B English to Telugu free online dictionary

B.A. the contraction of Bachelor of Arts విద్వాంసులకిచ్చే ఒక త, ఖ్రీస్తుపుట్టకమునుపు, B.L. Bachelor of Laws విద్వాంసులకిచ్చే ఒక తరహా పట్టము.
Baa n s బా అని మేక కూత.
Baal n s ఆకాశ భైరవుడు, భేతాళుడు. See Adam Clarke, on Judges 2.11.
Bab interj ఛీపో అనే ధిఃకారశబ్ధము.
Babble n s వదురు, పిచ్చి కూత, పిచ్చి మాటలు.
Babbling n s వదురు, పిచ్చికూత, పిచ్చిమాటలు.
Babe n s బిడ్డ, శిశువు, కూన.
Babel n s కలవరము.They attempted to build the tower of Babel up to the skies వాండ్ల ప్రయత్నమును చూస్తే రాయగోపురమునకు అడుగు వేసినట్టు వుండెను. అనగా, బ్రహ్మాండమైన ప్రయత్నము, కొనసాగదని భావము. The tower of Babel బేబెల్ బురుజు అనగా జలప్రళయమునకు తర్వాత మనుష్యులు అత్యున్నతమైన గోపురమును కట్టడమునకు యత్నపడినంతలో దేవుడికి కోపము వచ్చివొకడిమాట వొకనికి అథ ్ము కాకుండా పొయ్యేటట్టు చేసినందు మీదట ఆ ప్రయత్నము భంగమైపోయినదని బైబిలు మొదటి కాండలో ఒక కధ వున్నది.
Baboon n s గండుకోతి, తిమ్మడు.
Baby n s బిడ్డ, శిశువు. * linen పొత్తిగుడ్డలు.
Babyish adj బాలిక, పిల్ల, బాల్య, లేత, పిచ్చి.
Bacchanal n s తాగుబోతు.
Bacchanalia n s plu. Bacchus యొక్క వుత్సవము.
Bacchanalian n s Bacchus అనే దేవుని యొక్క వుత్సవములో తాండవమాడేవాడు.
Bacchus బలరామనామము,తాగుబోతులదేవుడు
Bachelor n s పెండ్లి లేనివాడు, బ్రహ్మచారి, ఒంటిగాడు. at the Universityపాఠశాలలో విద్యార్ధులకు యిచ్చే మొదటిపట్టము.
Bachelor's button n s Name of a flower వాసన లేని ఒక తరహా పుష్పము.
Back adj వెనకటి. the * way వెనకటిదారి, పెరటిదోవ.
Backbiter n s చాడీలు చెప్పేవాడు, కొండాలమారి.
Backbiting n s చాడీ, కొండెము, యిల్లామల్లితనము.
Backbone n s వెన్ను యెముక. he was a rogue to the *వాడినిలు వెల్లావిషము.
Backdoor n s దిడ్డి వాకిలి.
Backgammon n s చొకటాలవంటి ఒక తరహా ఆట. a * board యీ ఆట ఆడేపలక.
Background n s in a picture పరస్థలము. they kept this account in the * యీ సంగతిని మర్మముగా వుంచినారు. he remains in the *అప్రసిద్దుడై వున్నాడు.
Backhanded adj పెడచెయ్యి వాటమైన.
Backpiece n s వీపుజీరా.
Backside n s the rear వెనకపార్శ్వము. the buttocks పిరుదులు, ముడ్డిor yard of a house పెరడు.
Backslider n s భక్తిలో వెనక్కు తీసినవాడు, భక్తి తగ్గినవాడు.or apostate ఆరూఢపతితుడు.
Backsliding n s భక్తి తగ్గడము.
Backstairs n s వెనకటితట్టువుండేమెట్లు, మరుగుదారి.
Backward adj జబ్బైన, మందమైన, జడమైన.this child is * in reading యీపిల్లకాయ చదువులో జబ్బుగా వున్నాడు. a * confession అర్దాంగీకారము. I was * to believe this దాన్ని నేను నమ్మడానికి అనుమానిస్తిని.
Backward, Backwards adv వెనక్కు, తల్లకిందులుగా, విలోమముగా, జబ్బుగా.he fell backwards వెల్ల వెలకల పడ్డాడు. he has gone backwards in his reading చదువులో వెనకపడ్డాడు. It was written backwards ముద్రాక్షరమురీతిగా వ్రాయబడ్డది, యిట్లావ్రాసిన దాన్ని అద్దములో చూస్తే సరిగ్గా తెలుసును. Reading a spell * ఒక మంత్రమును తల్లకిందులుగా చదవడము.To go * మరుగు పెరటికి పోవుట, అనిన్ని కొన్నిచోట్ల అర్ధమౌతున్నది. యీ అర్ధము యిప్పట్లో వాడికలేదు.
Backwardness n s Unwillingness అసమ్మతి, అనంగీకారము. dullness మాంద్యము, జబ్బు. Backwater, n. s. కయ్యి
Backyard n s పెరడు.
Bacon n s పంది మాంసము, అనగా వుప్పు వేసి పొగనుకట్టిన పంది మాంసము.he saved his * తప్పించుకొన్నాడు.
Bad adj చెడ్డ, కాని, దుష్ట, పనికిమాలిన. * qualities దుర్గుణములు he is very * to-day, or he is very ill to-day యీ వేళవాడికి వొళ్ళు నిండా కుదురులేదు. he wants it very * వాడికి అది నిండా ఆగత్యముగా కావలెను. I know nothing about it good or * అది పుణ్యమో పాపమో నే నెరగను you are quite as * as he వాడెంతోనీవంతే.this objection is * యీ మాంసము మురిగిపోయినది, చెడిపోయినది. * advice or council దుర్బోధన. * coin తప్పునాణెము. he was in * circumstances దరిద్రుడై వుండినాడు. a * debt చచ్చుబాకి.* English తప్పుయింగ్లిషు. * fortune దౌర్భాగ్యము, గ్రహచారము. owing to my bad fortune నా దౌర్భాగ్యమువల్ల. he did it with a * grace దాన్ని అసమాధానముగా చేసినాడు. A * man దుష్టుడు.* character అపకీర్తి. * conduct దుర్నడత, దుర్మార్గము. he set his son a * example తాను దుర్మార్గముగా నడిచి తనదుర్గుణములు కొడుకుకు పట్టుపడేట్టుచేసినాడు. * faith ద్రోహము. * health అస్వస్థము. he has a * hand వాడికి చెయ్యి వుపద్రవముగా వున్నది. he is a * hand at reading వాడికిచదువను చేత కాదు. * humour కోపము, చిరచిర. I saw he was in a * humour వాడు మంటగా వుండినట్టు వుండెను. * humours in the bo dy పులినీళ్ళురసిక. he did me a * office నాకు ఒక అపకారము చేసినాడు.* sign దుర్నిమిత్తము, దుశ్శకునము. * symptom దుర్లక్షణము.the style of this poem is in * taste యీకవి చెప్పినది విరసముగావున్నది. * temper అలిగేభావము, దుర్గుభము, మూర్ఖము. they are on * terms వాండ్లు ఒకరికొకరు విరోధముగావున్నారు. Being on * terms with meనా మీద గిట్టక. * times దుష్కాలము, చెడ్డకాలము. a * tooth పుచ్చినపల్లు. * weather మబ్బు మందారము, వానఘాలి.
Badaubed adj పూయబడ్డ.
Bade thepastofBid ఆజ్ఙాపించినది, he * me go నన్ను పొమ్మన్నాడు.I * him go there or I bid him go there వాణ్ని అక్కడికి పొమ్మన్నాను.he bade them to dinner వాండ్లను భోజనానికి పిలిచినాడు.
Badge n s గురుతు, చిహ్నము, బిరుదు. the * worn by a Policemanబిళ్ళ.
Badger n s కొంచెము కుక్కరీతిగా కొంచెము పందిరీతిగావుండేఒక మృగము, యిదినీళ్ళలో నున్ను గట్టుమీదనున్ను సంచరించేటిది, చెడ్డకంపుకొట్టేది; కొంచమున చావని మొండిజంతువు. In the Tamil Bible and in the Bengali version the Hebrew word Taghas is used.
Badinage హాస్యము,యోగతాళి
Badly adv చెరుపుగా, జబ్బుగా.
Badness n s చెరుపు, చెడ్డతనము, దుష్టతనము. from the *of the writing ఆ వ్రాలు బాగావుండనందున. from the *of the wether మబ్బు మందారము చినుకుచిత్తడిగా వున్నందున.
Bag n s సంచి, తిత్తి, గోతాము. a. * of rice గోనెడు బియ్యము. a gunny * గోనెసంచి. a pair of bullock bags కంట్లము,పెరికె. a nose * for feeding horses తోపరా. a * of muskకస్తూరివీణె. an ornament for the hair పూర్వకాలమందు గొప్పదొరలు అలంకారానికి జడతీరుగా కట్టుకొన్న సంచి.
Bagatelle n s a trifle అల్పము, స్వల్పము, కొంచెము. a name of agame ఒక ఆట పేరు. this a mere * యిదివొట్టి అప్రయోజకము.
Baggage n s సామాను, సరంజాము. his * filled ten cartsఅతని సామాను పదిబండ్లు నిండింది. she is a drunken *అది తాగుబోతుముండ. a sly * నంగనాచి ముండ. in plu.Baggages లంజలు, గుడిసెవేట్లు.
Bagman n s or hawker ఆకరు. or man that carries a bagమూటమోసేవాడు.
Bagnio n s Bath స్నానము చేసే యిల్లు. or bowdy houseభోగము దాని యిల్లు.
Bagpipe n s తోలుసుతి, తిత్తిసుతి, స్కాట్లాండు దేశపు ఒక తరహా సన్నాయి.
Bagpiper n s తోలుసుతి వూదేవాడు.
Bailable adj జామీనుమీద విడవతగ్గ. a * offience జామీను తీసుకొనివిడిచిపెట్టతగ్గనేరము.
Bailiff n s కోర్టుబంట్రోతు, సార్జంతు. the high * or Chief Magistrateపెద్దమేజిస్ట్రేటు అధికారి. the * or Superintendent of an estateపయిరుపచ్చ విచారించుకొనే మణియగాడు.
Bailiwick n s సరహద్దు, తుకుడి, పేట.
Bait n s ఎర, తీపి, మజిలిలో పెట్టేదాణా. they stopped togive * to their beast గొడ్లకు దాణా పెట్టడానకై నిలిచిరి.
Baize n s ముతకనగళాతు, గొంగళి.
Baked adj కాల్చిన, వేపుడు. * rice వేపుడు బియ్యము.
Bake-house n s రొట్టెలు కాల్చేయిల్లు, రొట్టెల గిడ్డంగి.
Baken adj కాల్చబడ్డ.
Baker n s రొట్టెలు కాల్చేవాడు. sugar * బెల్లముకాచేవాడు.
Baking n s ఒక తడవ కాల్చినది.
Balance n s a pair of scales త్రాసు, తక్కెడ.when you walk on a pole you must keep your * ఒక బొంగుమీదనడిచేటప్పుడు యిటూ అటూ వొరగరాదు. keep your * or you willfall వొరిగితే పడుతావుసుమీ. an even weight సరితూనిక. *in a watch ఘడియారములో ఒక భాగము. or remainder నిలువ,మిగత, బాకి, అవశిష్టము. net * నికరమైన బాకి. he struckthe * బాకి. he struck the * బాకితేల్చినాడు. a * sheetజమాఖర్చులెక్క. Libra of the Zodiac తులారాశి. * of powerసమాధికారము. * of trade సమవ్యాపారము, సమవర్తకము.
Balanced adj సరితూగే. a * account బాకి దేలినలెక్క. this evil is * by that good యీ చెరుపుకు ఆ మంచికి సరిపోయినది.
Balcony n s వసార, బ్రాందా, అంముగా వుండడానకై మిద్దె జనలకుముందర బయిటికి వొత్తించి, యినుము, కొయ్య, లేకరాతిలో కట్టిన బ్రాందా.
Bald adj బోడి, బట్ట, వెంట్రుకలు రాలిబట్ట కట్టిన. of style జబ్బైన, నీరసమైన, పేలవమైన. a * head బోడితల, బట్టతల.a * style జబ్బు పాకము. this is a very * accountయిది తలాతోకలేని సంగతి.
Balderdash n s సంకరము, కొంటెకూతులు.
Baldness n s బోడి. of style జబ్బుతనము, పేలవము.
Baldric n s కటిబంధము. Dz. దట్టి, నడికట్టు.
Bale n s కట్ట, మూట, బస్తా, నగ.
Baleful adj వ్యసనకరమైన, విషమైన చేటుదెచ్చే, నాశకారియైన.their * example ruined him వాండ్లకు వచ్చినచేటు వీడికిన్నివచ్చినది. * influence నాశకారియైనశక్తి.
Balk n s disappointment నిరాశ. a beam దూలము. betweenfields దున్నకతుండుగా నిలిచి పోయిననేల.
Ball n s పూట, జామీను, పూటబడ్డవాడు . I stood * for him నేను వాడికి పూటబడితిని. personal * నఫరుజామీను. he found *వాడు జామీను యిచ్చినాడు. at circket పుల్ల, పుడక.
Ballad n s సామాన్యమైన పదము, నారుపాట. A * singerబొబ్బిలి కధలవంటివి, నారు పాటలవంటివే పాడేవాడు.
Ballast n s అడుగుబరువు, తాపి, అనగా వాడపొర్లకుండా వుండడానకై అడుగున వేసే రాయిరప్ప మొదలైనబరువు.
Ballasted adj అడుగుబరువుగల, అనగా వాడ పొర్లకుండా అడుగునరాయిరప్ప వేసి బరువుగావుండే.
Ballet n s a kind of dance perfomed by public actors వేషగాండ్లుఆడే ఒక తరహా లజ్జలేని ఆట.
Ballon n s పొగగుమ్మటము.
Ballot n s ఉండలువేయడము, అనగా ఒకణ్ని ఒకసభలో ప్రవేశ పెట్టడానకుసభలో వుండేదొరలలు ప్రతిమనిషిన్ని ఒక పెట్టలో తెల్లవుండనైనా నల్లవుండనైనా వేస్తారు, తెల్లవుండలు నిండ్డావుంటే అతణ్ని ప్రవేశ పెట్టుతారు,నల్లవుండలు అధికముగా వుంటే అతణ్ని ప్రవేశపెట్టరు, దీనికిBallot అనిపేరు.
Ball-room n s నాటకశాల
Balm n s consolation ఓదార్పు, ఉపశంతి, ఉపశమనము. Medicine ఉపశమనమైన ఒకతరహా గాయతైలము. a certain fragrant herb పరిమళమైన ఒక తరహా చెట్టు.
Balmy adj పరిమళముగల, మనోహరమైన, ఉపశాంతికరమైన. * breeze మలయమారుతము.
Balsam n s ఒక తరహాతైలము, ఒక తరహా చెట్టు. the flower గులిముడి, చిలకముక్కు పువ్వు. oil of * సాంబ్రాణితైలము.
Balsamic adj పరిమళించే, సుగంధమైన.
Baluster, Balustrade n s. మిద్దెమీద, గారతోనైనా కుండ పెంకుతోనైనా కట్టినగ్రాది, చెయిపిడిగోడ.
Bamboo n s (a word taken from the Malay language) వెదురు. a large * బొంగు . a long * గడ. the male * పోతువెదురు, ఘట్టి వెదురు. the female *పెంటివెదురు, బొంగు. * colour (an absurd word) చామనిచాయ, పండు వెదురు వర్ణము.
Ban n s or curse శాపము. or forbidding నిషేధించడము. Marriage bannsపెండ్లినిగురించిన ప్రకటన, అనగా ఫలానివాడు ఫలానిదాన్ని పెంఢ్లాడబోతాడు దీనికి యెవరైనా ఆక్షేపించే వారు కద్దా అని పాదిరిచేసే ప్రకటన.
Banana n s or plantain అరటిపండు.
Band n s or bandage, కట్టు, గాయకట్టు. there was a bras * round the top of the pillar స్థంభము యొక్కకొనకు విత్తళిపొన్ను వేసివుండినది.a staff with iron bands యినుపకట్లు వేసినకర్ర. a hat * టోపిచుట్టూ కట్టిన నాడా. mourning bands worn at funeral బద్దె, కర్మము చేసేటప్పుడు వేసుకొనే బద్దె.a straw * or rope వెంటి. a * of gold lace సరిగెట్ట, సరిగెనాడా.a snake with black bands నల్లకట్లపాము.connection or union సంబంధము. this marriage formed a * between the twofamilies యీ వివాహముచేత రెండు కుటుంబములకు సంబంధము కలిగినది. or company గుంపు, తెగ, కూటము. a * of thieves దొంగలగుంపు, దొంగలతెగ.a * of soldiers శపాయీలదళము. of musicians మేళము, మేళ గాండ్ల జత.or cravat పాదుర్లు, లాయర్లు మెడకు కట్టుకొనే ఒక తరహాగుడ్డ.
Bandage n s కట్టు, గాయకట్టు, పుంటికట్టు.
Bandbox n s తేలికైనపెట్టె, కాకితముతో, లేక, తేలికైన కొయ్యతోచేసిన చులకనైనపెట్టె.
Banded adj గుంపుగావుండే, చారలుగల.
Bandicoot n s a great rat, పందికొక్కు.
Bandicoy n s (a certain herb) బెండకాయ.
Bandit n s బందిపోటు దొంగ.
Banditti n s plu. బందిపోటుదొంగలు.
Bandog n s కావలికుక్క, రేచుకుక్క.
Bandy n s a carriage or cart బండి.
Bandy-legged adj దొడ్డికాళ్ళుగల.
Bane n s poison విషము. evil చేటు, చెరపు. rats * యెలుకపాషాణముhares * మొసలిచేటు మొక్క, మొసలిచేదు.
Baneful adj విషకారియైన, చెరుపైన, చేటైన, హానికరమైన. his *advice వాడుచెప్పిన దుర్బుద్ధి. a * custom దుర్వాడిక.
Bang n s దెబ్బ, మోటుదెబ్బ. the drug cannabis sativa గంజాయి, బంగి.
Bangles n s the Indian word for bracelets కంకణకులు, కడియాలు. or anclets అందెలు.
Banians n s (An old word for Hindus) హిందువులు. banian treeమర్రిచెట్టు. An old word for Shopkeepers వర్తకులు, శెట్లు, కోమట్లు. a banian dress సాదావుడుపు. a banian day వొళ్ళు కుదురు లేకుండా వుండేదినము, యీకాలమందు యీ మాట నిండా వాడికలేదు.
Banished adj వెళ్ళగొట్టబడ్డ, దేశభ్రష్టుడైన. long * thoughts బహుదినాలుగాలేడుండా వుండిన జ్ఙాపకము.
Banishment n s వెళ్ళగొట్టడము, దేశాంతరమునకు పంపివేయడము. he is now in * దేశత్యాగియైవున్నాడు.
Bank n s కట్ట, గడ్డ, ఒడ్డు, తీరము. he raised a * కట్ట వేసినాడు. my houseis built on the banks of the river మాయిల్లు యేటి అంచున వున్నది. a littlehill తిప్ప, దిబ్బ, మిట్ట. a * for money కొఠీ.
Banker n s కొఠీదారుడు, సాహుకారు, సరాబు.
Banking n s కొఠీవ్యాపారము, సాహుకారివ్యాపారము.
Bankinghous n s కొఠీ.
Bank-note n s నోటు.
Bankrupt n s దివాలెత్తినవాడు.
Bankruptcy n s దివాలుయెత్తడము.
Banksall n s (Calcutta word for an exchange, for traders)వాణిజ్యశాల.
Bankshall n s రేవులో సరుకులు దించేగిడ్డంగి.
Banner n s ధ్వజము, కొడి, టెక్కెము, పతాకము. after the * hoisted upకొడియెక్కించిన తరువాత. a silken * పట్టుకొడి.
Bannian n s See Banians.
Bannister n s మిద్దెమెట్లగ్రాది, చెయిపిడి.
Bannock n s a kind of Scotch bread ఒక తరహారొట్టె
Banquet n s విందు.
Banqueting-house n s విందుచేసే యిల్లు.
Banter n s యెగతాళి, పరిహాసము.
Banterer n s యెగతాళి చేసేవాడు.
Bantling n s పిల్ల, యిది తిరస్కార శబ్దము.
Banus n s See Ban.
Banyan n s See Banians.
Baptism n s బాప్తిస్మము. ( BNT, Or with the French pronunciation)బాతేము, మజ్జనము. SNT.
Baptismal a బాతేమ సంబంధమైన.
Baptist n బాప్తిస్తుడు (మజ్జాయితా SNT.బాప్తాయీజక BNT.స్నాన ్ . Rh.స్నాతకుడుF.) The sect called Baptists, ఖ్రీస్తు మతములో ఒక మత భేదము. John the *పూర్వకాలమందు వుండిన ఒక మహాత్ముడు.
Baptistery n s జ్ఙాన స్నానము చేయించే స్థానము.
Bar n s కమ్మి, కంబి, పాళము. a window with iron bars యినపకమ్ములువేసిన కిటికి of door గడియ, అర్గళము. of a gate అడ్డకర్ర. or hinderance అడ్డి, అభ్యంతరము, ఆటండము, consanguinity formed a * to the marriage వీడికి దాన్ని వివాహము చేయడానకు జ్ఞాతిత్వము ప్రతిబంధకముగా వున్నది. of a harbour ముఖద్వారమునుమూసుకొనివుండే యిసుక దిబ్బ. In a song చరణము. place for prisoners in a court ఖైదిని నిలిపేస్థలము. he practises at the* అతను లాయరు పనిచూస్తాడు. In a tavern సారాయి అంగడిలో అమ్మేవాడు కూర్చుండే స్థలము. or stripe of colour చార. the tiger's skin has black bars పెద్దపులి తోలులో నల్లచారలు వున్నవి. To Bar, v. a. అడ్డగడియ వేసుట. he barred the door ఆ తలుపుకు అడ్డుకర్రవేసినాడు, అడ్డగడియవేసినాడు. or to hinder ఆటంకము చేసుట,అభ్యంతరము చేసుట. the length of time barred his claim కాలవిళంబము వాడి స్వాతంత్య్రమునకు అడ్డి అయినది.
Barb n s చిల్ల, జిట్ట, తగులు. a pointed iron with one * చిల్లాకౌల,or steed తురుకీ గుర్రము, యిది కావ్యమందు వచ్చేమాట.
Barbacan n s బురుజు, కోటగోడలో ఫిరంగులు పెట్టే స్థలము.
Barbarian n s a rude person అసభ్యుడు, అమర్యాదస్థుడు. a savage అడివి మనిషి, చెంచువాడు.the * kings చెంచురాజులు. a cruel manక్రూరుడు, కిరాతకుడు, నిష్కంటకుడు. Dr. Johnson says ( Boswell, 27 March 1772) " The mass of the Greeks and Romans were Barbariansthe mass of every people must be barbarous, where there is no printing, and consequently knowledge is not generally diffused:knowledge is diffused among the people by our newspapers. I amtalking of the mass of the people. We see even what the boastedAthenians were. The little effect which Demosthenes's orationshad upon them shews that they were barbarians." In I Cor. XIV. IIమ్లేచ్ఛ. SNT. and BNT. అన్యులు. R. మూఢుడు. F.
Barbaric adj చెంచువాడ్ల సంబంధమైన.
Barbarism n s in language యాచమాట, మిశ్రమభాష
Barbarity n s cruelty క్రూరత్వము, నిష్కంటకత.
Barbarous adj rude, uncivilized మోటు. cruel క్రూర, నిష్కంటక. * languageయాచమాటలు. * people క్రూరలు, అడివి మనుష్యులు. In Acts XXVIII.2. అసభ్యలోకా SNT. అన్యజాతి. F. అన్యులు. R.
Barbarously adv అతి క్రూరముగా, నిష్కంటకముగా.
Barbarousness n s క్రూరత్వము, నిష్కంటకత్వము.
Barbecue n s కోయకుండా వున్నది వున్నట్టే కాల్చినపంది.
Barbed adj చిల్లలుగల. a * hook చిల్లలుగల గాలము. a * horse or horse in armour జీరావేసిన గుర్రము.
Barbel n s ఒక తరహా చేప.
Barber n s క్షవరకుడు, మంగలవాడు.
Barberry n s ఒక తరహా పండు.
Bard n s కవీశ్వరుడు.
Bare pastofBear నిభాయించినాడు,మోసినాడు,కన్నది, he * the blameనింద మోసినాదు. she * a son కొడుకును కన్నది. this is old English See To Bear, v. a.
Bare-faced adj సిగ్గుమాలిన, సిగ్గుచెడ్డ. * lie పచ్చి అబద్ధము.
Bare-facedly adv సిగ్గుమాలి, సిగ్గుచెడి.
Bare-foot adv ఒట్టికాళ్ళతో, చెప్పులు లేక.
Bare-headed adj ఒట్టితలగల, పాగా లేని, టోపిలేని, బోడి.
Barely adv or scarcely అరుదుగా, చాలీ చాలక. this is * enough యిదిచాలీ చాలక వున్నది. he is * alive వాడికి ప్రాణము వున్నదో పోయినదోఅనివున్నది. I had * arrived when he died నేను చేరీచేరక మునుపేచచ్చినాడు.
Bareness n s లేమి, లేకవుండడము. from the * of the trees ఆకులు లేకచెట్లు బోడిగా వున్నందున.
Bargain n s an agreement, ఒడంబడిక, ఒప్పందము, కరారు, బేరము. if you do not pay me the money to-day it is no * యీ వేళ రూకలు చెల్లించకపోతివా ఆ సరుకుకు నీకు సంబంధములేదు. he struck a * with us మాతోబేరము చేసినాడు. the thing purchased or sold కొన్న, లేక అమ్మినసరుకుwhen he brought his * home కొన్న సరుకును యింటికి తీసుకవచ్చేటప్పటికిhe bought the house at a good * యింటిని నయముగా కొన్నాడు. he boughtit at a bad * దానికి అధిక వెల పెట్టినాడు, గిరాకిలో కొన్నాడు. you have abad * నీవు చేసిన యుక్తి పిచ్చి పోయినది. he made the best of a bad *యీ కాలానికి యిట్లా వుండవలసిన దనుకొన్నాడు. into the * సహితము కూడాపైగా, సమేతు. he bought the house and the garden into the * ఆ యింటిని తోటతో కూడా కొనుక్కొన్నాడు. he is a liar and a drunkard intothe * వాడు అబద్ధీకుడే కాకుండా తాగుబోతున్ను.
Bargaining n s బేరము, కొనడము, అమ్మడము.
Barge n s ఒక తరహా పెద్దపడవ, విహారమునకు, లేక, వ్యాపారమునకు ఉపయుక్తమైనది. * man పడవవాడు.
Barilla n s ఒక తరహా క్షారము, వుప్పు.
Bark n s పట్ట, మానిపట్ట, వల్కము. the inner * లోనిపట్ట. the outer *or day బొబ్బర, బరదు. a medicine జ్వరానికియిచ్చే బార్కు పట్ట చూర్ణము.or vessel చిన్నవాడ, పడవ. voice of a dog కుక్క మొరుగు.
Barley n s బార్లిబియ్యము. * water బార్లి గంజి. * sugar ఒక తరహా మిఠాయియిది చక్కెర గోధుమపిండి కలిపి చేసినది.
Barley-corn n s బార్లిగింజ, అంగుళములో మూడో భాగము.
Barm n s కాడి, దీన్ని రొట్టెలు మొదలైనవి వుబ్బడానకు పులుసుగాపెట్టుతారు, బీరుసారాయి చేయడములో దీన్నిన్ని పోస్తారు.
Barn n s కణజము, కళంజము, ధాన్యకొఠారు.
Barnacle n s ఒక తరహా నత్తగుల్ల. a bird ఒక తరహా బాతు.
Barometer n s ఘాలి యొక్క ఎచ్చు తగ్గులను తెలియ జేసే ఒక యంత్రము,దీన్ని బ్రామీటరంటారు.
Barometrical adj ఘాలియొక్క హెచ్చు తగ్గులను తెలియజేసే యంత్రసంబంధమైన.
Baron n s రాజు, దొర, జమీందారు, ఒక తరహా కితాబు గలవాడు.The proper sense is యజమానుడు .Baronand Feme భార్యాభర్తలు.Baronet, Viscount అనే దర్జాలకు నడిమిదైన బారన్ అనే కితాబు గలవాడు.
Baroness n s బారనుయొక్క భార్య.
Baronet n s ఒక తరహా కితాబుకలవాడు, అనగా Baron, Knight అనే కితాబులకు నడిమి కితాబు గలవాడు.
Barony n s Baron అనే రాజుయొక్క దేశము. Baron అనే కితాబు.
Barrack n s సోజర్లు సిపాయిలు వుండేశాల, దీన్ని బార్కసు అంటారు.
Barrel n s ఒక తరహా పీపాయి. or tube గొట్టము. the * of a gunతుపాకి గొట్టము. the belly of a horse గుర్రము యొక్క కడుపు.
Barrelled adj గొట్టముగల, నాళముగల. a double * gun రెండు గొట్టాలతుపాకి.
Barren adj గొడ్డైన, ఫలించని. or feeble నీరసమైన, జబ్బైన. a * woman గొడ్రాలు. * land పండని భూమి, చవిటినేల, ఊషరభూమి.a * tree కాయనిచెట్టు. a * poet జబ్బుకవి.
Barrenness n s గొడ్డుతనము, ఫలించక పోవడము, నీరసము, జబ్బు. from the * of the soil ఆ నేల పండదు గనక.
Barricade n s అడ్డు, అడ్డము, ఆటంకము, పరులను రానివ్వకుండా కట్టిన అడ్డకట్టు. the * built with bamboos round the camp keptthe enemy in awe మా శిబిరానకు చుట్టూ వెదురుతో కట్టిన అలవచేతశత్రువులు ఆచివుండిరి.
Barricado n s See Barricade.
Barricadoed adj అడ్డకట్టిన, ఆటంకము చేయబడ్డ.
Barrier n s తడ, అడ్డు, ఆటంకము, హద్దు, సరహద్దు.
Barrister n s వకీలు.
Barrow n s for carrying earth & c. ఒంటి చక్రపు చెయిబండి. a hillockతిప్ప, దిబ్బ.
Bartavelle n s చకోరపక్షి.
Basalt n s ఒక తరహారాయి.
Base n s అడుగు, పీఠము, అస్థిభారము. in music మంద్రస్వరము. on the * of friendship స్నేహమునుపట్టి.
Base-born adj పలుబీజమైన, పలువిత్తైన.
Based adj ఆధారముగల.
Baseless adj నిరాధారమైన.
Basely adv నీచముగా, తుచ్ఛముగా, హీనముగా.
Basement n s అడుగు మట్టము, అడుగు పీఠము, మూలము. * floor తళవరిళ, అడుగు దళము.
Baseness n s నీచత్వము, తుచ్ఛత్వము, హీనత్వము, పోకిరితనము, పలవతనము.from the * of the silver వెండిమట్టమైనందున.
Bashaw n s పాదుషా, పాచ్ఛా. a pround man గర్విష్టుడు.
Bashel n s తూము, ముప్పైరెండు శేర్లు పట్టే తూము. he hideshis lamp under a * నిగురుగప్పిన నిప్పువలె వున్నాడు.
Bashful adj సంకోచముగల, కొంకుగల, సిగ్గుగల, బిడియముగల.
Bashfully adv సంకోచముగా, కొంకుగల, సిగ్గుగల, బిడియముగల.
Bashfulness n s సంకోచము, కొంకు, సిగ్గు, బిడియము.
Basil n s తుళసిచెట్టు.
Basilicon n s ఒక తరహా ప్లాస్తిరి.
Basilisk n s కాలకూటసర్పము, యీ సర్పము యొక్క దృష్టి దేనిమీద తగిలితే అదిభస్మమే పోతుందని ప్రతీతి.
Basin n s a vessel to hold water for washing నీళ్ళ పల్లెము.a cup గిన్నె. a * or water భోగుణినీళ్ళు . or small pond చిన్నగుంట. of harbour వాడలు నిలిచే దొరువు. a * round the treeపాదు ఆలవాలము a* of tea గిన్నెడు తేనీళ్ళు thistown is built in a * of hills యీ వూరు కొండల నడిమి పల్లములో కట్టివున్నది. the basins of a balance త్రాసు తట్టలు.
Basis n s ఆధారము, ఆస్పదము, మూలము, ఆస్తిభారము, బునాది. or pedestal పీఠము. of a column స్థంభము యొక్క అడుగు పీఠము.
Basketful adj గంపెడు, బుట్టెడు.
Basket-hilt n s మూతకత్తిపిడి, అనగా చేతికి దెబ్బ తగలకుండా పై మూతగల కత్తిపిడి.
Bason n s See Basin.
Bas-relief n s ఉబుకుపని. the face that appears upon a rupee isin * రూపాయమీద అగుపడే ముఖము వుబుకుపనిగా వున్నది.
Bass n s మంద్రస్వనము. Bassia latifolia, n. s. the name of a tree యిప్పచెట్లు, మధూకము.
Bassoon n s వూదేవాద్య విశేషము, ఒక తరహా వూదుకోవి.
Bass-viol n s ఒక తరహా వీణె.
Bastard n s వుంపుడుదాని కొడుకు, పెట్టుకొన్నదానికి పుట్టినవాడు, వేశ్యకు పుట్టినవాడు.
Bastardy n s జారజత్వము.
Bastile n s చెరసాల, బందేఖానా, యిందులో అతి క్రూరదండన జరిగేదనిప్రతీతి.
Bastinado n s కర్రతో కొట్టడము, దెబ్బలు, కర్రతో అరికాలిమీద కొట్టేదనేతురకలు చేసే ఒక తరహా శిక్ష.
Bastion n s బురుజు, కొత్తళము.
Bat n s గబ్బిలము. a large * called the flying fox బుషిపిట్టచీకురాయి. or stick used in games ఆటలో గుండును తట్టే కర్ర.or brick * యిటికరాయిపొడి. Bat-fowling ఘంట వేట, రాత్రిళ్ళుఆడే వేట.
Batch n s ఒకసారిలో కాల్చినది, ఒకతడవలో చేసినది. a * of bread ఒక సారిలో కాల్చి యెత్తిన రొట్టెలు. these bricks are all of the same* యిది అంతా ఒక సూళయిటికె లు. this is the best of the * వున్నంతల్లోయిది వాసి.
Batchelor n s పెండ్లి లేనివాడు. * of arts శాస్త్రి.
Bath n s స్నానము, స్నానతొట్టి, స్నానము చేసే స్థలము, స్నానవాటిక స్నానజలము. he took a * స్నానము చేసినాడు. she gave the child a * బిడ్డకు నీళ్ళుపోసినది. a warm * వేణ్నీళ్ళు. a cold * చన్నీళ్ళు .
Bathe n s స్నానము. he took a * స్నానము చేసినాడు.
Bathed adj స్నానము చేసిన తడిపిన, తడిసిన, ముంచిన. checks * in tearsకన్నీళ్ళ తడిసిన దవడలు. hands * in blood నెత్తురుతో తడిసిన చేతులు. *in dew మంచున తడిసిన.
Bathing n s స్నానము.
Bathos n s a ludicrous descent from the elevated to the mean in wirting or speech రాసాభాసము, అనగా వ్రాయడములో గాని మాట్లాడడములోగాని వౌకటిని గురించి అతి ఘనముగా చెప్పతూ వచ్చి దాన్ని గురించే లటక్కున వొక అల్పమాట చెప్పడమువల్ల కలిగే రసాభాసము. Pathos అనగా సరసము, దానికి ప్రతిగా Bathos అనగా రసాభాసమని యేర్పరచిరి.
Bating prep వినహా, వినాయించి. * this యిది వినహా, యిదితప్ప.
Baton n s సేనాధిపతి చేతివేత్రము, శెంగోలు.
Batoon, Battoon n s. సేనాధిపతి చేతి వేత్రము, శెంగోలు.
Batta n s (an Indian word) బత్తెము, రోజు.
Battalia n s వ్యూహము, సేనావిన్యాసము, దండును నిలిపే క్రమము.
Battalion n s పటాళము.
Batten n s బద్ద, చట్టము. a * of bamboo వెదురుబద్ద.
Batter n s తోపా, అనగా గుడ్లు, పాలు పిండి కలిపి చేసినది. they beat it to the consistency of * కాటుకవలె మెదిపినారు.
Battery n s place for guns మోర్జా, బురుజు. or beating కొట్టడము. he broughtan action of * against them వాండ్లు తన్ను కొట్టినట్టు వాండ్లమీద ఫిరంగులతీరుగా యేర్పరచిన సీసాలు.
Battle n s యుధ్ధము, జగడము, పోట్లాట. he lost the * అపజయమునుపొందినాడు. he gained the * జయించినాడు. The battle won కోరిక ఫలమైనది,తంటా తీరింది, కోరికె నెరవేరినది. the boxers fought a * మల్లులు యుధ్ధముచేసినారు. the cocks fought a * పుంజులు జగడము చేసినవి. he set the troopsin * array దండును యుద్ధసన్నద్ధముగా నిలిపినాడు. there was a * royal among thewomen ఆ యాడవాండ్ల కొకరికొకరికి అఘోరమైన జగడమైనది. a * axe గండ్రగొడ్డలి.he knows Sanscrit before hand and this is half the * in learning Teluguవాడికి మునుపే సంస్కృతము వచ్చియుండుటవల్ల తెలుగు నేర్చుకోవడములో సగము తొందరతీరినది. a line of * ship గొప్ప యుద్ధవాడ.
Battledore n s చెండుతట్టేకర్ర, అనగా అతిరస పలకవలె కొనను బటువుగా తోలుకట్టివుండేకర్ర.
Battlement n s మేలుగోడ, బురుజుపైగోడ, కోటకొమ్ము, దీనిమరుగున సిపాయీలువుండి ఫిరంగులు కాలుస్తారు.
Baulk n s (between fields) పొలములో దున్నక విడిచిన తుండునేల.
Baulked adj భంగమైన, భగ్నమైన, నిరర్ధకమైన. Being * in these attempts యీ యత్నములు భంగమైపోయినందున.
Baumble, or Bawble n s. గుల్లాగుట్ర, పనికిమాలినవస్తు, గుల్ల కాసు చేయనిది.Bawbles bought at the fair బెండు చిలకలు గిలకలు మొదలైన కాసు చెయ్యనివస్తువులు.
Bavin n s (a bit of wood) కట్టె, పుడక, పుల్ల
Bawd n s కుంటెనకత్తె
Bawdry n s కొంటెకూతలు, బండుబూతు.
Bawdy adj సిగ్గుమాలిన, కొంటె, బండ. * language బండకూతలు. * house గుడిశవేటువాండ్లు వుండే యిల్లు.
Bay n s of the sea మూడుతట్లు భూమిగల సముద్రము. (in building )a * window వింటిబద్ద ఆకారమైన గవాక్షి. the tiger was at * పులి నాలుగుతట్ల చిక్కుబడి వుండినది. the stag stood at * among the dogs ఆ జింక కుక్కలనడమ చిక్కుకొని ప్రాణానకు తెగించ వుండినది. the cow kept thetiger at * ఆ యావు పులిని దగ్గర చేరనియ్యలేదు. we kept the enemy at* శత్రువులు మామీద వచ్చి పడకుండా బందోబస్తుగా వుంటిమి, జాగ్రత్తగావుంటిమి. I am keeping fever at * నేను జ్వరాన్ని రాకుండా పట్టుతున్నాను. the name of the laurel tree ఒక చెట్టు పేరు.
Baya (SeeTail or bird)
Bayadere n s (from the Persian word) బోగముది.
Bayonet n s సనియను, తుపాకి కొనను తగిలించే బాకు.
Bay-tree n s ఒక వృక్ష విశేషము. he flourished like a green * తామర దంపముగా వుండెను. the Sanscrit metrical version of the Psalms says శ్యామవృక్షము. the Tamil version omits it.
Bazaar, Bazar n s. అంగడివీధి, సీమలో సొమ్ములు, పుస్తకములు, శాలువలు మొదలైనవిఅమ్మే సంత అంగళ్ళు పెట్టే బ్రహ్మాండమైన ఒక యింటిని బజారంటారు. that is a *report వదంతి ఘాలి సమాచారము.
Bdellium n s గుగ్గిలము. some Translators say గోమేధికము.
Be it so (thus placed by Johnson) కాని;అట్లావున్నప్పటికిన్ని
Beach n s రేవు, వోడరేవు, సముద్రతీరము,
Beacon n s ఓడలకు రాత్రిళ్ళు ఫలాని అపాయస్థలమని గురుతు తెలిసేటట్టునిర్ణయించబడ్డ వెలుతురు గల వున్నత స్థలము. or warning యెచ్చరిక.let him be a * to you అతడి గతిని చూచి నీవు యెచ్చరిక పడవలసినది.
Bead n s పూస, మణి, beads పూసలు, గుండ్లు. he was counting his beadsజపమాలికతో జపము చేసుకొంటూ వుండినాడు. a * of sweat చెమట బిందువు.
Beading n s పూసకట్టుగా చేసిన కొయ్యపని.
Beadle n s ఒక తరహా బంట్రోతు, పేదా, తలారి. Beadman, Beadsman, n. s. సన్యాసి, పకీరు.
Beagle n s ఒక తరహా వేటకుక్క.
Beak n s పక్షి ముక్కు.
Beaked adj ముక్కుగల.
Beaker n s గండిచెంబు.
Beam n s of wood దూలము. the * of a balance దండె, త్రాసుకోల.In trial this kicks the * పరిక్షలో యిది వెనక్కుబడుతుందు, weavers * పడమాను తరిమాను. * of a plough నొగమాను. of lightకిరణము.
Bean n s చిక్కుడుకాయ. there are many kinds of this బెండకాయ,పొట్లకాయ మొదలైన కాయగూరలు.
Bear n s ఎలుగ్గొడ్డు, భల్లూకము. the man is a perfect * మోటువాడు,మర్యాద తెలియని వాడు, అమర్యాదస్థుడు. Bearsply మోటుసరసము. the stars called the great * సప్తర్షి నక్షత్రములు. the lesser * ఉత్తర ధ్రువ నక్షత్రము.
Beard n s దాడి, గడ్డము. * of corn వరిముల్లు, ధాన్యశూకము.
Bearded adj దాడిగల. Beardless, adj. గడ్డముమీసము రాని, మీసకట్టురాని.
Bearer n s మోసేవాడు. a * of a palankeen బోయి. the * of this letterయీ జాబు తెచ్చేవాడు. a mace * వెండిబెత్తపువాడు. this tree is a good * యిది బాగా కాచేచెట్టు.
Beargarden n s కలహస్థానము, గందరగోళముగా వుండేస్థలము.
Bearing adj కనే, కాచే, పూచే, ఈనే. past * కాన్పువుడిగిన, కాపుడిగినa letter * postage టప్పాలు కూలియివ్వవలసినజాబు.
Bearish adj ఎడ్డె, మడ్డి, మూఢ, మొండి.
Bearward n s ఎలుగ్గొడ్లను పెంచేవాడు.
Beast n s మృగము, పశువు. గొడ్డు, జంతువు, జీవము.
Beastliness n s పశుత్వము, రౌత, అసంహ్యము.
Beastly adj రోతైన, అసంహ్యమైన, బండు. * language బండుబూతు.
Beat n s దెబ్బ. to publish by * of drum తంబరకొట్టి ప్రసిద్ధపరచుట. during 50beats of the pluse ధాతువు యాభై మాట్లు కొట్టడములో. or ward in a town ఠాణా లరహద్దు. the watchman was then on his * రోందు. round తిరుగుతూవుండినాడు, అనగా నగరశోధన చేస్తూవుండినాడు.
Beaten adj కొట్టబడ్డ, దెబ్బలుపడ్డ. he went over the * ground of the Willఆ వుయిలు కాకితమును వివివినిపడివుండేదాన్ని మళ్ళి మళ్ళి చెప్పుతాడు. a * pathనడిచి అరిగినదోవ * gold అపరంజి. See to Beat.
Beater n s కొట్టేవాడు. a cotton * or cotton cleaner దూదేకుల వాడు.an earth * or rammer ఘట్టనపలక, దిమ్మసు a gold * కుందనపు రేకులుచేసేవాడు. a rice * or pestle రోకలి.
Beatific adj పరమానందమైన, దివ్యమైన. the * vision దైవ ప్రత్యక్షము, సాలోక్యము.
Beatification n s చచ్చిన ఒక మహాత్ముణ్ని దేవతులలో కలపడము . Ten yearsafter his * వాణ్ని దేవుణ్నిగా నియమించుకొన్న పదియేండ్లకు తరువాత.
Beatified adj ముక్తుడైన.
Beating n s కొట్టడము, తాడనము, ప్రహరము. of cotton ఏకడము. after this *యీ దెబ్బలు పడ్డతరువాత.
Beatitude n s మోక్షము. or Benediction, blessing, దీవన, ఆశీర్వాదము.
Beau n s నీటుగాడు, సొగసుగాడు, ఒయ్యారగాడు. The beau-ideal (more correctly,ideal, a French phrase) తిలకము, రత్నము. This is the beau-ideal of a gardenఉద్యానవనతిలకము. It is the very beau-ideal of a commentary వ్యాఖ్యానమంటే యిదే వ్యాఖ్యానము. Tipu Sultan was the beau-ideal of a Musulman.టీపు సుల్తాను తురకల చూడామణిగా వుండెను.
Beauish adj నీటైన, వయ్యారమైన.
Beauteous adj అందమైన, సౌందర్యమైన, యిది కావ్యశబ్దము.
Beautified adj restored, repaired, adorned చక్కచేయబడ్డ,బాగుచేయబడ్డ, సింగారించబడ్డ.
Beautiful adj అందమైన, సుందరమైన. * weather మంచికాలము, హాయిగావుండేకాలము,అనగా మబ్బుమందారము చినుకుచిత్తడి లేక హాయిగా వుండేకాలము. this is a *demonstration దివ్యమైన ఉదాహరణ.This was a * trait of affection విశాసమునకుయిదే దివ్యమైనగురుతు.
Beautifully adv అందముగా, సౌందర్యముగా.
Beauty n s అందము, సౌందర్యము, చక్కదనము. or handsome woman అందకత్తె,రూపవతి. the beauties of a book, (as of Shakespeare) యెత్తి వ్రాసిన స్వారస్యమైన పద్యమంజరి.
Beauty-spot n s on the forehead తిలకము. dimple సిబ్బెము.
Beaver n s an animal ఒకజంతువు, దీని బొచ్చుతో టోపీలు చేస్తారు. or hatటోపి. front of hemlet ముఖమును కప్పుకొనియుండే తలజీరా యొక్క భాగము.
Beazle, or Bezel n s. మిద్దెటుంగరము యొక్క వొమ్మచ్చు.
Becafico n s ఒక తరహా నేలనెమలి.
Became (the past of become)అయినది
Because conj గనక, కాబట్టి, యేలనంటే. * he went పోయినాడు గనక. * of the heat యెండ అయినందున. I did this * of you నిన్ను గురించి దీన్ని చేస్తిని.* of his youth పసివాడైనందున.
Beck n s శిరఃకంపము, చెయిసౌజ్ఙ. they are wholly at his * వాండ్లంతా అతనిస్వాధీనములో వున్నారు, వాడు యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నారు.
Becoming adj తగిన, యుక్తమైన, యోగ్యమైన, ఉచితమైన. this is not a * dressయిది తగినవేషము కాదు.
Becomingly adv యుక్తముగా, యోగ్యముగా, ఉతముగా.
Bed n s పడక, శయనము, శయ్య. he went to * పండుకొన్నాడు. when the birdswent to * పక్షులు పండుకొనేటప్పుడు. she was brought to * of a son మొగబిడ్డనుకనింది. or * stead మంచము. or mattrass పీచుకమెత్త. or feather *పక్షి రెక్కలమెత్త. in a garden * మడి, పాదు. the * of a river యేటి గర్భము, నట్టేరు, మడుగు. they dig a canal out of the * of the river నట్లేటినుంచిఒక కాలవ తీసినారు. a * of rocks చాపరాయి.
Bedchamber n s పడకటిల్లు.
Bedclothes n s మంచముమీద పరచే దుప్పట్లు, బూర్నీసులు, పడకవుడుపు.they brought her in her * దాన్ని పడకవుడుపుతోనే తీసుకొని వచ్చినారు.
Bedded adj మంచము వేసిన. a double * room రెండుమంచములు వేసివుండేగది.
Bedding n s పడక, పరుపు, మెత్త.
Bedfellow n s ఒకపడకలో కూడా పండు కొనేవాడు. those children are bedfellowsఆ బిడ్డలు ఒకపడకలో పండుకొనేవాండ్లు.
Bedight adj అలంకృతమైన.
Bedlam n s వెర్రివాండ్ల ఆస్పత్రి.
Bedlamite n s వెర్రివాడు.
Bedrenched adj తడిసిన. I was * in the rain వానలో దొప్పదోగ తడిసినాను.
Bedrid adj మంచములో పడివుండే, పడ్డపడకగా పడివుండే.
Bedroom n s పడకటి యిల్లు.
Bedropped adj చుక్కలుగల.Velvet * with gold చుక్కలు చుక్కలుగా సరిగె బుట్టాలు వేసిన మొహమలు.
Bedstead n s మంచము.
Bedtime n s పండుకొనేవేళ.
Bedunged adj యేరిగి రోతగా వుండే.
Bee n s తేనీగ. Wild black bees that make no honey తుమ్మెదలు, తేంట్లు, భృంగములు. Bees wax మడ్డిమైనము. he was as busy as a * వాడు పనిలేక క్షణమైనా వూరికె వుండలేడు.
Beech n s ఒక తరహా పెద్ద వృక్షము.
Beechen adj యీ చెట్టు యొక్క కొయ్యతో చేసిన.
Beechive n s తేనెగూడు.
Beef n s గోమాంసము. hung * యెండిన గోమాంసము.
Beefeater n s (derived from beaufet a side board) రాజసముఖములో వుండేఒక తరహా బంట్రోతు.
Beefsteak n s కాల్చిన మాంసము.
Beeizebub n s the name of a devil ఒక తరహా శైతానుపేరు. This is rendered భూతరాజు in SNT and BNT, while R.F.P. and the Canarese versions retain thename untranslated భేతాళుడు. Betala would perhaps be the best rendering.
Been thepastofBe వుండిన, have you * there అక్కడికి పోయివుంటివా, పోయి వస్తివా. I have * to his house వాడింటికి పోయివుంటిని, పోయివస్తిని.
Beer n s బీరుసారాయి, దీన్ని బార్లి బియ్యపు గంజితో నేస్తారు గనక యవనురా అనవచ్చును.
Beestings, or Beestings n s. ముర్రుపాలు, జున్నుపాలు.
Beet n s ఒక తరహా కందమూలము, తినడానకు యోగ్యమైన ఒక తరహా గడ్డ.
Beeting adj ఉబుకుగా వుండే. * brows మిట్ట కనుబొమలు.
Beetle n s an insect వీపున పెంకున్ను రెక్కలున్నుగల పురుగు, పేడపురుగు,బొద్దెంక. or rammer దిమ్మెస. * leaf See Betel.
Beeves n s plu. పశువులు.
Befitting P తగిన, యోగ్యమైన.
Before prep and adv. (In time) ముందర, మునుపు, పూర్వము. The twowords ముందు Before, and వెనక After, sometimes bear a sense opposed to that used in English. Thus ముందు చేస్తాను. I will do it before, denotesI will do it presently; ముందు వ్రాలు literally the "letters preceding." must be translated The next syllables. And వెనక or కిందట (after and under )denote preceding. Thus in the word నాగలి a plough, the letter గ being themiddle syllable, the syllable నా is called కిందటి అక్షరము the followingsyllable, and లి is called ముందరి అక్షరము the preceding (lit: front) syllable. The words పిమ్మటివాండ్లు (See పిమ్మట) literally "those after him" denote his progenitors (compare Beschi, Shen Tamil Grammar, lvii).Thus also, the word పిరిది or పరింది behind frequently means before, ఆ పైని పఙ్తిలో in the next line: lit: in the line above. ఆ పైగా thereafter. PHRASES: Ten days * his arrival వాడు చేరడానకు పది దినములకు మునుపు. * now యింతకుమునుపు, ఏతత్పూర్వము. he died the day * ఆ తొలినాడు చచ్చినాడు. * I come నేను వచ్చేటందుకు మునుపు, నేను రాకమునుపు. the day * he died వాడు చచ్చేందుకు ముందునాడు. the day * yesterday మొన్న. the day * that అటు మొన్న. the month * last పోయిన నెలకు అవతలి నెల. Friday * last పోయిన శుక్రవారానికి అవతలి శుక్రవారము. In the year Vicrama * last (i.e. more than sixty years ago) పోయిన విక్రమ సంవత్సరముగాక అవతలి విక్రమ సంవత్సరములో. * Christ ఖ్రీస్తు పుట్టక మునుపు. you tell me what I knew * నాకు ముందర తెలిసినదాన్నే నీవు చెప్పుతున్నావు. In presence సమక్షమమందు, యెదట. they stood * him వాడి యెదట నిలిచిరి. In front of యెదట. there is a garden * my house నా యింటి యెదట ఒక తోట వున్నది. they were going * వాండ్లు ముందరపోతూ వుండిరి. * and behind ముందు వెనక. he did this not setting God * his eyes దేవుడు వున్నాడని యెంచక దీన్ని చేసినాడు. go * ముందరపో. this boy is much * you in learning వాడు చదువులో నీకు నిండా మించివున్నాడు. * day తెల్లవారక మునుపు. * the eyes of all men అందరికండ్ల యెదట. * mentioned ముందర వ్రాసిన, ముందర చెప్పిన, he is * the world భాగ్యవంతుడుగా వున్నాడు.
Beforehand adv ముందుగానే, ముందుమించి. I was * with them వాండ్లకంటేనేను ముందు మించుకొన్నాను.
Beforetime adv పూర్వాకాలమందు.
Began the past of Begin ఆరంభించినది
Begat the past of Beget కన్నది, Abraham * Isaac అబ్రహాం యిజాకును కన్నాడు.
Begetter n s కన్నవాడు, పుట్టించినవాడు, తండ్రి.
Beggar n భిక్షకుడు, యాచకుడు, తిరిపెమెత్తేవాడు, or pauper దరిద్రుడు, అతి దరిద్రుడు. he became a * అతిదరిద్రుడయినాడు, సన్యసించినాడు. A bull beggarబండవాడు, బండపక్కిరి. (i.e. fakir).
Beggarliness n s meanness క్షుద్ర, నీచ, తుచ్ఛత, నీచత్వము.
Beggary n s పేదరికము, దారిద్ర్యము.
Begging n s తిరిపెమెత్తడము, యాచకము.
Beginner n s ఆరంభించేవాడు, ఉపక్రమించేవాడు.
Beginning part ఆరంభించే, మొదలుబెట్టే. matters are * to mend పని చక్కబడే వైఖరిగా వున్నది. the fruit is * to ripen ఆ కాయపండబారుతుంది. the prophets * from Moses మోససు మొదలైనరుషులు. Beginning at Jerusalem యరూశలేమ పూర్వకముగా, యరూశలేమమారభ్య. SNT.1841.
Begone interj లేచిపో, ఛీపో. come * పోపో, లేచిపో. well * మంచిది లేచిపో.
Begot the past of Beget కన్నది
Begotten P|| కన్న, జనిత.
Begrimed adj మురికి అయిన, మలినమైన, మాసిన,
Begun adj ఆరంభించిన.
Behalf n s పక్షము.they spoke on his * వాడి పక్షముగా మాట్లాడినారు. a witness on my * నాపక్షముగా వుండే సాక్షి. he went there onmy * నాకై అక్కడికి పోయినాడు. signed by me on * of my brotherనా యన్నకై నాచేత చేవ్రాలు చేయబడ్డది.
Behaviour n s నడక, నడితి, నడవడిక, ప్రవర్తన. rough * దౌర్జన్యము. manly *పెద్ద మనిషి తనము. good * మంచినడత. he is upon his good *యీతేప తప్పితే యిందుతో వాడి పని సరి.
Beheld thepastandpof Behold. చూడబడ్డ. this was * by thousands దీన్ని అందరు చూచినారు.
Behemoth n s ఒక తరహా మనుబోతు, నీరేనుగ.
Behest n s ఆజ్ఙ, ఉత్తరువు.
Behind adj వెనకతట్టుగా.
Behindhand adv వెనకపడి, వెనక చిక్కి. In reading he is * చదువులో వాడుపడ్డాడు.
Behold interj ఇదోచూడు, అదోచూడు. and * when they came మరిన్నివాండ్లు వచ్చినప్పుడు, యిదుగో వాండ్లు వచ్చినప్పుడు.
Beholden adj చూడబడ్డ. or obliged ఉపకారబద్దులైన. I am much * to himfor this అతడు చేసిన యీ వుపకారమునకు నేను నిండా బద్ధుడైనాను.
Beholdern n s చూచేవాడు.
Being n s existence వునికి, వుండడము. or a human * మనిషి, వరుడు. living* ప్రాణి, జీవి, జంతువు. there was not a * in the house ఆ యింట్లో ఒక ప్రాణిలేదు. In him we live and move and have our * ఆయనలోనే బ్రతుకుతూ మెలగుతూవుంటున్నాము. In a future state of * పరమందు. the supreme * దేవుడు.a social * సరసుడు. wretched beings దిక్కుమాలిన పక్షులు. a despicable* దుష్టహరంజాదా or state స్థితి, విద్యమానము. well * కుశలము, క్షేమము.this does not affect his well * యిందువల్ల వాడి క్షేమమునకు ఒక వ్యత్యాసములేదు.
Bel n s an heathen god శివుడు, భేతాళుడు.
Belated adj చీకటిపడ్డ. he was * వాడు రావడానికి చీకటి పడ్డది.
Belch n s తేపు, తేంపు, తేణుపు.
beldam n s ముసిలమ్మ, యిదితిట్టుమాట.
Belfry n s ఘంటగూడు.
Belial n s శివుడు, భేతాళుడు.
Belied adj అబద్ధమైపోయిన, అపదూరుపడ్డ. he is much * or he is a thiefవాడు దొంగ అని ప్రతీతిగా వున్నది. She is much * or she killed herchild అది తన బిడ్డను తానే చంపినట్టు వదంతిగా వున్నది. he was much *వాడిమీద నిండా అబద్ధాలు పుట్టినవి. his prediction was * by the eventయీ సంభవించిన పనిచేత వాడు చెప్పినది అబద్ధమైనది.
Belief n s నమ్మిక, ఎన్నిక, మతము. In my * he is dead వాడు చచ్చినాడనినాకు తోస్తున్నది. I came in the * that they were here వాండ్లు యిక్కడ వున్నారనినమ్మివస్తిని. In the Mahomedan * తురక మతములో. this is beyond * యిది నమ్మరానిది. worthy of * నమ్మతగిన. unworthy of * నమ్మరాని. my *was that it was already sent అది మునుపే పంపబడ్డదని ఎంచియుంటిని.
Believer n s నమ్మేవాడు, భక్తుడు, మతస్థుడు.
Belike adv or perhaps ఒకవేళ, యేమో, కాబోలు.
Bell n s ఘంట, గంట. Morris bells ఆడే వాండ్లు కట్టుకొనే గజ్జలు. dumb-bellsసాముచేసే వాండ్లు తిప్పేలోడ్లు. In poetry it signifies a flower or a bud పుష్పము, మొగ్గ. Bhattumurtti bears the * among the Telugu poets ఆంధ్రకవులలోకి భట్టుమూర్తి తిలకము. the * man ఘంటవాడు, అనగా తండోరా వేసేవాడు, చాటించేవాడు.
Belladonna n s See Nightshade; వసనాభివంటి ఒక విషమూలిక.
Belle n s సువేష రసికయువతి, అందముగల రసికురాలైన పడుచు.
Belles Lettres n s సాహిత్య విద్య, అలంకార శాస్త్రము.
Belligerent adj యుద్ధముచేసే. the * powers యుద్ధముచేసే రాజులు.
Bellmetal n s కంచు.
Bellow n s or roar రంకె, గర్జన, బొబ్బలు.
Bellows n s or a pair of bellows కొలిమి తిత్తి. two pair of * ఒక జోడుకొలిమి తిత్తులు.
Belly n s కడుపు. the * of a lute కిన్నెర కాయ. a * god తిండిపోతు:this name is absurdly given to Ganesa, the god Janus or పిళ్ళారి,pot bellied గుండోదరుడైన, పెద్ద పొట్టగల. a big bellied woman గర్భిణి. he ate his * full కడుపునిండా మెక్కినాడు. he had his * fullof fun వాడికి వేడుకతో కడుపునిండింది, వానికి కావలశినంత వేడుక అయినది. The prisoner pleaded her * తాను గర్భిణి అని మనివి చేసింది, అనగా వురితీసేటట్టు తీర్పు అయివుండినప్పటికిన్ని తాను గర్భిణి గనక వురితీయకూడదనిమనివి చేసింది.
Belly ache n s కడుపునొప్పి
Belly-band n s టంగువారు.
Belly-bound abj మలబద్ధకముగా వుండే.
Belly-worm యేటికపాము
Belonging part సంబంధమైన. property * to him అతనిసొత్తు. some sheets* to that book ఆ పుస్తకసంబంధమైన కొన్ని కాకితాలు.
beloved adj ప్రియమైన, యిష్టమైన. * friends, ప్రియులు. My * Lord నా ప్రాణనాధ. My * ప్రియులారా. a * girl పరియురాలు. * of God దైవకటాక్షమునకుపాత్రుడైన.
Below prep కింద. * the tree చెట్టుకింద.
Belt n s నడికట్టు, దట్టి, దవాలి. a silver * round the waist worn by menవెండిబిళ్ళల మొలతాడు. worn by women వొడ్డానము. of a Saddle టంగువారు.
Belvedere n s శృంగార మంటపము.
Belwether n s పెద్దపొటేలు, మేకపోతు.
Bench n s బల్ల, బలంపీట, పదిపన్నండు అడుగులు నిడివి ఒక అడుగు వెడల్పుగా యెత్తుగా కాళ్ళు పెట్టివుండే పలక. a stone * వొరుగుదిన్నెa carpenter's bench వడ్లవాడు పనిచేసేబల్ల, a seat of justice న్యాయాసనము. he was raised to the * అతనికి న్యాయాధిపతి ఉద్యోగమైనది.the magisterial * పోలీసు అధికార్లు. the *, the kings *, the queens* యిది సీమలో ఒక న్యాయసభ.
Bencher n s ధర్మశాస్త్ర పాఠశాలలో ముఖ్యమైన విద్యార్థి, ఒక తరహా వకీలు.
Bend n s వంపు, వంకర. here the street makes a * ఆ వీధి యిక్కడ తిరుగుతుంది.
Bending n s వంపు, వంకర, తిరుగుడు.
Beneath adv కింద, అడుగున.
Benedicite n s దీవించండి, దీవన, ఆశీర్వాదము.
Benedict n s నాటకములౌ వుదాహరించబడ్డ ఒకని పేరు, పెండ్లి చేసుకో పొయ్యేవాడు. when I knew him he was a * నేను అతణ్ని యెరిగినప్పుడుపెండ్లి చేసుకోవలెనని వుండినాడు.
Benedictine n s ఒక తరహా పాదిరి.
Benediction n s దీవన, ఆశీర్వాదము.
Benefaction n s ఉపకారము, దానము.
benefactor n s ఉపకారి. * of a temple కైంకర్యపరుడు.
Benefactress n s ఉపకారి, ధర్మముచేసేటిది.
Benefic n s గుడి మాన్యము, శ్రోత్రియము, గుడికి వచ్చే వరుమానము.
Beneficence n s ఉపకారము, అనుగ్రహము, కృప, దాతృత్వము. a man of *దాత.
Beneficent adj ఉపకారియైన, దాతయైన. the * ఉపకారులు, ధర్మాత్ములు.
Beneficently adv ఉపకారిగా, ధర్మాత్ముడుగా, దాతగా.
Beneficial adj సఫలమైన, సార్ధకమైన, ప్రయోజకమైన. Bathing is * to thehealth స్నానము చేయడము వొంటికి అనుకూలము.
Beneficially adv సఫలముగా, సార్ధకముగా.
Beneficiary n s గుడిమాన్యమును అనుభవించే పాదిరి.
Benefit n s ప్రయోజనము, ఫలము, లాభము, మేలు, ఉపకారము, హితము.what * will this do you యిందువల్ల నీకేమి ప్రయోజనము. God confers many benefits upon men దేవుడు మనుష్యులకు చేసేదన్ని వుపకారములే. he pleaded the * of Clergy తాను పాదిరియైనందున శిక్షించ కూడదనివాదించినాడు. Mr. Kemble took his benefit yesterday నిన్నటి కేళికలోవచ్చినదంతా Kemble అనేవాడికి పోయినది, అనగా ఆటలో వారువారు వేసినదంతా,కడమవాండ్లకు పాలు లేకుండా, వాడికే చేరినది. Literally అసనికి లాభముదొరికినది.
Benefited adj ప్రయోజనపడ్డ, ఫలమును పొందిన.
Benevolence n s ధర్మ గుణము, ఉపకారము, దయ, కనికరము, ధర్మము.between man and wife దాంపత్య ధర్మము.
Benevolent adj ధర్మగుణముగల, దయాళువైన, ఉపకారియైన. * mind చల్లని హృదయము.
Bengal n s బంగాళాదేశము. a * newspaper బంగాళాదేశములో అచ్చువేశినప్రసిద్ద పత్రిక. * letters అక్కడనుంచి వచ్చిన జాబులు. * rice బంగాళాబియ్యము. ( never Bengali rice) .
Bengalee adj బంగాళాదేశ సంబంధమైన. a * బంగాళా దేశస్థుడు. a newspaper గౌళప్రసిద్ధ పత్రిక. * letters గౌడ అక్షరాలు. the * language గౌడ భాష. the * character గౌడ లిపి.
Benighted adj అస్తమించిన, వివేక శూన్యులేన, మూఢులైన, జడులైన. the * traveller నడిదోవలో చీకటిబడ్డ బాటసారి, the * population పామర జనము. the * presidency అంధకార పట్టణము.
Benign adj దయాళువైన, అనుకూలమైన, హితమైన. or wholesome ఆరోగ్యకరమైన.
Benignity n s దయారసము, కృప, దయాళుత్వము.
Beningly adv దయగా, కృపగా.
Benison n s దీవెన, ఆశీర్వాదము.
Benjamin n s (benzoin) సాంబ్రాణి. or cloak గొగ్గె, భైరవాసము.
Bent adj వంగిన, వంపైన, వంకరైన. the spear was * ఆ యీటె వంకరగా వున్నది.he was * with age వాడికి వృద్ధాప్యము చేత గూనివంగినది. the silver plateis * or indented ఆ వెండితట్ట నొక్కుపోయినది. or inclined తత్పురుడైన, ఆసక్తుడైన. he is * upon quarrelling జగడానికి సంకల్పము చేసుకొన్నాడు.Being * upon injustice అన్యాయానకు ఆలయమై he is * on doing justiceన్యాయ తత్పరుడై వున్నాడు. Are you * on ruining yourself? నీకు నీవే చెడిపోవలెనని నీకు సంకల్పమా?
Benumbed adj తిమురుపట్టిన, కొరడుపారిన. his hand was * by the blow దెబ్బచేత వాడిచెయ్యి మానై పోయినది.
Benzoin n s సాంబ్రాణి.
Bequeathed adj మరణశాసన పూర్వకముగా పెట్టిన.
Bereavement n s వహీనత, కోలుపోవడము.
Bereft adj వహీనమైన, కోలుపడ్డ.
Bergamot n s ఒక తరహాపండు. a fragrant water పన్నీరు వంటి వకనీళ్ళు.
Bergeois n s a particular size of printing letter ఒక తరహాఅచ్చు అక్షరములు.
Beri-beri n s (paralytic rheumatism) వుబ్బువాయువు, తిమురువాయువు:See proof in Telugu, apud Malcolmson On Beri beri page 4-5.
Berry n s కాయ, పండు, అనగా కలిసె గొంజి మొదలైనటువంటి చిన్న చిన్న పండ్లు. brows as a * చామని చాయగల. Berry-berry See beri-beri.
Berth n s or lodgement స్థానము, పట్టు. or bed పడక.
Beryl n s or fine emerald గరుడపచ్చ. దీన్ని పీరౌజా అని అంటారు.See Madras Journal (1840) XII. 171.
Beseechings n s వేడుకోళ్ళు.
Beseeming adj తగిన, ఒప్పిన, యోగ్యమైన. this is not * యిది యోగ్యము కాదు.
Beset adj చుట్టుకోబడ్డ, పరివేష్టితమైన. he was hard * వాడు చాలా యిబ్బందిపడ్డాడు.
Besetting adj చుట్టుకొన్న, అనుసరించే, సహజమైన. drunkenness is their * sin తాగుబోతు తనము వాండ్లకు వుండే సహజమైన రోగము. Inventingnew phrases is the * sin of dictionary writers కొత్తవాక్యములను కల్పించడమనేదినిఘంటుకర్తలకు వుండే సహజమైన దుర్గుణము.
Beshrew it! interj దాని తలపుండు పగల, దాన్ని తగలపెట్ట.
Beside, besides adv గాక, యింతేగాక, వినా. three besides this యిదిగాక మూడు. three besides him అతనుగా ముగ్గురు. besides this యిదివినా.
Besieger n s ముట్టడి వేసేవాడు.
Besmeared adj చరిమిన, పట్టించిన, అలికిన, పూసిన,
Besmirched adj మాసిపోయిన, మురికయైన, పొగచూరిన.
Besmutted adj మూసిన, మురికయైన, పొగచూరిన,
Besom n s చీపరకట్ట, పొరక.
Besotted adj తెలివితప్పిన, స్మారకములేని. how * he was to do thisదీన్ని చేయడానికి వాడకేమి జడత్వము పట్టింది. * ignorance ఒట్టి అవివేకము.
Besought past and part of Beseech వేడుకొన్నది,వేడుకోబడ్డ,బలిమాలుకోబడ్డ, he was * by us నాచేత వేడుకోబడ్డాడు.
Bespangied adj మెరిసేవాటిచేత అలంకరించబడ్డ. the awning was * with goldఆకురాళానికి బంగారు చుక్కలుపెట్టి కుట్టివున్నది. the sky is * with stars ఆకాశము చుక్కలచేత మెరుస్తున్నది.
Bespread adj పరచిన. the table was * with dainties ఆ మేజా ఆహారములచేత పరచబడి వుండెను.
Best adv ఉత్తమముగా. he wrote it * అందరి కంటే వీడు బాగా వ్రాసినాడు. hecame off * జయించినాడు. I like this * యిది నాకిష్టము. For some reason * known, to himself,he carried my horse away నాగుర్రాన్ని తీసుకొని పోయినాడు,ఆ హేతువ వాడికే తెలియవలెను. he came off second * వోడిపోయినాడు.
Bestained adj కరయైన, మరకైన, మురికైన.
Bestial adj పశుప్రాయమైన, రసాభాసమైన. * drunkenness చెడ్డ తాగుబోతు తనము.
Bestiality n s filthiness పశుప్రాయత, రోత, రసాభాసము.
Bestowal n s యివ్వడము, ఈవి.
Bestowern n s యిచ్చేవాడు, త్యాగి.
Bet past of Beat కొట్టినది, he * or did beat కొట్టినాడు యిది ప్రాచీనమే.
Betel n s (or Areca, Paun) తమలపాకు, తాంబూలము. * nut పక్క. a *garden ఆకుతోట. the * vine తమలపాకుతీగె. * nut scissors or nippers tocut the nut ఆడ కొత్తు, పోకొత్తు. * nut box అడపము, సంబెళ. Four sortsare called వొప్పులు, పానారము, ఆరంగాలు and వలగ్రము.
Betimes adv పెందలకాడ, సమయానికి, వేళకు.
Betle n s See Betel.
Betook the past of Betake
Betorsed adj అల్లాడే, డోలాయమానమైన.
Betrayal n s శత్రువులకు చూపించి యివ్వడము, బయట వేయడము, రట్టుచేయడము.
Betrayed adj శత్రువులకు చూపించి యిచ్చిన, బయట పెట్టిన, రట్టుచేసిన. he was * into these expressions యీ మాటలు వాణ్ని యెరగకుండా బయట వచ్చినవి, వాడినోరు జారి వచ్చినవి.
Betrayer n s శత్రువులకు చూపించి యిచ్చేవాడు, ద్రోహి.
Betrothed adj పయిడిముడుపు చేసిన, నిశ్చితార్థము చేయబడ్డ.
Betrothment n s పయిడిముడుపు, నిశ్చితార్థము.
Better n s పందెము వేసేవాడు.
Bettermost adj ఉత్తమమైన, ఘనమైన.
Betty n s తలుపు పెళ్ళగించే ఒక తరహా ఆయుధము.
Between prep నడమ, మధ్య, సందున. Is there any difference * this and thatదీనికిన్ని దానికిన్ని యేదైనా భేదముకద్దా. something has got * నడమ యేదోవకటి వున్నది. * us we have managed it వాడోనేనో మెట్టుకుదాన్ని సాధించినాము.the disagreement * their statements వాడు వీడు చెప్పినదాంట్లో వుండే అసంగతముdid you hear what passed * them వారికి వీరికి జరిగినది విన్నావా? * the twohouses ఆ రెండిండ్ల నడమ. the business * him and me వాడికి నాకు వుండే వ్యవహారము. * you and me he is a drunkard వాడు తాగుబోతు యీమాట మనయిద్దరిలోనే వుండవలసినది. you must settle this between yourselves దాన్ని మీలోమీరు తీర్చుకోవలసింది. he reads Telugu and writes * whiles తెలుగు చదువుతాడు యెడవేళలో వ్రాస్తాడు. * whiles అప్పుడప్పుడు, మధ్యమధ్య.
Betwixt prep నడమ. See Between.
Bevel n s ఒకతరహా కొలిచే ఆయుధము.
Beverage n s పానము, పానకము, పానయోగ్యమైన, రసద్రవ్యము. their only *is milk వాండ్లు తాగేది పాలే.
Bevy n s సమూహము, పక్షిసమూహము, స్త్రీసమాజము.
Bewailing n s యేడ్చు, మొర, రోదనము.
Beware interj భద్రము, జాగ్రత్త.
Bewidered adj చీకాకుపడ్డ, కలవరపడ్డ, దిగ్భ్రమపడ్డ, గాబరాపడ్డ.
Bewildering adj చీకాకుపరచే, దిగ్భ్రమపరచే.
Bewilderment n s చీకాకు, చిక్కు, దిగ్భ్రమ. of love మోహనపరవశత్వము.Ellanna, 3. 200.
Bewitched adj శూన్యము పెట్టబడ్డ, మోహించిన, మరులుకొన్న, పిచ్చిపట్టిదీన్ని చేసినావు.
Bewitching adj మనోహరమైన, వలపించే. a * girl మోహింపచేసే స్త్రీ.* looks వలపుచూపులు.
Bewitchingly adv మనోహరముగా, వలపించేటట్టుగా.
Bey n s టర్కీషువాండ్లలో వుండేదొర, సర్దారు.
Beyond prep and adv. అవతల, మించి, అతిశయించి. * the riverయేటికి అవతలు. * this యిదిగాక. they went * వాండ్లు మించి పోయినారు.this disease is * cure యీ రోగము కుదురేది అసాధ్యము. he is now * hopeఅతను బ్రతుకుతాడని ఆశ లేదు. lost * all reddress బొత్తిగా చెడిపోయిన. *all bounds అమితముగా. * doubt నిస్సందేహముగా. * what is herein statedయిందులో చెప్పినదిగాక. they went * (or over-reached) him వాణ్ని మోసబుచ్చిరి. to go * or surpass మించుట. or defraud మోసము చేసుట. the sum thatremained * the debt అప్పుపోగా నిలిచినరూకలు. he went * his depthనీళ్ళలో నిలువులోతును మించిపోయినాడు. It is * my power అది నాశక్తికిమించి వున్నది. * all dispute నిర్వివాదముగా. * measure అపారముగా.
Bezel n s వుంగరపుదిమ్మె, వొమ్మచ్చు, వుంగరపుగూడు.
Bezoar n s పామురాయి, తేలురాయి, విషహారియనే పేరుగల ఒకరాయి,గోరోచనము.
Bhoot gram n s (Bengali; cicer arietinum) శనగలు.
Bias n s పక్షము, పక్షపాతము, వొగ్గు. I saw his * in their favorఅతడు వాండ్లతట్టు వొరిగివుండేటట్టు తెలిసింది. the * changes the direction of the bowl ఆగుండు కొంచెము వంకరగా వుండుటవల్లసరిగ్గా పారలేదు.
Biasphemy n s దైవదూషణ, దైవనింద. (F. and R. say దూషణము. SNT.and BNT. say ఈశ్వరనింద.) Observe, that the common Hindu expressionsof adulation "you are my father and my mother; you are my God, are blasphemy in the judgment of the English: this is * నీవు నాతండ్రి, తల్లి, నా దేవుడు అని పరులను అనడము తన తండ్రి, తల్లి, దేవుణ్నిఅవమానము చేయడముగా వున్నది.
Bib n s బిడ్డరొమ్ముగుడ్డ, అనగా బిడ్డలరొమ్ముబట్టలకు మురికి తగలకుండామెడకు కట్టి రొమ్మున వేలాడవిడిచేగుడ్డ.
Bibber n s Wine bibber తాగుబోతు.
Bibbing n s తాగుబోతుతనము.
Bible (LiterallyThe books)గ్రంధములు,The new Sanscrit edition says ధర్మపుస్తకము. other versions say ఖ్రీస్తుమత గ్రంధము. Namesof the Books in the Bible: as rendered in the Sanscrit.Canarese, Tamil, and Bengali versions. OLD TESTAMENT ఆదిభాగము,పాతవొడంబడిక. NEW TESTAMENT అంతభాగము, ధర్మపుస్తక శేషాంశ: (SNT). Genesis అది పుస్తకము, మొదటి ఆగమము, మోశేయొక్క మొదటికాండExodus యాత్రాపుస్తకము, రెండో ఆగమము, రెండో ఆగమము, రెండోకాండ. Leviticus లేవేయ పుస్తకము, మూడో ఆగమము. Numbers గణనా పుస్తకము, నాలుగో ఆగమము. Deut ద్వితీయవివరణ, అయిదో ఆగమము.Joshua యెహోశూయ, యేశవా పుస్తకము. Judges విచార కర్తృ వివరణ, న్యాయాధిపతుల పుస్తకము. Ruth రూథ, రుత్తె. Sam. శిమూయేల్, శమువేల్.Kings రాజావళి, రాజులు. Chronicles వంశావళి దినముల ఆగమము.Neh. నిహిమేయ, నెఖెమీయ, Esther హెష్టరు, యేస్తరు. Job అయాబు,యోబుడు. Psalms గీతము, సంగీతములు, కీర్తనములు. Proverbs హితోపదేశము,సాలోమని వాక్యములు, సామితెలు. Eccl. ఉపదేశక, ప్రసంగి యొక్క పుస్తకము, ప్రసంగియబోధనము, Song పరమగీత, సాలోమని ఉత్తమమైనపాట,శలోమోన కీర్తనము. Isaiah యిశయియ, యోశాయా. Jerem యిరిమియి, యేరేమియ.Lamentations విలాపము, యేడ్వడము, దుఃఖాలాపనము. Ezekiel యిశికేయల్, యెశేకియే. Daniel దానీయెల్. Hosea హేశెయి. Joelయోయెల్. Amos ఆమొస్. Obad. ఉబియ. Jonah యూనస్. Micah మీఖా.Nahum నహూం Habak హబక్కుక్. Zeph. సిఫనియ. Haggai హగేయZechariah సిఖరీయరు. Malachi మలాఖి. Names of the Books of the New Testament, "ధర్మపుస్తకస్య శేషాంశః " (SNT). Matthew మథి, మత్తేయు. Mark మార్క, మార్కు. Luke లూక, లూకా. John యోహ ్ ,యోవాను. Acts ప్రేరితవారిక్రియలు, ఆపోస్తల నడతలు. Romansరౌమీయ, రౌమర, Cor. కరింతీయ, కోరింధల. Gal. గలాతియ. Revelationsప్రకాశితభవిష్యద్వాక్యము, ప్రకటనము; బైలు పెట్టిన విశేషము, ప్రత్యక్షపుపుస్తకము.
Biblical adj బైబిలుసంబంధమైన.
Bibliographer n s గ్రంధములు, వ్రాసేవాడు, యిది కాకుండా, ఆయా గ్రంధముల యొక్కవుత్పత్తి స్థితులను వివరించి వ్రాసేవాడు.
Bibliomania n s పుస్తకాలపిచ్చి, ఒట్టిపుస్తకాల ఆడంబరము.
Bibulous adj సీల్చే, యీడ్చే. a brick is * యిటికరాయి నీళ్ళనుయీచ్చుకొంటుంది. * paper తడిని పీల్చేకాకితము.
Bice n s ఆకాశనీలవర్ణము.
Bickering n s కలహము, రచ్చ, పోరాటము.
Bid thepastofBid SeetoBid, Do as you are bid ఆజ్ఞ ప్రకారముచెయ్యి. cannot you do as you are bid? చెప్పిన ప్రకారము చెయ్యి.
Bidden adj ఆజ్ఞాపించబడ్డ, పిలువబడ్డ.
Bidder n s ఏలములో అడిగేవాడు.
Bidding n s ఆజ్ఙ, పిలవడము, ఏలములో అడగడము.
Biennial adj రెండు సంవత్సరాలకు ఒకమాటుసంభవించే. a * leaseరెండేండ్లకు ఒకసారి చేసే గుత్త.
Bier n s పాడె, కటుక, శవవాహనము.
Biestings n s జున్నుపాలు, చీముపాలు.
Bifucated adj పంగలుగా వుండే, పాయలుగా వుండే. a * branch పంగలకొమ్మ.
Big adj పెద్దడైన, గొప్పైన, లావైన. a * dog పెద్దకుక్క. you are biggerthan me నా కంటే నీవు పెద్దవాడవు. after the child grew big ఆబిడ్డపెద్దపెరిగినతరువాత. as * as a cocoanut టెంకాయంత. he used * langugeఅహంకరించి మాట్లాడినాడు, గర్వముగా మాట్లాడినాడు. She has a * belly:or she is * with child అది కడుపుతోవున్నది. * with hope I visited him నిండా ఆశతో అతనిదర్శనము చేసుకొంటిని.
Bigamist n s రెండు పెండ్లాలుగలవాడు.
Bigamy n s పెండ్లిమీద పెండ్లిచేసుకోవడము.
Bigbellied adj కడుపుతోవుండే, గర్భిణియైన.
Biggin n s a cup గిన్నె. a child's cap బిడ్డకళాయి.
Bight n s ఉచ్చు, ఉరి.
Bigly adv గర్వముగా, అహంకారముగా.
Bigness n s లావు, వొమ్ము, వురుపు.
Bignonia Indica n s Trumpet flower కలిగొట్టు పువ్వు,పాటలపుష్పము. D.
Bigot n s దురభిమాని, మతవైరి, మూఢత్వముగా తనమతమే మతమనేవాడు,మతములో బహుదురాగ్రహము గలవాడు. they are great bigots అన్యమతస్థుల ముఖము చూడకూడదనే వాండ్లు.
Bigoted adj దురభిమానియైన, మతవైరముగల, తనమతమే మతమనే.
Bigotry n s మతవైరము, మతాగ్రహము, స్వమతవిషయకదురభిమానము.
Bilberry n s కోరిందపండ్లు, నల్ల గుత్తిపండ్లు, వీటివంటి ఒక తరహా అడివిచిన్నపండ్లు.
Bilboes n s సంకెళ్ళు, బొండకొయ్య, బొండమాను.
Bile n s a boil పుండు, గడ్డ.
Biliary ducts n s పైత్య సంబంధమైన నరములు, పిత్తనరములు.
Bilious adj పైత్య సంబంధమైన. * attack పిత్తవికారము. * vomitingపైత్య సంబంధమైన. * attack పైత్యపువాంతి. a * fever పైత్యజ్వరము.the * humour పైత్య ప్రకృతి.
Bill n s a bird's * ముక్కు . or account లెక్క, చీటి. a * of exchangeహుండి. a * of inditement ఫిర్యాదు. in parliament మనివి, అర్జి.the * of rights యిది ఒక చట్టము పేరు. * of leading సరుకులపట్టి.* of mortality చచ్చినవాండ్ల పట్టి, ఖానెసుమారులెక్క. * of fare భోజనపదార్థములపట్టి. * of Sale విక్రయచీటి. or advertisement ప్రకటన కాకితము. a knife for hedging పాళకత్తి, మచ్చుకత్తి.
Billet n s చీటి. of wood వంట చెరుకు, మొద్దుకట్టె. a ticket forquartering soldiers విడిది చీటి, అనగా సోజరుకు ఫలానివాడు,యింట్లో చోటు యివ్వవలసిందని యిచ్చిన చీటి. a love letter నాయకుడునాయకికి వ్రాసుకొనే చీటి.
Billet-doux n s a love letter నాయకుడు నాయకికి వ్రాసుకొనే చీటి.
Billiards n s దంతపుగుండ్లాట, యిందులో నిమ్మపండ్లంత రెండుతెల్ల దంతపు గుండ్లున్ను ఒక యర్ర గుండున్ను వుంటుంది. వీటినితోసేకర్ర Cue or Mace అనబడుతున్నది.
Billingsgate n s యిది లండన్ పట్టణములో ఒక బజారుపేరు.* langauge బండుబూతు.
Billion n s నూరు కౌట్లు.
Billow n s అల, సముద్రపు అల.
Billowy adj అలలుగల.
Bin n s తొట్టి, గాదె. corn * వడ్లకళంజము.
Bindes n s కట్టేవాడు. a book * పుస్తకములు జిల్దు కట్టేవాడు.
Binding n s జిల్దు.
Binnacle n s వాడలో కుంబాసు పుండే పెట్టె.
Biographer n s మనిషి యొక్క కీర్తిని, లేక, చరిత్రను వర్ణించేవాడు.
Biographical adj మనిషి యొక్క చరిత్ర సంబంధమైన. a * accountof Sancara శంకర విజయము.
Biography n s చరిత్ర, ఒక మనిషి యొక్క చరిత్ర. the * of Nala నల చరిత్ర.
Bipartite adj ద్విభాగముగా వుండే. a * agreement యిద్దరుగా చేరివ్రాసి యిచ్చిన వొడంబడిక, పరస్పరము వ్రాసుకొన్న వొడంబడిక.the Amaracosa (a certain Vocabulary) is tripartiteఅమర కోశము మూడు కాండలుగా వున్నది.
Biped n s ద్విపాజ్ఙంతువు. or man పశుప్రాయుడైన మనిషి ద్విపాత్పశువు.
Birch n s ఒక తరహా చెట్టు. or twig చువ్వ, దీనితో పల్లెకూటపుపిల్లకాయలను కొట్టుతారు. he wielded the * twenty yearsయిరువైయేండ్లు పల్లెకూటము చెప్పినాడు.
Birchen n s Birch అనే మానితో చేసిన.
Bird n s పక్షి, పిట్ట. a chintz of bird's eye pattern బొట్లు బొట్లుగా వుండే చీటిగుడ్డ. a bird's eye view ఒక తరహా చిత్రము,ఆకాశమునుంచి చూచే పక్షికి వూరు మొదలైనవి యేరీతిగా అగుబడుతున్నవోఅదే రీతిగా వ్రాసిన పఠము. the * that weaves a hanging bottle-shaped nest గిజిగాడు. the tailor * జీనువాయిపిట్ట. the maina *గోరింకపిట్ట. the paddy * బహుదినాలుగా బందేఖానాలో పడివుండేవాడు.
Bird-lime n s జిగురు, బంక, పక్షులను పట్టే పిసును.
Birth n s జన్మము, పుట్టుక. a man of * or a man of high *కులీనుడు. or childbed ప్రసూతి, ప్రసవము. a leper by * పుట్టుపాప. or employment ఉద్యోగము. this gave * to many disputesయిందువల్ల అనేక కలహములు పుట్టినవి. she gave * to a childఅది బిడ్డ కన్నది. he had his * there అక్కడ పుట్టినాడు. new *పునజ ్న్మము, పునజ ్న్మము. a place in a ship స్థానము, ఉనికిపట్టు.the soldiers went to their respective births సోజర్లు వాండ్ల వాండ్ల స్థానానికి పోయినారు.
Birthday n s పుట్టినదినము.
Birtheful adj ఉల్లాసముగల, ఉత్సాగముగల, సంతోషముగా వుండే.
Birthplace n s జన్మభూమి, పుట్టినచోటు.
Birth-right n s పుట్టుకచేత వచ్చిన స్వాతంత్య్రము. this is my *యిది నా పిత్రార్జితము.
Biscuit n s బిస్కత్తు, చక్కిలము, పాల కాయవంటిది.
Bisection n s రెండుగా ఖండించడము.
Bishop n s ప్రధాన గురువు, పెద్దపాదిరి. (ధర్మాధిపతి. ST ). atJerusalem the word is Vakeel! See Robinson's BiblicalResearches in Palestine 3. 456. (A. D. 1841). * at chessశకటము, రథము, వొంటె.
Bishopric n s ప్రధాన గురుత్వము.
Bishops-weed n s వోమపుచెట్టు, వోమము, ఖురాసానివామము.The Sansc. name is దీప్యము, కరాలము. (Hyoscyamus)
Bismuth n s తగరమువంటి ఒక లోహము.
Bisnagur n s అనగా విజయనగరము.
Bison n s మనుబోతు, కారెనుము, కార్బోతు.
Bissextile n s or Leap-year అధిక సంవత్సరము, అనగా మూడేండ్లకుఒకమాటు ఫిబ్రవరి నెలకు 29 తేదులు వచ్చే సంవత్సరము.
Bister n s a brown colour చామని చాయ.
Bistoury n s సత్రము చేసే కత్తి.
Bit n s తునక, తండు, ముక్క, తునియ. there is not a * of reasonin this యిందులో రవంతైనా న్యాయములేదు. a * of glass అద్దపుతునక.a * of butter వెన్నపూస. a * of cloth గుడ్డ తునక, పేలిక. a * orpiece of wood మాను, కర్ర, చెక్క. a * of ground కొంచెము నేల. a * of food కబళము. I have not eaten a * to-day నేను నేడు ఒక కబళమన్నాతినలేదు, ఒక మెతుకన్నా తినలేదు. a little * రవంత. every * యావత్తు.a * of an account కొంచెములెక్క. a * of a child కూన. she did notstir a * అది రవంతైనా కదలలేదు. * by * he ate all of it రవంతరవంతగా దాన్ని అంతా తినివేసినాడు. To break to bits పొడిచేసుట.the * of a bridle కళ్ళెపు కుక్కలు. I have got the * but ro bridleనోటికి వేసే యినప కళ్ళెము వున్నదిగాని దానికి తగిలించి యీడ్చేవారులేదు.
Bitch n s ఆడకుక్క. a * fox ఆడనక్క. * of wolf ఆడతోడేలు.a whore లంజ.
Bite n s కాటు.
Bitten adj కొరికిన
Bitter adj చేదైన. the * melon వెర్రి పుచ్చకాయ. or cruel క్రూరమైన.a * foe క్రూరశత్రువు. or intense అతి, చెడ్డ. he is in * grief వాడు అతివ్యాకులముగా వున్నాడు. this was a bitter disappointment యిది మహత్తైన భంగము. * cold చెడ్డచలి, పాడుచలి. bitters చేదైనకషాయము.
Bitterly adv క్రూరముగా, అతిశయించి. he reviled her * దాన్నినిండా తిట్టినాడు.
Bittern n s తుంపొడిపక్షి, రాయితొలిచే గాడు అనే పక్షి. See Goatsucker.
Bitterness n s చేదు. or malice చలము, పగ, విరోధము, వైరము. * of grief మహద్వాకులము. the * of death చావు భయము.
Bitumen n s మట్టితైలము. also a crystallized foliated gypsumor stalactite శిలాజిత్తు.
Bituminous adj మట్టితైల సంబంధమైన.
Blabbed adj బయిటపడ్డ, బయిలుపడ్డ.
Black n s or Blackness నలుపు కప్పు. a blackmoor నల్లవాడు, అనగాసద్దీవాడు. to wear * నల్లవుడుపు వేసుకొని వుండినది. Collyrim కాటుక.
Black pulse (nameofasortofgrain),మినుములు.
Blackamoor n s అబ్బీవాడు, సిద్దీవాడు. this is never applied to thepeople of India.
Blackberries n s (add,) they are as plentiful as * అవి కుక్కల మురికిగా వున్నవి.
Blackberry n s కలివే పండ్లవంటి ఒక తరహా అడివి పండ్లు.
Blackbird n s కోకిలవంటి వకపక్షి.
Blackbook n s పాప పురాణము.
Blackcattle n s పశువులు, గొడ్లు.
Blackened adj నల్లబడ్డ. * with smoke పొగచూరిన.
Blackest adj మహానలుపైన. the * wickedness చెడు దుర్మార్గము.
Blackguard n s పోకిరి.
Blackguardism n s పోకిరితనము.
Blackguardly adv పోకిరితనముగా.
Blackhole n s or dungeon అతి నిర్భంధమైన చెరసాల.
Blacking n s శప్పాతుకు పూసే కాటుక.
Blackish adj కొంచెము నలుపైన, పొగురైన.
Black-lead n s నల్ల సీసము.
Blackleg n s పోకిరి, జూదగాడు.
Blackletter n s పాత యింగ్లీషు అక్షరములు, ప్రాచీన యింగ్లీషు లిపి.
Blackmail n s or protection money తమ్మును దోచుకోకుండా వుండడానకైకాపులు పాళయ గాండ్లకు యిచ్చే కట్ణము.
Blackness n s నలుపు, నైల్యము. from the * of the night రాత్రిఅంధకారముగా వుండినందున.
Blacksmith n s కమ్మరవాడు, కరమలవాడు.
Blackstone n s కత్తెరరాయి, నల్లరాయి.
Blackthorn n s ఒక తరహా అడివి చెట్టు.
Blacktown n s That part of Madras which is within the townwalls చన్నపట్ణము, అనగా ప్రహరికిలోగా వుండే పట్టణము. the *and it's suburbs చెన్నపట్టణమున్ను దానిచుట్టూ పేటలున్ను.
Blacky n s నల్లవాడు, యిది ప్రయోగించరాని శబ్దము.
Bladder n s మూత్రపుతిత్తి, ఉచ్చబుడ్డ, దీన్ని గాలితో నిండించి మూతినిబిగించికట్టి నీళ్ళలో వేసుకొని యీదుతారు. the gall * పైత్యపుతిత్తిSand in the * సికతామేహము, మూత్రకృఛ్ఛ్ర రోగము.
Blade n s of a weapon అలుగు. of grass & c. ఆకు. when corn is in the* పయిరు ఆకులో విడిచినప్పుడు. of an oar వడవతోనే కర్రయొక్క కొన ఆకు.Shoulder * రెక్క. a gay young * సొగసుగాడు, ధీరుడు, ఘట్టి చిన్నవాడు.
Bladebone n s Shoulder-blade రెక్క.
Blain n s బొబ్బ, కురుపు.
Blamable adj నింద్యమైన, దూష్యమేన, కారాని, చెడ్డ.
Blamably adv తప్పుగా, అతిగా. he was * severe వాడికి అంత క్రౌర్యముకారాదు. he was * negligent అతి అజాగ్రత్తగా వుండినాడు.
Blame n s నింద, నెపము, తప్పు. this word has no plural.
Blameless adj నిరపరాధియైన, నిర్దోషియైన, తప్పులేని.
Blamelessly adv నిరపరాధముగా, నిర్దోషముగా, తప్పులేక.
Blamelessness n s నిరపరాధిత్వము, నిర్దోషిత్వము.
Blameworthy adj నిందార్హమైన, దూష్యమైన.
Bland adj శాంతమైన, సౌమ్యమైన, తిన్నని, మృదువైన. * languageమృదువైన మాటలు.
Blandishment n s మృదుభాషణములు, తియ్యనిమాటలు, చల్లనిమాటలు.or fondling లాలన, బుజ్జగింపు.
Blank n s వ్రాయనిది, వ్రాయక విడిచిన స్థలము. he left blanks for the names పేర్లకుగాను వుత్తచోట్లు విడిచి పెట్టినాడు. his life is nowa perfect * వాడు యిప్పుడు మిక్కిలి నిర్విణ్నుడై వున్నాడు. In a lotteryఉత్తచీట్లు.
Blanket n s కంబళి, గొంగళి.
Blaring adj అరిచే, వాగే.
blarney n s humbug వట్టి నోటిమాటలు, మాయమాటలు, బుజ్జగింపు మాటలు.
Blashphemer n s దేవుణ్ని గురించి అమర్యాదగా మాట్లాడేవాడు, దూషణగామాట్లాడేవాడు. (SNT. and BNT. నిందకుడు.)
Blasphemously adv అమర్యాదగా, దైవదూషణగా. he spoke * దైవదూషణగామాట్లాడినాడు.
Blasphemy n s A+ in Matt XII says simply నింద and we say దూషణ It is sheer * to call this wretched song the work of Milton ఇది ఆయన చెప్పినాడని అనడము ఆయనకు అపనింద, దూషన. See Clarke on Matt. IX. 3.
Blast n s of wind ఘాలి దెబ్బ. he blew a * on the trumpet తుత్తారవూదినాడు. or Blight కాటుక, ధాన్యగింజలకు పట్టే కాటుక.
Blasted adj ధ్వంసమైపోయిన, చెడిపోయిన. It was * by a curseశాపముచేత చెడిపోయినది. * ears of corn తాలు.
Blaze n s జ్వాల, మంట. the house was in a * ఆ యిల్లు మండుతూవుండెను. I saw a great * ఒక మంటను చూస్తిని. or splendour కాంతి, తేజస్సు. these words put him in a * యీమాటలకు మండిపడ్డాడు.She was then in the * of beauty అప్పట్లో అది అందముతో వెలుగుతూవుండెను. the * of his fame వాడి కీర్తి యొక్క ప్రకాశము. the wholetown was in a * with the news ఆ సమాచారము పట్టణమంతా యేక గుబగుబలుగా వుండినది.
Blazing adj జ్వలించే, ప్రకాశించే, ప్రచురమైన.
Blazon, Blazonry n s. వర్నన.
Bleached adj తెల్లబారిన, చలవచేయబడ్డ.
Bleak adj జిల్లుమనివుండే. a * wind పండ్లు కట్టుకొనిపొయ్యే చలి.a * place అతి శీతల ప్రదేశము.
Bleakness n s అతి శీతలము.
Blear adj పుసులు కట్టిన, మసకగావుండే, మబ్బుగావుండే. * eyedఅవిటికండ్లుగల, జబ్బుదృష్టిగల. * eyedness దృష్టి మాంద్యము.
Bleared మాశిన, * with weeping యేడ్పుతో యెర్రపారిన.
Bleat n s మేకకూత.
Bled the past of ToBleed
Blemish n s కళంకము, దోషము. or defect కొరత. his character iswithout * వాడి పేరుకు వక తక్కువలేదు.
Blemished adj కళంకముగల, దోషయుక్తమైన.
Blessed adj శ్రీ, శ్రీమత్, శుభమేన, దీవించబడ్డ, పుణ్యమేన, దివ్యమైన,పావనమైన. that * book ఆ పావనమైన గ్రంధము. a * man or saint మహాపురుషుడు, సిద్ధుడు. a * day పుణ్యదివసము. * is the man that feareth God దేవుడికి భయపడేవాడు పుణ్యపురుషుడు. * are the mercifulదయారసము గలవాండ్లు ధన్యులు. SNT. The other versions say భాగ్యవంతులు.he was * with a child స్వామి కటాక్షముచేత వాడికి ఒక బిడ్డ కలిగినది. his endeavours were * with success వాడి ప్రయత్నములు సఫలమైనవి. the * ముక్తులు. the realms of the * i. e. heaven పుణ్యలోకము, దేవలోకము. * bread ప్రసాదము.
Blessedness n s Happiness భాగ్యము, సౌఖ్యము, సుఖము. heavenlyముక్తి, మోక్షము. sanctity పరిశుద్ధత, పావనత. single * వివాహములేకవుండడము, బ్రహ్మచర్యము, కన్నెరికము.
Blessing n s దీవెన, ఆశీర్వాదము. or benefit వరము, అనుగ్రహము,భాగ్యము, శ్రేయస్సు, శుభము, మంగళము. the blessings that God upon us దేవుడు మాకు వొసగిన వరములు. he is a * to the poor వాడు పేదలకు కల్పవృక్షము. the priest pronounced the * పురోహితుడు అనుగ్రహము చెప్పినాడు.
Blight n s ruin చెరుపు, నాశనము. of plants తెవులు, చీడ, కాటుక.
Blighted adj చెడిన, కాటుకబట్టిచెడిన, చీడబట్టిచెడిన. he mourned his * hopes తన కోరిక భంగమైనందుకు యేడిచినాడు.
Blind n s (or venetian) ఆకుల తలుపు. or screne పేములతెర. horseblinds గుర్రపు కంటి కప్పులు. or pretext సాకు, నెపము. the letter was intended as a mere * ఆ జాబు వూరికె భ్రమ పడేలాగు వ్రాసినది.
Blindfold adj కండ్లకు గంతకట్టిన. he carried me * through the business ఆ వ్యవహారము నాకు తెలియనీయక నన్ను కొనే గడిపించినాడు. The Hindu girls are married * హిందూ పడుచులు అజ్ఞానదశగా పెండ్లిచేయ బడుతారు.I bought the horse * ఆ గుర్రాన్ని కండ్లుమూసుకొని కొన్నాను.
Blinding adj or dazzling కండ్లుచెదిరే.
Blindly adv గుడ్డితనముగా, అవివేకముగా, విచారించక.
Blindness n s గుడ్డితనము, అవివేకము, అజ్ఞానము.
Blindside n s దోషము. Pride is his * వాడికివుండేదోషము గర్వము.
Blindworm n s ఒక తరహా పాము.
Blink n s రెప్పపాటు.
Blinkers n s గుర్రపు కండ్లమూతలు.
Bliss n s బ్రహ్మానందము, పరమసుఖము, ఆహ్లాదము.
Blissful adj ఆనందకరమైన, ఆహ్లాదకరమైన.
Blister n s పొక్కు. or medicine to produce a * పొక్కు ప్లాస్త్రి.
Blistered adj పొక్కిన. * steel ఒక తరహా తెల్ల వుక్కు. my feet are * with walking కాళ్ళుబొబ్బలయినవి.
Blithe adj ఉల్లాసముగల, ఉత్సాహముగల, సంతోషముగావుండే.
Blitheness n s ఉల్లాసము, ఉత్సాహము.
Blithesomeness n s ఉల్లాసము, ఉత్సాహము.
Bloated adj వాచిన, వూదిన, వుబ్బిన. * with pride గర్వముచేత తలకొవ్విన.
Bloater n s పొగలోకట్టి యెండపెట్టిన ఒక తరహా చేప.
Block n s మొద్దు. a * of wood కొయ్య, మొద్దు. Some pictures, and books are printed from blocks of wood. కొన్ని పటములున్ను, పుస్తకములున్ను కొయ్య మొద్దుపడి అచ్చులతో అచ్చు వేస్తారు. A * cutter కొయ్యమొద్దుల మీద పడెచ్చులు చెక్కేవాడు. carpenter's * దాలికర్ర, వడ్లవాడు కొయ్యచెక్కేటప్పుడు యెత్తుగా పెట్టుకొనే మొద్దు దుంగకొయ్య. * of stone రాతిబండ. the culprit was brought to the * ఆ నేరస్తునితల నరకబడ్డది. He escaped the * వాడి తలతప్పింది. a stumbling * అభ్యంతరము, ప్రతిభంధకము, భంగము. he put this stumbling * in my way నాయత్నమును భంగపరచినాడు. a large pulley పెద్దకప్పి.
Blockade n s ముట్టడి, దోవమూయడము. they raised the * ముట్టడిని తీసినారు.
Blockhead n s జడుడు, మొద్దు, మందమతి.
Block-house n s రాయిలేకుండా కొయ్యమొద్దులతో కట్టిన యిల్లు.
Blockish adj మందమతి అయిన, జడుడైన.
Blockishness n s జడత్వము.
Block-tin n s తహరపుగడ్డ, తగరపు ముద్ద.
Blonde lace n s మహావెలపొడుగైనరవశెల్లా.
Blood n s నెత్తురు, రక్తము. No * was shed on this occasion యీతరణములో యెవరికిన్ని గాయముతగలలేదు. * of the grape i. e. wine సారాయి, or kin బంధుత్వము. Borthers by * సయాంతోడ పుట్టినవాండ్లు. relations by * రక్తసంబంధముగల బంధువులు. one of base * నీచుడు, క్షుద్రుడు. a son of the full * ఔరసపుత్రుడు. gentle * సద్వంశము. one of gentle * మంచికులస్తుడు. or progeny సంతతి, సంతానము, వంశము. the prices of * చంపినందుకుచెల్లు. or courage ధైర్యము. His * was up వాడికి చెడు ఆగ్రహము వచ్చినది. a * horse శ్రేష్టమైన గుర్రము. bad * పగ, ద్వేషము. there is bad * between them వారియిద్దరికిన్ని ద్వేషముగావున్నది. this bred ill * between them యిందుచేత వారికి విరోధము పట్టినది. In cold * నిశ్చింతగా, సునాయాసముగా. they murdered him in cold * వాణ్ని వక పురుగును నలిపినట్టు చంపినారు. hot * ఆగ్రహము. a man of * ఘాతకుడు, అతిక్రూరడు. a deed of * హత్య. my * curdled at hearing this దీన్ని వినగానే నా గుండెఝల్లుమన్నది. his * is cooled by experience కాగిచల్లారిన పాలుగా వున్నాడు. a fop or coxcomb బడాయికోరు. * hot గోరువెచ్చని, నులివెచ్చని. * red రక్తవర్ణమైన. a * hound వాసనచేత దొంగజాడను కనిపెట్టేకుక్క * shot eyes యెర్రబారిన కండ్లు. * stone యమునా రాయి, ఒక తరహా యెర్ర రాయి.
Blood heat n s గోరువెచ్చన, నులివెచ్చన.
Blooded adj or i. ఏ. having * నెత్తురుగల. the patient was blood or * ఆ రోగికి నెత్తురు దీసినారు. cold * నిర్దయాత్మక, క్రూర. hot * రేగే, మండిపడే.
Bloodguilitiness n s హత్యదోషము.
Bloodily adv క్రూరముగా.
Bloodiness n s నెత్తురుగా వుండడము. from the * of this battle యీ యుద్ధములో చాలామంది చచ్చినారుగనుక.
Bloodless adj రక్తహీనమైన, నెత్తురు చచ్చిన, తెల్లపారిన. * sacrifice సాత్విక పూజ, పిష్టపశు మేధము.
Bloodletting n s కత్తివాటు చేయడము.
Bloodshed n s ప్రాణహాని.
Bloodsheding n s ప్రాణహాని.
Bloodstone ఒకతరహాచెకముకరాయి,నల్లరాతిభేదము
Bloodsucker n s (a sort of lizard) తొండ, వూసరవల్లి, సరటః.voracious wretch పీల్చేవాడు, దోచేవాడు.
Bloodthirstiness n s క్రూరత్వము, గాతుకత్వము.
Bloodthirsty adj క్రూరమైన, ఘాతుకమైన.
Bloodvessel n s నరము.
Bloody adj రక్తమయమైన. the * flux నెత్తురుభేది. or cruel క్రూరమైన,అఘోరమైన. * minded క్రూరహృదయముగల. a * battle అఘోరమైన యుద్ధము. a * sacrifice తామసపూజ. (compare unbloody సాత్విక).
Bloodyminded adj క్రూరమనస్సుగల.
Bloodysweat n s నెత్తురు చెమట.
Bloom n s మొగ్గ, పువ్వు. the prime of life బాల్యము, కౌమారము.he was cut off in the * of his age వాణ్ని పశితనములో తుంచుకొనిపోయినది.
Blooming adj నవయౌవనముగల. a * beauty నవయౌవనవతీ.
Bloomy adj వికసించిన, పువ్వులుగల.
Blossom n s మొగ్గ, పువ్వు.
Blot n s తుడుపు, పాట, గిరుగు, మరక. Stain or disgrace కళంకము,మాలిన్యము, అపనింద.
Blotch n s చమరకాయలు, కడి, మచ్చ, సిభ్యము.
Blotted adj మరక తగిలిన. * out పాటాకొట్టిన, తుడుపుపెట్టిన, కొట్టివేయబడ్డ.
Blotting-paper n s వూరే కాకితము.
Blow n s దెబ్బ, పెట్టు, ఆపద, ఢక్కా. who gave the first *? ముందర చెయి మించినది యెవడు? they came to blows గుద్దులాడసాగిరి. a * with the first గుద్దు, పిడిగుద్దు. a * on the head with the knuckles మొట్టు, మొట్టికాయ. on the cheek చంపపెట్టు, చంపకాయ. this was a fatal * to him వాడికి యిది ఒక దౌర్భాగ్యము, ఆపద, ఢక్కా. the cholera destroyed a thousand people at a * వాంతి భేది బహుమందిని ఒక దెబ్బనకొట్టుకొని పోయినది. or bloom వికసనము, పూయడము. the flowers are now in full * యిప్పట్లో పువ్వులు బాగా వికసించివున్నవి.
Blown the past of Blow.
Blowzy adj పెద్ద యెర్ర ముఖముగల, పల్లెటూరి మోటుపడుచుల వర్ననయందు వచ్చేమాట.
Blubber n s (fat of a whale) పెద్దచేప కొవ్వు, యిందుతో నూనె చేస్తారు.
Blubber-lip n s లావు పెదివి.
Bludgeon n s దుడ్డుకర్ర, దండము, యిది దొంగచేతికర్రను గురించినమాట.
Blue adj నీలవర్ణమైన. dark * శామవర్ణము. light * చామనిచాయ.the * sky నీలవర్ణమైన ఆకాశము. the * veins పచ్చ నరాలు. eyesనీల వర్ణమైన కండ్లు. He looked * వెలవెలపోయినాడు, యిది నీచ తిట్టుమాట. a * light in fire works మత్తాపు, పగులువత్తి. the * bellflower గంటెన పువ్వు. a * bottle fly గండీగ, పోతుటీగ. * stockingవిద్వాంసురాలు యిది పరిహాసముగా చెప్పేమాట.
Blueness n s నీలత్వము, నైల్యము. * of a wound కందువ.
Blue-pill n s రసముతో చేసినవక మాత్ర.
Blue-vitriol n s మయిలతుత్తము.
Bluff adj దాష్టీకమైన, తృణీకరమైన. a * rock నెట్రముగా వొడుదుడుకుగావుండేమోటు కొండ.
Bluish adj కొంచము నీలవర్ణమైన.
Blunder n s పొరబాటు, తప్పు.
Blunderbuss n s పెద్దతుపాకి, మూతి వెడల్పైన పొట్టి తుపాకి.
Blunderer n s పొరబాటుపడేవాడు, తప్పేవాడు.
Blunder-headed adj జడుడైన, మూఢుడైన,
Blundering adj పొరబాటుపడే, తప్పే, మూఢుడైన.
Blunt adj మొద్దైన, మొక్కబోయిన, మొండియైన. * knife మొద్దుకత్తి,పదనులేనికత్తి. * catridge గుండులేని తోటా.
Blunted adj పదునులేని, మొక్కైన, మొద్దైన, మొండిపారిన. his sorrowwas * by time దినాలుచెల్లినందు మనవాడివెసనం ఆరింది. He used bluntlanguage కట్టె విరిచినట్టు మాట్లాడినాడు. He gave a blunt answer మోటుజవాబు యిచ్చినాడు.
Bluntly adv మొద్దుగా, మోటుగా.
Bluntness n s పదునులేని మోటు, మొద్దుతనము, మోటతనము.
Blur n s కర, మరక, కళంకము, మాశినది.
Blush n s యెరపు, సిగ్గు. at the first * this appears unjust పైకిచూస్తే అన్యాయము వలె తోస్తున్నది.
Blushing adj యెర్రపారిన, యెర్రని. a * apple యెర్రటి పండు.
Bluster n s జంభము.
Boa n s (a snake) దాసరిపాము, పెంజరిపాము. an article of female dress దొరసాన్లు వేసుకొనే బొచ్చుమాల.
Boar మొగపంది, A * spear బల్లెము. A wild * అడవిపంది.
Boar ,or Bore n s the high tide in certain rivers బాణము, అనగా వొకప్పుడు యేటి ముఖద్వారము గుండా సముద్రపు నీరు నలభై యాభై కోసుల దూరము బాణమువలె యెక్కి దినములకు తీసి పొయ్యెపోటు.
Board n s పలక. table మేజ, బల్ల. the festive * విందు. the royal * రాజు యింటి భోజనము. subsistence కూటి శెలవు. I pay for his * వాడికూటి శెలవుకు యిస్తాను. entertainemnt విందు, పంజ్ఞ్తి భోజనము, గ్రాసము, భోజనము. In this school they furnish the boys with * and lodging యీపళ్ళి కూటములో పిల్ల కాయలకు గ్రాస నివాసములను యిస్తారు. boards of a book పుస్తకానికి రెండుపక్కల వేసే పలకలు. a book in boards తోలులేకుండా ఉత్త కాకితముతో స్వల్పముగా బైండు చేసిన పుస్తకము. the boards నాటకశాలలో ఆడేటందుకు పలకలతో పేర్చిన స్థలము. She went onthe boards దాన్ని ఆటకువిడిచినారు. Council ఆలోచన సభ. the * of Revenue ములికీసంగతిని విచారించే ఆలోచనసభ. the military * దండుక మామిసునే విచారించే ఆలోచనసభ. on * a ship వాడలో. he went on * వాడ యెక్కినాడు. he fell over * వాడమీదనుంచి నీళ్ళలోపడ్డాడు. sea-board అనగా, Land-ward భూమివేపు, above * (without artifice) నిష్కపటముగా, బహిరంగముగా.
Boarded adj పలకలతో తాపిన, పలకలుపరచిన.
Boarder n s పూటకూళ్ళుతినేవాడు. in battle, శత్రువాడమీద దూరేవాడు.
Boarding-school n s కూడుపెట్టి చదువుచెప్పే పళ్ళి కూటము.
Board-wages n s కూటిఖర్చు, బత్యఖర్చు.
Boast n s జంభము, బడాయి, జల్లి.
Boaster n s జంభాలుకొట్టేవాడు, బడాయికొట్టేవాడు.
Boastful adj జంభాలునరికే, బడాయికొట్టే.
Boasting n s జంభము, బడాయి.
Boastingly adv జంభముగా, బడాయిగా.
Boat n s పడవ, దోనే. a basket * పుట్టి. a butter *, sauce *, or pap* గిన్నె.
Boat-hook n s అంకుశంవంటి, చేపలనే పొడిచే వక తరహా యీటి. Boating, n. s. పడవ యెక్కి విహారముగా పోవడము.
Boatman n s పడవవాడు.
Boatswain n s తండేలు.
Bob n s కాయ. an ornment జుమికి, బులాకి, కప్పై కుచ్చు, మొదలైనవి.
Bobbin n s a kind of string ఒక తరహా అల్లిక దారము. or pin మేకు.
Bobtailed adj మొండితోక గలది.
Bocm n s of a ship దూలము, అనగా వాడవెనకతట్టు తోకవలె నిడువుగావుండేమాను.
Boddice n s రవికె.
Bodice n s రవికె.
Bodiless adj శరీరములేని, శరీర విహీనమైన.
Bodily adv బొత్తిగా, యావత్తు. he carried it off * దాన్ని అంతా వక దెబ్బగా అంటుకొని పోయినాడు.
Bodkin n s దబ్బనము.
Body n s శరీరము, దేహము, కాయము. somebody యెవడో. anybodyయెవడైనా. nobody యెవరులేదు. everybody అందరు. all over theనిలువెల్లా. a dead * పీనుగ, శవము. the * was carried out of the town ఆ పీనుగ పట్ణానికి బయట తీసుకొని పోబడ్డది. a headless * కబంధము, మొండెము. or person మనిషి. she is a good * అది మంచి మనిషి. the old body will not agree ముసిలిది వొప్పదు. a busy * అధిక ప్రసంగి, దుర్వ్యాపారానికి పొయ్యేవాడు. principal part ముఖ్యమైన భాగము. the * of the people were in our favour, but a few were agaisnt us జనమంతా మా పక్షముగా వుండినారు గాని కోందరు మాత్రము విరుద్ధముగా వుండిరి. a few troops have arrived, but the * of army not come yet కొంత సేన వచ్చిందిగాని ముఖ్యమైన దండు రాలేదు. the body of the tree is sound but the branches have perished కొమ్మలు పోయినవి అడుగు మొద్దు మాత్రము బాగా వున్నది. the * of the letter was in his hand writing ఆ జాబులో ముఖ్యమైన భాగమును సొంతముగా వ్రాసినాడు. the * of her gown was red, the skirt was white దాని గౌను నడుములమట్టుకు యెరుపున్ను కింది పావడ తెలుపుగా వుండినది. or assembly గుంపు, స్తోమము. they came in a * గుంపుగా వచ్చిరి. a * of travellersబాటసారుల గుంపు. a * of police బంట్రోతుల గుంపు. a * of soldiersకాల్బలము. a * of friends ఆప్తవర్గము. a * of horse గుర్రపు దళము. there was large * of evidence బహుమంది సాక్షులువుండిరి. a * of poetry కావ్య గ్రంధములు. a * of divinity వేదాంతసార సంగ్రహము. a * of law ధర్మ శాస్త్రము. a * of medicine వైద్య శాస్త్రము. the coach had a black * with a red carriage బండిపయిపెట్టె నలుపున్ను అడుగు చట్టము యెరుపుగానున్ను వుండెను. the * of the church is old, the front is new ఆ గుడియొక్క ముఖ్యమైన భాగము పాతది ముఖమంటపము కొత్తది. the heavenly bodies సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలైనవి. or strength of wine కారము, సత్తువ. this wine has no body యీ సారాయిలో కారములేదు, చప్పగా వున్నది.or substance వస్తువు. glass is a brittle * గాజు పెళుచైన వస్తువు. this is a metallic * యిది వక లోహము. wood is an inflamable * కాష్టము దహనశీలమైనది, కొయ్య అంటుకొనేటిది. a particle or atomic * అణువు, కణము. she has a fine * of voice దానిది మంచి శారీరము. able bodied దృఢగాత్రుడైన, కాయపుష్టిగల. the bank burst and a large * or water broke out కట్ట తెగి విస్తారము నీళ్ళుపోయినది. BODY అనే శబ్దమును తప్పుగా ప్రయోగిస్తారు, యేలాగంటే, వాడికి వొళ్ళు కుదురు లేదు, దానికి వొళ్ళు కుదురుగా వున్నది, వారికి శరీరము కుదురలేదు. he is ill, she is well, they are unwell, యిట్లా అనకుండా his body is not well అంటే వాడి పీనుగ బాగా వుండలేదు, అని విరుద్ధముగా అర్థమౌతున్నది గనుక యీలాటి స్థలములలో body అనగా శవము, మానము, పొట్ట, పేగులు అని భావిస్తున్నది గనుక యీ శబ్దము బహు పదిలముగా ప్రయోగించవలసినది.
Body guard n s అంగ రక్షకులుగఅ వుండే భటులు, మైగాచేవారు.
Body-clothes n s విడి గుర్రమునకు పైనవేసే బురకా.
Body-guard n s అంగరక్షక సేన, అనగా రాజు సమీపములో వుండే తురుపుసవార్లు.
Bodysnatchers n s పాతిపెట్టిన పీనుగను తొవ్వి యెత్తుకొనేవాడు.
Bog n s బాడవ నేల, వాడవపొలము, చితచితలాడే భూమి, బురదనేల.
Boggling n s సందేహము, అనుమానము, సంకోచము, శంక.
Boggy adj చిత చితలాడే, బురదగా వుండే.
Bog-house n s (Johnson) మరుగు పెరడు, పాయఖానా.
Bohea n s ఒక తరహా తేయాకు.
Boil n s కురుపు, గడ్డ, పుండు. a raja * (gangrene or carbuncle) రాచపుండు.
Boiled adj కాగిన, వుడికిన, పచనమైన. half * వుడికీ వుడకని, ననుబాయిగా వుండే. * water కాగి చల్లారిన నీళ్ళు. * rice అన్నము.
Boiler n s బాన, కాగు. a sugar * or vessel బెల్లముకాచే బాన. or merchant బెల్లపు వర్తకుడు.
Boiling adj వుడికే, కాగే. * water వుడుకునీళ్ళు. * bravery ఉత్సాహము.
Boisterous adj ఘర్జించే, ఘోషించే, ప్రచండమైన, బ్రహ్మాండమైన. * seaఘోషించే సముద్రము. * wind ప్రచండ వాయువ్వు. * woman బొబ్బలు పెట్టేఆడది. Hunting and boxing are * amusements వేట, జట్టిపోట్లాట, యివిదొమ్మిపనులు.
Boisterously adv ఘోషించి, ప్రచండముగా, అరిచి, బిగ్గర, దొమ్మిగా.
Boisterousness n s ఘోష, ఘర్జన, అరుపు, కూత, దొమ్మి.
Bold adj ధైర్యముగల, ఘట్టిగుండెయైన, సాహసముగల. a * round handధాటిగా బటువుగా వుండే దస్తూరి. a * hill నెట్రముగా వుండే కొండ. orimpudent మొండి, తుంట. I made * to tell him that this was not lawful యిది న్యాయము కాదని అతనితో చెప్పే దానికి తెగించినాను, సాహసముచేసినాను. may I make * to come there నేను అక్కడికి వస్తాను అపరాధముక్షమించవలెను.
Boldly adv ధైర్యముగా, నిర్భయముగా.
Boldness n s ధైర్యము, నిర్భయము. he has the * to ask this question తెగించి యీ మాటను అడిగినాడు.
Bole n s (the trunk of a tree) అడుగుమాను, అడగు మొద్దు, ప్రకాండము.Armenian * భోళమనే ఔషధము. Ainslie says సీమ కావిరాయి.
Bolled adj గింజపట్టిన.
Bolster n s పెద్ద దిండు, పెద్ద తలగడ.
Bolt n s గడియ. or arrow అలుగులేని అంబు, అంపకట్టె. a * or thunder * పిడుగు తునక. a peg చీల, మేకు. a * of canvas నిండుకితనారచుట్ట. the horse made a bolt ఆ గుర్రము బెదిరి చంగున దుమికినది. he shot the * or he fastened the * గడియ వేసినాడు. he drew the * గడియ తీసినాడు.
Bolus n s పెద్దమాత్ర, లేహ్యము.
Bomay n s బొంబాయి అనే పట్నము. Commonly called కొంకణదేశము. Concan.
Bomb n s బొంబసుగుండు.
Bombaketch n s (a ship for bombs) బొంబసు ఫిరంగులవాడ.
Bombardier n s బొంబసుగుండు కాల్చేవాడు.
Bombardment n s బొంబసు ఫిరంగులతో కాల్చడము. the twon suffered much from the * బొంబసుగుండ్ల చేత ఆ వూరునిండా హితమైనది.
Bombasin, or Bombazeen n s. ఒక తరహా నాణ్యమైన నల్లపట్టు.
Bombast n s నిరర్ధకశబ్ద పుష్టి, నిరర్ధకమైన పెద్దపెద్ద మాటలు.
Bombastic adj నిరర్ధకశబ్ద పుష్టిగల.
Bombazine n s See Bombasin.
Bombproof adj బొంబసుగుండు దెబ్బ తాకని, బొంబసుగుండు పారని. the house was * ఆ యిల్లు బొంబసుగుండు పారకుండా వంపు కట్టడముగా కట్టివుండినది.
Bombproofs n s బొంబసుగుండు పారకుండా వంపు కట్టడముగా కట్టిన యిండ్లు.
Bonafide adv (really, honestly, in truth) వాస్తవ్యముగా, నిశ్చయముగా,యధార్ధముగా. Did he * sell you the horse నీవు ఆ గుర్రమును కొనుక్కున్నందులోయేమిన్ని పిత్తలాటకములేదా.
Bond adj దాసులైన, బద్ధులైన.
Bondage n s or Slavery దాస్యము, గులాపుతనము. or captivity చెర,ఖైదు, or restraint కట్టు, బంధము, పాశము.
Bondmaid n s దాసి, గులాపుది.
Bondman n s దాసుడు, గులాపువాడు.
Bondsman n s జామీనుదారుడు, పూట బడ్డవాడు.
Bone n s యెముక, అస్తి. the back * వెన్ను పూస. the cheek bones కటుమర్లు. the collar bones మెటకొంకులు, జత్రువు. a thin fish *చేప ముల్లు. a stay * సన్నబద్ద, పలచనిబద్ద. a * or difficulty చిక్కు తంటా, పీకులాట. the bone of contention కలహాస్పదము, వ్యాజ్యాస్పదము. I have a * to pick with him వాడికి నాకు వక పీకులాటవున్నది. he gave them a * to pick వాండ్లకు వక పీకులాట పెట్టినాడు. they examined his accounts to the వాడిలెక్కను సమర్మముగా విచారించినారు. he made no bones of translating the letter ఆ జాబును భాషాంతరము చేయడానకు వాడు అనుమానించలేదు.
Bonefire, or Bonfire n s. భోగిమంట, చొక్కబానమంట, జయోత్సాహసూచకముగా కాల్చే మంట.
Boneless adj యెముకలులేని, శల్యవిహీనమైన. * gums దంతములేని, పండ్లులేని.
Bonesetter n s యెముకనుచక్కగా తోసికట్టే వైద్యుడు.
Bonita n s ఒక తరహా సముద్రపు చేప.
Bonmot n s సరసము, ఛలోక్తి, పరిహాసోక్తి.
Bonnet టోపి,ఆడవాండ్లటొప్పి,లబ్బైకుల్లాయి
Bonny adj (a Schotch word) సొగసైన, అందమైన.
Bonus n s or privilege బహుమానము, or fee, bribe లంచము.
Bony adj అస్థిమయమైన, యెముకలగూడుగా వుండే.
Booby n s మందుడు, జఢుడు, మూఢుడు. a bird వక తరహా సముద్రపుపక్షి.
Book n s పుస్తకము, గ్రంధము. he repeated it without * కంఠపాఠముగాచెప్పినాడు, ముఖస్థముగా చెప్పినాడు. a blank * అలేఖము. a great * or record, దండకవిల, a day * చిఠ్ఠా. or work ప్రబంధము. or poemకావ్యము. or treatment శాస్త్రము. or chapter పర్వము, కాండ, సర్గ,at account book వహి, లెక్క పుస్తకము. or account లెక్క. he ran into my books నాకు అప్పుపడ్డాడు. they got into his good books వాడిదయ సంపాదించికొన్నాడు. they got into his bad book వారి యందు వాడిదయతప్పినది. * languge కాని భాష, తిట్లు, బూతలు. you have borrowedleaf out of his * వాడి గుణాలు నీకుపట్టుబడ్డవి.
Bookbinder n s జిల్దుకట్టేవాడు, పుస్తకాలు కట్టేవాడు.
Bookbinding n s జిల్దుకట్టడము, పుస్తకాలు కట్టడము.
Bookcase n s పుస్తకములు పెట్టే అల్మారా.
Bookish adj పస్తకములమీద పడిచచ్చే, పుస్తకముల పిచ్చిపట్టిన.
Bookkeeper n s లెక్క పెట్టేవాడు.
Bookkeeping n s లెక్కలు పెట్టే రీతి.
Booklearned adj పండితుడైన, యిది యెగతాళిమాట.
Booklearning n s పాండిత్యము, యిది యెగతాళిమాట.
Bookmaker n s గ్రంధము చెప్పేవాడు.
Bookseller n s పుస్తకములు అమ్మేవాడు.
Bookworm n s the insect రామబాణమనే పురుగు, చిమట. or studentపుస్తక చాదస్తము పట్టినవాడు.
Boon n s వరము, అనుగ్రహము.
Boor n s మోటుమనిషి.
Boorish adj మడ్డియైన, మోటైన. * langauge ఎడ్డెమాటలు.
Boorishness n s మడ్డితనము, మోటతనము, ఎడ్డెతనము.
Boot n s a covering for the leg బూట్సు. part of a coach బండిలో సామాన్లు పెట్టుకొనే పెట్టె. to * (over and above) పైన, అదిగాకుండా, సహితము. you may take this to * దీన్ని సహితము యెత్తుకో. he knows English to * వాడికి యింగ్లీషు సహితము తెలుసును. seven-league boots worn by hermits on active duty యోగవాగములు.
Booted adj బూట్సులు వేసుకొన్న.
Booth n s పందిలి, పాక, సంత, తిరుణాల్ల మొదలైన వాటిలో అంగడి వాండ్లు వేసుకొనేటిది.
Bootless adj నిష్ఫలమైన, వ్యర్థమైన.
Boot-tree n s బూట్సులోచేయడానకు కాలువలె చేసివుండే కొయ్య అచ్చు.
Booty n s కొల్ల పెట్టబడ్డసొత్తు, దొంగసొత్తు. they were caught with their * దొంగసొమ్ముతోకూడా పట్టబడ్డారు.
Bopeep n s దాగురుమూతలాట, దాగెర బూచి. to play at * దాగురుమూతలాడుట.
Borax n s వెలిగారము, టంకణము.
Border n s అంచు, సరహద్దు, పొలిమేర. of a cloth కమ్మీ. of flowersin a garden వరసగా పెట్టిన పూలచెట్లు.
Bore n s a hole రంధ్రము, బెజ్జము. or tiresom plague తొందర, పీడనము. or spring tide in the Calcutta river కొత్తనీరు, దీన్ని బాణమంటారు. Bore (supposed to be corrupted from the French Bar, used regarding the Seine) is the English word used regarding the river Severn.
Boreal adj Northern ఉత్తరపు, కుబేర దిక్కు సంబంధమైన.
Boreas n s ఉత్తరపు ఘాలికి అధిష్టాన దేవత పేరు, యిది కావ్యమందు వచ్చేమాట.
Borer n s a tool కంఠాణము, బరమా, పిడిసాన, తొరపణము.
Born adj పుట్టిన. the land in which he was * వాడి జన్మభూమి. first * జ్యేష్టుడైన, అగ్రజుడైన. youngest * కనిష్టుడైన. heirs * of his bodyతన కడుపునపుట్టిన వార్సుదార్లు. high * సత్కుల ప్రసూతుడైన. base * కులహీనుడైన, దుర్భీజుడైన. a * villain జన్మతఃక్రూరుడు. a * fool పుట్టువెర్రి. * again పునఃజన్మించిన, పునర్జన్మమును పొందిన, అనగా ముక్తులు పుణ్యాత్ములు.
Borne pastpartofBare మోసిన, the boxes were * on men's heads ఆ పెట్టలు తలల మీద మోసుకొని పోబడ్డవి. after she had * a son అది వక కొడుకును కన్న తరువాత. borne away by passion కోపపరవశుడైన.
Borough n s పేట, చిన్నవూరు. the * or Southwark యిది లండన్ పట్టణములోదక్షిణభాగము.
Borrowed adj అప్పుగా తీసుకొన్న, అరువుగా తీసుకొన్న. not our own వర,తెచ్చుకొన్న. * curls నవరము మొదలయిన దొంగ వెంట్రుకలు. Ornments form a * beauty భూషణములచేత పెట్టుఛాయ కలుగుతుంది.
Borrower n s అప్పు తీసుకొనేవాడు, చెయిబదులుగా తీసుకొనేవాడు.
Borrowing n s అప్పు, యెరవలు.
Bosky adj అడివిగావుండే.
Bosom n s రొమ్ము, మనస్సు, ఆంతర్యము. they do not cover their *వాండ్లు రొమ్ముమీద బట్టలు వేయరు. * friend ప్రాణ స్నేహితుడు. or centrepart నడిమి భాగము, గర్భము. My bosom's Lord నా ప్రాణనాధుడు. the* of the wood నట్టడివి. he was received into the * of our family వాణ్ని మాసము సారములో చేర్చుకొన్నాము.
Boss n s గుబ్బ, బుబక, కాయ.
Botanic adj ఓషధుల సంబంధమైన. a botanical garden నూతనమైనచెట్లను పెట్టి పెంచేతోట, మందు చెట్లు గల తోట.
Botanist n s ఓషధి శాస్త్రజ్ఞుడు, ఓషధులను విచారించేవాడు.
Botany n s ఓషధి శాస్త్రము.
Botch n s or patch అతుకు, మాసిక. or boil గడ్డ, కురుపు.
Botcher n s అబందరగా చేసుట.
Both adj and conj. ఉభయ, రెండు. * have arrived యిద్దరు చేరినారు.* parties ఉభయులు, ఉభయత్రులు, యిరువర్లు. on * tides ఉభయ పక్షముల యెందున్ను. at * ends రెండు మొనల. It is often understood; thus, * he and I came వాడూ నేను వస్తిమి.
Bother n s తొందర.
Bots n s గుర్రము కడుపులో పురుగులు.
Bottle n s బుడ్డి, సీసా, గాజుకుప్పె. a metal or skin * శిద్దె. a * of wine చెంబెడు సారాయి. an ink * సిరా బుడ్డి. a * shaped gourd సొరకాయ * nosed బుర్రముక్కుగల.
Bottle-holder n s See Holder.
Bottlescrew v a దట్టాలు తీసే ఆయుధము.
Bottom n s అడుగు, కింది, ఆధారము. Read to the * of the page ఆ పక్క కడవెళ్ళా చదువు. he is at the * of the business ఆ పనికివాడే మూలము, కారణము. from top to * నిలువల్లా, యావత్తు. or posterious పిరుదులు. or bravery ధైర్యము, సత్తువ. or ship వాడ. a valley లోయ.of thread కండె. of a lane సందుకొన. or sediment గసి, మష్టు. he got at the * of the business ఆ వ్యవహారాన్ని సమర్మకముగా కనుకొన్నాడు.at the * of his heart వాడి ఆంతర్యములో. he appears an honest man but is a thief at * వాడు పైకి పెద్దమనిషిగా వున్నాడు లోపల దొంగ.
Bottomed adj ఆధారముగల. this castle is * on a rock యీ కోట,చట్టును ఆధారముగా చేసి కట్టి వున్నది. broad * మంచి ఆధారముగల.
Bottomless adj అగాధమైన. the * pit నరకము.
Bottomry n s వాడను కుదువబెట్టి తీసుకున్న రూకలు.
Boudoir n s a lady's private chamber నాయకి అలిగివుండే యిల్లు.
Bough n s కొమ్మ, రెమ్మ, శాఖ. the * of a cocoanut or palm tree &c. మట్ట.
Bought thepastandpartofBuy కొన్నది,కొన్న, bought over a tampered with స్వాధీనము చేసుకొన్న. he bought my witnesses over నా సాక్షులను తన పక్షముగా తిప్పుకొన్నాడు.
Boulders n s గండశైలములు, ఒడ్డుగుండ్లు.
Bounce n s దఢాలనే శబ్దము. or boast జంభము, గచ్చు.
Bouncer n s బడాయిఖోరు, జంభాలు కొట్టేవాడు. or child నిండా బలిసినపిల్లకాయ.
Bound pastandpartofBind కట్టిన, a book * in leather తోలుతో జిల్దు కట్టిన పుస్తుకము. a ship * for Bengal బంగాళాకు పొయ్యే వాడ. whither are you * నీవు యెక్కడికి పొయ్యేవాడవు. a * hedge కత్తిరించి కట్టిన చెట్ల వెలుగు. I will be * to say he is gone వాడు నిజముగా పోయివుండును. And your petitioner as in duty * shall every pray యిదే పది వేల దండములు.
Boundary n s పొలిమేర, యెల్ల.
Bounden adj బద్ధమైన. It was your * duty to do this యిది నీవు అవస్యము చేయవలసిన ధర్మము, భారము.
Boundless adj అమితమైన, అపారమైన, మేరలేని.
Boundlessness n s అమితత్వము, అపారత్వము. from the * of this prospect యిది దృష్టికి హద్దు లేని బయలుగనుక.
Bounteous adj దాతృత్వముగల, ఉదారత్వముగల.
Bounteously adv ఉదారత్వముగా.
Bounteousness n s దాతృత్వము, వితరణ.
Bountiful adj దాతృత్వముగల, ఉదారత్వముగల.
Bountifully adv దాతృత్వముగా, ఉదారత్వముగా. Bountfulness, n. s. దాతృత్వము, ఉదారత్వము.
Bounty n s దాతృత్వము, ఉదారత్వము, వితరణ, యీవి. Money advanced to soldeirs & c. బహుమానము.
Bouquent n s పూబంతి.
Bourn n s limit యెల్ల, పొలిమేర. brook చిన్న నది.
Bousy adj drunk తాగుబోతైన.
Bout n s తేప, తడవ, సారి. a wrestling * మల్ల యుద్ధము.
Boutique n s a shop అంగడి.
Bouts rimes n s సమస్య, యిది ప్రెంచి భాష.
Bow n s a salute వందనము, దండము. to make a * దండముబెట్టుట.bo for arrows విల్లు. a peller * వుండవిల్లు. a knot with bows దూముడి.She wore bows of ribbon on her shoulder అది భుజము మీద కుచ్చులు వేసుకొని వుండినది. the bows of a ship అనీం. (aneem) వాడ ముఖము యొక్క చంపలు. a bow used by cotton cleaners దూదేకుడుబద్ద. or fiddlestick పిడ్డిలు వాయించే కొయ్య. Rain * ఇంద్ర ధనస్సు. * legged దొడ్డి కాళుగల.
Bowed adj వంచిన, వంగిన, వాలిన. * down with grief వ్యసనముచేత కుంగిన. * cotton యేకిన దూది.
Bowels n s పేగులు. his * were freely opened వాడికి చక్కగా భేది అయినది. a son of his own * కడుపునబుట్టిన కొడుకు. In the * of the earth భూమధ్యమందు. or mercy అంతఃకరణ. having * of compassion కడుపులో విశ్వాసము గలవాడై. having his * moved with compassion వాడికడుపు మండినందున. his * yearned వాడి కడుపు మండినది, వాడికి అయ్యో అని తోచినది.
Bower n s పొదరిల్లు, కుంజము, లతా గృహము. * anchor వక తరహా లంగరు.
Bowery n s (Indian word for a well) భావి.
Bowl గిన్నె,భోగిణి, of a lamp ప్రమిదె. an earthen * సానిక. the* of a tobacco pipe చిలము, అనగా పొగతాగే సుంగాణి కొనను నిప్పువేసే చిలము. in poetry కలశము. or ball గుండు. to play at bowlsగుండ్లాడుట.
Bowlderstones n s గండశైలముల, కొండమీదనుంచి దొల్లిన బ్రహ్మాండమైనకలుగుండ్లు, ఒడ్డుగుండ్లు.
Bowlegged adj దొడ్డి కాళ్ళుగల.
Bowler n s గుండ్లాడేవాడు.
Bowline n s తాడు, యిదివాడభాష.
Bowling-green n s గుండ్లాడేపసరిక బయలు.
Bowman n s విలుకాడు.
Bowshot n s బాణము పారే దూరము.
Bowspirt, or Boltsprit n s. వాడ యొక్క ముక్కుదూలము, దీన్ని చూదరియనిఅంటారు.
Bowstring n s నారి, అల్లె, శింజిణి.
Bow-window n s అర్థచంద్రాకారముగా బయిటికి మించివుండే అద్దాలగవాక్షి.
Bow-wow n s కుక్క కూతకు అనుకరణశబ్దము.
Bowyer n s విలుకాడు, విండ్లుచేసేవాడు.
Box n s a chest పెట్టె, బరిణె, డబ్బి. a great chest భోషాణము.a strong * ఖజానాపెట్టె. a poor's * హుండి, భవనాశి అక్షయపాత్ర.a snuff * పొడిభరణి, పొడిడబ్బి. a pill * మాత్రలువేసే భరణి. a scent * అత్తరుడబ్బి. a dice * పాచికలాడే గొట్టము. seat in a theatre నాటకశాలలో వేడుక చూచే వాండ్లు కూర్చుండేటందుకు చుట్టూరు కట్టివుండే చిన్న అరలు, వీటిని. Boxes అంటారు. the * tree వక తరహా చెట్టు. a cuff, as, he gave me a box on the ear నన్ను చంపమీద కొట్టినాడు. * or * iron యిస్త్రి చేసే యినుప పెట్టె. coach * బండిలో బండితోలేవాడు కూర్చుండేచోటు. Christmass boxes పండుగ బహుమానము.
Boxen adj బాక్సు అనేమానితో చేయబడ్డ, ఆ మాను తెల్లగా వుంటుంది.
Boxer n s ముష్టి యుద్ధము చేసేవాడు, మల్లుడు, గుద్దులాడేవాడు.
Boxing n s ముష్టి యుద్ధము, మల్ల యుద్ధము.
Boy n s మగబిడ్డ, పిల్లకాయ, చిన్నవాడు. come here my * యిక్కడరా అబ్బి. old * తంబూ a word used in calling to servants ఒరే apalankeen * బోయి. from this the English word is taken.
Boyhood n s బాల్యము, పసితనము.
Boyish adj పసి, బాల్యపు. * acts పిల్ల చేష్టలు.
Boyishly adv పసితనముగా, పిల్లతనముగా.
Boyishness n s పసితనము, పిల్లతనము, బాల్యము.
Bp Contraction of Bishop
Brab n s a sort of Plum రేగుపండు.
Brace n s కట్టు, బంధనము, బిగి, బిగువు తాడు. a pair (of birds & c.) జత, తోడు, యుగ్మము, యీయర్థమందు బహువచనములేదు గనక. ten *అంటే, పది జతలు. ten braces అంటే, పది కట్లు అని అర్థమౌతున్నది, అయితే. braces worn in clothing యి జారును తొడుక్కొని భుజములకు తగిలించుకొనేనాడాలు. In printing types అనే సంజ్ఞ.
Bracelet n s కరభూషణము, కంకణము, కడియము, మురుగు, తోడా, గాజుమొదలైనవి.
Brachman n s the old fashioned spelling of the word Brahman బ్రాహ్మణుడు. Bracing, adj. బలకరమైన, బిగువిచ్చే. a * climate చలి దేశము. a * wind చలి గాలి, దేహానికిబలమును కలగచేసే ఘాలి.
Bracket n s వాల్సేడ్లు, పెద్దఘడియారములు, వుంచడానకై గోడకుకొట్టివుండే కొయ్య దిమ్మె, a sign used in printing [ ] యిది వక తరహా కుండలీకరణము.
Brackish adj వుప్పైన, కారువైన. * water వుప్పునీళు. * soil చవిటి నేల.this water tastes * యీ నీళువుప్పుగా వున్నది.
Brackishness n s చవకలు.
Brad n s సన్న ఆణి, సన్నచీల, పల్లకి, బండి, మొదలైన వాటిలో గుడ్డలనుబిగించే సన్నమేకు.
Braggadocio n s జంభాల ఖోరు, బడాయిఖోరు.
Braggart, Bragger n s. జంభాలఖోరు, బడాయిఖోరు.
Braid n s జడ, అల్లిక.
Braided adj జడవేసిన, అల్లిన.
Brain n s మెదడు. or understanding బుద్ధి తెలివి. A mad * పిచ్చివాడు,వెర్రివాడు. hot brained తలకొవ్విన.
Brainless adj తెలివిమాలిన, పిచ్చి.
Brainpan n s తలకాయ, యిదియెగతాళి మాట.
Brainsick n s పిచ్చి, వెర్రి.
Brake అనగా,BrokeseeBreak
Bramble n s వుండ్రకంప, కోరిందకంప, గచ్చతీగె మొదలైన ముండ్లచెట్లు. I was then lying upon brambles నా కప్పుడు ముణక రాములుగా వుండెను. యెటవునోయని నా ప్రాణము గడగడ వణుకుతూ వుండెను.
Bramin n s బ్రాహ్మణుడు, బాపనవాడు, బాపడు. * woman బాపనది. a * village అగ్రహారము.
Braminical adj బ్రాహ్మణ సంబంధమైన. the * thread జంధ్యము.Investiture with the thread ఉపనయనము. the * creed బ్రాహ్మణమతము.
Braminy bull నంది,నందికేశ్వరుడు
Braminy duck బాపనకోడిఅనేపక్షి
Bran n s తవుడు, పొట్టు, వుమక. * new కొత్త, అభినవ. a * new coatకొత్త చొక్కాయ, యిది నీచమాట.
Branch n s కొమ్మ, రెమ్మ, మండ, శాఖ. a slender * చువ్వ, మల్లె.tendril of a vine పక్క తీగె. a forked * పంగలకొమ్మ. a doublebranched candlestick రెండుకొమ్మల దీపపు శెమ్మె. part of divisionభాగము, అంగము, శర్కము. a river పాయ. a * of a ravine పాయగావుండే గండి. Bramins consider grammar to be a * of the Vedas వ్యాకరణము వేదమునకు ఒక అంగమని అంటారు. they are a * of the royal family రాజవంశములో వాండ్లది ఒక తెగ. a * post office చిన్న తపాలాపీసు. * schools కింది పల్లె కూటములు.
Branching adj శాఖోపశాఖలుగా వుండే, కొమ్మలు కొమ్మలుగా వుండే. thisstag has * horns దుప్పి కొమ్ములు శాఖోపశాఖలుగా వుంటవి.
Branchless adj కొమ్మలులేని. a * tree మొండిచెట్టు, మోటుచెట్టు.
Branchy adj కొమ్మలతో నిండివుండే.
Brand n s వాత, శునకముద్ర. or fire * కొరివి, ఉల్కా. or stigmaనేరస్తుడని తెలిసేటట్టు పొడిచిన పచ్చ మొదలయిన గురుతు. or swordఖడ్గము, యిది కావ్యములో వచ్చేమాట.
Branded adj వాతవేయబడ్డ, శునకముద్ర వేయబడ్డ, నేరస్థుడని పచ్చ పొడవబడ్డ. the casks were * with numbers ఆ పీపాయలమీద నంబర్లు కాల్చివేయబడ్డవి.
Brandy n s బ్రాందియనే సారాయి.
Brangle n s కలహము, వివాదము, వ్యాజ్యము.
Brash n s పొడి, చెక్క. stone * కత్తెర రాళ్ళ చెక్కలు.
Brasier n s కంచరవాడు. a pan to hold fire in కుంపటి.
Brasil n s ఒక దేశము పేరు. they brazil cherry బుడ్డ మిసరిపండు,బుడ్డబూసరి పండు, తక్కాళి పండు. brazil wood యినుమడి చెక్క, సురుగుడిమాను.
Brass n s యిత్తళి. or impudence సిగ్గుమాలిన తనము, మొండితనము.
Brass-band n s a pharase for trumpets ఇత్తడి వూదువాద్యముల మేళము.
Brassy adj యిత్తళి, చిలుముగల. this water has * taste యీ నీళ్ళు చిలుముకంపు కొట్టుతున్నది.
Brat n s పాడుబిడ్డ, పాడుపిల్ల, యిది బిడ్డలను గురించిన తిరస్కారమైన మాట.
Bratty n s పిడకలు. this is corrupted from the Tamil word(వారట్టి) varatty.
Bravado n s గర్వము, బడాయి, జంభము. he did out of mere * దీన్నివొట్టి జంభానికి చేసినాడు.
Brave adj ధైర్యముగల, శౌర్యముగల, వీర్యముగల. noble దివ్యమైన, దొడ్డ.what a * house! యేమి దివ్యమైన యిల్లు O brave! శాబాసు.
Bravely adv ధైర్యముగా, వీర్యముగా, పరాక్రమముగా.
Bravery n s ధైర్యము, శౌర్యము, వీర్యము.
Bravo interj శాబాసు, భళా, భళీ.
Bravura n s గాన విశేషము.
Brawl n s పోరు, రచ్చ, కలహము, ఘర్షణా.
Brawler n s రచ్చబెట్టేవాడు, పోరాడేవాడు, జగడమాడేవాడు.
Brawn n s fleshy part శరీరములో కండపట్టుగా వుండే స్థలము. a kind of food పంది మాంసముతో చేసిన ఆహారము. or boar మొగపంది.
Brawny adj కండపుష్టిగల.
Bray n s Braying గాడిదెకూత. the * of a trumpet కొమ్ము ధ్వని.
Brazen adj యిత్తళి, యిత్తళితో చేసిన. or impudent సిగ్గుమాలిన, మొండి. * age ద్వాపర యుగము.
Brazier n s కంచరవాడు. a pan to hold fire in కుంపటి.
Brazil n s See Brasil.
Breach n s an opening, gap గండి, సందు. a quarrel or wranglingఛిద్రము, కలహము. violation of law or promise తప్పడము, తప్పి పోవడము.of faith or trust ద్రోహము, విశ్వాసఘాతకము. * of chastity పాతివ్రత్య భంగము. they have come to an open * వాండ్లు బయట పడి జగడమాడినారు.
Bread n s రొట్టె. he was locked up for a week on * and water వాడికి బుద్ధివచ్చేటట్టు వారం దినాలు ఒక గదిలో వేసి మూసిపెట్టి కూడు నీళ్ళు పెట్టినారు. he gave them sixpence for * and cheese వాండ్లకు గంజిమెతుకులకు అయ్యేటట్టు పావలా యిచ్చినాడు. or food ఆహారము, గ్రాసము. Support or maintenance జీవనము, బ్రతుకు. he took away my * నా బ్రతుకు చెరిచినాడు, నా కూటిలో రాయి వేసినాడు. daily * నానాటి బత్తెము. Give us this day our daily * నానాటి బత్తెమును నేటికి యివ్వవలెను. dry * వట్టి కూడు, శుష్కన్నము. consecrated * ప్రసాదము. Loaves or loaves of * రొట్టెలు. Bread అనే శబ్దమునకు బహువచనము లేదుగనుక Breads అని యెంతమాత్రము అనకూడదు, అయితే Loaves of * రొట్టెలు. one loaf of * ఒక రొట్టె. Ten loaves of * పదిరొట్టెలు, యీ ప్రకారము చెప్పవచ్చునే గాని a *, one * అని చెప్పకూడదు.
Bread-corn n s రొట్టెలు చేయడమునకు వుపయోగమైన గోధుమ మొదలైనది.
Bread-fruit n s రొట్టెపండు, యిది పెద్దచెట్టు, దీన్ని నిప్పున కాలిస్తే రొట్టె అవుతున్నది.
Breadth n s వెడల్పు, విశాలము. height and * తులార్జులు.
Break n s తెంపు, భంగము, బీటిక, గండి, సందు. Before the * of day తెల్లవారక మునుపు. at midnight there was a * of moonlight అర్ధరాత్రిలో కొంచెము వెన్నెలల వచ్చినది. or stop, pause నిలుపు. for teaching a horse గుర్రాన్ని మరపడానకు కట్టేబండి. a break training cattle బారకాడి.
Breakage n s పగిలిపోవడము. Out of these bottles I lost six by * యీ బుడ్లలో ఆరు బుడ్లు నాకు నష్టము.
Breaker n s a wave, కొండమీద, లేక, యిసుక దిబ్బమీద కొట్టే అల. a horse * చబుకుసవారు. a jaw * యినుపశనగలు, అనగా క్లిష్టమైన అతికఠీనమైనపదము.
Breakfast n s ప్రాతఃకాల భోజనము, సద్ది భోజనము.
Breaking n s or failure తప్పదము, భంగము, or eruption పేలినది,పోసినది. promise * ఆడి తప్పడము. Sabbath * ఆదివార వ్రత భంగము అనగాఆదివారమునాడు లౌక్యములో ప్రవర్తించడము. there was a * out on the skinచిడుములు చమరకాయలు యీలాటివి వుండినవి. a * up of the constitutionసన్నిపాతము.
Breakwater n s తరంగతిరస్కరణి, అనగా సముద్రమలో అలలకు అడ్డముగాకట్టిన సేతువ.
Bream n s ఒక తరహా చేప.
Breast n s రొమ్ము, వక్షస్థలము, యెదస్తనము. an infant at the చంటిపిల్ల. Milk from the చనుబాలు. he was lying on his * బోర్లపడి వుండినాడు. the wall was * high ఆ గోడరొమ్ముల పొడుగు వుండినది. or mind హృదయము, మనసు. he made a clean * తాను చేసిన పాపమంతా వొప్పుకొన్నాడు. keep this in your own breast దీన్ని నీ మనసులోనే పెట్టు.a * of mutton నానుబోర.
Breastpin n s దొరలు రొమ్ము వుడుపులో చెక్కుకొనే ఒక తరహా బంగారు గుండుసూది.
Breastplate n s రొమ్ము కవచము రొమ్ము జీరా, వక్షస్త్రాణము. an ornmentపతకము. the high priest's * పూర్వ కాలమందు పురోహితుడు రొమ్మునకట్టుకొనే ఒక తరహా పతకము.
Breastwork n s రొమ్ము పొడుగు గోడ లేక, గ్రాది మొదలైనది.
Breath n s ఊపిరి, శ్వాసము. he suffers from shortness of * వుబ్బసముతో శ్రమపడుతాడు. he drew a deep * పెద్ద వూపిరివిడిచినాడు,నిట్టూర్పు విడిచినాడు. he is out of * with running పరుగెత్తినందున యెగరోజుతాడు. to take * గుక్క తిప్పుకొనుట. give me * and I will tell you సావధానముగా అడిగితే చెప్పుతాను. this is a mere waste of * యిది వొట్టి వాగ్వ్రయము. he spoke under his * పరులకు వినకుండా తిన్నగా మాట్లాడినాడు. I drew my first * there నేను అక్కడ పుట్టినాను. When he was at his last * వాడు కొన ప్రాణముతో వుండగా. he drew his last * there అక్కడ చచ్చినాడు. there was not a * of wind రవంతైనా ఘాలి లేక వుండెను. you say he is there and in the same * you say that he is dead వాడు వున్నాడంటావు, ఆ మాటతోనే చచ్చినాడంటావు. It was done in a * ఒక క్షణములో తీరింది. three was not a * of suspicion రవంతైన సందేహము లేదు. Before the least * of this scandalgot wind యీ అపవాదము రవంతైనా బయిటపడక మునుపు. he wrote a poem and three letters all in a * ఒక కావ్యము మూడు జాబులు అంతా వొక దెబ్బన వ్రాసినాడు. To Breathe, v. n. and v. a. వూపిరి విడుచుట. can you * in this room యీ యింట్లో నీకు వూపిరి తిరుగుతుందా. he breathes hard యెగరోజుతాడు.As long as you * నీవు ప్రాణముతో వుండే వరకు. the best man thatbreathes లోకములో సర్వోత్తముడు. he breathed his last there అక్కడచచ్చినాడు. he breathed vengeance against them వాండ్లకు శాస్తినేయకవిడుస్తావాయని ఆగ్రహపడుతూ వుండినాడు. you must not * a word of thisయిందులో ఒకమాటైనా బయిటవిడువబోతావు.
Breathing n s ఊపిరి, వుశ్వాసము. or accent in Greek grammar ఫభథ వీటికి వొత్తువంటి ఒక గురుతు. a picture సజీవముగా వుండే పటము. a * sweat మహత్తైన చెమట.
Breathless adj out of Breath వూపిరి తిరగని. he was * with fearభయముచేత మానై నిలిచినాడు. or dead చచ్చిన. * haste అతిత్వర. * anxiety అతివ్యాకులము.
Bred the past and part of Breed కలిగిన, జన్మించిన, పుట్టిన.Insects that are * in water నీళ్ళలో పుట్టిన పురుగులు. he was bred up as a doctor అతనికి వైద్యము నేర్పినారు. Ill * అమర్యాదస్థుడైన,మోటు, మూర్ఖ. An ill * man అమర్యాదస్థుడు. well * మర్యాదస్థుడైన, సరసుడైన.
Brede, Breech n. s. ముడ్డి, పిరుదులు. of a gun తుపాకి యొక్క కుందా, చెవి. of a cannon ఫిరంగి యొక్క ముడ్డి See Braid
Breeched adj బట్టకట్టే యీడుగల, ఇది మొగపిల్ల కాయలను గురించినమాట.he was then just * వాడికి అప్పుడే జామాతొడుక్కొనే దశగా వుండెను. a boy just * యెదిగే కుర్ర.
Breeches n s చల్లడము. In that house the wife wears the * అది మొగుణ్నిచేతికింద వేసుకొన్నది.
Breeching n s ఫిరంగిమోకులు, ఫిరంగి కట్టేతాళ్ళు. To Breed, v. a. పుట్టించుట, ఉత్పత్తిచేసుట, కలగచేసుట. to bring up పెంచుట సాకుట. to educate శిక్ష చెప్పుట. Familiarity breeds contempt చనువు అలక్ష్యమును కలగచేస్తుంది, అతిపరిచయము అవఙ్ఞతను కలగచేస్తుంది. he bredthese horses up for war యీ గుర్రాలను యుద్ధానికి మరిపినాడు. he bred meup as his son అతడు నన్ను తనబిడ్డగా పెంచినాడు. corn breeds insectsగోధుమలలో పురుగులు పట్టుతవి. this bred a dispute దీనివల్ల ఒక కలహము పుట్టినది.
Breed n s జాతి, కులము. a horse of good * మంచిజాతి గుర్రము. a horseof English * యింగ్లీషు గుర్రమునకు పుట్టిన గుర్రము. he is of a good *మంచివంశములో పుట్టినవాడు. a mongrel * సంకరజాతి.
Breeder n s పిల్ల వేసేటిది. a horse * గుర్రములు పెంచి అమ్మేవాడు. a pigeon * పావు రాళ్ళు పెంచడము. or manners మర్యాద, నడవడి,he shewed his * వాడి యోగ్యతను అగుపరచినాడు. Bad * అమర్యాద. good* మంచి మర్యాద. he is a man of no * అమర్యాదస్తుడు. I will take careof their * వాండ్లకు శిక్షచెప్పడమును గురించి నేను జాగ్రత్త చేసుకుంటాను.
Breeding adj గర్భిణియైన, కడుపుతో వుండే, చూలుగా వుండే. a * woman గర్భిణిస్త్రీ.
Breeze n s గాలి, పిల్లగాలి, మందమారుతము. the sea * సముద్ర తీరపు గాలి. the land breeze వడగాట్పు. in sea language, a storm ప్రచండవాయువు, పెద్దగాలి. there was a * or quarrel between them వాండ్లలోఒక కలహము పుట్టినది. or gad fly జోరీగె.
Breezy adj గాలిగల.
Brethren n s plu. సహోదరులు. fellows or companions సంగాతులు.తనతోటిపాటి వాండ్లు, పాదిరి ప్రజలతో ప్రసంగించేటప్పుడు ప్రజలారా, జనులారాఅనకుండా. my brethren సహోదరులారా, అంటాడు. he and his * in the faithతానున్ను తన మతస్థులున్ను. the carpetner went and consulted his *or, his brother artificers ఆ వడ్ల వాడు తనవంటిపని వాండ్లతో ఆలోచించినాడు.
Breve n s in music సంగీత శాస్త్రములో వాద్యస్వర విశేషము, హ్రాస్వస్వరముయొక్కగురుతు.
Brevet n s విశేషాధికార పత్రికె, అనగా దండులో ఒక దొరసంబళము తీసుకొనినియతముగా వుండే వుద్యోగమును వుండగా విశేషముగా దానికి పై వుద్యోగమునుకలగచేసే విశేషాధికార పత్రిక, అయితె ఆ విశేష వుద్యోగమునకు మర్యాద స్వతంత్రములుమాత్రమేగాని మునుపటి వుద్యోగపు సంబళమేను. a captain who is major by *కేప్ట ్ సంబళము తీసుకొని విశేషాధికార పత్రికచేత మేజరు కితాబును పొందివుండేవాడు.
Breviary n s రోమ ్ కెతోలిక్ మతమందు ప్రార్ధననా సంగ్రహమనే పుస్తకము.
Brevier n s a small printing type సన్న అచ్చు అక్షరము.
Brevity n s సంగ్రహత, సంక్షేపత్వము. from the * of his style the bookis difficult వాడు సంగ్రహముగా చెప్పడమువల్ల ఆ గ్రంధము కఠినముగా వున్నది. * is the sould of wit సంగ్రహత, చమత్కారమునకు జీవముగావున్నది.
Brewage n s కలపడము, కాచడము. this beer is of his *యిది వాడు కాచిన సారాయి.
Brewer n s కాచేవాడు. Ale, Beer, Porter యీ మూడు విధాల సారాయికాచేవాడు.
Brewhouse n s సారాయి కాచే యిల్లు.
Briar n s ముండ్లకంప, గచ్చతీగె, ఉండ్ర కంప.
Bribe n s లంచము, పరిదానము.
Bribery n s లంచము యివ్వడము, లంచము పుచ్చుకోవడము.
Brick n s యిటిక, యిటిక రాయి. to make * యిటికరాళ్ళు కోసుట. unburnedor raw * పచ్చి యిటిక. a kind of loaf ఒక తరహా రొట్టె.
Brickbat n s యిటికరాయి తునక.
Bricklayer n s కాశేవాడు, తాపికాడు, కొల్లెత్తువాడు.
Brickmaker n s యిటికలు కోసేవాడు.
Brick-work n s యిటికపని, యిటిక కట్టు.
Bridal adj వివాహ సంబంధమైన, పెండ్లి సంబంధమైన. * presents పెండ్లి చదివింపులు.
Bride n s పెండ్లి కూతురు. Bride's maids తోడుపెండ్లికూతుర్లు. Bride'smen తోడు పెండ్లి కొడుకు.
Bridecake n s పెండ్లి ఫలహారము, పెండ్లి కాగానే బంధువులకు, హితులకుయిచ్చే లేక, పంపించే ఒక తరహా మిఠాయి.
Bridegroom n s పెండ్లికొడుకు, వరుడు.
Bridewell n s a house of correction సీమలో ఒక చెరసాల యొక్క పేరు.
Bridge n s వారధి, వంతెన, నేతువ. the * end వారధికొన, అక్కడ బిచ్చపువాండ్లు కూర్చుంటారని ప్రసిద్ధము. a bridge of boats పడవ వారధి, అనగావారధివలె పడవలను వరసగా యేట్లో నిలిపి దానిమీద యేరును దాటుతారు. *of the roof మొగటి దూలము. of the nose ముక్కు దూలము. the * of aviolin పీట, గుర్రము, బయిసణ, తంబుర పీఠము.
Bridle n s of a horse కల్లెము, లగాము. of a bullock ముక్కు దారముముఖతాడు. you put no * upon your tongue నీకు నోరుదుడుకు.you should keep your passions under a * నీవు కామక్రోధాదులను అణచవలెను. a check నిర్బంధము, ఆటంకము. a * path or road ఒంటి గుర్రము పోతగ్గదారి.
Bridled adj కళ్ళెము పెట్టిన, యీడ్చిపట్టిన. restrained అణిచిన, నిర్బంధించిన.
Brief n s సంక్షేపము, సంగ్రహము. a lawyers * వ్యాజ్యసంగతి.In that cause he held a * for me; or, I gave him a * ఆవ్యాజ్యములో అతడు నాకు లాయరుగా వుండెను.
Briefly adv సంక్షేపముగా, సంగ్రహముగా. * they will not comeవెయిమాటలేల వాండ్లు రారు.
Briefness n s సంక్షేపత, సంగ్రహత. from the * of his lifeవాడి ఆయుస్సు అల్పమైనందున.
Brier n s అడివి గులాబిపువ్వు, ముండ్లపొద.
Briery adj ముండ్లుగల.
Brig n s రెండు స్తంభముల చిన్నవాడ, దోనె.
Brigade n s సైన్యములో ఒక భాగము ఒక దళము.
Brigade Major n s An Assistant to a Brigadier బ్రిగేడీర అనేదండు దొరకు రెండోవాడు.
Brigadier, or BrigadierGeneral n s. మేజరు జెనరలుకు కింది సేనాధిపతి.
Brigand n s దారిలో కొట్టి దోచే దొంగ.
brigantine n s ఒక తరహా వాడ.
Bright adj ప్రకాశమైన, కాంతిగల, మెరిసే, తళతళలాడే, నిగనిగలాడే.clear తేటైన, పరిష్కారమైన, స్పష్టమైన. the lamp is not * ఆ దీపముప్రకాశముగావుండలేదు. * sun shine మహత్తైన యెండ. * white నిగనిగలాడేతెలుపు. * black నిగనిగలాడే నలుపు. he is very * వాడు తేటైన బుద్దిగలవాడు. he has a * reputation స్వచ్ఛమైన కీర్తిగలవాడు. that is a * idea అదిమంచియుక్తి. Sun * కోటి సూర్య ప్రకాశమైన.
Brightly adv ప్రకాశముగా, నిగనిగమని, తళతళమని.
Brightness n s ప్రకాశము, కాంతి, తేజస్సు, మెరుగు.
Brikdust n s యిటికరాయి పొడి. * colour కాషాయ వర్ణము.
Briksness n s చురుకు, వడి, ఉల్లాసము.
Brilliance n s ప్రకాశము, కాంతి, దీప్తి, మెరుగు.
Brilliant n s పట్టెలు తీర్చినరవ, కమలము.
Brilliantly adv ప్రకాశముగా, కాంతిగా, తళతళమని.
Brim n s అంచు. he filled the cup to the * with milk ఆ గిన్నె అంచుమట్టుకు నిండాపాలు పోసినాడు. the tank was full to the *ఆ గుంట కొనమెట్టుదాకా నిండివుండినది, తటాకముగా నిండివుండినది. Brimful, adj. అంచులమట్టుకు నిండిన.
Brimmer n s నిండిన చెంబు, గిన్నెడు సారాయి.
Brimming adj నిండిన. a * cup నిండుగిన్నె .
Brimstone n s గంధకము.
Brinded, Brindled adj చారలుగల, పొడలుగల.
Brine n s కారువుప్పునీళ్ళు.
Bringer n s తెచ్చేవాడు. a * up ముందుకుతెచ్చేవాడు, తర్బియతు చేసేవాడు.
Brinjal n s (the egg.plant) వంకాయ, వార్తాకము.
Brinjarries (H ) a sort of Gypsies లంబాడివాండ్లు.
Brink n s అంచు, కొన, గట్టు, వొడ్డు, తీరము. I was on the * of falling పడకుండా రవంత తప్పితివని. he is on the * of ruin వాడు చెడిపొయ్యేగతిగావున్నాడు.
Briny adj వుప్పగా వుండే, కారుగా వుండే.
Briony n s ఒక మొక్క పేరు.
Brisk adj lively చురుకైన, వడిగల. a * wind చురుకైన గాలి. or gayఉల్లాసమైన.
Brisket n s మృగముయొక్క రొమ్ము, రొమ్ము మాంసము.
Briskly adv చురుకుగా, వడిగా, ఉల్లాసముగా.
Bristiling adj నిక్కపొడుచుకొన్న, రేగిన.
Bristle n s పంది వెంట్రుక. A brush made of bristles వరాహకూర్చము.the bristles of his his beard బిరుపైన గడ్డము.
Bristly adj బిరుసువెంట్రుకలుగల.
Bristol-stone n s పుష్యరాగము, తొవరమల్లి.
Britain n s దేశనామము. Great * అనగా England, Wales and Scotland యీ మూడు దేశములకున్ను సముదాయనామము.
Britannia n s యింగ్లీషు దేశమునకు కావ్యనామము యిది స్త్రీలింగము. *metal వక తరహా సత్తు లోహము.
British adj యింగ్లీషు దేశ సంబంధమైన. * cloth సీమగుడ్డ. the *Government యింగ్లీషు వారి ప్రభుత్వము.
Briton n s యింగ్లీషువాడు, యిది కావ్యనామము.
Brittle adj పెళుచైనది, రవంత తప్పితే పగిలిపొయ్యేటిది. his temperis * వాడిగుణము పెళుచైనది.
Brittleness n s పెళుచుతనము, వెట్టతనము.
Britzka n s ఒక తరహా బండి.
Broacaded adj అలంకరించిన.
Broad adj వెడల్పైన, విశాలమైన. clear స్పష్టమైన. * moonshine పండువెన్నెల.It was now * day యింతలో పట్టపగలైనది. there is a * distinction betweenthese two యీ రెంటికిన్ని మహత్తైన భేదమున్నది. he gave me a * hint to goనన్ను పొమ్మని స్పష్టముగా సూచన చేసినాడు. * pronunciation యాచమాట. hehas a *pronunciation యాచగా మాట్లాడుతాడు, వికారముగా మాట్లాడుతాడు. he was* awake వాడుబాగా మేలుకొని వుండినాడు. * obscenity బండుబూతు. It is as* as it is long యెటైనాసరే, రెండూసరే.
Broad-axe n s గండ్రగొడ్డలి.
Broad-cast adv వెడల్పుగా, వెదచల్లినట్టుగా. he sowed the field * ఆ పొలములోవిత్తనము వెదచల్లినాడు.
Broad-cloth n s సగలాతు, బనాతు.
Broadish adj కొంచము వెడల్పైన.
Broadly adv వెడల్పుగా, విశాలముగా, విస్తారముగా. he news was * spreadఆ సమాచారము బహుదూరము వ్యాపించినది. these two are * distinguished యీ రెంటికిన్ని భేదము విస్తారముగా వున్నది. he pronounced * యాచగా మాట్లాడినాడు.
Broadness n s వెడల్పు, విశాలత.
Broadsie n s వాడయొక్క పక్క. the guns on one side వాడకువకపక్కన వుండే ఫిరంగులు. or volley పకపక్క ఫిరంగులను వకఫళితాకాల్చడము.this was printed upon a * and was stuck on the wall దాన్ని పై పొరటనవ్రాశి గోడకు అంటించబడ్డది.
Broadsword n s పట్టాకత్తి.
Broadwise adv అడ్డముగా.
Brobdignag n s రాక్షసదేశము, అక్కడి జనులు తాటిచెట్లంతపొడుగు వున్నారనికథ.
Brocade n s సరిగెబుట్టా వేసినపట్టు. gold brocade బంగారు తగిడి; బంగారు బుటేదారి పట్టు.
Brock n s ఒక జంతువు పేరు, అనగా. Badger.
Brocoli n s ఒక తరహా తోటకూర.
Brocure n s (a French word) కట్టిన చిన్నపుస్తకము.
Brogue n s a kind of shoe ఒక తరహా మోటు చెప్పులు. corruptdialect యాచమాటలు.
Broidery n s పువ్వులు వేసేపని, బుట్టా పని.
Broil n s జగడము, కలహము, కలత, అల్లరి. roasted meat కాల్చిన మాంసము.
Broken adj పగిలిన, విరిగిన, తెగిన, చిట్టలిన, చితికిన. a *wall యిడిసిన గోడ. a * rope తెగినతాడు. her speech was * withsighs నడమ నడమ పెద్ద వూపిరి విడుస్తూ మాట్లడిది. * pieces ofstone జల్లి, జల్లపొడి. * victuals తిని మిగిలినది. మిగిలినవుచ్ఛిష్టము, యెంగిలి. he speaks * English వాడు అభాసయింగ్లీషు మాట్లాడుతాడు. I had some * sleep నాకు నిద్రపట్టీపట్టక వున్నది. * ground మెరకాపల్లముగా వుండేభూమి. the captainwas broken; or dismissed ఆ కేప్టన్న తోసివేయ బడ్డాడు. a *down horse డీలైపోయిన గుర్రము. a * knee'd horse మోకాలువిరిగిన గుర్రము. that merchant has broken వాడు దివాలాయెత్తినాడు. * hearted కుంగిన. heart * damsels వ్యసనముతోకుంగిన పడుచులు. a heart * with grief వ్యసనముతో కుంగిన,మనోవ్యాధితో కుంగిన. a * old man వుడిగిన ముసలి వాడు. * in ortrained మరిపిన, అలవరించిన. the work is * off సంభాషణనిలిచిపోయినది. * periods చిల్లర దినములు. a * winded horseరొమ్ము పగిలిన గుర్రము. a * down gentleman ఆయుష్యదూరుడు,కులభ్రష్టుడు. * grain నూకలు.
Broker n s తరగిరి, అడతీదారుడు, దలాలి.
Brokerage n s తరుగు, అడతి.
Broking n s తరగిరితనము.
Bronchial n s కంఠవిషయకమైన, గళదేశీయమైన. the * artery మెడలోవుండే పెద్దనరము.
Bronchocele n s గండమాల రోగము.
Bronze n s ఒక తరహా కంచు. * colour మడ్డి పచ్చవర్ణము,గుడ్డిపచ్చవర్ణము, ముదురుమామిడాకువన్నె.
Bronzed adj కందిన, కమిలిన. his face was * with the sunయెండచేత వాడి ముఖము కమిలినది.
Brooch n s ఒక భూషణము, పతకము.
Brood n s పిల్లలు, పక్షిపిల్లలు, సంతానము. a * henపిల్లలకోడి. A * of chickens ఒక కారు కోడిపిల్లలు.
Brook n s చిన్ననది, కాలువ.
Broom n s చీపురుకట్ట, పొరక్కట్ట. name of a floweringshrub తంగేడు వంటి వకచెట్టు.
Broomstick n s కర్ర, దుడ్డుకర్ర.
Broth n s చారు, నీచునీళ్లు, మాంసమువేసి కాచినచారు. Barley* బార్లి గంజి.
Brothel n s లంజలువుండే యిల్లు, లంజల గుడిశె.
Brother n s తోడబుట్టినవాడు,సహోదరడు. elder * అన్న,Younger * తమ్ముడు. half brother తల్లివొకతె తండ్రులువేరైనసహోదరులు, తండ్రి వొకడు తల్లులువేరైన సహోదరులు. he consultedwith his * workmen తన తోటి పాటిపనివాండ్లతో యోచించినాడు. My *servants నా తోటిపాటి పనివాండ్లు, నా సరి వుద్యోగస్థులు. "Anattorney cannot live but by excluding from his confidencehis * attorney" (Sumati) కరణము తనసరికరణము, మరి నమ్మకమర్మమీకమనవలె సుమతీః
Brotherhood n s బరాబరి, సభ, వర్గము, తెగ. * of thievesదొంగలతెగ. * of monks సన్యాసుల గుంపు.
Brother-in-law n s బావమరిది. either a man's sister'shusband or wife's brother బావమరిది. if older than one's selfబావ. if younger than one's self మరిది. jointbrothers-in-law; or, husband of the wife's sister షడ్డకులు.
Brotherly adj సహోదర సంబంధమైన. * affection సహోదరవాత్సల్యము.
Brought thepastandp||ofBring తెచ్చినది,తెచ్చిన, See To Bring.
Brow n s కనుబొమ. * of a hill కొండ యొక్క శిఖరము. he livedunder the * of a hill కొండకింద నివాసము చేసినాడు. he lives bythe sweat of his * నొసటి చమటను వూడ్చివేసి బ్రతుకుతాడు.
Browbeating n s గద్దింపు, బెదిరింపు, భర్జన.
Brown adj చామనిచాయ వర్ణమైన, కపిలవర్ణము, కోతివర్ణము,తవుడువర్ణము, లేడివన్నె, నక్కవన్నె , చక్కబెట్టివర్ణమువేయనితోలువన్నె, టేకువన్నె, ిటికవన్నె, యెండిన ఆకువన్నె, రాగివన్నె. Brown sugar, [పంచదార] బెల్లము, చక్కెర, శర్కర. Reddishcolour పింగళ వర్ణమైన, బొద్దెంకవర్ణమైన. whited * or whity *కోరాగుడ్డవన్నె, నాటు కాకితపు వన్నెగల. I spoke to him but hewas in a * study and did not hear me నేను వాడితో చెప్పినానుగాని వాడు పరధ్యానముగా వుండినందున నేను చెప్పినది వాడికివినలేదు.
Brownish adj మసరవన్నె గల, కోరా వన్నెగల,కొంచెము యిటికె వణ ్మైన.
Brownness n s కపిలవణ ్ము. See Brown.
Bruin n s వెలుగుబంటికి పెట్టుపేరు, కోతికి తిమ్మనఅన్నట్టు.
Bruise n s నొక్కు, సొట్ట, దోగుడు.
Bruised adj నలిగిన, చిదిగిన, దంచిన, దోగిన. * riceదంగుడుబియ్యము, దంచిన బియ్యము.
Bruit n s వదంతి, గాలి సమాచారము.
Bruited adj వదంతిగా వుండే.
Brumal adj Wintry, చలికాల సంబంధమైన. the * quarterచలికాలము.
Brumette n s (A French word) యింగ్లీషువాండ్లలో కౌంచముచామని చాయగా వుండే స్త్రీ, ఈషద్గౌరవణ ్ స్త్రీ.
Bruning coal n s కట్టె నిప్పు, అంగారము.
Brunt n s దెబ్బ, వురిపడి, వేగము. they put bundles ofstraw between teh boats to bear the * పడవలు ఒకటితో ఒకటికొట్టుకోకుండా నడమ కసువు మోపులు వేస్తారు. If any thing goeswrong he will bear the* యేదైనా వ్యత్యాసము వస్తే ఆ దెబ్బనువాడు నిభాయించుకొనిపోను.
Brush n s బురుసు. made of bristles వరాహ కూర్చము. a tooth *పండ్లుతోముకునే బురుసు. a painter's * తూలిక, ఈషిక, కుంచే. orfox's * నక్కతోక. we had a * with the enemy శత్రువులకున్నుమాకున్ను కొంచెము యుద్ధమైనది.
Brushwood n s గుట్టగుట్టపొదలు, నరికినకొమ్ములు. A bundleof * కంపుమోపు.
Brust n s దెబ్బ, ఆకస్మీకమైన దెబ్బ, a * of thunder దడీలునవచ్చిన వురుము, a * of rain దడీలున వచ్చిన వాన. there was agreat * of laughter పకపక నవ్విరి.
Brutal adj savage, coarse పశుప్రాయమైన, క్రూరమైన,నిఘ్గరమైన, కఠినమైన. * language పోకిరికూతలు, బండకూతలు. Brutality, n. s. పశుత్వము, క్రూరత్వము, నిర్దయాత్మకత్వము,నిష్టురమైన, కఠినమైన. * language పోకిరికూతలు, బండకూతలు.
Brutality n s పశుత్వము, క్రూరత్వము, నిర్దయాత్తకత్వము,నిష్ఠురత్వము.
Brutally adv క్రూరత్వముగా, పశుప్రాయముగా, నిర్దయగా.
Brute n s మృగము, పశువు, గొడ్డు. or wretch దుర్జనుడు,క్రూరుడు, కిరాతకుడు.
Brutish adj పశుప్రాయమైన, కఠినమైన, క్రూరమైన. ignorentతెలివిమాలిన, మోటు, యెడ్డె. they lived in * ignoranceపశుప్రాయులై యెడ్డె తనముగా నుండిరి.
Brutishness n s పశుప్రాయత, మూఢత్వము, జడత్వము.
Bryony n s యేటిపుచ్చకాయ. See Ainslie 2.21. and 2.4.28. This plantresembles the yam.
Bubble n s నీరుబుడ్డ, బుద్బుదము. this life is a mer * యీజన్మము వట్టిమాయ. A vain project వట్టిమాయ, వట్టి బూటకము.
Bubby n s చన్ను, కుచము. యిది ఆడగూడనిమాట.
Bubo n s వడిశెగెడ్డ, అడ్డకర్రలు.
Buccaniers n s అమిరిగా దేశపు వాడ దొంగలు, వాడను దోవకట్టిదోచే దొంగలు.
Bucephalus n s అతి శ్రేష్ఠమైన వక గుర్రముయొక్క పేరు,ఉచ్చైశ్రవ మనవచ్చును.
Buck n s the male of deer, rabbits & c. మగది, దుప్పి,చెవులపిల్లి మొదలైన వాటిలో మగది. అడవి మూడున్ను వుండినవి. orhandsome fellow సొగసుగాడు.
Buck-basket n s చాకలవాడి గంప.
Bucket n s బాల్ది, నీళ్లుచేదేకొయ్య తొట్టి. made of ironయేతపుబాన. made of leather బొక్కెన, మోటబాన.
Buckle n s The English word alone is used బొక్లిసు,కొండి, చిలుక.
Buckler n s కేడెము, డాలు.
Buckram n s బంధనలేక, మైనముతో అంటించి బిర్రుగా వుండేగుడ్డ.
Buckskin n s మృగచర్మము, కృష్ణాజినము, జింగతోలు. he worebuckskins జింక తోలు చల్లడమునే వేసుకొన్నాడు.
Buckthorn n s వేపచెట్టు వంటి వకచెట్టు.
Buckwheat n s ఒక తరహా గోధుములు.
Bucolic n s గోపికాగీతల భేదము.
Bud n s మొలక, అంకురము. of a flower మొగ్గ. his hopeswere nipped in the * వాడి ఆశలు మొదటనే భంగమై పోయినవి.
Budding adj చిగిరించే, మొగ్గలు పెట్టే. a * fruit పూ పిందె.
Budge n s బొచ్చు.
Budgerow n s పెద్ద సవారి పడవ.
Budget n s సంచి, జోలె, జోల్నా, మూట, కట్ట. I have got a *of news for you నీకు చె ప్పవలసిన సమాచారములు నిండావున్నవి.నీతో వగగంపడు సమాచారములు నిండా వున్నవి, నీ తో గంపెడుసమాచారములు చెప్పవలసి యున్నది. the minister produced his *మంత్రి తన దస్త్రమును దాఖలు చేసినాడు.
Buff n s Leather యెనుము తోలు. Yellowish colour కొంచెముపసువువణ్నము, యెండు వెదురువణ్నము. a * coat తోలు వుడుపు. hewas in * or naked వాడు దిగంబరముగా వుండినాడు.
Buffalo n s Female or she * యెమము, బర్రె. male or he *యెనస పోతు, దున్నపోతు. a wild * అడవిదున్న, కారుబోతు, theyoung female that has not yet calved పడ్డ. a * calf గేద.బర్రె దూడ. * milk యెనప పాలు.
Buffet n s A blow గుద్దు. Beaufet or sideboardశృంగారించిన పక్కమేజ, యిది పాత్రలు వంచడానకు మాత్రమువుపయోగమైనది. they went to buffets గుద్దులాడిరి.
Buffeting n s గుద్దులాట పోరాట.
Buffoon n s హాస్యగాడు, పరియాచగాడు.
Buffoonery n s హాస్యము, పరిహాసము.
Buffy adj కొంచెపు పసుపువణ ్మైన, ఈషత్పీతవణ ్మైన.
Bug n s వల్లి, మత్కుణము.
Bugbear n s వట్టి బెదిరింపు, బుడ్డ బెదిరింపు బూచి,Prosody was the great * to those who attempted the study ofTelugu తెలుగు చదవవలెనన్న వాండ్లకు ఛందస్సు వక పెద్ద పులిగావుండెను.
Buggy n s a gig వొంటి గుర్రపు బండి.
Bugle n s కొమ్ము, వకతరహా తుతారా. Bugles, or, blackshining beads దొరసాన్లు బట్టలమీదపెట్టి కుట్టే ఒక తరహా నల్లపూసలు.
Buifinch n s గోరింకవంటి వకతరహా పక్షి.
Build n s or shpae ఆకారము, నిర్మాణము.
Builder n s కట్టేవాడు, నిర్మాణము చేసే వాడు. A coach *బండ్లు చేసేవాడు.
Building n s కట్టడము, యిల్లు.
Built thepastandp//ofBuild కట్టినది,నిర్మించిన
Bulb n s or knot, a round body or roof గుండ్రవైనదిగ్రంధి, ముడి, కాయ, గుడ్డ. the * of the throat గొంతుకాయ.
Bulbous adj గుండ్రముగా వుండే. Onions &c. are * rootsవుల్లిగడ్డ మొదలైనవి గుండుగా వుండేటివి.
Bulbul n s this is called the jocose shrike పిగిలిపిట్ట. See Journ. of As. Soc. X. 640.
Bulk n s లావు, గాత్రము, స్థౌల్యము, పరిమాణము. On accountof the * of the book పుస్తుకము గొప్పదిగనక. From his * thehorse could not carry him వాడి స్థాల్యానికి వాణ్ని ఆ గుర్రముమోయ నేరదు. This illness diminished his * యీ రోగముచేత వాడివొళ్లు కరిగింది. the majority or greatest part అధికాంశము.Some of them are Musulmaus but the * of them are Hindusవాండ్లలో తురకలు కొందరే గాని శానామంది హిందువులుగా వున్నారు.the bulk of his books are old ones వాది పుస్తుకములలోముప్పాతిక పాలు పాతవి he sold the cotton by the * వాడుపత్తిని మొత్తముగా అమ్మినాడు. the sample is superior to the *మాదిరి చూపించినది మంచిదిగాని తెచ్చినది మంచివి కావు. the shipbroke * వాడ సరుకు కొంత దిగింది. the projecting part of abuilding ; a terrace called pial or pyall at Madras తిన్నె .
Bulkiness n s లావు, గాత్రత, బృహత్వము, స్థాల్యము. From the* of the book పుస్తుకము లావైనందున.
Bulky adj లావైన, గాత్రమైన, స్థూలమైన. a * man లావాటి వాడు.Cotton is more * than iron దూది నిండా పట్టేటిది యినుము కొంచెములో యిమిడేటిది.
Bull n s యెద్దు, వృషభము. Bulls plu. యెడ్లు. a wild *గొరపోతు. * calf కోడె, కోడె దూడ. The sacred * or Apis నంది,నందికేశ్వరుడు. a Papel * పోపు యొక్క ఆజ్ఙా పత్రిక అనగాఆచార్యుల శ్రీముఖము. In composition గజ. thus, a * trout, a *finch, a * dog &c. గజ, పెద్ద. as, the great lime గజనిమ్మపండు. a * frog గోదురుకప్ప, అనగా పెద్దకప్ప. a * beggarగజదొంగ. a bull's eye or window గవాక్షి. the bull's eye in atarget బాణములు వేసే గురిపలకలో వుండే నడిమిచుక్క. he took the* by the horns సాహసము చేసినాడు. or blunder మాటలలో పొరబాటు,అనగా he spent all the money and gave the rest to hisborther రూకలనంతా శెలవు చేసి వేసి కడమను అన్నకు యిచ్చినాడు, యీవాక్యములో, రూకలనంతా, అన్న తరువాత, కడమ అనడము మిక్కిలిఅసంభవము గనుక దీన్ని యింగ్లీషు వారు. Bull అంటారు. Or inEnglish they sat down forming a sort of semicircle roundme (This occurs in a modern traveller). When this horsegoes down hill he stumbles and when he goes up hill hestops (Johnson himslef made this bull : See Boswell. VIII.324) One of the most remarkable is Had you but seen theseroads before they were made you would hold up your handsand bless marshal Wade 1-Milton Prose 12. 1.92 uses Bullfor Blunder.
Bullace n s కోరిందపండ్లు, పుండ్రకంపకాయులు.
Bull-baiting n s వృషభము మీద కుక్కలను వుసికొలిపి అగచాట్లుపెట్టడము. The bullring యీ ఆట జరిగించే స్థలము.
Bull-dog ఒక తరహా పెద్ధకుక్క
Bullet n s తుపాకి గుండు. to play at long bullets పిరంగిగుండ్లతో ఆట్లాడుట.
Bulletin n s ప్రసిద్ధ, పత్రిక, ప్రకటన పత్రిక.
Bullion n s పాళము, ఖడ్డి, యిది వెండి బంగారును గురించినమాట. gold * బంగారుఖడ్డి, బంగారు పాళము. silver * వెండి ఖడ్డీ,వెండిపాళము. epaulettes are made are of * దండు దొరల భుజాభ,రణములు వెండి బంగారుతో చేయబడుతవి.
Bullock n s యెద్దు. a * load పెరికె .
Bullock heart apple n s రామాఫలము.
Bully n s గద్దించేవాడు, గుడ్డిబెదిరింపులు, బెదిరించేవాడు.జంభాలఖోరు, ఉత్తర కొమార ప్రజ్ఙలు పలికేవారు, రౌష్టుచేసేవారు.
Bullying n s గుడ్డిబెదిరింపు, రొష్టు.
Bulrush n s జమ్ము జంబు.
Bulwark n s కొత్తళము, బురుజు. metaphorically రక్షణము,కాపు.
Bum n s ఆసనము, నితంబము, పిరుదులు, ముడ్డి.
Bumboat n s వాడవాండ్లకు కావలసిన వెచ్చము తీసుకొనిపొయ్యేపడవ.
Bump n s దద్దు, దద్దరింపు, బొడిపి, బొప్పి.
Bump. n. s. (add) in Craniology,denotes \" the outward sings of dispostion ,marked on the scull \" కపాలశాస్త్రములో కపాలము మీద యేర్పడి మనిషి యొక్క ఆంతర్య గుణసూచకములుగా వుండే బాహ్యలక్షణములు, this boy has the * of poetry ఈ చిన్నవాని కావ్యములు చెప్పే పటిమును గురించి శిరోలక్షణము లున్నవి.
Bumper n s సారాయి నిండా వుండేగిన్నె.
Bumpkin n s పల్లెటూరివాడు, మడ్డి, యెడ్డెవాడు,యెద్దుమొద్దు.
Bun n s A kind of tweet-bread ఒక తరహా మిఠాయి.ఉపవాసదినములలో తినే ఫలాహారము.
Bunch n s cluster గుత్తి గొత్తు. of fruit గెల. a *rasins or grapes దాక్షగొల. a * of flowers పూలగుత్తి. theHindus wear their hair in a * on the back of their headsహిందువులు జుట్టు పెట్టుకొంటారు. a * of keys బీగముచెవులగుత్తి. A camel that has two bunches వీపులో రెండుమిట్టలుగలవొంటె . the * on the shoulders of a bull మూపురము.
Bunchy adj గెలవలెవుండే, గొత్తుగావుండే.
Bundle n s కట్ట, మూట, మోపు.
Bung n s సీసాయిబిరడ.
Bungalo n s A kind of house బంగళా.
Bunghole n s బీపాయినోరు.
Bungler n s అబందరగాడు.
Bunn n s A kind of sweet bread ఒక తరహా మిఠాయి, ఉపవాసదినములలో తినే ఫలహారము.
Bunter n s తొత్తు.
Bunting n s Cloth of which flags are madeజండా కుట్టే వకతరహా సన్నకంబళి.
Buoy n s బొయాకట్టె, లంగరు గురుతు, లంగరు మొదలైనవిమునిగిపోయినచోటు గురుతు తెలిసే నిమిత్యమైనవి తేలికగా వుండేకొయ్యకణతలకు బరువుకట్టి నీళ్లల్లోవేసిన గురుతు. the fishermanwatch-ed the buoy చేపలు పట్టేవాడు బెండుమీదనే కన్నుపెట్టివుండినాడు.
Buoyancy n s తేలిక, లఘిమా. On account of the * of the woodకొయ్య తేలికై నందున. * of mind ఉల్లాసము.
Buoyant adj తేలికైన. * his spirits are * వాడికి వుల్లాసముగావున్నది. the corpse be came * and floated ఆ పీనుగ బెండుబడిపైకి తేలినది.
Buoyed up adj తేలికైన, తేలే.
Bur n s అంట్రింతలు.
Burden n s బళువు, భారము, మోపు. * carried on the headనెత్తిమూట, నెత్తిబరువు a ship of great * పెద్దవాడ,విస్తారము బళువు మోసేవాడ. the family was a great * to him యీసంసారము వాడికి తల మోపుగా వుండెను. * of a chorus పల్లసి. the* in the verses of Vemana is విశ్వదాభిరామ వినరవేమ. the * in Psalm 136 is "For his mercy endurech for ever." Life become a * to him వాడి ప్రాణము వాడికి బరువాయెను, అనగా చావడము మేలని తోచెను. the * of grief దుఃఖభరము. Lest she should sink under the * of grief దుఃఖముతో కుంగిపోబోతున్నది.
Burdened adj బళువుయెక్కించబడ్డ, బరువు చేయబడ్డ. afer theship was * యెక్కించిన తరువాత. after the ship was * వాడకుబళువుయెక్కిన తరువాత. being * with sorrow దుఃఖభరితుడై. being* with debts అప్పుల తొందరగలవాడై.
Burdensome adj దుఃఖకరమైన, ఆయాసకరమైన.
Burdock n s ఒక మొక్కపేరు, పెద్ద ఆకులుగల ఒకతరహాముండ్లచెట్టు.
Bureau n s బీరువ. or closit రాజు యొక్క అంతరంగసభ. cabinetcouncil రాజు యొక్క అంతరంగాలోచన. he was admitted into the* వాడు రాజుకు అంతరంగ రాయస గాడైనాడు. the king was his friendbut he was crushed by the bureaucracy రాజు అతనికి అనుకూలుడైనప్పటికిని అంతరంగ రాయసగాడి ముందర వాడి పని సాగలేదు.
Burgamot n s See Bergamot.
Burgess n s నగరవాసి, వకతరహా మిరాసిదారుడు, పెద్దకాపు.
Burgh n s పురము, వూరు, కసుబా.
Burgher n s పురవాసి, మిరాసీదారుడు.
Burglar n s కన్నపుదొంగ, కన్నగాడు.
Burglary n s కన్నపు దొంగతనము. he committed *కన్నమువేసినాడు.
Burgomaster n s వూరిపెద్ద.
Burgundy n s the name of a country ఒక దేశము యొక్కపేరు.a wine ఆ దేశములో ద్రాక్షరసముతో చేసిన సారాయి.
Burial n s వూడ్చడము, భూస్థాపనము, సమాధిచేయడము. were you atyou * అతణ్ని భూస్థాపన చేసిన్నప్పుడు నీవుంటివా.
Burial-place n s పూడ్చేస్థలము, సమాధిస్థలము, స్మశానము,రుద్రభూమి.
Burial-service n s భూస్థాపన మంత్రములు.
Buried adj పూడ్చిన, సమాధిచేసిన, భూస్థాపితము చేసిన. * indarkness అంధకాషగ్రస్తులైన. their origin is * in darknessవాండ్ల పుట్టుపూర్వోత్తరము తెలియలేరు. he was * in thoughtతదేకధ్యాసముగా వుండినాడు.
Buriesque adj పరిహాసమైన, హాస్యమైన, యెగతాళియైన.
Burine n s ముద్రచెక్కే శలాకు.
Burinish n s మెరుగు, చికిలి.
Burker n s రహస్యముగా చంపివేసినాడు.
Burletta n s ఒక తరహానాటకము.
Burly, or Big స్థూలదేహియైన, or Blusteringబుడ్డబెదిరింపులు బెదిరించే.
Burn n s నిప్పుగాయము, కాలిన గాయము.
Burning adj కాలే, మండే, తపించేచేసే, the * hear of he sunమలమలమాడ్చే యెండ. a * wind నిప్పు, గాలి. they were * forrevenge కసిదీర్చుకోవలెనని మండిపడుతూవుండిరి.
Burning place n s స్మశానము.
Burning sensation n s మంట.
Burning-glass n s సూర్యకాంత అద్దపుబిళ్ల, యెండలోపట్టితేనిప్పుబడే అద్దపుబిళ.
Burnished adj మెరుగుబెట్టిన, చికిలిచేసిన, తళతళమని మెరిసే.the wings of the fly are * యీగె యొక్క రెక్కలునిగనిగలాడుతవి.
Burnt adj కాలిన, మండిన. Rice * in cooking మాడు. my mouthis all *(as with lime * c.) నా నోరంతా పొక్కిపోయినది. landthat it burnt up by the sun యెండచేత మాడిపోయిన భూమి. a placewhere bodies are * స్మశాన భూమి. * offering యజ్ఙము, హోమము.
Burr n s అంటింతలు, చికిలింతగడ్డి. they stuck to him likeburrs వాణ్ని అంటింతలు వలె కరుచుకొన్నారు, తగులుకొన్నారు. alsothe * tree or Banyan tree మర్రిచెట్టు.
Burrow n s బొక్క, బొరియ, కలుగు, బిలము.
Bursar n s ఖజానిజి, పాఠశాల బొక్కసగాడు, పాఠశాలలో చదివేవాడు.
Burst pastandpart చితికిన, చిట్లిన, విరిసిన, పగిలిన. the bank that was * తెగిన కట్ట.
Burthen adj బళువు, భారము. See Burden.
Burutishly adv పశుప్రాయముగా, యెడ్డె తనముగా,మడ్డి తనముగా. Savagely క్రూరముగా.
Burying-goriund n s స్మశానభూమి, రుద్రభూమి.
Bush n s పొద. why do you beat about the * ముఖ్యమైన కార్యముచెప్పకుండా వూరికె యేల పెంచుతావు. Bush fighting దాగిచేసేయుద్దము.
Bushy adj పొదలుగల, దట్టమైన. * hair చింపిరి తల. * beardచంపిరి గడ్డము. the * tail of a fox నక్క యొక్క చింపిరి తోక.
Busily adv పనిదొంతరగా, నిండా పనిగా, చురుకుగా. thissquirrel was * eating the grain ఆ వుడత ధాన్యమును బహు చురుకుగాతింటూ వుండినది. he is * engaged వాడునిండా పనితొందరగావున్నాడు.
Business n s పని, కార్యము, వ్వవహారము, ధర్మము, వ్యవసాయము,వర్తకము, వ్యాపారము, సంగతి, ప్రమేయము, విషయము. About thisbusinhss యీ విషయమును గురించి. A man in * వ్యవహారములోవుండేవారు. they have left off * వాండ్లు వర్తకమునుచాలించినారు. A man of * వ్యవహారస్తుడు. he is my man of *అతడు నా వ్యవహారమును చూచేవాడు. I will make it my * to do thisదీన్ని నెరవేర్చడము నా పని. Is it not your * to support yourmother? నీ తల్లిని కాపాడడము నీకు ధర్మము కాదా? they did his *వాడిపని కాజేసినారు, అనగా వాణ్ని చంపినారని అర్థము. Go aboutyour * లేచిపో నీ పనికి నీవు పో. he went about his * వాడిపనికివాడు పోయినాడు.
Busk n s బిగువుపడ్డ, అనగా జాతిస్త్రీలు బిగువుగా వుండడమునకైముందరితట్టున్ను వెనకతట్టున్ను నడుముకు దోపి కట్టుకునేతిమిమత్స్యపు యెకముతో లేక వుక్కుతో చేసినబద్ద.
Buskin n s నాటకము ఆడే వేషగాండ్లు తొడుక్కునే ఒక తరహాబూట్సు. Buskined యీ బూట్సు వేసుకొన్న.
Buss n s (Shakespeare, adn Spenser, F. q. 3.10.46) a kissముద్దు, యిది నీచ శబ్దము. a boat for fishing * c. చేపలుపట్టేవాండ్ల పడవ. or Omnibus యిరువైమంది కూర్చుండ తగిలి కూలిబండి.
Bust n s అర్ధాకృతి ప్రతిమ, అనగా తల మొదలుకొని రొయ్యలమట్టుకుచేసిన రాతి ప్రతిమ.
Bustard n s ఒక తరహా అడవికోడి, దీన్ని బట్ట మేరపక్షి అంటారు.
Bustle n s గలభ, అల్లరి, సందడి, దడబిడలు, గగిబిడి. or lady'splumper పిరుదు దిండు, పిరుదులు గొప్పగా అగుపడడమునకై స్త్రీలుపిరుదుకు కట్టుకొనే దిండు.
Busy n s అధిక ప్రసంగి, పరుల జోలికి పొయ్యేవాడు.
But conj అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are* three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22.
Butcher n s (the hargila or adjutant) బెగ్గురుకౌంగఅనేపక్షి.
Butchered adj పశుప్రాయముగా చంపబడ్డ, వధచేయబడ్డ.
Butchery n s కటికతనము, వధ, హత్య, సంహారము. at night adreadful * took place రాత్రి వక అఘోరమైన హత్య జరిగినది. orbutcher's shop కసాయివాడి అంగడి.
Butea n s the name of a tree మోదుగచెట్టు, కింశుకము. (it has a bright scarlet flower).
Butler n s బొట్లర్లు, వుగ్రాణపువాడు, అన్నపానాదులువిచారించే పెద్దపనివాడు, సారాయి కొట్టుమీద వుండేవాడు.
Butt n s of a gun తుపాకి యొక్క కుందా. or mark గురి,లక్ష్యము. he is the * of misfortune ఆపదకు ఆలయమైనవాడు,పాత్రమైనవాడు, యిరవైనవాడు. he was made the * of ridicule orhe was their * వాణ్ని యెగతాళి పట్టించినారు. of a spearకుప్ఫై. అనగా యీటె కర్రయొక్క అడుగుకుప్పె. the back end of aBeam పిరుదు, అనగా దూలముయొక్క వెనకటి మొన. or a caskనూరయిరవైయారు గాలములుపట్టే పీపాయి. or measure యెనిమిదిమణుగులు, దీన్ని సాగరమంటారు. In tumbling down he coame fullbutt against me కాలుజారి నామీద వచ్చి పడిపోయినాడు.
Buttend n s of a spear. యీటె యొక్క అడుగు కుప్పె.
Butter n s వెన్న. a pat of * వెన్న పూస. melted orclarified * (ghee) నెయ్యి, ఘృతము. or flattery బుజ్ఙగింపు,యిది క్షుద్రప్రయోగము.
Buttercup n s ఒక తరహా పుష్పము.
Butterfly n s ఆకుచిలక, సీతాకోకచిలక.
Buttermilk n s మజ్జిగ.
Butterpit n s వెన్నపెట్టే ఒకతరహా గిన్నె.
Butter-teeth n s ముందుపండ్లు, మునిపండ్లు.
Butterwoman n s గొల్లది.
Buttery n s వుగ్రాణము, ఆహారములు పెట్టే వుగ్రాణము.
Buttock n s ముడ్డి, పిరుదు, పిర్ర. the buttocks నితంబము,శ్రోణి.
Button n s బొత్తాసు, గుండీ. or bud మొగ్గ.
Buttonhole n s బౌత్తాసులు తగిలించే రంధ్రము.
Buttress n s అండగోడ, ముట్టుగోడ.
Butyraceous adj ఘృతసంబంధమైన.
Buxom adj ముద్దుగా వుండే, రసికత్వము గల . a * lass సొగసైనపడుచు.
Buxomness n s సరసత, రసికత, ఉల్లాసము.
Buyer n s కొనేవాడు.
Buzz n s ఝంకారము, ఝుం అనడము. the * of bees తేనె యీగెలఝంకారము. a whisper గుసగుస. of a crowd గొలగొల, కలకలము.Report వదంతి.
Buzzard n s ఒకతరహా గూళి, యిది శవమునున్ను మలమునున్నుతినేటిది. a mean sort of hawk ఒక తరహా దిక్కుమాలిన డేగ. or adunce మూఢుడు, జడుడు, శుంఠుడు.
Buzzed abroad adj రట్టుచేయబడ్డ, రచ్చైన, వదంతిగావుండే,ప్రచురము చేయబడ్డ.
Buzzing n s ఝంకారము, ఝుం మనడము.
By adv దగ్గెర, సమపాన, కడగా. were you * at the time? నీవుఅప్పుడు వుంటివా. I was * నేను దగ్గెరవుంటిని. how did youcome * this ? యిది నీకు యెట్లావచ్చినది. the time is gone *సమయము మించిపోయినది. to lay * దాచిపపెట్టుట, యెత్తిపెట్టుట.they set him * అతణ్ని వుపేక్ష జేసినారు. put it * దాచిపెట్టు.* and * కొంత శేపులో, కాస్తతాళి, తరువాత.
By the bye adv నడమ వొకమాట, వోహో వొకటి జ్ఞాపకము వచ్చినది.
By-blow n s మరుగుదెబ్బ, దొంగదెబ్బ, అనగా దొంగతనముగాపుట్టినబిడ్డ;
By-by n s (bullaby) జోజో, చిచ్చీ, లాలి, అనే మాటలు.
By-corner n s ఒకమూల, దాగేస్థలము.
Bye adj మరుగైన, by a * way మరుగుదారిన. by the * ఓహోనాకుజ్ఙాపకము వచ్చినది.
Bye-ends n s దొంగయుక్తి, స్వలాభము, స్వప్రయోజనము.
By-gone adj గతించిన. In * times గతించిన కాలములో.
By-lane n s ఒక మూలవుండే సందు, గొంది.
Bylaw n s వారి వారిలో వుండే సంప్రదాయము, నిబంధన, ఆచారము,వాళి, సాంగ్యము, కట్టుబాటు.
By-path n s అడ్డదోవ, యెడదారి, దొంగదోవ.
By-play n s కపటము, కుత్సితము, కుయుక్తి. In this letter hemade some * యీ జాబులో కొంత అన్యాప్రదేశముగా వ్రాసినాడు.
By-road n s అడ్డదోవ, మరుగుదారి, దొంగదోవ.
By-room n s మరుగుగా వుండే అర, దొంగ అర.
By-stander n s దగ్గెర వుండేవాడు, పక్కనవుండేవాడు, సాక్షి.or otheres పరులు, లోకులు, మధ్యస్థులు.
By-street n s ఒక గొందిలో వుండే వీధి.
By-way n s అడ్డదోవ, మరుగుదారి, దొంగదోవ.
By-word n s సామిత, పొడుపుడుమాట. Tippoo has become a *among Hindus for a tyrant హిందువులలో క్రూరుడు అనడమునకు టీపుఅని పేరు పోయినది, అనగా వీడు రెండో టీపు అంటే క్రూరుడని భావము.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment