English to Telugu dictionary a Bivalve shell-Authoritatively

a Bivalve shell n s కాకిచిప్ప, కప్పచిప్ప, ఆలిచిప్ప.
a Boarding-house n s పూటకూటి యిల్లు.
A Catholic n s కాతోలిక్ మతస్థుడు.
A Catholicon n s అన్ని రోగములను పట్టే మందు.
a Clench or Clinch n s in poetry SleRa vAkyamu.
A Kimbo adv నడుమున చేతులు పెట్టుకొని she stood with her arms * నడుమున చేతులు పెట్టుకొని నిలిచినది, యిది తిట్టేటప్పుడు వుండే వైఖరి.
A Pedal n s. (in a piano) , Piano అనే యింగ్లిషు వీణె యొక్క కాలు, దీన్ని తొక్కితె తంబురయొక్క బిరడాను బిగించినట్లు సర్వభేదము కలుగుతున్నది.
A Pick n s or best of all ఉత్తమమైనది, శ్రేష్ఠమైనది. these men where the *of the regiment యీ సిఫాయీలు ఆ పటాళమునకు కండ్లుగా వుండిరి. take your *నీవు కోరినది యెత్తుకో. he carried me a * a pack over the water ఆ నీళ్ళలోనన్ను వీపు మీద యెత్తుకొని పోయినాడు.
A Priori n s కారణము చేత కార్యమును వూహించడము, యిది తర్క శబ్దము.
A Propos adv సమయానికి, అదునుకు. he came very a propos సమయానికివచ్చినాడు, అదునుకు వచ్చినాడు.
A Quickset hedge n s వెలుగుగా పెరిగే చెట్లు, పచ్చ వెలుగు.
A Quid of tobacco n s పుక్కిట పెట్టుకొన్న పొగాకు. a quid of betel nut తమ్మ,వక్కాకు తమ్మ. Quid pro quo ప్రతి, చెల్లు, ఫలము.
A Regular n s a kind of priest వొక విధమైన పాదిరి.
A Resurrectionist or Resurrection man n s పాతి పెట్టిన పీనుగులను తవ్వి అమ్మేవాడు. See Ann. Reg. 1776. p. [129.]
A Run n s పరుగు, పరిగెత్తడము this is above the common * ఇది సామాన్యము కాదు. he took a * పరుగెత్తినాడు. in the common * of affairs వ్యవహారధోరణిగా. in the long * తుదకు, మెట్టుకు. If he goes on in this way, in the long * he must be ruined వాడు యిట్లా ప్రవర్తిస్తే తుదకు చెడుతాడు. they gave him the * of the house ఆ యింట్లో వాడి మనసు వచ్చినట్టు నడవ నిచ్చినారు. ducks,pigeons and pigs had the * of the house ఆ యింటిలో బాతులు పావురాళ్ళు పందులు యథేచ్చగా తిరుగుతూ వుండినవి. It came down by the * లటక్కున వూడిపడ్డది.
A Runaway n s పారిపొయ్యేవాడు, పారిపొయ్యేటిది.
A Rustle n s a sound of leaves, &c. మర్మరధ్వని, చటచటమనే ధ్వని.
A Serving-man n s పనివాడు.
A Shrug n s or a * of the shoulders భుజములను యెగబెట్టుకోవడము.
A Sica-rupee n s సికారూపాయి.
A Skulker n s he who avoids what he must do పనిలో వొళ్లు దాచేవాడు, వొళ్లు వంగని వాడు.
A Smatch or Smattering n s వాసన. a * of garlic ఉల్లిగడ్డ కంపు. he has a * of knowledge వాడికి రవంత జ్ఞానము వున్నది.a * of Greek (See Cowper's Progress of Error line 367)రవంత చదువు, కాస్తంత పాండిత్యము.
A Split n s నెరియ, బీటిక, పగులు. there is a * in the wall ఆ గోడలో వొక బీటిక వున్నది. there was a * in the evidenceఆ సాక్ష్యములో ద్వైవిధ్యము వచ్చి చెడిపోయినది.
A Squaw n s (తిరస్కారమైన మాట) పెండ్లాము,
A Taunt n s a ఎత్తిపొడుపుమాట, ఎగతాళి మాట, తక్కువమాట, నింద, కుత్సితముగాచెప్పిన మాట.
A Tax gatherer n s పన్ను రూకలు తండేవాడు.
A Tear n s ( a rent ) చింపి, చినుగు, ఇది సుశబ్దము కాదు. *s of gum చెట్టులోనుంచి కారిన బంక.
A Teazle n s a comb to teazle wool బొచ్చు చిక్కు తీశే దువ్వెన.
A Thrust n s పోటు, తాకు, పొడుపు, గెంటు. he made four thrusts with hissword నాలుగు మాట్లు పొడవవచ్చినాడు. at a single thrust the deer killed him ఆ జింక వొకే పోటున చంపినది.
A Tortoiseshell cat n s తాబేటి పెంకు వర్ణముగల పిల్లి.
A Toss n s the act of tossing ఎగరవేయడము, రువ్వడము, పైకి తట్టడము.
A Truss n s గోచి, లంగోటి, బుడ్డను బిగించి యీడ్చికట్టే లంగోటి. of straw కట్ట,మోపు, దిండు. a * of sallad కూరకామలకట్ట.
A Tup n s ( a Scotch word ) a ram పొట్టేలు. a * lamb గొర్రె యొక్కపోతుపిల్ల.
A Wake n s a fair సంత. funeral ceremony used in Ireland ఐరులాండు దేశస్థులు చేశే వొక వుత్తరక్రియ. the * ofa ship వాడ పోతూ వుండగా వెనకతట్టు నీళ్ళలో అగుపడే జాడ, దీనిపేరు (ablosu) ఆబులోసు అంటారు. we followed in his wake ఆయననను వెంబడించి పోయినాము. or sitting up all night, vigil జాగరము.
A Wanton n s a lascivious woman కాముకురాలు, శృంగారవతి.
A Weighing machine n s balance తక్కెడ, త్రాసు.
A Whaler n s a ship which goes in search of Whales పెద్ధ చేపల వేటకు పొయ్యే వాడ.
A Whiffle n s a trifle రవంత.
A Whiffler n s a herald, an officer who went beforeprocessions to clear the way by blowing a horn ఒక దుత,అనగా వూరేగింపు పొయ్యేవాండ్లకు ముందర బరాబరి చేస్తూ పొయ్యే కొమ్మువాడు.
A, B,C ఏ,బీ,సీఅనేఅక్షరములు, he has not learned his A, B, C, వాడికి ఏ, బీ,సీ,రాడు, అనగా అక్షరాలు తెలియవు.
Aback adv వెనక, ఇది సముద్ర భాష.
Abaft adv వెనక, ఇది సముద్ర భాష.
Abandoned adj విడవబడ్డ, త్యజించబడ్డ, వర్జించిన, చెయి విడవబడ్డ. or helplessదిక్కుమాలిన. or vicious దుర్మార్గమైన, దుష్ట. * to grief వ్యసనాక్రాంతుడైన.* to his lusts మోహపరశుడైన. an * woman భ్రష్టురాలు, చెడ్డది, దుష్టురాలు.
Abandonment n s విడవడము, పరిత్యాగము. of mind విభ్రమము, పరవశత.
Abased adj అణిగిన, భంగపడ్డ.
Abasement n s అవమానము, భంగము.
Abashed adj భంగపడ్డ, సిగ్గుపడ్డ. he was * వాడికి ముఖము చచ్చినది.
Abated adj తగ్గిన, మట్టుపడ్డ.
Abatement n s తక్కువచేయడము, తక్కువ.
Abba n s అబ్బా, తండ్రి, ఇది దేవుణ్ని గురించి చేప్పేమాట.
Abbacy n s మఠాధిపత్యము, మఅఠము యొక్క మాన్యము.
Abbe n s (pronounced (ab-bay ) ఒక విధమైన పాదిరి.
Abbess n s సన్యసించిన స్తీల యొక్క మఠాధిపత్యము గల స్తీ.
Abbey n s సన్యాసిమఠము, సన్యసించిన పురుషుల యొక్క గాని స్త్రీల యొక్కగానిమఠము, (విహారము is the word used in Burma in Ceylon,) Abbey-lands,n. s.దేవస్థానము యొక్క మాన్యభూమి గుడినేల.
Abbot n s మఠాధిపతి, గురువు.
Abbreviated adj సంక్షేపము చేయబడ్డ, సంకేతాక్షరముగా వ్రాసిన, అనగా తర్వాత,అని వ్రాయడమునకు. త|| అని వ్రాసినట్టు, వెలగపూడి, భాష్టకార్లు అని వ్రాయడమునకు వె||భాష్యకార్లు, లేక వె|| భా|| అని వ్రాసినట్టు.
Abbreviation n s సంక్షేపము, సంగ్రహము, సంకేతాక్షరము.
Abdication n s త్యజించడము, వర్జించడము, విడిచిపెట్టడము, అనగా తన రాజ్యమునుత్యజించిపోవడము.
Abdomen n s పొత్తికడుపు, క్రీకడుపు, వస్తి.
Abdominal adj పొత్తికడుపు సంబంధమైన.
Abdominous adj పెద్ద పొట్టగల.
Abduction n s తీసుకొనిపోవడము.
Abetter n s సహాయము చేసేవాడు, అనగా దుర్మార్గమునకు సహాయము చేసేవాడు.
Abeyance n s (a state of suspension, or temporary extinction ) ఊరికేవుండడము, అనుపయోగముగా వుండడము, అనామత్తు. It is in * అది అనామత్తుగావున్నది. the appointment is now in * ఆ వుద్యోగము యిప్పుడు వూరికే వున్నది.the marriage is now in * ఆ పెండ్లి ప్రస్తుతము నిలిచివున్నది.
Abhorrence n s అసహ్యము, చీదర.
Abhorrent adj అసహ్యమైన, చీదరగావుండే.
Abiding adj స్ఠిరమైన, నిలకడైన, స్ఠిమితముగా వుండే.
Abigail n s ఆడపాప, ఆయా, పనికత్తె , ఇది పూర్వ కాలమందు వొక స్త్రీ పేరు.
Ability n s శక్తి, సామర్థ్యము, పరాక్రమము. a man of * శక్తివంతుడు; మేధావి.
Abject n s అతిరిక్తుడు, నిరుపేద.
Abjectly adv అతినీచముగా, అతితుచ్ఛముగా.
Abjectness n s నీచత్వము, క్షుద్రత.
Abjuration n s ప్రమాణ పూర్వకముగా విడిచిపెట్టడము, శపథము.
Ablative n s The instrumental * వల్ల, తో, చేత. " by, with, " is inSanscrit grammar called తృతియా విభక్తి the third case : and thelocative * "in " is called సప్తమీ విభక్తి, లో, యందు, the seventh case. The* absolute సతిసప్తమి.
Able adj శక్తిగల, సామర్థ్యముగల, an * man సమర్థుడు. one who is * to readచదవగలవాడు. he is not * to read వాడు చదవలేడు. I am not * to do it నేనుదాన్ని చేయలేను. the affix అంత్య ప్రత్యయము. as "pleasurable " సంతోషకరమైన.notable ప్రసిద్ధమైన. readable చదవగూడిన. saleable అమ్మగూడిన.
Able-bodied adj కాయపుష్టిగల, ధృడగాత్రుడైన. an * man కాయపుష్టిగలవాడు.
Ablution n s కడగడము, ప్రక్షాళనము.
Ably adv ఘనముగా.
Aboard adv వాడలో, వాడమీద. he went * వాడమీదికి పోయినాడు.
Abode thepastp||ofAbide ఉండిన,నివాసముచేసిన, See To Abide.
Abolition n s ఎత్తివేయడము, తోసివేయడము. after the * of this custom ఈమర్యాదను తోసివేసిన తరువాత.
Abominable adj అసహ్యమైన, రోతగావుండే, చెడ్డ. * conduct దుర్మార్గము.
Abominably adv అసహ్యముగా, రోతగా.
Abomination n s detestation, loating అసహ్యము, చీదర, రోత. the objectof destation రోతగా వుండేటిది, అసహ్యముగా వుండేటిది, తలచీదరగా వుండేటిది.wickedness దుష్టత. this is an * ఇది దుష్ట పని, యిది దుర్మార్గము.
Aboriginal adj అనాదియైన. * waste అనాదిబీడు. * lords or rulersఅనాదిరాజులు.
Aborigines n s plu. The earliest inhabitants of a country ఒక దేశములోఅనాదిగా పశుప్రాయులుగా అడవులలో తిరిగేవాండ్లు, చెంచువాండ్లు మొదలయినవాండ్లు.
Abortion n s కడుపు దిగబడడము. * took place గర్భస్రావమైనది. that child is amiserable * ఆ బిడ్డనిండా పీలగావున్నది. or horrible figure, Behind himstands a hideous animal the most horrible * that fancy ever coined.Here it means భీకరమూర్తి, భయంకరమూర్తి.
Abortive adj నిష్ఫలమైన, నిరర్థకమైన. an * birth నేలలు తక్కువగా పుట్టిన బిడ్డ.
About, or round (prep) చుట్టూ,చుట్టూరు ,they beat him * the head వాడి తలమీద నాలుగు తట్లా కొట్టినారు. those * him అతని వద్ద వాండ్లు. the suburbs * thecity వూరి బయిటవుండే పేట. she has no jewels * her దాని వొంటి మీదసొమ్ములు లేవు. he came with a sheet * him దుప్పటి చుట్టుకొని వచ్చినాడు. Ihave no money * me నా జేబులో రూకలు లేవు. the town is four miles * ఆపట్టణము చుట్టుకొని వస్తే నాలుగు మయిలుల దూరము వున్నది. all * అంతటా, సర్వత్ర.that road is very far * ఆ దోవ బహు చుట్టు. or concerning గురించి. theyasked him * his head వాడి తలను గురించి విచారించినారు. they came * thatbusiness ఆ పనికిగాను వచ్చిరి. or nearly కొంచెము, యించుమించు, మట్టుకు, వాసి.It is now * 4 o' clock యిప్పుడు దగ్గిర దగ్గెర నాలుగు ఘంటలు. * this timeయింత సేపటికి, యీసేపటికి, యీపాటికి. * half సగము మట్టుకు, సగమువాసి. * twofeet కొంచెము యించుమించు రెండడుగులు. a man * 30 ముప్పై యేండ్ల పాటివాడు. aman * his height వాడి అంత పొడుగాటి మనిషి. or employed upon మీద. youmust have your senses * you నీవు అజాగ్రతగా వుండరాదు. a cow * to calveయీననైవుండే ఆవు. a man * to die చావబొయ్యే మనిషి, అనగా యిప్పుడో యింకాఘడియకో అని వుండేవాడు. when I was * to set out నేను బయలుదేరవలెననివుండగా. * January జనవరి నెల అంతటికి. to bring * a సాధించుట. he broughtthe affair * ఆ పనిని నిర్వహించినాడు. he drove * the town బండి వేసుకొని వూరిచుట్టూ తిరిగినాడు, వూరంతా తిరిగినాడు. Go * your business నీపాటికి నీవుపో,లేచిపో.he looked * నల్దిక్కుల చూచినాడు, వెతికినాడు. what is he about ? వాడు యేమిచేస్తున్నాడు. the flag was blowing * ధ్వజ పటము గాలికి యిటూ అటూ ఆడుతూవుండినది,కొడిగాలికి ఆడుతూ వుండినది. the books were all lying * ఆ పుస్తకములుమూలకు వొకటిగా పడివుండినవి. why should you go * to abuse him ? వాణ్నియెందుకు తిట్టబోతావు. the ship went * వాడ తిరిగినది, మళ్లుకొన్నది.
Above prep మీద, పైన, మించిన, అధికమైన. * two hundred యిన్నూటికిపైన,యిన్నూటికి మించి. his conduct is * suspicion అతని నడతను గురించిఅనుమానము లేదు. this is an undertaking * his strength యిది అతని శక్తికిమించిన యత్నము. the * story యిందాకటి కథ, పైన చెప్పిన కథ. the * storyయిందాకటి కథ, పైన చెప్పిన కథ. the * stated పైన చెప్పిన. while they were *ground వాండ్లు జీవంతులై వుండినప్పుడు. * all ముఖ్యముగా. God is * allఅన్నిటికీ దేవుడు వున్నాడు. he is * receiving rent for his house వాడు తనయింటికి బాడిగే తీసుకోవడము తక్కువగా యెంచుతాడు. he is * his business వాడుతన వుద్యోగమును నీచముగా యెంచుతాడు. he is * the world వాడు కలిగిన వాడైవున్నాడు. In the world * పరమందు.
Above-board adv బాహాటముగా, బహిరంగముగా.
Abp ContractionofArchbishop
Abreast adv వరసగా, సరిగ్గా, జోడుగా. the corps advanced four * ఆపటాలము వరసకు నలుగురేసిగా వచ్చినది. the two palanquins came * ఆ రేండుపాలకీలు సరిగ్గా వచ్చినవి, జోడుగా వచ్చినవి.
Abridged adj సంగ్రహమైన, సంక్షేపము చేయబడ్డ, తగ్గించబడ్డ, తగ్గిన.
Abridgement n s సంగ్రహము, సంక్షేపము, తగ్గించడము, తగ్గడము. on accountof this * of his liberty వాడి స్వతంత్రము యిట్లా తగ్గిపోయినందున.
Abroach adj తెరిచిన, మొదలుపెట్టిన. to set * తెరుచుట, ఆరంభించుట. afterthey set the liquor * వాండ్లు సారాయి కారేటట్టు చేసిన తరువాత. he set the pipe* ఆ సీసాయికి బెజ్జము చేసి సారాయిని కారనిచ్చినాడు. they set this business * యీపనికి మొదలుపెట్టినారు. It is easy to set blood * but who is to stanch it ?నెత్తురు కారేటట్టు చేయడము సులభమే గాని కారకుండా నిలిపేవాడు యెవడు. who setthis ancient quarrel new * ? (Shakespeare ) పోయిన జగడాన్ని మళ్లీమొదలుపెట్టినది యెవరు.
Abroad adv బయట. both in the house and * ఇంట్లోనున్ను బయటనున్ను. hetravelled * పరదేశము తిరిగినాడు. The people were scattered * జనమునాలుగుతట్లా చెదరిపోయినది. he shed * his grace upon them తనదయనువాండ్లమీద ప్రసరింపచేసినాడు. the secret got * ఆ మర్మము బయటబడ్డది.
Abrogated adj కొట్టివేసిన, తోసివేసిన.
Abrogation n s కొట్టివేయడము, తోసివేయడము.
Abrupt adj ఆకస్మికమైన, అకస్మాత్తైన. or craggy ఒడుదుడుకైన. he gave me *answer ధూర్తత్వముగా వుత్తరవు చెప్పినాడు, కట్టెవిరిచినట్టు వుత్తరము చెప్పినాడు.
Abruptly adv ఆకస్మికముగా, ఆకస్మాత్తుగా, దడీలుమని, కట్టెవిరచినట్టుగా.
Abruptness n s ఆకస్మికత.
Abrus precatorious n s గురిగింజ.
Abscess n s విద్రధి, అనగా తేలకుండా వుండే లోనిపుండు.
Absence n s లేకవుండడము, పరోక్షము. In my * నేను లేనప్పుడు, నాపరోక్షములో.he took leave of * for ten days పది దినములకు లేకుండా వుండడమునకు సెలవుతీసుకొన్నాడు. the pains of * విరహవేదన. * of mind పరాకు, పరధ్యానము.
Absent adj లేని, లేకవుండే. he is very * వాడికి నిండా పరాకు, వాడికి పరధ్యానమునిండా. he is * to-day వాడు నేడు లేడు. he was then * వాడు అప్పుడు లేడు.
Absentee n s లేనివాడు, ఉండనివాడు.
Absolute adj సంపూర్ణమైన, స్వతంత్రమైన, స్వేచ్ఛ అయిన, నిరంకుశమైన. an *monarchy నిరంకుశ ప్రభుత్వము. this is * injustice యిది సాక్షాత్తు అన్యాయము వట్టిఅన్యాయము. he is * wisdom వాడు జ్ఞానావతారము.
Absolutely adv బొత్తిగా, శుద్దముగా, నిరంకుశముగా, అవశ్యముగా. this is * falseయిది బొత్తిగా అబద్ధము. he ruled * నిరంకుశ ప్రభుత్వము చేసినాడు.
Absoluteness n s పరిష్కారము, సంపూర్ణత.
Absolution n s విమోచనము, విముక్తి, అనగా పాదిరిచేసే పాపవిమోచనము. thepriest granted him * గురువు అతని పాపవిమోచనము చేసినాడు.
Absorbed adj పీల్చబడ్డ, ఇనికిన. he was * in grief దుఃఖములో ముణిగివుండినాడు. he was * in meditation వాడు తదేక ధ్యానముగా వుండెను. these tenofficers are to remain at Madras until they are * in differentregiments ఆయా రిజిమెంట్లలో యెత్తివేసుకొనే వరకున్ను యీ దొరలు పది మందిన్నిచెన్నపట్టణములో వుండవలసివున్నది.
Absorbent adj పీల్చే ఆకర్షించే. the * vessels నరము, తోలు, మొదలైనవి.blotting paper is * యెర్ర కాగితము తడిని యీడ్చు కొంటున్నది.
Absorbing adj పీల్చే, ఈడ్చుకొనే. * grief కృశింపచేసే దుఃఖము.
Absorpt adj పీల్చిన. See Absorbed.
Absorption n s పీల్చడము, ఈడ్చుకోవడము. * in the deity దేవునిలో లీనముకావడము, ఐక్యము కావడము.
Abstemious adj abstinent,మితభోజియైన,an * person మితాహారి, మితభోజి.
Abstemiously adv మితభోజనముగా.
Abstemiousness n s మిత భోజిత్వము. he shewed great * వాడు మహామితభోజనము చేసినాడు.
Abstergent adj నిర్మలముచేసే, శుభ్రముచేసే. soap is * సబ్బు నిర్మలముచేసేటిది.
Abstinence n s మితాహారము, లఘుభోజనము, ఫలాహారము, ఉపోష్యము,అభోజనము.
Abstinent adj మితాహారియైన, లఘుభోజనము చేసే.
Abstract adj సంక్షేపమైన, పరిష్కారమైన, స్పష్టమైన. an * noun భావార్థక శబ్దము,ధర్మవాచక శబ్దము. * mediation తదేక ధ్యానము. this is an * truth యిది కేవలనిజము, యిది పరిష్కారముగా నిజము.
Abstracted adj సంక్షేపమైన, సంగ్రహమైన. or absent పరాకైన, పరధ్యానమైన.
Abstractedly adv బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా. with absence of mindపరాకుగా, పరధ్యానముగా.
Abstraction n s పరాకు, పరధ్యానము. or disregard of wordly objectsవిషయ పరిత్యాగము, వైరాగ్యము. or theft &c. అపహారము.
Abstractly adv బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా.
Abstruse adj చిక్కైన, కఠినమైన, గూఢమైన, మర్మమైన, అమోమయమైన.
Abstrusely adv చిక్కుగా, కఠినముగా, గూఢముగా, మర్మముగా.
Abstruseness n s చిక్కు, కాఠిన్యము, గూఢము, మర్మము.
Absurd adj అవ్యక్తమైన, అనుచితమైన, అసంగతమైన.
Absurdity n s అవ్యక్తత, మూఢత.
Absurdly adv అవ్యక్తముగా, మూఢత్వముగా.
Abundance n s విస్తారము, యథేష్టము.
Abundant adj విస్తారమైన, యథేష్టమైన.
Abundantly adv విస్తారముగా, యథేష్టముగా, శానా.
abuse n s or reviling తిట్టు, తిట్లు, దుర్భాష. or the ill use of any thingదుర్వినియోగము. or bad practice దుర్మార్గము, దురాచారము, అక్రమము.
Abusive adj "తిట్టే, దూషించే. * language తిట్లు. Abusively, adv. దూషణగా, తిట్టి, దూషించి."
Abutment n s ముట్టుగోడ.
Abyss n s అగాధము, పాతాళము. the * of misery అఘోరమైన కడగండ్లు.
Acacia n s కనివిందచెట్టు.
Academical adj పాఠశాలా సంబంధమైన. * persons పాఠశాలా సంబంధమైనవాండ్లు.
Academician n s పాఠశాలా సంబంధమైన వాడు.
Academy n s పాఠశాల.
Acanthus n s ఒక విధమైన పుష్పచెట్టు.
Acatalectic adj సంపూర్ణమైన, ఇది ఛంధస్సులో వచ్చే మాట.
Accelerated adj త్వరపెట్టబడ్డ, తీవ్రించబడ్డ.
Acceleration n s త్వర, తీవ్రము.
Accent n s స్వరము, ఒత్తిపలికే స్వరము, ఒత్తుపలుకుకు సూచకమైన గురుతు, వానికే,అనే శబ్దములో accent మూడో అక్షరము మీద వున్నది, వాల్మీకి అనే శబ్దములో accentరెండో అక్షరము మీద వున్నది. soft *s తిన్నని పలుకులు. humble *s వినయోక్తులు.fierce *s క్రూరవచనములు.
Accentuation n s ఉచ్చారణ క్రమముగా గురుతులు వేయడము.
Acceptability n s మనోహరత్వము, ఉపయుక్తత, ఇష్టత, హితము. this provesthe * of your advice యిందువల్ల మీరు చెప్పిన బుద్ధి అతనికి యిష్టమైనట్టుతెలుస్తున్నది.
Acceptable adj మనోహరమైన, ప్రియమైన, ఉపయుక్తమైన, ఇష్టమైన, హితమైన, అనుకూలమైన. this rain is very * to the crops యీ వాన పైరుకునిండా అనుకూలమైనది. Unacceptable ప్రతికూలమైన.
Acceptableness n s హితము, ఇష్టము, ఉపయుక్తత.
Acceptably adv హితముగా, ఇష్టముగా.
Acceptance n s అంగీకారము, పరిగ్రహము, సమ్మతి.
Acceptation n s అంగీకారము, అర్థము, తాత్పర్యము.
Accepted adj అంగీకరించిన, పుచ్చుకొన్న, పరిగ్రహించిన, ఒప్పుకొన్న, రూఢియైన. the* meaning or sense రూఢ్యర్థము.
Access n s ప్రవేశము. he found * to them వాండ్ల వద్ద అతనికి ప్రవేశము కలిగినది,అనగా వాడికి వాండ్ల దర్శనము చిక్కినది. he is easy of * అతని వద్ద ప్రవేశముకలగడము సులభము, అనగా అతని దర్శనము కావడము సులభము. there was an *of fever last night నిన్న రాత్రి జ్వరము ముమ్మరముగా వుండినది.
Accessary n s దుర్మార్గమునకు సహాయపడేవాడు.
Accessible adj ప్రవేశించకూడిన, the house is * thro' the garden ఆ యింట్లోకితోటగుండా ప్రవేశించవచ్చును. he is * through flattery స్తోత్రముగుండా వాడువశ్యుడవుతాడు.
Accession n s ప్రవేశము. after this * ఆయనకు ప్రవేశమైన తరవాత, అనగాఆయన సింహాసన మెక్కిన తరవాత.
Accessory adj దుర్మార్గమునకు సహాయపడే.
Accidence n s లఘువ్యాకరణము.
Accident n s అకస్మాత్తుగా సంభవించిన పని. this was an * యిది తనంతటసంభవించినది, యిది ఆకస్మికము. a misfortune అపాయము, ఆపద. he met withan * వాడికి ఒక ఆపద వచ్చినది. by * అకస్మాత్తుగా, అయత్నపూర్వకముగా. inphilosophy సంభవము, విశేషము, అవివక్షితము.
Accidental adj అకస్మితమైన, అకస్మాత్తైన. causeless నిష్కారణమైన.
Accidentally adv అకస్మికముగా, అకస్మాత్తుగా. causelessly నిష్కారణముగా.
Acclamation n s జయధ్వని.
Acclimated adj అలవాటుగల.
Acclivity n s ఎక్కుడు, ఎగుడు. a house was built on the * of the hillకొండ యొక్క యెక్కుడులో వొక యిల్లు కట్టి వుండెను.
Accommodating adj తాళిమిగల, ఓర్పుగల. he is of an * temper వాడుతాళిమిగలవాడు. you should be more * నీకు నిండా తాళిమి వుండవలెను.
Accommodation n s వసతి, ఇమిడిక, పొసగుదల, వొదుగుదల, సమాధానము, రాజీ.can you give me * in your house? మీ యింట్లో నాకు స్థలమిస్తావా. there is ahouse with * for twenty people యిరువై మందికి వసతియైన వొక యిల్లు వున్నది.his giving me these books was a great * యీ పుస్తకములను నాకుఅతడివ్వడము నిండా సహాయమైనది. an * boat వసతిగా వుండే పడవ.
Accompaniment n s శ్రుతి, మేళము.
Accompanying adj వెంబడించే, అనుసరించే, కూడా వుండే.
Accomplice n s సహకారి, దుర్మార్గమునకు సహాయపడ్డవాడు. I will not be an *in this నేను యీ దుర్మార్గమునకు సహకారిగా వుండను.
Accomplished adj నెరవేరిన, పూర్ణమైన, పరిపక్వమైన, సిద్ధించిన. after theperiod was * ఆ కాలము పరిపక్వమైన తరువాత. after the business was * ఆపని నెరవేరిన తరువాత. after his prophecy was * అతను చేప్పిన ప్రకారముసిద్ధించిన తరువాత. * in archery ధనుర్విద్యా పారంగతుడైన. an * scholar సంపూర్ణపండితుడు, ప్రవీణుడు. an * woman వ్యక్తురాలు, నిపుణురాలు. an * dancer ఆటలోబాగా తీరిన వాడు.
Accomplisher n s నెరవేర్చేవాడు, నిర్వాహకి.
Accomplishment n s or elegant art విద్య అనావశ్యకమైన విద్య, అనగా ఆట,పాట, చిత్రము, సాము, మొదలైనవి. of a prophecy సిద్ధి, సిద్ధించడము. after the *of his prophecy సిద్ధి, సిద్ధించడము. after the * of his prophecy వాడునడవబోతున్నదన్నది సిద్ధించిన తరువాత, this prevented the * of this business ఆపని నేరవేరడమునకు యిది అభ్యంతరమైనది. a man of great *s మహాప్రవీణుడు.Drawing is a pretty * చిత్రపని వొక స్వల్పవిద్య.
Accompt n s లెక్క. See account.
Accomptant n s లెక్కవాడు. See Accountant.
Accord n s సమ్మతి. he came of his own * తనకు తానే వచ్చినాడు. All withone * అందుకు వొక మనసుగా, ఏక గ్రీవముగా.
Accordance n s అనుగుణ్యము. in * to his wish అయన కోరికకు అనుగుణ్యముగా.in * with his mandate ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారము.
According to prep ప్రకారము. * to orders ఆజ్ఞ ప్రకారము. * to him వాడుచెప్పిన ప్రకారము.
Accordingly adv అదే ప్రకారముగా.
Accoucheur n s మంత్రసానితనము చేసేవాడు.
Account n s of money లెక్క. value ఘనత. a man of * ఘనుడు. people ofno * స్వల్పులు. they made no * of him వాండ్లు వాణ్ని లక్ష్యపెట్టలేదు. Or profitఫలము. this turned to account యిది సఫలమైనది. You will find your * ingoing there నీవు అక్కడికి పోతివా నీకు సఫలమీను. he turned his time to good *సత్కాలక్షేపము చేసినాడు. he turns his land to no * వాడి నేలను వృధాగా వేసిపెట్టుతాడు. Reason నిమిత్తము. on this * యిందు నిమిత్తము. they called him to* for his వాణ్ని యిందుకేమి సమాధానము చెప్పుతావు అని అడిగినారు. Description,explanation వైనము, వృత్తాంతము, చరిత్ర. this is a foolish * యిది పనికిమాలినకధ. I have received accounts from home మా దేశము నుంచి వర్తమానమువచ్చినది. I settled his accounts వాడి లెక్కలను తీర్చినాను, లేక, వాణ్ని చంపినాను.By all accounts he is gone వాడు పోయినాడట. When you blame them, youmust take their ignorance into * వాండ్ల మీద దోషము చెప్పేటప్పుడు వాండ్లఅవజ్ఞతనున్ను నీవు యోచించవలెను. On * of his absence అతను లేనందున. hebought it on his own * దాన్ని తన సొంతానికి కొనుక్కొన్నాడు. on * of the rainవానవల్ల. You must on no * go there నీవు అక్కడికి యెంతమాత్రము పోకూడదు.he is gone to his final * or to his great * చచ్చినాడు.
Accountable adj ఉత్తరవాదియైన, జవాబుదారియైన.
Accountant n s లెక్కవాడు. of a village కరణము.
Account-book n s లెక్కపుస్తకము.
Accountred adj ధరించిన, తొడిచిన, ముస్తీబు చేయబడ్డ, సన్నద్ధము చేయబడ్డ. * witha sword ఖడ్గధారియైన, కత్తికట్టుకొన్న. he was then * with two pistols అప్పట్లోవాడు రెండు పిస్తోలులు కట్టుకొని యుండినాడు.
Accoutrement n s ఆయుధములు, బట్టలు, మొదలైన ముస్తీబు.
Accredited adj వకాలత్తు నామాగల అధికారముగల.
Accretion n s పెరిగినది, సంభవించినది.
Accumulated adj పోగుచేసిన, ఆర్జించిన, చేరిన, కూడిన. * injustice బహుఅన్యాయము.
Accumulation n s పోగు, రాశి. he left a great * of debts విస్తారముఅప్పుపెట్టి పోయినాడు. * of wealth బహుధనము.
Accuracy n s ఖండితము, పరిష్కారము, శుద్ధత. he wrote this with great *దీన్ని తప్పులు లేకుండా వ్రాసినాడు. a man of great * నిండా ఖండితమైనవాడు.
Accurate adj ఖండితమైన, పరిష్కారమైన, శుద్ధమైన. an * translationపరిష్కారమైన భాషాంతరము, సరియైన భాషాంతరము. an * copy శుద్ధప్రతి.
Accurately adv ఖండితముగా, సరిగ్గా, పరిష్కారముగా. a copy written *శుద్ధముగా వ్రాసి ప్రతి.
Accurateness n s ఖండితము, పరిష్కారత, శుద్ధత, సుబద్ధత. From the * of thisaccount I saw his talent వాడు దీన్ని వర్నించిన పరిష్కారతవల్ల వాని ప్రజ్ఞ నాకుతెలిసినది.
Accursed adj శపించబడ్డ, దౌర్భాగ్యమైన, చెడ్డ, పాపిష్టి.
Accusation n s నిందమోపడము, నెపము, అపవాదము. they brought an * oftheft against him దొంగలించినాడని వాడిమీద ఫిర్యాదు తెచ్చినారు.
Accused adj నిందమోపబడిన. those who are * of doing this యీ పనిచేసినారని అనబడ్డవాండ్లు. the accused ప్రతివాది, నేరము మోపబడ్డవాండ్లు.
Accuser n s పిర్యాది, వాది. who is the * in this యీ పని జరిగినట్టుచెప్పేవాడెవడు.
Accustomed adj అభ్యాసపడ్డ, అలవాటుపడ్డ, వాడికపడ్డ, మరిగిన.
Ace n s పగడ, వంచ. in cards వకచుక్క, దీన్ని ఆసు అంటారు. I was within an* of falling నేను పడడానకు పగడ తప్పింది.
Acerbity n s చెడుపులుసు, క్రౌర్యము.
Acescency n s పులిసేగుణము.
Acescent adj పులుసుగావుండే.
Acetous adj పులిసే.
Ache n s నొప్పి. heart * మనోవ్యధ. tooth * పండ్లతీపు.ear * చెవిపోటు.
Achievement n s కార్యము, సాధించిన కార్యము. or ensigns armorial చిహ్నము.this was a great * మహత్తైన కార్యము. his achievements are two lionsవాడికి బిరుదు రెండు సింహములు.
Achilles n s ద్రోణాచార్యులవంటి వక శూరుడు.
Achromatic adj వర్నవిహీనమైన.
Acid n s పులుసు. * muriatic లవణ ద్రావకము. vitriolic * గంధక ద్రావకము.nitrious * పెట్లుప్పు ద్రావకము.
Acidity n s పులుసు.
Acidulated adj పులియబెట్టిన.
Acknowledged adj వొప్పిన, అంగీకరించిన. or renowned ప్రసిద్ధమైన. It mustbe * that some of them are rich వారిలో కొందరు భాగ్యవంతులుగా వుండేదివాస్తవమే. she is an * beauty అది అందకత్తె యని ప్రసిద్ధురాలైనది.
Acknowledgement n s అంగీకారము, వొప్పుకోవడము. or receipt for moneyచెల్లుచీటి. * of a benefit కృతజ్ఞత, ఉపకారస్మృతి. * of a bow ప్రతివందనము. wemake you these acknowledgements for our new dresses మేము కొత్తబట్టలు కట్టుకొన్నాము గనుక తమకు దండము పెట్టుతాము.
Acme n s శిఖరము, ఊర్ధ్వభాగము, ఉఛ్రాయము. the * of a disease రోగముయొక్క ముమ్మరము. the * of felicity అనందాతిశయము.
Acolyte n s శిష్యుడు.
Aconite n s వకతరహా విషమూలిక.
Acorn n s కాయ, విత్తు, యిది Oak మొదలైన కొన్ని గొప్ప వృక్షముల యొక్క కాయ,వీటిని పందులు తింటవి.
Acoustics n s ధ్వని విషయక శాస్త్రము.
Acquaintance n s పరిచయము, యెరుక, నెళువు, యెరిగినవాడు,పరిచయము గలవాడు. he told a mutual * of oursతన్ను నన్ను యెరిగిన వకడితో చెప్పినాడు. this shews his * with grammarయిందువల్ల అతనికి వ్యాకరణమందు పరిచయము కద్దని తెలుస్తుంది. they scraped *with me నన్ను పరిచయము చేసుకొన్నారు. he has many acquaintances అతనికియెరిగినవాండ్లు శానామంది వున్నారు. they are acquaintances of mine వాండ్లునా కెరిగిన వాండ్లు. he has no * with English అతనికి ఇంగ్లీషు పరిచయము లేదు.
Acquainted adj యెరిగిన, పరిచయముగల. I am not * with his name వాడిపేరు నాకు తెలియదు.
Acquiescence n s సమ్మతి, అంగీకారము. In consequence of his * అతనువొప్పుకొన్నందున.
Acquired adj సంపాదించిన, ఆర్జించిన, గ్రహించిన, నేర్చుకొన్న.
Acquirement n s సంపాదించడము. After the * of this forture యీఐశ్వర్యము వచ్చిన తరువాత, ప్రాప్తమైన తరువాత. After the * of this languageయీ విద్యను గ్రహించిన తరువాత. in plural విద్య, పాండిత్యము. a man of greatacquirements మహావిద్వాంసుడు, మహాపండితుడు.
Acquisition n s సంపాద్యము, ఆర్జన. personal * స్వార్జితము.
Acquisitiveness n s విచారించే బుద్ధి. See under Cranology.
Acquittal n s దోషము లేదనడము, నేరము లోదని తీర్పువ్వడము.
Acquittance n s రుణవిమోచనము, చెల్లుచీటి.
Acre n s నాలుగువేల యెనమన్నూట, నలభైగెజాల చదర భూమి, దీన్ని వొక ఏకరా, లేకవొక కాణి అంటారు.
Acrid n s వగరు, కారము, వేండ్రము.
Acridity n s వగరు, కారము, వేండ్రము, తీక్ష్ణము, చురుకు. the * of the limepowder burnt his tongue సున్నపు వేండ్రముచేత నాలికెపొక్కింది.
Acrimonious adj క్రూరమైన, పరుషమైన, కఠోరమైన. * language కర్ణకఠోరమేనమాటలు. * humours in the body శరీరములో వుండే విష నీరు.
Acrimoniously adv క్రూరముగా, కఠోరముగా.
Acrimony n s క్రూరత, పరుషత, కఠోరత, తీక్ష్ణత.
Across adv అడ్డముగా. there is a bridge * the river ఆ యేటికి వంతెనకట్టివున్నది. a house * the river యేటికి ఆ తట్టువుండే బంగళా. they went * theriver యేటిని దాటినారు. when I came * him అతడు నాకు యెదురు పడ్డప్పుడు.
Acrostic n s ఒక తరహా చిత్రబంధ కావ్యము, యిందులో ప్రతి చరణము యొక్కమొదటి అక్షరములను కూర్చి చదివితే ఒక మనిషి యొక్కగాని ఒక వస్తువుగాని పేరుఅవుతున్నది.
Act n s క్రియ, పని. religious * కర్మము, వ్రతము. a rash * క్రూర కృత్యము. anoble * ఘనమైన కార్యము. an * in a play అంకము, అనగా నాటకములో ఒక భాగము.an * of parliament or government చట్టము. the * of God or the kingదైవికము రాజికములు. while I was in the * of falling నేను పడుతూ వుండగా. Icaught him in the * వాడు ఆ పని చేస్తూ వుండగా పట్టుకొన్నాను.
Acting adj బదులుగా పని చేస్తూవుండే. the * judge ఒకరి బదులుగా పనిచూస్తూవుండే న్యాయాధిపతి.
Action n s క్రియ, చలనము, పని, కార్యము, ఆట. the hands of the watch arenot in * ఆ ఘడియారము యొక్క ముండ్లు ఆడలేదు, తిరగలేదు. a good * సత్కర్మము,పుణ్యము. In law వ్యాజ్యము. he brought an * against them వాండ్ల మీదవ్యాజ్యము తెచ్చినాడు. or Battle యుద్ధము. One * took place in the morningand one in the evening తెల్లవారి ఒక యుద్ధము జరిగినది. the * of a medicineమందు యొక్క వ్యాపకము. or gesture అభినయము. he used much * in talkingమాట్లాడడములో అభినయములు నిండా చేసినాడు. Dryden says "To an exactperfection they have brought The action Love : the passion is forgot. "మోహమును గురించిన అభినయమును దివ్యముగా వర్ణించినాడు గాని మోహరసమునువిడిచిపెట్టినాడు.
Actionable adj శిక్షవచ్చే, దండన వచ్చే. Opening another man's letter is *ఒకరి జాబును విచ్చితే శిక్ష కలుగును.
Active adj క్రియగల, చలనముగల, చురుకైన, జాగ్రతగల, వుటంకియైన. an * horseచురుకైన, జాగ్రతగల, వుటంకియైన. an * horse చురుకైన గుర్రము. or busy పాటుపడేan * man చురుకుమనిషి, పాటుపడేవాడు. The volcano is not now * ఆఅగ్నిపురము యిప్పుడు మండలేదు. In grammar సకర్మకమైన. an * verb సకర్మకక్రియ. an * disease త్వరలో మనిషిని చంపే రోగము. charity is an * virtue :endurance and temperance are passive virtues ధర్మము ఆచరణ రూపమైనగుణము, సహనమున్ను మితమున్ను అనుభవరూపమైన గుణములు.
Actively adv చురుకుగా.
Activity n s చురుకు, జాగ్రత. the * of fever or of a medicine వేగము. Thefire is not in a state of * నిప్పు మండలేదు.
Actor n s చేసేవాడు. a stage player నటి, ఆడేవాడు, వేషగాడు. We wereactors in this business, and you were only spectators యీ పనిని చేసినవాండ్లు మేము వూరికే చూచిన వాండ్లు మీరు.
Actress n s ఆటకత్తె , వేషకత్తె.
Actual adj నిజమైన, వాస్తవ్యమైన, యధార్థమైన, ప్రత్యక్షమైన. or presentతాత్కాలికమైన, ప్రస్తుతమైన. this is * murder యిది సాక్షాత్తు ఖూనిపని. this is *injustice యిది ప్రత్యక్షమైన అన్యాయము. the * holder of the land ప్రస్తుతము .ఆభూమిని అనుభవించేవాడు. the * cautery రక్ష, వాత.
Actually adv నిజముగా, వాస్తవ్యముగా, యధార్థముగా, ప్రత్యక్షముగా.
Actuary n s or Accountant లెక్కలు తీర్పుచేసేవాడు.
Actuated adj ప్రేరేపించబడ్డ. In doing this he was * by friendshipస్నేహితమునుబట్టి దీన్ని చేసినాడు. * by terror భయమునుపట్టి. * by love for herదానియందు వ్యామోహముచేత.
Acumen n s సూక్ష్మబుద్ధి, కుశాగ్రబుద్ధి.
Acute adj క్రూరమైన, తీక్ష్ణమైన, చురుకైన. an * lawyer తీక్ష్ణబుద్ధిగలవకీలు. *pain పోటుబుద్ధిగలవకీలు. * pain పోటు, సళుపు. an * disease త్వరలో చంపేరోగము,తక్షణము చంపే రోగము. * intellect తీక్ష్ణబుద్ధి. the * accent ఉదాత్త స్వరము. an *angle అంతర్లంబకాస్రము.
Acutely adv కూరుగా, తీక్ష్ణముగా, సూక్ష్మముగా.
Acuteness n s కూరు, తీక్ష్ణత, చురుకు.
ad Libitum adv కావలసినమట్టుకు, యథేచ్ఛగా.
Adage n s వాడుకగా అనేమాట, సామిత. there is an * that "doctors differ "వైద్యులు తలా వక మాట అంటారనడము వాడుకగా అనే మాటేగదా.
Adagio n s in music విళంబితము.
Adam n s అదిమపురుషుని నామము. the sons of * * నరులు.
Adamant n s వజ్రము, రవ, హీరము.
Adamantine adj అతికఠినమైన. a man of * constitution వజ్రదేహి.
Adaptation n s సరిపరచడము, పొసగించడము, పొందిక, యిమిడిక.
Adapted adj తగిన, ఉపయుక్తమైన, యోగ్యమైన. this is * to many purposesయిది బహు పనులకు వుపయుక్తమైనది.
Adder n s కట్లపాము. Deaf * మంత్రానికి లోబడని కట్లపాము, మాట వినని మూఖు ్డు.
Addictedness n s దురాశ, లోలత్వము.
Addition n s కూర్చడము, చేర్చడము, వృద్ధి. In Arithmetic గుణకారము. he hadan * to his family yesterday నిన్న వాడికి బిడ్డ పుట్టింది. In * to his formerstatement వాడు మునుపు చెప్పినది కాకుండా.
Additional adj అధికమైన, ఎక్కువైన. * expenses అధికవ్యయములు. * servantsఅధిక పనివాండ్లు.
Additional rules ఉపనిబంధనలు
Addle adj అవిసిపోయిన, నిస్సారమైన, కలవరమైన. an * egg అవిసిపోయిన గుడ్డు.an * pated or * headed fellow కలవరపు మనిషి, పిచ్చివాడు.
Addled adj See Addle.
Address n s a petition మనివి, అర్జి. or speech ప్రసంగము, సంభాషణ.direction పై విలాసము. title వక్కణ, బిరుదావళి. skill నిపుణత. Mode ofbehaviour మర్యాద, రసము. a man of good * సరసముగా, లేక, ఘనముగామాట్లాడేవాడు. a man of mean * జబ్బురసముగా మాట్లాడేవాడు. he paid hisaddresses to her తన్ను పెండ్లి చేసుకొమ్మని దాన్ని ఉపసర్పించినాడు.
Adept n s ప్రవీణుడు, నిపుణుడు, సమర్థుడు, జితపడ్డవాడు. he is an * inarithmetic లెక్కలో పూర్ణుడు.
Adequate adj తగిన, యోగ్యమైన, సరియైన.
Adequately adv తగినట్టుగా.
Adherence n s అంటుకొని వుండడము, అనువర్తనము. or fixedness పట్టు. Bythe * of the skin to the flesh తోలు మాంసమును అంటుకొని వుండడమువల్ల.this shews their * to the law యిందువల్ల ఆ చట్టము మీద వాండ్లకు వుండే పట్టుతెలుస్తుంది. his * to the truth saved him వాడు నిజమును అవలంబించడము వాణ్నికాపాడింది.
Adherent n s అనుసరించినవాడు, అవలంబించినవాడు, ఆశ్రితుడు. he and hisadherents వాడున్ను వాడితో చేరిన వాండ్లున్ను.
Adhering adj అంట్లుకొన్న, చేరిన, అనుసరించిన, ఆశ్రయించిన.
Adhesion n s అంటుకోవడము, కరుచుకోవడము, బంధన the water destroyedthe * of the gum నీళ్ళచేత ఆ బంక యొక్క బంధన పోయినది.
Adhesive adj అంటుకొనే, కర్చుకొనే బంధనగల. * plaister కర్చుకొని వుండేప్లాస్తిరి. glue is * వజ్రము బంధన గలది, కర్చుకొనేటిది.
Adieu n s దండము, దీవన, సలాము, ఒకరిని ఒకరు యెడబాసేటప్పుడు శెలవు తీసుకొనిపొయ్యేవాడు, శెలవు యిచ్చి పంపించేవాడు యిద్దరున్ను చెప్పేమాట. he bade them *శెలవు పుచ్చుకొన్నాడు, శెలవు యిచ్చి పంపినాడు, పోయి వస్తా నన్నాడు, పోయిరాఅన్నాడు. I bade * to these hopes నేను యీ ఆశను విడిచిపెట్టినాను. he bade * tothe world సన్యసించినాడు. the same as good bye or farewell అనే మాటలకుసమానము. he uttered his last * చచ్చినాడు.
Adjacency n s సమీపత్వము.
Adjacent adj సమీపమైన, దగ్గిరి.
Adjective n s విశేషణము.
Adjoining adj చేరికగావుండే. In the * house పొరుగింటిలో, పక్క యింటిలో.
Adjournment n s మరిఒకవేళ జరిగిస్తామని తత్కాలానికి నిలిపిపెట్టడము.
Adjudication n s తీర్పు చేయడము, తీర్పు యివ్వడము, విధించడము.
Adjunct n s సంయోగించివుండేటిది, చేరివుండేటిది.
Adjuration n s ఒట్టుపెట్టడము, అనబెట్టడము, ఒట్టు, ఆన.
Adjusted adj దిద్దిన, సవరించిన, క్రమపరచిన.
Adjustment n s దిద్దుబాటు, సవరింపు.
Adjutancy n s అజిట ్ వుద్యోగము .
Adjutant n s దండులో అజిటననే వొక దొర. A sort of Crane బెగ్గురు అనే పెద్దకొంగ.
Admeasurement n s కొలత.
Administration n s జరిగించడము, చెల్లించడము, విచారణ. * of governmentప్రభుత్వమును జరిగించడము. During his * అతని మంత్రిత్వములో. * of justiceన్యాయ విచారణ. Letter or power of * చచ్చినవాని ఆస్తిని గురించి న్యాయసభవారిద్వారా వచ్చిన అధికార పత్రిక.
Administrator n s చచ్చినవారి ఆస్తిని గురించి న్యాయసభలో అధికారముతీసుకొన్నవాడు, విచారణకర్త.
Administratorship n s చచ్చినవారి ఆస్తిని గురించి న్యాయసభలో తీసుకొన్నఅధికారము.
Administratrix n s చచ్చిన వారి ఆస్తిని గురించి న్యాయసభలో అధికారమునుతీసుకొన్న స్త్రీ.
Admirable adj అద్భుతమైన, ఘనమైన, ఉత్తమమైన.
Admirably adv అద్భుతముగా, దివ్యముగా, ఘనముగా.
Admiral n s యుద్ధవాడలకు అధిపతి. * of the Red, * of the White, * of theBlue, Rear * యీనాలుగున్ను ధ్వజపటము యొక్క వర ్ భేదము చేత కలిగినఆధిపత్యము యొక్క భేదములు.
Admiralty n s వాడలో జరిగే కొట్టుతిట్లు మొదలయ్ని వ్యాజ్యములు తీర్చే న్యాయసభ.
Admiration n s అద్భుతము, ఆశ్చర్యము.
Admirer n s మెచ్చుకొనేవాడు. he is an * of hers దాన్ని మోహించినవాడు.
Admiringly adv ఆశ్చర్యపడి, మోహించి.
Admissibility n s అంగీకారయోగ్యత. he proved the * of these accountsయీ లెక్కల యొక్క అంగీకారతను రుజువు చేసినాడు.
Admissible adj అంగీకరించ యోగ్యమైన.
Admission n s ప్రవేశము, చేర్చుకోవడము, లోనికి రానివ్వడము, లోనికి రావడానకుశెలవు. After his * into the school వాడు పల్లెకూటములో ప్రవేశించిన తరువాత.Before the * of the water నీళ్లు లోగా రాకమునుపే, చొరడానకు మునుపే, hecould not gain * లోగా ప్రవేశించడానకు వాడికి అవకాశము చిక్కలేదు శెలవు చిక్కలేదు.the water gained * through the roof యింటి కప్పుగుండా నీళ్ళు దిగినది,వురిసినది. they refused him * వాణ్నిలోనికి రానివ్వమన్నారు, చేర్చుకోమన్నారు. orconfession ఒప్పుకోవడము, అంగీకారము. On his * of these charges వాడు యీతప్పులను వొప్పుకున్నందు మీదట.
Admittance n s లోనికి రానివ్వడము, లోనికిరావడానికి శెలవు, ప్రవేశము. I cannotget * to him; or, into his presence అతని వద్ద నాకు ప్రవేశము చిక్కలేదు, అనగా,అతని వద్దకి పోగూడలేదు.
Admitted adj చేర్చుకోబడ్డ, రానిచ్చిన, అంగీకరించబడ్డ, వొప్పుకొన్న.* but సరేగాని.
Admixture n s మిశ్రమము, కలుపు.
Admonition n s బుద్ధిచెప్పడము, బోధన, ఉపదేశము.
Admonitory adj బుద్ధిచెప్పే, బోధించే. an * poem నీతికావ్యము, ఉపదేశ గ్రంథము.
Ado n s శ్రమ, తొందర, యిబ్బంది. or Bustle అల్లరి, గత్తర. without any more *he paid the money ఆ రూకలను అనాయాసముగా చెల్లించినాడు. I had much * tohelp laughing సంకటపడి నవ్వును అణుచుకొంటిని. he had much * to get foodఅన్నానికి నిండా శ్రమపడ్డాడు.
Adolescence n s యౌవనము, యౌవనావస్థ.
Adolescent adj యౌవనావస్థగా వుండే.
Adonis అతిసుందరమైనఒకదేవునిపేరు
Adopted adj దత్తుచేసుకోబడ్డ, అవలంబించిన. an * son దత్త పుత్రుడు. the method* by these వాండ్లు అవలంబించిన మార్గము.
Adoption n s దత్తు, స్వీకారము, అవలంబించడము. from your * of hissentiments వాడి భావము నీకు పట్టుబడ్డది గనక, వాడి బుద్ధే నీకున్ను వచ్చినది గనక.After his * of this plan వాడు యీ యుక్తిని అవలంబించిన తరువాత, యీ మాదిరినిపట్టిన తరువాత.
Adoptive father n s దత్తు చేసుకొన్న తండ్రి.
Adorable adj పూజ్యమైన, పూజనీయమైన, పూజార్హమైన.
Adorably adv పూజనీయముగా, పూజార్హముగా.
Adoration n s పూజ, అర్చన.
Adored adj పూజ్యమైన, పూజార్హమైన.
Adorer n s పూజచేసేవాడు. an * of the sun సూర్యోపాసకుడు.
Adorned adj అలంకరించిన, శృంగారించిన, with many virtues సకలగుణసంపన్నుడైన.
Adornment n s అలంకారము, శృంగారము.
Adrift adv నీళ్ళమీద కొట్టుకొని పోయే, ఘాలికి కొట్టుకొనిపొయ్యే, విడిచిపెట్టి, దిక్కులేక. Wood that is * నీళ్ళ మీద విడిగా తేలేమాను. that boat is * పడవ ఘాలికికొట్టుకొని పోతుంది. All the cotton is now * యిప్పుడు పత్తి అంతా ఘాలికికొట్టుకపోయినది. he cut the boat * దారమును తెగ్గోసి పడవను యధేచ్ఛగావిడిచిపెట్టినాడు. he cut me * నన్ను నిరాధరముగా విడిచి పెట్టినాడు.
Adroit adj చమత్కారియైన, నేర్పరియైన, నిపుణుడైన.
Adroitly adv చమత్కారముగా, నేర్పుగా, నిపుణతగా.
Adroitness n s చమత్కారము, నేర్పు, నిపుణత.
Adry adv దప్పికగా, దాహముగా. I am * నాకు దాహముగా ఉన్నది.
Adscititious adj అధికమైన, ఉపరియైన, అన్యత్ర తెచ్చుకొన్న.
Adulation n s ఇచ్చకము, ముఖస్తుతి, బుజ్జగింపు.
Adulator n s ఇచ్చకాలమారి, ముఖస్తుతి చేసేవాడు, బుజ్జగించేవాడు, ఉబ్బించేవాడు.
Adulatory adj బుజ్జగింపైన, స్తోత్రమైన, ఉబ్బించే.
Adult n s వయసు వచ్చిన మనిషి, ప్రాయపు మనిషి. Both infants and adultsపసివాండ్లున్ను వయసు వచ్చిన వాండ్లున్ను.
Adulteration n s కలిపిచెరపడము, మట్టము చేయడము. to prevent the * ofthis silver యీ వెండి కలపడమై పోకుండా.
Adulterer n s జారుడు, ఒకని పెండ్లాన్ని పట్టేవాడు.
Adulteress n s వ్యభిచారి, జార స్త్రీ.
Adulterine adj పరపురుషునికి పుట్టిన, జారజుడైన.
Adulterous adj రంకుగల, వ్యభిచారముగల.
Adultery n s రంకు, వ్యభిచారము, జారత్వము.
Adust adj యెండిన, శుష్కించిన.
Advance n s ముందుకు రావడము, అభివృద్ధి, ముందు రూకలు. in his * వాడివతలికిరావడములో. to prevent his * వాడివతలికి రాకుండా నిలపడానకు. his * in theservice was slow వాడికి వుద్యోగము త్వరగా పొడగలేదు. I observed noadvance in his learning వాడికి విద్యలో అభివృద్ధి కానము. he made a rapid * inthe language ఆ భాష వాడికి త్వరగా వచ్చినది. his rapid * in learningsurprises me వాడి విద్యాభివృద్ధిని గురించి నాకు ఆశ్చర్యమౌతున్నది. she madeadvances to him వాడికి బులుపులు పెట్టింది, ఆశ కొలిపింది. he made advancesto a reconciliation మళ్లీ సమాధానము చేసుకోవలెనని యత్నపడ్డాడు. Money paidin * for cultivation వారకము, తక్కావి.
Advanced adj ముందుకు వచ్చిన, ముందుకు సాగిన, ముందరనడచిన, అభివృద్ధియైన,పొడిగిన, చాచిన ముందు రూకలిచ్చిన, చెప్పిన. the boy is well * in grammarవ్యాకరణములో బహుదూరము చదివినాడు. Well * in age నిండా యేండ్లు చెల్లిన. * inrank వుద్యోగములో పొడిగిన. the work is now far * ఇప్పుడా పని బహుదూరముజరిగినది. the statement * by them వాండ్లు చెప్పినమాట. the * force ముందుగాపోయిన దండు. Money * to tenants to pay for seed వారకము, తక్కావి. themoney * for this యిందుకై ముందుగా యిచ్చిన రూకలు.
Advancement n s అభివృద్ధి.
Advantage n s లాభము, ప్రయోజనము, ఉపయోగము, ఆదాయము, ఫలము. thatwill be no * అందువల్ల ఫలము లేదు. he let the * slip లాభమును విడిచిపెట్టినాడు,పోగొట్టుకొన్నాడు. he was born with the advantages of fortune andstrength ఐశ్వరమున్ను కాయపుష్టిన్ని అనే విశేషములతో కూడా పుట్టినాడు. oropportunity సమయము. they took * of his weakness and robbed him వాడిఆశక్తిని చూచుకొని దోచుకొన్నారు. he took * of my absence నేను లేని సమయముచూచుకొన్నాడు. he took * of me నన్ను మోసపుచ్చినాడు. In selling this houseto me he took * of me by concealing its age ఆ ఇంటిని నాకు అమ్మడములోఅది పాతదని తెలియచేయక మోసపుచ్చినాడు. Do you think that I would take an* of you నిన్ను మోసము చేతుననుకొన్నావా. you should not give them such an* over you నీవు వాండ్లకు అట్లా యెడమివ్వరాదు. you have the * of me నీదిపై చెయిగా వున్నది. I had the * of being taught by him ఆయన దగ్గెర చదివినానన్న అధిక్యము నాకు కద్దు. Being on the hill the enemy has the * over usకొండమీద వుండినందున శత్రువులు మాకు పై చెయిగా వుండిరి. he has some * overme in learning చదువులో అతను నాకు కొంచెము పై చెయిగా వున్నాడు. he appearedto great * in this business యీ పనిలో వాడి తేజస్సు బయటపడ్డది, వాడిప్రభావము బయటపడ్డది. he sold the house to * ఆ యింటిని లాభముగా అమ్మినాడు,కిఫాయిత్తుగా అమ్మినాడు. It appears to great * here యీ తట్టునుంచి చూస్తే అదిబాగా కండ్ల బడుతుంది. he arranged his arguments to much * వాడు బద్దలు కట్టిమాట్లాడినాడు, శృంగారించి మాట్లాడినాడు.
Advantaged adj లాభమును పొందిన, ఫలమును పొందిన.
Advantage-ground n s వైపుగావుండే స్థలము.
Advantageous adj ప్రయోజనకరమైన, లాభకరమైన, ఫలకరమైన, ఆదాయమైన,ఉపయోగమైన, అనుకూలమైన. he made a very * marriage వివాహముచేసుకోవడమువల్ల వాడికి నిండా వుపయోగము.
Advantageously adv లాభముగా, ఉపయోగముగా.
Advantageousness n s లాభము, ఫలము, ఆదాయము.
Advent n s ఆగమనము, అనగా ఖ్రీస్టు మాస్పండుగకు ముందువచ్చే నాలుగు వారాలు.
Adventiously adv తనకుతానే, తనంతటనే, హటాత్తుగా.
Adventitious adj that which happens సంభవించే, సంఘటించే, తటస్థించే,సంప్రాప్తమయ్యే, ఆగంతుకమైన, అవాంతరమైన. or extrinsic పై, బయటి. heeffected this without * aid పై సహాయము లేకనే దీన్ని నెరవేర్చినాడు. she is anexcellent woman; her beauty is an * circumstance అది మహాఘనురాలు దానిఅందము అవివక్షితము.
Adventure n s దైవఘటనము, సంభవించినపని, చరిత్ర, వృత్తాంతము, సాహసము,వింత, అతియము. a man of * సాహసుడు. I had an odd * yesterday నిన్ననాకొక అతిశయము సంభవించినది. this ring has had some curious adventuresయీ వుంగరాన్ని గురించి కొన్ని వింతలు సంభవించినవి. Adventures of RobinsonCrusoe రాబి ్స ్ క్రూసో అనే వాని చరిత్ర. the adventures of Aniruddhaఅనిరుద్ధ చరిత్ర. the adventures of Stella and the Genius తారాశాశంకవిజయము. the adventures of Nala నళోపాఖ్యానము. At all adventures youmust go there tomorrow. యేమి సంభవించినా నీవు అక్కడికి పోవలసినది,యెట్లాగైనా పోవలసినది. in trade దేశాంతరమునకు విక్రయానకై పంపించిన సరుకు.
Adventurer n s సాహసి, తెగించినవాడు, అనగా యిందులో మన అదృష్టము బయటపడదా అని వక పనికి తెగించినవాడు. Many adventurers joined the armyశానామంది తమకున్ను యేదయినా ఒక పని చిక్కదా అని తెగించి ఆ దండులో పోయికలిసినారు.
Adventuresome adj సాహసమైన.
Adventurous adj తెగువగల, సాహసముగల.
Adventurously adv తెగించి, సాహసముగా.
AEshetic forసావయమైనread,సావయవమైన
Affirmation n s confirmation, declaration నిశ్చయముగాచెప్పడము. ratification, an establishing of what had been before done or decreed రూఢిచేయడము. solemn *, or form of words which is used instead of an oath ప్రమాణమునకు ప్రతిగా స్థిరముగా చెప్పేక్రమము.
Afflicted adj బాధపడే. * with fever జ్వరముతో బాధపడే. he was * blindnessవాడికి నేత్రోపద్రవము కనిపించింది, గుడ్డివాడైనాడు.
Afflicting adj దుఃఖకరమైన, బాధించే.
Affliction n s కష్టము, ఆపద, క్లేశము, బాధ, వ్యాకులము, వ్యసనము.
Afflictive adj దుఃఖకరమైన, వ్యసనకరమైన.
Affluence n s సంపత్తు, భాగ్యము, పదవి.
Affluent adj భాగ్యవంతుడైన, ఐశ్వర్యవంతుడైన. he is in * circumstances వాడుభాగ్యవంతుడై వున్నాడు.
Affluently adv ఐశ్వర్యముగా, భాగ్యముగా.
Afflux n s సంపద, ప్రవహించడము.
Affray n s జగడము, గత్తర, కలహము.
Affrayed adj భయపడ్డ, దిగులుపడ్డ. Affray, n. s. జగడము, గత్తర, కలహము.
Affright n s వెరపు, జడుపు, దిగులు, భయము.
Affrighted adj జడిసిన, బేదిరిన.
Affront n s అమర్యాద, అవమానము, తిరస్కారము.
Affronted adj ఆయాసము పొందిన, రేగిన, ఆగ్రహపడ్డ. he was * at thisయిందుకు ఆయాసపడ్డాడు. he thought himself * by them వాండ్లు తన్ను అమర్యాదచేసినట్టు అనుకొన్నాడు.
Affronting adj అవమానమైన, తిరస్కారమైన, అమర్యాదైన.
Affused adj పైన పోసిన, కమ్మిన.
Affusion n s పైన పోయడము, కమ్మడము.
Afield adv పొలములో బయట.
Afloat adv తేలుతూ. the ship is * ఆ వాడ తేలుతుంది. all the land is afloat ఆ నేలంతా ఏక వెల్లువగా వున్నది. that transaction is still * ఆ వ్యవహారముయింకా పరిష్కారము కాలేదు. many rumours are * about this యిందున గురించిఅనేక వదంతులు పుట్టివున్నవి.
Afoot adv నడుస్తూ. he came * పాదచారిగా వచ్చినాడు. the army was * allnight ఆ దండు రాత్రి అంతా నడిచినది. he set the business * ఆ పనిని ఆరంభముచేయించినాడు, ఆ పనికి మొదలుపెట్టించినాడు.
Afore prep ముందర.
Aforesaid, or Aforementioned adj ముందర చెప్పిన.
Aforetime adv పూర్వకాలమందు, పూర్వమందు.
Afraid adj బెదిరిన, భయపడ్డ. I was * జడిస్తిని, వెరిస్తిని. this made them *యిందుకు జడిస్తిరి. I am * he is hurt వాడికి గాయము తగిలినదేమో. I am * he isgone వాడు పోయినాడేమో. I am * he will die వాడు చచ్చునేమో. I am * it is notenough అది చాలదేమో. I am * you thought so తమరు అట్లా తలచినారేమో. I am* I cannot come to-day నేడు నేను రాలేనని తోస్తుంది.
Afresh adv తిరిగీ, మళ్లీ, పునః.
Africa n s ఆఫ్రికా దేశము.
Afront adv యెదురుగా, యెదుట.
Aft adv వెనక, యిది సముద్రభాష. fore and * ముందూ వెనకా.
After adj తర్వాతి, వెనకటి, రెండో, ఉత్తర. an * thought వెనకటి తలంపు.
Afterages n s వెనకటి కాలము, ఉత్తరకాలము, పశ్చాత్కాలము.
Afterall adv మెట్టుకు, తుదకు, కడకు.
Afterbirth n s మావి.
Aftercrop n s రెండో భోగము, రెండో పంట.
Afterdinner n s భోజనాత్పరము.
Afterlap n s తర్వాత సంభవించిన అపాయము.
Afterlife n s వెనకటి కాలము, వెనకటి వయస్సు. You will be sorry for this in *యిందున గురించి అవతల యేడవబోతావు.
Aftermath n s కసువుయొక్క రెండో కోత.
Aftermost adj వెనకటి.
Afternoon n s మధ్యాహ్నోత్పరము, noon మధ్యాహ్నము. Forenoonమధ్యాహ్నత్పూర్వము, యిది శబ్దతః అయ్యే అర్థము, ప్రయోగములో యిందుకువ్యత్యాసముగా అర్థమౌతున్నది. యేలాగంటే, Breakfast కు తర్వాత. Dinnerపర్యంతము. Morning or Forenoon అంటారు, యిది వ్యవహార యోగ్యమైన కాలము. Icalled on him this morning నేటి దినము ఆయన దర్శనానకు పోయినాను. Dinnerకు మునుపు యెన్ని ఘంటలైనా సరి. morning అంటారు. Dinner కు తర్వాత, Eveningఅంటారు. Afternoon అనగా Dinner కు తర్వాత, అస్తమాన పర్యంతరం, యెవరికైతే రాత్రిళ్ళు భోజనము చేసే మర్యాద కలదో వారికి. Afternoon అనే వ్యవహారములేదు.
Afterpains n s మావినొప్పి.
Afterpart n s వెనకటి భాగము, ఉత్తర భాగము.
Aftertaste n s వెనకటిరుచి.
Afterthought n s వెనకపుట్టిన యోచన, తర్వాత పుట్టిన తలంపు.
Aftertimes n s వెనకటి కాలము.
Afterwards adv తర్వాత, పిమ్మట, వెనుక, తదనంతరము.
Aga n s తురక సేనాధిపతి.
Again adv మళ్ళీ, తిరిగి, పునః. I did not abuse him అతన్ని నేను బదులుకుతిట్టలేదు. It is half as big * అది వకటికి వకటిన్నరంత పెద్దదిగా వున్నది. thishouse is as large * as the other యీ యిల్లు ఆ యింటికి రెండింతలు పెద్దదిగా వున్నది.over * మళ్లీ ఒకసారి. * and * మాటి మాటికి, పదేపదే, మళ్లీ మళ్లీ.
Against prep మీద, పైన, యెదురుగా, విరుద్ధముగా, ప్రతికూలముగా. he swam *the stream ప్రవాహానికి యెదురు యీదినాడు. a charm * posion విషము దిగేమంత్రము. he set himself * us మాకు శత్రువుగా యేర్పడ్డాడు. Have this ready *tomorrow యిది రేపటికి సిద్ధముగా వుండవలెను. you must be ready * myarrival నేను వచ్చి చేరేటప్పటికి నీవు సిద్ధముగా వుండవలెను. they leaned theirlances * the wall వాండ్లు యీటేలను గోడకు ఆనించినారు. he harbours ill will *me వాడు ఆంతర్యములో నా మీద విరోధము పెట్టుకొన్నాడు. ants provide food *rainy season చీమలు వాన కాలమునకై మేతను జాగ్రతచేసి పెట్టుకొంటవి. he made acomplaint * me నామీద ఫిర్యాదు చేసినాడు. a sin * god దేవుని విషయమైన చేసినపాపము. he spoke * me నాకు ప్రతికూలముగా మాట్లాడినాడు, విరోధముగామాట్లాడినాడు. * the law న్యాయవిరోధముగా, చట్టవిరోధముగా. he laid this by *they returned వాండ్లు మళ్లీ వత్తురని దీన్ని దాచిపెట్టినాడు, లేక,పెట్టిపెట్టినాడు. this was quite * the hair or * the grain యిది అత్యంత విరుద్ధముగా వుండెను, అత్యసహ్యముగా వుండెను. the house over * mine మా యింటికియెదురుగా వుండే యిల్లు.
Agallochum n s అగరుగంధపు చెక్క.
Agape adv నోరుతెరుచుకొని.
Agaric n s the mushroom కుక్కగొడుగు. Ainslie, I. 5.
Agast adj వకతరహా రాయి, దీన్ని శిఖా వుంగరాలు మొదలైన వాటికి వేస్తారు.
Agate n s add, A+ says యిస్మ. The Kannadi says వైడూర్యము. so says Perceval.
Age n s వయస్సు, ప్రాయము, యీడు, ఆయుస్సు, యుగము. at an early *బాల్యమందు. he was cut off in the flower of his * మంచి వయస్సులో వాణ్నితుంచుకొని పోయినది. as you advance in * నీకు వయస్సు రాగారాగా. he is faradvanced in * వాడికి నిండా యేండ్లు చెల్లింది. In the present * యీ కాలములో. Inthe former * పూర్వకాలములో. old * వృద్దాప్యము. he is under * వాడికి వయస్సురాలేదు, వ్యవహార యోగ్యమైన కాలము రాలేదు. he is of * వాడికి వయస్సు వచ్చింది,వ్యవహారదశ వచ్చింది. It is an * since I saw you నిన్ను చూచి బహు దినాలుఅయినది. I consider a day as an * during your absence నాకు నీవు లేనిదినముఒక యుగముగా వున్నది. I have been waiting here this age బహు సేపటినుంచికాచుకొని వున్నాను or బహుదినములుగా కాచుకొని వున్నాను. they held that landfrom * to * వాండ్లు ఆ నేలను తరతరాలుగా అనుభవించిరి. the golden *కృతయుగము. the silver * త్రేతాయుగము. the brazen * ద్వాపరయుగము.the iron * కలియుగము.
Aged adj వయసు చెల్లిన, ముసలి. * ten పదియేండ్లుగల. an * man ముసలివాడు.an aged woman ముసలిది. an * tree ముదురుచెట్టు. the * వృద్ధులు.
Agency n s మంత్రాంగము, మంత్రిత్వము, కర్తృత్వము, గుమాస్తాగిరి. this waseffected thro, the * of his friends వాని స్నేహితుల వ్యాపకత్వముచేత యీపనితలకట్టినది. this is ascribed to his * యిది ఆతని ప్రాజాపత్యమువల్ల కలిగిన దనిఅంటారు. this is ascribed to preternatural * యిది ఒక ఉత్సాతమువల్ల కలిగినదని అంటారు. a mercantile * వర్తకులు, వ్యాపారము.
Agent n s కర్త, కారకుడు, గుమాస్తా, వకీలు, వ్యవహారము చూచేవాడు, మంత్రి. hewas the chief * in this business యీ పనిలో వీడు ముఖ్యుడు, ప్రముఖుడు. afree * స్వతంత్రుడు. he was a willing * in their hands వాండ్లు వాణ్ని యెట్లాఆడిస్తే అట్లా ఆడుతూ వుండినాడు. I was an unwilling * in their hands నాకుఇష్టము లేదు గాని వాండ్లు యేట్లా ఆడిస్తే అట్లా ఆడవలసి వచ్చింది. a mercantile *అడతిదారుడు. a chemical * సాధకము, సాధనము. * in grammar (Nominative) కర్త.
Aggrandizement n s గొప్పతనము, అభివృద్ధి.
Aggravated adj అధికమైన, అతిశయించిన. this is * injustice యిది మరీఅన్యాయము, అతి అన్యాయము.
Aggravation n s అధికము చేయడము, బలము చేయడము. this excuse is an *of your crime యీ సాకు నీ తప్పును మరీ అధికము చేస్తుంది.
Aggregate adj మొత్తమైన.
Aggression n s విరోధ మారంభము చేయడము, ముందుగా దుర్మాగ ్ ము చేయడము,ముందుగా చేయిమించడము.
Aggressor n s మొదట చెయిమించినవాడు, మొదట నోరుమించినవాడు,కలహమారంభము చేసినవాడు.
Aggrieved adj దుఃఖపడ్డ, అన్యాయము పొందిన.
Aghast adv ఆశ్చర్యపడి, వెరగుపడి. at these words he stood * యీ మాటలువిని మానై నిలిచిపోయినాడు.
Agile adj లాఘవముగల, చులకనైన, చురుకుగల. stags are very * లేండ్లు బహులాఘవము గలవి.
Agility n s లాఘవము. with * లాఘవముగా, చివుక్కున, చంగున.
Agio n s వట్టము.
Agitated adj కదిలించిన, కలియబెట్టిన, కలవరపడ్డ.
Agitatedly adv కలవరముగా, తొందరగా.
Agitation n s కదలడము, అల్లాటము, తొందర, కలవరము, అల్లోలకల్లోలము. Inconsequence of the * of this subject యీ సంగతిని కలియబెట్టినందువల్ల.
Agitator n s కదిలించేవాడు, కలియబెట్టేవాడు, ఎచ్చరించేవాడు.
Ago adv కిందట, మునుపు, ముందర. Two or three days * రెండు మూడుదినాలకిందట, రెండు మూడు దినాలకు ముందర. long * బహు దినాల కిందట, శానాసేపుకుముందర.
Agog adv ఆతురముగా, అభిలాషగా. these words set him * to go there యీమాటల చేత వాడికి అక్కడికి పోవలెనని ఆతురము పుట్టినది. what makes you so *to abuse people మనుష్యులను తిట్టడానకు నీకింత పదటమేమి.
Agoing adv పోతూ, చేస్తూ. he set the watch * ఆ గడియారమును తిరిగేలాగుచేసినాడు.
Agony n s వేదన, యాతన, సంకటనము, బాధ. the moral * మరణవేదన.
Agrarian adj పొలమును గురించిన, క్షేత్రవిషయమైన.
Agreeable adj అనుగుణ్యమైన, తగిన, మనోజ్ఞమైన, యింపైన. this conduct was* to orders యిట్లా చేసినది, ఆజ్ఞకు అనుగుణ్యముగా వుండినది. If you are * wewill go ( this is base English for " if you are willing " ) నీవు మెచ్చితేమేము పోతాము. They were not * మెచ్చలేదు.
Agreeableness n s ఇంపు, మనోజ్ఞత, పొంకము. from the * of this situationయీ స్థలము యొక్క రమ్యతవల్ల.
Agreeably adv అనుగుణ్యముగా, రమ్యముగా. * to your orders తమ ఆజ్ఞప్రకారము. we were surprized at his return అతడు తిరిగి వచ్చినాడు యిందుకుఆశ్చర్యపడి సంతోషించినాము.
Agreed adj ఇమిడిన, సరిపడిన, పొసగిన, గిట్టిన.
Agreement n s ఒడంబడిక, సమాధానము, పొందిక, ఇమిడిక. they came to an *సమాధాన పడ్డారు.
Agricultural adj వ్యవసాయ సంబంధమైన, సేద్య సంబంధమైన.
Agriculture n s కృషి, వ్యవసాయము, సేద్యము.
Agriculturist n s కృషిచేసేవాడు, వ్యవసాయము చేసేవాడు, సేద్యము చేసేవాడు.
Aground adv దరితట్టి, యెటూ తోచక. the ship ran * ఆవాడ గట్టు తట్టినది. I amquite * regarding this యిందున గురించి యెటూ తోచక వున్నాను.
Ague n s చలిజ్వరము.
Aguish adj చలిజ్వరముగల. I feel * today నాకు నేడు చలిజ్వరము తగిలినది.this is an * place యిది చలిజ్వర భూమి.
Agument n s ( the temporal * ) వృద్ధి.
Ah interj అకటా, అయ్యో, అబ్బా.
Aha interj అహహా, ఓహో.
Ahead adv ముందు మించి, ముందర. to send * ముందుగా సాగనంపుట. theywere * వాండ్లు ముందుగా సాగివుండిరి. that ship was * of us మా వాడలకు ఆవాడలకు ఆ వాడ ముందు మించిపోయి వుండినది.
Aid n s సహాయము, ఉపకారము, ఆదరణ. medical * వైద్యము, చికిత్స .
Aid-de-camp n s యేడీ కేంపు, అనగా Governor, Commander-in-Chief వీర్ల యొక్క హస్తకుడు, యీ వుద్యోగములో తమ స్నేహితులు లేక, బంధువులుయొక్క కొమాళ్ళను పెట్టుకొంటారు, నిజానుచరుడనవచ్చును.
Aigrette n s తురాయి. made of feather పక్షి రెక్కలతో చేసిన తురాయి. setwith precious stones కలికి తురాయి.
Ailing n s రోగము, నలి, నలుకువ.
Ailment n s రోగము, నలుకువ, వ్యాధి.
Aim n s లక్ష్యము, గురి, సూటి. or view యత్నము, ఉద్దేశ్యము. what is your *in writing this letter to him యీ జాబును అతనికి వ్రాయడములో నీ యత్నములోనీ యత్నమేని. he took * at the bird ఆ పక్షిమీద గురిపెట్టినాడు.
Aimless adj లక్ష్యము లేని, ఉద్దేశ్యము లేని.
Air n s గాలి, వాయువు, ఆకాశము. he walked upon his hands with his legsin the * కాళ్ళు పైకి యెత్తుకొని, చేతులతో నడచినాడు. or mien ముఖజాడ, పోలిక. heshews great airs or he gives himselves airs అహింకరిస్తాడు, పోకిళ్ళుపోతాడు. as light as * అతిలాఘవమైన. when the story got * యీ కథ బయటపడ్డప్పుడు. in music రాగము.
Aired adj ఆరబెట్టిన, గాలికి ఆరబెట్టిన, యెండ బెట్టిన. damp paper * at the fireశెగన కాచిన తడి కాకితము.
Airily adv ఉల్లాసముగా.
Airiness n s గాలికి తెరపగా వుండడము. or gaity ఉల్లాసము. on account ofthe * of this room యీ యిల్లు గాలికి తెరపై నందున.
Airing n s " గాలికి ఆరబెట్టడము, గాలి సోకనివ్వడము. or jaunt గాలిసవారి.ఒలాతడము. he gave the books an * ఆ పుస్తకములను గాలికి ఆరబెట్టినాడు. "
Airpump n s వాయుయంత్రము.
Airt (Scotch:apointofthecompass)దిక్కు, all the airtsthe wind can blow అష్టదిక్కులు.
Airy adj గాలికి తెరపగా వుండే. an * house గాలికి తెరపగా వుండే యిల్లు. thin orlight తేలికైన, సన్నని. an * diet స్వల్పాహారము. * notions నిరాధారమైన తలంపు, ఒట్టి తలంపు.
Aisle n s పక్కసాల్పు,అనగా మాదాగుడి మూడు సాల్పులుగా వుంటుంది, నడిమిసాల్పుnavel అనబడుతున్నది, పక్కసాల్పు aisle అనబడుతున్నది.
Ait n s తిప్ప, లంక.
Ajar adv ఓరవాకిలిగా. the door was * ఆ తలుపు ఓరవాకిలిగా వుండినది.
Akin adj సంబంధమైన, తుల్యమైన, సమానమైన. they are * to us వారు మాకురక్తసంబంధులు. this is * to theft యిది దొంగతనానికి సమానమైనది. Telugu is *to Canarese తెలుగు కన్నడానకు నిండా చేరిక.
Alabaster n s అతిశుభ్రమైన సున్నపు తెల్లరాయి, దీనితో ప్రతిమలు చేస్తారు. her *hand దాని తెల్లని చెయ్యి.
Alack interj అయ్యో, అకటా.
Alackaday interj అయ్యో, అకటా.
Alacrity n a ఉల్లాసము, సంతోషము.
Alamode adv సరసముగా.
Alangium hexapetalum n s ఊడుగుచెట్టు, అంకోలము, నికోచకము.
Alarm n s భయము, దిగులు, గాబరా, అపాయమును తెలియచేయడము. I entertainno * for him అతణ్ని గురించి నాకు భయము లేదు. or tumult అల్లరి, గత్తర. On hisgiving the * of fire నిప్పు అంటుకొన్నదని వాడు అరిచేటప్పటికి. he gave the * ofthe enemy's approach యిదుగో శత్రువులు వచ్చినారని అరచినాడు. I gave himthe * వాడికి యెచ్చరిక చేసినాను. he sounded an * సన్నద్ధులు కమ్మని భాంకావూదినాడు.
Alarmed adj భయపడ్డ. they were * by the watchman తలారివాడు వాండ్లకుయెచ్చరిక చేసినాడు.
Alarming adj భయంకరమైన, భయజనకమైన.
Alarmingly adv భయంకరముగా, భయజనకముగా.
Alarum n s ఎచ్చరిక చేసే తుత్తారా, ఎచ్చరిక చేసే గడియారము.
Alas interj అయ్యో, అకటా, పాపము.
Alb n s పాదిరి తొడుక్కొనే వక తరహా తెల్ల వుడుపు.
Albacore n s లోన సముద్రములో వుండే ఒక తరహా చేప.
Albatross n s సముద్రమందు సంచరించే ఒక తరహా బ్రహ్మాండమైన పక్షి.
Albeit adv అయినప్పటికిన్ని.
Albino n s పట్టుపాప.
Albion n a ఇంగ్లండుదేశము, యిది కావ్యమందు వచ్చే శబ్దము.
Albugo n s కనుగుడ్డుమీద పడే పువ్వు.
Album n s ఒక తరహా పుస్తకము.
Alcaid n s కాజీ, తురక న్యాయాధిపతి.
Alcaide n s కాజీ, తురక న్యాయాధిపతి.
Alcalde n s కాజీ, తురక న్యాయాధిపతి.
Alchymical adj రసవాద సంబంధమైన.
Alchymist n s రసవాదము, బంగారు చేసే విద్య.
Alcohol (Spirit),మద్యసారము,మద్యములోనిసారాంశము
Alcoran n s కురాను, తురకవేదము.
Alcove n s శృంగార మంటపము.
Aldebaran (Tauri)రోహిణిistheconstellationoffivestars,calledయోగతార
Alder n s వృక్షవిశేషము.
Alderman n s పెద్దశెట్టి, వీండ్లకు సీమలో ఒక తరహా magistrate అధికారము కద్దు.
Ale n s ఒకతరహా బీరుసారాయి.
Alehouse n s కల్లంగడి.
Alembic n s బట్టి.
Alert adj జాగరూకతగల, చురుకుగల. I wish you would be more * నీవుపరాకుగా వుండ రాదు. he was not on the * వాడు అజాగ్రతగా వుండినాడు, వాడుయేమరి వుండినాడు.
Alertly adv అజాగ్రతగా, చురుకుగా.
Alertness జాగ్రత,చురుకు
Aleternately adv add, He read Tamil and Telugu * అరవముతెలుగు వొకటి మార్చి వొకటి చదివినాడు.
Alewife n s కల్లు అమ్మేటిది.
Alexander n s అలెగ్జాండ రనే రాజు.
Alexandrine n s ఛందస్సులో నిండా నిడివిగా వుండే ఒక తరహా చరణము.
Algebra n s బీజగణితము.
Algebraical letters n s బీజగణితాక్షరములు.
Algebraist n s బీజగణితజ్ఞుడు.
Alias adv అధవా, కాకుంటే. his name is Ramaya * Rangaya వాడికి రామయ్యఅనిన్ని, లేక, రంగయ అనిన్ని పేర్లు గలవు.
Alibi n s మరివకచోట వుండడము, స్థలాంతరమందు వుండడము. he proved an *ఆపని జరిగినప్పుడు తాను స్థలాంతరమందు వున్నట్టు రుజువు చేసినాడు.
Alien n s పరుడు, అన్యుడు.
Alienable adj పరాధీనము చేయతగ్గ, దానాదివినిమయములకు అర్హమైన. theselands are not * యీ నేలకు దానాదివినిమయములకు యోగ్యమైనవి కావు.
Alienated adj తిప్పబడ్డ, పరాధీనమైన. the money was * ఆ రూకలుపరాధీనమైనవి. his affections were * వాడి మనస్సు విరిగింది, వాడి దయ తప్పింది.
Alienation n s పరాధీనము, మనస్సు విరగడము. * of mind చిత్తభ్రమ, బుద్ధివైకల్యము. on account of the * of the money ఆ రూకలు పరాధీనమైనందున.
Alight adv రగులుతూ, మండుతూ. the fire is still * ఆ నిప్పు యింకా రగులుతూవుంది. the candles are * దీపాలు మండుతూ వున్నవి.
Alike adv సరిగ్గా మండుతూ వున్నవి.
Aliment n s ఆహారము.
Alimental adj ఆహారమును గురించిన.
Alimentary adj ఖాద్యసంబంధీయమైన. any * matter ఆహారము. the * canal,meaning, the bowels, n. s. పేగులు, ఆంత్రములు, కడుపు.
Alimirah n s అల్మారా. See Press or Cabinet the word is Portugueze ).
Alimony n s మొగుణ్ని విడిచి నిర్దోషురాలుగా వుండే భార్యకు పెట్టిన జీవనాంశము.
Aliquot part n s మిగలక సరిపాలు పొయ్యే అంశము, అనగా .1 కి 16 4-4-16 సరిపాలుపొయ్యే అంశము.
Alive adj జీవముతో వుండే. he caught it * దాన్ని ప్రాణముతో పట్టుకొన్నాడు.would any man * have believed it దీన్ని ఒక ప్రాణి నమ్మునా. the cloth isall * with fleas ఆ గుడ్డ పేనులతో నిండి వున్నది. I am perfectly * to what youintend నీవు చేసే యత్నానికి నేను సిద్ధముగా వున్నాను. he is not * to the folly ofhis conduct వాడు చేసిన పిచ్చితనము వాడికి బాగా తెలియలేదు. he is not * to hisown interests తన మేలును గురించి తాను జాగ్రత లేకుండా వున్నాడు. All the townis * about this feast యీ వుత్సవాన్ని గురించి వూరంతా దడవిడలుగా వున్నది,వుత్సాహముగా వున్నది.
Alkalescent adj క్షారసంబంధమైన.
Alkali n s కారము, క్షారము, సౌవర్చ లవణము.
Alkaline adj క్షారసంబంధమైన.
All adj అంతా, అన్ని, యావత్తు, సర్వమై, సమస్తమైన. * and sundry పిన్నాపెద్దా.By * means అన్ని విధాల. with * his wit వాడింత తెలిసినవాడైయుండిన్ని. heis lord of * ఆయనే సర్వేశ్వరుడు. * night రాత్రి అంతా. * yesterday నిన్నటిదినమంతా. One and all అందరున్ను. after * మెట్టుకు, తుదకు. at * యెంతమాత్రము. * I pray for is this నేను వేడుకొనేదంతా యిదే. this is * I know నాకుతెలిసినది యింతే, యింతకు మించి నేను యెరగను. I am wet * over నేను శుద్ధముగాతడిసినాను, బొత్తిగా తడిసినాను. * through the country దేశములోనంతా. he was *in * in all to her ఆమెకు కొడుకే ప్రపంచము అతిముఖ్యము. * at once I sawhim coming యింతలో అతడు రావడము చూస్తిని. he was crawling on * foursదోగాడుతూ వుండినాడు. to gamble at * fours ఒకతరహా జూదమాడుట. they losttheir * వారి యావత్తు సొత్తున్ను పోయినది. he left his * to us వాడి యావత్తుసొత్తున్ను మాకిచ్చినాడు. In * there were two hundred men వుండినదంతాయిన్నూరుమంది * hail ! శుభము శుభము.
Allayed adj ఉపశమించిన, మట్టుపడ్డ, అణిగిన.
Allegation n s రూఢముగా చెప్పిన మాట, స్థిరముగా చెప్పిన మాట. or excuseసాకు, బహానా, పరిహారము.
Alleged adj చెప్పిన, అన్న. the letter he is * to have sent అతడుపంపినానన్న జాబు. he is * to have consented అతను వొప్పినాడట.
Allegiance n s ఆజ్ఞాధారకత్వము. I charged him on his * to follow me నీవునాతో కూడా రాకుంటే నీకు రాజు మీద ఆన వున్న దన్నాను. She broke her * to herhusband మొగుడి ఆజ్ఞను తోసివేసింది.
Allegorical adj రూపకముగా వుండే.
Allegorically adj రూపకముగా వుండే.
Allegory n s రూపకాలంకారము.
Allegro n s ఒకతరహా దరువు, దృతవాద్యము.
Allelujah n s కొన్ని కీర్తనలలో ప్రయోగించే పదము, మంగళము, జయజయదేవఅన్నట్టు.
Alleviation n s ఉపశమనము, ఉపశాంతి.
Alley n s సందు. A blind * ముట్టుసందు. * at marbles పెద్ద గోలిగుండు.
Alliance n s సంబంధము, చుట్టరికము. * by marriage వియ్యము. * with aforeign king విహితము, వొద్దిక.
Allied adj సంబంధము చేసిన, కలుసుకొన్న, కూడుకొన్న. the * kings ఒకటిగాకూడుకొన్న రాజులు ఒకరి కొకరు సహాయముగా వుండే రాజులు. See To Ally.
Allies n s విహితులు, అనుకూలులు, సహాయులు.
Alligation n s గణితశాస్త్రములో వక సూత్రనామము.
Alligator n s మొసలి, మకరి.
Alliteration n s ప్రతి శబ్దమునకు మొదట వచ్చిన అక్షరమే రావడము. as Bewareof the Bear of Bradwardine.
Allknowing adj సర్వము యెరిగిన, సమస్తము తెలిసిన
Alllusive adj సూచకమైన.
Allodium n s స్వతంత్రము, మిరాశి.
Alloted adj విధించిన, నిర్ణయించిన, నిశ్చయించిన.
Allotment n s నిర్ణయము, విధి, భాగము, విభాగము.
Allowable adj ఒప్పుకోతగిన, అంగీకరించ తగిన, న్యాయమైన. his joy at thiswas very * యిందున గురించి వాడు సంతోషపడవలసినది సహజమే న్యాయమే.
Allowably adv సహజముగా, తగినట్టుగా.
Allowance n s admission అంగీకారము. or deduction తోసియివ్వడము. youmust make allowances for his youth పసివాడని మన్నించ వలసినది. In thisbargain he made me an * of ten rupees యీ బేరములో నాకు పది రూపాయలుతోసి యిచ్చినాడు. pension భరణము, బత్తెము, వర్తన, గ్రాసము. the beggarsreceived their * బిచ్చగాండ్లు తమ వర్తనను తీసుకొన్నారు. these men are on full *the others are on short * వీండ్లకు నిండు బత్తెము దొరుకుతున్నది కడమవాండ్లకుఅర్ధగ్రాసము దొరుకుతున్నది. the government give him even horse *గవర ్మంటువారు అతనికి గుర్రపు శెలవులు సహితము యిప్పిస్తున్నారు.
Alloy n s వెండి బంగారు వీటిలో కలిపే రాగి, సీసము మొదలైనవి. happinesswithout * నిష్కల్మషమైన సుఖము.
Alloyed adj కలపడమైనడ, మట్టమైన, వన్నెతక్కువైన. * gold మట్టబంగారు. *silver కందువేండి. unalloyed gold అపరంజి. unalloyed silver చొక్కమైనవెండి.
Allsouls n s ఒక పండుగ.
Allspice n s మిరియము వంటి వక తరహా సంభార ద్రవ్యము.
Allurement n s తీపి, సరసత, ఆకర్షకము, ఆశకొలిపేటిది, వ్యామోహజనకమైనది. shehad many allurements దానియందు అనేక సరసతలు వుండినవి. she used manyallurements to him in vain వాడి దగ్గెర దాని తసుకులు పనికి రాలేదు.
Alluring Cdj ఆకర్షకమైన, మనోహరమైన, మనోజ్ఞమైన, మరులుకొలిపే,మోహజనకమైన.
Alluringly adv ఆకర్షకరముగా, మనోహరముగా, మోహజనకముగా.
Allusion n s గురించినది, సూచన, జాడ. In our conversation he made no *to the marriage మా సంభాషణలో ఆ పెండ్లి యొక్క సూచనను వాడు యెత్తలేదు.
Allusively adv సూచనగా.
Alluvial adj ప్రవాహమువల్ల కలిగిన. * soil వొండు.
Alluvium n s వొండు.
Ally n s సహాయుడు, సంబంధుడు they were allied వాండ్లు కలుసుకొని వుండిరి.the allies కలుసుకొని వుండేవాండ్లు.
Almanack n s పంచాంగము.
Almighty adj సర్వశక్తుడైన. the * or God * or * God సర్వశక్తుడు, దేవుడు.
Almond n s బాదాము, బాదాముపప్పు * tree బాదామిచెట్టు. a cake made withalmonds బాదాముపప్పు వేసి చేసిన ఫలహారము.
Almonds n s of the throat గవదకాయలు, యివి జలుబుచేస్తే వుబ్బుతవి.
Almoner n s రాజధర్మమును విచారించే వుద్యోగస్థుడు.
Almost adv కొంచెము, తక్కువ, దరీదగ్గెతర, దరీదాపుగా. * one month కొంచె ముతక్కువ ఒక నెల. he is * dead కొన ప్రాణముతో వున్నాడు, మృతప్రాయుడై వున్నాడు. *half అరవాసి. It is * finished ముగియవచ్చినది. a fruit which is * ripeదోరపండు. he is an * Christian వాణ్ని ఖ్రీష్టియ ్వాడనవచ్చును.
Alms n s భిక్షము, ధర్మము, తిరిపెము. he subsisted on * ముష్టి యెత్తుకొనిజీవించినాడు. * box వుండి, * deed ధర్మము.
Almshouse n s సత్రము, ధర్మశాల, గంజిదొడ్డి.
Almug n s టేకుచెట్టువంటి ఒక వృక్ష విశేషము.
Aloe n s the plant కలబంద. the hedge * plant బ్రహ్మరాకాసిచెట్టు,చాగనారచెట్టు.
Aloes n s the drug మూసాంబరము. a precious wood అగరుచెక్క.(గంధరసము SNT).
Aloft adv పైన, పైగా, పొడుగున. from * పైననుంచి.
Alone adv ఒంటిగా, ఏకాంతముగా. leave it * అది వుండేటట్టు వుండనీ, దానిజోలికి పోక. let me * నా జోలికి రావద్దు, నన్నంటవద్దు. or only మాత్రమే. we * didthis మేము మాత్రమే చేస్తిమి. I know this * యిది మాత్రమే నాకు తెలుసునుయింతకు మించి నేనే యెరగను.
Along adv వెంట, వెంబడిగా. he went * the shore తీరము వెంబడిగా పోయినాడు.come * రా, నడువు, కూడారా. go * పో, నడువు. * with him అతనితో కూడా పోతిని,వెంటపోతిని. all * I knew this would happen యిది యిట్లాజరుగపోతుందని నాకుమొదటినుంచి తెలుసును. * side పక్కన, వాడపక్కన, యిది వాడ భాష.
Aloof adv దూరాన, తొలిగి, వొదిగి. they stood * తొలిగివుండిరి, దూరముగావుండిరి.
Aloud adv బిగ్గర, ఘట్టిగా.
Alpha n s గ్రీక్కుభాషలో అకారము. Omega దీర్ఘఓత్వము, యిది గ్రీక్కుజీవాక్షరములలో కొన అక్షరము.
Alphabet n s వర్ణమాల, అక్షరసమామ్నాయము. An * of logic తర్కసంగ్రహము.తర్కముయొక్క ప్రారంభము. An * of electricity సంఘర్షణ జాగ్నిశాస్త్ర సంగ్రహముఆరంభము, శాస్త్ర ప్రారంభము. He scarcely knows the * of lawధర్మశాస్త్రసంగ్రహము సహితం వాడికి తెలియదు, ధర్మశాస్త్రము యెట్టిదో వాడికి తెలియదు.
Alphabetical adj అక్షరక్రమమైన.
Alphabetically adv అక్షరక్రమముగా.
Alpine adj కొండలమీది. * country కొండలమీది దేశము. in the * regions ofIndia పర్వత ప్రదేశమునందు.
Alps n s మహత్తైన పర్వతము. the * of India హిమవత్పర్వతము.
Already adv అప్పుడే, మునుపే, పూర్వమే. In the year * mentioned పైనచెప్పిన సంవత్సరములో. I have * told you నీతో మునుపే చేప్పియున్నాను.
Also adv కూడా, సహితము, మరిన్నీ, యిదిగాక. this * యిదిన్ని. I * నేనున్ను. hecame here * యిక్కడికిన్ని వచ్చినాడు, వాడున్ను వచ్చినాడు.
Altar n s బలిపీఠము, హోమగుండము.
Alteration n s మారడము, వ్యత్యాసము, భేదము, వికారము, దిద్దుబాటు, సవరింపు.what * shall I make నేనేమి దిద్దేది.
Alterative n s భేదిమందు.
Altercation n s వాగ్వాడము, వివాడము, ఘర్షణ, జగడము.
Altered adv మారుపడ్డ, వ్యత్యాసపడ్డ, వికారమైన. the house is now quite *దినము విడిచి దినము. these were * streaks of black and red ఒక పట్టెనలుపుఒక పట్టెయెరుపుగా వుండినవి.
Alternately adv ఒకటి విడిచి ఒకటిగా, ఒకటి మార్చి ఒకటిగా.
Alternation n s ఒకటి విడిచి వొకటి. on account of the * of the crops ofsambha and karoo సంభాకు తరవాత కారు, కారుకు తరవాత సంభా యిట్లా క్రమముగాపండడము వల్ల.
Alternative n s గత్యంతరము, వేరేగతి. I have no * నాకు వేరే విధి లేదు. heoffered me an * యిది వద్దంటే వేరే దారి చూస్తానన్నాడు. each * is painful యెటుచేసినా ఉపద్రవమే.
Although conj అయినప్పటికిన్ని. * he went వాడు పోయినప్పటికిన్ని. althoughhe did not go పోకపోయినప్పటికిన్ని.
Altitude n s ఔన్నత్యము, ఉచ్ఛత్వము.
Altogether adv బొత్తిగా,శుద్ధముగా,యెంత మాత్రము, మెట్టుకు. * this will doమెట్టుకు యిది సరిపడును. * it is ten rupees అంతా యేకానికి పదిరూపాలు. this is *wrong యిది అన్నివిధాల తప్పు.
Alum n s పటికారము.
Alvine adj కడుపు సంబంధమైన. * excretion పురీషము.
Always adv యేవేళ, యెప్పటికిన్ని, యెల్లప్పుడు, నిరంతరము. he * laughs atthis యిందున గురించి యేవేళా నవ్వుతాడు.
Am am,thefirstpersonsingularoftheverbBe వున్నాను, I * to gothere tomorrow రేపు నేను అక్కడికి పోవలేనని వున్నాను.
Amagram n s ఒక శబ్దములో వుండే అక్షరములను వెనక ముందుగా వుండడముచేతపుట్టే మరి ఒక శబ్దము అనగా. our big hen అనే శబ్దములో వుండే అక్షరములను వెనకముందుగా పెట్టితే. Neighbour అనే మాట పుట్టుతుంది.
Amain adv బలముకొద్ది, బలముగా, వడిగా. he roared * బలముకొద్ది అరిచినాడు.the water rushed * నీళ్ళు వడిగా చొరబడ్డది.
Amalgam n s ( a compound of two or more metals, of which one isalways mercury ) రసమిశ్రితమైన లోహము.
Amalgamation n s మిశ్రమము చేయడము, లోహములను రసముతో మిశ్రమముచేయడము. from the * of these two battalions యా రెండు పటాళములు ఒకటిగాకలసిపోవడము వల్ల.
Amanuensis n s ఒకడు చెప్పుతూ వచ్చేదాన్ని విని వ్రాసుకుంటూ వచ్చేవాడు. Beingunwell I employ my wife as an * in writing this letter నాకు అశక్తముగావున్నందున యీ జాబును నేను చెప్పుతూ వస్తిని నాభార్య వ్రాస్తూ వచ్చినది.
Amaranth n s వాడని పుష్పము, చెంగలువ.
Amaranthine adj వాడని.
Amassed adj కూడబెట్టిన.
Amateur n s అభిలాషి " ఆసక్తిగలవాడు, బులుపుగలవాడు, అనగా జీవనము నిమిత్తముకాకుండా వేడుకార్థమైన చిత్రము సంగీతము మొదలైన వాటిని ఆసక్తిగా చేసేవాడు. he isan * painter వేడుకార్థముగా చిత్రము వ్రాసేవాడు.
Amatory adj మోహసంబంధమైన, శృంగారమైన. an * poem శృంగార కావ్యము.
Amazed adj ఆశ్చర్యపడి.
Amazedly adv ఆశ్చర్యము, అద్భుతము.
Amazement n s add, 1 Pet. III. 6. శంక A+.
Amazing adj ఆశ్చర్యమైన, అద్భుతమైన.
Amazingly adv ఆశ్చర్యముగా, అద్భుతముగా.
Amazon n s యుద్ధము చేసే శూరత్వము గల స్త్రీ.
Ambassadress n s రాయబారి యొక్క భార్య, దూతిక.
Ambassodor n s రాయబారి, స్థానాపతి.
Amber n s ఒకతరహా పసుపు వర్నముగల రాయి. * coloured పసుపువర్నముగల.
Ambergris n s అంబరు అనే పరిమళ ద్రవ్యము.
Ambidextrous adj చమత్కారమైన.
Ambient adj చుట్టుకొన్న, నాలుగుతట్లా వ్యాప్తమైన.
Ambiguity n s అర్థసందిగ్దత, సందేహము.
Ambiguous adj సందిగ్ధమైన, ద్వ్యర్ధిగావుండే. his language is * వాడి మాటరేంటాపడును, వాడిమాట పిండికీ పడును, పిడుగుకూ పడును, యిటూ కాదు అటూ కాదు.
Ambiguously adv సందిగ్ధముగా, ద్వ్యర్థిగా.
Ambiguousness n s సందిగ్ధత, ద్వ్యర్థి. without స్పష్టముగా, తేటగా.
Ambition n s ఆశ, అత్యాశ, అదనాశ, గొప్పతనము కావలెననే ఆశ, అహమహమిక.
Ambitious adj ఆశగల, అత్యాశ గల, అదనాశగల, గొప్పతనము కావలెననే ఆశగల. heis * of this employment యీ వుద్యోగము కావలెనని ఆశపడుతాడు. an * manగొప్పపడవలెననే ఆశగలవాడు, అదనాశగలవాడు.
Ambitiously adv ఆశగా, అత్యాశగా, గొప్పతనము కావలె ననే ఆశగా.
Ambitiousness n s ఆశ, అత్యాశ, గొప్పతనము కావలెననే ఆశ.
Ambrosia n s అమృతము, దేవతల యొక్క ఆహారము.
Ambrosial adj అమృతమయమైన, దివ్యపరిమళముగల.
Ambulatory adj నడిచే, ఒలాతే.
Ambuscade n s మాటు, పొంచు వేసుకొని వుండే స్థలము. the cat lies inambush for the mouse యెలుకకై పిల్లి పొంచు వేసుకొని వున్నది, వొడువేసుకొనివున్నది. Ameer, n. s. అధికారి, యిది తురక శబ్దము.
Amelioration n s గుణము, ఉపశాంతి.
Amen adv తథాస్తు, యిట్లా అవుగాక, ప్రార్థన, ముగియగానే ఆమే ్ అని అంటారు.
Amenable adj ఉత్తరవాదియైన, లోబడ్డ, అధికారమునకు లోబడ్డ. they are not * tohis authority వాండ్లు అతని అధికారానికి లోబడ్డ వాండ్లు కారు.
Amendment n s దిద్దిబాటు, గుణము, ఆరోగ్యము, సన్మార్గము. he made fouramendments in that paper ఆ దస్తావేజులో నాలుగుచోట్ల దిద్దినాడు. I see no * inhis health వాడికి వొళ్ళు యేమిన్ని గుణము కానము. his instruction producedsome * among them వాడి శిక్ష చేత వాండ్లు కొంచెము సన్మార్గమునకు వచ్చిరి.
Amends n s చెల్లు యీడు, బదులు సంభవించిన నష్టమునకు పరిహారముగా చేసినఉపకారము. an apology makes * for a fault తప్పుకు అపరాధక్షాపణపరిహారమౌతున్నది. I will make you * for the loss you suffered నీవుపడ్డనష్టానికి నీకు యీడు చేస్తాను.
Amenity n s సరసత, సద్భావము, రమణియ్యత. * of disposition సద్భావము.
Amercement n s శిక్ష, దండన, అపరాధము.
America n s అమిరికా అనే ఖండము, దేశము.
American n s అమిరికా దేశస్థుడు.
Amethyst n s ఒకతరహా రత్నము the oriental * ఒకతరహా కురువిందరాయి. theOccidental or common * ఒకతరహా స్ఫటికము. Oriental Topaz, emerald, andamethyst are only varieties of Sapphire, ( Penny Cyclop. )
Amiability n s మంచితనము, సరసత.
Amiable adj సరసమైన, మనోహరమైన. She has an * disposition దాని మనసుమంచిది. he is an * person అతడు మంచివాడు, సరసుడు.
Amiableness n s మంచితనము, సరసత.
Amiably adv మంచితనముగా, సరసముగా.
Amicable adj విహితమైన, అనుకూలమైన, సమాధానమైన . an * agreementరాజీనామా.
Amicably adv విహితముగా, అనుకూలముగా, సమాధానముగా.
Amid, Amidat prep మధ్య, నడమ. amidst the trees చెట్లనడమ. amidst thisconfusion యింత గందరగూళములో.
Amiss adv తప్పుగా. he took this * యిందుకు అసహ్యపడ్డాడు. I took hiswords * వాడి మాటలకు తప్పు అర్థము చేసినాను. Is anything * with you ? నీకుయేమి తొందరగా వున్నది.It is not * అది తప్పుకాదు. It will not be * to tell himఅతనితో చెప్పితే యేమి, అనగా అతనితో చెప్పితే దోషము లేదు.
Amity n s స్నేహము, విహితము.
Ammonia మూత్రలవణము
Ammoniac n s ఒకతరహా బంక, ఒకతరహా వుప్పు, దీన్ని నవాచారము అంటారు.
Ammoniacal adj అమోనియా సంబంధమైన.
Ammunition n s ముందుగుండు మొదలైన యుద్ధసామాను. or food ఆహారము.
Amnesty n s అపరాధమును క్షమించడము, మన్నింపు.
Among, Amongst prep లో, మధ్య, నడుమ. he divided the money * thenయీ రూకలను వాండ్లకు పంచిపెట్టినాడు. one * a hundred నూటికొకడు.
Amorous adj కాముకమైన, మోహము గల. the dove is very * పావురాయికికామమధికము.
Amorously adv కామముగా, మోహముగా.
Amorousness n s కామము, మోహము.
Amount n s మొత్తము, వెరశి, తేలినది.
Amour n s సొగసుతనము. he carried on an * with her దానితో సొగసుతనాలుచేసినాడు.
Amphibious adj మిట్టను నీళ్లను జీవించే, * creatures కప్ప, పాము, తాబేలు,మొసలి మొదలైనవి, భూమి మీదనున్ను నీళ్ళలో నున్ను వుభయత్ర వసించేటివి.
Amphisbaena n s మొండిపురుగు.
Amphitheatre n s నల్డిక్కులు అగుపడే వున్నత స్థానము. for fencing &c. సాముచేసే బయలు, రంగము.
Ample adj విస్తారమైన, విశాలమైన.
Amplification n s పెంచి చెప్పడము, ఉత్పేక్ష, కొంచెమును గొప్పగా పరీక్షించడము.
Amplified adj విస్తరించిన, పెంచి చెప్పిన.
Amplitude n s విస్తారము, విశాలము.
Amply adv విస్తారముగా, నిండా, చాలా.
Amputation n s అంగఛేదనము.
Amulet n s తాయిత్తు, రక్ష.
Amusement n s వినోదము, వేడుక, ఉల్లాసము, అట్లాట, ప్రొద్దుబోక.
Amusive adj వినోదకరమైన, ఉల్లాసకరమైన, ప్రొద్దుబోకగా వుండే.
An an Article ఒక, * old man ఒకముసలివాడు. పాత యింగ్లీషులో, * you pleaseఅంటే, if you please అని అర్థము.
An Obstructive n s A stubborn useless wretch వట్టజడుడు,మూర్ఖుడు, శుంఠుడు.
Ana n s (sixteenth part, of a rupee &c. ) అణ.
Anachronism n s కాలవ్యత్యాసముగా చెప్పడము, ఒకకాలమందు నడిచిన దాన్ని మరిఒక కాలములో నడిచినట్టు కాలవ్యత్యాసముగా చెప్పడముగా చెప్పడము అనగా ద్వాపరయుగమందు వుండిన అర్జునుడు కలియుగమందు వుండిన టీపుసుల్తానుతో మాట్లాడినాడన్నట్టుకాల అసంగతనముగా చెప్పడము.
Anakim n s giants రాక్షసులలో ఒక కులము.
Analogical adj సంబంధమైన, సమానమైన, తుల్యమైన.
Analogically adj సంబంధమైన, సమానముగా, తుల్యముగా.
Analogous adj సంబంధమైన, సమానమైన, తుల్యమైన.
Analogy n s సంబంధము, సాదృశ్యము.
Analysis n s విభజన, పరిశీలన, విమర్శ. of a sentence పదచ్చేదము.
Analytical adj విభజించే, పరిశీలన చేసే.
Analytically adv విభజనగా, విడివిడిగా.
Ananas n s (pineapple) అనాసపండు.
Anarchy n s అరాజకము, అనాయకము.
Anathema n s శాపము.
Anathematized adj శపించబడ్డ, శాపగ్రస్తమైన.
Anatomical adj అంగఛేద సంబంధమైన.
Anatomist n s అంగఛేదము చేసి విమర్శించే వైద్యుడు.
Anatomy n s అంగఛేదము చేసి ఆయా అంగవిన్యాసములను విమర్శించే విద్య.
Ancestor n s కూటస్థుడు, పూర్వికుడు.
Ancestors n s పెద్దలు, పూర్వీకులు, కూటస్థులు.
Ancestral adj పూర్వికుల సంబంధమైన. he inherited the * estates వాడిపెద్దలాస్తి వాడికి వచ్చినది.
Ancestry n s పెద్దలు, పూర్వీకులు, కూటస్థులు.
Anchor n s లంగరు. the beam of an * యీసకర్ర. he weighed * లంగరుయెత్తినాడు తీసినాడు. he cast * లంగరు వేసినాడు. the ship was at * ఆ వాడకులంగరువేశి ఉండినది. a sheet * పెద్ద లంగరు. metaphorically జీవాధారము.ప్రాణధారము. he is the sheet * of our hopes మాకు అతడే జీవాధారము. This isthe * of my hopes యిదే నా ప్రాణాధారము, పట్టు కొమ్మ.
Anchored adj లంగరువేసిన, లంగరుచేసిన.
Anchoret, Anchorite n s. వనవాసి, వానప్రస్థుడు, సన్యాసి.
Anchourage n s వాడలు లంగరుచేసే ప్రదేశము, లంగరు వేయడానికై యిచ్చే వర్తన రూకలు.
Ancient adj పురాతనమైన, ప్రాచీనమైన, ముసిలి. * history పూర్వకాలపు కథ.
Anciently adv పూర్వకాలమందు.
And conj మరిన్ని, న్ని, న్ను. he * I went there వాడున్ను నేనున్ను పోతిమి,వాడు నేను పోతిమి. more * more మరిమరీ. here * there అక్కడక్కడ. day *night రాత్రీపగలు. now * then అప్పుడప్పుడు. It fell down * broke పడిపగిలినది.he came * sat down వచ్చి కూర్చుండినాడు. Tell me * I will do it నాతోచెప్పినట్టైతే చేస్తాను. God is a spirit * they that worship him must worshiphim in spirit * in truth దేవుడు ఆత్మే అయినందున అతణ్ని పూజించే వాండ్లు ఆత్మలోసత్యముగా పూజించవలెను. * yet అయినా, అయినప్పటికిన్ని.
Andiron n s ఇంగ్లిషు యిరవపొయ్యికి ముందర నాటివుండే యినప కమ్ములు.
Androgynal n s పురుషలింగము స్త్రీలింగమున్ను గలది. The idol లింగము,శివలింగము.
Andropogin, muriaticum The roots called వట్టి వేళ్ళు.
Andropogon n s కామంచికసువు.
Anecdote n s పొడికధ, వృత్తాంతము, చరిత్ర.
Anemone n s ఒకతరహా పుష్పము.
Anent prep గురించి.
Aneurism n s నరమువుబ్బి నెత్తురు కట్టుకొనే కణితి మొదలైన రోగము.
Anew adv కొత్తగా, తిరిగీ, మళ్లీ, పునః.
Angel n s దేవదూత. a lovely woman or child అతిసుందరవతి, అందముగావుండే బిడ్డ. or coin అయిదు రూపాయల బంగారు నాణెము.
Angelle, Angellical adj దివ్య or దివ్యమైన.
Anger n s కోపము.
Angered adj కోపించిన, రేచబడ్డ.
Angle n s కోణము, మూల. having eight angles అష్టకోణములుగల.
Angler n s గాలము వేసి చేపలు పట్టేవాడు.
Anglice adv ఇంగ్లిషు భాషలో. a curnam * a clerk కరణమనే మాటకు యింగ్లిషులోa clerk అని అంటారు.
Anglicism n s ఇంగ్లిషు భాషియ్యము, ఇంగ్లిషు జాతియ్యము.
Anglicized adj ఇంగ్లిషుభాష మర్యాదగా చేసిన.
Anglo-Indians n s పరంగివాండ్లు, చటకారివాండ్లు.
Anglo-Saxons n s వేయేండ్లకిందట ఇంగ్లిషుదేశములో వుండిన ఒక కులస్థులు.
Angrily adv కోపముగా.
Angry adj కోపముగల, కోపముగావుండే. an * person కోపిష్టి. he was *కోపముగా వుండినాడు. an * ulcer మంటలుగా వుండే పుండు.
Anguish n s వేదన, ఆరాటము, పరితాపము. he was then in * వాడప్పుడు నిండాఆరాటపడుతూ వుండెను.
Angular adj కోణములుగల, మూలలు గల.
Angularly adv కోణముగా, మూలగా.
Anights adv రాత్రిళ్లు, రాత్రికాలములో.
Animadversion n s ఆక్షేపణ, చీవాట్లు. they made no animadversions on hisletter అతని జాబుమీద యేమిన్ని ఆక్షేపణలు చేయలేదు. they made someanimadversions on his conduct వాడు చేసిన పనికి కొన్ని చీవాట్లు పెట్టినారు,దొబ్బులు పెట్టినారు.
Animal n s జంతువు, ప్రాణి. by way of contempt పశువు, గొడ్డు.
Animalcules n s కండ్లకు అగుపడని సన్నపురుగులు.
Animate adj చేతనమైన, సజీవియైన, ప్రాణియైన. all things whether * orinanimate చేతనాచేతనములైన అన్ని వస్తువులు.
Animated adj ప్రాణముగల, సజీవియైన, ప్రాత్సాహముగల, చురుకుగల, సరసమైన.that image looks as if it was * ఆ విగ్రహము సజీవిగా వున్నట్టు అగుపడుతున్నది.the child's face is * with joy ఆ బిడ్డ ముఖము సంతోషము చేత వికాసముగావున్నది. an * picture తద్రూపముగా వుండే పటము. or urged ప్రేరేపించబడ్డ. hewrote it in an * style సరసముగా వ్రాసినాడు, దివ్యముగా వ్రాసినాడు. there wasan * discussion మహత్తైన వివాదము జరిగినది.
Animating adj ఉత్సాహకరమైన. * intelligence ఉత్సాహకరమైన సమాచారము. *prospects సంతోషకరమైన ఆశలు.
Animation n s జీవము కలగచేయడము, ధైర్యము, ఉత్సాహము. suspended *మూర్చ. he spoke with great * మహావుత్సాహముగా మాట్లాడినాడు.
Animosity n s చలము, వైరము, పగ, ద్వేషము.
Anise n s సొంపు.
Anker n s పది గాలములు పట్టే పీపాయి.
Ankle n s చీలమండ. * rings అందెలు, మువ్వలు, గజ్జగొలుసు మొదలైనవి.
Anklet n s పాదభూషణము.
Anna n s (name of the fraction one sixteenth) అణా. The Telugu nameis వీసము.
Annalist n s ఆయా సంవత్సరమందు నడిచిన చరిత్రను క్రమముగా వ్రాసేవాడు.
Annals n s ఆ యా సంవత్సరమందు నడిచిన దాన్ని క్రమముగా వ్రాసిన చరిత్ర.
Annexed adj కూర్చిన, చేర్చిన, జంటించిన. in the * account యిందుతో కూడాచేర్చిన లెక్కలో.
Annihilated adj నాశనమైపోయిన, పాడైపోయిన, నిర్మూలమైపోయిన, హతమైన.
Annihilation n s నాశము, నిర్మూలము, పాడు, ధ్వంసము. but the true word isనిర్వాణము. q. v.
Anniversary adj యాటా వచ్చే, ప్రతి సంవత్సరము వచ్చే.
Anno Domini n s ఖ్రీష్టుపుట్టిన సంవత్సరము. 1842 A. D. ఖ్రీష్టు పుట్టిన 1842 సం||
Annotation n s టీకా, వ్యాఖ్యానము.
Annotator n s వ్యాఖ్యాత, వ్యాఖ్యానకారుడు.
Annoyance n s బాధ వేధ, ఉపద్రవము తొందర. he felt much * at theirknowing this యిది వాండ్లకు తెలిసినదని వాడు నిండా విచారపడ్డాడు.
Annoyed adj చీదరపడ్డ, అసహ్యపడ్డ, తొందరపడ్డ, సంకటపడ్డ, హింసపడ్డ. I was * athim వాడిమీద నాకు అసహ్యము వచ్చినది.
Annoying adj యాటా వచ్చే, ప్రతి సంవత్సరమున్ను వచ్చే. the plantain is an *plant అరటిచెట్టు ఒక సంవత్సరములో పుట్టి పెరిగి నశించేటిది. he paid them an *visit సంవత్సరానికి ఒక మాటు వారి దర్శనానికి పోతూ వచ్చినాడు. an * feast యాటావచ్చే పండుగ, ఉత్సవము.
Annually adv యాటా, ప్రతి సంవత్సరమున్ను.
Annuitant n s వర్థాశనము తీసుకొనేవాడు.
Annuity n s వర్షాశనము.
Annular adj వలయాకారముగా వుండే, గుండ్రముగా వుండే, యిది గ్రహణమునుగురించిన మాట. na * exlipse వలయగ్రహణము.
Annulled adj రద్దుచేయబడ్డ, కొట్టివేయబడ్డ, తోసివేయబడ్డ.
Annulling n s రద్దుచేయడము.
Annunciation n s తెలియచేయడము, ప్రకటన.
Anodyne n s ఉపశాంతి, ఉపశాంతియైన ఔషధము.
Anointing n s చరమడము, అంటడము, అభ్యంజనము, అభిషేకము.
Anomaious adj వ్యతిరిక్తమైన, వ్యత్యయమైన, విపరీతమైన.
Anomaly n s వ్యతిరిక్తము, వ్యత్యయము, విపరీతము.
Anon adv తక్షణము, మరీ. I will come * యిదుగో వస్తిని.
Anonymous adj పేరులేని అనామధేయమైన, వూరుపేరులేని.
Anonymously adv పేరు లేకుండా, వూరుపేరు లేకుండా.
Another n s మరివొకడు, వేరే ఒకడు, మరి ఒకటి, యింకొకటి, వేరే ఒకటి. one with *సరాసరి, సగటున, సగటుమీద. * yet మరీ ఒకడు, మరీ ఒకడు, మరీ ఒకటి. they beatone * ఒకరిని ఒకరు కొట్టుకొన్నారు. one after * ఒకడొకడుగా, ఒకటొకటిగా. onegoes and * comes ఒకడుపోతే మరి వకడు వస్తాడు. I told him one thing and did* నేను ఒకటి చెప్పితే వాడు ఒకటి చేసినాడు.
Answer n s ఉత్తరవు, జవాబు, ప్రత్యుత్తరము. Question and * ప్రశ్నోత్తరములు. in* ప్రత్యుత్తరముగా.
Answerable adj ఉత్తరవాదియైన, జవాబు చెప్పవలసిన. I will be * for itఅందుకు నేను ఉత్తరవాదిని. he laid out the money without any * advantage ఆరూకలను శెలవు చేసినాడు గాని దానికి తగిన ఫలము లేదు.
Answering adj సరియైన, యీడైన, సమానమైన. In the year Vilambi * to1838 దో సంవత్సరమునకు సరియైన విళంబి సంవత్సరములో.
Ant n s చీమ. black * నల్లచీమ. large black * గండుచీమ, కొండచీమ. red *యెర్ర చీమ. the fire * or tree * కొరివి చీమ. white ants చేదుళ్ళు. wingedwhite ants వుసుళ్ళు. the great white * చెదుళ్ళగూడు. the large destructivewhite * గొర్రెచెద, లేడిచెద. a white * hill పుట్ట. the red earth in a white *hill పుట్ట కూడు. a winged sort of * రెక్కచీమ. * lion చీమపులి. the spider *కట్టెచీమ.
Antagonism n s వైరము, శత్రుత్వము.
Antagonist n s వైరి, విరోధి, యెదిరి, శత్రువు. the * forces యెదిరిబలము.
Antagonistic adj యెదిరించిన, యెదటి. * power యెదటిబలము.
Antarctic adj దక్షిణదిక్కు సంబంధమైన. the * pole దక్షిణధృవము.
Ante particle పూర్వ,అగ్ర,యిదిలాటి్భాషలోఅవ్యయము
Antecedent n s సర్వనామశబ్దము చేత పరామర్శించబడ్డ శబ్దము, అనగా, hebrought the books upon which I found my own mark యిందులోసర్వనామమైన. which అనే పదమునకు books అనేపదము antecedent అవుతున్నది.* to 1800 అన 1800 రో సంవత్సరమునకు పూర్వము * to his arrival వాడు చేరకమునుపు.
Antecedently adv పూర్వము, ముందుగా.
Antechamber n s ముందరిగది, మొదటిగది.
Antediluvan adj అనాదియైన, జలప్రళయమునకు పూర్వమైన. the antediluviansకృతయుగస్థులు. See on కలియుగము. an W. on Vish. p. Lxv.
Antelope n s జింక. the female goat * లేడి. the male * ఇర్రి. * eyedహరిణాక్షియైన.
Antemeridian adj మధ్యాహ్నత్పూర్వమైన.
Antennae n s పురుగుయొక్క కొమ్ములు, లేక, మీసాలు.
Antepenultimate n s శబ్దాంతమందువుండే రెండు అక్షరములకు యివతలి అక్షరము,యేలాగంటే, dictionary అనే శబ్దములో A అనే అక్షరము.
Anterior adj ముందరి, పూర్వపు.
Antgher n s కింజల్కము, పుష్పము నడుమవుండే జుంజురు.
Anthem n s ధ్యానశ్లోకము, కీర్తన.
Anthill n s పుట్ట.
Anthology n s చాటుపద్యముల పుస్తకము.
Anthropophagi n s నరమాంస భక్షకులు, రాక్షసులు.
Anti prep హరింపచేసే, విరుద్ధమైన, ప్రతి. anti-venomous విషహరమైన. thusanti-venomous విషమును హరింపచేసే, విరిచే. anti-choler వాంతి భ్రాంతినినివారణముచేసే. anti-braminical బ్రాహ్మణులకు ప్రతియైన, విరుద్ధమైన.
Antichamber n s ముందరగది, మొదటిగది.
Antichrist n s ఖ్రీస్తవిరోధి.
Antichristian adj ఖ్రీస్ఠుమతమునకు విరుద్ధమైన.
Anticipated adj ముందుగా భావించుకొన్న, ముందుగా గ్రహించిన, ముందుమించుకొన్న.
Anticipation n s ముందు మించడము, ముందుగా గ్రహించడము, అగామి చింత,ముందు రాబోయ్యే దాన్ని గురించి మోద ఖేదములను చెందడము.
Antick n s కోణంగి, కోణంగి తనము. to play anticks కోణంగి చేష్టలు చేసుట.
Antick, Antic adj వికారమైన, కోణంగియైన. * tricks కోణంగి చేష్టలు.
Antidote n s విరుగుడు, పరిహారము, మాటు. an * for poison విషానికి విరుగుడు.this was an * to his fears వాడి భయానికి యిది పరిహారమైనది.
Antimonarchical adj రాజప్రభుత్వము కారాదనే, రాజనేమాట కూడదనే.
Antimony n s సురుమా. the sulphuret of * నీలాంజనము, కాటుకరాయి.
Antinomian n s పాషండుడు, మతదూరుడు.
Antinomin n s మతదూరుడు.
Antipathy n s అసహ్యత, వైరము, పగ, ద్వేషము.
Antiphlogistic adj ఉష్ణోపశమనమైన, కాకను అణిచే.
Antipodes n s ప్రతిచరణులు, యెదురు పాదస్థులు, అనగా భూగోళము మీద మనముఒకతట్టు వుండగా దీనికి సరిగ్గా అవతలితట్టు వుండే వాండ్ల యొక్క పాదములు మనపాదములున్ను యెదురెదురుగా వుంటవి గనుక వాండ్లు ప్రతిచరణులు అని అనబడుతారు.
Antiquarian, Antiquary n s. పురాతన వృత్తాంతములు మొదలైన వాటినివిచారించేవాడు, బహుకాలాలనాటి వస్తువులను సంగ్రహించి పెట్టేవాడు.
Antiquated adj వాడికలేని, చెల్లని, తోపుడైన, వికారమైన. * words యిప్పట్లోచెల్లని మాటలు. * custom or usage యిప్పట్లో వాడికలేని మర్యాద. an * dressపూర్వకాలపు రీతిగా వుండే వుడుపు. this is an * claim యిది బహుకాలము చెల్లినందునచెల్లని వ్యాజ్యము.
Antique adj పూర్వకాలపు, పురాతన. * beauty పురాతన సౌందర్యము, అనగా అతిసౌందర్యము. his features were really * i. e. beautiful వాడు అతిసౌందర్యవంతుడు.
Antiquity n s పూర్వకాలము, ప్రాచీనత్వము, పూర్వకాలమునాటి వస్తువు,పూర్వకాలపువాండ్లు. this book is a great * యీ పుస్తకము బహుకాలాల నాటిది.this proves the * of this book యిందువల్ల యీ గ్రంధము యొక్క ప్రాచీనత్వముతెలుస్తున్నది.
Antiscorbutic, Antiscorbutical adj Sourvy అనే రోగహరమైన.
Antiscriptural adj బైబిలుకు విరుద్ధమైన, అశాస్త్రియ్యమైన.
Antiseptic adj కుళ్ళిపోనియ్యకచేసే, చెడిపోనియ్యకచేసే.
Antisocial adj సహవాస భంజక, సహవాస వినాశక.
Antispasmodic adj శూలహరమైన, శూలరోగమును పోగొట్టే.
Antistrophe n s ఒకతరహా పద్యము.
Antithesis n s విపరీతము, విరుద్ధత, అనగా పదములకు, లేక, వాక్యములకు వుండేవిరుద్ధము.
Antithetical adj విపరీతమైన, విరుద్ధమైన.
Antitype n s దృష్టాంతము, పురోసూచక వస్తువు, గురుతు.
Antlers n s దుప్పికొమ్ములు.
Anus n s అపానము, గుదము.
Anvil n s దాగిలి, పట్టేద. that business is still upon the * ఆ పని యింకాఆలోచనలోనే వున్నది.
Anxiety n s చింత, వ్యాకులము, విచారము, ఆరాటము, వేదన. he shewed no * toplease them వాడికి వాండ్లకు సంతోషపెట్టవలెననే చింతలేదు.
Anxious adj చింతగల, విచారముగల, వ్యాకులముగల, తపించే. an * personవిచారము గలవాడు. he was * to escape తప్పించుకొని పారిపోవలేననే విచారముగలవాడై వుండెను.
Anxiously adv చింతగా, విచారముగా, వ్యాకులముగా.
Anxiousness n s చింత, విచారము, వ్యాకులము.
Any adj యెవడైనా, యెడైనా. at * place యొక్కడనైనా. at * time యెప్పుడైనా. at *rate యెట్లాగైనా, యేవిధానైనా, మెట్టుకు. Is that * great matter అది అంతగొప్పపనా. Is there * more యింకా వున్నదా. are there * other reasons వేరేహేతువులు యేవైనా కలవా. in * wise యెట్లాగైనా. * body or * one యెవడైనా. * onebook or * one యెవడైనా. * one book యేదైనా ఒక పుస్తకము. * thing you like నీకుకావలసినది యేదైనా. this is * thing but right యిది బొత్తిగా అన్యాయము, యిదిమహా అన్యాయము. this book is any thing but easy యీ గ్రంధము యెంతమాత్రము సులభము కాదు. this one is if * thing the oldest వాటికన్నా యిదికొంచెము పాతదేమో. I am * thing but well నాకు యెంత మాత్రము వొళ్ళుకుదురులేదు. For * thing I know he is dead For * thing I care he my do soవాడు అట్లా చేస్తే చేయనీ నాకేమి.
Aorist adj అనిశ్చిత తద్ధర్మ. the indefinite tense వుండును, కాబోలు.
Aorta n s హృదయమునకు యెడమ పార్శ్వమందు నెత్తురు యెక్కే పెద్దనరము.
Apace adv త్వరగా, వడిగా, దినే దినే, నానాటికి. the child is growing * ఆ బిడ్డత్వరగా పెరుగుతున్నది, నానాటికి పెరుగుతూ వున్నది.
Apart adv ప్రత్యేకముగా, విడిగా, పృధక్కుగా. he sat * కడగా కూర్చుండినాడు. thetrees are wide * ఆ చెట్లు యెడమ యెడముగా వున్నవి. joking * is this trueయెగతాళి వుండనీ యిది నిజమా. Relationship * I consider him a good scholarవాడికి నాకు వుండే బంధుత్వము పడి వుండనీ వాడు మంచి పండితుడనే దాన్ని యోచిస్తాను.the garden * the house is not worth having తోట వుండనీ యిల్లు పనికిరాదుthere were three families each * మూడు సంసారములు వేరే వేరేగా వుండినవి. *from this యిదిన్నిగాక, యిదిమినహ.
Apartment n s అర, అంకణము. the women's * ఆడవాండ్లు వుండేకట్టు,అంతఃపురము.
Apathetic adj నిశ్చింతభావము గల, ఉదాసీనత గల.
Apathy n s నిశ్చింత భావము, ఉదాసీనత,
Ape n s కోతి, తోకలేని కోతి.
Aperient adj and n. s. భేదిచేసే, భేదికరమైన, భేదిమందు. It acted as an *యిది భేది మందుగా వుపయోగించినది.
Aperture n s సందు, రంధ్రము, ద్వారము.
Apex n s శిఖరము, మొన. when we reached the * of the hill కొండ కొనకుపొయ్యేటప్పటికి.
Aphorism n s సూత్రము, వ్యవస్ఠ.
Aphrodisiac adj and n. s. వీర్యవృద్ధికరమైన, వీర్యవృద్ధికరమైనమందు.
Apiary n s తేనేగూడు.
Apiece adv తలా. they gave ten rupees * తలా పది రూపాయలు యిచ్చినారు. hegave us ten rupees * మాకు తలా పది రూపాయలు యిచ్చినాడు.
Apis నంది,నందికేశ్వరుడినామము
Apish adj కోతిచేష్టలుగల, అనుకరించే.
Apitpat adv దడదడలుగా, my heart went * at hearing this దీన్ని విని నాగుండె దడదడ లాడింది, కొట్టుకొన్నది.
Apocalypse n s బైబిలులో కడపటి కాండయొక్క పేరు.
Apocalyptical adj పైన చెప్పిన కాండ సంబంధమైన.
Apocope n s శబ్దము యొక్క అంత్యాక్షరలోపము.
Apocrypha n s బైబిలులో చేరివుండే అప్రసిద్ధ కాండల యొక్క నామము,మిథ్యోపనిషత్తు.
Apocryphal adj అప్రసిద్ధమైన, అనిశ్చితమైన, అబద్ధమైన. an * story కట్టుకధపుక్కిటి పురాణము.
Apogee n s సూర్యాది గ్రహములు తమ చారమందు భూగోళమునకు దూరముగా వుండేస్థానము, లేక, కాలము. The quick apogee శిఘ్రోచ్ఛ sighrochha Colebr.2. 401.
Apollyon n s ధ్వంసకుడు, నాశకుడు, యిది శైతాను పేరు.
Apologetic adj అపరాధక్షాపకమైన.
Apologist n s అపరాధక్షాపణ చేసుకొనేవాడు, సమాధానము చెప్పేవాడు.
Apologue n s కధ, కట్టుకధ, నీతికధ.
Apology n s అపరాధక్షాపణము, సమాధానము, సాకు. he would not listen tomy * నేను చేసుకొన్న అపరాధక్షమమును అతను వినలేదు. this is a mere * for acarriage దీనికి బండి యని ఒక పేరా.
Apostacy, Apostasy n s. స్వధర్మ త్యాగము, మతభ్రష్టత్వము.
Apostate n s మతభ్రష్టుడు.
Apostle n s ఖ్రిష్టువుయొక్క ముఖ్య శిష్యుడు, మతప్రచారము చేయడానకై పంపబడ్డగురువు.
Apostleship n s గురుత్వము, గురువుయొక్క ధర్మము.
Apostolic, Apostolical adj గురుసంబంధమైన.
Apostrophe n s in Spelling సంగ్రహముగా వ్రాయడము, సంక్షేపముగా పలకడము,సంగ్రహముగా వ్రాయడానకై వేసే గురుతు, యేలాగంటే cannot అనే శబ్దమునకు can'tఅని వ్రాసినట్టు or a sudden address in a discourse కావ్యమందు ఒకడితోసంభాషణ చేస్తూవుండగా లటక్కున మరి ఒకడికై తిరిగి మాట్లాడడము.
APothecary n s ముందులంగడివాడు. apothecary's shop ముందులంగడి.
Apotheosis n s దేవుణ్నిగా పెట్టుకోవడము. after his * వాణ్ని దేవుణ్నిగా పెట్టుకొన్న తరువాత.
Appalled adj దిగులుపడ్డ, అడలిన.
Appalling adj భయంకరమైన, అడలేటట్టుచేసే.
Apparatus n s ఉపకరణములు, సామాను, సరంజామాను, సామగ్రీ. ploughing *కలపసామాను.
Apparel n s ఉడుపు, వస్త్రము, బట్టలు.
Apparelled adj తొడుక్లొన్న, ధరించిన, అలంకరించుకొన్న. he was poorly *బీదబట్టలు వేసుకొన్నాడు, బీదవేషము వేసుకొని వుండినాడు.
Apparent adj అగుబడే, కనుబడే, స్పష్టమైన, స్ఫుటమైన, తేటైన. this is an *error యిది చూపుకు అబద్ధముగా వున్నది, పైకి అబద్ధముగా వున్నది. * friendship పైస్నేహము, బాహ్య స్నేహము. the injustice of this is * యిందులో అన్యాయముస్పష్టముగా వున్నది. an heir * యువరాజు, సింహాసమును యెక్కడానకు బాధ్యతగలవాడు. I will make this * దీన్ని తేట పరుస్తాను.
Apparently adv చూపుకు, పైకి.
Apparition n s భూతము, దయ్యము, పిశాచము.
Appeal n s మొర, ఫిర్యాదు, వక న్యాయస్థలములో చేసిన తీర్పు సమ్మతిలేక దానికిపైగా వుండే న్యాయస్థలములో ఫిర్యాదు చేసుకోవడము, ఉత్తర సభకు పోవడము.
Appearance n s అగుబడడము, ప్రత్యక్షము, రూపు, ఆకారము. at its first * itseemed to be new మొదట చూడగానే కొత్తదిగా అగుబడ్డది. there is no * of feverజ్వరము యొక్క జాడ కానము. as soon as he made his * వాడు హాజరు కాగానే. hemade a noble * వాడు జంభముగా అగుపడ్డాడు. he did not make his * todayయీవేళ అగుబడలేదు. he assumed the * of a friend స్నేహభావమునువహించినాడు. three years after his * on earth ఆయన భూమిలో అవతరించినమూడేండ్లకు తరువాత. To all * this is a new one అన్నివిధాల చూపుకు యిదికొత్తదిగా వున్నది. To save appearances he paid the money ఆ రూకలను చెల్లించిమానము దక్కించు కొన్నాడు. His Appearance on earth, శరీరము. This is thephrase in the Introduction to Menu. See As Jron Nov.1827 page 158.
Appeased adj శాంతి పొందిన, ఉపశమించిన, అణిగిన.
Appellant n s పై న్యాయాధిపతివద్ద ఫిర్యాదు చేసుకొన్నవాడు. the usualexpression is అప్పీలువాది.
Appellation n s పేరు, నామము.
Appendage n s చేరినది, ఉపాంగము, ఉపకరణము, నిరర్ధకమైన ఉపకరణము. thatgarden is an useless * to this house ఆ తోట ఆ యింటికి నిరర్ధకమైన ఉపభాగము:అనగా ఆ తోట ఆ యింటితో చేరి ఉండడము వ్యధ ్ము. They think the tails andears of the dogs useless appendages కుక్కలకు తోకలున్ను చెవులున్నుపనికిమాలిన అంగములని తలుస్తారు. a coach is an * of luxury రథము భాగ్యానికిఅంగము. a traveller must free himself from all needless appendagesప్రయాణము పొయ్యేవాడు పనికిరాని వుపకరణములను విడిచిపెట్టవలెను.
Appended adj చేర్చిన.
Appendix n s చేరినది. an * to an book ఉపగ్రంధము, గ్రంధము యొక్కఉపభాగము.
Appertaining adj సంబంధించిన, చేరిన. * to this case వ్యాజ్యముతో చేరిన.
Appertenance n s ఒకటితో చేరినది.
Appetence n s ఆశ, ఇచ్ఛ.
Appetite n s ఆకలి, క్షుత్తు. desire ఆశ, కాంక్ష. walking gives one an *నడవడము ఆకలిని కలుగజేస్తుంది. want of * మందము.
Applause n s శ్లాఘన, నొప్పులు.
Apple n s పండు, కాయ, రేగిపండు, సీమలోవుండే, ఒకతరహా ముఖ్యమైన పండు.other sorts of fruit యింకా కొన్ని పండ్లకు యీ పేరు కద్దు, అనగా. custard *సీతాఫలము. the great red custard * రామాఫలము. the love * తక్కాళి పండు.the rose * అల్లోనేరేడుపండు, అంబునేరేడుపండు, రాజజంబుపండు. thorn *ఉమ్మెత్తకాయ. wood * వెలక్కాయ. * pie అప్పిలుపండు వేసి చేసిన ఫలహారము. in *pie అప్పిలుపండు వేసి చేసిన ఫలహారము. in * pie order గరాగరిగా. the * of thethroat గుండెకాయ. he kept her as the * of his eye దాన్ని కన్నుగా పెట్టుకొనివుండినాడు. this was the * of discord to them వాండ్లు కలహపడేది దీనికోసరమే,వాండ్ల కలహానికి మూలమిదే. that house has been the * of discord to threepersons ఆ యింటికై ముగ్గురు పోటి చేస్తారు.
Appliance n s సాధనము, ఉపకరణము.
Applicability n s యోగ్యత, ఉపయుక్తత. this shows the * of the ruleయిందుచేత ఆ సూత్రము యొక్క వుపయోగము తెలుస్తుంది.
Applicable adj తగిన, యోగ్యమైన, ఉపయోగమైన, పొందికైన.
Applicant n s అడిగేవాడు, కోరేవాడు.
Application n s the act of putting వేయడము, పూయడము, చరమడము,లేపనము, పట్టు. after the * of this money to that purpose ఆ పనికి యీరూకలు వినియోగమైన తరువాత. the * of a fable or text ఫలితార్థము, సారాంశము.this is a wrong * of the word యిది తప్పు ప్రయోగము. intense study శ్రద్ధ,ఆసక్తి. a request మనివి, అడగడము.
Appointed adj నియమించిన, యేర్పరచిన.
Appointment n s ఆజ్ఞ, నియామకము, నిర్నయము, విధి. he made me a soldierand gave me my appointments (plu.) నన్ను సిపాయి వుద్యోగములో పేట్టి దానికికావలసిన వుడుపు మొదలైనదంతా యిచ్చినాడు. After my * as doctor నన్నుడాక్టరుగా నియమించిన తరువాత. After he gained this * అతనికి యీ వుద్యోగముచిక్కిన తరువాత. he kept this * అతడు నియమించిన స్థలములో నియమించిన వేళకుసిద్ధముగా వుండినాడు. I have an * in town today నేడు పట్టణములో ఫలాన చోటికిఫలాని వేళకు వస్తానని మాట యిచ్చివున్నాను. he broke his * ఫలాని చోటికి ఫలానివేళకు వస్తానన్నమాట తప్పినాడు.
Appolectical adj సన్నిపాతము, జన్ని ఆకస్మికముగా స్మారకమునున్నుసత్తువనున్ను పోగొట్టి తీసుకొనిపొయ్యే జన్ని.
Appollo n s సూర్యుడు, సాహిత్య, సంగీత చిత్ర విద్యాధి దేవత.
Appophthegm n s ప్రసిద్ధమైనమాట, విశేషవచనము, పెద్ధలు చెప్పిన విశేషము.
Appoplectic adj సన్నిపాత సంబంధమైన.
Apposite adj తగిన, యుక్తమైన, పొందికైన.
Appositely adv తగినట్టుగా, యుక్తముగా, పొందికగా.
Appositeness n s తగివుండడము, పొందిక. this proves the * of theinstance యిందువల్ల యీ దృష్టాంతము తగినదైనట్టు తెలుస్తున్నది.
Apposition n s పొందిక, చేరిక.
Appraisement n s మతించడము, వెల యేర్పరచడము. according to his *యేర్పరచిన వెల ప్రకారము.
Appraiser n s వెల యేర్పరచేవాడు.
Appreciable adj యెంచతగిన గణ్యమైన. between these two there is no *difference యీ రెంటికిన్ని భేదము యెంచదగినదిగా వుండలేదు.
Appreciation n s మతింపు, గణ్యత, తారతమ్యము.
Apprehension n s fear భయము. I entertain no apprehensions regardinghim అతణ్ని గురించి నాకు భయములేదు. conception బోధ, అవగాహన గ్రాహత్య,seizure పట్టుకోవడము. after the * of the thieves ఆ దొంగలు పట్టుబడ్డ తరువాత.this is quite beyond my * యిది నాకు యెంత మాత్రము అవగాహన కాలేదు.
Apprehensive adj గ్రాహకమైన. the * powers గ్రాహకశక్తి. I was * that hewas dead వాడు చచ్చినాడని నాకు అనుమానముగా వుండెను.
Apprentice n s పని నేర్చుకొనే చిన్నవాడు, పనివాడు, అనగా వొడంబడిక వ్రాసి యిచ్చికూడు గుడ్డకు వకడివద్ద వుండి పని నేర్చుకొనేవాడు.
Apprenticeship n s ఒకడివద్ద పిల్లకాయ కూటిగుడ్డకు వుండి పని నేర్చుకొంటాననివొడంబడిక మూలముగా యేర్పడి యుండే వాయిదా. During my * నేను వాడి చేతికిందవుండి పని నేర్చుకొంటూ వుండగా.
Approach n s దగ్గిరించడము, సమీపించడము.
Approaching adj దగ్గిరించే, సమీపించే. his hour is now * వాడికి కాలముదగ్గిరించినది.
Approbation n s అంగీకారము. this met with his * దీన్ని అతడు మేచ్చినాడు.
Appropriate adj తగిన, అనుగుణమైన, రూఢియైన. he called it by its * nameదానికి రూఢిగా వుండే పేరున పిలిచినాడు.
Appropriated adj నియమించబడ్డ, యేర్పరచబడ్డ, వినియోగపరచబడ్డ. the house *to the hospital ఆశిపత్రిగా నియమించబడ్డ యిల్లు.
Appropriately adv తగినట్టుగా, న్యాయముగా.
Appropriateness n s పొందిక, యిమిడిక. this proves the * of the nameయిందువల్ల ఆ పేరు యొక్క సార్థకనామధేయత తెలుస్తుంది.
Appropriation n s వ్రయము, యేర్పరచఢము. this proves his * of themoney యిందువల్ల ఆ రూకలు తాను వ్రయము చేసినట్టు తెలుస్తున్నది, తానే తిన్నట్టుతెలుస్తుంది. after the * of this name to him వాడికి యీ పేరును పెట్టిన తరువాత.wrongful * దుర్వ్రయము.
Approval n s అంగీకారము. after his * of this అతడు దీన్ని వొప్పుకొన్న మీదట.he offered a horse for my * యీ గుర్రము నీకు సమ్మతాయని అడిగినాడు.
Approved adj ప్రసిద్ధమైన, అంగీకరించబడ్డ. he is an * scholar అతడుప్రసిద్ధమైన పండితుడు.
Approver n s or kings evidence కడమ ఖైడీల మీద సాక్షిగా పలికే ఖైది.
Approximating adj సమీపించే, దగ్గిరించే. war was now * యింతలో యుద్ధముతటస్ఠమైనది.
Approximation n s సమీపించడము, దగ్గిరించడము.
Appulse n s సంఘట్టనము.
Appurtenance n s సంఘట్టనము.
Apricot n s ఒకతరహా పండు.
April n s నాలుగో నెల. * fool యెగతాళికి యేమార్చబడ్డవాడు.
Apron n s బట్టలు మురికి కాకుండా ముందరి తట్టు పైన కట్టుకొన్న గుడ్డ. of a Bishop గొప్ప పాదిరి వేసుకొనే ఒక తరహా వుడుపు. of a cannon ఫిరంగి చెవిమూత.
Apropos adv సమయానికి, వేళకు. he came * సమయానికి వచ్చినాడు. this wasvery * యిది యెట్లా సంభవించవలసినదో అట్లాగే సంభవించినది.
Apt adj fit తగిన, అర్హమైన, ఉపయుక్తమైన. he is an * scholar అతడుచురుకుబుద్ధి గలవాడు. they are * to drink వాండ్లకు తాగే గుణము కద్దు an * phraseతగిన మాట. glass is * to break గ్లాసు పగిలిపొయ్యేటిది. women are * toquarrel ఆడవాండ్లు జగడానికి యెక్కడ యెక్కడ అని వుంటారు. cold bathing is * tocause fever or we are * to get fever from cold bathing చల్ల నీళ్ళలోస్నానము చేస్తే మనకు జ్వరము వచ్చును. or ready ఉచితమైన, యోగ్యమైన, సిద్ధమైన.quick చురుకైన. this thread is * to break యీ తాడు తెగిపొయ్యేటిది. inclinedఇచ్ఛగల. children are * to get the small pox పిల్లకాయలకు అమ్మవారుపోయడము కద్దు. he is * to go to sleep in the middle of business పని చేస్తూవుండగా అతడు నిద్రపొయ్యే దుస్స్వభావము కలదు.
Aptitude n s యోగ్యత, ఉపయోగత, భావము, స్వభావము. or clevernessబుద్ధిచురుకు.
Aptly adv తగినరీతిగా,ఉపయోగముగా.
Aptness n s యోగ్యత, ఉపయోగత, ఉపయుక్తత, ఔచిత్యము. in learning చురుకుబుద్ధి.
Aqua-fortis n s పెట్లుప్పు ద్రావకము, వెండి బంగారు కరిగే నిప్పు ద్రావకము.
Aqua-marine n s ఒక తరహా పచ్చరాయి.
Aquarius n s కుంభరాశి.
Aquatic adj జలసంబంధమైన, జలచరమైన. * animals జలజంతువులు. * fowlsజలపక్షులు. An * excursion జలవిహారము, అనగా పడవమీద యెక్కి వేడుకగాపోవటము.
Aquavitae n s బ్రాంది సారాయికి ఒక పేరు.
Aqueduct n s కాలవ.
Aquery adj జలసంబంధమైన.
Aquilline nose n s. గరుడముక్కు.
Arab n s అరబ్బివాడు, అరబ్బిగుర్రము.
Arabesque adj చిత్రవిచిత్రమైన, వికారమైన, మశీదులు, గోపురములు, రధములువీటిమీద. Ornaments in * గచ్చు లేక రాతి పనిలో తురక మర్యాదగా పువ్వులు తీగెలుగాచేసిన చిత్రములు.
Arabian n s అరబ్బిదేశస్థుడు. The Arabian Nights Entertainments కధలపుస్తకము.
Arabic adj సాగుబడికి యోగ్యమైన, దున్నతగిన. * land సాగుబడికి యోగ్యమైన నేల.
Arbiter n s మధ్యవర్తి.
Arbitrarily adv తన మనస్సు వచ్చినట్టు, స్వేచ్ఛగా, యధేచ్ఛగా, నిరంకుశముగాthey decided it * తను మనస్సు వచ్చినట్టుగా తీర్చినారు.
Arbitrariness n s స్వేచ్ఛ, యధేచ్ఛ, నిరంకుశత్వము.
Arbitrary adj స్వేచ్ఛైన, యధేచ్ఛైన, స్వతంత్రమైన, నిరంకుశమైన. * conductస్వేచ్ఛా ప్రవృత్తి. an * prince నిరంకుశుడైన రాజు. he is an * man కామచారిగావున్నాడు. depending on no rule నిబంధన లేని, కట్టులేని. this is an * meaningయిది స్వతంత్రమైన అర్ధము, అనగా యిట్లా అర్థము కద్దు. యీ అర్ధము యెట్లా వచ్చినదంటేఅందుకు సమాధానము లేదని భావము. this form of the verb is * యీక్రియారూపమునకు నిబంధన లేదు.
Arbitration n s మధ్యస్థము. they brought their suit to * వాండ్లు తమవ్యాజ్యమును మధ్యస్థమునకు తీసుకొని వచ్చిరి.
Arbitrator n s మధ్యవర్తి. a jury of five arbitrators పంచాయతి వాండ్లు.
Arbitress n s మధ్యవర్తిగా వుండే స్త్రీ.
Arbour n s పొదరిల్లు, కుంజము, తోటలో పొదరిల్లువలె కట్టి తీగెలు పారవిడిచిన లతాగృహము.
Arbutus n s ఒక తరహా చెట్టు.
Arc n s అర్ధచంద్రాకృతి, విలువంపు, మండలములో ఒక భాగము.
Arcade n s శాల, పంచపాళి.
Arcadia n s ఒక దేశము పేరు, కావ్యములో యీ పేరు అందానికి స్వర్గానికిసమానముగా వుదాహరిస్తారు. Botany Bay is a perfect Arcadia అనగా రెండోస్వర్గము వలనే ఉన్నది. an Arcadian ఆ దేశస్థుడు.
Arcana n s మర్మములు.
Arcanum n s మర్మము.
Arch adj waggish చమత్కారమైన, వింతైన, చోద్యపు. an * boy చమత్కారముగల పిల్లకాయ. he made an * remark చమత్కారముగా ఒక మాట చెప్పినాడు. orchief ప్రధానమైన, ప్రబలమైన, ముఖ్యమైన. the * enemy ప్రబల విరోధి, అనగాశైతాను. an * deciever మహా మోసగాడు. an * impostor మహా కపటి. * apostateమహా పతితుడు యిది సైతాను పేరు.
Archangel n s ప్రధాన దూత.
Archanism n s (using ancient language) ప్రాచీన భాష, ఆష ్ము.
Archbishop n s మహా గురువు, రాజగురువు.
Archbishopric n s రాజగురువు యొక్క అధికారము, రాజగురువు యొక్క అధికారముకింద వుండే రాజ్యము.
Archdeacon n s రాజగురువుకు రెండో వాడు.
Archdeaconry n s రెండో గురుత్వము, అతని చేతికింద వుండే దేశము.
Archduchess n s అర్చిడ్యూకు యొక్క భార్య.
Archduke n s ఒక తరహా రాజు.
Arched adj కమానుగా కట్టిన, విలువంపుగా చేసిన, విలువంపైన, అర్ధచంద్రాకారమైన. * roof కమాను రీతిగా కట్టిన పై కప్పు.
Archer n s విలుకాడు.
Archery n s విలువిద్య, ధనుర్విద్య.
Archetype n s మూలమూర్తి, ఆదిమూలము.
Arch-fiend n s శైతాను.
Archiepiscopal adj ప్రధాన బిషపు సంబంధమైన.
Archipelago n s చిన్న చిన్న దీవులు గల సముద్రము.
Architect n s or builder కట్టేవాడు, శిల్పి. the great * ప్రపంచ సృష్టికర్త. hewas the * of his own fortunes వాడి ఐశ్వర్యమునకు వాడే కారకుడు.
Architecture n s యిండ్లు మొదలైనవి కట్టే విద్య, వాస్తుశాస్త్రము. From the * ofthis house it seems to be built by a Musulman యీ యింటి కట్టడపు వైఖరిచూస్తే తురకవాడు కట్టినట్టు తోస్తున్నది.
Architrave n s తల్లి దూలము, స్తంభము యొక్క బోదె.
Archives n s ప్రాచీన దస్తావేజులు, ఆ దస్తావేజులు పెట్టే కొట్టు. local * దండకవిల.
Archly adv చమత్కారముగా, చోద్యముగా.
Archness n s చమత్కారము, చురుకుబుద్ధి.
Arcot n s ఆర్కాటు అనే పట్టణము. South * మంజుకుప్పము.
Arctic adj ఉత్తర సంబంధమైన, ఉత్తరపు. the * pole ఉత్తరధ్రువము. the * circleఉత్తరధ్రువ ప్రాంత్యము.
Arctures n s స్వాతీనక్షత్రము.
Ardency n s ఉద్రేకము, ఉగ్రము. from the * of his love అతి మోహము చేత.
Ardent adj ప్రచండమైన, ఉగ్రమైన, తీక్ష్ణమైన, వేగమైన. * love అతిమోహము.
Ardently adv అత్యాశగా, ఆతురముగా.
Ardity, Aridness n s. శుష్కత్వము, ద్రవము లేమి.
Ardour n s ఉద్రేకము, తీక్ష్ణత, చురుకు. the * of love మోహోద్రేకము.
Arduous adj కఠినమైన, కష్టమైన, దుష్కరమైన.
Arduousness n s కఠినము, కష్టము, దుర్ఘటము, ప్రయాస. from the * of thisundertaking యీ ప్రయత్నము దుర్ఘటమైనందువల్ల.
Are thepluralofthepresenttenseoftheverbBe వున్నారు, where are you going యెక్కడికి పోతావు.
Area n s ప్రదేశము, స్థలము. the * within a house ముంగిలి.
Arecants n s వక్కలు, పోకలు, వక్కలు. the * tree పోకచెట్టు. a mouthful of *ఒక విడెము. the word Areca is corrupted from the Canarese అడికెadikeh.
Areconts n s read, `Areca nuts.'
Arena n s స్థలము, ప్రదేశము, రంగము, జట్టివాండ్లు, సాము చేసే బయలు. hedescended into the * argument వాడు వివాదమునకు ఆరంభించినాడు.
Argand-lamp n s ఒక తరహా దీపము.
Argent adj ధావళ్యమైన.
Argilla n s బంకమన్ను.
Argillaceous adj బంకమట్టి సంబంధమైన. * earth రేగడభూమి, బంకమట్టిభూమి.
Arguing n s తర్కము, న్యాయము.
Argument n s తర్కము. a reason న్యాయము, హేతువు. a position advancedపక్షము. or contents సంక్షేపము, సంగ్రహము. the * of the Bharata is statedin the first book భారతకథ యొక్క సంక్షేపము, ఆదిపర్వములో చెప్పియున్నది. theyheld an * తర్కించినారు. he used his poverty as an * that I should excusehim నేను తన్ను మన్నించవలసిన దానికి తన పేదతనము హేతువుగా చెప్పినాడు. this isno * యిది ఒక హేతువు కాదు. the * he produced is very weak వాడు చెప్పినన్యాయము బహు దుర్బలముగా వున్నది. he is your enemy but that is not *for your committing murder వాడు నీ శత్రువైనప్పటికిన్ని వాణ్ని నీవు చంపినందుకుశత్రుత్వము ఒక సమాధానము కాదు. argument in favour of an act సాధకము. *against an act బాధకము. admitting for argument's sake that what hesays is true వాడు చెప్పినది న్యాయ ప్రకారము వాస్తవ్యమైనప్పటికిన్ని.
Argumentation n s వాగ్వాదము, పోరు, రచ్చ.
Argumentative adj తర్కంచే, తార్కిక.
Argus n s వెయ్యికండ్లు గలవాడు, యిది నెమలి పేరు. he is a perfect * or heis * eyed వాడికి ఒకటిన్ని దాగదు.
Argute adj తీక్ష్ష, తీక్ష్ణమైన.
Arian n s యిది ఖ్రిష్టియన్ మతములో ఒక భేదము.
Arid adj యెండిన, శుష్కించిన. an * soil యెండిపోయిన భూమి.
Aries n s మేషము, మేషరాసి.
Aright adv సరిగ్గా, చక్కగా, తప్పక, తప్పు లేక.
Arisen adj లేచిన, పుట్టిన, ఉదయించిన.
Aristocracy n s the great the noble the fashionable దొరలు, ప్రభువులురాజులు, అధికారులు. a kind of government (as opposite to monarchy.) ఒకరాజు అని నియమము లేక ప్రభువులు చేసే రాజ్యభారము, దేశములో వుండే పెద్దమనుష్యులు చేసే రాజ్యభారము. The * of wealth ధనమదము. The * దొరలు The *educate their sons in this manner దొరలు తమ బిడ్డలకు యీ క్రమమముగా శిక్షచెప్పుతున్నారు (ఇది దూషణ పదము.)
Aristocrat n s a proud tyrant తలకొవ్వినవాడు, గర్విష్ఠుడు.
Aristocratic, Aristocratical adj proud tyrannical గర్విష్ఠుడైనఅభిజనమదముగల. * insolence అభిజనమదము, ( ఇది దూషణ పదము ).
Aristolochia Indica a sovereign remedy for snake bitesదూలకోవిల'ఈశ్వర'See Wight's Eassay in Madras Spectator of 3r March 1848 with an outline print.
Arithmetic n s గణితము, గణిత శాస్త్రము, లెక్క.
Arithmetical adj గణిత శాస్త్ర సంబంధమైన. * progression ఏకోత్తరవృద్ధి. the *superiority was on their side వాండ్లు సంఖ్యలో అధికముగా వుండిరి.
Arithmetically adv గణితశాస్త్ర ప్రకారము.
Arithmetician n s గణితజ్ఞుడు, గణితశాస్త్రము తెలిసినవాడు.
Ark n s of the flood పెద్దవాడు, అనగా జల ప్రళయమందు నోవా తనసంసారముతో కూడా అనేక జంతువులను పోషించినవాడు. a chest in which the lawkept దేవుడి శాసనమును వుంచిన పెట్టె, దేవమందాసనము. is the word used inthe Roman Catholic Telugu version of Old Testament. A common box; as, a meal * పెట్టె పిండిపోసి పెట్టే పెట్టె.
Arm n s of the body చెయ్యి, బాహువు, భుజము. he came with a bookunder his * చంకలో పుస్తకము పెట్టుకొని వచ్చినాడు. he came with his wife onhis * వాండ్లు ఆలుమగడు చేతులు గూర్చుకొని వచ్చిరి. lend me your * చెయ్యియియ్యి.the upper * సందిలి, రెట్ట. he took her in his arms దాన్ని కౌగిలించుకొన్నాడు.she took his * వాడి చెయ్యి గూర్చుకొన్నది. * of a tree పెద్ద కొమ్మ. an * ofthe sea చెయ్యివలె వుండే సముద్రము, కైయి. the * of a chair కురుచి యొక్కచెయ్యి. an * chair చేతులు గల కురిచి. the length of the extended armsబారెడు. he kept them at arms length వాడు వాండ్లకు చొరవ యివ్వలేదు, దగ్గెరచేరనియ్యలేదు. I am just keeping fever at arms length జ్వరము రానివ్వకుండావుపాయముగా గడుపుతున్నాను. he was within arm's reach of me వాడు నా చేతికిఅందే దూరములో వుండినాడు. a child in arms చేతిబిడ్డ. he received them withopen arms ఆహా వస్తిరా యని నిండా సన్మానించినాడు. with a strong * భుజబలము గలవాడై. the priest made them over to the secular * వీండ్లనుపాదిరి లౌక్యులైన అధికారుల చేతికి వొప్పగించినాడు. the * Artilelry ఫిరంగుల దళము. the arm of Cavalry తురుపుసవార్లు. in the plural ఆయుధములు. Both gunsand small arms ఫిరంగులున్ను, తుపాకులున్ను. side arms కత్తి, బాకు, పిస్తోలుమొదలైనవి. they flew to arms ఆయుధములు యెత్తుకొన్నారు. they took up armson his behalf వాడికై జగడానకు పోయిరి. they were up in arms against himవాడి మీదికి యుద్ధానికి వచ్చిరి. a man at arms ఆయుధపాణియైన బంట్రోతు. coat ofarms కుల బిరుదు ముద్ర అనగా వెంకటగిరి కాళహస్తి తంజావూరు యీలాటిసంస్థానాలకు వారి వారికి, సింహము, పంది, కటారి, అర్ధచంద్రుడు యిలాటిముద్రలు వుంటవి, యీ ప్రకారమే Europe దేశస్థులైన దొరలలో ప్రతి వంశమునకున్ను ఒక ముద్ర వుంటుంది. ఆ ముద్రకు coat of arms అని పేరు.
Armada n s యుద్ధవాడల సమూహము, అనగా మున్నూరుయేండ్ల కిందట యెంగిలండుమీదికి వచ్చిన యుద్ధవాడల సమూహము యొక్క పేరు.
Armadillo n s ఉడుమువంటి ఒక జంతువు, దీని వొంటి మీద వెంట్రుకలు లేవు. దీన్నితెలుగులో అలుక, ఆలుగ, ఆలువ యనిన్ని అంటారు. సంస్కృతములో నఖమృగమనియంటారు.
Armament n s సైన్యము, దండు, యుద్ధవాడలు.
Armed adj having hands చేతులుగల. having weapons ఆయుధములుధరించిన. covered with armour జీరా వేసుకొన్న. four * చతుర్భుజుడైన. long *అజానుబాహువైన. an * force దండు.
Armenia n s అరిమినియా యనే దేశము.
Armenian n s అరిమిని దేశస్థుడు, అరిమినివాడు, అరిమినివాండ్ల భాష.
Armful n s సందెడు. an * of straw సందెడుగడ్డి.
Armhole n s చొక్కాయ యొక్క చెయి సందు.
Armillary n s వలయాకారము.
Armistice n s or a truce యిన్నాళ్ళదాకా యుద్ధము చేయకూడదని ఉభయత్రులుగానియమించుకొన్న కాలము.
Armless adj భుజములు లేని, చేతులు లేని.
Armlet n s బాహుపురి, సందిటి తాయిత్తులు మొదలైన భుజ భూషణములు.
Armorer n s ఆయుధములు చేసేవాడు.
Armorial adj కులబిరుదు సంబంధమైన. * bearings కులబిరుదులు.
Armory n s ఆయుధశాల, అస్త్రశాల.
Armour n s కవచము, జీరా.
Armour-bearer n s ఆయుధములు మోసేవాడు.
Armourer n s ఆయుధములు చేసేవాడు.
Armouty n s ఆయుధశాల, అస్త్రశాల.
Armpit n s చంక.
Army n s సేన, దండు.
Aroma n s వాసన, గంధము.
Aromatic adj పరిమళమైన, సుగంధమైన. * po wders గంధపొడి.
Arose the past of the verb Arise లేచినది,ఉదయించినది,పుట్టినది,కలిగినది, See to Arise.
Around Prep and adv. చుట్టూ. he looked * చుట్టూరు చూచెను, నల్దిక్కులచూచెను.
Aroused adj నిద్ర లేచిన, మేలుకొన్న,రేగిన, ప్రేరేపించబడ్డ. he was * by thisయిందువల్ల వాడికి ఆగ్రహము వచ్చినది.
Arow adv వరసగా, పంఙ్తిగా
Aroynt interj ఛీ పో.
Arquebuse n s ఒక తరహా పూర్వ కాలపు తుపాకి.
Arrack n s సారాయి. * shop సారాయి అంగడి.
Arraignment n s దావా, నెపము.
Arrangement n s క్రమము, యేర్పాటు, పరిష్కారము.
Arrant adj చెడ్డ, దుష్ట. an * lie చెడ్డ, అబద్ధము. an * rogue చెడ్డ దొంగ.
Arras n s చిత్రవిచిత్రమైన తెర, అనగా అలంకారానికై గోడ కనబడకుండా కట్టే చిత్రవిచిత్రమైన గుడ్డ.
Array n s of battle వ్యూహము, మోహరము. or dress ఉడుపు, వేషము. thearmy stood in battle * ఆ దండు యుద్ధసన్నద్ధముగా నిలిచినది. in full *శృంగారముగా.
Arrayed adj క్రమపరచిన, అలంకరించిన. * in order of battle వ్యూహముగాయేర్పరచిన. she came * in silk పట్టు బట్టలు శృంగారించుకొని వచ్చింది. Sun arosearrayed in glory యశోభూషితుడై సూర్యుడు వుదయించెను. he came * in armsఆయుధములు ధరించుకొని వచ్చెను.
Arrear, Arrears n s. నిలువ, బాకి. the salary in arrears will be paid offనిలువ సంబళము చెల్లించబడును. the work fell in * ఆ పని వెనక పడ్డది. after hebrought up the arrears వెనకపడ్డ పనిని సరిచేసిన తరువాత.
Arrest n s అడ్డగింపు, ఆటంకము, అభ్యంతరము, పట్టుకోవడము. he made thisrequest in * of judgement తీర్పు చేయడానికి అభ్యంతరముగా యీ మనివిచేసుకొన్నాడు.
Arrested adj అడ్డగించబడ్డ, ఆటంకము చేయబడ్డ, పట్టుకోబడ్డ. my attention was *at the sight చూచి వెరగుపడ్డాను.
Arret n s ఆజ్ఞ, శాసనము.
Arrival n s వచ్చి చేరడము, ప్రవేశము, రాకడ. on its * అది చేరిన మీదట.
Arrogance n s దురహంకారము, గర్వము,మదము, పొగురు.
Arrogant adj దురహంకారముగల, గర్వముగల, పొగరు పట్టిన.
Arrow n s బాణము, అంబు.
Arrow-root n s మెట్టతామర, అర్రోడు. at Calcutta it is called సేంగారాsengarah. in Kalicut it is called Kooa కువ్వ. The word అర్రోడు, corruptedfrom the English name is alone in use.
Arse n s గుద్ద.
Arsenal n s ఆయుధశాల.
Arsenic n s పాషాణము. golden coloured * గౌరీపాషాణము. * realgarనెల్లిపాషాణము. white oxide of * ఉల్లిపాషాణము, తెల్లపాషాణము. yellowsulphuret of * దొడ్డి పాషాణము.
Arson n s యిల్లు తగులబెట్టిన నేరము.
Art (the singular of the 2nd person of the present tense of the verb Be Thou * to do this నీవు యిది చేయవలసినది.
Artery n s నాడి, పెద్దనరము, ముఖ్యమైన నరము.
Artful adj తంత్రమైన, కుత్రిమముగల, కపటమైన.
Artfully adv కపటముగా, తంత్రముగా.
Artfulness n s కపటము, తంత్రము, గారడీతనము, మాయ, వంచన.
Artichoke n s ఒక తరహా గడ్డ ,దీన్ని చెన్నపట్నములో హాటీచోకు అంటారు.
Article n s ( a thing ) పదాథ ్ము, ద్రవ్యము, వస్తువు, సొమ్ము, సరుకు. a part ofspeech ఉపపదము. A, an, the అనే వుపపదములు. an * of food భోజనద్రవ్యము.a condition of a Convenant నియమము, నిబంధన, వొడంబడిక. a clause ofan account పద్దు, సంగతి. there is an * regarding the war in today'snewspaper నేటి ప్రసిద్ధ పత్రికలో యుద్ధమును గురించి ఒక ప్రకరణము వున్న ఒక పద్దువున్నది. the articles of religion మతము యొక్క నిబంధనము; an * of faithసిద్ధాంతము. this is an * of faith with them యిది వారి సిద్ధాంతము. articlesof peace సమాధాన వొడంబడిక. he was under articles to me నాకు వొడంబడికవ్రాసి యిచ్చి నా చేతి కింద వుండినాడు. articles used in cookery వంటసామగ్రీ. * offood భోజన సామగ్రీ. articles of earthen ware కుండచట్లు, పింగాండ్లు. In the *of death మరణావస్థ యందు.
Articular adj శరీరము యొక్క,కీళ్ళ సంబంధమైన, స్పష్టమైన, విశదమైన. * speechస్పష్టమైన మాట.
Articulate adj స్పష్టమైన, స్ఫుటమైన. an * sound అర్థవద్ధ్వని.
Articulately adv స్పష్టముగా, స్ఫుటముగా.
Articulation n s ఉచ్చారణ. of joints కీలు, గెణుపు. the articulations of acane బెత్తము యొక్క గెణుపులు.
Artifice n s యుక్తి, కుయుక్తి, ఉపాయము, తంత్రము.
Artificer n s పనివాడు, శిల్పి.
Artificial adj కృత్రిమమైన, కల్పితమైన, మాయమైన. a river is a naturalstream but a canal is * యేరు దేవకృతమైనది, కాలవ మనుష్య కృతమైనది. RiceCotton &c. are natural productions but Cloth Paper &c. are *productions బియ్యము, పత్తి మొదలైనవి దేవ నిర్మితమైన వస్తువులు, గుడ్డ,కాకితముమొదలైనవి మనుష్య కృతమైన వస్తువులు. her beauty is not natural but * దానికిపెట్టు చాయే గాని పుట్టు చాయ లేదు. an * flower తజ్జాతిగా చేసిన పుష్పము. an *lake చెరువు. * gold విశ్వామిత్రమైన బంగారు, మాయ బంగారు. an * pearlచిప్పముత్యము, ఉమ్మాయముత్యము. * diamond తోరమల్లి. the * globeమనుష్యులచేత చేయబడ్డ భూగోళము. * piety కపటమైన భక్తి. * politeness దొంగవినయము. * wants అధికపోకిళ్ళు.
Artificially adv కృత్రిమముగా, మనుష్యకృతముగా, నేర్పుగా. Lands * irrigatedమనుష్యులచేత నీళ్లు కట్లబడ్డ భూములు.
Artillery n s పిరంగులు. In this battle they use no * యీ యుద్ధములో వాండ్లుపిరంగులు వాడలేదు. Small arms and * తుపాకులున్ను పిరంగులున్ను a piece of *పిరంగి. ten pieces of * పది పిరంగులు the * of love శృంగార చేష్టలు దుష్టులుయిత్యాది.
Artisan n s పనివాడు, శిల్పి, అనగా వడ్లవాడు, కంసలవాడు, కమ్మరవాడుకంచరవాడు, చిత్రగాడు, వీండ్లు మొదలైన వాండ్లు.
Artish n s పనివాడు, శిల్పి, అనగా వడ్లవాడు, కంసలవాడు, కమ్మరవాడుకంచరవాడు, ముచ్చెవాడు వీండ్లు మొదలైన వాండ్లు.
Artless adj సాధువైన, నిష్కపటియైన. or awkward మోటైన.
Artlessly adv సాధువుగా, నిష్కపటముగా.
Artlessness n s సాధుత్వము, నిష్కాపట్యము. or awkwardness మోటతనము.
Artocarpur Integrifolia -Thejacktreeపనసచెట్టు, Rox. 3. 522.
Arum n s శివకరణిక, పురుషరత్నము అనే పువ్వు, మగ లింగమనే చెట్టు.the Canadi Dictionary says బలురక్కసిగడ్డ. and W. says కంద.
As conj and adv. వలె, రీతిగా, ప్రకారము, అందున, గనక, వల్ల. just * all therest of the country దేశముతోటిపాటు. he was to me * a brother నాకుతోడబుట్టిన వాడివలె వుండినాడు. I was to them * a servant వాండ్లకు ఒక పనివాడుగా వుంటిని. he took this money * a loan యీ రూకలను అప్పుగాతీసుకొన్నాడు. Help me now and I will do * much for you another time నాకుయిప్పుడు సహాయము చెయ్యి యింకొక వేళ నీకు నేను అంత మాత్రము చేస్తాను. half *much again ఒకటికి ఒకటిన్నర. * much again మరీ అంత. Twice ( much againమరీ రెండింతలు. * usual యెప్పటివలె, యధారీతిగా * for me I remained at homeనేనైతే యింట్లోనే వుంటిని. I think I did మునుపు నాకు యెట్లా తోచినదో అట్లాగేతోస్తున్నది.you may do * you please నీ మనస్సు వచ్చినట్టు చెయ్యి. he did * hepromised చెప్పిన ప్రకారము చేసినాడు. I give it * it is అది యెట్లా వున్నదో అట్లాగేయిస్తాను. difficult * it was అది యెంత కష్టమైనప్పటికిన్ని. * it shall beconvenient యెట్లా అనుకూలమో అట్లా అనుకూలము చొప్పున. * you have done soనీవు అట్లా చేసినావు గనుక. * it was falling అది పడుతూ వుండగా. just * he cameవాడు రాగానే. I spoke to each person and seated them * they came వాండ్లుఒకరొకరుగా వస్తూ వుంటే ఒకరొకరితో మాట్లాడి కూర్చుండ పెట్టినాడు. * I was comingనేను వస్తూ వుండగా. * he says వాడు చెప్పే ప్రకారము. Better leave them * theyare అని యెట్లా వున్నవో అట్లాగే వుండనీ వాటి తెరువుకు పోకు. Feverish * I was Iwent there జ్వరముతోనే అక్కడికి పోతిని. as to, as for అయితే, అయితేనో. * tothis book it is of no use యీ పుస్తకము అయితే పనికిరాదు. as to which ofthem died first వాండ్లలో మొదట చచ్చినవాడు యెవడంటే. as if; or as thoughవలె. he looked * if he was ill వాడు వొళ్ళు కుదురులేని వాడివలె అగుబడెను.వాడికి వొళ్ళు కుదురు లేనట్టువలె అగుబడెను. he acts * though he was yourenemy నీకు శత్రువైనట్టు నడుస్తాడు. she seemed * though asleep నిద్రపొయ్యేదానివలె వుండెను. as yet యింకా యిదివరకు. * yet he is alive యింకా బ్రతికివున్నాడు. " As, as " యిది రెండుమాట్లు వచ్చినప్పుడు వేరే విధముగా అర్ధమౌతున్నది.* long * this దీనంత పొడుగు. * hot * fire నిప్పంత వేడి. * far * దాకా, మట్టుకు,వరకు, యెంత దూరమో అంత దూరము. * far * the town పట్టణము మట్టుకు,పట్టణము వరకు. there were * many * ten పది యింటిదాకా వుండినవి. I will tellyou * much * I have seen నేను యెంత మట్టుకు చూచినానో అంతమట్టుకుచెప్పుతాను. * soon * he comes వాడు వచ్చిన తక్షణము, వాడు రాగానే. * much * you can నీ చేతనైన మట్టుకు. * much * possible యధాశక్తి. he * well * caught the fever నా తోటిపాటివాడికిన్ని జ్వరము వచ్చినది.It is * likely * not అవునో కాదో. * for * I know నాకు తెలిసిన మట్టుకు.* long * you remain here నీవు యిక్కడ వుండే పర్యంతము. a man * learned * he is వాడి అంతటి పండితుడు. * old * he is he is still handsomeవాడికి యిన్ని యేండ్లైనప్పటికిన్ని యింకా అందముగానే వున్నాడు. he has a house such * it is వాడికి ఒక యిల్లు వున్నది అది యేమియిల్లు. In wisdom as in beauty she was superior to all అందములో యెట్లాగోబుద్ధిలోనున్ను అట్లాగే అది అందరికిన్ని హెచ్చుగా వుండినది. he had four sons and * many daughters వాడికి నలుగురు కొడుకులున్ను అన్ని మందికూతుర్లున్ను వుండిరి. As ( for instance) యేలాగంటే. If a man (* for instance I ) were to call him ఒకడు ఒకవేళ నేను వాణ్ని పిలిచినట్టైతే.
Asafoetida n s ఇంగువ.
Asarabacca n s టట్టాకు అనే ఒక దినుస్సు.
Asbestos n s ఒక తరహా రాయి, దీన్ని పగలకొట్టితే నార నారగా వస్తుంది.దీనితో చేసిన గుడ్డ నిప్పులో వేస్తే కాలదు.
Ascendant adj ప్రబలమయ్యే. or superiority ప్రాబల్యము. he gained the *over them వాండ్లను లోపరచుకొన్నాడు, వాండ్లను వశ్యము చేసుకొన్నాడు, వాండ్లనుచేతికింద వేసుకొన్నాడు. his star is now in the * or he is now lord of the *వాడికి యిప్పుడు వుఛ్రాయదశ వాడికి యిప్పుడు మంచి యోగకాలము క్షణే క్షణే అభివృద్ధిపొందుతున్నాడు, వానికి యిప్పుడు జయకాలము.
Ascendency n s ప్రధానత, ప్రాధాన్యము.
Ascension n s ఆరోపణము, ఊర్ధ్వగమనము.
Ascension-day n s ఖ్రిష్టుయొక్క స్వర్గారోహణ, దివసము.
Ascent n s ఎక్కుడు, ఉన్నతము, పొడుగు. easy of * యెక్కడానికి సులభమైన.difficult of * యెక్కడానకు కష్టమైన. * and descent యెక్కుడు దిగుడు.
Ascertained adj తెలిసిన, నిశ్చయమైన.
Ascetic n s సన్యాసి.
Asceticism n s మునివృత్తి, వైరాగ్యము.
Ascititious adj సంయుక్తమైన, అధికమైన.
Asclepias, acida (a certain plant)సోమలత
Asclepias, Giganteai అర్కము,జిల్లేడు
Ash n s a kind of tree ఒక తరహా చెట్టు. of fire బూడిదె, భస్మము. ashes oflive coal నిప్పుమీది నిగురు. It was burnt to ashes అది బూడిదై పోయినది. theashes of his grandfather were deposited here యిది వాడి తాతను పూడ్చినస్థలము. * colour బూడిదె వర్ణము.
Ashamed adj సిగ్గుపడ్డ. I am quite * of you ఛీ పో.
Ashen adj made of ash-wood అషు అనే మానితో చేసిన.
Ashore adv గట్టున, తీరమందు. he went * తీరమునకు పోయినాడు. the ship ran* ఆ పడవను సముద్రములో నుంచి గట్టుకు యీడ్చిరి. after they came * రేవునదిగగానే.
Ashwednesday n s ఒక వుపవాస దినము, ఖ్రిష్టువులు వుపవాసముండే నలభైదినములకు మొదటి దినము.
Ashy adj పాలిన, నెత్తురు చచ్చిన, తెల్లపారిన.
Asia n s ఏషియా అనే భూఖండము.
Asiatic adj ఏషియా దేశస్థుడు.
Aside adv పక్కన, ఓరగా, కడగా. they set this will * యీ నుతోసివేసినారు. he laid the money * ఆ రూకలను కడగా పెట్టినాడు. he laid thatplan * ఆ యుక్తిని విడిచిపెట్టినాడు. he spoke * పక్కకు తిరిగి రహస్యముగామాట్లాడినాడు.
Asinine adj గాడిదెవంటి. * conduct పిచ్చిపని, గాడిదెనడక. an * face ఖరదృష్టి.
Askance adv పక్కగా, ఓరగా.
Askew adv వంకరగా, వంపుగా.
Asking n s అడగడము, ప్రార్థన.
Aslant adv ఏటవాలుగా, పక్కగా, ఓరగా.
Asleep adv నిద్రపోతూ, నిద్రగా. my leg is * నా కాలు తిమురుగా ఉన్నది. theyfell * వాండ్లు నిద్రపోయిరి. while he was dropping * వాడికి కూరుకు పట్టుతూవుండగా.
Aslope adv ఏటవాలుగా, అదోకపాటుగా, ఒడ్డొరకముగా.
Asp n s కాలసర్పము, కట్లపాము.
Asparagus n s తోటకూర భేదము, దీన్ని పాలగ్లాసు అంటారు, కాకపాలాకు వంటిది SeeGrass.
Aspect n s దృష్టి, చూపు, రూపు, ఆకారము. judging from the present * ofaffairs యిప్పుడు వ్యవహారము వుండే దశ చూస్తే, స్థితి చూస్తే. Fromhis * I saw he was dying వాడి ముఖము చూస్తే చస్తాడని తెలిసినది.
Aspen n s వక చెట్టు. to tremble like an * leaf రాగి ఆకువలె గడ గడ వణుకుట.
Asperity n s or roughness as of the skin గరుకు, నిష్ఠురత్వము. he usedgreat * of language బహు క్రూరముగా మాట్లాడినాడు.
Aspersion n s దూషణ, దూరు.
Asphaltic adj బంకగా వుండే, జిగటగా వుండే.
Asphodel n s ఒక తరహా తామర పుష్పము.
Aspic n s వకతరహా పాము.
Aspirant n s ఆశపడేవాడు, ఉమేదువారు. he was an * for her hand దాన్నిపెండ్లి చేసుకోవలెనని ఆశపడ్డాడు.
Aspirate n s ఒత్తక్షరము.
Aspirated adj ఒత్తిపలికిన. an * letter ఒత్తక్షరము.
Aspiration n s ఆశ, అభిలాష, కోరిక.
Aspiring adj ఆశపడే, అభిలాషపడే, అధికఆశగల.
Asquint adv ఓర చూపుగా, పక్క చూపుగా, మెల్ల చూపుగా.
Ass n s గాడిదె.
Assafoetida n s ఇంగువ.
assailable adj that can be attacked పోయి పడడమునకు అర్హమైన, దూరకూడిన.the town is * on this side పట్టణము మీదికి యీ తట్టు పోయి పడవచ్చును.
Assailant n s పైబడేవాడు, దూరేవాలడు. he opposed his * తన మీదికి వచ్చిన శత్రువును యెదిరించినాడు.
Assassin n s చంపేవాడు, హత్య చేసేవాడు, ఖూనీఖోరు, రహస్యముగా చంపేవాడు.an * of reputation చాడీఖోరు.
Assassinated adj చంపబడ్డ, హత్య చేయబడ్డ, రహస్యముగా చంపబడిన.
Assassination n s రహస్యముగా చంపడము, హత్య, ఖూని.
Assault n s పైబడడము, చొరబడడము. దూరడము, దౌర్జన్యము. ( హల్లా. amistake for hamla ) he was summoned for * దౌర్జన్యమును గురించి వాడి మీదసమ్మను చేసినారు. the fever made several assaults upon him వాడికి జ్వరముఅడుగడుక్కు తగిలింది. they took the town by * ఆ వూరిని హల్లా చేసి పట్టుకొన్నారు.
Assay n s యత్నము, పరీక్ష, వన్నె చూడడము, వొరసి చూడడము. at the first *మొదటి యత్నములో. * of coins నాణెము చూడడము. an * master వెండి బంగారువన్నె చూచేవాడు.
Assayer n s వన్నె చూచేవాడు.
Assemblage n s సమూహము. this book is an * of beauties యీ గ్రంథమురసపుంజమైనది.
Assembly n s గుంపు, సమూహము, సంఘము, సభ.
Assent n s సమ్మతి, అంగీకారము.
Asserted adj చెప్పిన, స్థిరముగా చెప్పిన.
Assertion n s చెప్పే మాట. In spite of all his assertions వాడు యేమిచెప్పినప్పటికిన్ని.
Assessment n s పన్ను, వరి. * of revenue on a village బేరీజు.
Assessor n s నిర్ణయించేవాడు. he who sits by సహాయుడు, కూడాకూర్చుండేవాడు.
Assets n s సొత్తు, ఆస్థి, అనగా చచ్చినవాడి, లే, బుణగ్రస్తుడి యొక్క సొత్తు.
Asseveration n s చెప్పిన మాట, స్థిరముగా చెప్పిన మాట.
Assiduity n s శ్రద్ధ, ఓపిక, జాగ్రత.
Assiduous adj శ్రద్ధగల, ఓపికగల, జాగ్రతగల.
Assiduously adv శ్రద్ధగా, ఓపికగా, జాగ్రతగా.
Assign n s కర్త, అధికారి.
Assignable adj ఉదాహరించ తగ్గ.
Assignation n s సంకేతము, నాయకీ నాయకులు కూడేటందుకు చేసుకొన్న సంకేతము.She did not come to the place of * ; or she did not keep her * అదిసాంకేతిక స్థలమునకు రాలేదు.
Assignee n s మధ్యవర్తి.
Assignment n s నియమించడము, ఒప్పగింత. * on the revenues of a districtతనఖా, బరాతము, హవాలతు.
Assimilation n s సదృశము చేయడము, సమానపరచడము. * to the divine imageసారూప్యము.
Assistance n s సహాయము, అనుకూలము.
Assistant n s సహాయుడు, సహకారి. an * collector రెండో కలక్టరు.
Assize n s a court of justice న్యాయ సభ, విచారణ చేసే స్థానము. regulationof price &c. నిరఖునామా, సరుకుల వెలలపట్టి.
Associate n s సహాయి, కూడా వుండేవాడు, చెలికాడు.
Associated adj చేరిన, కలిసిన.
Association n s సంబంధము, సాంగత్యము, సహవాసము. or society సభ,కూటము. the union of ideas ఒకటిని పట్టి మరి వొకటి జ్ఞాపకమునకు రావడము. theyformed an * for carrying on trade వర్తకము జరిగించడానకు కూటము కూడిరి.
Assorted adj తరవారిగా యేర్పరచిన.
Assortment n s తరవారి. a large * of goods నానావిధమైన సరుకులు.
Assumed adj వహించుకొన్న, ధరిమచిన, ఆరోపితమైన.
Assuming adj అహంకరించిన, గర్వించిన. an * fellow అహంకారి, గర్విష్ఠుడు.
Assumption n s వహించుకోవడము. After the * of the Mysore countryమైసూరు దేశమును ఆక్రమించుకొన్న తర్వాత. after his * of this form వాడు యీఆకారమును ధరించిన తరువాత. this is a groundless * యిది నిర్హేతుకముగాఅనుకోవడము. * of a right స్వాతంత్ర్యమును వహించుకోవడము. * of a name పేరుపెట్టుకోవడము. the * of the blessed Virgin Mary సర్గారోహణము, స్వర్గారోహణపండుగ.
Assurance n s నమ్మిక, అభయము, భరవసా. or impudence మొండితనము.security against losss పూట, దీన్ని భీమా అంటారు.
Assured adj స్థిరముగా చెప్పిన, రూఢిగా చెప్పిన. I am * that he is still alivebut I don't believe it వాడు యింకా జీవించి వున్నాడని అంటారు గాని నేను దాన్నినమ్మలేదు. I felt * that you would pardon this తమరు దీన్ని క్షమింతురనిరూఢిగా నమ్మినాను. Be * thathe is dead చచ్చినాడని ఘట్టిగా నమ్ము.
Assuredly adv నిశ్చయముగా, నిజముగా, రూఢిగా. you must * do this నీవుదీన్ని సిద్ధముగా చేయవలసినది.
Asterisk n s పువ్వు. అనగా ( * ) యీ రీతిగా పుస్తకములో వేసే గురుతు, యీలాటిగురుతులు పదిపన్నెండు వేస్తే యిక్కడ గ్రంథము లోపమని భావము.
Asterism n s స్థిరముగా వుండే నక్షత్ర సమూహము, సప్తఋషి నక్షత్రములుమొదలైనవి.
Astern adv వెనకతట్టున. the boat was * ఆ పడవ వాడకు వెనకతట్టున వుండినది.the boat dropped * పడవ వాడకు వెనకపడ్డది.
Asthma n s ఉబ్బసము, రోజు, శ్వాస కాశము.
Asthmatic, Asthmatical adj ఉబ్బసముగల, శ్వాసకాశముగల.
Astir adv risen లేచి, నిద్రలేచి, మేలుకొని. they were * very early వాండలుతెల్లవారు ఝామున లేచినారు. they are still * వాండ్లు యింకా మేలుకొని వున్నారు. he is not * yet వాడు యింకా నిద్ర లేవలేదు.
Astonied adj ఆశ్చర్యపడ్డ, వెరగుపడ్డ, యిది పురాతన శబ్దము.
Astonished adj ఆశ్చర్యపడ్డ.
Astonishing adj ఆశ్చర్యకరమైన, అద్భుతమైన.
Astonishingly adv ఆశ్చర్యముగా.
Astonishment n s ఆశ్చర్యము.
Astounding adj మానుపరచే, దిగ్భ్రమపరచే, గాబరా చేసే.
Astraddle adv పంగటించుకొని. he stood * upon two horses ఒక గుర్రముమీద ఒక కాలు మరి ఒక గుర్రము మీద ఒక కాలు పెట్టుకొని పంగటించుకొని నిలిచినాడు.
Astral adj నక్షత్ర సంబంధమైన.
Astray adv దోవతప్పి. the cattle went * ఆ పశువులు తప్పిపోయినవి. shewent * వ్యభిచారియై పోయినది. he led them * వాండ్లను తప్పు దారిని తీసుకొనిపోయినాడు, భ్రమపరచినాడు, మోసము చేసినాడు.
Astride adv కాళ్ళు పంగటించుకొని. he stood * కాళ్ళు పంగటించుకొని నిలిచినాడు.
Astringency n s ఒగరు.
Astringent adj ఒగరైన. the karaccaya or walnut peel is very * కరక్కాయబహు ఒగరు.
Astrolable n s గ్రహముల యొక్క అవున్నత్యమునున్ను దూరమునున్ను చూచేఆయుధము, యంత్రము.
Astrologer n s ఫలశాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడు.
Astrological adj జ్యోతిశ్శాస్త్ర సంబంధమైన, ఫలశాస్త్ర సంబంధమైన.
Astrology n s జ్యోతిషము, ఫలశాస్త్రము.
Astronomer n s గణితశాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడు, సిద్ధాంతి, జోస్యుడు.
Astronomical adj గణితశాస్త్ర సంబంధమైన, జ్యోతిష సంబంధమైన.
Astronomy n s గణితశాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము. Europeans respect * butthey despoise astrology జాతి వాండ్లు గణితశాస్త్ర మందు గౌరవమును వుంచుతారుగాని ఫలశాస్త్రమును నమ్మరు.
Astute adj critically examining, shrewd, cunning కపటియైన.
Asunder adv విడిగా, ప్రత్యేకముగా, ఒకటితో ఒకటి చేరక. he held his hands *చెయ్యిలో చెయ్యి కలియకుండా పెట్టుకున్నాడు. the box fell * పెట్టె పడిఛిన్నాభిన్నమైనది. he cut the rope * ఆ తాడును తుండించినాడు.
Asylum n s రక్షకస్థానము, రక్షకము, దిక్కు, గతి, శరణు, ఆధారము.
At prep లోకి, వద్ద, అందు. what is he * వాడు యేమి చేస్తాడు. he was then *the gate గడప దగ్గెర వుండినాడు. he entered * the window కిటికీ గుండా దూరెను.he threw a stone * me నా మీద రాయి వేసినాడు. he frowned * me నన్ను ఉరిమిచూచినాడు. she laughed * me నన్ను చూచి నవ్వినది. he fired * the mark butdid not hit it గురి చూచి కాల్చినాడు గాని తగులలేదు. * the well బావి దగ్గెర. thedog barked * him ఆ కుక్క వాణ్ని చూచి మొరిగింది. the cow ran * him ఆ యావువాణ్ని కుమ్మపోయినది. * these words he rose యీ మాటలు విని లేచినాడు. * howmuch a yard do they sell this cloth యీ గుడ్డ గెజ మెట్లా అమ్ముతారు. * ten o'clock పది ఘంటలకు. * this యిందుకు. he was disgusted * this యిందుకు.he was disgusted * this యిందుకు అసహించినాడు. grieving * her absenceఅది లేనందుకు వ్యాకులపడి. he was surprised * it అందున గురించి ఆశ్చర్యపడ్డాడు.he was frightened * this యిందుకు భయపడ్డాడు. I was * this expense foryou నీ నిమిత్యమై యీ వ్రయము పడ్డాను. he was angry * this యిందున గురించికోపగించుకొన్నాడు. * all యెంత మాత్రము. not * all యెంత మాత్రము లేదు. thereis no body * all యేవరూ లేరు. there is nothing * all ఒకటీ లేదు. he did notweep * all వాడు యేడవనే లేదు, వాడు బొత్తిగా యేడవ లేదు. * the bottomఅడుగున. a child * the breast చంటిబిడ్డ. * dawn ఉదయాన. I came here * hisdesire అతని ఉత్తరువు మీద యిక్కడికి వచ్చినాను. * a distance దూరాన. heknocked * the door తలుపును తట్టినాడు. he lives * ease సుఖముగా వున్నాడు,క్షేమముగా వున్నాడు. * the end తుదను, తుదకు. * every word మాటమాటకు. * agreat expens, బహు వ్యయము దగ్గెర. I has no servants * hand నా దగ్గెరపనివాండ్లు వుండలేదు. If you have that book * hand ఆ పుస్తకము నీ వద్ద వుంటే.I received it * his hands అతని చేతిగుండా తీసుకొంటిని. when summer is *hand యెండకాలము తటస్థమయ్యేటప్పటికి. I was then * home యింట్లో వుంటిని. *last తుదకు, కడాపట. * least మెట్టుకు, అధమం, కడకు, యెంత తక్కువైనా.If they don't come I * least will come వాండ్లు రాకుంటే నేనైనా వస్తాను.Not being * leisure to go there అక్కడికి పోతీరక. * length తుదకు, కడాపట.Look * this దీన్ని చూడు. I was * a loss what to do నాకు ఒకటీ తోచక వుంటిని.* most నిండా వుంటే. the child is * most five years old ఆ బిడ్డకు నిండా వుంటేఅయిదేండ్లువుండును. * night రాత్రిలో. so late * night యింత రాత్రిలో, రాత్రి యింతపొద్దుపోయి. * no time was hethere వాడు అక్కడ ఒకనాడూ వుండలేదు. * noonమధ్యాహ్నమందు. * once ఒక దెబ్బన. all * once అంతా ఒకే దెబ్బన, అకస్మాత్తుగా,they are now * peace శాంతముగా వున్నారు, సమాధానముగా వున్నారు. * pleasureయధేచ్ఛగా, ఇష్టము చొప్పున. * present యిప్పట్లో. * random అనియమముగా,వూరికె, మొత్తముగా, సగటున, they shot * random గురిలేక వూరికే కాల్చినారు. aword spoken * random మొత్తముగా చెప్పిన ఒక మాట. * the rate of tenrupees పది రూపాయలు చొప్పున. * the present rate యిప్పటి వెలకు. * any rateమెట్టుకు యెట్లాగైనా, యే విధాననైనా. If you cannot do all the work today *any rate do half of it. నేటిలోగా ఆ పని అంతా చేయకుంటే మెట్టుకు సగమైనాచెయ్యి. you must go there * any rate నీవు యే విధాననైనా అక్కడికి పోవలెను. theship is * sea ఆ వాడ సముద్రములో వున్నది. he lay * my side నా పక్కనపండుకొన్నాడు. * sight చూచిన క్షణము. * full speed అతి త్వరగా. the work is *a stand పని నిలిచి వున్నది.I was * a stand యెటూ తోచక వుంటినిని. * the timehe arrived వాడు వచ్చి చేరినప్పుడు. ten * a time తడవకు పదేసి. * that timeఅప్పుడు, అప్పట్లో, ఆ కాలమందు. * one time ఒకప్పుడు. * times అప్పటప్పటికి, ఒకఒక వేళ. they are * variance వాండ్లు ద్వేషముగా వున్నారు. they are * warయుద్ధము చేస్తున్నారు, కలహపడుతున్నారు. he was * his wit's end for a dinnerకూటికి యెట్లా అని మిణకరిస్తున్నాడు. he isnow * work పని మీద వున్నాడు. * theworst or * the best మెట్టుకు. * my saying this నేను యిట్లా చెప్పినందున. * hisconsenting అతని సమ్మతి మీద. * going out I met him బయట పోతూ వుండగావాడు నాకు యెదురుపడ్డాడు. * him, again ! మళ్ళీ వాడి మీద యుద్ధములో వుసుకొలిపేమాట.
Ate the past of Eat భోజనముచేసినది,తిన్నది
Atheism n s దేవుడు లేదనే మతము, నాస్తిక మతము, శూన్యవాదము.
Atheist n s దేవుడు లేదనేవాడు, నాస్తికుడు, శూన్యవాది. a practical * దేవుడనేతలంపు లేనివాడు.
Atheistic, Atheistical adj దేవుడు లేదనే మతముగల, నాస్తిక మతసంబంధమైన,దైవ తిరస్కారమైన.
Athirst adv దప్పికగా, దాహముగా.
Athlete n s జెట్టివాడు (commonly) a contender for victoryజయమునకు పోరాడే వాడు.
Athletic adj దృఢగాత్రుడైన, బలిష్ఠుడైన, పుష్టిగల.
Athwart adv అడ్డముగా.
Atilt adv వొరిగి. the dish is * ఆ తట్ట వొరిగి వున్నది.
Atlantic n s Africa కున్ను America కున్ను మధ్యవుండే సముద్రము.
Atlas n s a mountain ఒక పర్వత నామము. a book of maps దేశాదేశ పఠములుగల పెద్ద పుస్తకము. a sort of silk అతలషు అనే ఒక తరహా పట్టు.
Atmosphere n s ఆకాశము, భూగోళమును చుట్టుకొని వుండే వాయువు. on accountof the thickness of the * I could not see the hill మబ్బుగా వుండడము చేత ఆకొండ తెలియలేదు, మంచు కమ్ముకొన్నందున ఆ కొండ తెలియలేదు. on account of theclearness ofthe * ఆకాశము స్వచ్ఛముగా వుండడము వల్ల, నిర్మలముగా వుండడమువల్ల. He lives in an * of learning విద్వగోష్ఠిలో వున్నాడు. they live in an * ofignorance and vice వాండ్లు అజ్ఞానగ్రస్తులై వున్నారు, వాండ్లను అజ్ఞానమున్ను,దుర్మార్గమున్ను చుట్టుకొన్నవి.
Atmospheric, Atmospherical adj వాయువు సంబంధమైన, భూగోళమునుఆవరించుకొని వుండే గాలి సంబంధమైన. * air సహజమైన ఘాలి.
Atom n s అణువు, రేణువు, నలుసు. he has not an * of food వాడికి రవంతైనాఆహారము లేదు. there is not an * of reason for this దీనికి యీషత్తైనా కారణములేదు. he broke it to atoms దాన్ని తుత్తుమురుగా చేసినాడు.
Atomic, Atomical adj అణుప్రాయమైన. * bodies పరమాణువులు.
Atonement n s ప్రాయశ్చిత్తము, పరిహారము, పాపనివృత్తి. he did me an injuryand as some * he obtained me this situation నన్ను గురించి ఒక అన్యాయమునుజరిగించి దానికి పరిహారముగా నాకు యీ వుద్యోగము ఇచ్చినాడు.
Atop adv పైన, మీద.
Atrocious adj అతిదుష్ట, అతిపాపిష్ఠి, మహాచెడ్డ.
Atrociously adv అతిదుష్టతనముగా, అతిపాపిష్ఠిగా. * wicked అతిపాపిష్ఠియైన.
Atrociousness n s అతిపాపిష్ఠితనము, అతిదుర్మార్గము.
Atrocity n s దుర్మార్గము.
Atrophy n s క్షయరోగము.
Attached adj అంటించిన, చేరిన. a kite with a tail * to it తోక గల ఒకఘాలిపటము. a paper attached to the wall గోడకు అంటించిన కాకితము. he ismuch * to you వాడికి నీ యందు నిండా విశ్వాసము. Five servants * to thisoffice యీ కచ్చరితో చేరిన అయిదుగురు నవుకర్లు. Some land * to this villageయీ వూరితో చేరిన కొంత నేల. all of them are * to his opinion అందరున్ను అతనిఅభిప్రాయమునే అనుసరించి వున్నారు.
Attachment n s fidelity, regard, స్నేహము, అనురాగము, విశ్వాసము. bywarrant జప్తి. * to a faith or creed మతాభిమానము. after the * o hisproperty వాడి సొత్తు జప్తి అయిన తరువాత.
Attack n s పైబడడము, పైబడికొట్టడము, దూరడము. the enemy made fourattacks upon the town ఆ పట్టణము మీద శత్రువులు నాలుగుమాట్లు వచ్చి పడ్డారు.I had an * of fever yesterday నిన్న నాకు జ్వరము తగిలింది.
Attacked adj పైబడ్డ, దూరిన, కనిపించిన. the corn was * by insects ఆపయిరుకు చీడ పట్టింది. he was * by fever వాడికి జ్వరము తగిలింది. the sugarwhich is * by ants చీమలు ముసురుకొన్న చక్కెర.
Attainable adj పొందతగ్గ, లభించతగ్గ. learning is * by application శ్రద్ధచేతవిద్య సాధ్యమయ్యేటిది.
Attainder n s రాజనిగ్రహము, రాజు చేసిన బహిష్కారము, వెలి. the kingreversed their * వెలివేసి యుండిన వాండ్లను రాజు మళ్ళీ చేర్చుకొన్నాడు.
Attained adj చేరిన, చెందిన, పొందిన, లభించిన, చెయికూడిన.
Attainment n s లభ్యమయ్యేటిది, ప్రాప్తమయ్యేటిది. that is easy of * అదిసులభముగా లభ్యమయ్యేటిది. difficult of * దుర్లభము, దుర్ఘటము. the * of ourwishes is prevented by this యిది మా యిష్ట సిద్ధికి అభ్యంతరమైనది. a man ofgreat attainments విద్వాంసుడు. his attainments are trifling వాడునేర్చుకొన్నది స్వల్పము. a man of classical attainments సాహిత్య సంపన్నుడు.
Attainted adj నేరము, మోపబడ్డ, దోషగ్రస్తుడైన, నిగ్రహింపబడ్డ, రాజుచేనిగ్రహింపబడ్డ.
Attempt n s యత్నము, ప్రయత్నము, they made an * upon his life వాణ్నిచంపవలెనని చూచినారు.
Attendance n s the act of waiting on or serving పరిచర్య, పూడిగము.there is not much to do but only regular * is requisite అక్కడచేయవలసినది నిండా యేమి లేదు అయితే క్రమముగా పోయి హాజరుగా వుండవలెను.the * at the feast was thin ఆ వుత్సవానికి వచ్చిన ప్రజ కొంచెము. they are in * హాజరుగా వున్నారు, కనిపెట్టుకొని వున్నారు. they are not in * వాండ్లు హాజరుగావుండలేదు. they gave * there అక్కడ హాజరైనారు. I danced * upon him for tendays పది దినములు అతని దగ్గెర వృధాగా తిరుగుతూ వుంటిని. medical * was givento the poor బీదలకు వైద్యము చేయబడ్డది. I procured the * of a doctor ఒకవైద్యుడు వచ్చి హాజరయ్యేటట్టు చేసినాను.
Attendant n s పరిచారకుడు, పనివాడు.
Attended (Shak, ', says ) " Enter the Queen, attended, " సపరివారముగారాణీ పాత్ర ప్రవేశము.
Attensted adj చేవ్రాలుగల, సాక్షి చేవ్రాలుగల. a bond * by three winessesముగ్గురి సాక్షి చేవ్రాలుగల పత్రము. an * copy of this paper యీ దస్తావేజుకుఅధికారి చేవ్రాలుగల నకలు. the truth of this has been * by thousands దీని యొక్కవాస్తవ్యమును లక్షమంది పలికివున్నారు.
Attention n s ధాన్యము, లక్ష్యము, గమనము. her beauty attracted his entire* వాడి మనసంతా దాని అందము మీద పోయినది. Every thing attracts the * of achild బిడ్డల యొక్క మనసు అన్నిటి మీద పారుతుంది, బిడ్డలకు అంతా చోద్యమే. hereads with * అక్కరగా చదువుతాడు. he diverted or distracted their * వాండ్లుపరాకు పడేటట్టు చేసినాడు. he fixed his * on this వాడి మనసును దానిమీదవుంచినాడు. he did this to disturb or divert my attention నా మనసుకుకలత బుట్టేటట్టు దీన్ని చేసినాడు. he read the letter with * ఆ జాబును తదేకధ్యానముగా చదివినాడు. he paid or shewed much * to me నన్ను నిండాసన్మానించినాడు. Lend me your * రవంత దయచేసి వినండి. the attentions whichhe paid her ఆపెకు అతను చేసిన మర్యాదలు. they paid no * to my orders నావుత్తరవును లక్ష్య పెట్టలేదు.
Attentive adj జాగ్రతగల. Be * జాగ్రతగావుండు. పరాకులేక వుండు.
Attentively adv జాగ్రతగా, ఎచ్చరికగా, పరాకు లేక.
Attenuated n s సన్నము, కావడము.
Attestation n s ప్రమాణము, సాక్ష్యము.
Attic adj (Belonging to Attica) అట్టి కాదేశ సంబంధమైన, ఉత్కృష్టమైన,శ్రేష్ఠమైన. * elegance అతి శృంగారము. * ease అతిసౌఖ్యము. the attics of ahouse నాలుగు అయిదు అంతస్తులు గల మిద్దె యింటి కొనను వుండే చిన్న గది.
Attire n s ఉడుపు, వేషము. Royal ఒ రాజవేషము.
Attired adj అలంకరింపబడ్డ, తొడుక్కొన్న.
Attitude n s వైఖరి, తీరు. he painted her in a sitting * దాన్ని కూర్చున్నవైఖరిగా వ్రాసినాడు. while affairs were in this * వ్యవహారము యీ రీతిని వుండగా
Attorney n s వకీలు, లాయరు, గుమాస్తా, వ్యవహారము చూచేవాడు. * generalగవనరు మంటు వకీలు. a village * గ్రామకరణము. a power of * అధికార పత్రిక.
Attraction n s ఆకర్షణము. the power of alluring మనోహరత. this poem hasmany attractions for the native reader, but none for the English criticయీ కావ్యము యీ దేశస్థులకు మనోహరమైనది గాని యింగ్లిషు వాండ్లకు రమ్యము కాదు.యిష్టము కాదు. Personal attractions సౌందర్యము. attraction of gravitationభూగోళాకర్ణణ శక్తి.
Attractive adj ఆకర్షించే, మనోహరమైన.
Attractiveness n s మనోహరత్వము.
Attributable adj ఆరోపించతగ్గ. this fever is * to your eating fruit నీవుపండ్లు తిన్నందున జ్వరము వచ్చినది, నీవు పండ్లు తిన్ణది యీ జ్వరానికి కారణము. thisdelay is not * to him యీ ఆలస్యము వాడివల్ల వచ్చినది కాదు.
Attribute n s ధర్మము, లక్షణము, గుణము, విశేషణము. the divine attributesఈశ్వరమహిమలు. the divine attributes are mercy, justice, power, wisdom,eternity, &c. కరుణ, నీతి, శక్తి, జ్ఞానము, నిత్యత్వము మొదలైనవి దేవుని యందు వుండేగుణములు.
Attributed adj ఆరోపించపడ్డ. this poem is * to him యీ కావ్యము అతనుచెప్పినదంటారు. this error is attributed to haste యీ తప్పు అవసరము చేతకలిగిన దంటారు. this quarrel is * to him యీ కలహము వాడివల్ల పుట్టినదంటారు.
Attribution n s స్తుతి, స్తోత్రము, మెప్పు, కొనియాడడము.
Attrition n s వొరియడము, రాపిడి. this fire was produced by * యీ నిప్పుమథించుట చేత పుట్టినది. grieving for sin పశ్చాత్తాపము.
Auburn adj పల్లవర్ణమైన. * hair పల్ల వెంట్రుకలు.
Auction n s ఏలము.
Auctioneer n s ఏలము వేసేవాడు.
Audacious adj సిగ్గుమాలిన, గండా గుండియైన, సాహసము గల, నిర్భయమైన.
Audacity n s సిగ్గుమాలిన తనము, గండాగుండితనము, సాహసము, నిర్భయము.
Audible adj వినదగ్గ, వినే. their steps were not * వాండ్ల అడుగుల చప్పుడువినబడలేదు.
Audibly adv వినేటట్టుగా.
Audience n s వినడము, ఆలకించడము. or visit దర్శనము. the governor gavehim an * గవనరు అతనికి దర్శన మిచ్చినాడు. or hearers వినేవాండ్లు. he spoke fora long time and his * were pleased వాడు బహు సేపు మాటాడినాడువిన్నవాండ్లు నిండా సంతోషించిరి. To day the * at church was thin యీ వేళగుడిలో జనము మట్టు. the hall of audience or
audience chamber కొలువుకూటము.
Audit n s లెక్క విమర్శ, లెక్కను తనఖి చేయడము.
Auditor n s or hearer వినేవాడు. or examiner of accounts లెక్కలనువిమర్శన చేసే అధికారి.
Auditory adj శ్రవణేంద్రియ సంబంధమైన. the * nerves శ్రవణేంద్రియ సంబంధమైననరములు.
Auditress n s వినే స్త్రీ.
Augar n s శకున ఫలము చెప్పేవాడు.
Auger, or Augre n s. బరమా, తొరపణము, పిడిసాన. * hole బెజ్జము, రంధ్రము.
Aught n s or pron, any thing యేదైనా, యేమైనా. Did he say * వాడు యేమైనాచెప్పినాడా. For * I know he is dead * ఒకవేళ చచ్చినాడేమో. For * I knowthose men are brothers వాండ్లు ఒక వేళ అన్నదమ్ములేమో. he may burn hishouse donw for * I care వాడు యింటిని కాల్చివేస్తే కాల్చివేయనీ నాకేమి.
Augmentasion n s వృద్ధి, అభివృద్ధి, అధికరించడము.
Augmented adj వృద్ధియైన, అభివృద్ధియైన, హెచ్చిన.
Augury n s శకునము, శకునశాస్త్రము.
August adj noble మహనియ్యమైన, అతిఘనమైన. the queen andher * motherరాణిగారున్ను మాతృశ్రీగారైన ఆమె తల్లిగారున్ను.
Augustus n s కవులను నిండా సన్నానించిన ఒక రాజు పేరు. Augustan age ఆరాజు యొక్క కాలము అతని హయాము.
Aulic adj సభా సంభంధమైన.
Aunt n s తలిదండ్రుల తోడబుట్టిన ఆడవాండ్లు అనగా మేనత్త, పినతల్లి.
Aurella n s పురుగు గూడు.
Auricle n s of the heart చెవి, అనగా హృదయములో రక్తము పోవడమునకురావడమునకుగాను వుండే ద్వారము.
Auricula n s దివ్వమైన ఒక పుష్ప విశేషము.
Auricular adj చెవిలో చెప్పిన, రహస్యమైన.
Auriferous adj స్వర్నోత్పాదకమైన.
Aurora n s ప్రాతఃకాల దేవత.
AuroraBorealis n s ఆకాశములో వుత్తర పార్శ్వమున రాత్రిలోఅగుబడే ఒక జ్యోతి.
Auspices n s శకునము. or patronage ప్రోద్బలము, కరుణ, కటాక్షము.favourable * in a fever జ్వరములో సుగుణ చిహ్నములు.
Auspicious adj శుభమైన, మంగళమైన, శ్రేయస్కరమైన, అనుకూలమైన. In an *hour సుముహూర్తమందు. on the * day ఆశుభదినమందు.
Auspiciously adv శుభముగా, మంగళముగా, శ్రేయస్కరముగా, అనుకూలముగా.
Austere adj కఠినమైన, క్రూరమైన, మొండియైన, గడుసైన. * behaviour క్రూర నడక.* man క్రూరుడు, కఠినుడు. * rebuff క్రూరమైన చీవాట్లు.
Austerely adv కఠినముగా, క్రూరముగా.
Austereness n s కఠినత్వము, క్రౌర్యము.
Austerity n s కాఠిన్యము, క్రౌర్యము, ఖండితము. religious * తపస్సు.
Austral adj దక్షిణ దిక్కు సంబంధమైన.
Australia n s దక్షిణ సముద్రమందు వుండే ఒక దేశము.
Authentic adj నిజమైన, యధార్థమైన, ప్రమాణసిద్దమైన.
Authentically adv నిశ్చయముగా, యధార్థముగా, ప్రమాణసిద్ధముగా.
Authenticated adj ప్రమాణసిద్ధమైన, ప్రామాణికమైన, నిశ్చయమైన, రూఢమైన.
Authentication n s నిజముకావడము. after the * of this bond యీ పత్రముప్రమాణికమైనదని సిద్దమైన తరువాత.
Authenticity n s ప్రమాణికత, యధార్థ్యము, నిజము.
Author n s కారకుడు, కర్త. who is the * of this book యీ గ్రంధకర్త యెవడు,యీ గ్రంధము చెప్పినవాడెవడు. he is the * of this mischief యీ దుర్మార్గమునకువాడే కారకుడు. he was the * of this quarrel యీ జగడానకు కారణమువాడు,మూలము వాడు.
Authoress n s కారకురాలు, కర్తయైన స్త్రీ. See Author.
Authoritative adj ప్రామాణికమైన, అధికారముగల.



English to Telugu Dictionary

No comments:

Post a Comment