రాజద్రోహము.
Dismal adj అఘోరమైన, , భయంకరమైన, పాడైన. a * faceయేడ్చేముఖము. a * story అఘోరమైన కథ. * intelligence దుష్టసమాచారము.
Dismally adv అఘోరముగా, భయంకరముగా, పాడుగా,
Dismantied adj శిథిలమైన, ఛిన్నాభిన్నమైన, పడకొట్టబడిన,పాడైన.
Dismasted adj స్తంభవిహీనమైన, స్తంభములు విరిగి పాడైన.
Dismay n s భయము, దిగులు, అఘోరము.
Dismayed adj భయపడ్డ, దిగులుపడ్డ.
Dismissal n s శెలవు. after his * అతడు శెలవు పుచ్చుకున్నతరువాత, అతన్ని తోసివేసిన తరువాత.
Dismissed adj పంపిన, విడుదలైన, తోసివేసిన.
Dismission n s సెలవు. See Dismissal
Dismounted adj దిగిన, దించిన, పాడైన. a * gun బండి మీదనుంచిదించిన ఫిరంగి.
Disobedience n s తిరగబడడము, ఉల్లంఘనము. in consequenceof his * అతడు చెప్పినట్టు విననందున.
Disobedient adj తిరగబడ్డ, వినని, అవిధేయ. To disobey, v. a. తిరగబడుట, ఉల్లంగనము చేసుట, తోసివేసిన.they *ed him, అతని మాటను ఉల్లంఘనము చేసినారు. he *edthe doctor వాడు వైద్యుడు చెప్పినట్టు వినలేదు.
Disobey -she could not * his father తండ్రిమాటతోయలేడుగనక
Disobliging adj ఆయాసకరమైన, విరసమైన. * conduct ఆయాసమైననడత ,విరసమైన నడత. a * person అపకారి, నిర్దయాత్మకుడు.విరసుడు. a * act కానిపని.
Disobligingly adv విరసముగా, అపకారముగా.
Disorder n s కలత, అక్రమము, తారుమారు, తొందర, వికారము,వ్యాధి, రోగము, జాడ్యము. it is all in * అది అంతా అల్లరిగావున్నది, అకటవికటము గావున్నది , గందరగోళంగా వున్నది. To Disorder, v. a. అల్లరిచేసుట, అకటవికటముచేసుట, తారుమారుచేసుట.this *ed his stomach యిందుచేత వాడి కడుపులో వికారము పుట్టినది.
Disordered adj అక్రమమైన, గత్తరగావుండే, అకటవికటముగావుండే, వికారమైన . * health అస్వస్థము.
Disorderly adj అక్రమమైన, తొందరైన. * poeple పోకుర్లు, తలకొట్లమార్లు. a * family పెద్దా, పిన్నా లేని సంసారము. * goings on అల్లరిపనులు, తుంటరిపనులు, పోకిరి నడతలుdisordrlies దుర్మార్గులు. a * house లంజలు వుండే యిల్లు.
Disorganization n s ఛిన్నాభిన్నము, తారుమారు, అకటవికటము.on account of the * of the army * ఆ సైన్యమంతా ఛిన్నాభిన్నముగావుండుటచేత * of the system సన్నిపాతము, విషమజన్ని.
Disorganized adj చిన్నాభిన్నమైన, అకటవికటమైన, తారుమారుగావుండే, అల్లరిగా వుండే.
Disowned adj కాదన్న, యెరగనన్న, వొప్పుకోని.a * account వప్పుకోనిలెక్క .
Disparagement n s దూషణ తిరస్కారము, అవమానము, అప్రతిష్ట,మానహాని. this is a * to him యిది వానికి వొక చెడ్డ అనుమానము.
Disparity n s తారతమ్యము. there is a great * betweenthese two boys యీ యిద్దరు పిల్లకాయలకు నిండా తారతమ్యమున్నది.వాడెక్కడ వీడెక్కడ. there is a great * between this crime andthe punishment ఆ తప్పు యెక్కడ, యీ దండన యెక్కడ.
Dispassionate adj శాంతముగల, వోర్పుగల, తాళిమిగ ల. on a *consideration of his letter వాడి జాబును వోర్పుగా చూచినందుమీదట.
Dispassionately adv శాంతముగా, వోర్పుగా, తాళిమిగా.
Dispatch n s See Despatch.
Dispelled adj చెదరకొట్టబడ్డ, పోగొట్టిన.
Dispensary n s ఔషధశాల, మందుల అంగడి.
Dispensation n s విధి. the *s of providence ఈశ్వరఆజ్ఞ, దైవఘటన.దైవసంకల్పము. the Mosaic మూసా అనే భవిష్యద్వక్త చెప్పిన స్మృతి. the christian * ఖ్రిష్టియాన్ శాసనము, ఖ్రిష్టియాన్ మతము.this is a dreadful * అయ్యో యిది యేమి విధి. exemption నిషేధమైనపనికిఅనుమతి యివ్వడము. the Pope granted him a * to do thisయిట్టి నిషేధమైన పనిని చేయమని పోపు వాడికి శెలవిచ్చెను.
Dispenser n s త్యాగి, దాత, యిచ్చేవాడు. a * of food అన్నదాత.
Dispeopled adj నిర్మానుష్యముచేయబడ్డ, నిర్జనముగా వుండే,పాడుగా వుండే.
Dispered adj చెదిరిపోయిన, యదాయదలుగా , పటాపంచలుగా, మూలకొకటిగా.
Dispersion n s చెదిరిపోవడము, యదాయదలైపోడము, మూలకొకటిగాపోవడము. the * of the Jews జూడియావాండ్లు యదాయదలై పోవడము, దేశదేశమునకు చెదిరిపోవడము.
Dispirited adj అధైర్యపడ్డ, కుంగిన, భయపడ్డ, దిగులుపడ్డ,వ్యాకులపడ్డ.
Displaced adj స్థలము తప్పించబడ్డ, తోసివేయబడ్డ, వూడిన. the tooth was * by a blow వొక దెబ్బ పల్లు పూడినది.
Display n s వేడుక, ఆడంబరము, జంభము. at that marriagethere was no great * ఆ పెండ్లిలో నిండా వేడుక లేదు.
Displayed v a చూపిన, అగుపరిచిన, జంభముగా, అగుపరిచిన.
Displeased adj అసహ్యపడ్డ, అయాసపడ్డ. he was * అసహ్యపడ్డాడు,అలిగినాడు. he was not * to find that they were goneవాండ్లు వెళ్లినారని సంతోషించినాడు. he looked * ముఖమును మాడ్చినట్టు అగుపడ్డాడు, వాణ్ని చూస్తే కోపముగా వున్నట్టు వుండెను.
Displeasing adj అసహ్యమైన, ఆయాసకరమైన.
Displeasure n s అసహ్యము, ఆయాసము. they incurred his *అతని దయకు పాత్రులైనారు.
Disport n s ఆట, క్రీడ,లీల, విలాసము.
Disposal n s control అధికారము, ఆధీనము, యేర్పాటు. he madea new * of this money యీ రూకలను గురించి కొత్త యేర్పాటుచేసినాడు. God hath the absolute * of all things దైవాధీనంజగత్సర్వం, they left it at my దాన్ని నా యిష్టప్రకారము.చేయమన్నారు.
Disposed adj యేర్పరచబడ్డ, క్రమముగా వుంచబడ్డ. thebooks were * in four rows ఆ పుస్తకములు నాలుగు వరుసలుగాయేర్పరచబడ్డవి. how is he * towards you నీయందు వాడికిమనసు యెట్లా వున్నది. he is well * towards me నా యందు వాడిమనుసు బాగా వున్నది. he is ill * towards me నాయందువాడి మనసు బాగా వుండలేదు. well * సద్బుద్దిగల. ill *( దుర్బుద్ది గల. religiously * సద్భక్తుడైన. are you * to go ?పోవలెనని వున్నారా, మీకు పోవలెనని తలంపా, అక్కడికి పొయ్యేటందుకునీకు భావమా. he is not * to do it దాన్ని చేయడమునకు వాడికిబుద్ధిపుట్టలేదు. he was not * to do so అట్లా చేయడానకుఅతనికి యిష్టములేదు. * of వినియోగపరచబడ్డ, వ్రయముచేయబడ్డ,అమ్మిన.
Disposer n s కర్త, శాసనీకుడు. God is the * of all thingsఈశ్వరుడు, సర్వకర్త.
Disposition n s order వరస, క్రమము . he made a new * of the armyదండును మరి వొక రీతిగా నిలిపినాడు, నవీన వ్యూహము పన్నినాడు.temper స్వభావము, గుణము. natural * స్వభావము, ప్రకృతి. a man of good * సద్బుద్దిగలవాడు. a man of evil * దుర్బుద్ది గలవాడు.inclination, యిచ్ఛ, మనసు. this cloth shews a * to rot యీ గుడ్డ వుండే వైఖరి చూస్తే చివికిపోయ్యేదిగా వున్నది.arragngement యేర్పాటు, విన్యాసము, నియమము, విధి. the *sof providence భగవత్సంతకల్పము.
Disposure n s యేర్పాటు, అధికారము, దశ, అవస్థ. he tookthe * of the money into his own hands ఆ రూకలను వ్రయము చేసే భారము తన మీద పెట్టుకున్నాడు.
Dispraise n s నింద, అప్రతిష్ట.
Dispraisingly adv నిందగా, దూషణగా, తక్కువగా.
Disproof n s ఖండన. in * of what he stated వాడు చెప్పిన దానికిఖండనగా.
Disproportaionable adj See Disproportionate.
Disproportaionably adv వ్యత్యాసముగా, వైపరిత్యముగా, వికారముగా,అంగుగా వుండకుండా. how can they marry he is * old వాండ్లకుయెట్లా పెండ్లి అవును దాని వయసు వాడి వయస్సు అధికము.
Disproportion n s వ్యత్యాసము, అసమత, హెచ్చుతగ్గు.వికారము, అందవికారము, అంగులేమి, వైపరిత్యము, ఏడాకోడము.observe the * of these two pillars or what a vast * ఈ రెండుస్థంభములకు వుండే వ్యత్యాసము చూడు యేమి విజ్జోడు. how can a horseand a colt draw together the * will run the businessగుర్రమున్ను గుర్రప్పిల్లానున్ను యెట్లా జతగా యీడ్చును, విజ్జోడుగావుండడము చేత నిచెడును. there is a * between his arms and hislegs వాడి చేతులూ కాళ్లూ అంగుగా వుండలేదు, వాడి చేతులకు తగినకాళ్లు లేవు.
Disproportionate, Disproportioned adj వ్యత్యాసమైన, వికారమైన,అందవికారమైన, పొందికగా వుండని, తగని, అంగుగావుండని, విపరీతమైన.great of large గొప్పైన, అతిశయించిన. the cost is * యిదితగని శెలవు. the punishement was * యిది నేరమునకు తగినదండనకాదు, అనగా నేరమునకు అధికదండనైనా నేరమునకు తక్కువదండనైనా అనిభావము. In the works of God there is nothing *ఈశ్వరసృష్టిలో వొకటిన్ని వ్యత్యాసము లేదు. అన్నిన్ని పొందికగావున్నది, పొంకముగా వున్నది, సరిగ్గా వున్నది. In this picturethe nose is disproportioned to the face యీ పటములో ముఖానికితగిన ముక్కులేదు.
Disproportionately adv అతివ్యత్యయముగా, వైపరిత్యముగా.
Disputable adj వివాదస్పదమైన, సంశయాస్పదమైన.this is not * యిందున గురించి సంశయము లేదు. this is *యిది కారాదు.
Disputant n s వాదించేవాడు, తర్కించేవాడు.
Disputation n s వాదు, వివాదము. what is the goodof all this * యిన్ని మాటలెందుకు.
Disputatious adj వాదాడే, పోరాడే, పీకులాడే.
Dispute n s వివాదము, కలహము, వ్యాజ్యము, జగడము, ఘర్షణ,పోట్లాట, పోరు, రచ్చ. they got into a * with himవాడితో వ్యాజ్యపడ్డారు. beyond all * నిరాపేక్షముగా,నిర్వివాదముగా , నిస్సందేహముగా.
Disputer n s వాదించేవాడు. a * of the fact యిట్లా కాదనివాదించేవాడు.
Disqualification n s అనర్హత, అనుపయుక్తత, అయోగ్యత.తక్కువ. his caste is no * వాడిది యేకులమైన చింతలేదు,కులముచేత వాడికి ఆక్షేపణము లేదు, వక తక్కువ లేదు.
Disqualified adj అనర్హమైన, తగని, అయోగ్యమైన, వుపయోగముకాని.he is * for this employment by age వయసు చెల్లినందునయీ పనికి వుపయోగమైనవాడు కాడు.
Disquiet n s ఆయాసము, చింత , తొందర, కలవరము.
Disquieted adj ఆయాసముగల, తొందరగల, కలవరపడ్డ, చింతపడ్డ,వ్యాకులపడ్డ.
Disquietness n s ఆయాసము, తొందర, చింత, కలవరము.
Disquised adj వేషమువేసుకొన్న , మారువేషము, వేసుకొన్న,ప్రచన్నమైన. he was * as a woman ఆడవారి వేషము వేసుకొన్నాడు.the bribe was * as a debt యీ లంచమునకు అప్పు అని పేరు పెట్టినారు.a * handwriting తన వ్రాలని తెలియకుండా వుండేటట్టు వ్రాసినవ్రాలు. she called to him in a * voice వాణ్ని మారుగొంతునుపిలిచినది. he was * in liquor వాడు మైకముతో వుండెను.
Disquisiton n s విచారము, ప్రసంగము, వుపన్యాసము.a * regarding divinity వేదాంత విచారము, వేదాంతమునుగురించిన గ్రంధము . he made a * about marriage వివాహమునుగురించి వుపన్యసించి మాట్లాడినాడు.
Disregard n s ఉపేక్ష, అనాదరణ, అలక్ష్యము.
Disregarded adj ఉపేక్షచేయబడ్డ, అనాదరణచేయబడ్డ, అలక్ష్యముచేయబడ్డ.
Disrelish n s అరుచి, అస్వారస్యము, అసహ్యము.
Disrelishing adj అరుచిగావుండే, రుచిలేని, వికారమైన,అసహ్యమైన.
Disreputable adj అవమానకరమైన, నీచ, తుచ్చ, పోకిరి. a * book పోకిరి పుస్తకము. a * house లంజలు వుండే యిల్లు.
Disreputably adv అవమానము , అపకీర్తి, అపఖ్యాతి,అప్రతిష్ట, నింద.
Disrespect n s అగౌరవము, అనాదరణ, అమర్యాద.they treated him with * వాణ్ని అమర్యాద చేసినారు.
Disrespectability n s నీచత్వము. from the * of hisfamily వాడిది నీచవంశము గనుక.
Disrespectable adj నీచమైన, పోకిరైన. * conduct పోకిరినడక,క్షుద్రనడక.
Disrespectably adv అతినీచముగా, తుచ్ఛముగా.
Disrespectful adj అమర్యాదైన, అవమానమైన, తిరస్కారమైన.this is * language యిది అమర్యాదైన మాటలు.
Disrespectfully adv అమర్యాదగా.
Disrobed adj వివస్త్రమైన, దిగంబరమైన, దిసమొలైన.
Disruption n s or breach విచ్ఛేదము, భంగము, గండి. a * of continuity తెగడము. * of friendship స్నేహ భంగము.
Dissatisfaction n s అతృప్తి, అసమాధానము, అసంతుష్టి , కొదవ.he shewed his * తన అసమాధానమును అగుపరచినాడు. అపహించినాడు . he shewed no * వొప్పుకున్నాడు, అంగీకరించినాడు.
Dissatisfactory adj అసమాధానమైన, అసహ్యకరమైన.
Dissatisfied adj అసమాధానమైన, అసహ్యకరమైన. he was * వాడు అసమాధానముగా వుండినాడు. they wree * వాండ్లు అసంతుష్టులైనారు.
Dissection n s ఛేదనము, ఛేదించి పరిశోధించడము.తునకలుగా కోయడము. or examination పరిశీలనము, విమర్శ. after the * of the body ఆ పీనుగను కోసి చూసినతరువాత.
Dissector n s శరీరము చేధించి పరిశోధించినారు.
Disseizee n s దోపుడుపడ్డవాడు, కోలుపోయినవాడు,భ్రష్టైనవాడు.
Disseizin n s అపహరణము, దోచుకోవడము.
Disseizor n s అపహరించేవాడు, వొకరిసొత్తును నోట్లోవేసుకొనేవాడు.
Dissembled p!! మాయమైన,మారీచమైన,బేడిజమైన,టక్కైన
Dissembler adj బేడిజగాడు, మారీచుడు, మాలమారి,పైకి టక్కులు చేసేవాడు.
Dissembling adj మాయలు చేసే, మారీచము చేసే, టక్కులుచేసే.
Dissemblingly adv బేడిజముగా, మాయగా, మారీచముగా,టక్కులుగా .
Disseminated adj వ్యాపించిన, ప్రసరించిన, ప్రచురమైన.
Dissemination n s వ్యాపించడము, ప్రసరించడము, ప్రచురముకావడము. by the * of this intelligence యీ సమాచారమునువూరంతా విత్తడము వల్ల.
Dissension n s పగ, విరోధము, కలత, జగడము, పోరు. to raisea * కలహము పెట్టుట.
Dissent n s విరోధము, భిన్నాభిప్రాయము, భిన్నమతము.
Dissenter n s one that disagress from an opinionభిన్నాభిప్రాయము గలవాడు, వొప్పనివాడు. one who refuses the communionof the English church ప్రోటెస్టాంటు మతస్థులలో చచ _వు యంగిలండుమతమును వొప్పనివాడు. they are * s from us మా మతములోనుంచిమిగిలిన విరుద్ధమతస్థులుగా వున్నారు. the Jangamas are *s from thebody of the Hindus జంగములు హిందువుల మతములోనుంచి కలిగినవిరుద్ధమతస్థులు.
Dissentient n s వొప్పనివాడు, భిన్నాభిప్రాయముగలవాడు. this is a phrasepeculiar to parliament.
Dissertation n s వివరణము, వ్యాఖ్యానము, ప్రసంగము.a * upon grammar వ్యాకరణము మీద చేసిన వుపన్యాస గ్రంధము.a * upon Morals నీతి వివరణము. a * upon law వ్యవహారకాండ. a * upon fever జ్వరలక్షణ గ్రంధము.
Disservice n s ఆయాసము, అపకారము. this did them a * యిది వాండ్లకు హానికరమైనది.
Disserviceable adj హానికరమైన, ఆయాసకరమైన.
Dissimilar adj సమానముగా వుండని, వ్యత్యాసమైన, భేదమైన.భిన్నమైన. these two flowers are quite * ఈ పుష్పవిధము వేరు ఆపుష్ప విధము వేరు. these two poems are quite * యీ గ్రంధ రీతివేరు ఆ గ్రంధ రీతి వేరు. are these two men brothers ?their face are quite * వీరిద్దరు అన్నదమ్ముల్లా వీడి ముఖజాడవేరు వాడి ముఖజాడ వేరు.
Dissimilarity, Dissimilitude n s. అతుల్యత, అసమానత,అసామ్యము, వ్యత్యాసము, భేదము, భిన్నము.
Dissimulation n s కపటము, మాయ , మోసము, వంచన, పితలాటకము.
Dissipated adj చెదరగొట్టబడ్డ, పొగొట్టబడ్డ. the cloudsare * మబ్బు విచ్చిపోయినది. my doubts are * నా సందేహము నివారణమైనది. the disease was * by the change of air స్థలముతప్పించడముచేత ఆ రోగము విడుదలైనది. the disease left marks on hisface which wre not * for a year after యీ రోగము తగిలినప్పుడుపడ్డ మచ్చలు మాసిపోలేదు. a man of * character పోకిరి. నీతినిలకడలేనివాడు. he leads a * life వాడు దుర్వ్యాపారములో పడ్డాడు.
Dissipation n s the act of dispersion చెదరడము. or doingaway పోవడము, నివారణము. or waste దుర్వ్రయము, దూపరదిండితనము.After the * of his doubts వాడికి సందేహ నివారణమైనతరువాత. * of mind మనసు చెదరడము, కలవరము. or bad conduct దుర్వ్యాపారము, పోకిరితనము, క్షుద్రనడక. he is given upto * దుర్వ్యాపారములో పడ్డాడు. on this word See Wesley's 79th sermon.
Dissoluble adj కరిగిపొయ్యే.
Dissolute adj భ్రష్టైన, పోకిరైన, కొంటైన. * conductపోకిరినడత.
Dissolution n s separtion విడిపోవడము , కలిసిపోవడము.after the * of these hands యీ బంధకము విమోచనమైన తరువాత. after the * of the assembly సభ కలిసిపోయిన తరువాత.or death చావు, మరణము, అవసానము,లయము. after the *of thebody శరీరమును విడిచిన తరువాత, పంచత్వమును పొందిన తరువాత.
Dissolved adj కరిగిన, నీరైపోయిన.
Dissonance n s వ్యతిరేకము, వైపరీత్యము, సుతికూడమి,స్వరపొందికలేమి, యెనయమి.
Dissonant adj వ్యతిరేకమైన, విరోధమైన, సుతిపొందికలేని.* sounds స్వరవెలితిగా వుండే స్వనములు, వికారస్వనములు.
Dissuasive adj వద్దనే, కూడదనే. he used * language కూడదన్నాడు,కారాదన్నాడు.
Distaff n s పంటె, అనగా నూలు చుట్టేటిది. the crown fell to the * ( Johnson ) కిరీటము పంటెపాలైనది, అనగా మొగసంతులేక ఆడదాని ప్రభుత్వమైనది,స్త్రీనాయకమైనది.
Distanced adj వెనుకబడ్డ, వోడిపోయిన.
Distant adj దూరమైన. there is not the most * hope రవంతైనా ఆశలేదు. a * heir దూరపు దాయాది. * ancestors మహాపూర్వీకులు. this gives a * idea of their misery దీనివల్ల వాండ్ల దౌర్భాగ్యము చూచాయగా తెలుస్తున్నది. * orreserved బెరుకైన, సంకోచముగల, వేరు బంధముగావుండే.
Distantly adv దూరముగా. they are * related వాండ్లది దూరబంధుత్వము.
Distaste n s అరుచి, అసహ్యము, విరసము. he shewed a great* to my advice నామాట వాడికి విషముగా వుండినది.
Distasteful adj అసహ్యమైన, విరసమైన.
Distemparature n s వికారము, వ్యత్యయము, కలత.
Distemper n s జాడ్యము, రోగము, తెవులు. a * of the eye కంటివుపద్రవము. a * of the skin గజ్జి మొదలైనవి. the wall waspainted in * గచ్చుగోడ మీద చిత్రములు వ్రాసినారు.
Distempered adj జాడ్యస్థుడైన, రోగియైన, వికారమైన, పిచ్చి.
Distended adj ఉబ్బిన.
Distention n s ఉబ్బు, వాపు.
Distich n s రెండు చరణములు గల శ్లోకము, ద్విపదలో వొక భేదము.
Distillation n s కారేటట్టు చేయడము, బట్టిలో దించడము,కారడము, స్రవించడము.
Distilled adj స్రవించిన, దించిన, బట్టిలో దించిన. * liquorsధృతి, సారాయి. Brandy is a * liquid బ్రాంది బట్టిలో దించబడ్డధృతి. spirits once * బట్టిలో వొక తేప దించిన సారాయి.
Distiller n s బట్టిపెట్టి దించేవాడు, సారాయి కాచేవాడు,కలాలి.
Distillery n s సారాయి కాచేవాడు.
Distinct adj స్పష్టమైన, భిన్నమైన, ప్రత్యేకమైన,వేరైన. this one is * యిది వొకటి వేరేగా వున్నది. all their families are * వాండ్ల సంసారము వేరేవేరేగా వున్నది. all their estates are * వాండ్ల వాండ్లకు ఆస్తి ప్రత్యేకముగావున్నది. that boy has a * articulation ఆ పిల్లకాయ స్పష్టముగామాట్లాడుతాడు, ఆ పిల్లకాయ వుచ్చారణ బాగా వున్నది.
Distinction n s భేదము, విశేషము, పేరు,గౌరవము.this is a * without difference యిది ఒక వ్యత్యాసము కాదు.a man of * గొప్పవాడు.
Distinctive adj భేదమును తెలియచేసే, వ్యత్యాసమును తెలియచేసే,విశేషమైన. a * mark విశేషమైన, గురుతు.
Distinctly adv స్పష్టముగా, తేటగా, విశదముగా, విభజనగా.
Distinctness n s స్పష్టత.
Distinguishable adj స్పష్టమైన, తెలిసే. there isno* difference between these two యీ రెంటికి స్పష్టమైనభేదము లేదు.
Distinguished adj ప్రసిద్దమైన, శ్రేష్టమైన, దొడ్డ. a * poet ఘనమైనవి. the * Duke శ్రీమత్ యిత్యాది రాజులుంగారు.
Distinguishing adj విశేషమైన. their * quality వీరికివుండే విశేషగుణము. the * mark విశేషమైన గురుతు. the * markof the diamond is it's hardness వజ్రమునకు వుండే విశేషమైనగురుతు దానియొక్క కాఠిన్యము.
Distorted adj వికారమైన, విరూపకమై న, వంకరైన. a * meaning అపార్థము, విపరీతార్థము, వ్యంగ్యార్థము.
Distortion n s వంకర, వికారము, విరూపము, అంగవైకల్యము. or miserepresentation అపార్ధము.
Distracted adj కలవరపడ్డ, తబ్బిబ్బైన. his attentionwas * వాడి బుద్ధి కలవరించిపోయినది. she was like a * womanవెర్రిపట్టిన దానివలె వుండినది.
Distractedly adv కలవరముగా, తబ్బిబ్బుగా,వెర్రిగా.
Distracting adj కలవరపరచే, వెర్రిచేసే. a * taskతలచీదరైనపని. a * headache వెర్రి తలనొప్పి.
Distraction n s కలత, కలవరము, చీకాకు, చీదర,గత్తర,వెర్రి. will you drive me to * నన్ను వెర్రిచేస్తావా,నన్ను భ్రమపరుస్తావా. he loved her to * దానీ మీద వాడికివెర్రిమోహము పట్టింది.
Distrainer n s జప్తివారంటు.
Distraint n s జప్తి. (H).
Distraught adj తెలివితప్పిన, కలవరపడ్డ, చీకాకుపడ్డ.
Distress n s దుఃఖము , వ్యసనము, వ్యాకులము, శ్రమ,తౌందర, యిబ్బంది, అగచాట్లు. or distraining జప్తిచేయడము. aa warrant of * జప్తివారంటు.
Distressed adj శ్రమపడ్డ, తొందరపడ్డ, దుఃఖపడ్డ.
Distressful adj దుఃఖకరమైన, సంకటమైన.
Distressing adj దుఃఖకరమైన , వ్యాకులమైన, సంకటమైన. * intelligence చెడ్డసమాచారము.
Distributer n s పంచిపెట్టేవాడు. a * of justice న్యాయాధిపతి.
Distribution n s పంచడము, పంచిపెట్టడము. during the * ofthe food అన్నమును పంచిపెడుతూ వుండగా.
Distributive adj వారివారికి. The * pronoun వారివారికిఅనే సర్వనామ శబ్దము, అనగా each.
District n s దేశము, ప్రదేశము, సీమ, తాలూకా, జిల్లా, పరగణా.
Distrust n s సందేహము, అపనమ్మిక.
Distrustful adj సందేహించే, అపనమ్మికపడే, నమ్మని.he was * of them వాండ్ల యందు వాడికి నమ్మికలేదు. I am* of this medicine యీ మందులో నాకు నమ్మకము లేదు.
Distrustfully adv సందేహముగా , అపనమ్మికగా, నమ్మక.he spoke * నమ్మిక లేకుండా చెప్పినాడు, సందేహముగా చెప్పినాడు. To Disturb, v. a. అల్లరిచేసుట, కలచుట, కలతపెట్టుట,తొందరపెట్టుట. his coming *ed the family వాడు రావడముచేతఆ సంసారములో కలతపుట్టినది. they *ed the water నీళ్లనుకలిపినారు. he *ed the beehive తేనే గూటిని రేచినాడు.
Disturbance n s అల్లరి, కలత, తొందర.
Disturbed adj కలతబడ్డ, తొందరబడ్డ, రేచిన.
Disturber n s అల్లరిచేసేవాడు, కలతపెట్టేవాడు, తొందరపెట్టేవాడు.
Disunion n s విచ్ఛేదము, వియోగము, వేరుపడడము. or breachof concord గిట్టమి, సరిపడమి. they are in a state of *వాండ్లు యెడబాసి వున్నారు, వేరుపడ్డారు.
Disunited adj విడదీయబడ్డ, ప్రత్యేకించబడ్డ.
Disuse n s వాడికలేమి, ఉపయోగము, లేమి, చెల్లమి. fromthe * of bathing స్నానము వాడిక లేనందున. that medicine is now in * ఆ మందును యిప్పుడు వాడడము లేదు. fallen into * వాడిక తప్పిన, చెల్లని, అప్రసిద్దమైన. these words are falleninto * యీ మాటలు యిప్పుడు వాడికి లేదు.
Disused adj మానుకొన్న, విడిచిపెట్టిన, వాడిక తప్పిన,చెల్లని. that word is now * ఆ మాట యిప్పుడు వాడికలేదు.చెల్లదు. this law was not cancelled tho'* d ఆ చట్టమువాడికలోకి తేపడక పోయినప్పటికిన్ని కొట్టివేయబడలేదు. Ditch, n. s. తవ్వినకాలువ, ఆగడ్త, కందకము . a wet *నీళ్లు వుండే అగడ్త. a dry * నీళ్లు లేని అగడ్త. he desiredthem to dig a * round his garden వాడి తోట చుట్టూకాలువగా పల్లము తవ్వమని వారికి వుత్తరువు చేసినాడు.
Ditcher n s తవ్వేకూలివాడు, ఉప్పరవాడు.
Dithyrambic n s దండకము, రగడ.
Dittany n s వక తరహా కూరాకు.
Ditto adv సదరహీ, పైనచెప్పిన, అదే, పైదే.
Ditty n s పదము, పాట, కథ.
Diuretick n s నీరుకట్టుకు యిచ్చే మందు. alum is a * పటికారముయిస్తే నీరు దిగుతుంది.
Diurnal adj నిత్యటి, అహ్నికమైన, పగటి. his * employmentవాడు ప్రతిదినము చేసే పని.
Divan n s ( meaning a minister) మంత్రి. meaning a court కొలువుకూటము.meaning a seat ఆసనము.
Divarication n s ద్విభాగము, పంచడము.
Diver n s మునిగేవాడు. a for pearls ముత్యాలసలాపములోమునిగేవాడు.
Divergence n s వ్యాపించడము, నాలుగుతట్లా ప్రసరించడము. from the * of the spokes చక్రము యొక్క ఆకులునాలుగుతట్లా వ్యాపించడముచేత. to prevent the *of thebranches he tied them up కొమ్మలు నాలుగుతట్లా పాయలుగాపోకుండా వాటికి తాడు చుట్టినాడు.
Divergent adj వ్యాపించే, ప్రసరించే, పాయలుగా పొయ్యే, చీలే, వేరుపడే. See To Diverge
Diverse adj నానావిధమైన, బహువిధములైన, చిత్రమైన.వేరైన, భేదమైన. these languages are * యివి వేరేవేరే భాషలు.in * countries ఆయా దేశముల యందు.. of * colours నానావర్ణములుగల. at * times ఆయా కాలములయందు.
Diversely adv నానావిధములుగా, పరిపరివిధములుగా, విచిత్రముగా. they were * located వారువారు అక్కడక్కడ వుంచబడ్డారు, వారు వారుప్రత్యేకముగా వుంచబడ్డారు.
Diversification n s మార్చడము, నానాత్వము, చిత్రవిచిత్రత. fromthe *of its colours అది నానావర్ణములుగా వుండడమువల్లచిత్రవిచిత్రముగా వుండడమువల్ల.
Diversified adj చిత్రవిచిత్రమైన, నానావిధమైన.
Diversion n s ఆట, క్రీడ, వేడుక, కేళీవిలాసము, లీలావినోదము.by way of * పొద్దుబోకకు, వుబుసుపోకకు, అట్లాటకు. to preventthe * of the water of the river ఆ యేటి నీళ్లు చెదిరిపోకుండా.he made a * and brought his troops the other way వాడుయేమార్చి సేనను మరివొక దోవను తీసుకవచ్చినాడు. he made a * to drawoff the way వాడు యే మార్చడానకై వొక యుక్తి చేసినాడు.
Diversity n s చిత్రవిచిత్రత, నానావిధము. there is a great*of opinions about this యిందున గురించి పదిమంది పదివిధములుగాచెప్పుతారు. from the *of the prospect చిత్రవిచిత్రముగాఅగుబడుటచేత, చిత్రవిచిత్రమనగా వొక తట్టు కొండలు, వొకతట్టునది, వొకతట్టు పట్టణము యిట్లా అగుపడడము.
Diverting adj సరసమైన, ఉల్లాసమైన, వేడుకగా వుండే, నవ్వించే.a * book వేడుక పుస్తకము.
Divided adj భాగింపబడ్డ, వేరైన, భిన్నమైన, ద్వివిధముగావుండే, చీలిన. they were * in their opinions వాండ్లకుతలా వొకటి తోచినది. a * property or estate భాగించుకొన్నఆస్తి పంచుకొన్న సొత్తు. a * family (in the English sense, denotingqauarrels) పరస్పరము గిట్టకుండా వుండే కుటుంబము.(But in the Indian sense, denoting shares) విభక్తులు,పంచుకొని వేరుపడ్డవాండ్లు పృధగ్భాండాశనులు.
Dividend n s a share పాలు, భాగము. in arithmetic భాజ్యము,హార్యము.
Divination n s fortune telling భవిష్కథనము, భావి విషయవ్యక్తీకరణము, యిఖను నడువబొయ్యేదాన్నిచెప్పడము, సోది చెప్పడము.
Divine adj దైవసంబంధమైన. the * will దైవసంకల్పము.ఈశ్వరాజ్ఞ. the * name దేవుడి పేరు, ఈశ్వరాహ్వయము. the *eye ఈశ్వర కటాక్షము. the *illumination జ్ఞానోదయము. * service దేవపూజ. * bliss పరమానందము. the * power ఈశ్వరపూజ.
Divinely adv దైవసంకల్పము చొప్పున, దైవీకముగా. he was *taught వాడికి దేవుడే నేర్పినాడు. a * book * inspired దేవుడువాక్కులో వుండి పలికించిన గ్రంధము. he was * fed వాడికిదేవుడే ఆహారము పెట్టినాడు. he was * supported వాడికిదేవుడే రక్షణము, * fair అతిసుందరమైన.
Diviner n s రాబొయ్యేదాన్ని చేప్పేవాడు, జోశ్యము చెప్పేవాడు.శకునము చెప్పేవాడు, సోదిచెప్పే మనిషి.
Diving n s ముణగడము. * for pearls ముత్యాలసలాపములో ముణగడము.
Diving, -bell n s. పాతాళభేది గంట, అనగా నీళ్లలోపడ్డవస్తువులను తడివి యెత్తడమునకై లోపల యిద్దరు మనుష్యులనుకూర్చండబెట్టి నీళ్లల్లో నిలువుకు దించబడే గంట యొక్కఆకారముగా వుండేటిది.
Divinity n s the divine nature దైవత్వము, ఈశ్వరత్వము.this proves his * యిందువల్ల అతడు దేవుడని తెలుస్తున్నది.they looked upon him as a * వాణ్ని అవతార పురుషుణ్నిగావిచారించినాడు. the * దైవము, దేవుడు. a * or petty god దేవత, క్షుద్రదేవత. celestial beingaMSaBUwudu. Sancarchariis considerd to be a * శంకరాచార్యులు శివాంశభూతుడంటారు. something supernatural దైవికమైనది, మహిమ . they observed a * in his words and actions వాడిమాటలలో నున్ను క్రియలోనున్ను వొక మహిమనుకనుక్కౌన్నారు. the science of divine things ( Note : there isno faultlesss word for this and we must use the Englishword డివినిటీ Divinity) దైవవిషయక శాస్త్రము, ఈశ్వర విషయకశాస్త్రము, అనగా ఈశ్వరుడి యొక్క స్వరూప స్వభావ మహిమాదివివరణశాస్త్రము. he read braminical * for three years వాడు మూడేండ్లు వేదాంతము చదివెను. a book on braminical *వేదాంత గ్రంథము.
Divisibilty n s భాగించబడే, ధర్మము, విభజనియ్యత,విభాగర్హత.
Divisible adj భాగించకూడిన, భాగములు కాగల. this is not * యిది భాగించకూడనది. the number 10 is not * by 3 మూడింటికిపదిపాలుపోదు. any number this is * by 8 యెనిమిదింటపాలు బొయ్యే యేదైనా వొక సంఖ్య.
Division n s the act of dividing any thing into partsవిభాగములు, చెయ్యడము . the state of being divided విభాగింపబడివుండడము. the * of the hair onthe forehead పాపట. a partor share అంశము, భాగము. *s or bits in an orangeకిచ్చిలి పండులో వుండే తొళలు. *s or parts in a townపేటలు. *s in a country జిల్లాలు, తాలుకాలు, పరగణాలు.Masulipatnam is in the northern * బందరు వుత్తర ఖండములోవున్నది. *s in a box అరలు. *s in a veranda అంకణములు. divisions (quarrels)in a family కలహములు, యింటిలోని పోరు.a partition అడ్డము, మరుగు. he took out the *s out the boxఆపెట్టెలో అరలు లేకుండా వుండడమునకై అడ్డముగా వేసివుండిన పలకలను యెత్తివేసినాడు. there is no * wall betweenthese gardens యీ రెండు తోటలకు నడమ అడ్డగోడలేదు. classes in a caste తెగలు. in arithmeticభాగహారము. they made a * of the estate ఆ యాస్తినిపంచినారు. *s in a book అధ్యాయములు, పర్వములు, పరిచ్ఛేదములుమొదలైనవి . or discord పగ, విరోధము. this caused a * in thatfamily యిందువల్ల సంసారములో వొక కలత పుట్టినది. in musicసంగీతశాస్త్రములో వొక విశేషము.
Divisor n s an arithmetic భాగహారి, హారకసంఖ్య.
Divorce n s పరిత్యాగము, విడవడము, భార్యగాని భర్తగానివొకరికౌకరు సంబంధము లేదనిపించే వేరే వివాహముచేసుకొనేటట్టు పుట్టించుకొన్న తీర్పు, ఆలుమగనికి సంబంధములేక తీర్చుకోవడము. for this the Hindu ceremony is calledఘటశ్రాద్ధము. they have now made a * between the two officesఆ రెండు వుద్యోగములకు వొకటితోవొకటి సంబంధము లేకుండా చేసినారు.
Divorcement n s పరిత్యాగము, త్యజించడము,వెళ్లకొట్టడము, విసర్జించి ఘట శ్రాద్ధముచేయడము. a bill of* త్యాగపత్రము. A +. పరిత్యాగపత్రము, ఆలుమగనికిసంబంధము లేకుండా తీర్చుకొని వ్రాసుకొన్న వొడంబడిక.
Dizziness n s తలతిప్పడము, కండ్లు తిరగడము . standingon a house top sometimes causes * మిద్దె మీద నుండిచూస్తే కండ్లుతిరుగుతున్నవి.
Dizzy adj తలతిరిగే, కండ్లు తిరిగే. I was * నాకు కండ్లు తిరిగింది.standing on the * height కండ్లు గిరగిర తిరిగేంత పొడుగున వుండి.
Do adv అనగా (Ditto), సదరహ, పైన వ్రాసిన, అదే,పైదే.
Doating adj తెరపుమరుపుగా వుండే, పిచ్చి. the old man is nowquite * వాడికి యిప్పుడు తెరుపుమరుపుగా వున్నది, వానికి యిప్పుడుతబ్బిబ్బుగా వున్నది.
Dobbin n s గుర్రము, కుక్కను కస్తూరి అన్నట్టు గుర్రమునుముద్దుగా * అంటారు.
Docile adj విధేయమైన, చెప్పినమాటవినే, నమ్రతగల, వినయముగల.
Docility n s విధేయత, నమ్రత,
Dock n s ( a plant ) బలురక్కసివంటి వొక చెట్టు.a short tail మొండితోక, అనగా కోసివేయగానిలిన గుర్రము యొక్కమొండి తోక. A Dock for ships దొరుపు అనగా వాడలుచేయడానకు లేక మరుమత్తు చేయడానకు వుండే స్థలము.for prisoners కోర్టులో నేరస్థులను నిలిపే స్థలము.
Docket n s ( a denuciation of a bankrupt ) దివాలెత్తినవాణ్ని గురించిన ప్రకటన కాగితము.
Dock-yard n s వాడదొరువుకున్ను ఆవరణమునకున్ను నడమవాడసామానులు పేట్టుకోనే బయలు.
Doctatorial adj క్రూరమైన, అహంకారమైన, గర్వమైన.why should you talk in such a * manner యెందుకు యింత అహంకారముగామాట్లాడుతావు.
Doctirnally adv మతమునుబట్టి సిద్దాంతములో శాస్త్రీయత. thesetwo religions are * one but practically different యీ రెండుమతములము సిద్దాంతము వకటేగాని ఆచారములో భేదము.
Doctor n s వైద్యుడు, పండితుడు, శాస్త్రి, గురువు.a * of divinity యిది కొందరు పండితులకిచ్చే పట్టము,పట్టపుపేరు, యిందుకు సంకేతాక్షరములు D. D. అనివ్రాస్తారు . a * of laws యిదిన్ని కొందరుపండితులకు యిచ్చే పట్టము, పట్టపుపేరు. యిందుకు సంకేతాక్షరములు LL. D. అనివ్రాస్తారు. ఈ పట్టపుపేరు నిఘంటుకర్తయైన Dr. Johnson దొరవారికి కద్దు Samuel Johnson కు సంకేతాక్షరములు. LL. D. అన్నిన్ని. * of Medicine కు సంకేతాక్షరములు.M.D. అన్నిన్ని వ్రాస్తారు. ముఖ్యముగా యీ సంకేతాక్షరములుపేర్లకు తరువాత వ్రాసివుంటున్నవి, చదవడములో పేర్లకు ముందుగాచదువుకోవలసినది. Samuel Johnson LL. D. అనివ్రాసి వుంటే DR.Johnsonఅని చదవవలసినది యిదిన్ని గాక D. D. or LL. D. or M. D. అని వ్రాసినప్పటికిన్ని చదవడములో Doctor అనేపేరు మాత్రమే వస్తుంది, కాలీజులో చదివి యోగ్యతాపత్రికతీసుకున్న తరువాత యీ పేర్లు వస్తున్నవి.
Doctoring n s వైద్యము, చికిత్స, యిది నీచమాట.
Doctor's shop n s మందుల అంగడి.
Doctorship n s శాస్త్రి అనే పట్టము.
Doctrine n s మతము, సిద్ధాంతము, సంప్రదాయము, ఉపదేశము.
Doctum n s వాక్యము, సూత్రము, విధి, ఆజ్ఞ.
Document n s సాధకము, సాధనము, దస్తావేజు.
Documental, Documentary adj సాధకరూపమైన. * evidence దస్తావేజు,దస్తావేజు రూపమైన సాక్ష్యము.
Dodder n s ( a parasitical plant like ivy ) బదనికభేదము. Dodderedadj. బదినకగల. a * oak బదనికగల వృక్షము.
Doddle n s పిచ్చిగొడ్డు, వెర్రముఖము.
Doe n s ఆడది, పెంటిది, జింక, కుందేలు, సీమకుందేలు.వీటిని గురించిన మాట. bucks and does లేండ్లన్ను ఆడలేండ్లున్ను.John Doe and Richard Roe, two techinical words దేవదత్తుడుయజ్ఞదత్తుడు అన్నట్టుగా రెండు పేర్లు.
Doer n s చేసేవాడు. an evil * దుర్మార్గుడు. well * సన్మార్గుడు.
Does (third person singular of do) చేస్తున్నాడు,చేస్తున్నది, See To Do.
Dog n s కుక్క. a word of light contempt కుర్రవాడు.చిన్నవాడు. a drunken * తాగుబోతు. a quarelsome * జగడాలమారి.a worthless *, a handsome * సోగసుగాడు, పనికిమాలిన గొడ్డు. a mery*హాస్యగాడు. a sad * పనికిమాలినవాడు, చేతకానివాడు, చెడ్డవాడు.a miserable * దిక్కుమాలిన పక్షీ. he is a lucky * వాడి అదృష్టముబాగా వున్నది. a * fox మొగనక్క . the dog -wolf మగ తోడేలు.the dog _rose అడివి రోజాపుష్పము, నాటు రోజాపుష్పము . a * brierఒకఅడవి చెట్టు. dogcheap మహానయమైన. I got the booksdogcheap ఆపుస్తకాలు. నాకునిండా నయముయగా చిక్కినవి. a dog'strick కొంటేచేష్ట. the dog -days. జ్యైష్ట కార్తె, యెండకాలముకత్తిరి. he is gone to the dogs వాడు చెడిపోయినాడు. they threw the regulation to the dogs ఆ చట్టమును అలక్ష్యముచేసినారు, తొక్కిపారవేసినారు . the dog _star జ్యేష్టానక్షత్రము. the * teeth కోరలు. do not make *s ears in your book నీ పుస్తకములో కాకితాలకొనలను మణచక. the *s of a hearth పోయిగుడ్డలు.
Doge n s రాజులలో వొక భేదము.
Dogfish n s తూరమీను.
Dogfly n s జోరిగ.
Dogged adj మొండి, మూర్ఖ, పేడసరమైన.
Doggedly adv మొండిగా మూర్ఖ, పెడసరము.
Doggedness n s మొండితనము, మూర్ఖతనము, పెడసరము.
Dogger n s చిన్నవాడ.
Doggerel n s ఛందౌబద్దముగా వుండని కావ్యము, లక్షణవిరుద్ధమైనకావ్యము, జబ్బు కావ్యము, పిచ్చి కావ్యము.
Dog-hole n s దిక్కుమాలినచోట, పనికిమాలిన గుడిశ.
Doghouse కుక్కలదొడ్డి
Dog-latin n s అభాసమైన లాటిన్ భాష.
Dogma n s సిద్ధాంతము, నిబంధన. trasmigration is a * amongthe Hindus పునర్జనము కద్దని హిందువుల సిద్దాంతము. some braminshold the * that learning English will ruin the piety of a Hinduయింగ్లీషు చదివినందున హిందువులయొక్క భక్తి చెడిపోతుందని కొందరుబ్రాహ్మల యొక్క సిద్దాంతము. some hold the * that a wifeought to die with her husband పెనిమిటితోకూడా పెండ్లాముచావవలసినదనేది కొందరి మతము. some hold the * that teluguoriginates in Sancrit తెలుగు సంస్కృతములో నుంచిపుట్టినదనికొందరి సిద్దాంతము.
Dogmatical adj మూర్కమైన, పిడివాదమైన. a * temper పెడసరమైనగుణము, పిడివాదగుణం.
Dogmatically adv పిడివాదముగా , మొండితనముగా, సిద్దాంతముగా,
Dogmaticalness n s ( Sir Is. Newton uses the word ).పెడసరము, మూర్ఖత, పిడివాదము.
Dogmatist n s పిడివాదముగలవాడు.
Dogmatizer n s తనమతమే మతమని పిడివాదముగా చెప్పేవాడు, తానే మహాగురువుగా యిదే విదియని అహంకరించిచేప్పేవాడు.
Dogsbane n s వసనాభివంటి వొక మొక్క.
Dog-sleep n s కుక్క నిద్ర, అనగా చిటుక్కుని చప్పుడైతే మేలుకొనేనిద్ర.
Dogstar n s జ్యేష్టానక్షత్రము.
Dog-tooth n s కోరలు.
Dog-trot n s జబ్బునడక.
Dog-weary adj చాలా అలసిన.
Doing P\\ see toDo , heis*wellవాడికిప్పుడుహాయిగావున్నది,వానికియిప్పుడుకుదురుగావున్నది
Doit n s గవ్వ, కాసు, పస్కాణి, పైసా.
Dole n s ముష్టి, అదృష్టము. he yesterday distributed the * నిన్న తనయింట్లోసంతర్పణ చేసినాడు, నిన్నభూరి యిచ్చినాడు. happy man be his *!వాడి అదృష్టము మంచిదిగా వుండవలెను. or grief శోకము, దుఃఖము.avoid space left in tillage ( Johnson) పాడువేసిన పొలము.బీడుగా వేశిపెట్టిన పొలము, కొండ్ర.
Doleful adj వ్యాకులమైన, వ్యసనకరమైన, దుఃఖరకమైన, శోకమైన. యేడ్చే, అఘోరమైన. a * cry యేడ్చు, దీనాలాపము. * newsకానిసమాచారము, చావు సమాచారము.
Dolefully adj వ్యాకులముగా , వ్యసనముగా, దుఃఖముగా, శోకముగా.
Dolefulness n s వ్యసనము, దుఃఖము, శోకము, అఘోరము.from the * of his face వాడి ముఖము చూస్తే వ్యసనముగావుండేటట్టు వుండుటవల్ల.
Dolichos n s ( a sort of beans) అనుములు.
Doll n s బొమ్మ, కీలుబొమ్మ. an Indian word for peaseపప్పు.
Dollar n s ( about five shillangs : a little more that tworupess ) డాలరు రూపాయ, యిది కొన్నిచోట్ల రెండున్నర రూపాయికిమారుతున్నది.
Dolorous adj అఘోరమైన, దుఃఖమైన, వ్యసనకరమైన.
Dolour n s దుఃఖము, వ్యసనము, శోకము.
Dolphin n s శఫరము, బేడిసచేప, మకరము, గండుమీను.యిది సముద్రమత్స్య విశేషము. sometimes the same as the porpoiseనీరుపంది.
Dolt n s మడ్డి, మోటవాడు, మొద్దు, తెలివిమాలినవాడు.
Doltish adj మందుడైన, జడుడైన, మొద్దైన.
Domain n s రాజ్యము, దేశము, సంస్థానము.
Dome n s గుమ్మటము, కలశము. the royal * రాజగృహము.
Domestic n s పనివాడు, పనికత్తె.
Domesticated adj అలవాటుపడ్డ, యింట్లో మరిగిన, యింట్లో పెంచిన. I was * with him for three months వాడి యింట్లో మూడునెలలుభోజనము చేస్తూ వుంటిని. the * squirrel యింట్లో మరిగిన వుడుత.
Domicile n s నివాసము, గృహము, యిల్లు, ఆలయము.
Domiciled adj నివాసముచేసిన, కాపురమువుండిన . he was * thereవాడు అక్కడ కాపురము వుండినాడు.
Domiciliary adj యింట్లో జరిగిన. a * visit పోలీసువాండ్లువచ్చి సోదా చూడడము.
Dominant adj ప్రగల్బమైన, ప్రబలమైన.
Domination n s అధికారము, ప్రభుత్వము, దొరతనము, యేలుబడి.
Domineering adj ధూర్తమైన, క్రూరమైన. a * speechధూర్తమాట, క్రూరమాట.
Dominical adj ఆదివారసంబంధమైన.
Dominie n s పల్లెకూటపు అయ్యవారు, ఉపాధ్యాయులు.
Dominion n s రాజ్యము, రాజ్యభారము, ప్రభుత్వము. or country దేశము. he had * వాడు రాజ్యభారము చేసినాడు. యేలినాడు. he had * over them వాండ్లను యేలినాడు, గెలిచినాడు.
Domino n s a cloak ఫలానివాడని గురుతు తెలియకుండా తలనుంచికాలిదాక వేసుకునే నల్లపట్టు భైరవాసము. the king appeared in a *రాజు తన గురుతు తెలియకుండా భైరవాసము వేసుకుని వచ్చినాడు.Dominos, n. s. చొకటాలవంటి ఒక ఆట, ఆయాట ఆడే కాయలు.
Don n s దొర, సాహేబు, యిది spanish శబ్దము.
Donation n s బహుమానము, బహుమతి, ధర్మము, దానము.
Donative (a benefice Johnson)మాన్యము,వృత్తి,స్వాస్త్యము
Done part,pass of the verb to do చేసిన, అయిన, అయిపోయిన.తీరిన, ముగిసిన. It is nearly * కావచ్చింది. It is * అయినది,తీరినది, ముగిసినది. he got it * చేయించినాడు. * away వదిలిపోయిన,విరిగిన, నివృత్తమైన. the house was * up anew ఆ యిల్లు చక్కపెట్టబడ్డది.He is * up చెడిపోయినాడు, అలిసినాడు, గాసిపడ్డాడు. well * భళా,భళి,మ సరీ, శాబాసు. have *! చాలు, చాలు, వొద్దు, వొద్దు. have *with this nonsence యీ పిచ్చికూతలు చాలు, యీ పిచ్చి కూతలుమానుకో.I have * with it యికను యిది నాకు అక్కరలేదు, యికను ఆనిమిత్తమునాకు అక్కరలేదు. If you wont tell me I have నీవు చెప్పకపోతేమానె .
Donee n s దానము తీసుకునేవాడు, ప్రతిగ్రహీత.
Doney n s a sort of boat దోనే అనే పడవ.
Donjon n s a tower in the middle of a castle or fortబురుజు, చెరసాల, యిది కావ్యమందు వచ్చేమాట.
Donkey n s దాత, త్యాగి, యిచ్చేవాడు.
Dont (contraction of do not) వద్దు, * go there అక్కడికిపోవద్దు. * say so అట్లా చెప్పక.
Dooly n s డోలి.
Doom n s ఆజ్ఞ, విధి, శాసనము. he met his * with firmness వాడుచావుకు వెనక్కు తియ్యలేదు. the hour of * మరణకాలము, చంపడానకైవిధించబడ్డ, కాలము. the death that was their * వాండ్లకువిధించిన మరణము.
Doomsday n s కల్పావసానము, మహా ప్రళయకాలము.
Doomsday-book n s పెద్దకవిళము, పోలిమేరలను గురించిన గ్రంథము.తరబడిలెక్క. యిది సీమలో నేలలను గురించి యెనమన్నూరుయేండ్ల కిందట నిర్ణయించబడ్డ లెక్క . a book made by order ofWilliam Conqueror in which the estates of the Kingdom wereregistered.
Door n s ద్వారబంధము, తలుపు. the top of a * ద్వారబంధము యొక్కపైతట్టు. the sill of a * గడప. the house * తలవాకిటిగడప.సింహద్వారము. or, an opening సందు, రంధ్రము. a lidor small * as thaty of a lantern తలుపు,. trap* సొరుగుతలుపు.,the cover of a pit యింట్లో సామానులను దాచిపెట్టే క్షేమము యొక్కతలుపు. * or opportunity మార్గము, అవకాశము, సందు. this was a * for his becoming minister అతను మంత్రికావడానకు యిది మూలము. the front * వాకిటి తలుపు. back * పెరటితలుపు,పెరటిగడప. in *s యింట్లో. the English do not wear their hatsin *s యింగ్లిషువాండ్లు యింట్లో వుండేటప్పుడు టోపి వేసుకోరు. out of *s బయట. he was then out of *s వాడు అప్పుడు యింట్లో లేడు. out of * s amusement వనవిహారము మొదలైనవి. the next * యిరుగిల్లు, పొరుగిల్లు.పక్కయిల్లు, అవతలి యిల్లు. we are next * neighboursమేము యిరుగుపొరుగువారము. two * of off రెండిండ్ల దూరము.రెండిండ్ల అవతల. from * to * యింటింటికి. he is at death'sవాడు చావు బ్రతుకుల మీద వున్నాడు, కొనప్రాణములో వున్నాడు. sinlieth at the * పాపము కట్టకపోదు, పాపము చుట్టుకోకపోదు.the sin does not lie at his * యీ పాపము అతనిది కాదు.If you act thus sin will lie at your * నీవు యీ పని చేస్తే యీ పాపమునిన్ను చుట్టుకొనును.
Door-case, Door-frame n s. ద్వారబంధము.
Doorkeeper n s ద్వారపాలకుడు, వాకిట పారా వుండేవాడు.
Doorway n s ద్వారము.
Doric n s యిది వొక దేశనామము. Pillars of the * order వొక తరహాస్తంభములు.
Dormant adj sleeping నిద్రపొయ్యే. not in use చెల్లని.అణిగివుండే, అగుపడని. the * privileges of the Rajahsరాజులకు పూర్వము వుండిన స్వతంత్రములు అనగా ప్రస్తుతములో చెల్లినది.a * disease లోగా అణిగివుండే రోగము. the talents of children lie *బాల్యములో ప్రజ్ఞ బయట అగుపడదు. the * flame appeared అణిగివుండినజ్వాల బయటికి వచ్చినది.
Dormitory n s పడకటియిల్లు, యిది స్కూలులో పిల్లకాయలు పండుకొనేయిల్లు. or burying -ground స్మశానము,
Dormouse n s పందికొక్కువంటి వొక జంతువు, యిది యేవేళ నిద్రపోతూవుంటున్నది.
Dose n s వక పూట ఔషధము. he has got his * వాడికి దెబ్బతగిలింది.అనగా కావలసినది శిక్ష అయినది, వాడికి తల తాకింది. this was abitter * to him యిందుచేత వాడి ప్రాణము విసికింది.
Dosesteem n s అలక్ష్యము, అగౌరవము. those arts are nowheld in * ఆ శాస్త్రములకు యిప్పుడు గౌరవము లేదు.
Dossil n s వ్రణములో యెక్కించేవత్తి.
Dossolvable adj See dissoluble.
Dost (second person singular of Do) చేస్తున్నావు, thou * sayనీవు చెప్పుతున్నావు.
Dot n s చుక్క, బొట్టు, బిందు. i. j. యీ అక్షరములమీదవుండే బొట్లు. a mark put between numerals హళ్లీ. Some Hinduswere a * in the forehead కొందరు హిందువులు ముఖములో చుక్కపెట్టుకోవడము కద్దు.
Dotage n s తెరుపుమరుపు. this is mere * యిది వట్టి వెర్రిమాటలు.he is in his * వాడికి వృద్ధాప్యము చేత బుద్ధి ముసించి వున్నది.
Dotard n s తెరుపుమరుపుగల ముసలివాడు , బుద్ధి ముసించిన ముసలివాడు
Dotation n s ఉంకువ.
Doth (the third person singular of Do) చేస్తున్నాడు,చేస్తున్నది
Double n s రెట్టింపు, రెండింతలు, యిబ్బడి. ( a facsimile) రెండోది, రెండోమారు. he is the * of his brother వాడి అన్నయెంతటివాడో వాడున్ను అంతటివాడే. or fold మడత. he made a * in thepaper ఆ కాకితమును మడిచినాడు. ( in hunting ) the rat made a *యెలుక పారిపోతూ వుండగా అట్టెమళ్లుకొని పరుగెత్తునది.
Double-dealer n s మోసగాడు, మాయలమారి, పిత్తలాటకగాడు.
Double-dealing n s మోసము, మాయ, పిత్తలాటకము.
Double-died adj రెండుమాట్లు చాయలో అద్దిన. a * rogue పక్కా దొంగ, పాత దొంగ.
Double-edged adj రెండంచులుగల.
Double-entendre n s ( a French word) ద్వ్యర్థము, శ్లేష, పొడుపుడుమాటలు.
Double-jasmine n s బొండుమల్లెలు, రెట్టమల్లెలు.
Double-meaning n s ద్వ్యర్థము, శ్లేష, చాతుర్యము, చతురోక్తి.
Double-minded adj చపలచిత్తమైన, స్థిరబుద్ధి లేని. (ద్విమనస్క)
Doublet n s (a waistcoat) వకతరహా చొక్కాయ. he went in his * and hose without his coat or cassock (Canons Ecel. LXXIV) కట్టుకోకతో వచ్చినాడు.
Double-tongued adj రెండు నాలకలు గల, ద్విజిహ్వుడైన, కపటియైన,వంచకుడైన.
Double-tooth n s దవడపల్లు.
Doublets, atgames n s. పాచికలలో జతగా పడే పందెము, అనగా రెండు పాచికలున్నుసరగ్గాపడడము, యిట్లా పడడమువల్ల వకటి యిబ్బడి అవుతున్నది.
Doubloon n s ( a gold coin worth 16 Spanish dollars ) వక బంగారు నాణ్యము, యిందుకు మార్పు పదిరూపాయలు.
Doubly adv ద్విగుణముగా, రెట్టిగా, రెట్టింపుగా, రెండింతలుగా.
Doubt n s సందేహము, సంశయము , శంక, అనుమానము. he entertained *s regarding this యిందున గురించి అనుమానపడ్డాను. I am in about it *అదినాకు సంశయముఘ వున్నది. no * కాకయేమి, అవశ్యముగా. no * it iswrong అది తప్పనేటందుకు అనుమానము లేదు. they no * have paidthe money వాండ్లు ఆ రూకలు చెల్లించివుందురు గదా.there can be no * but he is dead చచ్చివుండవచ్చును చచ్చినాడుకాబోలు.you no * have seen him నీవు అతన్ని చూచివుందువు గదా.you no * have read this దీన్ని నీవు చదివి వుందువు గదా. Next monthno * we shall have rain వచ్చేనెలలో వర్షించును కాబోలు.
Doubter n s సందేహించేవాడు, సంశయాళువు.
Doubtful adj సందేహమైన, సందిగ్దమైన, అనుమానమైన.
Doubtfully adv సందేహముగా, సందిగ్దముగా, అనుమానముగా,
Doubtfulness n s సందేహము, . అనుమానము.
Doubtless adv నిస్సందేహము, నిస్సంశయముగా.her features, though * altered by time was still handsomeవయసు చెల్లినందున మారురూపు అయినది సరేగాని అందముగా వుండినది.these * are his but the rest are mine యివి వాడివి సరేగానికడమవినావి. these words * are Sanscrit but the rest are Teluguయివి సంస్కృత శబ్దములు సరేగాని కడమవి తెలుగు శబ్దములు.
Douceur n s లంచము, బహుమానము. they offered him this as a *వాడికి దీన్ని తాంబూలానికి యిచ్చినారు.
Dough n s పిసికిన పిండి. you call this bread it is mere * దీన్నిరొట్టె అంటావా, యిది వట్టి పిండి. the * is in the oven the breadwillbe ready in two hours పిండిపొయిమీద వేసియున్నది రెండు గడియలలోరొట్టే సిద్దమౌను.
Doughty adj పరాక్రమముగల, వీరుడైన, శూరుడైన, యిది యెగతాళిమాట.
Doughy adj పిండిగా వుండే, కాలీకాలకపిండిగా వుండే.
Douse n s చెంపచెట్టు.
Dove n s పావురాయి, కపోతము, గువ్వ.
Dovecot n s పావురాళ్లగూడు, పావురాళ్లు వుండడానకుకట్టిన గూడు.Dove-eyed, adj. చకోరాక్షియైన, తరళాక్షియైన.
Dovelike accents n s చిలుకపలుకులు.
Dovetail n s వడ్లపనిలో పెట్టె మూలలను కూర్చేటందుకుపలకలలో వుండే పట్లు. లేక, పండ్లు వీటికి వసల, కుసి, తొలి, మచ్చి,పిసరు, పింజము అని అంటారు.
Dovetailed adj కూర్చిన, సంధించిన. the stories are all * togetherఆ కథలన్నీ వొకటితో వొకటి అనుక్రమణికగా వున్నవి, పొందికగా వున్నవి.పొనగింపబడి వున్నవి.
Dowager n s ( a widow with a jointure) భరణియ్య స్త్రీ జీవనాంశముతీసుకునివుండే వితంతురాలైన దొరసాని, మగడు చనిపోయిన తరువాతఆస్తిమంతురాలుగా వుండే ఆబిడ. The Queen * గతించిన, రాజుయొక్కభార్య.
Dowdy n s నాగరీకములేనిది, మోటది, కామాటిదానివలె వికారముగాబట్టలు కట్టుకునేది.
Dower n s ఓలి, ఉంకువ, హరణము, యౌతకము.వివాహకాలమందు తండ్రి తన కూతురికి యిచ్చే ఆస్తి, స్త్రీ ధనము.that which the widow possess వితంతు ధనము.
Dowless n s రెట్టుగుడ్డ, ముతకగుడ్డ.
Down adv కిందికి, కిందుగా, అడుగున, అడుగుకు. See the verbsto bring *, to fall *, to knock *, to take *, & c. to bring * గెలుచుట.the rain brought * the price of rice వర్షము చేత బియ్యమునయమైనది. to fall * నేలపడుట, రాలుట. the wall fell * ఆ గోడపడిపోయినది. to knock * పడగొట్టుట. యిడియగౌట్టుట he knocked* a lot at the auction. ఆ యేలములో వొకలాటు యెత్తినాడు.I took* what he said వాడు చేప్పినదాన్న వ్రాసుకొన్నాను. to carry *or to set * కూడా వేసుకోనుట. కూడా చేర్చుకొనుట, యిది లెక్కలోవచ్చేమాట. to get * దిగుట, దించుట. he got * the tree ఆ చెట్టు మీదనుంచి దిగినాడు. he got * the books ఆ పుస్తకములను కిందికిదించినాడు. to go * ( as a swelling) సగ్గుట. my boat was going * and his was sailing up నేను ప్రవాహమువెంబడించి పోతూవుండినాను, వాడు యేటికి యెదురెక్కి వస్తూ వుండెను.he ran * the street వీధి వెంట పరుగెత్తినాడు. the shewent * ( that is sunk ) ఆ వాడ మునిగిపోయినది. the sunis * సూర్యాస్తమానమైనది. they pulled * the house ఆ యింటినిపెరికివేసినారు. to put * or record దాఖలుచేసుకొనుట, వ్రాసుకొనుట.to put * or quell అణుచుట, అణగకొట్టుట, సాధించుట. he struckit * వాడు దాన్ని పడగొట్టినాడు. to tread * అడుగుబెట్టుట.అణగదొక్కుట. he turned * a leaf in the book వాడు పుస్తకములోవొక కాకితపుకొనను గురుతుకు మడిచినాడు. this article is * in theaccount యీ పద్దు ఆ లెక్కలో కట్టివున్నది. he was walking up and * వాడు అటూ యిటూ పచారిస్తూవుండెను. the road is all up and* అదో వంతా ఒడ్డూ మెరకగా వున్నది, మిట్టాపల్లముగా వున్నది.Is your father up ? మీ తండ్రి పడకవిడిచి లేచినాడా. Is he * ?మిద్దె నుంచి కిందికి దిగినాడా. I awoke at 4, up at 5, and at * 6నాలుగు గంటలకు మేలుకున్నాను, అయిదు గంటలకు పడకవిడిచిలేచినాను, ఆరు గంటలకుమిద్దెదిగినాను.
Down! interj. మండా, కాల, ( An exhortation to destruction ordemolition ) a contemptuous threat చీపడివుండు, అణిగిపడియుండు. * with it దాన్ని కొట్టి పడదొయ్యి. * with the tree * ఆ చెట్టునుకొట్టిపడదోయి ! * derry * చెంగనాలో, జేజేరాం, యిది పదములలోవుండే వొకమాట . those who cry * with the English Governmentయింగిలీసు దొరతనము నాశనమైనది.
Downeast adj కింది, చిన్నబోయ్ని, వ్యాకులము కావుండే. a * look కిందిచూపు, అధో దృష్టి. he looked very * ముఖము మాడిచినాడు.
Downfall n s నాశనము, చేటు. after the * of the Musulmansతురకల ప్రభుత్వము పోయినతరువాత.
Downfallen adj పడిపోయిన, నాశనమైపోయిన.
Downhill adv కిందికి. we came * కౌండ దిగినాను. he is going * వాడికిక్షయకాలము వచ్చినది. In his * course వాడికి క్షీణగతిలో. In the* of life వృద్దాప్యములో.
Downiness n s నూగు, బొచ్చు, సన్నరోమము.
Downlooking adj తలవంచుకొనివుండే.
Downright adv స్పష్టముగా, పరిష్కారముగా. he told it me * దాన్నినాతో పరిష్కారముగా చెప్పినాడు. Downs . (plu. n.s. ) a plain or pasture బయలు, పొలము,పోళ్లు. the feet in the * వాడలు. the downs " అనే సముద్రములోవున్నవి.
Downsitting n s కూర్చుండడము, యిది ప్రాచీనశబ్దము.
Downward, Downwards adv కిందికి, కిందుగా, దిగువకు. he hungwith his head * తలకిందుగా వేలాడుతూ వుండినాడు.
downy adj నూగైన, సన్న. or soft మెత్తని, మృదువైన.కోమలమైన. * hair నూగు వెంట్రుకలు.
Dowry n s ఓలి, ఉంకువ, హరణము, యౌతౌకము.
Doxology n s ధాన్యము, స్తపము, మంగళము.
Doxy n s లంజ, తొత్తు, బజారి.
Doze n s కునికిపాటు, నిద్రమబ్బు, నిద్రమైకము, తూగు.
Dozen n s పండ్రెండు. I have told you a * times నీతోఅనేకమాట్లు చెప్పివున్నాను. a * people పదిమంది, నలుగురు.h alf a * ( సంఖ్యలో) ఆరు, ( ప్రయోగములో) నలుగురు.కొందరు. as meaning a flogging దెబ్బలు, శిక్ష.
Doziness n s నిద్రమబ్బు, నిద్రమైకము.
Dozy adj నిద్రమబ్బవుగా వుండే. నిద్రమయికముగా వుండే.
Dpctrinal adj మతమును గురించిన. * points మతవిషయములు.
Dr. n . s. This is a contraction of these words Doctor, Debtor,and Drachm
Drab n s లంజ తొత్తు.
Drachm, Drachma n s. an old Greek coin వొకనాణెము.a weight వొక పడికట్టు యిది. ounce అనే తూనికలో యెనిమిదిభాగము, టంకమువంటిది. See Dram.
Dracunculus n s యిది వొక మొక్క పేరు. దీన్ని నారుగడ్డిఅంటారు.
Draeariness n s బావురుమని వుండడము, భయంకరముగా వుండడము.
Draff n s కడుగు, కుడితి, పందితాగేతొట్టి, నీళ్లు కల్మశము.
Draft, Draught n s. the act of drawing or pulling carriageయీ నడవడము ఆకర్షణము. a * bullock బండియెద్దు. * cattleబండియెద్దులు. the quantity of liquor drank at once గుక్కగుక్కెడు. he took a * of water వాడు వొక గుక్క నీళ్లు తాగినాడు. the doctor gave him a * వైద్యుడు వాడికి తాగడానకు మందుయిచ్చినాడు. he drank it at three * దాన్ని మూడు గుక్కలుగాతాగినాడు. the doctor appointed me a * ఫలాని మందును నీళ్లలోకలిపి తాగమన్నాడు. do not sit in the * గాలివాటములో కూర్చోక.A cheque for money హుండి. he paid my * వానిపేరటవ్రాసిన హుండికి రూకలు చెల్లించినాడు. there wee a thousandfishes caught at a * వొకమాటు వలవేసి యీడ్చి సందులోవెయ్యి చేపలు పట్టుబడ్డవి. or delineation చిత్తు, మసోదా.a picture drawn గీతలుగా వ్రాసిన పఠము, చూచాయగావ్రాసిన పఠము. I prepared a * of the letter ఆ జాబుకుచిత్తు కుదిరిచినాను. he made a * of fifty men otu of ourregiment యీ పటాళములో యాభై మందిని తీసుకొన్నాడు.what*has this boat యీ పడవ యెంతమట్టుకు మునుగుతున్నది.the game called drafts చొకటాలవంటి వొకఆట. the gamecalled drafts చొకటాల వంటి వొక ఆట. In Matt. XV. 17."is cast out into the * " మరుగు పేరడు, బహిర్భూమి. (అపస్కరాలయె. c + but a+ c_ omit it ) A house మరుగుపెరడు, బహిర్భూమి.
Drag n s net విసురువల. an instrument with hooks పాతాళబేది, గాలము, దీనితో నీళ్లల్లో పడివుండే శవాన్ని యెత్తుతున్నారు.
Draggled adj తడిసిన, మురికైన, కశ్మలముగా వుండే,
Draggletail n s యేబ్రేసి, మురికిమనిషి.
Drag-net n s పెద్దవల.
Dragoman n s an interpreter దుబాసి. Ann. Reg. 1827 [319]
Dragon n s నాగము. A + C+. ఘటసర్పము. K + మహాసర్పము.యిది మొసలివంటి వొక జంతువు , దీన్ని చిత్రములయందు వ్రాయడమే కాని యీ జంతువు లేదు. *s blood వొక తరహాగుగ్గిలము. of its wood walking sticks are madeగుగ్గిలపుమాను, దీనితో పూతకద్రలు చేస్తారు.
Dragonet n s వొకతరహా చేప.
Dragonfly n s తూనీగ.
Dragoon n s రౌతు, గుర్రపువారు, తురుపునవారు.
Drainage n s నీళ్లు, జారిపోవడము, వడిసిపోవడము.
Drained adj వడిసిపోయిన, యినికిపోయిన, వట్టిపోయిన, యెండిపోయిన.Every take was * by the heat యెండకు గుంటలంతా వట్టిపోయినవి. Drake, n. s. మగబాతు. ducks and *s ఆడబాతులు, మగబాతులు.a game కప్పగంతులనే పిల్లకాయల ఆట.
Dram n s ( a drachm ) ounce లో యెనిమిదో భాగము. or smallquantity (as not a * of sense ) కొంచెము, రవంత. a * ofspirits వొక ద్రాముసారాయి. a * shop సారాయి అంగడి, కల్లుగుడిసె.
Drama n s నాటకము.
Dramatic, Dramatical adj నాటకసంబంధమైన. a * literature నాటకములు. a * performer నటీ. a * account ప్రత్యక్షమైన.వర్ణనము, సరసమైన వర్ణనము.
Dramatically adv నాటకరితిగా.
Dramatist n s నాటకము చెప్పిన కవి.
Draped adj బట్టలు తొడుక్కొన్న గుడ్డకట్టుకొని వుండే.
Draper, Drapier n s. బట్టలవర్తకుడు, బట్టల అంగడివాడు.*s shop బట్టల అంగడి.
Drapery n s బట్టలు. his * shows that he is a bramin వాడి వేషముచూస్తే బ్రాహ్మణుడని అగుపడుతున్నది. the * in this pictrure iswell done యీ పటములో వస్త్రములు కట్టుకొన్నరీతినిబహుబాగా వ్రాసినాడు. or curtain తెర పరదా, జాలరు.
Drastic adj వేగమైన, చురుకైన, యిది భేదిమందును గురించినమాట.
Draught n s See Draft.
Draughts n s చొకటాలవంటి వొక ఆట.
Draughtsman n s (a painter ) చిత్రగాడు.
Drawback. n. s. తరుగు, వట్టము, ( want or disqualification )ఆక్షేపణ, తక్కువ. or objection ఆటంకము, తొందర, ఆయాసము.
Drawbridge n s ఆగడ్తకువేసే కీలు వారధి. యిది పలకలతోచేసినది, అక్కరలేనప్పుడు లేవనెత్తివేస్తారు.
Drawee n s తనపేరట వచ్చిన హుండికి రూకలు చెల్లించేవాడు.
Drawer n s a sliding box in a chest సొరుగు. a manservant పనివాడు, మేటి, నీళ్లుచేదే పనివాడు. the * of a money bill హుండి వ్రాసేవాడు, రూకలుతీసుకొని హుండి యిచ్చేవాడు.
Drawers n s సొరుగు. a chest of * సొరుగుగలపెట్టె.or breeches నిజారు, ఛల్లడము.
Drawing n s చిత్రము వ్రాసేపని, పటము. * masterచిత్రమని నేర్పేవాడు. * paper పటములు మొదలైనవివ్రాసే దళమైన కాగితము. a * of a lottery లాటరీచీట్లుయెత్తడము. the * of a wound or boil కురుపు చీము కూర్చడము.తీపులు తియ్యడము.
Drawing-room n s కచ్చేరియిల్లు, వచ్చే వారికి దర్శనముయిచ్చేయిల్లు, రాజుదర్శనము యిచ్చే సభ,
Drawn v n pass. past of the verb to draw యీడ్చిన, వ్రాసిన.See to Draw. The sword was * ఆ కత్తి దూయబడ్డది, యుద్ధము ఆరంభమైనది. a * sword విచ్చుకత్తి. the bond was * ఆ పత్రము వ్రాయబడ్డది. a long * note in music ఉదాత్తస్వరము, ప్రచయము, మూర్చన. a deep * sigh నిట్టూర్పు. a * game ఉభయత్ర గెలుపులేని ఆట, సరికిసరి అయిపోయిన ఆట. * up in battle array యుద్ధసన్నద్ధులై వుండే.
Draw-well n s చేదుడుబావి.
Dray n s సరుకులు వేసే పెద్దబండి. * horse బళువుబండిగుర్రము,అనగా మోటగుర్రము అటు వంటి గుర్రము యీ దేశములో లేదు. * man బళువుబండితోలేవాడు. a bird's nest పక్షిగూడు.
Drazel n s See wretch, Drab.
Dread n s బెదురు, భయము, భీతి, దిగులు.
Dreadful adj భయంకరమైన, అఘోరమైన, పాపిష్టి. a * woundమహాచెడ్డగాయము, మహా బలమైన గాయము. * death దుర్మరణము.* news చెడ్డసమాచారము.
Dreadfully adv అతిభయంకరముగా. he was * angry వాడు మహాకోపముగావుండినాడు. it is * cold పాడు చలిగా వున్నది. this is chiefly a female word యిది ముఖ్యముగా స్త్రీలు ఆడేమాట.
Dreadless adj నిర్భయమైన.
Dream n s కల, స్వప్నము. a mere * వట్టి భ్రమ.
Dreamer n s కలగన్నవాడు, భ్రాంతుడు, పిచ్చియెన్నికలు గలవాడు,మూఢుడు.
Dreamless adj కలలులేని. * sleep గాఢనిద్ర, మంచినిద్ర,మరణము.
Dreamy adj అస్పష్టమైన. * elegance in poetry అవ్యక్తమధురము.
Drear, Dreary adj పాడుగా వుండే, భయంకరముగా వుండే, బావురమనివుండే, అఘోరమైన. a * spot నిర్జన ప్రదేశము, బావురుమని వుండే ప్రదేశము. a * prospect యేమివస్తుందో అనే అఘోరింపు.
Drearily adv భయంకరముగా, అఘోరముగా, బావురుమని.
Dredge n s చేపలు పట్టే వొక తరహా వల.
Dredgingbox n s పిండి చల్లడానకు వుండే డబ్బి, ముగ్గుగొట్టము.
Dreggy adj మడ్డిగా వుండే, మష్టుగా వుండే, కల్మశముగా వుండే.
Dregs n s మడ్డి, మష్టు, గసి. * of castor oil ఆముదపు పుచ్చు.the * of the people నీచులు, క్షుద్రులు, తుచ్చులు, తుక్కుమూక. hedrank it to the * దాన్ని అడుగు పిప్పికూడా విడిచిపెట్టకుండా తాగివేసినాడు.Harischandra drained the cup of misery to the * హరిశ్చంద్రుడు పడని పాట్లు లేవు. In these * of time (Buston's Four fold state chap. I.) యీ కలియుగమునందు.
Drench n s దాహము, యిది తిట్టుమాటికి. physic for a bruteగుర్రములు మొదలైన వాటి యిచ్చే భేదిమందు.
Drenched adj తడిసిమొద్దైన, దొప్పదోగిన. I was * in the rainవానలో దొప్పదోగుగా తడిసినాను. the sword that was * in blood నెత్తురు వారలుగా వుండే కత్తి.
Dress n s బట్టలు, వుడుపు, వేషము. give me a clean * నాకు చలువ వుడుపు యియ్యి. head * పాగా కలికుతురాయి, రాకడి, కొప్పు, పువ్వులు మొదలైనవి, అయితే టోపి మాత్రముకాదు. he came in full * శృంగారించుకొనివచ్చినాడు. undress సాధారణమైణ వేషము, నిత్యము వేసుకొనే వుడుపు.
Dressed adj బట్టలు తొడుక్కొన్న, దిద్దిన, సవరించిన, బాగుపరచిన,పనుపరిచిన, పక్వమైన, వండిన. * in a tiger's skin పులితోలును బట్టగా కట్టుకొన్న. * in mortal flesh మనుష్యావతారమెత్తిన. half * or half boiled ననబాయిగా వుండే, వుడికి వుడకక వుండే.
Dresser n s one employed in regulating or adjustinganything తీర్పరి, దిద్దుబాటు చేసేవాడు. the * of a field కాపవాడు.the * of a garden తోటమాలి. a servant in hospital డాక్టరు చేతికింద వుండే పనివాడు. a bench in a kitchen వంట యింట్లో సామానులు పెట్టుకొనే పలక, బల్ల.
Dressing n s వుడుపు, శృంగారము, సవరించడము, పక్వముచేయడము,పచనము. *s of a wound గాయము మీద కట్టేకట్టు. a * room బట్టలుతొడుక్కొనేగది. she gave him a good వాణ్ని బాగా చీవాట్లు పెట్టిందిmanual labour upon ground కృషీ, వ్యవసాయము.
Dressy adj అలంకారప్రియమైన. a * woman అలంకారప్రియురాలు.
Dribbing adj సోనగాకురిసే, జబ్బైన, లేనిపోని. a * rain సన్న చినుకు.
Dribblet n s రవంత, చిల్లర. there was a * of money remaining కొంచెము చిల్లర రూకలు నిలిచినది.
Dried adj యెండిన, శుష్కించిన, వరుగైన, యింకిన, యిగిరిన,వట్టిపోయిన. * fruit వరుగు.
Drift n s వేగము, వురువడి, దెబ్బ. the * of the river carried him away ఆ యేటి వేగములో వాణ్ని కొట్టుకొని పోయినది. * wood యేట్లో కొట్టుకవచ్చిన మానులు. a * of sand యిసుక దిన్నె,యిసుక కుప్ప, సైకతము. the aim of action ఉద్దేశ్యము. I do not see his * అతని తాత్పర్యము నాకు తెలియలేదు. To Drift, v. n. నీళ్లల్లో కొట్టుకొనివచ్చుట, తేలుతూ వొడ్డుకు వచ్చుట. the ship *ed ashore ఆ వాడ తనంతటనే గట్టుకు కొట్టుకొని వచ్చినది. the sand *ed much యిసుక కుప్పకుప్పలుగా అయినది.
Drill n s శిక్ష, సాధకము, దిద్దుబాటు, వరవడి, మేలుబంతి.they are in good * వాండ్లు చక్కగా శిక్షితులై వున్నారు, వాండ్లుబాగా తీరివున్నారు. a carpenter's tool బరమా, పిడిసాన. a *bow తొరపణము తిప్పే కొయ్య. a * plough వెదగొర్రు, గొర్తి,జడ్డిగెముగల గొర్రు. or ape కోతి.
Drilled adj కవాయితుచేసి తీరివుండే, సాధకపడ్డ, మెదిగిన.he has been well * in grammer వాడు వ్యాకరణమందు సుశిక్షుతుడై వున్నాడు.
Drink n s తాగే వస్తువ, నీళ్లు, పానకము, సారాయి మొదలైనవి.he gave them * వాండ్లకు దాహానికి యిచ్చినాడు. meat and * అన్నపానాదులు, అన్నోదకములు, కూడునీళ్లు. this story was meat and * to him యిది వాడికి అవలీలగా వున్నది.
Drinker n s తాగేవాడు, పానము చేసేవాడు.
Drinking n s తాగడము. a * cup పానపాత్రము, చషకము.* trough కుడితితొట్టి.
Drink-money n s కూలివాండ్లకు తాగడానకు బహుమానముగాయిచ్చే రూకలు.
Dripping adj తడిసిన, దొప్పదోగిన. * rain సన్నగా పడే తుంపర. it is * wet అదిముద్దగా తడిసివున్నది. a * day ముసురువాన పట్టిన దినము. Dripping-pan, n. s. నిప్పునవాడ్చే మాంసముమీద పోసే నెయ్యిపడడానకై కిందపెట్టే బోగిణి, చట్టి.
Drippings n s నిప్పునవాడ్చూతూ వుండే మాంసము మీద పోయగాజారిన నెయ్యి.
Dripstone n s నీళ్లు వడియకట్టే వొకతరహా రాతి మరిగ,యీమరిగలో నీళ్లు పోసి పెట్టితే బొట్లుబొట్లుగా కారుతున్నదిగనుక ఆ నీళ్లు అతి నిర్మలముగా వుంటున్నది.
Drive n s an excursion for pleasure in a cariage బండియెక్కి విహారముగా పోవడము, స్వారి. a road మార్గము. there is a* through the forest ఆ యడవిలో వొక బండి బాట వున్నది.
Drivel n s చొంగ, జొల్లు, లాలా.
Driveller n s యెంబన్న, వెర్రిముఖము.
Drivelling adj చొంగకార్చుకొనే. a * fool వెర్రిగొడ్డు. * nonsense వెర్రికూతలు, పిచ్చి సుద్దులు.
Driven part of drive తోలిన, తోలబడ్డ, కొట్టుకొనిపోయిన,పోబడ్డ. It was * into his flesh అది వాడికండలోకిదూసుకొనిపోయినది. the ship was * into this part by stress of weather అసాధ్యమైన గాలివానచేత ఆ వాడ యీ రేవుకువచ్చిచేరినది. I am * to do this నేను యిది చేయవలసి వచ్చినది, నేను యిది చేయకుంటే విధిలేక వచ్చినది. * snow పోగుగా చేరిన మంచుకుప్పలు. white as * show అదిధావళ్యమైన.
Driver n s తోలేవాడు, సర్దారు, నాయకుడు. a slave * లంపతావాండ్ల మేస్త్రి. a sail in a ship వాడ వెనుకటి నిడుపువాటుగా వుండే రెక్కచాప.
Drizzly adj తూరగా వుండే, చినుకులుగా వుండే.
Drnurse n s బిడ్డలను కాపాడేపనికత్తె. or guide యజమానుణ్ని చేతికింద వేసుకొనితిప్పే వాడు. he is * to the secretary పేరు సెక్రటెరిది పని వీనిది.
Drogoman n s (meant for Tarjuman) మునిషి, తర్జిమా చేసేవాడు,వ్యవహారకుడు, గుమాస్తా.
Droll n s హాస్యగాడు.
Drollery n s యెగతాళిపని, కూచోద్యము, వేడుక, హాస్యము,వెర్రిచేష్టలు.
Drollness n s యెగతాళి హాస్యము, కూచోద్యము, వెర్రిచేష్ట.
Dromedary n s పెద్దలొటిపిట, బేగిరావు.
Drone n s సోమారి, బద్ధకముగా వుండేవాడు, పనికిమాలిన వాడు.a sort of bee తేనే చేయని తేనీగ. in music శ్రుతి. a musical instrument used by snake-catchers పామునాగసరము.
Dronish adj బద్ధకముగల, జాగుచేసే, జబ్బైన.
Drooping adj నిస్త్రాణగా వుండే, నిస్సత్తువుగా వుండే, కుంగి వుండే.
Drop n s బిందు, చినుకు, కణము, బొట్టు. the least * of waterరవ్వన్ని నీళ్ళు. bring me a * of water రవ్వన్ని నీళ్ళు తీసుకరా.by *s బొట్లు బొట్లుగా. to pour * by * బొట్టు బొట్టుగా విడుచుట. a * or specific మందు. she wears *s in her ears అది జుమికీలు వేసుకొని వున్నది. A Hindu woman weras a * at the nose హిందూ స్త్రీలు బులాకు వేసుకొంటున్నారు. a * or shoot of a banyan tree,మర్రివూడ. a gallows * వురి తిసేవాణ్ని నిలవబేట్టి గొంతుకు వురి తగిలించి తట్టేపలక.
Dropped adj పడ్డ, విడిచిపెట్టిన, మానుకొన్న, జారవిడిచిన, రాల్చిన,రాలిన. the vowel U is * by elision సంధి వచ్చినప్పుడు వుకారము లోపిస్తున్నది. See the verb to drop.
Dropping adj పడే, కారే, స్రవించే, జారే, రాలే.
Dropsical adj మహోదర వ్యాధిగల, పాండురోగము గల.
Dropsy n s మహోదరము, పాండు.
Dross n s చిట్టము, లోహము లోని ముష్టు. * of iron యినుప చిట్టము. this is mere యిది పనికిమాలిన తుక్కు.
Drossiness n s కల్మషము. from the * of the silver యిదికందు వెండి అయినందున.
Drossy adj కల్మషముగల, మష్టుగల, కందు. because the silver was * కందు వెండైనందున.
Drought n s కరువు, క్షామము, అనావృష్టి.
Drove n s మంద, గుంపు, తండ, బిడారము. a * of catlleతోలుకొనిపొయ్యే పశువుల మంద. a * of laden bullocks పెరికేయెద్దుల బిడారు.
Drover n s పశువులు, మేకలు మొదలైన వాటిని తోలేవాడు,పశువుల వర్తకుడు.
Drowned adj మునిగిన నీళ్ళలో పడి చచ్చిన. the field is * ఆ పొలము నీళ్ళలో మునిగిపోయినది. her face was * in tears దాని ముఖము కన్నీరు మయముగా వుండినది. * in sorrow వ్యసనాక్రాంతుడైన. his voice was * in the uproarఆ సందడిలో వాని కంఠము వినబడలేదు.
Drowning n s నీళ్ళలో పడి చావడము.
Drowsily adv నిద్రమబ్బుగా, సోమారితనముగా.
Drowsiness n s నిద్రమబ్బు, కునికిపాటు, సోమారితనము.
Drowsy adj నిద్రమబ్బుగా వుండే. I was * నాకు నిద్రమబ్బుగావుండినది.
Drubbing n s పులమడము, మొత్తడము, బాదడము. they gavehim a good * వాణ్ని బాగా పులిమి విడిచిపెట్టినారు. he got a sound * వాడికి మంచి దెబ్బలు తగిలినవి.
Drudge n s దాసుడుగా పనిచేసేవాడు, వెట్టికి పాటుపడేవాడు, అమిజికి పనిచేసేవాడు. a village * or serf వెట్టివాడు.
Drudgery n s హీనవృత్తి,నీచపని, గులాపుపని, వెట్టిపని.
Drudgingbox n s See Dredging box.
Drug n s మందు దినుసు, మందు సరుకు. a fatal * చచ్చేటందుకు తాగే విషము. or opium నల్ల మందు the fragrant * or tobacco పొగాకు. those books are now a mere * యిప్పుడు ఆ పుస్తకముల ముఖము యెవరు చూచేది లేదు.
Drugget n s గొంగళి, ముతకగుడ్డ.
Druggist n s మందుల అంగడి వాడు. a * s shop గంధపొడి, మందులు మొదలైనవిఅమ్మే అంగడి.
Druid n s పురోహితుడు, అనగా యింగ్లీషు వాండ్లు క్రైస్తువులు కాక మునుపు, విగ్రహ పూజ చేస్తూ వున్నప్పుడు వాండ్ల పురోహితులకు యీ పేరు వుండినది.
Drum n s డోలు, తంబురా. a large * పెద్దతంబురా, భేరి. a tomtom or Indian * తడుము. a kettle * డమారము, నగార. a sort of * beaten with the fingers మద్దళము, మృదంగము. "the *s of heaven resounded" i.e. "it thundered" దుందుభులు మ్రోసినవి. the * of the ear చవిలోగూబ. they held a court martial on the * head తంబురా దగ్గిరనే కూర్చుంది తీర్పు చేసినారు, అనగా దండులో నిలిచిందినిలిచినట్టే తక్షణము కోర్టుకూడి తీర్పుచేసి నారని అర్థము.
Drumkard n s తాగుబోతు, లొట్టిముచ్చు.
Drummajor n s తంబురా వాండ్లలో పెద్ద.
Drummer n s తంబురా కొట్టేవాడు, వీడు దండులో నేరస్థులను కొరడాతో కొట్టుతాడు.
Drumstick n s తంబురాకొట్టేకొయ్య. of a fowl కోడికాలి జంఘము.
Drumstick vegetable n s మునగకాయ.
Drunk adj imbibed తాగిన. the medicine that was * తాగినమందు, పుచ్చుకొన్నఅవుషధము. intoxicated తాగిన మయకముగా వుండే, మత్తుగా వుండే. he is *తాగిమయకముగా వున్నాడు. he got * తాగిమయకముగా వుండినాడు. after the cow has *ఆవు నీళ్ళు తాగిన తరువాత. * with rage ఆగ్రహము చేత తెలివితప్పిన.
Drunkenness n s మత్తు, మయకము, కయిపు.
Dry adj and adv. యెండిన, శుష్కించిన, ఆరిన, యింకిన, వట్టిపోయిన.a * lime యెండిన నిమ్మకాయ. he wiped it * తడిలేకుండా తుడిచినాడు. * bread వట్టి కూడు, శుష్కాన్నము అనుపానము లేని కూడు the * season యెండకాము, వరుపు, a * day చినుకులేని దినము. a* month వర్షము కురియని నేల. a * cough పొడిదగ్గు. I am * నాకు దాహముగా వున్నది. why should I drink when I am not * దాహము లేనప్పుడు నేనెందుకు నీళ్ళుతాగేది. they milked the cow * ఆ యావును వట్ట పిండినారు. the cow is gone *ఆ యావు వట్టి పోయినది. a * cow వట్టి పోయిన ఆవు. there was not a * eyepresent అక్కడ వుండిన వాండ్లలో కండ్ల నీళ్ళు పెట్టనివాండ్లు లేరు. a dispositionక్రౌర్యము. a * remark విరసమైనమాట, పెడసరమైనమాట. * humour హాస్యగర్భమైన సరసోక్తి, అనగా పైకి న్యాయము అగుపడేది, పట్టుగావిచారిస్తే వట్టి యెగతాళిగా వుండేమాట. this book is written in a * style యీగ్రంథము నీరసముగా రచించబడివున్నది. or acrid as wine వొగరైన, కటువైన.* cultivation కాడారంభము, మెట్ట సాగుబడి. * land తీరము, రేవు, పొడినేల. Dry landproduce (such as wheat, barley, zonna & c.) మెట్టపంట. See wet land prduce a *leaf సరగు, యెండు టాకు. * measure ధాన్యము, పప్పు మొదలైన వాటిని కొలిచే తూము మొదలైన కొలత లెక్క. a * well నీరువట్టిపోయిన బావి. to squeeze * రసములేకుండాపిండుట. high and * మెట్టన వుండే. the boat was left high and * పడవ కట్టమీదను వేసి వుండినది.
Dryly adv విరసముగా, క్రూరముగా, అసహ్యముగా.
Dryness n s యెండడము, యెండిపోవడము. * of taste వొగరు. * of humour భావగర్భితమైన హాస్యము. * of manner పెడసరము, మూర్ఖము.
Dry-rot n s a rapid decay of timber: by which it'ssubstance is converted into a dry powder: the timber beingfull of small holes, పుచ్చడకము, పుప్పిపట్టడము. as this woodhas the dry-rot యీ కొయ్య పుచ్చినందున.
Drysalter n s A dealer in. s.lted or dried means, sauces, oils, pickles, and various other articles వుప్పువేసిన, లేక , యెండేబెట్టిన మాంసము, వూరగాయలు మొదలైనవ్యాపారము చేసేవాడు.
Dryshod adv అరికాలు తడవకుండా. he went over the river * వాడు అరికాలు తడియకుండా యేరు దాటినాడు, అనగా యేటిలో బొత్తిగా నీళ్ళు లేదనే భావము.
Duad n s (a platonic phrase) ద్వైతము, ద్వంద్వము.
Dual n s ద్వివచనము. there is no * in Telugu or English తెలుగులో గాని యింగ్లీషులో గాని ద్వివచనము లేదు.
Dub n s a blow, a knock దెబ్బ,వేటు,పెట్టు. rub a * * తంబురా ధ్వనిని గురించి అనుకరణశబ్దము.
Dubber n s ( Indian word ) సిద్దె. for oil నూనెసిద్దె.
Dubious adj సందేహమైన, . అనుమానముగా, , సందిగ్దముగా.
Dubiousn. s. n s సందేహము. from the * of the busin. s. యిది సందేహగ్రస్తమైన పని గనక.
Ducal adj సేనాధిపతి సంబంధమైన. he is of * rank సేనాధిపతిఅనే పేరు అతనికి కలదు, పుట్టుక చేతనే కాని ఉద్యోగము చేతకాదు. all the king *s younger sons and their wives are of * rank రాజు యొక్క చిన్న కొడుకులకున్ని వాండ్ల భార్యలకున్నుయీ కితాబు కలదు. see duke.
Ducat n s ఒక తరహావరహ. * gold అపరంజిబంగారు.
Duchess n s దొరసాని,అనగా Duke యొక్క భార్య.
Duchy n s Duke అనే అధికారి యేలిన రాజ్యము యిప్పుడుయిది వట్టి కితాబు అయిపోయినది. the * of lancaster లాన్ కష్టరనేజమీందారి అనగా రాజ్యము.
Duck n s పొట్టి బాతు, దీనిపుంజు. Drake అనబడుతున్నది. the wild * చిలువ, అడివిబాతు. the black tufted నల్లచిలువ. the comb* జుట్టు చిలువ. the braminy * బాపనకోడి. a wordpf fondn. s. స్త్రీని గురించి ముద్దుపేరు. he gavea * with bis head లటుక్కున తలవంచుకొన్నాడు. a kind of cloth ఒకతరహా ముతక గుడ్డ.
Ducked adj ముణిగిన. he was * వాడు నీళ్లలో మునిగినాడు. యిది ఎగతాళి మాట. I was completely * నేను దొప్పదోగ తడిసినాను.
Ducking n s మునగడము, దోప్పదోగడము. I got a complete * దొప్పదోగ తడిసినాను.
Ducklegged adj దొడ్డికాళ్లు.
Duckling n s బాతుపిల్ల.
Duckmeat n s నీళ్లలో పయిరు అయ్యే ఒక తరహా గడ్డి.ఒక తరహా పాచి.
Duct n s నరము. బోలునరము.
Ductabiltiy n s ( gentelen. s. ,obedience, tractbilitygoodn. s. ) శాంతము , మంచితనము. See cowper ;s letters16 th June 1789.
Ductile adj నయమైన, అనగా మంచిబంగారువలే సాగే,వెట్టకాని. infancy is *,బాల్యమందు . ఎట్లా తిప్పితేఅట్లా తిరుగుతున్నది,
Ductility n s నయము. gold shews great * బంగారులోనయ మధికము.
Dudgeon n s displeasure అసహ్యము. he took in it * ఇదివినిఅసహించినాడు, రేగినాడు.
Due n s బాకి, అప్పు., ఋణము. రావలసినది. he got his * వాడికి న్యాయముగా జరిగినది. అనగా వాడికి తగిన బహుమానముగానితగిన శిక్ష గాని అయినదని భావము. *s or fees మేర. వర్తన,.వచ్చుబడి. a list of his debts and his *s తాను ఒకరికిఇవ్వవలసినదిన్ని తనకు ఒకరివల్ల రావలసినదన్ని వ్రాసివుంటేపట్టి. the *s of tenden. s. సాత్వికధర్మము. to give him his * heis hon. s. వాడు పెద్దమనిషి అనడము దర్మమే.
Duel n s ద్వంద్వ యుద్దము. అనగా అవమానము పడ్డవాడు.అవమానము చేసినవాడున్ను కత్తితోగాని పిస్తోలుతోగానిచేసే జగడము.
Duelling n s ద్వంద్వ యుద్దవాడికి, అనగా, అవమాన పడ్డవాడు.అవమానము చేసినవాడున్ను కాల్చుకునేవాడికిగాని నరుక్కునేవాడికిగాని అనిఅర్థము.
Duellist n s ద్వంద్వ యుద్దమచేసేవాడు. see duel.
Duenna n s పేద్దతలగా ఉండేటిది. or housekeeperఇంటియజమానురాలు.
Duet n s ఇద్దరుగా పాడేపదము.
Dug n s presterit and part pass of Dig
Duke n s సేనాధిపతి. he is a * వానికి సేనాధిపతిఅనే పేరు గలదు ఇది పుట్టుకచేత వచ్చినపేరుగానిఉద్యోగమువల్ల వచ్చినది కాదు. the * of york సీమరాజు యొక్కరెండోకొడుక్కు వుండే కితాబు. he dined with * humphryవాడు ఆకాశరామయ్యతో బోజనము చేసినాడు అనగా పస్తు వున్నాడు.
Dukedom n s duke అనే అధికారము.
Dulcet adj సరళమైన,మాధుర్యమైన. * notes సుస్వరములు.శ్రావ్యమైన స్వరములు.
Dulcimer n s ఒక తరహా వీణ,. సితారా.
Dull adj మందమైన, జబ్బైన. ముద్దైన,. మొండి,. కాంతివిహీనమైన,.మకమకలాడే., a * fellow జడుడు, మందుడు. the lampburns * దీపము మకమకలాడుతున్నది. the fire *s * నిప్పు రాజలేదు.*red మడ్డిఎరుపు. he is *of hearing,వాడికి చెవులుమందము,the knife is * ఆకత్తి మొద్దుగా ఉన్నది. a * day మసుపుగాఉండే దినము,
Dumb adj మూగైన. నోరులేని a *(man మూగవాడు.a a * animalనోరులేని జంతువు . struck *మానుపడ్డ. .this struck him * ఇందుచేత వైరుగుపడి మాన్పడ్డాడు.*shew మూగసైగ. * bells లోడిలు. he plays with * bellsవాడులోడీలు తిప్పుతాడు.dumbfounded , dumbfoudered adj. మానుపడ్డ, ఆశ్చర్యపడ్డ.
Dumbn. s. n s మూగతనము. నిశ్శబ్దము.Dumby, adj. at cards నలుగురు ఆడవలసిన కాకితాల ఆటనుముగ్గురుగా వుండి ఆడడములో ఇద్దరు రెండు చేతులు ఆడగాకడమ రెండు చేతుల ఆఠను ఒకడుగా ఆడే ఆట.
Dumpish adj వ్యాకులముగల;, జడమైన మొద్ధైన/
Dumpling n s సుగయ, సుగియ, పూర్నము. కుడుములు,సంకటి./apple* s సుగయలు. mutton *s మాంసపు సుగయలు.
Dumps n s వ్యాకులము, వ్యసనము.విచారము. he was in the *అసహ్యపడ్డాడు. చీదరపడ్డాడు. నోరెత్తడు. ఇది నీచమాట.
Dumpy adj పొట్టియైన, గిడ్డైన. కురచైన. a * woman పొట్టిది.
Dun n s గోజాడేవాడు. తరువుకాడు.తరువుచేసేవాడు. నక్షత్రతరుపుచేసేవాఢు, తగాదా చేసేవాఢు H.
Dun. s. or Downs n s ఇసుక దిన్నెలు , పోకీళ+లు.See Madras Journal IX 309.
Dunce n s జడుడు, మొద్దు. చదువురానిపిల్లకాయ, మూడుడు.Iam a * at cards ఎంత చెప్పిచ్చినా నాకు కాకితాలాట రాలేదు.
Dunderhead n s పిచ్చి గొడ్డు, ఇది ఎగతాళిమాట.
Dung n s మలము,. పియ్యి,. of sheep or goats పెంటిక,
Dungagree n ,s (a sort of canvas )దంగిడి . This is a bombay
Dungeon n ,s చెరసాల, నేలకిందఉండే చేరసాల, బందేకానా. In the *of hell నరకకూపమందు. he is a perfect * of learningవిద్యాసముద్రుడు.
Dunghill adj (base , cowardly) తుచ్చమైన, జడిసిన, పిరికి,నీచమైన. * fowls పెరిటికోళ్లు.
Dunghill n. s పేడకుప్ప,పెంట, he died on a * వాడు అనాధ]ప్రేతమై చచ్చి కుక్క నక్క ఈడ్చుకునిపోయినది. he is on his own *what can I do వాడిచేత అధికారము ఉన్నది నేనేమిచేతును.every fool is proud on his own ఎంత అల్పుడైన తన చేతికిందవుండే వాండ్లమీద తనమహిమలను చూపిస్తాడు గేహేశూరః the creaturesof his own * తన చేతికిమద అనాధపక్షులు,భృత్యులు.
Dunnage, Dunning n s. in ships వాడలలో సరుకులు పొలనకుండానడిమికి బిగించే తాళ్లు.
Duo n s ఇద్దరు పాడేపదము.
Duodecimo n s ఒకతరహాచిన్నబొక్కు. అనగా ఒక తావు కాకితము.ఆరుమడతలుగా ఉంటున్నది.
Dupe n s ఏమరినవాడు. మోసపోయినవాడు. I was his * నేనువాడిచేత మోసపోయినాను. వాడిచేత గడ్డితిన్నాను.
Duped adj ఏమరిన, మోసపోయిన, మాయలో చిక్కిన.
Duping n s ఏమార్పు,మోసము. పితలాటకము.
Duplex adj see Double,.
Duplicate n s జత. these keys are duplicates యీ బీగము ఆబీగముసరి. a pawn brokers * కుదువపెట్టుకొన్నవాడు.యిచ్చే చీటి. I sent my bill in * వాడికి హుండి రెండు ప్రతులుగాపంపించినాను. he wrote the letter in * ఆజాబును రెండుప్రతులుగా వ్రాసినాడు:.
Duplicity n s మాయ, మోసము, కుట్ర, పితలాటకము.
Durability n s అక్షయత్వము, శాశ్వతము, స్థిరత, నిలకడ,దార్డ్యము. horn has great * కొమ్ముదినాలపేరట వుంటున్నది.
Durable adj శాశ్వతమైన, స్థిరమైన, దినాలపేరటవుండే,బలమైన, గట్టి. silk is more * than cotton గుడ్డకంటే పట్టుకట్టు తాళ్ళున్నది. this cltoh is not * యీ బట్టకట్టుతాళదు.
Durably adv స్థిరముగా, దృఢముగా, గట్టిగా, బలముగా.
Durance n s కావలి, కయదు. he was held in * వాడికికావలిలో వుండినాడు.
Duration n s కాలము, కాలపరిమాణము. what was the * of his reign? వాడు యెన్నాళ్ళు ప్రభుత్వము చేసినాడు. endless * నిత్యత్వము. an illness of long * దీర్ఘరోగము. a life of long* దీర్ఘాయువు. a life of short * అల్పాయువు. a war of long * బహుదినాలు జరిగిన యుద్ధము. an illness of a certain * కొన్నాళ్ళువుండిపొయ్యే రోగము.
Duresse n s కావలి, కైదు.
During prep లో, అప్పుడు, పర్యంతము, దాక. * youth బాల్యమందు,బాల్యములో. * sleep నిద్రలో. * this month యీ నెలంతా. * nextవచ్చేనెల కడవేళ్లా. * this యింతలో. * the day సాయంకాలముదాకా.* my stay నేను వుండేటప్పుడు. * meals తినేటప్పుడు, భోజన కాలములో.
Durst (thepastofDare) తెగించినది, I * not to go there అక్కడికి పోను జడిసినాను. he told me I might go if I * తెగించి పొయ్యేటట్టైతే పొమ్మన్నాడు.
Dusk n s చీజీకటి, సందెచీకటి. he came at * దీపాలు పెట్టేవేళకు వచ్చినాడు. in the * of the morning తెల్లవారి చీజీకటివేళలో. It appeared in the * అది చాయగా అగుపడ్డది.
Duskily adv చీజీకటిగా, చాయగా, జాడగా, లీలగా.
Duskiness n s చీజీకటి. from the * of her skin దాని శరీరమునలుపైనందున.
Duskish adj రవ్వంత నల్లని, రవ్వంత చీకటి.
Dusky adj నల్లని, ధూసరమైన, ధూమ్రమైన, చాయగా అగుపడే, లీలగాఅగుపడే. or dark complexion నల్లని చాయగల.
Dust adj దుమ్ము, దూళి, బుగ్గి, నుసి. to beat to * చూర్ణముచేసుట. gold * బంగారుయిసుక. for our body is * మన శరీరముమృత్స్వరూపము గనక. this is mere * in the balance యిది తృణప్రాయము.
Duster n s (a towel) దుమ్ము, తట్టే గుడ్డ.
Dustman n s కుప్పవాడు, వీధులు వూడిచేవాడు.
Dusty adj దుమ్ముగా వుండే, మురికైన, ధూళీధూసరితమైన.
Dutch adj ఒలందా దేశ సంబంధమైన. a * man ఒలాందా వాడు. a * Venus పొట్టిపడుచు.
Dutches adj దొరసాని. See Duchess.
Dutchy n s See Duchy.
Duteous adj సద్భక్తిగల, వినయవిదేయతగల, నమ్రత గల.
Dutifully adv సద్భక్తిగా, వినయవిధేయముగా, నమ్రతగా.
Dutifulness n s సద్భక్తి, వినయవిధేయత నమ్రత.
Duty n s ధర్మము, విధి, పని, భారము. It is your* to obey ఆజ్ఞ ప్రకారము నడుచుకోవలసినది నీ ధర్మము. thisis a disagreeble * విధిలేక చేయవలసివచ్చిన పని. * obliged him to go abroad పని వల్ల అతనికి పరదేశమునకుపోవలసివచ్చినది. an unavoidable * తీరనికర్మము చేయక విధిలేక వచ్చిన కర్మము. the * or office of General సర్వసేనాధిపత్యము.the duties of friendship స్నేహ ధర్మములు. public * సర్కారువుద్యోగము. filial * పుత్రులు మాతా పితృవిషయములయందు వుంచవలసిన ధర్మము.paternal * తల్లిదండ్రులకు బిడ్డల యందు వుంచవలసిన ధర్మము. daily duties ప్రతి దినము చేయవలసిన పనులు, నిత్యకృత్యములు. the guardis now upon * సిపాయిలు పారామీద వున్నారు. he is now off * వాడి పారా అయినది. after he paid his * or respects to his parents తల్లిదండ్రులకు చేయవలసిన మర్యాధలు చేసి present my * to him అతనికి నా దండము చెప్పు, నా సలాము చెప్పు. duties at church పూజ. after the duties of the toilet శృంగార విధులు, దీర్చుకొని.the * paid on goods తీరువ, సుంకము.
Dwarf n s మరుగుజ్జు, గుజ్జు వామనుడు, పొట్టివాడు, గిడ్డవాడు, గిటకవాడు.
Dwarfed adj మరుగుజ్జుగా వుండే, గిటకగా వుండే, పొట్టిగా వుండే.
Dweller n s నివాసము చేసేవాడు, కాపురముండేవాడు.
Dwelling n s నివాసము, వునికిపట్టు, యిల్లు, బస, గృహము. he madehis * on the mountain కొండమీద వాసము చేసినాడు.
Dwellinghouse n s కాపురము వుండే యిల్లు, కాపురము చేసే యిల్లు.
Dwellingplace n s నివాస స్థలము.
Dwindled adj ఉడిగిన, వూచపోయిన, క్షయించిన. the estate has * away ఆ యాస్తి యేమి లేకపోయినది.
Dwt n s అనగా Pennyweight.
Dye, or Die n s. చాయ, రంగ, వన్నె, అద్దకము. applied to the teethకప్పు. crimes of the deepest * మహత్తైన పాపములు.
Dyeing or Dying n s (of colour) అద్దకము, చాయవేడము. (of death)మరణము.
Dyeing, or Dying adj of colour అద్దకము చేసే of death చచ్చే.a * vat అద్దకము చేసే తొట్టి. * accents హీనస్వరము. * words అవసానకాలమందు చెప్పేమాటలు. the * notes of the trumpet తుతారాస్వరము యొక్క అవరోహనము.
Dying P||(of colouring) అద్దకమునుగురించిన, a * vat చాయవేశేతొట్టి.
Dyke n s See Dike.
Dynamics n s యంత్రశాస్త్రము.
Dynasty n s దొరతనము, ప్రభుత్వము, అధికారము, రాజవంశము. the kuru * కురు వంశము.
Dysentery n s అతిసారము, గ్రహణి.
Dyspepetic adj అజీర్ణ సంబంధమైన. * symptoms అజీర్ణ లక్షణములు.
Dyspepsy n s అజీర్ణము.
Dysury n s మూత్రకృచ్రము నీరడపు, నీరుచురుకు.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

1 comment:

  1. Hmm is anyone else having problems with the pictures on this blog loading?
    I'm trying to determine if its a problem on my end or if it's the blog.
    Any feedback would be greatly appreciated.

    my site - laser cellulite treatment

    ReplyDelete