Conscript English to Telugu free online dictionary

Conscript n s శిపాయీలలో దాఖలు చేసుకోవడమునకు తేబడ్డవాడు, జవాను.
Conscription n s లావణము, దాఖలు చేయడము, అనగా శిఫాయీలలో దాఖలుచేసుకోవడమునకై పట్టుకొని వచ్చిన పిల్లకాయల పేళ్లను పట్టిలో దాఖలు చేయడము.
Conscupiscence n s or lust గాడు, కామవికారము, ఇంద్రియవశత్వము, మోహము, కుత్సితాభిలాష says ఇంద్రియాణాంవశ్యోభవత్. A+.
Consecrated adj or holy శ్రీ, సమర్పించిన, ప్రతిష్ట చేయబడిన, నియమించబడిన. * food ప్రసాదము, వాయనము. a bull * to the temple గుడికి విడిచిన వృషభము. a * mountain శ్రీశైలము, భద్రాచలము. * water తీర్థము. * flowers used in worship మంత్ర పుష్పము.
Consecration n s సమర్పణ చేయడము, అర్పించడము.
Consecutive adj ఒకటి వెంబడి ఒకటి క్రమముగా వచ్చే, పరంపరంగా వచ్చే. the * governors ఒకడికి తర్వాత ఒకడుగా వచ్చే గవనరులు, the * years ఒకటి వెంట ఒకటిగా వచ్చే సంవత్సరములు.
Consecutively adv ఒకటి వెంబడి ఒకటిగా, పరంపరగా.
Consent n s సమ్మతి, అంగీకారము, అనుమతి.
Consentaneous adj సమ్మతిగా వుండే, అనుసారమైన.
Consequence n s or effect ఫలము, ఫలితార్థము, పర్యవసానము. this is a * of what you say నీవు చెప్పినదానికి యిదే ఫలము. or inference అనుమానము. there is no knowing what will be the * of this యిందువల్ల యేమి సంభవించపోతుందో తెలియలేదు. drink this medicine; you need not fear the consequences యీ మందు పుచ్చుకో యేమి చేసునో అని భయపడవద్దు. this is the * of your bathing యిది నీవు స్నానము చేసినందుకు కలిగిన ఫలము, యిది నీవు స్నానము చేసినందున వచ్చినది. you will see the * యేమి కాపోతుందో చూడు. being blind to the *s యిఖను సంభవించపొయ్యేది యెరగక, రాపొయ్యేది తెలియక. in * or in * of this యిందు వల్ల. in * of his coming here అతను యిక్కడికి వచ్చినందున. in * of his not coming అతను రానందున. or Importance గౌరవము, ఘనత. this is of great * or this is of the utmost * యిది అతి ముఖ్యము. of no * స్వల్పమైన. this is of no * యిది అతిశయము కాదు, యిది ఒక గొప్ప కాదు. of what * is it? అది ఒక గొప్పా అది ఒక అతిశయమా. a man of * ఘనుడు. a man of no * అల్పుడు.
Consequent adj సంభవించే, కలిగే, పుట్టే. the advantages అందువల్ల కలిగేఫలములు.
Consequential adj (happening,) సంభవించే, (proud,) అహంకరించిన. he isvery * వాడు చెడు అహంకారి. conceited or prompous జంభముగల, బడాయిగల.
Consequentially adv by reason thereof అందువల్ల, అయినందున.
Consequently adv కాబట్టి, గనక.
Conservative adj సంరక్షించే, యిది. Tory అనే పేరుకు సమానమైనది.
Conservator n s or guardian సంరక్షించేవాడు, పరిపాలకుడు. or arbitrator మధ్యవర్తి. See Memde Comines, Book IV Chap XI Treaty No 10.
Considerable adj విస్తారమైన, బహు, నిండా తగుపాటైన, ఘనమైన. this poemhas * merit యీ గ్రంధము మహాస్వారస్య మైనది. a * distance మహాదూరము, కొంతదూరము. after a * time చాలా దినములకు తరువాత, కొన్నాళ్లకు తరువాత. thedifference is * వ్యత్యాసము కొంచెము కాదు. they are * merchants వాండ్లు,గొప్ప వర్తకులు. a * sum బహురూకలు. a * loss బహునష్టము.
Considerably adv బహుశా శానా కొంత మట్టుకు, తగుపాటిగా.
Considerate adj బుద్ధిమంతుడైన, వివేకముగల, నిదానస్థుడైన. he is very * అతడు నిండా బుద్ధిమంతుడు.
Considerately adv బుద్ధిశాలిగా, వివేకముగా, నిదానముగా.
Consideration n s the act of considering విచారించడము, విచారణ, ఆలోచన. you have no * నీకు తెలివి లేదు. on full * బాగా విచారించి. he di it on full * వాడు బుద్ధి పూర్వకముగా చేసినాడు, వాడు కావలెనని చేసినాడు.to take into * ఆలోచించుట, విచారించుట. he took this into * దీన్ని ఆలోచించినాడు, విచారించినాడు. motive or reason కారణము, హేతువ. on this * యీ హేతువ చేత. on every * అన్ని విధాల సర్వత్ర. on any * యెంత మాత్రము. that is a minor * అది ముఖ్యము కాదు. for many *s అనేక హేతువుల చేత. or bribe లంచము, బహుమానము. a valuable * వెల. on no * will be consent వాడు యెంత మాత్రము వొప్పడు. a man of * ఘనుడు, గొప్పవాడు. a man of no * అల్పుడు. he owned the bond but denied the * పత్రాన్ని ఒప్పుకొన్నాడు గాని రూకలు తీసుకోలేదన్నాడు.
Considered adj తలచిన, యెంచిన, విచారించిన, ఆలోచించిన, యోచించిన. it is * right అది న్యాయమని యెంచబడ్డది. nothing took place that could be * unjust అన్యాయమన్నది లేశ మైనా సంభవించలేదు. all things considered or every thing being * రాగా పోగా. he was * a thief వాణ్ని దొంగగా విచారించినారు.
Considering adv (vide Johnson) చూచి, ఆలోచించి, విచారించి. * his youthఅతని బాల్యమును చూస్తే, విచారిస్తే యోచిస్తే.
Consigned adj ఒప్పగించిన.
Consignee n s మునీబు, అడతిదారుడు, who is your * నీ సరుకును యెవరికివేసినావు.
Consignment n s అప్పగింత వొప్పగింత.
Consistence, Consistency n s. durability నిలకడ, సందర్భము, సంబంధము. uniformity ఏకరీతి, అనుగుణ్యము. I admire the * of his conduct వాడి నడక ఏకరీతిగా వుండడమునకు ఆశ్చర్యపడుతాను. there is no * in this story యీ కధ అకటవికటముగా వున్నది. what is the * of being my friend and my enemy's friend? నాకున్ను నా శత్రువుకున్ను మిత్రుడుగా వుండడము యెట్టి సందర్భము. or degree of denseness చిక్కిన, చిక్కదనము. when he had made the mortar of a proper * he put it on the wall ఆ గారను పక్వముగా కూర్చిన తరువాత గోడకు పూసినాడు. they mix oil with the plint till they have brought it to a proper * వర్ణము బాగా పక్వానికి వచ్చేదాకా నూనె పోసి నూరుతారు.it was of a due * అది పక్వముగా వుండినది. it assumed a * అది పక్వమైనది. when the wax is cooled to the * of paste మయనము చల్లారి పిండిపదునుకు వచ్చినప్పుడు. he shows no * వాడికి స్థిరబుద్ధి లేదు, వాడికి లక్ష గుణములు.
Consistent adj ఏకరీతిగా వుండే, స్థిరమైన, అనుకూలమైన, అనుగుణ్యమైన, ఒప్పిన, పొందికగా వుండే. this is not * with your account యిది నీలెక్కు విరుద్ధముగా వున్నది, అసందర్భముగా వున్నది.
Consistently adv ఏకరీతిగా, అనుగుణ్యముగా, సందర్భముగా.
Consnerve n s మిఠాయి, వరుగు, తేనె చక్కెర మొదలైన వాటిలో వేసి దినాల పేరట పెట్టి పెట్టే పండ్లు కాయలు మొదలైనవి.
Consolatery adj వోదార్చే, వూరటైన, దుఃఖోపశమనమైన.
Consolation n s వోదార్పు, వురార్పు, వూరడింపు, దుఃఖోపశమనము, సాంత్వనము.it is a * that he died in his country's cause తన దేశమునకై చచ్చినాడు గనుక చింత లేదు.
Consoled adj వోదార్చబడ్డ, వూరడించబడ్డ. he wept for ten days but was * at last పది దినములు యేడ్చి తుదకు శాంతపడ్డాడు.
Consolidated adj ఖనీభవించిన, పేరిన, గట్టిపడ్డ, ఒకటిగా కూర్చిన, వొకటిగా చేర్చిన *charges మొత్త ఖర్చులు. the mercury was * into a pill రసము మాత్రగా కట్టబడ్డది.
Consolidation n s గట్టిపడడము, గట్టిపరచడము, వొకటిగా చేరడము, వొకటిగా చేర్చడము.
Consonance n s or agreement ఐకమత్యము, అనుకూలము, అనుగుణ్యము,పొందిక యిమిడిక. In * with his orders అతని వుత్తరవుకు అనుగుణ్యముగా.
Consonant n s హల్లు, వ్యంజనము, అనగా, క, ఖ, గ, ఘ, యిత్యాది B, C, D, F, &c.
Consonantly adv అనుకూలముగా, అనుగుణ్యముగా, పొందికగా, యిమిడికగా.
Consort n s సహాయి, భార్య, భర్త. his * అతని పెండ్లాము. her * ఆమె పెనిమిటి. this ship parted form her * యీ వాడ తనతో కూడా వుండే వాడనువిడిచిపెట్టివచ్చినది.
Conspicuity n s ప్రకాశము, ప్రసిద్ధి, ప్రఖ్యాతి, స్పష్టత.
Conspicuous adj ప్రకాశమైన, స్పష్టమైన, ప్రసిద్ధమైన. he was * for learning వాడు చదువులో ప్రసిద్ధుడు. or obvious to the sight అగుపడే, కనబడే. a * hill ప్రసిద్ధమైన కొండ, బహుదూరానికి అగుపడే కొండ. The Hindu women are as * for chastity as the Hindu poets are for lewdness హిందూ కవులు పోకిరి తనములో యెంత ప్రసిద్ధులో హిందూ స్త్రీలు పాతివ్రత్యములో అంతఘనులు.
Conspicuously adv ప్రకాశముగా, ప్రసిద్ధిగా, స్పష్టముగా, అగుపడేటట్టుగా.
Conspicuousness n s ప్రకాశత, ప్రసిద్ధత, స్పష్టముగా అగుపడడము. from the * of this fault యీ తప్పు ప్రసిద్ధమైనది గనక, ప్రత్యక్షముగా తెలిసేది గనక.
Conspiracy n s కుట్ర, దురాలోచన, మర్మము, మంత్రాంగము, బందుకట్టు.
Conspirator కుట్రలోచేరినవాడు,ద్రోహి
Constable n s బంట్రోతు, తలారి, వారంటు తెచ్చే బంట్రోతు. the high * of a country అధికారి, అధిపతి, ప్రభువు.
Constancy n s నిలకడ, స్థిరత్వము, దృఢత్వము.
Constant adj నిత్యమైన, నిరంతమైన, స్థిరమైన, శాశ్వతమైన. his * abode అతని నిరంతర నివాస స్థానము.
Constantly adv యెల్లప్పుడు, యెప్పుడున్ను, నిత్యము, నిరంతరము, తియ్యకుండా,మాటిమాటికి, సారెసారెకు.
Consternation n s మహత్తెన భయము, ప్రాణ భయము తల్లడము.
Constipated adj మలబద్ధమైన. he was much * వాడికి మలబద్ధకముగా వుండెను.
Constipation n s మలబద్ధము. he suffered much from * మలబద్ధకము చేత నిండా సంకట పడ్డాడు. they drink this as a remedy against constipation మలము జారడానకై దీన్ని తాగుతారు.
Constituent n s నియామకుడు నియమించినాడు. a member of parliamentwrote a letter to his *s పార్లమెంటు అధికారి తన్ను యేర్పరచి పంపించిన కాపులకు జాబు వ్రాసినాడు.
Constituted adj నియమించబడిన, నిర్మితులైన, యేర్పరచిన. a * representative నియమించబడ్డ వకీలు.
Constitution n s the act of consituting నిర్మాణము, యేర్పాటు, నిబంధన.natural qualities ప్రకృతి, స్వభావము. It does not agree with my * అది నాశరీరమునకు గిట్టదు, వొంటదు. * or temperament of body శరీరప్రకృతి,దేహతత్వము. a man of strong * దృఢగాత్రుడు, వజ్ర శరీరము గలవాడు. a man of weak * నిస్త్రాణి, సత్తువలేనివాడు. his * is broken వానికి దేహపటుత్వము తప్పి పోయినది. his * is very delicate వాడి శరీరము మహా సున్నితమైనది. a bilious * పిత్త శరీరము, పైత్య ప్రకృతి. this hot weather tells severely upon the * యీ గాడ్పు కళలన్నిటిని పీలుస్తుంది. a breaking up of the * సన్నిపాతము, జన్ని. he injured his * by drinking తాగడము చేత ఒళ్లు చెరుపుకొన్నాడు. or government దేశాచారము, రాజ్యనీతి. an established form of government దొరతనపు నిబంధన. a system of laws ధర్మ శాస్త్ర పద్ధతి. the *s or laws of Manu మనుస్మృతి. The *s of Logic తర్కసిద్ధాంతము.
Constitutional adj శరీరముతో పుట్టిన, జన్మ సిద్ధమైన, నిత్యమైన. he took a * walk ఆరోగ్యము కొరకు పచారి చేసినాడు. * disease పురాణణించిన రోగము, ముదిరిన రోగము. * weakness సంగ దోషము. or legal న్యాయమైన, సహజమైన.
Constitutionalists n s పూర్వనిబంధన ప్రకారము నడిచేవారమని రాజుకుప్రతికక్షిగా వుండే Spain దేశపు కాపులు.
Constitutionally adv స్వభావతః, జన్మతః, సహజముగా.
Constrained adj నిర్బంధించబడ్డ,బలవంతముచేయబడ్డ,బలాత్కారముచేయబడ్డ, I was * to make this request నేను యీ మనివి చేసుకోవలసి వచ్చినది. I was * to go there అక్కడికి పోవలసి వచ్చినది. he used * expressions మనసు విడిచి మాట్లాడడు.
Constraint n s నిర్భంధము, బలవంతము, కడ్డాయము. or restraint ఆటంకము,విరోధము. I saw that he spoke with * వాడు మనసు విడిచి మాట్లాడలేదు. Self *దమము.
Constrictor, or BoaConstrictor n s. కొండ శిల అనే పెద్ద పాము, అజగరము,కొండచిలువ, రక్త పింజరపాము.
Construction n s నిర్మాణము, యేర్పాడు, భావము, అభిప్రాయము. the * of thebuilding కట్టడము. the * of a tank చెరువు వేయించడము. of wordsపదవిన్యాసము. I did not put that * on what he said వాడు చెప్పినది విని నేనుయీ భావము చేసుకోలేదు. I put a good * upon his words వాడి మాటలకు నేనుమంచి అర్థము చేసుకొన్నాడు. the * of a diagram ప్రోద్ధారము, చక్రము వేయడము.
Constructive adj భావించిన, క్రియ చేత తేలిన, ఉత్తరోత్తర తెలియబడే, ఫలితార్థముగావుండే. coining money is * treason తప్పునాణెము వేయడమునకు రాజద్రోహముఫలితార్థముగా వున్నది.
Constructively adv భావేన, తాత్పర్యతః, ఫలితార్థముగా.
Consubstantial adj ఏకీభూతమైన, ఏకీభవించిన, సమవస్తువుగా వుండే.
Consubstantiality n s ఏకీ భూతత్వము.
Consubstantiation n s ఏకీభూతత్వము, ఏకవస్తుత్వము, సమభావము. Droz. says ఖ్రైస్తు మతస్థులు చేసే సాక్రిమంటనే ఖ్రీస్తు భోజనములో అభిమంత్రించబడ్డరొట్టె, ఒయిన్ సారాయి, వీటిని, కొందరు ఖ్రైస్తు యొక్క సాక్షాత్ మాంస రక్తములనిన్ని, కొందరు తన్మిశ్రితమనిన్ని, కొందరు తత్ప్రత్యామ్నాయ మనిన్ని అంటారు,వీరిలో యిది తన్మిశ్రితమనే వారి మతము.
Consul n s (at foreign courts) మంత్రి, రాయబారి, వకీలు, అన్యదేశమందు తమవర్తకుల యొక్క సంరక్షణ కొరకై యేర్పరచి వుంచిన అధికారి. a military commanderసేనాధిపతి, అధికారి.
Consular adj అధిపతి సంబంధమైన, he obtained * rank అధికారి అయినాడు.
Consulate, Consulship n s. అధిపత్యము, అధికారము.
Consultation n s ఆలోచన.
Consumable adj ఆహారయోగ్యమైన, తినేటందుకు యోగ్యమైన. * commoditiesతినుబండములు, బియ్యము ధాన్యాది సరుకులు.
Consumed adj అయిపోయిన, క్షయించి పోయిన తినివేసిన వ్రయమైన, దగ్ధమైన. alltheir provisions were now * యింతలో వాండ్లకు భోజన సామగ్రీ అంతాఅయిపోయినది. the stock of grain was * within months ఆ ధాన్యము మూడునెలలకు అయిపోయినది.
Consumer n s శలవు చేసేవాడు, వ్రయము, చేసేవాడు, తినేవాడు, అనుభవించేవాడు.the merchant pays only 10 rupees for these goods but the * pays 20 rupees యీ సరుకుకు వర్తకుడు పది రూపాయీలే యిస్తాడు గాని అనుభోగిదానికే యిరువైరూపాయీలు పెట్టుతున్నాడు.
Consuming adj దహించే. a * fire ప్రళయానలము, (సంహారకవహ్ని) A+. *grief కుంగ కొట్టే వ్యాకులము. or using అనుభవించే, వ్రయము చేసే.
Consummate adj సిద్ధమైన, పూర్నమైన, అతి. * injustice అతి దౌర్జన్యము.consummate iniquity అతిపాపము మహత్పాపము. * beauty అతి సౌందర్యము.
Consummated adj తీరిన. this marriage was never * పెండ్లి అయినదిఆలమగడు కలియలేదు.
Consummately adv అతి. * beautiful అతి సౌందర్యమైన * vile మిక్కిలి చెడ్డ.
Consummation n s ముగింపు, సంపూర్తి, సమాప్తి. this was the * of hishopes వాడు కోరిన దానికి ఫలమిదే. of marriage శోభనము.
Consumption n s క్షయము. of money or stores వ్రయము. articles of *వ్రయము చేయదగిన వస్తువులు, శెలవు కావలశిన ద్రవ్యములు. articles of * in afamily సంసారానికి కావలసిన సామగ్రీ. this rice is not enough for a month's * యీ బియ్యము నెల ఖర్చుకు చాల కుండా వున్నది. or disease క్షయరోగము.pulmonary * రాజయక్ష్మ అనే రోగము.
Consumptive adj క్షయించే, నశించే, కృశించే. a * disease క్షయరోగము.
Contact n s స్పర్శ, తాకడము. * conveys disease స్పర్శ చేత రోగము వస్తున్నది.in * with అంటుకొని వుండే, తాకుకొని వుండే. they were placed in * అని ఒకటితోఒకటి తాకేటట్టుగా పెట్టబడ్డవి. to put in * ఒకటిని ఒకటి తగిలే టట్టుగా పెట్టుట.If two ships come in * వాడ మీద వాడ తగిలితే. when they were in * ఒకటిని ఒకటి తాకుకొని వుండినప్పుడు. to prevent * ఒకడితో ఒకటి అంటకుండా, ఒకటి మీద ఒకటి తగలకుండా.
Contagion n s స్పర్శ, అంటు, సోకు. people says that cholera comes by *వాంతి భ్రాంతి స్పర్శ చేత సంభవిస్తుందంటారు.
Contagious adj అంటే. a * disease అంటు రోగము. a * fever అంటు చేత వచ్చేజ్వరము. their fears were * వాండ్ల భయము అందరికి అంటుకొన్నది, కలిగినది. thelaughter was * ఒకరిని చూచి ఒకరు అందరు నవ్విరి.
Contagiousness n s స్పర్శశక్తి. this proves the * of the disease యిందువల్లఅది అంటురోగ మని తెలుస్తుంది.
Contained adj పట్టిన, యిమిడిన. the things * in the box ఆ పెట్టెలో పట్టినవస్తువులు.
Containing adj గల. the box * the money ఆ రూకలు గల పెట్టె. the letter *the intelligence ఆ సమాచారము గల జాబు.
Contaminated adj అంటుపడ్డ, భ్రట్టైన, చెడిపోయిన.
Contamination n s అంటు, అశుచి, భ్రష్టత.
Contemned adj అలక్ష్యము చేయబడ్డ, తృణీకరించబడ్డ, తిరస్కరించబడ్డ. he was *అగౌరవము చేయబడ్డాడు.
Contemplation n s ఆలోచన, ధ్యానము.
Contemplative adv ఆలోచనగా వుండే, ధాన్యముగా వుండే. a * life సన్యాసము,మునివృత్తి.
Contemporaneous adj ఏక కాలములో వుండే, సమకాలములలో వుండే.
Contemporary n s సమకాలపు వాడు, సమాన కాలపువాడు. his contemporariesఅతని కాలములో వుండిన వాండ్లు. these poets were his contemporaries వీండ్లుఅతని సమకాలపు కవులు.
Contempt n s అలక్ష్యము, తిరస్కారము, ఉల్లంఘనము. he treated them with *వాండ్లను అలక్ష్యము చేసినాడు. he treated the law with * శాస్త్రమును అలక్ష్యముచేసినాడు.
Contemptbly adv తుచ్ఛముగా, అల్పముగా, నీచముగా, దిక్కుమాలిన రీతిగా.
Contemptible adj హేయమైన, నీచమైన, అల్పమైన, తుచ్ఛమైన, దిక్కుమాలిన. hebrought a * army స్వల్పమైన దండు తీసుకవచ్చినాడు. a * wretch దిక్కుమాలినగొడ్డు. a * horse పనికిమాలిన గుర్రము. * wages స్వల్పసంబళము.
Contemptuous adj అహంకారమైన, గర్వమైన, తిరస్కారమైన. a * man గర్వి. *language అలక్ష్యమైన మాటలు, తిరస్కారపు మాటలు. he gave a * answerతరిస్కరమైన వుత్తరము చెప్పినాడు.
Contemptuously adv తిరస్కారముగా, అలక్ష్యముగా, అహంకారముగా, గర్వముగా.
Contender n s పోరాడేవాడు, జగడమాడేవాడు, వ్యాజ్యమాడేవాడు.
Contending adj పోరాడే, జగడమాడే, కలహమాడే, వ్యాజ్యమాడే. the * partiesపోరాడేవాండ్లు వాది ప్రతివాదులు.
Content n s తృప్తి, సంతుష్టి, తనివి, సమ్మతి, అంగీకారము రాజీ, సమాధానము.
Contented adj తృప్తి పొందిన, సంతుష్టి పొందిన, సమ్మతించిన, ఒప్పిన. * withlittle, and happy with more రవంతే చాలును విశేషమైతే మరిన్ని సంతోషమే. heshows a * dispositon నిమ్మళముగా వున్నాడు, తొణకకుండా వున్నాడు. he is not *with this యిది వాడికి తృప్తి లేదు.
Contentedness n s సమ్మతి, తృప్తి. this shows his * యిందువల్ల వాడు తృప్తిపొందిన్టు తెలుస్తున్నది.
Contention n s పోరు, జగడము ఘర్షణ, వ్యాజ్యమాడే, పీకులాడె. a * man కలహప్రియుడు. a * woman జగడగొండి.
Contentment n s సమ్మతము, తృప్తి, సంతోషము.
Contents n s plu. (that which is in side) లోనిది, లోగా వుండేటిది. heasked what were the * of the cup గిన్నెలోనిది యేమిటిదని అడిగినాడు. * of apurse సంచిలో వుండేటిది. the * of a library పుస్తకశాలలో వుండే గ్రంధములు. the *of the sea సముద్రములో వుండే నీళ్లు మొదలైనది. when the gun was fired hereceived the * in his side తుపాకి కాల్చేటప్పటికి దానిలో వుండేటిది వాడి పక్కనదూసుకొన్నది, వేటు బయల్దేరి వాడి పక్కన దూసిపోయినది. the * of the box of its *పెట్టెను ఖాలి చేసినాడు. the * of the book ఆ పుస్తకములో వుండే సంగతులు. * of aletter సంగతులు, జాబుతో వుండేటిది. the * of a chapter అధ్యాయ సంగ్రహము,సూచి.
Contest n s పోరు, జగడము, యుద్ధము, వివాదము, వ్యాజ్యము. athletic * మల్లయుద్ధము.
Contested adj వ్యాజ్యాస్పదమైన, వినాదాస్పదమైన, సందేహాస్పదమైన.
Contexture n s అల్లిక, నేత.
Contiguity, Contiguousness n s. చేరిక, చేరువ, సామీప్యము. from the * ofthese two hills యీ రెండు పర్వతములు చేరికగా వున్నందున.
Contiguous adj చేరికగా వుండె. these two towns are * యీ రెండు పట్ణములుచేరికగా వున్నవి.
Continence, Continency n s. జితేంద్రియత్వము, ఇంద్రియనిగ్రహము, కామాదినిగ్రహము, కచ్ఛశుద్ధి. want of * వ్యభిచారము. he took a vow of * స్త్రీ ముఖముచూచేది లేదని వ్రతము చేసుకొన్నాడు.
Continent n s మహాద్వీపము, అవిచ్ఛిన్నమైన ఖండము. Ceylon is near the * ofIndia లంక, జంబూద్వీపానకు సమీపముగా వున్నది. he passed from the island tothe * ఆ లంకలో నుంచి దేశానకి పోయినాడు. the * of Europe యిది FranceGermany, Spain ఆ ప్రాంత్యము లైన దేశములకు సముదాయనామము, గనకcontimental literature ఆయా దేశ భాషలు he went from England to the *యింగ్లిండు నుంచి దానికి సమీపమందు వుండే దేశానికి పోయినాడు. I lately made atour on the continuent యిటీవల దేశసంచారము పోయి వుంటిని.
Continental adj మహాద్వీప సంబంధమైన. Wesley (Journal, Feb 1772)calls sentimental and * " no words but mere absurdities " Johnsonomits them : but they now are in use.
Contingence, Contingency n s. సంభవించేపని, అనిశ్చయము. you must beprepared against contingencies యే వేళకు యేమి వచ్చునో అని నీవు జాగ్రతగావుండవలసినది. this rests on a mere * యిది అనుమానాస్పదముగా వున్నది. hisbrother's marriage is a mere * వాడితోడ బుట్టిన వానికి వివాహము అవుతుందోకాదో. property to be inherited from a father may be a certainty butthat of a maternal uncle is a mere * తండ్రి సొత్తు కొడుకుకు వచ్చుననేదినిశ్చయమేగాని మేనమామ సొత్తు మేనల్లుడికి రావడము అనిశ్చయము.
Contingent adj సంభవించే, తటస్థించే, అనిశ్చితమైన. * charges అనిశ్చతమైనఖర్చులు, సాదర్వారు ఖర్చులు, చిల్లర ఖర్చులు. a Contingent, n.s. సంభవించేపని,అనిశ్చతము, The Hyderabad * నిజాంవారు సహాయముగా పంపించిన సేన.
Continual adj నిత్యమైన, నిరంతరమైన, యెడతెగని, విడవని.
Continually adv నిత్యముగా, నిరంతరముగా, యెడతెగకుండా, విడవక, మాటిమాటికి,పదేపదే.
Continuance n s వుండడము, వునికి, నిలకడ, నిత్యత్వము, స్థిరత్వము. from their* here వాండ్లు యిక్కడ వుండుట చేత. from the * of the rain వాన విడవకుండావుండడము చేత. it is not of long * అది బహుదినాలుగా వుండేది కాదు.
Continuation n s ఉప భాగము, రెండో భాగము, కొదవ, కడమ. the Harivamsamis a * of the Mahabarat మహా భారతానకు హరివంశము వుపభాగము, హరివంశముభారతముతో చేరినది.
Continued adj యెడతెగని, విడవని, నిరంతరమైన. a * line యెడతెగకుండా వుండేవరుస, ఏక క్రమము. * benefits విడవకుండా చేస్తూ వచ్చు వుపకారములు. a * feverవిడవని జ్వరము. a long * war బహుదినాలు విడవకుండాజరుగుతూ వుండిన యుద్ధము.
Continuity n s అవ్యవధానత, యెడతెగకుండా వుండడము, వరుస, పరంపర,దార్ఢ్యము.
Continuous adj యెడతెగని, పరంపరగా వుండే. a * range of hills యెడతెగనికొండలు, కొండల సరణి.
Continuously adv యెడతెగకుండా, విడవకుండా, ఏకక్రమముగా, వరుసగా, కలిపి.
Contnemptuousness n s అలక్ష్యము, అహంకారము.
Contnent adj తృప్తిపొందిన, సంతుష్టి పొందిన, సమ్మతించిన, ఒప్పిన. my heart isnow * యిప్పుడు నా యాశ తీరింది, యింతే చాలు. the opulent are never * అతిభాగ్యవంతులకు యెన్నటికిన్ని తృప్తి లేదు, తనివి లేదు. he was quite * with 10 rupees పది రూపాయలతో మహాతృప్తి పొందినాడు, పది రూపాయీలే చాలుననుకొన్నాడు.was he * with that దానికి ఒప్పినాడా, సమ్మతించినాడా. were you * with theirconduct వాండ్ల నడత మెచ్చినావా, వాండ్లు చేసేది నీకు సరిగ్గా వుండినదా. not * withthis యిదిన్నీ చాలక. he was * to take this money యీ రూకలు తీసుకోవడానకుసమ్మతించినాడు.
Contnentedly adv అడ్డమాడక, యింతే చాలునని, ఒప్పుకొని.
Contnext n s పూర్వోత్తర సందర్భము, ఔచిత్యము.
Contorted adj వంకరైన, వికారమైన.
Contortion n s వంకర, వికారము, యీడ్పు. his *s showed the pain hesuffered వాడి వొళ్లు విరుపుళ్లు చేత వాడు పడిన సంకటము తెలిసినది. from the *sof the body I saw he had suffered great pain ఆ పీనుగ వంకరటొంకరగావుండినది చూచినాడు నిండా బాధపడి చచ్చినట్టు కనుక్కొన్నాను.
Contour n s ఆకృతి, ఆకారము, కుదురు.
Contra adv యెదురుగా. per * మారుగా, చెల్లుగా. we paid 100 rupees but per* we gained 50 నూరు చెల్లించినాము సరే, దానికి ప్రతిగా యాభై వచ్చినది,బదులుగా యాభై వచ్చినది.
Contraband adj తీసుకొని రాకూడని, నిషిద్ధమైన నిషేధింపబడ్డ. * goods తీసుకొనిరాకూడదని నిషేధింపబడ్డ సరుకులు. opium is a * article in China చీనా దేశములోకినల్ల మందు తీసుకొని పౌకూడదని చట్టమున్నది.
Contract n s ఒప్పందము, జట్టి, గుత్త, యిజారా, ఒడంబడిక, కరారు. he made a * for building a house for 1000 Rupees వెయ్యి రూపాయలకు ఒక యిల్లు కట్టుతానని గుత్త చేసుకొన్నాడు. he failed to keep his * కరారుతప్పినాడు. he took the * for grain కావలసినంత ధాన్యము వేస్తానని ఒప్పందము చేసినాడు. when he entered into a * ఒడంబడికను చూపినాడు.
Contracted adj సంకుచితమైన, సంగ్రహమైన, తగ్గించిన, చేసిన, తీసుకొన్న. his arm was * by disease రోగము వల్ల వాడి చెయ్యి యీడ్చుకొని పోయినది a * browచిట్లించిన ముఖము. a man of * mind లోభి, కుత్సితుడు. a man of a very *intellect మూఢుడు, మూర్ఖుడు. the limbs of a dwarf are * మరుగుజ్జువానిఅవయవములు కురుచనై వుంటవి. here a word is omitted, the sentence being* యిక్కడ ఒక శబ్దమును విడచిపెట్టి వాక్యాన్ని సంకుచితము చేసినాడు. this syllable is * యీ అక్షరము లోపము.
Contractedly adv సంక్షేపముగా, సంగ్రహముగా, టూకీగా.
Contraction n s సంక్షేపముగా సంగ్రహము, యిమడ్చడము. of letters inwriting సంక్షేపలిపి, సంకేతాక్షరము, పొడక్షరము. of a limb యిలుకు, పట్టు,యీడ్చుకొని పోవడము.
Contractor n s ఒప్పందగాడు, గుత్తదారుడు, యిజారాదారుడు.
Contradiction n s కాదనడము, లేదనడము విరుద్ధము, వ్యత్యాసము, అసంగతము,వితండావాదము. this is a plain * of that అది యెక్కడ యిది యెక్కడ. this is a * of what he said before వాడు ముందు చెప్పినదానికి యిప్పుడు చెప్పినదానికివిరుద్ధముగా వున్నది, అసంగతముగా వున్నది.
Contradictory adj విరుద్ధమైన, అసంగతమైన, వితండమైన, అడ్డమైన.
Contradistinction n s భేదము, లక్షణము, విశేషము.
Contradistinguished adj భేదమగుపరచిన, విశదమైన. those people areBramins whereas these are * as Musulmans వాండ్లు బ్రాహ్మణులు అయితేవీండ్లు తురకలు అయినట్లు భేదమగుపడుతున్నది.
Contraries n s plu. పరస్పర విరోధములు, అసంబంధములు. arguing by * విరుద్ధహేతువును పట్టి సాధించడము. " he refused my last request so I think hewill grant this one " this is called arguing by contraries మునుపుఅడిగినందుకు ఓపనన్నాడు గనుక యిప్పుడు అడిగితే ఒప్పునేమో.
Contrariety n s పరస్పర విరోధము, అసంగతము, విరుద్ధము, వ్యతిరేకము,వ్యత్యయము. from the * of their statements వాండ్లు చెప్పేది పరస్పరవిరుద్ధమైననందువల్ల.
Contrary adj విరుద్ధమైన, విరోధమైన, ప్రతికూలమైన, వ్యతిరిక్తమైన. * to hisinclinations వాడికి అసమ్మతముగా. he took a plan * to mine నా యుక్తినివ్యత్యస్తముగా ఒక యుక్తి చేసినాడు. a * wind యెదురుగాలి. those of the * side ప్రతిపక్షస్థులు, ప్రతికక్షివాండ్లు. can you prove the *? అట్లా కాదని నిరూపించగలవా ? for any thing I know to the * he is living there still బహుశా వాడు యిప్పటికిన్ని అక్కడనే వుండును. they may be partners ; I know nothing to the * వాండ్లు పాలికాపులుగా వుంటే వుండవచ్చును నేనేట్లా కాదనేది, దానికి అన్యధా నా కేమిన్ని తెలియదు. on the * supposition కాని పక్షమందు, లేని పక్షమందు. you say he is gone; on the * I know that he is here వాడు పోయినాడంటావు అట్లా కాదు వాడు యిక్కడ వున్నాడు నాకు తెలుసును. on the * అట్లా కాకుండా.
Contrast n s భేదము, పరస్పర భేదము, వైపరీత్యము, వ్యత్యాసము. there is astrong * between them అవి యెక్కడ యివి యెక్కడ, వాండ్లు యెక్కడ వీండ్లు యెక్కడ,వీటికి వాటికి వుండే బేదము యింతంత కాదు.
Contrasted adj విరుద్ధమైన, వ్యత్యాసమైన.
Contravention n s విరోధము, ప్రతికూలము. in * of the bond `ఆ పత్రమునుకొట్టేటట్టుగా, దానికి ప్రతికూలముగా, విరుద్ధముగా.
Contribution n s assistance సహాయము, అనుకూలము. of money & c చందా,పంచివేత. a * which is levied by force దండుగ తక్కిసము. they laid thecountry under * వాండ్లు ఆ దేశము కొల్లపెట్టినారు వాండ్లు ఆ దేశములో దండుగలుపట్టినారు. he sent a * to the news paper అన్యూసు పేపరులో వేసే లాగున ఒకసంగతి వ్రాసి పంపించినాడు.
Contributor n s సహాయము చేసేవాడు, అనుకూలము చేసేవాడు, ఒదిగేవాడు.
Contributory adj సహాయము చేసే, అనుకూలము చేసే ఒదిగే, ఉపయోగమైన.
Contrite adj అనుతాపముగల, పశ్చత్తాపముగల.
Contrition n s అనుతాపము, పశ్చాత్తాపము, సంతాపము.
Contrivance n s యుక్తి, ఉపాయము, యోచన,కల్పన.
Contrived adj యుక్తి చేసిన, కల్పించిన, పన్నిన. well * బాగా యోచించిన, నిండాయుక్తిగా పన్నిన. ill * జబ్బైన, జబ్బుగా కుదిరిన.
Contriver n s ఉపాయశాలి, ఉపమరి.
Control n s ఆజ్ఞ, అధికారము, కర్తృత్వము, స్వాధీనము. they are in his * వాడికి వశ్యులై వున్నారు. they are not in my * వాండ్లు నాకు స్వాధీనము లేదు. he kept them in * వాండ్లకు తన కట్టులో వుంచుకొన్నాడు. rage beyond * అపరిమితమైనకోపము. beyond * అపరిమితముగా. the board of * యీష్టు యిండియా కంపినిమీదపై విమర్శ చేసే అధికారుల సభ.
Controllable adj అణచకూడిన, స్వాధీనమయ్యే, వశ్యమయ్యే.
Controlled adj అణిగిన, స్వాధీనమైన, వశ్యమైన. can love be * by advice బుద్ధి చెప్పడము చేత మోహము అణుగునా.
Controller n s అణిచేవాడు, యేలేవాడు, అధికారి, విచారణ కర్త లెక్కలను పరిశీలన చేసేవాడు. God is the * of kings రాజులను అణిచేవాడు దేవుడు.
Controllership n s లెక్కలను విమర్శించే అధికారము.
Controversial adj తార్కిక, తర్కించే, వాదించే. * task వాదు, వితండవాదము. a *book మతగ్రంధము, తర్కగ్రంధము, వాద గ్రంధము. * theology మీమాంస.
Controversy n s వివాదము, వ్యాజ్యము, జగడము పోట్లాట. the matter is in * ఆ సంగతి వివాదములో వున్నది. without *; or, beyond all * నిర్వివాదముగా,నిరాక్షేపముగా.
Controverted adj వివాదాస్పదమైన, వ్యాజ్యగ్రస్తమైన, సందేహాస్పదమైన. * texts inthe Mahabharat are called వ్యాసఘట్ట శ్లోకములు.
Controvertible adj వివాదగ్రస్తమైన, వ్యాజ్యాస్పదమైన, సందేహాస్పదమైన.
Controvertist n s వాదించేవాడు, వ్యాజ్యగాడు, మీమాంసకుడు.
Contumacious adj అణగని, మొండి, మూర్కముగల, తిరగబడే, పీకులాడే. a *woman జగడగంటి.
Contumaciously adv మూర్ఖముగా, మొండితనముగా.
Contumaciousness n s మూర్కత్వము, మొండితనము, ఉల్లంఘనము.
Contumacy n s మూర్కత్వము, చణగరము, చండితనము, ఉల్లంఘన.
Contumeliously adv పరుషముగా, నిందగా. he was treated * వాణ్నితిరస్కారము చేసినారు.
Contumely n s దూషణ, దుర్బాష, తిట్లు, అపనింద.
Contused adj నలిగిన, నలగగొట్టిన.
Contusion n s కందు, చొట్ట, నొక్కు. he received a * from a blow వాడికి దెబ్బ తగిలి దోగిపోయినది.
Conundrum n s వ్యంగ్యము, ప్రశ్న, శ్లేష, విడి కథ, విపరీతార్థమయ్యే వాక్యము,విరోధాభాసాలంకారము యేలాగంటే విచారదృక్ చార దృగప్యవర్తత, వొకడు చార దృక్కుగానున్ను విచార దృక్కుగానున్ను వుండడము విరోధము, విచార శబ్దానకు విమర్శ అనే అర్ధముచేస్తే విరోధాభాసము.
Convalescent adj లఘువుగా వుండే, గుణముగా వుండే, తిరుగు ముఖముగా వుండే,తేరుకొనే, కోలుకొనే. he is * వాడికి రోగము లఘువుగా వున్నది, తిరుగుముఖముగావున్నది I am still a * నేను యింకాపథ్యము విడవలేదు.
Convelascence n s స్వస్థము, నయము, గుణము, కుదురు, తిరుగు ముఖము,శాంతము. during my * నాకు వ్యాధి తిరుగు ముఖముగా వుండేటప్పుడు.
Convenience n s వయివు అనువు, సౌఖ్యము, సౌకర్యము, ఉపాయము ఆయుధము,సాధనము, వసతి, వంటింపు. * of time సందర్భము come to me at your * నీకుఅనుకూలమైనప్పుడురా. he made a mere * of me వాడు నన్ను తన దాసుణ్నిగావిచారించినాడు.
Convenient adj అనుకూలమైన, అనువైన, ఉచితమైన, యుక్తమైన, వైపుగా వుండే,వసతిగా వుండే. If it is * for you to do this దీన్ని చేయడమునకు నీకుఅనుకూలముగా వుంటే. it is not * for him to come వాడు రావడానకు సరిపడలేదు.this is not * ( seemly ) యిది వొప్పుడు, కూడదు, అనుకూలము కాదు, పనికిరాదు.
Conveniently adv హాయిగా, అనువుగా, అనుకూలముగా. the home stands very* for him ఆ యిల్లు వాడికి అనుకూలముగా వున్నది, హాయిగా వున్నది. can youconveniently come tomorrow రేపు రావడము నీకు తొందర లేదే, రేపు రావడమునీకు అనుకూలమేగా. with out difficulty సరాళముగా.
Convent n s మఠము, సన్యాసులు వుండే ఆశ్రమము, వుదాసీలు వుండే దీక్షాలయము.convent అక్షరం. or lasting abode is the word used in some countriesBuchanan, E. I. 3. 176. To go into a * or embrace the monastic lifeసన్యసించుట, మునివృత్తిని వహించుట.
Conventicle n s గుప్త సభ, పిచ్చి మతస్థులు యేర్పరచుకొన్న వొక చావిడి.
Convention n s సభ కూటము. or agreement ఒడంబడిక, రాజీనామా.
Conventional adj సాంకేతికమైన, సాధారణమైన. a * phrase సాంకేతిక వాక్యము,సంజ్ఞావాక్యము. a * term పరిభాష, సాంకేతిక పదము.
Conventionality n s సాంకేతికము, వట్టి కల్పన.
Conventionally adv సాంకేతికముగా, పరిభాషగా.
Conventual adj మఠ సంభంధమైన, * observances మఠములో జరిగే ఆచారము.
Convergence n s ఒక చోట కూడడము.
Convergent adj ఒక చోట కూడే, కలిసే.
Conversable adj వేరు బంధము లేని, సాధు అయిన, సరసుడైన.
Conversancy n s ప్రవీణత, ప్రజ్ఞ, జ్ఞానము. from his * with logic తర్కములోప్రవీణత గలవాడు గనుక. * with divinity వేదాంతజ్ఞానము.
Conversant, or conversant adj ప్రవీణతగల,నిపుణుడైన,తెలిసిన, he is *with logic వాడు తర్క మందు ప్రవీణుడు. a woman * with geography భూగోళశాస్త్రము తెలిసిన స్త్రీ.
Conversation n s సంభాషణ, సల్లాపము, యిష్టాలాపము, ముచ్చట, మాట్లాడడము.some * took place కొన్ని మాటలు జరిగినవి. to turn the * పులిమి పుచ్చుట, వేరేమరి వొక ప్రస్తావన చేసుట. or behaviour నడక, ప్రవర్తన. carnal * సంభోగము, రతి.criminal * వ్యభిచారము, రంకు.
Conversational adj సంభాషణ, సంబంధమైన. a * expression గ్రామ్యమైనమాట. this poem is written in a * style యీ కావ్యము సంభాషణ సరణిగా వ్రాసివున్నది.
Converse n s (inter course) సంభాషణ, పరిచయము. or reverse వ్యతిరేకము,విపరీతము, తల్లకిందులు. he states that the Tantras are much esteemed butlittle studied : I have reason to believe that the * of this would betrue తంత్రముల యందు నిండా గౌరవము వున్నప్పటికిన్ని అంతగా చదవడము లేదంటాడు, గౌరవము లేదు గాని చదవడము మొండని దానికి విరుద్ధముగా నాకు తోస్తుంది. (Colebr)
Conversely adv విరుద్ధముగా, వ్యతిరేకముగా, తల్లకిందులుగా.
Conversion n s మార్చడము, చేయడము, మతాంతరము, మతము విడిచి వేరేమతములో ప్రవేశించడము. after his * to the Christian religion కిరిస్తు మతములోప్రవేశించిన తరువాత. by the * of his house into a school ఆ యింటిని పళ్లికూటముగా చేసినందున. to prevent the * of this money to other purposes ఆరూకలను వేరే పనులకు వినియోగపరచకుండా.
Convert n s ఒక మతము విడిచి వేరే మతములో ప్రవేశించినవాడు, కులముచొచ్చినవాడు. a * to the Christian religion కిరస్తు మతములో ప్రవేశించినవాడు. Iam now become a * to your opinion నీ మాటే సరి అని నాకు యిప్పుడు తోచినది,నీవు చెప్పేదే సరి అని యిప్పుడు ఒప్పినాను.
Converted adj మారిన, తిరిగిన, మతము విడిచి వేరే మతములో ప్రవేశించిన, కులముచొచ్చిన. Luke 22:32. మనసు తిప్పుట F+. G+ పరివర్తితె A+
Convertibility n s తిరిగే గుణము, యెట్లానంటే అట్లా అయ్యే గుణము. this provesthe * of sand into glass యిందువల్ల యిసుక గాజు అవుతున్నదని తెలుస్తున్నది.
Convertible adj మారే, తిప్పగూడిన, యెట్లానంటే అట్లా చేయగూడిన. this walkingstick is convertible into an umbrella యీ వూతకర్రను నిమిషములో గొడుగుచేయవచ్చును.
Convex adj తాబేలు వీపువలె వుబ్బుగా వుండే, బోర్లించిన ప్రమిద ఆకారముగా వుండే,బోర్లించిన మంగలగిన్నె ఆకారముగా వుండే. a * plate చల్లటి బిళ్ల.
Convexity n s కూర్మపృష్ఠాకారము, తాబేలు వీపు రూపు.
Convexo-concave adj తాబేలు పెంకు ఆకారముగా వుండే కూర్మపృష్ఠాకారమైన.
Conveyance n s a horse &c వాహనము, సవారి, పల్లకి, గుర్రము మొదలైనవి. awheeled * బండి. he got into his * బండి యెక్కినాడు, పాల్కి యెక్కినాడు. or deedదాన పత్రము.
Conveyancer n s or attorney లాయరు, అనగా దానపత్రములు,వుయిల్కాకితములు మొదలైనవాటిని వ్రాసి కుదిర్చే లాయరు.
Conveyed adj తీసుకొనిపోయిన, మోసుకొనిపోయిన, పంపిన, తెల్చిన, తెలియచేసిన.
Convict n s నేరస్థుడు, అపరాధి, కయిది.
Conviction n s నేరము, స్థాపించబడము, తప్పు మోపడము. after his * వాడి మీదనేరము యేర్పడ్డ తరువాత. I am open to * నా మీద తప్పు చూపితే వొప్పుకొంటాను. areligious * మతావలంబనము, వివేకము కలగడము. this does not carry * withit యిందువల్ల ఆ సందేహము తీరదు. their * that this was true led them topay the money యీ మాట నిజమైనట్టు రూఢిగా నమ్మినారు గనుక ఆ రూకలనుచెల్లించినారు.
Convinced adj నమ్మిన, వొప్పిన. I am * of my error నేను చేసినది తప్పేననితుదకు వొప్పుకున్నాను. I am * you are wrong నీవు తప్పినావు సుమీ, నీవు తప్పినట్టునాకు నిశ్చయము. are you * of this నమ్మినావా, చూస్తివా యిది నీకు నిశ్చయమా,యిది అబద్ధము కాదు కదా ? being * of this I paid the money యిది నిశ్చయమనిఆ రూకలను చెల్లించినాను. I am * it was you that went నీవు యెంత పోలేదన్నాపోయినది నీవే నని నాకు నిశ్చయము. he that's * against his will is of thesame opinion still సమాధానముగా వొప్పుకొనవాడు, వొప్పుకోనివాడే.
Convincing adj నమ్మేటట్టు చేసే, వొప్పించే, నిశ్చయమైన. this is not a * proofthat he went there పోయినాడన్నందుకు యిది నమ్మతగిన రుజువు కాదు. this is a *proof of your folly నీ పిచ్చితనానికి యిది ప్రత్యక్షమైన సాక్ష్యము.
Convincingly adv వొప్పేటట్టుగా, నమ్మేటట్టుగా, నిశ్చయముగా. the lawyer spoke* ఆ లాయరు తాను చెప్పేది సరేనని తోచేటట్టుగా మాట్లాడినాడు. he spoke but not *వాడు మాట్లాడినాడు అయితే సరేనని వొప్పుకొనేటట్టుగా మాట్లాడలేదు.
Convivial adj సరసమైన, ఉల్లాసమైన. the Musulmans are very * పది మందిగాతాగడము తుళ్లడము తురకలకు సహజము. he is very * అతడు మహా వుల్లాస పురుషుడు. a * meeting విందు, యిందులో తాగడము ముఖ్యము.
Conviviality n s సరసము, ఉల్లాసము, ఉత్సాహము, వేడుక, తాగడము, తుళ్లడము,at the marriage there was no * ఆ పెండ్లిలో యేమిన్ని వేడుకలు లేవు.
Convocation n s సభ, గోష్టి. he called a * to decide the case ఆవ్యాజ్యమును తీర్చడానకు పాదుర్లనంతా సభకూర్చినాడు, సభ E+. H+. సమారోహ. B+.
Convoluted adj మెలిబడివుండే, పెనుసుకొనివుండే. * shell ఆవర్తములుగలశంఖము. the * horns of the antilope మెలికలు మెలికలుగా వుండే యిర్రి కొమ్మలు.
Convolution n s మెలి, ఆవర్తము.
Convolvlus n s వొక తరహా పుష్పము. See Ainslie 2.219.
Convoy n s తోడు, అంపుదోడు, కావలి, మార్గసహాయముగా వచ్చే బలము. he gaveus a * of ten men మాకు దారి తోడుగా పది మంది సిపాయలను యిచ్చినాడు.
Convoyed adj accompanied సంరక్షణలో వచ్చిన. ten ships * by one frigateవొక యుద్ధవాడ వెంట వచ్చిన పది వాడలు, వొక యుద్ధ వాడను అండ చేసుకొని వచ్చిన పదివాడలు, వొక యుద్ధవాడ యొక్క కాపు దారిలో కూడా వచ్చిన పదివాడలు. ten shipsarrived * by one frigate వొక యుద్ధ వాడను అసరా చేసుకొని వచ్చి చేరిన పదివాడలు.
Convulsed adj. విలవిలలాడే,గడగడవణికే, * with rage కోపముతో తన్నుకొనే. *with fear భయముతో గడగడవణికే.
Convulsion n s కంపము. a * of the earth భూకంపము. convulsions plu.జన్ని, యీడ్పు. she was in *s ఆమె విలవిలలాడుతూ వుండెను. they were in *sof laughter పక్కలు పిసుక్కొని నవ్విరి. *s of weeping వెక్కి వెక్కి యేడ్వడము.
Convulsive adj విలవిలలాడే, కొంకరలు పోయ్యే, వంకర టొంకరలుగా యీడ్చే.
Convulsively adv విలవిల, వంకరటొంకరలుగా యీడ్చుకంటూ, కొంకరలుగా.
Cony n s గుంట చెవులపిల్లి.
Cook n s వంటవాడు, పాచకుడు.
Cooked adj వండిన, వచనమైన. before the rice was * అన్నము పక్వముకాకమునుపే.
Cookery n s వంట చేయడము వంటపని, సూపశాస్త్రము. articles used in *బియ్యము పప్పు మొదలైన వంట సామగ్రి. utensils used in * వంటకు కావలసినవుపకరణములు, పాత్ర సామగ్రి.
Cooking n s వంట, పాకము. this is of her * యిది దాని వంట, యిది దాని చేతిపాకము.
Cook-maid n s వంటకత్తె.
Cook-room n. s. వంటయిల్లు'వంటశాల
Cool adj నిబ్బరమైన, చల్లని. * water చన్నీళ్లు. a * breeze చల్లగాలి, పయరగాలి.it is pleasant to walk in the cool of the evening సాయంకాలము చల్లటి పూటనడవడము హాయిగా వుంటున్నది. he gave a * refusal నిబ్బరముగా వొప్పుకొన్నాడు.he wrote a * letter విరసముగా వొక జాబు వ్రాసినాడు, కట్టె విరిచినట్టు వొక జాబువ్రాసినాడు. he gave them a * reception వచ్చిన వాండ్లను సరసముగా గైకొనలేదు.these brothers are * to each other యీ అన్నదమ్ములు ఒకరికొకరు సరిపడకవున్నారు.
Cooler n s a vessel నీళ్ళకు జిల్లుమని వుండే టట్టు చేయడానకై వుండే తొట్టి.
Cooling adj చల్లదైన, మేహశాంతియైన. * diet ఊష్ణోపశాంతియైన ఆహారము. *medicine చలవ మందు.
Coolly adj నిబ్బరముగా విచారముగా, నిశ్చింతగా. he * put the money in hispocket ఒక యిది లేకుండా ఆ రూకలను సంచిలో వేడుకొన్నాడు.
Coolness n s చల్లన, చల్లదనము, శీతలము, శాంతి, శమనము, విరసము,బెనుకుతనము. a * exists between them వాండ్లలో ఒకరికొకరికి వుండేగిట్టమివిరసము.
Cooly n s (Indian word for a hired labourer) కూలివాడు. the fee paidhim కూలి రూకలు.
Coom n s కరదూపము, పాదట్టు.
Coomb n s ధాన్యము పరిమాణ విశేషము, యిది మూడు మణుగులకు కొంచెముయెక్కువగా వుంటుంది.
Coop n s a cage for fowls or birds కోళ్లు మొదలైనవి మూసే గూడు.
Cooped adj గిడ్డంగిలో వేసి మూయబడ్డ.
Cooper n s పీపాయలు చేసేవాడు.
Cooperage n s సీపాయిపని, సీపాయలు చేసే చోటు, సీపాయలు చేసేవాండ్లకు యిచ్చేకూలి, సీపాయలు మీద తీసే పన్ను.
Co-operation n s ఒక పనికి కూడా సహాయపడడము, అనుకూలము. thisprevented my * యిందువల్ల నేను సహాయపడడానకు అభ్యంతరమైనది.
Co-operative adj ఒక పనికి సహాయపడే, అనుకూలమైన.
Co-ordinate adj సమానమైన, తుల్యమైన. these four are * యీ నాలుగింటికిమూలము ఒకటే. the two areas are * యీ రెండు శకములకున్ను ఒకప్పుడేఆరంభమయినవి. these two rivers are * యీ రెండు యేళ్లున్ను ఒక చోటి నుంచేపుట్టినవి, యీ రెండు నదులకున్ను వుత్పత్తి స్థానము ఒకటే.
Coordinately adv సమానముగా, సమముగా, ఆరంభించి.
Coot n s ఒక తరహా నీరు కోడి. the purple * or sultana * జంబుకోడి.
Cop n s శిఖరము, కొన.
Copaiva n s ఒక తరహా బంక, యిది ఒక మందు దినుసు.
Copal n s ఒక తరహా బంక. See Ainslie 2.482.
Coparceners n s share holders కర్తృత్వముగల వాండ్లు, భాగస్థులు, భాగరులు.
Coparcenery n s కర్తృత్వము, భాగరితనము, పాలి కాపుతనము.
Coparceny n s పాలు, భాగము.
Copartner n s పాలివాడు, అవిభక్తుడు, భాగస్థుడు.
Copartnership n s పాలివానితనము.
Cope n s a cloak పాదుర్లు వేసుకొనే ఒక తరహా భైవాసము. the * of heavenఖగోళము, ఆకాశము.
Copier n s లేఖరి, ప్రతివ్రాసేవాడు, పుత్రిక వ్రాసేవాడు.
Coping n s ( of a wall ) మదురు.
Copious adj విస్తారమైన, యధేష్టమైన, నిండా, శానా there is a * supply ofrice బియ్యము యధేష్టముగా వున్నది. that dictionary is very * ఆ నిఘంటులో లేనిశబ్దము లేదు.
Copiously adv విస్తారముగా, యధేష్టముగా.
Copiousnenss n s విస్తారము, యధేష్టము, మెండు.
Copper n s రాగి, తామ్రము. a * coin పైసా. I gave them, some coppersవాండ్లకు కొన్ని పైసాలు యిచ్చినాను. * plate ( a picture ) రాగి అచ్చున వేసినపటము. a boiler హండా, గంగాళము. sulphate of * మయిల తుత్తము, coppercoloured చామనిచాయయైన. * nose యెర్రని ముక్కు.
Copperas n s మయిలతుత్తము.
Coppersmith n s కంచరవాడు.
Coppery adj రాగి చిలుముగల. this water has a * taste యీ నీళ్లు చిలుముకంపు కొట్టుతుంది.
Coppice, or Copse n s. గుట్టగుట్ట పొదలు గల అడివి.
Copulation n s రతి, సంయోగము.
Copulative n s A * Conjunction సముచ్చయార్థక అవ్యయము. And, withమొదలైనవి.
Copy n s ప్రతి, పుత్రిక. I will set you a * ( in writing ) నీకు వరవడి పెట్టిస్తాను,మేలుబంతి పెట్టిస్తాను. a fair * చిత్తు చూచి చక్కగా వ్రాసిన ప్రతి. a rough * చిత్తు. he wrote a * of verses regarding this యిందున గురించి కొన్ని పద్యములురచించినాడు. I want ten copies of the Ramayanam రామాయణము పది ప్రతులుకావలెను. he gave me a * ఆ పుస్తకానికి నాకు ఒక ప్రతి యిచ్చినాడు. he gave me a* of the print అచ్చు వేసిన పటములలో నాకు ఒకటి యిచ్చినాడు.
Copy right n s గ్రంధస్వామ్యము, అనగా తాను అచ్చువేయించిన గ్రంధమును మరిఒకరు అచ్చు వేయకూడదనే స్వామ్యము.
Copy-book n s మేలుబంతి పుస్తకము.
Copy-hold n s ఇంగ్లీషు ధర్మశాస్త్రములో ఒక తరహా భూస్వామ్యము. I hold thisland in free hold and the other land in * యీ నేల నా సొంతము ఆ నేలనుస్వామి భోగానికి తీసుకొని యున్నాను. * land స్వామిభోగమిచ్చి అనుభవించేనేల,మాలగుజారి భూమి అనవచ్చును.
Coquet, Coquette n s. తుసుకులాడి, వగలాడి, చిన్నెలాడి.
Coquetry n s తసుకు, కులుకు.
Coquettish adj తసికే, కులికే, టక్కులు చేసే.
Coracle n s ( a small boat, so called in Cumberland ) చిన్న పడవ తెప్పపుట్టి, దోనె.
Coral adj పగడము వంటి, యెర్రని. her * lip దాని కెమ్మోని, దాని శోణాధరము.she of the * lip బింబోష్ఠి. * plant ( a certain flower which resembles theJack Spratt See Ainslie 2. p. 45.47 and Rox 3,687) నేపాళ వృక్షము.
Corban n s కానుక ప్రార్థన చేసుకొని యెత్తి కట్టిన ముడుపు. [ ఈశ్వరాయదత్తం. A+. ]
Corbel n s బోదె, బోదె కట్టె.
Cord n s తాడు, దారము, పగ్గము. a hempen * నులక. a straw rope వెంటి,కసువు, పురి. a * of fire wood కట్టెల మోపు. the Braminical * or threadజందెము.
Cordage n s తాళ్లు, పగ్గములు.
Cordelier n s ఒక తరహా సన్యాసి, ఒక తరహా బైరాగి.
Cordial n s a medicine మయకమిచ్చే మందు. this letter was a * to hisheart యీ జాబు వల్ల వానికి ధైర్యము వచ్చినది, వానికి ప్రాణము వచ్చినది. he sellscordials బ్రాంది మొదలైన వాటిని అమ్ముతాడు.
Cordiality n s స్నేహము, సద్భావము. want of * వేరు బంధము, విరసము.
Cordially adv మనఃపూర్వకముగా. I * hope so నేనట్లా నిండా నమ్మినాను.
Cordon n s a line of troops ఘాటు, పారా, ఠాణా.
Corduroy n s గుగిగీలు, కుట్టే ఒక తరహా రెట్టు.
Cordwainer n s ( a shoe-maker) మాదిగవాడు, చెప్పులు కుట్టేవాడు, యిదిప్రాచీన శబ్దము.
Core n s హృదయము, మధ్య భాగము. the * of the heart అంతరంగము, లోనిమనసు. the * of a fruit విత్తు. the * of the wood of a tree చేప. the * ofa boil మొలక. the * of a plantain tree అరిటి బొందె.
Corge n s ( Indian word for 20 pieces of cloth ) ఖోర్జా.
Coriander n s కొతిమిర, కొతిమెర, కుస్తుంబురు. * seeds ధణియాలు.
Coriath n s ఒక దేశము పేరు. a corinthina ఆ దేశస్థుడు. the Corinthina orderఒక తరహాగా శృంగారించిన స్తంభములు.
Cork n s బుడ్డికి వేసే బెండు బిరడా. the * tree ఒక తరహా పెద్ద మాను, దీని పట్టతోబిరడాలు చేస్తారు.
Corked adj బిరడా వేసిన. a * bottle బిరడా వేసిన బుడ్డి. this wine is * యీసారాయికి బెండు బిరడా కంపు తగిలింది.
Corking-pin n s దబ్బనము, శలాక, మేకు.
Cork-screw n s ధిమ్మెట్లు, బుడ్డి బిరడాను తీసే ఒక తరహా ఆయుధము.
Corky adj బెండువలె వుండే, బెండుకంపు కొట్టే. a * substance బెండువలెమెత్తగా వుండేటిది.
Cormorant n s సముద్రమందు తిరిగే డేగ వంటి వక పెద్ద పక్షి, పెద్ద గూడ కొంగవంటిది, చెడ్డ తిండిబోతు, సర్వస్వాపారము దోచుకొనేవాడు, కావ్యమందు గండభేరుండపక్షికిసమానమైనది.
Corn n s grain ధాన్యము. crop of * పయిరు, సస్యము. a grain of * గింజ. ahead or ear of * కంకి. wild * నివ్వరి, నీవారము. seed * విత్తనాలు. empty earsof * తాలు, తప్పగింజలు. a * field చేను, మెట్ట పొలము. a sheaf of * పన, వోదె.Indian * మొక్క జొన్నలు. a sore on the foot &c కోవిపుండు, ఆణి. A * cutterకోవిపుండుకోసే వైద్యుడు. The * law ధాన్యమును గురించి యేర్పరచిన చట్టము. a *mill గోధుమ పిండి విసిరే తిరగలి, గోధుములను పిండి చేసే యంత్రము.
Cornea n s కనుగుడ్డులో రెండు బాగములున్నవి, ఒకటి కఠినమైనది, ఒకటి మెత్తనైనది,యిది కఠినమైన భాగమునకు పేరు.
Cornel n s ఒక తరహా ఫలవృక్షము.
Cornelian n s అకీకిరాయి, యమునా రాయి, శికావుంగరాలకున్ను ముద్రలకున్ను వేసేసామాన్యమైన ఒక రాయి.
Corner n s మూల, కోణము, దిక్కు. It was lying in a * అది ఒక మూల పడివుండెను. of the eye కడికన్ను, కొలికి, అపాంగము. of the mouth శెలివి. he turnedthe * వాడు ఆ మూల తిరిగినాడు. three cornered త్రికోణమైన. but the betterword is ముక్కోణమైని, మోచేతి వంపుగా వుండే. corner stone మూల రాయి, కూడలిరాయి, నిట్రాయి. he was the * stone of their faith వారి మతానకు ఆయనేనిర్వాహకుడు. they tied their handkerchiefs together cornerwise మూలతోమూలను ముడివేసినారు.
Cornet n s సన్నాయి, కొమ్ము, తురుపు సవ్లాలో. Lieutenantku సమానమైన ఒకవుద్యోగస్థుడు.
Cornice n s బోదె, చూరు, దూలపీఠము.
Cornucopia n s ధనప్రదకమండలము, శ్రీరామమాడ, కల్పవృక్షము అనే శబ్దమునకుసమానమైనది.
Cornuto n s ఒక స్త్రీ చెడిపోయివుంటే దాని మొగునికి కొమ్ములు మొలిచినట్టు అంటారుఅనగా పశుప్రాయుడైనాడని భావము.
Corny adj సస్యభరితమైన, సస్యసంపన్నమైన.
Corollary n s a consequence అనువృత్తి అన్వయము సిద్ధాంతము, ఫలితార్థము,భావము, స్వారస్యము
Coromandel The name given by Europeans to the eastern coast of the Indian Peninsula, It is a corruption of Carimanal కరిమణల్ a smallfishing village about 20 miles north of Madras, which is now vulgarlycalled Coromandel by the English. The supposed Sanscrit rootకురుమండలము Kuru-mandalam is plausible, but is wholly unknown tolearned bramins The coast of Coromandel చన్నపట్నపురాజ్యము, అనగావిశాఖపట్నము నుంచి రామేశ్వరము దాకా వుండే రేవు. Hamilton says it iscorruption of Choladesam but this is not correct.
Coronal n s కిరీటము.
Coronation n s పట్టాభిషేకము.
Coroner n s దుర్మరణము విచారించే అధికారి.
Coronet n s ఒక తరహా చిన్ని కిరీటము, దీన్ని శశిపువ్వు అంటారు.
Corporal adj శరీరసంబంధమైన. pains and Pieasures which are mentalare greater than those which are * శారీరక సుఖదుఃఖముల కన్నా మానసికసుఖఁదుఃఖములు బలిష్ఠముగా వుంటవి, అనగా దేహ సుఃదుఖఃములకన్నా మనసు యొక్కసుఖదుఃఖములు అధికము. * punishment దెబ్బలు.
Corporate ajd కూడిన, గుంపుగా కూడిన, సభ చేరిన సమయము గాకూడిన. a body *గ్రామస్థులు, వూరి పెద్దలు, గ్రామసభికులు, అధికారస్థులు, నాటువాండ్లు.
Corporation n s సభ, గ్రామసభ, అనగా సీమలో ప్రతి పట్ణములో వుండే వర్తకులురాజాజ్ఞ మీద సభ కూడి ఆ వూళ్లో కొన్ని రుసుములు వసూలు చేసి దానిగుండా వీధులుచక్కబెట్టించడము వంతెనలు కట్టించడము మొదలైనవి చేసే సభవారు, శిక్ష జరిగించేటందుకువాండ్లకు మేజస్ట్రీటు అధికారము లేదు. for this the Arabic phrase mist is theappropriate word In the legal sense అధికారము.
Corporeal adj మూర్తిమత్తైన, మూర్తీకరించిన, సాకారమైన, శారీరకమైన, భౌతికమైన,ప్రపంచమైన, దేహీభూతమైన. the * form స్థూలశరీరము. he appeared in * formదేహమెత్తినాడు, అవతరించినాడు.
Corporeally adv మూర్తిమత్తుగా, దేహిగా, శరీరిగా.
Corps n s pronounced core పటాళము, ముఖ్యముగా విచారించవలసిన దేమంటేపూర్వము శవమునకు. corps అనే మాట కలిగివుండెను, యిప్పట్లో చెల్లదు.
Corpse n s శవము, పీనుగ, ప్రేతము.
Corpulence, Corpulency n s. బలుపు, కాయపుష్ఠి స్థౌల్యము. from his * heseemed heavy వాడు స్థూలముగా వుండినందున బరువుగా వుండునని తోచినది.
Corpulent adj స్థూలమైన, బలిసిన, పెద్ద పొట్ట గల, లావాటి. a * man స్థూలదేహి.
Corpuscle n s అణువు, కణము పరమాణువు. a * of water జలకణము.
Corpuscular adj అణుమాత్రమైన, అతిసూక్ష్మమైన. Corracle, n.s. SeeCoracle.
Correct adj శుద్ధమైన, సుబద్ధమైన, తప్పులేని, చక్కని. he is a very * man వాడుజాగరీకుడు, పదిలముగా నడిచేవాడు. it is * అది సరిగా వున్నది. you are * నీవుచెప్పినది సరే, నీవు చెప్పినది నిజమే. a * pronounciation మంచి వుచ్చారణ. a *copy శుద్ధప్రతి.
Correction n s Punishment శిక్ష. amendment దిద్దుబాటు. the house of *జెయిల్కానా, చావడి.
Correctional adj శిక్షించే. the bench are the * police : constables arethe preventive Police దొరలు దండించే అధికారులు, బంట్రోతులు దుర్మార్గముజరగనీయకుండా నిలిపేవాండ్లు.
Corrective adj దిద్దే శక్తిగల సవరించే శక్రి గల, విరుగుడైన.
Correctly adv పరిశుద్ధముగా, తప్పు లేకుండా, దిద్దుసాటుగా, సరిగా.
Correctness n s శుద్ధముగా వుండడము, సౌష్టవము, తప్పలేకుండా వుండడము. the* of this statement దీని యొక్క వాస్తవ్యము, నిజము. I doubt the * of thisయిది నాకు అనుమానముగా వున్నది. * of conduct చక్కన, పరిష్కారము, నిదాణము.the * of his conduct prevented this అతను చక్కగా నడిచినందున యిది తప్పింది.
Corrector n s దిద్దేవాడు.
Correlative adj పరస్పర సంబంధము గల, అన్యోన్య సంబంధము గల.
Correlevancy n s పరస్పర సంబంధము.
Correlevant adj పరస్పరసంబంధము గల.
Correspondence n s or relation సంబంధము. I see no * between hiscommand and your conduct వాడి ఆజ్ఞకు నీ నడతకు సంబంధము లేదు, వాడుచెప్పినది యెక్కడ నీ నడత యెక్కడ. in war, all * with the enemy is forbiddenయుద్ధములో శత్రువులతో వొక వ్యాపారమున్ను కూడదని నిషేధింప బడ్డది, శత్రువులతో పొత్తుకారాదు. or similarity యీడు, జత, జోడు, దీటు, తాళా. or intercourseసహవాసము. he has much * వాడికి నాలుగుతట్లా వుత్తర ప్రత్యుత్తరములు. theypublished his * వాడి జాబులను అచ్చే వేసినారు.
Correspondent n s జాబులు వ్రాసేవాడు, మునీబు, అడితీదారుడు. is he a * ofyours ? వాడికి నీకు వుత్తర ప్రత్యుత్తరములు జరుగుతున్నవా, వాడు నీ అడితీదారుడా.
Corresponding adj యీడైన, జతగా వుండే, తుల్యమైన, సరియైన, ప్రతియైన. the *parties ఉత్తర ప్రత్యుత్తరములు వ్రాసేవాండ్లు. they gave him the title of cpatianwith * pay వాడికి కేప్టన్ అనే పేరు యిచ్చి దానికి తగిన జీతమున్ను యిచ్చినారు. a *term సరియైన శబ్దము, ప్రతిశబ్దము. In the year 1845 * with Vishwavasu1845 * సంవత్సరమునకు సరియైన విశ్వావసునామ సంవత్సరములో.
Corridor n s వొక తరహా తాళ్వారము, వొక మాదిరి వారపాక.
Corrobarant adj బలవర్ధకమైన, తేజస్కరమైన.
Corroborated adj స్థిరపడ్డ, నిశ్చయపడ్డ, రూఢమైన. this was * by his ownwords వాడి నోటి మాటల వల్లనే యిది రూఢిపడ్డది.
Corroboration n s ప్రమాణము, దాహరణము, సాక్ష్యము, ప్రోద్బలము. this is a *of his statement వాడు చెప్పినదానికి యిది ప్రమాణము. in * of his testimonyవాడి సాక్షిక వుపబలముగా.
Corroded adj తినివేసిన, హరించిన, క్షయించిన, అరిగిపోయిన, తేగడైన, కుళ్లిన,మురిగిపోయిన.
Corroder n s తినివేశేటిది, హరణకారణము.
Corrosion n s తినడము, క్షయించడము, అరగడము, కరగడము. to prevent the *of rust తుప్పు యినుమును తిని వేయకుండా, తుప్పు పట్టకుండా.
Corrosive n s తినివేసే మందు, కరగకొట్టే మందు. costic is a * కారము కండనుకోసే మందు.
Corrugated adj or wrinkled ముడతలు పడ్డ.
Corrupt adj చెడిపోయిన, చీకిపోయిన, కుళ్లిన, మురిగిన, పుప్పిపట్టిన, లంచముతీసుకొన్న. or vicious దుర్మార్గమైన, దుష్ట. * practices దుర్వాడికలు. a * judgeలంచగొట్టైన న్యాయాధిపతి. a * word అభాసమైన శబ్దము. a * phrase యాచమాట,గ్రామ్యము. * human nature పతితులు, అనగా మనుష్యులు.
Corrupted adj చెడిపోయిన, కుళ్లిన, మురిగిన, అభాసమైన. Sanscrit words * inTelugu are called తద్భవములు. * Telugu words అభాసాంధ్రపదములు. a * text అభాసముగా వుండే శ్లోకము.
Corrupter n s చెరిపేవాడు. a * of man మనుష్యులకు దుర్భోధన చేసేవాడు.
Corruptible adj చెడిపొయ్యే, కుళ్లిపొయ్యే నశించే, నశ్వరమైన A+.
Corruption n s చెడిపోవడము కుళ్లిపోవడము, పుచ్చడము, నశ్వరత్వము. A+ fromthe * of men మనుష్యులు దుష్టులు గనుక. this is a * of the sense యిదిఅపార్థము; or wickedness దుర్మార్గము. a law against injudge న్యాయాధిపతులులంచము యియ్యకుండా యేర్పడ్డ చట్టము. that word is a mere * అది వట్టిఆభాసమైన పదము, పిచ్చిపదము.
Corruptly adv దుర్మార్గముగా, ఆభాసముగా.
Corruptness n s దుర్మార్గము, దుస్స్వభావము, దుర్నీతి.
Corsair n s దొంగవాడ, దొంగవాడ వాడు.
Corse n s ( Poetical spelling for corpse. ) plural corses పీనుగలు.
Corselet n s రొమ్ము కవచము.
Corset n s రవిక.
Cortege n s పరివారము, పరిజనము.
Cortes n s Spanish దేశములో యీ మాట Court అనే అర్థము.
Cortex n s or bark పట్ట చెట్టు యొక్క పట్ట.
Corundum n s sapphire, or adamantine spar కొరివిందము, కురింజిరాయి.
Coruscation n s మిణుగుర్లు అగ్నికణములు, మెరుపు.
Coryphoeus n s the principal actor in a dance నాటకములో ప్రధాననాయకుడు, ముఖ్యమైన వేషగాడు, నటవుంగవుడు. he is the * of Sanscritlearning అతడు సంస్కృతములో అసమానపండితుడు, అసమాన పురుషుడు.
Cosmetic n s వొంటి మీద పూసుకొనే పరిమళ ద్రవ్యము, అంగరాగము, అత్తరు,పన్నీరు, చందనము, అరిదళము మొదలైనవి.
Cosmical adj relating to the world; rising or setting with the sunభూమండల సంబంధమైన, సూర్య సహిత వుదయాస్త ప్రాప్తతారాది ( Droz )
Cosmogony n s జగత్సృష్టి, భువనోత్పత్తి.
Cosmography n s జగత్సృష్టి వివరణము, బ్రహ్మాండ వర్ణనము, విశ్వర్ణ విద్య భూగోళశాస్త్రము.
Cosmopolite n s స్వదేశాభిమానము లేనివాడు, భూమిలో యెక్కడ వుండినా నాకువొకటే ననేవాడు.
Cossack n s పండారీ వాండ్లవలె రషియా దేశమందు వుండే వొక కులము. cossacktrowsers పెద్ద యిజారు.
Cosset n s పోతపాలు పోసి పెంచిన గొర్రె పిల్ల.Cost, n. s. నెల క్రయము తగులుబడి, పట్టుబడి, దండుగ. the * price క్రయము రూకలు,కొనుగోల, పట్టుబడి. costs in a suit వ్యాజ్యపు ఖర్చులు, కోర్టు శలవులు. you willfind it true to your * నీకు అనుభవములో తెలియబోతుంది యిందుకు నీవుయేడ్వపోతావు. you will find to your * that what I said is true నేను చెప్పినదినీకు అనుభవానికి వచ్చేటప్పుడు యేడవబోతావు సుమీ.
Costard n s తలకాయ, యిది ప్రాచీన శబ్దము.
Costermonger n s వూరూరు చిల్లర సరుకులు పండ్లు మొదలైనవి అమ్ముకొనిబ్రతికేవాడు.
Costiliness n s వెలపొడుగు, ప్రియము బహుమూల్యత. from the * of herdress దాని వుడుపు నిండా వెలపొడుగైనందున.
Costive adj మలబద్ధముగా వుండే, బద్ధగోష్టిగా వుండే.
Costiveness n s మలబద్ధము, బద్ధగోష్టి.
Costly adj వెలపొడుగుఅయిన. a * horse వెలపొడుగు గుర్రము.
Costume n s వేషము.
Cot n s or Cottage, గుడిశె. ( Indian or military words for ) a bedమంచము, పరుపు. a swinging * వుయ్యాల మంచము.
Cote n s ( or sheep * రాత్రిళ్లు మేకలను తోలిపెట్టే అలవ. a dove *పావురాళ్లగూడు, పావురాళ్లు పెంచడానకై కట్టిన గూడు.
Cotemporaneous adj ఏక కాలమందు వుండే, సమకాలీనమైన. these nine poetswere * యీ తొమ్మిదిమంది కవులున్న సమకాలీనులు.
Cotemporary adj and n. s. సమకాలీనులైన, ఏక కాలమందు వుండిన. he and myfather were contemporaries మా తండ్రి దినాలు అతని దినాలు వకటి. * historyయే పని యెప్పుడు జరిగినదో తత్కాలమందే వ్రాసిన గ్రంధము పని జరుగుతూ వున్నప్పుడేవ్రాసిన గ్రంధము.
Coterie, or society స్నేహితులవిందకూటము,వీండ్లువారాన
Cotillon n s యెనిమిది మందిగా ఆడే వొక తరహా ఆట దృతనర్తనము.
Cotquean n s ఉత్తర కుమార ప్రజ్ఞలు పలికేవాడు, అడంగిరేకు.
Cottage n s గుడిశె, కుటీరము.
Cottager n s or Cotter గుడిశె వేసుకొని వుండేవాడు, పేదవాడు.
Cotton n s ( clear from the seed ) దూది. not cleared పత్తి * threadనూలు. a * rope నూలు పగ్గము, నూలు తాడు. he wore as * jacket but a linenturband వాడు గుడ్డ చొక్కాయ వేసుకొన్నాడు అయితే నార పాగా వేసుకొన్నాడు. a * ragగుడ్డ తునక పేలిక. * goods నూలు సరుకులు. * cleaners, ( the caste so called) దూదేకుల వాండ్లు. * ground రేగడ భూమి, రేగటి మన్ను. the * plant ప్రత్తిచెట్టి the * tree ( the large tree so called ) బూరగచెట్టు, శాల్మలి. a bed stuffed withits down హంసతూలికాతల్పము.
Cottony adj దూదివంటి.
Couch n s మంచము, పడక పరుపు శయ్య, పానుపు. he made his * on the rockబండమీద పండుకొన్నాడు.
Couch grass n s ఒక విధమైనగడ్డి. See LSJ. XXXVI. 481. line 5.
Couchant adj శయనించిన, పండుకొన్న.
Cougar n s ( a leopard ) వొక తరహా పులి.
Cough n s దగ్గు, కాసము.
Could aux v. can గలను అనే మాటకు భూతకాలము. I gave him as much as I* నా చేత అయ్యేమట్టుకు యిచ్చినాను. reviling them as much as he * తనచేతనైనంత మట్టుకు వాండ్లను దూషించి. if I * నాచేత అయ్యేదిగా వుంటే.
Coulter n s నాగేటికర్రు.
Council n s సంఘము, కూటము, ఆలోచన సభ. he called a * వొక సభ కూర్చినాడు.they held a * of war కష్టకాలము వచ్చినది యిఖ మనము యేమి చేయవలెననిఆలోచించుకొన్నారు. he held a * with his relations బంధువులను కూర్చిఆలోచించినాడు. a member of * ఆలోచన సభలో వొకడు.
Counciller n s ఆలోచన సభ వారిలో వొకడు. a privy * రాజు యొక్క అంతరంగుడు.
Counntermine n s ప్రతి సొరంగము, అనగా కోట గోడ కిందికి శత్రువులు తవ్వేసొరంగమునకు అడ్డముగా కోటలో వుండే వాండ్లు తవ్వే సరంగము. or contrivanceయుక్తికి యుక్తి, ప్రతియుక్తి.
Counsel n s బుద్ధి, ఆలోచన, యోచన, బోధన. bad * దుర్బోధన. they kept *వాండ్లు మర్మమును బయట చెప్పలేదు. he could not keep * వాడు రహస్యాన్ని బయటచెప్పక వుండలేడు. his * ( lawyer ) అతని పక్షముగా వుండే లాయరు గాని,లాయర్లుగాని.
Counsellor n s మంత్రి, వకీలు, లాయరు, బుద్ధి చెప్పేవాడు. Privy * ఆప్తుడు,అంతరంగడు.
Count n s పెద్ద, వూరి పెద్ద, జమీందారుడు.
Countarily, Contrariwise adv విరుద్ధముగా, అసంగతముగా, అడ్డముగా.
Countellation n s నక్షత్రము, అనగా అశ్వన్వాది నక్షత్రములకు చెల్లే మాట, అయితే ఒంటి చుక్కగా వుండే నక్షత్రానికి యీ మాట చెల్లదు. the constellations అశ్వన్వాది యిరువై యేడు నక్షత్రములు. this poem is a * of beauties యీ కావ్యము శృంగారమంజరీ. Sita is described as a * of virtues సీత సద్గుణములనిధి.
Countenance n s ముఖభావము, ముఖ దాతువు, ముఖవైఖరి, ముఖజాడ. throughthe light of his * ఆయన మూర్తివంతమువల్ల. he withdrew his * from themపరాఙ్ముఖమైనాడు, దయ తప్పినది. he gave them his * వాడు వాండ్లకుముఖమిచ్చినాడు, అనగా వాండ్ల పక్షమయినాడు. he did not give them his * వాడువాండ్లకు ముఖమివ్వలేదు, అనగా వాండ్లతో ప్రతిఘటించి వున్నాడు. his * fellఆగ్రహపడ్డాడు, అలిగినాడు. they came to keep me in * నేను సిగ్గు పడకుండా నాకుసహాయముగా వచ్చినారు. he is out of * వాడి ముఖము చిన్న పోయినది. with afallen * సిగ్గుపడి చిన్నబోయి. his * changed వాడికి మారుముఖము పడ్డది.
Countenanced adj ఆదరించిన, అభీమానించిన, వొప్పుకొన్న, అంగీకరించిన. thework was * by Government దీన్ని గవనరుమెంటువారు ఆదరించినారు. * byscripture వేదసమ్మతమైన.
Counter adv అడ్డముగా, ప్రతికూలముగా, విరోధముగా. they ran * to himఅడ్డగించినారు. a * document యెదురు వొడంబడికె, కదపా. a * petition అడ్డముగాయిచ్చిన అర్జి, విరుద్ధముగా యిచ్చిన అర్జి. a * suit యెదురు వ్యాజ్యము. a * commandమునుపటి వుత్తరవుకు విరుద్ధమైన వుత్తరవు.
Counteraction n s విఘాతము, ప్రతిఘటనము, ప్రతికూలము, పరిహారము.
Counterbalance n s సరియెత్తు, సరిభారము, తుల్యము యీడు. as a * అందుకుయీడుగా.
Countercharm n s ప్రతి మంత్రము.
Countercurrent n s యెదురుపారే నీళ్లు.
Counterevidence n s యెదురు సాక్షి.
Counterfeit n s కల్పన, విశ్వామిత్రము, మోసగాడు, వంచకుడు.
Countermarch n s తిప్పుకొని పోవడము, మళ్లుకొని పోవడము.
Countermark n s యెదురుగురుకు, ప్రతిగురుతు, రెండో గురుతు.
Counterpane n s పలంగుపోషు, అనగా, పగటిపూట మంచమునకు దుమ్ముతగులకుండా వేసిన చీటి గుడ్డ.
Counterpart n s ప్రతి, బదులు. a * agreement కవులుకమ్మ, ప్రతి వొడంబడిక. hisbehaviour is just a * of yours నీ నడతకు ప్రతి వాడినడత. the Iliad is a * tothe Mahabharat మాలో యిలియాడు అనే కావ్యము యెంతో వారిలో మహాభారతమంతే.
Counterplot n s ప్రతికుట్ర, అడ్డమైన యుక్తి.
Counterpoint n s సంగీత శాస్త్రములో వొక పరిచ్ఛేదము యొక్క పేరు.
Counterpoise n s సరి తూగడానకై పెట్టే బళువు.
Counterpoison n s విరుగుడు, ప్రతి విషము, విషానికి విషము, విషాన్ని విరిచేమందు.
Counterscarp n s కోట గోడకింది కందకమును అంటినట్టు యేటవాలుగా మిట్టగా వుండేపశిరికబయలు.
Countersign n s పారా మార్చుకోవచ్చేవాడు చెప్పే ప్రతిసాంకేతికపు మాట, రెండోఅధికారి చేవ్రాళు. the * is the answer to the watch word పారాలో వుండేవాడుచెప్పే సాంకేతికపు మాటకు పారా మార్చుకోవచ్చిన వాడు వుత్తరముగా చెప్పే ప్రతిసాంకేతికపు మాట.
Countersignature n s పయిచే వ్రాలు, రెండోచేవ్రాలు, తానున్ను వొప్పుకొన్నట్టు చేసే రెండో అధికారి చేవ్రాలు.
Countertenor n s సంగీత శాస్త్రములో వొక పరిచ్ఛేదము యొక్క పేరు.
Countess n s దొరసాని, రాణి, బీబి.
Counting n s యెన్నిక, సంఖ్య.
Counting-house n. s. కొఠి, వర్తకుడైనాసాహుకారైనావ్యాపారముచేసుకొనేకొట్టు,అనగావర్తకుడిఆఫీసు, he was educated for the * వాడు వర్తకములో పనుబడి వున్నాడు.
Countless adj లెక్కలేని, అమితమైన, అనేకమైన.
Countrified adj ( rustic, boorish-blunt ) మోటుగా వుండే. * manners నాటుపురపువాండ్ల మర్యాదలు.
Country n s రాజ్యము, జిల్లా, సుబా. Count అనగా సుబేదారుడి యొక్క యిలాకాలోవుండే వక దేశము. a * town కస్బా, గ్రామము.
Country born n s or Eurasian East Indian సంకర జాతివాడు, చటకారివాడు,పరంగివాడు.
Country-dialect n s దేశియ్యము, గ్రామ్యము, శూద్రమాటలు.
Country-goods n s నాటు సరుకులు.
Country-greens n s తోటకూర మొదలైనవి.
Country-horse n s తట్టు, నాటుతట్టు.
Country-made adj నాటు, నాటుపురములో చేసిన.
Country-man n. s. నాటుపురపువాడు, పల్లెటూరిమనిషి,కాపు, he is a * of mineవానిది మాది వక దేశము. my country men మా దేశస్థులు.
Coup d'etat n s a trick, a divice యుక్తి, చెమత్కారము,తంత్రము.
Coup-d'ceil n s a glance ఆలోకనము దర్శనము.
Coup-de-grace n s చచ్చే దెబ్బ, చావుపోటు.
Coup-de-main n s ప్రబలమైన దెబ్బ, వొకరికి తోచని దివ్యమైన యుక్తి, యెత్తు, అనగావొక దెబ్బలో తన యత్నము సఫలమయ్యేటట్టు చేసిన వొకరికీ తోచని దివ్యమైన యుక్తి. hetook the queen by a * వొకరికిన్ని తోచని ఒక యెత్తులో లటక్కున మంత్రిని కొట్టి ఆటజయించినాడు.
Coup-de-soleil n s యెండగొట్టు. he died or * యెండ గొట్టుపడి చచ్చినాడు.
Couple n s జత, జంట, జోడు, రెండు, యిద్దరు. a married * దంపతులు, ఆలుమొగుడు. in dancing జంటగా ఆడే యిద్దరు. for dogs లంకె కుక్కలను పెనవేసేగొలుసు.
Couplet n s శ్లోకము పద్యము.
Courage n s ధైర్యము. a man of * ధీరుడు, ధైర్యశాలి. he lost * వాడికి ధైర్యముతప్పినది. at last he had the * to taste it సాహసము చేశి దాన్ని చవి చూచినాడు.
Courageous adj ధైర్యముగల, ధైర్యమైన.
Courageously adv ధైర్యముగా, తెగించి.
Courch-history n s KriswumawasWulanu guriMci AyA yugamulaMxu jariginavqwwAMwamu.
Courier n s హర్కారా, సమాచారము తెచ్చే బంటు, ముఖ్యముగా యీ పేరుకొన్నిన్యూసు పేపర్లకు వచ్చినది.
Course n s గమనము, పోవడము, ప్రయాణము, ఆచారము, క్రమము, విధి. in the *of conversation మాట ధోరణిలో. in the * of time కాలాంతరమందు, పిమ్మట,తరువాత. in the * of the year ఆ సంవత్సరములోగా. in the * of two monthsరెండు నెలలలోగా. in the * of the week ఆ వారములోగా. a * of bricks in awall ఒక యిటికవరుస. I nenver saw him in the * of my life వాణ్ని నాజన్మములో చూడలేదు. evil courses దుర్మార్గములు పలుబోకలు. the house is in *of repair ఆ యిల్లు పోయిన చోటు వచ్చిన చోటు చక్కబెట్టుతారు. this is out of theordinary * of events యిది వొక విపరీతము, యిది వొక విచిత్రము, యిది వొకచోద్యము, యిది వొక వింత. of * కాకయేమి. of * you must go నీవు వెళ్లకపోతేయెట్లా, నీవు అవశ్యముగా పోవలసినది. of course ! aha ! సరే, మంచిది. a matterof * సహజమె. these are merely words of * యివి సహజముగా చెప్పే మాటలు,యివి వూరికే మర్యాదకు చెప్పే మాటలు, అనగా ఆ మాటలలో ఒక విశేషము లేదు. aswater * కాలువ. the dinner was served in three courses మూడు మాట్లుమూడు విధాలుగా వడ్డించినారు యిది ఇంగ్లీషు వారిలో నిత్యమైన మర్యాద, యే మనిషికియేది యిష్టమో దాన్ని భోజనము చేస్తాడు. a race * గుర్రములను పందెమునకు విడిచేబయలు. courses క్రమములు. a ship's * వాడ చాపలోని కిందివి, అనగా పెద్ద చాపలు.a woman's * రుతుకాలము. a woman in her courses రుతువైన స్త్రీ, కడగా వుండేస్త్రీ. In Ephes. 2.2 Alwr సంసారము. A+ B+.
Courser n s అశ్వరత్నము, యిది కావ్యములో వచ్చే మాట.
Coursing n s వేట, కుక్కలను విడిచి ఆడే వేట.
Court n s సభ, కొలువుకూటము, ఆస్థాన మంటపము. * or * yard in a houseముంగిలి, ముంగిటిబయలు. he drove his carriage into the * of the palaceబండిని నగరు యొక్క ముంగిటి లోకి తోలినాడు. a * justice న్యాయ సభ న్యాయస్థానము.the * రాజపరివారము. he made * to them వాండ్లకు మహాలాలించినాడు. he madegreat * to the general సేనాధిపతిని నిండా వుపసర్పిస్తూ వుండినాడు. he was thattime paying * to my daughter అప్పట్లో నా కూతురిని పెండ్లి చేసుకోవలెనని దాన్నిఅనుసరిస్తూ వుండినాడు. a * poet ఆస్థానకవి. * leet పంచాయతి వాడు. * hand ఒకతరహా పాతమోడి అక్షరములు. Act of Parliament మొదలయిన శాసనములున్నులాయరులు కొన్ని దస్తవేజులనున్ను యీ మోడిని వ్రాయిస్తారు. this ship conveyed the portugueze * to Lisbon ఆ రాజు సపరివారముగా యీ వాడలోకి పోయినాడు.
Courteous adj సరసమైన, మర్యాదగల లలితమైన, నాగరీకమైన. a * man సరసుడు,మర్యాదపరుడు, మంచివాడు, సద్భావము గలవాడు A+. B+. not * మోటు, అమర్యాదైన.
Courteously adv మర్యాదగా, సరసముగా, లలితముగా.
Courteousness n s మర్యాద, సరసత, లాలిత్యము, మంచితనము, ( సౌజన్యము A+in Acts 273. )
Courtesan, Courtezan n s. బోగముది, వేశ్య.
Courtesy n s మంచితనము, సరసత, మర్యాద, ఉపచారము. he is heir by *అభిమానపుత్రుడు. by * Madras is the realm of the Nabob మర్యాదకు యీదేశానికి నబాబు ప్రభువు, పేరుకు ప్రభువు. the Bishop is by * called "my lord"బిషప్పుకు న్యాయముగా మైలార్డు అనే కితాబు లేదు గాని మర్యాదకు అట్లా పిలుస్తారు.
Courthouse n s న్యాయస్థలము, న్యాయసభ.
Courtier n s రాజసభలో ప్రవర్తించేవాడు, సరసుడు, నాగరీకుడు.
Courtliness n s నాగరీకము, సరసత.
Courtly adj సరసమైన, నాగరీకమైన.
Courtsey n s ( Pronounciation kurchy) a salutation by women ఇంగ్లీషుస్త్రీలు చేసే వందనము. See Curtesy.
Courtship n s ఉపసర్పణ, వివాహమును గురించి ఉపసర్పించడము.
Cousin n s జ్ఞాతి, బంధువుడు, బంధువురాలు. ( uncles, aunts తల్లిదండ్రులతోడబుట్టిన వాండ్లు అనబడుతారు, వీండ్ల కొడుకులు కూతుండ్లు Cousins అనిఅనబడుతారు. country cousins దూరబంధువులు. a cousin-german జ్ఞాతి.
Coutumelious adj పరుషమైన, నిష్ఠురమైన. * language తిట్లు, దూషణ. *treatment అవమానము.
Cove n s దాగే స్థలము, మరుగు, చాటు సముద్రపు గొంది.
Covenant n s ఒడంబడిక. F+. G+. నియమము. A+. D+. నిర్ణయము.
Covenanted adj ఒడంబడిక చేసుకొన్న ఒడంబడిక యిచ్చిన, నిర్నీతమైన. * servantsనిర్నీకులు, ఒడంబడిక వ్రాసి యిచ్చి వుద్యోగములో వుండేవాండ్లు.
Covenanter n s ఒడంబడిక పుచ్చుకొనేవాడు.
Coventry n s the name of a town ఒక పట్ణము యొక్క పేరు. they sent himto * వాణ్ని వెలి వేసినారు, వాడు ముఖమును యెవరున్ను చూడరు.
Cover n s మూత, ముసుకు, కప్పు, గవిసెన వాసెన, చాటు, దాగే స్థలము చిన్న అడివి.of a jar దిబ్బడము, మూత. of a letter లిఫాఫా, చంద్రిక. his letter gave * toone from my sister నా చెల్లెలు వ్రాసిన జాబు అతని జాబులో మల్ఫాపు చేసి వుండినది.for a guest సామాను, అనగా యింగ్లిషు వారిలో భోజనము వడ్డించే ముందు మేజామీదచిప్పలు, ముళ్లు, కత్తులు మొదలైన వాటిని సిద్ధముగా వుంచి కప్పి వుంచే వుపకరణములు.there was a table laid with 20 covers యిరువై మందికి వట్టి మేజా పరచివుండినది, అనగా అన్నిన్ని సిద్ధముగా పెట్టియున్నది యింకా వడ్డించలేదని భావము. in aforest డొంక. the fox was found in a cover ఆ నక్క వొక డొంకలో దొరికినది.
Covered adj మూసిన, కప్పబడ్డ, మూసుకొన్న. the ground was * with leavesయిక్కడ ఆకులు విస్తారము రాలి వున్నవి. it was * or concealed by the box అదిపెట్టె చాటున వుండినది. a book * with leather తోలువేసిన పుస్తకము. It was *with leaves ఆకులలో దాచబడ్డది. the ship was * with waves ఆ వాడను అలలుఆవరించినవి. a rupee * with gold leaf బంగారు మొలాముచేసిన రూపాయ. a ruby* throne రత్నఖచితమైన సింహాసనము. the plain was * with people ఆబయలులో జనము నిండి వున్నది. the table was well * వంటకాలు వేసినారు. * witheruptions పేలిన. his face was * with boils వాడి ముఖమంతా కురుపులు.please to be * దయచేసి టోపి వేసుకో.
Covering n s కప్పు, మూత, గవిసెన. of a mare or cow దాటడము.
Coverlet n s పలంగుపోషు.
Covershame n s కౌపీనము, గోచి.
Covert n s మరుగు, చాటు, డొంక.
Covertly adv కపటముగా, మర్మముగా, సాంకేతముగా, అన్యాపదేశముగా.
Covetous adj ఆశపాతకుడైన. a * man దురాశపడేవాడు, లోభి, పిసనారి గొడ్డు.
Covetously adv దురాశగా, లోభిగా.
Covetousness n s దురాశ, లోభత్వము, లుబ్ధత్వము.
Covey n s మంద, గుంపు, యిది అడిగి పక్షులను గురించిన మాట. a * of uselessdomesticks పదిమంది పనికిమాలిన నవుకర్ల గుంపు.
Cow n s ఆవు, గోవు. cows ఆవులు, గోవులు, పశువులు. * dung పేడ. sun-dried* dung యేరుపిడక. a * herd గొల్లవాడు. a * house పశువుల కొట్టము, దొడ్డి. cow'stail ( a particular ornament ) చామరము. * pox టీక, అనగా అమ్మవారుపోయకుండా వుండడానకై చిన్నప్పుడు పొడిపించే టీక, దీన్ని గోమశూచకమనిన్ని అంటారు.
Cowach n s ఒక మొక్క పేరు, దూలగొండి దురదగొండి, కండూరా, కపికచ్ఛు, కాసఘ్ని,పుల్లబచ్చలి, దీన్ని పిల్లి అడుగుచెట్టు అని అంటారు.
Coward n s పిరికి, పంద, భయస్తుడు.
Cowardice n s పిరికితనము, పందతనము, అధైర్యము.
Cowardly adj పిరికైన, భయపడే.
Cowdung n s పేడ.
Cowed adj దిగులుపడ్డ, యెదపడ్డ, భయపడ్డ. * by misfortune ఆపదలచేత ప్రాణముకుంగిన.
Cowherd n s గొల్లవాడు.
Cow-hide n s పశు చర్మము. In the slave drivers dialect, a whip కొరడాజాటి.
Cowhouse n s పశువుల దొడ్డి.
Cowkeeper n s గొల్లవాడు.
Cowl n s cover for the head ముసుకు.
Cowlstaff n s నీళ్ల తొట్టి బొంగు, అనగా నీళ్ల తొట్టిని యిద్దరు యెత్తుకొని పోవడమునకై వలయములకు దూర్చే బొంగు.
Cowry n s గవ్వ. a large * గోదురుగవ్వ.
Cowslip n s ఒక తరహా పుష్పము యిది వసంత రుతువులో పసిరిక బయలులోవిస్తారము పుష్పించి వుంటున్నది.
Coxcombical adj పిచ్చి బడాయిగా వుండే.
Coxcomicality n s (Wesley XII. 292. Letter 264) గర్వము,బడాయి.
Coxcumb n s సొగసుగాడు, బడాయి ఖోరు. a flower రక్తవర్ణమైన ఒక పువ్వు. orcock's comb కోడి యొక్క కొండె. Swift uses it for a fool, a block head వెర్రిముఖము.
Cox-swain n s పడవ చుక్కాని తిప్పేవాడు.
Coy adj సంకోచించిన బిడియముగల.
Coyly adv సంకోచముగా, బిడయముగా.
Coyness n s సంకోచము, బిడియము.
Coz n s ( a cant word for cousin) తమ్ముడా, అన్నట్టు ఒక మాట యిది. cousinఅనే శబ్దములో నుంచి పుట్టిన మాట.
Cozenage n s వంచన, మోసము మాయ, పితలాటకము.
Cozener n s వంచకుడు, మోసగాడు, మాయలమారి, తంత్రవాది.
Crab n s యెండ్రకాయ, పీత. as a sign of the Zodiac కర్కాటకము. a land *మండ్రపీత. * apple ఒక తరహా పుల్లనికాయ. * tree తుమ్మ చెట్టు వంటి ఒక చెట్టు. *lice గోదారి షేనులు, అంటు పేనులు.
Crabbed adj మూర్ఖుడైన, క్రూరుడైన, చిటచిటలాడే, ముసురు మూతియైన. a * styleక్లిష్టమైన పాకము. a * look మాడ్పుముఖము.
Crabbedly adv మూర్ఖముగా, క్రూరముగా, పెడసరముగా, చిటచటలాడుతూ. heanswered * మూర్ఖముగా వుత్తరము చెప్పినాడు.
Crabbedness n s మూర్ఖతనము, పెడతనము, చిరచిర, చిటచిట.
Crack n s బీటిక, పగులు. a * or noise చప్పుడి, పటపట అనే శబ్దము. the boughgave a loud * ఆ కొమ్మ పటపట విరిగినది. a * of the knuckles మెటికె.
Cracked adj పగిలిన, విరిగిన, విరిసిన, బీటికలు బాసిన, పెట్టిన, చిట్లిన. it is * అది విచ్చినది బీటిక పారినది. a * pot బీటిక పాసిన కుండ. or silly చలచిత్తుడైన,మతిభ్రష్టుడైన.
Cracker n s టప్పాసు, అబద్ధము.
Cracknels n s ఒక తరహా ఫలహారము, వడియములు, ( కజ్జాయము F+.మోదకములు D+. ) అనగా కుడుములు.
Cradle n s తొట్ల, ఉల్లంకి. from the * అనగా ever since infancy శిశువుగా వుండేటప్పటి నుంచి, బాల్యాదారభ్యము. this was their * యిది వాండ్ల దేశము, వాండ్లజన్మభూమి.
Craft n s guile యుక్తి, చమత్కారము. trade కులకాయకము, వృత్తి. art విద్య,కృత్తిమము, తంత్రము, కుట్ర. meaning ships వాడలు. small * చిన్న వాడలు.
Craftily adv కృతిమముగా, చమత్కారముగా, దొంగతనముగా, మోసముగా. to act* కపటము చేయుట, కృతిమము చేసుట.
Craftsman n s పనివాడు, పంచాణమువాడు.
Crafty adj కపటమైన, కృత్రిమమైన, మాయలు గల. a * man వంచకుడు, మోసగాడు,మాయలమారి.
Crag n s ఒడుదుడుకుగా వుండే పర్వతము, పర్వతశిఖరము.
Cragged, Craggy adj ఒడుదుడుకుగా వుండే, రాతి గొట్టెన, నిమ్నోన్నతమైన, రాళ్లురప్పలవల్ల అసాధ్యముగా వుండే.
Cragginess n s రాళ్లు రప్పలు వల్ల అసాధ్యముగా వుండడము, నిమ్మోన్నతముగావుండడము, రాతి గొట్టుగా వుండడము. on account of the * of the road ఆ దారిరాళ్లు రప్పలుగా వుండేటందు వల్ల.
Craggy adj See Cragged.
Craken n s ( a Prodigious marine monster ) సమస్తమైన మత్స్యములకంటెపెద్దది. ఒక లంకకు సమానమైన ఒక మత్స్యము, తిమి, తిమింగలము, అతి తిమింగలము.
Cram n s a fib, a lie అబద్ధము.
Crambo n s సమస్య అడిగే ఆట.
Crammed adj కూరిన అడిచిన, బొక్కిన. all of us were * into one smallroom ఒక చిన్న అరలో కిక్కిరుసుకొని వుండినాము.
Cramp n s తిమిరివాయువు, ముద్దవాయువు, యీడ్పు పట్ల వ్యాధి. an iron * బందు.
Cramped adj కిక్కిరిసిన, సంకుచితపరచబడ్డ. we were * for room స్థలము లేకకిక్కిరుసు కొని వుండినాము, యిబ్బంది పడ్డాము. a * hand ప్రాణాన్ని బిగపట్టుకొని వ్రాసిన వ్రాలు.
Cranbery n s ఒక తరహా అడివికాయ.
Crane n s or stork కొంగ, బకము, కొళంజి పక్షి. ( Jerdon No. 298 ) theadjutant * బెగురు. the Indian * or cyrus సారసపక్షి. an engine పెద్ద పెట్టెలుపీపాయిలు వగైరా యెత్తడానకై వుండే యంత్రము.
Craniologist n s కపాలము యొక్క రూపు చూచి మనిషి యొక్క గుణములుతెలియబడుతవని నమ్మేవాడు.
Craniology n s కపాలము యొక్క ఆకారమును చూచి మనిషి యొక్క గుణములనుచెప్పే శాస్త్రము. The principal new phrases used by SPURZHEIM in thisscience ( as it is called ) would be thus expressed in Sanscrit. 1. Amativeness మోహత. 2. Philoprogenitiveness ఈషణత. 3. Concentrativeness దీక్ష. 4. Adhesiveness సంలగ్నశీలత. 5. Combativenessయోధత. 6. Destructiveness సంహారత. 7. Secretiveness గుప్తత. 8. Acquisitiveness లభత. 9. Constructiveness సయ్యోగత్వము. 30. Eventuality ఫలత. 35. Causality కారణత. 19. Ideality కవిత. 36. Alimentativenessపోషణత. The rest will be found in the proper places.
Cranium n s కపాలము, పుర్రె.
Crank n s గడియారములో వుండే చక్రము యొక్క పల్లు, పిడి, కొక్కి. in witభావగర్భమైన మాట, అన్యాపదేశమైన మాట.
Crankly adv నెట్రముగా, బిగువుగా.
Crannied adj సందులుగొందులు గల, బొక్కలుగల.
Cranny n s బీటిక, సందులుగొందులు, బొక్క, చీలిక.
Crape n s సన్నమైన, సెల్లా, రవసెల్లా, సూతకములో యీ గుడ్డను కట్టుకొంటారు.
Crapulence n s అధికముగా తాగడము చేత కలిగిన అరుచి, వెగటు.
Crash n s గభీలుమనే ధ్వని, ఫెళఫెళమనే ధ్వని. with a great * గభీలుమని,ఫెళఫెళమని. It came down with a * అది ఫెళఫెళమని విరిగిపడ్డది, దభాలునపడింది. there was a great * among the merchants అనేక వర్తకులుచెడిపోయినారు.
Crashingly n s ఫెళఫెళమని, గభీలుమని.
Crate n s వెదురుపెట్టె, బరువు మోసే చౌక వెదురు తట్ట.
Crateava religiosa n s ( the tree so called ) బిల్వ చెట్టు. the fruitశ్రీఫలము, మారేడు పండు.
Crater n s అగ్ని గుండము భూమిలో నుంచి అగ్నిహోత్రము బైలుదేలె గుండము యొక్కనోరు.
Cravat n s మెడకు కట్టుకొనే గుడ్డ.
Craven n s ధైర్యము లేనివాడు పిరికివాడు, కోచ, పందమనిషి.
Craving adj అత్యాకాంక్షగల. a * wretch ఆశపాతకుడు, తొందరమనిషి. a *appetite తీరని ఆకలి.
Cravings n s అత్యాశ. the * of nature ఆకలి.
Craw n s పక్షియొక్క కడుపు, పక్షి కడుపులో ఆహారముండే తిత్తి, తీనిపొట్ట. there was some undigisted grain in the bird's * పక్షి కడుపు చీల్చి చూస్తే కొన్ని గింజలు అరగకుండా వుండినవి.
Crawfish, or Cray-fish n s. గాజురొయ్య, ఒక తరహా చేప.
Crayfish n s See Crawfish.
Crayon n s చిత్రగాండ్లు నాడే బలపము వంటి వకతరహా పెన్సిల్, దీంట్లో యెరుపు,నలుపు పచ్చ మొదలైన వర్ణములు కద్దు.
Craze n s ( Silliness ) చలచిత్తత, వెర్రితనము.
Crazed adj జబ్బైన, దుర్బలమైన, వెర్రి. the bridge is * యీ వారధి నమ్మరానిది.
Craziness n s జబ్బు, దుర్బలము, వెర్రి.
Crazy adj దుర్బలమైన, వెర్రి. he is in * health వాడు అశక్తుడుగా వున్నాడు.
Cream n s మీగడ, సంతానిక. or noblest part సారాంశము. the * of the jokewas this ఆయోగతాళిలో వుండే స్వారస్యము యేమంటే.
Cream-coloured adj మీగడ వన్నెగల.
Cream-faced adj వెలవెల పోయిన ముఖముగల, తెల్లపారిన ముఖముగల.
Creamy adj మీగడవంటి.
Crease n s ముడత, మడత, ఖంగు, అనగా కాకితము మొదలైన వాటిని మడిస్తే,యేర్పడే మడత గురుతు. at cricket అడ్డగీకి.
Creased adj ముడతలుపడ్డ, మడిచిన.
Created adj సృష్టించిన, నిర్మితమైన, ఉత్పత్తి చేసిన కలగచేసిన, కల్పించిన.
Creation n s సృష్టి, నిర్మాణము. or world ప్రపంచము. the wonders of *ప్రపంచములోని వింతలు. there are no ghosts but of your own * దయ్యములనినీవు యెంచుకోవడమే గాని వేరే దయ్యములు లేవు. some years after his creationas a Nabob నబాబు అనే ఆఖ్య వాడికి వచ్చిన కొన్ని యేండ్లకు. the animate andinanimate * చరాచరములు. any thing produced కల్పన.
Creative adj సృష్టించే, చమత్కారమైన. the * energy కల్పనాశక్తి, సృష్టించే శక్తి.
Creator n s సృష్టి కర్త, అనగా దేవుడు.
Creature n s ప్రాణి, జంతువు, జీవి. a rational & మనిషి, పునర్జననము. theseare mere creatures of the attorney వాండ్లు ఆ లాయరు చేతి కింద వుండేలుచ్చాలు, బడవాలు. an irrational * జంతువు. marine creatures సముద్రము లోనిజంతువులు. silly * వెర్రి ముఖము. poor * దిక్కుమాలిన పక్షి. she is a fine * ఆమెమహా యోగ్యురాలు, ఆమె మహా రూపవతి. * comforts శరీర సుఖములు, ముఖ్యముగాఅన్న పానాదులును గురించి పరిహాసమైన మాట. look at that poor * at the gateపాపము తలవాకిట వుండేవాన్ని చూడు. he is a new * 2 Cor. 5.17. ( i.e.formation ) నవీనసృష్టి స్వరూపోభవతి. A+. కొత్త సృష్టి. F+.
Credence n s or belief నమ్మిక, విశ్వాసము, పట్టు.
Credenda n s plu. మత సిద్ధాంతము. the * of the Musulman faith తురకమతసిద్ధాంతము.
Credential n s ఆనవాలు, సాధకము, దస్తావేజు.
Credibility n s విశ్వసనియ్యత, ప్రామాణ్యత, సత్యత. this shows the * of thestory యిందువల్ల ఆ కధ నమ్మతగినదని తెలుస్తుంది. a proof of his * నమ్మికకుఉదాహరణము. I doubt it's * అది నమ్మరాదని నాకు తోస్తుంది.
Credible adj నమ్మతగిన, విశ్వసనియ్యమైన.
Credibly adv నమ్మతగినట్టుగా. I am * informed that he did this వాడు దాన్నిచేసినాడని నిండా నమ్మకముగా చెప్పుతారు.
Credit n s నమ్మిక, నమ్మకము, ప్రామాణ్యము. esteem నాణ్యము, గణ్యత. his sondoes him great * కొడుకువల్ల వాడికి నిండా ప్రతిష్ఠ వచ్చినది. I did this on the *of your letter నీ జాబు మీద నమ్మకముంచి యీ పని చేసినాను. or honour కీర్తి, సేడు,భరము, ప్రతిష్ట. he cannot get any credit at this place యీ స్తలములో వాడికియెంత మాత్రము పరపత్యము పుట్టదు. trusting ( as a debt, ) or giving on *పరపత్యము. the * side in an account వరపు, జమ. trifles brought on *వెత్పము. he has no * among the shop keepers వర్తకులలో వాడికి నాణ్యము లేదు,అనగా వర్తకులు వాణ్ని నమ్మరు. you may carry this money to my * యీ రూకలునా పేరట జమకట్టు. he sold the cloth on * అప్పుకు యిచ్చినాడు. that man's *is entirely gone వాడి నాణ్యము బొత్తిగా యెత్తుబడి పోయినది. a man of *ప్రామాణికుడు, పెద్దమనిషి. a man of * అప్రమాణికుడు. I gave * to that report ఆ సమాచారాన్ని నమ్మితిని. I gave you * for more sense యింత పిచ్చివాడివని నేనుయెంచ లేదు. they gave you * for this యిది నీ వల్ల వచ్చినదని అంటారు. don'tgive to such stories అటువంటి మాటలను నమ్మకు.
Creditable adj గౌరవమైన, ఘనమైన, గణ్యమైన, యోగ్యమైన. he wrote a very* letter నిండా గౌరవమైన జాబు వ్రాసినాడు.
Creditably adv గణ్యముగా, యోగ్యముగా, గౌరవముగా.
Creditor n s అప్పు యిచ్చినవాడు, అప్పులవాడు, ఉత్తమర్ణుడు. he has manycreditors అతను శానా మందికి బాకిపడ్డాడు, వాడికి శానామంది అప్పువాండ్లు వున్నారు. he called his creditors together పరిష్కారము చేసుకోవడానకై అప్పులవాండ్లను కూర్చిమాట్లాడుకొన్నాడు.
Credulity n s బిడ్డవలె అవివేకముగా, అవివేకము విచారించక తెప్పని నమ్మేస్వభావము, నమ్మే గుణము. he shows great * వాడితో యేమి చెప్పిన దాన్నినమ్ముతాడు యెద్దు యీనిందంటే కొట్టాన కట్టమంటాడు.
Credulous adj బిడ్డవలె చెప్పినదాన్ని నమ్మే, సులభముగా నమ్మే.
Creed n s or religion మతము. or articles of belief మత సంక్షేపము.according to his * all women are abominable స్త్రీలందరు పాప జీవులని వాడిమతము.
Creek n s శైయ్య, సముద్రపు చిన్న కైయ్యి.
Creeper n s తీగె, లత.
Creeping adj పారకాడే, పాకే. a * thing పురుగులు మొదలయినవి. a *disposition నీచతుచ్ఛగుణము.
Creese n s or dagger, బాకు, కటారి.
Cremation n s (burning) దహనము, కాండము.
Creole n s సంకరజాతివాడు, అనగా. African చిన్న దానికిన్ని తెల్లవాడికిన్ని పుట్టిన మనిషి.
Crepitation n s (in burning) పటపట, చిటచిట.
Crept (past of the verb tocreep) అనేక్రియకుభూతకాలము,పాకినది,అల్లినది
Crescendo n s ఆరోపణము, యిది సంగీతశాస్త్ర మందు వచ్చే శబ్దము.
Crescent n s అర్ధచంద్రాకృతి, చంద్ర వంక. the fortnight of the * moon iscalled శుక్లపక్షము. the * moon అర్ధచంద్రుడు.
Cress n s (water cresses) ఆడేలు కూర. this word rhymes to pieces,fleeces, nieces.
Cresset n s అఖండము, కొండ మీద పెట్టిన పెద్ద దీపము.
Crest n s శిఖ, కొప్పు, జుట్టు, తురాయి. of a serpent నాగుపాము పడిగ. ofa mountain శిఖరము.
Crest fallen adj అపజయము పొందిన, ధైర్యము చెడిన, కుంగిన, యెదబడ్డ.
Crested adj శిఖరముగల, తురాయిగల. the hills were * with troops కొండశిఖరము మీద సైన్యము వుండినది.
Cretaceous adj సున్నపు. a * deposit పొడి సున్నము.
Crevice n s బీటికె, పగులు, సందు.
Crew n s గుంపు, జనము. of a ship వాడ వాండ్లు. he and his * అతనున్నుఅతని చేతి కింద వుండె జనమున్ను.
Crewel n s కంబళిదారము, కంబళినూలు.
Creyat root n s a certain drug (Justicia Panniculata)నేలవేము.
Crib n s (cradle, stable, chamber.) చిన్న గది, అర, గుడిశ, గూడు.
Cribbage n s ఒక తరహా కాకితాల ఆట.
Cribbing n s దొంగతనము, ముచ్చుతనము.
Cribble n s (a sieve) జల్లెడ.
Cribriform adj (like a sieve) జల్లెడ కంతలుగా వుండే.
Crick n s (in the neck) మెడపట్టు.
Cricket n s (insect) యిలకోడి, కీచురాయి ఉప్పుమిడత. or game పెద్ద గుండ్లతోమైదానము మీద ఆడే ఆట. or stool మూడు నాలుగు కాళ్ల మూడైనా, నాలుకాళ్లైనా గలపీట.
Cricumstantially adv vEnamugA, vivaramugA, samarmakamugA.
Crier n s యేలాం పాడేవాడు.
Crim n s (contraction for Criminal Connection) వ్యభిచారము,వ్యభిచారమును గురించిన వ్యాజ్యము.
Crime n s నేరము, ద్రోహము, దోషము, పాపము. he expressed his * on thescaffold వాడు చేసిన తప్పు, తూకుమానుతో తీరినది, అనగా వాణ్ని వురితీసినారనిఅర్థము. Is this my * యిది నా తప్పా.
Criminal adj నేరముగల, దోషయుక్తమైన, పాపమైన, చెడ్డ. they consider this *దీన్ని పాపమంటారు. a * suit మేజస్త్రీటు వ్యాజ్యము. a * court దొంగలను విచారణచేసే కోర్టు. the * judge or, the Sessions Judge నేరస్తులను విచారించేన్యాయాధిపతి. * connection వ్యభిచారము, రంకు.
Criminality n s నేరము, అపరాధీత్వము, ద్రోహము, దుర్మార్గము, పాపము.
Criminally adv నేరముగా, తప్పుగా, ద్రోహముగా.
Crimination n s నెపము, పెట్టడము, తప్పు మోపడము, అపనింద. mutual * నీవుదొంగ నీవు దొంగ అని వీడికి వాడు వాడికి వీడు అనడము.
Crimp n s దళారి, క్షుద్రుడు, వోరంబాకదు బాసి.
Crimped adj కొందిన, నజ్జునజ్జుగా కోసిన.
Crimping n s వాడ యెక్కిపోవడమునకై పామరజనమును బుజ్జగించడము,మనుష్యులను మయిదుచేసి లంకించుకొని పోవడము.
Crimson adj రక్తవర్ణమైన.
Crimsoned adj యెర్రపారిన, కందిన.
Cringing n s నక్క నైచ్యము.
Cripple n s కుంటివాడు, అవిటిమనిషి. by this fall he became a * for lifeయీ పడడము చేత మానని కుంటివాడై పోయెను.
Crippled adj మొండి, కుంటి, చేతకాని.
Criptical adj అతిరహస్యమైన, గూఢమైన.
Crisis n s సమయము, కాలము, తరుణము. just as that * ఆ యవసరములో.the disease is at the * ఆరోగ్యము మర్మముగా వున్నది. at the present *యిటువంటి, సమయములో, తరుణములో. the * still continues యింకాముమ్మరముగానే వున్నది.
Crisp adj పెళుచు అయిన, చక్కిలమువలె గరగరలాడె. curled as hair నొక్కులునొక్కులుగా వుండే.
Crispness n s గరగర లాడడము.
Criterion n s లక్షణము, గురుతు, శూచకము.
Critic n s నిర్ణేత, పరిక్షకుడు, విధాయకుడు అనగా ఒకడు చేసిన గ్రంథము మీదఅబద్ధసుబద్ధములు యేర్పరచి వ్రాసే పండితుడు. Appa Cavi and Peddi Bhatlu arecelebrated critics అప్పకవిన్ని పెద్దిభొట్లున్న గ్రంథముల యొక్క నిగ్గును తేల్చే వాండ్లు, లాక్షణీకులు. he is a * in horses వాడు అశ్వపరిక్ష తెలిసినవాడు. A crus criticorum విద్వాంసులము గ్గొయ్య, తీరని సందేహము, వ్యాసఘట్టము.
Critical adj శాస్త్రీయమైన, విశేషమైన, సూక్ష్మమైన, సరియైన, ఖండించే, ఆక్షేపించే.he has read Sanscrit but has not a * knowledge of that languageసంస్కృతము చదివినాడు గాని అందులో వానికి శాస్త్రియ్య జ్ఞానము లేదు. * timesఅపత్కాలము. * juncture కుసంధి.
Critically adv exactly పరిష్కారముగా, సున్నితముగా, సూక్ష్మముగా.
Criticism n s విమర్శ, తప్పులు వొప్పులు పరిశీలనము చేయడము, `క్షేపన,ఖండనము. he made no criticisms upon you నీవు చెప్పిన దాని మీద వాడుఆక్షేపించలేదు, ఖండన చేయలేదు.
Critique n s విమర్శ, పరిక్ష, ఆక్షేపణ, ఖండన.
Croak n s కప్పకూత, మాలకాకి కూత.
Croaker n s నేడెమో రేపే మోయని వూరికె అఘోరించేవాడు.
Croaking n s నేడెమో రేపే మోయని అఘోరించడము, అది ముఖ్యముగా రోగమునుగురించిన మాట.
Croceous adj అరుణమైన, యెర్రని.
Crock n s వొక పాత్ర.
Crockery n s పింగాణి సరుకు, కుండచట్లు, కుమ్మర స్వరూపాలు.
Crocodile n s మొసలి, మకరము. * tears నీలి యేడ్పు.
Crocus n s కుంకుమపువ్వు.
Croft n s పెరడు.
Crone n s ముసలిది, ముసలిదానికి యెగతాళి పేరు.
Crony n s చెలికాడు, ఆప్తుడు. this word is generally used in jest యిదియెగతాళిమాట.
Crook n. s. దోటెకర్ర, కొక్కెము, * back గూని.
Crooked adj వంగిన, వంకరైన, కుటిలమైన. you have written it all *వంకటటొంకరగా వ్రాసినావు. a * lane వంకర టొంకరగా వుండే సందు. * legs దొడ్డికాళ్లు.meaning, who has a hump గూని వీపు. a * mind కుటీలమైన మనస్సు. * councils దురాలోచన, వంకరాలోచన.
Crookedly adv వంకరగా.
Crookedness n s వంకర, వంపు, వక్రత.
Crop n s of corn పయిరు, పంట, ఫలము భోగము. a plentiful * of blundersలక్ష తప్పులు. a * of hair తలవెంట్రుకలు (అనగా తల వెంట్రుకలు పొడుగుగావుండకుండా మొగవాండ్ల రీతిగా కురచగా కత్తిరించి వుంటవి.) she wears a * తలవెంట్రుకలు కత్తిరించుకొన్నది. a field bearing a second * రెండో భోగము, నాపచెను.cropful కడుపు నిండిన. the * or craw of a bird పక్షి యొక్క కడుపు, తీనిపొట్ట.
Cropful adj గొంతు దాక నిండిన.
Cropped, Cropt adj కోసిన, కత్తిరించిన. not cropped, long haired తలపెంచిన. cropt in the bud లేత ప్రాయములో తుంచుకొని పోయిన, భంగము పొందిన,చెడిపోయిన.
Cropsick adj వెక్కసముగా వుండే.
Crore n s (an Indian word) కోటి, నూరు లక్షలు.
Crosier n s వంకరకర్ర, కొక్కెము, దీన్ని పూర్వము సన్యాసులు పట్టుకొనేది.
Cross adv or across అడ్డముగా.
Cross-bow n s కొయ్యతో తుపాకి ఆకారముగా చేసి దానికి తగిలించిన ఒక తరహాయినుప విల్లు దీని బిసను అణిస్తే అంబుగాని వుండగాని బహుదూరము పారుతుంది.
Cross-examination n s యెదురు సవాలు వేసుట, అడ్డసవాలు వేసి విచారించుట,తన సాక్షికి తాను సవాలు వేసిన తరవాత యెదటి కక్షివాడు సవాలు వేసి అడుగుట.
Cross-grained adj ముసురుమూతియైన, పెడసరయైన, మూర్ఖమైన, మొండికొయ్యయైన. a * wretch మొండి కొయ్య.
Crossly adv peevishly మూర్ఖముగా, మొండిగా, పెడసరముగా, ముసురుమూతిగా, శివంగివలె.
Crossness n s మూర్ఖత, మొండితనము, ముసురుమూతితనము, శివంగితనము.
Cross-way n s అడ్డదోవ, అడ్డదారి.
Cross-wise adv అడ్డముగా.
Crotchet n s in music సంగీత శాస్త్ర మందు అర్ధమాత్రను చూపే సంజ్ఞ, వ్రాతలో [ ] యీ గుర్తులు. యివి కుండలీకరణమునకు తుల్యమైనవి. or freak పిచ్చితలంపు,వెర్రితలంపు, వెర్రి భ్రమ.
Crotchetteer n s a whimsical man ( Christian Observer Dec. 1844 page 721) తల కొవ్విన మూర్ఖుడు.
Crotolaria n s ( a plant. Ainslie 2.478 ) గిలిగిరింత చెట్టు.
Croton n s ( the purgative drug ) నేపాళము.
Crouching adj పండుకొన్న, నక్కిన. a * tiger తల పైకెత్తుకొని పండుకొని వుండేపులి.
Croup n s ( or Crupper ) పల్లములో నుంచి గుర్రపు తోకకు తగిలించేవారు. adisease కింక వాయువ, కింకివాయువ, అడుపువాయువ, యిది చంటి పిల్లలకు వచ్చేరోగము.
Crow n s ( the bird ) కాకి. or the voice of the cock కోడికూత. an iron *గడ్డపార, యినప కంబి. I have a * to pluck with you నీతో నాకు ఒక పీకులాటవున్నది. the king * యేట్రింతపక్షి, భారద్వాజము. a water * నీరు కాకి. Ravenమాలకాకి, కాకోలము.
Crow, or CrowBar n s. గడ్డపార, యినపకంబి.
Crowd n s గుంపు, సమూహము, స్తోమము. in crowds గుంపులుగా.
Crowded adj గుంపుగా వుండే ఒత్తుడుగా వుండే, కిక్కిరిసిన, సంర్దముగా వుండే * trees దట్టముగా వుండే చెట్లు కిక్కిరుసుకొనివుండే చెట్లు.
Crowdedly adv గుంపుగా, ఒత్తుడుగా, కిక్కిరిసి.
Crowinig adj అతి ముఖ్యమైన, శిఖరమైన.
Crown n s కిరీటము. or top శిఖరము, పయితట్టు. the top of the head నడినెత్తి,ఉచ్చి, మాడు పట్టు. the * of a hat టోపి యొక్క మీది తట్లు. he fell down andcrackled his * పడి తల పగిలినది. of a mountain శిఖరము. of a wall మదురు. * or five shillings రెండున్నర రూపాయకు సమానమైన ఒక నాణెము. a half *రెండున్నర షిల్లింగు. or royal family రాజసంస్థానము. an heir to the * యువరాజు,రాజకుమారుడు. or superiority జయము, దొరతనము. or ornament ఆభరణము.she was the * of her sex ఆమె స్త్రీ తిలకముగా వుండెను, ఆమె స్త్రీ రత్నముగావుండెను. this was the * of his actions వాడు చేసిన పనులలో యిదిముఖ్యమైనది. the prosecutor on the part of the * గవనరుమెంటు వకీలు లేక,సర్కారు మనిషిగా వుండి వ్యాజ్యము జరిగించేవాడు. a * prisoner సర్కారు కయిది.the * lands సర్కారు భూమి, సర్కారు నేల.
Crown-glass n s శ్రేష్ఠమైన అద్దము.
Crown-post n s నిట్రాయి.
Crow-pheasant n s జముడు కాకి.
Crucible n s మూస.
Crucific n s శూలబద్ధ జగత్తారకుని మూర్తి, శిలువలో కొట్టినది కొట్టినట్టుగా చేసివుండే ఖ్రైస్తు యొక్క ప్రతిమ.
Crucifixion n s శిలువ మీద పెట్టి చిలలు కొట్టడము, కొరత వేయడము, అనగా + యీఆకారముగా వుండే కొయ్య మీద మనిషి వెల్ల వెలకల పండపెట్టి చేతులను బారచాపించిఅరిచేతులలో కాళ్ళలోనున్ను చీలలు కొట్టి ఆ కొయ్యను నేల నిలవ పాతడము.
Crude adj or raw meaning unboiled పచ్చి, పండని, అపక్వమైన. unripe పచ్చి,లేత పక్వము కాని. cot changed by any processor preparation పదను చేయని.or unprepared కోరా. * notions ఆల్ప జ్ఞానము, అసంపూర్ణమైన జ్ఞానము. orunconcocted జీర్ణము కాని, అరగని. the iron was brought there in a * state ఆ యినుమును తవ్వినది తవ్వినట్టే తేచ్చినారు, కాచి పక్వము చేయకుండా ముష్టుతో కూడా వుండే మడ్డి యినుమును తెచ్చినారు. a * form in Sanscrit grammar ప్రకృతి రూపము. a * Sanscrit noun ప్రాతిపదికము.
Crudeness, Crudity n s. పచ్చి, అపక్వత, అపరిష్ఖృతత్వము, జీర్ణము కాకుండావుండడము, అజీర్తి.
Crudle n s ( Johnson ) See Curdle.
Cruel adj క్రూరమైన, కఠినమైన, దారుణమైన. a * man క్రూరుడు, కటికవాడు.
Cruelly adv క్రూరముగా, కఠినముగా, దారుణముగా.
Cruelty n s క్రూరత్వము క్రౌర్యము, కటికతనము, నిష్ఠురత్వము.
Cruet n s ఒక తరహా చిన్న సీసా.
Cruise n s or a kind of bottle ఒక తరహా బుడ్డి. or voyage ప్రయాణము,యాత్ర, వకనడ, వకసారి వెళ్లి రావడము యిది దొంగ వాడలను యుద్ధవాడలను గురించినమాట.
Cruiser n s దొంగవాడ, యుద్ధవాడ.
Crum, Crumb n s. or morsell రొట్రె యొక్క పొడి, వక కణము. soft part ofbread చోవి, అనగా రొట్టె లోపల వుండే మెత్తనిది. crumbs పొళ్లు. a * of comfortరవంత వుపశాంతి.
Crumbling (pl) పొడిపొడిగారాలే
Crumpet n s అప్పము, అట్టు, దోసె.
Crumple n s నలగడము.
Crumpled adj నలిగిపోయిన, వూచపోయిన. a cow with a * horn వూచబోయినవొక కొమ్ముగల ఆవు.
Crupper n s దుమిచి, జీవిలో నుంచి గుర్రపు తోకకు తగిలించేవారు.
Crural adj కాలిసంబంధమైన, జాంఘీయ్యమైన.
Crusade, Crusado n s. a war for the cross మతాభిమానమును గురించిజిరేసులాం అనే పట్ణమును తురకల వద్దనుంచి గెల్చుకోవడానకు చేసిన యుద్ధము,సాహసమైన యత్నము.
Crusader n s crusade అనే యుద్ధమునకు పొయ్యే శూరుడు.
Cruse n s కుప్పె, కాళి కుప్పె.
Crush n s వొత్తుడు, నలగడము, సమ్మర్ధనము.
Crushed adj నలిగిన, అణిగిన, ముంచిన.
Crust n s రొట్టె యొక్క బిరుసుగా వుండే పయితోలు, పిండి వంటలు యొక్క బిరుసైనపయితోలు. or covering పయిచిప్ప, గుల్ల, పైచెక్క. there was a * of blood overthe wound గాయము మీద పొక్కు కట్టినది. the metal was found under a * ofearth వక మంటిపొర కింద రాగి వున్నది. the crust of the teeth పంటికి కట్టిన గార.
Crustaceous adj గుల్లగల, పెంకుగల. * fish గుల్లగుల వొక పురుగు, శీపిచాపలుమొదలైనవి.
Crusted adj పక్కు కట్టిన. a crown * with rubies రత్నఖచితమైన కిరీటము.
Crustily adv క్రూరముగా, కఠినముగా, మొండిగా.
Crustiness n s మొండితనము, చలము, క్రూరత్వము.
Crusty adj క్రూరమైన, మొండి అయిన, చలపారిన.
Crutch n s కుంటివాడు నడిచేటందుకు చంక కింద పెట్టుకొనే కర్ర, చంకకర్ర.
Cry n s కూత, కేక, మొర, యెలుగు, గొంతు. cries ఏడ్పు, రోదనము. of defianceహుమ్మని తిరస్కరించడము.
Cryer n s చాటించే బంట్రోతు, యేలాం పాడేవాడు.
Crying n s యేడ్పు, రోదనము, అరవడము.
Crypt n s గర్భగృహము, లోగుడి, కింది అర, గోరి.
Crystal n s స్ఫటికము. a * of salt వుప్పు పెళ్ల, వుప్పుకల్లు. the salt formedin crystals వుప్పుపంట కట్టినది, పువ్వులుగా కట్టినది.
Crystalline adj నిర్మలమైన, స్వచ్ఛమైన, తేటగా వుండే.
Crystallization n s స్ఫటికము వలె గడ్డ కట్టుట. the rain prevented the * ofthe salt వాన వల్ల వుప్పు పూయక పోయినది, వుప్పు పంట కట్టలేదు.
Cub n s కూన, గున్న, పిల్లి నక్క పిల్ల. an unlicked * యెడ్డెవాడు, మోటుగాడు.
Cubation n s See Incubation.
Cubbish adj మూర్ఖ మొండి, మోటు.
Cube n s పాచి యొక్క ఆకారము. It was a perfect * నాలుగు తట్లా కొలత సరిగావున్నది. a * of eighteen inches ఘన హస్తము, అనగా వెడల్పు, నిడుపు, యెత్తు,సరిగా మూరెడేసి వుండేటిది. * root ఘనమూలము, యిది మహాగణితమందు వొక శబ్దము.
Cubebs n s వొక తరహా మిరియాలు.
Cubical, Cubick adj ఘనమైన. a * root ఘనమైన అడుగు. * measurementఘన ప్రమాణము, అనగా నిడుపు వెడల్పు యెత్తు, యీ మూటి యొక్క కొలత.
Cubit n s మూర.
Cucking, stool n s. ( Johnson gives this word ) దండుబజారి ముండ.గ్రామస్థులు చేసే ఒక తరహా శిక్ష.
Cuckold n s the husband of an adulteress వూరిమీద పోయినదానీ మగడు,చెడిపోయినదాని మగడు, భ్రష్ట భార్యాపతి.
Cuckoldly adj మానహీనమైన, అవమానమైన, తలవంపైన, అధమమైన.
Cuckoo n s కోకోలము, కోవిల. * cry పిచ్చి సుద్ధులు.
Cucumber n s దోసకాయ.
Cucurbitaceous adj దోసకాయ సంబంధమైన. * fruits దోసకాయలు మొదలైనవి.
Cud n s పశువులు నెమరుకు తెచ్చుకొనే ఆహారము. to chew the * నెమరు వేసుట.chewing the * నేమరు వెయ్యడము. or to meditate upon తల పోసుకొనుట.
Cudding n s కౌగిలింత, అలింగనము, దొబ్బు.
Cuddy n s the chief cabin in a ship పెద్దగది, కూటము.
Cudgel n s దుడ్డుకర్ర, బడితె, గుదియ, కట్టె. he took up the *s for them వాండ్లపక్షముగా మాట్లాడినాడు.
Cue n s or pig tail తోక, అనగా పూర్వము మగవాండ్లు వేసుకొనే వక తరహా జడ. atbilliards గుండ్లతో ఆడె ఒక ఆటలో గుండ్లను తోసే సోటా కర్ర. or hint సైగ, సంజ్ఞ,జాడ. they took their * from him వాడు వాండ్లకు సైగ చేసినాడు.
Cuff n s or blow గుద్దు, పిడిగుద్ధు, మొట్టికాయ, దెబ్బ. they came to fisty *sగుద్దులాడ సాగిరి. of a coat చేతి మీద వుండే ముజేతి చొక్కాయ మడత. a red coatwith black *s and collar మెడ ముంజేతులు నల్లగా వుండె యెర్రకోటు. hand *sచేతి సంకెళ్లు.
Cuirass n s కవచము.
Cuirassier n s రౌతు, తురుపు సవారు అనగా కవచమును వేసుకొన్నవాడు.
Cuishes n s తొడలకు వేసుకొనేకవచము.
Culdees n s ( Monks who in former ages lived in Scotland and Ireland )ఒక తరహా సన్యాసులు.
Culinary adj వంట సంబంధమైన, పాక సంభంధమైన. * art సూపశాస్త్రము. *articles వంటకు కావలసిన పాత్ర సామగ్రి. * vegetables కూరగాయలు. * saltకూరవుప్పు.
Culled adj యేర్పరచబడ్డ, యేర్పరచి యెత్తుకోబడ్డ.
Cullender n s or sieve జల్లెడ, చిల్లులుసిబ్బి. H. 5. 13.
Cullet n s ( broken fargments of glass &c. ) చిల్ల పెంకులు, తునకలు, బద్దలు.
Cullion n s పోకిరి, క్షుద్రుడు.
Cully n s వూరికె నమ్మేవాడు, దొంగల చేతనైనా, లంజచేతనైనా మోసపోయ్యేవాడు.
Culm n s a kind of fossil cole ఒక తరహా రాతి బొగ్గు. a stem of grass గడ్డిమొదలైన వాటి కర్ర, స్తంబము.
Culmination n s ఉచ్చము, అనగా నక్షత్రము నడి నెత్తికి సరిగా రావడము.
Culpability n s నేరము, అపరాధత్వము. this proves his * యిందువల్ల వాడినేరమని తెలుస్తుంది.
Culpable adj నేరముగల, తప్పైన, దోషయుక్తమైన. a * partiality దురభిమానము.
Culpably adv నేరముగా, తప్పుగా, అన్యాయముగా. he was * careless of hischildren వాడు తన బిడ్డల మీద పాపిష్టి వుపేక్ష చేసినాడు.
Culprit n s నేరస్థుడు, అపరాధి, నేరము మోపబడ్డవాడు.
Culter n s నాగటిక.
Cultivated adj కృషిచేసిన, పయిరు పెట్టిన, వ్యవసాయము చేసిన, సాగుబడి చేసిన,సేద్యము చేసిన. a * language వ్యాకరణ శిక్షతమైన భాష. Sanscrit is notgenerately * among them వారిలో గీర్వాణము చడవడము అపరూపము. a man of* mind శాస్త్ర సంస్కారము గలవాడు, విత్పన్నుడు.
Cultivation n s కృషి, వ్యవసాయము, సాగుబడి, సేద్యము, పయిరు, పంట. dry * మెట్టసాగుబడి, కాడారంభము. wet * పల్లపుసాగుబడి, నీరారంభ, రొంపిదుక్కి మాగాణి.land in * దుక్కి పొలము. Land left without * బీటి పొలము. mental *సాహిత్యము, చదువులు శాస్త్రము. people without * చదవనివాండ్లు, నిరక్షరకుక్షులు,అక్షర జ్ఞానము లేనివాండ్లు.
Cultivator n s కాపు, రయితు, కృషికుడు, వ్యవసాయకుడు, సేద్యగాడు. a * ofjustice ధర్మ పరిపాలకుడు.
Culture n s కృషి, వ్యవసాయము, సాగుబడి, సేద్యము.
Culverin n s ( a kind of cannon ) ఫిరంగి, యిది ప్రాచీన శబ్దము.
Cumbered adj సంకటపడే, చిక్కులు పెట్టబడ్డ, యిబ్బంది పెట్టబడ్డ. he was * with a large family పెద్ద సంసారమును కాల్ల కట్టుకొని వుండినాడు.
Cumbersome adj తొందరైన, సంకటమైన, జంఝాటమైన, బళువైన, మోయకూడని,భారి, బ్రహ్మాండమైన.
Cumbersomeness n s తొందర, సంకటము, యిబ్బంది, జంఝాటము, బళువు,భారము.
Cumbrance n s తొందర, సంకటము, యిబ్బంది, ఒళువు, భారము.
Cumbrous adj బళువైన, బ్రహ్మాడమైన. See Cumbersome
Cumbrously adv బళువుగా, జంఝాటముగా. she was so * adorned that shecould not dance అది సొమ్ములు మోసుకొని ఆడలేక పోయినది.
Cumin n s జీలకర, జీలకర్ర.
Cumly n s ( Indian word for a blanket ) గొంగళి, కంబళి.
Cummer n s ( French, commere ) ముత్తైదువ, యిది ప్రాచీన శబ్దము.
Cummin Seed n s జీలకర్ర, జీలకర.
Cumulation n s పోగుచేయడము, పోగుకావడము.
Cumulative adj పోగైన.
Cunning n s artfice కపటము, వంచన తంత్రము, టక్కు. skill ప్రవీణత, నిపుణత,చమత్కారము, నేర్పు.
Cunningly adv కపటముగా, వుపాయముగా, నేర్పుగా, దొంగతనముగా.
Cup n s గిన్నె, కలశము, చెంబు, పాత్ర, అటిక. a tea cup కోపా. ( copa ) యిదియింగ్లిషు మాట. a * made of a leaf దొన్నె, దొప్ప. a * made of a cocoanutటెంకాయ చిప్ప. the * of a lamp ప్రమిద. when they are in their cups సారాయితాగి మయిక మెక్కినప్పుడు.
Cup-bearer n s రాజు దగ్గెర వుండే వొక తరహా పరిచారకుడు.
Cup-board n s అల్మారా.
Cupel n s మూస.
Cupful n s గిన్నెడు.
Cupid n s మన్మథుడు.
Cupidity n s దురాశ, అత్యాశ, కామము, లోభము, మోహము.
Cupola n s మసీదు మీద నైనా గోరీల మీద నైనా వుండె గుమ్మటము, శిఖరము.
Cupper n s గిన్నె కరిపించి నెత్తురు తీసేవాడు.
Cupping glass n s నెత్తురు తియ్యడానకు ఒంటికి కరిపించే గిన్నె.
Cur n s వూరకుక్క, మాలకుక్క, దొంగ కుక్క.
Curable adj స్వస్థమయ్యే, వాసియయ్యే, సాధ్యమైన.
Curacy n s ఒక తరహా పాదిరి వుద్యోగము, అందున గురించిన మాన్యము, గురిదక్షణఅనవచ్చును.
Curate n s రెండో పాదిరి, చిన్న పాదిరి, పాదిరి చేతికింది వాడు.
Curative adj స్వస్థము చేయించే, వాసిచేసే, ఆరోగ్యకరమైన.
Curator n s సంరక్షకుడు, పెద్ద, అధ్యక్షుడు, పైవిచారణ కర్త.
Curb n s పెద్ద కళ్లెము. metaphorically ఆటంకము, అడ్డి. he set a * upon hispassions వాడు కామ క్రోధాదులను అణిచినాడు. you ought to set a * upon yourtongue నీవు నోరు ఆచవలెను. the * of a road fountain or well అంచు.
Curbed adj కళ్లెము వేసిన, అణిగిన, కైజామోరగా వుండే, యిది వసు చరిత్రఅవతారికలో వుండే వాక్యము.
Curd n s పెరుగు. the cream of curds మీగడ. curds mixed with waterమజ్జిగ, మారు చల్ల.
Curdy adj పెరుగుగా వుండె, పేరిన.
Cure n s స్వస్థము, గుణము వాసి, నయము, పరిహారము, కుదురుబాటు, గుణముచేయడము. or remedy విరుగుడు, చికిత్స. or the benefice of employment of acurate పాదిరివృత్తి. to effect a * వాసి చేసుట గుణపరచుట.
Cured adj మానిన, మాన్పిన, స్వస్థమైన, వాసి అయిపోయిన. as flesh or fishచెడిపోకుండా వుప్పులో వూరవేసిన.
Cureless adj స్వస్థము కాని, మానని, అసాధ్యమైన, చక్కపెట్టకూడని.
Curfew n s సాయంకాలపు గంట అనగా పూర్వకాలమందు సాయంకాలము యేడు,యెనిమిది గంటల సేపటికి యీ గంట వాయించగనే వూరిలో అందరు అగ్నిహోత్రాన్నిచల్లారిచి వేసేది యని రాజనిబంధన కలిగివుండెను. In the year 1843 * law wasproclaimed in Oporto.
Curiosity n s inquisitiveness, inclination to enquire తెలుసుకోవలెననేయిచ్చ యిదేమి అదేమియని అడిగి తెలుసుకొనే బుద్ధి, పరిశోధకబుద్ధి, బుభుత్సుత. a manof great * మహా పరిశోధకుడు. he did not gratify my * నేను అడిగితినిగాని వాడుతెలియచేయలేదు. have you any * to see it నీకు దాన్ని చూడవలెనని ఆశా. nicetydelicacy సూక్ష్మము, నాజూకు. accuracy, exactness ఠీకు కచ్చితము. an object *a rarity వింత, వేడుక, వినోదము, ఆతిశయము, అపురూపము, ఆశ్చర్యము, వింతైనవస్తువు. his book is a great * యిది నిండా అపురూపమైన గ్రంథము. thecuriosities of nature యీశ్వరుడి యొక్క చిత్ర విచిత్రమైన సృష్టులు. he is goodman but his wife is a * వాడు సరే గాని వాడి పెండ్లాము వింతైన ఆడది. thissword is a great * యీ ఖడ్గమును గురించి ఒక వింత వున్నది.
Curious adj inquisitive, desirous of information తెలుసుకోవలె ననేయిచ్ఛగల, యిదేమి అదేమని అడిగి తెలుసు కొనే బుద్ధిగల పరిశోధక బుద్ధిగల, బుభుత్సుత.how * you are యిదేమి అదేమని యెందుకు వూరికె అడుగుతావు. I am not * aboutit అది యెటువంటిదో యని అడిగి తెలుసుకోవలెననే యిచ్చ నాకు లేదు. I was * toknow how this happened యిది యెట్లా సంభవించినదో తెలుసుకోవలెనని నాకుయిచ్చవు డినది. difficult to please full of care సూక్ష్మమైన, సున్నితమైన,జాగ్రతగల. these people are very curious about their food వీండ్లు భోజనములోసాంట్లు వెతికేవాండ్లు. exact nice, subtle ఠీకు అయిన, కచ్ఛితమైన. he is a *workman వీడు కచ్ఛితమైన పని చేసేవాడు. a * examination శలాకపరీక్ష, కచ్ఛితమైనపరీక్ష. elegant, neat, laboured, finished నాజూకైన, సుందరమైన. rare వింతైన,వినోదమైన, వేడుకైన, అతిశయమైన, అపురూపమైన, ఆశ్చర్యమైన.
Curiously adv inquisitively తెలుసుకోవలెననే ఆశతో. oddly వింతగా, వేడుకగా,చోద్యముగా, విపరీతముగా.
Curl n s చుట్టు వెంట్రుకలు. curls కురులు. on the forehead ముంగురులు. ofsmoke పొగ మోసులు.
Curled adj చుట్టలు చుట్టలుగా వుండే మెలిపెట్టిన, వడివేసిన, ముడుచుకొన్న.
Curlew n s ఒక తరహా సముద్రపు పక్షి, క్రౌచ పక్షి ఉల్లంకాయ, నల్లకంకణమువడ్లకంకణము, బలాకము.
Curliness n s చుట్టలు చుట్టలుగా వుండడము. from the * of the child's hairఆ బిడ్డ వెంట్రుకలు చుట్టలు చుట్టలుగా వుండడమువల్ల.
Curly adj చుట్టలు చుట్టలుగా వుండే. the child's hair is * ఆ బిడ్డ వెంట్రుకలుచుట్టలు చుట్టలుగా వున్నవి.
Curmudgeon n s చెడ్డపిశినారిగొడ్డు, ఆశపాతకుడు, పరమలోభి.
Currant, -bush n s. కలివిచెట్టువంటి వొక చెట్టు, యిందులో మాదుజాతులు కలవు, కొన్నినల్ల పండ్లు, కొన్ని యెర్ర పండ్లు, కొన్ని తెల్ల పండ్లు పండుతవి. currants వీట్లో పండే పండ్లు. a currant or dried grape యెండిన ఒక తరహా ద్రాక్ష పండు.
Currency n s చెలామణి, చెల్లుబడి. this story had a long * యిది బహుదినాలుగాప్రసిద్ధిగావుండే కథ. a metallic * బంగారు నాణెము, వెండి నాణెము, రాగి నాణెము.from the * of this word యీ మాట ప్రసిద్ధమైనది గనక. laws regarding the *రూకల నాణ్యమును గురించిన చట్టములు.
Current n s ప్రవాహము, సరణి. the * of trade వర్తకపు సరణీ. courseజరగడము, నడత. of air గాలి వచ్చే యిరవు. the under * of thought, the remoteidea లోని యోచన, లోని ఆలోచన.
Currently adv వాడుకగా సాధారణముగా, ప్రాయశః. this word is * explainedan elephant యీ మాటకు వాడుకగా యేనుగ అనే అర్ధ మౌతున్నది.
Curricle n s ఒక తరహా బండి, రెండు గుర్రములు వేసే రెండు చక్రాల బండి, దీన్నికరికలు బండి అంటారు.
Currier n s తోళ్లు పదను చేసేవాడు.
Currish adj తుంటైన, మూర్ఖమైన, కుక్కవలె పడే.
Curry n s ( Tamil word for a stew ) కూర. * powder కూర పిండి, మసాలా.
Currycomb n s గొరపము, ఖరారము.
Currystuff n s సంబారము.
Curse n s శాపము, తిట్టు. or affliction బాధ, దుఃఖము. these locusts are aperfect * జట్టిమిడతలు ఒక యీతి బాధ.
Cursed adj struck with a curse శపించబడ్డ, శాపగ్రస్తమైన. or vileదూష్యమైన, అతి పాపిష్టి, పాడైన, చెడ్డ. a * fiend దుష్ట పిశాచము. a * actఅతిపాపిష్టి పని.
Cursedly adv ( this is a vile tho' very common ) పాడుగా. it was * hotచెడ్డ యెండగా వుండెను. * afraid చెడ్డ భీతిని పొందిన.
Cursing n s తిట్టు, దూషణ.
Cursive adj గొలుసుగా వుండే యిది వ్రాతను గురించిన మాట.
Cursorily adv causally, by chance పై, పైగా. not carefully పైపరాకుగా.
Cursory adj casual పయిపయి, పైపరాకైన. at a * glance పై చూపుగా,పైపరాకుగా, చక్కగా చూడకుండా. a * observation పైపరాకుగా చెప్పిన మాట, వాక్పరణిగాచెప్పిన మాట, నోరు జారి చెప్పిన మాట.
Curst adj or blasted శాపగ్రస్తమైన, or wicked చెడ్డ, దుష్టి, పాపిష్టి. a * cowచెణగరపు ఆవు దుష్ట ఆవు.
Curt adj or short సంగ్రహమైన, సంకుచితమైన. he gave a * answer ఒకముక్కగా వుత్తరము చెప్పినాడు.
Curtailed adj తగ్గించిన, తగ్గిన, తక్కువైన మట్టుబడ్డ. this time is much * వాడికి పాపకాశము నిండా తక్కువైనది.
Curtailment n s తగ్గింపు, మట్టు, సంగ్రహము.Curtain, n.s. తెర, సరదా. or * wall అడ్డగోడ. a musquitoe * of guaze దోమతెర. of a tent కనాతు. we do not yet know what is behind the * మాకు యింకామర్మము తెలియలేదు. he drew the * over these transactions యీ సంగతులనుగుప్తముగా వుంచివున్నాడు. he withdrew the * from their crimes వాండ్లతప్పులను దాచకుండా బయట పెట్టినాడు.
Curtained adj అచ్ఛాదితమైన, కప్పబడ్డ. a heaven is * with cloudsమేఘాచ్ఛాదితమైన ఆకాశము.
Curtainlecture n s పెండ్లాము చేతి కసురు వాట్లు చీవాట్లు.
Curtsy n s ఇంగ్లీషు స్త్రీలు చేసే వందనము.
Curvature n s వంకర, వక్రత్వము.
Curve n s వంపు, ధనుస్సు యొక్క వంపు, వక్రము.
Curved adj వంకరైన, వంపుగా వుండే, వంగిన, వక్రమైన.
Curvetting n s దుముకు, గంతు, ఆట, యిది గుర్రమును గురించిన మాట.
Cushion n s కూర్చుండే మెత్త, బండి, కురిచి మొదలైన వాటిలో వేసే చిన్న మెత్త, బిళ్ల దిండు, ఒరుగుదిండు.
Cushioned adj మెత్తవేసిన యిది కురిచి మొదలైన వాటిని గురించిన మాట.
Cushoo-nut n s జీడిమామిడి విత్తు, ముంత మామిడి విత్తు. the kernel of the *జీడిపప్పు, ముంత మామిడిపప్పు.
Cusp n s మొన అర్ధచంద్రవంక మొన.
Cuss-cuss n s ( the fragrant root of a kind of grass ) వట్టి వేరు,ఉశీరము.
Custard n s కోడిగుడ్లు పాలు చక్కెర కలిపి చేసిన మిఠాయి.
Custard-apple n s సీతాఫలము. the red sort called " bullock's heart "రామాఫలము.
Custody n s కావలి, చర, కయిదు, హిరా, వశము, స్వాధీనము, సంరక్షణ. the childwas left to the * of its mother ఆ బిడ్డ తల్లి సంరక్షణలో వుండెను.
Custom n s వాడుక, అలవాటు, అభ్యాసము, ఆచారము, మర్యాద, సంప్రదాయము,ధర్మము. local * దేశాచారము. Poundage ( see that word ) in shoppingతరుగు, రవేసు. practice of buying of certain person కొనే వాడుక. I will givehim, my * అతని అంగట్లో వెచ్చము చేస్తాను కొనే వాడుక చేస్తాను. he opened a shopthere which drew all the * of the neighbourhood వాడు అంగడి పెట్టినందునఆ తట్టు వాడు కంతా వాడి అంగడికి తిరిగిపోయినది. or tax సుంకము తీరువ. * houseసుంకపు చావిడి, పురుజా, సలాయరుకచేరి. * house officer సుంకపు బంట్రోతు. the *of women is upon her స్త్రీల మర్యాదతో వున్నది, అనగా అది బహిష్టుగా వున్నది.
Customarily adv వాడుకగా.
Customary adj వాడుకైన, సాధారణమైన. as is * యధారీతిగా, వాడుక ప్రకారము.
Customer n s వాడుకవాడు, వాడుకగా కొనేవాడు. he has many customers వాడికిశానా మంది వాడుక వాండ్లు వాడి అంగట్లో వాడుకగా కొనే వాండ్లు విస్తారము.
Cut n s నరుకు, చీలిక, నక్కు, గాయము, పొడిచినతావు. this was a cruel * యిదిఅతి క్రూరమైన పని. or picture పఠము, బొమ్మ, అనగా పుస్తకముగా అచ్చు వేసి వుండేప్రతిమ. he was dressed after the Mahratta * మరాటి వేషము కట్టుకొన్నాడు.the * of one's face ముఖవైఖరి, ముఖరీతి, ముఖజాడ. a blow with a whip orstick దెబ్బ. he gave me a * నన్ను ఒక దెబ్బ కొట్టినాడు. a cross * అడ్డదోవ. thisis a short * to the place యిది అక్కడికి దాపైనదారి. or piece తునక. or channelకాలవ.
Cut throat n s గొంతులు కోసేవాడు, ఖూనీఖోరు.
Cutaneous adj చర్మగతమైన, త్వక్సంబంధమైన. a * disease గజ్జి మొదలైనవి.
Cutcha adj (Hind.) silly, inexperienced, raw పనికిమాలిన,పనుపడని, పక్వమైనది కాని.
Cuticle n s పీతోలు, పూతోలు.
Cutlace, Cutlass n s. ఖడ్గము, కత్తి.
Cutler n s ఖడ్గములు చాకులు చేసేవాడు, అమ్మేవాడు.
Cutlery n s కత్తులు, చాకులు కత్తిరి కోలలు మొదలైన సరుకులు.
Cutlet n s పేల్చిన మాంసపు తునక, పోస.
Cutpurse n s ముళ్లు కత్తిరించేవాడు.
Cutter n s ఒక తరహా చిన్న పడవ, యిందులో యిరువైమంది యెక్క వచ్చును.
Cutting n s చెట్టునుంచి కోసుకొన్న కొమ్మ, చున్వ.
Cuttle n s యిది ఒక చేప పేరు. * fish bone సముద్రపు మరుగు అనే ఒక పదార్థము.
Cwt n s One hundred weight అనేసంజ్ఞ, అనగా పదిమణుగులు.
Cycle n s శకము. the * or era of Salivahana శాలివాహన శకము. the Hindu *of sixty years ప్రభవాది సంవత్సరములు. the Puranas are a * of the Hindutheology హిందుమతానకు పురాణము ఆధారము.
Cyclic adj పౌరాణిక. a * poem పురాణము. a * poet పురాణకర్త.
Cycloid n s బహుశా గోళాకారముగా వుండేటిది.
Cyclopaedia n s పర్వశాస్త్ర సముచ్చయ మనే గ్రంధము, సర్వ విద్యా సంగ్రహమనేగ్రంధము, యిందులో సమస్త శాస్త్ర వివరములున్ను వున్నవి. this is alphabeticallyarranged యిది అక్షరక్రమముగా యేర్పరచబడి వున్నది.
Cyclopick adj రాక్షసకృతమైన, రాక్షస నిర్మితమైన, పర్వతములో తొలిచినబ్రహ్మాండమైన గుడి మొదలైన మనుష్యులకు అసాధ్యమైన కృత్యముగా వుండే.
Cyclops n s నొసటనే ఒంటికన్ను గల రాక్షసుడు.
Cyder n s See Cider.
Cygnet n s హంసపిల్ల, అడివి బాతుపిల్ల.
Cylinder n s కోలగా గుండుగా వుండేటిది. రూలుకర్ర యొక్క ఆకారము గలది,గుండ్రమైన, స్తంభమువంటిది. a hollow * గొట్టము, బొంగు తుపాకి గొట్టము మొదలైనవి.
Cylindric, Cylindrical adj కోలగా గుండుగా వుండే, రూలుకర్ర తీరుగానైనా స్తంభముతీరుగా నైనా గుండ్రముగా కోలగా వుండే, పొత్తరము వలె వుండే, పడి ఆకారముగ వుండే.
Cymbal n s చేతాళము, చెయితాళము. a mere tinkling * వట్టి వదరుబోతు.
Cynic, Cyieck n s. తాంత్రికుడు, సన్యాసి, బైరాగి, సిగ్గుమాలిన గొడ్డు, క్షుద్రుడు, క్రూరుడు, విరసుడు.
Cynical adj కుక్క బుద్ధిగల, క్రూరమూర్ఖ, సిగ్గుమాలిన, మొండి, సన్యాసి యొక్క, బైరాగి యొక్క గుణములుగల.
Cynicism n s క్రూరభావము, క్రౌర్యము, క్షుద్రతనము, సిగ్గుమాలినపని, మొండితనము.
Cynosure n s ధ్రువ నక్షత్రము.
Cyon n s మొక్క.
Cypher n s అంకె, సున్న. he was a mere * వాడు వట్టి సున్న, వాడు వట్టినిష్ప్రయోజకుడు. a magic * మంత్రాక్షరము. the art of writing secretlyసాంకేతికలిపి, దీని మర్మము తెలిసిన వాండ్లు వినా మరి ఒకరు చదవరాని లిపి.
Cypress n s నల్ల చీకటిమాను, తమాల వృక్షము, యిది ముఖ్యముగా శ్మశానములోవుండే వృక్షము, దీన్ని శోక వృక్షమని అంటారు.
Cyprian n s బోగముది, లంజ.
Cyprus n s ఒక దేశము పేరు, యీ దేశమందు. Venus అనగా రతీదేవి, పుట్టినట్టుకవులు చెప్పుతున్నారు గనుక a Cyprian ఆ దేశస్తురాలు, అనగా బోగముది అనిభావిస్తున్నది.
Cyrus n s ( an Indian crane ) సారసపక్షి. ( See that word ) పెద్ద కొంగ.
Cytisus cajan n s కందులు.
Czar, or Tsar n s. ఋషియాదేశపు చక్రవర్తికి యీ పేరు చెల్లుతున్నది, యిందుకుఉచ్చారణ, త్సారు అని చెప్పుతారు. Czarina ఆయన యొక్క రాణి.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment