K English to Telugu free online dictionary

Kaleidoscope n s చిత్రవిచిత్రములుగా అగుపడే వోక విధమైన గొట్టము.
Kalender n s పంచాంగము. or list కైదీలపట్టి.
Kali n s సముద్రపు పాచి యొక్క భస్మము.
Kangaroo n s ఒక జంతువు.
Kedge n s ఒక విధమైన లంగరు.
Kedgeree n s or Kichery (a mess of rice) పులగము, కిచిడి.
Keel n s వేన్నుపలక, అనగా వాడ పొర్లకుండా అడుగున వేన్నుకు వేసివుండే పలక.
Keen adj తీక్ష్ణమైన, వాడియైన, చురుకైన.
Keenly adv తీక్ష్ణత, వాడి, ఉగ్రత.
Keep n s guard కావలి, పారా. or daily supplies బత్తేము, మేత. they paid for his వాడికి బత్తేము యిచ్చినారు. the * or prison on a hill దుర్గము, పర్వతము మీద వుండే చేరసాల.
Keeper n s కాపాడేవాడు, పోశకుడు, రక్షకుడు, కావలివాడు, ఉంచుకొని వుండేవాడు, పేట్టుకొని వుండేవాడు. See Doorkeeper, Shopkeeper & c.
Keeping n s సంరక్షణ, కావలి, స్వాధీనము. that house was in my * ఆ యిల్లు నా స్వాధీనములో వుండెను. or consistency అనుగుణ్యట, సరసము. this is not in * with it ఇది దానికి అనుగుణ్యముగా వుండలేదు. this is quite out of * నిండా రసాభాసముగా వున్నది. this is quite in * with the rest of his conduct వాడికడమ పనులు యేంతో యిది అంతే
Keepsake n s జ్ఞాపకార్థము యిచ్చిన వస్తువు.
Keg n s చిన్న పీపాయి.
Kelp n s సముద్రపు పాచి, సముద్రపు పాచి యొక్క భస్మము.
Kelson n s the piece of wood lying over the keel వాడ వెన్ను పలక పై చెక్క.
Ken n s దృష్టిపారే దూరము. it is beyond my * అది నా కనుపారే దూరానకు ఆవల వున్నది.
Kennel n s జలధార, కాలవ, తూము. a house for dogs కుక్కలదొడ్డి. a pack of dogs కుక్కల మంద.
Kept the past and part of Keep. ఉంచినది, ఉంచిన, పెట్టిన.a * mistress ఉంచుకొన్న స్త్రీ. See To Keep.
Kerchief n s ముసుకు వేసుకొనే రుమాల.
Kernel n s లోనిది, గర్భము పప్పు. * of a cocoanut కొబ్బెర. the * of the almond బాదాంపప్పు. the * of a boil గేడ్డలోని మొలక. the * of the affair ఆ వ్యవహారములోని జీవాతు. the *s of the throat are swollen వాడికి గవదలు వాచినవి.
Kersey n s ముతకగుడ్డ, ముతకకోక.
Kerseymere n s నాణ్యపు సెకలాతు.
Kestrel n s a small hawk చిటిడేగ.
Ketch n s ఒక విధమైన వాడ. Jack * ఉరి తీసేవాడు, యిది యెగటాళి పేరు.
Ketchup n s వ్యంజనము.
kettle n s నీళ్లుకాచే చెరవము, గూన, కొప్పేర. Tea * చేయిపిడిగల వేణ్నీళ్లు కాచేగండి చెరవము. what a * of fish or * of hot water ఏమి కుంపటి తెచ్చిపేట్టినావు, ఏమితంపి తేచ్చి పెట్టినావు.
Kettledrum n s నగారా, డమారము, ఢంకా.
Key n s తాళంచెవి, బీగంచెవి. (meant for చావి. Bengali, from Portugueze chave.) a false * మారుతాళము. or peg of a violin &c. బిరడ, అనగా వీణె యొక్క బిరడ. She spoke in a loud * (or tone) అది బిగ్గర మాట్లాడినది. She spoke in a low * హీనస్వరముగా మాట్లాడినది. in music స్వరము. false * అపస్వరము. a * to a puzzle కట్టుకథను విచ్చడానకై వుండే సాధనము, కీలకము బిస, వివరణము. a wharf for goods వాడ మీది సామానులు దించడానకై కట్టివుండే రేవు. we took this village which was the * of theirposition వారి దేశమునకు ఆయపట్టుగా వుండే వూరిని పట్టుకొన్నాము. this village is the * of the river ఈ వూరు స్వాధీనమైతే ఆ యేరు స్వాధీనమైనట్టే.
Keyhole n s బీగంచెవివేసే రంధ్రము.
Keystone n s వంపుకట్టడములో నడమ నిడివిగా వేసే నల్లరాయి. this is the * of the whole plot ఆ కుట్రకు యిదే జీవాతువు.
Khond n s కోండువాడు. the *s కోండులు, కోండువాండ్లు, వీండ్లు విశాఖపట్టణము, గంజాము ఆ ప్రాంతములలో వుండే వొక తేగవాండ్లు.
Kibe n s కాలియొక్క పగుళ్లు, యిది పురాతన శబ్దము.
Kichery n s See Kedgeree.
Kick n s తన్ను. he did this at his last * పొయ్యేపోకులో దీన్ని చేసిపోయినాడు.
Kickshaw n s చిరుతిండి. a medley or mess, a jumble.
Kid n s మేకపిల్ల. * shoes మేకపిల్ల తోలుతో కుట్టిన జోడు. a * glove ఆ తోలుతో చేసిన నున్నని సన్నమైన చేతిజోడు.
Kidnapper n s బిడ్డలను దొంగిలించేవాడు, మనుష్యులను దొంగిలించేవాడు.
Kidnapping n s బిడ్డలను దొంగిలించడము, మనుష్యులను దొంగిలించడము.
Kidnev n s Sort: kind [a ludicrous use of the word]మచ్చు, తరహా, a man of his * వాని వంటివాడు.
Kidney n s పక్కెర గుండెకాయ, లంఖం, lankham అనగా మూత్రమును కలగచేసే కడుపులో వుండే మాంసగ్రంధి విశేషము. this medicine acts upon the *s ఈ మందు గుణము మూట్రములో తెలుస్తున్నది. * shaped ముంతమామిడిపండు ఆకారముగలది. they are all of the same * అందరు వొకటేమచ్చు. the *s of wheat నూకలు, మెరికెలు.
Kidneybeans n s శీమచిక్కుడు విత్తులు.
Kilderkin n s చిన్నపీపాయి.
Killer n s చంపేవాడు, హత్యచేసేవాడు. a child * శిశుఘాతకుడు, శిశుహట్య చేసేవాడు.
Killing n s చంపడము, వధ, హత్య.
Kiln n s ఆవము. a brick * ఇటిక రాళ్ల సూళ. * of lime stone సున్నపు అవము, సున్నప కాళవాయి.
Kilndried adj ఉప్పిన, ఉడకవేసిన. * rice ఉప్పుడు బియ్యము.
Kilt n s రంగుగల ధోవతి, దీన్ని Scotch దేశపు చెంచువాండ్లు మొలకు సగము కట్టుకొని పయికి సగము వేసుకొంటారు. It is like the dress of Sataunis or Labbis.
Kilt, Killed past p|| (Johnson)చంపిన
Kin,kin n s. బంధుత్వము, చుట్టరికము, బంధువులు, చుట్టాలు. they are of * వాండ్లు జ్ఞాతులు. this is * to theft ఇది దొంగతనముతో చేరినదే.
Kincob n s కీన్కాబనే పట్టుగుడ్డ.
Kind n s జాతి, విధము, రీతి, ప్రకారము. the same * అదేవిధము,అదేతీరు. of this * ఈ విధమైన, ఇటువంటి. all * s of articles నానా సరుకులు. human * మనుష్యులు. woman * స్త్రీలు. they paid it partly in money and partly in * దాన్ని రూకలుగా కొంత సరుకులుగా కొంత చేల్లించినారు. they wear a * of Turband వాండ్లు వొక విధమైన పాగా వేసుకొంటారు. the cloth is good of its * ఈ మాదిరిలో యిది మంచి గుడ్డ. I will do nothing of the * అటువంటి పని నేను చేయనుa Lover of his * అందరున్ను మన వంటి వాండ్లేకదా అనేవాడు, భూతదయపశ్చాత్తాపము గలవాడు. every lover of his * will rejoice to see the tyrants fall భూతదయ పశ్చాత్తాపము గల వాండ్లందరున్ను ఆ క్రూరుని చేటుకు సంతోషింతురు. they are haters of their * వాండ్లు స్వజాతి వైరులు.
Kindly adv విశ్వాసముగా, దయగా, ప్రీతిగా.
Kindness n s విశ్వాసము, దయ, ప్రీతి, వాత్సల్యము, ఉపకారము. the milk of human * దయారసము. have the * to send them దయ చేసి వాటిని పంపవలెను.
Kindred adj సంబంధముగల, సాజాత్యముగల. they are * minds వాండ్లు వొకటే మనసుగా వున్నారు.
Kine n s ఆవులు, పశువులు. milch * పాడి ఆవులు.
King n s రాజు. *'s evidence కడమవాండ్ల మీద సాక్షి చెప్పి తప్పించుకొన్న తోడుదొంగ. * of *s దేవుడు. * at arms వంశావళిని విచారించే స్త్రీ. loss incurred by the act of God or the * దైవిక రాజీకములు.
King-crow n s (the bird called shrike) జముడు కాకి. See Madras Journal X. 288 where is the Hind: name Kotual Kolsah, or Bojunga.
King-cup n s (a flower) ఒక పుష్పము.
Kingdom n s రాజ్యము. the animal * జీవకోటి, జీవరాశి. the vegetable * వృక్షకోటి. the mineral * లోహవర్గము. the various *s of Nature ఈశ్వర సృష్టి వర్గములు. the * of God ఈశ్వర రాజ్యం A+ Rom. XIV.
Kingfisher n s చల్లముద్దపక్షి, చల్లకవ్వపుపిట్ట, పచ్చరేకపిట్ట, మీలపల్లేంక పులుగు, లకుముకిపక్షి. the true name is నీళ్ళబుచ్చిగాడు.
Kinglike, Kingly adj అతిఘనమైన, దివ్యమైన, రాజఠీవియైన.
Kingsevil n s గండమాల.
Kingship n s రాజత్వము, దొరతనము.
Kino n s or Dragon's blood ఖడ్గమృగ రక్తము, యిది వొక మందుదినుసు.
Kinsfolk n s బంధువులు, చుట్టాలు, స్వజనము.
Kinsman n s జ్ఞాతి, బంధువుడు, చుట్టపువాడు.
Kinswoman n s చుట్టపుది.
Kiosk n s a pleasure house శృంగార మంటపము.
Kirk n s గుడి, యిది Scotch శబ్దము. the * కెర్కు మతస్థులు.
Kirtle n s కోక, యిది ప్రాచీన శబ్దము.
Kiss n s ముద్దు.
Kissing n s ముద్దు, దయ.
Kissingcrust n s కాల్పడములో వొకటితో వొకటి అంటుకొనివుండే రొట్టే.
Kit n s Fiddle చిన్నపిడీలు. or baggage మూఠా ముల్లే, సామాను, సర్వస్వము.
Kitchen n s వంటయిల్లు. * furniture వంటకు కావలసిన పాత్రసామగ్రి.
Kitchengarden n s కూరగాయల తోట.
Kitchenstuff n s కూరగాయలు.
Kitchenwench n s వంటలక్క, వంటచేసే స్త్రీ.
Kitchery n s a dish so called కిచ్చడి, పులగము.
Kite n s a bird గద్ద. a brainy * గరుత్మంతుడు, గరుడపక్షి. a paper * గాలిపటము.
Kith and kin n s చుట్టాలుపక్కాలు.
Kitten n s పిల్లికూన.
Knack, nack n s. or dexterity చమత్కారము, నేర్పు, ఉపాయము. or curious thing, rarity స్వల్పమైన వస్తువు. Pinkerton XIII. 235.
Knacker n s చచ్చినగొడ్డును తీసుకొనిపోయి అమ్ముకొనేవాడు.
Knag n s బుడిపి, మానిమీదిముడి, కొయ్యమొద్దు.
Knap, nap n s. Nap (upon cloth) గుడ్డమీది బొచ్చు.
Knave n s దొంగ, మోసగాడు టక్కులమారి. to play the * మోసముచేసుట,టక్కుచేసుట, వంచించుట.
Knavery n s దొంగతనము, టక్కు, పిటలాటకము, మోసము, వంచన.
Knavish adj మోసమైన, పితలాటకమైన.
Knavishly adv మోసముగా, పితలాటకముగా, వంచనగా.
Knavishness n s మోసము, పితలాటకము, వంచన.
Kneading-trough n s పిండికలిపే తొట్టి.
Knee n s మోకాలు. he wrote this paper resting it on his * ఆ కాగిదాన్ని తొడమీద పెట్టుకొని వ్రాసినాడు. he had the child on his * బిడ్డను తొడమీడ పెట్టుకొని వుండినాడు, ఒడిలో పెట్టుకొని వుండినాడు. Sit on my * నా తొడమీద కూర్చో. he had her sitting on his * దాన్ని తొడమీద గూర్చుండ పెట్టుకొని వుండినాడు. on my bended *s I implore you మోకారించి వేడు కొంటున్నాను, అనగా సాష్టాంగ దండము బెట్టి వేడుకొంటున్నానని భావము. a * of timber మూల కట్టువలే వంకరగా వుండేమాను. knock-kneed ముట్టికాళ్ళుగల, వంకరకాళ్ళుగల.
Knee-deep adj మోకాటిలోతైన, జానుద్వయ సమమైన.
Knee-pan n s మోకాటిచిప్ప.
Kneetribute n s మోకారించిపెట్టే దండము, సాష్టాంగ దండము.
Knell n s చావుగంటశబ్దము, అనగా పీనుగను తీసుకొనిపొయ్యేటప్పుడు కొట్టే ఘంటశబ్దము. The curfew tolls the * of parting day సాయంకాలపుఘంటారవము దినావసానమును తెలియచేస్తున్నది. this speech was the * to their hopes ఈ మాటతో వాండ్లకు నిరాశ అయిపోయినది. the * of those laws is tolled ఈ చట్టమునకు లయకాలము వచ్చినది.
Knew the past of Know తెలిసినది
Knick-nacks n s స్వల్పద్రవ్యములు, అల్పద్రవ్యములు, గుల్లాగుట్ర.
Knife n s కత్తి. a small * సూరుకత్తి. a pan * చాకు. a folding * or clasp * మడుపు కత్తి. a wood * మచ్చుకత్తి. a shoemaker's * అరే. a large kitchen * stuck upright in a block of wood కత్తిపీట. a * grinder కత్తులు సానపెట్టేవాడు.
Knight n s వీరుడు, శూరుడు, బంటు, రౌతు. a * chess చతురంగపు కాయలలో గుర్రము. Originally Knight meant servant, attendant and is ludicriously used thus : a * of the post (Johnson) దోవకట్టి దోచే దొంగ, జూదరి. a * of the thimble i. e. a tailor కుట్రపువాడు. a * of the quill, that is a clerk or writer లేఖరి.
Knight-errant n s అత్యంత సాహస కృత్యము యెక్కడ చిక్కునోయని దేశదేశము తిరిగే రౌతు.
Knight-errantry n s రౌతుయొక్క నానాదేశ సంచారము, సాహసకృత్యమునకై దేశ దేశము తిరగడము, నిష్ప్రయోజనముగా అత్యద్భుతసాహసములను చేయడానకై వుండే వుద్యుక్తత.
Knighthood n s శూరకులీనత్వము, బంటుతనము, నైట అనే పట్టమును కలిగి వుండడము.
Knightly adj శూరకులీనత్వ సంబంధమైన. the * rank నైట్ అనే పట్టము.
Knit n s అల్లిక.
Knitting-needle n s అల్లిక శలాకు.
Knob n s గుబ్బ, గుబక. in carpentry లక్ష్మి కమ్మి.
Knobbed adj గుబ్బలుగల, గుబకలుగల.
Knock, nock n s. దెబ్బ, తలుపుతట్టడము. I heard a * at the door తలుపుతట్టగా విన్నాను. * kneed ముట్టి కాళ్ళుగల.
Knocker n s తలవాకిటి తలుపుకు వేసి వుండే చెయిపిడి, దీనితో తలుపును తట్టుతారు.
Knole-cole n s ఒకవిధమైన కోసుకూర.
Knoll n s తిప్ప, మెరక, మిట్ట.
Knop n s గుబ్బ, గుబక.
Knot n s ముడి, గ్రంధి. she tied her hair in a * కొప్పుపెట్టుకొన్నది. a petticoat * నీవి, పోకముడి. the people was standing in *s గుంపు గుంపులుగా నిలుచుండి వుండినారు. a * in wood మానిలో వుండే ముడి. or bud మొగ్గ. slip or bow * దూముడి. a standing * ఉచ్చురుకు. the ship went six *s an hour ఆవాడ ఘంటకు ఆరు మైలులు పోయినది. he cut the Gordian * తీరని చిక్కును వొక సాహసము చేసి తీర్చినాడు.
Knot-grass n s దుబ్బులు, నచ్చుగడ్డి, చిగిరింతగడ్డి.
Knotted adj ముడి వేసిన, ముడిబడ్డ, ముళ్లుగల, బుడుపులుగల.
Knottiness n s బుడిపిగా వుండడము, ముడిగా వుండడము, చిక్కు, క్లిష్టము. from the * of this wood it is of no use ఈ మాను బుడుపులుగా వుండడము వల్ల పనికిరాదు. from the * of this question ఈ ప్రమేయము మహాక్లిష్టమైనది గనుక.
Knotty adj బుడుపులుగల, ముళ్లుగల, చిక్కైన.
Knout n s పెద్దకొరడా, జేరుబందు, ఇది Russian భాష.
Knowing adj తెలివిగల, జ్ఞాతయైన, ప్రవీణతగల, ఇంగిత మెరిగిన, భావజ్ఞులైన, కార్యవ్యక్తులైన.
Knowingly adv బుద్ధిపూర్వకముగా, ఎరిగి, కావలెనని. I did not hurt you * నేను నిన్ను కావలెనని వుపద్రవము చేయలేదు. he did this very * వాడు నిండా నేర్పుగా చేసినాడు. the dog looked at me very * ఆ కుక్క నన్ను భావగర్భముగా చూచినది.
Knowledge n s జ్ఞానము, ప్రజ్ఞ, తెలివి, ఏరుక, విద్య. I have no * of him నేను వాణ్ని యేరగను, వాడికి నాకు పరిచయము లేదు. he has a very good * of sanscrit వాడికి సంస్కృఅతములో మంచి ప్రవీణత కలదు, పాండిత్యము గలదు. I have no * medicine నాకు వైద్యములో ప్రవీణత లేదు. he did this without my * నా యేరుకలేక దీన్ని చేసినాడు. I came there without his * వాడికి తెలియకుండా వచ్చినాను. after it came to my * అది నాకు తెలిసిన తరువాత when it wasbrought to my * నాకు తెలియగానే. to the best of my * or as far as my * goes నాకు తెలిసినమట్టుకు. they took * of him అతణ్ని గురించి విచారించినారు. he had carnal * of her దానితో పోయినాడు, దానితో సంసర్గము చేసినాడు.
Known adj ఎరిగిన, తెలిసిన, ప్రసిద్ధమైన. it became * అది బయిటపడ్డది. he soon began to be * as a scholar కొన్నాళ్ళకు విద్వాంసుడనే ప్రసిద్ధిని పొందినాడు. be it * upto you ఇది నీకు తెలిసివుండవలసినది. a well * thief పేరు పోయిన దొంగ. forsome reason best * to himself he went and told them వాడి కేమి పట్టిందో వాండ్లతో పోయి చెప్పినాడు.
Knt n s. abbreviation of Knight, See Knight.
Knuckle n s గెణుపు, వేలిగెణుపు. a rap on the *s మొట్టికాయ, చీవాటు. he gave me a * on the head with his *s నా తలమీద మొట్టినాడు.
Knupsack n s సిపాయీల వీపుమూట, దీన్ని తేలుగులోకూడా నాప్శాకఅనిన్ని నాపసా అనిన్ని అంటారు.
Koran n s ఖురాను, తురకవేదము.
Kraal n s (a pen for cattle: Dutch) దొడ్డి, పల్లే.
Kraken n s See Craken.
Kriss n s a dagger బాకు, కటారి.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment