Cab English to Telugu free online dictionary

Cab n s i. e. Cabriolet ఒక తరహా వొంటి గుర్రపుబండి, or measure శేరెడు, యిది యింగ్లిషు శబ్దము కాదు, బైబులులో మాత్రము ప్రయోగించబడి వున్నది.
Cabal n s బందుకట్టు, కుట్ర, దురాలోచన. they joined in one * వాండ్లందరున్ను ఒక చెయ్యిగా వుండిరి.
Cabala n s or Cabalas. the Jewish secret art యహూది వండ్లలో పరంపరాగత ఇతిహాస సముచ్చయము, పరంపరగావచ్చే గుప్ప్తమైన ఐతిహ్యము.a
Cabalist n s యహూది వండ్ల యొక్క గుప్తవిద్య తెలిసిన పండితుడు,గుప్తమైన ఐతిహ్యములు తెలిసిన పండితుడు.
Cabalistic adj గుప్త, గుప్తమైన, గూడార్థముగల, అతిమర్మమైన.
Cabalistical adj గుప్త, గుప్తమైన, గూడార్థముగల, అతిమర్మమైన.
Cabbage n s కోసుకూర.
Cabin n s a set of drawers బీరువ, అల్మారా. or chamber శృంగారమంటపము. * council రాజు యొక్క అంతరంగసభ, the * మంత్రులు, అంతరంగులు.a * minister అంతరంగుడైన మంత్రి. * edition of a book చిన్న పుస్తకము. * maker ముచ్చటైన వడ్ల పని చేసే వాడు.
Cable n s అమారు, లంగరుతాడు, మోకు, మనిషి తొడ లావంతతాడు. achain * లంగరుతాటికి బదులుగా లంగరుకు వేసే యినుపగొలుసు. a leather * వారిణి One cable's length అనగా 300 అడుగులు.
Caboose n s (a fire palce, a stove) కుంపటి. a cook room వంటయిల్లు, కుశిని.
Cabriolet n s ఒక తరహా వొంటిగుర్రపుబండి.
Cachew n s or Cushoo-nut, ముంతమామిడి, జీడి మామిడి. the kernals of the cushoo-nut ముంత మామిడిపప్పు.
Cachexiae n s సన్నిపాతము, కాకిసోమాల.
Cackle n s కూత, అరవడము.
Cacodemon n s దుష్ట భూతము, ప్రేతము, పిశాచము, దయ్యము.
Cacophony n s వ్యంగ్యమైన ధ్వని, అపశబ్దము, అపస్వరము.
Cactus Indicus n s ముండ్లజముడు.
Cactus, Indicus the prickly pear&c, నాగతాళి పొద.
Cadaverous adj పీనుగ ముఖముపడ్డ, నెత్తురు చచ్చిన, పాశిన, పీనుగకంపుకొట్టే.
Caddy n s శృంగారమైన తేయాకు పెట్టె.
Cadence n s స్వరము యొక్క మూర్ఛ, అవరోహణము. or tone స్వరము,శయ్య, the * of this poem is very soft యీ కావ్యము యొక్క శయ్యనిండా మృదువుగా వున్నది.
Cadet n s దండు వుద్యోగములో ప్రవేశించిన దొరకొడుకు, ప్రెంచిభాషలో తమ్ముడు అనే అర్థము, యీ యర్థము యింగ్లిషులో చెల్లదు.
Cadger n s నాటు పురములో నుంచి కోళ్లు మొదలైనవి తెచ్చి అమ్మే కామాటివాడు.
Cadi n. s. (meant for Kazi.) కాజీ, తురకన్యాయాధిపతి
Cadijan n s (add,) (Kadjang is Javanes for a mat.)
Cadjan n s (Indian word for palm-leaf) తాటాకు. Anderson's Tamil grammer says this word is probably of Portuguese origin.
Caduceus n s పాశము. Mercury's wand or snaky staff దేవదూత యొక్క సర్పయుక్తమైన దండ విశేషము.
Caftan n s తురకలు వేసుకొనే ఒక తరహా శెల్లా.
Cag n s నాలుగైదు గాలములు పట్టే చిన్న పీపాయి.
Cage n s పంజరము. for beasts బోను. they caught the tiger in a trap and kept him in a * ఆ పులిని బోనులో పట్టి మరి ఒక బోనులో పెట్టి సాకినారు.
Caiacca n s a fruit కలివె కాయ, కలివె పండు.
Caison n s తుపాకి మందుతోనున్ను గుండుతోనున్ను నిండి వుండే పెట్టె.
Caitiff n s దొంగ, దొంగగొడ్డు, హరం జాద, దౌర్భాగ్యుడు. where is the fox? have you found the * నక్క యెక్కడ, ఆ దొంగ గొడ్డు చిక్కినదా.
Cajolery n s వంచన, మోసము, బుజ్జగింపు.
Cake n s ఫలహారము, పిండివంట, అపూపము, మిఠాయి. a * of wax మయినపు అడ. a * of copper రాగిబిళ్ల. a * of tamarind చింత పండు అడ. a * of colour వర్ణపు బిళ్ల, వర్ణపు ఖడ్డి. oil * or linsed oil * గానుగ పిండి. the residue of the seed of the Bassia longifolia యివ్పపిండి. a * of cow dung పిడక. the blood formed a * over the wound ఆ పుంటి మీద నెత్తురు గెడ్డ కట్టుకొన్నది, పక్కు కట్టుకొన్నది. or fool వెర్రి ముఖము.
Calabash n s టెంకాయ చిప్ప, దొన్నె. or gourd సొరకాయ బుర్ర.
Calacareous adj నిగురయ్యే, భస్మమయ్యే సున్నమయ్యే. * particles నిగురు, భస్సమము.
Calamanco n s ఒక తరహా కంబళి.
Calamine n s తుత్తు నాగము వంటి ఒక లోహము, మయిల్తుత్తము. See Ainslie Vol. I. p. 576.
Calamitous adj దౌర్భాగ్యమైన, దుఃఖకరమైన, ఆపదైన.
Calamity n s ఆపద, అపాయము, దౌర్భాగ్యము, యిడుము, గండము.
Calamus n s sweet flag వస.
Calash n s ఒక తరహా చిన్న బండి.
Calathus n s కలశము, దొన్నె.
Calcedony n s యెర్రని స్ఫటికము.
Calcination n s భస్మము కావడము, సున్నము కావడము, నిగురు కావడము. by * the stone became lime రాయి కాలి నిగురై సున్నమౌతున్నది.
Calculation n s లెక్క, యెన్నిక. or estimation మతింపు, యెన్నిక, వుద్దేశము.
Calculator n s యెంచేవాడు. he is an expert * వాడు బాగా తీరిన గణికుడు.
Calculous adj రాళ సంబంధమైన. * secretions సంభవించిన రాయి, అనగా మూత్ర ద్వారములో అడుచుకొనే రాయి.
Calculus n s the disease మూత్రకృఛ్ర రాయి. in mathematic మహా గణితములో వచ్చే ఒక పదము.
Caldera n s (Pandanus Odoratissimus, a very common plant) కేతకి, మొగిలి చెట్టు. of which the female is గొజ్జంగి.
Caldron n s నీళ్లు కాచే బాన, కాగు, కొప్పెర, కడాయి, అండా.
Caledonia n s Scotland అనే దేశమునకు కావ్య నామము.
Caledonian n s A Scotchman, స్కాటులండు దేశస్థుడు.
Calender 0n s. 0పంచాంగము. 0a 0list of criminals ఖైదీల పట్టీ. or mercer పట్టు అమ్మే వర్తకుడు. or Fakeer బైరాగి.
Calends n s రోమన్ దేశస్థులలో ప్రతి మాసము యొక్క మొదటి తేది.
Calenture n s ఓక తరహా జ్వరము.
Calf n s దూడ, ఆవు దూడ, గిత్త. a bull * కోడె దూడ. a buffalo * యెనప దూడ. a cow in * చూటి ఆవు. a book bound in * దూడ తోలుతో జిల్దు కట్టిన కాకిత పుస్తకము. a block head జడుడు తెలివి మాలిన వాడు. * of the leg పిక్క, జంఘ.
Caliber, Calibre n s. కొల్త, ప్రమాణము, అధికారము. of a cannon ఫిరంగి నోటి కొలత, of superior * ఘనమైన. a man of superior * అంశ పురుషుడు, మహా పురుషుడు. a man of that * ఆ పాటి మనిషి అంతటి వాడు.
Calico n s చీటి గుడ్డ.
Calif, Caliph n s. ఖలీఫ, తురకలలో సేనాధి పతి.
Caligraphy n s ముక్తాఫలము వంటి అక్షరము, సొగుసైన వ్రాలు.
Calipers, or Callipers n s. పిరంగి నోరు కొలిచే కుంబాసు.
Call n s పిలుపు. I heard his calls వాడు కేకలు వేసి పిలవడము విన్నాను. or occasion అక్కర. you had no * to do this దీన్ని చేయడమునకు నీకు యేమి పట్టినది. or visit దర్శనమునకు పోవడము. he passed his morning in calls వాడికి తెల్లవారి అంతా దర్శనమునకు పోవడముతో సరిపోయినది. he came at a * పిలవగానే వచ్చినాడు. I made a * upon him for the money ఆ రూకలను యిమ్మని వాణ్ని తగాదా చేసినాను. these two birds have different calls యీ పక్షి కూత వేరు, ఆ పక్షి కూత వేరు. he went to obey a * of nature : or he went to the necessary మల బాధకు పోయినాడు.
Callat n s వేశ్య, లంజ.
Called adj పిలిచిన, పిలవబడ్డ.
Callender n s See Callendar.
Calligraphy n s అందమైన వ్రాలు, ముక్తాఫలము వంటి అక్షరములు.
Calling n s పిలవడము. or employment వుద్యోగము, వృత్తి, పని.
Callipash, and Callipee n s. తాబేలు మాంసముతో చేసిన ఆహారములు.
Callipers n s వక తరహా కుంబాసు.
Callipigis, Calipygis నితంబినినితంబవతి
Callosity n s కాయ, కిణము, నొప్పి లేకుండా గడ్డగా కట్టుకొని వుండే మాంసము.
Callow adj లేత, అనగా రెక్కలు మొలవని, కూనఅయిన.
Calluous adj కాయకాచిన, కొరడుబారిన. he is quite * వాడికి యెంత చెప్పినా సోకలేదు. they are quite * to all moral feeling వాండ్లు నిర్దయాత్మకులై వున్నారు.
Calluousness n s కాయ AkAyadamu, AniSciMwaBAvamu, moVMdiwanamu,మొద్దుతనము. from the * of the skin తోలుకాయ కాచినందున.
Callus n s కాయ, కిణము, తోలుమీద కాచిన కాయ, నొప్పి లేక గడ్డగా కట్టుకొన్న మాంసము.
Calm adj still గాలి లేని. quiet శాంతమైన, నెమ్మది అయిన. It is very * to day నేడు గాలి లేకుండా వున్నది. Then the sea was * సముద్రము అలలు లేక నిశ్శబ్దముగా వుండెను, when it grew * గాలి అణిగినప్పుడు.
Calmly adj serenely గాలి లేకుండా. quietly నెమ్మదిగా, నిమ్మళముగా,శాంతముగా.
Calmness n s గాలిలేమి. or quiet నెమ్మది, నిమ్మశము, శాంతము, దమనము. he received the news of their death with * వాండ్లు చచ్చినారని విని వూరికె తొనకకుండా వుండినాడు.
Calmnrate v a దూరుపెట్టుట, అపవాదపరచుట, నిందబెట్టుట.
Calomel n s The native preparations of mercury are all different from calomel One of them is రసభస్మము.
Caloric n s A term expressing heat ఉష్ణము, తాపమునకు మూల కారణము, అగ్ని పరమాణువు.
Calorific adj ఉష్ణకారకమైన, కాకను కలగజేసే.
Caltrops n s పల్లేరు ముండ్లు, పల్లేరు ముండ్ల వలె చేసిన వక తరహా ఆయుధము.
Calumniator n s దూషించేవాడు, దూరు పెట్టేవాడు.
Calumnious adj అపదూరైన, అపవాదమైన.
Calumniously adv అపదూగా, అపవాదముగా.
Calumny n s అపవాదము, దూషణ, చాడి, కొండెము, నిందె. this is a mere * వూరికె వకడి మీద దూషణగా కట్టి విడిచిన మాటలు.
Calvary n s ఖ్రిస్తును చంపిన కొండ.
Calve v n ఈనుట, దూడ వేసుట. it was calved there ఆ దూడ అక్కడ పుట్టినది. the elephant calved యేనుగు పిల్ల వేసినది. a buffalo that has calved యీనిన యెనుము. a cow about to * యీన మోపుదలగా వుండే ఆవు.
Calvin n s ఖ్రిస్తుమతములో వక గురువు పేరు. Calvinism అతని యొక్క మతము పేరు. Calvinist అతని మతస్తుడు. అతని మతమును అవలంబించిన వాడు.
Calx n s భస్మము, సున్నము.
Calyx n s గిన్నె, ప్రమిద, అనగా ప్రమిదవలె వుండే పుష్ప గర్భము.
Cambric n s వకతరహా నాణ్యమైన సన్న బట్ట, దీన్ని కేంరేకు అంటారు.
Came past tense of the verb come','వచ్చిన, See To Come.
Camel n s వొంటె, లొటిపిట.
Cameleon, Camelion n s. వూసరవెల్లి, తొండ, కృకలాసము, యీ జంతువుకుగడియకు ఒక వర్ణము కలుగుతున్నది గనక. he is as changeable as the * వాడికి గడియకు వక గుణము, వాడి మాట నిలకడ లేదు, అని అంటారు.
Camelopand n s పులిలొటిపిట అనే వక జంతువు, యిది యీ దేశములో లేదు.
Camel's gall a drug,పావుదారఅనేఒకమమదుదినుసు
Cameo n s ముద్ర ఆకారమైన రాతి బిళ్లలో మలిచిన, లేక పోగరపనివలె అచ్చులో కొట్టిన రూపు.
Camera n s A chamber గది, యిల్లు.
Camera obscura n s చీకటి యింటిలో బయటి వస్తువులు తల్లకిందులుగాప్రతి ఫలించడము, దృష్టి విద్యా సంబంధమైన యంత్ర విశేషము, అనగా పెద్ద గవ్వ, లేక, తాబేలు ఆకారముగా వక గాజు వున్నది, దాని మీద సూర్య కిరణములు ప్రసరించినప్పుడు దాని యెదట వుండే అన్ని వస్తువులన్ను తలకిందుగా దాణియెదుట ప్రతిఫలిస్తున్నవి.
Camlet n s మేక బొచ్చున్ను పట్టున్ను కలిపివేసిన వక తరహా గుడ్డ.
Camomile n s చేమంతి, చామంతి పువ్వు, చామంతి పువ్వువంటిది అనవచ్చును.
Camp n s దండుదిగిన స్థలము, శిబిరము. they went out to battle and returned to * యుద్ధమునకు పోయి మళ్లీ శిబిరమునకు వచ్చి చేరిరి. we left our * at sun set అస్తమాన వేళ దండు దిగివుండే స్థలములో నుంచి బయలు దేరినాము. the soldiers pitched their * near the tank గుంట దగ్గెర దండు దిగినది, మొకాము చేసినది.
Campaign n s a large plain బ్రహ్మాండమైన బయిలు మైదానము. season of war దండు బైలుదేరి యుద్ధము మీద వుండే మాసములు, దండ యాత్ర, దాడి I served three campaigns with him అతనితో కూడా మూడు మాట్లు దండుకుపోతిని.
Campaigner n s దండయాత్ర చేసేవాడు. an old * అనేక దండయాత్రలు చేసినవాడు.
Camphire n s కర్పూరము.
Camphorate n s and adj. కర్పూరియ్యము, కర్పూయుక్తము.
Can aux v. గల. you * do so or you may do so నీవు చేయగలవు, నీవు చేస్తే చేయవచ్చును. how * he pay this ? వాడు దీన్ని యెట్లా చెల్లించగలడు. whom * I trust but thee? నిన్ను తప్ప నేను యెవరిని నమ్మగలను. * they come * వాండ్లు రాగలరా. I will do what I * నా చేతనయ్యే పని చేస్తున్నాను. as much as they * వారి చేత అయినంతమట్టుకు వారి శక్త్యానుసారము. * to assist him నీ చేత అయినమట్టుకు వానికి సహాయము చెయ్యి. I cannot do it దాన్ని చెయ్యలేను. as I could not do it దాన్ని చేయలేకపోతిని గనక. then he cannot be her brother అయితే వాడు దాని అన్నగా వుండనేరడు. cannot you swim ? యీదనేరవా, యీద లేవా, యీద చేతకాదా. cannot you pay the money రూకలను చెల్లించలేవా.
Canaille n s నీచులు, క్షుద్రులు, క్షుద్రమూక.
Canal n s పెద్ద కాలవ, తవ్విన యేరు, కోడు.
Canary n s యిది వక ద్వీపము యొక్క పేరు, గనుక ఆ దేశపు సారాయికి Canary అనే ఆ దేశపు పేరే వచ్చినది. Canary bird బంగారు వర్ణముగా వుండే మధుర స్వరముగల వక పక్షి.
Cancel n s కొట్టివేయడము, రద్దు చేయడము.
Cancer n s in the Zodiac కటకరాసి. a disease పుట్ట, కొరకు, పుండు. he has a * in his cheek వాడికి దవడ మీద పుట్ట బెట్టింది,పుట్టవలె కురుపు లేచింది.
Cancerous adj కొరుకు సంబంధమైన, పుట్ట సంబంధమైన.
Candent adj ధావళ్యమైన,ప్రకాశమానమైన
Candid adj నిష్కపటమైన, నిష్కళంకమైన, స్వచ్చమైన. this is my * opinion యిది నా స్పష్టమైన అభీప్రాయము, తిరుగుళ్లు లేక నేను చెప్పే మాట యిది. a * disposition సద్భావము. a man of * disposition సత్యసంధుడు.
Candidate n s వుమేదువారు, వుద్యోగము కోరేవాడు, అపేక్షించేవాడు. he was a * for the employment ఆ వుద్యోగమును కోరే వాండ్లలో వీడు ఒకడుగా వుండెను. those who are candidates for heaven ముక్తిని ఆపేక్షించేవాండ్లు.
Candidly adv నిష్కపటముగా నిష్కళంకముగా, దాచకుండా. I * confess that I disapprove your conduct altogether నేను దాచకుండా చెప్పుతున్నాను, నీ నడక యెంత మాత్రమున్ను మంచిది కాదు.
Candied adj నీళ్లుతగలకుండాపంచదారతోపక్వముచేసిన, * sugar కలకండ.
Candle n s వత్తి, అనగా. a wax * మైనపు వత్తి. a tallow * కొవ్వుతో చేసిన వత్తి. they were not fit to hold a * to him వాడి యోగ్యతను చూస్తే వాడికి మషాల్ పట్టడానకు కూడా వీండ్లు యోగ్యులు కారు.
Candle light n s దీపపు వెలుగు.
Candle stick n s దీపస్తంభము, దీపపుశెమ్మె, మైనపు వత్తి వుంచేదిమ్మ.
Candlemass n s రోమన్ కేతోలిక్ వాండ్లులో వక పండుగ పేరు, యిది పిబ్రవరి నెల రెండో తారీఖున వస్తున్నది.
Candour v s సరళత, నిష్కాపట్యము. he had the * to confess he was wrong తాను తప్పినట్టు సరసంగా వొప్పుకొన్నాడు.
Cane n s బెత్తము, పేము. a * bottomed chair బెత్తము అల్లిన కురిచితో. the bamboo * వెదురు. sugar * చెరుకు. a walking staff వొతకర్ర.
Canibal n s నరమాంసమును తినేవాడు.
Canibalism n s నరమాంస భక్షణము.
Canine adj కుక్క సంబంధమైన. the * species or race కుక్కలు. his * guide అతనికి దారి చూపే కుక్క. the * teeth కోరలు.
Canister n s డబ్బి, ముఖ్యముగా సీసముతో చేసిన వక తరహా పెట్టె యిందులో తేయాకు, చక్కెర, తుపాకి మందు మొదలైన వాటిని వుంచుతారు. Canister shot సన్న గుండ్లను పెట్టెలో వేశి కాల్చే వేటు, దీన్ని గ్రేప్ షాట్ అని అంటారు.
Canker n s an eating sore తిని వేసి పొయ్యే పుండు, కొరుకుడు, కుళ్లు. there was a * in the fruit ఆ పండు కొంచెము కుళ్లి వుండినది. grief is a * of the heart వ్యాకులము మనసును చెరిపి వేస్తున్నది.
Cannibal n s నరమాంస భక్షకుడు, నరమాంసమును తినేవాడు, వక తరహా చెంచువాండ్లు fish are cannibals పెద్ద చేపలు చిన్న చేపలను భక్షింస్తవి, అబలస్వకు లాశినోఝషాః, స్వకుల ఖాదినో మత్స్యాః.
Cannibalism n s నరమాంస భక్షణము.
Cannon n s పిరంగి. Cannon ball or Cannon shot పిరంగి గుండు.
Cannot v a చేయచాలను, చేయలేను, చేయవల్లకాదు, మొదలైనవి. I * do it చేయలేను, అది నా వల్ల కాదు. I * do this యిది నాకు వశము కాదు. He * be dead చచ్చి వుండడు. they * be brothers వాండ్లు అన్నతమ్ములు కావడము శక్యము కాదు.
Canoe n s దోనె, యీతకాయ. a single * మువ్వ దోనె a double * సంగడి. vulgarly a Sangaree boat.
Canon n s సూత్రము, వాక్యము, గురు సిద్ధాంతము, మరిన్ని గురువు, ఆచారి. the holy * అనగా బైబిల్. " Canon Law is nothing; never having had any parliamentary ratification This " Judge Blackstone has publiclydeclared." (See Rawland Hill's letter to David Simpson, in his lie, prefixed to his Plea for Religion.)
Canonically adv శాస్త్రీయతః, శాస్త్ర ప్రకారము.
Canonicals n s పూజా సమయమందు ఆచారి తొడుక్కొనే వేషము.
Canonization n s వకడు చచ్చిన బదినములకు అంశపురుషుడని కనుక్కొని తదారభ్య వాణ్ని దేవుణ్నిగా పూజించవలె నని, నిర్ణయించటము,యిది రోమన్ కాథొలికు మతస్థుల సంప్రదాయము.
Canonized adj దైవాంశము పొందిన. To canonize అనే మాట చూచుకో. A * saint సిద్ధ పురుషుడు. అంశ పురుషుడు, సిద్ధ స్త్రీ, దేవతలు అయినట్టు ప్రసిద్ధమైన పురుషులున్ను స్త్రీలున్ను, యిది రోమన్ కేతోలిక్ మతములో కద్దు. Protestant మతములో లేదు. Hoosen and Hooseyn are canonized by the Musulmans తురకలు వీరిద్దరిని దేవాంశమును పొందినట్టు అనుకొంటారు. Sankarachari is canonized by the Bramins బ్రాహ్మణులు శంకరాచార్యలను దేవత్వమును పొందినట్టు భావిస్తారు.
Canonship n s యిది వక తరహా మాన్యము.
Canopied adj కురాళము కట్టిన. * with boughs శాఖాఛాదితమైన, కొమ్మల చేత కప్పబడ్డ.
Canopus n s అగస్త్య నక్షత్రము. (Warren).
Canopy n s కురాళము, పందిలి, వితానము. in the * of heaven ఆకాశమునుఆవరించుకొని యుండే పొగ.
Canouical adj శాస్త్రనుజాయి, ధర్మ శాస్త్ర ప్రకారము, సిద్ధమైన, సౌత్ర. (as apposed to తాంత్రిక apocryphal) ధార్మిక, ఆషన్, శాస్త్ర సిద్ధమైన. In * hours అమృత ముహూర్తము నందు.
Cant n s పరిభాష, పిత్తలాటకము, సాంకేతిక శబ్దము, ముచ్చట, సుద్దులు, అనగా యిల్లు అనడమునకు తిరుమాలిఘ అనడము. this is Vaishnava * రూపాయి అనడమునకు బదులుగా బటువు అనడము. this is shopkeeper's * యిది కోమటి వాండ్ల యొక్క భాష. The yoga sastram is mere * యోగ శాస్త్ర మంతా వట్టి సుద్దులు. Or * whinning pretension to goodness " (Johnson) మారీచము, యేమంటే తన దగ్గెర భక్తి లేనిదై భక్తి వున్నట్టు కట్టే వేషము. In his Dictionary Johnson calls these words "mere cant" Laudanum, Fascines, Nervour, Fib, and the verb to Virgin. In the Preface to his Hymns, Wesley (Works, Vol. XIV. p. 353.) says, "Here the reader will find no cant expressions. " (Ains worth explains it, Sermonis fictitii usurpatio.)
Cantata n s గీత విశేషము, గంభీరగానము.
Canteen n s దండులో సారాయి, ఆహారము మొదలైనవి అమ్మే అంగడి. or largebox భోషాణము. or vessel వక పెద్ద చెంబు.
Canter n s అశ్వగమనములో వక భేదము.
Cantharides n s కుమారియ్య మక్షిక, వక జాతి జోరీగ, దీన్ని చూర్ణము చేసిచిత్రమూలమువలె వొళ్లు పొక్కడమునకు పట్టిస్తున్నారు.
Canticle n s పాట, గీతము, కీర్తన. రాగము.
Canto n s ఆశ్వాసము, కాండ.
Canton n s తాలూకా, పరగణా, ఖండము.
Cantoned adj గారీస్నగా వుంచిన.
Cantonment n s దండువాండ్లు దిగిన యిండ్లు. శిబిరము, గారీస్నగా చేసిన స్థలము, శిపాయిల కొరకు కట్టిన యిండ్లు.
Canvas, orCanvass n s. కిత్తాను, కితనార, దీనితో వాడ చాపలున్ను డేరలున్ను చేస్తారు. the troops were under * వాడ చాప కట్టి పోతూ వుండెను, మరిన్ని యీకిత నార గుడ్డ మీద పటములు వ్రాస్తున్నారు గనుక. the glowing * అంటే దివ్యమైన ప్రతిమ. Or soliciting వక కార్యము కొరకు సమ్మతిని ప్రార్థించుట, అనగా his * occupied four days నాలుగు రోజులు మనుషుల దగ్గెర మనవి చేస్తూ వుండినాడు.
Cany adj (consisting of canes)పేములమయముగావుండే, a spotపేములు బలిసిన స్థలము.
Canzonet n s వక తరహా పదము.
Caout-chove n s రబ్బరు, దీన్ని వక చెట్టు పాలుతో చేస్తారు.
Cap n s కుళ్లాయి, టోపి. or ferrule పొన్ను or cover మూత. * of the knee మోకాలి చిప్ప. you see that the * fits you గుమ్మడి కాయల దొంగ అంటె భుజములు పట్టి చూచుకొన్నట్టు నేను అన్న మాటకు వాడికి రోషము వస్తున్నది.
Cap a pie adv ఆకాశవత్రకముగా, నిలువెల్లా. he was armed * తల మొదలుకొని కాళ్ల దాకా జీరా తొడుక్కొన్నాడు.
Cap paper n s వక తరహా ముతక కాకితము.
Capability n s శక్తి, సామర్థ్యము, యోగ్యత. on observing the capabilities of the house ఆ యింటి యొక్క వైఖరి నిరాకరించగా.
Capable adj సామర్థ్యముగల, శక్తి గల, త్రాణగల, తగిన, అహమైన. he is not * of doing so వాడు అట్లా చేయగలవాడు కాడు. that ship is not* of containing 200 men ఆ వాడ యిన్నూరు మందిని పట్టేది కాదు.
Capacious adj విశాలమైన, గొప్ప. a man of mind ప్రశస్తమైన బుద్ధిగలవాడు.
Capacity n s ability శక్తి, సామర్థ్యము, త్రాణ. or size విశాలత. from the * of the house ఆ యిల్లు విశాలమైనందున. a ship of great * నిండా విశాలమైన వాడ. profession or occupation వుద్యోగము, వృత్తి. or qualification యోగ్యత. this business is beyond his * యీ పని వాడి యోగ్యతకు మించి వున్నది. I doubt his * for this business యీ పనికి వాడు అర్హుడు అనడానకు నాకు అనుమానముగా వున్నది. he was there in the * of a doctor వాడు వైద్య వృత్తిలో వుండినాడు, వైద్యుడుగావుండినాడు.
Caparison n s గుర్రము యేనుగ వీటి యొక్క ఆభరణములు, వీటి యొక్కఅలంకారములు.
Cape n s నాలుకవలె సముద్రములో పారి వుండే భూమి యొక్క కొన. the * of Good Hope యిండియా దేశము నుంచి సీమకు పొయ్యే దోవలో వుండే వక వూరు * of a coat కోటుతో కలిసినట్టు మెడ చుట్టూరు కుట్టి వుండే నాలుగు వేళ్ల గుడ్డ. a coat of four capes వీపులో వకటి కింద వకటి నాలుగు వరసలుగా గుడ్డ విడిచి కుట్టిన చొక్కాయి.
Caper n s దుముకు, గంతు. capers or jumps దుముకులు, తాండవము. a sort of berry వక తరహా కాయ, దీన్ని వూరగాయ వేస్తారు.
Capias n s వక తరహా వారంటు.
Capillary adj సన్నమైన, సూక్ష్మమైన వెంటృక వంటిది.
Capital n s రొమం దేశమందు పెద్ద వక బురుజు, అందులో వుండే దేవస్థానము.
Capitalist n s భాగ్యవంతుడు, ధనికుడు.
Capitally adv ఘనముగా దివ్యముగా. he was * convicted వాణ్ని వురితీసేలాగున తీర్పు అయినది.
Capitatton n s ఖానషుమారి, ప్రజాసంఖ్య. or yearly tax levied పన్ను.
Capivi n s (a drug) వక దినుసు పేరు, చలన మిరియాలు.
Capon n s కబాదు కోడి.
Capricarn n s మకరరాసి, ముక్షిక.
Caprice n s చలచిత్తత, దిగ్ర్భమ, పిత్తోల్బణము.
Capricious adj చలచిత్తమైన, నిలకడ లేని, నమ్మరాని, సాహసమైన, నియమము లేని.
Capriciously adv చలచిత్తముగా అనియమముగా.
Capriciousness n s చలచిత్తత, చంచలభావము,
Caprisoned adj అలంకరించబడ్డ, శృంగారించబడ్డ, యిది యేనుగ గుర్రము వీటిని గురించిన మాట.
Capsicum n s మిరపకాయ.
Capstan n s వాడవో లంగరు పైకి యీడ్చేటందుకు వుండే యంత్రము.
Capsular adj కోశవత్తు, పట్టెవంటిది.
Capsule n s (French) the cap of a gun nipple రాగికుళ్లాయి, అనగా తుపాకిలో చెకముకి రాతికి మారుగా నిప్పుపడేటట్టు కల్పించిన చిన్న గొట్టము.
Captain n s అధికారి, పెద్ద నాయకుడు, ప్రధానుడు, కప్తాను, సరదారుడు * of a ship వాడ మల్లించే మరకాడు, వాడంగి. Captain General సేనాపతి. the * of the robbers దొంగల పెద్ద.
Caption n s పట్టుకోవడము.
Captious adj లేనిపోని ఆక్షేపణలు చేసే, పీకులాడే, చీటికిమాటికి కోపగించే.a * fool ముసురుమూతి.
Captiously adv నిర్హేతుకముగా ఆక్షేపించే, వూరక.
Captiousness n s పీకులాట, ఆక్షేపించే భావము, వుగ్రత.
Captitulation n s కౌలు, రాజీ, వోడిపోవడము.
Captivating adj మనోహరమైన, ముద్దుగా వుండే.
Captive n s దాసులు, బద్ధులు, కైదీలు. he took them * చిక్కించుకొన్నాడు,పట్టుకొన్నాడు. he was tagen * చిక్కినాడు, వాండ్లకు పట్టుబడ్డాడు.
Captivity n s దాస్యము, చెర, కైదీగా వుండడము.
Captivpted adj భ్రమపడ్డ, మోహవశుడైన, వలసుకొన్న. he was quite * మోహపడ్డాడు, వలను కొన్నాడు.
captor n s జయించినవాడు, పట్టుకొన్న వాడు.
Capture n s జయము. after their * వాండ్లు పట్టుబడ్డ తర్వాత. after he made his * జయించిన తర్వాత, పట్టుకొన్న తర్వాత.
Capuchin n s a kind of kiar రోమన్ మతములో వక తరహా పాదిరి, సన్యాసులలో భేదము. a woman' s cloak స్త్రీలు తొడుగు కొనే వక తరహా వేషము.
Caput mortuum n s భస్మము, పిప్పి, ఉచ్ఛిష్టము, పనికిమాలినది.
Car, or Carriage n s. వక తరహా బండి, రధము. the * festival రథోత్సవము.
Carat n s రత్న తులనార్థమైన పరిమాణ విశేషము, నాళుగు గురిగింజల యెత్తు, శతమానము.
Caravan n s యాత్రకుల సమూహము. పధికులు, తండా, బిడారు. or waggon పెద్ద బండి.
Caravansary n s సత్రము, చావిడి.
Caraway n s సోపు, సోపువంటి వక తరహా విత్తులు.
Carbine n s చిన్న తుపాకి.
Carbinier n s చిన్న తుపాకి వేసే తురు పుసవారు.
Carbon n s బొగ్గు, లేక బొగ్గు యొక్క సారము.
Carbonic adj బొగ్గు సంబంధమైన. Carbonic acid దాని యొక్క ద్రావకము.Carbonic acid gass దాని యొక్క పొగ.
Carbonite adj బొగ్గు ద్రావకము కలిశిన.
Carboy n s పన్నీరు పోశే పెద్ద బుడ్డి, మేరువు, కూజా.
Carbuncle n s సూర్య కాంతము, మాణిక్యములలో వక భేదము. the tumour రాచ పుండు.
Carbuncled adj రత్నాలు చెక్కిన. diseased. రాచ పుండు గల.
Carcanet n s కంటె, సరిపెణ, కంఠ భూషణము.
Carcase n s పీనుగ, శవము. the felsh of an entire ox తలతోక కాళ్లు తోలు వినాయించి కడమ మాంసమున్ను యెముకలున్ను the * of the deer weighed ten pounds, and the offal weighed eight pounds మృగము యొక్క కాళ్లు తల తోక తోలు యెనిమిది పౌనులు వుండినవి, కడమ మాంసమున్ను యెముకలున్ను పది పౌనులు వుండినవి. phrase for the body దేహమనడమునకు యెగతాళిగా carcass అంటారు. the skeleton of a house కట్టీ కట్టక వుండే యిల్లు. పని తీరి తీరకవుండే యిల్లు.
Card n s నాలుగు అయిదు వకటిగా అంటించిన గట్టి కాకితము. used in games చీట్లు, ఇస్పేటు కాకితాలు. they were playing at cards వాండ్లు కాకితాలు ఆడుతూవుండిరి. he has played his cards well వాడు బాగానే జయించినాడు. a visiting* వక దొర దర్శనమునకు పోయినప్పుడు ఆయన యింట్లో లేని పక్షమందు తాను వచ్చి పోయినట్టు తెలిశే లాగున యిచ్చి పొయ్యే చీటి. a * orteazle కుంచె, కురుమ దువ్వెన. యీ దువ్వెనతో గొర్రె బొచ్చును చక్కపెట్టతారు. or advertisement ప్రకటన, చాటింపు యిస్తారు.
Cardamons n s యేలకులు.
Cardinal n s రోమన్ మతములో ప్రధాన గురువైన పోపు చేతి కింద వుండే అధిపతి, పోపు చేసి కింది దిగ్గజములోలో వకడు.
Care n. s. (caution) ఎచ్చరిక, భద్రము,జాగ్రత, (charge) భారము, సంరక్షణ, విచారణ, వశము, కాపు. (oversight) పరామరిక. they are my * వాండ్లు నా రక్షణలో వున్నారు. these children were under his fostering * ఆ బిడ్డలు వాడి పరి పాలనలో వుండిరి. I commit this to your * దీన్ని నీ వశము చేస్తాను. (concern) చింత, విచారము, వ్యాకులము. grief కీడు, వ్యసనము. (heed or attention) పదిలము, జాగ్రత. If you do not take * you will be ruined జాగ్రత పడకుంటే చెడిపోదువు.Take * పరాకు, భద్రము, జాగ్రత. you must take * of the dog కుక్క కరవబోతుంది భద్రము, కుక్కను జాగ్రతగా చూచుకో. when I go you must take * of my horses నేను పోతే నా గుర్రాలను నీవు విచారించుకో, పరామర్శించుకో. he looks * worn వాడి ముఖము చూస్తే యెండగొట్టు పడ్డట్టు వున్నది.
Career n s పరుగు, గతి, నడత, గమనము. his * is run వాని పని తీరినది. during the whole of his * వాడు జీవించిన కాలములో నంతా.
Careful adj జాగ్రతగల, జాగరూకతగల, మెళుకువగల, యెచ్చరికగల. Be careful భద్రము, జాగ్రత.
Carefully adv భద్రముగా, జాగ్రతగా, పదిలముగా.
Carefulness n s భద్రము, జాగ్రత, యెచ్చరిక.
Careless adj అశ్రద్ధగా వుండే, జాగ్రత లేని, నిశ్చింత అయిన.
Carelessly adv అశ్రద్ధగా, అజాగ్రతగా, నిశ్చింతగా.
Carelessness n s ఆశ్రద్ధ, అజాగ్రత, నిశ్చింత.
Caress n s లాలన, బుజ్జగింపు, మురిపెము.
Caressing adj సరసమైన, ముద్దుగా వుండే.
Caret n s హంసపాది.
Cargo n s వాడసరకు, వాడ మీదికి యెక్కించిన సరుకు.
Caricature n s వికారముగా వ్రాసిన పటము. this history is a mere * యిది కధ కాదు, వట్టి వికారమైన వర్ణన. It is supposed that the tale of Harischandra is but అ * of the book of Job హరిశ్చంద్ర కథ జోబ్ అనే గ్రంధములో నుంచి తెచ్చుకొన్నదిగా వున్నది. the * plant with green and white leaves బట్ట పువ్వు చెట్టు.
Caricature plant n s (add,) నవ్వే తమలపాకు.
Caries n s యెముకకైనా పల్లుకైనా పట్టిన పుప్పి.
Carious adj పుచ్చిన, పుప్పి బట్టిన.
Carle n s పల్లెటూరి వాడు, మూర్కుడు.
Carman n s బండివాడు.
Carmelite n s వక తరహా సన్యాసి, వక తరహా బైరాగి.
Carminative n s వాయువును పోగొట్టే అవుషధము.
Carmine n s యెర్రని వన్నె, కోడి కొండెవర్ణము, దాసాని పుష్పవర్ణము, దానిమ్మ పువ్వు వర్ణము.
Carnage n s సంహారము, వధ, నెత్తురు మడుగు.
Carnal adj ఐహిక సంబంధమైన, శరీరాభిమానముగల కామ వికారముగల, ఇంద్రియ సంబంధమైన. In Rom. 8. 7. శరీర కేకర్మణియోను రాగః. A+ In I Cor 11 carnal things సాంసారి కన్య. A * desires ఈషణత్రయములు, మోహము, విరహము. * knowledge or * connection రతి, సంగమము.
Carnal mindedness n s పంచేంద్రియ, బంధకత్వము ప్రకృతి.
Carnally adv రతి సంబంధముగా. he knew her * దాన్ని పొందినాడు, దానితోసంసర్గము చేసినాడు.
Carnalminded adj పంచేంద్రియ బద్ధుడైన, ప్రకృతి బద్ధుడైన.
Carnatic n s కర్నాటక దేశము, కర్నాటక రాజ్యము.
Carnation n s రోజా పువ్వు వర్ణము, అనగా యీషద్రక్త వర్ణము, మరిన్ని వక పుష్పము పేరు.
Carnelian n s కురువింద రాయి, వుంగరములకు గడియారములకు వేసే యెర్ర రాయి.
Carnival n s పర్వవిశేషము, సంభ్రమము, వుత్సవము, మొహర్రము వంటి పండుగ, హోళీ పండుగ వంటిది.
Carnivorous adj మాంసము తినే, the rat is * యెలుక మాంసమును తినేటిది.
Carol పదము,సంకీర్తనము,సువ్వాలు,పల్లవి,కిలక
Carotid n s మెడలో వుండే పెద్ద నరము, అది కోస్తే మనిషి చస్తాడు.
Carousal n s పెద్ద విందు.
Carp n s వక తరహా చేప, గుండు చేప, పక్క చేప, బనేడిసె మీను, సత్తువ మీను, శపరము, దీని రూపు చందువా చేపవలె వుంటుంది.
Carpenter n s వడ్లవాడు. a certain insect కుమ్మర పురుగు, కులాల కీటకము.
Carpentry n s వడ్ల పని.
Carper n s లేనిపోని ఆక్షేపణలు చేసేవాడు, వృధాగా వాదాడేవాడు.
Carpet n s జంబుఖానా, తివాసి, రత్న కంబళి. when he brought that subject on the * దాన్ని వాడు ప్రస్తాపము చేసినప్పుడు, వుదాహరించినప్పుడు. a Carpet bag పెద్ద బట్టువా సంచి.
Carpeted adj జంబుఖానా పరచిన, రత్న కంబళ్లు వేసిన.
Carpetting n s జంబుఖానాలు, రత్న కంబళ్లు.
Carping n. s. దురాక్షేపణ, కుతర్కము
Carpingly adv దురాక్షేపణగా, కుతర్కముగా.
Carraway n s సోపువంటి విత్తులు.
Carriage n s behaviour నడక, నడత, గమనము, భావన. or vehicle బండి, రథము, వాహనము. the body of a * బండి పరము, బండి యొక్క అయకట్టు. or carrying బరువు, మోపు, మోత. pay for carryign మోత కూలి. he paid the * for the articlesl ఆ సామానుల మోతకూలి యిచ్చినాడు. the troops were supplied with * ఆ దండుకు మోసుకొని పొయ్యే వాటినన్నిటిని జాగ్రత చేసినారు, అనగా యెడ్లుబండ్లు పాలకీలు మొదలైనవి జాగ్రత చేయబడ్డవి. there was no water * వాడగాని పడవగాని లేదు. Manners, behaviour, యిదిప్రాచీనమైన అర్థము, యేమంటె his * showed that he was displeased భావము చూస్తే వాడికి అసహ్యము వచ్చినట్టు అగుపడ్డది.
Carried adj తీసుకొని పోయిన, మోసుకొని పోయిన. he was * away by passion వాడు ఆగ్రహపరవశుడై వుండెను. It 6was * away by the stream అది ప్రవాహములో కొట్టుకొని పోయినది.
Carrier n s మోసుకొని పొయ్యేవాడు, బండ్లు లేక పెరికిల మీద సామాను తీసుకొని పొయ్యేవాడు. a letter * జాబులు మోసేవాడు.or Carrier pigeon గిజిగాడు.
Carrion n s తినరాని మాంసము, నిషిద్ధమైన మాంసము. Eagles do not eat * గరుడ పక్షులు పీనుగలను తినవు.
Carrot n s గాజర గడ్డ.
Carroty adj యెర్రని, లోహితమైన, యిది వెంటృకలను గురించిన మాట.
Cart n s బండి, యెడ్డులబండి, కట్టె బండి. a * load బండి బరువు. * rope బండి తాడు. * wright బండ్లు చేసేవాడు.
Cart rut n s బండిపోయిన జాడ.
Carte blanche n s యిది ఫ్రెంచి మాట, అలేఖము, వ్రాయని కాకితము, తన చేవ్రాలు చేసి మనస్సు వచ్చినది వ్రాసుకొమ్మని యిచ్చిన కాకితము. he gave me * about this business యీ పనిని నీ మనసు వచ్చినట్టు చేసుకొమ్మని వుత్తరువు చేసినాడు.
Cartel n s దండులో వుభయ పక్షములలో నున్ను చెరబడి వుండే వాండ్లను విడుదల చేసే నిమిత్యమై వ్రాసుకొన్న రాజీనామా. they departed on * రాజానామా ప్రకారము విడుదల అయినారు.
Carter n s బండివాడు, బండి తోలేవాడు.
Cartilage n s గట్టినరము, దీన్ని వుపాస్థి నరమంటారు. the nose is formed of * ముక్కు గట్టి నరమై వున్నది.
Cartilaginous adj గట్టి నరమయమైన, మెత్తని నరమువంటి.
Carting n s బండి తోలడము, బండి కూలి.
Cartload n s బండి బరువు.
Cartoon n s కాగితము మీద వ్రాసిన వక తరహా పఠము.
Cartouch n s a case for balls గుండ్ల తోటా. * box తోటాల పెట్టె. (H.)
Cartridge n s తోటా. blunt * గుండు లేని వుత్త మందు తూటా. * paper వక తరహా ముతక కాకితము.
Cart-rope n s బండి తాడు.
Cartwheel n s చక్రము.
Cartwright n s బండ్లు చేసేవాడు.
Carved adj తొలిచిన, లోనాటు పనిచేసిన. patterns in * work పోగర పనిమాదిరి.
Carver n s పోగర పని చేసేవాడు, కాసెవాడు, శిల్పి. a * and gilder ముచ్చివాడు, చిత్ర పని చేసేవాడు.
Carving n s లోనాటుపని, పోగరపని, చిత్రపని.
Casar n s రోమన్ దేశపు ఒక రాజుపేరు. Casarian or Casarean operation గర్భిణి యొక్క గర్భమును ఛేదించి బిడ్డను బయిటికి యెత్తేశాస్త్రము.
Casarino, or casuarina (A kind of tree Ainslie2,443) Iron wood?చౌకు చెట్లు.
Cascade n s కొండ కాలవ, సెలయేరు, నిర్ఘరము.
Case n s condition స్థితి, విద్యమానము, సంగతి అవస్థ. or cover or covering పొర, గవిసిన, a * knife వరలోవుండే సూరకత్తి, మేజాకత్తి. a * for spectacles ముక్కద్దపుగూడు. a clock * పెద్ద గడియారము పెట్టి వుండే చిట్టము. a watch * గెడియారము మూత. or box పెట్టె a * of goods సరుకులు వేసే పెట్టె. a * of goods సరుకులు వేసే పెట్టె. a * bottle చౌకబుడ్డి. a or suit వ్యాజ్యము. a * of theft దొంగతనమును గురించిన వ్యాజ్యము. a * of murder ఖూనిని గురించిన వ్యాజ్యము. the cases of a noun విభక్తులు. keep it in * I come నేను వకవేళ వత్తును అవి పెట్టిపెట్టు. book * పుస్తకములు వుంచే అల్మార. in this * or matters being thus యిట్లా వుండగా, యీ విషయమందు, It is the * యిది వాస్తవము, నిజమే.That's not the * అట్లా కాదు, ఆ మాట నిజముకాదు, అబద్ధమే. the state of the case is that ఆ సంగతి వుండేస్థితి యేమంటె in that * ఆ పక్షమందు, అట్లా వుండగా. in both cases యెటైనా, యేవిధమైనా in any * యెట్లా అయినా సరి. can it be the *? అది వాస్తవముగా వుండునా? It is not the * అట్లా జరగనేలేదు. it was the * with me నాకున్ను అదే స్థితిగా వుండెను? in * of death చచ్చిన పక్షమందు. such is the * వాస్తవ్య మింతె, అది విహితమె,వున్న సంగతి యింతె. in most cases బహుశా. he considered it a hard * యిది వక అన్యాయమని అతనికి తోచినది. In this school they read poetry,in the other schools this is not the * యీ పల్లి కూటములో కావ్యము చదువుతారు, కడమ పల్లి కూటములలో అట్లా కాదు. you said they were brothers this is not the * వాండ్లు అన్నతమ్ములు అన్నావు, అట్లా కాదు. these birds are as tall as a man in some cases య్ పక్షులలో వకటొకటి మనిషి పొడుగు వుండడముకద్దు. they are in a bad * దురవస్థలో వున్నారు.the horse is in good * గుర్రము పుష్టిగా వున్నది. the horse is in bad * గుర్రము చిక్కి వున్నది. the children are taught Tamil in some cases they learn it in one year పిల్ల కాయలకు అరవము చెప్పుతారు, వకడొకడుసంవత్సరములో నేర్చుకోవడము కద్దు. such cases are common అట్లా సంభవించడము సహజము, not a single case occured యిట్లా వకనాడున్ను సంభవించలేదు.
Cased adj గవిసెన వేసిన, వొర వేసిన. the oyster is * in a shell నత్తగుల్లను గుల్ల మూసుకొని వుంటుంది. the cocoanut is * in a busk టెంకాయ పైన మట్ట మూసుకొని వున్నది.
Casehardened adj ముక్కాకులు తీరిన, మొండి పడ్డ, మూర్ఖ.
Casemate n s కోటగోడలో వుండే గది, దీన్ని బొంబురూ అంటారు.
Casement n s కటిక.
Cash n s రొక్క రూకలు, నగదు. a * chest ఖజానా పెట్టె. a * keeper ఖజాంజి, సరాపు.
Cash keeper n s సరావు.
Cashew nut n s జీడి మామిడికాయ, ముంత మామిడికాయ. the kernel of the * ముంత మామిడిపప్పు.
Cashier n s ఖజాంజి, సరావు, బొక్కిసగాడు.
Cask n s పీపాయి.
Casket n s బరిణె, డబ్బి, సంపుటము, చిన్న సొమ్ముల పెట్టె.
Casque n s యినప టోపి, యిది కావ్యములో వచ్చే మాట.
Cassarina n s name of a certain foreign plant ఒక విధమైనపూలచెట్టు.
Cassarina tree, Casswary n s. చౌకు చెట్టు.
Cassia n s కసిందచెట్టు. Cassia-fistula, n. s. రేలాకు. Cassia-lignea, n. s. ఆకుపత్రి.
Cassowary n s పక్షి విశేషము, వెలుగు గొడ్డువలె వొల్లంతా వెంట్రుకలు గల గుర్రమెత్తు కొంగవంటి పక్షి.
Casssock n s పాదిరీ నల్లపట్టు వుడుపు.
Cast n s నేత, నేయడము, వేసినంత దూరము. he has a * in his eye వాడి కన్ను మెల్లగా వున్నది. or caste కులము. See Caste. The * of the countenance ముఖభావము ముఖ జాడ.
Cast, or Caste ,n s. కులము, జాతి. of the shoemaker * మాదిగ. half * సంకర జాతిగా వుండే. he who has lost * కులములో వెలివేయబడ్డ వాడు, కుల భ్రష్టుడయినవాడు, కులము చెడ్డవాడు. the right hand * మహా నాటు కాపులు, మొదలారి వగైరాలు. the left hand includes బేరివాండ్లు వగైరాలు. The word * meaning tribe is German.
Castanets n s చిరతలు, గిరిగిటలు, గజరా, చిటికెలు.
Castaway adj వాడ ముణిగిన, పని చెడిన, he is a * వాడు దిక్కుమాలిన పక్షి, భ్రష్టుడు, అప్రయోజకుడు.
Caste n s కులము. See Cast.
Castellated adj బురుజు రీతిగా కట్టిన, యేమంటే కొమ్మలు గల, చెన్న పట్నపు కాలీజు గోడ యీ తీరుగా వున్నది.
Caster n s వేసేవాడు or spear బరిచి. or small wheel చిన్న చక్రము. a pepper * మిరియాల పొడి వుంచే భరిణె.
Castigated (moderate)శాంతమైన,మితమైన
Casting (fusion)పోత,పోతపని
Casting net n s చేతి వల, విసురవల.
Castle n s కోట, దుర్గము బురుజు, దివ్యమయిన యిల్లు, గడి. (which the English call Gharri.) a man at chess చదరంగపు కాయ. a seat on an elephant హవుదా యేనుగ. to build castles in the air గొంతెమ్మ కోరికలు కోరుట, నేను యిది చేస్తాను అది చేస్తాను, అని బ్రహ్మాండ మయిన పనులు మనసులో వూరికే ఆలోచించుట. castle building వట్టి బులుపు, యిది సాధించి జయించ పోతానన్న తలంపులు.
Castled adj బురుజులు గల, అంబారి వేసిన. he casteld the queen at chess మంత్రికి అపాయము రాకుండా వంటె అడ్డము పెట్టినాడు.
Castor n s వక జంతువు పేరు, పునుగు పిల్లి వంటిది, మృగమదము. or small wheel, under a couch & c.
Castor-oil n s ఆముదము. the plant ఆముదపు చెట్టు, హేరండము. the species used for medicine చిట్టాముదాలు. that used for lamp oil పెద్ద ఆముదాలు.
Castrametation n s దండు దిగడానకు స్థలమేర్పరచే శాస్త్రము.
Castrated adj విత్తులు కట్టిన, కచ్చి తీసిన. as a book కావ్యములో దుష్టమయిన శ్లోకాలను తీసివేసి చక్కగా కుదిర్చిన.
Casual adj నిజంతమైన, హేత్వర్థకమైన. యించుకాగమము, అనగా చేయించుట,వ్రాయించుట, యిప్పుంచుట, యిత్యాది.
Casuallty n s విపరీతము, దైవీకము. we had six casualities మా దండులోఆరుగురు చచ్చినారు. Return of casualities చచ్చిన వాండ్ల లెక్క.
Casually adv అకస్మాత్తుగా, తోచక, గుడ్డివేటుగా, యోచించక, దైవాధీనముగా.
Casuist n s తర్కశాస్త్రి తార్కికుడు, చమత్కారి, దోషాదోష విషయకసందేహభంజకుడు, తద్భంజనవేత్త.
Casuistry n s తర్కము, వ్యాజ్యము, సూక్ష్మము, దోషాదోష విషయక సందేహ భంజన విద్య.
Casura n s ఛందశ్శాస్త్రములో, యతి, విశ్రమ స్థానము.
Cat n s పిల్లి. pussy చీలి. or cross woman మొండి ముండ. or town * గండుపిల్లి. or whip కొరడా, కోరా. Cat'seye వైడూర్యము. a wild * బావురుపిల్లి, అడివిపిల్లి. or civet * పునుగుపిల్లి. a pole * జవ్వాజిపిల్లి. as lame as a * పిచ్చుక, కుంటి, చప్పాణి. It was raining cats and dogs వాన యేనుగ తొండంలాగున కురుస్తుంది, సంతత ధారగా కురుస్తుంది. a * of nine tails ముంళ్ల కొరడా, a cat's paw or base medium సాధనము. they made a cat's paw of him in their business యీ పనికి వాణ్ని ముందు తోసి తాము బాగుపడ్డారు. they made me acat's paw in this business నన్ను అడ్డు పెట్టి గడ్డి తినుపించి తాము లాభాన్ని పొందినారు. he let the * out of the bag దాచవలసిన రహస్యము బయలుపరచినాడు.
Catachressis n s వైలక్షణ్యము. అసంగతము, అప్రయోగము, వుపమేయనిగరణము.
Catachrestical adj వైలక్షణ్యమైన, అన్యాయమైన.
Catacombs n s శవములను పాతి పెట్టే సమాధి స్థానము.
Catagorically adv ప్రశ్నకు సరిగా, స్పష్టముగా, టెంకాయ పగలకొట్టినట్లు.
Catalepsy n s a sudden suppression of motion andsensation; in which the patient is speechless, senselessand fixed in one posture కాకి సోమాల, వుండేటట్టు వుండి మాటపలుకు లేక మానువలె నిలిచి పొయ్యేటట్టు చేసే రోగము.
Catalogue n s పట్టి, సూచీపత్రము, విశేషపత్రము.
Catalque n s గోరివలె కట్టినది, ముహర్రములో అల్లాను పెట్టడానకు గోంవలె కట్టిన చప్పరము.
Catamaran n s (a float used for a cane) కట్టు మరము, తెప్ప, అరిగోలు. a fire machine. See Hist. of Europe for 1804. వాడను తగలపెట్టడానకై నిప్పును తీసుకొని పొయ్యే తెప్ప.
Catamountain n s బావురుపిల్లి.
Cataplasm n s పలాస్త్రీ, ప్రలేప విశేషము పాక జనక లేపనము.
Catapult n s ఫిరంగివంటిది వక యంత్రము పెద్ద రాళ్లు వేసే యంత్రము.
Cataract n. s. ఆకాశగంగ, శలయేరు, కొండ మీది నుంచి పడే ప్రవాహము. in the eye పొర, పటలము. The cataracts in the Nile are merely Rapids.
Catarrah n s పరిశము, రొంప.
Catastrophe n s ఘోరమైనపని, విపత్తు, దుర్దశ, దుర్గతి. the death ofRavana is the * of the Ramayanam రామాయణములో రావణ వధ రామాయణముయొక్క అంత్యము. what a terrible *! అయ్యో యేమి అఘోరము!
Catcall n s వికారమయిన స్వనంగల పెద్ద పిల్లంగ్రొవి.
Catch n s తగులు, కొలికి or catch, మీట, కొక్కి, కొండి. I made a * at it దాన్ని పట్టుకో బోయినాను, అది పడి పోతూ వుండగా పట్టుకోపోయినారనిఅర్థము. in chorus ముగ్గురు నలుగురు కలిసి లక్ష్మీకళ్యాణ, సువ్వి అని పాడినట్టు పాడడము. that is a great * అది దొరకడము దివ్యమె. (Johnson.) A * word ముందర పత్రములో మొదట వ్రాసే మాటను వెనక పత్రము చివరను వ్రాసుట.
Catch pole n s తలారివాడు, బంట్రోతు.
Catching adj (as a disease) అంటె స్పర్శ చేత వచ్చే. * disease అంటురోగము. the cholera is not * like small pox వాంతి భ్రాంతి అనే రోగముమశూచకమువలె స్పర్శ చేత కలగదు. Catch penny బూటకమైన సొమ్ము.
Catecbuman n s శిష్యుడు, అనగా ప్రశ్నోత్తర క్రమముగా వుపదేశించబడేవాడు.
Catechetical adj ప్రశ్నోత్తరములుగా యేర్పరచిన.
Catechiser n s గురువు, అనగా ప్రశ్నోత్తర క్రమముగా వుపదేశించేవాడు. or impertioner questioner సంకటమైన ప్రశ్నలు పెట్టేవాడు.
Catechism n s ప్రశ్నోత్తర క్రమముగా వుండే సంగ్రహ గ్రంథము.
Catechist n s మతమును ప్రశ్నోత్తర క్రమముగా వుపదేశించేవాడు.
Catechu, or Cutch a drug,కాచు
Categorical adj ప్రశ్నకు సరి అయిన, పరిష్కారమైన, స్పష్టమైన. a * ఆక్షేపించే. a * answer సరిఅయిన వుత్తరము, చక్కని వుత్తరము.
Category n s వర్గము, తరము, క్రమము. In logic పదార్థము. The word తత్వము is also used, see instances in Wilson's Sankhya Karika $ XXII page 79 "There are tatwas i. e. physical and metaphysical categories in the Sankhya system of Philosophy. "
Cateler n s భోజనము జాగ్రత చేసేవాడు. a comprador అనే పేరు చన్నపట్ణములో కలదు.
Catelwaulling adj అరిచే, యిది పిల్లిని గురించిన మాట.
Cater cousins n s విహితులు, ఆప్తులు, ఏకగ్రీవముగా వుండేవాండ్లు,పొత్తుగా భోజనమి చేసి వుండేవాండ్లు.
Cateress n s భోజనము జాగ్రత చేసే స్త్రీ.
Cateris paribus adv ఉత్తరోత్తర సములయిన పక్షమునుందు. See Ceterris.
Caterpillar n s పురుగు, జీడి పురుగు. the * which makes silk పట్టుపురుగు. various species are called కంబళీపురుగు, చీడ పురుగు,ఆకుపురుగు, అగ్నిమండలము.
Cates n s భోజనము, ఆహారము, సుభోజనము.
Catfish n s a large fresh-water fish; one sort is black, one is white: it is poisonous వాలుగ చేప.
Catgut n s నరముతో చేసిన తంతి, దీనికి పిల్లి సంబంధము వకటిన్నీ లేదు.
Cathartic n s భేదిమందు.
Cathartick adj విరోచన కారిఅయిన, భేదికరమైన.
Catheads n s లంగరు చేదడమునకై ముక్కుదూలమునకు రెండు పక్కల వుండేమానులు.
Cathedral n s పెద్ద గుడి.
Catherine n s యిది వొక స్త్రీ పేరు. Catherine wheel. n. s. వొక తరహా చక్ర బాణము.
Catheter n s మూత్రకట్టు నీరుదించే సన్నపు గొట్టము.
Catholic adj universal general సాధారణమైన, సార్వత్రికమైన, సర్వగ్రాహ్యమైన, సర్వ జన సమ్మతమైన సర్వసమమైన. the * religion యిది వొక మతనామము. a medicine of * use or universal application అన్ని రోగాలను పట్టే మందు. a * or comprehensive treatise సర్వజన సమ్మతమైన గ్రంధము.
Catkins n s పుష్పము యొక్క పై రేకు.
Cat's eye n s (a stone) వైడూర్య మణి.
Cattle n s పశువులు. twenty head of * యిరువై పశువులు. Black * orhorned * పశువులు, గొడ్లు. merchandize transported on * పెరికె వర్తకము.
Caudle n s బాలింతకారము. a sort of punch.
Caught adj చిక్కిన, చిక్కుకొన్న, పట్టిన, తగులుకొన్న he is * వాడు దొరికినాడు, చిక్కినాడు. I was * నేను దొరికితిని, పట్టుబడితిని.
Caul n s a woman's head dress స్త్రీలు తలకు వేసుకోనే జాలకార భూషణ విశేషము, దొరసానులు తలకు వేసుకొనే వలవంటి టొప్పి, fat in the belly వప అనగా పేగులను మూసుకొని వుండే సన్నతిత్తి. a child's * అప్పుడే పుట్టిన వొకానొక శిశువు యొక్క వుచ్చి మీది సన్న తోలు కొందరు పిచ్చినతముగా దీనికి తాయత్తువలె నిండా మహాత్మ్యము చెప్పుతున్నారు.
Cauldron n s కొప్పెర, కడాయి, అండా, కాగు.
Cauliflower n s ముట్టుకోసుకూర, పొట్లపువ్వు రూపుకలది.
Causal adj read, ణిజంతము. *c.
Cause n s హేతువ, కారణము, నిమిత్తము, వ్యాజము, వివాదము. without * వూరికె, నిర్నిమిత్యము. * and effect కారణకార్యములు. efficient * నిమిత్తకారణము, కర్త, కారకుడు, for some * or other యేదో వొక హేతువచేత, యేదో వొక నిమిత్తము చేత. he pleads 1the * of the poor బీదవాండ్ల నిమిత్తమై మాట్లాడుతాడు. they have made common * with him వాండ్లు వాడి తోటి పాటుగా వున్నారు, వాండ్లు వాడు వొక చెయ్యిగా వున్నారు. I fought your * with the Governor గవనరు వద్దికి పోయి నీ నిమిత్తము చాలా చెప్పినాను. It is due to the * of truth to add that I find my father was mistaken మా తండ్రి తప్పినాడు అది నేను చెప్పరాదు గాని యధార్ధాన్ని పట్టితే నేను చెప్పవలసివున్నది. With devotion worthy of a better * వాడికి వుండే శ్రద్ధ ఘనమైనదే గాని వాడు ఆరంభించిన పని మంచిది కాదు.
Causeless adj నిర్నిమిత్తమైన, నిష్కారణమైన, నిరహేతుకమైన.
Causelessly adv నిరహేతుకముగా, నిర్నిమిత్తముగా, నిష్కారణముగా, వూరికె.
Causer n s కారకుడు, చేయించేవాడు, కర్త.
Causeway n s యెత్తుగా మన్ను పోసి వేసిన భాట, కట్ట మీది భాట.
Caustic adj కారమైన, తీక్ష్ణమైన, క్రూరమైన. he used * expressions కారముగా మాట్లాడినాడు, కరుకుగా మాట్లాడినాడు.
Cauterization n s కాల్చడము, వాత వేయడము, చిటిక, వేయడము.
Cauterizing-iron n s వాత కోల.
Cauterwaulling n s కేకలు, అరుపు.
Cautery n s వాత, చిటికె, రక్ష.
Caution n s (or security) పూట. or care పదిలము, హెచ్చరిక, జాగ్రత, మెళుకువ.
Cautious adj యెచ్చరికగల, జాగ్రతగల, జాగరూకుడైన. a * man జాగరీకుడు, జాగ్రతకలవాడు.
Cautiously adj జాగ్రతగా, యెచ్చరికగా.
Cautiousness n s పదిలము, జాగ్రత, యెచ్చరిక.
Cavalcade n s పదిమంది దొరలు గుర్రాలను యెక్కి విహారముగా పోవుట.
Cavalier n s రవుతు, గుర్రపు రవుతు, శూరుడు. * treatment సాహసము,దురహంకారము, గర్వము, డంబము. a tower or bastion బురుజు.
cavalry n s తరుపు సవారులు, గుర్రాల దండు.
Cave n s గుహ, బిలము.
Caveat n s ఆటంకము, దురాయి, అనగా కోరట్టులో విచారణ అవుతూ వుండేవ్యాజ్యము నిలిచిపొయ్యేటట్టు వ్యాజ్యగాండ్లు యిచ్చే అర్జి.
Cavern n s గుహ, పర్వతము కింద వుండే బ్రహ్మాండమైన గుహ.
Caviare n s వుప్పు చేప.
Cavil n s దురాక్షేపణ, పనికిమాలిన ఆక్షేపణ, కృశంక.
Caviller n s దురాక్షేపణ చేసేవాడు, కుళంకులు చేసేవాడు.
Cavilling n s దురాక్షేపణ, కుశంక, వితండా వాదము.
Cavity n s సందు, రంధ్రము, గుహ, తొర్ర.
Ceaseless adj యెడతెగని, నిత్యమైన, తియ్యని, తీరని, వదలని.
Ceaselessly adv యెడతెగకుండా, తియ్యకుండా, విడవకుండా, వదలకుండా.
Ceasing n s తీరడము, మానడము, నివర్తి కావడము, విడవడము, అణగడము.without * మానక, తీరక.
Cedar n s దేవదారు చెట్టు.
Ceded adj వోడిన, వప్పగించిన, వశము చేసిన, యిచ్చి వేసిన. the * districts వోడి శత్రువులకు వొప్పగించి వేశిన తాలూకాలు, కడప, బల్లారి జిల్లాలకు యీ పేరు కద్దు.
Ceiling n s లో కప్పు.
Celebrated adj ప్రసిద్ధమైన, ఘనమైన.
Celebration n s ఆచరణము చేయడము, కొనియాడడము. I was present at the * of the marriage పెండ్లి జరగగా నేను వుంటిని. the annual * of a death తద్దినము పెట్టడము. * of a feast వుత్సవము జరిగించడము.
Celebrity n s పేరు, ఖ్యాతి, కీర్తి.
Celerity n s త్వర, వేహము, జవము.
Celery n s వక తరహా తోట కూర, దీన్ని పచ్చిగా తింటారు.
Celestial adj దివ్యమైన, స్వర్గ సంబంధమైన, ఆకాశ సంబంధమైన. * bliss మహానందము, పరమానందము.or supernatural weapon దివ్యాయుధము. the * empire చైనా దేశము, అనగా China. The * bodies సూర్య చంద్ర నక్షత్రాదులు.
Celibacy n s బ్రహ్మచర్యము, పెండ్లి కాకుండా వుండడము. The Tin Trumpet "gives this definition. Celibacy, a vow by which the priesthood in some countries swear to content themselves with the wives of other men."
Cell n s a small room గది, కైదీని వేసే గది, సన్యాసి వుండే చిన్న మాళిగ, గుహ. in a beehive తేనె తెట్టలో వుండే బొక్క; రంధ్రము. in a flower or fruit పుష్పమందు, కాయలందు విత్తువుండే స్థానము. of the ear చెవి బొక్క, కర్ణరంధ్రము.
Cellar n s పాతర, నేలమాళీగ, ముఖ్యముగా యిండ్ల కింద కట్టిన కొట్లు వీటిలో వైను వుంచుతారు. or tavern చావడి.
Cellular adj అరలు అరలుగా వుండే, బొక్కలు బొక్కలుగా వుండే.
Cement n s గచ్చు, లప్పము, చింత అంబలి. metalic * నవాసారము.
Cemented adj గార మొదలైన వాటితో సంతన చేసిన, దృఢమైన their friendship was * by this marriage యీ వివాహము చేత వాండ్ల స్నేహము అతుక్కొన్నది.
Cemetery n s స్మశానము, సమాధి స్థలము, పీనుగులను పూడ్చే స్థలము.
Cenobite n s సన్యాసి.
Cenotaph n s వట్టి గోరి, శవమును పాతి పెట్టకుండా మర్యాద నిమిత్తము జంబముగా కట్టిన గోరి.
Censer n s ధూపకలశము, ధూపార్తి.
Censor n s ధర్మకర్త, న్యాయ విచారణ చేసేవాడు.
Censorious adj నిందించే, ఆక్షేపణలు చేసే, దూషించే, తప్పులు బట్టే. do not be so * యిట్లా దూషించడము కారాదు.
Censoriousness n s నిందించే స్వభావము.
Censorship n s సమాచార పత్రికలో రాజుకు అసమాధానమైన సంగతులు వేయకుండా చూచుకొనే అధికారము.
Censurable adj దూషించతగిన, కాని.
Censure n s ఆక్షేపణ, చీవాట్లు, నింద, దూషణ.
Census n s ఖానేసుమారు లెక్క, వక వూళ్లో వుండే జనుల యొక్క సంఖ్య.
Cent అనగా Centum శతము,నూరు, ten per* నూటికి పది, డోకడాల ప్రకారము.* per* ట్టిగా, రెట్టింపుగా నూటికి నూరు ద్విగుణము. a certain coin పయిసా. or as meaning a centesimal certain part of a coin డోకడా. Note: Interest in England is reckoned per annum, on the year; but in India is usually reckoned per mensem, on the month accordingly a bond at one per * in India is the same as at per * in England. 50 per * was paid మాడలు చెల్లించినారు; because the మాడ is the half of any coin, particularly a half pagoda; or సగానికి సగము చెల్లించినారు. then (the మాడ being one twentieth) they paid five per* is మావులు చెల్లించిరి. or నూటికి అయిదు చెల్లించిరి. one sixteenth of the principal is వీసము, అణా. (see Anna) and accordingly a half anna share is one thirty second and a quarter anna share is onesixty fourth of the sum. In accounts an upright line denotes a quarter and అ horizonntal line a sixteenth. Thus S" denotes 7 + 1/ + 3/16 (7/1/1,1/6) = Rupees 7 - 11 - 0.
Centaur n s నరాళ్వము, అనగా నడుము పర్యంతమున్ను మనుష్యాకారము, దాని కింద నాలుగు కాళ్లతో గుర్రము యొక్క శరీరమున్ను గల రాక్షసుడు. a female *కామధేనువువంటి వక దేవత.
Centenarian n s నూరేండ్లవాడు.
Centenary n s నూరు. this was the * of his victory వాడు జయించి యిదినూరో సంవత్సరము.
Centesimal adj శతాంశమైన. he divided it into * parts దాన్ని నూరుభాగములుగా చేసినాడు.
Centinel n s పహరావాడు, కావలివాడు, ద్వారపాలకుడు.
Centipede n s కాళ్లజెర్రి, శతపది.
Cento n s బొంతకావ్యము, అనగా దానిలో వక పద్యము, దీనిలో వక పద్యముగా తెచ్చి కలుపుకొని చెప్పిన గ్రంధము.
Central adj నడిమి మధ్యస్థమైన. the * done గర్భగృహము.
Centrally adv నడమన, నడుముగా. this was placed * దీన్ని నడమన బెట్టినారు.
Centre n s మధ్యము, నాభి. a * post or pole నిట్రాయి, నడిమి స్తంభము.the very * నట్టనడుము.
Centrical adj నడిమి.
Centrically adj నడాన, నట్ట నడమ.
Centrifugal adj మధ్యత్యాగి, చక్రగమనవేగే మధ్య స్థల త్యాగకరణశీల,మధ్యస్థలాపకర్షిత, మధ్యాపజగామిఘ, నడిమినుంచి పారే, వడిశలను తిప్పేటప్పుడు రాయి తిరగడమునకు చేతి బలము కారణము గనుక ఆ బలము * force అనబడుతున్నది.
Centripetal adj మద్యాకర్షిత, మధ్యాభిగామి, అకర్షణశక్తిగల, నడిమికి-ఆకర్షించే శక్తిగల.
Centry n s పహరావాడు, ద్వారపాలకుడు. I stood * నేను పహరా మీద వుంటిని.
Centuple adj నూరంతలైన.
Centurion n s సర్దారుడు, నాయకుడు, జమేదారుడు.
Century n s నూరేండ్లు; యుగము, దీన్ని యింగ్లిషువారు వక 1యుగమంటారు. thenineteenth * యిప్పటి యుగము, అనగా 1900 సంవత్సరమునకు యిటీవల. IN thelast * పోయిన యుగములో, అనగా 1800 సంవత్సరము మొదలుకొని 1900 సంవత్సరమువరకు అయ్యే కాలము, అనగా పద్దెనిమిదో century.
Cephalic n s తలనొప్పి మందు, అనగా వక తరహా నస్యపుపొడి.
Cerastes n s కొమ్ములుగల పాము, నాగ భేదము.
Cerate n s మయినముతో చేసిన ప్లాస్తరు.
Cerebrus n s గండభేరుండ భేదము. or three headed dog త్రిశిరశ్శునకము, వీడు నరక ధ్వార పాలకుడని కవులు చెప్పడము.
Cerecloth, Cerement n s. మయినపు గుడ్డ, మయినపు జిడ్డి, ప్రేత వస్త్రమును దీనితో చేస్తారు.
Ceremonial n s కర్మము,, ఆచారము, ఉత్సవము. the ceremonials of a marriage peVMdli prayojanamu. the ceremonials of a funeral కర్మంతరములు మొదలైనవి.
Ceremonially adv ఆచార ప్రకారముగా, కర్మకాండ ప్రకారముగా, విధిచోదితప్రకారముగా.
Ceremonious adj వుపచారమైన, మర్యాదగల, ఆచారముగల. in religion విధిచోదితమైన.
Ceremoniously adv మర్యాదగా, వుపచారముగా.
Ceremoniousness n s గాంభీర్యము, డంబము, మర్యాద. From his * I saw that he was angry వాడి గాంభీర్యము వల్ల వాడు కోపముగా వుండేటట్టు కనుక్కొన్నాను.
Ceremony n s ప్రస్తుతము, ప్రయోజనము, కర్మము, మర్యాద, ఆచారము. amaster of ceremonies పెత్తనగాడు, రాజ దర్శనానకు వచ్చే వాండ్లకు రాజు యెదటికి తీసుకొని పొయ్యేవాడు. funeral ceremonies ఉత్తర క్రియలు, * marriage * పెండ్లి ప్రయోజనము. with * వినయముగా, వుపచారముగా. without * or without standing on * అమర్యాదగా.
Certain adj రూఢిఅయిన, వాస్తవమైన, సిద్ధమైన. a * man వకడు, వకానొకడు, ఫలాని మనిషి. in a * book ఫలాని పుస్తకములో, వకానొకపుస్తకములో. a * woman వొకతె, వొకానొకతె. to a * degree కోంతమట్టుకు. * persons కొందరు. I am * he went వాడు సిద్ధముగా వెళ్లినాడు. I am not* of that అందున గురించి నేను రూఢిగా చెప్పలేను. for * నిశ్చయముగా.
Certainly adv రూడిగా, నిజముగా, వాస్తవముగా, మెట్టుకు, ముఖ్యముగా,అగత్యముగా, తప్పకుండా, సరేగాని. I * thought నాకు అట్లా తోచినది సుమీ. n.s. shall I go? * నేను పోదునా, మంచిదిపో, పోవలసినదే, పోక యేమి.
Certainty n s నిజము, నిశ్చయము, వాస్తవము, రూడి.
Certes adv నిజముగా, సరేగదా, యిది ప్రాచీనమైన, యింగ్లీషు.
Certificate n s నిర్ణయ పత్రిక. a * of good conduct యోగ్యతా పత్రిక. a general * signed by all present మహజరునామా.
Certiorari n s కింది కోర్టులో వుండె వ్యాజ్యమును పై కోర్టుకు పంపించమని పుట్టిన హుకుము, ఉత్తరవు.
Certitude n s నిశ్చయము, రూఢి, నిర్ణయము.
Cerulean adj ఆకాశ వర్ణమైన, నీల వర్ణమైన. the * sky నీలమైన ఆకాశము.
Ceruse n s సత్తుభస్మము, ముఖమునకు చరుముకొనేటిది.
Cesarean n s vide Caesarean.
Cess n s పన్ను, తక్కినము. out of all * అమితముగా అపారముగా, లెక్క లేక.
Cessation n s నిలుపు, విరామము * of a labour శ్రమ తీర్చుకోవడము. labour without * విరామము లేనిపని. without any * విరామము లేకుండా, యెడ తెగకుండా, తెరపలేకుండా. rain without cessation తెరపలేని వాన.
Cession n s వప్పగింత, నివర్తనము, నిర్వహించలేక వకరికి వొప్పగించి వేయడము. after his * అతను దేశము యిచ్చి వేసిన మాట.
Cestus n s వడ్డాణము, రవికె, నక్కకొమ్ము వలెదీనికి వశీకరణ శక్తి కద్దని ప్రసిద్ధము.
Ceta n s or whale సముద్రములో వుండె పెద్ద చేప.
Cetaceous adj సముద్రపు పెద్ద చేప సంబంధమైన. the * tribes పెద్ద చేపలు.
Ceteris adv యిది లాటిన్ శబ్దము, కడమ వన్ని సరిగా వున్నప్పటికిన్ని వేరే విశేషము లేకుంటే. every animal is * fiercer when tied up or confined తక్కినవల్ని సరిగా వుండె పక్షమందు బోనులో వేసిపెట్టే మృగమునకు క్రౌర్యము అధికము, అనగా కట్టిపయట్టిన మృగమునకు క్రూరత్వ మధికము. I had rather live at Bangalore * than at Madras తక్కినవన్నీ సరిగా వుండె పక్షమందు పట్నములో వుండడమునకంటే బెంగుళూరిలో వుండడము మేలు. cotton lasts as-long-as hemp అన్నీ సరిగ్గా వుండె పక్షమందు కితనార గుడ్డ యెన్నాళు వుంటుందో నూలుగుడ్డానున్ను అన్నాళ్లు వుంటుంది.
Chace n s See Chase.
Chaco n s దండులో తొడుక్కునే వక కుళ్లాయి.
Cha-droon n s పేగులు.
Chaff n s పొట్టు, వుమక, తవుడు, పొల్లు. of oil seeds మాన. they were driven away like * before the wind ఘాలికి యెంగిలాకులవలె యెగిరిపోయిరి.
Chaffinch n s పిచ్చికవంటి వక పిట్ట.
Chafing-dish n s కుంపటి.
Chagrin n s మనస్తాపము, విసుకు, వేసట, అసహ్యము, చీదర.
Chagrined adj మనస్తాపముపడ్డ, చీదరపడ్డ, ఆయాసము పొందిన.
Chain n s గొలుసు, క్రమము, పరంపర. chains of fetters సంకెళ్లు. he brought them in chains వాండ్లను సంకెళ్ళతో తెచ్చినాడు. as * of mountains వరసగా వుండే పర్వతముఉ. A * of ideas వకటి మీద వకటి తోచడము. measurement మషాతు గొలుసు, అనగా నేలను కొల్చే గొలుసు.
Chained adj కట్టిన, గొలుసుతో కట్టిన, తగిలించిన, సంధించిన, సంకెళ్లు వేసిన, కూర్చుకొన్న.
Chain-pump n s నీళ్లు చల్లే యినపతొట్ల గొలుసు యంత్రము.
Chain-shot n s జంటగుండ్లు, జమిలి గుండ్లు, రెండు ముండ్లకు బారెడు గొలుసును తగిలించి ఫిరంగిలో వేసి కాలుస్తారు.
Chain-work n s గొలుసు పని.
Chair n s కురిచి. a sedan * నాల్కీ, టాంజా. at this meating he took the * యీ సభలో అతను సభా నాయకుడుగా వుండెను. a * of state గద్దియ, సింహాసనము. garden * మనిషి యీడ్చే వక తరహా చిన్న బండి.
Chairman n s. (orPreseident) సభా నాయకుడు. or bearer బోయి, పల్లకీ మోసేవాడు, కూలివాడు.
Chair-obscure n s cI jIkati, mabbu yixi ciwrapanilo cIkatigA kanipiMcetattu vrAsinaxi.
Chaise n s బండి.
Chalcedony n s యెర్రనిస్ఫటికము, పుష్యరాగము, కురివిందము, కురింజి.
Chaldorn n s కొలత, సుమారు వెయి శేర్ల ప్రమాణము.
Chalice n s కలశము, పాత్ర, గిన్నె.
Chalk n s (White) శీమ సున్నము. or soapy pot stone like slate pencil బలపము. red * జూజువన్నె, యెర్ర కావిరాయి, గైరికము.
Chalk-pit n s శీమ, సున్నపుగని, శీమ సున్నము తవ్వే పల్లము.
Chalky adj తెల్లటి, శీమ సున్నము వంటి.
Challenger n s జగడానకు, పిలిచేవాడు, రా, వొక చెయ్యి, చూతాము, అనేవాడు.
Chalybeate adj కారమైన. * waters యిది వొక తరహా కారమైన నీళ్లు, భేదికి పనికివస్తున్నది.
Cham n s (of Tartary) టార్టరి దేశాధిపతి.
Chamade n s వోడిపోయినామని తమకు తామే తంబరు కొట్టమని చేసిన సంజ్ఞ they beat the * వాండ్లు వోడిపోయినారు.
Chamber n s గది, అర. upper * మిద్దె మీద వుండే గది. a * for audience or homage కొలువు కూటము. privy * రాణి వాసము, అంతఃపురము the council * రచ్చ పట్టు సభ. bed * పడకిల్లు. * maid దాది, బానిశ. * pot మూత్ర భాండము. chamber lie వుచ్చ. he made a * in the rock పర్వతములో బొక్క చేసినాడు. గుహ చేసినాడు. the * of a gun తుపాకి గొట్టములో ముందువుండే స్థానము.
Chamberer n s విటగాడు, విటపురుషుడు.
Chamberlain n s . రాజు గృహకృత్యమును విచారించుకొనే దళవాయి.
Chameloen n s తొండ, వూసరవెల్లి సరటము, కృకలాసము, దీనికి ప్రతిక్షణ మందున్ను వేరే వొక వన్నె వస్తుంది. he is as changeable as a * వాడికి నిమిషానకు వక గుణము.
Chamois n s కొండ మేక.
Chamomile n s చేమంతి వంటి వక చెట్టు.
Champagne n s వక తరహా సారాయి. commonly called Simpkinor Jumpwine!
Champaign n s బయిలు, మైదానము.
Champignon n s See Mushroon.
Champion n s రక్షకుడు, పక్షవాది, అసహాయ శూరుడు. he is the great * for education వాడు విద్యా పక్షవాది, వాడు విద్యా సంరక్షకుడు.
Chanbering n s వ్యభిచారము, పడుపు.
Chance n s అదృష్టము, ప్రాప్తి, భాగ్యము యోగము, గతి, దైవఘటన. says D+ in 1 Sam. 6.9. and Eccl. 9. 11.) by * అకస్మాత్ A+. హఠాత్తుగా, అవశాత్తుగా. Z. అదాట్టుగా, అకస్మాత్తుగా, తనంతటనే, దైవాధీనముగా. there is every * of his coming వాడు బహుశా వచ్చును.I will take my * నా అదృష్టము చూతాము. only give me a * నాకు రవంత అవకాశము మాత్రము యియ్యి. If by any * he should come here వాడు వొక వేళ యిక్కడికి వస్తే. in the * of his not coming వాడు రాని పక్షమందు, వాడు రాని యెడల. there is no * of his giving .it .వాడు .యిచ్చేగతిగా వుండలేదు, వాడు యిచ్చే మాట కానము. you give me no * నీవు అవకాశమివ్వడము లేదు. you have no * with him వాడు యెక్కడ నీవు యెక్కడ. a child has no * with a man బిడ్డ యెక్కడ పెద్దవాడు యెక్కడ. అనగా బిడ్డ పెద్దవాడికి యెదురుకాదు, పెద్దవాడితో పోరాడ నేరదు. have you calculated the chances of his being deador absent వాడు చచ్చినమాటైనా లేక, వెళ్లిపోయిన మాటైనా ఆలోచించుకొన్నావా a *crop పడు మొదలు పడువరి. chance-medley ఆ బుద్ధి పూర్వకముగా చేసిన నేరము,తన్ను యెరుగక వచ్చిన తప్పు. a guest అతిధి, అభ్యాగతుడు. All nature is but art unknown to thee? All chance direction which thou can not see. (Pope, in Johnson's Dicty). ఆకస్మిక మనేది నీకగుపడని దైవసంకల్పమేను అనగా ఆకస్మిక మనేదెక్కడిది అంతా దైవ సంకల్పమే అయితే అది మనకు కుదరదు.
Chancel n s గర్బగృహము, హోమస్థానము.
Chancellor n s పెద్ద న్యాయాధిపతి. *of the exchequer శిరస్తే దారుడివలె రివినియూ సంగతులను విచారించే పెద్ద మంత్రి, అనగా రివినియూ పనులను గురించిన అధిపతి అయిన మంత్రి. Lord * సర్వాధ్యక్షుడైన న్యాయాధిపతి, రాజగురువు.
Chancery n s సీమలో వుండే వక తరహా న్యాయ సభ.
Chancre n s పొక్కు, సవాయి పొక్కు.
Chandelier n s కొంమల శెంమె, లస్తరు, పంగలుగా వుండే దీపస్తంభము.
Chandler n s మైనపు 1వస్తులు అమ్మేవాడు. tallow * కొవ్వు వత్తులు అమ్మేవాడు.Chandler's shop చిల్లర దుకాణము.
Change n s మార్పు, వినిమయము, పరివర్తనము, వకటిని యిచ్చి మరి వకటిని తీసుకోవడము, బదలాయింపు. a * took place in his business వాడి పనిలో భేదము సంభవించినది. a * of linen వక దుస్తు బట్టలు. I have no change of clothes నాకు మారుబట్ట లేదు. * of form పరిణామము మారురూపు, రూపాంతరము. * of dishes మారు వడ్డించడము. He is gone there for * of air నీళ్ల సౌఖ్యానికి అక్కడికి పోయినాడు. a * of colour వైవర్ణ్యము, వర్ణము మారడము. or small coin చిల్లర నాణ్యము. Give me * for this note యీ నోటుకు రూకలు యియ్యి. Loss upon * of money వట్టము. or place of meeting for merchants వర్తకులు కూడే స్థానము. * of the moon అమావాస్య, పౌర్ణమి.
Changeable adj చంచలమైన, చపలమైన, అస్థిరమైన.
Changeableness n s చాంచల్యము, చంచలత్వము, చపలత్వము, భ్రమ.
Changed adj మారిన, మార్చిన.
Changeless adj శాశ్వితమైన, నిర్వికారమైన, మారని.
Changeling n s అవిటి మనిషి, కురూపి, పిచ్చివాడు, పుట్టువెర్రి. a sickly infant దేవతులు మంచి యోగ్యమైన బిడ్డను యెత్తుకొనిపోయి దానికి బదులుగా వొక పనికిమాలిన పిల్లను వుంచి పోయినట్టు కథ కలదు.
Changer n s మార్చేవాడు. money * సరాబు.
Changing adj అస్థిరమైన, నమ్మరాని. a * bule tint వైడూర్య వర్ణము.
Chanllenge n s జగడానకు పిల్వడము, నీవు చెయ్యి చూతామని చెప్పడము. by a sentry పహరావాడు ఆ వచ్చేదియెవరు అని యెచ్చరించడము. I accept your * or definance హో హో నాచేత కాదని అంటావా, రా చూతాము.
Channel n s కాలువ, తూము. outlet అలుగు. means ద్వారము, ముఖాంతరము.the secretary is the * of communication మనిషీ ద్వారా వుత్తర ప్రత్యుత్తరములు జరుగుతూ వుంటవి. they made me the * for this business యీ పని నా ముఖాంతరముగా జరిగించినారు. Arm of the se కయి. The sea between England and Ireland is called the Irish Channel. That between England and France is the British Channel.
Channelled adj కాలవగల. a road * by the rain వానకు కాలవగా కోసుకొని పోయిన భాట.
Chant n s పాట, పదము, సంగీతము, గానము, దండకము.
Chanter n s పాటకుడు, గాయకుడు.
Chanticleer n s కోడిపుంజు, కోతికి తిమ్మడు అన్నట్టు యీ పేరు కావ్యములో పుంజుకు చెల్లుతుంది.
Chanting n s పాట, గానము.
Chaos n s సృష్టికి మునుపు జలస్థలాదులు మిశ్రమముగా వుండడము, ఏక సంకరము, కలగూర గంప, తల తోక లేక పడి వుండేటిది, అధ్వాన్నము. God made the world out of * కలగూరగంపగా వుండే పదార్ధములలో నుంచి దేవుడు ప్రపంచమును సృష్టి చేసినాడు. a * of papers తల తోక లేక పడి వుండే కాకితములు.
Chaotic adj అధ్వాన్నముగా వుండే, కలగూర గంపగా వుండే, గిలిబిలిగా వుండే,తల బీకర కాయగా వుండే, గజిబిజిగా వుండే.
Chap n s అనగా chapter అధ్యాయము, సర్గ.
Chapel n s చిన్నగుడి. A * at the entrance of a temple ముఖమంటపము.
Chaperon n s పెద్ద ఆబిడె, రక్షకురాలు, పెద్ద దిక్కుగా వుండే స్త్రీ, అనగా పశిపడుచులను, విందు, పెండ్లి, వేడుకలు మొదలైనవాటిని చూడడమునకు పిలుచుకొని పొయ్యే పెద్ద తలగా వుండే ఆబిడ.
Chapfallen adj ముఖము, చిన్న బుచ్చుకొన్న, భంగపడ్డ.
Chapiter n s బోదె, స్తంభము మీద వుండె కోణిగె.
Chaplain n s గురువు, ఆచారి, పురోహితుడు.
Chaplainship n s పౌరోహిత్యము.
Chaplet n s మాలిక, పూలదండ, జపమాలిక.
Chapman n s వ్యాపారము, చేసేవాడు, అనగా కొనేవాడు, అమ్మేవాడు. he wanted to sell his horse and soon found a * గుర్రము అమ్మవలెనని వుండగా కొనేవాడు చిక్కినాడు.
Chapped adj యెండిపోయిన, బీటికలు బాసిన, పగుళ్లు బారిన. the ground was * ఆ నేల బీటికలు బాసినది.
Chaps n s plu. నోరు, యిది నీచమాట.
Chapter n s అధ్యాయము, ఆశ్వాసము, మరిన్ని. a court గురువుల యొక్క సభ.
Char n s a fish వక తరహా చేప.
Character n s or mark ఆనవాలు, గుర్తు, చిహ్నము. a letter అక్షరము. a book in the Kanarese * కన్నడి అక్షరములతో వ్రాసిన గ్రంధము. or reputation పేరు కీర్తి, నాణ్యము, మానుషము. a man of good * యోగ్యుడు, పెద్ద మనిషి. a man of bad * అయోగ్యుడు, దుష్టుడు. he gave them a good * వాండ్లు యోగ్యులని చెప్పినాడు. he gave them, a bad * వాండ్లు అయోగ్యులన్నాడు. he bears a good * యోగ్యుడని పేరెత్తినాడు. he gave his servant a * తన పనివాడికి యోగ్యతా పత్రిక యిచ్చినాడు. the * of the country is mountainous అది కొండల ప్రదేశము. or account సంగతి, వివరము. he gave me a bad * of the place అది మంచి భూమి కాదని నాతో చెప్పినాడు. or disposition స్వభావము, సహజగుణము, నడత. or person మనిషి. or personation వేషము. humane * దయాళువైన వాడు. a public * ప్రసిద్ధుడు a contemptible * పోకిరి he is a sporting * వేటే పనిగా వుండేవాడు. he acted the * of Krishna కృష్ణ వేషము కట్టినాడు. he went there in the * of a Magistrate మేజిస్ట్రేటు అధికారమును పట్టి అక్కడికి పోయినాడు. he acted quite in * వాడు తన సహజగుణముతో ప్రవర్తించినాడు, వాడు తన స్వవృత్తి చొప్పున నటించినాడు. he acted quite out of * స్వవృత్తి తప్పి నడిచినాడు.
Characteristic n s గురుతు, ఆ సవాలు, లక్షణము, చిహ్నము.
Characteristical adj స్వభావమైన, సహజమైన, గురుతైన, లక్షణమైన.
Characteristically adv స్వభావముగా, సహజముగా, గురుతుగా, లక్షణముగా.
Charcoal n s బొగ్గు.
Charde n s ప్రశ్న, అనగా దీని భావమేమి తిరుమలేశ అనే తీరుగా వుండే విడి కథ.
Chared-wood n s నిప్పు చేత కాలి నల్ల బడ్డ కర్ర.
Charge n s care custody వశము, అధీనము. expense, cost వ్రయము, శెలవు, వెల కూలి. he bore my charges నాకు పట్టిన శెలవు అతని పెట్టుకొన్నాడు. he got it free of charge వాడికి అది తేరకు వచ్చినది. accuation, imputation నింద, నెపము, అపరాధము. a false * అపనింద, అపోహము, అభాండము, తప్పు ఫిర్యాదు he filed a * against them వాండ్ల మీద ఫిర్యాదు వ్రాసి దాఖలు చేసినాడు. Onset or attack ఆ క్రమణము, యెదిరింపు, ధాటి. he brought his spear to the * ఈటెతో పొడవవచ్చినాడు. Commission,trust conferred, భారము, బరువు. the prisoner was in my * or, I wasin * of the prisoner ఆ ఖైది నా వశములో వుండినాడు. he was in * of thehouse; or, the house was in his * ఆ యిల్లు వాడిపరముగా వుండినది I was in * of the school in his absence వాడు లేనప్పుడు నేను ఆ పల్లె కూటము చెప్పుతూ వుంటిని. his children are my * వాడి బిడ్డలు నా పోషణలో వున్నారు. of powder and ball in a gun ఘట్టించి వుండే మందుగుండు, బారు చేసి వుండే మందుగుండు. he lodged the * in my leg వాడు కాల్చిన గుండు నా కాలిలో పారినది. he drow the * of his gun ఘట్టించివుండే మందుగుండును బైటికి తీసివేసినాడు. precept, command ఆజ్ఞ, a speech బిషపుగాని, న్యాయాధిపతి గాని చెప్పే బోధ. the judge delivered a charge to the jury న్యాయాధిపతి జూరీలకు బోధ చేసినాడు. he took * of the house ఆ యింటిని వొప్పగించుకొన్నాడు, వశము చేసుకొన్నాడు. he gave me * of the house ఆ యింటిని నాకు వొప్పగించినాడు.
Charge' d' affaires n s an ambassador మంత్రి పని చూచే వొకగుమాస్తా.
Chargeable adj imputable మోపదగ్గ. this silk is * with duty యీ పట్టుకు సుంకము తీరవలసినది. this offence is * to his father యీ తప్పు వాడి తండ్రిది. this is * to your own folly యిది నీ పిచ్చితనము వల్లనే సంభవించినది. as I wished not to be * to you నా వల్ల మీకు బరువు వద్దని, నా వల్ల నీకు వ్రయము వద్దని.
Charger n s or tray తాంబాళము. a war horse యుద్ధాశ్వము.
Charily adv పోణిమిగా, పదిలముగా, కరుతుగా, భద్రముగా.
Charinoss n s పోణిమి, పదిలము, కరుతు, భద్రము.
Chariot n s బండి, రధము. a divine car దేవయానము, విమానము, తేరు.
Charioteer n s సారధి.
Charitable adj దాత అయిన, మంచి, దయాళువైన, ధర్మాత్తుడైన, పుణ్యాత్ముడైన.a * man దాత, వుపకారి. for * purposes ధర్మానికి. a * deed సత్క్రియ. thisremark was not charitable యిది క్రురమైన మాట.
Charitableness n s benevolence దాతృత్వము, ధారాళము.
Charitably adv ఉపకారముగా, ధర్మముగా, పుణ్యానికి, కనికరముగా. he *supposed that they did this unintentionally వాడు మంచివాడు గనుక అబుద్ధిపూర్వకముగా దాన్ని చేసినారను కొన్నాడు.
Charity తాళిమి. charity is an active virtue : endurance and temperance are *virtues ధర్మము ఆచరణ రూపమైన గుణము, సహనమున్నుమితమున్నుఅనుభవరూపమైనగుణములు
Charlatan n s a cheat పండితంమన్యుః అనగా పండిత వేషము వేసుకొన్నవాడు, గారడాలమారి. an ignorant doctor వైద్యుడని వేషము వేసుకొన్నవాడు.
Charles's-wain n s సప్తర్షి నక్షత్రములు, చిత్రశికండి.
Charm n s a magic spell మంత్రము, కట్టు, కవచము, రక్ష. he threw a * over them వాండ్లకు పొడిచల్లినాడు. attraction ఆకర్షణము. my wife being dead every thing has lost its * నా పెండ్లాము చచ్చినందున నాకు అన్ని ఆశలు విడిచినవి. love throws. a charm over every thing తాను వలసినది రంభ అన్నట్టు తానువలసినదే దివ్యము. this place has many charms for me యీ స్థలము నాకు అనేక విధాల రమణియ్యముగా వున్నది. learning has no charms for him వాడికి చదువు మీద ఆశ లేదు. something that pleases irresistably మనోహరమైనది, మరులు కొలిపేటిది,రంజకమైనది. she had many charms దానివద్ద అనేక స్వారస్యములు వుండినవి.
Charmed adj మంత్రించిన, వలపించిన. a * ring మంత్రించిన వుంగరము. he bears a * life మంత్ర కవచము కలవాడై వున్నాడు. he was * at the sight of her దాన్ని చూచి సంతోషపడ్డాడు.
Charmer n s మాంత్రికుడు, సొగుసు కత్తె, అందకత్తె, ముద్దులాడి. a snake * పాము మంత్రగాడు.
Charming adj సుందరమైన, ముద్దైన మనౌహరమైన, రమ్యమైన, మంచి. a *woman మనోహరమైన స్త్రీ. a charming child ముద్దుగా వుండే బిడ్డ. a * poemకావ్య చూడామణి.
Charmingly adv ముద్దుగా, రమ్యముగా, మనోహరముగా, సరసముగా.
Charnelhouse n s శల్యా గారము అనగా మనిషి యెముకలను పోసిపెట్టే యిల్లు.
Charpoy n s (bedstead) మంచము, నులక మంచము.
Charred adj కలి నల్లపారిన.
Chart n s జలగోళపటము, భూమిని గురించి Map యెట్లాగో సముద్రమును గురించి Chart అట్లా వుపయోగించబడుతుంది.
Charter n s రాజశాసనము, స్వతంత్ర పత్రిక.
Chartered adj శాసన పూర్వకముగా యిచ్చిన, శాసనము పొందిన స్వతంత్తరము గల.
Charter-party n s రాజశాసనము గలవాలడు.
Charwoman n s కూలిది, దినకూలిది.
Chary adj భద్రముగా వుండే, పదిలముగా వుండే, ఎచ్చరికగల, మితవ్రయము చేసే.
Chase n s hunting వేట, తరుముకొని పోవడము. or seeking వెతకడము. I went there in * of him వాణ్ని వెతుక్కొని పోయినాను. they live by the * వాండ్లకు వేటే వృత్తి. or open space వేటాడెబయిలు, మైదానము. stern chaser వాడ ముక్కు పిరంగి, తరిమి ముడ్డి మీద కాల్చే ఫిరంగి.
Chasm n s బీటిక, గండి, కనమ, సందు. in a book గ్రంధపాతము, లోపము. chasms పగుళ్లు.
Chaste adj పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, వ్యభిచారము లేని, కచ్ఛశుద్ధిగల. a * woman కచ్ఛశుద్ధి గలది, పతివ్రత, సుశీల. a * style పిచ్చి శృంగారము లేని శయ్య. the Sacuntala is written in a very * style శాకుంతలము యొక్క శయ్య మహా సరళముగా వున్నది. the * tree వావిలి చెట్టు.
Chastely adv పతివ్రతగా, సన్మానముగా, పిచ్చి శృంగారము, లేక, సరళముగా.
Chastened adj శిక్షించబడ్డ, దండించబడ్డ, మితమైన, సరళమైన.
Chasteness n s పారిశుధ్యము, కచ్ఛశుద్ధి, సరళత.
Chastity n s పారిశుద్ధ్యము, కచ్చశ్ఛుద్ధి. an offence against * వ్యభిచారము, రంకు. From the * of his style వాడి శయ్య యొక్క సరళత చేత.
Chastized adj శిక్షించబడ్డ, దండించబడ్డ. a * spirit దీన భావము, శమము, దమము. a man of * spirit శమదమములు గలవాడు. a * style సరళమైన పాకము.
Chastizement n s శిక్ష, దండన. the loss of his son was a * to him కొడుకు చావడమే వాడికి శిక్ష గర్వభంగము.
Chat n s ముచ్చట, సల్లాపము.
Chaterer n s వదురుబోతు.
Chatney, or Chutney n s. (pickle) వూరగాయ, "Green sauce" is the English word.
Chatter n s పిచ్చికూత, వదురు. the Hindustani word for an umbrellaగొడుగు.
Chatter box n s వదురుబోతు.
Chattering n s వదురు, పిచ్చికూత.
Chattles n s గృహోప కరణములు. యింటి సామాను, తట్టుముట్టు, జంగమములు.His goods and chattels వాడి సర్వస్వము, వాడి యావత్తు సొత్తున్ను.
Chatty adj సరసముగా మాట్లాడే, ముచ్చట్లాడె.
Chay n s (add,) Indian Madder:- Oldenlandia umbellata.
Chay, or chayroot, or choya-root n s. చిరివేరు, చాయవేరు.
Cheacoy n s (a corruption of) శీకాయ.
Cheap adj చవుకైన, నయమైన, అగ్గువైన. a * part of the country సుభిక్షముగా వుండె దేశము, అగ్గువగా వుండె దేశము. he bought it at a * rate దాన్ని నయముగా కొన్నాడు. when it grew or became * అది నయమైనప్పుడు. he bough the house * ఆ యింటిని నయముగా కొన్నాడు. In this country horses are dog * యీ దేశములో గుర్రములు కుక్కల మురికిగా వున్నవి. he holds them very cheap వాండ్లను అలక్ష్యపెట్టుతాడు.
Cheaper adj నయమైన, చవుకైన. when rice becomes * బియ్యము నిండానయమై నప్పుడు.
Cheaply adv చవుకగా, అగ్గువగా, అలక్ష్యముగా, స్వల్పముగా. he spoke very *of them వాండ్లను నిండా అలక్ష్యముగా మాట్లాడినాడు.
Cheapness n s చవుక, అగ్గువ. from the * of this rice యీ బియ్యముచవుకైనందున.
Chearacterized adj చిహ్నముగా వుండె, లక్షణముగా వుండె, పేరుగల, ప్రసిద్ధమైన. the Hindu are * by patience హిందువులు శాంతులని ప్రసిద్ధము, హిందువులకు లక్షణము శాంతి.
Cheat n s మోసము, మాయ, పితలాటకము, వంచన, టక్కు. or rogue మోసగాడు, వంచకుడు, కేపుమారి. "When I consider life, it is all a cheat." (Dryden, here quoted by Johnson) జీవము వట్టి మాయ.
Cheated adj మోసపోయిన, వంచించబడ్డ.
Cheater n s దొంగ, మోసగాడు, వంచకుడు, మాయలమారి.
Cheating n s మాయ, మోసము, వంచన, పితలాటకము.
Check. n. s. Stop, hinderanceఆటంకము,నిరోధము,నిఘ్నము, his presence formed a * on conversation అతను సమక్షమమందు వుండడము సంభాషణకు అభ్యంతరమైనది. I will set you as a * over them వాండ్ల మీద నిన్ను పైవి చారణిగా పెట్టుతాను. She put a * on her grief ఆమె తన దుఃఖాన్ని కడుపులోకి దించుకొన్నది. he put no * on his grief వూరికె యేడ్చినాడు. or bill హుండి. or reprimand కూకలు, నిగ్రహము. Cloth woven in squares పప్పిళిబట్ట, మళ్లబట్ట. at chess షహా.
Checked adj అభ్యంతరమైన, విఘ్నమైన, ఆటంకపడ్డ. his returning was * by rain వాడు మళ్లి రావడానకు వాన అభ్యంతరమైనది.
Checkered adj చిత్రవిచిత్రమైన, నానా వర్ణములు గల. They were dancing in the * shade కొంచెము నీడ కొంచెము యెండగా వుండే చోట ఆడుతూ వుండిరి. Life is all * with joys and with woes యెవడికిన్ని కొన్నాళ్లు సుఖము కొన్నాళ్లు దుఃఖము, కొన్నాళ్లు వెన్నల కొన్నాళు చీకటి.
Checkers n s plu. చదరంగ పలక.
Checker-work n s మళ్లుమళ్లుగా వుండే పని.
Checkmate n s మాతు, యిది చదరంగములో చెప్పే మాట.
Cheek n s దవడ, చంప. the inside of the * బుగ్గ, పుక్కిలి. of a fire place యెత్తుగడ్డలు పొక్కటి రాళ్లు. a * wall చెవిగోడ.
Cheek-bones n s దవడ యెముకలు, కటు మోరలు. he has high * వానికి కటు మోరలు వుబ్బుగా వున్నవి.
Cheek-tooth n s దవడ పల్లు.
Cheer n s రసము, భావము. entertainment భోజనము విందు. good *సరసాన్నము, సుభోజనము. gaity ఉల్లాసము. courage ధైర్యము. he of good *ధైర్యముగా వుండు Sad * వ్యాకులము. what * ! క్షేమమా. what * brother ఓ అన్నామీరెట్లా వున్నారు. they gave a * జయము జయ మని అరిచినారు. when they sawhim the whole army gave a * వాణ్ని చూచి దండంతా యేకముగా జయజయశబ్దమును చేసినది. they received him with cheers జయము జయమని అతణ్నిగైకొన్నారు.
Cheerer n s ఉల్లాసకారి, ఆహ్లాదకారి.
Cheerful, orcheerful adj సరసమైన. ఉల్లాసమైన, ఉత్సాహమైన, ప్రసన్నమైన.
Cheerfully adv సరసముగా, సంతోషముగా, ఉత్సాహముగా.
Cheerfulness n s ఉల్లాసము, ఉత్సాహము, సొంపు, సరసము.
Cheering adj సంతోషకరమైన, ఉల్లాసమైన, ఓదార్పైన.
Cheerless adj ఉత్సాహము లేని, ఉల్లాసము లేని, దిక్కుమాలిన, పాడైన.
Cheery adj సరసమైన, ముద్దెన.
Cheese n s జున్నుగడ్డ, మరిన్ని. Damson cheese జున్ను గడ్డవలె చేసిన వక తరహా మిఠాయి.
Cheese-cake n s వకతరహా మిఠాయి.
Cheese-monger n s వెన్ను జున్ను మొదలైనని అమ్మేవాడు.
Cheese-press n s జున్నుపిండే అచ్చు పీట.
Cheese-vat n s జున్ను చేసే తొట్టి.
Cheetar or Cheetur n. s. (a hunting leopard.) చిరతపులి,శివంగి,చివ్వంగి
Chef d'ouvre n s ముఖ్యమైన పని. the Vasu Charitra is the * of Telugu poetry వసు చరిత్ర ఆంధ్రకావ్య రత్నము, ఆంధ్రచూడామణీ.
Chemical adj రసవాద సంబంధమైన.
Chemise n s ఆడవాండ్ల పడక వుడుపు, మొలగుడ్డ, లో కొంగు అనవచ్చును.
Chemist n s రసవాదము చేసేవాడు, మందు సరుకులు కట్టేవాడు.
Chemistry n s రసవాదము, రసగంధ పాషానాదులను కట్టడము.
Cheque, check n s. హుండి.
Chequered,Checkered adj నానా వర్ణములు గల, See Chekered.
Cherished adj పోషించబడ్డ, పెంచిన, పాలించిన, long * plan బహుదినములుగా వుండే యోచన.
Cherisher n s పోషకుడు, రక్షకుడు, పాలకుడు.
Cherishing n s పోషణము, రక్షణము, పాలనము,
Cheroot n s పొగచుట్టు.
Cherrup n s వూరపిచ్చుక కూత, కుక్కను, చూ, గుర్రమును, దా, అని పిలువడము.this news gave a * to his heart యిందువల్ల వాడి మనసుకు వుల్లాసమైనది.
Cherry n s వక తరహా యెర్రని, పండు, దొండ పండువలె యెర్రగా గుండ్రనైన వక తరహా పండు. * brandy యీ పండ్లతో చేసినసారాయి. * checked యెర్రని చెక్కిళ్లుగల. * lipped బింజొష్టియైన. the Brazil * బుడ్డమిసిరి పండు.
Cherub n s వక తరహా దేవదూత, గంధర్వుడు. the little * మిక్కిలి అందమైన బిడ్డ.
Cherub, Cherubim A+ says కిరూబు which is Hebrew.R. says కెరూపి.
Cherubic adj స్వర్గసంబంధమైన, దేవదూత సంబంధమైన. the * legionsగంధర్వ సేన.
Cherubin n s దేవదూతలు, గంధర్వులు, యిది నిత్య బహువచనము.
Chervu n s వకతరహా కసువు.
Chess n s చదరంగము, చతురంగము. The following are the phrases: the board పయట్టె పలక. a move యెత్తు. a guard కాపు. a piece or man శారి, కాయ. chessmen బలము. the king రాజు. the Queen మంత్రి. the tower, rook or castle యేనుగ. the bidshop రథము, శకటము, ఒంటె. the knight గుర్రము. the pawn బంటు. they were playing at * చదరంగమాడుతూ వుండిరి.
Chess-board n s చదరంగమాడే సలక.
Chess-player n s చదరంగమాడే వాడు.
Chest n s పెట్టె భోషాణము. A * of drawers అల్మారా, బీరువ, సామానులువుంచిన పెట్టె. or breast రొమ్ము.
Chestnut, Chesnut n s. బాదాము వంటి వక తరహా అడివికాయ. దీనిపప్పు కాల్చితింటారు. horse * యిదే పెద్ద తరహా కాయ, దీని పప్పు తినరు. * colour టేకుమానివర్ణము. * hair పల్ల వెంట్రుకలు. a * horse పల్ల వర్ణమైన గుర్రము.
Chevalier n s క్షత్రియుడు, కొన్ని చోట్ల తురుపు సవారు అని అర్థము. the young * నూరు యేండ్ల కిందట రాజ్యమును గురించి యత్నము చేసిన వక పురుషుడు, యితనికి. The Pretender అనే పేరు కలదు.
Chevaux-de-frise n s గ్రాది మొనలు గలది, యిందుకు వుచ్చారణ షషవ్వోడీ ఫ్రిజ్.
Chewed adj నమిలిన, నెమరు వేసిన.
Chicane, Chicanery n s. పితలాటకము, కృత్తిమము, మోసము, తక్కిడి.
Chick n s కోడిపిల్ల కొన్ని చోట్ల బిడ్డలను గురించిన్ని ముద్దుగా చెప్పుతారు.
Chicken n s కోడిపిల్ల, కోడి. chickens కోడి పిల్లలు, కోళ్లు. (the vulgar word at Madras is సగము కోడి.
Chicken-hearted adj భయస్థుడైన, పిరికైన.
Chicken-pox n s తట్ట అమ్మవారు, చిన్న అమ్మవారు.
Chick-pea n s శనగలు.
Chick-weed n s దొగ్గలి కూర.
Chicory n s వక తరహా గడ్డ.
Chiding n s కూకలు, రోతలు, చీవాట్లు.
Chief adj ముఖ్యమైన, ప్రధానమైన, ఉత్తమమైన, శ్రేష్ఠమైన, గొప్ప. * Justiceపెద్ద న్యాయాధిపతి. the * gate of a palace సింహద్వారము we entered bythe * gate పెద్ద గవినిగుండా పోతిమి. in * ముఖ్యముగా. Chief, n. s. పెద్ద, ముఖ్యుడు, ప్రముఖుడు. the * of an army మొనగాడు, నాయకుడు, సరదారు.
Chiefly adv ముఖ్యముగా.
Chieftain n s సరదారు నాయకుడు, మొనగాడు, సేనాపతి.
Chieftainship n. s. పెత్తనము, మొనగానితనము,ప్రముఖత.
Chilblain n s శీతకాలమందు పిల్లకాయలకు సంభవించే గజ్జి వంటి వక రోగము, బొబ్బలు.
Child n s బిడ్డ, పడుచు, పిల్ల, పిల్లకాయ. his children ఆయన సంతతి, ఆయన వంశము. Child ! or my dear ! అమ్మాయి, అమ్మాయి, పిల్ల, వోసి. Ever since I was a * చిన్నప్పటినుంచి, నాకు బుద్ధి తెలిసిన నాటనుంచి. She is with * ఆమె గర్భముగా వున్నది ఆమె కడుపుతో వున్నది. this expression is the child of caprice యిది అకారణముగా పుట్టిన మాట. Ruin is the * of carelessness నాశనము అజాగ్రతవల్ల కలిగేటిది. To translate this was mere child's play to him దీన్ని వాడు అవలీలగా భాషాంతరము చేసినాడు అనగా దీన్ని భాషాంతరము చేయడము వాడికి అతి సుళబము. In scriptural phrase, a * of light జ్ఞానవంతుడు తెలిసినవాడు. a * of wisdom బుద్ధిశాలి, జ్ఞాని. a * of peace శాంతుడు,దాంతుడు. a * of wrath శాప గ్రస్తుడు. a * of his world or a * of darkness or a * of sin ఇహపరుడు, ఐహితబద్ధుడు, పాపాత్ముడు.
Childbearing n s ప్రసవము, కానుపు.
Childbed n s ప్రసవము, కానుపు. a woman in * బాలింతరాలు.
Childbrith n s ప్రసవము, ప్రసూతి, కానుపు.
Childe అనగాKnightశూరుడు
Childermass n s వొక పండుగ.
Childhood n s బాల్యము, శైశవము, పసితనము. ever since * చిన్నప్పటి నుంచి second * రెండో బాల్యము, అనగా అతి వృద్ధాప్యము. he is in second *అధికవృద్ధాప్యము చేత బిడ్డవలె వున్నాడు, తెలివి తప్పి వున్నాడు.
Childish adj బేల, తెలివిమాలిన, పిచ్చి a * whim పడుచు బుద్ధి.
Childishly adv పసితనముగా, పడుచు తనముగా, పిచ్చిగా.
Childishness n s పసితనము, పిల్లతనము, పడుచుతనము, పిచ్చితనము.
Childless adj బిడ్డలు లేని, సంతులేని. he died * నిస్సంతుగా చచ్చినాడు.
Childlike adj బేలయైన, సాధువైన, సాత్వికుడైన. a * simplicity వాత్సల్యము.
Children n s plu బిడ్డలు సంతాను. These are the * of the Musulmans who came here three hundred years ago వీండ్లు మూన్నూరు యేండ్లకు మునుపుయిక్కడికి వచ్చిన తురకవాండ్ల వంశస్థులు.
Chiling adj జిల్లుమని వుండే, చల్లగా వుండే, అఘోరమైన, భయంకరమైన. * wind గడగడ వణికే చలి. * intelligence అఘోరమైన సమాచారము.
Chill n s చలి, శీతలము, శైత్యము. She * of a fever జ్వరము యొక్క చలి.
Chilliness n s శీతలము, శైత్యము, చలవ.
Chilly adj చలితో వణికే. a * woman చలితో వణికే స్త్రీ.
Chime n s సమతాళము, ఏకతాళము, కొన్ని గడియారములలో పావుగంటకు వొక మాటు వక తరహా మధురమైన స్వనము కలుగుతున్నది, ముఖ్యముగా ఆస్వనము chime అనబడుతున్నది. a * of bells గంటల సంగీతము, రాగము, సప్తస్వరములు పలికేటట్టు చిన్నది పెద్దదిగా యేర్పరచబడ్డ గంటల యొక్క స్వరక్రమమైన నాదము.
Chimera n s వట్టి భ్రమ, పిచ్చి సందేహము, లేని పోని చింత, శరభ మృగము.
Chimerical adj భ్రామికమైన, భ్రమవల్ల పుట్టిన.
Chimney n s పొగగూడు.
Chimney corner n s సీమలో కుంపటి గూటి పక్కన హాయిగా కూర్చుండడానకై వుండే స్థలము.
Chimney piece n s పొగగూటి అడుగున శృంగారముగా కట్టిన చిన్న మిద్దె.
Chimney sweep n s పొగగూడు కడిగే కూలివాడు.
Chimpanzee n s వక తరహా కోతి.
Chin n s గడ్డము చబుకము. smooth chinned నున్నటి గడ్డముగల. doublechinned మడతలుబడే గడ్డముగల.
China n s చైనా దేశము, earthen ware పింగాణి, గాజు broken * పింగాణిపెంకు.
China man n s A Native of China చీనా దేశస్థుడు. Formerly a seller of crockery పింగాణులు అమ్మేవాడు.
China-rose n s వాసన లేని రోజా పుష్పము.
China-ware n s పింగాణి సరుకు.
Chincough n s కక్కువాయి, మాందదగ్గు.
Chine n s వీపు, వెన్ను, వెన్ను యెముకకు రెండు పక్కల వుండే మాంసము. of a roof వెన్ను బద్ద, వెన్నుపట్టె.
Chink n s బీటిక, సన్నమైన సందు, పగులు.
Chin-root n s పరంగి చెక్క.
Chintz n s కలంకారిగుడ్డ, చీటిగుడ్డ.
Chip n s పేడు, చివ్విన పొట్టు. chips పేళ్లు. పొట్టు, చివ్విన పొట్టు. a * hat తుంగతో అల్లిన టోపి.
Chiromancy n s సాముద్రికము.
Chirping n s కిచకిచలు.
Chirpingly adj కీచుకీచుమని.
Chirurgeon n s See Surgeon.
Chirurgical adj See Surgical.
Chisel n s పులి, కొయ్య పులి, రాతిపులి, చీరణము, టంకము.
Chiselled adj చెక్కిన, మలిచిన.
Chit n s (Note) చీటి. (child) పిల్ల, యిది తిరస్కారమైన మాట.
Chit-chat n s సుద్దులు, ముచ్చట మాటలు.
Chitgang read "Chittagong" this wood is the Mahogany of India
Chit-gang n s వొక దేశము పేరు. * wood ఆ దేశపు మాను.
Chittah, cheetur or leopard n s. చిరుతపులి.
Chitterlings n s పేగులు.
Chivalrous adj శౌర్యమైన, పరాక్రమము గల, వీరత్వముగల, అతి ఘనమైన. * act శూరకృత్యము.
Chivalry n s శూరత్వము, శౌర్యము.
Chives n s కింజల్కము, కేసరము.
Chlorosis n s పెండ్లి కాణి పడుచుల యొక్క విరహ తాప జ్వరము.
Chocolate n s వక తరహా పానకము. * colour మామిడి చిగురు వన్నె.
Choice adj ఉత్తమమైన, ఉత్కృష్టమైన. శ్రేషటమైన. * pieces or the bestparts మంచి తునకలు, సారాంశము. A * ruby శ్రేష్టమైన కెంపు మొదటి తరం కెంపు. The Sakontalam is a * piece of Sanscrit literature సంస్కృతములోశాకుతలము శ్రేష్ఠమైన గ్రంధము.
Choicely adv పరిష్కారముగా, బాగా.
Choiceness n s శ్రేష్ఠత్వము, ఉత్కృష్టత్వము.
Choir, or quir n s. పాటకుల మేళము, గుడిలో పాటకులు నిలిచే స్థలము.
Choirster n s గాయకుడు, పాటకుడు. Feathered choiristers శ్రావ్యమైనస్వరముగల పక్షులు.
Cholam n s (a sort of millet) జొన్నలు.
Choler n s చలము, క్రోధము, ఆగ్రహము.
Cholera, or Choleran s. వాంతి భ్రాంతి రోగము.
Choleric adj చలము పట్టిన, ఆగ్రహము గల, కోపియైన. a * man కోపిష్ఠి.
Cholum n s (a sort of grain) జొన్నలు.
Chop n s cut నరుకు. a mutton * మాంస ఖండము. A low word for food, a meal, భోజనము. A mutton chop పేల్చిన మాంసము. the chops, or inner cheeks పుక్కిళ్లు, నోరు, ముఖము. I saw him licking his chops వాడు తిండికి పుర పరలాడుతూ వుడినాడు. Stamp ముద్ర.
Chop-fallen adj veVlaveVla boyina. he was looked * veVlaveVlapoyinAdu.
Chop-house n s pUtakUtiyillu.
Chopper n s (an Indian phrase) A large knife మచ్చుకత్తి.a small roof తడక వసారా.
Chopping adj big, fine దొడ్డ. a * boy పుష్టిగా వుండేపిల్లగాడు. a * salmon తుండువలె వుండే వొక చేప. "Charades,which are short and chopping" సారతరమైన చిన్న చిన్నశ్లోకములు.
Chopsticks n s wiMdipullalu, anagA mullu, geVrita vItiki baxulugA cInA xeSasWulu AhAramu notloki yeVgara vesukovadamunakE vupayogiMce sanna veVMdi, leka xaMwapu pullalu.
Chopt adj weVgina, wunigina, pagulYlubArina, bItikalu bAsina.
Choral adj samUha saMbaMXamEna.
Chord n s in music Sruwi, suwi. in goemetry kRewragaNiwamulo arXa caMxra BexakAri reKa.
Chorister n s pAtakudu, gAyakudu.
Chorus n s (of Singers) pallavi, xAsaraXI karuNApayoniXi, lakRmI kalYyANamu, yeleno, yIlAgaMti paxamulu, yitlA ceVppevAMdlu. They revile him in * eka vAkyawagA wittinAru, voVka wIruna wittinAru.
Chose pastofchoose korinaxi,yerparacukoVnnaxi, As far as he * yiRtamEna xAkA. See To Choose.
Chosen adj yerparacabadda, SreRTamEna, uwwamamEna. * spirits aMSapuruRulu.
Chough n s nIrukAki, samuxrapukAki.
Choultry n s (Indian word for a lodging place) sawramu, cAvidi.
Chowry, or Chaury n s. or whisk kuMceV, surati, cAmaramu.
Choya Root n s ciruveru.
Chrism n s vaka warahA saMskqwa wElamu, xInni roman kAwalikuvAMdlu avasAna kAlamaMxu AyA avayavamulalo carumuwAru.
Christ n s Kriswu. Mill in his Christa Sangita writes it KqRtu.But krIswu is the usual spelling, In the Tamil versions it is spelt kiriswu.
Christendom n s Kriswiyan mawamu prAbalyamugA vuMde xeSamu, anagA Europe.
Christening n s nAmakaraNamu. Were you present at the * biddaku peru peVttetappudu nIvu vuMtivA.
Christian n s KriswumawasWudu.
Christianity n s KriswuyAnu mawamu. the usual phrase jFAna mArgamu. "the way of knowledge," is entirely wrong.
Christianname n s guruvugAru biddaku peVtte peru. What is your name? nI yiMti peremi. Johnson jAnsanu. What is your *? nI soVMwa peremi, SamuelsAmiyal, anagA awani peru Samuel Johnson.
Christmas n s disaMbaru neVla wexi vacce Kriswu mawasWula paMduga.
Christmas-box n s Kriswu mawasWula paMdugalalo vedukagA navukalAnku yicce bahumAnamu, paMduga bahumAnamu.
Chromatic adj varNa saMbaMXiyyamEna, pUrva kAlamaMxu gAna viRayamu, vAxyaviRayamu.
Chronic, Chronical adj xIrGamEna, wIrani. a * complaint xIrga vyAXi,xIrGa rogamu.
Chronicle n s purANamu, iwihAsamu, cariwra, AyA kAlamaMxu jarigina rAjyavqwwAMwamu. Local chronicles or archives sWalapurANamu, sWalamahAwmyamu.
Chronicler n s purANamu raciMcevAdu.
Chronogram n s anagA Araya SAlivAhana SakAbxamul axrigajAgni somulanwAraNa vawsaraMbuna annattugA saMvawsaramula yoVkka saMKyanu tUkigA weVliya cese vAkyamu, kAlani rUpaka saMkewa kAvya viSeRamu. Chronologer, n. s. AyA saMvawsaramulalo rAjyamunu guriMci jariginavqwwAMwamulanu vrASevAdu.
Chronologically adv saMvawsara kramamugA. This book is written * yI puswakamu saMvawsara kramamugA vrAyabadivunnaxi. he named the Kings * AyA kAlamaMxu vuMdina rAjula pelYlanu kramamugA ceVppinAdu.
Chronologist n s rAjyamunu guriMci AyA saMvawsaramulo jariginavqwwAMwamulanu vrAsevAdu.
Chronology n s kAlavqwwAMwamu, anagA AyA saMvawsaramulaMxu xeSamulojarigina vqwwAMwamu, BUwakaWAnukramaNika.
Chronometer n s awi SreRTamEna gadiyAramu.
Chrononological adj rAjyamunu guriMci AyA saMvawsaramulalo jariginavqwwAMwa saMbaMXamEna. a * history purANamu, rAjyamunu guriMciappadappudu jarigina vqwwAMwamu.
Chrysalis n s purugugUdu, pisini kAya, anagA koVnni purugulu reVkkalu rAka munupu nivasiMce gUdu. That law is now in its * state A cattamu yiMkA puttI puttakuMdA vunnaxi.
Chrysolite n s vaka warahA rAyi, caMxrakAMwa maNi. A+. akkikkal. G+.paxmarAgamaNi.
Chrysoprasus n s vEdUryamu, G+. Piroja, C+. laSunIyyamu. A+
Chrystal n s vide Crystal sPatikamu. a * glass spatikAniki samAnamEnaaxxamu. the * waves nirmaloxakamu, mahAwetEna nIlYlu.
Chub n s vaka warahA cepa.
Chubby adj pAlabuggalu gala, buMgayEna. a * child buMga mUwibidda. * cheeks vubbugA vuMde gubbalu.
Chuck-farthing n s xudlAdadamu.
Chuckler n s (an Indian word for a cobbler or leather dresser)mAxigavAdu.
Chum n s sahavAsi, kUdA kApuramu vuMdevi xyAWin, voVka yiMtlo kUdA Bojanamu ceswU vuMde vixyArWi, kUdA kApuramuMde vAdu. Who is your * nIwo kUdA kApuramuMdevA deVvadu. To Chum, v. n. kUdA kApurama vuMduta, vixyArWulu kalisi voVka yiMtlo kApuramu vuMduta.
Chump n s wuMdu, wunaka, moVxxu.
Chunam n s (lime, plaister) sunnamu, gaccu, fine * meVrugu sunnamu.
Church n s (the building) gudi, Alayamu, xevAlayamu. a * bell gudi gaMta. a * living gudimAnyamu. As soon as we left the * memu gudi vidici rAgAne. or body of Christians Kriswu mawasWulu. he took to the * or took orders pAxiri ayinAdu. * establishment gudivAMdlu, gudi parijanamu. he is a great ornament to the * vAdu guruwilakamu. or Sect mawamu. the * of England sImarAjamawamu. the national * A xeSa mawamu. * and state vExIkulu, lOkIkulu. this is a disgrace to the * yixi A mawAnike avamAnamu.
Churchland n s gudimAnyamu.
Churchman n s pAxiri, Kriswu mawaswudu. a high * wana mawame mawa manevAdu, vIramawasWudu.
Churchwarden n s gudi aXikAri, Xarmakarwa, gudi vicAraNa karwa.
Churchyard n s gudi prAkAramulogA pInugalanu pAwipeVtte sWalamu, samAXi sWalamu. a * cough vallakAti xaggu, pAduxaggu. a * ghost kAtixayyamu, ruxraBUmilo saMcariMce xayyamu.
Churl n s Clown palleVtUri motuvAdu, eVddeVmaniRi. miser loBi.
Churlish adj motEna, amaryAxagA vuMde. he gave a * reply aligi ceVppinAdu.
Churlishly adv motuwanamugA, loBawvamugA.
Churlishness n s motuwanamu, mUrKawvamu, moVMdiwanamu.
Churn n s majjiga cilike woVtti. a * staff kavvamu.
Chuse See Choose
Chutney n s See Chatney.
Chyle n s annarasamu, XAwupoRaka sAra BAgamu. Drox jIrNamu kAvadAnakusAXanamugA kadupulo vuMde nIru, xInni jaTarAgni yani yaMtAru.
Chymical adj rasa, gaMXaka, pARANAxulanu parIkRiMce SAswra saMbaMXamEna.
Chymist n s rasa, gaMXaka, pARANAxulanu parikRiMce SAswri. he is a good * rasa, gaMXaka, pARANAxula guNamulanu bAgA weVlipinavAdu.
Chymistry n s rasa, gaMXaka, pARANAxulanu parIkRiMce SAswramu.
Cicada, Cigala n s. yilakodi yane purugu.
Cicatrice, Cicatrix n s. puMdu, leka, gAyamu mAnipoyina waruvAwa vuMdemacca, kRawa cihnamu. Droz.
Cicerone n s cUpevAdu, xevasWAnamu, rAja gqhamu moVxalEna sWalAlalo vuMdeviMwalu, vedukalu cUpiMci poVtta posukoVnevAdu.
Cicisbeo n s swrI loludu, anagA poVMxavaleVnane yicCa leka vUrikeV vupasarpiMci wirige vitakAdu.
Cider n s appil paMdla rasamuwo cesina sArAyi.
Cidevant adj (Late) muMxari, munupati. The * clerk muMxari karaNamu.
Cieling n s yiMtilogA, kayilu, wrAvulu agupadakuMdA kattina gudda. Cigar, n. s. cutta, poVgacutta.
Cilice n s kaMbalYi, goVMgalYi, yixi sanyAsulu vesukoVnetixi.
Cimeter n s Kadgamu, yixi kAvya Sabxamu.
Cimmerian adj mahA nallani. darkness gADAMXakAramu.
Cincture n s xatti, nadikattu, AvaraNamu. the * of the town patNamu yoVkka AvaraNamu.
Cinder n s katteV nippu, aMgAramu, boVggu. of metal citteVmu. the body was burnt to * A Savamu bUdixeV ayinaxi.
Cinderwench n s murikimuMda, yebrAsimuMda, murikixi.
Cinnabar n s siMXUramu, iMgilIkamu. * of antimony rasasiMXUramu.
Cinnamon n s lavaMgapatta, xAlacini.
Cinque n s cOvaMca, ayixu, yixi Atalo ceVlle mAta.
Cinque-foil n s ayixu rekulugA vuMde puRpamu.
Cinque-ports n s iMgliMduku xakRiNamugA vuMde ayixu revulu.
Cion n s aMkuramu, moVlaka, pallavamu.
Cipher n s sunna, pUjyamu, aMkeV, akRaramu. Initial letters of namesuMgaramulu moVxalEna vAtilo voVkatiwo voVkati peVnusu koVnnattu soVgusugA vrAsesaMkewAkRaramulu, or fool mUDudu. The art of writing in * AraMdakamu,saMkewalipi. the letter was written in * A jAbu saMkewAkRaramulawo vrAyabaddaxi.
Ciphering n s leVkkalu nercukovadamu. Circar, or Sircar, n. s. sarkAru. A Persian word for Government,District, division : state. Thus the Rajahmandry Sircar : that is, the Rajahmandry District. "The Circars"-- or "The Northern Circars" is a phrase formerly used for the northern part of the Telugu countries. The word ought to be disused.
Circe n s maMwraSAswrAXi xevawa.
Circle n s varwulamu, maMdalamu, kEvAramu, giri, guMdramugA vuMde AkAramu. Company vargamu. a * friends Apwa vargamu, suhqwkoti. a literary * vixvAMsula samUhamu. a family * kutuMbamu. Family * balagamu.He moves in the royal * rAju yoVkka Apwavargamulo wiruguwunnAdu, anagA rAjunu ASrayiswU vunnAdu. the * of the sciences SAswra samUhamu. AuthorityaXikAramu. Arguing in a * bIjAMkura nyAyamu. a magic * cakramu, yaMwramu.
Circled adj cuttukoVnna. * forests cuttu adivigala, nAlugu watlA adivigala.
Circlet n s cakramu, guMdugA vuMde AkAramu. the gilded * on his browkirItamu.
Circling adj cuttukoVnivuMde, nAlugu watlA cuttukoVni vuMde, AvaraNamugA vuMde.
Circuit n s a round or part of the country maMdalamu, pariXi, kEvAramu, praxakRiNamu, xeSa saMcAramu, xeSamu, praxeSamu. a * judge xeSamu mIxa wirige nyAyAXipawi. he made a * to reach the house koVMceVmu cutti yillu vacci cerinAdu.
Circuitous adj wirugulYlugala, cuttEna. a * way cuttu xova.
Circuitously adv cuttugA, wirugudugA, parasparamugA, paragadagA, paraBArigA. he spoke * about this cakkagA ceVppakuMdA wirugudugA mAtlAdinAdu.
Circular adj guMdrani, vatqvEna, batuvEna, varwulamEna. * motion praxakRiNamugA wiragadamu. or * order voVttu hukumu.
Circulation n s wiragadamu, cuttadamu, vyApariMcadamu, ceVlladamu. he sent this letter in * yI jAbunu aMxaru cUdadAnakE paMpinAdu. money now in * praswuwa maMxu ceVlle rUkalu. this prevented the * of the news yiMxuvalla A samAcAramu vyApiMcalexu. To prevent the * of the money A rUkalu ceVllakuMdA vuMdadAnakE.
Circulator n s aMxariki yeVruka cesevAdu.
Circumambient adj nAlugu watlA vyApariMce.
Circumambulate v a praxakRimu cesuta, nAlugu watlA wiruguta.
Circumbendibus n s వృద్ధి. (Coleridge says) a rogue is a fool with a * దౌంగ వొక పెద్ద పిచ్చి వాడు.
Circumcised adj sunnawi ayina.
Circumcision n s sunnawi.
Circumference n s cuttu, kEvAramu, pariXI, maMdalamu, kuMdalamu.
Circumflex n s an accent over a letter ( ), uccAraNaku sUcakamugA akRaramu mIxa vese vaMkara addagIwa.
Circumjacent adj cuttU vuMde, nAlugu watlA vuMde, samIpamulo vuMde.
Circumlocution n s vAgjAlamu, vAkyabAHulYyamu. Droz. aviveciwa vAkyaprayogamu. (Menzies.) anagA muKyamEna kAryamunu weVliya ceVppakuMdA vUrikeVpeVMci peVMci wirugulYlugA weVliya ceyadamu, marugu mAta, anagA caccinAdu anianakuMdA padipoyinAdani gOravamugA anadamu.
Circumlocutory adj vAgjAlamugA vuMde, wirugulYlugA vuMde.
Circumnavigable adj vAda mIxa yeVkki nAlYugu watlU pogala. an Island is * vAda mIxa yeVkki praxakRiNamugA pokUdina xIvi. India is not * hiMxuxeSamu vAda mIxa yeVkki praxakRiNamugA rAkUdanixi.
Circumnavigation n s vAda mIxa yeVkki praxakRINamugA povadamu.
Circumscribed adj haxxu yerparacabadda, viSAlamu leni yirakatamugA vuMde. I am very much * for means nA cewa xuddu leka mahA saMkatapaduwunnAnu.
Circumspeccly adv jAgrawagA, yeVccarikagA.
Circumspect adj jAgrawagala, yeVccarikagA vuMde. he is * vAdu mahA jAgrawagA vunnAdu, vAdu wana mIxa mAta rAkuMdA, kApAdukoVMtU vunnAdu.
Circumspection n s jAgrawa, sAvaXAnawa, yeVccarika, meVlYukuva.
Circumspectness n s jAgrawa, sAvaXAnawa, yeVccarika.
Circumstance n s saMgawi, mAta, vEnamu, vivaramu, viSeRamu, prameyamu,prasakwi, pani, sWiwi, vixyamAnamu, xaSa. this * yixi. that * axi. a lucky * viSeRamu, maMci pani, axqRtamu. an unlucky * kAni pani, xurxaSa, Apaxa. a remarkable * voVka coxyamu, voVka viSeRamEna pani. the * of his confessing this is important awadu xInni voVppukoVnnaxe muKyamu.
Circumstanced adj saMBaviMcina. Being thus * yitlA vuMdagA, yituvaMtipaniki. To a man so * yI gawigA vuMdevAdiki, yI rIwigA vuMdevAdiki, yI xaSalo vuMdevAdiki.
Circumstances n s plu. Particulars viSeRamulu, sWiwi, vixyamAnamu. he stated the * aMxuna guriMcina saMgawulu ceVppinAdu, lAguleVlla weVliya ceSinAdu. From all the * meVttuku. In these * yitlA vuMdagA. Being prevented by * xAniki vaka gawi vacci addi paddaMxuna. a man in good * kaligina vAdu, bAgA vuMdeV vAdu, SreyassugA vuMdevAdu. he is in bad * vAdu xurxaSanu poVMxivunnAdu. Do you know his * vAdiki Aswi yeVMwo nIku weVlusunA, vAdu vuMde sWiwi yeVttixo nIku weVlusunA. under any * ye viXAnanEnA, yeVtlAgEnA. under all * meVttuku, muKyamugA, rAgA pogA.under no * yeVMwamAwramu. as well as * would admit yaXociwamugA, kAlociwamugA, kUdina mattuku. he was driven by * to sell his house vAdu yillu ammukovalasinagawi vaccinaxi.
Circumstantial adj viSeRamEna, vivaramEna. he gave a * description of this yiMxuna guriMci vivaramuku vivaramu ceVppinAdu. he gave a *account vivaramugA ceVppinAdu. This poet is tediously * yI kavi ceVppe vivaramuwo prANamu visukuwunnaxi. * evidence vivaramEna sAkRyamu. Regarding this murder there is not direct evidence but plenty of * evidence yI KUnini guriMci cUcina sAkRulu leru gAni vuwwarowwara weVliyabadda vEnamula valla pUrwigA sAbawwu ayinaxi.
Circumvallation n s AvaraNamu, prAkAramu.
Circumvented adj mosapoyina.
Circumvention n s mosamu, kutra, kqwrimamu, vaMcana.
Circus n s raMgasWalamu, anagA jattIla potlAta, puli veta, gurrapu paMxeVmulu vidice bayilu. the sports of the * raMgakelYi, anagA mallayuxXamu, siMhamula, pulula, yuxXamu, gurramula paMxeVmu.
Cis (aLatinpreposition) ఈవల,ఈతట్టు, Cisalpine ఆల్పయినుఅనే కొండకు యీతట్టు. * Himalia హిమవత్పర్వతమునకు యీతట్టు.Trans Gangem గంగకు అవతల. the * Gangetic provinces గంగ కీవలి దేశములు. the ultra Ganetic or Trans-Gangetic nations అవతలి దేశపు జాతులు.
Cissampelos Hexandria n s katla wIgeV.
Cistern n s nIlYa woVtti, kuMda.
Cit n s yixi varwakulaku hAsyanAmamu.
Citadel n s kota, xurgamu.
Citation n s uxAharaNa Slokamu, uxAharaNa vAkyamu, uxAharimacadamu, sammanu ceVyyadamu.
Citizen n s pOrudu, pattasWudu, grAmasWudu, kApu, saMsAri, SeVtti, komati, nivAsi. Citizens pOrulu. Fellow * samIpavAsi. A+. he was separated from his fellow citizens wama vUrivAMdlallonuMci veruparaca paddAdu. my fellow citizens mA patNasWulu, mA vUri vAMdlu, prawivAsi. B+. a citizen of heaven svargavAsi. a citizen of the world svagrAmABimAnamu leni vAdu, anagA prapaMcamulo yeVkkada vuMdinA voVkate nanevAdu.
Citizenship n s pOraXarmamu, anagA grAmasvawaMwramu, grAmasvAmyamu. By residing there one year he obtained * akkada voVka saMvawsara vAsamu cesinaMxuna vAdu grAmasWudEnAdu. they deprived him of * vAdiki vuMdina grAma svAmyamunu pogoVttinAru.
Citron n s xUxi nimmakAya, xabbakAya, wuraMjipaMdu, mAxIPalamu.
City n s patNa saMbaMXamEna, vUru saMbaMXamEna. the * authorities grAma peVxxalu.
Civet n s punugu, javvAji, kaswUri, saMkumaxamu. * cat punugu pilli, javvAji pilli, kaswUri pilli.
Civic adj vUri saMBaMXamEna. * honours grAmamulo kaligina gOravamu, anagAaXikAramu. * crown voVka warahA mAla, hAramu, puramu rakRiMcinavAniki yIhAramunu yiccinAru.
Civil adj maryAxasWulEna, SAMwulEna, maMci, sAXu. the Colonel was very * karnalxoVravAru mahA maryAxagA jarigiMcinAru. he was * to me nA yeVdala maryAxagA jarigiMcinAdu. he was not * to me nA yeVdala amaryAxagA jarigiMcinAdu. he was * to me nA yeVdala amaryAxagA jarigiMcinAdu. the * authorities vUri peVxxalu, grAma peVxxalu. * war aMwaHkalahamu, grAma kalahamu, anagA kApulu rAjula mIxa wiragabadi cese yuxXamu, leka, eka xeSasWulu wamalo wAme kalahapadadamu. During the warsof England iMgliMdu xeSasWulu wamalo wAmu potlAde samayamulo. * rights grAma svawaMwramulu, maryAxalu. Among the Hindus marriage is a * rite, not a religious one hiMxuvulalo vivAhamu lOkikame kAni vExikamu kAxu. Not Military or Clergy lOkikulEna, anagA xaMdu vuxyogasWulu, pAxarIlu wappa kadamavAMdlu. * employ grAma vyavahAramu, anagA xaMdu vuxyogamu, vExyamu, pAxiri vuxyogamunnu kAka, xeSa vicAraNa polIsu, XarmAXipawya aXikAramu. * servants kalkatarlu, mejistretu vagErA aXikArasWulu. (literally anUcAnulu). A * suit appusappulu vagErAlanu guriMcina vyAjyamu. * law Xarma SAswramulo yixi voVka kAMda nAmamu, yixi muKyamugA Aswi viBajananu guriMcina vyavahAramu, ayiwe yixi yI kAlamulo ceVlladamu lexu.
Civilian n s voVka viSeRaXarma SAswravewwa. a Government officer in India iMdiyA xeSamulo voVka warahA vyavahAri, anagA xaMdu, vExyamu, pAxiri vuxyogamulu wappa kalkattaru, mejistretu, nyAyAXipawi moVxalEna vuxyogasWudu.
Civility n s maryAxa, sanmAnamu, maMciwanamu, nAgarIkamu.
Civilization n s saMskAramu, vivekamu, sanmAnamu, sanmaryAxa, nAgarIkamu. Do you call this * xInni nIwi aMtAvA. Devoid of * nIwi leni, mUrKa, motu. Education is a great promoter of * caxuvu nIwiki aBivqxXi cesetixi. the Code * nIwi SAswramu. Sir Thomas Munro says, "I do not exactly know what is meant by civilizing the people of India. In the theory andpractice of good government they may be deficient : but if a good system of agriculture, if unrivalled manufactures, if a capacity to produce what convenience of luxury demands, If the establishment of schools for reading and writing, if the general practice of kindness and hospitality; and, above all, if a scrupulous respect and delicacy towards the female sex are among the point that denote a civilized people then the Hindus are not inferior in civilization to the people of Europe."
Civilized adj nAgarIkamu gala, maryAxasWudEna. * pursuits mAnuRa kqwyamulu, mAnuRa vyavahAramulu.
Civily adv maryAxagA, sanmAnamugA, nayamugA, maMci mAtalawo, upacAramugA,nAgarIkamugA. Clack, n. s. cappudu, katakatamane Xvani, takku takku mane Xvani,loVdaloVda. I heard the * of a loom maggamu yoVkka cappudu vinnAdu.What can stop the * of a woman's tongue? xAni loVdaloVdalu xenivalla aNugunu, xAnni noru vAgakuMdA vuMdetattu yemi ceyakUdunu. I wish you to stop your * nI loVdaloVda cAliMcu.
Clad adj XariMcina, woVdukkoVnna, paripeRtiwamEna. he was royally * vAdu rAju veRamunu vesukoVnnAdu. well * maMci battalu woVdukkoVnna. I will * maMci battalu leni. unclad vaswramu leni, xigaMbara. She was * in silk AmeV pattu battalu woVdukkoVnnaxi. the tree was * with blossoms A vqkRamu puRpaBariwamE vuMdeVnu. the ground * in greeen pasarikacewa kappabadda nela. Snow * heights maMcu mUsukoVnna koVMdalu.the Image was * with flames A vigrahamu jvAlAvqwamE vuMdeVnu. Her face was * with smiles xAni muKamu cirunavvu kulukuwU vuMdeVnu. the spirit * in flesh SarIramu XariMcina Awma xeha meVwwina jIvudu.
Claim n s nawwagulla, kAkicippa.
Claimant n s vyAjyagAdu, wanaxani vyAjyamu cesevAdu, manavi cesevAdu,korevAdu, xayAxi.
Claimer n s wanaxani adige vadu, xAvAxArudu.
Clairvoyance (a sort of magical cunning,like prophecying) jFAnaxqRti,yogaxqRti
Clairvoyant (he who thus is entranced and speaks) jFANaxqRticewacUciceVppevAdu,yogi
Clamminess n s pisapisa, baMka, baMXamana, jigata, pisunu. From the * of his skin I saw that the man was dying voVlYlu pisapisalAdadamu cUci vAdu caswAdanukoVnnAnu.
Clammy adj pisapisamani aMtukoVne, baMkagA vuMde, jigatagA vuMdeV, jigurEna.
Clamorous adj arice, boVbbalu peVtte, kUwalugA vuMdeV. they were clamorous vAMdlu peVxxa goVMwu peVtti aruswU vuMdinAru.
Clamorously adv aruswU, boVbbalu peVttuwU, kUwalugA.
Clamorousness n s kUwa, boVbbalu, saMxadi, arupu, raxxi.
Clamour n s kUwa, boVbbalu, saMxadi, raxxi.
Clamp n s peVtteVlu moVxalEna vAtiki vese mUla baMxu, mUlawagadu.
Clan n s gowramu, kulamu, vaMSamu, weVga. Clansmen voVka kulasWulu, vaka weVgavAMdlu. he was the chief of his * A kulAnaku vAdeV peVxxagA vuMdeVnu.
Clandestine adj rahasyamEna, gupwamena. a marriage xoVMga peVMdli, gAMXarva vivAhamu.
Clandestinely adv rahasyamugA, gupwamugA, gopyamugA, weVliyabadakuMdA.
Clang n s gaNagaNa mane Xvani.
Clangour n s gaNIlane Sabxamu.
Clank n s galagalamane Xvani. I heard the * of chains saMkeVlYla Xvani vinnAnu.
Clap n s cappatla Xvani, cappudu. they received him with claps awanu vaccetappatiki cappatlu koVttigEkoVni sanmAniMciri. a * of thunder urumu. there were four claps of thunder nAlugu brahmAMdamEna vurumulu vurimiMxi. or disease Sagarogamu.
Clap-board n s pUrAru palaka.
Clapper n s of a Bell gaMta yoVkka nAluka. of a Mill oVka warahA mUwa.
Claptrap n s wanaku SlAGana vaccetattu yukwigA ceVppadamu.
Clareneux, or Clarencieux n s. vaMSAvalYi vimarSa cese aXikAri.
Claret n s oVka warahA vEnu sArAyi. * colour Uka baMwipUvarNamu,keVMpu varNamu.
Clarified adj wetaparacina, SuxXayEna, nirmalamEna. * butter neVyyi.* sugar nirmalamEna cakkeVra.
Clarinet n s sannAyi.
Clarion n s a trumpet voVka warahA vUxe koVmmu.
Clash n s voVkati mIxa voVkati koVttu kovadamu, wAkadamu, xeVbba, saMGarRaNa, viroXamu.
Clasp n s koVliki, koVkkeVmu. embrace kOgili, AliMganamu. a * knife madupukawwi.
Classical adj * SareRTamEna, sAMpraxAyakamEna, maMci, prayogasixXamEna, GanamEna. a * poem mahA kAvyamu. a classical author kavISvarudu. Calidas is a * author kAlYixAsu mahAkavi. Vemana is not a * author vemana sAmAnya kavi. * style maMci Sayya, GanamEna Sayya. * phrase suSabxamu,SAswrIyyamEna paxamu. * knowledge sAhiwya jFAnamu. a * scholar sAhiwyamu kalavAdu, lAkRaNikudu. * ground or celebrated spot prasixXamEna sWalamu.
Classically adv lakRaNayukwamugA, kAvyarIwigA. Benares is * called "Casi" binArasane pattaNamu kAvya saraNigA kASi anabaduwunnaxi.
Classick n s mahAkavi. the classicks sAHiwya vixya, anagA Greek LatinBARalu the classicks of India gIrvANa kAvyamulu yiwyAxi.
Classification n s yerpAtu, waragawi yerparacadamu.
Classified adj waragawigA yerparacabadda.
Class-leader n s badi peVxxa.
Clatter n s catacatamane cappudu, patapata Xvani. I wish you would cease your * nI kUwalu nilupu.
Clause n s a sentence vAkyamu. an article paxxu, saMgawi, prakaraNamu. a new * wAjA kalamu.
Clave thepastofCleave
Clavicle n s bora yeVmuka, jawru (W).
Claw n s pakRigoru, puligoru, pilli goru. of a crab, scorpion, or lobster deVkka, gitta.
Clawed adj golYlugala, barikina.
Clay n s baMka mannu, regada mannu. pipe * suxxa. a mortal * SarIramu, xehamu. clayed sugar voVka warahA paMcaxAra.
Clay-cold adj cacci jillumani vuMde. he touched a * hand caccina xANi ceVyyi aMtinAdu.
Clayey adj baMkamaMti, regada maMti, jigata ayina, baMkagA vuMde.
Claymore n s peVxxa Kadgamu, yixi yiMgliRu mAta kAxu.
Clean adv boVwwigA, voVdAramugA, yAvawwu. this is * wrong yixi voVtti wappu. he came off * yivawaliki ceVkkuceVxarakuMdA vaccinAdu.
Cleaning n s pariSuxXamu, bAguceVyyadamu, prakRAlYanamu.
Cleanlily adv pariSuxXamuga, SucigA, nirmalamugA.
Cleanliness n s pariSuxXawa, svacCawa, nErmalyamu, garagarika.
Cleanly adj nirmalamEna, garAgarigA vuMde. the cat is very * pillulu niMdA garA garika vuMdetixi.
Cleanness n s pariSuxXi, nErmalyamu. from the * of the water nIlYlu nirmalamugA vuMdetaMxuvalla.
Cleansed adj SuxXi cesina, kadigina.
Cleansing adj SuxXi cese, nirmalamu cese.
Clear adv pariRkAramugA, spaRtamugA, wetagA, rUDigA, prawyekamugA, vidigA. * of all deductions Karculu pogA, the boat fell * of the ship padava mIxa wagalakuMdA wappi vaccinaxi. he got * of it xAnni vidipiMcukoVnnAdu. when we got * of the wood adivi xAtagAne.the horse stopped * of the child biddanu woVkkuMdA adugu peVttiMxi.
Clearance n s viduxala cIti, rahaxAri, purajA cIti, xInni kiliMtu ani aMtAru. he made a complete * of the trees ceVtlu boVwwigA lekuMdA cesinAdu.
Cleared adj welipoyina, wIripoyina. these difficulties will be * up yI woVMxaralu wIripovunu. when it * up vAna veVlisinappudu.
Clearing n s settlement, making free పరిష్కారము, నివారణము. In this * of the forest యిట్లా అడవికొట్టి పరిష్కాషము చేయడములో. they did this as a * of themselves తమ యందలి దోషము లేదని అగుపరచడమునకై దీన్ని చేసిరి.
Clearing-nut n s cilla giMja, kawakamu.
Clearly adv wetagA, vayanamugA, pariRkAramugA, spaRtamugA, rUDamugA.
Clearness n s weta, nErmalyamu, spaRtawa.
Clearsighted adj wIkRNaxqRti gala, vivekaSAliyEna.
Clearsightedness n s wIkRNaxqRti, vivekamu.
Cleat n s pItakarra, anagA vAda moVxalEna vAti mIxa vuMcina sAmAnu kaxalakuMdA vuMdadamunakE A sAmAnuku xAramu wagiliMci meVli peVtti bigiMcina pItakarra.
Cleaver n s maccukawwi, anagA kasAyi vAMdlaxi, gaMdra goVddali.
Cleft adj pagilina, cIlina, baxxalEna.
Clemency n s xaya, kqpa, SAMwamu, callawanamu. From the * of the climate yixi calava BUmi ganuka.
Clement adj kqpagala, SAMwamEna, sOmyamEna.
Clemently adv xayagA, kqpagA.
Clergy n s pAxirilu. the thief pleaded the benefit of * xoVMga wAnu cesinaxi moVxati wappiwamu ganuka manniMcavaleVnani oVka Slokamu ceVppinAdu, yixi pUrvakAlYapu maryAxa.
Clergyman pAxiri(i e. Padre)
Clerical adj pAxiri saMbaMXamEna, SAswriyyamEna, vExika. a * error cewappu, haswaxoRamu, wappu akRarAlu.
Clerk n s vrAsevAdu, lYeKari, javAbuni vIsu, gumAswA. or parish * pAxiri yoVkka haswakudu. a town * harikaraNamu, grAma karaNamu. * of the peace xeSa pAmadya. or learned man SAswra. Clerkly, adj. SAswrIyyamEna, vExikamEna.
Clerkship n s cattamulu gAni, varwaka saraNigAni nercukoVnexaSa, yixilAyarlu, varwakulu, vIrlanu guriMcina mAta. During his * pEna ceVppinattu vixyArWigA vuMdetappudu.
Clever adj gatti, curukEna, weVlisina, nipuNawagala. a * man gattivAdu, weVlisinavAdu, kuSaludu, prayojakudu.
Cleverly adv gattiwanamugA, camawkAramugA.
Cleverness n s gattiwanamu, sAmarXyamu, nipuNawa, nEpuNyamu, camawkAramu,nerpu, sUkRma buxXi.
Clew n s nUlu uMda, nUlukaMdeV. or guide jAda, pawwA, pobidi. The preceding verse gives a * to the meaning of these words pE Slokamu valla yI mAtala yoVkka arWamu vIduwuMxi. clew line xAramu, pogu.
Click n s katukku ane Sabxamu, yixi muKyamugA gadiyAramu wirigetappudu gAni, wupAki ceVvini yIdcetappudu gAni katukku ane Sabxamu.
Clicker n s దలాలి, తరగిరి.
Client n s వఖిలును కోరుకొన్న వ్యాజ్యగాడు. my * నన్ను వకీలుగా కోరకొన్నవాడు.
Cliff n s కూచిగా వుండే కొండ, మనుష్యులు యెక్కడానకు అసాధ్యమైన కొండ.
Climacteric n s విశేషదశ, విపరీత దశ, అనగా మనిషి యొక్క ఆయుస్సులో వచ్చే ఆ యాగండ సంవత్సరము. he has past his grand * వాడికి వృద్ధాప్యము వచ్చినది. when he reached his grand * వాడికి యెనభై ఒక సంవత్సరమైన తరువాత, వాడికి షష్టిపూర్తి అయిన తరువాత.
Climate n s ప్రదేశము, దేశము, భూమి. That * did not agree with him ఆ భూమి వాడికి కాళేదు, ఆ నీల్లు వాడికి ఒంటలేదు. he is enured to the * ఆ దేశము వాడికి జతపడ్డది, ఆ నీల్లు వాడికి ఒంటిపోయినది. this * affects the health యీ నీల్లు దేహానికి వుపద్రవముగా వున్నది, యిది రోగ భూమి.
Climax n s ఔన్నత్యము, అభివృద్ధి, ఉత్తరోత్తరాభివృద్ధి. the * of beauty సౌందర్య తిలకము, శృంగార తిలకము. His crimes had now reached their * వాడి పాపము మహా అతిశయించినది. The following spiteful stanza contains an instance of * ఇందుకు ఉదాహరణ " క " తలనుండు విషము పాముకు వెలయంగాదోకనుండు వృశ్చికమునకున్ ఖలునకు నాలుక నుండున్ వెలుమనకు నిలువెల్ల విషమువినరా సుమతీ " The snake has poison in its head, the scorpion in its tail, and the villain in his tongue: but a proud baron is venom all over. Also in the following verse. The following instance is in the Bilhanam. శ్లో || కిమందుఃకిం పద్మం కిము ముకురబింబం కిముమఖం | కిమబ్జే కిమ్మీనౌకి ముమదన బాణౌకి ముదృ శౌ! ఖ గౌవాగుచ్ఛౌవా కనక కలశౌ వాకిముకుచౌ | తటిద్వాతారావా కనకలతి కావాకిమబలా " which is thus translated Canto 2 verse 55 సీ || రాకేందు బింబమో రాజివ మోమించు టద్దమో లేక నెమ్మర్దు మొగమౌ | చెలువందు కల్వలో చేపలో మరుని నారాచంబులో లేక లోచనములొ | కోకంబులో విరుగుత్తులో బంగారు కుండలో లేక వక్షోజ యుగమొ | క్రొక్కారు మెరుగొ మేల్జుక్క యెనును పైడి తీవయొ లేకొక్క తెరవయేమొ | యపుర యీ కిళ యీ తావి యీరమణత | యీవిధంబులు నీ బెక్కులీ కుశలత | నీ సువృత్త తలీసొంపులీ మెరుంగు | లీ తళుకు నిగ్గులీచాయ లెందు గలదు ||.
Climber n s యెక్కేవాడు, తీగె.
Clime n s దేశము, ప్రదేశము. See Climate n. s.
Clinch n s శ్లేషవాక్యము.
Clincher n s వెనకకు మణగకొట్టిన తీల.
Clinical adj శయ్యా సంబంధమైన, a * leclture రోగి యొక్క శయ్య దగ్గెర వైద్యుడు తన శిష్యులకు ఆ రోగమును గురించి చేసే ప్రసంగము.
Clink n s ఘల్లుఘల్లుమనే శబ్దము, సంకెళ్లు మొదలైనవనాటి శబ్దము, ఛేకము.
Clinner n s కత్తెర, అడకొత్తు. A kind of Ship అతి త్వరగా పొయ్యేవాడ. a money * రూకలు రూపాయీలను వొరిచి వెండి బంగారు దొంగలించుకొనే వాడు.
Clinquant n s కాకి బంగారు. In poetry జబ్బు పిచ్చి అలంకారము.
Clippings n s తునకలు.
Clique n s party, gang బందుకట్టు.
Cloak n s గొగ్గి, భైరవాసము, కప్పుకొనే టందుకైనా, చలికైనా వేసుకొనేటిది, వ్యాజము. వేషము, డంబము. under the * of night రాత్రియనే మరుగులో. he uses his charity as a * for sin వాడు ధర్మము చేసేది వేషము, వాడు డాంబికముగా ధర్మము చేస్తాడు.
Cloakbag n s పెద్ద బట్వాసంచి.
Cloaked adj కప్పిన, మూసిన, మరుగు చేసిన, దాచిన.
Cloca n s బహిర్దేశము, కాలవ. Cloacina బహిర్దేశ శక్తి నామము. a temple to Cloacina పాయఖానా యిది యెగతాళీ మాట.
Clock n s పెద్ద గడియారము. What's o' clock? or, what o' clock is it? యిప్పుడు యెన్ని గంటలు. It's twelve మధ్యాహ్నమైనది. It's one గంట అయినది. after 4 o' clock మూడు ఝాములు మీదట. the clocks of stockings మేజోడు మీది ఒక తరహా శృంగారమైన బుట్టాలు.
Clockcase n s గడియారపు గూడు, గడియారపు చట్టము.
Clockwork n s కీలుపని, బిస, యుక్తి. a puppet moved by * కీలు బొమ్మ.It goes on like * నిరభ్యంతరముగా జరుగుతున్నది.
Clod n s మంటి గడ్డ, మంటి పెళ్ల. or Clodhopper or Clodpole మోటు మనిషి.
Clog n s పశువులకు కట్టే గుది, గుది కర్ర, లంకె. Clogs worn by English women ఆడవాండ్లు తొడుక్కొనే పాదుకలు. See Clogged.
Clogged adj తొందరపడే, గుడి కట్టిన. the wheels were clogged with mud చక్రమును బురదమూసుకొన్నది. The Telugu is * with Hindustani తెలుగులో తురక మాటలు కలిసివుండడము మహా సంకటముగా వున్నది.
Cloister n s గుప్త ప్రార్థనాగారము, జపము చేసుకొనే యిల్లు, దేవస్థానములో చుట్టూ చాలుగా వుండే మంటపము, సన్యాతి మఠము, ఆశ్రమము, చావిడి.
Cloistered adj ఆశ్రమవాసిగా వుండే, మునివృత్తిలో వుండే.
Cloke n s పోరువ భైరవాసము. See Cloak. n. s.
Close adj ఇరుకైన, బిగువుగా వుండే, యిబ్బందిగా వుండే. they were in *discourse బహు ఆదరముగా మాట్లాడుతూ వుండిరి. a * fight చెయ్యి చెయ్యి కలిసినయుద్ధము, ముష్టి యుద్ధము. * friendship అతి స్నేహము. * connection పొందిక. *woven తరుచుగావుండే. * writing యిమిడికగా వుండే వ్రాలు. a * translation మాటకుమాటగా చేసిన భాషాంతరము. a close dress బిగువుగా వుండే వుడుపు. *confinement నిర్బంధమైన కయిదు. * prisoner నిర్బందమైన పారాలో వుండేవాడు. a * cover బిగువుగా వుండే గవిసెన. without air ఉక్కగా వుండే, ఉమ్మదముగా వుండే. a * spot దారి లేని స్థలము, దోవ డొంక లేని స్థలము. a * alley యిరుకుగా వుండే ముట్టుసందు. he was so * he would not say a word వాడు తొణకని వాడు గనక నోరు తెరవడు. he was so * he would not give a penny వాడు లోభి గనుక వొక కాసైనా యివ్వడు. a * holiday అవస్యమైన పండుగ దినము.
Closed adj మూసిన, ముకుళించుకొన్న, ముడుచుకొన్న, ముగిసిన, తీరిన. the door was * but not fastened వాకిలి మూసి వుండినది గాని గడియ వెయ్య లేదు speaking through his * teeth పండ్లు కరుచుకొని మాట్లాడుతూ.
Close-fisted, Close-handed adj లోభియైన, పిసినారిగా వుండే.
Closely adv ఇరుకుగా, కిక్కిరిసి, యిమిదికగా, సమీపముగా, తరుచుగా. to follow * వెను వెంట వచ్చుట. he studies * విరామము లేకుండా చదువుతాడు. his head was * shaved వాడి తల నున్నగా గొరగబడ్డది.
Closeness n s (nearness) దాపు, చేర్పు, సమీపము, యిబ్బంది, యిక్కట్టు;యిరుకు. of texture తరుచు, నేత తరుచు. as * of a hedge or veil సాంద్రము, దట్టము. want of air వుమ్మదము, వుక్క, వుడక పోయడము.
Close-stool n s పాయఖానాలో వుండే వొక తరహా నాలుగు కాళ్ల పీట. Bishop Patrick, (in his discourse on Immoderate Grief, part VIII) says He was preferred by Cesar to be ground of his * సీజరనేరాజు వాణ్ని పాయఖానా అధికారినిగా యేర్పరచినాడు.
Closet n s గది, అర. the king's * రాజు యేకాంతముగా వుండే గది. he was closeted up with the king for two hours రాజుతో యేకాంతముగా రెండుఘడియలు మాట్లాడుతూ వుండినాడు. The water * పాయఖానా.
Clot n s గడ్డ, కదుము, ముద్ద.
Cloth n s బట్ట, వస్త్రము, సెకలాతు. Plain white * శల్లా coarse * రెట్టు * shoes సెకలాతు జోడు. a * cap సెకలాతు కుల్లాయి. one * వొక తరహా గుడ్డ. I observe that this is not all made of one * యీ ఢేరా అనేక తరహాల గుడ్డలతో కుట్టి వున్నది. * of gold సాదరా, తగిడి. * or broad * or woollen * యీ మూడు మాటలు, బనాతుకు, సెకలాతుడు, బూర్నిసుకు, సాధారణ నామములు. long * మూరకోక, బారచాపు. a man of his * ఆ కులస్థుడు, ఆ జాతి మనిషి, ఆ వుద్యోగములో వుండేవాడు. the * or Clergy పాదిరీలు. as he was one of the * వాడు పాదిరి గనుక. he is a disgrace to his * కులము పేరు చెరిపేవాడు. he had nothing but a * round his middle వాడికి మొలగుడ్డ తప్ప మరియేమి లేదు. a small piece of * concealing the privities కౌసీనము, గోచి || బహువచనమందు. Cloths అనగా గుడ్డులు, అనేక తరహాల గుడ్డలు. Clothes అనగా, వస్త్రము, వేషము. a clean suit of clothes మడుపు, దుస్తు.
Clothed adj బట్టలు తొడుక్కొన్న, వస్త్రములు ధరించిన పరివేష్టితమైన. he was well clothed వాడు మంచి బట్టలు తొడుక్కొన్నాడు. * in glory యశోభూషితుడైన. * in flesh శరీరమెత్తిన. * in darkness అంధకారగ్రస్తమైన. * in clouds మేఘ పరివృతమైన.
Clothes-horse n s బట్టలువేసే చట్టము, అనగా దండెము.
Clothier n s బట్టలు అమ్మే వర్తకుడు, ముఖ్యముగా సెకలాతు గుడ్డలు అమ్మేవాడు.
Clothing n s బట్టలు, వస్త్రములు. a wold in sheeps * గోముఖ వ్యాఘ్రము.
Clotted adj గడ్డ కట్టిన, అడలు కట్టిన, జడలు కట్టిన. * milk ఒక తరహా జున్ను. * blood పేరుకొన్న నెత్తురు. * blood on the wound పుంటి మీద గడ్డ కట్టిన నెత్తురు.
Cloud n s మేఘము, మబ్బు, మెయిలు. the clouds are gathering మబ్బు వేస్తూ వున్నది. clouds of smoke ధూమస్తోమము, విస్తారమైన పొగ. * of dust రేగిన దుమ్ము. or infamy అపవాదము, కళంకము. he was under a * అపవాదగ్రస్తుడై వుండినాడు. or flock గుంపు సమూహము. a * of birds పక్షుల సమూహము.
Cloud compelling n s మేఘాధిపతి, వరుణుడు.
Cloudcapt adj మేఘముల చేత ఆవరించబడ్డ, మేఘావృతమైన. a * mountainమేఘావృతమైన పర్వతము.
Clouded adj మబ్బు మూసుకొన్న, మబ్బు కమ్మిన, చీకటి కప్పిన, మేఘావృతమైన,కళ తప్పిన.
Cloudily adv మబ్బుగా, చీకటిగా.
Cloudiness n s మబ్బు, మొయిలు, చీకటి, మందారము. I saw from the * ofhis face that he was angry వాడి ముఖము యొక్క వికారము చూస్తే కోపముగావుండినట్టు వుండెను.
Cloudless adj మబ్బు లేని, నిర్మలమైన. * weather మంచి కాలము, మబ్బుమందారము లేని కాలము.
Cloudlessness n s మంచి కాలము, మబ్బు మందారములేని కాలము.
Cloudtopt adj మేఘఛన్నమైన, మేఘావృతమైన.
Cloudy adj మబ్బుగా వుండే, మబ్బు మందారముగా వుండే. * weather మబ్బుమందారముగా వుండే కాలము.
Clouring n s చిత్ర శాస్త్రము, వ్యాజము, మిష, వర్ణన, శృంగారము.
Clout n. s. తునక, గుడ్డతునక,యిదిచంటిపిల్లలకేకట్టేగోచ, or patch అతుకు గుడ్డ or blow దెబ్బ, పెట్టు. a beggar's clouts బిచ్చగాడి చింపి గుడ్డలు, గంత బొంత. or mark గుర్తు.
Clouted adj అతుకులు వేసిన. * cloth అతుకు వేసిన గుడ్డ. * shoes అతుకులు వేసి కుట్టిన చెప్పులు. * cream ఒక తరహా పరమాన్నము.
Clove thepastofCleave చీల్చినది,పగలుకొట్టినది
Cloven adj చీతిన, చీల్చిన, పగిలిన పగల కొట్టిన బద్దలైన పాయలుగా ఒలచబడ్డ. * footed గిట్టలుగల. * footed animal ఆవు, మేక. జింక మొదలైనవి. ఈది శైతానునిరూపుగనుక he shewed the * foot అనగా, తన క్రూరగుణమును చూపినాడు.
Clover n s (add,) he now lives in * వాడు యిప్పుడు అన్నందాలా సౌఖ్యముగా వున్నాడు.
Clower n s వక తరహా పరిమళమైన గడ్డి.
Clown n s మోటువాడు, పల్లెటూరివాడు, నాటుపురపువాడు. sort of Actorహాస్యగాడు.
Clownish adj మోటైన మడ్డి, మూర్ఖ, చాదస్తుడైన చేతకాని.
Clownishly adv మోటతనముగా మడ్డితనముగా.
Clownishness n s మోటతనము మడ్డితనము.
Cloyed adj ముఖము కొట్టిన, చీదర చేసిన. I was * నాకు ముఖము కొట్టినది, నాకు చీదరైనది. I felt quite * నాకు బొత్తిగా ముఖము కొట్టి పోయినది.
Cloying adj ముఖము కొట్టే, చీదర చేసే. * food ముఖము కొట్టే ఆహారము.
Club n s A stick దుడ్డు కర్ర, లాటీ కర్ర, గుదియ. or hotel పూటకూళ్ళ యిల్లు. a * foot వంకర పాదము, ముడుచుకొని పోయిన పాదము. * footed జన్మతః ముడుచుకొని పోయిన పాదము గల.
Clubhouse n s పూటకూటి యిల్లు.
Club-law n s దండ శాసనము.
Club-room n. s. పూటకూటి యిల్లు.
Clue n s నూలుకండె. or guide జాడ, పత్తా, పోబిడి. the preceding verse gives a * to the meaning of these words పై శ్లోకము వల్ల యీ మాటల యొక్క అర్ధము వీడుతున్నది. See Clew.
Clump n s of trees పొద.
Clumsily adv మొద్దుగా, మోటుగా, మడ్డిగా.
Clumsiness n s మొద్దుతనము, మోటుతనము, మడ్డి తనము.
Clumsy adj మొద్దుగా వుండే, మోటుగా వుండే, మడ్డిగా వుండే, చేత కాని.
Clung past and part of Cling అంటుకొన్నది,కరుచుకొన్నది,అంటుకొన్న,కరుచుకొన్న
Cluster n s గెల, చీపు, గుత్తి, అత్తము. of pearls ముత్యాల కుచ్చు or crowd గుంపు, సమూహము.
Clutch n s పట్టిన పట్టు. he got the estate into his clutches ఆ ఆస్తిని వాడు నోట్లో వేసుకొన్నాడు. he got into their clutches వాడు వాండ్ల చేతిలో చిక్కుకొన్నాడు.
Clutter n s అల్లరి, గొలగొలధ్వని, రొద, తొందర.
Clyster n s ఔషధభేదము, ఆసనము నందు చిమ్మన గొట్టముతో ప్రయోగించే మందు. * pipe ఆసనములో మందు ప్రయోగించే చిమ్మన గొట్టము.
Co, or Con సహా,కూడా, the prefix as in Coalition, సహవాసము. Co అనగాCompany, as Johnson and Co జాన్ సన్ వగైరాలు.
Coach n s ఒక తరహా బండి. * box బండి తోలేవాడు కూర్చుండే స్థానము. * house గాడి ఖానా.
Coachman n s బండి తోలే పనివాడు, సారధి.
Coadjutor n s సహాయి, సహకారి, ఉపకారి.
Coagulam n s పెరుగు.
Coagulation n s పేరడం.
Coal n s రాతి బొగ్గు, అనగా మంటిలో తవ్వి యెత్తే బొగ్గు. A coal or live * కట్టె నిప్పు, అంగారము. charcoal కట్టె బొగ్గు. * pit బొగ్గులు తవ్వే పల్లము. to haul over the coals క్రూరముగా విమర్శించుట. you will be hauled over the coals for this యిందు చేత నీకు మాట వస్తున్నది.
Coal-black n s బొగ్గు నలుపు. అనగా మంటిలో తవ్వి యెత్తే బొగ్గు. A coal or live * కట్టె నిప్పు, అంగారము. charcoal కట్టె బొగ్గు. * pit బొగ్గులు తవ్వే పల్లము to haul over the coals క్రూరముగా విమర్శించుట. you will be hauled over the coals for this యిందుచేత నీకు మాట వస్తున్నది.
Coalery n s బొగ్గులు తవ్వే పల్లము, గొయ్యి.
Coalescence n s ఐకమత్యము, ఏకీభావము, కలిసిపోవడము, మేళనము.
Coal-heaver n s బొగ్గులుతవ్వే కూలివాడు.
Coalition n s ఐకమత్యము, ఏకీభావము, అంగీకారము, సమ్మతము.
Coarse adj ముతకైన, ముదుగుగా వుండే, మోటుగా వుండే, చక్కబెట్టని. * foodమోటుతిండి, మడ్డి అన్నము. * grass దుబ్బులు. * hair బిరుసు .వెంట్రుకలు. A * hand తేరని అక్షరము. * language మోటు భాష, మోటు మాట. * mortar ముతక సున్నము. * paper ముతక కాకితము, * rice ముతక బియ్యము, A * ruby గుడ్డి కెంపు. * people మడ్డి మనుష్యులు. * silver మట్ట వెండి. * sugar బెల్లము. A * translation జబ్బు భాషాంతరము. A * voice బర్రెగొంతు.
Coarsely adv ముదుగుగా, మోటుగా, మడ్డితనముగా, మోటుతనముగా.
Coarseness n s ముదుగు, జబ్బు, మోటుతనము, మొండితనము.
Coast n. s. సముద్రతీరము, రేవు,కోస్తా, they spread this report through all their coasts యీ సమాచారమును వాండ్ల దేశములో నంతా ప్రచురము చేసినారు. go to his house and speak to him; but you must wait till the * is clear నీవు పోయి అతనితో మాట్లాడవలసినది అయితే అక్కడ వుండేవాండ్లు అవతలికి పొయ్యే దాకా కనిపెట్టి వుండవలసినది. Finding the * clear I went and spoke to him యెవరు లేనిది చూచి, లేక, సందడి లేని సమయము చూచి ఆయన దగ్గెరకు వెల్ళి మాట్లాడినాను. the * of Coromandel నాగూరు నాగపట్ణము మొదలుకొని మచిలి బందరు పర్యంతరము వుండే భూమికి యింగ్లిషువారు యీ పేరు పెట్టినారు. the * languages అరవము, తెలుగు, కన్నడ భాషలు.
Coaster n s చిన్న వాడ.
Coat n s or Covering కప్పు, పూత, పొర. * of fruit పెంకు, తోలు, చెక్కు. or hust of the cocoanut టెంకాయమట్ట. of skin; an integument పొర. a * of paint వర్ణము యొక్క ఒక పూత. Four coats of paint were put on the wall గోడకు నాలుగు పూతలు వర్ణము పూసినారు. He put a coat of tin over the copper రాగి మీద కళాయి పూసినాడు. There was as * of dirt over his skin అతని చర్మమీద మురికి ఒక పొరగా వుండినది. a * of mud పొర. the horse is losing his * ఆ గుర్రానికి వెంట్రుకలు రాలిపోతవి. a man's * or dress చొక్కాయ. a great * పైపచ్చడము, భైరవాసము, గొగ్గి. coats or petticoats కోక, వొల్లె. a * of mail జీరా, కవచము. Coat of Arms, See Arms.
Coatee n s కుడతా.
Coating n s పూత.
Coaxing n s పుసలాయింపు చెల్లింపు.
Cob n s a sort of horse ఒక తరహా గుర్రపుతట్టు.
Cobalt n s ఒక తరహా నల్ల కావిరాయి.
Cobbler n s మాదిగవాడు, పాతచెప్పులను బాగుచేసేవాడు, మోటుగా పని చేసేవాడు.
Cobra n s (the female, which has a hood) నాగు పాము, తాచు పాము. (the male which has no hood) సారాయి పాము.
Cobweb n s బూజు, కరుదూపము, పిచ్చి సొమ్ము, బూటకమైన సొమ్ము, లేతయుక్తి.
Cocculus indicus n s కాకమారి అనే ఒక విషపు చెట్టు.
Cochin-leg n s యేనుగ కాలు అనే రోగము, పుట్ట కాలు.
Cock n s కోడి పుంజు. of a gun గుర్రము. * sparrow మొగపిచ్చిక. * crowing కోడి కూసే వేళ, వేకువఝాము. a spout of spigot పీపాయి గిండి అనగా పీపాయికి రంధ్రము చేసి అందులో ఒక యిత్తడి గొట్టాన్ని బిగించి దానికి మరపెట్టి వుంటున్నది, ఆ మరస్సు తిప్పితే లోగా వుండె నీళ్లు. సారాయి మొదలైనవి బయిటికి వస్తున్నవి దాన్ని మళ్లీ తిప్పితే నిలిచిపోతున్నది or penis లింగము, ప్రజాపతి. a weather * గాలి యీతట్టు కొట్టుతున్నదని తెలియ చేసే ధ్వజమువంటి ఒక యంత్రము. he is a perfect weather * నిలకడ లేనివాడు, చపలచిత్తుడు. of hay వోదె, కసువువామి. to a ride a * horse పిల్లకాయలు ఆటలో గుర్రము మీద యెక్కినట్టు కర్ర మీద యెక్కుట. a cock and bull story లేని పోని కధ, నీలి వార్త, పుక్కిటి పురాణాలు చెప్పుట. He was the * of th crew, the leader మొనగాడు, పెద్ద, సొగుసుగాండ్లల్లో దొడ్డవాడు. Did you observe the * of his turband వాడు పాగా వేసుకొన్న సొగుసు చూస్తివా. Cock-a-doodle కొక్కరకో యనే స్వరము. cock-a-hoop అల్లారు ముద్దుగా వుండె పులకాంకితమైన.
Cockade n s దండులో వుండె వాండ్లు టోపీలలో దోపుకొనే బెండుపూలతో చేసినతురాయి.
Cockatoo n s పెద్ద తెల్ల చిలుక.
Cockatrice n s a serpent ఒక తరహా తాచుపాము, సర్పము, క్రూరుడు, పాపజీవి.
Cock-boat చిన్నదోనె
Cock-cbaffer n s ఆకు చిలక, మిడత.
Cock-crowing n s కోడికూత, కోడికూసే వేళ.
Cock-fight n s కోడిపందెము. See Cockpit.
Cockle n s (weed) గురుగాకు. shell fish ఆళిచిప్ప పురుగు. * shell ఆళిచిప్ప, నత్తగుల్ల, గరి చిప్ప. the ribbed species గంగాళ చిప్ప.
Cockloft n s యింటి మీద నుండె చిన్న అర.
Cockney n s పిచ్చివాడు, వరి మ్రాకులవాడు, అనగా London లో పుట్టి అక్కడనే పెరిగినవాడు, మరిన్ని యింగ్లిషు భాషను యాచగా మాట్లాడెవాడు, వడ్లు కాచేచెట్టు యెటువంటిదని అడిగేవాడు. He is a mere * వాడు వట్టి కోమటి.
Cockpit n s కోడి పందెము విడిచే స్థలము. In a ship యుద్ధవాడలో వుండె ఆసుపత్రి. or court చావిడి. or uproarious assembly అల్లరి మూక.
Cockroach n s బొద్దింక, భరిణెపురుగు, బరిడపురుగు, పరిటె పురుగు.
Cock's comb n. s. కోడిపుంజు యొక్క కొండె. or beau or gallant సొగసుగాడు, విటగాడు, a red flower పంచ పువ్వు.
Cockspur n s ఒక తరహా పుష్పము.
Cocksure adj దృఢముగా నమ్మిన. he was * of this యిది తనకు దొరుకుతున్నదని గర్వించినాడు, యిది యెగతాళి మాట.
Cockswain n s పడవవాండ్ల పెద్ద తండేలు.
Cockup (a sort of fish)పండుమీను
Cocky (pert,brave)గడుసైన,యిదియెగతాళిమాట
Cocoa n s ఒక తరహా చెట్టు, దీని కాయలని పిండి నీళ్ళలో వేసి పానకముగా తాగుతారు.
Cocoanut n s టెంకాయ, నారికేళము, కొబ్బరికాయ. the boughs మట్టలు. the ripe nut కొబ్బరికాయ. the nut with the hust on or in the husk బొండెము. the water యెడనీరు యెళనీరు. the kernel కొబ్బర. the coat పీచు. the husk of the germ పాళె. the shell బుర్ర. the broken shellచిప్ప, పెంకు. a ladle made of half the shell అపక, అగప. * tree టెంకాయ చెట్టు. * oil టెంకాయ నూనె.
Cocoon n s పిసిరికాయ.
Coculus n s కాకిమారి, నచ్చికొట్ట, నంజి గొట్ట.
Coculus indicus n s కాకమారి అనే ఒక విషపు Cochineal, n. s. ఇంద్రగోప పురుగు, ఆరుద్ర పురుగు.
Cod n s or pod కాయ. or fish గండు మీను అనే ఒక చేప. or testicleవృషణము.
Coddle n s కొన్ని కాయలను చోరువెచ్చని నీళ్లలో నానవేయడము. or pet గారాబము చేసి చెరపడము.
Code n s సంహిత, స్మృతి, చట్టములు పుస్తకము.
Codger n s గొడ్డు, అనగా చేదస్తుడు. a cunning * తెలిసిన హరంజాదా. an old * ముసిలిపండు.
Codicil n s ఉయిల్కా కితములో వ్రాసిన తాజాకలము.
Codiment n s సాధకము, సంభారము, వ్యంజనము.
Codpiece n s కౌపీనము, దట్టి, యిది ప్రాచీన కావ్యములలో వచ్చే మాట.
Coefficient n s సహాయి, సహకారి కారణము, ఉపాదాన కారణము, యిదిమహాగణితములో వచ్చే వాక్యము.
Coelebs n s బ్రహ్మచారి భార్యలేని వాడు.
Coeliack passion n s మహత్తైన గర్భశూల, దీనివల్ల చస్తారు.
Coemetery n s స్మశానము, పాతే స్థలము.
Coenobite n s సన్యాసి.
Coequal adj తుల్యమైన, సరిసమానమైన.
Coercion n s నిర్బంధము, బలవంతము, బలత్కారము.
Coercive adj నిర్బంధమైన, బలవంతమైన. * measures బలాత్కారము.
Coessential adj సమతత్వముగల, సమభావముగా వుండే, సమవస్తువుగా వుండే.
Coeternal adj సమనిత్యత్వముగల, సమనిత్యమైన.
Coeval adj సమకాలీనులైన, సమవయస్కులైన. his coevals అతని కాలమందువుండినవాండ్లు వాడీడువాండ్లు. these ten were coevals యీ పదిమంది వొకకాలపువాండ్లు.
Coexistant adj ఏక కాలమందు వుండే.
Coffee n s కాఫీ విత్తులు. * colour చామని చాయ, వొక తరహా నలుపు.
Coffee house n. s. భోజనము, చేసేయిల్లు,పూటకూళ్లయిల్లు
Coffeepot n s వొక తరహా గండి చెంబు.
Coffer n s రూకలు వుంచే పెట్టె, భోషాణము.
Coffin n s పీనుగ పెట్టె.
Coffined adj పీనుగ పెట్టెలో పెట్టిన.
Cog n s పల్లు, గడియారము మొదలైన వాటి చక్రము యొక్క పల్లు.
Cogency n s బలము, బలవత్తరము, దార్ఢ్యము. that argument has no *అన్యాయము దుర్మలముగా వున్నది. From the * of his reasoning ఆతడు చెప్పేన్యాయము నిరాఘాటము అయినది గనుక.
Cogent adj బలవత్తరమైన, దృఢమైన, నిరాఘాటమైన.
Cogently adv దృఢముగా, దార్ఢ్యముగా.
Cogitation n s యెన్నిక, తలంపు, తలపోసుకోవడము,
Cognate adj సంబంధముగల, చుట్టముగల.
Cognizable adj విచారణ చేయడమునకు అర్హమైన, విచారించతగిన. Offences that are not * by the Magistrate మేజస్ట్రేటు వారి అధికారానికి లోబడని తప్పితములు.
Cognizance n s విచారణ, విమర్శ. to take * విచారించుట, విచారణ చేసుట.
Cohabitation n s సంసారము సంగము. See Jeremy Taylor's GreatExampler Vol. 1. 147.
Coheir n s దాయాది, పాలివాడు, బాధ్యస్థుడు.
Coheiress n s దాయాదిది, పాలికత్తె.
Coherence, Coherency n s. సంబంధము, సందర్భము, పొందిక, పట్టు.
Coherent adj సంబంధించిన, సందర్భమైన, పొందికైన.
Cohesion n s సంబంధము, సంయోగము, ఐక్యము, అతకడము.
Cohesiue adj అతుక్కొనే, అంటుకొనే, జిగటగావుండే.
Cohesiveness n s సంలగ్నత, సంయోగము.
Cohexistance n s ఏక కాలమందు వుండడము, సమకాలమందు వుండడడము.
Cohobation n s పునఃపాకము, పునఃపచనము, ఒక ద్రవ్యములో నుంచి తీసిన ధృతిని ఆ పిప్పిలోనే పోసి మళ్లీ కాచడము.
Cohort n s పటాలము.
Coiffure n s తలశృంగారము.
Coil n s చుట్ట. or trouble. తొందర, యిబ్బంది.
Coiled up adj చుట్టుకొన్న, చుట్టిపెట్టిన. coiled rope దారపుచుట్ట.
Coin n s నాణ్యము, నాణెము. bad * చెల్లని నాణ్యము. the dent made in assaying * సులాకి. he paid them in their own * వాండ్లు చేసిన అపకారానికి వీడు ప్రతి అపకారము చేసినాడు, వాండ్లు చేసినదానికి ప్రతి చేసినాడు.
Coinage n s నాణ్యము వేయడము, ముద్ర వేయడము. or invention కల్పన. money of that * ఆ ముద్ర రూకలు. a mere * of the brain వట్టి భ్రమ.
Coincidence n s సందర్భము, సరిపడడము, సంబంధము. By a singular * his brother also was there మరిన్ని సమందర్భించిన దేమంటే వాడి తమ్ముడు కూడా అక్కడ వుండినాడు.
Coincident adj సందర్భించిన, సరిపడిన, వొప్పిన.
Coined adj కల్పితమైన, బనాయించిన. a * word నిరాధారమైన మాట, అనుకరణ శబ్దము.
Coiner n s కల్పించేవాడు, తప్పు నాణెము వేసేవాడు.
Coining n s నాణెములు వేయడము, తప్పు నాణ్యములు వేయడము. he washanged for తప్పు నాణెము వేసినందున గురించి వాణ్నీ వురిదీశినారు.
Coir n s (Indian word) తాటినార.
Coition n s రతి, సంగమము, సంయోగము.
Coke n s వొక తరహా బొగ్గు.
Colander n s జల్లెడ.
Cold n s చలి. or catarrch జలుబు, పడిశము, శైత్యము.
Cold hearted adj బెరుకు గుణము గల.
Cold-blooded adj క్రూరమైన, మొండి.
Coldly adv విరసముగా.
Coldness n s చలి, చల్లదనము, విరసము, వేరు బంధము.
Cole n s వొక తరహా తోటకూర.
Colewort n s ఒక తరహా తోటకూర.
Colf n s వొకతరహా టోపి. యిది ప్రాచీన శబ్దము.
Colick n s కడుపు నొప్పి శూలనొప్పి.
Collapse n s అంటుకొని పోవడము, యెండుకొని పోవడము.
Collapsed adj అంటుకొని పోయిన, యెండుకొని పోయిన.
Collar n s మెడకు వేసుకొనేటిది, గల బంధనము, మాల, మాలిక. a dog * కుక్క మెడకు వేసినది. of a coat ఇంగ్లిషువాండ్ల చొక్కాయ యొక్క మెడకప్పుగుడ్డ. To seize him by the * వాడి మెడ గుడ్డ పట్టుకొన్నది, దౌర్జన్యము జరిగించినది. A horse * బండిని యివ్వడానకు గుర్రపు మెడకు వేసే తోలువలయము, దీన్ని సరజు అని అంటారు. * bones జత్రువులు, మెడకొంకులు. a * of honour దండ, మాళ. a gold * worn by women close round the throat పట్టెడ, అడ్డిగెలు. a large gold * కంటె. a * of brown వొక తరహా మాంసము.
Collateral adj తత్సంబంధమైన, పరస్పరమైన, పరభారిగావుండె, దాయాదులైన. * relations జ్ఞాతులు, దాయాదులు. * evidence పరస్పరముగా వుండె సాక్షి, ఉపసాక్షి, పై సాక్ష్యము, ఉత్తర సాక్ష్యము. * circumstances వేరే కొన్ని పరస్పరమైన సంగతులు. * security పై భద్రము.
Collaterally adv తత్సంబంధముగా, పరస్పరముగా, పర భారిగా, దాయాదిత్వముగా.
Collation n s A meal ఫలహారము. of manuscripts సంప్రతించడము,మొకాబిలా చేయడము.
Colleague n s తోటిపాటి వుద్యోగస్థుడు, జత వుద్యోగస్థుడు.
Collect n s సంక్షేపము, జపము, అనగా వొక తరహా ప్రార్థన.
Collected adj కూడిన, చేరిన, వసూలైన, కలిసిన, స్థిరబుద్ధిగా వుండె, ఏకచిత్తముగా వుండె. Money that has been * వసూలైన రూకలు. he was in a * state వాడికి భ్రమతీరి తెలివిగా వుండినాడు. he was then * పిచ్చి విడిచిపోయి హాయిగా వుండినాడు.
Collectedly adv స్థిర బుద్ధిగా, స్థిమితముగా, ఏకచిత్తముగా, తెలివిగా, నిబ్బరముగా.
Collectedness n s స్థిరము, స్థిమితము, ఏకాగ్ర చిత్తత, నిబ్బరము.
Collection n s కూడినది, సంగ్రహము, అనగా a * of people గుంపు. of wealth ధనము. of money చందారూకలు of revenue వసూలు, వసూలు రూకలు. of verse శతకము, చాటు శ్లోకములు. or volume గ్రంథము. there was a * of blood నెత్తురు కట్టినది, బొప్పికట్టినది. there was a large * of water. అక్కడ నీళ్ళ వెల్లువ వుండినది. there was a * of dirt అక్కడ నిండా మురికి చేరి వుండినది.
Collective adj ఏకమైన, ఏకముగా కూడిన, సముదాయమైన. the judgement ofthe * court యావత్తు మంది కూడి చెప్పిన తీర్పు. a * name సముదాయ నామము.
Collectively adv ఏకముగా, ఐక కంఠ్యముగా, వకటిగా కూడి, సముదాయముగా.
Collector n s పోగుచేసేవాడు, చేర్చేవాడు, సంగ్రహించేవాడు. a * revenue పన్ను రూకలు వసూలు చేసేవాడు. this was the title used in the old Hindu Governments. A book * గ్రంధములు సంగ్రహించేవాడు.
Collectorate n s జిల్లా, పరగణా, తుకుడీ, దేశము.
Collectorship n s తాలూకా, తాలూకా అధికారము.
College n s శాస్త్రపాఠశాల, విద్యాలయము. a * for monks మఠము. or hispital; as Greenwich College ధర్మ చావిడి, ధర్మసత్రము, పించన్ వాండ్లు నివసించే సత్రము.
Collegian n s శాస్త్ర పాఠశాలలో చదువుకొనేవాడు, విద్యార్థి.
Collegiate adj శాస్త్ర పాఠశాల సంబంధమైన. * life బ్రహ్మ చర్యము,విద్యార్ధిత్వము.
Collier n s బొగ్గులు తవ్వేవాడు, బొగ్గులు అమ్మేవాడు. or ship బొగ్గులు తీసుకొని పొయ్యేవాడు.
Colliery n s బొగ్గులు తవ్వే పల్లము.
Colliquative sweat n s వడుస్తూ వుండే చెమట, మహత్తైన చెమట.
Collision n s సంఘట్టనము, వకటితో వకటి కొట్టు కోవడము, తగలడము. or contention ఘర్షణ. They came in * ఘర్షణకు సంధించిరి. By doing this he came in * with his landlord యిందువల్ల అతనికిన్ని యజమానికిన్ని ఘర్షణ సంభవించినది. * of sentiments అభిప్రాయ విరోధము.
Collocation n s కూడా పెట్టడము, చేరి వుండడము, కలిసివుండడము, ప్రవేశము.
Collops n s కండలు, కండ యొక్క ముడతలు.
Colloquial adj సామాన్యమైన, గ్రామ్యమైన. * language రూఢిగా వుండె మాటలు,గ్రామ్య భాష, సామాన్యమైన భాష, అనగా కావ్యమందు రాని భాష.
Colloquially adv సరసముగా, సామాన్యముగా, మాట్లాడె రీతిగా, గ్రామ్యముగా.
Colloquy n s సంభాషణ, సల్లాపము, సంవాదము.
Collusion n s కుట్ర, దొంగ యోచన, పక్షపాతము, పితలాటకము, మాయ, మోసము (యోగము Colebrooke.)
Collusively adv కృత్తిమముగా, పితలాటకముగా, మోసముగా.
Collussive adj కుట్రమైన, పితలాటికమైన, మోసమైన.
Colly-flower n s వక తరహా శ్రేష్ఠమైన కోసుకూర.
Collyrium n s కాటుక, అంజనము.
Colocynth n s a bitter apple, a violent purgativemedicine చేదు పుచ్చకాయ.
Colon n s పెద్ద పేగు, పురీషస్థానము. in grammar మూడు నిమిషములు నిలిపేలాగు వేసే గురుతు.
Colonel n s సేనాధిపతి.
Colonelship n s సేనాధిపతిత్వము.
Colonial adj కొత్తపూరి సంబంధమైన. the * government కొత్తగా పరదేశములో పోయి చేరిన కాపుల సంరక్షణ కొరకు పరదేశములో పోయి చేరిన కాపుల సంరక్షణ కొరకు సీమలో వుండె అధికారులు. the * secretary కొత్తగా ఆయా దేశములలో పోయి చేరి వూళ్లు కట్టుకొని వుండె కాపుల సంగతి విచారించే మంత్రి. See Colony.
Colonist n s కొత్తగా వచ్చి వుండేవాడు, స్వదేశము విడిచి దేశాంతరమందు వచ్చి నివాసముగా వుండెవాడు.
Colonization n s బస్తి చెయ్యడము, కొత్తగా వచ్చి కాపురము వుండడము.After the * of America by the English ఇంగ్లిషువాండ్లు అమెరికా దేశమునకుపోయి చేరి వూళ్లు కట్టుకొన్న తరువాత. See Colony.
Colonnade n s ప్రాకారము పొడుగునా నిడుపుగా కట్టి వుండె మంటపము, వసారా, పంచపాళి.
Colony n s గ్రామము A palntation: whither people are sent to dwell: a company of people transplantned from one place to another with an allowance of land for tillage: a city or country where of the people once came from another country (Ainsw.) వచ్చి చేరిన కాపుల అనగా స్వదేశమును విడిచి కొత్తగా వచ్చి కొంత భూమిని ఆక్రమించుకొని వుండె కాపులు, పరదేశస్థులు వచ్చి కొంత భూమిని ఆక్రమించి కొత్తగా కట్టుకొన్న వూరు See Madras Journal 1844 page 123. (Metaphorically) a * of ants has taken possession of my room నా గదిలో కొత్తగా చీమలు పుట్ట పెట్టినవి. a * is governed by its own laws యీ కొత్తగా వచ్చి చేరిన కాపులు స్వతంత్రులు అనగా వాండ్లు అక్కడి రాజు యొక్క అధికారమునకు లోబడ్డవారు కారు.
Coloquintida ns వెర్రి పుచ్చకాయ.
Colossal adj బ్రహ్మాండమైన, మహాగాత్రమైన, అతిగాత్రమైన.
Colossus n s బ్రహ్మండమైన విగ్రహము, బ్రహ్మాండమైన ప్రతిమ. That * of literature Sam Johnson మహా విద్యావంతుడైన జాన్సను.
Coloumbine n s వేషములో వచ్చే ఒక పాత్ర యొక్క పేరు. * అనే ఒక వేషము.
Colour n s వర్ణము, వన్నె, చాయ, రంగు. to lose * తెల్లపారుట చాయయెత్తి పోవుట, వాడిపోవుట. he changed * వాడు ముఖము మాడ్చినాడు, వాడి ముఖము నల్లపడ్డది. a countenance devoid of * తెల్లపారిన ముఖము. * of pretext వ్యాజము, సాకు, మిష, వేషము. there was no * of doing so యిట్లా చేస్తారన్న పొళుకువ వుండలేదు. colours of flag కొడి, పతాకము, జండా. They fought under his colours ఆయన చేతి కింద వుండి పోట్లాడినారు. he painted the battle in glowing colours ఆ యుద్ధమును బాగా వర్ణించినాడు.
Colourable adj సాకుగల, వ్యాజముగల, శృంగారించిన.
Colourably adv సాకుగా, వ్యాజముగా, శృంగారించి.
Coloured adj చిత్రవిచిత్రమైన, నానా వర్నమైన. highly * అతి శృంగారమైన. a * man or a man of colour వెష్టుయిండియా దేశపు పరంగివాడు. * clothes are clothes of the wearer's own choosing: neither black (as in the church or the law) nor red, as required in the army Plain dress, is the opposite word to * clothes.
Colourist n s చిత్రశాస్త్రమందు ప్రవీణుడైనవాడు, చిత్రకారుడు.
Colourless adj వివర్ణమైన, తెల్లపారిన, వెలవెలపోయిన.
Colporteur n s వీధివీధికి తెచ్చి పుస్తకములు అమ్మేవాడు.
Colt n s గుర్రపు పిల్ల. asse's * గాడిదె పిల్ల.
Colter n s కర్రు.
Coltish adj తుంట.
Colts tooth n s గుర్రపు పిల్ల యొక్క పల్లు. he has not yet shed his * వాడికి యిన్నేండ్లు వచ్చిన్నీ పిల్ల చేష్టలు మానలేదు.
Coltsfoot n s ఒకమూలిక, దీనితో దగ్గుమందు చేస్తారు.
Column n s స్తంభము, వరస. this dictionary is printed with two coloumns in the page యీ గ్రంధము పత్రములో రెండు వరసలుగా అచ్చు వేయబడి వున్నది. a * of figures కత్తెము. a * of fire బ్రహ్మాండమైన మంట. a * of troops వరస, సిపాయీల వరస. the army was divided into two coloumns ఆ దండును రెండు వరసలుగా నిలిపినారు.
Colures n s జ్యోతిషమందు వేసే చక్రములు.
Comate n s చెలికాడు, విహితుడు.
Comatose adj స్మృతితప్పిన, స్మారకము లేని.
Comb n s దువ్వెన, చిక్కంటు, ఈర్పెన. honey * తేనె పట్టు, తెట్టె, తోన, తెర, పెర. of a cock కోడి కొండె, కోడి జుట్టు.of white ants పుట్టకూడు.
Combat n s పోరు, జగడము, యుద్ధము, కలహము. single * ఒకడితో ఒకడు కత్తి యెత్తుకొని చేసే యుద్ధము. They were put hors de combat చెయ్యాడకుండా నిలిచిపోయినారు, గాయములు పడ్డారు.
Combination n s యోగము, సంయోగము, సంసర్గము, మేళనము, ఏకీభావము,చేరిక, బందుకట్టు, కట్టుబాడు. or coalescence లీనము కావడము, కలిసిపోవడము.There was a * among the weavers సాలెవాండ్లలో ఒక కట్టుబాటువుండినది.From a * of circummstances I was obliged to sell my house అన్నిఒకటిగా కూడినది గనుక నాకు యిల్లు అమ్యవలశి వచ్చినది. It was a * of diseases నానా రోగములు కలిసి వుండినది.
Combined adj చేరుకొన్న, కూడుకొన్న, కలుసుకొన్న, ఏకీభవించిన, కట్టుకొన్న, these circumstances * rendered him unfit for the office యివన్నీ కూడినందున వాడు ఆ వుద్యోగమునకు తగనివాడైనాడు, అనర్హుడైనాడు.
Combinedly adv కూడా, ఒకటిగా, ఏకముగా, ఏకగ్రీవముగా, ఏకీభవించి.
Combustibility n s కాలేస్వభావము, కాలే గుణము.
Combustible adj కాలే, అంటుకొనే, రంజకమువలె అంటుకొనే, నిప్పుసోకితెఅంటుకొనే. the house was filled with combustibles యింట్లో యేతట్టుచూచినా నిప్పు సోకితే అంటుకొనే వస్తువులు నిండి వుండినవి అనగా బొగ్గు, చక్కలు,కాకితము, బట్టలు వగైరా.
Combustibleness n s కాలే గుణము, నిప్పు సోకితె అంటుకొనే గుణము.
Combustion n s దహనము, కాలడము. In a state of * కాలుతూ వుండగా,దహనమౌతూ వుండగా.
Come The two verbs To Comeand To Go are often used for one another: severalinstancearepointedoutinthenotestomyvolumeo
Comedian n s నటీ, నాటకము ఆడేవాడు, వేషగాడు, భాగవతుడు, అనగా బోగముది,బోగంవాడు.
Comedy n s నాటకభేదము See Tragedy.
Comeliness n s సొంపు, సొగుసు, సౌందర్యము, లావణ్యము, ముద్దు, ఒప్పిదము.
Comely adj సొంపైన,సొగుసైన,అమదమైన,సుందరమైన,లావణ
Come-off n s సాకు, బహనా. this is a mere * యిది వట్టి సాకు.
Comet n s తోకచుక్క, ధూమకేతు.
Comfit n s మిఠాయి, పుస్తెకాయలంతేసి, సుగియలు.
Comfort n s ఓదార్పు, వూరట, ఆదరణ, సుఖము, క్షేమము, నిమ్మళము,సాంత్వనము. A+ they live in great * వాండ్లు హాయిగా వున్నారు, నెమ్మదిగావున్నారు.
Comfortable adj సుఖమైన, హాయిహావుండె. a * house సౌఖ్యమైన యిల్లు. a *bed హాయిగా వుండే పరుపు. the bird builds herself a * nest పక్షులు తమకుసౌఖ్యముగా గూడు కట్టుకొంటవి * intelligence క్షేమ సమాచారము, మంచిసమాచారము. a * farmer భారి రయితు.
Comfortableness n s సుఖము, హాయిగా, నెమ్మది.
Comfortably adv సుఖముగా, హాయిగా, నెమ్మదిగా.
Comforted adj ఓదార్చబడ్డ, వూరడించబడ్డ, ఆదరించబడ్డ. She wept and refused to be * యెంత వోదార్చినా వినకుండా యేడ్చినది.
Comforter n s ఓదార్చేవాడు, వూరడించేవాడు, ఆదరించేవాడు.
Comfortless adj దిక్కుమాలిన, పాడైన, అనాదరమైన, ఆదరణ లేని, తొందరపడే. a * house సౌఖ్యము లేని యిల్లు.
Comic, Comical adj హాస్యకరమైన, కుచోద్యమైన, వికారమైన. The * aliance హాస్య పంచాంగము, యెగతాళి పంచాంగము.
Comicality n s హాస్యరసము, నవ్వించే గుణము, కుచోద్యగానితనము.
Comically adv హాస్యముగా, కుచోద్యముగా, వికారముగా.
Comick adj హాస్య నాటక సంబంధమైన హాస్యకరమైన, కుచోద్యమైన, నవ్వించే.
Coming n s రావడము, రాకడ, ఆగమనము, ప్రవేశము. * in or comings in వరపు, వరుమానము.
Comity n s మర్యాద, ఉపచారము.
Comma n s చదవడములో రవంత నిలవ వలసిన చోట వేసే గురుతు (,).
Command n s ఆజ్ఞ, అధికారము, విధి, శాసనము, శెలవు, ఉత్తరువు, స్వాధీనము. I came here at his * అతని శెలవు చొప్పున యక్కడికి వస్తిని. he has great * of this language అతనికి యీ భాష స్వాధీనమై వున్నది. One who has the * of his passions జితేంద్రియుడు. at * or available as money స్వాధీనముగా వుండే. they are at his * వారు అతని స్వాధీనములో వున్నారు. Self * ధైర్యము, ఇంద్రియ నిగ్రహము దమము, శాంతి. he has great self * వాడు బహు నిబ్బరముగా వున్నాడు. he has no self * వాడు యింద్రియ బద్ధుడై వున్నాడు, వాడు చలచిత్తుడై వున్నాడు.
Commandant n s అధిపతి, అధికారి, సేనాధిపతి, దక్షవాయి. the English or French word కుముందాను is in familiar use.
Commanded adj మెచ్చిన, మెచ్చుకోతగ్గ, స్తుతించిన. this house is * by its situation యీ యింటి విన్యాసము చూస్తే మెచ్చుకో తగ్గదిగా వున్నది, యీ యింటి సన్నివేశము మంచిది.
Commander n s అధిపతి, అధికారి, సేనా నాయకుడు, దళవాయి. Commander-in-chief సేనాధిపతి. * of a vessel వాడ యొక్క సర్దారు, వాడు కపితాను, తండేలు, మరకాడు. Knight * శూరులకు రాజు యిచ్చిన వక ఖితాబు. (H.)
Commanding adj or grand, Noble ఘనమైన శ్రేష్ఠమైన, దివ్యమైన. She has a * figure అది గంభీరమైనది. a * hill ఉన్నతమైన పర్వతము. the * officer కుముందాను.
Commandment n s కట్టడ. ఆజ్ఞ, విధి, శాసనము. at his * ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన ఆజ్ఞాపించినందున.
Commemoration n s ఆచరించడము, కొనియాడడము. * of a feast ప్రతిసంవత్సరము చేసే పండుగ. * of a death శ్రద్ధము, తద్దినము.
Commencement n s ఆరంభము, మొదలు. from the very * ఆరంభించినదిమొదలుకొని.
Commendable adj మెచ్చతగిన పొగడతగిన, అంగీకరించతగిన, ఒప్పుకోతగిన.
Commendably adv ఒప్పుగా, బాగా. he acted it * మెచ్చుకొనేటట్టుగా చేసినాడు.
Commendam n s అమాని, యిది గుడిమాన్యమును గురించిన మాట. this land is held in * ఆ నేల అరూబిగా వున్నది, జప్తిగా వున్నది.
Commendation n s స్తుతి.
Commendatory adj పొగడ తగ్గ, స్తుతించతగ్గ. * expressions మెప్పులు,స్తోత్రములు. a * letter సిఫారసు కాగిదము.
Commensurable adj తగిన, అంగుగా వుండే, తదనుగుణ్యమైన, సమానమైన. this labour has * advantages యీ తొందరకు తగిన ఫలము కద్దు.
Commensurate adj తగిన, అకగుగా వుండే, తదనుగుణ్యమైన, సమానమైన. I see no * advantage in this యిందుకు తగిన ఫలము కనుపించలేదు.
Commensuration n s సమానత్వము.
Comment n s వ్యాఖ్యానము, టీక. or remark ఆక్షేపణ. they made their comments with much freedom తమ మనసుకు వచ్చినట్టెల్లా ఆక్షేపించినారు.
Commentary n s టీక, వ్యాఖ్యానము, ఆక్షేపణ. Cesar's commentaries సీజరు తాను చేసిన యుద్ధమును గురించి తానే వ్రాసిన చరిత్ర.
Commentator n s టీక చేశిన వాడు, వ్యాఖ్యానకర్త.
Commerce n s వర్తకము, వ్యాపారము. they hold no * with strangersవాండ్లు అన్యులతో సహవాసము చేయరు. the * of friendship స్నేహవ్యాపారము.the * of love కానుక వ్యాపారము. or sexual intercourse రతి, స్త్రీ పురుషసంయోగము.
Commercial adj వర్తక సంబంధమైన, వ్యాపార సంబంధమైన. a * city వర్తకము బాగా జరిగే పట్టణము.
Commercially adv వర్తకముగా, వ్యాపారముగా.
Commination n s బెదిరింపు, శాపము.
Comminatory adj భయంకరమైన, శాపముగా వుండె. * clauses శాపములు.
Comminuted adj పొడి చేసిన, చూర్ణము చేసిన.
Comminution n s పొడి చేయడము, చూర్ణము చేయడము.
Commiseration n s జాలి, పరితాపము.
Commissariate n s దండుకు రస్తు మొదలైనవి జాగ్రత చేసే వుద్యోగము.
Commissary n s దండుకు భోజన సామగ్రీ మొదలైన వాటిని జాగ్రత చేసేవాడు,దండుకు రస్తు మొదలైనవి సరఫరా చేసేవాడు.
Commission n s the act of doing చేయడము, జరిగించడము. after the * of this murder యీ ఖూని జరిగించిన తరువాత. he prevented the * of this crime యీ నేరము జరగకుండా అడ్డి చేసినాడు. Sins of omission and of * అకరణే ప్రత్యవ్యాయములు, చేయక విడిచినందువల్ల నన్ను చేయకూడనిదాన్ని చేసినందునున్ను వచ్చిన పాపములు. he gave me a * to sell the horse గుర్రాన్ని అమ్మడానకు ఆజ్ఞ యిచ్చినాడు. or charge పని, వ్యవహారము, ఉద్యోగము. as you are going to twon I will give you a * నీవు పట్ణానికి పోతున్న్నావు గనుక మీకు ఒక పని చెప్పుతాను, నాకు ఒక పని చెయ్యి. they sold the goods on * తరుగు మాట్లాడుకొని సామానులను అమ్మి యిచ్చినారు. or Behest, order ఆజ్ఞ. he is in the * or in the * of the peace మేజిస్ట్రేటు దొరలలో వీడు ఒకడుగా వున్నాడు. or letters patent ఉద్యోగ పత్రిక, సన్నదు. he received his commission from the king రాజు వద్దవాడికి వుద్యోగ పత్రిక దొరికినది. they took away his * వాణి వుద్యోగము తీసివేసినారు. the King's power was then in *; or in abeyance రాజు యొక్క అధికారము అప్పుడు చెల్లకుండా వుండెను, జప్తిగా వుండెను. or fee, allowance వర్తన, రుసుము, తరుగు, కట్టెడ. he paid the * upon the auction ఆ యేలములో రుసుము చెల్లించినాడు.
Commissioner n s అధికారి, అధికారపత్రిక యిచ్చి పంపబడ్డ ప్రభువు.
Commissure n s సంధి, ముఖ్యముగా బ్రహ్మకపాల సంధి.
Commitment n s పారాలో పెట్టమని వుత్తరవు చేయడము.
Committal n s పారాలో పెట్టమని వుత్తరవు చేయడము.
Committee n s సభ, ఆలోచనసభ. they held a * వారు ఆలోచించుకొన్నారు, మాట్లాడుకొన్నారు. they appointed a * విచారించగలందులను నలుగురిని యేర్పరచినారు.
Committer n s చేసేవాడు.
Commixture n s మిశ్రమము, సంకరము.
Commode n s a head dress శిరోభూషణము, స్త్రీల వొక తరహా భూషణము, యిది పూర్వకాలపుది. or dressing table మరిన్ని స్త్రీల యొక్క మేజ, యిది మహా పిచ్చిమాట. or necessary chair జలమలములు విసర్జించే పెట్టె.
Commodious adj తగిన, అనుకూలమైన, వసతిగా వుండే.
Commodiously adv హాయిగా, వసతిగా.
Commodiousness n s వసతి, హాయి, సౌఖ్యము.
Commodity n s goods, wares, articles సరుకు, సొమ్ము.
Commodore n s వాడలపెద్ద, అనగా పది పన్నెండు వాడలకు అధిపతిగా వుండేవాడు.
Common n s సముదాయ నేల. the village * గ్రామకంఠము, బీడుగా వుండే గ్రామ సముదాయ నేల.
Common-??? n s Europe దేశములో వుండే వొక లాటీను ధర్మశాస్త్ర పుస్తకము, అది యిప్పట్లో చెల్లదు.
Commoner n s సామాన్యుడు. In a college ధర్మానికి చదివే విద్యార్థి.
Commonly adv వాడుకగా, పొడువుగా, బహుశా. It is * reported ఆట. It is * reported that he is dead వాడు చచ్చినాడట. * called అనగా వాడుకగా చెప్పే. Bhashyacarlu * called Ramanuja రామానుజులనే భాష్యకార్లు.
Commonness n s వాడిక.
Commonplace-book n s యదాస్తు పుస్తకము, చిల్లర పద్దులు వ్రాసుకొనే పుస్తకము.
Commons n s (dinner) బత్తెము. short * బీద బత్తెము. King, Lords and Commons రాజు, ఘనులు, సామాన్యులు, రాజున్ను పెద్ద మనుష్యులున్నుసామాన్యులున్ను.The house of Commons సామాన్యుల సభ. యిది యింగ్లీషుగౌవరుమెంటులో వొక భాగము.
Commonwealth n s a sort of government మహానాడు, ప్రజా ప్రభుత్వము.members of a * మహానాటి కాపులు. the * of letters విద్వాంసులు. or welfare of the country దేశ సుఖము, ప్రజాక్షేమము. See Weal.
Commotion n s కలహము, కలత, అల్లరి, అల్లోలకల్లోలము, కొందలపాటు.
Communicable adj చెప్పగల, తెలియచేయతగ్గ.
Communicate n s సహభాగి, స్మరణిర్థముగా యీశ్వర భోజనము చేసేవాడు, యిది ఖ్రీస్తు మతసంభంధమైన మాట.
Communicated adj కలిసిన, తెలిసిన, పట్టుబడిన, అంటిన. Knowledge iscommunicated by books గ్రంధముల చేత జ్ఞానము కలుగుతున్నది. the knowledge* by books గ్రంధముల వల్ల కలిగిన జ్ఞానము. the intelligence * by this letter యీ జాబు వల్ల తెలిసిన సమాచారము. the disease * by these clothes యీ గుడ్డలవల్ల అంటిన రోగము. Some diseases are communicated by touch స్పర్శచేత కొన్ని రోగములు అంటుతున్నవి, వస్తున్నవి.
Communication n s intercourse, interchange సంబంధము, అన్యోన్యము,సహవాసము. passage or way దోవ, దారి. he added two bridges tocomplete the * రెండు వారధులు కట్టినందున దోవ నిరాటంకమైనది. by breaking the bridge he cut off the * వారధిని పడకొట్టినందున దారి లేకపోయినది. or imparting యివ్వడము, తెలియ చేయడము. information సమాచారము, సంగతి. a written * of letter జాబు, conversation సంభాషణ.
Communicative adj (familiar) కలియకలుపుగా వుండే, వేరు బంధము లేని,ధారాళమైన, మర్మము లేని. He is very * వాడు నిండా కలియకలుపు మనిషి మర్మికాని వాడు.
Communicativeness n s or unreservedness ధారాళముగా వుండడము, వేరుబంధము లేమి, మర్మము లేమి, నిష్కాపట్యము.
Communion n s or being joined అన్యోన్య సంబంధము, ఐకమత్యము, చేరిక,యోగము, సహవాసము. Church or sect సమయము, సమయ స్థులు. of the Lordssupper సహభోజనము.
Community n s లోకులు, ప్రజలు, జనులు, జనకట్టు. he did this for the benefit of the * ప్రజలమేలుకై దీన్ని చేసినాడు, లోకోపకారముగా దీన్ని చేసినాడు. they form one * వాండ్లంతా ఏకగ్రీవముగా వున్నారు, వాండ్లంతా వొక కట్టుగా వున్నారు. the * of wives as exemplified to the present day in the Malayala country అనేక భర్తృకత్వము. the name they bore in * సముదాయ నామము.
Commutable adj మార్చతగ్గ, మార్చకూడిన.
Commutation n s or change మార్పు, మార్చడము. or exchange పరివర్తన,మార్చుకోవడము, బదలాయింపు.
Compact n s or agreement వొడంబడిక, ఉభయ సమ్మతి, నిశ్చయము.
Compacted adj ఖనీభవించిన, ఖనీభూతమైన, ముద్దకట్టుకొన్న. a cell where sweets * lie మధుపూరిత రంధ్రము.
Compactly adv గట్టిగా, దృఢముగా, దట్టముగా, సాంద్రముగా, తరుచుగా,యిమిడికగా.
Compactness n s గట్టి, దృఢత, సాంద్రత, నిబిడత, యిమిడిక, కుదిరిక. from the * of the earth in this place యిక్కడ నేలచట్టు వలె వుండేటందు వల్ల. from the * of these goods యీ సరుకులు యిమిడికగా వుండేటందువల్ల.
Compages n s సంస్థానము, సంధింపు. (See mass) పిండము, పుంజము. a frame or system కట్టు.
Companion n s చెలికాడు, కూడా వుండేవాడు, సహవాసగాడు, చెలికత్తె. he and his companions వాడున్ను వాడి చెలికాండ్లున్ను. she and her companions అదిన్ని దాని చెలికత్తెలున్ను. he had no companions వాడు వొంటిగా వున్నాడు, సహాయము లేకుండా వున్నాడు. your brother and I were companions in the road నీ తమ్ముడున్ను నేనున్ను దోవలోకూడ డాస్తిమి. he came there with a female * అక్కడికి వక ఆడదాన్ని వెంటబెట్టుకొని వచ్చినాడు. where is the * to this earring? దీని జతపోగెక్కడ, రెండో పోగెక్కడ? these shoes are not companions యీ జోళ్లు జతగా వుండలేదు. where is the * to this picture యీ పటానికి జతగా వుండేపటము యెక్కడ. small book సంగ్రహమైన గ్రంధము. the * on board ship చిన్న నిచ్చెన.
Companionable adj సహవాస యోగ్యమైన.
Companionship n s సహవాసము.
Company n s of persons జనము గుంపు, సమూహము. I am always glad to be in his * అతనితో కూడా వుండడము నాకు యెప్పుడున్ను సంతోషము. he keeps bad * దుర్మార్గ సహవాసము చేస్తున్నాడు. assembly సభ, సభికులు. or guests విందుకు వచ్చినవాండ్లు. he sees much * అడుగడుగుకు విందులు చేస్తాడు. persons accompanying కూడా వచ్చే జనము. she came in * with him వాడితో కూడా వచ్చినది, వాణ్ని వెంబడించి వచ్చినది. they came in * వాండ్లంతా కూడా వచ్చినారు. In trade కొఠి, పాలికాపులు. a trading * పాలివర్తకులు. The East India Company ఈస్టుయిండియా సభ, యిండియా దేశమును యేలే వర్తకుల సభ, వీండ్లు వర్తకమును మానుకొనిన్ని ఆ పేరు పోలేదు. a * in a regiment పటాలములో ఒక కుంఫిని. the steam * &c. వాడకు పొగ సామగ్రి సిద్ధము చేసే వర్తకుల సభ. they keep him * or they keep * with him వాండ్లు వాడితో కూడా వుంటారు, వాండ్లు వాడితో కూడా సహవాసము చేస్తారు. To bear him * అతనితో సహవాసముగా వుండుట.
Comparable adj ఉపమానము చేయతగ్గ, పోల్చతగ్గ, తుల్యమైన, సమానమైన.
Comparative adj తారతమ్యము చొప్పున మేలైన, కంటే మేలైన, కంటేమించిన.తరమైన. the *; or the * degree తరప్రత్యయము. according to their * ages వారి వారి వయస్సు తారతమ్య ప్రకారము. by its * excellence కడమవాటికంటే యోగ్యమైనందున. during a period of * good health కాస్త వాసిగా వున్నప్పుడు. from its * difficulty కడమ వాటికంటే కష్టమైనందున. from its * goodness వున్నంతలో మేలైనందున. from its * height this is called the king of hills అత్యౌన్నత్యమువల్ల యిది అచలేంద్ర మనబడుతున్నది.he was a * stranger కడమవాండ్లకంటే వీడు కొత్త.
Comparatively adv ఇతరాపేక్షయా వున్నంతలో, కడమ వాటికన్నా, కడమ చూస్తే.he was * a good scholar వున్నంతలో వీడు పండితుడు. this is * modernవున్నంతలో యిది కొత్తది. this is * modern వన్నంతలో యిది కొత్తది. this is * nothing వున్నంతలో యిది కొత్తది. this is * nothing ఇతరాపేక్షయా యిది ఒక సొమ్ము కాదు. I am now * well నాకు మునుపటికంటే యిప్పుడు వొళ్లు కాస్త వాసి. he is now * poor మునుపటి కంటే యిప్పుడు దరిద్రుడుగా వున్నాడు. you are now * rich మునుపటి కంటే నీవు భాగ్యవంతుడుగా వున్నావు.
Compare n s ఉపమ, సమానత్వము. beyond all * అసమానముగా.
Compared to adj తుల్యమైన, సమానమైన. it may be * to a river యిదియేటితో సమానమనవచ్చును దీన్ని యేరనవచ్చును. * to him I am poor వాడికి నేను దరిద్రుణ్ని.
Comparison n s పోల్చడము, ఉపమించడము, సాదృశ్యము, సరిచూడడము,సంప్రదించడము. on making a * వాటిని సరిపెట్టి చూడగా. on a * of accounts లెక్కలు సరిపెట్టి చూడగా. on a * of accounts లెక్కలు సరి చూడగా, లెక్కలు సంప్రతించగా. What * can there be between this and that దీనికిన్ని దాని కిన్ని యేమి సామ్యము, సాటువ, యిది యెక్కడ అది యెక్కడ. beyond all * అసమానముగా. comparisons are odious పోల్చడము ఆసహ్యకరము, పోల్చపోతే చీదర పుట్టుతున్నది.
Compartment n s అర, అంకణము, యిల్లు. In a box గూడు. in a field మడి. in a chess board యిల్లు. in a beehive పొర.
Compass n s సూదంటురాయి గుణము గల దిక్కులు చూపే సూదిగల యంత్రవిశేషము, దీన్ని కొంపాసు అని అంటారు. the circle చక్రము, మండలము, ప్రదక్షిణము, చుట్టూరు, ఆవరణము, యెల్ల. Within the * of the garden there are several well తోట ఆవరణములోగా శానా భావులు వున్నవి. To keep within * హద్దులో వుంచుట, మితములో వుంచుట. you should keep your expenses within * నీవు మితవ్రయము చేయవలసినది. within the * of man's life మనిషి యొక్క అయుఃప్రమాణములో. within the * of one year వొక సంవత్సరములోగా. within the * of one hundred yards నూరు గజాలకు లోగా. within the * of the village ఆ వూరి యల్లకులోగా. a pair of compasses కైవారమ అనే ఆయుధము. a point of the compass దిక్కు, దిశ, దీన్ని, సముఖా, అని వాడవాండ్లు చెప్పుతున్నారు. or power అధికారము, శక్తి, యోగ్యత. mysticism is quite beyond my * యోగశాస్త్రము నా శక్తికి మించినది, నాకు అసాధ్యము. the points of the * అష్టదిక్కులు. they are thus named: N. కుబేర NE. ఈశాన్య E. ఇంద్ర SE. అగ్ని S. యమ SW. నైరుతి W. వరుణ NW. వాయువు.
Compassion n s కనికరము, జాలి, పరితాపము, దయ.
Compassionate adj జాలిపడే, పరితాప పడే, విశ్వాసము గల, దయాళువైన.
Compatibility n s సంభంధము, సాంగత్యము, సందర్భము, పొందిక. I do not see the * of his paying his debts and living in such luxury వాడి జంభానికిన్ని అప్పులు చెల్లించడానకున్ను సంబంధము యెంత మాత్రము కనుపడలేదు.
Compatible adj సంగతమైన, అనుకూలమైన, తగిన, తగ్గ. It is * with both suppositions అది వుభయధా అనుకూలముగా వున్నది.
Compatriot n s స్వదేశస్థుడు. He and I were compatriots వాడు నేను వొక దేశ స్థులము.
Compeer n s సముడు, తనతో సమానమైనవాడు, సహపాఠి.
Compendious adj సంక్షేపమైన, సంగ్రహమైన. a * grammar వ్యాకరణ సంగ్రహము.
Compendiously adv సంక్షేపముగా, సంగ్రహముగా, కొంచముగా, టూకిగా.
Compendiousness n s సంక్షేపము, సంగ్రహము.
Compendium n s సంగ్రహము, సంక్షేపము.
Compensating adj చెల్లుఅయ్యే, పడ్డ నష్టమునకు చెల్లు అయ్యే, యీడు అయ్యే,తగిన.
Compensation n s చెల్లు, పడ్డ నష్టమునకు చెల్లు, యీడు, బదులు, (H.)బహుమానము.
Competence, Competency n s. అర్హత, యోగ్యత he attained a moderate *వానికి కొంచెము దుడ్డు కూడినది.
Competent adj అర్హమైన, యోగ్యమైన, తగిన, యధోచితమైన, చాలిన, చాలినంత,కావలసినంత. Is it * to him to do so అట్లా చేయడము వాడికి యోగ్యమా. he is not * to this దీనికి వాడు యోగ్యుడు కాడు, తగదు. he has a * knowledge of the language ఆ భాషలో వాడికి యధోచిత జ్ఞానము వున్నది.
Competently adv యధోచితముగా, తగుమాత్రముగా, బాగా, చాలా.
Competition n s పోటి. he entered into * with them వాండ్లకు పోటి చేసినాడు. when two duties enter into *, we must consider which is most important రెండు పనులు వచ్చి తగులుకొన్నప్పుడు అందులో యేది ముఖ్యమో విచారించవలసినది.
Competitor n s పోటి చేసేవాడు. they were competitors for her hand దాన్ని పెండ్లి చేసుకోవలెనని వాండ్లు పోటి చేసినారు, దాన్ని పెండ్లి ఆడడానకు నేనంటే నేనని పయిబడ్డారు.
Compilation n s సంగ్రహము, రచన, ఆయాగ్రంధములలో నుంచి యెత్తి రచించినది. a * of poetry కావ్య సంగ్రహము. a * of verses చాటు శ్లోక పుస్తకము. a * of rules సూత్ర సంగ్రహము, సూత్ర మంజరి. during the * of this dictionary యీ నిఘంటు రచిస్తూ వుండగా. a worthless * పనికిమాలిన గ్రంధము, కుకావ్యము.
Compiled adj సంగ్రహించిన, పోగు చేసిన, రచించిన, చేసిన.
Compiler n s సంగ్రహించేవాడు, రచించేవాడు, గ్రంధకర్త.
Complacence, Complacency n s. ప్రసన్నత, సంతోషము, ఆనందము, ఉల్లాసము. he viewed them with * సంతోషముగా చూచినాడు. self complacency అహంకారము.
Complacent adj ప్రసన్నమైన, సంతోషమైన, ఉల్లాసమైన. he looked at themwith a complacent eye వాండ్లను సంతోషముగా చూచినాడు, ఆహ్లాదముగా చూచినాడు.self complacent అహంకరించిన.
Complacently adv ప్రసన్నముగా, సంతోషముగా, ఉల్లాసముగా. self *అహంకరించి, అహంకారముగా.
Complainant n s వాది, వ్యాజ్యగాడు, ఫిర్యాది (H).
Complainer n s మొరపెట్టుకొనే వాడు.
Complaint adj సులుభుడైన, విధేయుడైన. a * simpleton యెత్తువారి చేతిబిడ్డ,యెవరు యెట్లా ఆడిస్తె అట్లా ఆడెవాడు.
Complaisance n s kindness, friendliness ఉపచారము, మర్యాద, వినయము,నమ్రత. he had the * to explain it దయచేసి అర్థము చెప్పినాడు, అనుగ్రహించి అర్థము చెప్పినాడు.
Complaisant adj ఉపచారమైన, మర్యాదగల, వినయము గల, నమ్రతయైన.
Complaisantly adv ఉపచారముగా, మర్యాదగా, వినయముగా, నమ్రతగా.
Compleat, Complete adj సంపూర్తియైన, సంపూర్ణమైన, నెరవేరిన, ముగిసిన.
Complement n s fullness పూర్తి సంపూర్ణత. In mathematics, the * of an arc కోటి. In this regiment there are ten men short of the * యీ రిజిమెంటు పూర్తి కావడానకు పదిమంది తక్కువగా వున్నారు. the * is a thousand వెయ్యి అయితే సంపూర్నము. all the regiments are short of their * ప్రతి పటాళములో నున్ను కొంత మంది తక్కువ.
Complete adj సంపూర్ణమైన, పూర్తియైన, నెరవేరిన, ముగిసిన. Is it * అది సంపూర్ణముగా వున్నదా ?
Completed adj సంపూర్ణమైన, సమాప్తమైన, తీరిన, ముగిసిన.
Completely adv పూర్తిగా, సంపూర్ణముగా, సమాప్తిగా, కడివెళ్లా, యావత్తు, బొత్తిగా.
Completeness n s పూర్తి, సంపూర్ణత. from the * of his account యీ లెక్కలో ఒకటిన్ని లోపము లేదు గనుక.
Completion n s సంపూర్ణత, ముగియడము, నెరవేరడము, తీరడము, సమాప్తికావడము. this prevented the * of the work యిందు వల్ల ఆ పని సమాప్తి కాలేదు. before the * of the cure తీరా స్వస్తము కాక మునుపు.
Complex adj Not simple చిక్కుగా వుండే, జటిలమైన, అస్పష్టమైన, క్లిష్టమైన.
Complexion n s ముఖచాయ, ముఖవైఖరి. a man of fair * యెర్రటి మనిషి. a man of dark * నల్లటి మనిషి. or constitution స్వభావము. a bilious * పైత్యప్రకృతి a phlegmatic * శ్లేష్మ ప్రకృతి. from the * of affairs కార్య వైఖరి చూస్తే.
Complexity, Complexness n s. చిక్కు, వికారము.
Compliance n s అంగీకారము, సమ్మతి, ఒప్పుకోవడము. this prevented his * యిందువల్ల వాడు ఒప్పుకోలేదు. from his easy * వాడు తక్షణము ఒప్పుకొన్నందున. In * with your wishes తమ అభిప్రాయము చొప్పున, మీరు కోరిన ప్రకారము.
Complicate adj చిక్కైన, క్లిష్టమైన, సంకరమైన. a * diseases ద్వంద్వ రోగము.
Complicated adj చిక్కైన, క్లిష్టమైన, సంకటమైన, సంకరముగా వుండె. a * disease ద్వంద్వ రోగము, సంకరవ్యాధి.
Complication n s చిక్కు, క్లిష్టము, కలత, సంకరము. a * of diseasesసన్నిపాతము, ద్వంద్వ రోగము. a * of crimes పాపముల పుట్ట. a * of blundersతప్పుల తడక.
Compliment n s ఉపచారోక్తి, మృదువచనము, ప్రియోక్తి, ప్రియభాషణము, వందనము, దండము, సలాము, ఆశీర్వచనము. you pay me a * వూరికె తమరు దయచేత శలవు యిస్తారు. with my compliments నా సలాములు చెప్పి. compliments of condolence దుఃఖోపశమనమైన మాటలు, ఉపచారము చెప్పడము. compliments of congratulation శుభవార్తలు. he presented his compliments దండము పెట్టినాడు, సలాము చేసినాడు. these are mere compliments వట్టి ముఖప్రీతి మాటలు. empty compliments శుష్కోపచారములు, ముఖప్రీతిమాటలు. at the beginning of a Hindu letter వక్కణ. We assert that the Hindus have no sense of shame: they return the compliment by saying we have no modesty at all మనము హిందువులకు సిగ్గు లేదంటే మనకే సిగ్గు లేదని అదే మర్యాద చేస్తారు. In compliment to your brother I will not punish you మీ యన్నను చూచి నిన్ను శిక్షించక విడిచిపెట్టినాను. in * to your youth నీ వయస్సు విచారించి, నీ వయస్సును చూచి. in * to your learning నీ విద్య చూచి. by way of * ఉపచారముగా. as a * గౌరవముగా.
Complimentary adj ఉపచారమైన. * phrases ఉపచారోక్తులు. * enquiriesకుశలప్రశ్నలు.
Compliness n s కడపటి పూజ, యిది రోమన్ కాతోలిక్కు వారి మాట.
Complot n s దురాలోచన, కుట్ర, కృత్రిమము, కుయుక్తి.
Complyer n s అనుకూలముగా నడుచుకొనేవాడు, ఉచితజ్ఞుడు. a * with the times కాలోచితముగా నడుచుకొనేవాడు.
Component adj అవయవముగా వుండే, చేరివుండె, కూడివుండె, అంశీభూతమైన. *part కలిసివుండె అంశము, భాగము. he separated it into its * partsకలిసివుండిన వాటిని వేరే వేరేగా విభజించినాడు. charcoal is a * part in gun powder తుపాకి మందులో బొగ్గు కూడా కలుస్తుంది, బొగ్గు కూడా కలిసిన ద్రవ్యము. in grammar ప్రత్యయము.
Comportment n s నడక.
Composed adj made or formed చేసిన, కల్పించిన, రచించిన, కూర్చిన. thisbook is * of paper and leather యీ పుస్తకము కాకితముతో నున్ను తోలుతో నున్నుచేయబడి వున్నది. cloth is * of cotton గుడ్డ పత్తితో చేయబడుతున్నది. * ofgems రత్నమయమైన. * of grass తృణమయమైన. or calmed ఉపశమించిన, శాంతమైన. a * heart నెమ్మది, శాంతమైన హృదయము. he mediated with a * heart నెమ్మదిగా ఆలోచించినాడు.
Composedly adv శాంతముగా నిమ్మళముగా
Composedness n s శాంతము, శమనము, నిమ్మళము.
Composer n s చేసేవాడు, రచించేవాడు, గ్రంధకారుడు, కవి, పదాలు, దరువులుమొదలైన కవిత్వము చెప్పేవాడు.
Composite adj శిల్పి శాస్త్రమందు అయిదు విధములు స్తంభములు గలవు వాటిలోఅయిదో విధమైన. a pillar of the * order అయిదోతరహాగా వుండే స్తంభము.
Compositer n s అచ్చు, అక్షరాలు కూర్చే పనివాడు.
Composition n s mixture మిశ్రమము, మేళనము, మేళనము, మిశ్రితమైన వస్తువు. a medical * నానా వస్తువులు కలిపిన మందు. honey enters into the * of this medicine యీ మందులో తేనె కలుస్తుంది. or writing రచన, కవనము, కవిత్వము. this is the * of a real poet యిది సాక్షాత్క వికృతము. whose * is this ? యిది యెవరు రచించినది. a * in prose వచన కావ్యము. in * with the verb క్రియాపదముతో కూడా. a * in verse పద్య కావ్యము. or compact రాజీ, సమాధానము. or union చేరిక. this word "pre" is only used in * ప్ర, అనే ఉపసర్గ ఒక మాటతో సంయోగము గానే ప్రయోగించ బడుతున్నది. in * with కూడా, చేర్చి.
Compos-mentis adj స్థిరబుద్ధిగల. when he was * వాడు స్థిరబుద్ధిగా వుండినప్పుడు. no-compos వెర్రి, చలచిత్తుడు.
Compost n s యెరువు, పెంట.
Composure n s శాంతము, ఉపశమనము, తాలిమి, నెమ్మది, అమరిక, వోపిక.
Compotation n s శాంతము, ఉపశమనము, తాలిమి, నెమ్మది, అమరిక, వోపిక.
Compound adj కలిసిన, మిశ్రమమైన. a * phrase సమాసపదము. * metalమిశ్రితమైన లోహము, అనగా యిత్తడి, కంచు, సత్తు వగైరా * interest వడ్డికి వడ్డి.
Compounded adj మిశ్రమమైన. this medicine is * of mercury and opiumయీ మందులో పాద రసమున్ను నల్లమందున్ను కలిసి వున్నది.
Comprehended adj గ్రాహ్యమైన, తెలిసిన, అనగాహమైన, కలిగిన, చేరిన. his style is easily comprehended అతని పాకము సులభముగా గ్రాహ్యమౌతున్నది,తెలుస్తున్నది.
Comprehensible adj గ్రాహ్యమయ్యే, గోచరమయ్యే, తెలుసుకోతగిన. this is not * యిది అర్థమయ్యేది కాదు.
Comprehension n s understanding గ్రాహ్యము, తెలియడము, అకళింపు,అవగాహనము. this passes my * యిది నాకు అవగాహనమయ్యేది కాదు, అర్థమయ్యేదికాదు. that's quite beyond my * అది నాకు యెంత మాత్రము అవగాహనము కాలేదు.
Comprehensive adj విశాలమైన, విస్తారమైన, ఘనమైన.
Comprehensively adv విశాలముగా, విస్తారముగా, ఘనముగా.
Compress n s గాయము మీద కట్టే గుడ్డ.
Compressible adj యిమిడే, యిమిడ్చతగ్గ.
Compression n s అణుకువ, యిమిడిక. after * the cotton is weighedయిమిడ్చి కట్టిన తరువాత దూదిని తూనిక వేస్తారు. compression of style సంక్షేపముగా చెప్పడము, సంగ్రహముగా చెప్పడము.
Comprised adj యిమిడిన. items that are * in these accounts యీ లెక్కలోవుండే పద్దులు.
Comprising adj గల.
Compromise n s రాజీ, సమాధానము.
Compter n s a prison లండన్ లో వుండే జెయిల్ఖానా పేరు.
Compting SeeCounting
Compting house n s See Counting house.
Comptroll SeeControl
Comptroller n s See Controller.
Compulsatroy adj అవార్యమైన, అప్రతిహతమైన, బలాత్కారమైన, నిర్బంధమైన,ప్రబలమైన. this order is * అడ్డము ఆడకూడని వుత్తరవు.
Compulsion n s బలవంతము, బలాత్కారము, నిర్బంధము.
Compulsive, Compulsory adj బలవంతమైన, బలత్కారమైన, నిర్భంధమైన.
Compunction n s పశ్చాత్తాపము, యేల చేస్తినని చింతపడడము, పరితాపము,అనుతాపము, ఖేదము, వ్యాకులము.
Compunctious adj పశ్చాత్తాపము గల, పరితాపము గల. * visitings పశ్చాత్తాపము, పరితాపము.
Compurgator n s ఉపసాక్షి, ఉత్తరసాక్షి, మంచి నడకను గురించిన సాక్షి, నేరస్థుడు కోరుకొన్న సాక్షి.
Computable adj గణనియ్యమైన, యెంచతగ్గ.
Computation n s యెన్నిక, లెక్క, సంఖ్య, మదింపు. according to my * నాకు తోచిన ప్రకారము నేను యెంచినదేమంటే.
Comrade n s కూడా వుండేవాడు, సహవాసి, యిది దండువాండ్ల మాటలు, యిప్పట్లోచెల్లదు. one of my comrades నా వాండ్లలో వొకడు. he told his comrades తన తోటి పాటి సోజర్లుతో చెప్పుకొన్నాడు. Comrades ! listen to me వినండి తమ్ములారా.
Con-amore adv వ్యామోహపడి అత్యాశగా, బహు అభిలాషగా యిది. Italianభాషా శబ్దము.
Concantenation n s వరస, మాలిక, అనుక్రమణిక, పరంపర. from * of circumstances సంభవించిన పనుల క్రమమున, కార్య క్రమేణ. a * of idea భావక్రమము, అనగా సంస్కారము, ఒకటి మీద ఒకటి తోచడము. in * పరంపరగా, వరసగా, ఒకటి మీద ఒకటి.
Concatenated adj పరంపరగా వుండే, అనుక్రమణికగా వుండే, మాలికగా జోడించిన, గొలుసుగా కూర్చిన, ఒకటి వెంబడి ఒకటి తగిలించిన, యిది లెక్క, వర్ణన, ఉదాహరణ, వీట్లను గురించిన మాట. a * description అనుక్రమణికగా చేసిన వర్ణనము.
Concave adj బోర్లించని టెంకాయ చిప్ప వలె అదోకపాటు పల్లముగా వుండే, ప్రమిదవలె పల్లవాటుగా వుండే, ప్రమిద యొక్క లోని పల్లమును. concave అని అంటారు, దాని యొక్క బయటి వుబుకును convex అని అంటారు. the concave of heaven ఆకాశము.
Concavity n s పలము, చొట్ట, నొక్కు. the poison lies in the * of the snake's tooth పాము యొక్క పంటి నడిమి పల్లములో విషము వుంటున్నది.
Concealed adj దాగిన, మరుగైన, అగుపడని, బయటపడని. It was * by the box పెట్టె చాటున వుండినది.
Concealment n s దాచడము, మరుగు, చాటు, దాగే స్థలము. he kept it in * దాన్ని దాచిపెట్టినాడు. they are in * దాగి వున్నారు.
Conceite n s Fancy తలంపు, యెన్నిక. conception or idea అభిప్రాయము,తాత్పర్యము. or vanity (this word is quite different from pride)అహంకారము, దుష్గర్వము, బోర్లపాటు, తలకిందులపాటు. he is out of * with the house ఆ యింటి మీద వాడికి అసహ్యము పుట్టింది.
Conceited adj అహంకరించిన, బోర్ల పడె, తలకిందులుపడే. a * man అహంకారి, బోర్ల పడేవాడు.
Conceitedly adv అహంకారముగా, బోర్ల పాటుగా.
Conceitedness n s అహంకారము, గర్వము.
Conceivable adj yeVMcaSakyamEna, walacaSakyamEna, UhyamEna. SeeInconceivable.
Conceived adj భావించిన, ఊహించిన, తలచిన, గర్భము ధరించిన. a letter* in harsh terms క్రూరమైన మాటలు గల జాబు. after he has * in the womb అతడు తల్లి గర్భమందు పడ్డ తరువాత. * in sin పాప సంభవుడైన.
Concentrated adj నడమ కూడిన. * thought తదేక ధ్యానము, ఏక చింత. * spirit నికరముగా తీసిన ధృతి.
Concentration n s నడమ చేరడము, ఒకటిగా కూడడము. * of thoughtsతదేకధ్యానము, ఏక చింత.
Concentric adj బండి చక్రము యొక్క ఆకులవలె నాలుగు తట్లా నుంచి నడిమికి చేరే. seven * circles ఒకటి లోన ఒకటిగా వుండే సప్త కుండలములు, యేడుగిర్లు. * circles on the thumb పెద్ద వేలిలో వుండే చక్రములు.
Conception n s (in the womb.) గర్భమందు పడడము. (notion) యెన్నిక, తలంపు. I had no * of this or it is quite beyond my * యిది నాకు యెంత మాత్రము తోచలేదు.
Concern n s or connection సంబంధము, నిమిత్తము, అక్కర. or affairవ్యాపారము, వ్యవహారము, పని, జోలి. this is no * of yours యిది నీ జోలి కాదు, నీ పని కాదు, యిది నీకు నిమిత్తము లేదు. or regret చింత, వ్యాకులము. or regard దయ.
Concerning prep గురించి, విషయమైన, నిమిత్తము. * me నన్ను గురించి.
Concert n s బందుకట్టు, సమ్మతి, యుక్తి, ఆలోచన. of music మేళము.they acted in * వాండ్లు బందుకట్టుగా ప్రవర్తించినారు, వారికి వీరికి వుండె యోచన ఒకటే. he acted in * with them వారికి లోబడి నడుచుకొన్నాడు. they wept in * వాండ్లందరు కూడి యేడ్చినారు.
Concerted adj యోచించుకొన్న, కల్పించుకొన్న.
Concession n s సమ్మతి, అంగీకారము. to make concessions ఒప్పుకొనుట. he made many concessions కొన్ని మాటలు ఒప్పుకొన్నాడు, కొన్నిటిని అంగీకరించినాడు.
Conch n s శంఖము, కంబు.
Conchoidal adj శంఖాకారమైన, కోరుగా వుండే, కూచిగా వుండే.
Conchologist n s శంఖశాస్త్రి, శంఖపరీక్ష తెలిసినవాడు.
Conchology n s శంఖ శాస్త్రము, శంఖపరీక్ష.
Conciliated adj or gained సంపాదించిన, సమాధానపరచిన, సఖ్యపరచిన.
Conciliating adj సరసమైన, హితమైన, శాంతమైన.
Conciliation n s సమాధానము, సాంత్వనము, సుహృల్లాభము, బుజ్జగింపు.
Conciliatory adj సమాధానము చేసే, సహనము పెట్టే. * measuresసామోపాయము.
Concise adj సంక్షేపమైన, యిమిడికైన, క్లిప్తమైన.
Concisely adv సంక్షేపముగా, సంగ్రహముగా, యిమిడికగా, రెండు ముక్కలుగా.
Conciseness n s సంక్షేపము, సంగ్రహము.
Concision n s ఛేదనము, కోత, అపచ్ఛేత్తృత్వము. C+. కోపిక్లేలశోనాస్తి. A+. దుర్మార్గదల్లి ప్రవర్తిస్తువ వరిగె యెచ్చరిక యాయిరు. K+. i. e. evil doers the same meaning is given in the Persian version.
Conclave n s ధర్మసభ, అనగా Pope చేతి కింది పాదుర్ల సభ.
Concluded adj ముగిసిన, సమాప్తమైన, తీరిన. See To Conclude.
Concluding adj కడాపటి. * part ఉత్తర భాగము.
Conclusion n s or end ముగింపు సమాప్తి. when it came to a * ముగిసినప్పుడు, తీరినప్పుడు. or determination తీర్పు, తేరుగడ, పరిష్కారము, తేలిన అభిప్రాయము సిద్ధాంతము. or infnerence ఊహ, అనుమానము. in * తుదను, చివర, కడాపట.
Conclusive adj పరిష్కారమైన, ఘట్టి, తేరుగడైన, తీసుమానమైన, తీర్పైన. pray look upon this letter as * యీ జాబును వెయ్యి జాబులుగా విచారించుకోవలసినది.
Conclusively adv పరిష్కారముగా, తీర్పుగా.
Concocted adj పక్వమైన, జీర్నమైన, పండిన.
Concoction n s పక్వము, జీర్ణము.
Concomitant adj and n. s. అనుసరించుకొని వుండె, కూడా వుండె, విశేషమైన, సహజమైన. this had many * advantages దీనితో కూడా యింకా కొన్ని ఫలములు కలవు. poverty was a * of his disease వాడికి రోగము తోటి పాటు దరిద్రమున్ను వుండినది.
Concord n s or union అనుకూలము, వొద్దిక, ఐకమత్యము, సమ్మతి, అంగీకారము. they live in * వొద్దికగా వున్నారు. in grammar పొందిక, అన్వయము. false * అనన్వయము. in music ఏకతాళము.
Concordance n s సూచి, అక్షర క్రమముగా వుండే సూచి.
Concourse n s గుంపు, మూక, సమూహము, ప్రజ.
Concremation n s burning of a widow with her husband సహగమనము.
Concrete adj సంయుక్తమైన, కలిసిన, మిశ్రితమైన. both in the simple and in the form * ఒంటిగా నున్ను సంయుక్తముగా నున్ను.
Concretion n s ఖనీభవించిన పదార్థము, అనగా ముత్యము, వుప్పు మొదలైనవి.
Concubinage n s ఉంచుకోవడము, పెట్టుకోవడము. She lived in * with him అది వాడి దగ్గెర చేరి వుండినది. one who lives in * ఒకని దగ్గెర చేరి వుండేటిది.
Concubine n s వుంచుకొన్న స్త్రీ, పెట్టుకొన్న స్త్రీ, వుంపుడుకత్తె. In Judges XIX, 2, the expression is ఉపపత్ని వేశ్యాచారము చేసినది. D+.
Concurrence n s అనుకూలము, సమ్మతి, ఐకమత్యము.
Concurrent adj సమ్మతిగా వుండే, అనుగుణ్యముగా వుండే, అనుకూలమైన. *testimony అనుగుణ్యమైన సాక్షి, అనుకూలమైన సాక్షి, పొందికైన సాక్షి.
Concussion n s దెబ్బ, ఘాతము, ఒకటితో ఒకటి కొట్టుకోవడము. a * of the brain మొదురు అదరడము.
Condemnation n s దండనావిధి, శిక్షావిధి, పనికిరాదన్న తీర్పు, ఛీవాటు. In James, 5. 12. దండం A+ C+; ఆజ్ఞ, F.
Condemnatory adj నిషేధమైన, దూషణైన. a * letter దూషణజాబు, ఛీవాట్ల జాబు. * classes in a law నిషేధక సూత్రములు.
Condemned adj తప్పు కద్దని, విధించబడ్డ, దండనకు అర్హమని విధించబడ్డ,నిషేధించబడ్డ, తోపుడైన. a * culprit శిక్ష విధించబడ్డ నేరస్థుడు. * horsesతోపుడైన గుర్రములు. See To Condemn.
Condensation n s ఖనీభవించడము, గట్టికావడము. by * steam becomes water ఆవిరి ఖనీభవించి నీళ్లు అవుతున్నది.
Condensed adj ఖనీభవించిన, సంగ్రహమైన. a * narration సంగ్రహము.
Condescending adj అనుగ్రహించే, దయచేసే, నమ్రతగల, నిగర్వమైన.
Condescendingly adv నమ్రతగా, నిగర్వముగా, అనుగ్రహము చేసి, మ దయచేసి.
Condescension n s నమ్రత, నిగర్వము, అనుగ్రహము, దయ.
Condign adj తగిన, తగ్గ, యుక్తమైన, న్యాయమైన.
Condignly adv తగినట్టుగా, న్యాయముగా.
Condition n s స్థితి, విద్యమానము, అవస్థ, దశ. stipulation ఒడంబడిక,నిబంధన, నియమము. on * that you give this నీవు యిస్తివా, నీవు యిచ్చే పక్షమందు. or rank in society పరువు, మట్టు. a man of * పెద్ద మనిషి.a woman of ఉత్తమురాళు. ill conditions దుర్మార్గములు. a horse that is in good * బాగా బలిసిన గుర్రము. the bullocks are in bad * యెద్దులు బక్కచిక్కినవి. good conditioned దృఢమైన, గట్టియైన. ill conditioned జబ్బైన, బక్క చిక్కిన.
Conditional adj ఒడంబడికగల, సోపాధికమైన, సనియమమైన. a * sale ఒక విధముగా జరిగితే యీ విక్రయము సిద్ధమని అర్ధము. in grammar the word if చేత్, స్తే, అయితే, కుంటే, అనగా పోతే, వస్తే, యిస్తే, చేస్తే, మొదలైనవి.
Conditionally adv ఒడంబడికగా.
Condolence n s కూడా యేడ్వడము, ఉపచారము, విచారించడము.
Condor n s a great eagle గూళీ, సాళువడేగ.
Conducive adj సహామైన, అనుకూలమైన, ఉపబలమైన. * health ఆరోగ్యకారియైన.
Conduct n s నడత, ఆచారము. he approved their వాండ్లు చేసినదాన్నిఒప్పుకొన్నాడు. good * మంచి నడక, సన్మార్గము. bad * దుర్మార్గము, చెడ్డ నడక. manly * మానుష్యము, పెద్ద మనిషితనము. or management చేయడము, నిర్వాహకత. the * of the affairs was entrusted to him ఆ కార్య నిర్వాఃకమును వాడి మీద వుంచినారు. a safe * or passport రాదారి. a safe * or guard సంరక్షణగా తీసుకొని పోయ్యే పారా, అంపుదోడు, దారిబడి, సహవాసము. they gave ten sepoys as a safe * for the money ఆ రూకలను తీసుకొని పోయి వొప్పగించమని పది సిపాయీలను యిచ్చినారు. he went with her as a safe * or guard వాడు దానితోడుగా పోయినాడు.
Conductor n s యేలేవాడు, నాయకుడు, దారి చూపేవాడు, పిలుచుకొని పోయ్యేవాడు,నడిపించేవాడు, తోడు. for lightning యిల్లు మొదలైనవాటికి అపాయము రాకుండాపిడుగును ఆకర్షించుకొనే యినప శలాకు. a * for electricity యినపతంతి, గొలుసు మొదలైనది.
Conduit n s కాలవ, జలదారి.
Cone n s కిరీటాకృతి, అదోకపాటు, కాయ. a fir * దేవదారు చెట్టు యొక్క కాయ.
Coney n s చెవులపిల్లి, కుందేలు, యిది యిప్పుడు వాడిక లేని మాట.
Confabulation n s ముచ్చట, సల్లాపము, సంభాషణ, మాటలు.
Confection n s మిఠాయి.
Confectionary n s మిఠాయి. (H).
Confectioner n s మిఠాయి చేసి అమ్మేవాడు.
Confederacy n s సమయము, బందుకట్టు, సమాఖ్య. there was a * againstBonaparte బోనేపార్టు అనే రాజు మీద కక్షి కట్టినారు.
Confederate n s కక్షిలో చేరినవాడు, సమాఖ్యలో చేరినవాడు. one of theconfederates ఆ కక్షిలో వొకడు.
Confederate, Confederated adj కక్షికట్టుకొన్న, సమాఖ్య చేసుకొన్న, బందుకట్టు చేసుకొన్న.
Confederation n s బందుకట్టు, సమయము, సమాఖ్య.
Conference n s సంభాషణ, గోష్టీ.
Confessed adj వొప్పుకొన్న, ప్రసిద్ధమైన, బాహాటమైన. it must be * that this is true వెయ్యి మాటలేల యిది వాస్తవ్యము.
Confessedly adv ప్రసిద్ధముగా, బాహాటముగా, సాక్షాత్తుగా. he is * a fool వాడు సాక్షాత్తుగా పిచ్చివాడు.
Confession n s ఒప్పుకోవడము. or creed మతము, సాక్ర్యము. a * (seeWatson's Biblical and Theol. Dictionary) మత సంక్షేపము, గాయత్రి వంటిది. the Roman Catholic phrase is పాప సంకీర్తనము. In Rom. X. 10. పరిత్రార్థం వదనేన స్వీకర్తవ్యం. A+.
Confessional n s రోమన్ కేతోలిక్కు గురువు కూర్చుండే ఆసనము, దానికిసమీపములో శిష్యులు మోకాలించి కూర్చుండి తాము చేసిన పాపములను అతని చెవిలో చెప్పుతారు.
Confessor n s రోమన్ కేతోలిక్కు పాదిరి. or convert to a creed మతావలంబీ.
Confest adj ఒప్పుకొన్న, స్పష్టమైన, సాక్షాత్కరించిన.
Confidant n s చెలికత్తె, చెలికాడు, అంతరంగుడు, అంతరంగురాలు.
Confidence n s assurance నమ్మిక, నమ్మకము, విశ్వాసము, భరవసా.or boldness సాహసము ధైర్యము, తెంపు.
Confident adj సాహసముగల, నమ్మకము గల. a * man సాహసుడు. I am * he is gone వాడు పోయినాడని నాకు రూఢిగా వున్నది. I am * it was he that came ఆ వచ్చినది అతడే నని నాకు రూఢీగా వున్నది.
Confidential adj నమ్మికగల, విశ్వాసము గల, మర్మమైన, అంతరంగమైన. a * letter మర్మమైన జాబు, రహస్యమైన జాబు. secret and అతిరహస్యమైన. a * person అంతరంగుడు, తన మర్మమును యివ్డమునకు అర్హుడు.
Confidentially adv నమ్మకముగా, విశ్వసించి.
Confidently adv నమ్మకముగా. or positively స్థిరముగా, నిశ్చయముగా.
Confiding adj సాధువైన.
Configuration n s నక్షత్రముల యొక్క విన్యాసము, నక్షత్రములు వుండే వైఖరి.
Confine n s యెల్ల, హద్దు.
Confined adj కావలిలో వుంచబడ్డ, ప్రసవించిన, నిర్బంధమైన, మట్టుపడ్డ,యిరుకైన. he was * to his bed పడ్డపడకగా వుండినాడు. he was * to dry bread వాడు వట్టి కూడు తినవలసి వచ్చినది. she was * అది నీళ్లాడినది,ప్రసవించినది. she was * of a son అది మగ బిడ్డను కన్నది. a woman who has been * బాలింతరాలు. this house is very much * యీ యిల్లు నిండా యిరుకుగా వున్నది.
Confinement n s or imprisonment చెర, కావలి. or restraint నిర్బంధము, నిరోధము. or child birth ప్రసవము, నీళ్లాడడము.
Confines n s సరిహద్దు, పొలిమేర, యెల్ల.
Confirmation n s స్థాపించడము, స్థాపన, దృడపరచడము, రూఢి చేయడము. or proof దృష్టాంతము. this is a * of my suspicions నా అనుమానమునకు యిదే దృష్టాంతము. by a bishop ఉపదేశము.
Confirmatory adj ఉపబలమైన. * statements వుపబలముగా చెప్పినది.
Confirmed adj నిశ్చితమైన. as a disease ముదిరిన. this order was not * by the government యీ వుత్తరవును గవరన్మంటువారు స్థిరపరచినారు కారు. he is not yet * in the office వాడికి యింకా ఆ పని కాయము కాలేదు.before the boys were * ఆ పిల్లకాయలకు bishop యొక్క వుపదేశము కాక మునుపు.
Confirmity n s అనుసరణము, అనువర్తనము, అనుగుణ్యము. in * with hisorders ఆయన వుత్తరవు ప్రకారము.
Confiscation n s జప్తి, దివానములో చేర్చుకోవడము.
Conflagration n s పెనుమంట, దావానలము, కార్చిచ్చు, మండడము, కాలడము.the whole town was in a * వూరంతా తగులుకొని మండుతూ వుండినది.
Conflict n s యుద్ధము, పోట్లాట, పోరాటము, విరుద్ధము, విరోధము.
Conflicting adj పోరాడే, విరోధించే, విరుద్ధమైన. a * wind యెదురుగాలి.* diseases ద్వంద్వ రోగములు. * evils విరుద్ధమైన సంకటములు. * opinions విరుద్ధ అభిప్రాయములు.
Confluence n s సంగమము. the * of rivers నదీ సంగమము.
Confluent adj కూడివుండే, సంగమమైన యుండే. * small pox మల్లెలు అనేరోగము.
Conflux n s of people గుంపు, సంఘము, సమూహము. of rivers సంగమము.
Conformable to adj అనుగుణమైన, అనుసరణైన, అనురూపమైన.
Conformably adv అనుగుణముగా, చొప్పున, ప్రకారముగా. * to your orders మీ వుత్తరవు ప్రకారము.
Conformation n s రూపము, స్వరూపము, ఆకృతి, ఆకారము, అపయవ విన్యాసము,అంగవైఖరి.
Confounded adj కలిసిన, కలవరపడ్డ, భ్రమపడ్డ, పాపిష్టి, అపజయంపొందిన. See To Confound.
Confoundedly adv పాపిష్టితనముగా. యిది తిట్టుమాట.
Confraternity n s brotherhood సంప్రదాయము, సమయము, బరాదరి. or abody of men united for some purpose సమాజము, తెగ.
Confused adj కలిసిపోయిన, తారుమారుగా వుండే, కలవరకంపగా వుండే, రసాభాసమైన, కలవరపడ్డ, చీకాకుపడ్డ.
Confusedly adv కలవరముగా, తారుమారుగా, తలతోక లేకుండా.
Confusion n s భ్రమ, కలవరము, గత్తర, చీకాకు, గందరగోళము, తత్తరపాటు, తారుమారు. of face తలవంపు, సిగ్గు. a * of languages భాషాసాంకర్యము. * of ideas బుద్ధి వైకల్యము. * of mind తబ్బిబ్బు, తెరుపు మరుపు. * of castes జాతి సాంకర్యము. he put them to * వాండ్లను వోడకొట్టినాడు, భంగపరచినాడు. he threw all the books into * ఆ పుస్తకాలనంతా గందరగోళము చేసినాడు, తారుమారు చేసినాడు.
Confutation n s ఖండనము, ఆఖ్షేపము. this is a * of what he said వాడు చెప్పిన మాటకు యిది ఖండనము.
Conge n s (a French word) a bow దండము, సలాము. or leave శలవుఅనుజ్ఞ, ఉత్తరవు. I gave him his * శలవు యిచ్చినాను తోసివేసినాను.
Congealment n s పేరడము, ఖనీభవించడము, గడ్డ కట్టడము.
Congee n s (Indian word for gruel) కంజి, గంజి, the * house గంజి దొడ్డి.
Congelation n s పేరడము, ఖనీభవించడము, గడ్డ కట్టడము.
Congenial adj. అన్యోన్యమైన, అనుకూలమైన,నొప్పైన,సంమతమైన, this is very * to their minds యిది వాండ్లకు నిండా సంమతము, అంగీకారము.
Congeniality n s natural affinity, suitableness అన్యోన్యము, విహితము, ఇమిడిక.
Congenially adv అన్యోన్యముగా, అనుకూలముగా, సంమతముగా.
Conger n s a large eel, సముద్రములుగు పాము అనే చేప.
Congeries n s కుప్ప, రాశి. this book is a * of blunders యీ పుస్తకముఅబద్ధాల తడక.
Congested adj అజీర్ణమైన, భారకించిన.
Congestion n s పోగు, కుప్ప. the bowels were in a state of * కడుపులోమందముగా వుండినది.
Conglomerated adj ఖనీభవించిన, వుంటగా చుట్టుకొన్న, కలవరపడ్డ. his senses are all * వాడి బుద్ధి మహా కలవరముగా వున్నది.
Conglomeration n s ఖనీభవించడము, వుంటగా చుట్టుకోవడము, కరుడు, మిశ్రమము, కలవరము.
Conglutination n s అంటుకొని వుండడము, కరుచుకొని వుండడము.
Congous n s నల్ల తేయాకు.
Congratulation n s దీవనము, శుభము కొనియాడడము, సంతోషము కొనియాడడము.
Congratulatory adj దీవించే, శుభమును కొనియాడే, సంతోషమును కొనియాడే.
Congregation n s గుడికి వచ్చిన గుంపు, ప్రజ.
Congregational adj గుడిలో కూడిన గుంపు సంబంధమైన.
Congress n s రతి, సంభోగము. meeting or parliament కూటము, సభ.
Congruent adj వొప్పిన, తగిన, యిమిడికైన, పొందికైన, అనుగుణ్యమైన.
Congruity n s ఒప్పు, అనుగుణము, అనుకూలము, యిమిడిక, పొందిక, పొసగుదల, ఐకమత్యము.
Congruous adj ఒప్పిన, అనుగుణ్యమైన, అనుకూలమైన, యిమిడికైన, పొందికైన,పొసగిన.
Conic adj కూచిగా వుండే, కూచైన. * sections యిది మహా గణితములో ఒకప్రకరణము.
Conical adj కిరీటాకారమైన, కూచిగా వుండే, కోరుగా వుండే, ఆ దోకపాటుగా వుండే.
Conjecturable adj ఊహించిన; అనుమేయించిన, యెంచిన.
Conjecture n s ఊహ, అనుమానము, యెన్నిక.
Conjeveram n s కంచి. the name of a town.
Conjoined, Conjoint adj చేరిన, కలిసిన, సంయుక్తమైన, ఏకీభవించిన.
Conjointly adv చేరికగా, చేరి, వొకటిగా, యేకముగా.
Conjugal adj దాంపత్య, భార్యభర్తల సంబంధమైన, సాంసారిక, సంసార సంబంధమైన, * affection భార్యా భర్తలకు వుండే విశ్వాసము. * life or the * state సంసారము. * infidelity వ్యభిచారము, రంకు.
Conjugally adv సంసార రీతిగా.
Conjugation n s క్రియారూప నిష్పత్తి, క్రియామాలిక. In Telugu, verbs ending in యు are of the second * తెలుగులో యు అని అంతమందు వచ్చే క్రియలు రెండో conjugation గా వుంటవి, అనగా, చేయు, పోయు, కోయు మొదలైనవి. there are ten *s of verbs in Sanscrit సంస్కృతములో క్రియలకు దశలకారములు వున్నవి.
Conjunction n s union చేరిక, ఐక్యము. In grammar, the copulative * "And", అనే సముచ్చయము. the disjunctive * "But, If" అనే వైకల్పి కావ్యములు. A * of planets యోగము.
Conjuncture n s సమయము, తరుణము, యోగము.
Conjuration n s or oath శపథము, అభిమంత్రణము.
Conjurer n s గారడి విద్యలు చేసేవాడు. you are a perfect * యెటువంటిమర్మమునున్ను తెలుసుకొంటావు.
Conjuring n s (sleight of hand,) గారడి విద్య.
Connected adj చేరిన, సంబంధించిన, సంధించిన. accounts * with thisయిందులో చేరిన లెక్కలు. a * letter సంయుక్తాక్షరము. * by marriage వివాహసంబంధము గల, వియ్యమందిన. how is he * with you వాడు నీకేమి కావలెను, వాడికి నీకేమి సంబంధము. people who are * with him వాడి వాండ్లు, వాడికి కావలసినవాండ్లు. people * with the press అచ్చువాండ్లు. people * with trade వర్తకులు.
Connectedly adv చేరికగా, అనుబంధముగా, క్రమముగా, యెడతెగకుండా. today he speaks * నేడు బాగా మాట్లాడుతాడు, తెలివిగా మాట్లాడుతాడు. he does not speak * తబ్బిబ్బులుగా మాట్లాడుతాడు.
Connection n s సంబంధము, బంధుత్వము, సంధి, పొందిన, యిమిడిక, నిమిత్తము, బంధువుడు. grammatical * అన్వయము. or thread of a story కధాసరణి, కధాక్రమము, ప్రకరణము. the * of ideas ఉద్భోధకము. distant *s or cousins దాయాదులు. what * is he of your's ? వాడు మీకేమి అవుతాడు వాడికి మీకేమి బంధుత్వము. *s by blood జ్ఞాతులు, బంధువులు. she is a * of mine ఆమెకు నాకు బంధుత్వము కలదు. criminal * వ్యభిచారము,రంకు. carnal * సంభోగము. he had * with her వాడు దానితో పోయినాడు.
Connivance n s చూచి చూడనట్టుగా వుండడము, ఉపేక్షి. they did this with his * అతని వుపేక్ష మీదనే వీండ్లు యీ దుర్మార్గమును చేసినారు.
Connoisseur n s అనుభవశాలి, పరిచయము గలవాడు, పరిక్ష-గలవాడు, తెలిసినవాడు, యిది ముఖ్యముగా సంగీతము, చిత్రము, వీటిని గురించిన మాట.
Connubial adj వైవాహికమైన, వివాహ సంబంధమైన. * harmony or * happiness దాంపత్య సుఖము. * fidelity పాతివ్రత్యము. * infidelity వ్యభిచారము.
Conquered adj జయించిన.
Conqueror n s జయించినవాడు, జయశాలి. the * of Mahishaమహిషాసురమర్ధనుడు. the * of the death మృత్యుంజయుడు.
Conquest n s జయము, గెలుపు, జయించిన దేశము, she made many *s దాన్నిమోహించినవాండ్లు బహుమంది. I heard that she has made a * of him దానివలలో వొకడు పడ్డాడట.
Consanguinity n s జ్ఞాతిత్వము, రక్త సంబంధము.
Conscieatious adj సత్యసంధుడైన, ప్రామాణికుడైన, పారమార్థికముగల. a * man పారమార్థికుడు.
Conscience n s మనసు, వివేకము, స్వదోషజ్ఞానము, my * tells me that I did wrong నేను చేసినది తప్పని నా మనసుకే తెలుస్తున్నది. he was troubled in * about this యేల చేస్తినని యిందుకు పరితాప పడ్డాడు. a pure * నిర్మలమైన మనసు. a bad * is a torment తాను చేసినది తన మనస్సునే కోస్తున్నది. his * was pricked యేల చేస్తినని వాడికే పశ్చాత్తాపము పుట్టినది, వాడు చేసినది వాడి మనసుకే తెలిసినది. remorse of * పశ్చాత్తాపము. he who possesses a good * సత్యసంధుడు. a man who is without * or, a man of no * దుర్మార్గుడు, పాపభీతి లేనివాడు. a man of tender * పాపభీతి గలవాడు. or justice న్యాయము, ధర్మము. this cannotin * be granted దీనికి ఆమోదించడము న్యాయము కాదు, ధర్మము కాదు. in truthసత్యముగా, యధార్థముగా. The Lord Chancellor is called Keeper of theKing's * లార్డు చాన్సెల్లరు రాజుకు గురువుగా వున్నాడు. real thoughts నిశ్చయము.on my * I believed him వాణ్ని మనఃపూర్వకముగా నమ్మితిని. do you in * think so నీవు సత్యముగా అట్లా యెంచితివా. had you the * to say so అట్లా అనడానకు నీకు నోరాడినదా. I should make a * of doing so అట్లా చేయడము నా మనసుకే అసమాధానముగా వుండును, అనగా నేను యెంత మాత్రమున్ను చేయును. the bramins make it a matter of * drink wine but they made no * of burning women బ్రాహ్మణులు సారాయి తాగడము నిషిద్ధమంటారు గాని స్త్రీలను ప్రాణముతో కాల్చడము నిషిద్ధమనరు. have you the * (or audicity) to make such a demand? దీన్ని అడగడానకు నీకు సిగ్గులేలదా, నీకు మనసు వచ్చినదా. a pretty affair on my * ! దొడ్డపని వచ్చినది సుమీ. I should make a * of telling him this దీన్ని వాడితో చెప్పకుంటే నా మనసు తాళదు, వొప్పదు.this was persecution for * sake వాండ్లు అతని మిద చేసే క్రౌర్యము మతమును పట్టే. In Titus 1-15 "their mind and * are defined," బుద్ధి మనసీ. A+ జ్ఞానము మనసు. B+ బుద్ధిర్వివేకశక్తిశ్చ, C+ In Acts XXIV, మనసు సాక్షి. F+
Conscientiously adv ప్రామాణికముగా, పారమార్థికముగా.
Conscientiousness n s ప్రామాణికత, పారమార్థికతము.
Conscionable adj న్యాయమైన, తగిన, యెరిగిన, తెలిసిన.
Conscious adj తెలివిగల, జ్ఞానముగల, యెరిగిన, తెలుసుకొన్న. * that what he said was false తాను చెప్పినది అబద్ధమని తెలిసి. a dead body is not * of any thing పీనుగకు వొకటిన్ని తెలియదు, వొకటిన్ని సోకదు.
Consciously adv యెరిగి, తెలిసి.
Consciousness n s యెరుక, తెలివి, వివేకము. a corpse is without * పీనుగను యేమి చేసినా దానికి తెలియదు. after the loss * of తెలివి తప్పిన తరువాత, ప్రజ్ఞ తప్పిన తరువాత. this showed his * of guilt యిందువల్ల వాడి తప్పు వాడి మనస్సుకే తెలుసునని అగుపడుతున్నది. this shows his * of innocence యిందువల్ల నిరపరాధి అని తన మనస్సుకే తెలుసునని అగుపడుతున్నది.

English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

10 comments:

  1. Great blog you have here.. It's hard to find good quality writing like yours nowadays. I seriously appreciate individuals like you! Take care!!
    my page - top online jobs

    ReplyDelete
  2. It's awesome to pay a quick visit this web page and reading the views of all friends on the topic of this paragraph, while I am also zealous of getting know-how.
    my web site - jobs online work from home

    ReplyDelete
  3. Hi there, its nice paragraph about media print, we all understand media is a great source of facts.


    Here is my site - Sac Guess Pas Cher

    ReplyDelete
  4. Hello, after reading this awesome article i
    am as well cheerful to share my knowledge here with colleagues.


    Here is my page ... Michael Kors (http://overuc.com/)

    ReplyDelete
  5. Having read this I believed it was very enlightening.
    I appreciate you finding the time and effort to put this short article
    together. I once again find myself personally spending a lot of time both reading
    and posting comments. But so what, it was still worthwhile!



    My web site ... Louis Vuitton Handbags

    ReplyDelete
  6. A person essentially lend a hand to make severely posts I might state.
    This is the very first time I frequented your web page and
    so far? I amazed with the analysis you made to
    create this particular publish incredible. Magnificent activity!


    Review my web blog :: Tory Burch Shoes

    ReplyDelete
  7. My brother suggested I would possibly like this blog.
    He was once entirely right. This post truly made my day.
    You cann't consider just how a lot time I had spent for this info! Thank you!

    Take a look at my website ... Cheap Oakley Sunglasses (tedxyse.com)

    ReplyDelete
  8. Quality articles is the secret to invite the visitors to pay a visit the
    website, that's what this web site is providing.

    Feel free to visit my web site; Gucci Sito Ufficiale

    ReplyDelete
  9. Nice weblog right here! Also your web site a lot up very
    fast! What web host are you the use of? Can I get your affiliate hyperlink in your host?
    I wish my web site loaded up as fast as yours lol

    my web page - NFL wholesale Jerseys

    ReplyDelete
  10. Simply desire to say your article is as amazing.
    The clarity in your post is just nice and i
    could assume you are an expert on this subject.

    Fine with your permission allow me to grab your RSS feed
    to keep up to date with forthcoming post. Thanks a million and please
    continue the enjoyable work.

    Also visit my web page Louis Vuitton Bags Outlet

    ReplyDelete