మా సార్ నిద్రపోయాడు

తండ్రి- స్కూల్ నుండి ఇంత లేటుగా వచ్చావేం.
కొడుకు- మా సార్ నిద్రపోయాడు.
తండ్రి- మరి సార్ నిద్రపోతే నీకెందుకాలస్యమైంది
కొడుకు - ఆయన నిద్రలేచాక నన్ను లేపాడు.

*************
- నీకూ నాకూ గొడవెందుకు నాకివ్వాల్సిన డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా.
- నేననేదీ అదే డబ్బులు లేవు. నువ్వెళ్ళు.
*****


సార్- సుభ్బారావు బాకీ వసూలుకని ఫీల్డ్ వర్క్ కి వెళ్ళి సినిమాకి వెళ్ళావట. నీమీద యాక్షన్ తీసుకోబోతున్నా.
సారీ సార్ సుబ్బారావ్ కూడా సినిమాకి వెళ్ళాడని తెలిసి అతన్ని కలవడానికే సినిమాకి వెళ్ళాను.
మరి దొరికాడా.
లేదు సార్. చీకట్లో కనపడలేదు.
***********
తెలుగు జోక్స్, హాస్యం

No comments:

Post a Comment