Proprietress n s యజమానురాలు.
Propriety n s మర్యాద, యోగ్యత, యుక్తము. a breach of * అమర్యాద,మోట సరసము.
Propugner n s a defender, రక్షించేవాడు, కాపాడేవాడు.
Prorogation n s కొన్నాళ్లకు వెనక కానియ్యుమని నిలిపి పెట్టడము.
Prosaic adj విరసమైన, జబ్బైన.
Proscribed adj భ్రష్టైన, నిషేధించబడ్డ, వెలివేయబడ్డ. a * criminal కన్నవాండ్లు కన్న చోట చంపవలసినదని ప్రచురము చేయబడ్డ నేరస్థుడు. house breakers are * పగలగొట్టి యింట్లో జొరబడే దొంగలను యేమి చేసినా నేరము లేదని ప్రసిద్ధము. onions are * to bramins వుల్లిగడ్డలు బ్రాహ్మణులకునిషేధము. these customs are * among us మాలో యీ వాడుకలు కారాదు. novels are * to girls ఆడపడుచులు శృంగార కావ్యములు చదవరాదు. education is * to Hindu women హిందూ స్త్రీలకు చదవడము వల్ల కాదు.
Proscription n s బహిష్కారము, చంపవలసినదనిగాని ఆస్తిని దోచుకోవలసినదని గాని చేసిన ప్రకటన.
Prose n s వచనము, మాటలు గద్య. in plain * she won't marry him వెయ్యి మాటలెందుకు అది వాణ్ని పెండ్లి యాడదు.
Prosecution n s జరిగించడము, నడిపించడము. or suit ఫిర్యాదు, వ్యాజ్యము. in the * of this affair యీ వ్యవహారమును జరిగించడములో.
Prosecutor n s ఫిర్యాది, ఫిర్యాదు చేసినవాడు, వాది.
Prosecutrix n s ఫిర్యాదు చేసిన స్త్రీ, ఫిర్యాధియైన స్త్రీ.
Proselyte n s అన్యమతము చొచ్చినవాడు, అన్యమతములో ప్రవేశించినవాడు.I am now a * to your opinion తుదకు తమ అభిప్రాయమునకు లోబడ్డాను.
Proselytism n s ఛందము తెలిసినవాడు.
Prosody n s ఛందస్సు.
Prospect n s కనుపారేంత దూరము ఆశ, నమ్మిక, సూచన. there is a fine * from the top of this hill యీ కొండ మీద నుంచి చూస్తే బహు దూరముకండ్లబడుతున్నది. he has another business in * వాడికి యింకొక ఆశ వున్నది. he has no * of having children వాడికి బిడ్డలు కలగబోతారనే ఆశ లేదు, నమ్మిక లేదు. there is no * of his recovery వాడు బ్రతికే జాడ కానము. he has a dreadful * వాడికి యేమో బండపడబోతున్నది. there is every * of his coming వాడు అన్ని విధాలా వచ్చే గతిగా వున్నది. this will interfere with his *s యిది వాని మేలుకు చెరుపుగా వుండును.
Prospective adj భావిసూచకమైన, సంభవించ పొయ్యేదాన్ని గురించిన. a *calculation ఉజ్జాయింపు. * arrangements ముందు జాగ్రతలు.
Prospectus n s చేయబొయ్యేదాన్ని గురించిన ప్రకటన.
Prosperity n s శ్రేయస్సు, భాగ్యము, కలిమి, సంపద, ఉఛ్రాయము.
Prosperous adj శ్రేయస్కరమైన, శుభకరమైన.
Prosperously adv చక్కగా, బాగా.
Prostitute adj వ్యభిచారియైన, దుడ్డే ప్రధానముగా వుండే. a * flatterer డబ్బుకు పొగడేవాడు. a * lawyer దుడ్డునే ముఖ్యముగా చూచే లాయరు.
Prostitution n s లంజరికము, వ్యభిచారము. To call it is charity is a mere * of language యీ పనికి ధర్మమనే శబ్దము, ప్రయోగించడము వట్టి దుష్ప్రయోగమే, అనగా యీ పనిని ధర్మమనరాదు.
Prostrate adj సాగిలపడ్డ, సాష్టాంగముగా పడివుండే.
Prostration n s సాష్టాంగదండము సాగిల పడడము. on account of the * of his strength వాడికి నిండా బలహీనతవల్ల.
Prosy adj నీరసమైన, జబ్బుగా వుండే. he is very * అనా కొనాలేక వూరికె పెంచి చెప్పుతాడు.
Protean adj కామరూపియైన, అనిశ్చయమైన, చపలమైన. this disease is quite * యీ రోగము గడియకు వొక విధముగా వుంటున్నది. See Proteus.
Protected adj రక్షించబడ్డ, కాపాడబడ్డ, ఆదరించబడ్డ.
Protection n s రక్షణ, ప్రాపకము, ఆదరవు. they are under his * అతని పోష్యములో వున్నారు. to seek * ఆశ్రయించుట, శరణుజొచ్చుట. I throwmyself on your * తమ్మున శరణు జొచ్చినాను. they put themselves under his * అతణ్ని శరణుజొచ్చిరి.
Protective adj రక్షించే.
Protector n s రక్షకుడు, పాలకుడు.
Protectress n s రక్షకురాలు.
Protegee n s సంరక్షణలో వుండేవాడు, పోష్యవర్గువాడు, ఆశ్రితుడు.
Protest n s దృఢముగా చెప్పడము, రూఢిగా చెప్పడము. he made a * against this దీన్ని కారాదన్నాడు, కూడదన్నాడు. he entered a * regarding the bills హుండిరూకలు, లేక, పత్రార్థము చెల్లలేదని దానిమీద వ్రాసినాడు.
Protestant n s రోమన్ కేతోలిక్కు మతమునకు ప్రతిగా యేర్పడివుండే ఖ్రిష్టియన్మతస్థుడు. The Bible is the religion of Protestants. (Chillingworth; In Christian Observer, May 1944, p. 295.)
Protestantism n s రోమన్ కేతోలిక్ మతమునకు ప్రతిగా యేర్పడివుండే ఖ్రిష్టియన్ మతము.
Protestation n s వద్దని బతిమాలుకోవడము, కారాదని వేడుకోవడము.
Proteus n s గడియకు వొక రూపు వహించే రాక్షసుడు, కామరూపి, నిలకడలేని వాడు.
Prothonotary n s పెద్ద కోర్టులో వుండే పెద్ద రిజిస్టరు.
Protocol n s గ్రంధము, నలుగురు మంత్రులున్ను కూడి యేర్పాటు చేసుకొని వ్రాసుకొన్న మూల నిర్ణయ పత్రిక.
Prototype n s is the original or model after which a thing was formed; but chiefly used for the patterns of things to be engraved, cast, &c. మాతృక, మాదిరి, మేలు బంతి, దృష్టాంతము.
Protracted adj బహుదినాలుగా జరిగిన. a * disease దీర్ఘ రోగము.
Protraction n s ఆలస్యము, కాలవిడంబము.
Protruded adj బయిటికి తోసుకొనివచ్చిన, ముందరికి వెళ్లుకొనివచ్చిన.
Protrusion n s బయిటికి తోసుకొని రావడము ముందరికి వెళ్లుకొని రావడము. an account of the * of flesh fresh the wound ఆ పుంటిలో నుంచి మాంసము బయిటికి పెరగడము వల్ల.
Protuberance n s ఉబ్బు, ఉబుకు.
Protuberant adj ఉబ్బుగా వుండే, ఉబుకుగా వుండే.
Proud adj గర్వముగల, అహంకారముగల, బడాయిగల. when a cow is * ఆవు యెదగా వుండేటప్పుడు. * flesh in a wound (which the vulgar thinkbad) దుర్మాంసము. there appeared * flesh in the wound ఆ కురుపులో దుర్మాంసము పెరిగినది. a * mountain మహాపర్వతము.
Proudly adv గర్వముగా, బడాయిగా, ఘనముగా.
Proved adj నిరూపించబడ్డ, నిజపరచబడ్డ, అయిన.
Provender n s ఆహారము, మేత.
Proverb n s సామిత this is a common * యిది లోక సామేత. The Proverbsof Solomon హితోపదేశ గ్రంధము. (Yates.)
Proverbial adj సామితగా వుండే. the obstinacy of these people is * వాండ్లకుయీ మూర్ఖత ప్రసిద్ధమే.
Proverbially adv సామితగా, ప్రసిద్ధముగా. this is * difficult యిది కష్టమైనట్టుప్రసిద్ధమే. a place * dangerous to the health రోగభూమి అని పేరుబడి వుండే స్థలము.the lion's waist is * slender సింహము యొక్క నడుము సన్నమైనదని రూఢి.
Provided adj జాగ్రతచేయబడ్డ, సిద్ధముచేయబడ్డ, అమర్చిన. his children are well *for అతని బిడ్డలకు వొకందునా కరత లేదు. * he is there అతడు అక్కడ వుండే పక్షమందు. *that he arrives in proper time అతడు సమాయానికి వచ్చినట్టైతే. * alwayas that he consents అయితే వాడు సమ్మతించ వలసినదిగదా. you can dispose of the money inthis manner * always that your father consents నీ వా రూకలను యీ ప్రకారముగావ్రయము చేయవచ్చును, అయితె మీ తండ్రిగారి అనుమతి వుండ వలెను. * always that అనగా If. Providence, n. s. or foresight ముందు జాగ్రత, ముందాలోచన. they shew no * in theirfamilies వాండ్ల కాపురములో పోణిమిలేదు, యిది ప్రాచీన ప్రయోగము. a word for God దైవము. the care of God దేవ సంరక్షణ, దైవటాక్షము. the decrees of * దైవయత్నము, దైవసంకల్పము, ఈశ్వరాజ్ఞ, దైవగతి. by the hand of * దైవశముగా. * ordered that he met them దైవాధీనముగా వాండ్లకు యెదురుపడ్డాడు.
Provident adj ముందు జాగ్రతగల, ముందాలోచనగల.
Providential adj దైవకృతమైన, దైవాధీనమైన.
Providentially adv దైవాధీనముగా.
Providently adv ముందు జాగ్రతగా.
Provider n s జాగ్రత చేసేవాడు, సిద్ధము చేసేవాడు. the jackal is called the lion's * నక్క సింహమునకు ఆహారము జాగ్రత చేశేటిది.
Province n s a country దేశము, రాజ్యము. or district జిల్లా, తాలూకా. dutyధర్మము, పని, కార్యము. It is the magistrate's * to try thieves దొంగలను విచారించడము మెజిస్త్రేటు వారి పని. the army returned into the *s దండు దేశములోకితిరిగి వచ్చినది.
Provincial adj దేశ సంబంధమైన. a * dialect దేశ్యము, దేశీయము, గ్రామ్యము. * customs దేశాచారమలు.
Provincialism n s దేశ్యము, దేశ్యమైన మాట, గ్రామ్యము.
Provision n s జాగ్రతచేయడము, సిద్ధముచేయడము. stock collected సామాను, సామాగ్రి,రస్తు. or food ఆహారము. the army is in distress for want of *s దండుకు రస్తులేక సంకటముగా వున్నది. salt *s వుప్పు వేసిన మాంసము. fresh *s వుప్పు బిడ్డలకని వొకటి కూడబెట్టడము లేదు. In the law there is a * regarding this ధర్మ శాస్త్రములో యిందున గురించిన వొక నిబంధ వున్నది.
Provisional adj అట్లా ప్రసక్తించే పక్షమందు యిట్లా చేసేదనే, తాత్కాలికమైన, సద్యా. this is a * arrangement అట్లా ప్రసక్తించే పక్షమందు యిట్లా చేసేదనే యేర్పాటు. a member of Council రేపు మంత్రి కాబొయ్యేవాడు.
Provisionally adv ఫలాని నిబంధన మీద, యిన్నో వొక నియమము మీద, అట్లా ప్రసక్తమయ్యే పక్షమందు. he agreed to sell me the house * యిన్నో వొకపని ప్రసక్తమయ్యే పక్షమందు ఆ యింటిని నాకు అమ్ముతానని వొప్పుకొని యున్నాడు.
Proviso n s నిబంధన, వొడంబడిక.
Provocation n s కోపకారణము, కోపము వచ్చే పని. he patiently bore this *యింత ఆగ్రహ జనకమైన పనికి తాళిమిగా వోర్చుకొన్నాడు. this was a great * యిది నిండాకోపము వచ్చే పని. he beat me without any * నన్ను నిర్వేత్కరముగా కొట్టినాడు, వూరికే కొట్టినాడు.
Provocative adj దీపనకారియైన, ఆకలి పుట్టించే, మోహకరమైన, మోహమును పుట్టించే. * medicine దీపనకారియైన ఔషధము. To Provoke, v. a. రేచుట, కోపము పుట్టించుట. or to cause పుట్టించుట. this *d himor *d his anger వాడికి యిందుకు కోపము వచ్చినది. he did this to * me నాకుకోపము రావలెనని దీన్ని చేసినాడు. do what you will, you will not * me నీవుయేమి చేసినా నాకు కోపము రాదు. *d me to laugh or this *d my laughter or *da smile యిందుకు నాకు నవ్వు వచ్చినది. this *s enquiry యిది విచారించవలసి వచ్చినది. he gave me this medicine to * perspiration నాకు చెమటపట్టడానకైయీ మందు యిచ్చినాడు.
Provoked adj "రేగిన, ఆగ్రహము వచ్చిన. he was much * at this వాడికి యిందుకు మహా ఆగ్రహము వచ్చినది. "
Provoking adj ఆగ్రహజనకమైన, మోహకరమైన, అసహ్యమైన.
Provokingly adv రేగులాగు, ఆగ్రహము వచ్చేటట్టు, మోహము పుట్టేటట్టు, అసహ్యమువచ్చేటట్టు.
Provost n s అధిపతి, అధకారి, కొన్ని చోట్ల పోలిసు అధికారి. a * marshalదండు ప్రయాణములో దౌర్జన్యము చేసే వానికి శిక్ష విధించే అధికారి.
Prow n s వాడ యొక్క ముఖము, వాడ యొక్క ముందరి తట్టు.
Prowess n s శౌర్యము, పరాక్రమము.
Proximate adj సమీపమైన, సన్నిహితమైన, దగ్గిరి. a * relation సమీప బంధువు,దగ్గిరి బంధువు. the * cause of fever జ్వరానికి సన్నిహితమైన కారణము. the* premier వొకడికి వెనక మంత్రి కావడానకు సిద్ధముగా వుండేవాడు.
Proximity n s సామీప్యము, సన్నిహితము. on account of the * of the feast పండుగ సమీపించినందున.
Proximo adv in next month వచ్చే నెలలో. This word should never be used. Proximo, Instant and Ultimo are bad mercantile phrases and ought to be discontinued.
Proxy n s బదులు మనిషి, వకీలు, గుమాస్తా. to do by * మనుష్య ముఖాంతరముగాచేసుట. Literally (proximus) సంహితుడు.
Prucurable adj దొరికే, చిక్కే. that book is not now * ఆ పుస్తకము యిప్పుడుచిక్కేదికాదు.
Prude n s నిర్హేతుకముగా సిగ్గుపడేటిది, బహుసిగ్గుపడే దానివలె బయిటికి తసి కేటిది, నంగనాచి, రుద్రాక్ష పిల్లవంటిది.
Prudence n s తెలివి, వివేకము, పోణిమి, తెరకువ, జాగ్రత, ఏచ్చరిక.a rat has great cunning but no * యెలుకకు కాపట్యము వున్నది గానిపోణిమి లేదు. a sparrow and an ant have great * but no cunningవూరపిచ్చికకున్ను చీమకున్ను వివేకము కద్దుగాని కాపట్యము లేదు. In Prov. VIII.21. వివేచన A+ D+ బుద్ధి. H+ జ్ఞానము. E+.
Prudent adj తెలివిగల, వివేకముగల, తెరుకువైన, జాగ్రతగల, ఏచ్చరిక గల.it is not * to do so యిట్లా చేయడము బుద్ధికాదు. Prov. XII. 16. విజ్ఞజనః A.
Prudential adj వివేకమును పట్టి చేసిన, జాగరూకతను పట్టి చేసిన.
Prudently adv తెలివిగా, వివేకముగా, తెరకువగా, జాగ్రతగలిగి, ఏచ్చరికగా.
Prudery n s రుద్రాక్ష పిల్లితనము, నంగనాచితనము, బహుసిగ్గుగల దాని వలె బయిటికి తనకడము.
Prudish adj రుద్రాక్ష పిల్లి వంటి, బహుసిగ్గు పడే దాని వలె బయిటిక తసికే.
Prudishly adv బహుసిగ్గగల దానివలె బయిటికి తసుకుగా, రుద్రాక్ష పిల్లిరీతిగా.
Prudishness n s బహు సిగ్గుగల దానివలె బయిటికి తసకడము.
Prune n s నెల్లికాయ వంటి వొక పండు.
Prunello n s వొక విధమైన గుడ్డ, యోందుతో పూర్వము చెప్పులు కట్టబడ్డవి గనుక.mere leather and * అనగా trash, rubbish తుక్కా ముక్కా, పనికిరానిది. Pruning hook, Pruning knife, n. s. కొమ్మలను నరికే కత్తి, మచ్చుకత్తి,పాళెకత్తి, దోటి. In publishing this tale he used the pruning knifeకొంచెము చెప్పినాడు, కొంచెము మానినాడు.
Prurience, Pruiency n s. దూల, దురద, గాడు.
Prurient adj దూలపట్టిన, దురద పట్టిన, గాడు పట్టిన.
Prussic acid n s వొక విధమైన చెడ్డ విషము.
Psalmist n s కీర్తనలు చెప్పే కవి.
Psalmody n s సంగీతము, అనగా భక్తి పరమైన సంగీతము.
Psalter n s కీర్తనల పుస్తకము. these boys are well educated in the * యీ పిల్ల కాయలు కీర్తనలు బాగా పాడడానకు నేర్చకొన్నారు.
Psaltery n s వొక విధమైన వీణె, మృదంగము. A+ D+ సర్వమండలము. H+ E.
Pseudo adj మాయగా వుండే. a * saint కపట సన్యాసి.
Pseudonym n s or false name తప్పు పేరు, మారు పేరు.
Pshaw interj ఛీ, ఛీపో.
Psycology n s ఆత్మ విచారము.
Ptarmigan n s వొక విధమైన పావురాయి. In Barrow's Newfound landhe says it is merely a name of Partridge.
Ptisan n s వొక విధమైన గంజి.
Puberty n s వయసు, యౌవనము, after they reached * వారికి వయసు వచ్చినతరువాత.
Pubes n s శష్పాలు, నూగు.
Pubescence n s నూగు, యౌవనము.
Pubescent adj యౌవనము వచ్చిన, వయసు వచ్చిన.
Pubic regions n s కీగడుపు, మానము.
Public business n s రాజకీయకర్మము. (says Pearson.)
Publican n s or Inn-keeper సత్రగాడు. or tax gatherer సుంకరి.
Publication n s ప్రకటన, చాటింపు. or book పుస్తకము.
Publicity n s బహిరంగము, బాహాటము. they did this to prevent *బహిరంగము కాకుండా యిట్లా చేసినారు.
Publick adj Belonging to a state సర్కారు, దివాణపు. a * officeకచ్చేరి. * service సర్కారు వుద్యోగము. a * letter సర్కారు వుద్యోగమును పట్టివ్రాసిన జాబు. belonging to all పొత్తుగా వుండే, అందరికిన్ని బాద్యత గల. thecommon stock, or * property అందరికిన్ని పొత్తుగా వుండే సొత్తు, లోకులకంతాపొత్తుగా వుండే సొత్తు. the * good లోకహితము. the * enemy లోకశత్రువు. a *spirit లోకోపకారము చేసే గుణము. a * spirited man or a * benefactorలోకోపకారి. He did this for the * good లోకోపకారముగా దీన్ని చేసినాడు.a * road రాజమార్గము, నలుగురు నడిచే దోవ. a * place అందరికిన్ని పొత్తుగావుండే స్థలము. To-morrow is a * day with the governor రేపు అందరికిగౌనరు దర్శనమిచ్చే దినము. a * school సర్కారు పల్లె కూటమి, ధర్మపల్లె కుటము.or open బహిరంగమైన, బాహాటమైన. when it became * అది ప్రచురమైనప్పుడు, అదిబయటపడ్డప్పుడు. a * house సారాయి అంగడి, కల్లంగడి. a * whore వూరలంజ. a* hospital ధర్మ ఆసుపత్రి. he made it * దాన్ని ప్రచురము చేసినాడు. * executionబహిరంగముగా వురి దీయడము. * rooms పది మందికి పొత్తుగా వుండే యిండ్లు. * scron లోకనింద, పది మంది ఛీ యనడము. he became a * laughing stock పది మందినవ్వడానికి ఆస్పదమైనాడు. * measures ప్రజా సుఖమునకై చేయబడ్డ యేర్పాట్లు. Thegovernor made a * visit to the fort గవనరు సపరివారముగా పోయినాడు.
Publick, Public n s. లోకులు, జనులు, ప్రజలు, పరులు. the charitable* ధర్మాత్ములైన వాండ్లు. the reading * చదివే వాండ్లు. he spoke in * బహిరంగముగామాట్లాడినాడు.
Publickly adv బాహటముగా, బహిరంగముగా.
Published adj ప్రచురమైన, బహిరంగము చేయబడ్డ, చాటించిన.
Publisher n s ప్రచురము చేసేవాడు, చాటించే వాడు, అచ్చు వేసి ప్రసిద్ధముచేసేవాడు.
Pucelage n s కన్నెరికము.
Puck n s వొక విధమైన దయ్యము.
Puckah adj (Indian word for a house built with lime) సున్నపు కట్టడము.this is a cutcha house యిది సున్నముతో కట్టిన యిల్లు అది బురదతో కట్టిన యిల్లు.
Pucker n s passion అసహ్యము, కోపము, చీదర. of cloth మడత, కుచ్చె.
Pudder n s (Locke and Johnson) తొందర, అల్లరి.
Pudding n s పిండి వంట, యిది ముఖ్యముగా పాలు, పిండి, గుడ్లు, వీటితో నానా విధములుగా చేసే వొక విధమైన ఆహారము. plain salt * సంకటి. solid * is better than empty praise వట్టి బుజ్జగింపుకన్న మంచి తిండి మేలు. a jack * హాస్యగాడు. he came in * time తాను బాగుపడ వలసిన సమయానికి వచ్చినాడు.
Puddle n s చిదపలు చిదపలుగా నీళ్లు నిలిచే పల్లము.
Pudency, Pudicity n s. సిగ్గు.
Pudendum n s virile శిశ్నము, లింగము. * muliebre యోని, భగము.
Pudgy adj short and fat పొట్టిగా వుండే, గిటకైన.
Puerile adj పసి, బాల్యమైన, పడుచుతనమైన, అవివేకమైన. * freak బాల్య చేష్ట.
Puerility n s పసితనము, పిల్లతనము, అవివేకము.
Puff n s a quick blast with the mouth వొక వూదు. a blast of windగాలి దెబ్బ. the wind came in *s గాలి బుస్సుమని కొట్టినది. a kind of foodవొక విధమైన పిండి వంట. a fungous ball filled with dust కుక్కగొడుగు. a powder * వాసన పొడి చల్లుకొనే బొచ్చుతో చేసిన చెండు. an advertisement ornotice మనుష్యలకు ఆశ పుట్టేలాగున కొట్టే జల్లి మాటలు.
Puffed adj ఉబ్బిన, వూదబడ్డ. he was * with pride వాడికి గర్వము మించినది.
Puffin n s వొకవిధమైన జలపక్షి.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning
No comments:
Post a Comment