Phosphorescent English to Telugu free online dictionary

Phosphorescent adj వేడి లేక రాత్రిళ్లు వెలిగే. the glowworm has a *lightమిణుగురు పురుగుకు వేడిలేక రాత్రిళ్లు వెలిగే వొక వెలుతురు కద్దు.
Phosphoric adj వేడిలేక చీకట్లో వెలిగే వొక వస్తు సంబంధమైన. * light ismentioned in the Raghuvamam .IX.70.&). సలలిత కుసుమ ప్రవాళ శయ్యాం జ్వలితమహౌషధి దీపికాసనాధాం.
Phosphorus n s వేడి లేక చీకట్లో వెలిగే వొక వస్తువు.
Phrase n s మాట, పదము, వాక్యము, వచనము. this book has many ancient*s యీ గ్రంథములో కొన్ని ప్రాచీన పదములు వున్నవి. this is a common * యిదిసామాన్యమైన మాట. this is a remarkable * యిది విచిత్రమైన ప్రయోగము. this isa vulgar * యిది నీచమాట.
Phraseology n s పాకము, శయ్య. the * is easy యిది సులభమైన పాకము.
Phrenology n s కపాలపరీక్ష, అనగా కపాలము యొక్క ఆకారమును పట్టి మనిషియొక్క గుణములను నిశ్చయించే శాస్త్రము.
Phrensy n s పిచ్చి, వెర్రి, పైత్యము, చలచిత్తత.
Phthisical adj క్షయరోగముగల, క్షయించిన.
Phthistic n s క్షయరోగము.
Phylactery n s యహూది దేశస్థులు కట్టే వొక విధమైన రక్ష.
Phymosis n s పెరిగిన తోలు.
Physical adj ( natural) సహజమైన, స్వాభావికమైన, పకృతి సిద్ధమైన. in *strength the is my superior కాయపుష్టిలో వాడు నాకు అధికుడు. * exertionకాయకష్టము. his * system is deranged వాడి దేహస్థితి తప్పినది. * forceదేహదార్ఢ్యము. he kept her quite by * force ఆమె లేవకుండా తన బలమంతావేసి అణచినాడు. it is a mere question of * force బలో రాజా పృథ్వీ. the *difficulties are very great పకృతి సిద్ధమైన సంకటములు ప్రబలము. I do seethe * possibility of this యిది సహజముగా అయ్యేటిది కాదు, యిది కొంచెములోఅయ్యేది కాదని నాకు తోస్తున్నది.
Physically adv ప్రకృత్యా, స్వభావముగా, సహజముగా. though * alive he ispolitically dead జీవశ్శవముగా వున్నాడు, అధికారతః చచ్చినాడు శరీరతః వున్నాడు,శరీరము వున్నదిగాని అధికారము పోయినది. it is * impossible బొత్తిగా వల్లకాడు.
Physician n s వైద్యుడు, చికిత్సకుడు.
Physick n s మందు, ఔషధము. he took * yesterday నిన్న బేదికి పుచ్చుకొన్నాడు. the science of healing వైద్యము, చికిత్స. he studied * for four yearsనాలుగేండ్లు వైద్య శాస్త్రము చదివినాడు. he practised * there అక్కడ వైద్యము చేస్తూవుండినాడు. Physicks సర్వపదార్థ వివేచక శాస్త్రము. the physick nut ( IatrophaCarcas, Ainslie 2.45.) నేపాళము.
Physiognomist n s ముఖభావము వల్ల మనోభావమును తెలుసుకొనే శాస్త్రవేత్త.
Physiogonomy n s ముఖ భావము వల్ల మనోభావమును తెలుసుకొనే శాస్త్రము.ముఖభావము, ముఖము. his * is that of a Musulman వాడిముఖము తురకముఖము వలె వున్నది.
Physiology n s పదార్థతత్వ వివేచక శాస్త్రము.
Pial n s or Bulk తిన్నె.
Piamater n s మంచితల్లి, అనగా మెదడుమీది సన్న తోలు. he is diseased in the* వాని మెదడుకు రోగము తగిలినది.
Piano or Pianofort n s అనేక తంతులు గల వొక విధమైన సంగీత వాద్యము.
Piastre n s వొక విధమైన బంగారు నాణెము, సుమారు రెండున్నర రూపాయికి మారేవొకవిధమైన నాణెము. ten piastres ( in Egypt ) are less than two shillings.
Piazza n s నడమంటపము, అనగా వార పాకవలె వుండే మంటపము, వసారా.
Pica n s వొక విధమైన అచ్చు అక్షరము.
Picapolonica n s తల పుండ్లుగా పుచ్చి చచ్చే వొక రోగము. See Elflock.
Picaroon n s వొక విధమైన దొంగ.
Pice n s ( Indian word for a half penny ) పైసా. ten * పది పైసలు.
Pickaxe n s గుద్దలి, పిక్కాసు, గడ్డ పలుగు.
Picked adj యేర్పరచి యెత్తబడ్డ, యేరబడ్డ, ఉత్తమమైన.
Picket n s See Picquet.
Picket-gate n s See Wicket also See Picquet.
Pickings n s ( plunder, stealthy gains ) కొల్ల, పై ఆదాయము. there weregreat *in the customs సుంకములో మంచి కొల్ల పై ఆదాయము నిండా.
Pickle n s వూరుగాయ. or water వూరుగాయపూట. or rogue పోకిరి. scrape ortrouble తొందర, సంకటము, రోత. he is a miserable * వాడు సంకటములోతగులుకొన్నాడు, రోతగా వున్నాడు, దిక్కుమాలిన స్థితిలో వున్నాడు.
Pickle-herring n s హాస్యగాడు.
Picklock n s బీగమును తెరిచే ఆయుధము, అనగా మారుతాళము. or thiefమారుతాళము వేసి తెరిచే దొంగ.
Pick-nick n s వనభోజనము.
Pickpocket n s ముడివిప్పే దొంగ, కత్తెరదొంగ.
Pickthank n s అధిక ప్రసంగి, చాడీ ఖోరు.
Picnic SeePicknick
Pic-nic n s వనభోజనము.
Picota n s Indian name for a Pump యేతాము.
Pictorial adj చిత్రసంబంధమైన. a * illustrationపఠము.
Picture n s పఠము, చిత్రము. to draw a * పఠము వ్రాసుట, చిత్రమువేసుట. thechild is the very * of its father యీ బిడ్డ అంత తండ్రిపోలికగా వున్నది. he wasthe very * of misery వాడు దౌర్భాగ్య స్వరూపుడై వుండినాడు. the * ( or tale ) isgreatly overcharged కొంచెమును గొప్పగా వర్నించి వ్రాసినాడు. here the poetturns the * కవి యిక్కడ వేరేదశను చెప్పబోతాడు. his house was a * ofhappinessవాడి యిల్లు ఆనంద నిలయముగా వుండినది.
Picturesque adj శృంగారమైన, అలంకారమైన. these Italian girls looked dirtyand saucy but were quite * ( Mrs. Butler's year of Consol.2.86. )వీండ్లు చూపుకు కునుమాలపు తుంట పడుచులుగా వున్నప్పటికిన్ని చిత్తరువులోవ్రాశినట్టు వున్నారు.
Piddle n s See Puddle.
Piddling adj అల్పమైన, నీచమైన, తుచ్ఛమైన. as * trade అల్ప వర్తకము.
Pidgeon n s See Pigeon.
Pie n s plu. Pice, (an Indian word) పైసా.
Pie, or Pye n s. వొక విధమైన అప్పము, అనగా పండ్లను గాని మాంసమును గానినడమపెట్టి చేసిన వొక విధమైన అప్పము. or magpie వూరికె వదిరే వొక పక్షి,వదురుబోతు. a dirtpie పిల్ల కాయలు పోగుచేసే యిసకకుప్ప.
Piebald adj చిత్రవర్ణములుగల, నానా వర్ణములుగల. a * horse పంచకళ్యాణి.
Piece n s of fragment తునక, తుండు, చెక్క, బద్ద, పేడు, ముక్క. a core of anorange or jack fruit & c. తొల, తొన. he moved a * at chess or at draftsవొక కాయను ఆడినాడు. a * wood మాను, తుండు. a * of cloth తాను, తుండు గుడ్డ.the custom levied on * goods గుడ్డలకు తీసిన సుంకము. the * of cloth cameoff అతుకు వీడిపోయినది. a * of ground కొంత నేల. a * sugar cane చెరుకుతుంట. a * of flesh మాంస ఖండము. a * of silver వెండి కడ్డి, వెండి నాణెము,రూపాయ మొదలైనది. a * of puresilver వూదు వెండిబిళ్ళ. a * of gold బంగారుకడ్డి, బంగారు నాణెము, మోహరీ మొదలైనది. he cut it in * s తునకలు తునకలుగాకోసినాడు. he put them in * by * వొకొక తునకగా లోగా వేసినాడు. it went to *sతునకలు తునకలైనది. this is just of a * with their conduct వాండ్ల కడమపనులతోటి పాటు యిదిన్ని వెర్రిగా వున్నది. it is all of a * అది అంతా వొకటే మచ్చుగావున్నది. In some phrases the word * is left untranslated; a * of waterకొలను, చెరువు, మడుగు. a * of injustice అన్యాయము. a * of money or coinరూకలు. a * of paper కాకితము, కొంచెము కాకితము. a * of furniture మేజా, బల్ల,కురిచి, మంచము, పెట్టె మొదలైనవి. a * of plate వెండి పాత్ర, బంగారు పాత్ర. this isa * of wit యిది వొక చమత్కారము. this is a * of folly యిది వొక వెర్రిపని. hemade a * great * of work about this యిందున గురించి నిండా దడబిడలుచేసినాడు. a fowling * వేట తుపాకి. a * of artillery ఫిరంగి. they fired he *sఫిరంగులు కాల్చిరి, తుపాకులు కాల్చిరి. a field * చిన్న ఫిరంగి. a wall * పెద్ద ఫిరంగి. fine * or a fine * of painting దివ్యమైనచిత్రము, పఠము. a sea * సముద్రమును వ్రాసివుండే పఠము. a battle * యుద్ధపఠము. a * of poetry కవిత్వము,కావ్యము.they played five *s of music అయిదు రాగాలు పాడినారు. a * of eightకరుకు వరహా. she is a foolish * ( a word of slight for a woman ) అది వొక వెర్రి ముఖము. he spent much money on *s వాడు ముండల వ్రయము నిండాచేసినాడు. head * బొమిడికము, యినుప కుళ్లాయి. tail * చిన్న పఠము, అనగా బొమ్మ.
Piecemeal adv తునకలు తునకలుగా, బద్దలుబద్దలుగా.
Pied adj నానావర ్మైన, చిత్రవిచిత్రమైన. a * horse బట్ట గుర్రము.a * cow బట్టావు.
Pier n s వంపు యొక్క గాని, వారధికంటి యొక్కగాని నడిమికట్టె, లేక, స్తంభము.or quay సముద్రమునకు గాని నదికిగాని రాళ్లు కట్టిన రేవు.
Piercer n s బరమా.
Piercing adj తీక్ష్ణమైన, చురుకైన. a * sound కర్ణకఠోరమైన ధ్వని. a * windయీదరగాలి, చెడ్డ చలిగాలి. * words క్రూరమైన మాటలు. a * genius కుశాగ్రబుద్ధి.heart * intelligence గుండెలు పగిలే సమాచారము.
Piercingly adv తీక్ష్ణముగా. he looked at me * నన్ను తీక్ష్ణముగా చూచినాడు.
Pietism n s ( Schlegel ) పిచ్చి వైరాగ్యము.
Piety n s భక్తి, విశ్వాసము.
Pig n s పందిపిల్ల. a mass of lead సీసపు ముద్ద or iron యినపముద్ద. * headedఅతిమూర్ఖమైన. guinea * పిల్లివంటి వొక జంతువు.
Pigeon n s పావురాయి. the brown * పిడిసిటిపిట్ట. the fan tailed * వొక విధమైన పావురాయి. the rock * పోలంక, పోలక, పోలికపిట్ట, పోలుగు, లావుక.The rock * might be better called Grouse : it is the Tetrao Paradoxusor rather the black bellied pterocles. See Wilkin son's Thebes,1835 page 245.a * house పావు రాళ్ళగూడు.
Pigheaded adj (obstinate )మూఖ ్మైన, మొండి.
Pigment n s వర్ణము, రంగు.
Pigmy n s మూడు జానల పొడుగు మనిషి, యిది కావ్యమందు వచ్చే శబ్దము.
Pignuts n s వేరుశనగలు. = Earthnut, Arachis hypogoea -MadrasJournal. IX.440 . Rox.3 .280.
Pigsty n s పందిగుడిశ, పందులదొడ్డి.
Pig-tail n s A cue; the hair of the head tied in the form of a pig's tail; dry loose leaves tobacco జడ, పొగాకు or పొగాకు మట్టలు.
Pike n s గండుమీను. or spear ఈటె, బల్లెము. it is as plain as a * staffయిది అతి స్పష్టముగా వున్నది, యిది నిస్సందేహముగా వున్నది.
Pilability n s నమ్రత్వము. from the * of lead సీసము వంగేటిది గనుక. fromthe * of a childs temper బిడ్డల గుణము యెట్లా అంటే అట్లా తిరిగేటిది గనుక.
Pilable adj వంగే, వంచతగిన. lead is * సీసము వంగుతున్నది. rattan is *బెత్తెము వంగేటిది. the minds of children are * బిడ్డల మనసు సులభముగాతిరుగుతున్నది.
Pilableness n s నమ్రత, వంగే గుణము.
Pilant adj ఎట్లా వంచితే అట్లా వంగే, నయమైన.
Pilaster n s అందానికి గోడతో చేరినట్టుగా చేసిన స్తంభము. See Ann. R.1820 .p.1095.
Pilchard n s వొకవిధమైన చేప.
Pile n s a heap కుప్ప, తిప్ప, రాశి. a magnificent * అతి ఘనమైన యిల్లు, లేక,గుడి. the funeral * కాష్టము, చితి. his religion brought him tothe * మతద్వేషము చేత వాణ్ని తగలబెట్టినారు. a stick వాసము. a hair వెంట్రుక. the piles(a disease ) మూలవ్యాధి.
Piled adj కుప్పవేసిన, పోగుచేసిన.
Pilentum n s (an easy car) అతి సుఖకరమైన వొక బండి.
Pilers n s plu. శ్రావణము.
Pilferer n s స్వల్ప దొంగతనము చేసే వాడు, ముందలించేవాడు.
Pilgarlick n. s. కన్నవారి చేత చీవాట్లు పడేవాడు, దిక్కుమాలినపక్షి, they did notcome back and * must pay the money వాండ్లు తిరుగా రానందున ఆ రూకలుదిక్కుమాలిన పక్షి చెల్లించవలసి వచ్చినది, దిక్కుమాలిన పక్షి అనగా నేను అనితాత్పర్యము.
Pilgrim n s యాత్ర చేసేవాడు, పరదేశి, తీర్థయాత్రాపరుడు. in a metaphoricalsense తపసి.
Pilgrimage n s యాత్ర, తీర్థయాత్ర. a place of * దివ్యదేశము, పుణ్యక్షేత్రము. he went on * యాత్రపోయినాడు. in a metaphorical sense తపస్సు.
Pill n s మాత్ర, గుళిక, వుండ. this was a bitter * to him వాడికి యిది వొక ప్రాణసంకటముగా వుండినది. poverty is bitter * దరిద్రము పడరానిది.
Pillage n s కొల్ల, దోపుడు.
Pillar n s స్తంభము, కంభము, గుంజ. he is a * of the state ఆ సంస్థానానికిఅతడు వొక నిర్వాహకుడు.
Pillared adj స్తంభములు గల.
Pillaw, or Polao n s. ( an Indian dish of rice ) పులావు.
Pillion n s ఆడదానిజీని, గుర్రము మీద ముందర మొగవాడున్ను వెనక ఆడదిన్ని కూర్చుండేటట్టు వొకజీనికదు అందులో యిది వెనకటి జీనికి పేరు.
Pillory n s అరతూకు, అనగా కొన్ని చెడ్డతప్పులు చేసిన వాండ్లను అవమాన పరచడానకై మంచెవలెకట్టి అందులో వొక పలకను పెట్టి దాంట్లో వుండేరంధ్రములలో మెడనున్ను చేతులనున్ను తగిలించి కొంత సేపుదాకానిలువపెట్టుతారు దాన్ని అరతూకు అంటారు.
Pillow n s తలగడ, దిండు.
Pillowcase n s తలగడవొర, తలగడ, గవిసెన.
Pilot n s వాడలకు దారి చూపేవాడు, మాలిమి, ( అరకాటి is the Tamil word. )
Pilotage n s వాడకు దారి చూపే శక్తి, వాడకు దారి చూపేవాని కూలి.
Pimenta n s వొకవిధమైన మిరియాలు.
Pimp n s కుంటెనగాడు, బడవా. Fielding uses this instead of bawd.
Pimping adj vile, base, wretched స్వల్పమైన, నీచమైన, తుచ్ఛమైన, క్షుద్రమైన,పనికిమాలిన.
Pimple n s మొటిమ, చెమరకాయ.
Pin n s గుండుసూది, అనపసూది, అలపనాతి. he did not give even the valueof a *'s point for it వాడు దానికి వొక గుల్ల కాసైనా యివ్వలేదు. he does notcare a * for me నన్ను అలక్ష్యము చేస్తాడు. you might have heard a * dropచీమ చిటుక్కుమంటే వినబడును, అనగా అంత నిశ్శబ్దముగా వుండిన దనియర్థము.or peg వసి, గూటము. tent *s గుడారపు మేకులు. a rolling * అప్పడాలకర్ర.* hole సన్న బెజ్జము.
Pinafore n s కారు, పటకారు, శ్రావణము.
Pinch n s గిల్లు, నులి. he gave her a * on the cheek దాని బుగ్గనునులిమినాడు. on feeling the * గిల్లగానే. a small quantity, as of snuff,రెండు వేళ్లుపట్టే మాత్రము, కొంచెము, రవంత. a * of snuff చిటికెపొడి.or time of distress తొందరవేళ. at a * అవసరము వచ్చినప్పుడు కావలసినప్పుడు.
Pinchbeck n s వొకవిధమైన పంచలోహము, తంబాకు. ( * was the name ofa buckle maker to George II. ).
Pinched adj యిరుక్కొన్న, సంకటపడే, యిబ్బందిపడే. See To Pinch.
Pincushion n s గాది అనగా అలపనాతులు గుచ్చి పెట్టే చిన్న దిండు.
Pindaree n s ( Freebooter ) పెండారీ వాడు. * horse పెండారీ గుర్రము.
Pine n s a tree దేవదారు వృక్షము.
Pinealgland n s సుఘమ్ననాడి, కుండలి, బ్రహ్మ నాడి.
Pineapple n s అనాసపండు.
Pined adj or shrewelled కృశించిన, శుష్కించిన, యీచపోయిన.
Pinfold n s దొడ్డి, కొట్టము.
Pining n s కార్శ్యము, చిక్కి వుండడము.
Pinion n s రెక్క, రెట్ట.
Pink n s పన్నీరు పువ్వువర్ణము, పాటల వర్ణము, వొక పుష్పము. she was the * ofthe family ఆ కుటుంబానికి అది తిలకముగా వుండినది. he was the * of fashionఅతి శృంగార పురుషుడుగా వుండెను.
Pinkish adj నీరు కావిగా వుండే.
Pinmoney n s ఉంకువ, స్త్రీధనము.
Pinnace n s వొకవిధమైన చిన్నపడవ.
Pinnacle n s గోపుర శిఖరము శిఖరము. he reached the * of gloryఅతి యశస్సును పొందినాడు.
Pinner n s శిరోభూషణము, యిది పూర్వ కాలపు సొమ్ము.
Pint n s అర్ధశేరు, యిది నీళ్ళు, సారాయి, పాలు మొదలైన వాటిని గురించిన మాట. a *bottle అరబుడ్డి.
Pioneer n s కామాటి, దండులో కామాటి పనులు చేయడమునకై జీతము తీసుకొనివుండే కామాటివాడు, పైనీరువాడు, బేల్దారు.
Pious adj భక్తిగల, విశ్వాసముగల. a * act సుకర్మము, ధర్మము.
Piously adv సద్భక్తిగా, విశ్వాసముగా.
Pip n s a spot on cards ఆడే కాకితాల మీది చుక్క. or berry కాయ. seed in anorange కిచ్చిలి పండులో వుండేవిత్తు. there was not a * of spice in it దాంట్లోమసాలా రవంతైనా లేదు. a disease in fowls కోళ్ళకు వచ్చే వొక విధమైన తెవులు.a melancholy cut throat place where I think we shall all die of the *యిది దిక్కుమాలిన పనికిరాని స్థలము యిక్కడ మేమందరము ప్రాణము విసికి చచ్చేటట్టువుంటిమి. Prior, Tale. I. line 370 uses it for సన్నిపాతము.
Pipe n s గొట్టము, కోవి. or flute పిల్లంగోవి. used for charming snakes పామునాగసరము. that bird's * is very sweet ఆ పక్షి యొక్క కంఠధ్వనిబహుమధురముగా వున్నది. he smoked a * of tobacco సుంగాణి తాగినాడు. a * ofwine నూట యిరువై యారు గాలములు పట్టే వైను సీపాయి. the wind * కంఠనాళము,గొంతు పీకె. blow * కంసలవాడు వూదే గొట్టము.
Pipe-clay n s a kind of white clay, used in makingtobacco-pipes and toher earthen-ware సుద్ద.
Piper n s పిల్లంగోవి వూదేవాడు. you will have to pay the * దీనికి అనుభవమునీకు అవతల తెలియబోతున్నది.
Piping adj weak జబ్బైన. * hot నిండా వేడిగా వుండే.
Pipkin n s చట్టి.
Pippin n s వొకవిధమైన చిన్న. apple అనే పండు.
Piquancy n s సరసము, తీక్ష్ణము.
Piquant adj సరసమైన, తీక్ష్ణమైన.
Piquantly adv సరసముగా, తీక్ష్ణముగా.
Pique n s ( spite, కాపన్ ణ్యము, చలము, అసహ్యము, చీదర. he indulged in *కార్పణ్యము వహించినాడు.
Piqued adj అసహించిన, ఆయాసపడ్డ. See spiteful.
Piquet n s at cards మరియా ్ సనే కాకితాల ఆట. a kind of guard వొకవిధమైనపారావాడు.
Piracy n s సముద్రములోని దొంగతనము.
Pirate n s సముద్రములో తిరిగే దొంగ, దొంగవాడ.
Piratical adj దొంగిలించే.
Pis aller adv ( French ) The last reasource : the last shift :the worst that can befall him ) విధి లేక, వేరే గతిలేక. when every thing elsefails as a * I shall apply to him నాకు వొకటిన్ని కూడిరాక వేరే గతి లేకపోతేఆయనతో వచ్చి చెప్పుకొంటాను. he could not get a horse, and as a * he tooka bullock వాడికి గుర్రము దొరకనందున విధిలేక యెద్దును తీసుకున్నాడు.
Pisces n s మీనరాశి.
Piscivorous adj చేపలను తినే. the crane is * కొంగ చేపలను తినేటిది.
Pish interj ఛీ, ఛీపో.
Pish, pash n s. జావ.
Pismire n s చీమ.
Piss n s మూత్రము. * burnt కంపుకొట్టే, వుచ్చ మరకలు కట్టిన.
Pissing n s అల్పాచమానము, జలబాధ.
Pistachio n s పిస్తాచపండు, అనగా వొకవిధమైన బాదంకాయ.
Pistil n s మిద్దె, దిమ్మె, అనగా పువ్వు నడిమిదిమ్మె.
Pistol n s పిస్తోలు, వొకవిధమైన చిన్న తుపాకి.
Pistole n s అయిదు రూపాయలకు మారే వొక విధమైన బంగారు నాణెము.
Piston n s నీళ్ళు చిమ్మడానకై వుండే చిమ్మన గొట్టములోని శలాకు.
Pit n s గొయ్యి, పల్లము, గుంట, గుంత. a grain * పాతర. the cock * కోళ్ళనుపందెమునకు విడిచే స్థలము. the * in a theatre నాటకశాలలో ప్రజలు కూర్చుండే మధ్యరంగము. the * of the stomach రొమ్ము పల్లము. the arm * చంక. * saw పెద్దరంపము.
Pitapat adv దడబిడలుగా. his heart went * వాడి రొమ్ము కొట్టుకొన్నది.
Pitch n s resin of the pine కీలు. as black as * or as dark as *కారునలుపైన, గాఢాంధకారమైన. in * darkness మహత్తైన చీకటిలో. or elevation ఔన్నత్యము, వున్నతి. which of these hawks flies the highest * ? యేడేగ వీటిలో నిండా వున్నతముగా యెగురుతున్నది. the pipes sounded a high *ఆ పిల్లంగోవులు వుచ్చ స్వరము గలవై మ్రోసినవి. he was sitting on the * ofthe roof వాడు యింటి మొగటిమీద కూర్చుండి వుండెను. to a certain * కొంతమట్టుకు. to a great * మహా. in his time learning was at the highest * వాడి కాలములోవిద్య మహోన్నత దశను పొంది వుండెను. he has fallen to the lowest * ofmisfortune వాడు అతి దరిద్ర దశను పొందినాడు.
Pitcher n s కుండ, చెంబు.
Pitchfork n s పంగలకర్ర, త్రిశూలము.
Pitchy adj కీలుపూసిన, కారునలుపైన.
Piteous adj వ్యసనకరమైన. a *tone దీనస్వరము. hr exciting pity జాలిపుట్టించే,కరుణ పుట్టించే.
Piteously adv దైన్యముగా, కరుణపుట్టేటట్టుగా.
Pitfall n s పడుగొయ్యి.
Pith n s బెండు, నిస్సారము, కూడు, దవ్వ. the * of the palm tree తాటి చెట్టునడిమికూడు. the * of the plantain అరిటిబొందె. or strength చేవ, త్రాణ,దార్ఢ్యము, సారము. a man of * బలాఢ్యుడు. there is no * in his style వాడివాక్కు నిస్సారముగా వున్నది.
Pithily adv స్వారస్యముగా. he answered very * స్వారస్యముగా వుత్తరముచెప్పినాడు.
Pithiness n s స్వారస్యము.
Pithless adj నిస్సారమైన, నీరసమైన, తుచ్ఛమైన.
Pithy adj సారవత్తైన, రసవత్తైన, దృఢమైన. the * citron దూది నిమ్మకాయ. a * expression స్వారస్యమైనమాట, తీక్ష్ణమైనమాట. a * question స్వారస్యమైనప్రశ్న. Proverbs are * expressions సామితెలు స్వారస్యమైన వచనములు.
Pitiable adj కరుణించతగిన, దీనమైన. he is in * circumstances వాడుదిక్కుమాలిన స్థితిలో వున్నాడు.
Pitied adj కరుణించతగిన, దీనమైన.
Pitiful adj కరుణపుట్టించే, దీనమైన. a * story దుఃఖకరమైన కథ. this is a *pretext యిది పనికిమాలిన సాకు. this is a * grammar యిది వొక దిక్కుమాలినవ్యాకరణము.
Pitifully adv or wretchedly దిక్కుమాలిన రీతిగా,or kindly కనికరముగా.
Pitifulness n s కరుణ, కనికరము, జాలి.
Pitiless adj నిర్దయాత్మకుడైన, క్రూరమైన.
Pitilessly adv నిర్దయగా, క్రూరముగా.
Pittance n s బిచ్చము, బత్తెము, మాధోకరము. he left a small * to hischildren వాడు తన బిడ్డలకు స్వల్ప జీవనానికి పెట్టిపోయినాడు.
Pity n s దయ, కరుణ, కనికరము, అనుకంపము, జాలి. he took * upon themవాడికి వాండ్ల మీద దయవచ్చినది. what a * ! అయ్యో పాపము. it is a * he is goneఅయ్యో పోయినాడే.
Pivot n s కీలుతిరిగేమొల, చీల, కీలకము. of a door కుబుసము, వుతక, కూసము.of scissors కత్తెరచీల. he was the * upon which the whole business turnsఅన్నిటికి వీడే మూలము.
Pix n s or circible మూస. or sacred box ప్రసాదము పెట్టే సంపుటము.
Pizzle n s చేకు. bull's * తోలుకొరడా. Addisons's Tatler, No. 216.
Placability n s శాంతము, దయాశుత్వము.
Placable adj శాంతమైన, దయాళువైన.
Placard n s ప్రకటన కాకితము, యిస్తి యార్నామా.
Place n s స్థలము, స్థానము, తావు, చోటు, దేశము. I have lostthe * in the book నాకు అది తప్పినది. I took a * in the ship or inthe coach వాడలో, లేక బండిలో స్థలము మాట్లాడుకొన్నాను. they have no * in his favour వాండ్ల మీద వాడికి దయలేదు. in this * యిక్కడ. in that * అక్కడ. in any * యెక్కడనైనా. in both *sఉభయత్ర. or office ఉద్యోగము. in * of going there అక్కడికి పోకుండా.I went in his * అతనికి బదులుగా పోతిని. he was to them In the * of a fatherవాండ్లకు అతడు తండ్రి మారు తండ్రిగా వుండెను. market * బాజారు, అంగడి వీధి.birth * పుట్టిన చోటు, జన్మభూమి. a halting * మజిలి. a * of worship గుడి, దేవస్థానము. you must not give * to scandal దుషణకు యెడమివ్వవద్దు. a marriage took * yesterday నిన్న వొక పెండ్లి జరిగినది. a hurricane took * గాలి వాన సంభవించినది. what more took * ? యింకా యేమి జరిగెను. if elision took * లోపము వస్తే in the first * మొదట. in the last * కడాపట. in the next *తదనంతరము, అటు తరువాత. he knows his own * వాడి పరువు వాడికి తెలుసును.
Placebo n s or quack medicine సర్వరోగగజకేసరి, సమస్త రోగములను పట్టేఔషధము.
Placed adj వుంచిన, పెట్టిన, వున్న.
Placehunter n s వుమేదువారు.
Placeman n s ఉద్యోగస్థుడు, అనగా సర్కారు వుద్యోగస్థుడు.
Placid adj శాంతమైన, సౌమ్యమైన.
Placidity n s శాంతము, సౌమ్యము.
Placket n s పావడ, కోక.
Plagiarism n s కావ్యచోరత్వము, పదచోరత్వము.
Plagiarist, Plagiary n s. కావ్యచోరుడు, పదచోరుడు. originally this meant amanstealer.
Plague n s మారి, తెవులు, చీడ, పీడ, బాధ, హింస, సంకటము, ఈతి.what a * these mosquitoes are ! అబ్బా యీ దోమలది యేమి వుపద్రవము.the *s of Egypt బామలు, కడగండ్లు, ఈతిబాధలు. In Rev. XVI.21 . ఉత్పాతం.A+.
Plaguily adv తొందరగా, యిది నీచమాట.
Plaguy adj తొందరచేసే పీడించే, యిది నీచ మాట.
Plaice n s వొకవిధమైన చేప.
Plaid n s పప్పిళిగుడ్డ, పూర్వకాలపు. Scotch దేశస్థుల వుడుపు.
Plain adj smooth సమమైన, సాఫైన. or clear స్పష్టమైన. I told him in *English వాడితో పరిష్కారముగా చెప్పితిని. this book is written in a * style యీ గ్రంథము సరళముగా వున్నది. or homely వికారమైన. he came in * clothes వాడు సాధారణమైన వేషముతో వచ్చినాడు. * diet సాధారణమైన భోజనము. she is a very * woman అది కురూపి. his taking this is in * Englishtheft తిరుగుళ్లు లేక చెప్పితే దీన్ని వాడు తీసుకోవడము దొంగతనమే.in * English he was drunk యిన్ని మాటలు యెందుకు, వాడు తాగి వుండెను.
Plaindealer n s నిష్కపటి, సీదామనిషి.
Plaindealing n s నిష్కాపట్యము, అకృత్రిమము.
Plainly adv స్పష్టముగా, విశదముగా, తేటగా. he * saw that this was wrongయిది తప్పని బాగా కనుక్కొన్నాడు. he * said స్పష్టముగా చెప్పినాడు.
Plainness n s నిష్కాపట్యము, స్పష్టత. he used great * of speech స్పష్టముగామాట్లాడినాడు, నిష్కాపట్యముగా మాట్లాడినాడు. he observed the * of the childrenఆ పిల్ల వికారము చూచినాడు.
Plainspoken adj నిష్కాపట్యమైన.
Plaint n s మొర, ఫిర్యాదు. he listened to the * of the bird పక్షుల యేడ్పునువిన్నాడు.
Plaintiff n s వాది, ఫిర్యాది.
Plaintive adj వ్యసనసూచకమైన, దుఃఖసూచకమైన. her * notes దాని శోక స్వనము.
Plainwork n s సాదాపని, సాదాకుట్రపు పని, దర్జీపని.
Plaister n s గుచ్చు, గార, సున్నము. See Plaster.
Plait n s మడత, జడ.
Plaited adj మడిచిన, అల్లిన, జడవేసిన. * work in sewing మడతలు మడతలుగాపెట్టి కుట్టే పని. her * hair దాని జడ. a chair bottom * with rattanపేములల్లిన కరిచి.
Plan n s ( the English word * is commonly used .) ప్లాను, యోచన, యుక్తి,యేర్పాటు, నమూనా, పద్ధతి, చట్టము. of a house or town వొక యిల్లుగాని వూరుగానివ్రాసి వుండే వైఖరి.they came into his * వాడి యుక్తిని వొప్పినారు.
Plane n s సమత, చదరము. an inclined * or slope యేటవాలు. a carpenter'stool చిత్రిక, తోపుడు. or tree వొక విధమైన అడివి వృక్షము. smooth this boardwith a * యీ పలకము చిత్రికతో నున్నగా చెయ్యి.
Planet n s గ్రహము. the Hindu *s are named సూర్యుడు, చంద్రుడు,అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతు. but the Europeanmode of recokoning the Planets is this; Mercury, Venus, the Earth,Mars, Jupiter, Saturn, Georgium-Sidus. The * on which we dwellభూమి. he went to another * ఇతర లోకమునకు పోయినాడు.he was born under a fortunate * మంచి లగ్నములో పుట్టినాడు.he said that his evil * drove him to do this తన గ్రహచారమువల్ల యిట్లా చేసినానన్నాడు.
Planetary adj గ్రహసంభంధమైన. * motion గ్రహచారము, గ్రహగతి. * hourలగ్నము.
Planetstruck adj గ్రహచార గ్రస్తుడైన, గ్రహచారము పట్టిన.
Plank n s పలక, బల్ల.
Planked adj పలకలు వేసిన, బల్లలు కూర్చిన.
Planking n s బల్ల కూర్పుపని.
Planned adj యోచించిన యుక్తి చేసిన. this house is * by himయిది అతను ప్లాను వేసిన యిల్లు.
Plant n s చెట్టు. a young * నారు. a creeping or climbing * తీగె.a spreading * అల్లే చెట్టు. an annual * ఓషధి, ఒక కాపుతో యెండి పొయ్యే చెట్టు.an oak * or cudgel దుడ్డుకర్ర, బడితె.
Plantain n s అరటిపండు, అరటికాయ. a * tree అరటిచెట్టు. the cow * బొంతఅరటి పండు, బొంత, అరటికాయ.
Plantation n s తోట, వనము. or colony కొత్తగా పోయి చేరికట్టుకొన్న ఖండ్రిగ.
Planted adj నాటిన, పెట్టిన, వుంచిన. she was * at his side అతని పక్కనునిలుచుండి వుండినది.
Planter n s అన్య దేశములో పోయి చేరినవాడు. the * of this garden యీ తోటవేసినవాడు. as a sugar * &c. పల్లెటూరిలో చెరుకు గాని పత్తిగాని నీలి గాని పండించి వత ్ కపుపని చేసే వ్యవహారి.
Plash n s మడుగు, నీళ్ళమడుగు.
Plashy adj తడిగా వుండే, చెమ్మగావుండే, మడుగుగావుండే.
Plaster n s గచ్చు, గార, సున్నము. for a sore మలాము, ప్లాస్త్రి. an imagemade of * గచ్చుబొమ్మ, సుధావిగ్రహము.
Plastered adj గచ్చుపూసిన, అలికిన. a dress * over with gold laceవికారముగా సరిగవేసిన వుడుపు.
Plasterer n s గచ్చుపూసేవాడు.
Plastic adj సృష్టించే, సృజించే, నానా రూపములను కలగచేసే.the * hand of God formed these creatures ఈశ్వరుడి యొక్క సృష్టించే శక్తి వల్ల యీ జంతువులు కలిగినవి. the * centre or incipient idea ( coleber.) సంస్థానముSee note on that word.
Plat n s అల్లిక, జడ. * or plot of ground వొకతుండునేల, చదరముగా వుండే నేల.a grass * పసరికపట్టు.
Plate n s రేకు, తగుడు, బిళ్ళ, తట్ట, తబుకు, కంచము. a chine * పింగాణిచిప్ప. a * of fresh leaves stitched together విస్తరాకు. or picture పుస్తకములో అచ్చువేసివుండే పఠము. he bought much * వెండి బంగారు మొదలైన పాత్ర సామానులునిండా కొన్నాడు. he produced the forged notes and the *s తప్పు నోట్లనున్నువాటిని వేసిన పడి అచ్చులనున్ను హాజరు చేసినాడు.
Plated adj వెండి మొలాము చేసిన.
Platform n s of earth మిట్ట, దిబ్బ, తిన్నె. a * raised upon posts ముంచె. or scaffold శారము. a * erected on the floor తిన్నెవలె యెత్తుగా పలకలతో కట్టినది.
Platina n s వెండివంటి వొకవిధమైన లోహము.
Platonic adj Plato అనే పండితుని మతానుసారమైన, అనగా యింద్రియనిగ్రహముగల, ఆశవున్నప్పటికిన్ని అనుభవేచ్ఛలేని. * love అనుభవేచ్ఛలేనిఆశ. he has a * affection for her వాడికి దానిమీద అతి వ్యామోహము వున్నది గాని దాన్ని అనుభవించవలెననే బుద్ధి యెంత మాత్రము లేదు.
Platoon n s చవుకముగా నిలిచే సిఫాయీల చిన్నతుకిడి.
Platter n s తాంబాళము, పళ్లెము. of earth సానికె. made of leaves విస్తరి,విస్తరాకు.
Plaudit n s స్తోత్రము, స్తవము.
Plausibility n s బయటికి న్యాయముగా వుండడము, చూపుకు బాగుగా వుండడము.the * of his story made me believe him వాడి మాటల సొంపు నన్ను నమ్మేటట్టుచేసినది.
Plausible adj పైకి న్యాయముగా వుండే, చూపుకు బాగా వుండే, సుముఖమైన.this is a * reason యిది చూపుకు న్యాయముగానే వున్నది. he is a very * man వాడుచూపుకు నిండా పెద్ద మనిషిగా వున్నాడు.
Plausibly adv పైకి న్యాయముగా, చూపుకుబాగా. he spoke very * వాడుమాట్లాడినది చూపుకు న్యాయముగానే వుండినది.
Play n s ఆర, క్రీడ, కేళి, లీల. the children were then at *అప్పట్లో బిడ్డలు ఆడుకొంటూ వుండిరి. or comedy నాటకము, కేళిక. dice * జూదము.this is foul * యిది అన్యాయము. he met with foul * వాడికి మోసము వచ్చినది.అనగా చంపబడ్డాడు. give him fair * వాణ్ని తొందర పెట్టక, రచ్చపెట్టక.a * upon words శ్లేష, ద్వ్యర్థి శబ్ద చమత్కారము. she scolded him in * వాణ్ని ఆట్లాటకు తిట్టినది, వూరికె తిట్టినది. the school is now in full * ఆ పల్లెకూటము యిప్పుడు వుచ్ఛ్రాయముగా వున్నది. in this letter he used some bye *యీ జాబులో వాడు కొంత అన్యాపదేశముగా వ్రాసినాడు. Bear's * మోటుసరసము.his knowledge of the language came into * on this journey వాడికి ఆ భాష తెలిసివుండడము యీ ప్రయాణములో పనికి వచ్చినది.
Playbook n s నాటక గ్రంథము.
Playday n s ఆటవిడుపు దినము.
Player n s ఆడేవాడు, నటుడు. the *s on flutes పిల్లంగోవులు వూదేవాండ్లు. orgamester జూదరి, జూదగాడు.
Playfellow n s సంగడిగాడు, సంగాతి.
Playful adj ఆట్లాడే ఉల్లాసముగల. this child is very * యీ బిడ్డ వూరికె ఆట్లాడుతూవుంటున్నది. a kitten is * పిల్లి కూన వూరికె ఆట్లాడేటిది.
Playfully adj సరసముగా.
Playfulness n s సరసము ఉల్లాసము వినోదము.
Playhouse n s నాటకశాల.
Playing n s ఆట.
Playmate n s చెలికాడు, నేస్తగాడు, చెలికత్తె.
Plaything n s or toy ఆట్లాటసామాను. this boat is of no use it is a mere* యీ పడవ వూరికె ఆట్లాడుకొనేటిదే గాని పనికి వచ్చేటిది కాదు.
Playwright n s నాటకము చెప్పిన కవికి పెట్టే హాస్యనామము యెగతాళి పేరు.
Plea n s సాకు హేతువు ఫిర్యాదు. he excused himself for this theft onthe * of poverty తాను పేదవాడనే సాకు చెప్పి మన్నించవలెనన్నాడు on the * ofbeing his relation I asked him to assist me నాకు బంధువైన హేతువును పట్టినాకు సహాయము చేయమన్నాను.
Pleader n s వకీలు.
Pleading n s మనవి, అర్జీ. special * తర్కము, ఉపన్యాసము, వాదము.
Pleasant adj మంచి, యింపైన,రమ్యమైన,మనోహరమైన,సరసమైన, ఉల్లాసమైన* weather మంచి కాలము. a * smell మంచి వాసన, దివ్యమైన వాసన. a * tasteమంచి రుచి. as * place మంచి స్థలము, రమ్యమైన ప్రదేశము. a * manఉల్లాసపురుషుడు. he made a * remark సరసముగా వొక మాట చెప్పినాడు.
Pleasantly adv వేడుకగా, వినోదముగా, సరసముగా, ఉల్లాసముగా.
Pleasantry n s హాస్యము, యెగతాళి, సరసత.
Pleasing adj సంతోషకరమైన, సరసమైన, రమ్యమైన, మనోహరమైన.
Pleasingly adv సరసముగా, వేడుకగా, వినోదముగా.
Pleasurable adj సరసమైన, మనోహరమైన.
Pleasure n s సంతోషము, సుఖము, యిష్టము. he takes * in riding వాడికి గుర్రపు సవారి మీద యిష్టము. the divine * ఈశ్వరేచ్ఛ. you may doyour * నీకు యెట్లా సమ్మతో అట్లా చెయ్యి. Sir your * అయ్యా తమ చిత్తము.he may stay or go at * వాడిష్టము వాడు వుంటే వుండనీ పోతే పోనీ. do you think God will take * in this act యిందుకు దేవుడు వొప్పుననుకొంటివా.a woman of * బోగముది. a man of * విటగాడు.
Pleasure-ground n s శృంగారవనము, విహారస్థానము.
Pleasure-house n s విలాస గృహము.
Pleasure-party n s విహారము,విహారముగాపోయినవాండ్లు. they wenton a * విహారమునకు పోయిరి. his time was all spent in pleasure partiesవాడి కాలమంతా విహారములతోనే సరిపోయినది.
Pleat n s See Plait.
Plebeian n s నీచుడు, సామాన్యుడు.
Pledge n s కుదువ, తాకట్టు, పూట, జామీను. the * became forfeitor he forfeited his * కుదువ, ముణిగిపోయినది, ఆడినమాట తప్పినాడు.a man's wife and children are *s for his behaving properly వాడి మంచినడకకు వాడి పెండ్లాము బిడ్డలే పూటగా వున్నారు. అనగా పెండ్లాము బిడ్డలు గలవాడుయోగ్యముగా నడుచుకోక విధిలేదని అర్థము.
Pledget n s పుంటిలో యెక్కించే వత్తి.
Pleiades n s సప్త ఋషి నక్షత్రములు.
Plenarily adv పూర్ణముగా, సంపూర్ణముగా.
Plenary adj పూర్ణమైన, సంపూర్ణమైన.
Plenasm n s అధికముగా చెప్పడము, వొకటిని పూర్జితపరచడానకై పరిపరి విధములుగాచెప్పడము.
Plenipotentiary n s సర్వాధికారము జెందిన రాయబారి.
Plenished adj నించిన, సంపూర్ణమైన.
Plenishing n s or furniture సామాను, గృహోపకరణములు.
Plenitude n s సంపూర్ణత్వము.
Plenteous adj విస్తారమైన, అమితమైన.
Plenteously adv విస్తారముగా, అవారిగా.
Plenteousness n s విస్తారత, అవారి.
Plentiful adj విస్తారమైన, అమితమైన.
Plentifully adv విస్తారముగా అవారిగా.
Plenty n s విస్తారము, సమృద్ధి, యథేష్టము. this water is * యీ నీళ్ళు చాలునుయీ నీళ్లు యథేష్టము. there is * చాలును యథేష్టము. a year of * సుభిక్షముగావుండే సంవత్సరము. he lives in * ఐశ్వర్యవంతుడై వున్నాడు. there are wells in *బావులు చాలా వున్నవి. the horn of * అక్షయపాత్ర.
Plethora n s రక్తపిత్తము. ( Wilson ) అధిక బలుపుచేత ఆపసోపాలు పడే రోగము.that country is suffering under a * of riches ఆ దేశము అధిక ఐశ్వర్యముఅధికమైనందువల్ల ప్రజలకు సంకటముగా వున్నది.
Plethoric adj అధిక బలుపు చేత ఆపసోపాలు పడే.
Pleurisy n s రొమ్ము నొప్పి, పార్శ్వశూల.
Pleuritic adj పక్కశూల సంబంధమైన. a * disease పక్కశూల నొప్పి.
Plight n s దశ, గతి, స్థితి. he is in good * మంచి స్థితిలో వున్నాడు.he is in bad * దుర్దశలో వున్నాడు.
Plinth n s స్తంభము యొక్క అడుగు భాగము.
Plodder n s నిండా పాటుపడేవాడు, పరిశ్రమ పడేవాడు.
Plodding adj పాటుపడే, పరిశ్రమపడే, వూగుతూ నడిచే, కాళ్ళీడుచుకొంటూ నడిచే,మొండి అయిన, ఉల్లాసము లేని.
Plot n s or ground నేల, వొక తుండునేల. a garden * చెట్లు వేసి వుండే తుండు.scheme దురాలోచన కుయుక్తి వుపాయము బందుకట్టు కుట్ర. of a play నాటకముయొక్క యెత్తుగడ. a grass * పసరికపట్టు. the * is thickening కలహముముదురుతున్నది. he came into the * వీడున్ను ఆ కుట్రలో చేరినాడు.
Plotter n s కుట్రలు పన్నేవాడు.
Plough n s నాగలి, అరక. a drill * గొర్తి, జడ్జిగంగలగొర్తి ,వెదగొర్రు. the shaft of beam వేడికోల, యేడికోల. * tail మేడి. * share కర్రు, నాగేటికర్రు.
Ploughing n s దుక్కి. * oxen దుక్కి యెద్దులు. a fall of rain sufficient for *దుక్కి వర్షము.
Ploughland n s సాగుబడి అయ్యే నేల.
Ploughman n s దున్నేవాడు.
Ploughshare n s కర్రు.
Pluck n s a pull పీకుపీకినది. at a single * వొక పీకులో. heart liver &c.పేగులు గుండెలు మొదలైనవి. or bravery ధైర్యము, యిది నీచమాట.
Plucked up adj పెళ్ళగించిన, పీకిన.
Pluckless adj ధైర్యము లేని, పిరికియైన.
Plucky adj Brave, గడుసయిన.
Plug n s బిరడా.
Plum n s పండు, రేగుపండు. యీ పేరు కొన్ని పండ్లకు చెల్లుతున్నది.a * pudding ద్రాక్ష పండ్లు వేసి పాకము పట్టిన వొక విధమైన ఫలాహారము. * cake ద్రాక్షపండ్లు వేసి చేసిన ఫలాహారము. or dried grape కిస్మిస్ పండు అనగాయెండపెట్టి పక్వము చేసిన ద్రాక్షపండు. a greengage * An Orleans * యివి రెండుతరహాల శ్రేష్ఠమైన పండ్లు, L 100,000. లక్షపవున్లు. his father died worth a *( Johnson ) వాడి అబ్బ లక్షాంతరాలు పెట్టి చచ్చినాడు.
Plumage n s ఈకెలు, రెక్కలు. peacock has beautiful * నెమలికి ఈకెలుఅందము.
Plumb n s సీసపుగుండు. a * line నీళ్ళ లోతు చూడడానకున్ను నీరుమట్టముకట్టడానకున్ను తాడుకట్టి వుండే సీసపు గుండు.
Plumbago n s black lead వల్లసీసము.
Plumber n s సీసపు పని చేసేవాడు.
Plume n s ( a feather of birds ) ఈకె, తురాయి.
Plumed adj తురాయి గల. his * head తురాయి గల శిరస్సు.
Plummet n s సీసపుకడ్డీ నీళ్ళలోతు చూడడానికిగాని నీరు మట్టము కట్టడానికి గానివుపయోగించే సీసపు గుండు.
Plump adj పుష్టిగావుండే, లావుగావుండే, బలిసిన, స్థూలమైన, కొవ్విన.
Plumply adv ( downright ) స్పష్టముగా.
Plumpness n s పుష్టి, బలుపు.
Plumy adj ఈకెలుగల, రెక్కలుగల.
Plunder n s కొల్ల, దోపుడు, చూర, దోచుకున్న వస్తువు. he considered thesehorses fair * యీ గుర్రములను దోచుకొన్నది సహజమేనన్నాడు. they divided the* దోచుకొన్నదాన్ని పంచుకున్నారు.
Plundered adj దోచుకొన్న, దోచుకోబడ్డ.
Plunderer n s దోచుకొన్నవాడు, కొల్లబెట్టినవాడు.
Plunge adj ముంచిన, మునిగిన,నిమగ్నమైన.
Plural n s బహువచనము. men is a * noun.
Pluralist n s రెండు మూడు మాన్యములు అనుభవించే పాదిరి. paley saysThough I am a great * in preferment I am a greater * in children నాకు మాన్యాలు నిండా వుంటేనేమి తినేటందుకు శానా మంది వున్నారు.
Plurality n s అనేకత్వము, బహుత్వము, ద్వైతము. Calc Quly Rev. No. VIII.p.370 .
Plush n s వొకవిధమైన బొచ్చుగల మొఖమల్.
Pluto n s యముడు, కాలుడు.
Plutus n s కుబేరుడు.
Ply n s a bend వంపు, మడత. there were several plies in the cloth ఆగుడ్డలో శానా మడత లుండినవి.
Plyers n s అనగా శ్రావణము.
Pneumatic adj వాయు మయమైన,వాయువు చేత చలించే, వాయు విషయమైన. orspiritual సూక్ష్మమైన.
Pneumatics n s వాయువిద్య, వాయు శాస్త్రము.
Poacher n s ఒడ్డు వేసుకొని తిరిగే దొంగ, అనగా కట్టు చేసివుండే పక్షులు,మృగాలు, చేపలు మొదలైనవాటిని దొంగలించిడానికై వొడ్డు వేసుకొని తిరిగేవాడు.
Pock n s ముత్తెము. * marked అమ్మవారు మచ్చలు గల.
Pocket n s జేబు, కీసా. * money చేతి రూకలు. a * dictionary చిన్న డిక్షనరీ, నిఘంటువు. a * knife జేబులో పెట్టుకొనే కత్తి. money out ofmy ఒ నా చెయి విడిచి యిచ్చిన రూకలు. he was ten pounds (L 10) out of * by thisవాడికి యిందువల్ల నూరు రూపాయలు నష్టము వచ్చినది. you must put your pride inyour * నీ గర్వాన్ని కట్టిపెట్టు. * money బిడ్డలకు తల్లిదండ్రులుగాని, ఆప్తులుగాని లెక్కలోకి తేకుండా ప్రీతి చేత యిచ్చే రూకలు.
Pocket-book n s యదాస్తు పుస్తకము, యిందులో వాడుకగా బాంకు నోట్లు వుంచుతారు.
Pocket-glass n. s. చేతి అద్దము, చిన్నదుర్భీను,యేదైనవొకవస్తువునుచూడ
Pocky adj పుండ్లు పట్టిన.
Pococurante n s నిశ్చింతగా వుండేవాడు.
Pod n s పొట్టు, తోలు,కాయ, బొందెము. the * of French beans చిక్కుడిబొండెము. * of cotton దూదికాయ. pease in the * పొట్టు తీయని బటానీలు.tamarinds in the * వొలవని చింతపండు.
Poem n s కవిత్వము, కావ్యము.
Poesy n s కవిత్వము.
Poet n s కవి, కవీశ్వరుడు.
Poetaster n s కుకవి, నీచకవి.
Poetess n s కవిత్వము చెప్పే స్త్రీ.
Poetical adj కావ్య సంబంధమైన.
Poetically adv కావ్య సరణిగా.
Poetry n s కవిత్వము, కావ్యము.
Poh interj చీపో.
Poignancy n s తీక్ష్ణత, చురుకు. from the * of this reflection యీ తలంపుయొక్క వేదనవల్ల. the * of pepper మిర్యాల కారము.
Poignant adj తీక్ష్ణమైన, చురుకైన. he used * language బహుతీక్ష్ణమైన మాటలుమాట్లాడినాడు. * distress మహత్తైన సంకటము.
Poiguard n s బాకు.
Point n s మొన,కొన, అగ్రము,బిందువు. a steel * for engraving పోగర. the very * కొట్టకొన. but now to the * మెట్టకు ముఖ్యమేమంటే. the troops landedat the * తండుకొస భూమిలో దిగినది, కొసభూమి యనగా సముద్రములో నాలికవలెపోయివుండే భూమి, రావి ఆకు కొనవలె వుండే భూమి. matter విషయము, ప్రమేయముసంగతి. regarding this * యీ విషయమును గురించి. this is a very important *యిది అతి ముఖ్యమైన విషయము. this is the great * యిది ముఖ్యము. this isno great * యిది వొక అతిశయము కాదు. he saw the matter in another * ofview అతనికి వేరే విధముగా తోచినది. in a legal * of view ధర్మ శాస్త్ర ప్రకారముగా.I do not see the * of this verse యీ పద్యము యొక్క కిటుకు నాకు తెలియదు.I will make a * of doing this నేను దీన్ని అవస్యము చేస్తున్నాను. I wish youwill come to the * పరిష్కారముగా చెప్పు. a * of time నిమిషము. just at that * Iarrived ఆ సమయానికి వస్తిని. in * of fact మెట్టుకు. this is a case in * యిదిసరియైన వుదాహరణము. this is a quotation in * యిది తగిన వుదాహరణము. the *of honour మాసము. they consider it a * of honour never to surrendertheir arms ఖడ్గనష్టము మాన నష్టమని అనుకొంటారు none. equal him in * oflearning విద్యావిషయములో వాడికి యెవడు యీడు లేదు. he was at the * ofdeath వాడు చచ్చేగతిగా వుండినాడు,వానికి కాలము ముగిసినది. I was on the * oftelling him వాడితో చెప్పక తప్పినాను. a cow on the * of calving యీనమోపుదలగా వుండే ఆవు. he was armed at all * s వాడు ఆయుధసన్నద్ధుడై వుండెను.he carried his * జయించినాడు, గెలిచినాడు. a mathematical * బిందుdiacritical *s used in Persian ఫార్సీ భాషలో అక్షరమునకు కింద మీదవేసే అకార, ఉకారాది సంజ్ఞలుగా వుండే చుక్కలు. every * was properly guardedఆయా స్థలములో బందోబస్తుగా పారా పెట్టి వుండెను. the eight *s of the compassఅష్టదిక్కులు. the intermediate eight *s E. N. .E. .&c. .విదిక్కులు. a string with a tag దూర్చడానికి సులభముగా మొనకు సీసపుకూచి గొట్టము వేసిన తాడు. Point blank స్పష్టముగా, సరిగ్గా.
Pointed adj మొనగల, తీక్ష్ణమైన. the spear was * brass ఆ బల్లెపుకొనకు విత్తళి వేసి వుండినది. a * remark యుక్తిగా చెప్పినమాట.
Pointedly adv యుక్తిగా, పొడుపుగా.
Pointer n s వొక విధమైన కుక్క, అనగా వేటలో తీతువపక్షిని వేటగాడికి పండుకొని గురి చూపే కుక్క.
Pointless adj మొనలేని, నీరసమైన, జబ్బైన.
Poise n s బరువు, భారము, సరిబరువు, సరి తూనిక.
Poison n s విషము.
Poisoner n s విషము పెట్టేవాడు, చెరిపేవాడు.
Poison-nut n s ( ratsbane nux vomica ) ముష్టి గింజ.
Poisonous adj విషసంబంధమైన, విషమైన. a * snake మంచి పాము.
Poisonously adv విషముగా.
Poize n s See Poise.
Poke n s or pocket సంచి, తిత్తి. he bought a pig in a * ( Johnson)సొమ్మును చూడక కొనుక్కొన్నాడు, అనగా గుడ్డితనముగా వొప్పుకొన్నాడు, విచారించకవొప్పుకొన్నాడు.
Poker n s నిప్పును కుళ్ళగించే యినపకోల.
Polar adj ఉత్తర దక్షిణకేంద్ర సమీపమైన, ఉత్తరదక్షిణ కేంద్ర సమీపమందువుండే, ధ్రువ సంబంధమైన . the * star ధ్రువ నక్షత్రము.
Polarity n s కేంద్రాభిముఖ్యత, ధ్రువాభిముఖ్యత.
Polarization n s కేంద్రాభి ముఖ్యతను కలగ చేయడము, ధ్రువాభి ముఖ్యతనుకలగచేయడము. the iron was rubbed with a magnet to produce *యినుముకు వుత్తరాభి ముఖత్వము రావడానికై కాంతరాయితో రాచబడుతున్నది.
Pole n s కంభము, బొంగు. he pushed the boat along with a pole ఆపడవను గడవేసి తోసినాడు. the bag was borne by two men on a pole ఆ మాటను యిద్దరు దండె కర్రను మోసుకొని పోయిరి. these two things are not alikethey are far as the * s asunder ఆ రెండు సమానములు కావు. కాశి రామేశ్వరమువలె వున్నవి. the * of carriage నొగ. the * of a palankeen పల్లకి దండె. tent *s గుడారపు బొంగులు in measuring అయిదున్నర గజమునేల. asquare * of land వొక గుండభూమి. the north * ఉత్తరధ్రువము. from * to *సర్వత్ర, నాలుగుతట్లా, లోకమంతా, యావద్భూమండలమందు. the south * దక్షిణధ్రువము. a * with a hook to pull down branches దోటి
Poleaxe n s గండ్రగొడ్డలి, కుకారము.
Polecat n s చెడ్డకంపు కొట్టే వొక జంతువు.
Polemic n s వేదాంతవాదము చేసేవాడు.
Polemic, Polemical adj ఘర్షించే, తర్కించే, వాదించే.
Polemicks n s వేదాంత విషయమైన, తర్క శాస్త్రము, యిది వేదాంతములో వొకభాగము.
Polestar n s ధ్రువనక్షత్రము. she was the * of his hopes వాడి ప్రాణమంతాదాని మీద వుండెను.
Police n s ( English words పోలీసు alone is used ) పోలీసు. * office పోలీసు కచ్చేరి. * officers or men బంట్రోతులు.
Policy n s తంత్రము, యుక్తి, యోచన, ఉపాయము, నీతి. this is excellent * యిది దివ్యమైన యుక్తి.this is bad * యిది నీతి కాదు. crooked * కుయుక్తి. shortsighted * అవివేకము. a warrant for money అపాయాభయపత్ర నిర్ణయము, దీన్నిబీమా అని అంటారు. in Scotch. an enclousure పెరడు.
Polish n s మెరుగు. I remarked the * of their manners వాండ్ల నడితినాణ్యమును లేక నాగరీకమును కనుక్కొంటిని.Polished, adj. మెరుగుబెట్టిన, మెరుగుయెత్తబడిన, ప్రకాశించే. a * languageదిద్ది చక్క పెట్టబడ్డ భాష. * manners నాగరీకమైన నడకలు.
Polite adj సన్మర్యాదగల, శిష్ట, సభ్య ,నాగరీకముగా వుండే. a * man మర్యాదస్థుడు.they are not * వాండ్లు మోటు మనుష్యులు. he was very * to us మాకు నిండామర్యాద చేసినాడు.* learning సాహిత్యవిద్య. Addison was a * scholar ( thesesense is old fashioned ) అతడు సాహిత్య జ్ఞాని.
Politely adv మర్యాదగా, సన్మానముగా.
Politeness n s మర్యాద, సన్మానము.
Politic adj prudent, artful, cunning, వివేకముగల, తెలివిగల,చమత్కారమైన, జాగరూకతగల, ఉపాయముగల, యుక్తిగల, తంత్రము గల. this is not * యిది యుక్తి కాదు, ఆలోచన కాదు. the art * రాజ్య తంత్రము, దొరతనము యొక్క సంచు. he is a * man వాడు తంత్రవాది. See Polticks.
Political adj వ్యవహార సంబంధమైన, రాజ్యాగ సంబంధమైన, దొరతనముతో చేరిన. *affairs రాచకార్యము. a * adviser మంత్రి. a * scheme యుక్తిగా చేసిన తంత్రముor cunning నేర్పుగల,చమత్కారముగల. * economy రాజ్య పరిపాలనాతంత్రము, రాజ్యపరిపాలనను గురించిన శాస్త్రము. A * resident స్థానాపతి అన్యసమస్థానములో నుంచివచ్చి యుండే స్థానాపతి.
Politically adv వ్యవహారరీత్యా. * a man's wife is nobody వ్యవహారరీత్యావొకని భార్య వొక లెక్క కాదు, దాన్ని వొక విషయముగా పెట్టుకోకూడదు.
Politician n s వ్యవహారవేత్త, తంత్రజ్ఞుడు, యుక్తిశాలి, రాచకార్యము లెరిగినవాడు.
Politicks n s the science and art of government రాచకార్యము.unauthorized talk about government రాజ్యాంగమును గురించిన ముచ్చట. thehistory of the moment ప్రస్తుతములో రాజ్యభారము జరిగే వైఖరి, ప్రస్తుతమురాజ్యాంగము పడే పాట్లు.
Polity n s రాజ్యాంగము, రాజ్యతంత్రము, రాజ్య పరిపాలన. when a warhappens it intereferes with the * of the country యుద్ధముసంభవించేటప్పటికి రాజ్యపరిపాలనకు వ్యత్యయము వస్తున్నది.
Polka n s a wild sort of dance తాండవభేదము, గంతులు.
Poll n s the head తలకాయ. register పేర్ల పట్టీ. అనగా యింగిలండులోపార్లేమెంటుకు మెంబరులను యేర్పరచడమునకై ఆయా యిలాఖాలో వుండే దొరలువొక స్థలానికి వచ్చి ఫలానివాడు తనకు సమ్మతియని చెప్పి తమ పేర్లను వ్రాయించిపొయ్యేపట్టీ. or parrot చిలుకకు ముద్దు పేరు.
Pollard n s tree కొమ్మలు నరికిన చెట్టు, బోడి చెట్టు, స్థాణువు. or fine flourనూకలు.
Pollaxe n s గండ్ర గొడ్డలి.
Pollen n s పుప్పొడి.
Polltax n s తలకట్టువరి, తలపన్ను.
Polluted adj చెరపబడ్డ, భ్రష్టైన, అపవిత్రమైన.
Pollution n s అపవిత్రత, అశుచి, అంటు, భ్రష్టత్వము.
Polt n s of a Turkey సీమకోడి or slight blow చీటిపోటు. a * with theelbow మోచేతిపోటు. to give a * నెట్టుట.
Poltroon n s పిరికిబంటు, కోచ.
Poltroonery n s పిరికితనము.
Polyanthus n s వొక విధమైన పుష్పము.
Polygamy n s బహుభార్యాత్వము,పెండ్లి మీద పెండ్లి చేసుకోవడము. he lives in* వాడు అనేక భార్యలు కలవాడై వున్నాడు. * is legal in this countryయీ దేశములో న్యాయముగా పెండ్లి మీద పెండ్లి చేసుకోవచ్చును.
Polyglot n s బహుభాషా గ్రంథము అనగా అనేక భాషలలో భాషాంతరముగల Bible గ్రంథము.
Polygon n s అనేక కోణములు గల వస్తువు.
Polygonal adj అనేక కోణములు గల.
Polypheme n s నడినెత్తిని కన్నుగల వొక రాక్షసుని పేరు.
Polypus n s a disease నానా రోగము, ముక్కుకు తగిలే వొక రోగము. an animalఅనేక కాళ్ళుగల వొక జల జంతువు. దీన్ని నెగడు తంతు నాగమని అంటారు
Polysyllabic adj అనేక అక్షరములుగల.
Polysyllable n s అనేక వర్ణములు గల పదము, అనేక అక్షరములు గల శబ్దము.
Polytechnick adj నానా యుక్తులుగల.
Polytheism n s బహు దేవతో పాసకత్వము అనేక దేవుండ్లను కొలిచే మతము.
Polytheist n s అనేక దేవుండ్లను కొలిచేవాడు. he is a * వాడికి అనేక దేవుండ్లు Christrians are not *s ఒకే దైవమును పూజిస్తారు.
Pomade n s జవ్వాదివంటి పరిమళ ద్రవ్యము, సుగంధవస్తువు.
Pomander n s అత్తరుబిళ్ళ, వొక విధమైన కదంబపొడి.
Pomatum n s జవ్వాదివంటి పరిమళ ద్రవ్యము.
Pomegranate n s దాడిమ పండు.
Pomelnos n s పంపరమాను పండు.
Pomfret n s (or pamflet a sort of turbot) the black sort చందువాయి చేప. the white * మేవ చేప బొచ్చె.
Pommel n s of a sword పిడి. of a saddle జీని యొక్క ముందరి గుబ్బ
Pomp n s జంభము, డంభము, ఆడంబరము. with vast * ఒడ్డోలకముగా.
Pompion n s or Pumpkin గుమ్మడి కాయ.
Pomposity n s జంభము, డంభము, ఆడంబరము.
Pompous adj జంభమైన, డంభమైన, ఆడంబరమైన.
Pompously adv జంభముగా, డంభముగా, పటాటోపముగా.
Pompousness n s జంభము, డంభము, పటాటోపము.
Pond n s గుంట కొలను కోనేరు పడియ పల్లము.
Ponderasity n s గురుత్వము, గరిమ, భారము .
Ponderous adj బరువైన, భారముగల.
Ponderously adv బరువుగా, భారముగా.
Ponderousness n s గురుత్వము, గరిమ, భారము.
Poney n s టకణా, పైగో మట్టము . an Acheen * అచ్చు మట్టము.
Pongal n s ( Name of a Tamil feast in December January ) పొంగలి పండుగ, సంక్రాంతి పండుగ.
Poniard n s బాకు, కటారి.
Pons Asinorum n s a difficult question or riddle వ్యాసఘట్టము.
Pontiff n s a కటారితో పొడిచి చంపుట.
Pontifical adj ప్రధానగురు సంబంధమైన. the * palace పోపుగారి నగరు. he wasdressed in *s ప్రధాన గురు పీఠ సంబంధమైన వుడుపును వేసుకొని వుండెను.
Pontificate n s పోపుత్వము. after he came to the * అతనికి పోపుత్వమువచ్చిన తరువాత. during his * అతను పోపుగా వున్నప్పుడు.
Ponton n s పడవవంతెన, పడవ సేతువ అనగా అవసరముగా యేరు మొదలయిన వాటిని దాటడానకై వంతెనవలె చాలుగా నిలిపిన పడవలు.
Pony n s పై గోమట్టము టాకణా an Acheen * అచ్చుమట్టము.
Pooh interj పో, ఛీపో.
Pool n s మడుగు, పడియ. there was a * of blood on the floor నేల నెత్తురు మడుగు కట్టినది.
Poop n s వాడియొక్క వెనకటి భాగములో యెత్తుగా వుండే యిల్లు.
Poor adj బీదయైన, పేదయైన, దరిద్రుడైన. a * man దరిద్రుడు. the * దరిద్రులు, బీదలు, భిక్షగాండ్లు. this is a * reason యిది వొక పిచ్చి సమాధానము.this is * food .చవిసారము లేని కూడు. * land నిస్సారమైన భూమి. I have a * opinion of him వాడు అప్రయోజకుడని నాకు తోస్తున్నది. the poor's houseధర్మసత్రము. Poor's rates ధర్మానికి గ్రామ సముదాయములో వసూలు చేసే రూకలు .the horse is very * గుర్రము బక్కపలచగా వున్నది. she fell down * creatureపాపము అది పడ్డది. he submitted * fellow పాపము వొప్పుకొన్నాడు. the * king isnow quite forgotten పాపము ఆ రాజును యిప్పుడు మరిచినాడు .he took her forricher or *er యెంత భాగ్యము వచ్చినా యెంత బీదరికము వచ్చినా దాన్ని చెయ్యి విడవనన్నాడు, యిది వొక వివాహ సూత్రము. Poor's house (Infirmary ) ధర్మ సత్రము బీదలను ఆదరించే సత్రము. And * I was left there ( Addison's Spect. No. 190.) అయ్యో నేను అక్కడ వొంటిగా నిలిచిపోతినే.
Poorly adv జబ్బుగా. the house is * built ఆ యిల్లు దిక్కుమాలిన రీతిగాకట్టివున్నది. he is * clothed పనికిమాలిన గుడ్డలను కట్టుకొన్నాడు. the fort was *defended ఆ కోటలో వుండినవాండ్లు బాగా నిభాయించలేకపోయిరి. he provided them* for the hourney వాండ్ల ప్రయాణానికి చక్కగా సరఫరా చేయలేదు. I was * al lyesterday నిన్నంతా నాకు వొళ్ళు కుదురులేదు. he looks * వాడికి వొళ్ళుకుదురులేనట్టు వున్నది.
Poorness n s బీదరికము పేదతనము దరిద్రత నీరసము నిస్సారము జబ్బు.
Poorspiritedness పిరికితనము, అధైర్యము
Poorspiritted adj పిరికి ధైర్యము లేని.
Pop n s టప్ అనే ధ్వని.
Pope n s ( the bishop of Rome ) గురువు. ప్రధాన గురువు రోమన్ కేతోలిక్కుమతమునకు పోప్ అనే ప్రధాన గురువు బ్రహ్మణులకు శంకరాచారి స్వాములవలెరోమన్కేతోలిక్కు మతస్థులకు Pope ప్రధాన గురువు. .Guru .evidently is the tru word :" Lady S who hated the Bishop of London said regarding him toSir Robert Walpole Well how does your pope do ? Madam hereplied ." .He .is .my .pope .and .shall .be .my .pope .: .every body has somepope or other." Walpole.
Popedom n s పోప్ అనే ప్రధాన గురువు యొక్క అధిపత్యము.
Popery n s రోమన్ కేతోలిక్కు మతము యిది తిరస్కార శబ్దము.
Popeseye n s ( Johnson ) తొడమాంసము నడమవుండే కొవ్వు.
Popgun n s పిల్లకాయ ఠప్పని ధ్వనించేటట్టు విసిరే కాకితపు మడుపు. a word ofscorn for a musquet పనికిమాలిన చిన్న తుపాకి. this is a mere * affair యిది వట్టి బూటకము.
Popinjay n s చిలక తలకొట్లమారి.
Popish adj రోమన్ కేతోలిక్కు మతసంబంధమైన. యిది తిరస్కార శబ్దము.
Popishly adv రోమన్ కేతోలిక్కు మతానుసారముగా.
Poplar n s బూరగవంటి వొక విధమైన అడివిచెట్టు.
Poppy n s పోస్తుకాయ. * tree గసగసాల చెట్టు. * seeds గసగసాలు.
Populace n s ప్రజలు జనులు లోకులు.
Popular adj సాధారణమైన, సామాన్యమైన, జనసమ్మతమైన, జనరంజరమైన,జనస్తూయమానమైన. a * book అందరికి కావలసిన పుస్తకము. :a :* :poetసర్వసమ్మతమైన కవి. a * magistrate అందరికి హితుడైన పోలీసు అధికారి. .* .manఅందరికి మంచివాడు. the * sense of this word యీ మాటలకు సాధారణమైనఅర్థము. * instruction సామాన్యమైన చదువు. [ A popular King రాజారంజయాతీతి రాజా. according totheepigra యథా ప్రహ్లాదనా చ్చంద్రః ప్రతాపాత్తపనోయథా తధైవ సోభూ దన్వర్ధో రాజా ప్రకృతి రంజనాత్.]
Popularity n s జనరంజకత్వము, లోకహితత్వము, హితవు.
Popularly adv సాధారణముగా, సామాన్యముగా, వాడికగా. this man is * calleda Nabob .వీణ్ని అందరు నబాబు అంటారు. It is * said that he died of poision వాడు విషము తిని చచ్చినాడని సాధారణముగా అంటారు.
populated adj జనులుగల. a thickly * country ప్రజాసమృద్ధిగల దేశము.కాపుపుష్టిగల దేశము. a thinly * country జనసమృద్ధిలేని దేశము.
Population n s జనులు, ప్రజలు, జనము.
Populous adj ప్రజా సమృద్ధిగల, జన సమృద్ధిగల.
Populousness n s ప్రజాసమృద్ధి, జనసమృద్ధి.
Porcelain n s నిండా పొడుగైన చీనా దేశపు పింగాణి.
Porch n s తలవాకిటి వసార, గడపముందరి వసార, మొగసాల. the * of a palaceముఖ మంటపము.
Porcupine n s ముండ్లపంది, యేదు, యేదుపంది, శలలము.
Pore n s వెంట్రుక సందు, రోమకూపము.
Pork n s పంది మాంసము.
Porker n s పంది.
Porosity n s రోమ కూపవత్వము, అతి సూక్ష్మమైన, రంధ్రములు కలిగివుండడము. on account of the * of this earthen ware the water oozes out యీ కుండలోఅతి సూక్ష్మమైన రంధ్రములు కలవు, గనుక నీళ్లు బయిటికి చెమర్చుతున్నది.
Porous adj వెంట్రుక సందువలె రంధ్రములు గల, అతి సూక్ష్మమైన రంధ్రములు గల,చెమర్చే.
Porphyry n s వొకవిధమైన చలవ రాయి.
Porpoise n s సముద్రమందు వుండే వొకవిధమైన పెద్ద చేప. దీన్ని తూరమీను అనిఅంటారు. called the water hog viz. నీరుపంది, పిడక మొసలి.
Porridge n s గంజి, అంబలి.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment