E.g.             (Exampls gratia) " for instance" అందుకు దృష్టాంతము, యేలాగంటే అనగా (paley"s Nat Theol. page 1.)
Each    adv        చెరి, తలా. she gave them a book * వాండ్లకు తలా వొకపుస్తకమునుయిచ్చినది. they took one * చెరి వొకటి యెత్తుకొన్నారు.
Eager    adj        ఆతురమైన, అత్యాశగల, ఆకాంక్షగల. he is * for instructionవాడు విద్యాతురుడై వున్నాడు. See how * the cat is to catch the ratఆ యెలుకను పట్టవలెనని ఆ పిల్లికి మనసు యెట్లా కొట్టుకొంటున్నదో చూడు.
Eagerly    adv        ఆతురముగా, అత్యాశగా.
Eagerness    n     s     ఆతురము, అత్యాశ, అత్యాకాంక్ష, కౌతూహలము.
Eagle    n     s     ఒకవిధమైన పెద్దపక్షి. గూళి, పక్షిరాజు, గరుత్మంతుడు. యిది చచ్చినగొడ్లను పెరుక్కొని తినడములేదు గనుక గరుత్మంతుడే యనవచ్చును. In Rev.( V.7 విహంగం . A+ which merely is a bird గండభేరుండపక్షి. p + గరుడ K +.
Eagle-eyed    adj        దూరదృష్టిగల, సూక్ష్మదృష్టిగల, దూరాలోచనగల, సూక్ష్మబుద్దిగల.
Eaglet    n     s     గూళిపిల్ల.    
Eagle-wood    n     s     అగరు.  ( Sree article in the Penny Cyclop.)
Ear    n     s     చెవి, కర్ణము. the top of the * కొనచెవి. the tip, lobe, or lowerpart of the * గూబ.he has a good * for music    వాడికి సంగీతములో చొరవకలదు.have you a good * నీకు సంగీతములో తప్పువొప్పు కనుక్కొనే శక్తికద్దా. I have no *for music నాకు సంగీత శాస్త్రం యొక్క స్వారస్యము తెలియదు. they say the singsvery well; I do not think so,but  I have no * for music అది బాగా పాడుతుందంటారు   నాకు అట్లా తోచలేదు. అయితే నాకు సంగీతములో జ్ఞానములేదు.the *s of bowl భోగిణి యొక్క చెవులు. * of corn కంకి,వెన్ను. * wax గులిమి.an * pick  గులిమితీసే పుడక. when it came to his *s అది అతని చెవి పడ్డప్పుడు.he gave * to these words  వాడు యీ మాటలను ఆలకించినాడు, చిత్తగించినాడు.Lend me your *s ( Shakespeare)  అవధారు, ఆలకించండి. as the possesedthe king's ear  వాండ్లు రాజు చెవిని పట్టి ఆడిస్తూ వుండినారు గనుక.they poisoned the king's * against me నా మీద చాడిచెప్పినారు.God bowed down the * to our prayer దేవుడు మా మొరను ఆలకించినాడు.he turned away the * from me or he turned a deaf * to me నేను చెప్పినమాటనుచెవినిపెట్టలేదు, నా మాటను పెడచెవిని పెట్టినాడు. he set them by the *sవాండ్లకు కలహము పెట్టినాడు.  he fell over head and * s into the water.వాడు నీళ్లలో బుడింగుమని ముణిగినాడు. he is up to the *s  in business పనిలో మునిగివున్నాడు. he is over head and * s in debt వాడు అప్పులో మునిగియున్నాడు.  Take care ! he will be about your *s భద్రము నిన్నుచంపకాయ పుచ్చుకొంటాడు.     Take care! you will bring the magistrateabout your *s భద్రము పైన మేజిస్ట్రేటు వాండ్లు వున్నారు. By doing sohe raised a nest of hornests about his *s యిట్లా చేయడముచేత వూరంతావాడిమీద రేగినారు .they knocked the house about his *s  ఆ యిల్లు పడకొట్టివాడితలమీద తోసినారు.  Don't make dog's *s in the book  పుస్తకములోనికాగితపు కొనలను మడవక.
Earl    n     s     వొకవిధమైన ప్రభువు, జమీందారి.
Earldom    n     s     వొక విధమైన జమీందారి యొక్క కితాబు.
Earlier    adj        ఆదిని, ముందుగా, మొదట, త్వరగా.
Earliest    adj        మొదటి.   Send it me by the * opportunity  దాన్నినాకు అతిత్వరగా పంపించవలసినది.  from the * ages కృతయుతము మొదలుకొనిsince the * periods అనాదిగా.
Earl-marshal    n     s     దండులో మేజిస్ట్రేటు పనిచూచేవాడు.
Early    adj        and adv.  ముందరి, శీఘ్రపు, అకాలపు. * in the morningవేకోఝామున he dined very. * to-day వాడు నేడు పెందలకడ భోజనముచేసినాడు. he keeps * hours వాడు లేవడమున్ను త్వర. * fruitsకాలానికి ముందుగా పండిన పండ్లు. * tobacco ఆ కాలపు పొగాకు.at an * age బాల్యమందు.
Earnest    n     s     or earnest money సంచకారము, అచ్చారము.this is an * of what he will hereafter do  యిఖ మీదట వాడు చెయ్యపొయ్యేపనికి యిది అవతారిక.
Earnestly    adv        అత్యాదరముగా, బతిమాలుకొని, ప్రాధేయపడి,ఆశగా, అక్కరగా.
Earnestness    n     s      ఆదరము, ఆతురము, అక్కర, వాంఛ.
Earning    n     s     దున్నడము, కృషి,  వ్యవసాయము.   * time  దున్నేకాలము.
Earnings    n     s     సంపాద్యము .  this estate was his brother's * యీ ఆస్తివాడి అన్న సంపాద్యము.
Earring    n     s     కర్ణ భూషణము, కుండలము, పోగులు, కమ్మలుమొదలైనవి.
Earshot    n     s     వినబడేదూరము.   he was out of *  వాడు వినబడే దూరానికిమించి వుండినాడు. he was within * అతడు వినబడే దూరములోవుండినాడు.
Earth    n     s     భూమి, నేల, మన్ను.   black * రేగటిమన్ను. white * సుద్ద . *salt మంటివుప్పు, మడ్డివుప్పు. fuller's * చవుడు.  the world   జగత్తుlet all the * worship him  లోకులెల్లా అతణ్ని పూజించవలదినది.or the inhabitants of the world  లోకులు.   a foxes * నక్క బొక్క. here on *యిహమునందు .     what on * do you mean అయ్యో నీవు యేమిమాట చెప్పుతావు.what on *is that అయ్యో అది యేమి. I do not know what on *this is అదియేమి యెళువో నాకు తెలియదు. How on * should be give this వాడివ్వడమనేమాటయెక్కడిది.
Earthborn    adj        భూమిలో పుట్టిన జంతువైన.             Earthen, adj. మంటితోచేసిన, మంటి, మృణ్మయమైన. *  pot  కుండ. * ware   కుమ్మరస్వరూపములు,  అనగా  కుండ, చట్టి, పింగాండ్లుమొదలైనవి.
Earthiness    n     s     మంటివాసన.   from the * of the taste మంటివాసనగావున్నందున.
Earthly    adj        ఐహికమైన, సాంసారికమైన. * enjoyments ఐహికసుఖములు.*ties    సంసారబంధకములు. an * nature       ఐహికస్వభావము. the spiritualbody is different from the  * body  సూక్ష్మశరీరము వేరు స్థూలశరీరమువేరు.  not one * thing ( Johnson calls this a female hyperbole, but it isan ancient phrase ) వొకటిన్ని లేదు, యేమిన్నిలేదు. I did not say one *word  నేను వొకటిన్ని చెప్పలేదు. (In James 3.15 సాంసారికం A+.) Earthlyminded, adj. పాశబద్దుడైన, సంసారబంధముగల.
Earthnut    n     s      వేరుశనగలు.
Earthquake    n     s     భూకంపము.
Earthworm    n     s     యెర్రలు, వానపాములు.
Earthy    adj        మృణ్మయమైన, భూసంబంధమైన .           an smell మంటివాసన.   (In 1 Cor, 15, 47 పాథి్వ,  A+.)
Ear-wax    n     s     గులిమి.
Ear-wig              వొక తరహాపురుగు, ఆరుద్రపురుగువంటిది
Ease    n     s     నెమ్మది, నిమ్మళము, హాయి, సుఖము, సౌఖ్యము,సులభము. he is now at *.   వాడు నిమ్మళముగా వున్నాడు.  I am ill at * regardinghim అతన్ని గురించి  నాకు వ్యాకులముగా వున్నది.   belives at * వాడుసుఖజీవిగా వున్నాడు,  నిమ్మళముగా వున్నాడు.   he took his *  విశ్రమించినాడు.అలుపు దీర్చుకున్నాడు.
Easil    n     s     బల్ల, యేటవాలుగా వుండేబల్ల. the painting *  పటమునుపెట్టి వ్రాసే యేటవాలుబల్ల. the reading * బల్ల , మేజా.
Easily    adv        సులభముగా, సుళువుగా  , అనాయాసముగా.
Easiness    n     s     సులభము, చులకన, అనాయాసము. from the *of the task యిదినిండా సులభమైనది గనక.   he  has great  * of mannersవాడు సర్వసులభుడు.
East    n     s     తూర్పు. * wind తూర్పుగాలి.
East Indian    n     s     పరంగివాడు,  చటకారివాడు. See Indian.
Easter    n     s     Easter day  వొక పండుగ. ఖ్రీష్టుచచ్చి మళ్లీ బ్రతికిలేచినసంగతియొక్క జ్ఙాపకార్థమై చేసే పండుగ.
Easterly    adj        తూర్పుదేశసంబంధమైన. * wind    తూర్పుగాలి .
Eastward    adv        తూర్పుతట్టుగా, తూర్పుకై, తూర్పుకు.
Easy    adj        సులభమైన, చులకని, నెమ్మదియైన,    నిమ్మళమైన, సరళమైన.she had an * delivery అది సుఖప్రసవమైనది the  ascent of the hill was* యీ కొండ యేటవాలుగా వున్నది.   this coat is not * యీ చొక్కాయ నిండాబిగువుగా వున్నది. * garments బిగువులేక వదులుగా వుండే బట్టలు.make your mind * about this యిందున గురించి వ్యాకులము పడవద్దు.an * master  చల్లని ప్రభువు, మంచిదొర, సులభుడు.    he is now  very *వాడు యిప్పుడు హాయిగా వున్నాడు, వాడికి యిప్పుడు వుపశాంతిగా వున్నది.he is now in * circumstances  వాడు యిప్పుడు తగుబాటి స్థితిలో వున్నాడు.a lady of * virtue   బోగముది.  his free and * (or impudent) manneris very disagreeable వాడి అధిక ప్రసంగితనము మహా అసహ్యముగా వున్నది.   
Eatable    adj        తనడానకు అర్హమైన, తినదగిన. this is not   * యిది తినిరానిది.
Eaten    adj        తిన్న, భక్షించిన, తినివేసిన. he is * up with pride వాడికి గర్వముతలకొట్టుకొనిపోతున్నది. they found some half * viands there తిని మిగిలిన పదార్దములు కొన్ని వీండ్లకు అక్కడ చిక్కినవి. worm * పుప్పి పట్టిన, పురుగుకొట్టిన.worm * books రామభాణము పడ్డ పుస్తకములు, పురుగుకొట్టిన పుస్తకములు.   Eater, n. s. తినేవాడు, భక్షించేవాడు.
Eating    n     s     తినడము, భోజనము చేయడము.      an * house పూటకూళ్లల యిల్లు. thisis nice * యిది సుభోజనము , యిది నోటికి రుచియైన  పదార్థము.
Eau    n     s     ( prounounced owe)  నీళ్లు, యిది ఫ్రెంచి భాష. * de-cologne యిది ఒకఔషధము.    * de-luce   యిది అఘ్రాణించే వొకమందు. * de-vie   బ్రాందికి యిది వొక పేరు. 
Eaves    n     s     flowers or gushes  ప్రవహించము, పారడము, చూరు, ముంజూరు, వాచూరు.the board covering the  *మూతబల్ల వాచూరు పలక. An * dropper పొంచు వుండి వినేవాడు, చాడికత్తె ద్రోహి.
Ebb    n     s     యేటి యొక్క పాటు, సముద్రము యొక్క పాటు, క్షణగతి , క్షయము.his fortune is now at a low * వాడికి యిప్పుడు మహా దీనదశగా వున్నది.
Ebon    adj        నల్లని. her * locks దాని నల్లని కురులు.
Ebony    n     s     నల్లచేవమాను, కోవిదార వృక్షము.
Ebriety    n     s     మత్తు, కైపు. he drunk to * వొళ్లు మరిచేటట్టు తాగినాడు.
Ebullition    n     s     పొంగడము, వుబకడము. the water was in a state of *ఆ నీరు వుబికి వుండినది, ఆ నీరు పొంగి వుండినది. an * of rage కోపోద్ద్రేకము.
Eccentric    adj        వికారమైన, వింతైన, విపరీతమైన, వెర్రి. an * orbit  ప్రతిమండలము.Colebr in As Res. Vol. XII. 234 also his essays, vol. 2. 399.
Eccentricity    n     s     వికారమైన గుణం, వింతైన గుణము, విపరీతమైన గుణము, వెర్రిచేష్ఠ.
Ecclesiastic    n     s     పాదిరి, అనగా గురువు. యిది ముఖ్యముగా రోమన్ కాథలిక్కుపాదిర్లకుచెల్లేమాట.
Ecclesiastical    adj        పాదిరిమతసంబంధమైన.  .  letters *  శ్రీముఖము, అనగాబిషపు వ్రాసే ఆజ్ఞాపత్రిక. *court or * side అనాచారము గురించి విచారణ. *law ఆచారకాండ.
Echo    n     s     ప్రతిధ్వని, ప్రతిమోత. this answer is a mere * to what I saidయీ జవాబులో నేను చెప్పిన మాటలే వున్నవిగాని వేరే అధికము లేదు.
Echoed    adj        ప్రతిధ్వనించి. See To Echo.
Echoing    adj        ప్రతిధ్వనించే. an * రోచక పలుకురాయి, ప్రతిధ్వనించేరాయి.
Eclaircissement    n     s     explanation ( a French word) తీర్పు, తుదకు వేషముబయటపడడము,మర్మముబయటపడడము,కథయొక్క సమాప్తి. యిది కావ్యనాటకములలోవచ్చే మాట.
Eclat    n     s     ( French; pronounced  ec-law) splendour, show, lustreశోభ,పేరు, ఖ్యాతి. with great  * డంబముగా, పేరు ప్రఖ్యాతిగా.
Eclectic    adj        పరిశీలనచేసే, విమర్శచేసే విశేషమై.
Eclipse    n     s     గ్రహణము, ఉపరాగము. a total * పూర్ణగ్రహణము, పూర్ణోపరాగము.a quarter * పాతికగ్రహణము, పాదోసరాగము. the beginning of an *   స్పర్శ కాలము.the end of an * మోక్ష కాలము.
Ecliptic    n     s     ( Warren. p. 361. ) క్రాంతి కక్షము, క్రాంతిమండలము.
Eclogue    n     s     గోపికాగీతల వంటి వొకతరహాకావ్యము. the *s Virgil రఘువంశమువలెలాటిన్ చదివే చిన్నవాండ్లు చదివే కావ్యము.
Ecommunicated    adj        బహిష్కారముచేయబడ్డ, వెలివేయబడ్డ.
Economic    adj        రాజ్యసంబంధమైన. the * regulations ప్రజాపరిపాలనమునుగురించి చట్టములు.
Economical    adj        పొడిమైన, మితవ్రయముచేసే  , దుర్వ్రయమ చేయని, జాగ్రత్తగావుండే. for * purposes  గృహకృత్యములకై.
Economically    adv        పోణిమిగా, దుర్వ్ర వయము లేకుండా, మితముగా,క్రమముగా, పదిలముగా.
Economicks    n     s     రాజ్యతంత్ర శాస్త్రము, మంత్రాంగము.
Economist    n     s     పోణిమిగా జరుపుకొనేవాడు, మితవ్రయము చేసేవాడు, నిర్వాహకి.he is a bad *  సంసారమును పోణిమిగా జరుపుకోనేరడు. they are good *sవాండ్లు దుర్వ్రయము చేసేవాండ్లుకారు. a political * రాజ్యతంత్రము యెరిగినవాడు.the Musulmans are bad political *s తురకలు రాజ్యతంత్రము యెరుగరు.      
Economy    n     s     ఏర్పాటు క్రమము, పద్దతి, గృహకృత్యనిర్వాహకము,  సంసార నిర్వాహకముపోణిమి మితవ్రయము. * is a virtue, covetousness is a vice  పోణిమి మంచిది,లోభిత్వము పనికిరానిది. to starve his servants is very bad *  పనివాండ్లకు కూటికి యివ్వకుండాచంపడము వొక బందోబస్తా, వొకపోడిమా. I think this is bad * యిది మంచి ఆలోచనకాదని నాకు తోస్తున్నది. the * of creation సృష్టిక్రమము. the animal. శరీరవిన్యాసము, శరీరము యొక్క సృష్టి క్షమము. the vegetable * ఔషధులయొక్క సృష్టిక్రమము.the animal * requires food every days ప్రతిదినమున్ను ఆహారము లేకుంటే శరీరము   నిలవదగిన. the  * of nature is wonderful ఈశ్వరతంత్రము అతి విచిత్రమైనది.ఈశ్వరసృష్టి అతి విచిత్రమైనదిగా ఉన్నది the * of ants is remarkable చీమలలయొక్క నేర్పు అత్యాశ్చర్యకరమైనది. the internal * of the body శరీరములోనివిన్యాసము.  political  రాజ్యంత్రము, ప్రజాపరిపాలనము. the * of agrcultureవ్యవసాయక్రమము.  the * of the eyes నేత్రపోషణవిధి.
Ecretion    n     s     రసము. of trees బంక. of the body వుసి, గులిమి,రసిక మొదలైనవి. o insects బూజు, పట్టు నూలు మొదలైనవి.
Ecstasied    adj        ఆనందభరితమైన, పరవశమైన, మైమరచిన.
Ecstasy    n     s     పరవశత, ఆనందము. they were inecstasies at seeing him     వాణ్ని చూచి వాండ్లు, పరవశులైనారు. She was in an * of grief అది వ్యాకులముచేతస్మారకముతప్పి వుండినది.
Ecstatic, Estatical    adj        ( Better spelt Extatic ) ఆనందభరితమైన, పరవశమైన,మైమరచిన.
Eddy    n     s     సుడి, ఆవర్తము, నీళ్ల సుడి. an * of wind సుడిగాలి.
Eddying    adj        సుడిబడే.
Eden    n     s     ( The proper name) యిది వొక తోటపేరు, యిందులో  ఆదమనే పురుషుడు భార్యతో కూడ వుండినాడు. దీన్ని యింద్రుడి నందనవనమునకు సమముగా వర్ణిస్తారు.
Edge    n     s     అంచు, వోర, వాయి, ధార. this knife has lost it's * యీ     కత్తిమొద్దుపారిపోయినది. the * of a rock కొండంచు. he is on the * of the grave.వాడికి చావు తటస్థమైవున్నది. this took off the * of his appetite యిందుచేతవాడి ఆకలి కొంచెము అణిగినది.  this gave a fresh * to his anger యిందుచేతవాడి కోపము మరికొంచెము అతిశయించినది.   the lime juice set his teeth on *నిమ్మపులుసువల్ల వాడిపండ్లు పులిసిపోయినవి, వాడి దవడలు పట్టుకొనిపోయినవి.he gave them to the * of the sword  వాండ్లను ఖడ్గధార పాలు చేసినాడు.
Edged    adj        అంచుగల.   a vest * with silver సరిగె అంచువేసినగుడ్డ.a two * sword or double  * రెండంచులుగల కత్తి. three * మూడంచులుగలa new * sword కొత్తగా పదును పెట్టిన కత్తి.
Edgeless    adj        జబ్బైన, మొండి. an * satire పనికిమాలిన దూషణ, నిష్ఫలమైనదూషణ.Edgetool, n. s. అంచు గల ఆయుధము, అనగా బాడిశ, పులి, కత్తి మొదలైనవి.
Edgewise    adv        ఓరవాటుగా, పక్కవాటుగా.   the bricks were placed * ఆయిటికలను పక్కవాటుగా పెట్టినారు. the dishes were placed * తట్టలను నిలవబెట్టినారు.
Edging    n    s     అంచు, కమ్మి. the * of the cloth  గుడ్డయొక్క కమ్మి .
Edible    adj        తినదగిన, భక్షించదగిన.
Edict    n     s     ప్రకటనకాగితము, చాటింపు, శాసనము , ఆజ్ఞ.
Edification    n     s     నిష్ఠ. (A+.) మతములో నిష్టకలగచేయడము.   these are describedfor our * మనకు వివేకము రావడమునకై యివి చెప్పబడివున్నవి.
Edifice    n     s     దివ్యభవనము, దొడ్డయిల్లు, నగరు. a sacred * దేవాలయము .
Edifying    adj        నిష్టను కలగచేసే. * language హితోపదేశము, నిష్టనుకలగచేసేమాటలు. an * tale   పుణ్యకథ. they wre engaged in * disourse వాండ్లుసత్కాలక్షేపము చేస్తూ వుండినారు.
Edile    n     s     రోమన్ దేశమందు వొక ప్రాచీన విచాషణకర్త కొత్తవాలు.
Edition    n     s     పుస్తకమును అచ్చువేయించడము, వొకసారి అచ్చువేయించిన గ్రంథము.a new * కొత్తగా అచ్చు వేయించిన గ్రంథము .  that book has gone throughfive *s ఆ పుస్తకము అయిదు మాట్లు అచ్చువేయబడ్డది. the fourth * నాలుగోమాటుఅచ్చువేయడము. this is just another * of his former conduct   వాడు మునుపుచేసినది ఎంతోపనో యిది అంతపనేను.            
Editor    n     s     He that revises or prepares any work for publicationఅచ్చు వేయడానకు గ్రంథమును సవరించి యిచ్చేవాడు. Peddibhatlu is the celebrated * ofthe Magha పెద్దిబొట్లు మాఘమనే కావ్యమును దిద్ది పరిశుద్దముచేసి టీక వ్రాసినాడు.Todd is the * of Jhonson's Dictionary   టాడ్డనేవాడు జా్స్ డికిషనేరినిసవరించి యింకా కొన్ని శబ్దములను చేర్చి అచ్చువేయించినాడు.the * of the paper quarelled with the owner  ప్రసిద్ద పత్రికను అచ్చుకుసవరించి యిచ్చేవాడికిన్ని రూకలు పెట్టి కాగితము వేయించే వాడికిన్ని వివాదము జరిగినది. The phrase కర్త. is used in the Bombay Mahratta newspaper. The * of the Jnanodayam  జ్ఞానోదయమనే  సమాచారపత్రికను సవరించి కుదిర్చిఅచ్చుకు యిచ్చేవాడు.
Editorial    adj        గ్రంథమును సవరించి యిచ్చేవాని సంబంధమైన. *   remarks వ్యాఖ్యాతచెప్పిన మాటలు. See Editor.
Editorship    n     s     అచ్చుకు గ్రంథమును సవరించి యిచ్చే అధికారము. they gave himthe * of the newspaper ఆ ప్రసిద్ధపత్రికను సవరించి యిచ్చే అధికారము వాడికియిచ్చినారు.
Educated    adj        శిక్షితమైన, విద్యాబుద్దులు నేర్పబడ్డ. she was * by her mother.   దానికి తల్లే శిక్ష చెప్పినది. these boys are well * యీ పిల్ల కాయలు బాగాచదివినవాండ్లు యీ పిల్లకాయలు సుశిక్షితులై వున్నారు. an ill * man చదువులోసామాన్యుడు.
Education    n     s     చదువు,శిక్ష, విద్యాభ్యాసము, విద్యాబుద్ధి. I received my * in the college  కాలీజులో చదువుకొన్నాను. her * was comfined to dancing and singing.దానికి ఆట పాట తప్ప యేమిన్ని తెలియదు.       
Educational    adj        శిక్షాసంబంధమైన, విద్యాసంబంధమైన.   the * courseశిక్షాక్రమము, విద్యాభ్యాసక్రమము. the * committee విద్యాభివృద్ది చేయించడమునకైయేర్పడియుండే సభవారు.
Eel    n     s     మలుగు చేప, పామువలె    వుండే చేప.  various species are called కుళ్లెం,బుక్కడం, గడ్డిపాము, దుండుపాము, చెమ్మనిపాము, తవిటికిపాము, కొంమ్మెరపాము. an *pot (a snare for eels) ములుగుచేప పట్టే కడవ.
Efective    adj        సఫలమైన, సార్థకమైన, ఉపయుక్తమైన, ఉపయోగమైన, పనికివచ్చే.* troops పనికి వుపయోగముగా వుండే   బంట్లు. non * పనికి వుపయోగముకాని.
Effaced    adj        తుడిచివేయబడ్డ, చెరిపివేయబడ్డ, గోకి యెత్తివేయబడ్డ, మాశినthe inscripition on the seal was * ముద్రమీది అక్షరాలు మాశిపోయినవి.the mark of the wound was * గాయపుమచ్చ మాసిపోయినది   . his friendshipfor them was * by this conduct యిట్లా చేసినందున  వాండ్లయందు వుండే స్నేహముపోయినది.
Effect    n     s     ఫలము, ఫలపర్యవసానము, క్రియ, గుణము, కార్యము, ప్రయోజనము,స్వార్థకము . the paleness of his face is the * of hunger ఆకలిచేత వాడి ముఖముతెల్లబారినది. The * of this is that he will not come యిందుకు తేలే ఫలముయేమంటే వాడు రాడు.   the * of an evil eye దృష్టిదోషము. the rain had great * anthe flames ఆమంటలో వాన కురిసింది నిండా సఫలమైనది, ఆ వాన      కు  మంట  అణిగినది.pupose భావము, తాత్పర్యము. he wrote me to that  * అదే భావమునుపట్టి నాకువ్రాసినాడు. he expressed himself to this * అతను చెప్పిన వైఖరియే మంటే, యీ జాబులోని ఫలితాష్థము యేమంటే. Cause and *  కార్యకారణములు. It has a very pretty* or apperance అది సొగసుగా వున్నది, అదిసరసముగా వున్నది . It has a very queer * అది వికారముగా వున్నది, విరూపముగా వున్నది. the ball took * on his hand.తుపాకి గుండు వాడి తలమీద తాకినది.  his turban prevented  the ball from taking *పాగావల్లగుండు తాకక తప్పినది. the medicine produced no * ఆ మందు పట్టలేదు.my words had no * నేను చెప్పిన్ని నిష్ఫలమైనది. the regulation took *ఆ  చట్టము పనికి వచ్చినది. your appointment will take * from the date of hisdeparture నీకు యిచ్చిన వుద్యోగము అతను ప్రయాణమై పొయ్యేదినము మొదలుకొనిచెల్లును . Will the spell take * on us ఆ మంత్రము మనమీద పారునా. the author evidently use this expression merely for * మనుష్యులు వూరికే ఆశ్చర్యముపడడమునకైకవి దీన్ని ప్రయోగించినాడు. In * the two are the same మెట్టుకు రెండు వొకటే.In *  you will  have to pay the money  తుదకు ఆ రూకలు నీవు యివ్వవలసివస్తున్నది. this in * adoption యిది తుదకు  దత్తని తేలుతున్నది, యేర్పడుతున్నది. the constitut-ional  *s of a disease తీరిన  రోగము యొక్క వేగము  . Effects ( plural ) or property of the  decesed చచ్చినవాడిసొత్తులు, సామానులు, ఆస్తి.( Fielding usesthis for the goods of the living).   
Effected    adj        సఫలమైన, సాధించిన   , నిర్వహించిన నెరవేర్చిన, తేలిన, తీరిన,సిద్ధించిన. this was * by stratagem యిది ఉపాయముచేత సాధ్యము అయినది.  It wasnot * అది సాధ్యము కాలేదు. my wishes were  not * నా కోరిక కొనసాగలేదు. hegot this * వాడు దీన్ని సాధించుకొన్నాడు.   
Effectively    adv        సఫలముగా, ఉపయోగముగా,        బలముగా . this is * a marriageయిది వివాహముతో జతే, తుదకు యిదిన్ని వివాహమనే తేలుతున్నది. the disease is now* cured  ఆ రోగము యిప్పుడు తీరా కుదిరినది .
Effector    n     s     సఫలము చేసినవాడు,    వొనగూర్చినవాడు, నెరవేర్చినవాడు.
Effectual    adj        సఫలమైన, సార్థకమైన.
Effectually, Effectually    adv        సఫలముగా, ,  సార్థకముగా,  బొత్తిగా.it * cured him  of this folly అందుచేత వాడికి  యీ వెర్రి బొత్తిగా లేకపోయినది.
Effeminate    adj        ఆడంగితనముగా వుండే, పిదపగావుండే, అప్రయోజకుడైన
Effeminately    adv        ఆడంగితనముగా , పిదపతనముగా , అప్రయోజకుడుగా.
Effeminateness    n     s     see Effeminancy.
Effervescence    n     s     పొంగు, ఉద్రేకము. an * of rage కోపోద్ద్రేకము.
Effervescent    adj        పొంగే.
Effete    adj        నీరసమైన, కారము చచ్చిన, బలహీనమైన, బలముడిగిన, జబ్బైన.
Efficacious    adj        అప్రయోజకరమైన, ఫలకరమైన     , సిద్ధిదమైన. the medicinewas not *   ఆ మందు పట్ఠలేదు.   the spell was not * upon them ఆమంత్రము వాండ్లమీద పారలేదు.
Efficaciously    adv        ప్రయోజనకముగా,   ఫలకరముగా.
Efficaciousness, Efficicacy    n    s.     ప్రయోజనము, ఫలము, గుణము.
Efficiency    n     s     ఫలోత్ఫాదకశక్తి, ఫలమును కలుగచేసేశక్తి, త్రాణ     
Efficient    n     s     ( in mathematics) కరణము, సాధనము.
Effigies, Effigy    n    s.     ప్రతిమ, పటము. he was hung and burnt in effigyవాని వలె పటము వ్రాసి దాన్ని ఉరితీసి దహనము చేసినారు.
Efflorescent    adj        పూచిన.  on the skin పేలిన, దద్దరించిన, పుష్పించిన.
Efflorscence    n     s     పుష్పించడము,పూయడము. Damp caused * on the wall చెమ్మచేతగోడ వుప్పువురుస్తున్నది * on the skin దద్దులు, బొబ్బలు.
Effluent    adj        ఉత్పన్నమైన, నిర్గతమైన, విస్తృతమైన.
Effluvia    (n        s. plu.) వాసన. a stink దుర్గంధము, గబ్బు .  he preceivedthe * of a corpse పీనుగ కంపు వచ్చినది.
Effluvium    (n        s. singular) వాసన. See Effluvia.
Efflux    n     s     స్రవణము, కారడము. the * of matter from a wound    పుంటినించిచీము కారడము. to stop the * of the blood.   నెత్తురు కాషడమును నిలపడానికై.
Effort    n     s     యత్నము,   ప్రయత్నము.
Effrontery    n     s     సిగ్గుమాలినతనము, సిగ్గులేమి.
Effuence    n     s     that which issues from some other principle  నిస్సరణము, నిసృతి .వొకటి మరివొకటినుంచి పుట్టడము, కలగడము అనగా కళ, తేజస్సు. వాసనమొదలైనవి. Light అనగా కళా తేజస్సు, వాసన మొదలైనవి. Light is the * of the sunవెలుగు సూర్యుడివల్ల కలిగినది, తేజస్సు సూర్యోద్భూతమైనవి.
Effulgence    n     s     తేజస్సు, కాంతి, ప్రకాశము, దీప్తి.
EFfulgent    adj        అతి ప్రకాశమైన.
Effused    adj        స్రవించిన, కారిన, వడిసిన.
Effusion    n     s     స్రవించడము, కారడము,కుమ్మరించడము.      there was a great * ofblood ఏక నెత్తురు వెల్లువగా వుండినది. a poetical * కావ్యము. a greatful *స్తవము.
Eft    n     s     బల్లి, గౌళి.
Egestion    n     s     విసర్జనముచేయడము, బయటికి వెళ్లేటట్టుచేయడము.
Egg    n     s     గుడ్డు, అండము .
Egg-plant    n     s     (or brinjal)  వంగచెట్టు.
Eglantine    n     s     వొక తరహా రోజా పుష్పము.
Egmore    n     s     (name of a surburb of Madras) యెళుంబూరు, యెగుంబూరు .
Egoism    n     s     See Egotism.
Egotims    n     s     నేను నేనడము, మాటమాటకున్ను నేను నేనని మాట్లాడడము, తన్నగురించే  పదే పదే  చెప్పడము, అహంకారము.
Egotist    n     s     అహంకారి. యేవేళ తన్ను గురించే మాట్లాడేవాడు. this poet is an *యీ కవి వూరికే  తన వృత్తాంతమే చెప్పుతున్నాడు.
Egotistic, Egotistical    adj        అహంకారియైన.
Egregious    adj        అతిశయించిన, మహత్తైన,చెడ్డ. an * blockhead శుద్ధమూఢుడు.
Egregiously    adv        అతి మిక్కిలి, నిండా. this is * foolish యిది వట్టి వెర్రి.
Egress    n     s     బయలుదేరడము.this prevented their *  *  యిందుచేత వాండ్లు బయటికిరావడమునకు లేకపోయినది.
Eh    (interj)          హే అని వింతగా అనడము. did he say so * ? హే అట్లా అన్నాడా?    * whatis that హే అది యేమి.
Eight    adj        యెనిమిది. at dice దచ్చి Eighteen, adj. పద్దెనిమిది. * pence means one shilling and a half. ముక్కాలు రూపాయ.(being three quarters of a rupee which is thus called) .
Eighteenth    adj        పద్దెనిమిదో.
Eighth    adj        యెనిమిదో.
Eighthly    adj        యెనిమిదోదిగా.
Eighty    adj        యెనభై.
Either    adv        అయినా.  * here or there యిక్కడనైనా, అక్కడనైన. * him or meనన్నైనా వాన్నైనా. * to-morow or next day రేపట యెల్లుండి * two or threeరెండు మూడు, రెండైనామూడైనా. * before or after     ముందరైన పిమ్మటైనా.Is this * a fit time or place for it అందుకు  తగిన సమయమా తగిన స్థలమా.
Ejaculation    n     s     నామస్మరణ, జపము , మెల్లిగా అనుకొనేమాటలు, దేవుడా స్వామీఅని అనుకొనేమాటలు.
Ejected    adj        వెళ్లకొట్టబడ్డ, బయటికితోయబడ్డ, బహిష్కృతమైన, వమనమైన.
Ejection    n     s     వెళ్లకొట్ఠడము, బయటికితోయడము,  నివర్తిచేయడము, బహిష్కారము.
Eke    adv        (likewise, besideds, moreoever) మరిన్ని, యిదిన్నిగాక పైగా, యిది కావ్యమందు వచ్చే మాట. his father  and * his brother వాడి తండ్రిన్ని పైగా వాడి అన్నానున్ను. To Eke, v. a.  పెంచుట, సరుదుకొనుట.   he *d out the history ఆ కథను చాలాపెంచి చెప్పినాడు. she *d out the money ఆ రూకలతో  శానాదినములు గడుపుకొన్నది.she *d out the cloth so that it made two coats  గుడ్డ కొంచెముగా వుండిన్నిరెండు చొక్కాయలుగా సరిది కుట్టినది.
Elaborate    adj        శృంగారించిన, దివ్యముగా కుదిరిన, పరిష్కారమైన, తీరిన.
Elaborately    adv        దివ్యముగా, పరిష్కారముగా.
Elaboration    n     s     శృంగారము, పరిష్కారము, ఉల్లేఖన.
Elapsed    adj        గడిచిన, గడిచిపోయిన, జరిగిన, అతిక్రమించిన, గతమైన.
Elastcity    n     s     స్థితిస్థాపకగుణము, నయగుణము.  See Elastic.
Elastic    adj        springy, playing ఆడే, నటించే, స్థిత స్థాపకమైన, స్థితిస్థాపకగుణముగల, తన గుణమువిడవని, పట్టివిడిచినమండ, సాగదీతి విడిచిన తోలు, వాపుమీదచేసిన నొక్కుమొదలైన వాటివలె  యధాస్థితిని పొందే. See in proof. of this Colebr.in Roy.As. Trans. I. p. 111. Indian rubber is * రబ్బరును సాగదీసి విడిచిపెట్టితేయెప్పటివలె మడుచుకొంటున్నది. pillow is * తలగడను అదిమితే పల్లమునుపడి మళ్లీ యెప్పటివలె వుంటుంది. a pen is * పేనాను వంచినా  యెప్పటివలెఅవుతున్నది. she danced with * toe అతిలాఘవముగా ఆడినది. an *   atmosphereనాతిశీతోష్ణమైన వాయువు. * spirits   ఉల్లాసభావము.
Elate, Elated    adj        ఉల్లసించిన, ఉల్లాసభరితమైన, ఆనందించిన. he was much elatedwith this యిది వాడికి మహావుల్లాసమైనది.
Elation    n     s     ఉల్లాసము, ఆనందము.
Elbow    n     s     మోచెయ్యి. or turning మోచేతి వంపు. I was at his  * నేను వాడి పక్కనువుంటిని. he always keeps it at his *  వాడు యేవేళ దాన్ని దగ్గరపెట్టుకొంటాడు. he is out at *s వాడికి కట్ఠుకునేటందుకు కూడాబట్టలు లేవు, అనగా చింపి గుడ్డలు కట్టుకొన్నాడు.
Elbow-chair    n     s     చేయి పిడిగల కురిచి.
Elbow-room    n     s     మెదలాడనకుచోటు, యిటూ అటూ కదలాడనకు చోటు. I haveno * here  యిక్కడ నాకు కదల మెదలాడనకు చోటు లేదు.
Eld    n     s     వృద్దాప్యము, యిది కావ్యమందు వచ్చే మాట.
Elder    n     s     జ్యేష్టుడు, పెద్ద, కులపెద్ద.
Elderly    adv        వయసుచెల్లిన, వృద్దాప్యముగల. an * man వయసు చెల్లినవాడు. an * woman  వయసు చెల్లినది.
Elders    n     s     plu. జ్యేష్టులు, పెద్దలు, వృద్దులు.
Eldest    adj        జ్యేష్టుడైన, పెద్ద. * child పెద్దబిడ్డ, జ్యేష్టశిశువు. which is * ?  he or you ? వాడు పెద్దా నీవు పెద్దా, నీవు జ్యేష్టుడా, వాడు జ్యేష్టుడా.
Elecampane    n     s     వొక విధమైన చెట్టు. Ainslie 1. 119.
Elect    adj        ఏర్పరచబడ్డ, కోరుకోబడ్డ, నియుక్తమైన, స్థాపితమైన, మనోనీతమైన, గ్రాహ్యమైన, మనసువచ్చిన .  he and his son-in-law *  తానున్ను తన అల్లుడుగాయేర్పరచుకోబడ్డ వాడున్ను. the * of God ఈశ్వరుడిచేత యేర్పరచుకోబడ్డవాండ్లు,ఈశ్వరస్య మనోనీలోకా, అనగా ఈశ్వరుడి దయకు పాత్రులైనవాండ్లు . the Governor * గవనరు కాబోయేవాడు.
Elected    adj        ఏర్పరచబడ్డ, నియమించబడ్డ, బహుమందిచేత యేర్పరచి నియమించబడ్డ.
Election    n     s     ఏర్పరచడము, ఏర్పాటు, కోరుకోవడము . I leave it to your * నీకు మనసు వచ్చినది యెత్తుకో. there was an * of master for the schoolఆ పల్లెకూటానికి ఉపాధ్యాయులను యోగ్యతను చూచి యేర్పరచుకోవడమైనది.in theology  ఈశ్వరేచ్ఛ, ఈశ్వర సంకల్పము.
Electioneer    n     s     ఏర్పరచే అధికారముగలవాడు నన్ను యేర్పరచవలెనని కోరుకునేవాడు. 
Electioneering    n     s      అనేకులను వుపసర్పించి వారి యొక్క అంగీకారమునుసంపాదించుకోవడము.
Elective    adj        ఏర్పరచుకొనే, కోరుకునే. all moral goodness will  సమస్తపుణ్యములున్ను చిత్తవృత్తియందే కలుగును, అనగా బలాత్కారము మీద జరిగే  ధర్మముధర్మము కాదు.
Elector    n     s      ఏర్పరచి యెత్తుకునేవాడు, కోరుకునేవాడు. 
Electoral    adj        జర్మని దేశమందు మహారాజరాజశ్రీ అనే మాటకు తుల్యమైనది.
Electorate    n     s      జర్మనిదేశములో ఒక తరహా జమీందారి.
Electric, Electrical    adj        (astonishing)  ఆశ్చర్యకరమైన, అద్భుతమైన,అకర్షణాపకర్షణ శక్తిగల. or superhuman అతిశయమైన, మహనియ్యమైన,అంతర్గతాగ్నిసంబంధమైన.  the * spark మెరుపు, పిడుగుతోకూడా  పడే అగ్ని.the fire in a flint is * చకుముకిరాతిలోని నిప్పులోగా వుండి తట్టితే పడేటిది.
Electrically    adv        attractively  ఆకర్షించి, ఆశ్చర్యకరముగా.
Electrician    n     s     అంతర్గతాగ్ని పరిశోధక శాస్త్రజ్ఞుడు.
Electricity    n     s     అంతర్గతాగ్ని పరిశోధకశాస్త్రము, శరీరగతాగ్ని, ఇంధనాగ్ని,అనగా రాపిడిచేత పుట్టే అగ్ని, సంఘర్షణచేత పుట్టే అగ్ని.
Electrified    adj        అంతరగ్నిగల, శరీరగతాగ్నిగల, సంఘర్షణాగ్నిగల.the stone was * ఆ రాయి అంతరగ్నితో సంపూర్ణమైనది.   bodies are *by friction  రాపిడిచేత  ద్రవ్యములలోనుంచి అగ్నిపుట్టుతున్నది. or astonishedవెరుగుపడ్డ, ఆశ్చర్యపడ్డ రోమాంచము కలిగిన.
Electuary    n     s     లేహ్యము.
Elegance    n     s     సొంపు, సొగసు, సౌందర్యము,   శృంగారము.
Elegant    adj        సొంపైన, సొగుసైన, సౌందర్యమైన, లక్షణమైన, శృంగారమైన.a man of * manners  నాగరీకుడు, సరసుడు. *   learning సాహిత్యము . *arts ఆట, పాట, చిత్రము, సాము మొదలైన విద్యలు.
Elegantly    adv        సొంపుగా, సొగుసుగా లక్షణముగా, శృంగారముగా
Elegiac    adj        శోకమైన. an * poem   శోకరసముగల కావ్యము.
Elegy    n     s     శ్లోకములు వొక తరహా కావ్యము, యిందులో శోకరసముగానివిరహతాపముగాని విశేషముగా    వుంటున్నది.
Element    n     s     భూతము, మూలము, మూలవస్తువు,       మూలసూత్రము, ప్రధానద్రవ్యము. Air, Earth, Fire, Water and Ether are by the Hindus cosideredthe " Five Elements  పంచభూతములు. amibition accumulated the *sof rupture ఈర్ష్య ద్రోహానికి కారణమైనది. Blood is an * in mortal bodiesజంతుకోటి యొక్క శరీరములలో నెత్తురు వొకమూల ద్రవ్యము.  the man dared toencounter the  alligator in his own * స్థానబలము కలిగిన మొసలితో మనిషిపోరాడను తెగించినాడు, స్థానబలము అనగా నీళ్లు అని భావిస్తున్నది.put him in that employment then you shall see  he will be in his *వాణ్ని ఆ వుద్యోగములో పెట్టితే అప్పుడు వాడి ప్రజ్ఞ బయటపడుతుంది చూడు.Colonel Munro was educated as a Military man and yet he  was  quite in his * as a Collector మండ్రోల్ సాహేబు కత్తికట్టువాడు అయినప్పటికిన్ని కలక్టరు పనిలో నున్ను శారదగా వుండినాడు. In revenue business heis in his * in Magistrate's he is quite out of his *రీవినియూ పనిలోవాడు ప్రవీణుడుగా వున్నాడు గానిమెజిస్ట్రేటుపనిలో వాడికి యెంతమాత్రమున్ను పరిచయములేదు.the alphabet అక్షరములు. he is still in the  *s of Telugu వాడు  యింకాఓనమాలలోనే వున్నాడు.  Ingredient constituent part పదార్ధము, ద్రవ్యము, వస్తు.In this medicine there are seven *s  యీ మందులో యేడు సరుకులు     కలిసి వున్నవి.యేడు పదార్థములు కలిసి వున్నవి. the sacred *s (i.e. Eucharist Lord's supperఅనే దేవభోజనములోని వస్తువులు  . the simple * or the pure * జలము, నీళ్లు.the watery * అబ్లింగము, అనగాజలము. the ethereal * వాయులింగము, అనగా వాయువు. the ిraging *s గాలివాన, తుఫాను, అగ్ని భయము, ఉప్పెన, వెల్లువ మొదలైనవి .the devouring * అగ్ని.the house fell a prey to the fiery ఆ యిల్లు కాలిపోయినది. * In logic విషయము. To preserve the *s of   righteousness I will appearin every age  ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే.   Gita. 4. 8.
Elemental    adj        ఆదిమ, ప్రథమ, ఆదిభూతమైన, ఆదిమూలమైన.        the * body లింగశరీరము..( See Wilson on Sankhya Karika P. 133. the " rudimental body" ) at death thebody is resolved into  its * parts  చచ్చిన తరవాత శరీరము పంచభూతములతోకలిసిపోతున్నది.
Elementary    adj        ఆదిభూతమైన, ఆది మూలమైన, ప్రధానవస్తువైన. * worksమూలసూత్ర గ్రంథములు, బాలులకొరకు సంగ్రహముగా       యేర్పరచబడ్డ పుస్తకములు,బాలశిక్ష మొదలైనవి. Ignorance is * and indefinable అజ్ఞాన మనాద్యంనిర్వచనియ్య, యితి శంకరాచార్యః.
Elemosynary    adj        ధర్మానికి యిచ్చిన, భిక్షముగా యిచ్చిన. an * subsistenceతిరిపెము, బిచ్చము.
Elephant    n     s     యేనుగ, గజము, హస్తి. an *  that is in heat ( must) or infuriatedమదముపట్ఠిన యేనుగ.   she * ఆడ యేనుగ.   the seat or howdah on an *  అంబారిహవుదా, చౌడోలు. an *  driver మావటివాడు, మావటీడు. the *   hook అంకుశము.an * trap వారి. the * apple వెలగపండు.
Elephantiasis    n     s     ( or cochin-leg, a disease ) యేనుగ కాలు అనే రోగముతెల్లకుష్టము.
Elephantine    adj        ( huge, vast )  బ్రహ్మాండమైన.
Elesewhere    adv        మరియెక్కడనైనా, వేరే యెక్కడనైనా, అన్యత్ర,రెండోచోట.I was then  *  నేను  అప్పట్లో వేరే ఒక చోట వుంటిని, స్థలాంతరమందు వుంటిని.
Elevated    adj        పైకి యెత్తిన, ఉన్నతమైన, ఘనమైన, ప్రౌఢ. Being in so* a situation this place is cold కొండమీద అయినందున చల్లగా వున్నది. he was * with wine తాగి మత్తుగా వుండినాడు. * with pride గర్వించిన.* with joy ఆనందభరితుడైన. Being * to the   post of minister మంత్రి వుద్యోగమనేఔన్నత్యదశ వచ్చినందున .
Elevation    n     s     ఔన్నత్యము, యెత్తు. or a hill కొండ, తిప్ప. the housestood upon an * ఆ యిల్లు మిట్టమీద వుండినది. from the * of the gunsthe balls passed over us పిరంగులు మూతులు    పైకి పొడిగి వుండినందున గుండ్లుతలకు మీద పారిపోయినవి. or rank ఘనత. he was raise   d  to great * వాడుమహాఘనతను పొందినాడు.    * joy ఆనందము .    wine causes  an * of the spiritsతాగడముచేత   మనసుకు వుల్లాసము కలుగుతున్నది.   in Astronomy ఉచ్ఛము. the * of the host యిది రోమ ్  మతములలో ఒక ఆచారము.
Eleven    adj        పదకొండు, ఏకాదశము.
Eleventh    adj        పదకొండో, ఏకాదశమైన.    at the * hour మించిపోబొయ్యే తరుణములో,రవంత తప్పితే  చెడిపొయ్యే సమయంలో.   This  alludes to Matt. XX. 6. 9.
Elf    n     s     కన్నికలు, భూతము, దయ్యము, మోహిని, లోడితెడు మనిషి.              Elfin, adj . కన్నికల సంబంధమైన, దయ్యము వంటి.
Elfish    adj        పొట్టిగా వికారముగావుండే, భయంకరమైన.
Elflock    n     s     చింపిరితల, జడలుకట్టుకొని పోయినతల. also see Plica.
Eligibility    n     s      యోగ్యత, అర్హత, ఉపయుక్తత .
Eligible    adj        యోగ్యమైన, అర్హమైన, తగిన, వొప్పిన, ఉపయుక్తమైన.
Eligibly    adv        యోగ్యముగా , ఉపయుక్తముగా, యిది సుశబ్దము కాదు.
Elision    n     s     లోపము.  here the vowels suffers *  యిక్కడ అచ్చు లోపిస్తున్నది.
Elixir    n     s     కషాయము, ధృతి, ద్రావకము, సిద్ధ క్రియ, యీ మందు పుచ్చుకుంటేమనిషి వెయ్యేండ్లు బ్రతుకుతాడు అనేది మొదలైన ఫల శ్రుతి కలదు.
Elk    n     s     కణిత, కణజు. ( This  is the animal commonly but  wrongly calledan elk, see Madras Journal XXV.220. No.s 51 in Elliot's Catalogue.)
Ell    n     s     వొకటింపాతికగజకోల  .
Ellipse    n     s     శబ్దలోపము, వాక్యలోపము. here is an *    యిక్కడ వొక శబ్దములోపము, అనగా అధ్యాహారము చేసుకోవలసినది.     here we must  understand an *ఆ మాటను యిక్కడ తెచ్చుకోవలసినది.
Ellipse, Ellipsis    n    s.     అండాకారము, కోడిగుడ్డు యొక్క ఆకారము, కోడిగుడ్డు రూపు.
Elliptic, Elliptical    adj        కోడిగుడ్డు ఆకారముగా వుండే, దోసకాయఆకారముగా వుండే, సంగ్రహమైన సూత్రమువలె , రెండు ముక్కలుగా వుండే.an * expression టూకిగా చెప్పినమాట, పదిమాటలకు వొక మాటగా చెప్పిన మాట.
Elm    n     s     వొక వృక్ష నామము.
Elocution    n     s     ఉచ్ఛారణ, మాట్లాడేశక్తి, వాగ్ఝరి, వాగ్దాటి, వాక్పటుత్వము, వక్తృత్వము, వాచాలకత్వము.
Eloded    adj        లోపించిన, లోపముపోయిన .
Elogy    n     s     స్తోత్రము, స్తుతి.
Elohim    n     s     భగవంతుని నామము.     in Ps. lxxii. 1. ఈశ్వర. A+ in verse6 దేవతా.
Elongated    adj        పొడుగుచేసిన, దీర్ఘమైన, సోగైన. an * sound ప్రచయము,    దీర్ఘస్వనము.
Elongation    n     s     పొడుగు, దీర్ఘత, సోగ.
Elopement    n     s     పారిపోవడము, అనగా తండ్రిని గాని మగణ్నిగాని విడిచిపెట్టి వొకన్ని అంటుకొని పారిపోవడము.
Eloqence    n     s     మాట్లాడేశక్తి, వాగ్ఝరి, వాక్పటుత్వము, వక్తృత్వము, వాచాలకత్వము.you will try all your * in vain  యెందుకు వృధాగా   నీవు నేర్చినదెల్లామాట్లాడుతావు.
Eloquent    adj        వక్తైన, వాచాలకుడైన,  బాగా మాట్లాడేవాడైనా. an *  man మాటకారి,వాచాలకుడు. the dog gazed at me with  a most * eye   ఆ కుక్క నన్ను చూచినవైఖరి చూస్తే దాని మనోభావమును నోటచెప్పినట్టే వుండెను.
Eloquently    adv        వాచాలకత్వముగా.
Else    adv        లేకుంటే, లేకపోతే, కాకుంటే,వినహా,కడమ, తక్కిన, యితరమైన.any one *  యితరులు , లోకులు. you may give him something * వాడికివేరేయేదైనా వొకటి యియ్యి.  what * ? యింకా ఏమి, మరియేమి. I told no one * మరియెవరితో చెప్పలేదు. he was thinking of something  *  వేరే ధ్యానముమీద వుండినాడు.who * ? యింకా యెవరు, మరి యెవరు. anywhere    *  మరియెక్కడానున్ను.your may keep it or * leave it with me నీవు వుంచుకుంటే  వుంచుకో లేకుంటే నావద్దపెట్టిపో. you must go there, or * he will be ruined నీవు అక్కడికి పోవలసినదిలేకుంటే  వాడు చెడిపోతాడు. you may pay  him if he comes today not * వాడునేడు వస్తే యియ్యి లేకుంటే వద్దు.
Elucidation    n     s     వివరణము, విశదము, వ్యాఖ్యానము.          
Eluded    adj        తప్పించిన, యేమార్చిన, వంచించిన.
Elusive    adj        వంచనైన, యెత్తైన, మోసమైన, పితలాటకమైన.
Elusory    adj        వంచనైన, మాయమైన, పితలాటకమైన.
Elves    n     s     (plu. of Elf ) కన్నికలు, మోహినులు, దివ్యభామలు,  దయ్యములు.
Elysian    adj        యింద్రలోకతుల్యమైన, అతి దివ్యమైన, అతి సుఖమైన, అత్యంతసౌఖ్యమైన.
Elysium    n     s     యింద్రలోకము, స్వర్గము, నందనవనము.
Em            అనగా Them,  He called'em వాండ్లని పిలిచినాడు.
Emaciated    adj        బక్క, చిక్కిన, చిక్కిపోయిన, యెండిన, కృశించిన, శుష్కించిన,క్షీణించిన.
Emaciation    n     s     కార్శ్యము, శుష్కించడము, చిక్కిపోవడము. from his * వాడు చిక్కిపోవడము వల్ల.
Emanation    n     s     కలగడము, ప్రసరణము. light is     an * from thesun. వెలుతురు సూర్యుడిలోనుంచి ప్రసరించినది, వెలుతురు సూర్యుడిలోనుంచిపుట్టినకళ, తేజస్సు.
Emancipated    adj        విముక్తుడైన, దాస్యవినిర్ముక్తుడైన. 
Emancipation    n     s     దాస్య విమోచనము.   * from  the chains of supersitionఅజ్ఞానపాశ విమోచనము.
Emasculated    adj        పుంస్త్వముపోయిన, దేబె .
Emasculation    n     s     పుంస్త్వమును పొగొట్టడము, ఖొజ్జాగా చేయడము,  కాలుపట్టడము.
Embankment    n     s     కట్ట, మడవ.
Embargo    n     s     దురాయి, వొట్టు, ఆన, ఆటంకము, నిరోధము. they laid an *    himవాణ్ని పోకూడదని దురాయి   పెట్టినారు.
Embarkation    n     s     వాడిమీదికి యెక్కడము, వాడకెక్కించడము, వొక వ్యాపారములోప్రవేశించడము.
Embarrassed    adj        తడమాడే, తత్తరించే, తొందరపడే, సంకటపడే, యిబ్బందిపడ్డ,కలతబడ్డ, చీకాకుపడ్డ. he felt much * యెటూ తోచక   తడమాడినాడు. his  estate was  * వాడి ఆస్తి అప్పులపాలైనది. an * man అప్పులచేత యిబ్బందిపడుతూ   వుండేవాడు.
Embarrassment    n     s     తడమాటము, తత్తరపాటు, తొందర, సంకటము, చిక్కుయిబ్బంది. without * తడమాటములేకుండా, ధారాళముగా.
Embassador    n     s     మంత్రి, వకీలు. See Ambassador
Embassy    n     s     రాయభారము.
Embattled    adj        యుద్దసన్నద్ధమైన.
Embedded    adj        పాదుకొన్న , పొదిగిన, చెక్కిన. 
Embellished    adj        శృంగారమైన, అలంకారమైన, వర్ణించబడ్డ. * withpictures పటములు గల, పటములచేత శృంగారముగా వుండే.
Embellishment    n     s     అందము, శృంగారము, అలంకారము, చిత్రము, పుస్తకాలలోవుండే బొమ్మ, పటము.
Embers    n     s     కట్టెనిప్పులు, అంగారము. ashes over * నిప్పుమీది నిగురు.
Emberweeks    n     s     ఉపవాస దినములు.
Embezzled     adj        అపహరించిన,తినివేసిన,యజమానద్రోహముచేసినోట్లోవేసుకొన్నస్వామిద్రోహముచేసిన
Embezzlement    n     s      అపహరించడము,     సిద్ధాయము చేయడము, స్వామిద్రోహము,స్వామి ద్రోహము చేసి నోట్లో వేసుకోవడము.
Emblazonary    n     s     శృంగారము.
Emblem    n     s     చిహ్నము, గురుతు, ఆనవాలు, గూఢార్థముగల చిహ్నము,సాంకేతిక చిత్రము. the lingam is an * of Siva లింగము శివునియొక్కస్వరూపము.   the  bull is an * of Siva వృషభము    శివునికి చిహ్నముthe  eagle is an * of Vishnu విష్ణువుకు చిహ్నము గరుత్మంతుడు.
Emblematical    adj        చిహ్నముగా వుండే,  గురుతుగా వుండే, సామ్యముగా వుండే,పోలికగా వుండే. a fable  is an * history వొక కట్టుకధ, జంతువులనుగురించిన మాటలై వుండిన్ని తాత్పర్యము మనుష్యులనుచెందేటిది, అన్యాపదేశముగావుండే  చరిత్ర.
Emblic myrobalan    n     s      అమలకము, ఉశిరకచెట్టు.
Embodied    adj        మూర్తీకరించిన, దేహియైన, చేర్చిన, కుదిరిన, యేర్పడ్డthey looked upon him as * virtue  అతణ్ని పుణ్యమూర్తిగా విచారించినారు.* holiness  పుణ్యమూర్తి, ధర్మస్వరూపము. the * spirit దేహి.the account is * in the letter  ఆ లెక్క ప్రత్యేకముగా వుండకుండాఆ జాబులోనే చేరి వున్నది. a statement wherein  these  circumstancesare  *  యీ సంగతులుగల వొక మనవి.
Embodiment    n     s     personification అవతారము.
Embolism    n     s     అధికమాసము.
Embolismic    adj        అధికముగా వచ్చిన, యిది మాసములను గురించినది.
Embosomed    adj        గర్భితమైన, నడమవుండే, దాగిన.    a village * in  woodsఅడివి నడమవుండే పల్లె.
Embossed    adj        గుబకలుగల. the door was  * with brass ఆ తలుపుకువిత్తళి గుబకలు వేసివుండినవి. a face * with boils కురుపులు గల ముఖము .
Embowered    adj        పొదలుగల. the  *  shaded పొదలుగల అడవి.
Embrace    n     s      కౌగిలి, ఆలింగనము.
Embrasure    n     s     జేవురుగండి, అనగా  బురుజులమీద ఫిరంగులను పెట్టేగండి,తుపాకులను దూర్చి  కాల్చడమునకై  కోటగోడలోని  సందు.
Embrocation    n     s      తైలము,   పుండుకు  పట్టించే తైలము, కషాయము, పుండుమొదలైనవాటిని కడిగే కషాయము మొదలైనటువంటివి.
Embroidered    adj        శృంగారమైన, బుటాలు వేసిన. gold     * slik  బంగారుసరిగె  బుటేదారిపట్టు.  the  meadows were * with  flowers ఆ పశిరిక బయలునానా  పుష్పములచేత శృంగారముగా వుండెను   . an English  style * with Latinలాటిను శబ్దజటిలమైన యింగ్లీషుభాష.
Embroidery    n     s     గుడ్డమీద పూలు వేసేపని, బుట్టాపని, బుటేదారిపని. 
Embroilment    n     s       కలతపెట్టడము,  కలహము, చిక్కు.
Embrowned    adj        చీకటిగావుండే,  నల్లగా వుండే, కందిన.
Embrued    adj        తడిసిన. hands * in  blood నెత్తురుతో తడిసిన చేతులు,అనగా   ఘాతకము  , కంటకతనము హత్య.
Embryo    n     s     పిండము, ఆదిమయత్నము.     * the  flower మొగ్గ.anb * general సేనాధిపతి లక్షణములుగల పిల్లకాయ. that  work is stillin * ఆ పనికి  యింకా అంగ మేర్పడలేదు,   ఆపని యింకా కుదురుపాటు కాలేదు.
Emendation    n     s     దిద్దుబాటు, సవరింపు. he returened me my letter with many *s  నా జాబును   చాలా దిద్ది మళ్ళీ పంపినాడు.
Emended    adj        దిద్దిన, సవరించిన, చక్కచేసిన.
Emerald    n     s      పచ్చ, మరకతము. a base *  గరుడపచ్చ.*  green మంచి పచ్చవర్ణము. the * Isle అనగా   Ireland అనేదేశమునకు  వుండే కావ్యనామము.
Emergency    n     s     అక్కర అవసరము, అగత్యము.     on emergencies అవసరమువచ్చినప్పుడు, కావలసినప్పుడు.
Emergent    adj        అక్కరైన, అవసరమైన, అగత్యమైన, అత్యావశ్యకమైన.
Emerods    n     s     plu. ( homorrhids) మూలవ్యాధి.
Emersion    n     s     ఉదయము, యిది నక్షత్రములను గురించిన  మాట.  after the *of the star  ఆనక్షత్రము ఆ గ్రహమును విడిచి యివతలకి వచ్చిన తరువాతafter   the *  of Venus   శుక్రమూఢము విడిచిన తరువాత.
Emery    n     s      కురువిందశిల యొక్క పొడి, కారండము,  ముఖ్యముగా యిందుకు corrundum అని అంటారు,  యిందులో  రత్నాలను  మెరుగు పెట్టుతారు . 
Emetic    adj        వమనకరమైన.      the nux vomica or *  nut మంగకాయ,ముష్టికాయ.
Emeute    n     s     tumult, commotion అల్లరి, గత్తర.
Emigrant    n     s     వలసపోయినవాడు, వలసవచ్చినవాడు, పరదేశి, స్వదేశత్యాగి.
Emigration    n     s      వలసపోవడము,       అచ్చపువలస.
Eminence    n     s       ఔన్నత్యము, పొడుగు,  యెత్తు, ఘనత, పర్వతము, తిప్పto gain * ఘనతను   పొందుట. a mam of *  ప్రసిద్ధుడు, నిపుణుడు. * in anu artనిపుణత, నైపుణ్యము. by  way of * రూఢిగా , విశేషించి. the  lotus by wayof * called clay-born  కమలమునకు పంకజమనేనామము రూఢిచేత వచ్చినది.his * ( title of a cardinal ) మహమ్మేరుసమానధీరులయ్ని గురువులవారు.
Eminency    n     s      ఔన్నత్యము, ఉన్నత స్థలము. he was raised     to great  *  వాడు మహా గొప్పవాడైనాడు. His * the Cardinal     శ్రీమద్గురువులవారు.
Eminently    adv        ప్రబలముగా, ప్రసిద్ధముగా, ఘనముగా, ముఖ్యముగా,మహాఅతిశయముగా. he was * pious అత్యంతభక్తుడు.
Emir    n     s     అధికారి, యిది తురకమాట.
Emissary    n     s     దూత, చారుడు, వేగువాడు, వేగు చూడడానకు పంపబడ్డవాడు.
Emission    n     s     స్థలనము, ప్రసరణము.
Emitted    adj        బయటవిడిచిన, బయలుదేర్చిన. the light * by the cloud మేఘములో కలిగిన మెరుపు. See To Emit.
Emmet    n     s     చీమ, పిపీలిక.
Emmity    n     s     పగ, వైరము, విరోధము, గిట్టమి. concealed * లోని పగ, లోవైరము. being a * with him they have acted in this manner వాడిమీద గిట్టక యిట్లా చేసినారు.
Emollient    adj        మార్ధవకరమైన, మెత్తనపరచే, యిది లేపనమును గురించినమాట.
Emolument    n     s     ఆదాయము, లాభము, కూడుదల.
Emotion    n     s     భావము, వ్యసనము, వ్యాకులము, తొందర, ఆశ్చర్యము,మోహము. he felt much * అతనికి కడుపు మండినది. violent or sinful *s అరిషడ్వర్గములు. an * of kindness దయారసము.
Empassioned    adj        సరసమైన, ఉద్రేకమైన, దీనమైన. * eloquence దీనాలాపము.
Emperor    n     s     చక్రవర్తి, సార్వభౌముడు.
Empery    n     s     రాజ్యము.
Emphasis    n     s     అవధారణము. with * అతి ముఖ్యముగా విశేషించి. he talked with more * (i. e. feeling, passion) than philosophy on his misfortunes అతడు తన ఆపదలను గురించి శాంతముగా వుండక మహా వ్యాకులముతో మాట్లాడినాడు.
Emphatic, Emphatical    adj        అవధారణార్థకమైన, నిర్ధాయకమైన. the regulation is * on this point యిందున గురించి చట్టము పరిష్కారముగా వున్నది. In grammar the * pronoun, myself himself నేనే, వాడే. The vowel e being thus added this is denominated ఏవార్థకాః.
Emphatically    adv        అతిముఖ్యముగా, బలముగా, ధృడముగా, నిర్దారణచేసి.that * excellent man Heber అతిఘనుడైన హీబరనే బిషపు, అతి ప్రసిద్ధుడైనహీబరనే బిషపు. This is an * unfortunate case (Ann. reg. 1794, Appx.129.) అతి దౌర్భాగ్యము.
Empire    n     s     రాజ్యము, చక్రవర్తిత్వము throughout the * రాజ్యమంతా,దేశమంతా. the attainment of universal * జగద్విజయము. the * of ignorance అజ్ఞానము యొక్క బలము, అజ్ఞానము యొక్క శక్తి.
Empiric    n     s     See Johnson టక్కు వైద్యుడు, పితలాటక వైద్యుడు, వైద్యుడని భేషజము చేసేవాడు.
Empirical    adj        Dogmatic (See Johnson)  అశాస్త్రీయమైన యిది మాయవైద్యమునుగురించినమాట. an *  theory వట్టికల్పన.
Empirically    adv        (See Johnson's second sense, As a Dogma) or falsely అశాస్త్రీయముగా, పితలాటకముగా, యిది మాయ వైద్యమును గురించిన మాట.
Employ    n     s     పని, ఉద్యోగము, కొలువు. he is out of * వాడు విడిగా వున్నాడు, పనిలేక వున్నాడు, వూరక వున్నాడు.
Employed    adj        పనిబడ్డ, పనిలోవుండే. his time is fully * వాడు యే వేళ పనిమీదనే వున్నాడు. the money was * in merchandise ఆ రూకలు వర్తకములో పెట్టబడ్డది, వ్రయమైనది.   
Employer    n     s     యజమానుడు.
Employment    n     s     పని, ఉద్యోగము, కొలువు, వ్యాపారము, కాలక్షేపము.
Emporium    n     s     వర్తకము బాగా జరిగే స్థలము, వర్తకమునకు యిరవైన పట్టణము, సరుకు వెలబొయ్యే స్థలము. canton is an * for opium నల్లమందు అమ్మడమునకు ముఖ్యమైనది కాంటననే పట్టణము. Hyderabad is an * for shawls శాలువలు వెలపోగడమునకు హైద్రాబాద్ ముఖ్యమైన స్థలము.
Empowered    adj        అధికారమిచ్చిన, శలవు యివ్వబడ్డ.
Empress    n     s     చక్రవర్తియొక్క భార్య, మరిన్ని చక్రవర్తిగా వుండే రాణి.
Emprise    n     s     ధైర్యము, సాహసము.
Emptied    adj        ఖాలిచేయబడ్డ. the box was * ఆ పెట్టె ఖాలీచేయబడ్డది.
Emptiness    n     s     శూన్యము, ఖాలీగా వుండడము, యేమిన్ని లేక వుండడము.he feels the * of worldly pleasures ఐహికసుఖములు వట్టిదని తెలుసుకున్నాడు.
Emption    n     s     విక్రయము, యిది ధర్మశాస్త్రమందు వచ్చే పదము.
Empty    adj        ఉత్త, ఊరకవుండే, ఖాళీగా వుండే, తప్పుగా వుండే. an * box వట్టి పెట్టె. an * house కాపురములేని యిల్లు. an * well వట్టి బావి, నీళ్లు లేని బావి. * ears of corn తప్పులు, తాలు. he sent them * away వాండ్లకు వొకటీ యివ్వకుండా వూరక పంపించినాడు. he gave hisbread to the * ఆకలిగా వుండే వాండ్లకు అన్నము పెట్టినాడు. he came * handed వుత్త చేతులతో వచ్చినాడు. an * fellow పిచ్చివాడు, నిరర్ధకుడు.an * contrivance పిచ్చియుక్తి. an * objection తప్పు ఆక్షేపణ, పనికిమాలిన ఆక్షేపణ. an * compliment శుష్కోపచారము. * declamation పనికిమాలిన మాటలు, వట్టి మాటలు.
Empurpled    adj        కందిన, యెర్రపారిన.
Empyreal    adj        తేజోమయమైన.
Empyrean    n     s     తేజోమండలము, జ్యోతిర్మండలము, అగ్నిలోకము.
Empyreumatic    adj        having the taste or smell of burnt substancesపొగ చూరుకంపుకొట్టే, పొగచూరు కంపుగల, కమురుకంపుగల. an * odourకారువాసన.
Emulation    n     s     పోటీ పైబడడము, అహమహమిక, మించవలె ననే యిచ్ఛ.these pupils shew great ఈ విద్యార్ధులు ఒకరిని ఒకరు మించవలె నని పాటుపడుతారు. * promotes trade పోటీచేత వర్తకము అభివృద్ది అవుతున్నది.
Emulous    adj        పోటీచేసే, పయిబడే, అహంపూర్వ మహంపూర్వమనేటి.they were * of him వాడితో సరికావలెనని కోరుతూ వుండిరి.
Emulously    adv        పోటీగా, ఒకరిని ఒకరు మించవలె నని, నీవు ముందంటే, నేను ముందని.
Emulsion    n     s     పాలు, రసము, అనగా శరీరము మృదువు యివ్వడమునకై బాదంపప్పు గసగసాలు మొదలైన వాటి పాలతో చేసే నలుగు చెడ్డ జ్వరము మొదలైన రోగములు తగిలినప్పుడు ఈ లాటి పాలతో చేసే వొక రసాయనము.
Enactment    n     s     చట్టము, విధి, శాసనము, యేర్పాటు.
Enamel    n     s     శృంగారము, శ్రేష్టమైన తెల్లపింగాణి, దంత కాంతి, పండ్లయొక్క మెరుపు.
Enamelled    adj        శృంగారమైన, చిత్రమైన.
Enamoured    adj        వలపించిన, మోహించిన.
Enamouring    adj        మోహింపచేసే, మనోహరమైన, ముద్దైన.
Enamourment    n     s     మోహము, సొక్కు.
Encaged    adj        పంజరములో పెట్టిన.
Encamped    adj        దిగిన, ముకాము చేసిన, నిలిచిన.
Encampment    n     s     స్థానము, దండు దిగిన స్థలము, శిబిరము.
Encased    adj        పొదిగిన, కప్పిన, మూయబడ్డ. the diamonds were * insilk ఆ వజ్రములు పట్టులో వుంచి కట్టబడ్డవి.
Encaustic    n     s     పింగాడ్లు మీద పూలు వేసేది మొదలైన చిత్ర పని.
Enceinte    adj        గర్భిణిగా వుండే, యిది French శబ్దము.
Enchanted    adj        (in magic) అభిమంత్రించబడ్డ. (with wonder) ఆశ్చర్యపడ్డ.(with joy) ఉల్లసించిన, సంతోషించిన, ఆనందభరితులైన, ఆహ్లాదభరితులైన,మోహింపచేసిన. an * spot గందర్వులు మొదలైనవాండ్లు సంచరించేభూమి.
Enchanter    n     s     మాంత్రికుడు, మంత్రవాది, వ్యామోహముకలగచేసేవాడు,యింద్రజాలము మొదలైన విద్యలు చేసేవాడు, ఘనమైనకవులకు కూడా ఈ పేరు చెల్లుతుంది. * of snakes పామును తడకట్టేవాడు, పాము మంత్రగాడు.
Enchanting    adj        (delightful) అతిసరసమైన, మనోహరమైన.
Enchantingly    adv        అతిదివ్యముగా, మనోహరముగా, యింపుగా.
Enchantment    n     s     మంత్రము, మంత్రవిద్య, వశ్యము, మనోహరత్వము, మోహము మాయ, యింద్రజాలము. the * of riches ధనమదాంధము.
Enchantress    n     s     మంత్రకత్తె, జగన్మోహిని. she was a perfect * అది జగదేక మోహినిగా వుండెను.
Encirled    adj        చుట్టుకొన్న, చుట్ట వేసుకొన్న, పరివేష్టించిన.
Enclosed    adj        లోగా పెట్టుబడ్డ, ఆవరణ మేర్పరచబడ్డ, చుట్టుకోబడ్డ, బిడాయించిన. an * country బట్టబయలుగా వుండని దేశము, అనగా కొండలు గుహలు అడివి అగాంతరముగా వుండే దేశము. the country is not at all * ఆ దేశము బట్టబయలుగా వున్నది.
Enclosure    n     s     ఆవరణము, లోగా పెట్టిన కాగితము, జాబులో బిడాయించినకాగితము. he opened the letter and took out the *s జాబును విచ్చిఅందులో వుండిన కాగితములను తీసుకొన్నాడు.
Encomiast    n     s     శ్లాఘించేవాడు, కొనియాడేవాడు, భట్రాజు.
Encomiastic    adj        శ్లాఘనైన, మెప్పైన. * verses నాందిశ్లోకము.
Encomium    n     s     శ్లాఘన, మెప్పులు. he lavished his *s upon this దీన్ని నిండా కొన్నాడు, శ్లాఘించినాడు.  
Encompassed    adj        చుట్టుకొన్న, ఆవరించుకొన్న, ముట్టడివేసిన. his friends * him వాణ్ని చుట్టుకొని వుండే స్నేహితులు.
Encore    interj        శాబాసు, భళిర, భళీ.
Encounter    n     s     యెదిరించడము, అడ్డపడడము, యెదుటపడడము, యుద్ధము.
Encouraged    adj        ధైర్యపరచబడ్డ, ప్రేరేపణచేయబడ్డ, ప్రోత్సాహము చేయబడ్డ.
Encouragement    n     s     ధైర్యము, ప్రేరేపణ, ప్రోత్సాహమును (భరోసా H.)ప్రోద్భలము. they held out * to us మాకు ప్రోదల్బము చేసిరి.
Encouraging    adj        ధైర్యకరమైన.
Encrease    n     s     See Increase.
Encroachment    n     s     ఆక్రమించుకోవడము, అతిక్రమించడము.
Encumbered    adj        బళువు చేత తొందరపడే, సంకటపడే. the tablewas * with books ఆ మేజామీద పుస్తకాలు నిండివున్నవి. he is * with a large family వాడు వొక పెద్ద సంసారమును మెడకు కట్టుకొన్నాడు.his estate is much * వాడి ఆస్తిమీద అప్పులు శానా వున్నవి.
Encumbrance    n     s     బళవు, చిక్కు, తొందర, సంకటము, జంఝాటము.
Encyclopedia    n     s     సర్వ విద్యాసంగ్రహమనే గ్రంధం, సర్వశాస్త్ర సముచ్చయమనే గ్రంధము, అక్షరక్రమ నిఘంటు, యిందులో సమస్త శాస్త్రములున్నవి. 
End, end    n    s.     కొన, తుద, చివర, అంత్యము. the *s of the earch (literally the elephants) దిగంతములు, దిగ్గజములు. from the *s of the earth దేశాంతరమునుంచి. the *s of the world are come upon us ప్రళయ కాలము వచ్చినది. he was at his wits * వాడికి వొకటీ తోచక వుండినాడు, వాడకి బుద్ధి యెటుపారలేదు.I have the name at my toungues * ఆ పేరు నా గొంతులో వున్నది, అనగా జ్ఞాపకము రాలేదు. at the * of the month నెలసరికి, మా సాంతమందు. his * is drawing near అతనికి అవసాన కాలము వచ్చినది.he met his * with firmness వాడు చావుకు వెరవ లేదు. or intentతాత్పర్యము, అభిప్రాయము. at the very * కొట్టకొన, చిట్టచివర. the  work is now at an * పని సమాప్తమైనది. he made an * of the money ఆ రూకలను కాజేసినాడు. to the * that you may perceive this యిది తమరు కనుక్కోగలందులకు. to this * యిందు నిమిత్యమై to that * అందునిమిత్యమై. to what * do you deny this or you deny this to no * నీవు కాదనడానకు ఫలమేమి. Write it to the * కడాకు వ్రాసి వెయ్యి.from * to * కడాకు, సర్వత్ర. hear me to the * నేను చెప్పేదాన్ని తీరా వినుము. his hair stood on * వాడికి చెడ్డ భయమైనది. he slept twelve hours on * మూడుఝాములదాకా వొకటే నిద్రగా నిద్రపోయినాడు. he set the box on * ఆ పెట్టెను నిలవపెట్టినాడు. he just made both *s meet వాడి ఆదాయమునకు వ్యయములకు సరిపోయినది. odds and *s చిల్లరలు. It seems to be all odds and ends అది కలవర కంపగా వుండేటట్టుగా వున్నది. you must pay the money; there's an * of it పది మాట లెందుకు నీవు ఆ రూకలు యిచ్చి వేయవలసినది. he put an * to it దాన్ని పిలిచినాడు. he put an * to their lives వాండ్లను చంపినాడు.
Endangered    adj        అపాయమును పొందిన. his life will be * వాడి ప్రాణమునకు అపాయము వచ్చును, మోసము వచ్చును.
Endeared    adj        సరసమైన, ముద్దుగా వుండే.
Endearing    adj        సరసమైన, ప్రియమైన, మనోహరమైన. an * appellationముద్దుపేరు.
Endearment    n     s     సరసత, ముద్దు, మురిపెము, ప్రీతి, విశ్వాసకారణము.
Endeavour    n     s     యత్నము, ప్రయత్నము.
Ended    adj        ముగిసిన, తీరిన, సమాప్తమైన, సంపూర్ణమైన. It was * withgold దాని కొనను బంగారువేసి వుండినది.
Endemial    adj        an * disease అక్కడక్కడ ప్రజలకు తగిలే తెవులు.
Ending    n     s     ముగింపు, అంతము.
Endive    n     s     వొక తరహాకు కూరాకు.
Endless    adj        తుదిలేని, అంత్యములేని, తియ్యని నిరంతరమైన, అపరిమితమైన.the diamond cutter's wheel is turned by an * rope వడిదారము.
Endlessly    adv        అంత్యము లేకుండా, విడవక, తియ్యక, వూరక.
Endmost    adj        కడాపటి.
Endorsement    n     s     వెనుకతట్టు వ్రాసినది, యిది హుండీలు ఆర్జీలను గురించిన మాట.
Endowed    adj        గల కలిగిన, యుక్తుడైన, శాలియైన, సంపన్నమైన. * with learning విద్యగలవాడైన. * with sense బుద్ధిశాలియైన. richly * సంపన్నులైన. an * temple యిస్తువుగలగుడి. this pagoda is * the other is not యీ గుడికి యిస్తువ వున్నది ఆ గుడికి లేదు. * with bodily form దేహియైన.
Endowment    n     s     దానము, వరము, మాన్యము, బుద్ధి, యోగ్యత. a deed of *దాన పత్రము.
Endued with    adj        గల, శాలియైన, సంపన్నమైన. * with learningవిద్యావంతుడైన. Man is * with sense మనుష్యులకు వివేకము గలదు.
Endurable    adj        సహించకూడిన, తాళకూడిన. this is not * యిది పడగూడనిది.
Endurance    n     s     తాళిమి, వోపిక, వోర్పు, సమానము, నిలకడ. she teased him beyond all * వాడికి ప్రాణము విసికేటట్టు తొందర పెట్టినది. he shews great * వాడు మహా వోర్పుగలవాడుగా వున్నాడు, సమానము గల వాడుగా వున్నాడు.
Enduring    adj        వోర్చే, నిలిచే, గట్టి, శాశ్వతమైన. much * చాలా సహనముగల, నిండా వోర్పుగల, సహిష్ణుడైన.
Endwise    adv        నిలువుగా. the bricks were placed * యిటికలను నిలబెట్టినారు.
Enema            See Clyster,Anenemapipe, నేత్రం. W.
Enemy    n     s     శత్రువు, వైరి, విరోధి, పగవాడు, కానివాడు. the * or opposed soldiers పరదళము, శత్రుసైన్యము. he attacked the * శత్రుసేనను యెదిర్చినాడు. or the devil సైతాను.
Enerevated, Enfeebled    adj        దుర్భలమైన, శక్తిలేని, నిస్సత్వగావుండే, జబ్బైన, నీరసమైన. he is an * wretch వాడు వట్టి జబ్బుమనిషి.
Energetic, Energetical    adj        పరాక్రమముగల, శక్తిగల, బలముగల.   the Hindu dominion was tyrannical without being * హిందువుల ప్రభుత్వము పరాక్రమము లేనిదైనా క్రూరమైనదిగా వుండెను. the Musulman government was * but tyrannical తురకల ప్రభుత్వము పరాక్రమము కలదిగాని క్రూరమైనదిగా వుండెను. the English government though is not tyrannical యింగ్లీషు ప్రభుత్వము పరాక్రమము కలదైనా క్రూరమైనది కాదు. an * man శక్తివంతుడు.
Energetically    adv        బలముగా, శక్తిగా.
Energy    n     s     పరాక్రమము, శక్తి, బలము, సత్తువ, త్రాణ. he spokewith great * వాడు నిండా పట్టుగా మాట్లాడినాడు. he has lost all *నిస్త్రాణగా వున్నాడు నిస్సత్వగా వున్నాడు.
Enervation    n     s     బలహీనము, దుర్భలము, జబ్బు. in a state of *దుర్భలముగా వుండడములో.
Enfeoffiment    n     s     ఆధీనములో వుంచడము. deed of * ఆస్తిని ఆధీనము చేసే పత్రము, అధికారపత్రము.      
Enforcement    n     s     బలాత్కారము, బలవంతము చెల్లించడము, నడిపించడము.* of the law చట్ట ప్రకారము జరిపించడము.
Enfranchisement    n     s     విమోచనము, విడుదల, విముక్తి, అనగా దాసత్వవిముక్తి. after their * వాండ్ల దాసత్వ విమోచనమైన తరవాత.
Engaged    adj        పూటబడ్డ, పూనుకొన్న, పనిబడ్డ, పనిలో వుండే, ప్రవర్తించిన.he was * in the king's service వాడు రాజు కొలువులో వుండినాడు. he is * on that work ఆ పనిలో వుండినాడు. he was * in that plot వాడు ఆ కుట్రలో కలిసి వుండినాడు. while I was busily * నేను నిండాపనిగా వుండినప్పుడు. he is not now * వాడు యిప్పుడు వూరక వున్నాడు. he was deeply * in this work వాడు యిదే పనిగా వుండినాడు. the house is not now * ఆ యిల్లు యిప్పట్లో వూరక వున్నది. the troops were * all day ఆ దండు ఆ దినమంతా పోట్లాడుతూ వుండినది. he cannot come he is * వాడు వాడితో భోజనానికి వొప్పుకొన్నాడు గనుక రాలేడు. she is * (to be married)ఆ పిల్లకు నిశ్చితార్థమైనది.
Engagement    n     s     వొడంబడిక, వొప్పుదల. they entered into an * for the house ఆ యిల్లు మాట్లాడుకొన్నారు, ఆ యింటిని గురించి వొడంబడికచేసుకొన్నారు. he kept his * వాడు మాట్లాడుకొన్న ప్రకారము జరిగించినాడు.he broke his * మాట తప్పినాడు. I have an * and therefore I cannot  come వేరే వొప్పుకొన్నాను గనుక రాలేను. or battle యుద్ధము. there wasa general * ఏకముగా యుద్ధము జరిగినది. there was a partial * కొందరుయుద్ధము చేసినారు, అనగా కొందరు వూరక వుండినారని భావము. of marriage నిశ్చితార్థము.
Engaging    adj        సరసమైన, మనోహరమైన. he has very * mannersవాడు మహాసరసుడు. an * history మనోహరమైన కథ.
Engendered    adj        కలిగిన, పుట్టిన. the fever was * by the rain. వానచేత జ్వరము కలిగినది.
Engendering    adj        కలగచేసే, పుట్టించే.
Engine    n     s     యంత్రము, సాధనము, వుపాయము. a loom is an * for weaving మగ్గము బట్టలు నేసే యంత్రము. a fire * నిప్పును చల్లార్చే జల యంత్రము. a printing * అచ్చువేసే యంత్రము. a sort of pump or * for drawing water యేతాము, కపిల. a steam * పొగ యంత్రము, అనగా పొగచేత ఆడేటిది. warlike *s యుద్ధ సాధనములు, అనగా ఫిరంగి, తుపాకులు మొదలైనవి. they employed every * to destroy me నన్ను చెరపడమునకు యెన్ని యుక్తులో అన్నిన్ని చేసినారు.
Engineer    n     s     యింజనీరు, వాస్తు శాస్త్రము తెలిసిన సూత్రధారి.
England    n     s     ఇంగిలండు అనే దేశము. chruch of * యిది క్రిస్టియన్ మతములో వొక శాఖ.
Englightened    adj        ప్రకాశించే, వెలిగే, జ్ఞానముగల, వివేకముగల.
English    adj        ఇంగ్లీషు సంబంధమైన. the * ఇంగ్లీషువాండ్లు. an *man ఇంగ్లీషు వాడు.
Engrafted    adj        అంటించిన. See Ingrafted.
Engraver    n     s     చెక్కేవాడు, లోనాటు పని చేసేవాడు. a seal *ముద్రలు చెక్కేవాడు.
Engraving    n     s     లోనాటు చెక్కడపు పని. a picture అచ్చు వేసిన పటము. this book has many coloured *s అచ్చువేసి వర్ణము పెట్టిన బొమ్మలు యీ పుస్తకములో శానా వున్నవి.
Engrossing    adj        ఆక్రమించే, ఆకర్షించే. this is a very * businessయిది యావత్తు బుద్ధినిన్ని పెట్టవలసినపని.
Enhanced    adj        అతిశయించిన, అభివృద్ధియైన, హెచ్చిన, పొడిగిన.
Enhancement    n     s     అతిశయము, అభివృద్ధి, హెచ్చు.
Enigma    n     s     విడి కథ. his letter is a perfect in * to me వాడి జాబులోని భావము నాకు వీడలేదు. he expressed himself in *s వాడు  గూఢముగా మాట్లాడినాడు.
Enigmatical    adj        అర్థము వీడని, చిక్కైన, గూఢ భావముగల. * expressions గూఢ భావముగల మాటలు, అర్థము వీడని మాటలు.
Enigmatically    adv        అర్థము వీడకుండా, గూఢభావముగా, చిక్కగా.
Enjoyed    adj        అనుభవించు, పొందిన.
Enjoyment    n     s     అనుభవము, సుఖానుభవము, భోగము, సుఖము. the *s of life ఐహిక సుఖములు. during the * of health వొళ్లు కుదురుగా వున్నప్పుడు.
Enlarged    adj        అధికమైన, విస్తారమైన, గొప్పైన, పెరిగిన, దొడ్డ.an * mind or intellect ఘనమైన బుద్ధి. or freed విడుదలైన.testicle వొక బీజము.
Enlargement    n     s     అభివృద్ధి, విస్తారము, విమోచనము. or tumourనెరి, కంతి. from prison ఖైదిని విడుదలచేయడము.
Enlisted    adj        కొలువులో పెట్టుకొన్న, లావణములో దాఖలు చేసుకొన్న.
Enlivening    adj        సరసమైన, రంజకమైన, రమణియ్యమైన, వుల్లాసకరమైన. 
Ennui    n     s     (French) పాడు బద్ధకము, పిచ్చిపాలుమాలిక, వట్టిసోమారితనము. Laziness and gluttony produce * సోమారితనముచేతనున్ను తిండిపోతుతనము చేతనున్ను పాలుమాలిక కలుగుతున్నది. See on Vapours.     
Ennuy    (French)adj        బద్ధకముగల, సోమారితనముగా వుండే.
Ennuyee            (ought to be thus printed, The comma is misplaced.)
Enodation    n     s     explanation సందేహ నివారణము.
Enormity    n     s     crime అఘోరమైన పాపము, పాతకము.
Enormous    adj        great అపరిమితమైన, అపారమైన, బ్రహ్మాండమైన.
Enormously    adv        greatly అపరమితముగా, అపారముగా, బ్రహ్మాండముగా.
Enough    adv        చాలా కావలసినమట్టుకు. this is more than * కావలసినందుకుఅదికముగానే వున్నది. a hole only large * to admit the hand చెయి మాత్రముపట్టగల రంధ్రము. it is long * దాని నిడివి చాలును. it is not thick * at bottom. దానికి అడుగున దళము చాలదు. there will only be * corn for you ఆ ధాన్యము మీకే సరిపోను. give him * వాడికి కావలసినంత యియ్యి.Don't eat more than * కావలసినంతకంటే అధికముగా తినక.
Enow    plu        చాలా శానామంది.
Enpassant    adv        (French) (lit: in passing దాటడములో) మధ్యను, నడుమ.* I tell you one thing నడుమ వక మాట చెప్పుతున్నాను.
Enquirer    n     s     అడిగేవాడు, విచారించేవాడు, ఆపేక్షించేవాడు, కోరేవాడు.
Enquiry    n     s     విమర్శ, విచారణ, పరిశీలన, అడగడము.
Enraged    adj        ఆగ్రహపడ్డ, కోపమువచ్చిన, రేగిన. he was * వాడికి ఆగ్రహము వచ్చినది, వాడు రేగినాడు.
Enrapt, Enraptured    adj        పరవశుడైన, ఆనందభరితుడైన.                        
Enriched    adj        సంపన్నమైన, భాగ్యముగల, ఐశ్వర్యముగల, సత్తువగల, సారముగల.
Enrobed    adj        అంబరముగల, పరివేష్టితమైన, పరివృత్తమైన. the mountain * in clouds మేఘపరివేష్టితమైన పర్వతము.
Enrolement    n     s     పట్టీలో దాఖలు చేసుకోవడము.
Enrolled    adj        లావణములో దాఖలు చేసుకొన్న, పట్టీలో దాఖలు చేసిన.he was * in the college కాలీజు పట్టీలో అతని పేరు దాఖలు అయినది.
Enrooted    adj        వేళ్లు పారిన, పాదుకొన్న. * prejudices అనాదియైన వైరము.
Ens    n     s     తత్వము. God is described as an * or being దైవము తత్వమనిగాని వస్తువని గాని అనబడుతాడు.
Ensample    n     s     నమూన, మాదిరి, వుదాహరణము, దృష్టాంతము.
Ensanguined    adj        రక్తమయమైన, నెత్తురుతో తడిసిన, రక్తవర్ణమైన,యిది కావ్యమందు వచ్చేమాట.
Ensconced    adj        చాటున దాగిన. * in a palankeen he set out on the Journey పల్లకిలో దాగుకొని ప్రయాణమైపోయినాడు.
Ensign    n     s     టెక్కెము, ధ్వజము, ఝండా, కోడి. or officer దండులోEnsign అనే దొర దండులో దొరలకు యిచ్చే మొదటి వుద్యోగము.
Enslaved    adj        దాసుడైన, బద్ధుడైన. he is * to his lustsవాడు కామాతురుడై వున్నాడు.
Ensnared    adj        చిక్కిన, తగిలిన, తగులుకొన్న.
Ensnaring    adj        బుద్ధిని చెరిపే. a very * book బుద్ధిని చెరిపే పుస్తకము.
Ensurance    n     s     See Insurance.
Entail    n     s     A deed settling an estate upon a series of heirs; and generally accompanied with conditions and limitations makinga perpetuity ధనాధికారము, క్రమాగతాధికారము, క్రయవిక్రయాతీతభూమ్యాది,ఉత్తరాధికారే శున్ద్ధభోగ మాత్రం. (Dz.)
Entangled    adj        చిక్కు, కలవరము, కలత.
Entelechia    n     s     సిద్ధి, యిదితత్వమును గురించిన మాట.
Enterprise    n     s     సాహసము, సాహసకృత్యము, యత్నము, పూనిక, పూనుకొన్నపని, వుద్యోగించినపని.
Enterprising    adj        సాహసులైన, ధీరులైన. an * man సాహసుడు, ధీరుడు.
Entertainer    n     s     వుద్యోగములో పెట్టుకొనేవాడు, విందు పెట్టేవాడు.
Entertaining    adj        సరసమైన, హాస్యకరమైన. * poetry శృంగార కావ్యము.
Entertainment    n     s     విందు, వేడుక, వినోదము, తమాషా.
Enthralled    adj        చిక్కుకొన్న, తగులుకొన్న, దాసుణ్నిగా చేయబడ్డ, బద్ధ్య్ణ్నిగా చేయబడ్డ. * by love కామపాసబద్ధుడైన.
Enthralment    n     s     slavery దాస్యము, దాసత్వము.
Enthroned    adj        సింహాసనమెక్కిన, పట్టాభిషక్తుడైన.
Enthusiasm    n     s     దురభిమానము, అభినివేశము, వీరావేశము, దుస్సాహసము.
Enthusiast    n     s     దురభిమాని, దురభిమానముగలవాడు, వీరావేశము గలవాడు.he is a mere * in this వాడికి యీ పిచ్చి పట్టి యున్నది, వాడికి యిందులోవీరావేశము వచ్చి యున్నది.
Enthusiastic    adj        దురభిమానియైన, దురభినివేశముగల, వీరావేశముగల.
Enthusiastically    adv        దురభిమానముగా, వీరావేశముగా. they applauded him * వాణ్ని మహా అభినివేశముగా కొనియాడినారు.
Enthymema    n     s     అనుమానము, యిది తర్కశాస్త్ర విషయమైన మాట.
Enticement    n     s     the act of alluring to ill తీపి, పెట్టిన తీపి, రుచి, చూపిన రుచి, పెట్టిన ఆశ, పుసలాయింపు, నయవంచన, దుర్భోధన, సమ్మోహనము, మోసము, భ్రమ, మయకము.
Enticing    adj        నయవంచనైన, మనోహరమైన, శృంగారమైన, సరసమైన.
Enticingly    adv        నయవంచనగా, మనోహరముగా, సరసముగా.
Entire    adj        యావత్తు, అంతా, సమస్తమైన, అఖండమైన, పూర్ణమైన. the hoof of a cow is divided, but that of a horse is * ఆవు యొక్కగిట్టలు రెండు బద్దలుగా వున్నవి గుర్రపు గొరిశలు అఖండముగా వున్నవి.the * army was destroyed దండంతా హతము చేయబడ్డది. his * propertyవాడి యావత్సొత్తు. the * account was written by him ఆ లెక్కంతావాడిచేతనే వ్రాయబడ్డది. this horse is a gelding, but the other five are * యీ గుర్రానికి విత్తులు తీసినారుగాని కడమ అయిదుకు తియ్యలేదు.
Entirely    adv        యావత్తు, అంతా, కడవెళ్లా, శుద్ధముగా, బొత్తిగా, తీరా,సమస్తము. I am * ignorant నేను బొత్తిగా యెరుగను. he was * silentవాడు బొత్తిగా నోరు తెరవలేదు. it is * finished అది యావత్తు తీరినది.
Entireness    n     s     పూర్ణత్వము. from the * of the body, పీనుగ చెక్కుచెదరకుండా వుండినందున.
Entitled    adj        qualified అర్హమైన, పాత్రమైనన, యోగ్యమైన. the claimhe makes is * to attention అతను చేసే దావా మంచిదే, అనగా విచారించవలసినది. the objection he makes is not * to attentionఅతను చేసే ఆక్షేపణ మంచిది కాదు.
Entity    n     s     సత్వము, తత్వము, వాస్తవికత, వస్తుత్వము. See Quiddity. 
Entombed    adj        భూస్థాపితము చేసిన, పాతిపెట్టిన, పూడ్చిన.
Entomology    n     s     క్రిమి వివేచనము, అనగా పురుగులను గురించిన శాస్త్రము.
Entrails    n     s     పేగులు. Metals are dug from the * of the earth భూగర్భములో నుంచి లోహములు తవ్వబడుతున్నవి.
Entrammelled    adj        See Trammelled.
Entrance    n     s     ద్వారము, ప్రవేశము. the * of the house గుమ్మము,నడవ. I found an * దారి చిక్కినది. I foud no * నాకు అవకాశము చిక్కలేదు. on his * వాడు లోగా వచ్చినందు మీదట. who gave him * వాణ్ని లోగా విడిచినది యెవరు.
Entranced    adj        పరవశుడైన, నిర్విణ్నుడైన. she was * with griefఅది వ్యసనముచేత వొళ్లు తెలియకుండా పడి వుండినది. he was * with delight వాడు ఆనందపరవశుడై వుండెను.
Entrancing    adj        ఆశ్చర్యకరమైన.
Entrapped    adj        చిక్కిన, బోనులోపడ్డ, మాయలో చిక్కిన.
Entreatingly    adv        వేడికొని, బతిమాలుకొని.
Entreaty    n     s     వేడుకోవడము, ప్రార్థన, మనవి.
Entremets    n     s     (a French word) ఫలహారము, అనుపానము.
Entrench    &c        See Intrench &c.
Entrepot    n     s     (a French word) నడమ వుండే కోస్తా, యితరమైనకోస్తాలలో నుంచి యావత్తు సరకులు, యిక్కడ దిగుమతి అయి చుట్టు ప్రక్కలకుపోతున్నవి. Bombay is an * for Perisa నాలుగు తట్టుల నుంచి సరుకులువచ్చి బొంబయిలో దిగుమతి అయి అక్కడనుంచి పెర్షియా దేశమునకు యెగుమతిఅవుతున్నవి.
Entrusted    ad        వొప్పగించిన, అధీనముచేసిన, పరము చేసిన.
Entry    n     s     ద్వారము, మార్గము, ప్రవేశము. after his * అతడు ప్రవేశించిన తరువాత. in an account పద్దు. make an * regarding this యీ పద్దును లెక్కలో వ్రాసుకో. he made an * ప్రవేశించినాడు. thieves made an * into my house దొంగలు కన్నము వేసి నా యింట్లో చొరబడ్డారు.
Entwined    adj        చుట్టుకొన్న, మెలివేసుకొన్న. two * snakes పెనవేసుకొన్నరెండు పాములు.
Enumeration    n     s     లెక్క, యెన్నిక, వివరము, వయనము. he made an * of the particulars వయనము చెప్పనాడు.
Enunciation    n     s     ఉచ్చారణ. by his indistinctness of * వాడి వుచ్చారణ బాగా వుండనందున. logical * ఉద్దేశము. expression or wording రచన. See Colebr. Roy. As Soc. I. P. 94.
Enveloped    adj        కప్పబడ్డ, మూయబడ్డ, మరుగుచేయబడ్డ, చుట్టబడ్డ. thebody was * in a cloth ఆ పీనుగకు గుడ్డ చుట్టినారు. that murder is *in mystery ఆ ఖూని యెంతమాత్రము బయటపడలేదు. the question is * in obscurity యిది సందేహగ్రస్తముగా వున్నది.
Envelopment    n     s     అచ్ఛాదనము.
Envenomed    adj        విషమిశ్రితమైన, విషదగ్ధమైన. * language అతి క్రూరమైనమాటలు.
Enviable    adj        అపేక్షించదగిన, ఆశించదగిన, కోరదగిన. that is an* office అది మహాఘనమైన వుద్యోగము. he did not appear in a very* light అవమానము పొందినాడు.
Envious    adj        అసూయపడే, కడుపుమంటపడే, క్రూరమైన. he is * of youనిన్ను గురించి అసూయపడుతాడు.
Enviously    adv        అసూయపడి, కడుపుమంటగా.
Environs    n     s     చుట్టుపక్కలు, పట్టణము చుట్టు వుండే పేటలు, చుట్టుపట్లవుండే పల్లెలు.Envoy, n. s. రాయభారి, వకీలు. In a poem. See Epilogue.
Envy    n     s     అసూయ, కడుపు మంట, వోర్చలేనితనము, మచ్చరము.
Enwrapt    adj        పరవశుడైన, ఆనందభరితుడైన.
Epact    n     s     the excess of the solar month above the lunar synodical month కాలము యొక్క వుపిరి, అనగా చాంద్రమాన మాసమున కంటేసౌరమాన మాసము వుపిరి.
Epaulet    n     s     వొక తరహా భుజకీర్తి, దండు దొరల కుడుతాలలో భుజముమీద వుండే సరిగె కుచ్చులు, దీన్ని హెప్లెటు అంటారు.
Epha    n     s     మరక్కాలు, అనగా తూము. (F) యిది యింగ్లీషు శబ్దము కాదు.
Ephemera    n     s     ఏకదినజీవి, పుట్టిన దినమందే చచ్చే వొక తరహా పురుగులు, దోమ. this is a mere * యిది క్షణభంగురము.
Ephemeral    adj        వొకనాటితో తీరేటి, అప్పుడు పుట్టి అప్పుడే పొయ్యే, బుద్బుదమువంటి, అ శాశ్వతమైన, నశ్వరమైన. this under taking was quite * యీయత్నము మిద్దెమీది పరుగైనది, యీ యత్నము చేసినదేగాని జరుగనేలేదు. and * zeal ప్రారంభశూరత్వము. * visitors వొకదినముండి చూచిపొయ్యే వాండ్లు.
Ephemeris    n     s     a journal దినచర్య, దినవహి, దినశుద్ధి.
Ephemeron    n     s     అశాశ్వతమైనది, యిది కొన్ని పురుగుల పేరు.
Ephod    n     s     యూదియా ఆచార్యుడు తొడుక్కొనే చొక్కాయ, యిది బైబిలులోవచ్చేమాట, యిది యింగ్లీషు మాట కాదు.
Epic    n     s     కావ్యము, ప్రబంధము. an * poem మహాకావ్యము. the Hindu *s భారతభాగవత రామాయణములు. [Dz. says ఉపాఖ్యాన విశిష్టమైనది, మహా వీరవిషయకమైన కావ్యము.]  
Epicene    adj        స్త్రీ పుల్లింగమైన, అటుకానిది యిటు కానిది.
Epicure    n     s     రుచులు వెతికేవాడు, యెంత మంచిది పెట్టినా బాగులేదనేవాడు,నూటికి వొకటిని మెచ్చేవాడు. he is a great * in reading వాడు వెయ్యింటికివొక శ్లోకమును మెచ్చుకునేవాడు.  Epicurean, n. s. a sort of Atheist తాంత్రికుడు, నాస్తికుడు.
Epicycle    n     s     ఉపచక్రము, పరిధి. Colebr. says నీచోచ్చవృత్తము (Essays 2. 399. As. Res. XII. 234.)
Epidemic    n     s     తెవులు, ఏక కాలమందు చాలామందికి తగిలే రోగము, పోలేరు, వాంతి భ్రాంతి, చలిజ్వరము మొదలైనవి.
Epidemic, Epideimical    adj        తెవులుగా వుండే, విషగాలి సంబంధమైన, అంటు. an * fever విషగాలి సంబంధమైన జ్వరము. Cholera is * వాంతి భ్రాంతి వొక దెబ్బన బహుమందికి తగులుతున్నది. a * disease అంటురోగము.the * ravages of these insects చీడ, తెవులు.    Epidermis, n. s. పీతోలు, శరీరము మీద వుండే బైటి చర్మము. From the abrasion of the * మీది తోలు పొట్టు పొట్టుగా రాలిపోయినందుచేత.
Epigastric region    n     s     వక్షస్థలము, రొమ్ము.
Epigram    n     s     చాటు పద్యము. a collection of *s చాటు పద్యములపుస్తకము. the *s of Vemana వేమన పద్యములు, వేమన శతకము.
Epigrammatic    adj        చాటు శ్లోకరీతిగా వుండే, అనగా చమత్కారమైన.
Epigrammatist    n     s     చాటు పద్యములు చెప్పే కవి. Vemana was an* వేమన చాటు పద్యములు చెప్పేవాడు.
Epilepsy    n     s     కాకిసోమాల, మూర్ఛ రోగము.
Epileptic    adj        కాకిసోమాల, మూర్ఛరోగముగల.
Epilogue    n     s     ఆ శ్వాసగర్భములో వుండే శ్లోకములు, ఉత్తరరంగము.
Epiphany    n     s     ఖ్రైష్టుమాస్పండుగకు పన్నెండో దినము జనవరి నెల 6వ తేదిని వచ్చే పండుగ. In I. Tim. IV. 14. ఆగమనము. A+ in 2 Thes. II. 8. తేజస్. A+
Episcopacy    n     s     బిషపు యొక్క ప్రభుత్వము, బిషపు యొక్క అధికారము.
Episcopal    adj        బిషపు యొక్క ప్రభుత్వ సంబంధమైన. he obtained the * rank అతను బిషపు అయినాడు. an * palace బిషపు యొక్క నగరు.
Episcopate    n     s     బిషప్త్వమనే అధికారము.
Episcoplians    n     s     బిషపు వుండవలసినదనే వాండ్లు.
Episode    n     s     ఉపాఖ్యానము, ఉపకథ, చిత్రకథ. the * of Nalaనలోపాఖ్యానము, అవాంతరముగా వచ్చిన కథ.
Epistle    n     s     జాబు, గురువు వ్రాసిన జాబు. an postolical * పత్రముA+. నిరూపము F+ R+. a letter from a గురువు to his people శ్రీముఖము.
Epistolary    adj        జాబు సంబంధమైన, నిరూపసంబంధమైన, శ్రీముఖ సంబంధమైనన. they have no * communication వాండ్లకు వీండ్లకు ఉత్తర ప్రత్యుత్తరములు లేవు. an * style జాబులు వ్రాసే ధోరణి, జాబులు వ్రాసే పాకము.
Epitaph    n     s     గోరిమీది రాతిలో చెక్కిన శ్లోకము చరమ శ్లోకము వంటిది.
Epithalamium    n     s     పెండ్లి పాటలు.
Epithet    n     s     సార్థక నామము. the word Dasaradhi is an * of Rama దాశరథి అనే పేరు రాముడికి సార్థక నామధేయము. the word MUrari is an * of Krishna మురారి అనే పేరు కృష్ణుడికి సార్థకనామము.
Epitome    n     s     సంక్షేపము, సంగ్రహము.
Epoch, Epocha    n    s.     శకము, ముహూర్తము, ఘడియ, సమయము. the birth of Christ is the Christian * ఖ్రైష్టు యొక్క పుట్టుక క్రీస్తువుల శకమున కారంభము. the * of Saleevahana శాలివాహన శకము. the Musulmans count their * from the flight of Mahommed మహ్మ్మదు పారిపోయిన దినము మొదలుకొని తురకలు హిజిరీ అనే శకమును లెక్కబెట్టుకొంటారు. from the * of his arrival వాడు వచ్చిచేరిన ముహూర్తము మొదలుకొని.
Epode    n     s     పద్యములలో వొక భేదము.
Epope    n     s     మహా కావ్యము.
Eqalization    n     s     సమత, సమత్వము, సమానత, తుల్యత. an account  of the * of the weights ఆ రెండు బరువులు సరిగ్గా వుండినందున.
Eqatorial    adj        నాడీమండల సంబంధమైన. See Equator.
Equability    n     s     సమభావము, సమత్వము. * of temper శాంతము,దమము.
Equable    adj        సమమైన, సమభావముగల, హెచ్చుతగ్గులేని, నిర్వికారమైన.
Equably    adv        హెచ్చుతగ్గు లేకుండా, సమానముగా, సరిగ్గా.
Equal    adj        సమమైన, సమానమైన, సరియైన, తుల్యమైన, జతయైన, యీడైన.he who is * సముడు. the interest is * to the principal మొదలంతైనవడ్డి. these are * యివి యెంతో అవి అంతే. the water in the two vesselsis * యీ పాత్రలో యెంత నీళ్లు వున్నదో ఆ పాత్రలో అంతనీళ్లు వున్నది. a teacher * to him అతనియంత వుపధ్యాయులు. this is * to a confessionof the theft యిది దొంగతనమును వొప్పుకొన్నందుతో సమమే. he is not * to the work ఆ పనికి వీడు తగడు. * to a god దేవసముడు.
Equality    n     s     సమత్వము, సమానత, సామ్యము, తుల్యత, యీడు. he aspired to * with the king రాజుతో సమము కావలెనని అపేక్షించినాడు.
Equally    adv        సమముగా, సమానముగా తుల్యముగా, యీడుగా. she is * wise and beautiful దాని బుద్ధికి తుల్యమైన అందము కలదిగా వున్నది, అనగా దాని బుద్ధి సరే దాని అందము సరే.
Equanimity    n     s     సమభావము, సహిష్ణుత, శాంతము, నిబ్బరము, నిశ్చింత.he met his misfortunes with * వాడికి వచ్చిన ఆపదలకు వాడు తొణకలేదు.
Equation    n     s     ఉపమానము, యిది మహా గణితములో వుండే వొక శబ్దము.Vide Sir Wm. Jones in Transctions of Roy Socy. Vol. 3. p. 8.the anomalistice * of a Planet బలము, మందబలము.
Equator    n     s     నాడీమండలము. (Kala sanc. p. 372) అచ్ఛరేఖ, అనగా భూగోళము మీది చెరిసగములో తూర్పుపడమరగా వుండే రేఖ, దీన్ని సూర్యగమనము అనుసరించి వుంటున్నది. Dz. says ఉత్తర దక్షిణ కేంద్రద్వయోర్మధ్యస్థితి భూగోళద్వ్యంశ కారిణీ రేఖా.
Equerry    n     s     రాజాశ్వశాలాధ్యక్షుడు, యితడు రాజు సభలో చొరవగాప్రవర్తిస్తాడు.
Equestrian    adj        గుర్రముమీద వుండే, గుర్రపు సవారీలో నేర్పరియైన. * exercise or feats అశ్వలాఘవమలు, అనగా గుర్రము మీద యెక్కడముదిగడము మొదలైన వాటిలో చేసి వుండే సాధకములు. * exercise. గుర్రపుసవారి చేయడము. an * party గుర్రముల మీద పొయ్యే వాండ్లు. he is a good * గుర్రపు సవారిలో బాగా తీరిన వాండ్లు. an * statue గుర్రము మీద కూర్చున్నట్టుగా వుండే ప్రతిమ. there were many pedestrains and many *s పాదచారులున్ను శానామంది వుండిరి, గుర్రము మీద వచ్చినవారున్ను శానామంది వుండిరి.
Equibalance    n     s     సరి తూనిక.
Equidistant    adj        సరి దూరమైన. his house and yours are * frommine నా యింటికి వీడి యిల్లు యెంతదూరమో నీ యిల్లు అంతదూరమేను.
Equilateral    adj        సమమైన మూలలు గల, సమమైన కోణములు గల,యిది మహా గణిత శబ్దము.
Equilibrium    n     s     సమత, సమత్వము, సరితూనిక. when the twoscales are in * త్రాసు సరిగా తూగేటప్పుడు. he placed them in *వాటిని సరిగా తూగేటట్టు పెట్టినాడు. he lost him and fell వొక వైపుకు వొరిగిపడిపోయినాడు. the * of properties (in a philosophical sense) ప్రధానము. q. v.
Equinoctical    n     s     నాడీమండల రేఖ, అచ్చరేఖ, భూగోళము మీద చెరిసగమున తూర్పు పడమరగా వుండే రేఖ, యిది సూర్య మార్గము. the   * points ఆయనము, విషువత్. * gales విషమ గాలివాన, అనగా అట్టిసంధి కాలమందు సంభవించే మహత్తైన గాలివాన.
Equinox    n     s     విషువత్, సమరాత్రిందివమైన కాలము, రాత్రీపగలు సమముగా వుండే కాలము. the vernal * is on the 21st March, the autumnal * is on the 23rd of September మార్చి నెల 21 తేదిని మేషసంక్రాంతియందు దక్షిణాయనము వస్తున్నది, సెప్టెంబరు నెల 23 తేదిని తులా సంక్రాంతియందు వుత్తరాయణము వస్తున్నది, యివి దక్షిణాయన వుత్తరాయన సంధి కాలములు.
Equipage    n     s     (Vehicle) వాహనము, సవారి, అనగా బండి, పల్లకీ మొదలైనవి. or attendants, suite పరిజనము, పరివారము. he went in full * వాడు సపరివారముగా పోయినాడు. furniture సామాను, సరంజాము.a tea * తేనీళ్ల సామాను, తేనీళ్ల వుపకరణములు.
Equipment    n     s     సన్నాహము, సామాను, ఉపకరణములు.
Equipoise    n     s     సరితూగడము. they were held in * అవి సరిగ్గాతూగినవి.
Equiponderant    adj        సరితూగే, సరిసమానమైన.
Equipped    adj        సన్నద్ధుడైన, సన్నాహముగా వుండే, సిద్ధముగా వుండే.she was * for the dance అది ఆటకు శృంగారించుకొన్నది. he was fully * for the journey వాడు ప్రయాణమునకు సిద్ధముగా వుండినాడు.  Equitable, adj. న్యాయమైన, నిష్పక్షపాతమైన. an * decision నిష్పక్షపాతమైన తీర్పు, ఖండితమైన తీర్పు.
Equitabry    adv        న్యాయముగా, ధర్మముగా.
Equity    n     s     న్యాయము, ధర్మము, నీతి, అనగా మంచో, చెడో వుభయవాదులకున్ను పొత్తున ధర్మముగా తనకు తోచినట్టు చెప్పే న్యాయము. a court of * పంచాయత్ సభ.
Equivalent    n     s     సరియైనది, సరిసమానమైనది, యీడైనది. an * appointment సరియైన వుద్యోగము.
Equivocal    adj        సందిగ్ధమైన, సందేహాస్పదమైన, అనిశ్చయమైన. thisis an * expression యీ మాట సందిగ్ధముగా వున్నది. his conduct is very * వాడి నడక మంచిది అనరాదు చెడుది అనరాదు.
Equivocally    adv        సందిగ్ధముగా, అనిశ్చయముగా.
Equivocation    n     s     సందిగ్ధముగా చెప్పడము. Cannot you answer me without *? సరియైన జవాబు యివ్వలేవా, సంశయము తీరేటట్టు వుత్తరము చెప్పలేవా.
Equivocator    n     s     సందిగ్ధముగా చెప్పేవాడు, యిటూగాక, అటూ గాక పలికేవాడు.
Equivoke or Equivoque    n     s     సందిగ్ధముగా చెప్పినమాట, యిటూగాకుండాఅటుగాకుండా సంశయాస్పదముగా చెప్పేమాట.
Equovalence, Equivalency    n    s.     సమానత, సామ్యము, దీటు.
Era    n     s     శకము, కాలము. Fifty years before our * ఖ్రైష్టు పుట్టేముందుయాభై యేండ్లకు. See Epoch. According to their * వారి సంఖ్య ప్రకారము.
Eradicated    adj        సమూల నానశనము చేసిన, నిర్మూలనము చేసిన, దుంపనాశనముచేసిన.
Eradication    n     s     సమూల నాశనము, నిర్మూలనము, మూలతోహాని, దుంపనాశనము.  To Erase, v. a. కత్తితో గోకివేయుట. this *d all remeberance of hisformer errors యిందు చేత వాడు పూర్వముచేసిన తప్పులు మాసిపోయినవి.
Erased    adj        కత్తితో గోకి వేసిన, మాసిపోయిన.
Erasion, Erasure    n    s.     కాగితము మీద వ్రాసి కత్తితో గోకివేసిన స్థలము.this letter is full of erasures యీ జాబంతా కత్తితో గోకివున్నది. there were many erasures in the poem కావ్యములో శానాచోట్ల కత్తి గోకుళ్ళు వుండినవి.
Erastain    n     s     ఫలానా వొక మతస్తుడు.
Erastianism    n     s     వొకమత నామము.
Ere    adv        ముందు, పూర్వము. * he goes అతను వెళ్లక మునుపు. theywill arrive * evening సాయంకాలానికి మునుపే వచ్చి చేరుదురు. * longమరికొంచెము సేపటికి, యింతలో. * now యింతకు మునుపు, యింతకుముందు.
Erebus    n     s     erebus (A proper name) నరకము.
Erect    adj        నిలువుగా వుండే, నిక్కిన, నిక్కబట్టిన. he stood * వాడు నిక్కుకొని నిలిచినాడు.
Erected    adj        నిల్పిన, నియమించిన.
Erection    n     s     కట్టడము, యిల్లు, భవంతి, నిక్కడము. or establishmentయేర్పరచడము, స్థాపించడము. after the * of the temple ఆ గుడి కట్టిన తరువాత. after the * of the college కాలీజి పెట్టిన తరువాత.
Erectly    adv        నిక్కుకొని.
Erectness    n     s     నిక్కు.
Ere-long    adv        కొంచెము సేపటికి, యింతలో.
Eremite    n     s     ముని, యోగీశ్వరుడు, సన్యాసి.
Ergo    adv        therfore గనుక.
Eringo    n     s     వొక తరహా గుడ్డ, కందము.
Ermine    n     s     తెల్లని అడివిపిల్లి, సన్యాసలకు జింకతోలు యెట్లా ముఖ్యమోఅట్లా యీ పిల్లి యొక్క తోలు యింగ్లీషు న్యాయాధిపతులు ముఖ్యముగా తొడుక్కొంటారుగనుక. he attained the * అంటే వాడికి న్యాయాధిపతి వుద్యోగము వచ్చినదనిఅర్థము.
Ermined    adj        కృష్ణజినమువంటి వొక దివ్యమైన అడవి పిల్లి చర్మముతో కుట్టిన వుడుపు వేసుకొన్న.
Eroded    adj        వొరుసుకొని పోయిన.
Erosion    n     s     వొరుసుకొని పోవడము.
Erosive    adj        వొరుసుకొనే.
Erotic    adj        amorous, lustful, శృంగారమైన.
Errand    n     s     పని, వచ్చినపని, పోయినపని, పంపించిన కార్యము. they sent me here on that * ఆ పనిని గురించి నన్ను యిక్కడికి పంపించినారు.they sent him on a fools * వాణ్ని పిచ్చివాణ్నిగా చేసి పంపించినారు,అనగా వాడికి వొక పిచ్చి పని పెట్టి అవతలికి పంపినాను. when he arrived there he forgot his * అక్కడికిపోయి తాను పోయిన పనిని మరిచినాడు.
Errant    adj        సంచరించే, దేశముతిరిగే. a knight * దేశము మీద తిరిగేశూరుడు. an * lie &c. (See Arrant) పచ్చి అబద్ధము.
Errantry    n     s     or knight * శూరత్వము, శూరకృత్యము, శూరుడు దేశ సంచారము చేయడము.
Errata    n     s     plu. గ్రంథమందు పడిన చెయితప్పులపట్టి. (The pharase used in Calcutta is) శుద్ధిపత్రము. this is head తప్పుమాట. `wrong word' and వొప్పుమాట `right word ' See (the singular) Erratum.
Erratic    adj        తిరిగే, అల్లాడే. in astronomy అతిచారముగల. in logicఅన్యధాసద్ధమైన.
Erratum    n     s     చేయితప్పు, స్ఖాలిత్యము, హస్తదోశము.
Erring    adj        తప్పైన. * mortals భ్రమాగ్రస్తులు, మాయాబద్ధులు.
Erroneous    adj        తప్పుగా వుండే, పొరబాటైన, భ్రమప్రమాధమైన. An * word అపశబ్ధము.
Erroneously    adv        తప్పుగా, పొరబాటుగా, భ్రమ ప్రమాధముచేత.
Error    n     s     తప్పు, పొరబాటు, భ్రమ, ప్రమాదము. in astronomyకాలవ్యత్యాసము.
Erst    adv        పూర్వము, లోగడ.
Eructation    n     s     తేణుపు, తేపు.
Erudite    adj        పాండిత్యముగల, శాస్త్రీయ్యమైన. an * commentray శాస్త్రీయ్యమైన వ్యాఖ్యానము.
Erudition    n     s     పాండిత్యము.
Eruption    n     s     దద్దు, బొబ్బ, పొక్కు, చెమరకాయలు మొదలైనవి.after the fever he had an * on the skin జ్వరము విడిచిన తరువాత వాడికి వొళ్లంతా పేలినది. an * of the small pox అమ్మవారుపోయడము. to break out as an * పేలుట, పొక్కుట, పోసుట. an * asof a volcano భూమి పగిలి నిప్పు బయటికి రావడము.
Eryngo    n     s     ధాతువుపుష్టికరమైన, వొక మూలిక.
Erysipelas    n     s     అక్కి, వొకతరహా దద్దురోగము, అమ్మవారివలె లేచినది. * appeared and he died వొళ్లంతా దద్దరించి చచ్చినాడు.
Escalade    n     s     లగ్గయొక్కడము. the general had resort to * సేనాధిపతి లగ్గ యెక్కవలసి వచ్చినది.
Escapade    n     s     (a prank, fear, trick) చేష్ట, కొంటెతనము, యీ మాఠ యిప్పుడు లేదు.
Escape    n     s     తప్పడము, తప్పించుకొనిపారిపోవడము, తప్పించడము. he made his * వాడు తప్పించుకొని పారిపోయినాడు.
Eschar    n     s     బొబ్బ, పొక్కు, యిది వైద్యభాష.
Escharotic    n     s     పొక్కేమందు, యిది వైద్యభాష.
Escheat    n     s     సర్కారుకు చెందే బేవార్సు సొత్తు.
Escort    n     s     దారితోడు, పరిజనము, పరివారము. we went as thepricne's * రాజుతో కూడా స్తోమముగా పోయినాము.
Escritoir    n     s     వ్రాసే బల్ల, వ్రాసే పెట్టె.
Esculent    n     s     శాకములు, కందమూలాలు, తినేకూరాకు గుడ్డలు మొదలైనవి.the potato is an * వురలగడ్డలు తినేటివి.
Escutcheon    n     s     డాలు, వంశముద్ర, అనగా పూర్వకాలమందు వంశముద్రనుడాలుమీద వ్రాసివుండే వాడికచేత వంశముద్రుకు డాలు అనే పేరు వచ్చినది.the * of the Vencatagiri family has a boar for the bearingవెంకటగిరి వారి వంశముద్రకు వరాహము చిహ్నము.
Esoteric    adj        గోప్యమైన, గుహ్యమైన, రహస్యమైన, విశేషమైన. the * doctrine గురువుతన అంతరంగ శిష్యులకు గోప్యముగా చేసే గుహ్యోపదేశము,యిందుకు వ్యతిరేకమైన శబ్దము. Exoteric adj. బాహ్యమైన, బాహటమైన, సామాన్యమైన. the exoteric doctrine సామాన్యమైన వుపదేశము, అనగా అందరికి బాహటముగా తెలియచేసే వుపదేశము. Sir Thomas Browne says in his Religio Medici" I have (the outer) one common and authentic philosophy I learned in the schools whereby I discourse and satisfy the reason of other men: another [the inner] more reserved and drawn from experience whereby I content mine own."
Espalier    n     s     తీగలు పాకడమునకై నాటే కంప.
Especial    adj        విశేషమైన, ముఖ్యమైన, ప్రదానమైన.
Especially    adv        విశేషముగా, ముఖ్యముగా, అవశ్యముగా.
Espial    n     s     వేగుచూచేవాడు, చారుడు.
Espionage    n     s     వేగుచూచే ఉద్యోగము.
Esplanade    n     s     బయిలు, మైదానము, కోటకు లోనగాని వెలపలగానికవాతుచేసే బయిలు.
Espousal    adj        వివాహ సంబంధమైన, వైవాహికమైన.
Espousals    n     s     పెండ్లి, నిశ్చితార్థము.
Esquire    n     s     బాహదరు అనే దానికి సరియైన కితాబు, యిది యీ దేశములోనాయుడు, రావు, పంతులు, మొదలారి, సాహేబు మొదలైన శబ్దములతో సమానముగావున్నది, మెట్టుకు డాక్టర్లు, పాదరీలు, కత్తికట్టుదొరలు, షాపుకీపర్లు వీండ్ల యొక్క పేరుతో కూడా Esquire అనే పేరును పరాకున వ్రాస్తారుగాని అది మర్యాదకాదు. మరిన్ని F. W. Ellis Esq. అని అనవచ్చును. Mr. F. W. Ellis Esq. అనకూడదు, మరిన్ని యీ Esquire అనే కితాబు మేజిస్ట్రేటు వుద్యోగస్తులకు ముఖ్యము.
Essay    n     s     యత్నము, ప్రయత్నము. an * upon morals హితోపదేశము,నీతిశాస్త్రమును గురించిన చిన్న గ్రంథము. Pope's * on man పోపనే ఆయన చెప్పిన మానుష్య వివరణము. a well known * on etymology is named వైకృతిచంద్రిక. an * on the Pricipia సిద్ధాంతకౌముది.an * on divine knowledge జ్ఞాన ప్రదీపిక. the master ordered the student to write an * upon this యిందున గురించి నీకు తోచిన సాధక బాధకములను వ్రాయుమన్నాడు. an * on female education స్త్రీలకు  శిక్ష చెప్పడములో వుండే సాధకబాధకముల వివరణము.
Essayist    n     s     గ్రంథకర్త, వొక విషయమును వుపన్యసించి చిన్న గ్రంథము రచించేవాడు.
Essence    n     s     nature, substance సారము, సత్తు, నిగ్గు, స్వభావము,తత్వము, ధర్మము, భావము. Being of anything సద్భావము, సత్తా, స్థితి,వునికి. the * of the matter ఆ సంగతిలో వుండే స్వారస్యము. the divine * ఈశ్వర సద్భావము, ఈశ్వరుడు కలడనడము. this is the * of beauty యిది సౌందర్యాలవాలము. these few words give the * of the matter యీ కొన్ని మాటలచేత ఆ సంగతి యొక్క నైజము తేలుతుంది. as volatile essential oil ధృతి, ద్రావకము, తైలము. * of cloves లవంగ ద్రావకము. or perfume ధృతిగా తీసిన పరిమళ ద్రవ్యము.
Essenced    adj        సుగంధము, చమురుకొన్న, పరిమళము పూసుకొన్న.
Essential    n     s     సత్తు, సారము, ప్రథానాంశము. these are none * యివి ముఖ్యములు కావు.
Essentially    adv        అతిముఖ్యముగా, ఆవశ్యముగా, మిక్కలి. this is * wrongయిది అహిత్యన్యాయము. this is * necessary యిది అత్యావశ్యకము, యిది లేకగడవదు.
Established    adj        నిలకడగా వుండే, స్థిరమైన, నియమించిన, నిర్ణయమైనఏర్పరచిన, నిర్మించిన, స్థాపితమైన, కుదుటబడ్డ. an * truth సిద్ధాంతము.an * custom ఆచారము, వాడిక. a man of * character ప్రసిద్ధుడు, పేరుపడ్డవాడు, ఘనుడు. his health is re-* వాడి రోగము మళ్లీ కుదిరినది. they wrongly say that the Canarese is not an * language కన్నడముశాస్త్రియ్యమైన భాష కాదంటారు. or married పెండ్లియైన. the * faith చాలా వ్యాపించివుండే మతము. the * church సీమరాజు ఆవలంబించి వుండే మతము.
Establishment    n     s     కుదురుపాటు, స్థాపనము, నిర్ధారణము, ఏర్పాటు, దిట్టము,నిర్ణయము. house * యింటి పనివాండ్లు. government * సర్కారు సిబ్బంది. the people of an office కచ్చేరివారు. on my going to England I brokeup my * నేను సీమకు పొయ్యేటప్పుడు నా సామానును అమ్మివేసి పనివాండ్లనుతీసివేసినాను. his * consists of twenty servants అతనికి పనివాండ్లుయిరువైమంది వున్నారు. or marriage వివాహము. the church * గుడి పరిజనము,గుడి పరివారము. the mercantile * వర్తకులు. the military * సేన, దండు.the home * స్వదేశమందు వుండే రాజు యొక్క వుద్యోగస్తులు. the foreign * రాజుచే దేశాంతరమనుకు పంపబడ్డ వుద్యోగస్తులు. he is on the Bengal *వాడు బంగాళా దేశములో వుద్యోగస్తుడుగా వున్నాడు. trhe English have four *s (presidencies) in India యిండియా దేశములో యింగ్లీషు వారికి నాలుగు సంస్తానములు వున్నవి. the charges incured for an office * కచ్చేరి సిబ్బంది శెలవు. an educational * బడి, పల్లెకూటము.
Estate    n     s     (Property, Wealth) ఆస్తి, స్థితి, యిస్తువ, సొత్తు,బండాలము. Condition స్థితి, దశ, అవస్థ. he is now in low * వాడుయిప్పట్లో దీనదశలో వున్నాడు. Considering our low * మేము వుండేదీనదశను విచారించి.
Esteem    n     s     గౌరవము, లక్ష్యము, గణ్యము, గురుత్వము. to hold in *గౌరవముగా విచారించుట.
Esteemed    adj        యెంచిన, గుణ్యమైన, గౌరవమైన, this is * falseయిది అబద్ధమంటారు. It was lightly * దాన్ని అలక్ష్య పెట్టినారు.
Estimable    adj        ఘనమైన, గౌరవమైన, పూజ్యమైన. a very * personఅతి పూజ్యుడు.
Estimate    n     s     యెన్నిక, మతింపు, అంచన, ఉజ్జాయింపు.
Estimation    n     s     యెన్నిక, లక్ష్యము, గౌరవము, గురుత్వము, నుతింపు,అంచన, ఉజ్జాయింపు.
Estranged    adj        విరోధులైన, మిత్రబేధము చేయబడ్డ, యెడబాపబడ్డ,వేరుబడ్డ.
Estrangement    n     s     మిత్రబేధము, వేరుబంధము, మనస్తాపము, విరోధము. 
Estuary            కయ్యి,వుప్పుకయ్యి
Etc. Etcetera    conj        మొదలైనవి, యిత్యాది.
Etcetera            (literallyis)తద్వర్గంచ
Etchings    n     s     రాగి రేకు అచ్చుతో వేసిన పటములు, యిది కాస్త మోటుగా వుంటున్నది.
Eternal    adj        నిత్యమైన, శాశ్వతమైన, అద్యంతరహితమైన. the * happinessనిత్యపదవి. an * lamp అఖండము. (In Hebr. IX. 12. * redemption అనంతముక్తి, A+.) without beginning అనాదియైన. * without end అంత్యములేని. the * or the * being ఈశ్వరుడు, భగవంతుడు. * life (in John III. 15. అనంతాయుః A+. నిత్యజీవము F+.) చిరాయుః, చిరంజీవిత్వము. orplaguy, teasing పాపిష్ఠి, చెడ్డ.
Eternally    adv        నిత్యముగా, నిరంతరముగా, ఆద్యంతముగాలేక. that lampshall burn * ఆ దీపము సర్వదా మండును. that man is * drunk నిత్యము తాగి వుంటాడు.
Eternity    n     s     నిత్యము, శాశ్వతము. few think of * మోక్షమునుయెంచేవాండ్లు, యెవరు. an * of bliss నిత్యానందము. vulgarly, a long time వెయ్యేండ్లు, లక్షయేండ్లు. he was launched into * orhe was hanged వాడు నిత్యత్వమును పొందించబడ్డాడు, అనగా వురితీయబడ్డాడు.
Ether    n     s     ఆకాశము. or a medicine ఈతరనే ద్రావకము.
Etheraliyt    n     s     (incorporeality) లఘిమా అనే గుణము.
Etheralized    adj        లఘిమ గల, అతిలఘువైన, అతి సూక్ష్మమైన.
Ethereal    adj        ఆకాశ సంబంధమైన, అంతరిక్షసంబందమైన, స్వర్గసంబంధమైన, అతి సూక్ష్మమైన. * beings దేవయక్ష గందర్వులు. the blue * sky నిర్మలాకాశము.
Ethical    adj        నీతిశాస్త్రసంబంధమైన. the Panchatntram is an * workపంచతంత్రము నీతి గ్రంథము. an treatise నీతిశాస్త్రము.
Ethicks    n     s     నీతిశాస్త్రము.
Ethnick    adj        See Gentile.
Etiquette    n     s     మర్యాద క్రమము, ఆచారము. It is the * among them to present visitors with betel-nut వచ్చిన పెద్ద మనుష్యులకు తాంబూల మివ్వడము వారిలో మర్యాద. It is not the * to visit a great man without a proper dress మంచి బట్టలు తొడుక్కోకుండా పెద్దమనుష్యుల భేటికి పోవడము మర్యాదకాదు.
Etuis    n     s     (సూదులు, కత్తెర, పేనాకత్తులు మొదలైనవి పెట్టే) చిన్న పెట్టె, డబ్బి, వొర, గూడు. 
Etymological    adj        శబ్ద లక్షణ సంబంధమైన.
Etymologically    adv        శబ్దలక్షణ ప్రకారము.
Etymologist    n     s     శబ్దము యొక్క ధాతువ్యుత్పత్తులను విమర్శించే వైయాకరణి.
Etymology    n     s     శబ్ధలక్షణము, అవయవవుత్పత్తి. do you know the *of this word యీ శబ్దము యెట్లాపుట్టినదో నీకు తెలుసునా, నీకు యీ శబ్దముయొక్క ధాతువు తెలుసునా, వ్యుత్పత్తి తెలుసునా.
Etymon    n     s     ధాతువు, ప్రాతిపదికము.
Eucharist    n     s     the act of giving thanks; the sacramental act in which the death of our Redeemer is commemorated with a thankful remembrance, the Sacrament of the Lord's supper (Johnson) ఖ్రైస్టియన్ మతములో మహాప్రసాద వినియోగము, ఈశ్వరస్యగుణాన్ కీర్త యిత్వా ధన్యవాదంయంచాబ్రవీత్ C+. స్త్రోత్రము చేసి స్త్రోత్రము చదివి P+. Droz says ధన్యవాదము, ఖ్రైష్టు యొక్క మృత్యుస్మరణార్ధముగా స్థాపించబడ్డ భోజన వ్యవహారము.
Eulogist    n     s     స్తోత్రము చేసేవాడు, శ్లాఘించేవాడు.
Eulogium, Eulogy    n    s.     స్తవము, స్తుతి, స్తోత్రము.
Eunuch    n     s     ఖొజ్జా. in Acts VIII. షండః A+. నపుంసకుడు K+. వర్ష వరహా C+. But F+. and R+ omit the word and sbustitute "Minister".
Euphemism    n     s     softened expression తేలికగా చెప్పేమాట, అనగా  వాన్ని చంపినా రనడమునకు వాన్ని కాజేసినా రనడము, పదిరూపాయలులంచమిచ్చినా రనడమునకు తేలికగా తాంబూలానికి పది రూపాయ లిచ్చినారనడము.
Euphonious    adj        melodious శ్రావ్యమైన, చెవులకింపైన. Sancrit is an* language సంస్కృతము శ్రావ్యమైన భాష.
Euphony    n     s     శ్రావ్యమైనస్వనము, చెవుల కింకపైన స్వనము.
Euphorbium    n     s     (See Spurge) ఆకు జముడు, బొంత జముడు.
Euphrasy    n     s     నిద్యము జనఓషది, యీ మూలికతో అంజనగాండ్లు కాటుకచేస్తారంటారు. he dug for * (or Eye-bright) and in the act hefound a treasure నిధ్వ్యం జనౌషధీమూలం ఖనతాసాదితో నిధిః.
Euphuism    n     s     పరిభాష, అనగా కూర అనకుండా కరియామధు అన్నట్టు.
Euphuistical    adj        పరిభాషగా వుండే. * style పిచ్చి చమత్కారమైనరచన.
Eurasian    n     s     పరంగివాడు. See some caustic remarks on this  silly word in Asiatic Journal 1823 page 445.
Euroclydon    n     s     ఈదురుగాలి. (A+ uses the Greek word.)
Europe    n     s     యూరోపనే ఖండము. Vulgarly called సీమ.
European    n     s     యూరోపుదేశస్థుడు, జాతివాడు. These words are insufficient and objectionable though in general use. Europeans are sometimes in scorn called పరంగివాండ్లు, or Feringis, Learned Bramins call them హూణః `Huns' which is the poetical name.
Euthanasia    n     s     అనాయాసమరణము, మంచిచావు.
Evacuant    adj        భేది అయ్యే, భేది కారియైన. Caster oil is * చిట్టాముదము భేది అయ్యేటిది.
Evacuation    n     s     of a purge విరోచనము. of an army విడిచిపెట్టిలేచిపోవడము. he had four *s వాడికి నాలుగు మాట్లు, ప్రవర్తులు అయినవి. after the * of the town by the enemy శత్రు సేన పట్టణమును విడిచిఅవతలికి పోయిన తరువాత.
Evanescence    n     s     శూన్యము, ఆభావము, లేకపోవడము. after the *of the disease ఆ రోగములేకపోయిన తరువాత.
Evanescent    adj        అస్థిరమైన, నిలవని అచిరస్తాయియైన, నేడు వుండి రేపుపొయ్యే. an * disease ఆ రెండు దినములు వుండి పొయ్యే రోగము.
Evangelical    adj        సువిశేష సంబంధమైన, an * teacher సద్గురువు.
Evangelist    n     s     మంచి సమాచారము తెచ్చినవాడు, సువిశేషవక్త. thefour *s ఖ్రైష్టు యొక్క చరిత్రను చెప్పిన నలుగురు శిష్యులు In a Tim.IV. 5 సుసంవాదప్రకారకః A+ సువిశేష ప్రసంగి. K+.
Evangelized    adj        ఖ్రైస్టు మతమును అవలంబించినది.
Evaporated    adj        పొగై యెగసిపోయిన, యింకిపోయిన, యిగిరిపోయిన, యెండిపోయిన. all his money was * in this business యిందులో వాని రూకలన్నీ ఖర్చు అయిపోయినవి.
Evaporation    n     s     పొగై యిగిరిపోవడము, యింకిపోవడము, యిగిరిపోవడము.
Evaporator    n     s     (an epithet of the sun) జలత్స్కరుడు.
Evasion    n     s     తప్పించుకోవడము, సాకు, మాయ, మోసము. By his * of the question ప్రశ్నకు వుత్తరము చెప్పకుండా తప్పించినందున.
Evasive    adj        తప్పించుకొనే, సాకైన, పితలాటకమైన, టక్కైన, మాయయైన.
Evasively    adv        తప్పించుకొని, మాయగా, మోసముగా. he answered *తప్పించుకొని మాట్లాడినాడు.
Even    adv        also, too కూడా, సహా, సహితము, న్ను, న్ని, అయినా. * hisbrother condemns him వాడి అన్న సహితము వాణ్ని దూషిస్తాడు. * in the least యించుకైనా. they did not * give him water నీళ్లు అయినా యివ్వలేదు. he would not * tell me the name పేరును సహా చెప్పలేదు.* in his life time అతను జీవముతో వున్నప్పుడున్ను. * though they are gone వాండ్లు పోయి వుండినా, పోయివుండినప్పటికిన్ని. if you * touch it దాన్ని నీవు అంటినాసరి. to him అతడికిన్ని. * the great గొప్పవాండ్లున్ను.
Evenhanded    adj        పక్షపాతము లేని.
Evening    n     s     సాయంకాలము. in the * మాపటికి. in the * of hisdays వాడికి వృద్ధాప్యములో. Note రాత్రి నిద్రపొయ్యేవరకు evening అని వ్యవహారము కద్దుగనుక. * and morning రేపు మాపు. See notes on Morning, Noon, and Midday.
Evening star    n     s     పడమట పొడిచే చుక్క అనగా శుక్రుడు.
Evenly    adv        సమముగా, వ్యత్యాసము లేకుండా, మిట్టాపల్లము లేకుండా.
Evenness    n     s     సమత్వము, సమముగా వుండడము, వ్యత్యాసము లేకుండా వుండడము,మిట్టాపల్లము లేకుండా వుండడము.
Evensong    n     s     సంధ్యా వందనము.
Event    n     s     సంభవించేపని, ఘటించేపని. a sad * ఆపద. a happy * అదృష్టము. we must be guided by * యెటౌతున్నదో దాన్ని చూచుకొని దానికి తగినట్టు నడుచుకోవలసినది. at all *s అన్నిటికి, మెట్టుకు, యెట్లాగైనా సరి. in this * యీ పక్షమందు. in the * of his coming వాడు వచ్చినట్టైతే, వాడు వచ్చే పక్షమందు. in the * of your going నీవు పొయ్యేటట్టైతే.
Eventful    adj        గడియకు వొక వింత పుట్టే. in these * times గడియకువొక వింతగా వుండే యీ కాలములో.
Eventide    n     s     సాయంకాలము. at * సంధ్యవేళ.
Eventual    adj        సంభవించబొయ్యే, రాబొయ్యే. they give security forthe * costs సంభవించబొయ్యే ఖర్చులకు జామీను యిచ్చినారు.
Eventuality    n     s     See Chance, probability, prospect. It is a bad French phrase.
Eventually    adv        ప్రసక్తి వచ్చినప్పుడు, కావలసినప్పుడు, కడకు, తుదకు.they paid the money * తుదకు వాండ్లు ఆ రూకలు చెల్లించి వేసినారు.
Ever            అనగా Ever యిది కావ్యమందు వచ్చేమాట, or e'er I saw him he diedనేను వాన్ని చూడక మునుపే చచ్చినాడు.  Effable, adj. చెప్పనలవియైన, వచనియ్యమైన, వాగ్గోచరమైన. It is not * అదివాచామగోచరమైనది, అది నిర్వచనియ్యమైనది.
Evergreen    n     s     యెప్పటికిన్ని పచ్చగా వుండేచెట్టు, షడృతువులయందున్నుఆకులు రాలకుండా పచ్చగానే ఉండే చెట్టు.
Everlasting    adj        నిత్యమైన, శాశ్వతమైన. without a beginning అనాదిగా వుండే. or endless తీరని, మానని, అంత్యము లేని. In Ps.xli. 13 from * to * అది మధ్యావసానేషు. A+.
Everliving    adj        చిరంజీవియైన, చావని, శాశ్వతమైన.
Evermore    adv        నిత్యముగా, సదా, సార్వదా. for * అనంతము. A+ in Ps.xvi. II.
Every    adj        ప్రతి, వొకొక, సకలమైన. * body అందరు. * body knowsఅందరు యెరుగుదురు. they went * man his way వారి వారి పనికి వారు వారుపోయినారు. * one ప్రతిమనిషి * now and then అప్పటప్పటికి, మధ్యమధ్య. * other one వొకరిని విడిచి వొకరు వొకటి విడిచి వొకటి. * other day దినము మార్చి దినము, దినము విడిచి దినము, దినము తప్పి దినము. * other month నెల మార్చి నెల, నెల తప్పి నెల. he was * thing to them వాడే వాండ్లకు గతి * time మాటిమాటికి. * day people సామాన్యులు.this is not an * day business యిది సామాన్యమైనది కాదు, యిది స్వల్ప పనికాదు. this word is expressed by a reiteration: this * penny గవ్వకు గవ్వ. * month నెల నెలకు, * day ప్రతి దినము, ప్రత్యహము.at * wrod మాట మాటకు. * man for himself యెవరి మానమునకు వారుయెవరి అంతట వారు, వారి వారి మట్టుకు.
Every-where    adv        అంతటా, అన్ని చోట్ల. he searched * నకముఖాల వెతికినాడు. * in the town పట్టణమంతా.
Evesdropper    n     s     పొంచువుండి వినేవాడు, చాడీ ఖోరు.
Evidence    n     s     సాక్ష్యము, సాక్షి, సాక్షి చెప్పేమనిషి. proofదృష్టాంతము, నిదర్శనము. he give his * వాడు సాక్షి పలికినాడు.he bore * వాడు సాక్షి చెప్పినాడు. he brought four *s వాడునలుగురు సాక్షులను తెచ్చినాడు. king's * యితర దొంగలమీద తాను సాక్షి చెప్పి తనకు శిక్ష లేకుండా తప్పించుకొనే దొంగ. this  is an * of disease రోగము వున్నదనే దానికి యిది గురుతు.
Evidenced    adj        రూపించిన, అగుపడిన, తెలియచేసిన.
Evident    adj        స్పష్టమైన, స్పుటమైన, ప్రత్యక్షమైన, తేటైన, విశదమైన. It is * అది స్పష్టమే. self * స్వతస్సిద్ధముగా తెలిసే.
Evidently    adv        స్పష్టముగా, తేటగా, విశదముగా. he * knows it వాడికి నిజముగా తెలుసును, వాడికి స్పష్టముగా తెలుసును.
Evil    n     s     శబ్బర, చెరువు, కష్టము, దురవస్త, యిబ్బంది, దుఃఖము, ఉపద్రవము. or misfortune కీడు, యెగ్గు. injury అపాయము, ఆపద. a contagion అంటు రోగము, తెవులు. the *s of this life ఐహిక కష్టములు.the king's * : See Scurvy. We must not do * that good may comeపుణ్యము రావడమునకై మనము పాపము చేయరాదు. he returned them * for * ప్రత్యుపకారము చేసినాడు. he returned good for * అపకారమునకు ఉపకారము చేసినాడు. * favoured అవలక్షణమైన, వికారమైన. deliver us from * (Matt. VI. 13). మందము. C+ అశుభం A+ కీడు. K+.
Evil-doer    n     s     దుష్టుడు, దుర్మార్గుడు, పాపిష్టి, పాపాత్ముడు.
Evilly    adv        చెరుపుగా, దుర్మార్గముగా.
Evil-minded    adj        దుర్మనస్కుడైన, క్రూరహృదయముగల.
Evil-speaking    n     s     దుర్భాష, చాడీమాటలు.
Evil-worker    n     s     దుర్మార్గుడు, దుష్కృత్యము కలవాడు.
Evinced    adj        తెలియచేసిన, చూపిన, అగుపడిన.
Evitable    adj        నివర్తించకూడిన, తప్పించగల.
Evo, Even    n    s.     evening సాయంకాలము. the vigil or fast to be observed before an holiday విశేష పండుగ దినమునకు తొలినాటి సాయంకాలము. the * of a feast పండుగకు తొలి దినము. a cow on the * of calving యీనబొయ్యే ఆవు. he is on the * of ruin వాడికి  చేటు కాలము దగ్గిరించినది. on the * of the departure బయలుదేరే సమయమందు. I was on the * of telling him వాడితో చెప్పి వేయబోతిని, వాడితో చెప్పక తప్పితిని. Events that were then on the * of taking place అప్పట్లో తటస్థించేటట్టు వుండిన పనులు. he is on the * of marriage వాడికి పెండ్లి తటస్థమైనది.
Evolution    n     s     కవాయద్ చేయడము, సేనా విన్యాసము. the regiment performed several *s ఆ రిజిమెంటు కవాయిత్తు చేసినది.
Evulsion    n     s     పీకి వేయడము, పెరికివేయడము.
Ewe    n     a     ఆడగొర్రె.
Ewer    n     s     చెంబు, కూజా, గెండి. 
Ex, exoregz    adj        గతమైన, మునుపటి, పూర్వపు, యిందాకటి. the * minister మునుపటి మంత్రి. the * secretary మునుపటి రాయసగాడు. the *-Raja తోసివేయబడ్డ రాజు.
Exacerbation    n     s     వ్యాధి యొక్క ముమ్మరము, ప్రకోపము.
Exact    adj        సరియైన, దిట్టమైన. this is the * sum యిది సరియైన మొత్తము. I do not know the * sum ఆ రూకలు సరిగ్గా యింతని తెలియదు.he is a very * man వాడు క్రమస్థుడు. you should be more * నీవు ఖండితముగా వుండవలసినది.
Exaction    v     s     నిర్భందించి అడగడము, కక్కసించడము, తరువు.
Exactitude    n     s     ఖండితము, ఖండింపు. he has no * వాడితో కరాఖండితములేదు.
Exactly    adv        సరిగ్గా, పరిష్కారముగా. an interjection, like yes! సరే.
Exactness    n     s     ఖండితము, ఖండింపు.
Exaggeration    n     s     పెంచి చెప్పడము, కొంచెమును గొప్పగా విస్తరించి చెప్పడము. this is a mere * యిది వూరక గోరంతను కొండంతగా పెంచి చెప్పినదేగాని వేరే లేదు. poetical * ఉత్ప్రేక్ష.
Exaltation    n     s     ఔన్నత్యము, ఘనత, గొప్పతనము, అభివృద్ధి, శ్రేయస్సు.on account of thier * their enemies were silent వాండ్లు తల యెత్తివుండినందున వాండ్ల శత్రువులు నోరుమూసుకొని వుండినారు.
Exalted    adj        ఘనమైన, అతిఘనమైన, మహత్తైన. an * expressionin poetry ఉత్ప్రేక్షష, ఉల్లేఖన.
Examination    n     s     పరిక్ష, పరిశోధన, విచారణ, విమర్శ. this book will stand * యీ గ్రంథము పరీక్షకకు నిలుచును. his story will not bear * వాడి మాట విచారణకు నిలువదు. cross * అడ్డమాటలు వేసి అడగడము. * of coin నాణెము చూడడము.
Examiner    n     s     పరిక్ష చేసేవాడు, విచారించేవాడు.
Example    n     s     దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము. can you givean * of this దీనికి వొక ఉదాహరణ చెప్పగలవా. they follow his * వాణ్ని చూచి శిక్షించినారు. she is an * to all around her దానివలెవుండవద్దాయని అందరిచేత అనిపించుకొన్నది. why do not you set thechild a good *? నీవు చక్కగా నడిచి ఆ ప్రకారము ఆ బిడ్డ చక్కగా నడుచుకొనేటట్టు యేల చేయవు. they will behave well if you set them the * నీవు చక్కగా నడుచుకొంటే నిన్ను చూచి వాండ్లున్ను చక్కగా నడుచుకొందురు. if you want them to be industrious set them the * వాండ్లు శ్రద్ధగల వారుగా వుండవసలసినట్లైతే నీవు శ్రద్ధగలవాడవుగా వుండి నిన్ను చూచి వాండ్లు నేర్చుకోని. he set them a bad * తాను దుర్మార్గముగా నడిచి తన దుర్గుణములున్ను కొడుక్కున్ను పట్టుపడేటట్టు చేసినాడు. for * దృష్టాంతమేమంటే, ఉదాహరణమేమంటే. In James V. దృష్టాంతం. A+. in Matt. 1. 19. కలకం ప్రకాశయితుం అనిచ్ఛన్ A+. దాన్ని అపదూరు చేయ మనసులేని వాడై G+.
Exasperated    adj        ఆగ్రహపడ్డ, రేగిన. the fever is * by this medicine యీ మందుచేత ఆ జ్వరము పైకి విసిరినది. he was * at this lanuguage యీ మాట మీద రేగినాడు.
Exasperation    n     s     ఉద్రేకము, ఆగ్రహము, కోపము. After much * shestruck him దానికి వూరక కోపము పొడిగేటట్టు చేసినందున వాణ్నిదెబ్బకొట్టినది. the * of fever జ్వర వేగము, జ్వర ముమ్మరము.
Excavation    n     s     తొర్ర, బొంద, బొక్క, గుంట, గొయ్యి, బిలము, సొరంగము.
Excavator    n     s     (this is a bad word) వుప్పరవాడు, కామాటి,కూలివాడు.
Exceeding    adj        అతిశయమైన, మీరిన, మించిన.
Exceedingly    adv        అతిశయముగా, మహా, మిక్కిలి, శానా.
Excellency    n     s     శ్రేష్టత. a title of honour ఘనము పొందిన, యిదిముఖ్యముగా గొప్ప దండు దొరలపట్టము. His * the commander in chiefఘనము పొందిన సర్వ సేనాధిపతిగారు. St. Luke and St. Paul whenaddressing people of rank use the word Cratistos: which as nearly ass possible answers to the title of "your" భూవర q. v.In Luke I. 3. హేమమహామహిమ, ఘనము పొందిన G+ and also Acts XXIII. 26. మహామహిమ శ్రీయుక్త A+.
Excellent    interj        భళా, మఝ్ఘా, మంచిది. 
Excellently    adv        ఘనముగా, దివ్యముగా.
Except    Excepted,Excepting,adv        వినాగాక, తప్ప. * this యిదివినా.he will not read it * at home యింట్లోగాక దాన్ని చదవడు.
Excepted or Excepting    adj        See Except, adv.
Exception    n     s     అపవాదము, ఆక్షేపము, నిషేధము, బాధకము, వ్యతిరేకము.Is there any * to this rule? యీ సూత్రమునకు యేదైనా, అపవాదము కద్దా.they made no *s to his conduct వాడు చేసినపనిని వాండ్లు ఆక్షేపించలేదు.with the * of these books యీ పుస్తకములను వినాయించి. he sold themall without * మిగత లేకుండా అంతా అమ్మివేసినాడు. all of them without * came వొకరు తప్పక అందరున్ను వచ్చినారు.
Exceptionable    adj        వర్జనియ్యమైన, ఆగ్రాహ్యమైన, దూష్యమైన, కాని కూడని.his conduct is very * వాడినడత యెంత మాత్రము మంచిది కాదు.
Excess    n     s     అతి, అధికము, యెక్కువ, దుర్మార్గము. * of rain అతివృష్టి.* of anger అతికోపము, కోపోద్రేకము. * of lust కామోద్రేకము. they are much given to * వాండ్లు దుర్వృత్తులు, దుష్టులు. these detestable *es యీ దుర్మార్గాములు. he avoided all *es వాడు దుర్నీతులన్నిటిని మానుకొన్నాడు.In Matt. XXIII. 25. దౌరాత్మ్యం. A+. In. Ephes. V. 18. దుష్టత. A+.
Excessive    adj        అతి, అతిశయమైన, అధికమైనే, నిండా, బహు. * thirst అతి దాహము * anger అతికోపము.
Excessively    adv        మిక్కిలి, మహా, బహు, మిగుల.
Exchange    n     s     మార్పు, మారకము, పరివర్తనము, వినిమయము. If we take gold we lose in the * మెహరీలు పుచ్చుకొంటిమా వట్టము యివ్వవలసివస్తున్నది. he took a horse in * వాడు బదులుకు గుర్రమును తీసుకొన్నాడు. loss or gain on * వారడి, తేడ. a placewhere merchants meet వర్తకులు కూడి మాట్లాడుకొనే చావడి. a bill of * హుండి.
Exchequer    n     s     బొక్కసము, రాజకోశ గృహము. an * bill కుంపిణిపత్రమువంటిది వొక కాగితము.
Exchequered    adj        seized జఫ్తి చేసిన.
Excisable    adj        అధిక తీర్వ వేయబడేదైన, అనగా అభిని, సారాయి, భంగిమొదలైనే సరుకుల మీద అధిక తీర్వవేయబడేదైన అని అర్థము. opium is * but rice is not అభిని అధిక తీర్వవేయబడే సరుకు, బియ్యము తీర్వుసరుకు కాదు.
Excise    n     s     అధికతీర్వ, బళువైన తీర్వ, సుంకము, తీర్వమ వరి.
Excised    adj        జఫ్తిచేయబడ్డ, నగరకలుకోబడ్డ. * goods నగర కలుపుకోబడ్డ సరుకులు. the land as * ఆ మాన్యమును నగరకలుపుకొన్నాడు.
Exciseman    n     s     సుంకరి, సుంకము, పైగస్తు బంట్రోతు, దొంగ సరుకులనుపట్టి జఫ్తి చేసుకొనేవాడు.
Excision    n     s     సత్రము చేయడము, కోసివేయడము, చేధనము, నాశనము, ధ్వంసము. After the * of the ball కోసి గుండును యెత్తిన తరువాత.
Excitability    n     s     capability of being excited స్పర్శ గ్రాహకత్వము,అనగా తాకితే తెలియడము, రేగేగుణము, రవంతలో అణిగేగుణము. from the *of a child's temper it laughs or weeps at a trifle బిడ్డలదిరవంలో రేగి రవంతలో అణిగే గుణము గనుక రవంతలో నవ్వుతారు, రవంతలో యేడుస్తారు. from the * of the eye కంటికి రవంత హెచ్చునున్ను తగ్గనున్నుకూడదు గనుక, కన్ను అపాయస్థలము గనక. there is no * in horn of hair కొమ్ములోనే గాని వెంట్రుకలోనే గాని స్పర్శగ్రాహకత్వము లేదు, తాకితే తెలియడములేదు.
Excitable    adj        to be excited రవంతలో రేగే. the young are easily* పిల్లకాయలు రవంతలో యేడుస్తారు, రవంతలో నవ్వుతారు. In this feverthe skin is very * యీ జ్వరములో వొంటిమీద చెయ్యి తగిలితే పుండుగావుంటున్నది.
Excitation    n     s     రేచడము, రేగడము, ప్రేరేపించడము, ప్రేరేపణ. she was in a state of great * about this అది యిందున గురించి నిండా అల్లాడుతూ వుండినది. See Excitement.
Excited    adj        ప్రేరేపించబడ్డ, పురికొలుపబడ్డ, రేచిన. * with rageకోపోద్రేకముగల, చిరచిరలాడే. My curiosity was * at this అందుమీదటఅది యేమిటిదో విచారించవలెనని నాకు బుద్ధిపుట్టినది.
Excitement    n     s     (the motive by which one is stirred up) ప్రేరేపకము, ఉద్రేకము. perturbation అతిశయము, వింత, తత్తరపాటు. the village was in a state of a great * regarding this యిందున గురించి వూరంతా తహతహలాడుతూ వుండినది. from the * of the passions we suffer misery కామోద్రేకముచేత ఆపదను అనుభవిస్తున్నాము. the death of the king caused no * రాజు చచ్చినదివొక అతిశయముగా వుండలేదు. this was an * to writing the dictionary ఆ నిఘంటువును వ్రాయడమునకు యిది వొక ప్రేరేపకముగా వుండెను.
Exciting    adj        ప్రేరేపకమైన, రేచే. Novels are very * శృంగారకావ్యములు, మోహమును కలగచేసేటివి. an * book మోహోద్రేకకరమైన పుస్తకము.
Exclamation    n     s     మొర, కూత, అరుపు, కేక. he uttered many * నిండా అరిచినాడు, కేకలు యెత్తినాడు.
Excllence    n     s     eminence, dignity శ్రేష్టత, ఉత్తమత, ఔత్కృష్ట్యము,శ్లాఘ్యత. from the * of this cloth యీ బట్ట నాణ్యమైనది గనుక. from the * of his behavaiour వాడి ఉత్తమమైన నడక చేత, వాడి నడక మంచిది గనక. comparative * తారతమ్యము. by its comparative * కడమవాటి కంటే యిది యోగ్యమైనందున.
Excluded    adj        బహిష్కిరంచిన, వెలివేసిన. * from their societyవాండ్లతో చేరని.
Exclusion    n     s     బహిష్కారము, వెలి, వినాగా. all Hindus, to the * of parias, are admitted at Tirupatty మాల వాండ్లు తప్పకడమ అందరు తిరుపతికి పోవచ్చును.
Exclusive    adj        కేవల, భిన్న, వ్యతిరిక్త. they have an * rightto the  property యీ సొత్తుకు కేవలము వాండ్లకే బాధ్యతగాని మరియెవరికి నిమిత్యము లేదు. his conduct shews an * preference to the English వాడు కేవలము యింగ్లీషు వాండ్ల పక్షముగా నడుచుకొంటాడు.the Bramins are very * బ్రాహ్మణులు యితర జాతులతో యెంత మాత్రమున్ను సంబంధపడక తాము ప్రత్యేకముగా వుంటారు. his family is very * వాండ్లు వొకరితో కలిసేవాండ్లు కారు. * of rice they eat nothing వాండ్లు బియ్యముకాక మరేమీ తినరు. * of the fees the salary is small రుసుమును తీసివేస్తే సంబళము స్వల్పమే.
Exclusively    adv        కేవలము, మాత్రమే. the money that was *devoted to this one purpose యీ పనిని గురించే నియమించబడివుండేరూకలు. I called them * వారినే పిలిచినాను, వారిని మాత్రమే పిలిచినాను.
Excogitation    n     s     యోచన, యోచించి కల్పించడము.
Excommunication    n     s     బహిష్కారము, వెలి, పరిత్యాగము. letter of *వెలిజాబులు.
Excoriated    adj        దోగిపోయిన, తోలుదోగిన, కొట్టుకొనిపోయిన. an * spotతోలుకొట్టుకొని పోయిన చోటు.
Excoriation    n     s     తోలుదొగిపోవడము. the hot water made an * onhis arm వేడినీళ్ల చేత వాడి చెయ్యితోలు దోగిపోయినది. they appliedoil  to cure the * తోలు దోగిపోయిన చోట నూనెపట్టించినారు.
Excrement    n     s     or Excrements, (this is generally used in the plural)మలము, పురీషము. the Musulmans consider silk as the * of a worm పట్టు వక పురుగు మలమని తురక లంటారు.
Excrementitious    adj        మలమయమైన. *  matter మలము.
Excrescence    n     s     on the body కణితి, గ్రంథి, బుడిపి, కాయ. * on the trunks of trees  చెట్టు మీద ముడి.
Excretory    adj        విసర్జించే, బయటతోసే, బయటకక్కే. the * ducts in the skin రోమ కూపములు.
Excruciating    adj        వేధించే, బాధించే, ఉపద్రవము చేసే, యాతన పరచే. * painతాళకూడని నొప్పి. an * head-ache వెర్రి తల నొప్పి.
Exculpatory    adj        తప్పు లేదని అగుపరచే, నిరపరాధినిగా చేసే. thisletter is *  ఈ జాబు తప్పులేదని అగురపరుస్తున్నది.
Excursion    n     s     విహారము. we took an * as far as Pulicatప్రలయకావేరిదాక విహారముగా పోయినాము.
Excursive    adj        విహరించే.
Excursively    adv        in a wandering unsettled manner ఛిన్నా భిన్నముగా.
Excusable    adj        మన్నించవలసిన, క్షమించదగిన.
Excuse    n     s     సాకు, నెపము, మిష, అనుపపత్తి, పరిహారము, సమాధానము.
Excuseless    adj        మన్నించకూడని, క్షమించరాని.
Excutioner    n     s     వురిదీసే బంట్రోతు, కొట్టే బంట్రోతు.
Execrable    adj        అతిపాపిష్టి, అతిదుష్ట.
Execrably    adv        అతిపాపిష్టితనముగా.
Execration    n     s     శాపము, తిట్టు.
Executed    adj        జరిగిన, నెరవేరిన, చేసిన. a bond * to me నాకువ్రాసి యిచ్చిన పత్రము. the thief who was * వురిదీయబడ్డ దొంగ. a picture * by him వాడు వ్రాసిన పటము.
Execution    n     s     జరిగించడము, నెరవేర్చడము, చేయడము, క్రియలోకి తేవడము. after the * of the bond పత్రము పుట్టిన తరువాత. he ordered the thief to be flogged and was present at the * ఆ దొంగను కొట్టేటట్టు వుత్తరువు యిచ్చి దగ్గెరవుండి కొట్టించినాడు. the  * of this picture is good యీ పటము యొక్క తీర్పు బాగా వున్నది. the idea of this picture is good but the * is very poor యీ పటమును వ్రాయడమునకు చేసిన సంకల్పము బాగానే వున్నది గాని వ్రాసి తీరడములో నిండా జబ్భైపోయినది. to carry into * జరిగించడము. he put the law into * చట్టప్రకారము జరిగించినాడు. they put an * into his houseఅప్పును గురించి వాడి సామానులను అమ్మించినారు, ఫలానిశిక్ష అని విధించి చెప్పక వూరక EXecution అని మాత్రము అంటే ప్రాణము తీసుట అని అర్థమౌతున్నది, అనగాI was present at the * వురిదీసినప్పుడు గాని గుండున కాల్చి నప్పుడుగాని, దగ్గెర వుంటినని అర్థము.
Executive    n     s     తీర్పు ప్రకారము, జరిగించేవాండ్లు, ఉత్తరువును నెరవేర్చేవాండ్లు.
Executor    n     s     నెరవేర్చేవాడు, జరిగించేవాడు, ఉయిలు ప్రకారము జరిగించేఅధికారముగలవాడు. the phrase used by Ram Mohun Rao నియోగకృతుడు.but the ancient phrase is కార్యకర్త.
Executrix    n     s     ఉయిలు ప్రకారము జరిగించే అధికారముగల స్త్రీ.
Exegesis    n     s     the interpretation of the scriptures వివరణము, వ్యాఖ్యానము, వృత్తి, భాష్యము.
Exegetical    adj        or practical (Arnold's Life, I. 138.) వివరమైన,స్పష్టమైన.
Exemplar    n     s     మాదిరి దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము.
Exemplarily    adv        ఉత్తమముగా, శ్రేష్టముగా.
Exemplary    adj        ఉత్తమమైన, శ్రేష్టమైన, మిక్కిలియోగ్యమైన. his conductis very * వాడి నడకనిండా వుత్తమమైనదిగా వున్నది.
Exemplification    n     s     దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము. thisis an * of it దానికి యిది ఉదాహరణము.
Exemplified    adj        దృష్టాంతమైన, నిదర్శనమైన, ఉదాహరణ అయిన. the rule is * in this verse ఆ సూత్రమునకు యీ పద్యము వుదాహరణ అయినది.Paternal affection is * in the behaviour of a bird to its youngపుత్ర వాత్సల్యమునకు పక్షియొక్క నడత నిదర్శనముగా వున్నది.
Exempt    n     s     అధికారి, యిది వొకతరహా బంట్రోతుకు వుండే పేరు.
Exempt, Exempted    adj        వినాయించిన, వినాయించబడ్డ, లేని. a life* from care వ్యాకులములేని బ్రతుకు. * from death చావులేని, అమర్త్యులైన.this is an *ed case యిది వినాయించబడ్డ ప్రమేయం. land *ed fromtax మాన్యము, యినాము. the Brahmins are *ed from paying this feeబ్రాహ్మణులకు యీ పన్ను మన్నించబడ్డది. they were *ed from mortalityవాండ్లు ముక్తులైరి. he is *ed from these inconveniencies వాడికి యీ పీకులాటలు లేవు.
Exemption    n     s     మన్నింపు, పరిహారము. he claimed * on the ground of being a monk సన్యాసి అయినందున మాపుచేయవలెనన్నాడు.he pleaded * from the tax on the ground of his being a priest గురువనే న్యాయమును పట్టి తాను పన్ను యివ్వవలసినది లేదని వాదించినాడు.
Exeperimental    adj        అనుభవము చేత తెలిసే. he has * knowledgeof this యిందులో వాడికి అనుభవజ్ఞానము కద్దు.
Exequies    n     s     ఉత్తర క్రియలు, అపరక్రియలు, శ్రాద్ధాదిక్రియలు,దినవారాలు.
Exercise    n     s     (learning) అభ్యాసము, సాధకము. (walking &c.) గాలిసవారి పోవడము. by the * of reason వివేకమును వినియోగపరుచుటచేత. bodily * తిరగడము, సంచారము. mental * మననము, చింతన.equestrain * గుర్రపుసవారి పోవడము. religious *s ధ్యానములు, ప్రార్థనలుమొదలైనవి. military *s కవాతు. a school boys * or essay చిన్నవాండ్లకు రచనా శక్తికలగమడునకై చేసే యత్నము. manly *s సాము, గెరడి మొదలైనవి. sword * కత్తిసాము, ఖడ్గాభ్యాసము. to take * సాధకము చేసుట.the convalescent took gentle * రోగము విడిచి వొళ్లు తేరకుండా వుండేవాడు లేచి తిరుగుతాడు. children must take * బిడ్డలు యిట్టా అట్లా తిరగవలసినది.you will be ill if you take no * లేచి తిరగక పడ్డపడకగా వుంటే నీ వొళ్లు కుదరదు.
Exercised    adj        అభ్యాసమైన, అభ్యసించిన, అలవాటుపడ్డ, వాడికైన, పనుబడ్డ. he is well * in this యిందులో బాగా అలవాటుపడివున్నాడు.she is well * in dancing అది ఆటలో బాగా తీరినది.
Exerted    adj        ఉపయోగపరచిన, వినియోగపరిచిన, ప్రయత్నపడ్డ. his power was * to save me నన్ను కాపాడడమునకు వాడి శక్తి ఉపయోగపరచబడ్డది.
Exertion    n     s     యత్నము, ప్రయత్నము, పాటు, పరిశ్రమ.
Exfoliation    n     s     యెముక చచ్చి చెక్కగా వూడిరావడము.
Exhalation    n     s     ఆవిరి, శాకము.
Exhaled    adj        బయట విసిరిన, బయట విడిచిన. the scent * by the rose రోజా పుష్పము కొట్టేవాసన.
Exhausted    adj        వ్రయమైన, అయిపోయిన, శోషించిన, క్షీణించిన, తరిగిన.his strength was * by the long walk బహుదూరము నడుచుటచేత వాడిబలము వుడిగినది, అలిసినాడు. I am quite * నాకు ప్రాణము విసికినది,మహా అలిసినాను. * by the heat యెండగొట్టు పడ్డ, బడలిన. his patience was quite * వాడి సహనము బొత్తిగా పోయినది. the ammunition is * మందుగుండు అయిపోయినది.
Exhausting    adj        పోగొట్టే శోషింపచేసే, క్షీణింపచేసే, తరగగొట్టే.the * heat పీల్చివేసే యెండ. an * task ప్రాణమును విసికించేపని,అతికష్టమైన పని.
Exhaustion    n     s     శోషణము, క్షయము, తరగడము, అలుపు. on accountof the * of the treasury ఆ బొక్కసము, వుత్తదైపోయినందున. * of strength బలక్షయము. through * అలుపుచేత. after the * of the waterనీళ్లంతా పోయిన తరువాత.
Exhibition    n     s     చూపడము, అగుపరచడము, కనుపరచడము. after the * of this paper యీ దస్తావేజును చూపిన తరువాత. or public show వేడుక, తమాషా. they made an * of the ape ఆ కోతిని వూళ్లో అందరికిన్ని చూపించినారు. or money బహుమానము, శుల్కము.
Exhilarated    adj        ఉల్లసించిన, ఆనందభరితుడైన. * with wineతాగిమత్తెక్కిన.
Exhilarating    adj        ఉల్లాసకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైన.wine is * సారాయి మనసుకు వుల్లాసము చేసేటిది.
Exhortation    n     s     బుద్ధి, బోధన. in answer to all his *sఅతను చెప్పిన మాటలన్ని విని.
Exhortatory    adj        బుద్ధిచెప్పే, బోధించే, బోధన చేసే.
Exhumation    n     s     పాతిపెట్టినదాన్ని బయటికి యెత్తడము. after the * of the body పాతిపెట్టిన శవాన్ని పెళ్లగించి యెత్తిన తరువాత.
Exiccated    adj        ఆరిపోయిన, యెండిపోయిన.
Exigence, Exigency    n    s.     అక్కర, ఆగత్యము, అవసరము. according to the * of the statue ఆ చట్టములో విధించిన ప్రకారము.
Exile    n     s     దేశములోనుంచి వెళ్ల కొట్టబడ్డ వాడు, దేశభ్రష్టుడు, పరదేశి,దేశములోనుంచి వెళ్ళకొట్టపడడము. they are unfortunate *s వాండ్లు దేశములోనుంచి వెళ్లకొట్టబడ్డ దిక్కుమాలిన వాండ్లుగా వుండిరి. he was thenliving in * వాడు అప్పట్లో దేశ భ్రష్టుడై వుండినాడు. here we live is splendid * ప్రస్తుతము యిక్కడ యెంత జంభముగా ఉవ్Mడినా విదేశమందు వున్నాము.
Exiled    adj        దేశములోనుంచి వెళ్లకొట్టబడ్డ, దేశ భ్రష్టుడైన, పరదేశియైన.
Existence    n     s     ఉనికి, స్థితి, వుండడము, జీవితకాలము. in a philosophical sense తత్త్వము. I never saw him in the courseof my * నా ఆయుస్సులో వాన్ని చూడలేదు. The Hindus deny the * of the devil హిందువులు సైతాను అనేదే లేదంటారు. not one of them isnow in * వాండ్లలో వొకరున్ను యిప్పుడు లేరు, అనగా అంతా చచ్చినారు. he forgot that his father was in * యింకావాడి అబ్బ బ్రతికివున్నాడనే దాన్ని మరిచినాడు. he is the greatest fool in * జగత్తులో వీడికంటే  పిచ్చివాడు లేడు. they derive their * from weaving నేసుకొని బ్రతుకుతారు.non* శూన్యము, లేమి, అభావము. on the non * of the bond పత్రముఅభావమైనందున, ఆ పత్రము లేకపోయినందున. *  and non-* సదసద్భావము. self * సత్వము.
Existent    adj        వుండే, కలిగివుండే, స్థితమైన, జీవించివుండే. the self* స్వయంభువు, బ్రహ్మము.
Existimation    n     s     opinion ఎన్నిక, భావము, అభిప్రాయము. in their* he is a scholar వాండ్ల అభిప్రాయ ప్రకారము వాడు పండితుడు.
Existing    adj        వుండే, విద్యమానమైన. that regulation was thenstill * అప్పట్లో ఆ చట్టము కలిగే వుండినది. the then * arrangementsఅప్పట్లో వుండిన యేర్పాట్లు. in * circumstances కార్యము వుండేరీతికి.non *లేని లోకములో లేని, అభూత పూర్వకమైన.
Exit    n     s     లేచిపోవడము, వెళ్లిపోవడము, బహిర్గమనము, ప్రస్తానము.* from life మరణము, చావు. he made his * లేచిపోయినాడు. on his* from office వుద్యోగము విడిచిపోయిన తరువాత. Exit. (a phraseused in comedies) పాత్ర నిర్గమనము, యిది మూలార్థము.
Exodus    n     s     (literally)  దేశ త్యాగము, యిది బైబిలు గ్రంథమందురెండో కాండ యొక్క పేరు.
Ex-officio    adv        ఉద్యోగతః, ఉద్యోగము చొప్పున.
Exonerable    adj        శాంతుడైన, దయాళువైన.
Exonerated    adj        నివృత్తి చేయబడ్డ, నివారితమైన. they were *from payment of the money వాండ్లు ఆ రూకలను చెల్లించవలసినదిలేకపోయినది. If you compel me to release the prisoner I shallin that case stand * by the public నీవు చేసే నిర్భందమునకైయేవే నేను ఆ ఖైదీని విడుదల చేస్తే లోకములో ఆ యపవాదము నాకు వుండదు.
Exoneration    n     s     నివృత్తి, నివారణము, విమోచనము.
Exorbitance, EXorbitancy    n    S.     అతిక్రమము, అన్యాయము, అమితము.
Exorbitant    adj        అతిక్రమమైన, అన్యాయమైన, అదికమైన.
Exorbitantly    adv        అమితముగా, అతశయముగా.
Exorciser    n     s     దయ్యమును తోలే మంత్రగాడు.
Exorcism    n     s     దయ్యమునుతోలే మంత్రము, భూతోచ్ఛాటన మంత్రము.
Exorcist    n     s     దయ్యమును తోలే మంత్రగాడు.
Exordium    n     s     గ్రంథారంభము, నాందిశ్లోకము.
Exoteric    adj        బాహటమైన, ప్రసిద్ధమైన, సామాన్యమైన. See Exoteric.
Exotic    adj        పరదేశ సంబంధమైన, అన్యదేశ సంబందమైన, యిది కొన్ని చెట్లను, కొన్ని శబ్దములను గురించిన మాట. this world is an * యిదిఅన్య దేశ్య శబ్దము.
Expanded    adj        వికసించిన, విస్తరించిన.
Expanse    n     s     విశాలత, విస్తారము, విస్తీర్ణము, విరివి, ప్రపంచము.the * of heaven ఖగోళము, ఆకాశము. there was a vast * of water అక్కడ బహుదూరము నీళ్లు పట్టి వుండినది, వ్యాపించి వుండినది.
Expansion    n     s     వికసనము, విస్తరింపు, విశాలము, విరవి, వ్యాప్తి.by the * of the bladder పుచ్చబుడ్డ గాలికి వుబ్బినందున.
Expansive    adj        విస్తరింపచేసే, వ్యాపించే, వుబ్బేటట్టు చేసే. the *power of steam burst the vessel పొగ యొక్క వ్యాపకశక్తిచేత ఆకుండ పగిలినది.
Expansiveness    n     s     విశాలత, వ్యాప్తి, విరివి.
Exparte    adj        ఏక పక్షపు. an * decree ఏక పక్షముగా విచారించి యిచ్చిన తీర్పు, అనగా ప్రతివాది యొక్క వుత్తరమునుగాని సాక్షిదస్తావేజులను గాని విచారణము చేయకుండా చేసినతీర్పు.
Expatiation    n     s     ఉపన్యాసము, విస్తరించి చెప్పడము, వివరించడము.
Expatriated    adj        పరదేశమునకు పంపబడ్డ, దేశ భ్రష్టుడైన. See Exiled.
Expatriation    n     s     దేశ భ్రష్టుణ్నిగా చేయడము, పరదేశమునకుపంపడము.
Expectancy    n     s     నమ్మిక, కోరిక, ఆశ.
Expectant    n     s     యెదురుచూచేవాడు, నిరీక్షిస్తూవుండేవాడు, ఆశించుకొనివుండేవాడు, ఉమేదువారు.
Expectation    n     s     యెదురుచూడడము, ఆశ, ఆపేక్ష, తలంపు. accordingto my * నేను అనుకున్న ప్రకారము.
Expected    adj        యెదురుచూడబడ్డ, నిరీక్షించబడ్డ, అనుకొన్న. he as might be * favoured his brother అతడు అన్నయందు పక్షము వుంచడముసహజమే. She is * to lye in next month వచ్చే నెలలో అది ప్రసవించేటట్టు వున్నది.
Expectorant    adj        కఫహరమైన. this fruit is an * యీ పండుకఫహారమైనది.
Expectoration    n     s     కేకరింత. in this cold she suffered much  from * యీ జలుబుచేత అది వూరక కేకరిస్తూ వుండినది.
Expedience, Expediency    n    s.     ఆవశ్యకత, ఉపయుక్తత, యోగ్యత, ప్రయోజనము. I shewed him the * of going there అక్కడికి పోవడము   ఆవశ్యమని అగుపరచినాను.
Expedient    adj        ఆవశ్యమైన, ఉచితమైన, యుక్తమైన. In I. Cor. X. 23.మంగళ జనకం. A+.
Expedition    n     s     quickness త్వర, తీవ్రము. journey యాత్ర, ప్రయాణము,దండయాత్ర. or adventures చరిత్ర.
Expeditious    adj        త్వరగల, వడిగల.
Expeditiously    adv        త్వరగా, వడిగా, వేగిరముగా.
Expended    adj        వ్రయమైన, శలవైన, అయిపోయిన. it is * అది అయిపోయినది.
Expenditure    n     s     వయము, శలవు. petty * చిల్లర ఖర్చు.
Expense    n     s     వ్రయము, శలవు. fruitless * వట్టిదండుగ. he did it at the * of his life వాడు దాన్ని చేస్తేనేమి అందులో వాడి ప్రాణముపోయినది. he effected this although at the * of some discomfortకొంచెము ఆయాసపడ్డా మెట్టుకు సాధించినాడు. he proved this fact at the * of his character దాన్ని వాస్తవమని రుజువు చేస్తేనేమి అందులోతనమానము పోయినది. I effected it but at the * of my healthదాన్ని సాధించినాను గాని అందువల్ల నాకు అశక్తము తగిలినది. he sold this to meet the * of the marriage పెండ్లి ప్రయమునకై దీన్ని అమ్మినాడు.
Expensive    adj        శానారూకలుపట్టే, నిండా వ్రయముపట్టే, వెలపొడుగైన.an * man or prodigal శలవుగాడు, దూబరదిండి. an * woman, or a woman of * habits వొక రూపాయను వొకపైసాగా శలవుచేసేటిది. an * shawl వెల పొడుగు శాలవ. you are very * నీవు అధిక శలవుగాడవు.
Expensively    adv        చాలా వ్రయముచేసి, దూబరదిండితనముగా. he lives* వాడు నిండా శలవుగాడుగా వున్నాడు.
Expensiveness    n     s     నిండా రూకలు పట్టడము, అతి వ్రయము, అధిక శలవు.from the * of these shawls యివి నిండా వెలపొడుగైన శాలవులు గనక.
Experience    n     s     or practical knowledge అనుభవము, అభ్యాసము,వాడిక. or trial పరీక్ష శోధన. want of * అనభ్యాసము. a man of * అనుభవశాలి.
Experienced    adj        అనుభవశాలియైన, పనుబడ్డ, జితపడ్డ, తీరిన.an * man అనుభవశాలి, నెళవరి, చేయితిరిగిన వాడు.
Experiment    n     s     పరిక్ష, శోధన.
Experimentally    adv        అనుభవముచేత, అనుభవము మీద.
Experimentum crucis            -a decisive experiment శలాకపరిక్ష,స్తనశల్యపరిక్ష
Expert    adj        Skilful, prompt, ready, dexterous చేయితిరిగిన,వాడికపడ్డ, పనుబడ్డ, నిపుణతగల. he is * in this వాడు యిందులోనిపుణుడు. one who is * చేయి తిరిగినవాడు, పనుబడ్డవాడు.
Expertly    adv        నేర్పుగా, నిపుణతగా, చమత్కారముగా.
Expertness    n     s     నిపుణత, గట్టితనము, సామర్థ్యము, నేరుపు, చతురత.he has no * in that వాడికి అందులో నిపుణత చాలదు.
Expiable    adj        ప్రాయశ్చిత్తమునకు అర్హమైన. they say that this sin is * by penance యీ పాపము ప్రాయశ్చిత్తముచేత పరిహార్యమంటారు. theysay that this is easily * యిది లఘు ప్రాయశ్చిత్తముచేత పరిహరింపబడునంటారు.
Expiation    n     s     ప్రాయశ్చిత్తము, పరిహారము.
Expiatory    adj        ప్రాయశ్చిత్త సంబంధమైన.
Expiration    n     s     or breathing out శ్వాసము విడవడము, వూపిరి విడవడము.termination, end, close ముగింపు, అవసానము, అంతము. on the * of the month ఆ మాసాంతమందు, ఆ నెలసరికి. at the * of the lease ఆ గుత్త తీరిన తరువాత.
Expired    adj        చచ్చిన, ముగిసిన, తీరిన, ఆరిపోయిన.
Explained    adj        అర్థము చెప్పిన, విశదపరచిన, తెలియచేసిన.
Explanation    n     s     అర్థము, వివరణము, సమాధానము. this is no * of your conduct నీవు చేసిన పనికి యిది సమాధానము కాదు.
Explanatory    adj        వివరముగా తెలిపే, విశదపరచే, అర్ధమును తెలియచేసే.an * letter భావమును వివరించే జాబు, న్యాయములను అగుపరచే జాబు.
Expletive    adj        నిరర్ధకమైనపదము, పాదపూరకము, వొక పద్యములోగణములు కుదిరేటందుకు పెట్టిన అర్థములేని శబ్దము. The syllablesతు, చ. &c. are mere *s తు, చ, యిత్యాదికములు వట్టి పాదపూరకములే.
Explicable    adj        అర్థమయ్యే, సాధ్యమయ్యే. this verse is * if youread the next పై శ్లోకము చదివితే యీ శ్లోకమునకు అర్థమౌతున్నది.
Explication    n     s     అర్థము, వివరము, వ్యాఖ్యానము, న్యాయము, సమాధానము.
Explicative    adj        నిరర్థకమైన శబ్దము, పాదపూరక శబ్దము.
Explicit    adj        స్పష్టమైన, పరిష్కారమైన, తేట అయిన.
Explicitly    adv        clearly స్పష్టముగా, పరిష్కారముగా, తేటగా.
Explicitness    n     s     స్పష్టత, వివరము, వైశిద్యము, తేట.
Exploit    n     s     శూరకృత్యము, వీరకృత్యము, సాహసకృత్యము, అద్భుతకృత్యము.
Explosion    n     s     భగ్గునమండడము. on the * of the powder మందుభగ్గుమని అంటుకొనేటప్పటికి. an * of passion ఆగ్రహము. the * knockeddown the wall మందు భగ్గున అంటుకొన్నందున గోడ పడిపోయినది.
Explosive    adj        భగ్గని అంటుకొనే, పఠీలుమని విచ్చే. the * power of gunpowder తుపాకిమందులో వుండే భగ్గని అంటుకొనే శక్తి.
Exponent    n     s     విశేషము, ఆనవాలు, లింగము, యిది మహాగణితములోవచ్చే శబ్దము. or exemplification దృష్టాంతము, లక్షణము.
Exponential    adj        విశేషమైన, లక్ష్యమైన, లక్షణమైన.
Exportation    n     s     యెగుమతి, సరుకును పంపడము, సరుకును తీసుకొనిపోవడము.
Exporter    n     s     యెగుమతిచేసేవాడు, సరుకును పంపేవాడు, సరుకుని తీసుకొనిపొయ్యేవాడు.
Exports    n     s     యెగుమతి అయ్యేసరుకులు, పంపేసరుకులు, తీసుకొనిపొయ్యేసరుకులు.
Expose    n     s     (French expose) విశదము, వివరము, వయనము, బట్టబయిలు.this paper is a complete * of their conduct వాండ్ల నడక యావత్తు యీ కాగితముచేత బట్టబయలౌతున్నది.
Exposed    adj        ఆవరణములేని, మరుగులేని, తెరవబడ్డ, అగుపరచబడ్డ,చూపబడ్డ. when the wound was * కట్టువిచ్చేటప్పటికి. this was *to redicule యిది పరిహాసాస్పదమైనది, నవ్వులపాలైనది. this housestands much * యీ యింటికి మరుగు యేమిన్ని లేదు. his lies are * వాడి అబద్ధాలు బయటపడ్డవి. goods * in his shop వాడి అంగట్లో పరచిపెట్టిన సరుకులు. this bay is * to the north wind యీ సముద్రములో కొట్టే వుత్తరపు గాలికి మరుగుగా వాడలు నిలిచేటందుకు చోటు లేదు. when the skin was taken off the flesh was * తోలు తీసేటప్పటికి మాంసం బయటపడ్డది.
Exposition    n     s     వ్యాఖ్యానము, వివరణము. this is a complete* of the affair యిది ఆ సంగతిని గురించిన యావద్వృత్తాంతముగా వున్నది.an * of the vedas వేదభాష్యము.
Expositor    n     s     వ్యాఖ్యానకర్త, విశదపరచేవాడు, భాష్యకారులు.
Expository    adj        వివరించే, విశదపరచే. these words are * of the preceding verse యీ మాటవల్ల ముందు శ్లోకానికి అర్థము తేలుతున్నది.
Ex-post-facto    adv        యిటీవలి, యిటుతర్వాతి. an * law కొన్ని ముందు మించి జరిగిపోయిన తరువాత పుట్టిన చట్టము, అనగా ముందు జరిగిపోయిన పనికి యీ చట్టము విఘాతము, కాదని భావము.
Expostulation    n     s     బుద్ధిచెప్పడము, బహుదూరము, యుక్తాయుక్తముతెలియచేసి బతిమాలుకోవడము, న్యాయములను అగుపరచి అడుక్కోవడము,కీడు మేలు తెలియచేసి బుద్ధిచెప్పడము.
Expostulatory    adj        బుద్ధిచెప్పే, న్యాయములను తెలియచేసి బహుదూరముబతిమాలుకొనే. an * letter యిది అవును అది కాదని బుద్ధిచెప్పి బతిమాలుకొని వ్రాసే జాబు.
Exposure    n     s     బయట పెట్టడము, తెరచి పెట్టడము, తెరచి చూపడము.by * to the weather he caught this fever యెండగాలి మొదలైన వాటిలోగొట్టుపడ్డందున వాడికి జ్వరము తగిలినది. after the * of these goodsin his shop యీ సరుకులను వాడి అంగట్లో తెరచిపెట్టిన తరువాత.
Expounder    n     s     అర్థము చెప్పేవాడు, వ్యాఖ్యాత. 
Express    n     s     (especial messenger of the post office) గజ్జ కట్టిన టపాలు.
Expressed    adj        ఉచ్చరించబడ్డ, చెప్పిన, తెలియచేసిన. that rule isthus ఆ సూత్రములో చెప్పినదేమంటే. or squeezed పిండిన, పిడిచిన. oil expressed from linseed నూవ్వులు ఆడిన నూనె.
Expressible    adj        ఉచ్చరించకూడిన, చెప్పకూడిన, వివరించకూడిన,వచనియ్యమైన. it is easily * in English దీన్ని యింగ్లీషులో సులభముగాచెప్పవచ్చును.
Expression    n     s     the act of representing తెలియచేయడము, అగుపడే భావము, మాట, ఉక్తి, పరిభాష. the * of his face was remarkable వాడిముఖము భావము విచిత్రముగా వుండినది. the * of his face is like that of women వాడి మూతి తీరుచూస్తే ఆడదాని ముఖము వలె వున్నది. there is no* in this music యీ రాగములో రసము లేదు. an eye fall of * భావగర్భితమైనచూపు. this is a correct * యిది సుశబ్దము. this is not a correct * యిది అపశబ్దము. Dina varamu is an * for a funeral rite (or)obsequies is an * for a funeral కర్మాంతరమనే మాటకు దినవారమనే శబ్దము పరిభాష. Power is an * for a goddess దేవతకు శక్తి అనడముకద్దు. the act of squeeing out పిండడము, పిడవడము. after the * the juice the limes were put in salt ఆ రసము పిండివేసి నిమ్మకాయలనువుప్పులో వేసినాను.
Expressive    adj        తెలియచేసే, భావమును తెలియచేసే, భావ ప్రకాశకమైన.the infant gave me a very * look ఆ బిడ్డ తన భావము నాకు అగుపడేటట్టు నన్ను చూచినది.
Expressively    adv        భావము విశదమయ్యేటట్టుగా.
Expressly    adv        స్పష్టముగా, పరిష్కారముగా, ఖండితముగా.
Expressness    n     s     స్పష్టత, వైశిద్యము.
Exprobration    n     s     దూషణ.
Expulsion    n     s     వెళ్లకొట్టడము, బహిష్కారము. after the * of the poison విషము బయట వచ్చిన తరువాత.
Exquisite    adj        సరసమైన, శ్రేష్టమైన, దివ్యమైన, అద్భుతమైన. * painఅత్యంత దుఃఖము. * joy, అత్యంత సంతోషము.
Exquisitely    adv        సరసముగా, దివ్యముగా, శ్రేష్టముగా, అద్భుతంగా.
Exquisiteness    n     s     అతిశయము. from the * of her beauty దానిసౌందర్యాతిశయమువల్ల.
Exremental    adj        మల సంబంధమైన.
Exsiccated    adj        dried యెండిన.
Exsudation    n     s     బొట్టుబొట్టుగా కారడము, స్రవించడము, స్రవణము.gum is an * of a tree బంక చెట్టులోనుంచి కారేటిది.
Extacy    n     s     See Extasy.
Extant    adj        యిప్పట్లో వుండే. that poem is not now * ఆ కావ్యముయిప్పట్లో లేదు. Part of Appacavis book is *; the rest is not * అప్పకవియ్యము సగమున్నది సగము లోకములో లేదు.
Extasied    adj        పరవశమైన, పరవశము పొందిన, ఆనందభరితమైన.
Extasy    n     s     పరవశత, అత్యానందము. or unnatural swoon from mental excitement యోగనిద్ర. an * for grief దుఃఖపరవశత. an * of joy ఆనందపరవశత. thrilling with * రోమాంచముగల.
Extatic    adj        అత్యానందముగల, పరవశమైన, వొళ్లు తెలియని.
Extempore    adj        and adv. without premeditation, suddenly, readily అవశాత్తుగా ఆశుకవిత్వముగా. he wrote this poem * యీ కావ్యమును ఆసుకవనముగా చెప్పినాడు. an * poet నిమిషకవి, ఆశుకవి. an * banquet (Prior's Poems) అవశాత్తుగా సంభవించిన విందు.
Extended    adj        వ్యాపించిన, ప్రసరించిన, విస్తరించిన, నిగుడిన. I saw his body * in the street వాడు చచ్చి వీధిలో పడివుండగా చూచినాను.she lay * at the door అది గడపదగ్గెర సాగిలపడి వుండినది. a long * place అత్యంత విశాలమైన ప్రదేశము.
Extension    n     s     విస్తరించడము, వ్యాపించడము, విశాలము. by the *of the branches కొమ్మలు పొడుగైనందున. from the * of the Englishauthority యింగ్లీషువారి ప్రభుత్వము యొక్క వ్యాపకముచేతను. from the * of his leave వాడికి మరి కొన్నాళ్లు శలవు చిక్కినందున.
Extensive    adj        విపులమైన, విస్తారమైన, విశాలమైన, విరివైన.
Extensively    adj        విస్తారముగా, విశాలముగా, సర్వత్ర, అన్నిచోట్ల, అంతటా.the Bhagavatam is read * భాగవతమును సర్వత్ర చదువుతున్నారు. the tobacco is * cultivated here యిక్కడ పొగాకు విస్తారము పయిరుచేస్తారు.
Extensiveness    n     s     బాహుళ్యము, విస్తారత, విశాలత.
Extent    n     s     విశాలము, విస్తారము, విరివి, దూరము, పర్యంతము.the house has not sufficient * for this purpose యీ పనికి ఆ యిల్లు విశాలము చాలదు. what is the * of his land వాడి భూమియెంతమాత్రము వున్నది. Forests of prodigious * బ్రహ్మాండమైన అడవులు. a village of small * చిన్నగ్రామము. to the * of ten  rupees పది రూపాయలు మట్టుకు పదిరూపాయల పర్యంతము, పదిరూపాయలదాకా.he went to the * of beating her దాన్ని కొట్టేమట్టుకైనాడు. to a great * విస్తారముగా, చాలా to a small * కొద్దిగా, కొంచెముమట్టుకు.to what * యెందాకా, యెంతమట్టుకు, యేపాటి. to any * యెంతమట్టుకైనా.to a certain * కొంతమట్టుకు. I will do it to the * of my power యధాశక్తి చేస్తాను. to the * of one half అరవాసి. to the *of ten miles పదిగడియల దూరము.
Extenuation    n     s     తక్కువ కావడము, పరిహారము. * of crime నేరముతక్కువ కావడము.
Exterior    adj        బయటి, వెలపటి బాహ్యమైన, అగుపడే.
Exterminating    adj        పాడుచేసే, నాశముచేసే, నిర్మూలముచేసే, ధ్వంసంచేసే.
Extermination    n     s     దుంపనాశనము, సమూల నాశనము.
Exterminator    n     s     దుంపనాశనము చేసేవాడు, ధ్వంసకుడు. * of Muraమురాంతకుడు. * of death మృత్యుంజయుడు.
External    adj        బయిటి వెలపటి, పయి, బాహ్యమైన.
Externally    adv        బయిటికి, పయికి, బాహ్యముగా. this fruit is * roughయీ పండు పైన గరుకుగా వున్నది.
Externals    n     s     plu. outward appearance బాహ్యకారములు,బాహగ్యకృత్యములు, రూపు.
Extinct    adj        ఆరిన, చల్లారిన, ముగిసిన, తీరిపోయిన, నిలిచిపోయిన,నశించిన. the flame is not * ఆ జ్వాల యింకా అణగలేదు. the familyis * ఆ వంశము నశించిపోయినది. his love is now * వాడికి ఆ వ్యామోహముయిప్పుడు పోయినది. after life is * ప్రాణము పోయిన తరువాత.
Extinction    n     s     నాశనము, నిర్మూలము. after the * of the fire ఆనిప్పు చల్లారిన తరువాత.
Extinguishable    adj        ఆర్చకూడిన.
Extinguished    adj        ఆరిన, ఆరిపోయిన.
Extinguisher    n     s     దీపము ఆరిపొయ్యేటట్లు మూసే పై మూత, ఆర్పేటిది.
Extinguishment    n     s     ఆర్పడము.
Extirpated    adj        నిర్మూలమైన, నాశనమైన, ధ్వంసమైన.
Extirpation    n     s     దుంపనాశనము, సమూలనాశనము, ధ్వంసము.
Extolled    adj        స్తుతించబడ్డ, పొగడబడ్డ.
Extorted    adj        బలవంతముగా తీయబడ్డ.
Extortion    n     s     దండగ, బలాత్కారముగా తీసుకొన్న రూకలు. this is mere * యిది వట్టి దండగ. this account is mere * యిది వట్టి దండగ లెక్క.
Extortioner    n     s     అన్యాయగాడు, దండగలు బెట్టెవాడు, రూకలను కొట్టితీసేవాడు.
Extra    adv        అధికముగా, అదనముగా. the book was bound * or wasin * binding (this is book sellers cant) అధిక వన్నెలు చిన్నెలుగాజిల్దుకట్టిన పుస్తకము.
Extract    n     s     తీసినది, దించినది, ధృతి, ద్రావకము, కషాయము, సారాంశము.an * of his letter వాడి జాబులోనుంచి యెత్తి వ్రాసుకొన్న వొక భాగము. elegant *s చాటు పద్యముల పుస్తకము, చాటు శ్లోకముల పుస్తకము. * of roses పన్నీరు. * of bark, quinine జ్వరపట్ట యొక్క సత్తు. * of pepper మిర్యాల ద్రావకము. this oil is an * from the seed యిది ఆ విత్తులలోనుంచి తీసిన నూనె. of the plant called menisperumum తిప్ప సత్తు.
Extraction    n     s     వూడదియ్యడము, పెరకడము. family వంశము పుట్టుక.a man of noble * సత్కులీనుడు. a man of mean * హీన కులస్తుడు, తక్కువ జాతివాడు. do you know the * of this word యీ శబ్దమునకు వుత్పత్తి నీకు తెలుసునా. after the * of a tooth వొక పల్లు పెరికిన తరువాత.
Extrajudicial    adj        out of the regular course of legal procedureఅతిక్రమమైన, అనగా తన అధికారమునకు మించిన.
Extrajudicially    adv        అతిక్రమముగా, తన అధికారమునకు మించి.
Extramundane    adj        జగత్తులో లేని, జగదతిరిక్తమైన, భూలోకములోలేని.the * regions అవాంతర లోకములు, అనగా స్వర్గము మొదలైనవి.
Extraneous    adj        అస్వాభావిక, అన్యమైన, భిన్నమైన. there was no *matter in this letter యీ జాబులో నిమిత్ము మాలిన సంగతి యేమి లేదు.some * substances are some times found in wood కొయ్యలోఅప్పడప్పుడు రాయి మొదలైన అన్యవస్తువులు వుంటవి.
Extraordinaries    n     s     plural అనిశ్చయమైన, అధిక శలవులు, అనామతుఖర్చులు, పై ఖర్చులు.
Extraordinarily    adv        అపూర్వముగా, విశేషముగా, అతిశయముగా, మహా. This is * large యిది మిక్కిలి పెద్దదిగా వున్నది. It is * small యిది అతి సూక్ష్మమైనదిగా వున్నది. this poem is * difficult యిది బహుక్లిష్టమైనది.
Extraordinary    adj        అతిశయమైన, అసామాన్యమైన, అపూర్వమైన, అద్భుతమైన, విపరీతమైన, వింతైన. the regular and * charges నిత్య నైమిత్తిక వ్రయములు, అనగా మామూలు ఖర్చులున్ను విశేషఖర్చులున్ను.
Extravagance, Extravagancy    n    s.     విపరీతత, దూపరదిండితనము.outrageous vehemence ఉన్మాదము, వెర్రి. this is a mere poetical* యిది వట్టి వుత్ప్రేక్ష, అధిక ప్రసంగము. from the * of his languageవాడి అధిక మాటలచేతను, వెర్రి మాటలు చేతను. from the * of his applause వాడి వెర్రిశ్లాఘనచేత.
Extravagant    adj        wandering out of his bounds అతి అమితమైన,మట్టుమీరిన. prodigal దూపరదిండియైన, అతివ్రయముగల. * expenditureదూపరదిండితనము, దుర్ర్వయము. * language అధికమాటలు, పిచ్చికూతలు.you gave an * price for this నీవు దీనికి అధిక వెల యిచ్చినావు.
Extravagantly    adv        మట్టుమీరి, దూపరదిండితనముగా, అతివ్రయముగా,అపరిమితముగా, పిచ్చిగా. he lives * దూపరదిండి కాపురము చేస్తాడు.they applauded him * వాడ్ని అతిస్తోత్రము చేసినారు, వెర్రిస్తోత్రముచేసినారు. they are * fond of pictures వాండ్లకు పటముల మీద మహా భ్రాంతి, మహా పిచ్చి.
Extravasated    adj        తొలిగిన, స్వస్థనాములో నుంచి తొలిగిన స్వార్ధమ్ని బహిర్గత స్వస్థానచ్యుత, నెత్తురు తొలగడమును గురించిన మాట.
Extravasation    n     s     తొలగడము, స్వస్థానములోనుంచి తొలగడము.after the * of the blood నెత్తురు ఆవతలికి తొలిగిన తరువాత.or wheal కమిలిన చోటు. See Extravasated.
Extreme    adj        అత్యంతమైన, అతిశయమైన, విస్తారమైన, కడపటి కట్టకడపటి.* unction అవసాన తైల సంస్పర్శనము, అనగా Catholic పాదిరి అవసానకాలమందు,కరపాదాదులయందు తైలము చమరడము. your brother is too kind and yougo to the other * నీ అన్న అతి దయాళువు అందుకు ప్రతి నీవు అతి క్రూరుడవు.if thou be * to mark what is amiss ఘట్టి విమర్శ చేసే పక్షమందు, అతిశయించి విమర్శ చేసే పక్షమందు. it is wretched in the * అది యింతంత పిచ్చిది కాదు. it is beautiful in the * అందం యింతంతకాదు. Extremes, n. s. plural అతి. he is always in * వాడిదంతా అతి. *s meet అతి సర్వత్ర గ్రహ్యతే, అనగా యేదిన్ని అధికము కారాదు.
Extremely    adv        మిక్కిలి, చాలా, మహా.
Extremity    n     s     utmost point అంత్యము, కొన, చివర. from one * to the other యీ కొన నుంచి ఆ కొనకు. Four hours before he died his extremities were cold వాడు చావడానకు నాలుగు ఘడియలకు మునుపే వాడి కాళ్లుచేతులు చలవలు కమ్మినవి. If you push matter to extremities who can stand it గట్టిగా పట్టితే యెవరు నిలవగలరు. violence of passion or the most aggravated state ముమ్మరము, ఉద్రేకము. when they came to extremities with him వాండ్లకు వీడికి కలహము ముదిరినప్పుడు in the * of grief వ్యసనోద్రేకమందు, వ్యసనము యొక్క ముమ్మరములో. or distressశ్రమ, కష్టము, ఆపద. he was reduced to great * వాడికి వచ్చిన సంకటము యింతంత కాదు. he rescued us when we were in * మమ్మున ఆపదలో రక్షించినాడు.
Extrinsic    adj        బయటి, వెలపటి,   బాహ్యమైన.
Extrinsically    adv        బాహ్యముగా, పయికి.   * this argument is goodయిది పైకి న్యాయముగా వున్నది.
Extrusion    n     s     వెళ్లబెట్టడము, చాచడము. observing the  woundon his  belly and the  * of the bowels  వాడి కడుపు మీది గాయమునున్ను పేగులు  బయటికి వచ్చి వుండడమున్ను చూచి.
Exuberance    n     s     అభివృద్ది, అతిశయము, విస్తారము, విజృంభణము,బాహుళ్యము, అధిక్యము, ప్రాచుర్యము.
Exuberant    adj        అతిశయమైన.   * joy  అత్యుల్లాసము.
Exuberantly    adv        అతిశయముగా,   విస్తారముగా,  అభివృద్ధిగా.
Exudation    n     s      స్రవణము,  చమర్చడము, రసము.
Exulcerated    adj        శెలబారిన,  వ్రణముగల, పచ్చిపుండుగా వుండే.
Exulceration    n     s      శెలబారడము,   పచ్చిపుండు,   వ్రణము.
Exult    v     n     ఆనందించుట, ఆహ్లాదించుట,  హర్షించుట.
Exultation    n     s     ఆనందము,   ఆహ్లాదము, హర్షము.
Exuvie    n     s     plural. విసర్జింబడ్డది. cast skin విడిచిన తోలు,పాముకుబుసము మొదలైనవి.     cast shells  పిల్లలు గుడ్లలోనుంచి బయటవచ్చిన తరువాత  విసర్జింబడ్డ గుడ్ల పెంకులు, పురుగులు వదిలిన గుల్లలుమొదలైనవి.  the skin of a snake  పాము విడిచిన కుబుసము.  sivawears the  * of the  elephant  శివుడు గజచర్మమును ధరిస్తాడు.
Eye    n     s     కన్ను, లోచనము.  sight   చూపు, దృష్టి. when our *s metవాడిదృష్టి నాదృష్టి కలిసినప్పుడు. there is more in this thanmeets  the *   యిందులో  చెప్పి వుండేది వేరు వానిలోని అభిప్రాయమువేరు.  he cast his *s  over  the paper  ఆ దస్తావేజును పార చూచినాడు.అనగా గచ్చత్తుగా చూచినాడు.   the inner  corner of the * కంటికొలికి the puter corner of the *  కడకన్ను.  pupil of the   * కనుపాప, నల్లగుడ్డు.the  wite of the *  తెల్లగుడ్డు. sore *s కండ్ల నొప్పి, కండ్ల కలక. the *sin a peacock's tail నెమలి పింఛములో వుండే కండ్లు. any small perforationబెజ్జము, కన్ను.  the *  of a needle   సూది బెజ్జము.  an  * for a   hookగాలము, కొండి మొదలైనవాటిని తగిలించే వుంగరము. you must  keep your * uponthis నీవు దీనిమీద దృష్టిని  వుంచవలసినది.    opinion formed by observationతాత్పర్యము.he did it with the * of his owen profit స్వలాభమును విచారించిదాన్ని చేసినాడు. he paid the money with an * to getting this appointmentయీ వుద్యోగము తనకు  కావలెననే తాత్పర్యమునుపట్టి యీ రూకలను  చెల్లించినాడు.with an  * to screen himself  తాను చేసినది దాగవలెననే యోచనచేతను.he viewed  this with a jaundiced * దాన్ని మహా అసహ్యముగాచూచినాడు.   he made large *s at it  అందున గురించి  ఆశ్చర్యపడ్డాడు.he   did it  with a single  *  యీ పనిని పారమార్ధికముగా  చేసినాడు.లోకోపకారముగా  చేసినాడు. setting God before his *s  పైన దేవుడున్నాడనియెంచక. this is of  reat  importance in thier *s  వారి అభిప్రాయములోయిది  మహాముఖ్యము.   he did  it with his *s  open  వాడు బాగా  తెలిసేదీన్ని చేసినాడు, వాడు కావలెనని చేసినాడు. his *s were opened వాడికితెలివివచ్చినది. in doing this he shut his *s to the consequencesయిది యెంతమాత్రము యోచించలేదు.   he shut  his *s to her conduct  అదిపడే పాట్లకు కండ్లు మూసుకొని  వూరక  వుండినాడు.   in the twinking of an *నిమిషములో, రెప్పపాటులో.   he kept it under  his own  * వాడు దాన్నిస్వయముగా   విచారించుకొన్నాడు,  అనగా      తన స్వంత విచారణలోవుంచుకొన్నాడు. the  effects of an evil* దృష్టి దోషము.
Eyeball    n     s     కంటిగుడ్డు.
Eyebrow    n     s      కనుబొమ్మ.
Eyed    adj        కన్నులు గల.   one *  ఏకాక్షియైన. three *  త్రినేత్రములుగల.thousand *  సహస్రాక్షులు గల.  green * పిల్లికండ్లు గల.
Eyefly    n     s     or Midge  సన్నదోమ,  నుసుమ , చీకటిగల.
Eyeglance    n     s     కటాక్షవీక్షణము.
Eyeglass    n     s      కంటి అద్దము.
Eyegum    n     s      పుసి.
Eyelash    n     s    రెప్ప వెంట్రుక,పక్ష్మ.
Eyeless    adj        గుడ్డి.
Eyelet, Eyelet-hole    n    s.      సన్నరంధ్రము,  గవాక్షి.
Eyelid    n    s      కనురెప్ప.
Eyesalve    n     s     కలికము.
Eyeservant    n     s     భక్తి లేనివాడు, యజమానుడు,  యెదట లేనప్పుడు  పనినివుపేక్ష చేసేవాడు.
Eye-service    n     s     కంటి యెదట చేసే పని.
Eyesight    n     s      చూపు, దృష్టి.
Eyesore    n     s     అసహ్యము, వికారము   .  that account, is a perfect   * tohim ఆ లెక్కను చూస్తే వాడికి యెక్కడలేని అసహ్యము వస్తున్నది.
Eyestrings    n     s      కనుగుడ్డు నరములు.
Eyetooth    n     s      పై కోర.
Eyewitness    n     s     కండ్లార చూచినవాడు.
Eyre    n     s      వొకతరహా సర్క్యూటు కోర్టు.
Eyry    n     s     కొండమీద వుండే  గూళి పక్షి యొక్క గూడు.  Fabaceous, adj. చిక్కుడుకాయల సంబంధమైన.
Ezhaustless    adj        అక్షయమైన, క్షయించని, తరగని. * riches తరగని,ధనము.
English to Telugu free online dictionary
 Enter English word and know Telugu meaning
 
No comments:
Post a Comment